భాగవతం తెలుగులోకి అనువదించిన భక్తపోతన తెలుగు చిత్రం

భాగవత రచయిత సహజకవి పోతనామాత్యుని జీవిత కధా చిత్రం

భక్త పోతన సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

అలనాటి మేటి చిత్రాల్లో భక్తపోతన భక్తీచిత్రం. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana Samskrutam nundi Telugulo Anuvadinchina Bhakta Potanaamaatyulu శ్రీకృష్ణుడు మహాభారతం నడిపించడానికి ద్వాపరయుగంలో ధర్మానికి అధర్మానికి యుద్దంలో ధర్మాన్ని రక్షించబూనిన వారికి మద్దతుగా ఉంటూ ధర్మ సంస్థాపన చేయడానికి అవతరిస్తే, ఆ మహాభారతాన్ని సంస్కృత రచన చేసిన వేదవ్యాసుడు, ఆ పరబ్రహ్మ లీలలను కూడా చెప్పదలచి భాగవతం కూడా రచనచేసి ఆత్మతృప్తిని పొందినట్టుగా శాస్త్ర పండితులు పలువురు ప్రవచన కారులు చెబుతారు. భాగవతం వింటే పుణ్యం కలుగుతుంది అని, మరీ భక్తిశ్రద్దలతో వింటే మోక్షమే ప్రాప్తిస్తుంది అని కూడా ప్రవచన కారులు వారి వారి ప్రవచనాల ద్వారా చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల చేత చెప్పబడుతున్న మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహానుభావుడు, తెలుగుజాతికి విలువైన భక్తీ గ్రంధాన్ని అందించిన బమ్మెర పోతరాజు గురించిన తెలుగు చలనచిత్రం చూడడం కూడా ఒక అదృష్టమే అంటారు. ‘BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

భాగవతమును తెలుగులోకి అనువదించిన మహానుభావుడు పోతనామాత్యుడు జీవితం ఆధారంగా తెలుగు చిత్రంగా మలిచిన మరో సినీమహానుభావుడు కె.వి. రెడ్డి(కద్రి వెంకటరెడ్డి)గారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన తెలుగుచలనచిత్రంలో పోతనగా చిత్తూరి నాగయ్య నటిస్తే, ఇంకా ముదిగొండ లింగమూర్తి, హేమలతదేవి, టంగుటూరి సూర్యకుమారి తదితరులు నటించారు. బమ్మెర పోతన జీవితంలో భాగవతం వ్రాయడానికి పురిగోల్పిన పరిస్థితులు, భాగవతం వ్రాస్తుండగా భగవానుడు సహకరించిన సన్నివేశాలతో చిత్రం BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana భక్తప్రదంగా సాగుతుంది.

వ్యాసభాగవతం ఆధారంగా తెలుగులో భాగవతం రచన ప్రారంభించిన భక్త పోతన

ఏకశిలానగరంలో శ్రీరామునిపై ప్రార్ధన పాటతో చిత్రం మొదలవుతుంది, అందరిని దైవ బిడ్డలుగా భావించే పోతనగారి ఔన్నత్యం ఆ పాట తరువాత కనిపిస్తుంది. కవిసార్వభౌమ శ్రీనాధుడు, పోతనామాత్యులు బావబావమరుదులు. శ్రీనాధుడి కూతురుకు, పోతన ఇంటిలోనే పెరుగుతూ ఉంటుంది. వారివురుకు వివాహం చేసే ఆలోచన కూడా ఉంటుంది. ఇంకా పోతన కూతురుతో భార్యాభర్తలు కలిసి ఇంటిలో ఉంటూ ఉంటారు. పోతన భక్తి పరిపక్వతకు వచ్చిందని పోతనను అనుగ్రహింప దలచిన భగవానుడు, ఆమాట సీతమ్మతల్లితో చెప్పి బయలుదేరతాడు. భోజనానికి కూర్చుండబోతున్న సమయానికి ఒక అన్నార్ది పోతన ఇంటికి వస్తాడు. వారు తమ భోజనం మాని, ఆ అతిథికి భోజనం కడుపునిండా పెట్టి పంపుతారు, పోతనామాత్యులు. ఇంటి బయటకు వచ్చిన ఆఅతిథి భగవానుడి రూపంలో అంతర్ధానం అవుతారు. పోతననే అనుగ్రహించిన భగవానుడు, పోతనకు శ్రీసీతారాములుగా కనిపించి, శ్రీమహాభాగవతముని తెలుగు అనువదించమని చెప్పి అంతర్ధానం అవుతారు.

పోతనామాత్యులు తనఇంటి పూజామందిరంలోనే, భగవానుణ్ణి అర్చించి, భాగవతం తెలుగులో రచన చేయడం ప్రారంభిస్తారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చేడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండేడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్యుత కవిత్వ మహాత్య పటుత్వ సంపదల్ లాంటి ఎన్నో మహిమాన్విత పద్యాలు భాగవతంలో పెక్కుగా ఉంటాయి.

గజేంద్రమోక్ష ఘట్టంలో పోతన వేషంలో పద్యరచన చేసిన శ్రీరామచంద్ర మూర్తి

గజేంద్రమోక్షం ఘట్ట రచనలో శ్రీమహా విష్ణువు వైకుంఠం నుండి ఉన్నఫలంగా బయలుదేరే సన్నివేశం వివరణ తోచని మహాకవి పోతనామాత్యులు, అయన కూతురు లక్ష్మిని అక్కడే పూజగదిలోనే కూర్చుండబెట్టి, గుడికి ఆలోచిస్తూ బయలుదేరతారు. పచార్లు చేసి ఆలోచనలతో తిరిగి ఇంటికి వచ్చిన పోతనామాత్యులకు గొప్ప విషయం తెలుస్తుంది. మరలా వ్రాయడానికి తాళపత్రం చూడగానే అందులో తాను వ్రాయదలచిన ఘట్టం వ్రాయబడి ఉంటుంది. ఎలా అనుకుండగా కూతురు లక్ష్మి మీరే కదా అలా వెళ్లి ఇలా వచ్చి పద్యం తట్టినది అని వ్రాసారు, అని చెబుతుంది. అప్పుడు అవగతం అవుతుంది  పోతనామాత్యులకు, తానూ బయటికి వెళ్ళాక, తన వేషంలో శ్రీరామచంద్ర మూర్తి వచ్చి శ్రీమహావిష్ణువు గజేంద్ర రక్షణార్ధం వైకుంఠం నుండి ఎలా బయలుదేరినది వివరించి వెళ్ళారని. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

విష్ణుభగవానుడి అవతార ఘట్టాలతో సాగే భాగవత రచన చేస్తున్న పోతనకు, పోతన కుటుంబ సభ్యలు సేవలు చేస్తూ సహకరిస్తూ ఉంటారు. పోతన భావమరిది అయిన కవిసార్వభౌమ శ్రినాధులు రాజాశ్రయంతో భోగభాగ్యాలతో ఉంటారు. అటువంటి సమయంలో పోతన రచన చేసిన ఒక పద్యం ఒకటిని శ్రీనాధకవిసార్వభౌముల వారు ఆ రాజుకి వినిపిస్తారు. ఆ పద్యం విన్న రాజుగారు పోతనను సత్కరింపదలుస్తారు. అలాగే ఆ భాగవతమును తనకు అంకితం ఇవ్వవలసినదిగా పోతనకు చెప్పమని, రాజుగారు బహుమానాలు శ్రీనాధకవిసార్వభౌముడితో పంపిస్తాడు. పోతనకు నేచెప్పి ఒప్పించెదనని పలికిన కవిసార్వభౌమ శ్రీనాధులు, పోతనకు ఇంటికి వస్తారు.

భాగవతం రాజుకి అంకితం ఇవ్వవలసినదిగా శ్రీనాధకవిసార్వభౌమ పోతనని అడుగుట

పోతనతో భేటి అయిన కవిసార్వభౌమ శ్రీనాధులు వారు, రాజుగారి తలంపును పోతనతో చెబుతారు. అందుకు పోతనామాత్యులు ఆరచన నాదైతే కధా ఆభాగవతం శ్రీరామంకితం నేను రాజుకి అంకితం ఇవ్వటానికి నాది అను కావ్యమేది లేదని చెబుతారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా పోతన మాటకే మద్దతుగా నిలబడతారు. పోతనామాత్యుల వారి మాట శ్రీనాధ కవికి, రాజుకి కూడా రుచించవు. రాజుగారి దగ్గర నుండి తనకు వచ్చిన బహుమానాలు పేదవారికి దానం చేస్తూ, పోతనామాత్యుల ఉంటుండగా, రాజపరివారంతో శ్రీనాధ కవిసార్వభౌములవారు పోతన ఇంటికి వస్తారు.

రాజుగారికి భాగవతం అంకితం ఇస్తావా సరే లేకపొతే నా కూతురు కూడా నీకు కోడలు కాదని హెచ్చరిస్తాడు, శ్రీనాధుడు పోతనని. కొడుకు కోసం ఒప్పోకోమని పోతన భార్య వేడుకున్నా, పోతనామాత్యుడు భాగవతం భగవంతుడి సొత్తు, అంకితం ఇవ్వడానికి నేనేవ్వరనే సమాధానమే చెబుతారు. ఇక చేసేది లేక శ్రీనాధకవిసార్వభౌమ పోతన కుటుంబానికి ఆలోచన చేసుకుని చెప్పమని కోరతాడు. ఆరోజు అంతా దుఃఖంతో మునుగుతుంది. ఆకష్టాలలో రాజుకు అంకితం ఇవ్వమనే ప్రోత్సహకానికి పోతనామాత్యులు ఎక్కడ లొంగుతారు అనో ఏమో సాక్ష్యాత్తు సరస్వతీ మాతే పోతన నట్టింట విలపిస్తూ కనబడడం భక్తీ హృదయాన్నే తాకుతుంది. ఆఅమ్మకు ఈ బిడ్డడు మాట ఇచ్చి, అమ్మ కన్నీరు తుడిచి, తన కుటుంబం కన్నీరుకు కారణంగా ఉంటారు పోతనామాత్యులు. కవిసార్వభౌమ శ్రీనాధులను పోతనగారు శ్రీమద్భాగవతం రాజుకి అంకితం ఇవ్వబోనని తేల్చి చెప్పి పంపుతారు. శ్రీరాముడినే నమ్ముకుని ఉన్న పోతనామాత్యులు భాగవత రచనని కొనసాగిస్తూ ఉంటారు.

పోతనామాత్యుల మాటను రాజధిక్కారంగా భావించిన ఆ రాజు, పోతనను దుర్హహంకారిగా జమకట్టి, సేనాధిపతిని సైన్యంతో పోతన ఇంటికి వెళ్లి భాగవతం తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. పరమరామ భక్తుడు అయిన పోతనామాత్యులు భగవదారాధనతో ఉంటుండగా, రాజ సేనాని రాజభటులతో పోతన ఇంటికి రావడం జరుగుతుంది. ఏకశిలానగరంలో పోతనామాత్యుల ఇంటిముందుకు వచ్చిన రాజభటులకు శ్రీఆంజనేయ స్వామి కనబడగానే, వారు రామభజన చేస్తూ పారిపోతారు. రాములవారి గుడిలో దీపారాధనని అవమానించిన వ్యక్తికి, ఆంజనేయస్వామి బుద్ది చెప్పుతాడు.

సీతమ్మ దయతో వందలమందికి పంచభక్ష్య పరవన్నాలతో ఆతిధ్యం ఇచ్చిన పోతనామాత్యుల కుటుంబం.

పోతన పేదరికం అంటే చిన్నచూపు చూపే పోతన బావగారు అనేకమంది తన తోటి పండితులను పోతనామాత్యుల ఇంటికి అతిథులుగా ఆతిధ్యం కోసం తీసుకువస్తాడు. ఇంట్లో ఒక బియ్యం గింజ లేని సమయంలో అతిధులు రావడం, పోతనామాత్యుల భార్య సీతమ్మతల్లిని ప్రార్ధన చేయడంతో, అమ్మ అనుగ్రహంతో పోతనామాత్యుల కుటుంబం వచ్చిన అతిథులకు పంచభక్ష్య పరవన్నాలతో ఆతిధ్యం ఇస్తారు. ఆతిధ్యం స్వీకరించిన పండితులంతా పోతనతో సమావేశమై నన్నయ్య, తిక్కన భారతం అంకితం ఇచ్చారని, అలాగే మీరు ఇవ్వవలసినదిగా సూచన చేస్తారు. అయినా పోతనామాత్యుల వారు భగవత్పరమైన భాగవతమును ఎవరికీ అంకితం ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పుతారు.

పండితుల మద్య వాదనకు దిగిన శ్రీనాధ కవిసార్వభౌమ భాగవత దూషణ చేయబోతు, గజేంద్ర మోక్షంలో పరుగు పరుగున వచ్చిన విష్ణుమూర్తి అలా రావడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. ఇదంతా వినోదంగానే తలపిస్తుంది అని అంటుండగా అంతలోనే ఇంటిబయట ఆడుకుంటున్న శ్రీనాధుడి కూతురుకి ఎదో అయ్యింది అని అరుపు వినగానే అందరూ గబాగబా బయటకి వస్తారు. వెంటనే పోతనామాత్యులవారు సన్నివేశం గుర్తు చేస్తూ, ప్రేమానుభందాలు కలిగిన మనమే ఇంత అల్లాడితే, మరి భగవంతుడు ఇంకెంత అల్లాడుతూ భక్తుల కోసం తపిస్తూ ఉంటాడు అని అనగానే, శ్రీనాధ కవిసార్వభౌమతో సహా వచ్చిన పండితులంతా పోతనకు నమస్కరించినిలబడతారు. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

ఇక రాజు శింగభూపాలుడు పోతనకు రాజ్య బహిష్కరణ విధిస్తారు. కట్టుబట్టలతో కుటుంబం రాజ్యాన్ని విడిచివెళ్ళాలని రాజు ఆజ్ఞాపించడంతో బమ్మెర పోతనామాత్యులు కుటుంబంతో సహా కట్టుబట్టలతో ఊరు వదిలి బయలుదేరతారు. అయితే పోతనామాత్యులు రచన చేసిన భాగవత గ్రంధం పోతనామాత్యుల పూజగదిలోనే ఉంటుంది. పోతనామాత్యులు ఊరు వదిలి వెళ్ళాక శ్రీమద్భాగవత గ్రంధాన్ని తీసుకొని పోదలిచిన రాజభటుల ప్రయత్నాలు విఫలం అవుతాయి. అయితే ఆఖిరికి సేనాధిపతి కూడా శ్రీమద్భాగవత గ్రంధ దరిదాపులకు చేరలేక పోతాడు. ఈ విషయం రాజుకి నివేదించగా రాజు పోతనామత్యుడి ఇల్లుని కూలగొట్టమని ఆజ్ఞాపిస్తాడు.

అందరి సమక్షంలో భాగవతాన్ని భగవంతుడికి అర్పించిన పోతనామాత్యులు

రాజభటులు పోతనామాత్యుల ఇంటిని కూలగొడుతున్న కొలది రాజభవనాల్లో ప్రకంపనలు వచ్చి, రాజు భయకంపితుడు అవుతాడు. ఇదంతా పోతనామాత్యుల భక్తీ ప్రభావమేనని తెలుసుకుని పోతనామాత్యుల వద్దకు వచ్చి బమ్మెర పోతన కాళ్ళపై పడతాడు రాజు. చివరికి రాజు సమక్షంలో శ్రీసీతారాములకే భాగవతం సమర్పిస్తారు, బమ్మెర పోతనామాత్యులు. ఎన్ని కష్టాలు కలిగిన ఓర్చుకుని భాగవతాన్ని భగవత్పరం చేసిన ఘనుడుగా పోతనామాత్యులని రాజు కొనియాడతాడు. “BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana”

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

పవన్ కళ్యాణ్ మూవీస్

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాలు, పవన్ కళ్యాణ్ తెలుగు మూవీస్

తెలుగు తెరపై అగ్ర కధానాయకుడుకి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చి గోకులంలో సీతతో జతకట్టి సుస్వాగతం అంటూ కొత్త సంవత్సరం ప్రారంభించి తొలిప్రేమతో ఆకట్టుకుని తమ్ముడుగా బద్రి ఖుషి చేసుకుని, జానీతో తననితానే కొత్తగా పరిచయం చేసుకుని గుడుంబా శంకర్ గా బాలు బంగారంతో అన్నవరంతో జల్సా చేసుకుని పులితో తీన్ మార్ చేసిన పవన్ పంజా గబ్బర్ సింగుతో తనకితానే సాటి అనిపించుకుని కెమెరామేన్ గంగతో రాంబాబుగా వచ్చి అత్తారింటికి దారేది గోపాలా గోపాల అన్న సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడుల అజ్నతవాసిగా వచ్చి ప్రస్తుతం తెరనుండి కాకుండా నేరుగా ప్రజల్లో వెలుగుతున్న పవర్ స్టార్.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ ఫస్ట్ ఫిలిం.

మెగాస్టారు చిరంజీవి చినతమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తెలుగుచలనచిత్రంతో ఆంధ్ర-తెలంగాణా రాష్ట్ర ప్రజలకు తెరపై పరిచయం అయ్యారు. 1996 లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో చిరంజీవి సోదరుడు హీరో అయితే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ హీరొయిన్ గా నటించారు. ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. కాలేజీ ప్రేమకధ ఊరిలో పెద్దల పట్టుదల మద్య ప్రేమికులుగా కళ్యాణ్ – సుప్రియలు నటించారు. ఈచిత్రానికి పవన్ పేరు కళ్యాణ్ గానే పరిగణించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం పవన్ కళ్యాణ్ కి కళ్యాణ్ గా తొలి చిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

తమిళంలో హిట్టైన గోకులత్తిల్ సీత చిత్రం ఆధారంగా తెలుగులో పునర్మించిన చిత్రం గోకులంలో సీత, ఈ చిత్రానికి దర్శకుడు ముత్యాల సుబ్బయ్యగారు. పవన్ కళ్యాణ్ రెండవచిత్రంలో రాశి కధానాయకగా హరీష్ సహానటుడుగా నటించిన తెలుగు చలన చిత్రం. కేవలం సుఖాల వెంట తిరిగే వ్యక్తి, తన స్నేహితుడి కోసం పెళ్లిపీటల మీద నుండి అమ్మాయిని తీసుకువచ్చాక, స్నేహితుడు కాదంటే, ఆ అమ్మాయికి ఆశ్రయం కల్పించి, ఆ అమ్మాయి సహవాసంలో చెడుసావాసలకు దూరమయ్యే డబ్బున్నవ్యక్తిగా, ఆమెను ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నటించారు.

పవన్ కళ్యాణ్ మూడవ తెలుగుచలనచిత్రంగా సుస్వాగతం తెలుగుచలనచిత్రం కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువ ప్రేక్షకులకు ప్రేమసందేశాన్ని అందించారు. ఆకర్షణ అనో ప్రేమ అనో యువత సమయం వృదా చేసుకోరాదు, అలా చేసుకున్న యువకుడు జీవితం ఎలా ఉంటుందో ఈచిత్రం ద్వారా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుగారు చక్కగా చూపించారు. ప్రేమించే తండ్రి, ప్రాణమిచ్చే స్నేహితుల మద్యలో ఒక యువకుడు ఒక యువతి ప్రేమకోసం, ఆమె అంగీకారం కోసం నాలుగు సంవత్సరాలు వేచి ఉండే యువకుడు పాత్రలో పవన్ నటన చక్కగా ఉంటే, పాటలు మంచి ప్రజాదరణను పొందాయి. ఆలయాన హారతిలో ఆఖిరి చితిమంటలలో అంటూ చిత్రం ఆఖరున వచ్చే పాట కంటతడి పెట్టించే సన్నివేశాలతో ఉంటూ ఆకట్టుకుంటుంది.

తొలిప్రేమ ప్రేమకధా చిత్రాలలో ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ తెలుగుచలనచిత్రం

Power Start Pawan Kalyan Telugu Movies List

సుస్వాగతం చిత్రంతో యువతకు మంచి మెసేజ్ అందిస్తే, తొలిప్రేమ చిత్రంతో లక్ష్యం ఎంత గొప్పదో నిజమైన ప్రేమ ఏమి చేస్తుందో తొలిప్రేమ చిత్రం ద్వారా మధ్యతరగతి కుటుంబ భావనలతో సాగే చిత్రం యువతను బాగా ఆకర్షిస్తే, ఆ చిత్రం నిదానంగా సాధించిన విజయం ఇప్పటికి ఆ చిత్ర దర్శకుడుకి అంతటి స్థాయిలో పేరు తెచ్చిన చిత్రం మరేది రాలేదు. కుటుంబంలో అఖిరి కొడుకుగా నాన్నతో చివాట్లు తింటూ పెదనాన్న అభిమానంతో సరదాగా స్నేహితులతో గడిపేస్తూ ఉండే అబ్బాయి మదిలో అలజడి సృష్టించిన ఒక దీపావళి తెల్లవారుజాము అతని జీవితాన్నే ఏవిధంగా మలుపు తిప్పిందో చిత్రం చూస్తేనే బాగుటుంది. కొన్ని చిత్రాలకు విశ్లేషణ కన్నా వీక్షణ ఉత్తమం అలాంటి చిత్రాల్లో తొలిప్రేమ తెలుగుచలనచిత్రం ఒకటి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి, అలీ తదితరులు నటించగా ఏకరుణాకరన్ దర్శకత్వం వహించారు.

తమ్ముడు టైటిల్ కి తగ్గ పాత్రలలో నటించడం పవన్ చిత్రాల్లో మొదటి చిత్రం నుండి కనబడుతుంది. అలాగే తమ్ముడు చిత్రంలో కూడా ఆదర్శంగా ఉండే అన్నకి తమ్ముడుగా, అఖిరికి అన్నఆశయాన్ని నెరవేర్చే తమ్ముడుగా, ఎప్పుడు తండ్రితో తిట్లు తినే చిన్నవాడిగా ఉంటూ, చివరికి తండ్రి శభాస్ అనిపించుకునే కొడుకు పాత్రలో పవన్ నటన యూత్ కి అద్బుతంగా అనిపించింది. ఇంకా ఈ చిత్రంలో ప్రక్కనే ప్రేమ ఉన్నా పట్టించుకోకుండా పోకడలను పట్టుకుని ఆకర్షణని ప్రేమ అనుకుని తిరిగే కుర్రవాడిగా కూడా పవన్ చాలా చక్కగా నటించారు. చిరంజీవికి తగ్గ తమ్ముడుగా తమ్ముడు తెలుగుచలనచిత్రంతో పవన్ అందరితో అనిపించుకున్నారు. తమ్ముడు చిత్రానికి ఏఅరుణప్రసాద్ దర్శకత్వం వహించగా ప్రీతిజింగానియా, అదితి గోవిత్రికర్ హీరొయిన్లుగా నటించారు.

పవన్ కళ్యాణ్ బద్రి – ఖుషి సూపర్ డూపర్ హిట్ తెలుగు చిత్రాలు

Power Start Pawan Kalyan Telugu Movies List

బద్రి టైటిల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో పవన్ నటనే హైలైట్ ఈచిత్రానికి. నువ్వు నందా అయితే ఎవడిక్కావాలి నేను బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ డైలాగు పవర్ ఫుల్ డైలాగ్. ప్రకాష్ రాజు నందగా పవన్ బద్రిగా పోటిపడి నటించిన ఈ చిత్రానికి ప్రసిద్ద దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తిగా, ప్రియురాలితో పందెం కట్టి ఇంకొక అమ్మాయితో ప్రేమ నాటకం మొదలుపెట్టి, ఆ అమ్మాయితో ప్రేమలో పడడంతో ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కధ చిత్రంగా మారుతుంది. రేణుదేశాయ్, అమీషాపటేల్, అలీ తదితరులు నటించిన ఈతెలుగుచలనచిత్రం చక్కటి ప్రజాదరణను పొందింది.

ఖుషి తెలుగుచలనచిత్రం చూస్తున్నంతసేపు ఖుషిగానే చిత్రకధనం సాగుతుంది. చక్కటి కాలేజీ ప్రేమ కధకు ఇగో ఉన్న అమ్మాయి పాత్రదారి అయితే ఆ ప్రేమికుడు పడే పాట్లు ఈచిత్రంలో చాల చక్కగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ భూమిక ప్రేమికులుగా ఈచిత్రం అందరిని అలరించి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం నిలిచింది. ఫైట్లలో చిరంజీవి చిత్రాలు ప్రసిద్ది అయితే ఖుషి చిత్రం తరువాత చిరంజీవి తన చిత్రానికి కూడా ఫైట్ కంపోజ్ పవన్ కళ్యాణ్ చేయించుకోవడం విశేషం. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ జె సూర్య. పవన్ కళ్యాణ్ తారస్థాయిలో తీసుకువెళ్ళిన చిత్రం, ఖుషి తెలుగుచలనచిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

వరుస ఏడు హిట్ చిత్రాల హీరో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో భారి అంచనాల మద్య వచ్చిన జానీ తెలుగు చలనచిత్రం హాలీవుడ్ చిత్రానికి దగ్గరగా సగటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా నిలబడి, పవన్ కళ్యాణ్ మరియు పవన్ ఫాన్స్ కి నిరాశపరిచింది. రేణుదేశాయ్ పవన్ జంటగా వచ్చిన ఈతెలుగుచలనచిత్రం హాలీవుడ్ చిత్రం తరహాలో కధనం సాగుతూ సగటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా సన్నివేశాలు ఉంటూ భారిగా ఫెయిల్ అయిన చిత్రాల్లో చేరిపోయింది. ఖుషి వరకు ప్రతి చిత్రంతో అంచనాలు అందుకుంటూ అన్ని చిత్రాలతో అందరిని ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ జానీ చిత్రం విడుదల తర్వాత అంచనాలు తలక్రిందులు చేసింది.

ఇక అటుతరువాత వచ్చిన గుడుంబా శంకర్ తెలుగుచలనచిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించగా మీరాజాస్మిన్ జతగా నటించింది. ఈచిత్రం ఒక చిల్లర దొంగతనాలు చేసే దొంగగా, ఆపదలో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడి, ఆ అమ్మాయి ఆపదను తొలగించడానికి ఆ దొంగ పడేపాట్లు ఈ చిత్ర కధాంశం. అయితే గుడుంబాశంకర్ చిత్రం పవన్ కి తగ్గ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కాని పాటలు ప్రాచుర్యం పొందాయి.

తొలిప్రేమ దర్శకహీరోల కాంబినేషన్ బాలు తెలుగుచలనచిత్రంతో పునరావృతం అయ్యింది. బాలు తొలిప్రేమచిత్రంలో పాత్రపేరు, అదే టైటిల్ ఆ చిత్రదర్శకుడుతో వచ్చిన బాలు చిత్రంలో శ్రియ, నేహ ఒబెరాయ్ జతగా నటించారు. పాటలు ప్రజాదరణ పొందాయి, చిత్రం విజయవంతం అయినా పవన్ పూర్వస్థాయిలో విజయం సాధించలేకపోయింది అప్పటికి, అయితే చిత్రం రెండవభాగం బాగా ఆకట్టుకుంటుంది. మొదటి భాగం హాస్యభరితంగా సాగిన రెండవ భాగం కధనం బాగుంటుంది. అమ్మాయి కోసం అన్ని చేసే పెట్టె ఒక యువకుడు అనే అర్ధం వచ్చే లా బాలు టైటిల్ ట్యాగ్ లైన్ ఉంటుంది.

Power Start Pawan Kalyan Telugu Movies List

పవన్ కళ్యాణ్ బాలు తరువాత బంగారంగా ప్రేక్షకుల వద్దకు వచ్చారు. ప్రేమంటే పడని పని అంటే పడిపడి చేసే ఒక యువకుడు, సాటి యువతి ప్రేమ కోసం యుద్దమే చేస్తాడు. తన అవసరం తీరిన తనదారిన తాను పోకుండా, ఉపకారం పొందిన ఇంటిపెద్దకి ఇష్టం లేకపోయిన ఆ ఇంటి కూతురు ప్రేమని రక్షించి బంగారంగానే నిలబడతాడు. పాటలు చక్కగా ఉంటాయి, పవన్ కళ్యాణ్, మీరా చోప్రా, రీమసేన్ ప్రధానంగా నటించారు. ఈచిత్రంలో కేవలం ఇంకొకరి ప్రేమకోసం పాటుపడే కధానాయకుడుగానే ఉంటాడు, ప్రేమకోసం కాకుండా పనికోసం పాటుపడే యువకుడుగా పవన్ నటన బాగుంటుంది. Pawan Kalyan’s Eleventh Movie is Bangaram. ఈ చిత్రానికి దర్శకుడు తమిళ చిత్రాల దర్శకుడు ధరణి దర్శకత్వం వహించారు.

అన్నగా అన్నవరం ప్రేమికుడుగా తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్

చెల్లెలుపై మిక్కిలి మమకారం ఉన్న అన్నగా అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ చిత్రంలో నటించారు. చెల్లెలు అంటే అమితమైన అభిమానం ఉన్న అన్నయ్యగా ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించి, అక్కడ చెల్లెలు కాపురానికి అడ్డుగా ఉన్నసామజిక పరిస్థితులపై పోరాటం చేసి, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడే వ్యక్తులను అందుకు సహకరించే పెద్దమనుషులకు బుద్ది చెబుతాడు. సమాజంలో చెడు సాధారణ జీవితానికి ఎలా అడ్డంకిగా ఉంటుందో ఈ చిత్రంలో కనబడుతుంది. పవన్ కళ్యాణ్ అన్నగా నటిస్తే, అతడికి చెల్లెలిగా ప్రేమిస్తే ఫేం సంధ్య నటించింది. పవన్ కళ్యాణ్ కి జతగా అసిన్ నటించింది. సుస్వాగతం హీరోదర్శక కాంబినేషన్లో ఈతెలుగుచలనచిత్రం వచ్చింది. Annavaram Powerstar Pawan Kalyan’s Twelth Movie as hero.

Power Start Pawan Kalyan Telugu Movies List

Pawan Kalyan Thirteenth Film is Jalsa, Super Hit entertainer. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు చిత్రంలో నటించాల్సిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా తెలుగుచలనచిత్రంలో నటించడం విశేషం. ఈచిత్రం పవన్ అభిమానులకు ఖుషిలాగా జల్సా తెచ్చింది. పునరావాసం పొందిన నక్శలైట్ , కాలేజీలో చదువుకునే స్టూడెంట్ పాత్రలో పవన్ నటించారు. ఒక పోలీసు అధికారికి ఉన్న ఇద్దరి అక్కచెల్లెలికి ఒకే ప్రేమికుడుగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. ప్రకాష్ రాజ్ పోలీసు అధికారిగా నటిస్తే, పోలీసు అధికారి కూతుళ్ళుగా  ఇలియానా, కమిలినిముఖర్జీ నటించారు. పార్వతి మెల్టన్ ఇలియానాకు స్నేహితురాలుగా పవన్ కళ్యాణ్ అభిమానిగా నటించారు. ఈ చిత్రంలో పాటలు ప్రజాదరణ పొందాయి.

ఖుషి కాంబినేషన్లో హీరోదర్శకులతో పులి తెలుగుచలనచిత్రం వచ్చింది. పవర్ ఫుల్ పోలీసు ఆఫీసు పాత్రలో పవన్ నటన బాగున్నా చిత్రం ఆశించనంత విజయం సాధించలేకపోయింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జతగా నికిష పటేల్ నటించింది.

పులి తరువాత తీన్ మార్ చిత్రంలో పవన్ నటించారు. అమ్మాయితో మాట్లాడాలంటే సంవత్సరాల సమయం పట్టే కాలం, అమ్మాయితో రోజుల వ్యవధిలోనే తెగతెంపులు చేసుకునే కాలానికి పోల్చుతూ ఈ చిత్రంలో ఒకే సమయంలో రెండు తరాల ప్రేమకధలు కనిపిస్తూ కధనం సాగుతుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో త్రిష, కృతి కర్బందా పవన్ కళ్యాణ్ కి జతగా నటించారు. ప్రస్తుతంలో అందాలని ఆస్వాదిస్తూ ఉండే యువకుడు గడిచిన ప్రేమకధని వింటూ, తన జీవితంలో ప్రేమను పొందే యువకుడు కధగా ఈ చిత్రం ఉంటుంది. గతంలో ప్రస్తుతంలో ప్రేమకధలలో కధానాయకుడుగా పవన్ కళ్యాణ్ నటన బాగుటుంది. పాటలు బాగుంటాయి.

