మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి? ప్రధానంగా ప్రధమ పుత్రుడు కానీ ఏకైక పుత్రుడు కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా జీవించాలని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. పితృవాక్య పరిపాలన ప్రధాన కర్తవ్యంగా జీవించాలని రామాయణం మనకు బోధిస్తుంది… రామాయణం ప్రకారం ఆలోచిస్తే, తండ్రిమాటకు విలువనిచ్చి జీవించడం కుమారుడి ప్రధాన లక్షణంగా కనబడుతుంది. మంచి కుమారుడు తండ్రిమాట వినాలి అంటారు. ఇంకా సమాజంలో తండ్రికి తలవొంపులు తేకుండా ప్రవర్తించాలి. మంచి విషయాలలో తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా … Read more

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం. మనిషికి ఉండకూడని వ్యసనంగా పెద్దలు చెబుతారు. కానీ ఈ వ్యసనం నేటి సమాజంలో ఎక్కువమందికి ఉండడం దురదృష్టకరం అంటారు. అందుకు కారణం మద్యపానం వలన మత్తులో ఉంటూ, బాధని మరిచిపోతామనే అపోహలో ఉంటారని, ఇంకా మద్యపానం వలన జరిగే నష్టం గురించి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అంటారు. మద్యపానం మూలంగా కలిగే వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి. తాగుడు వలన అతిగా మాట్లాడుట అలవాటు అవుతుంది. తాగుడు వలన … Read more

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో విశ్వసనీయత ప్రధానమని తెలుగులో వివరించండి. విశ్వసనీయత జీవితంలో చాలా ముఖ్యమైనది. విశ్వాసం ఏర్పడిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం వ్యక్తికి చాలా అవసరం. విశ్వాసం కోల్పోతే అర్హతను కోల్పోవలసి ఉంటుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా చివరికి ఒక ప్రాంతమైనా విశ్వసనీయత ప్రధానమైన ప్రభావం చూపగలదు. ఒక ప్రాంతంలో దారి దోపిడి దొంగలు ఎక్కువ అని సమాజంలో ప్రాచుర్యం పెరిగితే, ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రాంతంపై ప్రజలలో విశ్వసనీయత ఉండదు. ఆ … Read more

పావురం గురించి తెలుగులో వ్యాసం

పావురం గురించి తెలుగులో వ్యాసం ! ప్రధానంగా తెల్లని పావురం శాంతికి సంకేతంగా చెబుతారు. పావురం ప్రధానంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్నవాటిని కూడా ఇవి గుర్తించగలవు. 16గంటలు అవిశ్రాంతంగా ఆకాశంలో ఎగురగలవు. అందుకే వీటిని పూర్వపు కాలంలో సందేశాలు ఒక ప్రాంతం నుండి మరొక సుదూర ప్రాంతానికి పంపడానికి ఉపయోగించేవారు. పావురాలు తలను పైకెత్తకుండానే ఆహారాన్ని స్వీకరించగలవు. కానీ ఇతర పక్షలు పావురం మాదిరి ఆహారాన్ని స్వీకరించలేవని అంటారు. ఇంకా పావురం గుండె … Read more

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు. ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం … Read more

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి? చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా నిరక్షరాస్యులు ప్రయాణం చేసేటప్పుడు, వారికి ఎదురయ్యే అనుభవాలు బాగుంటాయి. నిరక్షరాస్యులు ఏమి తెలియని కొత్త ప్రదేశాలలో ప్రయాణం చేయాలంటే, వారు వారి గమ్యస్థానం చేరేవారికి ఇతరులపై ఆధారపడాలి. అయితే సమాజంలో మంచివారు ఉంటారు. మోసం చేసేవారు ఉంటారు. మంచివారు ఎదురైతే వారికి మేలు కలగవచ్చును. కానీ మోసం చేసేవారు ఎదురైతే మాత్రం నష్టపోతారు. అంటే చదువు రాకపోతే … Read more

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి , జనుల యందు ఎవరిలో అయితే ఎల్లప్పుడూ మంచి లక్షణాలను కలిగి ఉంటారో, వారిని సజ్జనులుగా లోకం కీర్తిస్తూ ఉంటుంది. తమకు ఎటువంటి పరిస్థితి ఉన్నాసరే తమయందు ఉన్న గొప్పగుణముల లక్షణాలను కోల్పోనివారిని సజ్జనులుగా లోకం గుర్తు పెట్టుకుంటుంది. సహజంగానే వీరికి సహనం ఉంటుంది. ఎటువంటి స్థితిలోనూ తమ సహనాన్ని కోల్పోరు. సజ్జనులు లక్షణాలు మంచి గుణములుగా మరొకరికి మార్గదర్శకంగా ఉంటాయిని అంటారు. సాహసంగా వ్యవహరించగలరు. క్లిష్ట సమయాలలో సమయస్పూర్తితో వ్యవహరించడంలో … Read more

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. చూసి నేర్చుకునే విద్యైనా, చదివి తెలుసుకునే విద్య అయినా సరే గురువు ద్వారా నేర్చుకునే విద్యకు రాణింపు ఉంటుంది. మంచి గుర్తింపుతో బాటు మనోవిద్య కూడా … Read more

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది. ముఖ్యంగా తాత-ముత్తాతలు, అమ్మమ్మ, అమ్మకు అమ్మమ్మలు మాటలు పిల్లలలో మంచ అవగాహనను కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు చూపుకునే ప్రేమాభిమానాలు ఎదుగుతున్న పిల్లలో ఒంటరితనం అనే భావన లేకుండా, పాజిటివ్ దృక్పధం పెరిగే అవకాశాలు ఎక్కువ. … Read more

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు. స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను హరించే గర్హించాలి. సమాజంలో మనుషులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కుంది. కాబట్టి వ్యక్తి ఎదిగేవరకు సంరక్షకుల నియంత్రణలో ఉన్నా … Read more

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి. పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి? మొక్కగా ఉన్నప్పుడే … Read more

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో వ్రాయడం అంటే వ్యక్తిత్వ ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన పత్రాలను కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ వ్రాయడం. ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన మీపేరు, మీరు చదివిన తరగతి, మీ స్కూల్ పేరు. టు, ది ప్రిన్సిపాల్, స్కూల్ పేరు. విషయము: వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు కొరకు అభ్యర్ధన అయ్యా, నా పేరు______________________ నా యొక్క తండ్రి పేరు__________________. నేను__________________ స్కూల్ … Read more

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువు గురించి చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఆ బంధం అట్టేకాలం కొనసాగదు. సహచరుల విషయంలో చెడు … Read more

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ పుట్టిస్తాయి. విద్యార్ధులకైతే ఏదైనా సాధించాలనే లక్ష్యము ఏర్పడగలదు. తన జీవితములో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వాస్తవిక దృష్టితో … Read more

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు. ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మ విషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే, అమ్మ పంచిన ప్రేమను తరిచి చూస్తే చాలు… పదాలు ప్రవహిస్తూ పేరాలుగా ఏర్పడుతూ పేజీలకు పేజీలు పెరుగుతూనే … Read more

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా… ఇది వంటబట్టించుకున్న వ్యక్తి అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అందరితో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఆ మాటలోనే చాలా ఆంతర్యం ఉంటుంది. పోరు అంటే పోరాటం లేక యుద్ధం అంటారు. పొందు అంటే సఖ్యత, స్నేహం, … Read more

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి వంటిది అంటారు. మనిషి ఒక వనరుగా ఉంటే, మానవ వనరు అంటే, ఒక సంస్థకు పనిచేసే మనుషులను మానవ వనరులు అంటే, ఒక సంస్థలో నియమితులైన సిబ్బందినే హ్యుమన్ రిసోర్సెస్ అంటారు. సంస్థకు ఉండే … Read more

అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే

అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే జీవితంలో కష్టాలు అంటారు. అమ్మ అనుగ్రహం అందరిపై ప్రసరించాలి… హ్యాపీ దసరా విషెస్ టు యు చిన్నపిల్లలను అమ్మ అనునిత్యం రక్షిస్తూ కంట గమనిస్తూ ఇంటిపని చేసుకుంటూ ఉంటుంది. అటువంటి అమ్మ నన్ను పట్టించుకోవడం లేదని శ్రీకృష్ణుడంతటివాడే అల్లరి చేశాడని భాగవతంలో చెబుతారు. పిల్లలుగా ఉన్నవారెవరైనా అంతే అల్లరితోనే అమ్మతో ఆటలు… ఎంత అల్లరి చేసినా, ఎంత మొండివారైనా సరే పిల్లలను అమ్మ ఓ కంటకనిపెడుతూనే … Read more

చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి

చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి చదవడం కోసం చదువుకోవాలి. ఇప్పుడు పుస్తకం చదవాలంటే చదువు ఉండాలి. ఊరిపేరు చదవాలంటే, చదువు ఉండాలి. ఒక వ్యక్తి వ్రాసిన పుస్తకం చదవాలంటే, చదువుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి అవగాహన రావాలంటే, చదువుకోవాలి. అక్షర రూపంలో ఉండే వివిధ విషయాలు తెలుసుకోవాలంటే, చదువు రావాలి. చదువుకోవాలి. అక్షరరూపంలో నిక్షిప్తమైన విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే, చదువు తప్పనిసరి. లేకపోతే అనేక విజ్ఙాన విషయాలు ఇతరులతో చెప్పించుకోవాలిన స్థితి వస్తుంది. … Read more

