Month: May 2020

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు. మంచి మ్యూజిక్ మైండుని రిలాక్స్ చేస్తుంది. మంచి మాట మనసును శాంతింపజేస్తుంది. మంచి మాటలు మంచి మిత్రుడి నుండి లభిస్తాయి. ఇంకా తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. గురువుల బోధలో మేలైన మాటలు ఉంటాయి.

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికి పుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది. […]

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం. లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా […]

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. సర్వదేవతా భజనలు, రామభజనామృతము, సీతారామ భజన తదితర తెలుగు పుస్తకాలు… సర్వదేవతా భజనలు బుక్ లోని కొన్ని భజన పద్యాలు. శ్రీగణేశ శ్రీగణేశ | శ్రీగణేశ పాహిమాంజయగణేశ జయగణేశ | జయగణేశ రక్షమాంఓం గణేశ ఓం గణేశ | ఓం గణేశ పాహిమాంశ్రీగణేశ శ్రీగణేశ | శ్రీ గణేశ రక్షమాం || గణేశ శరణం | శరణం గణేశవాగీశ శరణం | శరణం వాగీశవిఘ్నేశ […]

అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్

ఉన్నత ఉద్యోగాలకే ఏది గ్రేట్ అంటే ఐఏస్ గ్రేట్ అంటారు. ఐఏఎస్ అవ్వడమే గొప్పగా ఉంటే, వారి కర్తవ్యం ఖచ్చితంగా చేస్తే, ఇంకా గ్రేట్ అంటారు. ఇప్పుడు ఈ గ్రేట్ ఎవరికంటే అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ కు. సుమారు పదిహేను నెలల కాలవ్యవధిలో ఒక రాష్ట్రంలో మార్పును తీసుకురావడం అంటే గొప్పే కధా… ప్రజాభిమానం ఉన్న నాయకుల నిర్ణయాలు కూడా అమలు అవ్వడంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక ఐఏస్ ఉద్యోగిని రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టడమే […]

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు చదవడం అలవాటు అయితే, మంచి బుద్దులు అబ్బుతాయని అంటారు. సహజంగా పిల్లలకు కధలంటే ఆసక్తి ఉంటుంది. కధలలోని సారంశం గ్రహించడం పిల్లలకు అలవాటు అయితే, అదే అలవాటు నిత్య విద్యలో కూడా అలవాటు పెరుగుతుంది. అన్ని అలవాట్లుకు పరిమితులు చెబితే, విద్య నేర్చుకోవడంలో పరిమితులు చెప్పరు. వినయంతో కూడిన విద్య ఎంతవరకైనా తెలుసుకోవచ్చును. పిల్లలకు అవసరమైన వినయవిధేయతలు చిన్ననాడే బలంగా నాటుకోవాలని అంటారు. ఇందుకు తరచుగా వాడే మాటలు ‘మొక్కై ఒంగనిది, […]

శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది

శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా పుస్తకం చదువుతున్న మనసు ఏకాగ్రత దృష్టితో పుస్తకంలో వ్రాయబడిన విషయాలతో మమేకం అవుతుంది. ఎక్కువగా పుస్తకం చదివేటప్పుడు అందులోని విషయంపై ఆసక్తిని బట్టి, ఆ పుస్తకంపై ఏకాగ్రతా దృష్టి ఏర్పడుతుంది. కానీ కేవలం పుస్తకం చూస్తూ పేజీలు తిరగేయడం వరకే పరిమితం అయితే పుస్తకంలో వ్రాయబడి ఉన్న విషయం పూర్తిగా అవగతమవదు. పుస్తకం చూస్తూ ఉంటే, అందులో దేని గురించి వ్రాయబడి ఉన్నదో తెలియబడుతుంది, క్లుప్తంగా […]

విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం

విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం చదవడం అంటే, స్థితికారకుడిని మననం చేయడమే. పుస్తకపఠనం అంటే, మనసు ఏకాగ్రతతో పుస్తకంలోని విషయంతో మమేకం కావడమే. కాబట్టి విష్ణుపురాణం చదవడం అంటే, విష్ణు స్వరూపమును మనసులో పటిష్టం చేయడమే. సృష్టి – స్థితి – లయం మూడు స్థితులు ప్రకృతిలో నిరంతరాయంగా జరిగే ప్రక్రియగా చెబుతారు. సృష్టికి అధిదేవతగా బ్రహ్మను, స్థితికారకుడుగా విష్ణుస్వరూపమును, లయకారకుడుగా పరమశివుడిని చెబుతారు. త్రిమూర్తుల అనుగ్రహంతోనే మన జననం జరిగితే, మన స్థితికి మన చేసుకునే […]

బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్

బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ అని అంటారు. కొందరికి పుస్తకాలు చదివే అలవాటు చిన్ననాటి నుండే ఉంటుంది. కానీ ఎలాంటి పుస్తకాలు చదివితే, అలాంటి ఆలోచనలు చదివేవారి మనసులో చేరుతూ ఉంటాయి. గతం మాదిరి ఇష్టం ఉండే విషయాలపైనే పుస్తకాలు ఇంకా ఎక్కువ చదివితే, అదే విషయంలో మరింత అవగాహన ఉంటుంది. అలా కాకుండా కొత్తగా తెలిసిన విషయాల గురించి పుస్తకాలు చదివితే, కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తాయి. అప్పటికే తెలిసిన విషయాలలో పుస్తకాలు చదివితే, ఆయా […]

అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్

అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్ చదవడానికి ఈ పోస్టు చివరలో ఉన్న బటన్ పై క్లిక్ చేయగలరు. అయ్యప్ప అనగానే నియమాల మాల మదిలో మెదులుతుంది. నియమంగా మాలధారణ స్వీకరించి, నియమంగా నిద్రలేచి, నియమంగా స్నానాది కార్యక్రములు చేసి, నియమంగా పూజచేసి, నియమంగా వడి చేసి, నియమంగా భిక్ష చేసి, నియమంగా స్వామిని ఆరాధిస్తూ, నియమంగా నిద్రకు ఉప్రక్రమించడం… ఆహార నియమాలు, నిద్ర, నియమానుసారం క్రమం తప్పకుండా చేస్తూ స్వామిని ఆరాధించడంలో భక్తి పారవశ్యంతో ఉండడం ప్రధానంగా […]