పవన్ పంజా గబ్బర్ సింగ్ చిత్రంలో

Power Start Pawan Kalyan Telugu Movies List

వివాదమైన న్యాయం ఉంటే ఆ వివాదానికి ప్రాచుర్యం లభిస్తుంది. పంజా చిత్రంలో ఒక క్రిమినల్ నిజాయతీ, అతని అంతరంగంలో ఉండే ఆవేదన చిత్రంలో పవన్ నటనలో కనబడుతుంది. యాక్షన్ త్రిల్లర్ గా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన పంజా చిత్రం కమర్షియల్ విజయం సాధించలేకపోయిన హీరో నటనపరంగా ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్, జాకిష్రాఫ్, సారా జేన్, అలీ తదితరులు నటించారు. జై పాత్రలో పవన్ నటనతో ఈచిత్రంలోమెప్పించారు. తనను చేరదీసిన యజమాని కొడుకు దురాగతాలను అడ్డుకోవడానికి, యజమానిపై ఉండే విశ్వాసానికి ప్రతీకగా ఒక నేరస్తుడు మదిలో మెదిలే సంఘర్షణ యాక్షన్ త్రిల్లర్ గా ఈ చిత్రంలో ఉంటుంది.

హిందీలో విజయవంతమైన చిత్రం ఆధారంగా ఒక తిక్క పోలీసు ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ధియేటర్లో కూర్చున్న వ్యక్తి విరామం కోసం వేచి చూడకుండా దృష్టి తెరపైనే ఉంచగలిగే కధనం ఉంటే ఆ చిత్రం సూపర్ హిట్టే. గబ్బర్ సింగ్ చిత్రం చూస్తున్నంత సేపు చిత్రంలో లీనమవ్వడమే ఈ చిత్ర కధనం తిక్క పోలీసు ఆఫీసర్ నటన ప్రత్యేకత. పవన్ కళ్యాణ్, శృతిహసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది డైలాగ్ ప్రసిద్ది చెందింది. పాటలు అన్ని ఆకట్టుకునే విధంగా చక్కగా ఉంటాయి. తిక్క పోలీసు ఆఫీసర్ ప్రేమ కధలో పవన్ నటన ఆకట్టుకుంటుంది.

Power Start Pawan Kalyan Telugu Movies List

కెమెరా మేన్ గంగతో రాంబాబుగా టివి విలేకరిగా పనిచేస్తూ సమాజ సేవ చేసే బాద్యత కలిగిన పౌరుడుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించారు. రాంబాబు పవన్ కళ్యాణ్ అయితే గంగగా తమన్నా నటించింది. ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో రాజకీయంగా అతని ఆకృత్యాలను అడ్డుకునే టివి విలేఖరిగా, చివరికి అతనిపై పోరాటానికి యువతలో చైతన్యం కలిపించి పోరాడే పాత్రలో పవన్ నటిస్తే, ప్రతిపక్ష నాయుకుడు కొడుకుగా ప్రకాష్ రాజ్ నటించారు. బద్రి దర్శకహీరో కాంబినేషన్లో కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం రావడం విశేషం. సామాజికమైన అంశాలకు సహజంగా స్పందించే వ్యక్తిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. ఇప్పుడు సమాజ సేవకోసం రాజకీయాలలోకి వచ్చి జనసేనపార్టికి నాయకత్వం వహిస్తున్నారు.

సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది అంటూ అందరిని అలరించిన పవన్ కళ్యాణ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ తెలుగుచలనచిత్రంగా నిలించింది. జల్సా దర్శకహీరో కాంబినేషన్లో ఈచిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రేమకోసం ఇంటినుండి దూరంగా ఉంటున్న అత్తకోసం అల్లుడు పడేపాట్లు, అత్తకూతుళ్ళతో ఆటలు ఈచిత్రం సాగి, చివరికి సెంటిమెంట్ సన్నివేశంతో అందరిని ఆకట్టుకుంటుంది. అత్తగా నదియా నటిస్తే, మరదళ్ళుగా సమంతా, ప్రణీత నటించారు. ఒక మిల్లినియర్ పాత్రలో పవన్ నటన ఈ చిత్రానికి హైలైట్. పాటలు, కధనం, సెంటిమెంట్, కామెడీ అన్నింటితో అందరిని అలరించే అత్తారింటికి దారేది. నెట్లో సగం సినిమా లీక్ అయ్యిన సూపర్ హిట్ అయ్యిన చిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలయికలో వచ్చిన బహుతార తెలుగుచలనచిత్రం గోపాల గోపాల ఒక గోపాల భక్తుడు అయితే ఇంకో గోపాల దేవుడు. భక్తుడుగా వెంకటేష్ నటిస్తే, భగవానుడుగా పవన్ కళ్యాణ్ నటించారు. భక్తీ ముసుగులో కొంతమంది చేసే మోసాలను ఎండగడుతూ, పోరాడే ఒక భక్తుడు కోసం దిగివచ్చిన దేవుడుగా పవన్ ఈ తెలుగుచలనచిత్రంలో నటించారు. వెంకటేశ, శ్రియ భక్తులుగా నటించిన ఈ చిత్రంలో విష్ణువు అవతారం కృష్ణుడుగా పవన్ కళ్యాణ్ నటించి మెప్పించారు. హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించారు.

గబ్బర్ సింగ్ చిత్రానికి అనుకరణ చిత్రంగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది, కానీ గబ్బర్ సింగ్ స్థాయిలో ఈ చిత్రం విజయవంతం కాలేకపోయింది. ఎదురులేని ఒక వ్యక్తి నిర్మించుకున్న దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చి, అతని నుండి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిని, ఆమె ఆస్తిని రక్షించే పోలీసు పాత్రలో అలాగే ఆమెకు ప్రియుడుగా ఈ తెలుగుచలనచిత్రంలో పవన్ కళ్యాణ్ కనబడతారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పండిన హాస్యం ఈచిత్రంలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ కాజల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు.

Power Start Pawan Kalyan Telugu Movies List

కాటమరాయుడు అత్తారింటికి దారేది చిత్రంలో పాట పల్లవి, అదే పేరుతో ఒక ఊరి పెద్దమనిషి పాత్రలో పవన్ నటించారు. ఆడవాళ్లంటే పడని వ్యక్తిగా తమ్ముళ్ళతో కలిసి ఉంటాడు. అయితే అతని తమ్ముళ్ళ తమ ప్రేమ ఫలించాలంటే అన్నకూడా ప్రేమలో పడాలని, భావించి, అతని జీవితంలోకి అవంతిక అనే అమ్మాయి వచ్చేలా చేస్తారు. అమ్మయాలంటే ఇష్టంలేని పెద్దమనిషికి అవంతికతో ఎలా ప్రవర్తించడం, ఆ అమ్మాయి కుటుంబ సమస్యని పరిష్కరించడం కోసం చూడడం ఉంటుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ శ్రుతి హసన్ జంటగా నటించిన తెలుగుచలనచిత్రం కాటమరాయుడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడుసార్లు నటించిన పవన్ కళ్యాణ్

జల్సా చేసి అత్తారింటికి దారేది అంటూ అందరిని ఆనందింప చేసిన కాంబినేషన్ అజ్ఞాతవాసి తెలుగుచలనచిత్రంతో అభిమానులను నిరాశపరిచారు. తన తండ్రిని చంపినవారి ఆచూకికోసం తన కంపెనీలోనే ఒక ఉద్యోగిగా చేరి, వారిని తుదమొట్టించడమే ఈ చిత్ర కధాంశం. పవన్ కళ్యాణ్ కి జతగా కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

సత్యహరిశ్చంద్ర తెలుగు భక్తి చిత్రాలు

సత్యహరిశ్చంద్ర తెలుగు భక్తి చలనచిత్రం

మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప చిత్రం

స్టార్ ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో టి.ఏ. రామన్ దర్శకత్వంలో హరిశ్చంద్ర తెలుగు చిత్రం 1930 దశకంలోనే వచ్చింది. ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి, పి కన్నాంబ, బందర్ నాయుడు, పులిపాటి వెంకటేశ్వర్లు, మాస్టర్ భీమారావు, ఆకుల నరసింహారావు, జె. రామకృష్ణారావు తదితరులు నటించారు.

ఇంకా రాజ్యం పిక్చర్స్ సమర్పణలో హరిశ్చంద్ర పేరుతోనే మరలా ఈ చిత్రం తెరకెక్కించగా, ఇందులో ఎస్వీ. రంగారావు, లక్ష్మిరాజ్యం, రేలంగి, గుమ్మడి, సూరిబాబు, రఘురామయ్య, ఏ.వి. సుబ్బారావు, గౌరిపతిశాస్త్రి తదితరులు నటించారు.

తర్వాత సత్యహరిశ్చంద్ర గాధ53 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, ఎస్ వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ తదితరులు నటించారు. సత్యహరిశ్చంద్ర చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించగా ప్రముఖ దర్శకులు కె.వి. రెడ్డి నిర్మాణదర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సత్యహరిశ్చంద్ర గాధని చిత్రంగా సంస్థ నిర్మించింది.

సత్యహరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాధనుండి తెలుగు తెరపై కె.వి. రెడ్డిగారు నందమూరి తారక రామారావుగారిని సత్యహరిశ్చంద్రగా చూపించారు. ప్రముఖ గాయని అయిన ఎస్ వరలక్ష్మిగారిని సత్యహరిశ్చంద్ర భార్యగా చంద్రమతిగా చూపించారు. తెలుగుతెర తొలి కధానాయకుడు అయిన నాగయ్యగారిని వశిష్ఠ మహర్షి పాత్రలో చూపించారు. ప్రముఖ నటుడు ముక్కామలగారిని మహర్షి విశ్వామిత్రుడుగా చూపిస్తూ, విశ్వామిత్ర ప్రధాన శిష్యుడు నక్షత్రకుడు పాత్రలో రమణారెడ్డి గారిని చూపించారు. కాశి పట్టణవాసిగా కాలకౌశికుడు పాత్రలో రేలంగి నరసింహారావుగారిని చూపిస్తూ, కాల కౌశికుడుకి గయ్యాళి భార్యగా గిరిజని చూపించారు. మిక్కిలినేని గారిని ఇంద్రుడుగా చూపిస్తూ పార్వతిపరమేశ్వరులుగా సబితాదేవి-ప్రభాకర్ రెడ్డిగార్లని చూపించారు. ఇంకా వివిధ పాత్రల్లో ఎల్ విజయలక్ష్మి, రాజబాబు, రాజనాల, రాజశ్రీ, వాణిశ్రీ, మీనాకుమారి, మోహన, చదలవాడ, బాలకృష్ణ మొదలైనవారు SatyaHarisChandra Movie నటించారు. ‘NTR Satya Harishchandra Full Story Telugu Movie’

ఇంద్రసభలో వశిష్ఠుడు-విశ్వామిత్రుల సంవాదం

ఆడినమాట తప్పని హరిశ్చంద్ర మహారాజు సూర్య వంశస్తుడుగా పరమశివ భక్తుడు. రాజసూయ యాగము చేసి యజ్నఫలాన్ని పొందిన హరిశ్చంద్ర మహారాజు ఆ యజ్నఫల మహిమ రాజ్యంలో ప్రజలందరికి కలగాలని రాజసభలో యజ్న ఫల దర్శన భాగ్యం అయోధ్య ప్రజలకు కల్పిస్తారు. పిమ్మట యజ్న ఫలం గొప్పతనం రాజర్షి దాత అయిన హరిశ్చంద్ర మహారాజు గురించి రాజవంశగురువు వశిష్ఠ మహర్షి సభకు తెలియజేస్తారు. అదే సభలో ఒక యోగి వచ్చి మహారాజు దగ్గర మాట ఆ యజ్నఫలాన్ని అర్ధిస్తారు. అంతటి మహిమ కలిగిన యజ్నఫలాన్ని ఆ యోగికి దానం చేసేస్తారు, హరిశ్చంద్ర మహారాజు. (అయితే ఆ నిష్కామయోగిగా వచ్చింది పరమశివుడే, యజ్నఫలాన్ని పట్టుకుని ఆ యోగి, హరిశ్చంద్ర మహారాజు పూజామందిరంలోకి వెళ్లి అంతర్ధానం అవుతారు. అక్కడ వాక్కులుగా  హరిశ్చంద్రుడు యొక్క సత్యనిష్ఠని పరీక్ష చేయదలచానని పరమశివుడు పార్వతిమాతతో పలకడం వినబడుతుంది.)

ఇంద్ర సభలో మహర్షులతో సమావేశమై ఉన్న దేవేంద్రుడు, సభలో మహర్షులతో అందరిని పేద, ధనిక బేదాలు లేకుండా అందరిని తరింపజేసే వ్రతం ఏదైనా సెలవియ్యండి అని అనగా…. విశ్వామిత్ర మహర్షి అందరికి తగిన ఏకైక వ్రతం ఏది లేదు అర్హతను బట్టి వారి వారి తాహతు బట్టి మాత్రమే వ్రతాలు వుంటాయి అని చెబితే, మహర్షి వశిష్టులు మాత్రం అందరూ ఆచరించి తరించగలిగే వ్రతం సత్యవ్రతం ఒక్కటే అని బదులు చెబుతారు. సత్యవ్రతం ఆచరింప అసాద్యం అని అందులోను మానవమాత్రులు ఆచరించడం అనేది కుదరదు. వారి జీవన విధానం రిత్యా మానవులు సత్యవ్రతం అసాద్యం అని మహర్షి విశ్వామిత్రులువారు చెబుతూ వశిష్ఠ మహర్షి ప్రతిపాదనని తోసిపుచ్చుతారు. వశిష్ఠ – విశ్వామిత్ర వాదనల పిదప దేవేంద్రులువారు అలాంటి సత్యవ్రతం చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని వశిష్ఠమహర్షిని అడుగుతారు.

అందుకు వశిష్ఠ మహర్షి సూర్య వంశస్తుడు త్రిశంకువు కుమారుడు అయిన సత్యహరిశ్చంద్ర మహారాజు గురించి చెబుతారు. ఆ మాటకు కూడా విశ్వామిత్ర మహర్షి ఇంకో వాదనను తీసుకువస్తారు. ఈ వశిష్ఠ మహర్షి హరిశ్చంద్ర వంశానికి గురువు కావున వశిష్టులు హరిశ్చంద్ర మహారాజు గురించి గొప్పగా చెబుతున్నారు అని అంటారు. ఇక ఇంద్ర సభలో దేవతలు, మహర్షుల సమక్షంలో విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్ర మహారాజు సత్యనిష్టతని పరిక్షిస్తానని అందులో హరిశ్చంద్ర మహారాజు కచ్చితంగా అసత్యమాడేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. అందుకు వశిష్ఠ మహర్షి ఒకవేళ సత్యహరిశ్చంద్రుడు అబద్దమాడితే నేను ఆచార బ్రష్టుడినై బ్రతుకుతాను అని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే విశ్వామిత్ర మహర్షి సత్యహరిశ్చంద్ర మహారాజుతో అసత్యవాక్కు పలికించలేకపోతే తన తపశక్తిలో సగభాగం సత్యహరిశ్చంద్ర మహారాజుకి ధారపోస్తానని, సహస్ర వర్షములు సకల చక్రవర్తిగా పరిపాలన చేస్తాడని, అంతేకాకుండా చిరకాలం 14 మన్వంతరముల వరకు దేవేంద్ర సింహాసనంలో సగభాగం కలిగి ఉండేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

విశ్వామిత్ర మహర్షి పరీక్షలో భాగంగా రాజ్యదానం చేసేసిన హరిశ్చంద్ర

స్వర్గం నుండి బూలోకం వచ్చిన విశ్వామిత్ర మహర్షి తన ప్రధాన శిష్యుడు నక్షత్రకుడుతో కలిసి అయోధ్యకు హరిశ్చంద్ర రాజసభకు వస్తారు. ఒక ఎత్తైన మదపుటేనుగుపై ఒక పహిల్వాన్ ఎక్కి అతను విసిరిన రత్నం ఎంత పైకి వెళితే అంత ధనరాశి కావాలి అంటారు. సాదారణంగా ఒకమహారాజు అంతధనము ఇవ్వడమంటే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడమే అవుతుంది. హరిశ్చంద్రుడుని అంత ధనము అడిగితే, రాజు సంకోచించి మాట వెనుకకు తీసుకుంటాడెమో అని ఆలోచన చేసిన మహర్షి అంత మొత్తం ధనమును హరిశ్చంద్ర మహారాజుని కోరతారు. అడిగిన వెంటనే అంతధనము మీదే పట్టుకుని వెళ్ళండి అని అన్న హరిశ్చంద్ర మహారాజు మాటకు విశ్వామిత్ర మహర్షి ఆ ధనమును అవసరమైనప్పుడు తీసుకుంటాను నీవద్దనే ఉండని అని చెప్పి, రాజ సభనుండి నిష్క్రమిస్తారు.

విశ్వామిత్రవెనువెంటనే తన మాయ సృష్టిద్వారా క్రూరమృగాలను సృష్టించి అడవులలో స్వేచ్చగా వదిలేస్తారు, ఆ మృగాలు అడవి నుండి ఊళ్లపైకి వచ్చి పడతాయి. ప్రజలు మొర ఆలకించిన హరిశ్చంద్ర మహారాజు క్రూర మృగాల వేటకు అడవికి వెళ్లి, వాటిని వేటడతారు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఇద్దరు స్త్రీలను సృష్టించి అడవిలో ఉన్న హరిశ్చంద్ర మహారాజు వద్దకి పంపిస్తాడు. ఆ స్త్రీలు హరిశ్చంద్ర మహారాజు ముందు ఆడి పాడి, మహారాజుని పెండ్లి చేసుకోవలసినదిగా కోరతారు. వారిని వారించిన వినని స్త్రీలను మహారాజు తన సైన్యం ద్వారా అడ్డుకుంటారు. వారు మరలా విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వచ్చి మొరపెట్టుకుంటారు.

మహర్షి ఆగ్రహంలో ఉండగా అక్కడికి హరిశ్చంద్ర మహారాజు వస్తారు. వచ్చి జరిగిన విషయం వివరిస్తారు. అయితే వరించిన తన కుమార్తెలను పెండ్లి చేసుకోవలసిందే అని చెబుతారు. (వివాహమహోత్సవంలో అందరిముందు అగ్ని సాక్షిగా చేసే మంత్రపూర్వక ప్రతిజ్ఞ ఉంటుంది. ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు కోరి వచ్చారు కదా అని ఆ స్త్రీలను వరిస్తే అసత్య దోషమే వస్తుంది.). అయితే ఇప్పుడు ఇప్పటికే అగ్నిసాక్షిగా సంతానం కోసమే వివాహమాడిన ధర్మపత్ని ఉండగా, ఈ స్త్రీలను వివాహమాడడం అధర్మమని హరిశ్చంద్ర మహారాజు చెబితే, అందుకు బదులుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, తపోధనుల మాట వినడమే రాజధర్మం అని చెబుతారు. రాజర్షి అయిన హరిశ్చంద్రుడు అటువంటి ధర్మం కలిగిన ఈ రాచరికం నాకు వద్దు అని రాజ్యదాననికే సిద్ధపడతారు. నిండు రాజసభలో సకల రాజ్యాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రకు ధారపోసి కట్టుబట్టలతో తన భార్య, కుమారుడుతో కలిసి రాజ్యాన్ని వదిలి అడవికి బయలుదేరతారు, సత్య హరిశ్చంద్రుడు. రాజ్యాన్ని వీడుతున్న రాజుని చూసి ప్రజలు విలపిస్తూ హరిశ్చంద్రుడుకి వీడ్కోలు పలుకుతారు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

హరిశ్చంద్రుడు రాజభోగాలను త్యజించి, తన భార్యాపిల్లలతో అడవులలోకి

మొదటగా విశ్వామిత్ర మహర్షికి దానం చేసిన సొమ్ము హరిశ్చంద్ర మహారాజు వద్ద ఉంటుంది, అయితే సకల రాజ్యం దానంగా ఇచ్చిన మహారాజు విశ్వామిత్రుడికి ముందుగా ఇచ్చిన దానం ఋణంగానే ఉంటుంది. రాజ్యం నుండి బయటకు వచ్చిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్ర మహర్షి తనకు దానంగా ఇచ్చిన సొమ్ము నీవద్దనే ఉంది, కావునా అది నీకు రుణమే ఆ ఋణం తీర్చుకో అని చెబుతారు. అందుకు హరిశ్చంద్రుడు నెలరోజులు గడువు కోరతారు. అయితే ఆ రుణనిమిత్తం అయోధ్య రాజ్యంలో కానీ, అయోధ్య సామంత రాజ్యాలలో కానీ సంపాదన చేయకూడదని విశ్వామిత్ర మహర్షి అజ్నపిస్తారు హరిశ్చంద్రుడిని.

అడవుల బారిన పడిన హరిశ్చంద్రుడిని అతని భార్య పిల్లలు అనుసరిస్తారు, అలాగే రుణ వసూలు కోసం నక్షత్రకుడు హరిశ్చంద్రుడుని అనుసరిస్తారు. అయితే అడవులలో కూడా నక్షత్రకుడు ప్రవర్తనకు తోడూ, వశిష్టుడుగా మారువేషంలో ఒక రాక్షసుడు వచ్చి, విశ్వామిత్ర మహర్షి మోసం నాకు తెలుసు నేను అతన్ని అంతం చేస్తాని, నీవు నీ రాజ్యాన్ని దక్కించుకో అని చెబుతాడు. దానికి సత్యహరిశ్చంద్రుడు దానం చేసిన రాజ్యాన్ని నేను పొందగోరను, అని బదులు చెబుతాడు. తరువాత దావాగ్ని దహించుకుంటూ అడవినలువైపులా నుండి హరిశ్చంద్రుడివైపు వస్తూ ఉంటుంది. NTR Satya Harishchandra Full Story Telugu Movie

అలా వస్తున్న అగ్నిదేవుడు నక్షత్రకుడుతో మీ నిజమైన పేర్లు మీవి కావు అని చెప్పినా మీకు ప్రమాదం ఉండదని చెపుతాడు. ఆ విషయం హరిశ్చంద్రుడుకి చెప్పి, తానూ బ్రహ్మర్షి విశ్వామిత్రుని శిష్యుడుని కాదు నాపేరు నక్షత్రకుడు కాదు అని చెప్పి, అగ్నిలోకి వెళ్లి, క్షేమంగా వచ్చేస్తాడు. అలా వెళ్లి వచ్చి హరిశ్చంద్రుడుని, అతని భార్య చంద్రమతిదేవిని కూడా ఆ పని చేయమంటాడు. పేర్లు తమవి కావు అని అనడమంటే అసత్యమే అవుతుంది. ఆ పని నేనుచేయననే చెబుతారు(కేవలమ పేరు తనది కాదు తాత్కాలికంగా నేను నేను కాదు అని చెప్పినా అసత్యదోషమే అవుతుంది అని భావించిన హరిశ్చంద్రుడు, వారి భార్య పిల్లలు). తరువాత చంద్రమతి దేవి ప్రార్ధనతో అగ్నిదేవుడు శాంతించి వెనుతిరుగుతాడు.

కాశీ పట్టణంలో భార్యా విక్రయం

ఇక అక్కడి నుండి బయలుదేరిన వారు కాశి పట్టణం చేరుకుంటారు. కాశి పట్టణంలో శ్రీమంతుల కొరకు దాసిలను విక్రయించే స్థలం ఉంటుంది. ఋణం చెల్లించవలసిన గడువు నేటితో తీరిపోతుంది అని అన్న నక్షత్రకుడు మాటలతో, హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి దేవి, తనను విక్రయించి ఆ ఋషి ఋణం గడువులోపు తీర్చేయండి అని సలహా హరిశ్చంద్రుడుకి సలహా ఇస్తుంది. అందుకు హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మలేను, నేనే దాసిగా అమ్ముడయ్యి, ఆ ఋణం తీర్చేస్తాను అని చెబుతాడు. అయితే అమ్మకంలో రుణానికి సరిపడా సొమ్ములు రాకపోతే, నీవు ఋణగ్రస్తుడుగానే మిగిలిపోతావు అని నక్షత్రకుడి మాటలకూ, హరిశ్చంద్రుడు అచేతనావస్థలో ఉంటారు. అప్పుడు చంద్రమతి దేవి తననే విక్రయించి, ఆ ఋణం తీర్చేయమని హరిశ్చంద్ర మహారాజుకి చెబుతుంది. గత్యంతరం లేని హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మడానకి కాశి పట్టణంలో అయిష్టంగా సిద్దపడతాడు.

కాల కౌశికుడు కాశిపట్టణంలో గయ్యాళి భార్య భాదలకు లోనవుతూ తద్దినాలకు వెళుతూ ఉంటాడు. అలాంటి కాలకౌశికుడుకి తోడుగా జడబట్టు ఉంటూ ఉంటాడు. తద్దిన భోజనానికి వెళ్ళిన కాల కౌశికుడు వేషంలో పరమశివుడే వచ్చి కాశిపట్టణ దాసీ విక్రయ స్థలానికి వచ్చి చంద్రమతి దేవిని కాలకౌశికుడుకి దాసిగా నక్షత్రకుడు అడిగిన రుణసొమ్మును చెల్లించి, చంద్రమతి దేవిని కాల కౌశికుడు ఇంటికి చేరుస్తాడు. దాసిగా అమ్ముడైన చంద్రమతిదేవితోనే వారి కుమారుడు లోహితాస్వుడు వెళతాడు. విశ్వామిత్ర మహర్షి ఋణం తీర్చుకున్న సత్యహరిశ్చంద్రుడుకి ఇంకో ఆపద్ధర్మ ఋణం వచ్చి పడుతుంది. ఇన్నాళ్ళు హరిశ్చంద్రుడు వెనుక తిరిగిన నక్షత్రకుడుకి బత్యం బకాయి పడతాడు, హరిశ్చంద్రుడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

నక్షత్రకుడి జీతం చెల్లించడానికి తనని అమ్మకానికి పెట్టమని హరిశ్చంద్రుడు నక్షత్రకుడుని కోరతాడు, అప్పుడు నక్షత్రకుడు కాశిపట్టణంలో సత్యహరిశ్చంద్రుడుని ఒక కాటికాపరి వీరబాహుకి అమ్మి వచ్చిన సొమ్ముతో వెనుతిరుగుతాడు. బానిసగా అమ్ముడుపోయిన హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేస్తూ ఉంటాడు. కాటికాపరి వీరబాహు చెప్పినట్టు, శవదహనానికి తగిన ధాన్యము, ధనము తీసుకుని ఆ పని చేస్తూ ఉంటారు, సత్యహరిశ్చంద్ర రాజర్షి.

కాటిదాకా వెళ్లిన విశ్వామిత్ర పరీక్ష

బానిసగా కాలకౌశికుడు ఇంట్లో పనిచేస్తున్న చంద్రమతి, లోహితాస్వులను, గయ్యాళి కాలకౌశికుడు భార్య భాదలు పెడుతూ ఉంటుంది. అందులో భాగంగా లోహితాస్వుడుని దర్బలకోసం కాలకౌశికుడు శిష్యులతో అడవికి పంపుతుంది, కాలకౌశికుడు భార్య, అక్కడ అడవిలో మాయసర్పం కాటుతో లోహితాస్వుడు మరణిస్తాడు. విషయం తెలిసిన చంద్రమతి దేవి లోహితాస్వుడు దగ్గరికి వెళ్లి విలపించి, కుమారుడి శవాన్ని పట్టుకుని కాటికి వెళుతుంది. కాని అక్కడ కాటికాపరి అయిన హరిశ్చంద్రుడు, శవదహన సొమ్ము చెల్లించనదే శవాన్ని కాల్చడానికి వీలులేదని అడ్డుకుంటాడు. భర్తని గుర్తుపట్టిన చంద్రమతిదేవి భర్త అసత్యదోషమేర్పడకుండా ఉండడానికి శవాదహన రుసుం తన యజమాని దగ్గర నుండి తీసుకువస్తానని మరలా కాలకౌశికుడు ఇంటికి బయలుదేరుతుంది.

అయితే విశ్వామిత్ర సృష్టిలో భాగంగా మాయ దొంగ, కాశి రాజు యొక్క కుమారుడుని చంద్రమతి వేషంలో ఎత్తుకొచ్చి అడవిలో వదిలి వెళ్ళిపోతారు. కాలకౌశికుడు ఇంటికి వెళ్తున్న చంద్రమతి దేవికి దారిలో పసిబిడ్డ ఏడుపు వినిపించి, ఆ పసిబిడ్డదగ్గరకి వెళుతుంది, అప్పటికే ఆ బిడ్డడు మరణించి ఉంటాడు. మాయదొంగని వెంబడించిన కాశి రాజు సైనికులు చంద్రమతిదేవిని బంధించి, కాశి రాజుదగ్గర నిలబెడతారు. బిడ్డ ఆమెవలననే మరణించింది అని భావించిన కాశి రాజు చంద్రమతిదేవికి మరణదండన విధిస్తాడు. ఆ మరణదండనను అమలు చేయవలసినదిగా వీరబాహుకి అప్పజేపితే, ఆపనిని వీరబాహు హరిశ్చంద్రుడుకి అప్పజేప్పుతాడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

కాటికాపరి వృత్తిరిత్యా హరిశ్చంద్రుడు తనభార్యని చంద్రమతిని వీరబాహు ఆదేశానుసారం హతం చేయడానికి సిద్దపడతాడు. అయితే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి వారించిన వినకుండా భార్య శిరస్సుని హరిశ్చంద్రుడు ఖండించబోతాడు. విశ్వామిత్రుడు ఓటమిని అంగీకరించినా చంద్రమతి శిరస్సుని ఖండించాబోయిన ఖడ్గం పూలమాలగా చంద్రమతిదేవి మెడలో ప్రత్యక్ష్యం అవుతుంది. పరమశివుడు, ప్రత్యక్షమై సత్యహరిశ్చంద్రుడు కుమారుడిని, కాశిరాజు కుమారుడుని బ్రతికిస్తాడు. బ్రహ్మశ్రీ విశ్వామిత్రుల వారు తన ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటారు. సత్యహరిశ్చంద్ర మహారాజు పరమశివ ప్రార్ధనతో “NTR Satya Harishchandra Full Story Telugu Movie” చిత్రం ముగుస్తుంది.

తెలుగు రీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

Jr.NTR తెలుగు సినిమాలు

బాలనటుడుగా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర లో కనిపించి, బాలనటుడుగా ఉన్నప్పుడే ప్రధాన పాత్రలో రామాయణం తెలుగుసినిమాలో నటించి, నిన్ను చూడాలని చిత్రంలో యువ కధానాయకుడుగా వచ్చి స్టూడెంట్ నెం.1 తెలుగుమూవీతో అందరిని ఆకట్టుకుని, సుబ్బు తెలుగుచిత్రం తర్వాత ఆది, అల్లరి రాముడు నాగ తెలుగుసినిమాల్లో నటించి, సింహాద్రి తెలుగుచిత్రంతో సంచలనం సృష్టించి, ఆంధ్రవాల అంటూ సాంబ నాఅల్లుడు, నరసింహుడు, అశోక్ తెలుగు చిత్రాలతో అందరిని అలరించారు. రాఖి, యమదొంగ, కంత్రి, అదుర్స్ అంటూ బృందావనంలో శక్తిగా ఊసరవెల్లిలో దమ్ము చూపించి బాక్స్ఆఫీసు బాద్ షాగా అనిపించుకున్నారు. రామయ్య వస్తావయ్యగా రభస చేసి టెంపర్ గా నాన్నకు ప్రేమతో అంటూ జనతా గారేజ్ అన్న ఎన్టిఆర్ జైలవకుశ తెలుగు మూవీలో విబిన్న పాత్రల్లో కనిపించరు. అరవింద సమేత వీర రాఘవగా వచ్చి, ఎన్టిఆర్ రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు.

