తెలుగు చిత్ర సీమలో హాస్య చిత్ర దర్శకులు

సూపర్  హిట్ చిత్రాలలో యాక్షన్, ఫాంటసీ, డ్రామా, విబిన్న కదాంశాలతో తెలుగు చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ కామెడీ చిత్రాలు మనుసుకి హాయిని తీసుకువస్తాయి. Telugu Comdey Hasya Chitra Darshakulu, తెలుగులో కొంతమంది కామెడీ డైరెక్టర్స్ తీసిన చిత్రాలు. హాస్య ప్రధానంగా చిత్రాలను తెరకెక్కించే దర్శకులు. మనిషికి నవ్వే ఆరోగ్యంగా సంతోషం సగం బలంగా చెబుతూ ఉంటారు. అటువంటి నవ్వు తెప్పించే కొన్ని కామెడీ చిత్రాలను అందించిన దర్శకులు. జంద్యాల, ముత్యాల సుబ్బయ్య, వంశీ, ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కె విజయ భాస్కర రెడ్డి లాంటి దర్శకులు కామెడీ, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా లాంటి చిత్రాలని అందించారు, కొంతమంది దర్శకులు కె రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కె ఎస్ ఆర్ దాస్ మొదలైనవారు యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, సామజిక అంశాలపై చిత్రాలను తెరకెక్కించారు. కొంతమంది హాస్యమే ప్రధానంశంగా చిత్రాలను దర్శకత్వం వహించారు.

శివనాగేశ్వర రావు

కిడ్నాప్ కధని కామెడీగా మనీ మనిషిని ఎలా అడిస్తుందో వెండితెరకెక్కించి, దర్శకుడుగా పరిచయం అయ్యారు శివనాగేశ్వర రావు. తరువాత హాస్య ప్రధానంగా పలు హాస్య (కామెడీ) చిత్రాలను తెరకెక్కించారు. వన్ బై టూ, లక్కీ ఛాన్స్, మనీ మనీ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. పసిపిల్లవాడు ప్రధాన పాత్రధారిగా హాస్య చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగార్జున కొడుకు అయిన అఖిల్ ని మాస్టర్ అఖిల్ గా చిన్నప్పుడే సిసింద్రిగా పరిచయం చేసారు. ఆద్యంతం సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రాలలో బ్రహ్మానందంతో హాస్య సన్నివేశాలు బాగా ప్రేక్షకాదరణను పొందినాయి. పట్టుకోండి చూద్దాం, ఓ పనైపోతుంది బాబు, హాండ్స్ అప్, రమణ, ధనలక్ష్మి ఐ లవ్ యు, మిస్టర్ & మిసెస్ శైలజా కృష్ణమూర్తి, భూకైలాస్, నిన్ను కలిసాక చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రేలంగి నరసింహారావు – కామెడీ ఫిలిం డైరెక్టర్

రాజేంద్ర ప్రసాదుతో పలు హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా హాస్య ప్రధానంగా సాగే కధనమే రేలంగి నరసింహారావు గారి చిత్రాలలో కనిపిస్తుంది. పోలీసుగా నరేష్ ని చూపిస్తూ అతని బార్యగా సీతని కలెక్టర్ గా మార్చి పోలీసుభార్య అనే మహిళ కదా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాదుతో ఎదురింటిమొగుడుగా దివ్యవాణిని పక్కింటిపెళ్ళాంగా చూపించి చివరికి ఇద్దరినీ ఒక్కటే చేసే హాస్య చిత్రం ఎదురింటిమొగుడు పక్కింటిపెళ్ళాం నవ్వు తెప్పించే చిత్రం. ఇంకా ఇద్దరు పెళ్ళాల ముద్దులపోలీసు, రొటేషన్ చక్రవర్తి, చిక్కడు దొరకడు, పరుగో పరుగు, సుందరి సుబ్బారావు, పెళ్ళాం చాటు మొగుడు పలు హాస్య కుటుంబ కదా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

శ్రీనువైట్ల – కామెడీ, ఫ్యామిలీ, లవ్ డ్రామా ఫిలిం డైరెక్టర్

పెద్ద హీరోలతో కూడా ప్రధానంగా కామెడీ చేయించే దర్శకుడు అంటే శ్రీనువైట్ల, చిరంజీవితో అందరివాడు, నాగార్జునతో కింగ్, వెంకటేష్ తో నమోవేంకటేశా, మహేష్ బాబుతో దూకుడు, ఆగడు, Jr. ఎన్టీఆర్ తో బాద్ షా యాక్షన్ చిత్రాలను హాస్యప్రధానంగా చెప్పే ప్రయత్నంలో విజయవంతం అయ్యారు. మొదట నీకోసం చిత్రంతో దర్శకుడుగా ప్రేమకధను తెరకెక్కించిన శ్రీనువైట్ల ఆనందంతో కామెడీ లవ్ ఎంటర్టైన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకి, డీ, రెడీ, ఆనందం, దూకుడు, బాద్ షా తెలుగు చిత్రాలు దిగ్విజయాన్ని సాధిస్తే, నీకోసం చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.

జి నాగేశ్వరరెడ్డి కామెడీ ఫిలిమ్స్ డైరెక్టర్

6టీన్స్ వెరైటీ పేరుతొ టైటిల్ పెట్టి కామెడీతో కడుపుబ్బా నవ్వించే చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన జి నాగేశ్వరరెడ్డి, రోహిత్ హీరోగా 6టీన్స్, గర్ల్ ఫ్రెండ్, నేను సీతామహాలక్ష్మి, గుడ్ బాయ్ వంటి హాస్య ప్రేమకదా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ హీరోగా సీమశాస్త్రి, సీమటపకాయ్, ఇంట్లో దెయ్యం నాకేం బయ్యం చిత్రాలను డైరెక్ట్ చేసారు. హాస్య, ప్రేమ కదా చిత్రాలను ఎక్కువగా అందించారు. ఇదే నా మొదటి ప్రేమలేఖ, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, కాస్కో, దేనికైనారెడీ, కరెంటు తీగ, ఈడోరకం ఆడో రకం, ఆటాడుకుందాం రా, ఆచారి అమెరికా యాత్ర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇ సత్తిబాబు –

శ్రీకాంత్, రవితేజ, బ్రహ్మానందం, రోజా, మహేశ్వరీ, కోవై సరళ జంటలుగా తిరుమల తిరుపతి వేంకటేశా చిత్రంతో దర్శకుడుగా పరిచయమై పలు హాస్య ప్రధానంగా సాగే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓ చినదాన ప్రేమకధా చిత్రాన్ని శ్రీకాంత్ హీరోగా తెరకెక్కించి, అల్లరి నరేష్ నేను చిత్రంతో ఒక విబిన్నమైన పాత్రలో చూపించారు. ఒట్టేసి చెబుతున్నా, ఏమండోయ్ శ్రీవారు, వియ్యాలవారి కయ్యాలు, బెట్టింగ్ బంగార్రాజు, యముడికి మొగుడు, జంప్ జిలాని, మీలో ఎవరు కోటీశ్వరులు చిత్రాలను హాస్య ప్రధానంగా కుటుంబ కధలను, ప్రేమకధాలను వెండితెరపై చూపించారు.

శ్రీనివాస్ రెడ్డి కామెడీ ఫిలిమ్స్ డైరెక్టర్

హాస్య కుటుంబ కదా చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ్యా చంద్రం చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యారు. శివాజీ, శ్రీకాంత్, తొట్టెంపూడి వేణులు హీరోలుగా కొన్ని కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాగార్జున – అనుష్కలతోతో శివ భక్తి గల డమరుకం చిత్రానికి దర్శకత్వం వహించారు. అదిరిందయ్యా చంద్రం, యమగోల మళ్ళి మొదలైంది, కుబేరులు, బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్, అ ఆ ఇ ఈ, డమరుకం, సింగినాథం జీలకర్ర, బాబురావు నిన్నోదల, దుర్గ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రవిబాబు కామెడీ, లవ్, హారర్ ఫిలిమ్స్ డైరెక్టర్

పలు హాస్య, ప్రేమ, భయానక చిత్రాలను దర్శకత్వం వహించి తెరకెక్కించారు, అయితే మొదట హాస్య ప్రధానంగా సాగే అల్లరి చిత్రంతో దర్శకుడు పరిచయం అయ్యారు. రవిబాబు నటుడు చలపతిరావుగారి అబ్బాయి. ఈవివి సత్యనారాయణ ద్వితీయ కుమారుడిని అల్లరి నరేష్ గా పరిచయం చేసి తానూ దర్శకుడుగా పరిచయం చేసుకున్నారు. అలాగే అల్లరి నరేష్ తో పార్టీ, లడ్డు బాబు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంకా కొత్తవాళ్ళతో అమ్మాయిలు అబ్బాయిలు, నువ్విలా, నచ్చవులే వంటి హాస్యభరిత ప్రేమకదా చిత్రాలను అందించారు. భూమిక ప్రధాన పాత్రలో అనసూయతో అందరిని భయపెట్టి, హారర్ చిత్రాల్లో కూడా మెప్పించే దర్శకుడుగా అవును అనిపించుకున్నారు. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, అనసూయ, నచ్చవులే, అమరావతి, మనసారా, నువ్విలా, అవును, లాడ్డుబాబు, ఆవును2 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కామెడీ చిత్రాలే కాకుండా కుటుంబ, సామజిక, భయానక, ప్రేమ, సాంఘికా కదాంశాలతో నవరస చిత్రాలను అందించే తెలుగు దర్శకులు మనకి చాలామందే ఉంటారు. సందేశాత్మక చిత్రాలు కొన్ని సరదాగా సాగితే, కొన్ని వాస్తవిక పరిస్థితుల ప్రకారంగా సాగుతాయి. పలు రకాల కధంశాలతో కామెడీ ప్రధానంగా వచిన కొన్ని చిత్రాలు అశేష ప్రేక్షకాదరణను పొందాయి. పైన కొంతమంది దర్శకుల గురించి Telugu Comedy Hasya Chitra Darshakulu పోస్టు టైటిల్ గా చెప్పడం జరిగింది. మరికొంతమంది దర్శకుల చిత్రాల తరువాయి జైచిత్ర పోస్టులలో చదవగలరు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

సింగితం శ్రీనివాసరావు, బాపు, బి.గోపాల్, క్రాంతి కుమార్, ఎస్వీ కృష్ణారెడ్డి

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy, VijayaBhaskar: సింగీతం శ్రీనివాసరావు, బాపు, బి గోపాల్, క్రాంతి కుమార్, ఎస్వి కృష్ణారెడ్డి, విజయ భాస్కర్ ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకులు.

సింగీతం శ్రీనివాసరావు – SingeetamSrinivasaRao

సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మమైన పుష్పకవిమానం, ఆదిత్య 369 చిత్రాలకు దర్శకత్వం వహించారు. పుష్పకవిమానం చిత్రం మాటలు లేకుండానే ప్రారంభమై ముగుస్తుంది, కేవలం నటనతో నవ్వుతెప్పించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదిత్య369 టైం మెషిన్ అనే యంత్రంతో కాలంలో ప్రయాణించే ప్రయోగం చేసారు. 1990లలో వ్యక్తులు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యానికి వెళితే ఎలా ఉంటుంది, వారే 2500 సంవత్సరాలలోకి వెళితే ఎలా ఉండబోతుందో ఈ చిత్ర సన్నివేశాలు ఉంటాయి.

కమలహాసన్ తో అమావాస్య చంద్రుడు, సొమ్మొకడిది సోకొకడిది, పుష్పకవిమానం, మైకేల్ మదన కామరాజు, అపూర్వ సహోదరులు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా ప్రయోగాత్మక సందేశాత్మక కుటుంబ కధలను తెరకెక్కించారు. మయూరి, తరం మారింది, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, భైరవద్వీపం, మేడం, బృందావనం, జమిందారు గారి అమ్మాయి, నీతి నిజాయితీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బాపు – Bapu

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy

బాపు బొమ్మ, బాపు వ్రాత, బాపు కార్టూన్, బాపు ఫాంట్ ఇలా కొన్నింటిలో బాపు పేరు బ్రాండు గా ఉంది. అలాగే బాపు చిత్రాలలో నటించిన నటిమణిని కూడా ఒక బాపు బొమ్మగా చూస్తారు, తెలుగు చలనచిత్ర అభిమానులు. పౌరాణిక బొమ్మలు గీసిన సాంఘిక బొమ్మలు గీసిన బాపు బొమ్మల బహు ప్రసిద్ది పొందినవి, అలాగే బాపు కార్టూన్స్ కూడాను. ఇలా బహుముఖ ప్రజ్ఞా పాటవాలు కొంతమందికే ఉంటాయి, అటువంటి వారిలో బాపు ఒకరు. సాక్షి తెలుగు చిత్రంతో దర్శకులుగా మారిన బాపుగారు పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపుగారిపై ఆరుద్రగారు పద్యం చెప్పడం బాపుగారి ప్రజ్ఞా ఏపాటిదో అర్ధం అవుతుంది.

పలు పౌరాణిక సాంఘిక తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, ముత్యాల ముగ్గు చిత్రాలకు పలు అవార్డులు వచ్చాయి. ఇంకా సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు, బాలరాజు కధ, అందాలరాముడు, శ్రీ రామాంజనేయ యుద్ధం, త్యాగయ్య, రాదా కళ్యాణం, కళ్యాణ తాంబూలం, రాధగోపాలం, శ్రీనాధ కవిసార్వభౌమ, శ్రీరామరాజ్యం, శ్రీకృష్ణావతారం, భక్త కన్నప్ప, మంత్రిగారి వియ్యంకుడు,మనవూరి పాండవులు మొదలైన తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బి. గోపాల్ – BGopal

ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన బి. గోపాల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించారు. కలెక్టర్ గారి అబ్బాయి, బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడి, లారీ డ్రైవర్, స్టేట్ రౌడి, మెకానిక్ అల్లుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి లాంటి అగ్రహీరోలకు అందించారు. యాక్షన్ చిత్రాలను కుటుంబ కదా చిత్రాలను ఎక్కువ తెరకెక్కించిన బి. గోపాల్, రాయలసీమ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు దర్శకత్వం వహించి విజయవంతమైనారు.

క్రాంతి కుమార్ – KrantiKumar

మహిళా పాత్రలు ప్రధానంగా కుటుంబ కదా చిత్రాలను దర్శకత్వం చేసి మరియు నిర్మాతగా తెలుగు చిత్రాలను అందించారు. క్రాంతి కుమార్ నిర్మించిన ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు చిత్రాలతోనే చిరంజీవి వెండితెరకి పరిచయం అయ్యారు. అలాగే మీనా కూడా క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనువరాలు చిత్రంతో ప్రధాన పాత్రలో పరిచయం అయ్యారు. దర్శకులుగా నిర్మాతగా కూడా నంది అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.

శుభసంకల్పం చిత్రం

స్వాతి, అగ్నిగుండం, స్రవంతి, హీరో బాయ్, అరణ్యకాండ, శారదాంబ, గౌతమి, నేటి సిద్ధార్ధ, సీతారామయ్యగారి మనుమరాలు, అక్క మొగుడు, రాజేశ్వరి కళ్యాణం, సరిగమలు, భలేపెళ్ళాం, పాడుతా తీయగా, 9 నెలలు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. జ్యోతి, శారద, ఊర్వశి, కల్పన, పునాదిరాళ్ళు, ప్రాణంఖరీదు, సర్దారు పాపారాయుడు, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, శివుడు శివుడు శివుడు నేటి సిద్దార్ధ, రిక్షావోడు, 9 నెలలు మొదలైన చిత్రాలను నిర్మించారు.

