స్కూలులో పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా, ఇష్టపడి సంతోషంతో క్లాసులో కూర్చుంటే, క్లాసులో చెప్పే సబ్జెక్టు విషయాలు తలకెక్కుతాయి. సబ్జెక్టు బుక్స్ ఒక్కొక్కటి 100 / 150 పేజీలకు పైగా ఉంటాయి. ఆ సబ్జెక్టు బుక్స్ చదివిన విద్యార్ధి ఇచ్చే పరీక్షా పత్రం రెండు లేదా మూడు పేజీలు ఉంటే, దానికి జవాబు పది నుండి ఇరవై పేజీల వరకు ఉండవచ్చును. అంటే ఒక సబ్జెక్టు బుక్ పేజీలలో కేవలం 10 నుండి పదిహేను శాతం మాత్రమే తిరిగి జవాబులుగా విద్యార్ధి వ్రాస్తాడు. మరి ఎందుకు విద్యార్ధులు ఫెయిల్ అవుతారు?
క్లాసులో స్టూడెంట్ సరిగా టీచర్ చెప్పే విషయాన్ని గ్రహించకపోవడం కారణం అంటారు. స్టూడెంట్ సరిగ్గా దృష్టి పెడితే, పాఠాల సారం గ్రహించవచ్చును. తద్వారా పరీక్షల వేళలో ప్రశ్నాపత్రానికి జవాబులు వ్రాయడం ఈజి.
ఉదాహరణకు ఒక చిన్న అంశము ఊహించి పరిశీలిస్తే…. పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా
ఒక ఇంటిముందు ఉన్న దారి అంతా పొదలతో మూసుకుని ఉంది. అలా ఇరుకుగా ఉన్నదారిలో నుండి, ఆ ఇంటిలోకి సామాగ్రి చేరవేయాలి. అప్పుడు రెండు మార్గాలు: అవి ఏమిటి అంటే?
ఒకటి: ప్రస్తుతం ఉన్నదారిలోనే సామాగ్రిని ఇంటిలోకి చేరవేయడం.
రెండు: ఇంటి ముందున్నదారిని శుభ్రంచేసి, దారిని విశాలం చేసి, సామాగ్రిని ఇంటిలోకి చేర్చడం.
ఒకటవ మార్గం ఎంచుకుని సామాగ్రిని ఇంటిలోకి చేర్చితే, మరలా అవసరం వచ్చినప్పుడు సామాగ్రిని ఇంటి బయటికి తీసుకుపోవడానికి పని సులువుగా సాగదు. పనిభారంగా ఉంటుంది.
అదే రెండవమార్గం ఎంచుకుని, సామాగ్రిని ఇంటిలోకి చేర్చితే, మరలా అవసరం వచ్చినప్పుడు సామాగ్రిని సులభంగా బయటకు తీసుకుపోవచ్చును.
ఇతర విషయాలు పట్టించుకోకుండా, పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా
అలాగే స్టూడెంట్ కూడా తన మనసుని, దానికిష్టమొచ్చినట్టు వదిలేసి, క్లాసులో పాఠాలు వింటే, అవి అతని చెవికెక్కుతాయి కానీ అతని మనసుకు చేరవు. తర్వాత పరీక్ష హాలులో చేయగలిగేదేముంటుంది?
అలా కాకుండా స్టూడెంట్ తన మనసుని ఇతర విషయాలవైపు మొగ్గు చూపకుండా, కేవలం క్లాసులో టీచర్ చెప్పే పాఠాలు వింటూ ఉండడం చేత, అతను సులభంగా పరీక్ష హాలులో జవాబులు వ్రాయగలడు.
పిల్లలు పాఠాలు వినడానికి ఏదో పెద్ద ప్రయత్నం చేయాలనే భావన కాకుండా, క్లాసులో టీచర్ ఏం చెబుతున్నారు? అనేది శ్రద్దగా వింటే, చాలు పిల్లల మనసే, సబ్జెక్టు వెంటపడడం చేస్తుంది. వినగా వినగా వేము తీయగనుండు అంటారు. అలాగే వినగ వినగా పాఠాలు పిల్లల మదిలోకి చేరతాయి. వినడానికి సుముఖత చూపకపోవడమే, విద్యార్ధి దశలో ఎదురయ్యే సమస్య.
పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా, ఇష్టంగా క్లాసులో కూర్చుంటే, పిల్లలకు చదువుపై ఆసక్తి వస్తుంది. క్లాసులో టీచర్ వివిధ రకాలు పిల్లలకు అర్ధం అయ్యేవిధంగా పాఠాలు బోధించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పిల్లలు ఒక్కచోట కూర్చునంతసేపూ, దృష్టిని క్లాసు టీచర్ చెప్పే మాటలు ఆలకించడమే చేస్తే, వారు ఖచ్చితంగా సదరు సబ్జెక్టులోని విషయం అర్ధం కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా గుర్తు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. పరీక్ష హాలులో విద్యార్ధి కంగారు పడకుండా ఉంటే, ఖచ్చితంగా క్లాసులో శ్రద్ధగా విన్ని పాఠాలు గుర్తుకువచ్చే అవకాశం ఉంటుంది. కావునా క్లాసులో కూర్చున్న పిల్లల దృష్టి టీచర్ చెప్పే పాఠాలపై దృష్టి పెట్టాలి.
ఈ రోజులలో గల సాంకేతికత పిల్లలపై చాలా ప్రభావం చూపగలదు. అందుబాటులో గల సాంకేతికతను చక్కగా సబ్జెక్టు విషయాల సేకరణకు ఉపయోగించుకుంటే, నేటి టెక్నాలజీ పిల్లలకు వరం వంటిదే. అలా కాకుండా పిల్లల అనవసర విషయాల జోలికెలితే, అదే టెక్నాలజీ పిల్లలకు శాపంగా మారుతుంది. పిల్లలకు క్లాసులో కష్టంగా కాకుండా, ఇష్టంగా క్లాసులో కూర్చుని పాఠాలు వినాలంటే?
పిల్లలు క్లాసులో ఇష్టంగా కూర్చుని పాఠాలు వినడానికి
పిల్లలు స్కూల్ కు క్రమం తప్పకుండా వెళ్ళేవిధంగా తల్లిదండ్రులు చూడాలి. అలాగే పిల్లలు పాఠాల చెప్పే సమయంలో దృష్టి కేంద్రీకరించడానికి మరియు చురుకుగా వినడానికి ఉపాధ్యాయులు ఉపయోగించగల అనేక వ్యూహాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన విధానాలు ఉన్నాయి:
కొత్తగా ఉన్నవాటిపై పిల్లలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ కళ్ళముందు జరుగుతున్నదానిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పిల్లల్లో డ్రాయింగ్ పద్దతి, వ్రాత పద్దతి మరియు అందులో పోటీ తత్వం వంటివి ఒక వయస్సు వరకు ఉపయోగపడతాయి.
స్కూలు నుండి తిరిగి వచ్చిన పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. ప్రవేటు పాఠశాలలో డబ్బులు చెల్లించాము కదా వారే చదువులు చెప్పేస్తారు. లేదా ప్రభుత్వ పాఠశాలలో వారే పాఠాలు చెబుతారు అని రోజూ ఇంటికొచ్చిన పిల్లల చదువుపై తల్లిదండ్రుల కాసేపయినా శ్రద్ద పెట్టకపోతే, వారికి ఎక్కౌంటబిలిటి ఉండదు. వయస్సు పెరిగే కొలది జవాబుదారీతనం తగ్గి, పిల్లల చదువులో మార్పు ఉంటుంది. అదే ప్రతిరోజూ కాసేపు స్కూలులో జరిగిన విషయాలను ప్రేమతో పిల్లలను అడిగి తెలుసుకోవడం. రోజుకు ఏదో ఒక ప్రశ్న సబ్జెక్టు పరంగా అడగడం వలన, పిల్లలలో జవాబుదారీ పెరుగుతుంది. అలా వారు ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు, చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం పిల్లలకు చదువుపై శ్రద్ద పెట్టాలనే తపన పెంచవచ్చు.
వయస్సు పెరుగుతున్న కొలదీ పిల్లలలో ఏదో ఒక విషయంలో వృద్దిని కనబరుస్తూ ఉంటారు. ఏదో ఒక అంశంలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అవి వారి అభివృద్ది తోడ్పడేవి అయితే, వాటిని ఖచ్చితంగా ప్రోత్సహించవలసిన కర్తవ్యం తల్లిదండ్రులది….
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం
దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్
నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
More Telugureads Posts
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో