సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది

అతి సర్వత్రా వర్జయేత్ అనగా అతి చేయడం అన్ని విషయాలలోనూ, అన్ని చోట్లా, అన్ని సమయాలలోనూ మంచిదికాదని అంటారు. అతి మాట్లాడేవారికి విలువ వేరుగా ఉంటుంది. అతిగా అదేపనిగా పనిచేసుకుంటూ ఉండేవారికి లోకంతీరు తెలియదు. అతిగా తినేవారికి విలువ ఉండే విలువను ఇంకొకరు కోరుకోరు. అతిగా సంపాదించేవారిని అనుసరించాలనుకుంటారు కానీ అతిగా సంపాదించేవారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారంటారు. అలాగే అతిగా అనుసరించడం, అతిగా వినడం ఏదైనా, అతి అన్నింటా అంత మంచిది కాదనే విషయం చాలమంది చెబుతూనే ఉంటారు. వ్యక్తి సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది.

వ్యక్తి ఏదో ఒక విషయంలో మాత్రం అతి అలవాటు అయ్యే అవకాశం ఉంటుందంటారు. లేకపోతే అతి అన్నింటా మంచిది కాదనే మాటలు ఎందుకు ఎక్కువగా చెప్పబడతాయి? ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ఎప్పుడోకప్పుడు ఏదైనా ఒక విషయంపై ఒకవ్యక్తికి అనురక్తి ఏర్పడవచ్చును. ఆ అనురక్తి ఫలితం మనసు మననం చేయడం మొదలుపెడితే, అదే అలోచనలు, అవే తలంపులు తలుస్తూ, వ్యక్తి మనసు అతికి అలవాటు అవ్వవచ్చును. కొందరికి తిండిపై ధ్యాస కలిగితే, మరికొందరికి సినిమాలు అతిగా చూడడం అలవాటు అవుతుంది. కొందరికి త్రాగడం అలవాటు అవుతుంది. ఇంకా సహజంగా ఒక వయస్సుకు వచ్చాకా వ్యక్తిలో సెక్స్ విషయంలో ఎక్కువమందికి అతి ఆలోచనలు కలగవచ్చును.

మంచి బుక్స్ మంచి ఆలోచనలను కలుగజేస్తే, చెడు బుక్స్ చెడ్డ ఆలోచనలు

యవ్వనంలోకి వచ్చాక, శరీరంలో కలిగే మార్పుతో వచ్చే సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది. చెడు సహవాసం అయితే అవి, క్రియారూపంలోకి వస్తే, అక్రమ సంబంధాలకు దారితీస్తాయి. మంచి సహవాసం అయితే మానవీయ సంబంధాలకు ఎక్కువ విలువనిస్తూ చెడు ఆలోచనలకు దూరం చేస్తుంది. ఏ సహవాసం చేయక, కేవలం బుక్స్ చదివే వారికి కూడా మంచి బుక్స్ మంచి ఆలోచనలను కలుగజేస్తే, చెడు బుక్స్ చెడ్డ ఆలోచనలు కలుగజేస్తాయి.

ఇక యవ్యనంలో ఉన్న యువతకు వచ్చే సందేహాలకు తెలుగుసెక్స్ బుక్స్ వ్యక్తిగత సందేహాములకు సమాధానపరచవచ్చును. కొన్ని రకాల తెలుగుసెక్స్ బుక్స్ సందేహాలకు తీర్చకుండా, కొత్త సందేహాలకు తెరదీయవచ్చును. కొన్ని రకాల సెక్స్ బుక్స్ కేవలం బూతుమాటలతో మనసును మరింతగా రెచ్చగొడతాయి. ఇటువంటి బూతుతెలుగుసెక్స్ బుక్స్ చదివితే వచ్చే సెక్స్ విజ్ఙానం కన్నా బూతుతెలుగుసెక్స్ బుక్స్ తెచ్చే ప్రమాదం ఎక్కువ అంటారు.

