స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు. ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో ఆలోచనలు పుట్టిస్తాయి. సహజంగా గొప్పవారు సామాజిక శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారు కాబట్టి స్పూర్తిదాయకమైన మాటల వలన … Read more

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది. అదే జాతీయ సైన్స్ దినోత్సవం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వేంకట రామన్ సైన్సులో ఒక ఎఫెక్ట్ అది రామన్ ఎఫెక్ట్ గా ప్రఖ్యాతి గాంచినది. వైజ్ఙానికరంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు. భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది. బౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ 1888 సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదిన తిరుచినాపల్లి దగ్గరలో గల అయ్యన్ … Read more

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారిని పట్టించుకుసే స్థితి ఉండకపోవడం విశేషం. కారణం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయి ఉండవచ్చును. మరొక కారణం తల్లిదండ్రులకు దూరంగా పిల్లల ఉపాధి అవకాశాలు ఉండి ఉండడం కావచ్చును. ఒత్తిడిలో ఉండే యువత పెద్దల స్థితిని పట్టించుకోలేని పరిస్థితి కావచ్చును. కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఏదో బంధుత్వం ద్వారా సేవలు పొందే వృద్దాప్యం వృద్ధాశ్రమంలో కాలం గడుపుతుంది. ఎప్పటినుండో స్వేచ్చగా జీవించే పెద్ద హృదయం, చిన్న కుటుంబంలో చిన్నవారి … Read more

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి? మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి? మంచి స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇన్ని ప్రశ్నలు సమాధానం ఒక్కటే వస్తుంది. మంచిగా ప్రవర్తించు, మంచి స్నేహితుడుగా మారు, నీవే మంచి స్నేహితుడుగా ఉండడం వలన నీ వలన మరొక మంచి స్నేహితుడు మరొకరికి లభిస్తాడు. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఆనందం ఉందని గుర్తెరిగినవారు తీసుకోవడం కన్నా … Read more

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును…. వంటి విషయాలు తెలుసుకోగలుగుతాము. పదవ తరగతి పూర్తయ్యాక ఆలోచన చేద్దామనే భావన ఉంటే, అది కాలం వృధా కావడానికి కారణం కావచ్చును. హైస్కూల్ చదువుతుండగానే ప్రతి విద్యార్ధికి, తన బలమేమిటో తనకు తెలియవస్తుంది. ఆ బలంతోనే … Read more

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు పెద్దలు చెప్పిన మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు నుండి కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పడం మేలు. మార్గదర్శకంగా నిలిచిన మహనీయులంతా తల్లిదండ్రుల నుండి కానీ గురువుల నుండి కానీ మంచి మాటలు విన్నవారేనని … Read more

పేదలకు దానం చేయటంవల్ల మనం

పేదలకు దానం చేయటంవల్ల మనం పొందే మేలును గురించి వివరిస్తూ, ఆ మాటలను మీ మిత్రునికి లేఖ వ్రాయండి. ప్రియ మిత్రమా! నేను క్షేమం! నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తూ…. నేను ఒక మంచి విషయం గురించి ఈ లేఖ ద్వారా నీకు తెలియజేయదలిచాను. బహుశా ఇది నీకు కూడా తెలిసి ఉండవచ్చును. కానీ నా దృష్టి కోణం నుండి ఈ అంశం గురించి ప్రస్తావిస్తాను. మన పెద్దలకు ఉండి మనకు చదవు … Read more

మంధర పాత్ర స్వభావం చూస్తే

శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా ఉంటుంది… మంధర మాటలు వినడానికి వినసొంపుగా అనిపిస్తే, అటువంటి మాటలు వ్యక్తిని చులకన చేస్తాయి… కైకేయి విషయంలో … Read more

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి… మంచి పుస్తకాలు కూడా చదవాలి. మంచిని తెలియజేసే మంచి తెలుగు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఇంకా సామాజిక అవగాహన కల్పించే వారపత్రికలు, వార్తాపత్రికలు కూడా చదవాలి… పిల్లలకు చదవడం బిగ్గరగా చదవడంతో అనర్ఘలంగా చదివే శక్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న మనసు తన ఆసక్తి నెరవేర్చుకోవడం బహు శ్రద్ద చూపుతుంది. అంటే… ఆసక్తి అంటే ఏమిటి? సినిమా … Read more

వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో

నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో…. వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి అనగానే వరకట్నం ఎంత? వరకట్నం కోసం కూడబెట్టిన డబ్బు లేకపోతే, ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలు వర్ణానీతతం…. … Read more

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం వరకే… అయితే మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి? మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ ఎలా ఉండాలి? పైన చెప్పినట్టుగా మూగ జీవులు అంటేనే మాట్లాడలేవు. వాటికి బాధ కలిగితే, మూలుగుతూ బాధపడతాయి. సంతోషం … Read more

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి. ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం. పిల్లలకు చక్కని నీతి కధలు బోధించడం. పిల్లలకు మంచి మాటలు చెప్పడం. పిల్లలకు గొప్పవారి గురించి చెబుతూ, వారి మనసులో గొప్పవారు కావాలనే కాంక్షను పుట్టించడం.. ఇలా ఇంటిలో ఇల్లాలు … Read more