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం వ్రాయమంటే, ఆర్ధికపరమైన పొదుపు గురించి, నీటి పొదుపు గురించి, విద్యుత్ వాడుకలో పొదుపు గురించి, మోటారు వాహన వాడుకలో పొదుపు గురించి ఇలా వివిధ అంశములలో పొదుపు గురించి తెలుసుకోవడం వలన ఆర్ధిక ప్రయోజనాలు మరియు సామాజిక ప్రయోజనలు ఉంటాయని అంటారు. ముందుగా పొదుపు అంటే ఏమిటి అంటే, తగు పాళ్ళల్లో వాడుక. తగినంతగా ఉపయోగించుట. తగు సమయంలో ముగించుట… అంటే డబ్బు విషయానికొస్తే, ధనం విరవిగా ఖర్చు చేయకుండా ఎంత … Read more

బమ్మెర పోతన గురించి రాయండి

తెలుగులో బమ్మెర పోతన గురించి రాయండి. ఈయనను బమ్మెర పోతనామాత్యులుగా పండితులు ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. పోతనామాత్యులు గారికి సహజ పండితుడు అను బిరుదు కూడా కలదు. ఈయన రచించిన భాగవతం కాసుల కోసమని రాజులకు అంకితం ఇవ్వలేదు.. తన మనసంరాజ్జ్యంలో కొలువై ఉన్న రాముడికే అంకితమిచ్చాడు. ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు… ఈ రామభక్తుడు. బమ్మెర పోతరాజు పోతనగా బాగా పరిచయం కలిగిన పేరు. కారణం ఈయన రచించిన శ్రీమద్భాగవతం భక్తులపాలిట కల్పవృక్షం. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్న భాగవతం తెలుగులో తెలుగువారికి అందించాలనే శ్రీరాముడు తలంపును పోతన స్వీకరించాడు. సహజ పాండిత్యం కలిగిన పోతనామాత్యులు భాగవత అనువాదం తెలుగులో రచన చేసారు. ఈయన రచించిన భాగవతంలో పద్యాలూ ఎప్పటికి భక్తుల పాలిట కల్పవృక్షమే అంటారు. ఎందుకంటే ఈయన రచించిన భాగవతం అప్పటి సాదారణ వాడుక భాషలో వాడె పదప్రయోగాలూ ఎక్కువ అని అంటారు. “అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్….” “ఇందు గలఁ డందు లేఁ డనిసందేహము … Read more

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం. తినగ తినగా వేము తీయగుండు అంటారు. అంటే చేదుగా ఉండే వేపాకు కూడా తినగ తినగా తీయగా అనిపిస్తుంది అంటారు. అలాగే ఒక పని చేయగ చేయగా అదే అలవాటు అయ్యి, ఆ పనిని సునాయసంగా చేసేస్తూ ఉంటారు… నేర్చుకునే వయసులో పిల్లలకు చూసి నేర్చుకోవడం, అలకిస్తూ ఆలోచించడం, వినడం ద్వారా నేర్చుకునే జ్ఞానం పెంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వయసులో మంచి విషయాలవైపు వారి దృష్టి వెళ్ళేలా … Read more

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై వ్యాసం రాయండి. అంతంత మాత్రంగా ఉండే కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రిత్యా చిన్న వయస్సులోనే కార్మికులుగా మారే బాలలు ఉండడం సమాజం యొక్క దురదృష్టకం. అంతర్జాతీయ కార్మిక నిర్వహణ వ్యవస్థ యొక్క సర్వేలో లక్షలాది బాల కార్మికులు ఉన్నారని తేలడం వలన ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇంకా గమనిస్తే చుట్టూ ఉన్న పరిసరాలలో బాల కార్మికులు కనబడుతునే ఉంటారు. బడికిపోయి చదువుకోవలసిన బాలలు హోటల్లలో పని … Read more

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి? అధిక్షేపం ఆక్షేపించడం అంటారు. అంటే ఒక విషయంలో ఉన్న లోపామును అర్ధవంతంగా వివరణగా విశదీకరించడం అంటారు. పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మేధావులకు ఆ చట్టాలు లోపభూయిష్టంగా అనిపిస్తే, వాటిపై ఆక్షేపణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చట్టం యొక్క ఉద్దేశం, ఆ చట్టం యొక్క ప్రభావం, ఆ చట్టం అమలు అయితే వచ్చే దుష్ఫలితలను తెలియజేస్తూ విశ్లేషణలు వ్యక్తం చేస్తూ … Read more