యవ్యనంలోకి ప్రవేశించకముందు సమాజం ఒకలాగా కనిపిస్తే, యవ్వనంలోకి వచ్చాక సమాజం మరొకలాగా కనిపిస్తుందంటే? అది యవ్వనంతో వచ్చే శారీరక మార్పులు, అటుతర్వాత వచ్చే సందేహాల ప్రభావం ఉంటుంది. అప్పుడు కేవలం అనుభవించడానికే జీవితం అనేభావన బలంగా ఉండడం చేత, అనుభవం కొరకు మనసు ఉవ్విళ్లూరుతుంది. అయితే ఇది జీవితాంతం ఉండదు. ఒక వయస్సు వరకు మాత్రమే పరిమితం అని తెలియక తప్పులు చేసేవారు ఉంటారు. చెడుసహవాసం వలన అటువంటి వయస్సులో తప్పులు జరగవచ్చును.

తెలుగుబూతుకధలు లేక తెలుగుబూతుసెక్స్ బుక్స్ అంటూ ఏదో ఒక రకంగా బుక్స్ ఉంటాయి. ఇవి కేవలంలో మనసు రెచ్చగొట్టి మరొక బుక్ రీడ్ చేసేవిధంగా వ్రాయబడి ఉంటాయి. డబ్బున్న వ్యక్తితో వేశ్య వ్యవహరించిన తీరుగా కొన్ని బూతుపుస్తకాలలో విషయాలు వ్యవహరిస్తాయి. సరైన సెక్స్ విజ్ఙానం అందించవంటారు. సెక్స్ సందేహాలతో వ్యక్తి ఉండకూడదంటారు. వాటికోసం వాస్తవ వాత్య్సాయన రచనలు చదవడం మేలంటారు. అంతేకానీ అతిగా సెక్స్ విషయాలతో మమేకం చేసే బూతు బుక్స్ మేలుకాదని అంటారు.

వయస్సు పెరిగే కొలది జీవితంలో మార్పులు అనేకం వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వ్యక్తిని అనుసరించేవారు కూడా ఉంటారు. వారిలో ముఖ్యంగా వ్యక్తి సంతానం అనుసరిస్తుంది. యవ్వనం నుండి మరొక వయస్సుకు మారే అవకాశం ఉంటుంది కాబట్టి యవ్వనంలో మనసును నియంత్రించుకుంటూ, ఆ వయస్సును సక్రమ సంబంధంతో ముడిపెట్టుకుంటే, జీవితం బాగుటుంది. పిల్లలకు మంచి సమాజం అందించిన వారవుతారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

అనేక బుక్స్ సారం గురువుల మాటలలో

గురుబోధ మనసులో బాగా నాటుకుంటుందని అంటారు. అనేక బుక్స్ సారం గురువుల మాటలలో వ్యక్తి గతంలో తెలియబడిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. గురి కుదిరితే సద్గురు మాటలు మంత్రంలా పనిచేస్తాయని అంటారు. ఎన్ని బుక్స్ చదివినా మనసులో లోతైనా ఆలోచన ఉంటేనే, ఆ బుక్ సారం గ్రహించగలం కానీ గురువుల మాటలలో ఎన్నో బుక్స్ లో చెప్పబడిన సారాంశం ఉంటుంది.

అనేక బుక్స్ చదివితే తెలియబడే సారాంశం, ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడినప్పుడే, ఆ బుక్స్ రీడ్ చేసిన ఫలితం పొందనట్టు. అయితే బుక్ రీడింగ్ వలన ఆ బుక్ లో ఉన్న అంశంతో మనసు తాదాత్మకం చెందుతుంది. కానీ ఆ బుక్ విషయం మన జీవనతీరుకు దగ్గరగా లేకపోతే, మన జీవితంలో కొత్త విషయం చేరుతుంది. అయితే అలా చేరిన కొత్త విషయం జీవనలక్ష్యం చేరేదిగా ఉండాలంటారు.

ఏదైనా బుక్ రీడ్ చేసిన తర్వాత ఆబుక్ లోని అంశం మనలో మరో ఆలోచనలు మనకు కలిగిస్తాయి. ఏదైనా తెలుగు నవలను రీడ్ చేస్తే, ఆ నవలలోని పాత్రలు మన మనసులో ఊహించబడతాయి. ఆ నవలను ఎంతబాగా చదివి ఉంటే, అందులోని పాత్రలు అంత బలంగా మన మనసులో పాతుకుపోతాయి. ఇలానే ఇతర బుక్స్ రీడ్ చేస్తే, ఇతర అంశములు మనిషి మనసులోకి చేరతాయి. మనసుకు ఏమిస్తే, వాటిని మననం చేసి మనసు గుర్తుపెట్టుకుంటుంది, మరలా గుర్తకు తెస్తుంది.