బాలనటుడుగా ఉన్నప్పుడే ప్రధాన పాత్రలో రాముడుగా కనిపించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టిఆర్ నిన్ను చూడాలని చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు. Jr. NTR first movie is Ninnu Choodalani as a hero. కాని స్టూడెంట్ నెం.1 చిత్రంలో స్టూడెంట్ పాత్రలో చక్కగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్ అయితే ప్రపంచ ప్రసిద్ది పొందిన రాజమౌళి మొదటి తెలుగుమూవీ స్టూడెంట్ నెం.1 కావడం విశేషం.

సుబ్బు తెలుగుమూవీలో కూడా స్టూడెంట్ పాత్రలో కాలేజీ బ్యాక్ డ్రాప్ తెలుగుచిత్రంలో నటించిన ఎన్టిఆర్ ఆది తెలుగుచిత్రంతో అందరి దృష్టి బాగా ఆకర్షించారు. ఆది చిత్రంలో స్టూడెంట్ పాత్రలో కనిపించిన ఫ్యాక్షన్ కధలో వీరోచితమైన హీరోగా ఆకట్టుకున్నారు. అమ్మతోడూ అడ్డంగా నరికేస్తాను అనే డైలాగ్ ప్రచారం పొందితే, చిరంజీవితో ఠాగూర్ హిట్ చిత్రం తీసిన అగ్రదర్శకుడు వివి వినాయక తొలి తెలుగుసినిమా ఆది కావడం విశేషం.

రాజమౌళి దర్శకత్వంలో మూడు మూవీల్లో నటించిన ఎన్టిఆర్ స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ

అల్లరి రాముడు తెలుగుచిత్రంలో అంచనాలు అందుకోని నాగ సింహాద్రి తెలుగు చిత్రంతో సంచలనమే సృష్టించారు. అప్పటికి అప్పటివరకు ఉన్న బాక్సాఫీసు రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. దర్శకుడు రాజమౌళికి రెండవ మూవీగా ఎన్టిఆర్ కెరీర్ కష్టకాలంలో సూపర్ హిట్ తెలుగు చిత్రంగా సింహాద్రి నిలవడం విశేషం.

అటు తర్వాత అందరిలో అంచనాలు పెంచిన ఆంధ్రావాల అంచనాలను అందుకోలేకపొతే, సాంబ తెలుగుచిత్రంతో సరిపెట్టుకుని నా అల్లుడుగా నరసింహుడుగా నటించిన ఎన్టిఆర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖి తెలుగుచిత్రంలో నటనతో ప్రేక్షకులని మెప్పించారు. తెలుగింటి ఆడపడచులకు అన్నగా, ఆడువారిపై దాడులు చేసే వారిపై ఎదురుదాడి చేసే సందేశాత్మక పాత్రను పోషించారు.

రాజమౌళి యమదొంగ తెలుగుచిత్రంలో యమయమగా యముడితో పోటి పడి విజయవంతం అయ్యారు. ఈ తెలుగుచిత్రం పోషియో ఫాంటసీ టైపులో యమలోకం బ్యాక్ డ్రాప్లో అందరిని ఆకట్టుకుంటుంది. కంత్రిలో కనిపించి అదుర్స్ తెలుగుచిత్రంతో అందరితో అదుర్స్ అనిపించుకున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన తెలుగుచిత్రం కామెడీగా ఉండి, అందరిని అలరించింది.

బృందావనం కుటుంబ కధా చిత్రంలో నటించి మెప్పించిన ఎన్టిఆర్ ఊసరవెల్లి చిత్రంలో చాలా చక్కగా నటించారు. తరువాత వచ్చిన దమ్ము చిత్రం మంచి టైటిల్ చిత్రంగా మిగిలింది. రామయ్య వస్తావయ్య అంటూ రభస చేసినా టెంపర్ చిత్రాన్ని బాగా ఆదరించారు. టెంపర్ తెలుగుచిత్రంలో కేవలం డబ్బే ప్రధానమని భావించిన పోలీసు, మనిషి చుట్టూ మంచివారు ఉంటే, ఆ మనిషి ఎలా మంచిమనిషి గా మారిపోతారు అనే మాటకు అర్ధం వచ్చేలా నటించారు.

రాఖి, టెంపర్ తెలుగుచిత్రాలలో మంచి అన్నగా గుర్తింపు పొందిన ఎన్టిఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంతో మంచి కొడుకుగా మంచి మార్కులు సాధించారు. తండ్రి కధ విని, దానిని కధగా కొట్టిపారవేయకుండా సాధించి చూపే యువకుడు పాత్రలో ఎన్టిఆర్ నటన అద్బుతంగా ఉంటుంది. ఒక కుటుంబం మంచి మార్గాన్నే ఎంచుకుని ఉంటే వారసులు కూడా సదరు మంచి గుణాలు పుణికి పుచ్చుకుంటారు అనే మాట మాదిరి జనతా గారేజ్ తెలుగుచిత్రం ఉంటుంది. సమాజానికి సేవ చేయడంలో వెనకడుగు వేయని కుటుంబ కధ జనతా గారేజ్ చిత్రం.

జై లవకుశ చిత్రంలో మూడు పాత్రల్లో విబిన్నంగా నటించిన ఎన్టిఆర్ ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో మల్టి స్టారర్ సినిమాలో నటిస్తున్నారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

అల్లుఅర్జున్ అందరూ మెచ్చే మెగాహీరో – తెలుగురీడ్స్

అల వైకుంఠాపురంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్

మనకున్న మోస్ట్ పాపులర్ హీరోలలో అల్లు అర్జున్ అంటే అందరికి ఇష్టం, అల్లు అర్జున్ అభినయం, డాన్స్ అంటే ఎవరైనా మెచ్చుతారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన మోస్ట్ టాలెంటెడ్ మెగా హీరో మన అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ నటించిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం తెలుగురీడ్స్...చదవండి.

అయితే కొత్తగా నిర్మితమవుతున్న అల్లు అర్జున్ సినిమా గురించి మొదటిగా చూసి, తర్వాత పూర్వపు చిత్రాల గురించి క్లుప్తంగా.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి , జులాయి సినిమాలు రాగా, ఇప్పుడు వీరి కాంబినేషన్లో అల వైకుంఠపురములో రాబోతుంది. ఈ చిత్రంలో ఇంకా పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తుండగా, టబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

తెలుగు చలనచిత్రాలు. విజేత, స్వాతిముత్యం చిత్రాల్లో బాలనటుడిగా తెలుగు తెరపై కనిపించిన అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి డాడి చిత్రంలో డాన్సర్ గా కనిపించారు. గంగోత్రి చిత్రంతో హీరోగా తెలుగుతెరపై కనిపించి, మా అవార్డుగా ఉత్తమ నూతన నటుడు గెలుచుకున్నారు. అటు తరువాత అనుమెహతాతో వన్ సైడ్ లవర్ గా ఆర్యగా అల్లరి చేసి అందర్నీ అలరించిన బన్ని, తరువాత బన్నిగా గౌరీ ముంజల్ జోడీగా సూపర్ హిట్ అందుకున్నారు. అల్లు అర్జున్ ఆర్య చిత్రానికి నంది స్పెషల్ జ్యూరి పురష్కారం గెలుచుకున్నారు.

జెనిలియా డిసౌజాతో హ్యాపీగా వెండితెరపై డాన్సులు వేసిన అల్లు అర్జున్ సన్యాసినితో ప్రేమాయణం సాగించి దేశముదురుగా గుర్తింపు పొందారు. ఈ చిత్రానికి బన్నీకి ఉత్తమనటుడుగా ఫిలిం ఫేర్ పురష్కారం లభించింది. దేశముదురు చిత్రంతో క్యూట్ నటిగా గుర్తింపు పొందిన నటి హన్సిక మోత్వాని. అతిథి పాత్రలో శంకర్ దాదా జిందాబాదు చిత్రంలో కనిపించిన బన్నీ. తరువాత అల్లు అర్జున్ షీలాతో జతకట్టి పరుగుపెట్టి ఆర్య2, వరుడు, వేదం బద్రీనాథ్ జులాయి ఇద్దరమ్మాయలతో రేసుగుర్రంతో ఎవడు సన్ అఫ్ సత్యమూర్తికి రుద్రమదేవికి సరైనోడుగా దువ్వాడ జగన్నాధంతో నాపేరు సూర్య నాఇల్లు ఇండియా దాకా వచ్చారు.

అల్లు అర్జున్ (Allu Arjun) మూవీస్ వినోదంతో బాటు సందేశాత్మ చిత్రాలుగా కూడా ఉంటాయి. గంగోత్రి మూవీ మ్యూజికల్ హిట్ అయితే, ఆర్య ప్రేమిస్తూ ప్రేమించబడడం లేదనే వారికి ఓదార్పు సందేశంగా వన్ సైడ్ లవర్ల కోసమా అన్నట్టు ఉంటుంది. అలాగే అల్లుఅర్జున్ చిత్రాలలో నటనపరంగా చిన్న చిన్న పాత్రలు కూడా ఉన్నాయి. రుద్రమదేవిలో చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్ర, వేదం చిత్రంలో ఒక పేదప్రేమికుడుగా అందరిని అలరిస్తే, ఆర్య2 చిత్రంలో అల్లు అర్జున్ నటన ఆకట్టుకుంటుంది. ఎలాగైనా డబ్బే ప్రధానమని భావించే రోజులలో విలువలు గురించి మాట్లాడే యువకుడి పాత్రలో అల్లుఅర్జున్ నటించి మెప్పించారు. సన్ అఫ్ సత్యమూర్తి చిత్రంలో.

అల్లు అర్జున్ గంగోత్రి సినిమా మ్యూజికల్ హిట్ అయితే ఆర్య చిత్రంతో యువతలో క్రేజ్ పెరిగింది. ఒక ప్రేమకధని విబిన్న రీతిలో చెప్పిన దర్శకుడు సుకుమార్. సున్నితమైన మనసు కలిగిన అమ్మాయితో ప్రేమించకపోతే చస్తాను అన్నా యువకుడిని సహజంగా ఆమె ఒప్పుకుంటుంది. అటువంటి బెదిరింపు ప్రేమ నిజమైనది కాదు అనే అంశంగా ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కధగా చూపుతుంది. పాటలు బన్ని నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

Allu Arjun Telugu Movies అల్లు అర్జున్ హ్యాపీ, దేశముదురు, పరుగు చిత్రాలు

సమాజంలో ప్రజాసేవ చేసేవారు ఉంటే వారిని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. అటువంటి తీరులోనే బన్ని చిత్రం ఉంటుంది. రంగరాజు భూపతిరాజు పోలవరం ప్రాజెక్ట్ కోసం తన ఆస్తిని త్యాగం చేస్తాడు, అయితే అతని వెనుకనే ఉంటూ సోమరాజు మైసమ్మ సహాయంతో రంగరాజు భూపతిరాజుని హతమార్చి, ఆస్తిని హస్తగతం చేసుకుంటాడు. ఆ రంగరాజు భూపతిరాజు కొడుకే బన్ని. తన తండ్రి ఆశయం నెరవేర్చడానికి ప్రయత్నించి సఫలికృతుడౌతాడు.

చదువుకుని డాక్టర్ కావాలనే ఆశయంతో ఉండే మధుమతికి బన్ని పరిచయం ఆమె జీవితాన్నే మలుపు తిప్పుతుంది. తండ్రి చూసిన పెళ్లి చేస్తాను అంటే వద్దు చదువుకుంటాను అని చదువుని కొనసాగించే మధుమతి బన్నిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. లక్ష్యం మీద ధ్యాస ఉండే ఆమెకు, అమెపైనే ఆరాధన పెంచుకునే బన్నికి మధ్య జరిగిన కధే, హ్యాపీ చిత్రం ప్రేమకధా చిత్రం.

ప్రేమికుడుగా, మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ దేశముదురు చిత్రంతో ఏనార్జేటిక్ హీరోగా పాపులర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ బాడీతో డాన్సులు, ఫైట్లు, యాక్షన్ ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తుంది. కుటుంబ గొడవల్లో చిక్కుకున్న ఒక యువతి సన్యాసినిలతో కలిసి ఆశ్రమంలో ఉంటే, ఆ సన్యాసినిని చూసిన బన్నీ ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె వెంటపడడం, ఆమె వెనుక ఉన్న సమస్యకు కారణమైనవారిని తుదముట్టించి, ఆమెను పెళ్ళాడతాడు.

మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా సీక్వెల్ చిత్రాలల్లో రెండవది అయిన శంకర్ దాదా జిందాబాదులో అతిథి పాత్రలో అల్లుఅర్జున్ కనిపిస్తాడు. ఆ తరువాత పరుగు చిత్రంలో నటించాడు.  ఎప్పుడు పరుగులు పెడుతూ ఉండే యువకుడు ఒక ప్రేమజంటకు పెళ్లి చేస్తాడు, సదరు పెళ్ళికూతురు తరపువారు అతడిని తీసుకువెళ్ళి బందిస్తారు. అక్కడ ఒక అమ్మాయని ప్రేమిస్తాడు అతడు. ఆ కుర్రాడి వలన ఆ కుటుంబలో ఏర్పడిన పరిస్థితులకు, ఆ కుర్రాడు చెల్లించిన మూల్యం ఏమిటి ? అనేది చిత్ర కధాంశం  చివరికి ప్రేమ గెలుస్తుంది. ముందు  వెనుకలు చూడకుండా ఆకర్షితులయ్యే యువతని దృష్టిలో ఉంచుకుని తీసినట్టు ఈ చిత్రకధ వలన తెలుస్తుంది.

ఆర్య డైరెక్టర్ సుకుమార్ ఆర్యకి కొనసాగింపు చిత్రంగా ఆర్య2 చిత్రీకరించారు, అయితే కధ కొత్తది, పాత కధకి సంభందం లేకుండా ఉంటుంది. ఒక యువకుడిలో ఒకేసారి ప్రేమ మరియు స్నేహం కోసం పడే తపన ఈ చిత్రం కధాంశం. తాను ప్రేమించిన అమ్మాయినే స్నేహితుడు ప్రేమిస్తే, అతని కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి అవసరం అయితే ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ద పడే యువకుడి పాత్రలో అల్లుఅర్జున్ నటన హైలైట్ గా ఉంటుంది.

అల్లుఅర్జున్ వరుడు, వేదం, భాద్రినాథ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన తెలుగు మూవీస్ – చలనచిత్రాలు

లేచిపోయి గుళ్ళోనో రిజిస్ట్రార్ ఆఫీసులోనో పెళ్లిచేసుకునే కాలంలో పాత పద్దతిలో పెళ్లిని అయిదు రోజుల పండుగలా చేయమని తల్లిదండ్రులను కోరే కొడుకుగా అల్లు అర్జున్ వరుడు చిత్రంలో కనబడతారు. అంతేకాకుండా తాళి కట్టే సమయం వరకు పెళ్లి కూతురుని చూడకుండా ఆమె ఎలా ఉన్నా చేసుకోవడానికి సిద్దపడతాడు. పెళ్లి పండుగలాగా చేసే పద్దతిలో చిత్రం సాగుతుంది.

గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రధాన హీరో అయినా వేదం చిత్రంలో ఒక పరిమిత క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటించడమే కాకుండా, ఆ చిత్రం ప్రమోషన్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. ఒక బీద యువకుడు, ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనే భావించే పాత్రలో అల్లుఅర్జున్ నటించాడు.

బద్రినాథ్ గుడిని చూపిస్తూ, బద్రీనాథ్ చుట్టూ తిరిగే ప్రేమకధ బద్రీనాథ్ చిత్రం. ఇందులో అల్లు అర్జున్ బద్రీనాథ్ గురించి, వివరించే గైడ్ పాత్రలో కనిపించారు. పెళ్లి చేసుకోకుండా గుడిలో గురువుగారి దగ్గర జీవితాంతం ఉంటానని ప్రమాణం చేసిన యువకుడుగా అల్లుఅర్జున్ నటించారు.