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు తెలుగు వ్యాసం. ఆర్ధికపరమైన స్థితి బాగుంటే సమాజంలో గౌరవం బాగుంటుంది. సమాజంలో గౌరవం తనకు తనని నమ్ముకున్నవారికి రక్షగా ఉంటుంది. కబటి ఆర్ధిక అభివృద్ది కోసం చూసినప్పుడు నగరాలలో ఎక్కువగా ఉంటుంది. అధిక జనాభా, ఎక్కువ అవసరాలు, తీరిక లేని జనులకు సేవలు, ఆర్ధిక స్థితి మెరుగుపర్చుకోవడానికి నగర జీవనంలో అవకాశాలు ఎక్కువ… ఇదే ప్రధానమైన అనుకూల అంశం… మిగిలినవన్నీ దీనికి అనుకూలంగా ఉంటాయి. నగరంలో నివసించేవారికి ఆర్ధిక … Read more

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం. ఒకప్పుడు ప్రపంచం చుట్టి వచ్చినవారి ద్వారా లోకంలో జరిగే విషయాలు తెలియబడుతూ ఉండేవట. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఉంటే లోకం మొత్తం దర్శించే అవకాశం ఉంది. ఇక లోకం గురించి తెలియనిదేముంది? ఎక్కెడెక్కడో జరిగినవి, జరిగేవి, జరుగుతున్నవి… అప్పటికప్పుడు ఉన్న చోట నుండే తెలుసుకునే సౌకర్యం మొబైల్ వలన ఏర్పడుతుంది. స్మార్ట్ మొబైల్ అయితే లోకంలో జరుగుతున్న విషయాలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇలా మొబైల్ ఒక లోక … Read more

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం. వ్యాసాలు విషయాలను విపులంగా విశదీకరిస్తాయి…. వచన రూపంలో ఉండే విషయాలు తెలుసుకోవడంతో బాటు వాటి గురించి బౌతిక పరిచయం కావడం వలన మనసుకి విషయ విజ్ఞానము వృద్ది చెందుతుంది. విజ్ఞానయాత్రలు చేయడం వలన లోకజ్ఙానం వస్తుంది. ప్రత్యేక స్థలాలకు ప్రయాణం చేయడానికి ఆసక్తి ఉంటుంది, అటువంటి ఆసక్తి చేత విజ్ఙానయాత్రలలో వినోదంతో బాటు విజ్ఙానం కూడా సంపాదించవచ్చును. పుస్తకపఠం చేత విషయ జ్ఙానం లభిస్తే, విజ్ఙానయాత్రలు వలన విజ్ఙానంతో బాటు … Read more

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు. అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటైనారు. సమిష్టిగా తెలంగాణ సాదనకు ప్రజలు సహకరించారు. అంటే ఇక్కడ ఎంత ఎక్కువమంది ఒకే విషయంలో … Read more

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం… దూరం నుండి ప్రసారల అయ్యే చలన చిత్రములను దర్శనం చేయించే పరికరం. దీనినే టి‌వి అని అంటారు. టి‌వి ఫుల్ ఫార్మ్ టెలీవిజన్ అంటారు. దీని ద్వారా ఇంట్లో కూర్చొని సినిమాలు, వార్తలు, దారవాహిక కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చును. కుటుంబంలో దూరదర్శిని ఒక భాగమై కూర్చుంది. శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమములను చలనచిత్ర రూపంలో దూరదర్శిని మనకు దర్శింపజేస్తుంది. అందుకే దీనిని దూరదర్శనీ అంటారు. రేడియోలో అయితే కేవలం … Read more

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి. గాలిలో ప్రయాణం చేస్తూ ఉండే శబ్ధ సంకేతాలను మనకు మాటలు లేక పాటలు రూపంలో వినిపించే సాధనాన్ని రేడియో అంటారు. విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రయాణం గురించి గతంలో మ్యాక్స్ వెల్, హెర్ట్ జ్ మరియు బ్రాన్లీ వంటివారు ప్రయోగాలు చేస్తే, చివరికి మార్కోని ప్రయోగాల అనంతరం రేడియో ఆవిష్కరణ జరిగినట్టు చరిత్ర చెబుతుంది. 1907 సంవత్సరంలో బ్రిటిష్ నావికాదళంలో ఒక ఓడ నుండి మరొక ఓడకు వారి జాతీయగీతం … Read more

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి. టి‌వి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే. ప్రతిదినం ఎన్నో ఇళ్ల ముంగిట్లోకి వార్తలు చేరవేసే ప్రక్రియను వార్తా పత్రికలు చాలాకాలం నుండి మోసుకొస్తున్నాయి. టి‌వి చూసినా సరే, … Read more