ఎటువంటి బుక్స్ ఎక్కువగా చదివితే అటువంటి ఊహాశక్తి మనసులో

అక్షరజ్ఙానం ఉన్నవారు ఒక వయస్సుకు వచ్చే సమయానికి ఎన్నో కొన్ని తెలుగుబుక్స్ రీడ్ చేయడం జరిగి ఉండవచ్చును. భుక్తికోసం ఆదాయమార్గములను తెచ్చే విద్యలో బుక్స్ చదివి ఉండవచ్చును. ఇంకా యవ్యనంలో కోరికలను రెచ్చగొట్టే తెలుగుబుక్స్ చదివి ఉండవచ్చును. లేదా ఊహాత్మక శక్తిని పెంచే ఊహాత్మక సంఘటనలను అక్షరరూపంలో తెలియజేసే బుక్స్ చదివి ఉండవచ్చును. ఎటువంటి బుక్స్ ఎక్కువగా చదివితే అటువంటి ఊహాశక్తి మనసులో పెరుగుతుందంటారు. కానీ సమాజంలో ఎన్నో అంశములతో ముడిపడి ఉండి, మనచుట్టూ వివిధ రకాల మనస్తత్వాలతో వ్యక్తులు ఉంటారు. వారితో స్నేహాభావం వలన వారి వారి ద్వారా మన మనసులోకి మరిన్ని విషయాలు చేరవచ్చును.

ఇలా ఒక వ్యక్తి కొన్ని విషయాలో స్వతహా మనసులోకి తెచ్చుకుంటే, కొన్ని విషయాలు చుట్టుప్రక్కల వారి ద్వారానో… లేక సహవాసంతోనో కొత్త విషయాలు చేరతాయి. మంచి విషయాలు చేరితే, మంచి పరివర్తన ఉంటుంది. జీవితం మంచి చెడుల కలయిక కాబట్టి మంచి చెడులు సమజంలో కనబడుతూనే ఉంటాయి. సంఘజీవిగా మంచిగానో, చెడుగానో మనిషి ప్రభావితం అవుతూ ఉంటాడు. అయితే వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మూలం తనకు తానుగా ఏర్పరచుకునే విషయాలే అంటారు. కానీ వాటిని గుర్తెరగకుండా తన సమస్యలకు కారణం ఇతరులుగానో లేక ఇతరులతో పోల్చుకునేవిధంగానో వ్యక్తి ఆలోచనలు సాగవచ్చని అంటారు.

అనేక ఆలోచనలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పోరాటం చేసే వ్యక్తికి మానసిక పరివర్తన అవసరం అయితే మాత్రం మంచి విషయాలతో కూడిన బుక్స్ చదవడం అవసరం అంటారు. అయితే అనేక విషయాలతో కూడి ఉండే మనసు ఏదో ఒక బుక్ రీడింగుతోనే మార్పును పొందకపోవచ్చును. అనేక బుక్స్ రీడ్ చేయడంతో మార్పుకు మనసు మరలవచ్చును. అయితే అంతర్గత ఆలోచనను కలిగి ఉండే ఒక్కొక్కరికి ఏదైన ఒక మంచి బుక్ మంచి మార్పును వెంటనే కలుగజేయవచ్చును. కానీ అనేక బుక్స్ సారం గురువుల మాటలలో లభిస్తే, ఆ మాటలే మనసులో మార్పును తీసుకువస్తాయి. గురి కుదిరితే గురువుల మాటలు మనసులో బలంగా పాతుకుపోతాయి అంటారు.

సద్గురు మాటలు వినడంతో మనసు మొదటగా శాంతిని పొందడం ప్రారంభిస్తుంది. శాంతించిన మనసు మరింత పదునుగా ఆలోచన చేయగలుగుతందంటారు. మనసుకు మనసే బలమంటారు. మనసుకు మనసే బలహీనమంటారు. అటువంటి మనసు యొక్క బలాలు – బలహీనతలు గుర్తెరగడానికి గురువుల మాటలే మంత్రాలంటారు. మాటలు వినడానికి, గురువును చూస్తూ సద్గురువు మాటలను వినడానికి సద్గురు తెలుగు యూట్యూబ్ చానల్ మనకు ఉంది. సద్గురు మాటలను మనసు గ్రహించగలిగితే, ఆ మాటలతో మనసు ఆలోచనను పొందితే, వ్యక్తిలో కొత్తదనం కలుగుతుంది. ముఖ్యంగా జీవిత పరమార్ధం అవగతమవుతుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు ప్రజలకు సమాజంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేకిత్తిస్తూ, అవగాహనను ఏర్పరుస్తాయి. జరుగుతున్న పరిణామాలపై ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది. గతంలోని నాయకులు ప్రభావం వలన ఏ పరిణామలు సంభవించాయి? ఇప్పటి పరిణామలు సామాజిక స్థితిని ఎలా ప్రభావితం చేయబోతాయో? అవగాహన చర్చాకార్యక్రమములు చూడడం ద్వారా ఏర్పడవచ్చును.

2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ, ప్రజావేదిక కూల్చివేతతో సంచలనానికి తెరదీసింది. అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు రీటెండర్ అంటూ మరో సంచలనం సృష్టించింది. ఆపై రాజధాని మార్పుపై ఏపి మంత్రులు మాట్లాడడంతో అమరావతి రాజధానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిపై జిఎన్ రావు కమెటీ ఏర్పాటు చేయడం, ఆ కమెటీ మూడు రాజధానులు ప్రతిపాదనను వస్తే, 2019 శీతకాలపు శాసనసభలో చివరిరోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు వెల్లడి చేయడం జరిగింది. ఆ ప్రకటనతో అమరావతి రైతులు ఆందోళనలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి రాజధాని వ్యవహారం సంచలనంగా మారింది.

ఇక 2020 జనవరిలో మూడు రాజధానుల బిల్లు, సి.ఆర్.డి.ఏ రద్దు బిల్లు శాసనసభలో పాస్ అయ్యాయి. అయితే వాటికి శాసనమండలిలో బ్రేక్ పడింది. శాసనమండలిలో టిడిపికి మెజార్టి ఎక్కువ ఉండడం చేత, ఆసభలో ఈ రెండు బిల్లులు పాస్ కాలేదు. ఇంకా ఈ రెండు బిల్లులను ప్రజాభిప్రాయ సేకరణ కొరకు సెలక్టు కమిటీకి మండలి చైర్మన్ సిఫారసు చేయడం మరొ సంచలనం అయ్యింది. ఇలా ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెల రాజకీయ ప్రకంపనలతో నడుస్తుంది.

చర్చాకార్యక్రమమలలో విశ్లేషణలు

రాజకీయ నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయి. తాజా ఏపి రాజకీయాలు అందరిలోనూ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అయితే ఈ సంఘటనలు జగన్మోహన్ రెడ్డిగారి నిర్ణయాలు టిడిపి అభిమానులకు నచ్చకపోవచ్చును. అలాగే చంద్రబాబునాయుడు గారి నిర్ణయాలు కూడా జగన్మోహన్ రెడ్డిగారి అభిమానులకు నచ్చకపోవచ్చును. అయితే ఈ రాజకీయాలు ప్రజలకు గందరగోళంగా అనిపిస్తే, వారు వీక్షించేది మాత్రం న్యూస్ చానల్లో చర్చా కార్యక్రమములు. ఈ చర్చాకార్యక్రమముల వలన రాజకీయ పార్టీల నాయకుల ప్రశ్నలు, సమాధానలతో బాటు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుల విశ్లేషణలు ఉంటాయి.

చర్చా కార్యక్రమముల వలన రాజకీయ, సామాజిక అంశాలలో ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది. ఇటువంటి చర్చాకార్యక్రమములు రాజకీయ ఆసక్తి కలిగినవారు చాలామంది వీక్షిస్తూ ఉంటారు. అలాంటి చర్చా కార్యక్రమములలో ఏపి24×7 న్యూస్ చానల్లో వెంకటకృష్ణ గారి చర్చా కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ఎక్కువమంది వీక్షిస్తూ ఉంటారు. వెంకటకృష్ణగారి లేవనెత్తే పాయింట్లు, చర్చలో పాల్గొనే నాయకుల ద్వారా మాట్లాడించడం ఎక్కువమందిని ఆకర్షిస్తూ ఉంటాయి.