ఎస్వి కృష్ణారెడ్డి – SVKrishnaReddy

ఎస్వి కృష్ణారెడ్డి కొబ్బరిబొండం చిత్రానికి కధని అందించి ఆ చిత్రానికే సంగీతం కూడా స్వరపరచారు, మాయలోడు చిత్రానికి కధ, కధనం, సంగీతం, దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్ – సౌందర్య కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో వరుసగా ఎస్వి కృష్ణారెడ్డి చిత్రాలు వచ్చి మహిళా ప్రేక్షకాదరణను పొందాయి. ఎక్కువ కుటుంబ కధలను హాస్య, సెంటిమెంట్ చిత్రాలను తెరకెక్కించారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, యమలీల, శుభలగ్నం, మావిచిగురు, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, ప్రేమకు వేళాయారా, సర్దుకుపోదాం రండి, పెళ్ళాం ఊరెళితే వంటి కుటుంబ కదా చిత్రాలను అందిచారు. ఉగాది, అభిషేకం చిత్రాలలో కధానాయకుడిగా నటించారు.

కె విజయ భాస్కర్ – VijayaBhaskar

1991 ప్రార్ధన చిత్రంతో దర్శకులుగా పరిచయమైనా విజయ భాస్కర్ మరలా తొమ్మిది సంవత్సరాలకు 1999లో వేణు తొట్టెంపూడి – లయ ప్రధాన పాత్రలుగా స్వయంవరం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్ర విజయం తరువాత తరుణ్ – రిచా లతో నువ్వే కావాలి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇక వరుసగా నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, నాగార్జునతో మన్మధుడు, చిరంజీవితో జైచిరంజీవ చిత్రాలకు దర్శకత్వం వహించిన కె విజయ భాస్కర్ క్లాస్ మేట్స్ భలేదొంగలు, ప్రేమ కావాలి, మసాలా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. హాస్య ప్రధానంగా కుటుంబ ప్రేమ కధలను అందించి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను దర్శకత్వం చేసారు. నువ్వే కావాలి చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు పొందారు.

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy, VijayaBhaskar Telugu chalanachitra darshakulu.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

శుభసంకల్పం

ShubhaSankalpam Alpa vishayalaki Ateetamga untundi శుభసంకల్పం కమలహసన్, ఆమని, ప్రియారామన్, కె విశ్వనాధ్ ప్రధాన పాత్రలుగా ఉంటే, రాళ్ళపల్లి, నిర్మల, గొల్లపూడి తదితరులు నటించిన ఈ చిత్రం శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్ పతాకంపై SP బాలసుబ్రహ్మణ్యం కె విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు, చిత్ర పాటలు మంచి ప్రజాదరణను పొందాయి.

రాయుడు (కె విశ్వనాధ్) సముద్రతీరాన నివాసం ఉండే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పెద్దమనిషి, అయన సంకల్పమే ఆచరణలో శుభసంకల్పంగా మన ముందుకి వచ్చింది. సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మత్యకారులకు పడవలు చేయించి ఇస్తూ, వారి మంచిచెడులను చూసుకునే పెద్దమనిషి. రాయుడుకి ఒక కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు, ఆమె మనుమరాలు తాతయ్య అంటే ప్రేమ కొద్ది, ఆ పల్లెకి వచ్చి వెళుతూ ఉంటుంది. ఇంకా రాయుడుకి ఒక దత్తపుత్రుడు ఉంటే అతను చెడు అలవాట్లకు బానిసగా మారతాడు.

సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మత్యకారులలో దాసు (కమలహాసన్) చాల తెలివైనవాడు. పేపర్ పెన్ను అవసరం లేకుండా ఎప్పటి లెక్కలు అయినా కావలసినప్పుడు చెప్పగలిగే జ్ఞాపక శక్తి కలిగిన వ్యక్తి, అయితే అతను ఏమాత్రం అక్షరజ్ఞానం లేని వ్యక్తి. దాసు అంటే రాయుడుగారికి ఎనలేని అభిమానం ఉంటుంది.

చెడు అలవాటులకు దగ్గరైన తన కొడుకుని డబ్బు వ్యవహారాలకు దూరంగా ఉంచడంతో చెడు అవసరార్ధం రాయుడు కొడుకు అయిన దత్తుడుజ, పట్నంలో ఒక వ్యక్తి దగ్గర (కోట శ్రీనివాసరావు) దగ్గర లక్షల కొద్ది అప్పు చేస్తాడు. ShubhaSankalpam Alpa vishayalaki Ateetamga untundi

గంగామహాలక్ష్మి – దాసుల వివాహం

పడవలు తయారుచేసే ఒక తాగుబోతు కూతురు అయిన గంగామహాలక్ష్మి (ఆమని) దాసు ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ విషయం తెలిసిన రాయుడు వాళ్ళిద్దరికీ పెళ్ళిచేసి, మరలా దాసు – గంగామహాలక్ష్మికి పుట్టిన కొడుకుకి నామకారణం కూడా తన ఖర్చులతో చేయిస్తాడు.

పట్నంలో అప్పు చెల్లించవలసిన రాయుడు కొడుకు దత్తుడు, రాయుడు ఆఫీసులో లేని సమయంలో వచ్చి బలవంతంగా డబ్బు తీసుకుని వెళ్లిపోతుంటే, దాసు అడ్డుకుని ఆ లక్షల డబ్బుని తన ఇంట్లో దాస్తాడు. తరువాత విషయం ఊరిని నుండి వచ్చిన రాయుడికి వివరిస్తారు.

డబ్బుని దాసు ఇంటిలోనే ఉంచి, వ్యాపార వ్యవహారాలకు ఉపయోగించమని, మీ అందరికి తలా ఒకరికి ఒక ఇల్లు, ఒక పడవ సొంతంగా ఉండి, మీరు సంతోషంగా ఉండాలి అదే నా సంకల్పం అని రాయుడు అంటారు. తన సంకల్పానికి దాసుని సహకారంగా ఉండమని చెబుతారు. ఇక ఆ డబ్బు వ్యవహారాలు అన్ని దాసు గుడిస నుండి జరుగుతూ ఉంటాయి.

ఒకరోజు దాసు వేటకి అని సముద్రంలోకి వెళ్తాడు, అదును కోసం చూస్తున్న రాయుడి కొడుకు మనుషులు దాసు ఇంటికి వచ్చి దాడి చేస్తారు. ఆ డబ్బుని కాపాడే క్రమంలో దాసు నాయనమ్మ ప్రాణాలు కోల్పోతుంది. గుడిసె నుండి డబ్బుని తీసుకుని గంగామహాలక్ష్మి పడవమీద సముద్రంలోకి వెళ్తుంది, వెంటాడిన మనుషులకు డబ్బులు దక్కకుండా ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతుంది. ShubhaSankalpam Alpa vishayalaki Ateetamga untundi

వేటకు వెళ్ళిన దాసుకి డబ్బు గంగా మహాలక్ష్మి వలలో చిక్కుతారు, అయితే గంగా మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయి, డబ్బుని రక్షిస్తుంది. దాసు నాయనమ్మ మరణం చూసిన రాయుడికి గుండెపోటు వస్తుంది. రాయుడి ప్రాణరక్షణార్ధం గంగామహాలక్ష్మి బ్రతికే ఉన్నట్టు అబద్దం చెబుతాడు దాసు.

హాస్పిటల్ నుండి గంగ కోసం ఎదురుచూసే రాయుడు, తిరిగిరాని లోకాలకు తరలిపోయిన తనభార్య క్షేమంగా వస్తుంది అని రాయుడికి అబద్దం చెబుతూ దాసు పాత్ర విబిన్నంగా కనిపిస్తుంది. అందరూ ఉండి కూడా దాసు తన భార్యకు తన కొడుకుతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు, రాయుడి ప్రాణ రక్షణకోసం. ఈ సన్నివేశాలు కంటతడిబెట్టిస్తాయి. చివరికి రాయుడికి గంగవిషయం తెలుస్తుంది, తరువాత రాయుడి కలల్ని దాసు నిజం చేస్తాడు.

నటన అంటే కమలహాసన్ చిత్రాలే సమాధానాలుగా చెబుతారు, అటువంటి నటనకి కె విశ్వనాధ్ గారి దర్శకత్వం తోడైతే ఆ చిత్రం నటన విశ్వరూపమే కనిపిస్తుంది. అటువంటి ఈ చిత్రం ఒక శుభసంకల్పాన్ని నెరవేర్చే పాత్రలో కమలహాసన్ నటన అద్బుతంగా ఉంటుంది. ఒక మంచి చిత్రం ఉంది అని చెప్పగలం కానీ ఆ మంచి చిత్రం గురించి గొప్పగా చెప్పడం కన్నా మంచి చిత్రాలే చూస్తేనే బాగుంటుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

సౌందర్య – విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగుచిత్రం

PavitraBandham, ViktariVenkatesh, Soundaryala Telugu Chitram ayite Mutyala Subbaiah Director. పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం. వెంకటేష్ – సౌందర్య హిట్ కాంబినేషన్లో వచ్చి తెలుగు మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా చిత్రంగా నిలిచింది. మారుతున్నా సామజిక పరిస్థితిలో భాగం ఎక్కువమంది ఉన్నత కుటుంబంలో తమ పిల్లల్ని ఇతరదేశాలలో చదివించడం పరిపాటి. అలా ఇతర దేశాలలో చదువుకుని ఇంటికి వచ్చి ఒక ఉన్నత కుటుంబ కుర్రాడుగా వెంకటేష్ నటిస్తే, సనాతన ధర్మం కల్గిన భారతదేశంలో సగటు మహిళగా, ఒక ఫాక్టరీలో ఉద్యోగిగా సౌందర్య చక్కగా నటించిన చిత్రం, పవిత్రబంధం.

సకుటుంబ సపరివారంగా చూడదగిన చిత్రాలలో పవిత్రబంధం ఒకటిగా ఉండి, భారతీయ స్త్రీమూర్తి సహనం, పతిసేవా తత్పరతను తెలియజేసే తెలుగు చలనచిత్రం పవిత్రబంధం. సెంటిమెంట్ చిత్రాల దర్శకులుగా పేరుపొందినవారిలో ముత్యాల సుబ్బయ్య గారు ఒకరు. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై పోసాని కృష్ణ మురళి కధ అందిస్తే, ఎంఎం కీరవాణి సంగీతం అందివ్వగా పవిత్రబంధం చిత్రాన్ని వెంకట రాజు – శివరాజులు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మించారు. PavitraBandham, ViktariVenkatesh, Soundaryala Telugu Chitram.

జనతాగారేజ్ చిత్ర సమీక్ష చదవండి

విశ్వనాధ్(SP బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆస్తిపరుడైన అతనికి ఒక కొడుకు విజయ్(విక్టరివెంకటేష్) ఫారిన్లో చదువుపూర్తీ చేసుకుని స్వదేశానికి ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చిన విజయ్ తో విశ్వనాధ్ పెళ్లి చేసుకుని బిజినెస్ వ్యవహారాలు చూసుకోవలసినదిగా కోరతాడు. స్వేచ్చగా స్వదేశం వదిలి విదేశంలో తిరగడం అలవాటు పడిన విజయ్ కేవలం సంతోషకరమైన విషయాలతో సంతోషిస్తూ ఉంటాడు.

రాధ (సౌందర్య) మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈమె తన కుటుంబ పోషణార్ధం విశ్వనాధ్ ఆఫీసులో విశ్వనాధ్ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. రాధ (సౌందర్య) కుటుంబంలో అన్న నిరోద్యోగిగా ఉంటూ ఉంటే, పెళ్ళైన ఆమె అక్క జబ్బుతో బాధపడుతూ ఇంటిలోనే ఉంటుంది. పెళ్లికావాల్సిన చెల్లెలు ఉంటుంది. కుటుంబ పోషణ మొత్తం రాదే చూసుకుంటూ ఉంటుంది.

విజయ్ ఇంటికి వచ్చాక పాశ్చాత్య ధోరణిలో ఉంటూ క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పెళ్లి సంభందం గురించి మాట్లాడితే విజయ్ చెప్పిన మాటలకు విశ్వనాధ్ అవాక్కవుతాడు. నేను పెళ్లిచేసుకుంటాను కానీ ఆమెతో సంవత్సరం కాపురం చేసాక మా ఇద్దరికీ ఇష్టంగా ఉంటే కాపురం కొనసాగిస్తాం, ఒకవేళ సంవత్సరం తరువాత అలా ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా విడిపోవటానికి అంగీకరించిన అమ్మాయి అయితే నాకు సరే అని చెబితే అవాక్కవ్వని తెలుగు తండ్రి ఉండడు. ఆ విధంగా కొడుకు ప్రవర్తనకు కారణం తల్లిలేకుండా ఉండడం ఒకటి, విదేశ సంస్కృతిలో అలవాటు పడి ఉండడం ప్రధాన కారణం అని గ్రహించిన విశ్వనాధ్.

విజయ్ (విక్టరివెంకటేష్) రాధ(సౌందర్య) అగ్రిమెంట్ వివాహం

ఆఫీసులో తనకు పర్సనల్ సెక్రటరీగా చేస్తున్న రాధను చూసి ఈమె అయితే తన కొడుకు విజయ్నిమార్చగలదు అని భావించి, ఆమెకు తన కొడుకుని పెళ్లి చేసుకోవలసినదిగా కోరతాడు. ఆత్మాభిమానం కలిగిన రాధ తన కుటుంబ కష్టాలు తీరాలంటే డబ్బు అవసరం, ఆ డబ్బు విశ్వనాధ్ గారి అబ్బాయి కండిషన్ తెలిసి, పెళ్లి తరువాత ప్రేమతో విజయ్ ని మార్చుకుంటాననే నమ్మకంతో ఆమె పెళ్ళికి ఒప్పుకుంటుంది. అయితే విశ్వనాధ్ గారి బరోస వలననే ఆమె తనపై తనకు గల నమ్మకంతో విజయ్ ని పెళ్లి చేసుకుంటుంది రాధ.

పెళ్లికి ముందే అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు చేసుకుంటారు కాబోయే భార్య భర్తలు. తర్వాత రాధవిజయులు అన్యోన్యంగా కలిసి ఉండడం ముచ్చటగా ఉంటూనే, మరోప్రక్క విజయ్ అగ్రిమెంట్ ఆసక్తిగా కధనం సాగుతుంది. రాధ కుటుంబ కష్టాలు విశ్వనాధ్ గారు తీర్చుతారు. రేచీకటితో బాధపడే సుధాకర్, బ్రహ్మానందం హాస్య సన్నివేశాలు మద్య మద్యలో వస్తూ ఉంటాయి.

సంవత్సరం గడిచేలోపు విజయ్ కి ఆక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో రాధ అతనికి సేవలు చేసి అతనిని కాపాడుకుంటుంది. ఆ క్రమంలో వచ్చే పాట అపురూపమైనది అమ్మ ఆడజన్మ అంటూ సాగే సాంగ్ చిత్రీకరణ కధలో భాగమై సాగుతుంది. పాట పూర్తీ అయ్యేసరికి సంవత్సరం గడవడం అగ్రిమెంట్ ప్రకారం తనకు రాధపై ఫీలింగ్స్ లేవని వివాహం రద్దు చేసుకుందామని అంటే, విజయ్ తండ్రి బ్రతిమాలినా వినని విజయ్ విచిత్రంగా విడిపోవడానికి ఇష్టపడతాడు. విజయ్ ఇష్టప్రకారం రాధ తన పుట్టింటికి వెళుతుంది.