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం. చలన చిత్రం అంటే ఆంగ్లంలో సినిమా అంటారు. వెండితెరపై కదిలే బొమ్మలు మాట్లాడుతూ సన్నివేశాలలో పాల్గొంటూ ముగింపుకు వచ్చే కధను తెలియజేసేది సినిమా. మనుషులు నటించిన పాత్రలను తిరిగి అనేకమార్లు తెరపై ప్రదర్శించేవిధంగా తయారు చేసిన ప్రక్రియ చలనచిత్రంగా మారితే, అది అనేకమార్లు ధియేటర్లలో ఇంకా ఓటిటి ద్వారా చిన్న చిన్న తాకే తెరలలో కూడా ప్రదర్శితమవుతుంది. అదే సినిమా…. తెలుగులో మొదటి చలన చిత్రం శబ్దం లేకుండా మూకీ … Read more

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

గ్రంధములకు ఆలవాలమైన స్థలమునకు గ్రంధాలయం అని పేరు. అనేక గ్రంధములు ఈ గ్రంధాలయాలలో ఉంటాయి. గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి. అంటే లైబ్రరీ గురించి తెలుగులో వ్యాసం. గ్రంధము అంటే పుస్తకము. ఆవహించడానికి అనువుగా ఉండేది. దేవాలయంలో దేవుడు ఆవహించినట్టుగా గ్రంధాలయములో గ్రంధములు ఆవహించు ఉంటాయి. గ్రంధములలో శాస్త్ర పరిజ్ఙానం నిక్షిప్తం అయి ఉంటుంది. ఇక గ్రంధాలయం అంటే పుస్తకాలయం. అంటే పుస్తకములు నిల్వ ఉంచు ప్రదేశముగా చెప్పవచ్చును. ప్రజల ఉపయోగం కొరకు విజ్ఙాన విషయాలు … Read more

తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ

తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ వ్రాయడం గురించి…. లేఖ వ్రాసేటప్పుడు మొదటగా టాప్ రైట్ కార్నర్లో డేట్, దాని క్రిందగా ప్లేస్ వ్రాస్తాము. ఆ తరువాత ఉత్తరం వ్రాసే వ్యక్తి పేరు, ఆ వ్యక్తి చిరునామ వ్రాస్తాము. ఇంకా క్రిందగా ఉత్తరం ఎవరికి వ్రాస్తున్నామో వారి హోదాను బట్టి, వారిని సంభోదిస్తాము. మిత్రుడుకి లెటర్ వ్రాస్తున్నాము కాబట్టి ప్రియమైన స్నేహితుడా…. లేదా ప్రియనేస్తమా లేకా ప్రియమిత్రమా… అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ లేఖ వ్రాయడం మొదలు … Read more

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ వ్రాయమని అంటే ఎలా వ్రాయాలి. ముందుగా లేఖ ఎవరు ఎవరికి వ్రాయాలి? విద్యార్ధి అయితే, స్కూల్ ప్రిన్సిపల్ కు ఉద్యోగి అయితే తన పై అధికారికి సెలవు ధరఖాస్తు పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక విధ్యార్ధి స్కూల్ హెడ్ మాస్టర్ కు లేఖ వ్రాయాలంటే, ఎలా వ్రాయాలి? మొదటగా సెలవు ధరఖాస్తు అంటే ఆంగ్లంలో అయితే లీవ్ లెటర్ అంటూ హెడ్డింగ్ పేపర్ పైభాగంలో వ్రాయాలి. ఆ తరువాత … Read more

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం. స్మార్ట్ ఫోన్ వాడుక పెరిగాక డిజిటల్ చెల్లింపులు అధికమయ్యాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుక విధానం చాల సులభంగా మారింది. కేవల అక్షర జ్ఞానం ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ వాడుక చాల తేలిక. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ భాష ప్రాంతీయ భాషలలోకి మార్చుకోవచ్చు. సాధారణంగా అయితే కరెంట్ బిల్లులు వంటి నెలవారీ చెల్లింపులు క్యూలో నిలబడి కట్టుకునేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వలన ఆన్ లైన్ చెల్లింపులు సులభతరం అయ్యాయి. పేమెంట్ వాలేట్స్ అందుకు బాగా సహకరిస్తున్నాయి. ఎవరికైనా మని పంపాలంటే మనియార్డర్ లేదా బ్యాంకు నుండి లావాదేవీలు నిర్వహించవలసి ఉండేది. అయితే స్మార్ట్ ఫోన్, టాబ్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడుక పెరగడంతో బ్యాంకర్లు ఆన్ లైన్ బ్యాంకింగ్ బాగా ప్రోత్సహించడంతో లావాదేవిలు కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా జరుతున్నాయి. పేమెంట్ వాల్లెట్లు వచ్చాక చెల్లింపులు కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా జరగడం ఎక్కువ అయ్యింది. పేటీయం, ఫోన్ పే, జిపే వంటి పేమెంట్ వాల్లెట్లు ప్రజలు బాగా వాడుతున్నారు. ఇలా స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులు పెరిగి, నగదు లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి. నగదు లావాదేవీలలో చొర భయం ఉంటుంది. ఇంకా నగదు లావాదేవిలలో రశీదు కీలకం. నగదు రశీదు వలన నగదు ముట్టినట్టు లేదా ముట్టనట్టుగా పరిగణిస్తారు. కానీ డిజిటల్ చెల్లింపులు నేరుగా ఖాతాదారుని ఖాతాకు జమ అవ్వడంతో దానికి డిజిటల్ ప్రూఫ్ ఉంటుంది. బౌతికంగా రశీదుతో పని ఉండదు. అయితే డిజిటల్ చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ఉన్నవారికే డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతా లేనివారికి మాత్రం డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ లేద టాబ్ వంటి పరికరాలతో పేమెంట్ చెల్లింపులు చేయలేరు. ఏదైనా ఒక జాతీయ బ్యాంక్ ఖాతాతో, సులభంగా యూపిఐ ద్వారా … Read more