వెంకటకృష్ణ గారు ఏపి24×7 న్యూస్ చానల్లో ప్రతిరోజూ చర్చాకార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ చానల్లో వచ్చే రాజకీయ చర్చా కార్యక్రమమును అనేకమంది ప్రత్యక్షవీక్షణను యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపి రాజకీయాలు సంచనాలకు కేంద్రంగా మారుతున్నాయి. ప్రస్తుత రాజకీయ సమాజంలో నాయకుల మరియు పార్టీల అభిప్రాయం, ప్రభుత్వ పనితీరు వలన భవిష్యత్తుపై అవగాహన రాజకీయాసక్తి కలిగిన వారికి ఏర్పడుతుంది. అందరికీ తెలియని నిబంధనలు, అందరికీ తెలియని వ్యక్తులు కూడా రాజకీయ సంఘటనలతో తెరపైకి వస్తూ ఉంటారు.

ఇంకా టివి9 లో మురళీకృష్ణగారి చర్చాకార్యక్రమం కూడా ఎక్కువ మంది వీక్షిస్తూ ఉంటారు.

టివిలలో వచ్చే న్యూస్ చానల్స్ ద్వారా రాజకీయ అంశములపై, రాజకీయ నాయకుల నిర్ణయాలపై చర్చా కార్యక్రమములు జరుగుతూ అందరిలో రాజకీయ పరిస్థితులపై అవగాహన తెచ్చే విధంగా ఉంటాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితులతో పాటు గతంలో సమాజం ఎదుర్కొన్న సంక్షోభాలు, వాటి ప్రభావాలు కూడా ఈ న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు నందు చర్చకు వస్తాయి. వీటిని వీక్షించడం ద్వారా ఎన్నికల సమయానికి ఏపార్టీతీరు ఎలా సాగుతుందో? అవగాహన ఏర్పడుతుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

వంద పద్యాలు అంతకన్నా ఎక్కువగా పద్యములు ఉంటే, ఆ పద్యముల సమూహమును శతకముగా చెబుతారు. పూర్వులు రచించిన పద్యములు మనకు శతకములుగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా సామాజిక పరిస్థితులు, నీతి, ఆచరణ, సంప్రదాయములు, భక్తి, ఆరాధన, వ్యక్తి పరివర్తన తదితర అంశములను స్పృశిస్తూ ఉంటాయి. తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లో శతాదిక పద్యములతో కూడి ఉంటాయి.

భక్తి పారవశ్యంతో కొందరు తమ భావనలను పద్యరూపంలో తెలియజేస్తే, కొందరు సమాజంలో వివిధ వ్యక్తిత్వాలపై తమ భావనలను వెల్లడి చేయడం మనకు శతకాలు తెలుగు పద్యాలలో కనబడుతుంది. ఎక్కువగా భక్తితో కూడిన భావనలను తెలియజేస్తూ, వివిధ దేవతల అద్భుత గుణముల విశిష్టతను భక్తి శతకాలు వెల్లడి చేస్తాయి. ఏభావనతో వెల్లడి చేసినా, తద్భావన ఎంతో లోతైన భావం కలిగి ఉంటాయి. ఇంకా శతక పద్యములు చిన్న పద్యములుగానే ఉన్నా గుణాత్మక మార్పును సూచిస్తూ ఉంటాయి అంటారు.

తెలుగులో శతకముల తెలుగుబుక్స్

శతకములు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి వేమన శతకం, సమతీ శతకం, దాశరధి శతకం, భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం. కానీ పూర్తిగా మనం చదువుకున్న పాఠ్యపుస్తకాలలో ఉండవు, బాగా ప్రసిద్ది చెందిన పద్యాలే ఉంటాయి. కవులు భక్తి పారవశ్యంతో చేసిన శతకాలు మనలోను భక్తిని పెంపొందిస్తాయి. అలాగే ఇంకా మనకు మరిన్ని శతకాలు కూడా ఉన్నాయి. తెలుగు కవులు రచించిన శతకాలు మనకు మరిన్ని ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ తెలుగుబుక్స్ రూపంలో లభిస్తున్నాయి. మారుతి శతకం, మూకపంచశతి కటాక్ష శతకం, నరసింహ శతకం, భర్త్రుహరి శతకం, కుమారి శతకం, కమార శతకం, కృష్ణ శతకం, ఆంధ్ర నాయక శతకం ఇలాంటి శతకాలు మరిన్ని అందుబాటులో ఉన్నాయి. భక్తిని, ఆలోచనను రేకెత్తించే ఈ శతకమాధుర్యాలు ఉచితంగా చదవాలంటే ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