అలా పుట్టింటికి వెళ్ళిన రాధ లేని లోటు విజయ్ కి తెలిసి వచ్చి, ఆమెపై తనకి ఉన్న ప్రేమను గుర్తించి రాధ కోసం రాధ పుట్టింటికి వెళితే విజయ్ ని రాధ తిరస్కరిస్తుంది. ఎవరు చెప్పిన రాధ వినకుండా ఒంటరిగా ఉంటూ అందరి చేత మాటలు పడుతుంది. అలా ఎందుకు రాధ చేసింది అనేది చిత్రం చూడడమే బాగుంటుంది. చివరికి ఇద్దరు ఒకటవటంతో చిత్ర కధ ముగుస్తుంది. అయితే ఆద్యంతం కుటుంబ వాతావరణ సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. రాధ పాత్రలో సౌందర్య నటన అద్బుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ – సౌందర్యల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటే, విశ్వనాధ్ పాత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగారి నటన సెంటిమెంట్ బాగా పండిస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన పవిత్రబంధం చిత్రం, చాల పవిత్రమైన బంధం విలువని తెలియజేస్తుంది. PavitraBandham, ViktariVenkatesh, Soundaryala Telugu Chitram.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

కుటుంబకధా చిత్ర తెలుగు దర్శకులు

Telugu ChalanaChitra Kutumba Kadha Darshakulu Konasagimpugaa A Kodandaramireddy, Jandhyala, Raviraja Pinisetty, Mutyala Subbaiah, EVV Satyanarayana, Vijayabapeenidu, Vamshi ఏ కోదండరామిరెడ్డి, జంద్యాల, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, ఈవివి సత్యనారాయణ, విజయబాపినీడు, వంశీ మొదలైన దర్శకులు అనేక తెలుగు చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకాభిమానాన్ని పొందితే, కొన్ని చిత్రాలు అవార్డులు పొందాయి.

ఏ కోదండరామిరెడ్డి Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu

సంధ్య తెలుగుచలనచిత్రంతో 1980 లో దర్శకుడుగా మొదలుపెట్టిన ఏకోదండరామిరెడ్డి తరువాతి సంవత్సరంలో వరుసగా రెండు తెలుగు చిత్రాలకు ఒక తమిళ చిత్రానికి దర్శకుడుగా పనిచేసారు. చిరంజీవి -రాధిక, జగ్గయ్య – శారద ప్రధాన పాత్రలతో దర్శకత్వం వహించిన న్యాయంకావాలి చిత్రానికి మంచిపేరు వచ్చింది. తరువాత చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ గా స్థిరపడి, వీరిద్దరి కాంబినేషన్ కి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు తోడై ఎక్కువ చిత్రాలు ప్రజాదరణను పొందాయి. చిరంజీవి సినీ కెరీర్లో టర్నింగ్ పాయింట్ గా చెప్పే ఖైది చిత్రానికి ఏ కోదండరామిరెడ్డిగారే దర్శకులు.

ఏనార్, శోభన్ బాబు, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. న్యాయం కావాలి, అభిలాష, ఖైది, అనుభందం, దొంగ, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, వేట, దొంగమొగుడు, పసివాడి ప్రాణం, కిరాయిదాద, మరణమృదంగం, త్రినేత్రుడు, బలేదొంగ, నారి నారి నడుమ మురారి, చిట్టెమ్మ మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, నిప్పురవ్వ, ముఠామేస్త్రి, అల్లరి అల్లుడు, బొబ్బిలి రాజా వంటి ప్రజాదరణ పొందిన మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి కెరీర్లో మంచి హిట్ చిత్రాల ఇచ్చిన దర్శకులలో కోదండరామిరెడ్డి ఒకరు.

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి Telugu ChalanaChitra Kutumba Kadha Darshakulu

ముద్దమందారం చిత్రంతో దర్శకుడుగా వచ్చిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేక కుటుంబ కధలను హాస్య ప్రధానంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో కామెడి చిత్రాలను అందించి తెలుగు వారి నోట నవ్వుల పండించిన దర్శకులు. మరీ ముఖ్యంగా ఈయన చిత్రాలలో సుత్తివేలు, సుత్తి వీరభద్రరావులతో చేయించే హాస్య సన్నివేశాలకు నవ్వని తెలుగుచిత్ర ప్రేక్షకులుండరు. బాలకృష్ణతో బాబాయ్ అబ్బాయ్, సీతారామ కళ్యాణం, చిరంజీవితో చంటబ్బాయి హాస్య చిత్రాలను తెరకెక్కించారు.

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో బాబాయ్ హోటల్, విచిత్రం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్రమోహన్ కధానాయకులుగా చిత్రాలని డైరెక్ట్ చేసారు. నాలుగు స్తంబాలాట, రెండురెళ్ళు ఆరు, అహనాపెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, చంటబ్బాయి, సీతారామ కళ్యాణం, పడమటి సంధ్యారాగం, రెండు జళ్ళ సీత చిత్రాలు ప్రసిద్ది పొందాయి. బ్రహ్మానందం, సుత్తివేలు, వీరభద్రరావు లను అందించింది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారే.

అలాగే చిరంజీవి ఆపద్బందవుడు చిత్రంలో గొప్పింటి పెద్దగా నటించి మెప్పించారు. ఆనంద భైరవి, పడమటి సంధ్యారాగం, ఆపద్భాందవుడు  చిత్రాలకు ఉత్తమ రచయితగా, ఆనందభైరవి చిత్రానికి ఉత్తమ దర్శకులుగా నంది అవార్డులు అందుకున్నారు.  శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇంకా జర్నలిస్ట్ గా కూడా పలు అవార్డులు అందుకున్నారు.

రవిరాజా పినిశెట్టి Telugu ChalanaChitra Kutumba Kadha Darshakulu

చిరంజీవితో జ్వాలా చిత్రంతో దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న రవిరాజా పినిశెట్టి తరువాయి అర్జున్‌తో కోనసీమ కుర్రోడు, కళ్యాణ చక్రవర్తితో కృష్ణ లీల, చిరంజీవితో చక్రవర్తి, యముడికి మొగుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. యముడికి మొగుడు చిత్రం మంచి ప్రజాదరణ పొందింది, అటు తరువాత మంచి హిట్ చిత్రాలను దర్శకత్వం వహించి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ముత్యమంతముద్దు, రాజావిక్రమార్క, చంటి, బలరామకృష్ణులు, కొండపల్లిరాజా, బంగారుబుల్లోడు, పెదరాయుడు, మా అన్నయ్య వంటి మంచి ప్రజాదరణ పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మోహన్ బాబు సినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం, విక్టరి వెంకటేష్ సినీ కెరీర్లో మ్యుజికాల్ హిట్ చిత్రం చంటి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే రవిరాజా పినిశెట్టి హిట్ చిత్రాలు కొన్ని రీమేక్ చిత్రాలుగా ఉంటాయి. అది పినిశెట్టి రవిరాజా పినిశెట్టి కుమారుడు.

ముత్యాల సుబ్బయ్య Telugu ChalanaChitra Kutumba Kadha Darshakulu

నిర్మాతల దర్శకుడైన ముత్యాల సుబ్బయ్య కుటుంబ కదా చిత్రాలను చక్కటి సెంటిమెంట్ మేళవించి, కుటుంబసమేతంగా చూడదగిన చిత్రాలను తీసారు. మూడుముళ్ళభందం చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన ముత్యాల సుబ్బయ్య గారు, నవభారతం, సగటు మనిషి, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మమతలకోవెల, నేతిచరిత్ర, మాఇంటికధ, మామగారు, కలికాలం, ఎర్రమందారం, బంగారుమామ, పల్నాటి పౌరుషం, అన్న, అమ్మాయి కాపురం, సోగ్గాడి పెళ్ళాం, పవిత్రభందం, హిట్లర్, గోకులంలో సీత, పెళ్లిచేసుకుందాం రా, స్నేహితులు, అన్నయ్య, ఆప్తుడు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమునా, ఐశ్వర్య ప్రధాన పాత్రలుగా మామగారు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చిత్రంగా అందించారు. ఇందులో బాబూమోహన్ – కోటశ్రీనివాసరావు కామెడీ కాంబినేషన్ సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ – రాశి జంటగా గోకులంలో సీత  రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రం రాజశేఖర్-విజయశాంతి లతో అరుణకిరణం, రాజేంద్ర ప్రసాద్ – యమునలతో ఎర్రమందారం, మహేశ్వరీ ప్రధాన పాత్రలో అమ్మాయికాపురం, వెంకటేష్ – సౌందర్యల కాంబినేషన్లో పవిత్రబందం చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. ఇంకా పలు పురష్కారాలు అందుకున్నారు.

ఈవివి సత్యనారాయణ Telugu ChalanaChitra Kutumba Kadha Darshakulu

జంధ్యాలగారి శిష్యుడు అయినా ఈవివి సత్యనారాయణ చెవిలో పువ్వు చిత్రంతో దర్శకుడుగా మారి, ప్రేమఖైది ప్రేమకదా చిత్రంతో ప్రేక్షకులను సినిమాహాలులో రెండున్నర గంటలపాటు ఖైదు చేసారు. అప్పుల అప్పారావు చిత్రంతో అందరిని హాస్యభరితంగా ఆనందింపజేసి సీతారత్నంగారి అబ్బాయితో కామెడీ-సెంటిమెంట్ సమపాళ్లలో చూపించారు. జంబలకిడిపంబ అంటూ హాస్యాన్ని అందరికి పంచారు. ఇలా ఈవివి సత్యనారాయణ కామెడీ, సెంటిమెంట్ కుటుంబ కధ చిత్రాలను ఎక్కువగా హస్యబరితంగానే తెరకెక్కించారు. చిన్నచిత్రాలకు పెద్ద చిత్రాలకు కూడా దర్శకత్వం వహించిన దర్శకుడు.

ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో రాజేంద్ర ప్రసాదుతో హాస్యం అందించిన ఈవివి వారసుడు, హలో బ్రదర్, ఆవిడా మా ఆవిడే చిత్రాలతో నాగార్జునతో హాస్యం పలికించారు. చిరంజీవితో అల్లుడా మజాకా, వెంకటేష్ తో అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మోహన్ బాబుతో అదిరింది అల్లుడు, కృష్ణతో తెలుగువీరలేవరా పలు హీరోలతో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈవివి సత్యనారాయణ సొంతబ్యానర్ పై చాలబాగుంది చిత్రం స్వీయ దర్శకనిర్మాన భాద్యతలు తీసుకుని విజయవంతమయ్యారు. రంభ, రచన, ఊహ, రవళి నాలుగు నటీమణులు ఈవివి చిత్రాలద్వారా తెలుగు చిత్ర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అలాగే తన కొడుకులు అయిన నరేష్, ఆర్యన్ రాజేష్ లను హీరోలుగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసి అందించారు. అల్లరి నరేష్ కామెడీ చిత్రాల హీరోగా విజయవంతం అయ్యారు.

విజయబాపినీడు

డబ్బు డబ్బు డబ్బు చిత్రానికి దర్శకుడు గా వచ్చిన విజయబాపినీడు పట్నంవచ్చిన ప్రతివ్రతలు చిత్రంలో చిరంజీవి మోహన్ బాబులతో దర్శకునిగా పనిచేసారు. రాజేంద్ర ప్రసాద్ పలు హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాకు పెళ్ళాం కావాలి, దొంగకోళ్ళు, జూలకటక, మహాజనానికి మరదలు పిల్ల హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. మెగాస్టారు చిరంజీవితో పట్నంవచ్చినప్రతివ్రతలు, మగమహారాజు, హీరో, మగధీరుడు, ఖైదినెంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

వంశీ

కుటుంబ హాస్యకదా చిత్రాలను అందించిన దర్శకులలో వంశీ ఒకరు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా మంచుపల్లకి చిత్రం చిరంజీవి-సుహాసినిలతో తెరకెక్కించి దర్శకుడు అయ్యారు. మోహన్ – భానుప్రియలతో ఆలాపన చేయించి, కార్తిక్ భానుప్రియలతో అన్వేషణ చేసి, భానుప్రియను సితారగా మార్చి, రాజేంద్ర ప్రసాదుని లేడీస్ టైలర్ చేసారు. తరువాత పలు హాస్య చిత్రాలను కుటుంబ కదా చిత్రాలను అందించారు. చెట్టుకింద ప్లీడర్, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, ఏప్రిల్ 1 విడుదల, లింగబాబు లవ్ స్టొరీ, జోకర్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కె విశ్వనాధ్, కె రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, కోడిరామకృష్ణ, కెఎస్ఆర్ దాస్ దర్శకుల గురించి చదవండి.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu ఎందరో తెలుగు దర్శకులు మనకి మంచి చిత్రాలను అందించి అందరిని అలరించారు, ఎన్నోన్నో చిత్రాలలో మనోల్లాసం కలిగించే కధలను వెండితెరపై చూపించారు. మరెన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. సామజిక అంశాలలో సాంఘిక సూచనలు కలిగిన చిత్రాలను అందించారు. కుటుంబ విలువలను తెలిపే చిత్రాలు, కొందరు అందిస్తే ప్రేమ కావ్యాలు కొందరు తెరకెక్కించారు. ఇలా వివిధములైన విషయలలో అంశాలలో తెలుగు చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మి బుల్లి బుల్లి తెరలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్ష్యం అవుతున్నాయి. వారిలో కొంతమంది దర్శకులు కె విశ్వనాధ్, దాసరి నారాయణరావు, ఏ కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, కే రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టి, జంద్యాల, ముత్యాల సుబ్బయ్య, ఇవివి సత్యనారాయణ, ముప్పలనేని శివ, విజయ బాపినీడు, వంశీ, టి కృష్ణ, సింగీతం శ్రీనివాసరావు, బాపు, బి గోపాల్, సాగర్, రేలంగి నరశింహారావు, ఎస్వి కృష్ణారెడ్డి, శరత్, క్రాంతి కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, ఏ మోహన్ గాంధీ, విజయభాస్కర్ మొదలైనవారు Telugu ChalanaChitra prasidda uttama darshakulu.

కె విశ్వనాధ్ – Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu, K Vishwanath

కె విశ్వనాధ్ గారి పేరు చెబితే ఉత్తమ చిత్రాలకు దర్శకులుగా చెబుతారు. కళాతపస్వి అనే బిరుదనామం కూడా ఆయనికి చెబుతారు. మూగమనసులు చిత్రంకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కె విశ్వనాధ్ గారు ఆత్మగౌరవం చిత్రానికి దర్శకత్వం వహించారు, ఆ చిత్రం ఒక నంది అవార్డు గెలుచుకుంది. ప్రైవేటు మాస్టర్, కలోసిచ్చిన అదృష్టం, ఉండమ్మాబొట్టుపెడతా, ఓ సీతకధ, చెల్లెలి కాపురం, నిండు దంపతులు,  జీవనజ్యోతి, సిరి సిరి మువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, సూత్రదారులు, స్వాతికిరణం, శుభసంకల్పం, ఇంకా పలు తెలుగు చిత్రాలతో బాటు తమిళ్ హిందీ భాషలలో దర్శకత్వం వహించారు.

యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహిస్తే, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు, ఇంటర్నేషనల్ హానర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ఇంకా ఫిలిం ఫేర్ అవార్డ్స్ మొదలైన పలు అవార్డ్స్ గెలుచుకున్నారు. మానవ సంభందాలు – సామజిక అంశాలుపై మేలుకొల్పు చిత్రాలుగా తీసారు. క్లాసికల్ హిట్ చిత్రాల దర్శకులుగా ప్రఖ్యాతి గాంచిన మహనీయ దర్శకులు. అనవసరపు హంగులు లేకుండా అవసరమైన్ కధలను సామజిక అంశాలు మానవతా విలువలపై సందేశాత్మక చిత్రాలుగా మలచడం కె విశ్వనాధ్ గారి గొప్పతనం.

భారతీయ సాంప్రదాయ సంగీత గొప్పతనం కె విశ్వనాధ్ గారి చిత్రాల వలన ఇంకా ఎక్కువమందికి తెలిసేలా జరిగింది. సంగీతం ప్రధాన అంశంగా శంకరాభరణం, శ్రుతిలయలు, సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణ కమలం స్వాతి కిరణం చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా కొన్నిచిత్రాలు నటించారు.