కాలిగా తిరిగే యువకుడిని ఇంట్లో జులాయి అని అతని తండ్రి తిడుతూ ఉంటుంటే, ఉండబట్టలేక కొంత డబ్బు ఇవ్వండి సాయంత్రానికి నాలుగు రెట్లు ఎక్కువ చేసి చూపిస్తాను అంటాడు. డబ్బు తీసుకుని వెళ్ళిన యువకుడి జీవితమే మలుపు తిరుగుతుంది, ఒక అతిపెద్ద నేరంలో సాక్షిగా మారి, పోలీసుల పర్యవేక్షణలో నేరస్తుడిని పట్టుకోవడమే ధ్యేయంగా ఉండే యువకుడు పాత్రలో జులాయి చిత్రంలో అల్లుఅర్జున్ నటించారు.

ఒక అమ్మాయితో ప్రేమిస్తున్నట్టు ఉంటూ, తన అసలు ప్రేమ కధని తెలియజేస్తూ, ఆ ప్రేమ కధలో శత్రువులైన వారిని ఇప్పుడున్న అమ్మాయి ద్వారా పట్టుకుని శిక్షించడమే ధ్యేయంగా సాగే పాత్రలో అల్లుఅర్జున్ ఇద్దరమ్మాయలతో ప్రేమ కధ చిత్రంలో నటించారు.

పోలీసు ఆఫీసరుకి తమ్ముడుగా ఉంటూ, అల్లరి పనులు చేస్తూ, అన్నపై కోపాన్నే ప్రదర్శిస్తూ ఉండే తమ్ముడు పాత్రలో కనిపిస్తాడు. అయితే తన అన్నపై చేయబోయిన హత్యాప్రయత్నం తెలియగానే అన్న కోసం పోరాటం మొదలు పెడతాడు. రేసుగుర్రం చిత్రం యాక్షన్ కామెడీ ఎంటర్టైనరుగా ఉంటుంది.

ఎవడు చిత్రంలో కనిపించేది రామ్ చరణ్ అయినా ఆ కధకి మూలమైన పాత్ర అంతా అల్లు అర్జున్ నటించిన పాత్రదే. చావునుండి బ్రతికిన ఒక యువకుడు తన రూపం కోల్పోయి ఇంకో రూపాన్ని పొంది, తన చావుకోసం ప్రయత్నించిన వారిపై పగ తీర్చుకుంటాడు. చావుదాక వెళ్ళిన యువకుడి పాత్రలో అల్లు అర్జున్ నటించారు.

విలువలతో కూడిన ఆస్తులు అంతస్తుని గౌరవాన్ని పెంచుతాయి – సన్ అఫ్ సత్యమూర్తి

సన్ అఫ్ సత్యమూర్తి చిత్రం టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా అంతా తండ్రి సత్యమూర్తి గారి ఆలోచనతో జీవించే యువకుడి కధ. తన తండ్రికి చిన్న మాట కూడా రావడం ఇష్టంలేని సత్యమూర్తిగారి అబ్బాయిగా దానికోసం ఎంతటి రిస్క్ అయిన చేసే యువకుడిగా అల్లుఅర్జున్ నటించారు. విలువలే ఆస్తులు, విలువలేని ఆస్తి వ్యర్ధం అంటూ చిత్రం సాగుతుంది.

గమ్మునుండవోయ్ అనే మానరిజం బాగా అక్కట్టుకుంటుంది ఈ రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా ఒక పాత్రలో అల్లుఅర్జున్ నటన ఆకట్టుకుంటుంది.

సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ నటన చాలా ఎనర్జీటిక్ గా ఉంటుంది. విలన్ ఒక పవర్ ఫుల్ పాత్రలో ముఖ్యమంత్రి కొడుకుగా అక్రమాలు చేస్తుంటే, అతనిని అంతకన్నా డామినేట్ చేస్తూ ఉండే పాత్రలో అల్లుఅర్జున్ నటించారు. సరైనోడు టైటిల్ కి తగ్గ చిత్రంలో టైటిల్ కి తగ్గ పాత్రలో నటించిన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

ఒక బ్రాహ్మణ బాలుడుగా ఉన్నప్పుడు సమాజంలో ఎదురైనా సంఘటనలతో, సమాజంలో జరిగే చెడుని తొలగించాలి అని నిర్ణయించుకున్న బ్రాహ్మణ యువకుడు కధ. రహస్యంగా చెడు కార్యక్రమాలు చేసే వారిని శిక్షిస్తూ, వృత్తి రిత్యా పౌరోహిత్యం చేస్తూ ఉండే పాత్రలో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటించారు.

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మిలిటరీ అధికారి కధ. అదుపులేని కోపం కలిగిన యువకుడు సైన్యంలో చేరి, కోపం వలననే సైన్యం నుండి తొలగించబడడం. మరలా అతను సైన్యంలో చేరడానికి చేసే ప్రయత్నాలే ఈ చిత్ర కధాంశం.

చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు సమాచారం. ఇది షూటింగ్లో ఉన్న ప్రస్తుత చిత్రంగా ఉంది, 2019లో విడుదల కానుంది.

ఇవి ఇప్పటివరకు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన తెలుగు మూవీస్ – చలనచిత్రాలు

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ యాప్ డౌన్ లోడ్ చేయండి

సంసారం ఒక చదరంగం కుటుంబకధా తెలుగు చలనచిత్రం

సంసారం ఒక చదరంగం కుటుంబకధా తెలుగు చలనచిత్రం

సంసారం ఒక చదరంగం కుటుంబకధా తెలుగు చలనచిత్రం అంటే సాగరం ఈదడం లాంటిది అంటారు. ఇక మధ్యతరగతి సంసారం అయితే నడి సముద్రంలో దిక్కులు చూస్తున్నట్టే ఉంటుంది. మనదేశంలో మధ్యతరగతి జీవనమే ఎక్కువ.  అలాగే ఎక్కువగా వ్యాపార సేవా వ్యవహారాలు కూడా మధ్యతరగతి సమాజంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్యోగి అతనిపై నలుగురు ఆధారపడి ఉండడం, లేక ఇద్దరు కన్నా ఎక్కువమంది పనిచేసే కుటుంబమైతే పలురకాల సమస్యలు వస్తూ సంసార తీరం మీద బెంగలేకుండా చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త బెంగలు పుట్టిస్తూ.

కుటుంబ బాద్యతలను మోస్తూ చివరి దశలో ఉన్న మధ్యతరగతి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల భావనల చేత ప్రభావితమయ్యే కుటుంబం ఈ సంసారం ఒక చదరంగం చలనచిత్రం. గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, శరత్ బాబు, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్, ముచ్చెర్ల అరుణ తదితరులు నటించిన తెలుగు చలనచిత్రం. ప్రతిష్టాత్మకమైనా సంస్థ ఏవిఎం వారు ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో నిర్మించారు.

సంసారం ఒక చదరంగం కుటుంబ కధ

గోదావరి (అన్నపూర్ణ)- అప్పల నర్సయ్యల(గొల్లపూడి మారుతీరావు)ది మధ్యతరగతి కుటుంబం, వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు, పెద్ద కొడుకు ప్రకాష్ (శరత్ బాబు)ని బికాం చదివించారు, రెండవ కొడుకు రాఘవ(రాజేంద్ర ప్రసాద్)ని పనికి పంపించారు, చిన్న కొడుకు కాళిదాసు పది పరిక్షలు రాస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. పెద్ద కొడుక్కి భార్యగా ఉమా(సుహాసిని) వస్తే, కూతురు సరోజ(కల్పన)కి పెళ్లి సంభందాలు చూస్తూ ఉంటారు. ఆ ఇంటికి మొదటి నుండి ఉండే పనిమనిషి చిలకమ్మా(షావుకారుజానకి) ఉంటుంది.

కూతురు సరోజకి పెళ్లి సంభందం వస్తే అప్పటికప్పుడే ఆమె కాదని చెబుతుండగా, పెళ్లి చూపులకి వచ్చిన వారు వెళ్ళిపోతారు. తరువాత అప్పల నర్సయ్య ఆ పెళ్లి చూపులకు వచ్చిన వారింటికి వెళ్లి క్షమాపణ చెబుతాడు. పద్దతి నచ్చిన అతను అప్పల నర్సయ్య కొడుకికి తన కూతురు వసంతని చేసుకోవలసిందిగా కోరతాడు. అప్పల నర్సయ్య అంగికరించి ఇంటికి వచ్చేస్తాడు. అప్పలనర్సయ్యకు కూతురు సరోజ తన ప్రేమించిన పీటర్ గురించి చెబుతుంది. అలా కూతురు కొడుకు ఇద్దరి పెళ్ళిళ్ళు చేసేస్తాడు.

పెళ్ళిళ్ళు పూర్తయ్యాక అప్పలనర్సయ్య పెద్ద కోడలు పురిటికి పుట్టింటికి వెళుతుంది, ఆ సమయంలో కూతురు సరోజ భర్తతో తగవు పెట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది, రెండవ కోడలు కొడుకు రాఘవతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతుంది, రెండు సంఘటనలు ఒకేసారి జరుగుతాయి. అలాగే ఎప్పుడు జమా ఖర్చులు లెక్కలు వేసుకునే ప్రకాష్, తన భార్య ఉమా ఇప్పుడు పుట్టింట్లో ఉంది కాబట్టి, తనవాటా ఖర్చు కింద ఎప్పుడు ఇంట్లో ఖర్చుకు ఇచ్చే మొత్తంలో నుండి సగం తగ్గించి గోదావరికి ఇస్తాడు.

అందరూ 10 నెలలకె పుడితే నీవు పది నెలల పదమూడు రోజులు కడుపులోనే పెరిగావు, అప్పుడు నేను లెక్కలు చూడలేదే అని గోదావరి కొడుకు ప్రకాష్ తో అంటే, అందుకున్న అప్పల నర్సయ్యతో ప్రకాష్ వాదం పెంచుకుంటాడు. ప్రకాష్ మాటలకి విసిగిన అప్పల నర్సయ్య ఇంటినుండి వెళ్ళిపోమంటాడు. ప్రకాష్ తాను ఇంతకుముందు పెళ్ళిళ్ళకి ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లిస్తే వెంటనే వెళ్ళిపోతాను అంటాడు. ఆ సంఘటనతో నట్టింట్లో అడ్డుగా గీత గీసుకుని, పెద్ద కొడుకు తండ్రి విడిపోతారు.

పురిటికి పుట్టింటికి వెళ్ళిన ఉమా వచ్చేటప్పటికి ఇంటి పరిస్థితిని చూసి, భాదపడి ఆ ఇంట్లో సమస్యగా మారినా విషయాలపై దృష్టి సారించి సరి చేస్తుంది. చివరికి ఉమా-ప్రకాష్ దంపతులు తమ పిల్లవాడితో ఇల్లు వదిలి బయటికి అద్దెకు సభ్యతతో వెళతారు. అందరి నటన పాత్రలపరంగా చక్కగా ఉంటుంది. సకుటుంబ సమేతంగా చూడదగిన సాంఘిక చిత్రాల్లో సందేశంతో కూడిన చిత్రంగా ఆకట్టుకుంటుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

స్వాతంత్ర్య పోరాటా సమరయోధుల తెలుగు మూవీస్

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొని పరదేశస్తుల పాలనను ప్రారద్రోలారు. ఆ మహానుభావులు ఎంతమందో? చరిత్రకెక్కింది ఎంతమంది ? చరిత్ర విశేషాలే గణిస్తే కనుక చరితకు రాని మహానుభావులు ఎంతమందో వారిలో చరితకెక్కిన కొంతమందిని అన్నా స్వాతంత్ర్య దినోత్సవం ఆగష్టు 15 న తలచి జోహార్లు చెబుదాం.

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు: పరాయి పాలనలో వందల సంవత్సరాలు మగ్గిన భారతావనిని, భారతీయులు మొత్తంగా ఏకమై పరుల అధికారం నుండి దేశాన్ని స్వాతంత్ర్య దేశంగా సాధించుకోవడంలో ఎంతోమంది నాయకుల జీవితాల త్యాగం ఉంది. కొందరి జీవితం కాల్పుల్లో కలిసిపోతే, కొందరి జీవితం జైళ్లలో అంతరించి ఎంతోమంది దేశభక్తుల జీవితం పోరాటంలో పాల్గొని 90 సంవత్సరాల కాలం పోరాటం తరువాత స్వాతంత్ర్య భారతావని సాధించారు. 1857 – 1947 స్వాతంత్ర్య పోరాటం జరిగితే పోరాటంలో పోయిన ప్రాణత్యాగాల, ఎంతోమంది తమ జీవితాలను భరతమాత దాస్య సంకెళ్ళ విముక్తికై అర్పించిన దేశభక్తుల జీవిత త్యాగాల ఫలితం 1947 ఆగష్టు 15 తేది సంబరాలు.

మరుదనాయగం, వీరపాండ్య కట్టబొమ్మన్, మంగళ్ పాండే, నానసాహిబ్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్, బహదూర్ షా, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, టంగుటూరి ప్రకాశం, చంద్రశేఖర ఆజాద్, చిత్తరంజన్ దాస్, కొమరం భీం, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ కరం చంద్ గాంధి, జవహర్ లాల్ నెహ్రు, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాల లజపతి రాయ్ లాంటి ఎందఱో మహానుభావుల పోరాట ఫలితం నేటి మన స్వతంత్ర భారతదేశం.

పుస్తకాల ద్వారా స్వాతంత్ర్య పోరాటం, పోరాటంలో పాల్గొన్న నాయకుల గురించి పుస్తకాలలో చదువుకున్నాం, చదువుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లో అయితే మహానుభావుల గురించిన బయోగ్రఫీ మొబైల్ ఆప్స్ లభిస్తాయి. ఇంకా చలనచిత్ర రూపంలో కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల చరిత లభిస్తుంది. గతకాలపు చరిత్రలో కలిసి ఉన్న మన స్వాతంత్ర్య సమరయోధుల గురించి, స్వాతంత్ర్య దినోత్సవ రోజులలో గుర్తుచేసుకోవడానికి పుస్తకాల రూపంలో మొబైల్ ఆప్స్ రూపంలో సినిమాల రూపంలో యూట్యూబ్లో లభిస్తాయి.

స్వాతంత్ర్య సమరయోధుల నాయకుల చరిత చలనచిత్రాలు

భారతదేశపు స్వాతంత్ర్య పోరాటంలో తెలుగువారిలో ఆంధ్రకేసరి అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు వారలబ్బాయిగా చదువుకుని ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వరాజ్య పత్రికకు సంపాదకీయం చేసారు, 1922 స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా 30000 స్వచ్చందకులతో ప్రదర్శన నిర్వహించారు. మద్రాసులో సైమన్ కమిషన్ ఎదుట తుపాకీ కాల్పులకు రొమ్ము విరిచి నిలబడి ఆంధ్రకేసరిగా ప్రసిద్దికెక్కారు. ఆగష్టు 23, 1872లో జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు 1957 మే20న స్వర్గస్తులైనారు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు చిత్రం ఆంధ్రకేసరి. విజయచందర్ ఆంధ్రకేసరిగా నటించి, ఆ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించారు.