వేమన శతకంలో వేమన ఎక్కువగా వ్యక్తి, సమాజంలో వ్యక్తి వ్యవహారం ఎలా ఉంటుందో? సూచిస్తూ ఉంటాయి. పురుషలందు పుణ్యపురుషులు వేరయా అంటూ… వ్యక్తి గుణమును స్పృశిస్తుంది. వేమన శతకములు తెలుగు పద్యములు చదివి, వాటి భావన చదవడం వలన వ్యక్తి మనసు తనను తాను చెక్ చేసుకోవడం కూడా మొదలుపెడుతుంది అంటారు. ఇంకా సమాజంలో వివిధ రకాల వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో తెలియబడుతుందని అంటారు. వేశ్యతో సంబంధం కలిగి ఉన్న వేమన, ఒక్కసారే వైరాగ్యంతో యోగిగా మారి సామాజిక పరిస్థితులలో వివిధ వ్యక్తుల వ్యక్తుల ప్రవర్తనను తన పద్యములలో ఎత్తి చూపుతాడు. వేమన పద్యాలు చాలా ప్రసిద్ది చెందియున్నాయి.

వేమన శతకము తెలుగు పద్యములు మాదిరి సుమతీ శతకం కూడా సామాజిక హితమును కాంక్షిస్తూ ఉంటాయి. ఇంకా భక్తితో కూడిన ఆరాధనా భావనలను రేకెత్తించే తెలుగు శతకాలు మనకు లభిస్తాయి. కాళహస్తీశ్వర తెలుగు శతకం తెలుగు పద్యాలు మన శివుని గూర్తి తెలియజేస్తాయి. దూర్జటి రచించిన ఈ భక్తి శతకం శివలీలలను తెలియజేస్తుంది. చెరశాలలో రామదాసు వెల్లడిజేసిన రామభక్తి భావనలే దాశరధీ శతకం.

తెలుగు శతకాల బుక్ లింక్స్

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లింకులు ఈ క్రిందగా ఇవ్వబడ్డాయి. ఈ క్రింది లిస్టులో ‘తెలుగుబుక్’ అనే పదమునకు ఆయా పేర్లతో కూడిన బుక్ లింక్ చేయబడింది.

తెలుగు శతకములు చదవడంతో బాటు వినడం వలన కూడా ఆయా తెలుగు పద్యములు మన మనసులో మననం అవుతాయి. మననం చేత మనసులో మంచి విషయాలు పద్యరూపంలో చేరతాయి. గుర్తుకు వచ్చిన పద్యములకు సంబంధించిన పద్యభావనను తలచుకోవడం వలన, మనసు మార్పువైపు మరలుతుందంటారు. తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ చదవడంతో బాటు వినడానికి తెలుగుపద్యాలు.తెలుగురీడ్స్.కామ్ వెబ్ పేజిని సందర్శించండి. ఈ వెబ్ పేజిలో తెలుగు శతకముల పద్యములు భావంతో అక్షర రూపంలోనూ, వాయిస్ రూపంలోనూ ఉంటుంది. మీరు వింటూ చదవవచ్చును.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు

రాజకీయ సామాజిక పరిస్థితులలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు వీడియోలు చూడడం వలన ప్రస్తుత రాజకీయ పరిణామలపై అవగాహన ఉంటుంది. తెలుగు రాష్ట్రముల రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీల గురించి, ఆయా పార్టీలు నాయకులపై విమర్శనాత్మక విశ్లేషణలు వీడియోల రూపంలో ఉంటాయి.

రాజకీయం నాయకుల ప్రయోజనాలతో బాటు పార్టీ ప్రయోజనాలు మరియు ప్రజా ప్రయోజనాలు కోసం సాగుతుందంటారు. రాజకీయంగా పార్టీల పొత్తులు పార్టీ ప్రయోజనాలతో బాటు ప్రజాప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక కూటమిగా ఏర్పడుతూ ఉంటారు. నాయకులు పార్టీ వీడడం అంటే వారి రాజకీయ ప్రయోజనంతో బాటు ఆప్రాంత ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పార్టీలు మారుతూ ఉంటారంటారు.