దాసరి నారాయణరావు, Dasari Narayanarao

1972 సంవత్సరంలో తాతామనవడుకి దర్శకత్వం ప్రారంభించిన దాసరి నారాయణరావుగారు 2014 సంవత్సరంలో ఎర్రబసు చిత్రంతో కలిపి 140 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా చాలా చిత్రాలలో కనిపించి అలరించారు. కొన్ని చిత్రాలకు రచయితగా, కొన్ని చిత్రాలను నిర్మించారు. ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. మొదటి చిత్రం తాతమనవడు చిత్రానికి అవార్డు అందుకోగా తరువాత స్వరం-నరకం, మేఘసందేశం లాంటి చిత్రాలకుకూడా అవార్డ్ అందుకున్నారు. ఇంకా మామగారు తెలుగుచలనచిత్రంలో దాసరి గారి నటన అంటే ఇష్టపడిన తెలుగు వారుండరు.

కన్న తల్లిదండ్రులను విడిచి, తన విలాసాల కోసం డబ్బుకి అంతస్తులకి లొంగిన కొడుకుని కన్నందుకు సిగ్గుపడి, బాధపడి అఖిరికి కోర్టులో కొడుకుని నిలబెట్టిన సూరిగాడు చిత్రంలో దాసరి నటన ప్రశంసనీయం. అడవి పల్లెల అడపడుచులపై చేసే ఆకృత్యాలని చిత్రంలో దర్శకుడుగా తెరకెక్కించి తానూ ఒక పాత్రను పోషించిన ఒసేయ్ రాములమ్మ చిత్రం ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఇంకా తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్నారు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, మాటలు-పాటలు ఇలా ఒకే వ్యక్తి ఎక్కువ చిత్రరంగాల్లో రాణించిన వ్యక్తి దాసరిగారే ఉంటారు. 2017 మే 30 న సికింద్రాబాద్‌లో కిమ్స్‌లో కన్నుమూసారు.

కోడి రామక్రిష్ణ, Kodi Ramakrishna

100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు, చిరంజీవి హీరోగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో దర్శకుడు పరిచయమయ్యారు. అయితే కోడిరామకృష్ణ ముందుగా దాసరి నారాయణరావు గారి దర్శకత్వ శాఖలో పనిచేసారు. చిరంజీవితో ఇంకా ఆలయశిఖరం, సింహపురి సింహం, గూడచారి నెం1, రిక్షావోడు, అంజి చిత్రాలకు దర్శకులుగా వ్యవహరించారు. నందమూరి తారక రామరావుగారి బాలకృష్ణకు సోలో హీరోగా విజయంతమైన చిత్రం మంగమ్మగారి మనవడు చిత్రానికి కోడి రామకృష్ణే దర్శకులు. తరువాత బాలకృష్ణతో పలు తెలుగుచిత్రాలు ముద్దులకృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమేనల్ల్దుడు, బాలగోపాలుడు దర్శకత్వం వహించారు.

తెలుగులో గ్రాఫిక్స్ కలిగిన చిత్రాలు ఎక్కువగా దర్శకత్వం వహించడంతో భారి చిత్ర నిర్మాణ వైభవం కోడి రామకృష్ణగారి దర్శకత్వంలోనే ఎక్కువ ఉండేవి. అమ్మోరు, దేవిపుత్రుడు, అంజి, దేవి, అరుందతి వంటి చిత్రాలతో గ్రాఫిక్స్ ఎక్కువగా వాడి తెలుగువారికి అద్బుత చిత్రాలను అందించారు. కోడి రామకృష్ణగారి చిత్రాలు మద్యతరగతి సంసార ఇతిభాదలు, కుటుంబ బంధాలు ప్రధాన అంశంగా కొన్ని చిత్రాలు ఉంటాయి. ఆవిడే శ్యామల, ఆస్తిమూరెడు ఆశబారెడు, ఆలయశిఖరం, పెళ్లి, పెళ్ళాం చెబితే వినాలి, పెళ్లిపందిరి, పుట్టింటికి రా చెల్లి, ముక్కుపుడక, పంచదార చిలక మొదలైన చిత్రాలు ఉంటే కోడి రామకృష్ణ కొన్ని చిత్రాలలో నటించారు. చిన్నపిల్లలతో భక్తి యాత్ర చేయించి దేవుళ్ళ గురించి మహిమల గురించి తెలియజెప్పారు.

కె రాఘవేంద్ర రావు – Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu, K Raghavendrarao

దర్శకేంద్రుడు అని శతచిత్ర దర్శకులైన రాఘవేంద్రరావు గారిని అంటారు. తెలుగు చిత్ర సీమలో NT రామారావు గారి నుండి మంచు మనోజ్ వరకు చాల మంది హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిన్న మొన్నటి తెలుగు అగ్రతారలు రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విక్టరి వెంకటేష్ తొలిచిత్రం కలియుగ పాండవులు రాఘవేంద్రుడి దర్శకత్వంలోనే వచ్చింది. మహేష్ బాబుని రాజకుమారుడు చిత్రంతో, అల్లుఅర్జున్‌ని గంగోత్రి చిత్రంతో హీరోలుగా నేటి తరం అగ్రహీరోలను తొలిపరిచయం చేసింది రాఘవేంద్రరావు గారే.

తెలుగు అగ్రహీరోలకు బిగ్గెస్ట్ హిట్ చిత్రాలను అందించింది కె రాఘవేంద్రరావు గారే, పదహారేళ్ళ వయసు, వేటగాడు, గజదొంగ, కొండవీటిసింహం, త్రిశూలం, దేవత, అడవిదొంగ, అగ్నిపర్వతం, పట్టాభిషేకం, జానకిరాముడు, కొండవీటిదొంగ, ఆఖరిపోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, సుందరకాండ, అల్లుడుగారు, ఘరానామొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరిప్రియుడు, పెళ్లిసందడి, ముద్దులప్రియుడు, రాజకుమారుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు దర్శకత్వం వహించారు. పాటలచిత్రీకరణలో పళ్ళుపూవులు నటుల అందాలతో అందంగా తీయడం రాఘవేంద్రరావుగారి తరువాతే.

సాంఘిక చిత్రాలలో అనేక విజయాలను అందుకున్న రాఘవేంద్రరావుగారు భక్తిరస చిత్రాలలోనూ మంచి విజయాలు సాధించారు. అన్నమయ్య చిత్రంతో నాగార్జునని ఓకే భక్తుడిగా సుమన్ వేంకటేశ్వరస్వామిగా చూపించి అందరి ప్రశంశలు అందుకున్నారు. తరువాత చిరంజీవిని శివుడిని చేసి అర్జున్‌ని భక్తుడిగా శ్రీమంజునాధ చిత్రంతో మళ్ళి ఒకసారి భక్తుల మన్ననలను అందుకున్నారు. మరలా భక్తిచిత్రాలతోనే నాగార్జున హీరోగా శ్రీరామదాసు కధని, షిర్డీ సాయిబాబా కధని వెండితెరపై ప్రసరింపచేసారు. సాంఘిక చిత్రమైన భక్తిచిత్రమైన ప్రేక్షకులకు అర్ధం అయ్యేరీతిలో తీయడం, ప్రేక్షక హృదయాలని రంజింప చేయడంలో దిట్ట. ఈతరం ప్రసిద్ద దర్శకులలో జక్కన రాజమౌళి రాఘవేంద్రరావు గారి శిష్యుడే.

కెఎస్ఆర్ దాస్, KSR Das

యాక్షన్ తరహాలో నేరవిభాగంలో సాగే అంశాల చిత్రాలు తీయడంలో సిద్దహస్తులు. నేరస్తులను వెంటాడే పోలీసులు, నేరస్తులను పట్టుకోవడంలో ప్రత్యేక ఏజెంట్స్ నిర్వహించే ఆపరేషన్స్ వంటి చిత్రాలను తెరకేక్కించడంలో ఘనాపాటిగా చెబుతారు. తెలుగుతో బాటు కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తం మీద 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులలో కెఎస్ఆర్ దాస్ ఒకరు.

శోభన్ బాబు కధానాయకుడుగా నేరగాళ్ళను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో లోగుట్టుపెరుమాళ్ళకెరుక చిత్రం దర్శకత్వం వహించారు. తరువాత కృష్ణతో అనేక సాహాస చిత్రాలు తీసారు, టక్కరిదొంగ చక్కనిచుక్క, మోసగాళ్ళకు మోసగాడు, అన్నదమ్ముల సవాల్, ఏజెంట్ గోపి, దొంగలవేట, మాయదారి అల్లుడు, రహస్యగూడచారి, దొంగలు బాబోయ్ దొంగలు, దొంగలకుసవాల్ వంటివి ఉన్నాయి. కృష్ణంరాజు – చిరంజీవి హీరోలుగా పులి బెబ్బులి, కృష్ణ-రజనికాంత్ హీరోలుగా ఇద్దరూ అసాధ్యులే  వంటి మల్టీస్టారర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా కృష్ణతో చిత్రాలకు దర్శకత్వం వహించారు.

తెలుగురీడ్స్

ప్రస్తుత ప్రసిద్ధ తెలుగు దర్శకులు

Telugu Chitra Movie Present Famous Directors

Telugu Chitra Movie Present Famous Directors తెలుగులో చిత్రాలని అందించి, అందిస్తున్న కొంతమంది దర్శకుల చిత్రాలు ప్రేక్షకాభిమానం సంపాదిస్తూ వారికి కూడా కొంతమంది అభిమానులు సంపాదించి పెడతాయి. అలా కొన్నిచిత్రాల ద్వారా కొంతమంది దర్శకులకు అభిమానులు ఉంటారు. దర్శకుని పై అభిమానంతో నమ్మకంతో వెళ్ళే దర్శకుల జాబితాలో ఇప్పటి తరం వారు ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాధ్, సుకుమార్, క్రిష్, శేఖర్ కమ్ముల, సతీష్ వేగేశ్న, కొరటాల శివ, మారుతి మొదలైనవారు ఉంటారు.

ఎస్ఎస్ రాజమౌళి చిత్ర దర్శకులు – SS Rajamouli Telugu Chitra Movie Present Famous Directors

ఎస్ఎస్ రాజమౌళి ప్రతి చిత్ర కధానాయకుడి అభిమానికి రాజమౌళి అభిమాన దర్శకుడుగా ఉంటారు. తమ అభిమాన హీరో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో ఉంటే బాగుంటుంది అని అభిమానులు భావించేంతగా చిత్రాలను మలిచిన తెలుగుచిత్ర జక్కన అంటే అందరికి అభిమానమే. అలాగే ప్రతి భారతీయ కధానాయకుడుకి కూడా రాజమౌళి దర్శకత్వంలో చిత్రం అంటే అది వారికీ పట్టిన అదృష్టమే అవుతుంది. తెలుగు చిత్ర ఘనతని ప్రపంచానికి చాటుతూ ప్రాంతీయ చిత్ర స్థాయిని అంతర్జాతీయంగా మార్చేసిన చిత్రఋషి ఎస్ఎస్ రాజమౌళి.

స్టూడెంట్ నెం1 చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అయ్యి, తనని దర్శకుడిగా పరిచయం చేసిన హీరోకి చిత్రపరిశ్రమలో సుస్తిర స్థానం ఏర్పరచే చిత్రాలను తీసిన దర్శకుడు బహుశా రాజమౌళి గారే అయ్యి ఉండవచ్చు. Jr. NTR హీరోగా రాజమౌళి దర్శకుడుగా పరిచయం అయితే, సింహాద్రి, యమదొంగ చిత్రాలను jr. ఎన్టీఆర్ పామ్‌లో లేనప్పుడు రాజమౌళి హిట్ చిత్రాలను అందించారు. అలాగే మెగాస్టారు చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ కి రెండవ చిత్రం మగధీరతో స్టార్ డం నిలబెట్టేసారు. పురుగుతో చిత్రం తీసి విచిత్రంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాయించారు ఈగతో.

ఎన్టిఆర్, రామ్ చరణ్ కంటే ఎక్కువ లాభపడింది మాత్రం ప్రభాస్, మొదట తీసిన ఛత్రపతి సినిమా సూపర్ హిట్ అయితే, రెండవ సినిమా బాహుబలి భారతదేశంలో సూపర్ హిట్ అయ్యింది, మూడవ సినిమా భారతదేశ అల్ టైం రికార్డు అయ్యింది. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని పెంచిన దర్శకుడిగా రాజమౌళి గారి గురించి ఎంతచెప్పిన అభిమానికి తనివితీరదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర దర్శకులు – Trivikram Srinivas Telugu Chitra Movie Present Famous Directors

త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలకు మాటలు రాస్తూ మాటల మాంత్రికుడుగా ఉండి, చిత్రాలను దర్శకత్వం చేస్తూ చిత్ర మాంత్రికుడు అయ్యారు. స్వయం వరం, చిరునవ్వుతో, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, జైచిరంజీవ, మన్మధుడు, వాసు మొదలైన్ చిత్రాలకు మాటలను అందించి, నువ్వే నువ్వే అంటూ చిత్ర దర్శకత్వం వహించారు. నువ్వే నువ్వే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ అయిన ఒక తండ్రి కూతురి గురించి పడే తపన చిత్రానికి హైలైట్.

అతడుతో అతడికి దర్శకుడెవరు అని తరచి చూసే విధంగా చిత్రం మలిచారు. చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తే, అతని మానరిజంతో సినిమాని చాలా చక్కగా తీర్చిదిద్దారు. తెలుగు టీవీ ఛానెల్లో ప్రసారం అయిన ప్రతిసారి టివికి అతుక్కుని చూసిన చిత్రంగా చెబుతారు. తరువాత పవన్ కళ్యాణ్ తో జల్సా, మళ్ళి మహేష్ తో ఖలేజ, అల్లు అర్జున్ తో జులాయి, పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది చూపించి సన్ అఫ్ సత్యమూర్తి చిత్రంతో విలువలే ఆస్తులు అంటూ మన్ననలు పొందారు. ఆ తరువాత అఆ, అజ్ఞాతవాసి తీసి, ఇప్పుడు ఎన్టిఆర్ తో అరవింద సమేత వీరరాఘవ అని టైటిల్ తో అభిమానుల్లో ఆత్రుత పెంచారు.

సుకుమార్ చిత్ర దర్శకులు – Sukumar Telugu Chitra Movie Present Famous Directors

కొత్తగా ఆలోచన చేస్తూ నవీన తరానికి కొత్తగా చిత్రాలను చూపించే వారిలో ముందుండే దర్శకుడు. ఎప్పుడు కొత్తగా ఆలోచన చేసే యువతరానికి ఈయన చిత్రాలు కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. అందుకు మొదటి చిత్రం ఆర్య ప్రేమించిన ప్రియురాలు, ఆమె ప్రియుడుగా అనుకునే వ్యక్తితో ప్రేమికుడుగా ప్రవర్తించే పాత్రలో హీరో సాహసోపేతంగా నడిపించిన నాయకుడుగా సుకుమార్ విజయవంతమయ్యారు. అలాగే ఆర్య-2 ప్రేమ-స్నేహం రెండు పార్శ్వాలు ఒకేసారి ఒకవ్యక్తిలో కలిగి అంతఃఘర్షణను చూపించే సాహసం కొత్తగానే కనబడుతుంది.

జగడం సినిమాలో రౌడీయిజం, 100% లవ్ సినిమాలో లెక్కలు వేసే ప్రేమను చూపించిన విధానంలో యువత ఆకర్షితులు. తరువాత 1 నేనొక్కడినే చిత్రం, కుమారి 21f చిత్రాలు అన్ని రొటీన్ కు భిన్నం అన్నట్లు సాగే చిత్రాలే. స్టార్ హీరోతో కూడా ప్రయోగాత్మక చిత్రం తీయగలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. అల్లు అర్జున్ తో అర్య2, మహేష్ బాబుతో 1 నేనొక్కడినే తీసి, ఎన్టిఆర్ తో నాన్నకు ప్రేమతో చిత్రాలు నిరుపిస్తాయి. స్టార్ హీరో అయిన చిన్న హీరో అయిన చిత్రం రొటీన్ కి భిన్నమే అవుతుంది.