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం. ఇప్పటి ప్రసాద సాధనాలు యువతపై రెండు రకాల ప్రభావం చూపించే అవకాశం కలదు. ఒకటి: ఉపయుక్తమైన విషయ సంగ్రహణం చేసే క్రమంలో ఉత్సాహావంతులకు ప్రోత్సాహకరంగా నేటి సాంకేతికత ఉపయోగపడును. రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్లేడు రెండువైపులా పదును కలిగి ఉండి, దానిని ఉపయోగించేటప్పుడు చేతి వెళ్లకు ప్రమాదకరంగా ఉంటుందో, నేటి సాంకేతికత కూడా ఎదిగే మనసుకు అలాగే ఉంటుంది. … Read more

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజంపైన పడుతుందా? అవుననే అంటారు. ఎందుకంటే ఒకప్పుడు హిట్ సినిమాను బట్టి, ఆ సినిమా చీరలు అని అమ్మకాలు కొనసాగించేవారు. అంటే పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ అయ్యింది… ఆ తురువాత బట్టల షాపులలో పెళ్ళిసందడి చీరలు అంటే అమ్మకాలు ఎక్కువగా ఉండేవి… అదేవిధంగా తెలుగు సినిమా హీరోల స్టైల్ కూడా యువతపై ప్రభావం చూపుతుంది. మన తెలుగు సినిమాల కధలు సమాజంలో ఎదో ఒక మూల జరిగిన సంఘటన ఆధారంగా లేక రచయిత మైండులో పుట్టిన ఆలోచన ఆధారంగా కావచ్చు. కాని ఆయా తెలుగు సినిమాల ప్రభావం మొత్తం తెలుగు సమాజంపై ఉంటుంది. ఎక్కువ అభిమానులు కలిగిన హీరో సినిమా అయితే, ఎక్కువమంది యువకులపై ప్రభావం చూపుతుంది. ఏమిటి? ఈ తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజం పైన… అంటే ఆలోచనా ధోరణిలోకి సినిమాలలో ఉండే విషయాలు వచ్చి చేరతాయి. ఎలాంటి విషయాలు ఆలోచన ధోరణికి దగ్గరవుతాయి? అంటే కధానాయకుడు వేష ధారణ యువకులలో అనుసరించాలనే ఆసక్తిని పెంచవచ్చు. అలాగే కధానాయిక యొక్క వేషధారణ కు యువత మనసులో మెదులుతూ ఉంటుంది. ఇంకా మాటల ప్రభావం కూడా ఉండవచ్చు. అంటే సినిమాలో నాయకా నాయికలు మాట్లాడే భాషా శైలి యువతను ఆకట్టుకుంటే, అటువంటి శైలిని యువత అనుసరించడానికి ఆసక్తి కనబరచవచ్చు. ఇలా తెలుగు సినిమాల వలన వేషధారణ, మాటతీరు తెలుగు సమాజంపై పడే అవకాశం ఉంటే, ఇంకా సినిమా కధలో చేయవచ్చు, చేయకూడదు అనే పనులపైన కూడా సినిమా ప్రభావం ఉండవచ్చు. సమాజంలో ఎదో ఒక ప్రాంతంలో ఏదైనా వింత ప్రవర్తన ఉన్న వ్యక్తి ఉంటే, అటువంటి వ్యక్తి కధను సినిమాగా మరల్చడం ద్వారా ఆయా ప్రాంతీయ పోకడ మొత్తం సమాజానికే తెలియబడుతుంది. ఒక దర్శకుడి వినూత్న ఆలోచన సినిమాగా వచ్చినా ఆ ఆలోచన కూడా యువత మైండులో మెదులుతుంది. ఇలా కొందరి ఆలోచనా సృష్టి, సమాజంలో యువతపైన ప్రభావం చూపించే అవకాశం సినిమాల వలన ఎక్కువగా ఉండవచ్చు. మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ … Read more