ఏదైనా రెండు పార్టీల కలయిక లేదా పార్టీ వీడడం అనేది వారి ప్రయోజనాలతో బాటు ప్రజల ప్రయోజనాలు భవిష్యత్తు ప్రయోజనాలు కోసం జరుగుతుందంటారు. అయితే జరిగే రాజకీయ పరిణామాల గురించి న్యూస్ చానల్లలో డిబేట్ కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో వివిధ పార్టీలు ప్రముఖులతో బాటు, రాజకీయ సామాజిక విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు.

నాయకులు తమ తమ పార్టీ విధానాలను సమర్ధించుకుంటూ, ఇతర పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ ఉంటే, విశ్లేషకులు ప్రస్తుత విధానంలో పరిణామాలను విశ్లేషిస్తూ ఉంటారు. ఇలా రాజకీయ పరిణామాలలో సామాజిక భవిష్యత్తును విశ్లేషించే వారిలో ప్రముఖంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు విశ్లేషణలు కూడా ఉంటాయి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణలు అన్ని తెలుగు చానల్లలోనూ ఉంటాయి. ఇంకా ఈయనకి ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ఈ చానల్ పేరు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అయితే ఈ చానల్ కు 3లక్షలకు పైగా సబ్ స్కైబర్స్ కూడా ఉన్నారు.

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలతో బాటు కేంద్ర ప్రభుత్వ విధానములను, జాతీయ రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ ఉంటారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చేసిన విశ్లేషణలు కొందరికి నచ్చితే, మరికొందరికి నచ్చవు ఆ విషయంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి వీడియోల కామెంట్లను చూస్తే అవగతం అవుతుంది. ఈయనే చెబుతూ ఉంటారు, నేను నా అభిప్రాయం తెలియజేస్తూ ఉంటాను. అది అందరూ ఇష్టపడకపోవచ్చును అని.

సమాజంలో జరిగే రాజకీయ పరిణమాలలో రాజకీయ నాయకుల రాజకీయ అంతరంగం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు విశ్లేషణల వీడియోలు చూడవచ్చు. న్యూస్ పేపర్ రీడ్ చేయడం కన్నా న్యూస్ చానల్ వాచ్ చేయడంతో సమయం సేవ్ అవుతుందనే వారికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి వీడియోలతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు తెలియవస్తాయి.

ఈ క్రింది వీడియోలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు బిజెపి – జనసేన పొత్తు గురించి ప్రస్తావిస్తూ… ఆయన పవన్ కళ్యాణ్ గారికి తగిన గౌరవం లభించకుండానే బిజెపితో పొత్తు ప్రక్రియ జరిగినట్టుగా విశ్లేషించారు. బిజెపికి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో అంతగా అనుకూలతలు లేకపోయినా, ఎన్నికలు లేని సమయంలో జనసేన బిజెపితో కలిసింది. బిజెపి తెలివైన పనిచేసినట్టుగా విశ్లేషించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన-బిజెపి పొత్తులో రాజకీయ పరిణామాలను విశ్లేషించే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి వీడియోలు చూడవచ్చు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్

ఐకమత్యమే మహాబలము అంటారు. అటువంటి ఐకమత్యము ఒక కుటుంబంలోని నలుగురి అన్నదమ్ములలో ఉంటే, ఆకుటుంబమును శత్రుభయం తక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వృద్దిలోకి వస్తుంది అంటారు. గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ లో గ్రామములో సంఘం ఐకమత్యం గురించి తెలిపారు.

అలాంటి ఐకమత్యము ఒక ఊరికి ఉంటే, ఆఊరిలో తప్పులు జరగడం చాలా తక్కువగా ఉంటుందని అంటారు. కలసి ఉన్నప్పుడు తోటివారికి సమాధానం చెప్పాలన్న భావన బలంగా ఉండడం చేత, వ్యక్తి తప్పుదోవ తొక్కడంటారు.

తెలుగు రాష్ట్రములలో ఉండే అనేక గ్రామాలలో ప్రతి గ్రామమునకు ఒక గ్రామదేవత తప్పనిసరిగా ఉంటుంది. గ్రామదేవతకు సంబంధించిన పూజలను నిర్వహించుటకు ప్రత్యేకంగా వ్యక్తులు ఉంటారు. ఇంకా నిర్ణీత కాలంలో జరిపే గ్రామదేవత జాతరలకు ఊరంతా ఏకమై పెద్ద ఉత్సవంలాగా జరుపుకుంటారు.

ఒక గ్రామంలో ఆ గ్రామమునకు చెందని దేవత పండుగ చేసుకుంటూ ఉంటే, ఆ గ్రామనివాసులు ఇతర గ్రామాలలో నివసించే తమ బంధువులను ఆహ్వానించి, వారితో తమ ఆనందం పంచుకుంటారు. ఇలా మన తెలుగురాష్ట్రాలలో ఉండే వివిధ గ్రామములకు వివిధ పేర్లతో గ్రామదేవతలు ఉంటారు. కొన్ని గ్రామాలలో ఊరిజాతర ఒక సంవత్సరమునకు జరిపితే, కొన్ని గ్రామాలలో మూడు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరములకు ఒక్కసారి గ్రామదేవతకు జాతర చేస్తూ ఉంటారు.

గ్రామ ప్రజలనందరిని ఏకం చేసే జాతర అంటే, ఆగ్రామ ప్రజలకే కాకుండా, ఆగ్రామం చుట్టుప్రక్కల ఉండే ప్రజలకు ఆనందదాయకముగా ఉంటుంది. గ్రామదేవతలు గురించి తెలియజేసే తెలుగుబుక్ ఒక్కటి ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తుంది. ఈ తెలుగుబుక్ రీడ్ చేయడానికి లేక ఫ్రీగా డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేదా ఇవే అక్షరాలను నొక్కండి.

గ్రామదేవతలు తెలుగుబుక్

తెలుగుబుక్ గ్రామదేవతలు అను నామధేయంతో ఉంది. ఈ గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ నందు గ్రామదేవతలు గురించి ఈ విధంగా చెప్పారు. సంఘము అంటే ప్రజలందరిలో ఉండే ఐకమత్యమునకు ప్రతీక. దేవత సంఘమునకు సంబంధించినది అయితే ఆ సంఘమనుందు ఐకమత్యమును సాధించుటకు కనిపించని దేవతను ఆలంబనముగా చేసుకుని తమ జాతి యందు అభివృద్దిని సాధించే మానవ ప్రయత్నములో ఒక భాగమే గ్రామదేవత ఆవిర్భావము అని చెప్పబడింది.

తెలుగు ప్రాంతాలలో గ్రామదేవతలుగా పోలేరమ్మ, పోచమ్మ, పైడమ్మ, అంకాళమ్మ, మరిడమ్మ, వనువులమ్మ, మాచలమ్మ, నూకాలమ్మ, మావుళ్ళమ్మ, సుంకులమ్మ, నేరేళ్ళమ్మ, అంకమ్మ, కోటమ్మ, ఎల్లమ్మ, పల్లాలమ్మ, గజ్జాలమ్మ, కడియాలమ్మ, గంగానమ్మ, మారెమ్మ, తోటలమ్మ, తలుపులమ్మ, ఆటలమ్మ, నోమాలమ్మ, చెరువులమ్మ, కాగితమ్మ, గండాలమ్మ, మైశమ్మ, చింతాలమ్మ, కోర్లమ్మ, పెద్దింట్లమ్మ, బాపనమ్మ, దుర్గమ్మ, గంటెమ్మ తదితర గ్రామదేవతా పేర్లతో ఉంటారు. ఈ పుస్తకంలో వివిధ గ్రామదేవతా పేర్లను తెలుపుతూ గ్రామముల నామాలను కూడా తెలియజేశారు.

ఇంకా గ్రామములందు గ్రామదేవత సంప్రదాయం తదితర విషయాలు తెలియజేశారు. అలాగే పోతురాజు గురించిన కధలను కూడా తెలియజేశారు. గ్రామదేవతలు తెలుగుబుక్ నందు జానపదుల గురించి, జానపదుల సామెతలను తెలియజేశారు.

ఎక్కువగా గ్రామదేవతల పూజలు భయకంపితంగానే ఉంటాయి. ఎందుకంటే గ్రామాలలో జరిగే కొన్ని జాతరలకు విశేషంగా జంతుబలులు ఇవ్వడం సంప్రదాయంగా ఉంటుంది. వీటిలో పూనకాలు రావడం కూడా ఉంటుంది. పూనకం వచ్చిన వ్యక్తి ఊగుతూ గ్రామదేవత తరపున కోరికలు కోరడం కూడా కొన్ని గ్రామాలలో ఉంటుంది. గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ ఫ్రీగురుకుల్ వెబ్ సైటు నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును లేదా బుక్ రీడ్ చేయవచ్చును.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్