ఎన్టిఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో, నాన్న పగ కోసం జీవితాన్ని రిస్కులో పెట్టి నాన్నకు ఋణం తీర్చుకునే కొడుకుగా ఎన్టిఆర్ ని చక్కగా చూపిస్తారు. కలిక్యులేటేడ్ మైండ్ కలిగిన ఒక యువకుడి పాత్రలో ఎన్టిఆర్ కనిపిస్తారు. ఈమధ్యనే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టించిన చిత్రం (బాహుబలి తరువాత ప్లేస్) రంగస్థలం అంటారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పల్లెటూరి పాత పాత్రలో పరకాయ ప్రేవేశం చేసినట్టుగా చూపించడం సుకుమార్ సాహసమే చేసారు, విజయవంతం అయ్యారు.

పూరి జగన్నాథ్ చిత్ర దర్శకులు – Puri Jagannath Telugu Chitra Movie Present Famous Directors

ఎంట్రీ ఒక ఫేమస్ హీరోతో చేసిన దర్శకుడు. ఫేంలో ఉన్న పవన్ కళ్యాణ్ తో బద్రి చిత్రానికి దర్శకునిగా పూరి జగన్నాథ్ పరిచయం అయ్యారు. అయితే తరువాత ఎక్కువ చిత్రాలను రవితేజతో తీసి ఒక సక్సెస్ ఫుల్ హీరోగా రవితేజని నిలబెట్టారు. విభిన్న చిత్రాలను చాల వేగవంతంగా తెరకెక్కించడంలో ఘనాపాటిగా చెబుతారు. పెద్ద హీరో అయినా చిన్న హీరో అయిన ప్రారంబించిన చిత్రం కొద్దికాలంలోనే విడుదలకు సిద్దం అవుతుంది.

పవన్ కళ్యాణ్ తో బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు, అల్లు అర్జున్ తో దేశముదురు, ఇద్దరమ్మాయిలు, నాగార్జునతో శివమణి, సూపర్, ఎన్టిఆర్ తో ఆంధ్రావాల, టెంపర్ విజయవంతమైన చిత్రాలు తీసిన పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్ మేన్, ప్రబాస్ తో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ ఇంకా రవితేజ, గోపీచంద్, నితిన్ తదితరులతో మొత్తంగా నలభై చిత్రాల వరకు దర్శకత్వం వహించారు.

జాగర్లమూడి రాధాకృష్ణ క్రిష్ చిత్ర దర్శకులు – Krish Telugu Film Present Famous Directors

గమ్యం చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకులు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్). మొదటి చిత్రం అల్లరి నరేష్, శర్వానంద్, కమిలిని ముఖర్జీ లతో ఒక మంచి చిత్రం అందించారు. తరువాత వేదం చిత్రం కధాంశం ప్రధానంగా స్టార్ హీరోని ఒక కధలో భాగంగా నాలుగు కధలను ఒకే తెరపై విజయవంతంగా తెరకేక్కించారు. అలాగే వేదం చిత్రంలో ఒక స్టార్ హీరొయిన్ని వేశ్య పాత్రలో చూపించడం జరిగింది.

దగ్గుబాటి రానాతో కృష్ణంవందే జగద్గురుం అంటూ సందేశాత్మక చిత్రం తీసారు. తరువాత కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి బాలకృష్ణతో చారిత్రిక అంశంతో సినిమా తీసారు. దర్శకుడైన పదేళ్ళలో అయిదు ఉత్తమ దర్శకుడు (Best Director) అవార్డ్స్ గెలుచుకోవడం విశేషం. నందమూరి బాలకృష్ణతో నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమాకి పనిచేస్తున్నారు.

శతమానంభవతి కుటుంబ సంభందాలు మనోభావాలను సాంకేతిక విప్లవం ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయో ఈ చిత్రం ద్వారా సతీష్ వేగేశ్న దర్శకులు చెప్పడంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారని చెప్పవచ్చు. శర్వానంద్, ప్రకాష్ raj, జయసుధ, నరేష్, ఇంద్రజ మొదలైన వారు నటించిన పాత్రలే ప్రధానంశంగా కుటుంబ బందాలే విలువైనవిగా చిత్రం చక్కగా తెరకెక్కించారు, దర్శకులు.

మా పెళ్ళికి రండి, తొట్టిగాంగ్, కబడ్డీ, కబడ్డి తదితర చిత్రాలకు రైటర్ గా పనిచేసిన తర్వాత అల్లరి దొంగలబండి కామెడీ చిత్రం తీసిన సతీష్ వేగేశ్నకు గుర్తింపు తెచ్చిన చిత్రం శతమానంభవతి. శ్రీనివాస కళ్యాణం చిత్రం నితిన్ – రాశిఖన్నా జంటగా దర్శకత్వం వహిస్తున్నారు.

కొరటాల శివ, శేఖర్ కమ్ముల – Koratala Siva, Sekhar Kammula Telugu Chitra Movie Present Famous Directors

గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి సహాయ రచయితగా భద్ర, మున్న, ఒక్కడున్నాడు, సింహ, బృందావనం, ఊసరవెల్లి చిత్రాలకు రచయితగా ఉన్న కొరటాల శివ మిర్చి చిత్రంలో స్టార్ డైరెక్టర్ గా మారారు. ప్రబాస్ అనుష్క శెట్టిలు జంటగా దర్శకుడిగా తీసిన తొలి చిత్రం సూపర్ హిట్ అయింది. పల్నాడులో రెండు గ్రామాల మద్య యుద్ధం కాకుండా ప్రేమతో గొడవలు మాన్పించే యువకుడు పాత్రలో ప్రభాస్ ని చక్కగా చూపించారు. శ్రీమంతుడు చిత్రం మహేష్ జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులతో తీసి, ఒక కోటీశ్వరుడు ఊరిని దత్తత తీసుకుని, ఊరిని బాగుచేయడం, ఊరి సమస్యలను సరి చేసే వ్యక్తిగా చిత్రం చక్కగా చూపించారు.

జనతా గారేజ్ అన్ని రిపైర్లు చేయబడును అంటూ జనం సమస్యలను తీర్చే వ్యక్తి తమ్ముడి కొడుకు ప్రకృతిని పరిరక్షించే వ్యక్తిగా ఎదిగి వచ్చి పెదనాన్న జనతా గారేజ్ బాధ్యతను తీసుకోవడం, ఒక కుటుంబా కదా చిత్రం ఎన్టిఆర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సందేశాత్మకంగా తీసారు. తరువాత మహేష్ బాబుతో భారత్ అను నేను అంతఃకరణ శుద్దితో ఒక ముఖ్యమంత్రి పనిచేసే తీరుని చూపించారు. సక్సెస్ రేట్ బాగా ఉన్న దర్శకులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

శేఖర్ కమ్ముల డాలర్ ఇంగ్లీష్ చిత్రంతో అవార్డు పొంది ఆనంద్ సినిమాతో అందరికి ఒక కాఫీ లాంటి చిత్రం అందించి, గోదావరిలో ప్రయాణం చేయించిన దర్శకుడు. సహజమైన కధాంశాలు తీసుకుని కొత్తవారితో చిత్రాలు రూపొందించే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆనంద్, గోదావరి హిట్ చిత్రాల తరువాత హ్యాపీ డేస్ కొత్త నటులతో చిత్రం తీసిన ఆవకాయ బిర్యానీని తయారు చేయించారు. తరువాత ఒక ముఖ్యమంత్రి కొడుకు మంచి ముఖ్యమంత్రిగా పడే పాట్లు చాలా సహజంగా తీసారు. లైఫ్ ఇస్ బ్యూటీఫుల్ మూవీ తీసాక, నాగబాబు అబ్బాయి వరుణ్ తేజ్ – సాయి పల్లవితో ఫిదా హిట్ చిత్రం దర్శకత్వం వహించారు.

మరింత మంది దర్శకుల గురించి తరువాయి పోస్టులలో Telugu Chitra Movie Present Famous Directors

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

జనతా గారెజ్

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఓకే కుటుంబ కథ! జనతా గారేజ్ తెలుగు చలన చిత్రం. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కధానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే కుటుంబ పెద్దగా మోహన్ లాల్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిచిన ఈ చిత్రానికి నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్.

చంద్రశేఖర్ (సాయి కుమార్) శివ (రహమాన్) ఇద్దరు స్నేహితులు హైదరాబాదులో ఉంటారు. అయితే చంద్రశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. రహమాన్ ఊరిలో ఉన్న తన అన్న సత్యం (మోహన్ లాల్)ని కుటుంబంతో సహా హైదరాబాదుకి తీసుకువచ్చి అక్కడ అతనికి ఒక వర్క్ షాప్ పెట్టిస్తాడు. అయితే ఆ గారేజ్ ఒక స్థాయిలో వెళుతుంది.

సత్యం (మోహన్ లాల్) అన్యాయం జరిగిందంటూ ఎవరు వచ్చి అడిగి సహాయం చేయమన్న వెళ్లి సహాయం చేస్తూ ఉంటాడు. కొద్దిరోజులుగా తన షెడ్లో పనిచేసే పెద్దాయన రాకపోతే ఆయనింటికి వెళ్లి విషయం అడుగుతారు జనతా గారేజ్ పెద్ద మరియు అక్కడ పనిచేసే అతని గ్యాంగ్. తన కూతురిని మానభంగం చేసి చంపేశారని వాపోతాడు ఆ పెద్దాయన. ఈ విషయం గురించి జనతా గారేజ్ వ్యక్తులు అంతా కలిసి DSP చంద్రశేఖర్ (సాయికుమార్) దగ్గరికి వెళ్లి అడుగుతారు. నగరంలో ఒక పెద్దమనిషికి సంభందించిన వారు సాక్ష్యం లేకుండా ఆ తప్పు చేశారని, ప్రస్తుతం పోలీసులు చేతిలో ఏమి లేదని చెబుతారు.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

పోలీసుల సమాధానం విన్న జనతా గారేజ్ మనుషులు పెద్దాయన కూతుర్ని మానభంగం చేసిన నలుగురుని ఆక్సిడెంట్ గా చూపి చంపుతారు. ఇక ఆ సంఘటన తరువాత సిటీలో ఎవరికీ ఏ సమస్య వచ్చిన జనతా గారేజ్ వైపు చూడడం, వారికి వచ్చి విన్నవించుకోవడం జరుగుతూ ఉంటే, జనతా గారేజ్ గాంగ్ తమకు చెప్పిన సమస్యలను సరిచేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే సత్యం (మోహన్ లాల్) తమ్ముడుకి పెళ్లి సంభందం వస్తుంది, పెళ్లి చేసుకుని ముంబై వచ్చేయమని (సురేష్ అనుయాయులు) పెళ్ళివారు అడిగినా రహమాన్ పెళ్లిచేసుకుని హైదరాబాదులో అన్నదగ్గరే ఉంటాడు. కొన్నాళ్ళకు వారికి ఒక బిడ్డకలుగుతాడు. అయితే జనందృష్టి ఎలా పడితే అలా ఎదగడం ఉండే సామజిక పరిస్థతిలో జనతా గారేజ్ గ్యాంగ్ అంటే మంచి చేసే గ్యాంగ్ గా పేరు గడిస్తుంది, అలాగే సిటీలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో శత్రుత్వం కూడా సంపాదించుకుంటుంది. ఒకరోజు వారు గుడికి వెళుతుంటే జనతా గారేజ్ శత్రువులు కొందరు సత్యం (మోహన్ లాల్) తమ్ముడు రహమాన్ దంపతులపై దాడి చేసి చంపుతారు, వారి కొడుకు బతుకుతాడు.

ఆ ఇన్సిడెంట్ తరువాత DSP చంద్ర శేఖర్ వచ్చి ఈ పనులు మానేయమని ఇంతకుముందు మీకు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను అని చెబుతాడు. ముంబై నుండి వచ్చిన తమ్ముడు బావమరిది సురేష్ కి తమ్ముడి కొడుకుని వారికి ఇచ్చేసి మేమనే బందువులు ఉన్నట్టు చెప్పకుండా పెంచుకోండి, అని చెబుతాడు. అలా ముంబైకి చేరిన పిల్లవాడు ప్రకృతిపై అమితమైన ప్రేమను పెంచుకుంటూ ఉంటాడు. పిల్లవాడు మేనమామ అయిన సురేష్ కి ఒక పాప, ఇద్దరు పిల్లలు కలిసి పెరుగుతారు. అమ్మానాన్న గురించి అడిగితే మీ అమ్మ నాలాగా మీ నాన్న నీలాగా ఉంటుంది అని మాత్రమే సమాధానం చెబుతాడు సురేష్. పెరిగిన పిల్లవాడు ఆనంద్ (నందమూరి తారక రామారావు jr.), పాప బుజ్జి (సమంత).

కధానాయకుడి పరిచయ పాటలో అతని వ్యక్తిత్వం ప్రతిబింబించేలా ప్రకృతిని గురించి కధానాయకుడి ప్రణామం పాట చక్కగా ఉంటుంది. ప్రకృతిని ఇష్టానుసారం వాడుకునే వారు, పద్దతిగా వాడుకునేవారు ఎవరైనా పాటను వింటే ప్రకృతిపై ఇంకా గౌరవం పెరుగుతుంది.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

వాతావరణ కాలుష్యం గురించి ఆనంద్ (నందమూరి తారక రామారావు Jr.) ఎప్పుడు ఆలోచన సాగిస్తూ, ప్రకృతిని కాపాడుకోవాలి అని చూస్తూ ఉంటాడు. సురేష్ అప్పుడు ఆనంద్ జనతా గారేజ్ గ్యాంగ్ ఆలోచన చేసినట్టే ఆలోచన చేస్తున్నాడని అర్ధం అవుతుంది. తండ్రి కుటుంబ ఆలోచనలు ఇతనిలోను సాగుతాయి. ఆనంద్ ఆలోచనలు పెదనాన్నసత్యం(మోహన్ లాల్)లాగ సాగితే, సత్యం కొడుకు మాత్రం జనతా గారేజ్ విరోధితో చేతులు కలిపి తండ్రి దారి నుండి తప్పుకుని చెడు దారిలో ఆలోచనలు సాగుతూ ఉంటాయి.

సత్యం అతని అనుయాయులు ఎవరికీ ఏ సమస్య ఉందని జనతా గారేజ్ దగ్గరికి వచ్చిన వారి వారి సమస్యలను తీర్చుతూ సహాయపడుతూ ఉంటారు. అలా జనతా గారేజ్ వాహనాలను మనుష్యులను కూడా రిపేర్ చేయడం కొనసాగిస్తూ ఉంటుంది. సిటీలో ఉన్నా పేదవారి గుడిసెలు కలిచేసి హోటల్ కాంప్లెక్స్ కట్టి అభివృద్ధి చేసి పేదలకు కూడా వేరేచోట ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ తెస్తారు. సత్యం (మోహన్ లాల్) తిరస్కారంతో ఆ స్లం ప్రాజెక్ట్ ఆగిపోతుంది. జనతా గారేజ్ ఏమని చెప్పినా అదే కరెక్ట్ అనే అభిప్రాయం జనాలలో పెరుగుతుంది.

ప్రకృతిపై ప్రేమ కలిగిన ఆనంద్ ముంబైలో ప్రకృతిని పరిరక్షణకోసం అన్నట్టు చేసే ప్రయత్నంలో నిత్యమీనన్ పరిచయం అవుతుంది. బుజ్జి(సమంత), ఆనంద్ (నందమూరి తారక రామరావు Jr.)లు షాపింగ్ మాల్లో కలిస్తే చూసిన నిత్య ఎప్పుడు ప్రకృతి అని నసపెట్టే అతనితో ఏం ఫన్ ఉంటుంది, అంటే. డానికి ఆనంద్ నాతోరా అని నిత్యని తీసుకువెళతాడు ఎప్పుడూ తాను ఆనందంగా గడిపే ప్రదేశాలకి. మనకి ఆనందాన్ని ఇచ్చే ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనే ప్రధాన ఉద్దేశ్యమే ఆనంద్‌లో ప్రస్పుటం అవుతుంది.