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

మనకు అనేక తెలుగు కధలు ఉన్నాయి… అయితే కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే, కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని వ్యాక్యాలలో కధ గురించి…. ఈ తెలుగు వ్యాసంలో కధ అంటే ఎదో ఒక సత్యమైన విషయమును తెలియజేస్తూ, కల్పనతో కూడిన వచనం గాని, వాక్కుగా గాని చెబుతారు. పరిణామం ప్రకారం కధలు చిన్న కధలు, పెద్ద కధలు, నవలలు, ఒక పేజి కధలు… అలా కొన్ని రకాలుగా కధలు ఉంటాయి. కధలు చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి అమ్మ చెప్పే కమ్మనైన కధలు ఉంటాయి. ఇలా … Read more

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి ! గుణపాఠం అంటే గుణమునకు పాఠం. ఎవరి గుణమునకు పాఠం అంటే, చెడుగుణం కలిగిన వ్యక్తికి గుణపాఠం అంటారు. ఒక వ్యక్తిని మోసం చేస్తూ, మరొక వ్యక్తి జీవిస్తూ ఉంటే, మోసం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పే అవకాశం మోసపోయిన వ్యక్తికి కాలం కల్పిస్తుంది… కానీ గుణపాఠం త్వరగా ప్రారంభం కాకపోవచ్చు… కానీ గుణపాఠం ఎదురయితే జీవితంపై ప్రభావం పడుతుంది…. సమాజంలో గుర్తింపు మారుతుంది. సమాజంలో వివిధ రకాల స్వభావాలతో … Read more

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక ప్రవర్తన వలన ఆ బంధం మరింత బలపడుతుంది అంటారు. ఏ బంధం అయినా స్నేహం ప్రభావం ఉంటుంది. మానవ జీవనం అనేక బంధాలతో కొనసాగుతుంది. ప్రతి బంధంలోనూ స్నేహపూర్వకంగా ప్రవర్తించే వారు శాంతిగా ఉంటారు. వారి చుట్టూ ఉండేవారిని శాంతిగా ఉంచుతారు. అంటే స్నేహం యొక్క ప్రభావం ప్రతి మానవ బంధంపైనా ఉంటుంది. అంటే స్నేహం ఇద్దరి మద్యలో అంతరాలను తొలగిస్తుంది. ఇద్దరినీ ఒక్కటి చేసే ప్రక్రియలో … Read more

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది? వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారబడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే, ఆ వ్యక్తి చేతివృత్తికి … Read more

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం. మాటతీరు వలన మన్ననలు పొందవచ్చు. మాట తీరుతో బాగుంటే, స్నేహపూర్వక సమాజం మనిషి చుట్టూ ఏర్పడుతుంది. సంఘంలో గుర్తింపు మాట తీరును బట్టి ప్రభావితం అవుతుంది. మనిషి మాట తీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. మాట వలన మనిషికి మనిషికి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటే మంత్రం అవుతుంది. మాటే కష్టం పోగొడుతుంది. మాటే మనిషికి కష్టాన్ని తీసుకురావచ్చు. మాట శక్తివంతమైనది… అది ఒక మంత్రంగా పనిచేయగలదు. ఎందుకంటే మాట మనసుని తాకుతుంది. వ్యక్తి మాట తీరు బాగుంటే, ఆ వ్యక్తి చుట్టూ స్నేహితులే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా సరే స్నేహపూర్వక ఆదరణ మాట తీరు బాగుండే వ్యక్తిపై చూపుతారు. అలా కాకుండా ఒక వ్యక్తి మాట తీరు కటువుగా ఉంటే మాత్రం, ఆ వ్యక్తికి ఎక్కువమంది మిత్రుల కంటే శత్రువులు పెరుగుతారు. మాట తీరు వలననే మిత్రత్వం లేదా శతృత్వ భావనలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో వ్యక్తిపై అతని మాట తీరు ప్రభావం చాల ప్రముఖమైంది. అతని మాటే అతనికి పరిచయాలు తీసుకువస్తుంది,. మాట తీరును బట్టి స్నేహితులు గాని శత్రువులు గాని ఉండవచ్చు. మాట తీరు మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలదు, మాట తీరు వలన విషయాలను చక్కగా వివరించవచ్చును. మాట తీరు మంచిదైతే లోకం అంతా ప్రశాంతంగా కనబడుతుంది. లేకపోతె లోకం అశాంతిగా అనిపిస్తుంది. కొందరి మాట తీరు ఎదుటివారిలో శాంతిని రేకెత్తిస్తే, కొందరి మాట తీరు ఎదుటివారిలో అశాంతికి కారణం కాగలదు. కొందరు నొప్పించే మాట తీరు కలిగి ఉండి, తమ చుట్టూ ఉండేవారిని కూడా బాధపెడుతూ ఉంటారు. మాట సాయం వలన మనిషికి మనో బలం ఏర్పడుతుంది. అటువంటి మాట సాయం మంచి మాట తీరు కలిగిన వ్యక్తులకే సాద్యమంటారు. మాట తీరు ప్రాముఖ్యత గురించి పురాణాలలో కూడా కనబడుతుంది. మనకు మాట … Read more

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం. శతకాలు చదవమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉన్నత తరగతి పాఠ్యాంశాలలో కూడా తెలుసు శతకాలు ఉంటాయి. పలువురు పెద్దలు శతకాలను చదవమని చెప్పడమే, శతకాలు చదవానికి ఒక ప్రేరణ. ఇంకా ఉన్నత తరగతి పాఠ్యాంశాలలోనూ తెలుగు శతకాలు ఉండడం కూడా ప్రధాన కారణంగా కనబడుతుంది. సమాజనికి మేలు చేసే విషయాలు బాల్యం నుండి అలవాటు చేయడం కోసం పలు పాఠ్యాంశాలు విధ్యార్ధులకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ విధంగా ఆలోచన చేస్తే, … Read more

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో ఈ పోస్టు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మనిషికి మరచిపోవడం ఎంత సహజమో అంతకన్నా ఎక్కువ విషయాలు గుర్తులో ఉంటాయి. ఏదైనా మరిచిపోయే విషయం అతిగా ఉండడం అంటే బాగా వయస్సు అయిపోయాక జరిగేది మాత్రమే… మరిచి పోవడం అనేది చాలా సహజం, అయితే అన్నీ విషయాలు మరిచిపోము. ఎప్పుడో ఏదో ఒక విషయం మరిచిపోతే మనకు పది విషయాలు గుర్తుకు ఉంటాయి. అంటే ఇక్కడ మరిచిపోయినది, గుర్తుకు రాకపోయేసరికి … Read more

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

మాయొక్క పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం , కొత్తగా కట్టబడిన మా పాఠశాలలోకి మేము ఈ మద్యనే మారాము. అందమైన భవనంలోకి మా పాఠశాల మార్చబడింది. ఊరికి దూరంగా కొత్తగా నిర్మించిన పాఠశాల చుట్టూ చెట్లు ఉంటాయి. చాలా ప్రశాంతంగా పాఠశాల వాతావరణం ఉంటుంది. మూడు అంతస్తుల భవనంలో అన్నీ తరగతులు మరియు తరగతుల సెక్షన్ల వారీగా గదులు ఉంటాయి. నేను చదువుకునే తరగతి గది చివరి ఫ్లోర్. మాతరగతి గదికి ఒక డోర్, ఇంకా రెండువైపులా … Read more

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం. క్లాసులో సమాధానం చెప్పాలి. పరీక్షలో పేపరుపై బాగా వ్రాయాలి. అర్ధవంతంగా సమాధానాలు వ్రాయడం ప్రధానం. SSC పరీక్షలు ఫెయిల్ అయితే అంతే, అనే భావన కొందరిలో ఉంటుంది. అటువంటి భావన వలన బాగా చదివేవారు కూడా పదవతరగతికి వచ్చేసరికి వెనుకబడే అవకాశం ఉంటుంది. కనుక పదవతరగతి బాగా చదవాలనే బలమైన సంకల్పం చేసుకోవాలి. అందుకోసం కృషి చేయాలి. ఇష్టపడి చదివితే, చదివే సమయం కష్టం తెలియకుండా ఉంటుంది. సమయం … Read more

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం. నేటి బాలికలే రేపటి తల్లులు మారతారు . గృహిణిగా ఇంటి బాధ్యతలు చక్క పెట్టె, అమ్మ పిల్లలకు మొదటి గురువు గా ఉంటుంది.  తల్లి దగ్గర నేర్చిన పాఠం జీవితంలో ఎప్పటికి గుర్తు ఉంటుంది. కాబట్టి ఒక తల్లి తన పిల్లలకు విద్యను నేర్పించడానికి, ఆమె బాల్యం లో చదువుకుని ఉండుట చాల చాలా ప్రధానమైన విషయం. మారుతున్న కాలంలో ఆడువారు ఉద్యోగస్తులుగా చక్కగా రాణిస్తున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం … Read more

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర అంటే జరిగినది, జరగబోయే రోజులలో వర్తమానంగా వర్తింపబడుతుంది. అంటే గతంలోని విషయాలు ఈరోజు తెలుసుకోవడం… జరుగుతుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినది. దానిని కొంతకాలం జరిగాక, గుర్తుకు చేసుకుంటే అది గతం అవుతుంది. అలాంటి గత సంఘటనలు సమాజంపై చూపిన ప్రభావాన్ని బట్టి చరిత్రగా మనకు మరలా గుర్తుకు వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి జీవితం ముగిసింది. ఆయన జీవితం గతించిన జీవితంగా పరిగణింపబడుతుంది. ఎవరైతే … Read more