పాండ్యరాజైన జగ్విర్ మరణానంతరం పాంచల్ మకురుచ్చీ ప్రాంతానికి రాజు అయిన వీరపాండ్య కట్టబొమ్మన్ పూర్వికులు ఆంధ్రులు. దక్షిణాది నామమాత్రపు నవాబు అయిన ఆర్కాట్ నవాబు ఈస్టిండియా కంపెనీకి తన అధీన రాజ్యాలపై కప్పం వసూలు చేసే ప్రక్రియని అప్పగిస్తాడు. అయితే కప్పం వసూలు చేసే నెపంతో స్థానిక రాజ్యాలను ఆక్రమించుకునే క్రమంలో ఉన్న ఈస్టిండియా కట్టబొమ్మన్ కప్పం కట్టకుండా ఎదురిస్తాడు. కప్పం వెంటనే కట్టకపోయిన పరవాలేదు, కట్టడానికి అంగీకరిస్తే చాలు అనే రాయబారాన్ని కూడా అంగీకరించడు. తొమ్మిదేళ్లుగా కట్టబొమ్మన్ ఏమిచేయలేకపోయిన ఈస్టిండియా కంపెనీ పాంచల్ మరుకుచ్చీపై యుద్దానికి వస్తారు. భారీ సైనిక దళంతో ఉన్న బ్రిటిష్ వారే యుద్దంలో పైచేయి సాధిస్తారు, కానీ కట్టబొమ్మన్ శత్రువుకు పట్టుబడకుండా తప్పించుకుంటాడు. అయితే మరలా ఇతర రాజులతో కలిసి యుద్ధం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న కట్టబొమ్మన్ ని పుదుక్కోట్టాయ్ జమిందారు తొండైమాన్ వంచనతో తన కోటకి ఆహ్వానిస్తాడు. అది పసిగట్టలేకపోయినా కట్టబొమ్మన్ బ్రిటిష్ వారికి బందీగా పట్టుబడతాడు. ఉరితీసే సమయంలో భరతమాతని తలుచుకుని ఉరితాడు తనకి తానే తగిలించుకుని ప్రాణత్యాగం చేస్తాడు. ఈవీరుని చరిత చలనచిత్రంగా వీరపాండ్య కట్టబ్రహ్మనగా తెలుగులోకి డబ్ చేయబడి ప్రేక్షకాదరణ పొందింది. బి.ఆర్. పంతులు నిర్మాణ దర్శకత్వంలో శివాజీ గణేషన్, ఎస్ వరలక్ష్మి, జెమిని గణేషన్ తదితరులు నటించారు.

1827 సంవత్సరం, జులై 19న జన్మించిన మంగళ్ పాండే 1857 సిపాయి తిరుగుబాటుకి ముందు బ్రిటిష్ వారిని ఎదిరించిన దేశభక్తుడు. సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసి తయారుచేసిన తూటాలను ఇచ్చి ఉపయోగించమన్న బ్రిటిష్ అధికారిని కాల్చి చంపి బ్రిటిష్ వారిని ఎదిరించిన తొలి భారతీయుడుగా చరిత్రకెక్కారు. 1857 సిపాయి తిరుగుబాటుకి మంగళ్ పాండే కలకత్తా దగ్గర బరాక్ పూర్ వద్ద 1857 మార్చి 29న బ్రిటిష్ వారికి ఎదురుతిరిగిన సంఘటన ప్రేరణగా చరిత్రకెక్కింది. ఈస్టిండియా కంపెనీ బెంగాల్ రెజిమెంట్ నందు సిపాయిగా ఉన్న మంగళ్ పాండే దాదాపు రెండు వందల ఏళ్ల తరబడి ఏలుతున్న పాలనకు ఎదురొడ్డి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన వీరుడుగా, స్వాతంత్ర్య సమరానికి ఆద్యుడుగా నిలిచాడు. ఈ దేశభక్తుడుపై చలనచిత్రం హిందీ భాషలో మంగళ్ పాండే ది రైజింగ్ పేరుతో ఉంది. కేతన్ మెహతా దర్శకత్వంలో అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ, అమీషా పటేల్ తదితరులు నటించారు.

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

ఒక స్వాతంత్ర్య సమరయోదుడుపై ఎక్కువ చలనచిత్రాలు ఉన్నది బహుశా భగత్ సింగ్ ఒకరే అయ్యివుంటారు. భగత్ సింగ్ 22 సెప్టెంబర్ 1907 సంవత్సరంలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమిలిస్తుంది అంటారు, అలా భగత్ సింగ్ చిన్ననాడే తండ్రికి చెప్పిన సమాధానంతో నిజమనిపిస్తుంది. కిషన్ సింగ్ భగత్ సింగ్ తో తోటకి వెళ్తే అక్కడ పొలంలో అడుకుంటూ గడ్డి పరకలను నాటుతుంటే, తండ్రి ఏమిటని ప్రశిస్తే బాల భగత్ సింగ్ నోట వచ్చిన మాట తుపాకులు నాటుతున్నాని. అలాంటి భగత్ సింగ్ 13 ఏళ్ల వయసులో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమంతో ప్రభావితుడై బ్రిటిష్ ప్రభుత్వ పాఠశాల పాఠ్యపుస్తకాలు, వారి దిగుమతి దుస్తులు తగులబెడతాడు, అయితే అహింసావాదం ఉపయోగం ఉండదని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్ హింసాత్మక ఉద్యమం ఉదృతం చేస్తాడు. లాలాలజపతి రాయ్ హత్య నేపద్యంలో బ్రిటిష్ పోలీసు అధికారిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. భగత్ సింగ్ విప్లవ స్పూర్తిగా నిలిచిన భగత్ సింగ్ ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. భగత్ సింగ్ పై 1954లో షహీద్ ఎ-ఆజాద్ భగత్ సింగ్, 1963లో షహీద్ భగత్ సింగ్, 1965లో షహీద్ బాలీవుడ్లో చిత్రాలు వచ్చాయి. 2002 లో మూడు హిందీచిత్రాలు భగత్ సింగ్ ప్రేరణతో వచ్చాయి షహీద్ ఎ అజం, 23 మార్చ్ 1931 షహీద్, ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్. 2006లో భగత్ సింగ్ కాలం నాటి రోజుల నేపద్యంలో రంగ్ దే బసంతి విప్లవాత్మక చిత్రంగా ఉంది. 2008లో ఇంక్విలాబ్ 40నిమిషాల డాక్యుమెంటరీ చిత్రం ఉంది.

అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలకు నాయకత్వం వహించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి స్వాతంత్య్ర సమరయోధుడు. సాటి స్వాతంత్ర్య సమరయోధుల మాదిరి అతను ఉరితీయబడకుండానే అల్లూరి సీతారామరాజుని విచారణ లేకుండా కాల్చి చంపారు అంటే, ఆ ప్రభుత్వం ఎంత భయపడి ఉంటే ఆ పని చేస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయపెట్టించిన అల్లూరి సీతారామరాజు జననం 1897 జులై 4 వ తేది అయితే మరణం 7వ తేది మే 1924 సంవత్సరం. అయితే ఒక బుర్రకధలో సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ ! వీరుడు మరణించడు, విప్లవానికి పరాజయం లేదు అని అన్నారంటే అల్లూరి సీతారామ రాజు విప్లవ స్పూర్తి ఎంతమంది భారతీయులలో ప్రేరణగా ఉండి ఉంటుంది. మన్యం ప్రాంతంలో ఆటవికులపై అమానుష చర్యలకు పాల్పడే బ్రిటిష్ ప్రభుత్వానికి అల్లూరి సీతారామరాజు ఎదురు తిరిగి, మన్యం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఈ స్వాతంత్ర్య సమరయోధుడిపై అల్లూరి సీతారామరాజు పేరుతో తెలుగు చలన చిత్రం ఉంది. వి రామచంద్రరావు, కెఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల, కొంగరజగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు, చంద్రమోహన్, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, త్యాగరాజు, కెవి చలం, మంజుల, రాజశ్రీ, జయంతి తదితరులు నటించారు.

మహాత్మా గాంధి జీవిత చలన చిత్రాలు

మహాత్మాగాంధి స్వాతంత్ర్యాన్ని శాంతిమార్గంలో సాధించాలని యోచించి, అనేక చోట్ల వేర్వేరుగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటాలలో ఐక్యతను సాధించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పంపించిన మహానుభావుడుగా జాతిపితగా భారతజాతి హృదయంలో నిలిచారు. భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్, అల్లూరి సీతారామరాజు వంటివారు సాయుధ పోరాటంలో సాధించలేని స్వాతంత్ర్య నిరాయుధ అహింసా మార్గంలో సాధించినవారిగా ఖ్యాతిగాంచారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఎలాంటి పదవి స్వీకరించకుండ ఉన్నారు, చివరికి నాదురాం గాడ్సే చేత కాల్చబడి చనిపోయారు. మహాత్మా గాంధీజీ జీవితం ఆధారంగా స్వాతంత్ర్య పోరాట చరిత నేపధ్యంలో గాంధీ టైటిల్ తో ఆంగ్ల చిత్రం ఉండడం విశేషం అలాగే ఆ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఆంగ్ల నటులతో ఆంగ్లంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. అలాగే గాంధి భావాలతో, గాంధి చరిత్ర ఆధారంగా హిందీ చిత్రాలు కూడా ఉంటే, తెలుగులో మాత్రం గాంధి ఆదర్శాలకి ప్రభావితమయ్యే ఒక గుండా కధ శంకర్ దాదా జిందాబాద్ చలనచిత్రం ఉంది. ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మాకోటక్, షియాజీ షిండే, సదా, పవన్ కళ్యాణ్ తదితరులు నటించారు. ఇవి స్వాతంత్ర్య సమరయోధుల నాయకుల చరిత చలనచిత్రాలు

ఆగష్టు15 పరతంత్ర పాలనా నుండి విముక్తి పొందిన దినం మన స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన నాయకుల జీవితాల త్యాగ ఫలితం. ఇంటి కష్టాలు చూసి చదువు మానేసి పనిచేసి సంపాదించి కుటుంబ భాద్యతని నెత్తిన వేసుకున్న యువకుడి మాదిరి భారతమాత దాస్య పాలనను చూసి జీవితాలని పణంగా పెట్టి పోరాడిన మహానుభావుల కృషి ఫలితం ఆగష్టు15 దినోత్సవం. ఒక విప్లవం పుట్టాలంటే ఎదో ఒక సంఘటన నాంది కావాలి, అటువంటి సంఘటనలలో ఎంతోమంది అప్పటికి బలై ఉంటారు. ఒక బలమైన అరాచాకత్వాన్ని ఎదురించాలంటే ఎన్ని బలమైన సంఘటనలు జరిగితే ఎంతమంది ప్రాణత్యాగాలు జరిగితే మొదలవుతుంది. విప్లవం నడవాలంటే శక్తివంతమైన నాయకుడు అవసరం, దేశంలో అనేక చోట్ల విప్లవాలు వేర్వేరుగా జరిగాయంటే ఎంతమంది నాయకులు నాయకత్వం వహించాలి. చరిత్రకి తెలిసేది విశేషం అయితే ఆ విశేషాన్ని అందించే జీవితాలు ఎన్ని ఉండి, ఉంటాయి. అలా జీవిత ప్రాణ త్యాగాలను చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులందరికీ జోహార్లు చెబుతూ జైహింద్.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు.

మహేశ్ బాబు-త్రివిక్రమ్ ల అతడు తెలుగు చలనచిత్రం.png

బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు. సాదారణంగా టైటిల్ తగ్గ చిత్రంగా కొన్ని ప్రసిద్ద టైటిల్స్ విషయంలో అంచనాలు తప్పవచ్చు, కాని అతడు విషయంలో అంచనాలు లేకుండా బిన్నమైన టైటిలుతో విడుదల అయ్యాక ఎక్కువకాలం గుర్తుకు ఉన్న చిత్రం అతడు. సహజత్వానికి దగ్గరగా ఎక్కువమంది ఆలోచనలతో సరిపోలే విధంగా ఉండేవి నిదానంగా అందరి ఆలోచనల్లో మెదులుతూ ఉంటాయి. అతడిని ఒకరు కాదంటే ఇంకొకరు ఒప్పుకున్నారు, ఆ తరువాత అందరు ఒప్పుకున్నారు.

ప్రతిపక్షంలో కూర్చున్న రాజకీయ పార్టీ నాయకుడు శివారెడ్డి రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల సానుభూతి అవసరమని గ్రహిస్తాడు. ప్రజల సానుభూతి అంటే మరణం నుండి తప్పించుకున్న వ్యక్తి సహజంగానే ఉంటుంది, అదే పార్టీ నాయకుడు అయితే, అతడిని ముఖ్యమంత్రి చేసేంతగా ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఆ క్రమంలో శివారెడ్డి (బులెట్ గాయం అవుతుంది, శివారెడ్డి చావకూడదు) పాల్గొనబోయే సమావేశంలో హత్యాప్రయత్నం జరిగేల పధకం రచిస్తారు, ఆ పార్టీ ఉపనాయకులు బాజిరెడ్డి తదితరులు. అందుకు నందు, మల్లి ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని పురమాయిస్తారు.

కాని సమావేశంలో పధకం ప్రకారం శివారెడ్డిని నందు కాల్చే లోపులోనే, శివారెడ్డి ఇంకొక బులెట్ తగిలి నిజంగానే చంపబడతాడు. విషయం గ్రహించిన నందు బిల్డింగ్ పై నుండి ట్రైనుపైకి దూకి, ట్రైను లోపలకి ప్రవేశిస్తాడు. పోలీసులు కూడా ఆ ట్రైనుని అనుసరిస్తారు. బాల్యంలో చేసిన పొరపాటుకు ఊరినుండి పారిపోయిన పార్ధు, చాన్నాళ్ళ తర్వాత తిరిగి ఇంటికి అదే రైలులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ట్రైనుపై నుండి లోపలికి వచ్చిన నందు పార్ధు ఎదురుగానే కూర్చుంటాడు. ట్రైను తరువాతి స్టేజికి చేరాక పోలీసులు జరిపిన కాల్పుల్లో నందు స్థానంలో పార్ధు మరణిస్తాడు. పార్ధు విషయాలు విన్న నందు పార్ధు ఇంటికి పార్ధుగా వెళ్తాడు.

తనవలననే ప్రాణాలు కోల్పోయిన అతడి కుటుంబంలోకి అతడు.

ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన అతడిని అందరు ఆదరిస్తారు వివరాలేమిటో అడగకుండానే అతడిని పార్ధుగా గుర్తిస్తారు. నేరం చేసి ట్రైనుపై దూకి పారిపోయిన అతడి కోసం కేసు సిబిఐకి వెళ్తుంది. పార్ధు స్నేహితులు, వచ్చి అతడిని కలిసి బాల్య విషయంలో బాల్యంలో అతడు చేసిన తప్పు ఏమిటో వివరిస్తారు. తన వల్లే చనిపోయిన పార్ధు కుటుంబానికి ఏదైనా సాయం చేయాలనీ భావించిన నందు, పార్ధు చిన్ననాడు చేసిన తప్పుకు బలైన మాస్టారుగారి అవసరం తీరుస్తాడు. అలాగే పార్ధు తాతగారి పొలం తగాదాని సరిచేస్తాడు. పార్ధు తాతగారి మనవరాలి పెళ్లిని తన ఖర్చుతో చేస్తాడు. పార్ధు మరదలు ప్రేమిస్తే, ఆమెను ప్రేమిస్తాడు. అలా అతడు పార్ధుగా మారిపోతాడు.బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు.

అయితే సిబిఐ అధికారి ఆంజనేయ ప్రసాద్ ఇన్వెస్ట్ గేట్ చేసి పార్ధు స్థానంలో నందు చలామణి అవుతున్నట్టు కనుక్కుంటాడు. పార్ధు కుటుంబానికి సహాయం అందించడంలో నందు పని పూర్తయ్యేటప్పటికి, ఆంజనేయ ప్రసాదు ఆధారాలతో నందుని వెతుక్కుంటూ పార్ధు తాతగారి ఇంటికి వస్తాడు. గ్రహించిన నందు ఆంజనేయ ప్రసాదు వచ్చేటప్పటికి తప్పించుకుంటాడు. అధికారులు వెళ్లిపోయాక వచ్చి అతడు తిరిగి వచ్చి జరిగిన సంఘటనలలో తన భావన తెలియజేస్తాడు. తాతగారు అతడినే పార్దుగా ఆదరిస్తారు.

జరిగిన శివారెడ్డి హత్యలో భాగం బాజిరెడ్డికి ఉంటుందని గ్రహించిన నందు, బాజిరెడ్డి దగ్గరి నుండి నిజాన్ని రికార్డు చేసి, అసలు నేరస్తుడు మల్లిని చంపుతాడు. సిబిఐ అధికారి ఆంజనేయప్రసాదుకి తన దగ్గర ఉన్న ఆధారం అందజేస్తాడు. అదారంతో ఎదురుగా ఉన్న ఆంజనేయప్రసాదు ముందే బాజిరెడ్డి తననితనే కాల్చుకుని చనిపోతాడు. నేర ప్రవృత్తి ఉన్నా మంచి మనుషుల మద్య మనిషిగా మారిన అతడిని ఆంజనేయ ప్రసాద్ వదిలివేసి కేసు క్లోజ్ చేయడంతో అతడు కధ సుఖాంతం అవుతుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు చిత్రంలో మహేష్ బాబు, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, త్రిష, సోను సూద్, కోట శ్రీనివాసరావు, షియాజీ షిండే, నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, అజయ్, గిరిబాబు, సుధ, తనికెళ్ళ భరణి, కె విశ్వనాధ్, గిరిధర్, చరణ్ రాజ్ తదితరులు నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

అంతఃపురం చిత్రంలో అమ్మతనం ఆరాటపోరాటం బిడ్డడి భవిష్యత్తుకోసం

అంత:పురం అమ్మపోరాటం

అంతఃపురం చిత్రంలో అమ్మతనం ఆరాటపోరాటం బిడ్డడి భవిష్యత్తుకోసం సాగిస్తుంది. తన బిడ్డడిని ఫాక్షనిస్టుల మధ్య నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి ఆరాటపడుతూ కష్టంతో పోరాటం చేసే కన్నతల్లి ప్రయత్నం. ఏతల్లి అయినా బిడ్డడి క్షేమం కోరుతుంది, పోరాటం చేస్తుంది, ప్రాణాలకు తెగించి కూడా తల్లి పోరాడుతుంది అని ఈచిత్రం చూపుతుంది. విమర్శకుల ప్రసంశలు కొన్ని చిత్రాలకే దక్కుతాయి అలా ఈ చిత్రానికి ఈచిత్ర యూనిట్ కు కూడా దక్కాయి. అంతఃపురం అమ్మతనం ఆరాటం పోరాటం.

అమ్మగా సౌందర్య నటిస్తే, అమ్మ భర్తగా సాయి కుమార్ నటిస్తే అమ్మ భర్తకి తండ్రిగా అమ్మకి మామగా ప్రకాష్ రాజ్ నటన అందరిని ఆకట్టుకుంటే, సౌందర్య నటన అందరిని మెప్పిస్తుంది. అమ్మభర్తకి తల్లిగా ప్రకాశ రాజ్ భార్యగా సౌందర్యకు మద్దతు పలికే అత్తగా ఫ్యాక్షన్ ఫ్యామిలీలో ఇల్లాలులా శారద నటన ఉంటుంది. ఇలా అందరి నటన ఈ చిత్ర కధనం చిత్రాన్ని ఒక సచ్చిత్రంగా మలిచింది. ఈ చిత్రంలో అసలేం గుర్తుకు రాదు… అంటూ సాగే పాట బాగా ప్రాచుర్యం పొందింది.

ఫ్యాక్షన్ వాతావరణంలో ఉండలేక విదేశాల్లో నివసించే శేఖర్ (సాయికుమార్) అక్కడే స్థిరపడ్డ ఒక బిజినెస్ మేన్ కూతురు బానుమతి (సౌందర్య)ని వివాహం చేసుకుంటాడు. వారివురు అన్యోన్యమైన సంసార ఫలితంగా కలిగిన కొడుకుతో సంతోషంగా విదేశాల్లోనే ఉంటారు. అయితే ఊరినుండి వచ్చిన కబురుతో శేఖర్ ఫ్యామిలీతో సొంతఊరికి వస్తాడు. శేఖర్ తండ్రి ఊరిలో ప్రసిద్ద ఫ్యాక్షన్ నాయకుడు అతని పేరు నరసింహ, పేరుకు తగ్గట్టే అతని ప్రవర్తన ఉంటుంది. ఎప్పుడు దాడి ప్రతిదాడిలతో సాగే ఆ కుటుంబవాతావరణంలోకి బానుమతి తన బిడ్డడితో బిక్కుబిక్కుమంటూ ప్రవేశిస్తుంది.

నరసింహ ప్రత్యర్ధుల దాడిలో శేఖర్ తన ప్రాణాలు కోల్పోతాడు, భర్తని కోల్పోయిన భానుమతి తన బిడ్డడితో మరలా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. భానుమతి మామ అయినా నరసింహా వారిని ఆప్ తండ్రిని చంపిన వారిపై కక్ష తీర్చుకునే భాద్యత నీ బిడ్డడిపై ఉంది, నీ బిడ్డడు నాకు వారసుడు అని భానుమతి ప్రయాణాన్ని అడ్డుకుంటాడు. తన మూర్ఖత్వాన్ని ఎదిరించిన భానుమతిని నరసింహ గదిలో బందించి ఉంచుతాడు.

అత్తగారి సహాయంతో భానుమతి బిడ్డడితో ఇల్లు దాటి బయటపడుతుంది, నరసింహ మనుషులు వెంటపడతారు. ఎలాగైనా వారికి దొరకకుండా బిడ్డడితో కొనసాగించే ప్రయాణ ప్రయత్నంలో భానుమతి పడే కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. చివరికి జగపతిబాబు సహాయంతో ఆమె తన ప్రయత్నంలో విజయవంతం చేయగలుగుతుంది.

సహజత్వానికి దగ్గరగా కధనం నడిపించడంలో సన్నివేశాల్లో విబిన్నతను చూపే కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకుడు. మంచి చిత్రాలకు ఆదరణ నిదానంగా వచ్చిన ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు, అలా సందేశాత్మక చిత్రాలు, సామజిక ఇతివృత్తాలు ఉంటాయి. అంతఃపురం చిత్రం ముఠాకక్షల మద్య కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో చూపుతుంది. సౌందర్య, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, శారద, జగపతి బాబు, చిన్నా, ఎంఎస్ నారాయణ, బాబు మోహన్ తదితరులు నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

కర్తవ్యం వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి

నిజాయితి గల పోలీసు అధికారిణ కర్తవ్యం

ఈ చిత్రంలో కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి కధ కర్తవ్యం కధ. ఘటనా ఘటనలను తెలియజేస్తూ వాస్తవాలను సమాజానికి తెలియపరిచే సమాచార వ్యవస్థ ఒకటి ఉంటే పాల్గొనేవారి కర్తవ్యం ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలి, రోగికి చికిత్స చేయాలి, రోగాలను అదుపు చేయాలనీ వ్యవస్థచే ఏర్పరచుకున్నది వైద్యవ్యవస్థ, ఇక్కడ రోగికి చికిత్స, రోగనివారణ మార్గాల సూచన ప్రధమ కర్తవ్యం. ఇలా పలురకాలుగా వ్యవస్థల్లో వివిధ రంగాలలో ప్రజాపనుల కోసం, సమాజ సేవలు కోసం  వ్యవస్థలు ఏర్పడడం, వ్యవస్థచే వ్యక్తులు నియమింపబడడం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నిగా ప్రైవేటు రంగ సంస్థలుగా కొన్ని ఉంటే, అధికారికంగా ఉండే వ్యవస్థల్లో రక్షణ వ్యవస్థ ప్రధానమైనది, ప్రభుత్వపరమైన వ్యవస్థ.

ఏ రంగానికైనా సమయాలు ఉంటే రక్షణ వ్యవస్థ ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆపదలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వస్తాయో చెప్పలేరు. అలాంటి రక్షణ వ్యవస్థను అధికార రాజకీయవర్గాలు శాసిస్తూ ఉంటాయి. ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థలో ఉద్యోగం చేయడం అంటే అది సమాజ సేవచేయడంలో ముందుండే వ్యక్తిత్వం ఉన్నవారికే ఉంటుంది. శక్తి ఉండి సమాజానికి సహాయకారిగా ఉంటే సమాజమే మెచ్చుతుంది, తెలివితో శక్తితో సమాజం నుండి పొందినా సమాజం సహకరిస్తుంది. ఏర్పరచుకున్న వ్యవస్థలో నియమ నిభందనలు ఉంటే, సమాజంలో వ్యక్తులు, వారి కుటుంబాలు, కులాలు, మతాలు వివిధ వ్యవస్థలు అన్ని అధికార అనధికార వ్యవస్థలుగా గుర్తింపు పొందినవిగా కొన్ని పొందనవిగా కొన్ని ఉంటాయి. ఒకరు ఒక రకంగా సేవ చేస్తూ ఉంటే, వారు మరొక రకంగా సేవను పొందుతూ ఉంటారు. సమాజం ద్వారా సేవ చేయడం, పొందడం ఉంటుంది.

స్వార్ధమనే విషయం పొందడంలో చూపిన చొరవ చేయడంలో చూపదు, అలాంటి స్వార్ధమే ఒక వ్యక్తిలో నిండిపొతే సదరు వ్యక్తి ప్రవర్తన పొందడంలోనే ఉంటుంది. దానికోసం ఇతర వ్యవస్థల లేక ఇతరుల కర్తవ్యానికి కూడా అడ్డుపడతారు. అలాంటివారు ముందుగా డబ్బు, తరువాత పదవి దాంతో అవసరమైన వ్యవస్థ అందులో అధికారులపై పట్టుబిగిస్తూ ఉంటారు. అధికారం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రక్షణ వ్యవస్థే. రక్షణ వ్యవస్థలో కర్తవ్యతా భ్రస్టత ఏర్పడితే వ్యవస్థ చిన్నాబిన్నం అయ్యి సమాజంలో సమతుల్యత అదుపుతప్పుతుంది. అందుకే శాంతి భద్రతలను కాపాడే వ్యవస్థగా రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

కర్తవ్యమే కార్యంగా పనిచేసే అధికారులు సమాజంలో తాత్కాలిక కష్టాలు ఉంటే

వ్యవస్థలో స్వార్ధపరుల ఆటకట్టించే రక్షణవ్యవస్థలో రక్షణాదికారిగా ఒక స్త్రీ పనిచేస్తే అది కర్తవ్యంతో చేస్తే ఎలా ఉంటుందో కర్తవ్యం చిత్రం చూపుతుంది. సమాజంలో స్వార్ధంతో పెద్దమనుషుల బలంతో అధికారంతో ఆటలాడే వ్యక్తుల గురించి చెప్పడంలో దర్శకుడు ఎ మోహన్ గాంధి సిద్దహస్తుడు.  పూజకు పనికిరాని పువ్వు, ఆడపడచు, న్యాయానికి సంకెళ్ళు, మౌనపోరాటం, జడ్జ్ మెంట్, పీపుల్స్ ఎన్కౌంటర్, ఆశయం, పోలీసు బ్రదర్స్, సంభవం, శంఖారావం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కర్తవ్యం చిత్రాన్ని నిర్మించింది ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం. ఒకేఒక్కడు, ప్రేమికులరోజు, స్నేహం కోసం, బంగారం, ఖుషి, భారతీయుడు, పెద్దరికం లాంటి పలు చిత్రాలని నిర్మించారు.———————————–

తెలుగు చలన చిత్రం కర్తవ్యం కధలోకి వెళ్తే

మంత్రి బాబురావు (బాబుమోహన్) 32 ఫైళ్లపై అర్హతలు చూడకుండా సంతకం చేస్తే, ఆ ఫైళ్ల తాలూకా కుంభకోణం గురుంచి ప్రముఖ రాజకీయ వ్యక్తి దత్తు నిరాహారదీక్ష చేస్తాడు. మంత్రిబాబురావు సంతకాలు చేసిన ఫైళ్లలలో నగరంలో పెద్దమనిషి ముద్దుకృష్ణ (అట్లూరి పుండరీకాక్షయ్య) ఫైల్ కూడా ఉంటుంది. ఇదే విషయం అతనికి చెప్పి దత్తు సంగతి చూడమంటాడు మంత్రి. నేరాలు ఎదేచ్చగా చేస్తూ పోలీసు, న్యాయ వ్యవస్థలలో వ్యక్తులను డబ్బుతో లొంగదీసుకుంటూ ఉండే ముద్దుకృష్ణ దత్తుపై లారీని ఎక్కించేసి చంపించేస్తాడు. ఆ కేసుని CI కాశిపాతి, లాయర్ కలిసి అది ఆక్సిడెంట్ అని ఫైల్ క్లోజ్ చేస్తారు.

కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి ఏఎస్పి వైజయంతి నిజాయితీ గల అధికారి ఆమె వచ్చి ఈ ఫైల్ కేసు తిరిగి విచారణ చేపడుతుంది. ముద్దుకృష్ణ డబ్బు అధికారంతో ఆ కేసుని గెలుస్తాడు. డ్రైవర్ తప్పతాగి ఆ ఆక్సిడెంట్ చేసారని నిరూపిస్తారు. CI కాశిపతి చేతిలో అవమానపాలు అయిన పోలీస్ కానీస్టేబుల్ కొడుకు సూరిబాబు కాశిపతిని చంపబోయి ఇంకో కానిస్టేబుల్ ని కాలుస్తాడు. దాంతో సూరిబాబు ఉద్యోగం పోగొట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏఎస్పి వైజయంతి మారుటతల్లి కొడుకు ముద్దుకృష్ణ కొడుకుతో జతకట్టి అతనికోసం తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో పరీక్షా ప్రశ్న పత్రాలను దొంగిలించి అతనికి ఇస్తాడు. అలాగే వైజయంతి స్కూల్ మాస్టర్ గారి కూతురిని మానభంగం చేయడానికి ముద్దుకృష్ణ కొడుకుని అతని స్నేహితులు ప్రోత్సహిస్తారు. మానభంగానికి గురైన యువతి వెంటనే కోర్టుకి వెళితే, ముద్దుకృష్ణ కొడుకుని పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు.

CI కాశిపతి చెయ్యి విరక్కొట్టుకుని ఆ నేరం ముద్దుకృష్ణ కొడుకే చేసాడని నిరూపిస్తే, ఒకేవ్యక్తి ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో రెండు నేరాలు చేయలేడు, అలాగే మానభంగం కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందువలన కోర్టు ముద్దుకృష్ణ కొడుకుని కొద్దిపాటి శిక్ష విధిస్తుంది. ఈ నేరం విషయంలో వైజయంతి వదలదని భావించిన ముద్దుకృష్ణ తన కొడుకు పుట్టిన రోజుని ఘనంగా నిర్వహించి రాజకీయ యువ నాయకుడుగా మంత్రిచే చేయిస్తాడు. మానభంగం కేసులో శిక్ష తప్పించుకున్న ముద్దుకృష్ణ కొడుకుని కనుబొమలతో సహా గుండు గీసి బయటతిరగకుండా చేస్తాడు, సూరిబాబు. మండిపడ్డ ముద్దుకృష్ణ జైలులో ఉన్న సూరిబాబుని బయటకి లాక్కొచ్చి గొడవ సృష్టించి ఆ గొడవలో వైజయంతి కాళ్ళు విరిగేలాగా చేస్తాడు. కాళ్ళు విరిగినా మరలా కోలుకుని వృత్తిలో వచ్చిన వైజయంతి ముద్దుకృష్ణ అంతుచూస్తుంది. మానభంగం చేసేటప్పుడు ప్రోత్సహించిన ముద్దుకృష్ణ కొడుకు స్నేహితులు, అదే అమ్మాయికి తాళి కట్టేవిధంగా ప్రోత్సహించి, చేసిన తప్పు సరిదిద్దుకుంటారు.

అధికారి కర్తవ్యమే వ్యవస్థకు ఆధారం, సమాజానికి మేలు

వ్యక్తి కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి తన కర్తవ్యం తను నిర్వహించడంలో కాళ్ళు పోగొట్టుకున్న నిరుత్సాహపడకుండా పోరాడడమే ఈ చిత్ర కధాంశం. తన స్వార్ధ కోసం ముద్దుకృష్ణ చేసే తప్పుడు పనులను కర్తవ్యం గాలికి వదిలేసి రక్షణ శిక్షణ అధికారులు అమ్ముడు అయ్యే అధికారులు, కర్తవ్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టె అధికారులు ఈ చిత్రంలో కనబడుతారు. విజయశాంతి, వినోద్ కుమార్, సాయికుమార్, పిఎల్ నారాయణ, పరచూరి వెంకటేశ్వరరావు, చరణ్ రాజ్, నిర్మలమ్మ, బాబూమోహన్, నూతన్ ప్రసాద్, సాక్షి రంగారావు, పి.జె. శర్మ, సంజీవి, మోహన్, మీనా మొదలైనవారు నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్