జనతా గారేజ్ యజమాని సత్యం (మోహన్ లాల్)కి ఆక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్ జాయిన్ అవుతాడు. ఆ ఆక్సిడెంట్ జనతా గారేజ్ శత్రువులే చేయించారని జాగ్రత్త అని DSP చంద్ర శేఖర్ మరలా హెచ్చరిస్తారు. ముంబైలో ఆనంద్ ఒక పార్క్ తీసీవేయలనుకున్న ఒక ఎంఎల్ఏ దేశ్ పాండేతో గొడవపడతాడు. ఒకసారి నేను హైదరాబాదు పరిశోదన నిమిత్తం వెళతాను అని అడిగిన ఆనంద్‌ని వద్దని ఆపేసిన (ఆనంద్ మావయ్య)సురేష్, ఇప్పుడు నీవు హైదరాబాదు వెళ్లి పరిశోదన చేసుకో అని చెప్పి హైదరాబాదుకి పంపించేస్తాడు.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

అయితే హైదరాబాదులో జనతా గారేజ్ యజమాని సత్యంగారికి ఆరోగ్యమ బాగా ఉండకపోవడం వలన వారి మంచి కార్యకలాపాలు కొంచెం తగ్గుతాయి. జనతా గారేజ్‌లో మిగిలినవారు సత్యంగారి ఆరోగ్యదృష్ట్యా సమస్యలు చెప్పుకునే వారు వచ్చిన కాదని వారిని పంపించేస్తూ ఉంటారు. జనతా గారేజ్ భాద్యతని తన కొడుకుని తీసుకోమని సత్యం(మోహన్ లాల్) అడిగితే కొడుకు కాదంటాడు. అంతే కాకుండా కొడుకు జనతా గారేజ్ విరోధి కూతుర్ని పెళ్లిచేసుకుని, అతని చేతిలో కీలుబొమ్మగా మారతాడు.

సత్యం(మోహన్ లాల్)గారి కొడుకు వలన హైదరాబాదులో ఒక చోట పర్యవరణం కాలుష్యం జరుగుతుంటే, జనతా గారేజ్ యజమాని కొడుకు అని ఎవరు ఆ విషయం జోలికి వెళ్ళరు, కానీ పరిశోదన నిమిత్తం అక్కడికి వచ్చిన ఆనంద్ వారిని కారణం అడిగి తెలుసుకుని, సత్యం(మోహన్ లాల్)గారి కొడుకుని అతని మనుషులతో గొడవపడతాడు. ప్రకృతిలో మనం ఒక బాగంగా వచ్చాము అద్దెకు వచ్చినట్టు, శుభ్రంగా వాడుకోవాలి కానీ, ఎలాపడితే అలా వాడి పర్యావరణం పాడుచేయకూడదు అనే కధానాయకుడి భావన ఒక సద్భావనగా ఉంటుంది.

సత్యం (మోహన్ లాల్) గారు తన కొడుకుతో గొడవపడ్డ ఆనంద్‌ని జనతా గారేజ్ కి తీసుకువచ్చి వాళ్ళ అబ్బాయి విషయంలో తగువు ఎందుకు అని తెలుసుకుంటాడు. తరువాత ఆనంద్ దగ్గరకి వెళ్లి చాన్నాళ్ళుగా ఈ జనతా గారేజ్ జనాలా సమస్యలు తీర్చింది, ఇప్పుడు నా వయస్సు మీరడం వలన సమస్యలు చెప్పి బాధపెట్టడం ఎందుకు అని వెనుతిరుగుతున్నారు, అందుకు నాకు చాల బాధగా ఉంది. నీవు వచ్చి జనతా గారేజ్ భాద్యతని తీసుకుని నడిపించమని అడుగుతారు, నీపైనే నమ్మకం ఉంది అని అంటారు. సుదీర్ఘ ఆలోచన తరువాయి జనతా గారేజ్ భాద్యతని ఆనంద్ స్వీకరిస్తాడు.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

సహాయం అడిగిన మంచివారికి సహాయం చేసే గుణం సత్యం గారికి, ప్రకృతి అమితమైన ప్రేమతో పర్యావరణ పరిరక్షణకు పూనుకునే తమ్ముడి కొడుకు ఆనంద్ కలయిక జనతా గారేజ్. కార్ల రిపేర్ తో బాటు మరలా మనుషుల రిపేర్ మొదలవుతుంది. జనతా గారేజ్ సహాయం కోసం వచ్చి వెనుతిరిగిన మొదటి వ్యక్తితో ఆ రిపేర్ మొదలవుతుంది. అలా వెళ్ళినా మొదటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి వికాస్. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చేఅధికారిగా వికాస్ (రాజీవ్ కనకాల) GHMCలో పనిచేస్తున్న ఉద్యోగిని డాకుమెంట్స్ సరిగా లేని బిల్డింగ్ అప్రూవల్ కోసం ఒక వ్యాపారస్తుడి మనుషులు బెదిరిస్తారు.

ఆనంద్ ఆ ఉద్యోగి వికాస్ ని జనతా గారేజ్ పిలిపించి అడిగినప్పుడు తన సమస్యను చెబుతారు, GHMC ఉద్యోగి(రాజీవ్ కనకాల). అప్పుడు ఆనంద్ (నందమూరి తారక రామారావు jr.) సంతకం పెట్టడానికి రేపు వారు గడువు ఇచ్చారని అంటున్నావు, ఈరోజు మేము మీతో మాట్లాడకుండా ఉండి ఉంటే రేపు మీరేం చేసేవారని అడుగుతాడు. డానికి బదులుగా రేపు ఆఫీసుకి వెళ్ళే లోపులోనే సూసైడ్ చేసుకునే వాడిని అని బదులిస్తారు. ఆ సన్నివేశంలో ఒక ఇద్దరు పిల్లలు, భార్య కలిగిన సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగి భావన ఆనంద్కి కనిపిస్తుంది వికాస్ ముఖంలో.

మరునాడు GHMC ఆఫీసులో ఆనంద్ మాటలు అక్కడి ఉద్యోగస్తులని కదిలిస్తాయి. అలాగే అక్కడికి ప్రభుత్వ ఉద్యోగి వికాస్(రాజీవ్ కనకాల) బెదిరింపుతో వచ్చిన మనుషుల్ని ఆనంద్ కొట్టి పంపిస్తాడు. అలా మొదలైన జనతా గారేజ్ అన్ని రిపైర్లు విజయవంతం అవుతాయి. మరలా DSP చంద్రశేఖర్ ఆనంద్‌ని కూడా హెచ్చరిస్తాడు, ఇలాంటి పనుల వలన సమస్యలు వస్తాయని. డానికి బదులుగా జననానికి జనతా గారేజ్ తో పనిలేకుండా మీరు హామీ ఇవ్వండి మేము మానేస్తామని చెప్పి, ఆనంద్(నందమూరి తారక రామారావు Jr.) జయహో జనతా గారేజ్ అనుకుంటూ తన బాద్యతను తను నిర్వహిస్తూ ఉంటాడు.

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram

అయితే DSP చంద్రశేఖర్ ఆనంద్ ఫ్యామిలీ గురించి ఎంక్వయిరీ చేసి, సత్యం (మోహన్ లాల్)బావమరిదిని సత్యంగారి ఇంటికి తీసుకువస్తాడు. అప్పటిదాక సత్యం (మోహన్ లాల్) గారికి ఆనంద్ తన తమ్ముడి కొడుకు అని, ఆనంద్కి సత్యంగారు పెదనాన్న అన్న విషయం తెలియదు. అయితే ఆనంద్‌ని ఇంటికి రప్పించడానికి మేనమామ నా కూతురు కావాలా? జనతా గారేజ్ కావాలా ? అని కండిషన్ పెడితే ఆనంద్ కూడా తన తండ్రిలాగానే జనతా గారేజ్ బాద్యతనే ఎంచుకుంటాడు.

ఎప్పుడు జనతా గారేజ్ గ్యాంగ్ ని మీ పనులు మానివేయండి అని సలహా చెప్పే DSP చంద్రశేఖర్ కూడా జనతా గారేజ్ కొచ్చి సమస్యను తీర్చమనే స్థితికి పోలీసులు రావడం, అలా జనతా గారేజ్ నడిపించే ఆనంద్ జనతా గారేజ్ ని వ్యతిరేకిస్తూ ఉండే మూల వ్యక్తిని మట్టుపెట్టడంతోనూ,ఎంత చెప్పినా వినకుండా చెడుమార్గంలో నడిచిన కొడుకుని సత్యంగారు మట్టుపెట్టడంతో, కధ సుఖాంతం అవుతుంది. సాదారణ మనిషి కష్టాలు విని వారి కష్టాలను పోగొట్టే వ్యక్తిగా సత్యం పాత్రలో మోహన్ లాల్ పాత్ర కధకి ఆయువుపట్టు. కొనసాగింపుగా ఆనంద్ పాత్రలో నందమూరి తారక రామారావు చాల బాగా నటించారు. ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడాలి అనే ఆలోచనతోనే ఉండడం దానికోసం ఏమైనా చేయడం చిత్రం మంచి సందేశాత్మక చిత్రంగా ఉంటుంది.

శ్రీ వినాయక విజయం విజయవంతమైన చిత్రం చదవండి

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

శ్రీమంజునాధ తెలుగు భక్తి మూవీ, చిరంజీవి-మీన-అర్జున్-సౌందర్యల భక్తి తెలుగుచిత్రం

దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం.

ఓం శ్రీ మంజునాదాయ నమః

చిరంజీవి శివుడుగా నర్తించిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం Chiranjeevi-Arjun daivam-bhaktuluga meppinchina Telugu bhakti chitram Telugu movie. జెకె భారవి రచించిన భక్తి కధ ఆధారంగా చిరంజీవి శివుడిగా మీనా పార్వతి దేవిగా, అర్జున్ భక్తుడిగా అతని భార్యగా సౌందర్య నటించిన భక్తిరస తెలుగు చలన చిత్రం శ్రీ మంజునాథ. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడం విశేషం అయితే హంసలేఖ సంగీతం అందించారు, నారా జయదేవి నిర్మించారు.

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస సినిమాను యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేక నొక్కండి.

భూదేవి భూమిని చీల్చుకుంటూ పైకి వస్తే, ఒక రాక్షసాకారాలు ఆమెను తరుముతూ ఉంటుంది ప్రారంభ సన్నివేశంలో.  అప్పుడు భూదేవి శ్రీమంజునాథ(SriManjunatha) అంటూ ఆర్తనాదం చేయడంతో కైలాసంలో ధ్యానం ఉన్న కైలసవాసి కనబడతారు. అప్పుడు పార్వతి దేవి శివయ్యని అడుగుతుంది ఏమిటి స్వామి భూమాత అక్రోసిస్తుంది, ఏమిటి వైపరీత్యం అంటే అప్పుడు, పరమేశ్వరుడు పార్వతితో కలికాలం కదా భూలోకంలో కామ క్రోధ, లోభ, మద, మాచ్యర్యాలు జనులు లోనవుతూ ఉంటారు అని సెలవిస్తారు.

ధర్మోరక్షిత రక్షితః అనే సూత్రంతో మనిషే మహనీయుడు అవుతాడని అంటే, అటువంటి మానవుడు ఎవరని అడిగితే మంజునాధుడు భూలోకంలో రుద్రుడుని దూషిస్తూ కనబడే వ్యక్తిని చూపిస్తారు. అతనే భూలోకంలో ధర్మరక్షణకు పూనుకునే భక్తుడుగా మారతాడని మంజునాధుడు సెలవిస్తారు. ఇక శివదూషణ సాగే పాటలో మరో భక్తురాలు కాత్యాయని శివస్తుతి చేస్తూ కనబడుతుంది. తరువాయి ఇంటికి విచ్చేసిన మంజునాధుడుని తండ్రి మందలిస్తాడు.

గ్రామపెద్ద ఒక తప్పుడు తీర్పు ఇస్తుండడంతో మంజునాధ అక్కడికి వచ్చి ఆ గ్రామ పెద్దకి బుద్ది చెబుతాడు. అక్కడే ఉన్న కాత్యాయని (సౌందర్య) మంజునాధ(అర్జున్)ని చూసి ఇష్టపడుతుంది. శివాయలంలో ప్రసాదం పెట్టని పూజారిని ఎదురించి మంజునాధ ఆ అన్నార్తికి ప్రసాదం పెడతాడు. శివుడు సంతోషిస్తాడు, ఆకలితో ఉన్నవాడి ఆకలి తీర్చినందుకు. మరలా మంజునాధ, కాత్యాయని గుడిలో కలిసే పరిస్థితి వస్తుంది. ఊరి పెద్దలంతా భక్త మంజునాధపై ఆగ్రహంగా ఉంటారు. అన్యాయాన్ని ఎదిరించే గుణం కలిగిన మంజునాధుడు కనిపించకుండా ఉంటూ అన్యాయాన్ని ఆపని భగవంతుడిపై కోపంగానే ఉంటూ ఉంటాడు.

భక్తుడు మంజునాధ-కాత్యయనిల వివాహం వారికి సంతానం

శ్రీ మంజునాధ చరితం నీ శ్రీ మంజునాధ అంటూ సాగే పాట పాడుతూ శివ మహిమలు గురించి చెప్పే పాటలో ఆ ప్రాంత అంబికేశ్వర మహారాజ దంపతులు కనబడతారు. శివుడు హాలాహల భక్షణం, గంగావతరణ, శివపార్వతుల అర్ధనారీశ్వర స్వరూపం గురించి ఈ పాటలో చక్కగా చూపుతారు. ఆ మహారాజుకి మంజునాధుడి అనుగ్రహంతో ఎదుటివారి నుదుటి వ్రాతలు చదివే విద్య అతని సాధన వలన వస్తుంది.

మంజునాధుడు(శివుడి) అనుగ్రహంతో కాత్యాయని మంజునాధు(అర్జున్)లకు వివాహం జరుగుతుంది. కాత్యయనిని దేవదాశిగా మారుస్తుంటే భరించలేని మంజునాధు(అర్జున్)డు ఊరి పెద్దల మద్య తాళి కడతాడు. ఇంటికి వచ్చిన మంజునాధ-కాత్యాయనిలను ఇంట్లోని వారు కాత్యాయనికి శివుడిపై ఉన్న భక్తి కారణంగా వారిని ఇంటిలోనే ఉండనిస్తారు. శివుని పేరు చెబితే చిరాకు పడే మంజునాధుడి భార్య కాత్యాయని శివుడిని సంతానం కోసం పూజిస్తూ ఉంటుంది. భక్తురాలి కాత్యాయని భక్తికి భగవంతుడు శివుడు కట్టుబడడం ఈ సన్నివేశంలో కనిపిస్తుంది.

సంతానం కోసం మౌనవ్రతం చేస్తూ ఉండే కాత్యాయనికి శివుడు మారువేషంలో వచ్చి మూలికను ఇచ్చి వెళతాడు. తత్పలితంగా వారికి ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి సిద్ధూ అని నామకరణం చేస్తారు. కానీ ఆ పుత్రుడు పూర్తిగా శివుని భక్తుడిగా ఉంటాడు. అది మంజునాధుడి(అర్జున్)కి నచ్చదు అయితే అతను తన తల్లిదండ్రులతో వాదించి ఇకపై దైవ ప్రస్తావన తీసుకురావద్దని చెబుతాడు.

దైవ మంజునాధుడు మానవ మంజునాధతో వివిధ రూపాలలో హితబోధ చేయడం

శివుడు లేడని ఒప్పుకో మీ నాన్నని భాదపెట్టకు అని సిద్ధుకు మంజునాధుడి స్నేహితులు చెబుతుంటే, అప్పుడు సిద్ధూ శివుడి గురించి వివరిస్తూ ఉండగా తండ్రి వచ్చి సిద్ధూని చెంపపై కొట్టి ఇంటికి తీసుకువెళతాడు. కానీ మంజునాధ(అర్జున్)కు నిద్రరాకుండా కలలే వస్తూ ఉంటాయి. లేచి ఊరికి దూరంగా కొండలలో కూర్చున్న మంజునాధ(అర్జున్) దగ్గరికి శివుడైన మంజునాధుడు మారువేషంలో వస్తారు. అలా వచ్చిన మంజునాధుడు మానవ మంజునాధుడికి హితబోధ చేస్తే ఆలోచనలో పడతాడు మంజునాధుడు(అర్జున్). అలా ఆలోచనలో ఉన్న మంజునాధుడు దగ్గరికి వాళ్ళ అమ్మ వేషంలో దైవ మంజునాధ వచ్చి మాట్లాడి వెళుతుంది. ఇంకా ఆలోచనలో సాగుతుండగా మళ్ళి మంజునాధుడు సిద్దుడి వేషంలో వచ్చి మాట్లాడి వెళతాడు.

నిరంతర ఆలోచనల నుండి బయటపడిన మంజునాధుడు(అర్జున్) ఇంటికి వస్తాడు. అలా వచ్చిన మంజునాధ (అర్జున్)ని ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని అడిగితే ఆశ్చర్యపడతాడు మంజునాధుడు (అర్జున్). అప్పుడు ఇంట్లో వారిని అడుగుతాడు మీరు ఇంతకముందు నాదగ్గరికి వచ్చారు అని అడిగితే, కుమారుడు సిద్ధూ వచ్చి నీదగ్గరికి మా రూపాలలో వచ్చింది దైవం మంజునాధుడు(శివుడు) అని చెబుతాడు. ఇంటిలో ఉన్న మంజునాధుడు శివభక్తుడుగా మారతాడు. ఆ సన్నివేశంలో ఒక్కడే మంజునాధుడు ఒక్కడే మంజునాధుడు ఒక్కడే అని సాగే పాట భక్తిప్రదాయకంగా సాగుతుంది. హరుడు ఒక్కడే, శివుడు ఒక్కడే, మంజునాధుడు ఒక్కడే, గంగాధరుడు ఒక్కడే అంటూ మానవ మంజునాధ భక్తమంజునాధగా మారుతాడు.

భక్తుడు అయిన మంజునాధ తన కుటుంబంతో ధర్మస్థల దైవ దర్శనానికి దేవాలయానికి వెళతాడు. అదే ఊరికి అంబికేశ్వర మహారాజు దేవాలయానికి వస్తాడు. అప్పటికీ భక్త మంజునాధ అంటే గిట్టని కొందరు అక్కడికి వస్తారు. అదే సమయంలో సుడిగాలి రావడం దేవాలయంలో దీపాలు ఆరిపోతాయి. సుడిగాలి వచ్చి దీపాలు ఆరిపోయాయి అంటే నాస్తికుడు దేవుడిని నమ్మని మంజునాధ (అర్జున్) దేవాలయానికి రావడమే కారణం అని మహారాజుతో చెబుతారు. అప్పుడు మహారాజు భక్త మంజునాధకి ఆలయప్రవేశం చేయాలంటే మీ భక్తితో ఆరిపోయిన దీపాలు వెలిగించండి అప్పుడు దైవాన్ని దర్శించుకోండి అని ఆజ్ఞాపిస్తాడు.

భక్తిగానంతో దేవాలయ దీపాలు వెలిగించే భక్త మంజునాధ

ఓం మహా ప్రాణదీపం, శివం శివం మహా ఓంకార రూపం అంటూ అందుకునే పాట గుక్కతిప్పకుండా సాగుతుంది. పాట పూర్తయ్యేసరికి గుడిగంటలు లక్ష గుడిదీపాలు వెలగడం మంజునాధ దైవమహిమ, మంజునాధ భక్తి తేట తెల్లమవుతుంది మహారాజుకి. మహారాజు తనతో రాజ్యానికి వచ్చేయమని భక్తమంజునాధని కోరితే, నేను అహంకారంతో అజ్ఞానంతో కోటిసార్లు దైవ దూషణ చేశాను కాబట్టి కోటిలింగ ప్రతిస్థాపన చేస్తాను అని బడులిస్తాడు భక్త మంజునాధ.

కోటిలింగాల ప్రతిస్థాపనకు మహారాజుకూడా వచ్చి వెళతాడు. ఆ మహాకార్యం పూర్తయ్యాక పార్వతి పరమశివులు చాల సంతోషిస్తారు. అనుగ్రహించదలచిన పరమేశ్వరుడు మంజునాధుడు భక్త మంజునాదని అనుగ్రహించడానికి ఒక వృద్ద వేషంలో వస్తారు. అయితే అతిదిగా భోజనానికి వచ్చిన ఆ వృద్ధుడు భక్త మంజునాధని పరీక్షించడానికి తననితనే దూషిస్తాడు, కోపగించిన భక్త మంజునాధ వచ్చింది పరమశివుడు అని గుర్తించక స్వామి ఇంటినుండి గెంటివేస్తాడు. ఆ సమయంలో మౌనవ్రతంలో ఉన్న కాత్యాయనికి వచ్చింది శివుడు అని తెలిసిన భర్తకు చెప్పలేని అపస్మారక స్థితిలో ఉంటుంది.

శివయ్య ఇంటినుండి వెళ్ళిపోయాక స్పృహలోకి వచ్చిన కాత్యాయని మాట్లాడి స్వామిని అడుగుతుంది. కానీ మౌనవ్రతం చేస్తున్న కాత్యాయని మాట్లాడం విని మంజునాధ అడిగితే, వచ్చింది సాక్షాత్తు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అయిన మంజునాధుడు అని బదిలిస్తుందే. భక్త మంజునాధ మరలా వృద్ద రూపంలో వచ్చిన మంజునాధుడిని వెతుకుతూ వెళతాడు. పరిక్షలు పెట్టవాడు దొరికితే పకృతి ఒప్పదనే ఏమో భక్తుడిని పరీక్షిస్తూ భగవానుడు కూడా భాదపడుతూ ఉంటాడు.

పార్వతిమాత కోయి రూపంలో వచ్చి అన్నదానం చెయ్యమని సూచన చెప్పి వెళుతుంది. ఆ సూచనతో అన్నదాన కార్యక్రమానికి పూనుకుంటారు ఆ పుణ్యదంపతులు. అయితే సిద్ధూ స్నానం చేస్తుండగా పాము కరిచి చనిపోతాడు. అయితే అన్నదాన కార్యక్రమం ఆగకూడదని, ఆ విష విషయాన్ని మనసులో దిగమింగుకుని, అన్నదాన కార్యక్రమం చేస్తారు. గుడిలో దీపాలు పాటపాడి వెలిగించినట్టు మీ భక్తితో నా బిడ్డ ప్రాణాలు బతికించమని అడుగుతుంది, కాత్యాయని. అప్పుడు మంజునాధ భక్తుడు ఊళ్ళోకి చావులేని ఇంటినుండి పిడికెడు ఆవాలు తెమ్మని చెబుతారు. తిరిగివచ్చిన కాత్యాయనికి చావు తప్పదని అర్ధం అయిన కాత్యాయని మౌనం వహిస్తుంది.

ఇక ఇంట్లో శవం పెట్టుకుని అన్నదానం చేయడం అధర్మం అని మంజునాధని మహారాజు దగ్గరదోషిగా నిలబెడతారు. నేరం ఆరోపింపబడి సభలో మౌనంగా ఉన్న మంజునాధని రక్షించాడానికి పైన నుండి మంజునాధుడే అఘోర రూపంలో వస్తాడు. అలా వచ్చిన మహాస్వామి భక్త మంజునాధని పరీక్షపెడితే, ఆ అగ్నిపరీక్షలో మంజునాధకి ఏమి జరగకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మంజునాధ మహాభక్తుడు అని అఘోర రూపంలో వచ్చిన భగవానుడు తీర్మానించి సభనుండి నిష్క్రమిస్తారు.

యముడు పనిని మంజునాధుడు చేయడం Chiranjeevi-Arjun Daivam-Bhaktuluga Meppinchina Telugu Bhakti Chitram.

మహారాజుతో కలిసి ధర్మజ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్న మంజునాధ వలన అంతా సంతోషిస్తూ ఉంటారు. అయితే, కైలాసంలో సంతోషిస్తున్న పరమశివుడు దగ్గరకి యమధర్మరాజు వస్తారు. అలా వచ్చిన యముడు చెప్పిన విషయాన్ని విని దిక్కులకు నాధుడు అయిన మంజునాధుడు దిగ్బ్రాంతికి గురి అయ్యినట్టు కనబడడం జరుగుతుంది. యముడు పాశాన్ని మంజునాధుడికె ఇచ్చేసి కైలాసం నుండి మరలుతాడు. భక్త మంజునాధ నుదుటిని ఒకరోజు రాజు చదివి, విషయం భక్తమంజునాధకి చెబుతాడు. తన మరణం తద్యం అని తెలుసుకున్న భక్త మంజునాధ ఇంటికి తిరిగి వెళతాడు.

ఇంటికి వస్తున్న భక్త మంజునాధని అతనంటే పడనివారు కత్తితో గాయాలు చేస్తారు. గాయాలను పైకి కనబడకుండా ఇంటికివచ్చిన భక్త మంజునాధ ఇంటిలోనివారిని గుడికి పంపించి మృత్యువుకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మరణం అంటే భయముండే మనిషి మృత్యువు కోసం ఎదురు చూడడం, జననమరణాలు ఆటగా ఆడుకునే ఆ ఆటగాడు ప్రాణాలు తీసుకువెళ్ళడానికి దుఖించడం బహుశా ఈ భక్తిచిత్రంలోనే కనబడుతుంది.

భక్త మంజునాధకి దైవ మంజునాధకి జరిగే పతాక సన్నివేశం కంటతడి బెట్టిస్తుంది. చివరికి మంజునాధ దంపతులు కైలాస మంజునాధుడిలో కలిసి పోవడంతో ఈ Chiranjeevi-Arjun daivam-bhaktuluga meppinchina Telugu bhakti chitram చిత్రం ముగుస్తుంది.

ఆద్యంతం భక్తుడి యోగక్షేమాలు కోసం తపించే దైవంగా కైలాస మంజునాధుడు కనిపిస్తే, కైలాస మంజునాధుడిని దూషిస్తూ, చివరికి కైలాస వాసి పాదాలు కోసం తపించే భక్తుడిగా భూలోక మంజునాధుడు కనిపిస్తాడు. ఇద్దరి వలననే ధర్మస్థలం కోటిలింగాల క్షేత్రంగా వెలసినట్టుగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. శివానుగ్రహం వలన జీవితాలు ఎలా ఉద్దరింపబడుతాయో ఈభక్తిచిత్రం తెలియపరుస్తుంది. నమ్మిన భక్తుడి యోగక్షేమాల కోసం భగవానుడు తాను విధించిన నియమయాలకు తాను విలపించే భగవంతుడి హృదయం Chiranjeevi-Arjun daivam-bhaktuluga meppinchina Telugu bhakti chitram శ్రీమంజునాధచిత్రంలో కనిపిస్తుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

శ్రీ కంచి కామాక్షి తెలుగు పాత చిత్రము

Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram – కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా ఉంటుంది.

ఆదిశంకరాచార్య కంచికి వచ్చి అమ్మ అనుగ్రహం సంపాదించడం, అలాగే కంచి కామకోటి పీఠం నెలకొల్పమని కామాక్షి అమ్మవారు చెప్పడం, ఒక అమాయక పిల్లను కామాక్షి అమ్మ అనుగ్రహించి ఆమె నోటపలికిన మాటను వాస్తవం చేసే శక్తిని ప్రసాదించడం, ఇంకా మరిన్ని భక్తి సన్నివేశాలు ఈ  కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం – Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram లో కనిపిస్తాయి.

జనని సినీ ప్రొడక్షన్స్ పతాకం పై కంచి కామాక్షి తెలుగు భక్తి చిత్రం జెమిని గణేషన్, సుజాత, శ్రీప్రియ, వై విజయ, శ్రీకాంత్, శ్రీవిద్య, రాజసులోచన తదితరులు నటించిన చిత్రానికి సంగీతం కెఎస్. రఘునాథన్, దర్శకత్వం కెఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం – Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram తెరకెక్కింది.

కాంచీపురం చుపుస్తూ కంచి గురించి చెబుతూ అమ్మవారి ఆలయం గురించి చూపుతూ అమ్మగురించి చెప్పడం చిత్ర ప్రారంభ సన్నివేశం. కంచి కామాక్షి గుడిలో అమ్మవారికి ఆలయ ధర్మకర్త వచ్చి పూలు పలహారాలు తెస్తే, అక్కడే ఒక స్వర్ణపుష్పంతో నిలబడి ఉన్న సిద్ధుడు, ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి పూజించి ఇవ్వమని చెబుతారు. ప్రధాన అర్చకులు ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గరపెట్టి పూజ చేసి ఆ సిద్దుడికి ఇస్తే, సిద్దుడు అక్కడ నిలబడి ఉన్నఆడువారిలో ఒకామెకు స్వర్ణపుష్పం ఇచ్చి వెళ్ళిపోతారు.

ఆమె ఆ స్వర్ణపుష్పం తీసుకుని వెళ్లి తన భర్తకు ఉన్న కుష్టిరోగాన్ని పోగొడుతుంది. ఆ తరువాత ఒక సాధు కొన్ని శక్తులతో మహిమలు చూపుతూ నేనే భగవంతుడిని నన్నే కొలవండి అని ప్రగల్భాలు పలుకుతుంటే, కంచి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పానికి అర్చన చేయించిన సిద్దుడు అక్కడికి వస్తాడు. అక్కడ ఆ సాదువుకి తన మహిమ చూపి అతనికి బుద్ది చెబుతారు సిద్దుడు. అక్కడికి కామాక్షి గుడిలో సిద్దుడి దగ్గర స్వర్ణపుష్పం పొందిన మహిళ రోగం తగ్గించుకున్న తన భర్తతో సిద్ధుడు దగ్గరికి వస్తుంది. అలా వచ్చిన ఆ దంపతులు తమను కంచి కామాక్షే మాకు మీరు వస్తారని చెప్పారని అందుకు మీరు ఎవరో చెప్పమని సిద్దుడిని ప్రాదేయపడతారు. సిద్దుడు అమ్మవారిని తలచుకుని స్పృహ తప్పితే, అక్కడకు మధుర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆ సిద్దుడు గురించి నాకు తెలిసినది చెబుతాను అని చెప్పడం మొదలుపెడతాడు.

Madhura Meenakshi Penchina Bidda Gurinchina Vivaram

ఆ సిద్దస్వామి పేరు బాల శివానందం అని, మీనాక్షి దూతగా అందరికి తెలుసనని చెబుతూ అతని పుట్టుక గురించి వివరిస్తుండగా, కంచి కామాక్షి చిత్ర సన్నివేశం మారుతుంది. స్వామి తల్లిదండ్రులు(జెమిని గణేషన్-సుజాత) కంచి కామాక్షి గుడిలో నలభై ఒక్కరోజులు దీక్ష చేసిన తరువాత ఒకరోజు కంచి కామాక్షి గుడిలో పడుకుని ఉన్న సుజాతకు కలలో అమ్మవారు కనబడి, “నీవు బిడ్డకోసమే కదా నా సన్నిధికి వచ్చింది, అలాగే మధుర మీనాక్షికి పార్వతి మాతలాగా కూడా ఒక బిడ్డకు ఆలనాపాలనా చూడాలని కోరికగా ఉందట, నీవు నీ భర్తతో కలిసి మధురకు చేరుకో అక్కడ మధురమీనాక్షి కోరిక నీ కోరిక తీర్చుతానని చెప్పి అంతర్ధానం అవుతుంది.” మెలుకువ వచ్చిన సుజాత లేచి జెమినీ గణేషన్‌ని లేపి విషయం చెప్పి ఇద్దరు దంపతులు మధుర మీనాక్షి అమ్మవారి గుడికి వెళతారు.

అలా మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించిన ఆ దంపతులు మాకు పుట్టిన బిడ్డని నీ పాదాలు దగ్గరే వదిలేస్తాను నీకోసం అని మొక్కుకుని అనుగ్రహించమని వేడుకుంటారు. కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం వలన ఆమెకు మగ కవలలు జన్మిస్తారు. అప్పుడు ఆ దంపతులు ఇద్దరినీ తీసుకుని మధుర మీనాక్షి గుడిలో మీనాక్షి అమ్మవారి దగ్గర పెడితే, ఒక పిల్లవాడు అమ్మవారువైపు మళ్ళితే, మరొకరు అమ్మవైపు మళ్లుతారు. ఆ సన్నివేశం చాలా చక్కగా భక్తిప్రదాయకంగా ఉంటుంది. ఆ పిల్లవాడిని మీనాక్షి అమ్మవారు రమ్మని ఆహ్వానించడం ఆ పిల్లవాడికే కనిపిస్తుంది.

అక్కడ నుండి ఆ దంపతులు వెనుదిరుగుతుంటే ఆలయధర్మ కర్త, పూజారి దంపతులను అడ్డుకుని పిల్లవాడిని తీసుకువెళ్లమంటారు. సుజాత, జెమినీ గణేషన్ దంపతులు మేము ఆ పిల్లవాడిని అమ్మవారికి అప్పగించేశాం, ఇక ఆ పిల్లవాడి భాద్యత మీనాక్షి అమ్మే చూసుకుంటుంది అని చెప్పి వారు ఇంటికి వెళతారు. గుడి ధర్మకర్త ఆలయఅర్చకులు ఎంత ప్రయత్నం చేసినా గుడి తలుపులు తెరుచుకోవు, తాళం రంద్రంలో నుంచి అమ్మవారి స్వరూపం చూసి భయపడతారు వారు.

ఇంటికి చేరిన జెమిని గణేషన్-సుజాత దంపతులు ఆ పిల్లవాడిని అమ్మవారు దగ్గరే పూజారులు ఉంచారా బయట పడవేశారా అని సందేహం దిగులు చెంది, తెల్లవారగానే గుడికి చేరుకుంటారు. పూజారులకు ఎంత ప్రయత్నం చేసిన తెరుచుకొని గర్భగుడి తలుపులు ఆమె తీయగానే తెరుచుకుంటాయి. అమ్మవారి గర్భాలయంలో ఆడుకుంటున్న పిల్లవాడు కనబడతాడు, అమ్మవారి ముక్కు పుడక, బంగారు ఉగ్గుగిన్నె పిల్లవాడి చేతిలో ఉంటాయి. ఇదంతా మీనాక్షి అమ్మవారే మహిమ ఆ తల్లి పిల్లవాడి ఆలనాపాలనా చూసుకుంటుంది అని భావించి వారు వెనుతిరుగుతారు. ఆ పిల్లవాడే ఈ సిద్దుడు అని మధుర నుండి వచ్చిన వ్యక్తి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పం గ్రహించిన దంపతులకు చెబుతారు.

Siddhudu Cheppina Kanchi Kamakshi Pouranika Gadha

ఈలోపు తేరుకున్న ఆ సిద్దుడు నా గురించి కాదు చెప్పుకోవలసింది, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల గురించి చెప్పుకుంటే, పుణ్యం పరమార్ధం అని కంచి కామాక్షి అమ్మవారి గురించి చెప్పడం మొదలు పెడతారు.

బండాసురుడు తప్పస్సు చేసి బ్రహ్మను మెప్పించి, భూలోకంలో మానుష జాతిలో అడామగ కలవకుండా ఐదేళ్ళ బాలిక పుట్టాలి, ఆ విధంగా బాలిక పుడితే ఆ బాలిక చేతిలో మాత్రమే మరణం ఉండాలి అని వరం కోరుకుంటాడు. వరబలంతో బండాసురుడు దేవతలను హింసిస్తూ ఉంటే, అందరూ దేవతలు కలిసి కైలాసం పరమశివుడి దగ్గరికి వెళతారు. కైలాసం నుండి పరమశివుడు సలహాపై జగన్మాతని ప్రార్ధించడానికి కంచికి చేరుకుంటారు.

కంచిలో సర్వదేవతలు జగన్మాతని ప్రార్ధన చేయడం వలన ప్రకృతి మరియు సర్వదేవతల శక్తి నుండి ఒక ఐదేళ్ళ పాప ఉద్బవిస్తుంది. బండాసురుడు ఆ పాపతో యుద్ధం చేసి మరణిస్తాడు. బండాసురుడుని అంతుతేల్చిన ఆ బాలిక త్రిమూర్తుల దగ్గరికి వచ్చి నాకు గుడికట్టండి అని చెబితే, మయుడు శివుని అజ్ఞా మేరకు కంచిలో ఆలయం నిర్మిస్తారు. మరుసటి ఉదయం దేవతలంతా గుడికి చేరితే ఆ పాప అమ్మవారుగా గర్భగుడిలో దర్శనం ఇస్తుంది. బాలగా అవతరించి బండాసురుడుని అంతం చేసి, కన్యగా గర్భగుడిలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని చూసి పరమశివుడు ఆదిపరాశక్తి అని పిలిస్తే, ఆ తల్లి నేను  కామాక్షిని, అలాగే అందరిని అనుగ్రహిస్తాను అని బదులిస్తుంది. ఆ విధంగా సిద్దుడు వారికి ఇంకా కామాక్షి అమ్మవారి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఉంటారు.

భద్రయ్య అను భక్తుడిని అనుగ్రహించిన Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

తిరువాయూర్లో ఒక అమ్మవారి భద్ర అనే భక్తుడికి సిద్దుడు “ఒక శుబ్రపరిచిన గదిలో 101 భోజనం చేసే ఆకులు పరచి 100మంది కన్యలను లోపలి పంపించు, భోజనాలు పెడుతూ ఉండు, రోజు 100 ఆకులు మాత్రమే భోజనం చేసి ఉంటాయి, కానీ ఏరోజు అయితే 101 ఆకులు భోజనం చేస్తున్నట్టు కనిపిస్తుందో, ఆ రోజు అమ్మవారు వచ్చి భోజనం చేసినట్టు, అలాగే భోజనం పూర్తయిన తరువాత వారికి 101 రవికలు పంచిబెట్టు, ఏరోజు 101 ఆకులు భోజనం ముగింపు ఉంటుందో ఆరోజే 101 రవికలు సరిపోతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు”.

కామాక్షి గుడి ఊరిమధ్యలో ఉండకూడదు, నేను ఆ మండపాన్ని తీసివేసి, కోర్ట్ కడతాను అని ఆంగ్ల కలెక్టర్ అమ్మవారి భక్తుడు అయిన భద్రయ్యతో గొడవపతాడు, కలెక్టర్ వాళ్ళ అమ్మగారి మాట మీద గుడి దగ్గరి నుండి వెళ్ళిపోతాడు. అదే ఊళ్ళో మిడతంబొట్లు అనే వ్యక్తి అమ్మవారి గుడికి ధర్మకర్తగా ఉంటూ వడ్డీవ్యాపారం చేస్తూ, అమ్మవారి గుడిలో కానుకలు కూడా ఇంటికే తీసుకుపోతూ ఉంటూ ఉంటాడు. సిద్దుడు చెప్పిన భద్రయ్య భక్తుడు అదే వ్యాపారి దగ్గర తన ఆస్తి పత్రాలు మిడతం బొట్లు దగ్గర కాళీనోటు పేపర్ పై వేలుముద్రలు వేసి, డబ్బు అప్పు తీసుకుని క్రమంగా 101 విస్తర్లు వేసి 100 మందికి భోజనం పెడుతూ భక్తిగా అమ్మవారిపై నమ్మకం ఉంచుతాడు.

ఒకరోజు మిడతం బొట్లు భద్రయ్య ఇంటికి వచ్చి ఉన్నపళంగా ఇల్లు కాళీచేసి వెళ్ళమంటాడు, ఎందుకు అని అడిగితే నీవు చేసిన అప్పు చాల వుంది అని చెప్పి దొంగపత్రాలు పట్టుకుని కోర్టుకి వెళతాడు. అమ్మవారుపై నమ్మకం ఉంచిన భక్తుడు అయిన భద్రయ్య కామాక్షి అమ్మే వచ్చి తనవైపు సాక్ష్యం చెబుతుంది అని కోర్టులో వాదిస్తాడు. మోసపూరిత పత్రాలను బట్టి ఆంగ్ల కలెక్టర్ భద్రయ్యపై తీర్పు మరుసటి రోజుకి వాయిదా వేస్తాడు. అయితే తరువాయి తీర్పు వ్రాసే సమయంలో కలెక్టర్ కలం కదలదు, ఎంతా ప్రయత్నం చేసిన కలం కదలదు. అమ్మవారు కలెక్టర్ అమ్మరూపంలో వచ్చి తీర్పు భక్తుడు అయిన భద్ర నిరపరాధి వ్రాయి అది నిజం అయితే, నీ కలం కదులుతుంది. అని చెబుతుంది. అలా భద్రయ్య అయిన అమ్మవారి భక్తుడిని నిర్దోషిగా తీర్పు వ్రాసిన కలెక్టర్, అమ్మవారి గుడిలో ఉన్న భక్తుడి దగ్గరికి వస్తాడు.రేపు భోజనాలు 101 విస్తర్లలో 100 మందికి పెట్టే చోటకి అమ్మ కామాక్షి వచ్చి భోజనం చేస్తుంది. రేపు 101 విస్తర్లలో భోజనం పూర్తవుతుంది అని చెప్పి సిద్దుడు, కలెక్టర్ భద్రయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం చేసుకుంటారు.

భద్రయ్య ఇంటిలో 100 మంది కన్యలతో కలిసి భోజనం చేసిన Kanchi Kamakshi అమ్మవారు.

తరువాత సిద్దుడు చెప్పగా ఒక శుబ్రపరిచిన గదిలో 101మందికి విస్తర్లు వేసి 100 కన్యలను గదిలోకి పంపించి భోజనాలు పెడతారు. అప్పుడు ఆంగ్ల కలెక్టర్, సిద్దుడు, భద్రయ్య గమనించగా 101 మంది భోజనం చేస్తూ కనబడతారు. భోజనాలు పూర్తయ్యాక 101 రవికలు పంచిబెడితే, ఒక రవికపై కలెక్టర్ సైన్ చేస్తారు. తరువాత గుడికి వెళ్లి చూస్తే, కలెక్టర్ సంతకం చేసిన వస్త్రం అమ్మవారి మెడలో కనిపిస్తుంది. అందరు అమ్మవారి మహిమను కీర్తిస్తారు. ఇంకా సిద్దుడు కంచి కామాక్షి అమ్మవారి గురించి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఆదిశంకరాచార్యులు కంచికి వచ్చి, అర్చించి అమ్మని మెప్పించన వైనం చెబుతారు.

కంచిలో ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తి భక్తులను నమ్మించి అమ్మవారికి బలులు ఇవ్వాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రకృతిలో హింస, అధర్మం పెరిగితే, దైవశక్తి నిమ్మకుండడం ప్రకృతి ప్రకోపించడం సాదరణమే కదా. ఆది శంకరాచార్యులు కంచికామాక్షి గుడికి వచ్చి అమ్మవారికి బలులు ఇవ్వవద్దని చెప్పి అమ్మవారిని స్త్రోత్రం చేస్తే, అమ్మ వర్షం కురిపిస్తుంది. అది చూసిన ఊరిప్రజలు, ఆ క్షుద్ర వ్యక్తి ఆదిశంకరాచార్యులు పాదాలపై పడతారు. అమ్మవారు ఆది శంకరచార్యులకు ప్రత్యక్షం అయ్యి, కంచి కామకోటి పీఠం కంచిలో స్థాపించి, ఆ పీఠం నీవు  అధిష్టించి కీర్తిని గడిస్తావు అని చెబుతుంది.

కంచి కామాక్షి ఆలయ కోశాధికారి సుబ్రహ్మణ్య శాస్త్రికి ఒకసారి చిన్నపాప కనిపిస్తే ఇంటికి తీసుకువచ్చి తన మనుమరాలుగా పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఆ పాప(మహాలక్ష్మి) పెరిగాక తన తల్లిదండ్రుల గురించి అడిగితే, నీ అమ్మ ఆ కామాక్షి అని చెప్పి, నీ తండ్రి హిమాలయాల్లో వైద్యం చేయించుకుంటున్నట్టు చెబుతాడు. అయితే అమ్మని చూపించమంటే ఆ పూజారి ఆ పాప మహాలక్ష్మికి గుడిలో కామాక్షిని చూపి నీతల్లి అని చెబితే, అప్పటినుండి ఆపాప అమ్మనే చూస్తూ ఉంటూ ఉంటుంది.

అక్షరజ్ఞానం లేని పాపను అనుగ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు. Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్త దుర్బుద్ధి తెలుసుకుని, ఇన్నాళ్ళు నేను ఒక పాపపు సొమ్ము తిని పెద్దపాపం చేశాను కాశికి వెళ్లి ఆ పాపం పోగొట్టుకుంటాను అని చెప్పి ఆ పాప మహాలక్ష్మితో కాశికి బయలుదేరతాడు. అలా బయలుదేరుతున్న సుబ్రహ్మణ్య శాస్త్రిని ఆ ప్రక్కనే ఉంటున్న ఇద్దరు దంపతులు పాపను కాశికి తీసుకువెళ్ళడం ఎందుకు మేము ఆపాపను చూసుకుంటాం అని చెప్పి, పాపను సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర నుండి తీసుకుంటారు. మహాలక్ష్మి పాపకు శక్తులు ఉన్నాయి అందుకే పాప ఎప్పుడు అమ్మవారి ఆలయంలో ఉంటుంది అని చెప్పి ఆ పాపను తీసుకున్న దంపతులు ప్రచారం చేస్తారు.

మహాలక్ష్మి పాపపై ప్రచార మహిమలు గురించి విన్న భక్తలు పాపదగ్గరికి వస్తారు. అప్పుడు ఆ దంపతులు పాపతో ఒక ఇల్లాలితో ఆమె భర్త పదిరోజులలో చనిపోతాడని అబద్దం బలవంతంగా పాపతో చెబుతారు. పది బంగారు కాసులు తెస్తే కాపాడతానని కూడా ఆ పాపతో చెప్పిస్తారు. ఆ ఇల్లాలు రోదిస్తూ వెళ్ళిపోతుంది. నిద్రపట్టని పాప మహాలక్ష్మి అబద్దం చెప్పినందుకు మనోవేదనకు గురి అయ్యి అమ్మవారి పాదాలపై తలకొట్టుకుని చనిపోదామని నిశ్చయించుకుని బయలుదేరుతుంది.

పాప అంతరంగం గ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు అనంతలక్ష్మితో కలిసి గర్భాలయం వెలుపలికి వచ్చి పాపను ఆపి, ఆ పాపతో నేనే నీ తల్లిని అని చెప్పి పాప మహాలక్ష్మి నాలుకపై తన నాలుకతో బీజాక్షరాలు వ్రాస్తుంది. తరువాత పాప మహాలక్ష్మితో నీనోటితో ఏది పలికితే అది జరుగుతుంది అని చెప్పి పాపను గుడిలోనే పడుకో బెడుతుంది అమ్మవారు. అలా అమ్మ అనుగ్రహం పొందిన ఆ పాప మహాలక్ష్మి మహిమలు చూపించి, దుష్ట బుద్దితో ఉన్న దంపతులకి పాప మహాలక్ష్మి వారికి బుద్ది చెప్పుతుంది. తరువాత కంచి మహారాజు అయిన పల్లవరాజుకి చాళక్యరాజుపై విజయాన్ని కూడా కట్టబెడుతుంది.

అమ్మని మనసారా నమ్మితే, అమ్మ అనుగ్రహానికి ఎదురులేదని ఈ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram ద్వారా తెలియవస్తుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి