దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి. కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది… మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం. వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా చెబుతారు. అనేక ఆలోచనలు సృష్టించే మనసు వివిధ విషయాలపై వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇలా […]
తెలుగు నాట దీపావళి పండుగ
తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి. ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా అవతారం స్వీకరించింది. కృష్ణుడికి ఆమె భార్య అయ్యింది. వరప్రసాదం వలన నరకుడు తనకన్నా శక్తివంతుడు లేడని లోకంలో […]
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం? వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక క్రమశిక్షణ దోహదపడుతుంది. ఒక వ్యక్తి సామాజిక స్థితిని ఆర్ధిక పరిస్థితి శాసిస్తుంది. సమాజంలో గౌరవం వ్యక్తి యొక్క ఆర్ధిక స్థితి ఆధారంగా ఉంటుంది. కుటుంబ జీవనంలో ఆర్ధిక వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. సామాజిక […]
మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని
మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని అడ్డుపెట్టుకుని, మనసుపై పట్టు సాధించడం వలన స్వీయ నియంత్రణ పెరుగుతుందని అంటారు. మనిషికి మనసే బలం మనసే బలహీనత అంటారు. విద్యార్ధి దశలో చిన్న చిన్న పొరపాట్లే అలవాట్లుగా మారకుండా జాగ్రత్తపడాలి. నేర్చుకుంటూ ఏవో కొన్ని విషయాలను అలవాటుగా మార్చుకునే గుణం మనసుకు విద్యార్ధి దశలో ఉంటే, మంచి విషయాలలో ఆసక్తి అలవాటుగా మారితే, అవి జీవితానికి ఉపయోగపడతాయని అంటారు. రోజూ ఆడుకోవడం ఇష్టం కాబట్టి ప్రతిరోజూ ఆట ఆడుకునే సమయానికి […]
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది. ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావులలో ధర్మరాజు గొప్పవానిగా కీర్తింపబడ్డాడు. క్షత్రియ ధర్మం ప్రకారం రాజ్యాధికారిగా ఉండేకాలంలో రాజుగా ఉండాలి కాబట్టి శ్రీకృష్ణునితో ధర్మరాజు చెప్పే మాటలు […]
మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?
మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు కూడా అమ్మ సంతోషం కోసం అమ్మ చేత కట్టబడ్డాడు… కాబట్టి తల్లి సంతోషం కన్నా కొడుకు సాధించేదేముంటుంది? […]
జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?
జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. కేవలం వృత్తి పనితో బాటు తగిన చదువు ఉంటే, వ్యక్తి తనకు వచ్చిన పనితోనైనా జీవనం కొనసాగించగలడు. లేదా ఇతర కార్యాలయములలో ఉపాధి అవకాశాలు చూసుకోగలడు. కావునా […]
దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు
దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు. దీపావళి పండుగ ప్రతియేడాది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ అమావస్యనాడు వస్తుంది. ఇంగ్లీషు కేలండర్లో ఒక్కోయేడాది ఒక్కో తారీఖున వస్తుంది. అయితే ఎక్కువగా నవంబర్ మాసంలోనే ఈ దీపావళి పండుగ వస్తుంటే, దీపావళి ఎందుకు చేసుకుంటారు? పురాణ ప్రవచనాలు లేదా పురాణ కధనాలు ప్రకారం నరకాసురుని వధించిన తర్వాతి రోజు లోకాన్ని పట్టి పీడించిన నరకాసురుడు మరణం సందర్భంగా సాధు జనుల సంతోషంగా దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటున్నట్టుగా చెబుతారు. […]
కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో
కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తే, కొత్త ఉత్సాహాన్ని అందిస్తే, అదే మనసుకు బలం అంటారు. అందుకేనోమో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు సరికొత్తగా అనిపిస్తుంది. కొత్త వస్తువు వచ్చినప్పుడు సరికొత్తగా ఉంటుంది. అందుకేనోమో మన పెద్దలు పండుగలకు కొత్త బట్టలు, కొత్త కానుకలు సిద్దం చేసేవారు. ఏదైనా కొత్త అనేది సరికొత్తగా అనిపిస్తుంది… ఒక ఉత్సాహాన్ని అందిస్తుంది… మనసులో కొత్త ఆలోచనలు కూడా మొదలవుతాయి అంటారు. ఒక తెలుగు సామెత లేదా జాతీయం ఉంది… కొత్త ఒక వింత పాత ఒక రోత. అంటే కొత్త ఒక వింతగా అనిపిస్తే పాత ఒక రోతగా అనిపిస్తుందని అంటారు. పాత పరిచయస్తులు ఉన్నప్పుడు కొత్త పరిచయస్తులతో కలిసిపోతూ ఉంటుంటే అలంటి సందర్భాలలో ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు. అంటే పరిచయం అయిన కొత్తది ఒక వింత భావనను కలిగించే అవకాశం ఉంటుంది. సరే వాడుతున్న వస్తువు స్థానంలో కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు ఎంతో ఉత్సాహం ఉంటె, అసలు తొలిసారి కొత్త వస్తువు కొనుక్కునేటప్పుడు ఇంకెంత ఉత్సాహం ఉంటుంది? స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉండేవారు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు సంతోషంగా ఉంటె, మరి మొదటి స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారు? ఈ ప్రశ్నలకు జవాబు ఆలోచిస్తే, కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తుందనే భావన బలపడుతుంది.
వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం
వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం. ఎవరికివారికి వారి వారి వృత్తులంటే అభిమానం ఉంటుంది. తమ తమ వృత్తులను ప్రేమిస్తారు. వృత్తిపై ఉండే ప్రేమ వలన వృత్తిలో కష్టనష్టాలను ఇష్టంతో అధిగమిస్తారు. పురాణ శాస్త్రజ్ఞులైనవారు అంటూ ఉంటారు “మనదేశంలో వృత్తిపని ఒక తపస్సు వలె” చేస్తారని. వైద్యుడు ఒక తపస్సు వలె వృత్తి పనిని నిర్వహించడం వలననే వేలమంది ప్రాణాలను నిలబెట్టగలరు. పోలీసు తమ వృత్తిని తపస్సువలె నిర్వహించడం వలననే సమాజనికి రక్షణ. ఒక […]
సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా
సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా చూసుకోవాలి! దసరా సెలవులు అయితే దసరా సెలవులకు ముందు వ్రాసిన పరీక్షలు ఎలా వ్రాయసమో? ఒక్కసారి ప్రశ్నించుకుని ఆలోచిస్తే, చదువులో మనం ఎంత ముందున్నమో మనకు ఒక అవగాహన వస్తుంది. అలా కాకుండా పరీక్షలు అయ్యాయి కదా మరలా స్కూల్ తెరిచాక చూద్దాం అంటే, సంవత్సం అంతా సాదరణమే. ప్రతి విద్యా సంవత్సరంలో మద్య మధ్య జరిగే పరీక్షలు మనం గ్రహించిన విషయ పరిజ్ఞానం ఏమిటో తెలియబడుతుంది. కాబట్టి అలా దసరా […]
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత తెలుగు వ్యాసం. బడికిపోయి చదువుకునే పిల్లలు, పనిని పరిశీలించే పిల్లలు, తండ్రిని అనుసరించే పిల్లలు, చదువుకోని పిల్లలు, వ్యతిరేకించే పిల్లలు… రకరకాల స్వభావాలతో పెరుగుతున్న పిల్లలే రేపటి యువత. కొందరు బాల బాలికలు సహజంగా చదువుకోవడానికి సుముఖంగా ఉంటే, కొందరు బాల బాలికలు చదువుకోవడం కన్నా ఏదో నేర్చుకునే ప్రయత్నంలో ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కొందరు బాల బాలికలు ఖాళీగా తిరగడానికి ఆసక్తి చూపవచ్చు… కానీ తల్లిదండ్రుల […]
అంతరంగం తెలుగు పద భావన
అంతరంగం తెలుగు పద భావన చూద్దాం. అంతరంగం అంటే ఆంతర్యంలో ఉండే ఆలోచన విధానం కావచ్చు లేదా మనసులో ఉండే భావన. మన పెద్దలు లోదృష్టి అంటూ ఉంటారు. అంటే పైకి చెప్పే మాటలు కాకుండా లోపల ఎటువంటి భావన కలిగి ఉంటారు. ఎటువంటి ఆలోచనా విధానం సాగుతూ ఉంటుంది. ఇలాంటి లోదృష్టిని అంతరంగం అంటారు. సముద్రంలో తరంగం వస్తూ, పోతూ ఉంటుంది. అలాగే మనిషి మనసులో ఆలోచన తరంగం మాదిరి పుడుతూ ఉంటుంది… పోతూ ఉంటుంది. […]
చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా
చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా ఎగబ్రాకింది. ఇప్పుడు చాయ్ త్రాగకుండా రోజు గడపలేనివారు కూడా ఉంటారు. అలా మనకు చాయ్ అనేది అలవాటుగా ఉంది. కొందరికి అతిగా త్రాగే అలవాటు కూడా ఉండవచ్చు. ఛాయ్ చైనాలో పుట్టిందట. క్రీ.పూ. 2737వ సంవత్సరంలో చైనాను షెన్ నాంగ్ అనే చక్రవర్తి చేత చాయ్ కనుగొనబడిందట. అంటే యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనలో చాయ్ సదరు చైనా చక్రవర్తి తాగారట. అది ఎలా అంటే, గాలిలో ఎగిరి వచ్చిన […]
సినిమా రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్య…
సినిమా రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్యగా కనబడతారు. ఎందుకంటే స్వయంకృషితో పైకొచ్చిన హీరో అనగానే చిరంజీవే గుర్తుకువస్తారు. ప్రాణం ఖరీదు, పున్నమినాగు, కోతలరాయుడు, మంత్రిగారి వియ్యంకుడు అంటూ సినిమా రంగంలో పునాదిరాళ్ళు ఏర్పరచుకుంటూ… అందరి మనసులలో ఖైదీగా మారారు. గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు, హిట్లర్, మాస్టర్ అంటూ అందరికీ మెగా స్టార్ అయ్యారు. ఎదుగుతున్న హీరోలకు ఆదర్శం అనిపించుకున్నారు. ఎవరైనా కొత్తగా సినిమా రంగంలోకి వస్తే, అలా వచ్చినవారికి ప్రేరణ ఆచార్య చిరంజీవే అని గర్వంగా చెప్పుకుంటారు. […]
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం తెలుగులో…. నాయకుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు. ప్రజా సమస్య నుండి, దాని సాధించడానికి ప్రజల మధ్య నుండే నాయకత్వం ఉదయిస్తుందని అంటారు. నాయకత్వం వహించేవారు పెత్తనం చేయాలనే తపన కాదు… నాయకత్వం అంటే సమస్యను పరిష్కరించుకోవడంలో తను ముందుండి అందరికీ మార్గదర్శకంగా నిలబడడం అంటారు. కొందరు నాయకత్వం లక్షణాలు ఉన్నవారిలో అజమాయిషీ అనే ఆలోచన ఉండదు… వారిలో లక్ష్యాన్ని సాధించాలనే ఉండే పట్టుదల, లక్ష్యసాధనకు వారు చేసే కృషివలన అందరూ […]
చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే
చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే, శాస్త్ర ప్రకారం పెట్టుకున్న పేరు ప్రభావం ?పిల్లలకు పేరు పెట్టేటప్పుడు పంతులుగారికి పుట్టుక సమయం, తేదీ అందించి, వివరాలు అడిగి పేరు ఎంపిక చేస్తాం.కానీ పిల్లలకు మాత్రం చిట్టి చిట్టి పేర్లకు పలికే విధంగా అలవాటు చేయడం జరుగుతూ ఉంటుంది.అలా చిట్టి పొట్టి పేర్లతో పిల్లలను పిలుచుకునేటప్పుడు శాస్త్రప్రకారం నామకరణం చేయడం ఎందుకు అనే ప్రశ్న ఉదయించకమానదు.బాబుకు కానీ పాపకు కానీ పేరు పెట్టే సమయంలో మంచి […]
భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ
భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ అంటే తెలుగు వారందరికి గర్వ కారణమే. కరిగిపోతు కొవ్వొత్తి వెలుగు ఇస్తుంది… అలా ఒక తెలుగు గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డ దార్శనికత నేటి మన భారత ఆర్ధిక పురోగతి అని పెద్దలు ప్రశంసిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రశంశలు అందుకుంటున్న అలనాటి తెలుగు బిడ్డ అప్పటి భారతదేశ ప్రధానమంత్రి. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన పాలనలో దేశం పురోగతికి పురుడు పోసుకుంటూ ఉంటే, ఆయన తెలివికి నిశ్చేష్టతో […]
మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?
మీ చానెల్లో యొక్క యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేయడం ఎలా? ఈ బ్లాగు పోస్టులో…. అప్ లోడ్ చేయబడిన మీ యూట్యూబ్ వీడియో మరల మీ డెస్క్ టాప్ కంప్యూటర్ నందు డౌన్ లోడ్ చేయాలంటే, కొన్ని వెబ్ సైట్స్ ఉంటాయి. మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ నందు మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేసుకోవడం సులభమే. కంప్యూటర్ బ్రౌజర్లో వీక్షిస్తున్న వీడియో url ఈ క్రింది విధంగా ఉంది అనుకోండి. క్రింది యుఆర్ఎల్ గమనించండి…. పై యుఆర్ఎల్ నందు https://www. ఆంగ్ల అక్షరాల తరువాత youtube.com/watch?v=3wnG9k3VbVE ఈ ఆంగ్ల అక్షరాలకు ముందు ss అను రెండు అక్షరాల ఈ క్రింది యుఆర్ఎల్ మాదిరిగా జత చేసి ఎంటర్ చేయగానే… యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ లింక్ అందించే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. చుడండి పై యుఆర్ఎల్ నందు బోల్డ్ చేయబడిన ఆంగ్ల అక్షరాలు ఎక్కడ టైపు చేయబడి ఉన్నాయో… అలాగే ఏదైనా యూట్యూబ్ వీడియో లింకులో ss అను ఆంగ్ల అక్షరాలు లింక్ మద్యలో యాడ్ చేసి, సదరు వీడియోను డౌన్ లోడ్ చేయవచ్చు. మరొక వెబ్ సైట్ ద్వారా కూడా మీ చానెల్ నందు గల యూట్యూబ్ వీడియోలను సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు. మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా? గూగల్ నందు ఈ క్రింది విధంగా y2mate అను ఆంగ్ల అక్షరాలు టైపు చేయండి. ఆ తరువాత గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఉంటుంది. పై చిత్రంలో చూపిన విధంగా మొదట్లోనె కనబడుతున్న యుఆర్ఎల్ ఈ క్రింది విధంగా ఉంది. దాని పై క్లిక్ చేయగానే, సదరు వై2మేట్ వెబ్ సైట్ మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఈ క్రింది చిత్రం గమనించండి…. వై2మేట్.కాం ఓపెన్ అయితే ఈ క్రింది ఇమేజ్ మాదిరిగా ఉంటుంది. మీరు ఈ వెబ్ సైట్ నుండి మీయొక్క యూట్యూబ్ చానెల్ లోని వీడియోలు లేదా ఆ వీడియోకి సంబందించిన ఆడియో ఫైల్ సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రింది చిత్రం గమనించండి. పై చిత్రంలో ఒక యూట్యూబ్ వీడియో మీ యూట్యూబ్ వీడియో అయితే, దాని వీడియోలో కూడా పై చిత్రంలో చూపినట్టుగానె లైక్, అన్ లైక్ బట్టన్స్ మరియు షేర్ బట్టన్ ఉంటుంది. […]
అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం
అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం చదవండి. అమ్మ ఒడి గురించి వ్రాయండి అంటే తెలుగులో వ్యాసం వ్రాయడానికి కొంత విశ్లేషణ… విధ్యార్ధులకు ఆర్ధికంగా అండగా ఉండాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ కొరకు ఈ పధకం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో నివసించే వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో […]
మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం
మన దేశం గురించి వ్రాయండి తెలుగులో మన దేశం భారత దేశం గురించి వ్రాయండి… పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి…. అంటూ సాగే తెలుగు సినిమా పాటలో భారతదేశపు మహనీయుల గురించి కీర్తించబడింది. మనదేశం భారతదేశం అనేక మంది మహానుభావులను అందించిన దేశం. అందరు విశ్వమును సమభావముతో చుసిన మహానుభావులే కావడం విశేషం. స్వామి వివేకానందా, రామ కృష్ణ పరమహంస, గాంధీ తదితర మహనీయులు ప్రపంచం చేత కీర్తింపబడ్డారు. ఆ మహానుభావులు మన భారతదేశపు గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము…. అను భారతీయ తెలుగు జాతీయ గీతాన్నిరాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. దేశమంటే ఏకాదటిపై నడిచే ప్రజా వ్యవస్థ అని తెలియజేసే మేలుకొలుపు […]
అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం
అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం, అమృతం వంటిది. అమ్మ ఆప్యాయంగా చేసే స్పర్శలోనే అమృతత్వం ఉంటుంది. అమ్మా అనిపించకుండా బాధ ఊరుకోదు. అమ్మా అని ఆర్తితో అరిపించకుండా కష్టం కూర్చోదు. ఒక వయసుకు వచ్చాక కూడా అమ్మా అంటూ బాధను అనుభవిస్తాం… గతంలో అమ్మ చూపిన ఆప్యాయత గుర్తుకు రాగానే బాధను మరుస్తాం…. అంటే అమ్మ అమృతమైన ప్రేమను పంచేస్తుంది. అమ్మలేని జీవిలేదు. అమ్మలేని జీవితం లేదు. అమ్మతోనే వెలుగు ఆరంభం. లోకంలోకి ప్రయాణం ప్రారంభం అమ్మ […]
నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న
నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న ముందుంటాడు. నాన్న వలన నలుగురిలో గౌరవం దక్కుతుంది. నాన్న వలన నలుగురు పరిచయం అవుతారు. నాన్నతోనే సామాజిక ప్రభావం ప్రారంభం. అమ్మ గురించి చెప్పడంలో పడి నాన్నను మరిచిపోయిన రచనలు అన్నట్టుగా నాన్న కన్నా అమ్మనే రచనలు కీర్తిస్తాయి. కానీ అవిరామ శ్రమ నాన్నలో ఉంటుంది. పిల్లలకు నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు. అలాంటి ఆలోచనకు పునాది నాన్న వలననే కలుగుతుందని అంటారు. కేవలం చదువుకునే వయసులోనే […]
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
చెప్పుడు మాటలు చేటుకు కారణం అవుతాయి… తెలుగులో వ్యాసం. చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో వాటిని గుడ్డిగా నమ్మడం కూడా అంతే తప్పు. సమాజంలో మనిషికి మనిషికి మద్య ఏర్పడే సంబంధాలలో మరొక మనిషి పాత్ర ఉంటుంది. అవి మొదట్లో ఉన్నట్టు భవిష్యత్తులో ఉండవు. కారణం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరి చెప్పుడు మాటలు విని, నమ్మడమే అవుతుంది. ఒక మనిషి ఇంకొక మనిషి ఏర్పడిన పరిచయం ప్రక్రుతి వలన కానీ మరొక మనిషి వలన కానీ జరుగుతుంది. అలా ఏర్పడిన కొన్ని సంబంధాలు ఎక్కువకాలం కొనసాగుతుంది. అలాంటి బంధాలలో కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉంటాయి. కుటుంబ బాంధవ్యం ప్రకృతిపరంగా సహజంగా జరుగుతుంది. స్నేహ సంబంధం మనసును బట్టి, మనసు ఇష్టాయిష్టాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. స్నేహం, కుటుంబ సంబంధం మనిషి మనసుకు బలంగా మారతాయి. ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అలాంటి మానవ సంబంధాలు ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు సంబంధాలకు చేటు చేస్తాయి. అవి స్నేహ సంబంధం కావచ్చు. లేక కుటుంబ సంబంధం కావచ్చు. మనిషికి మాటల వలననే మంచి సంబంధాలు ఏర్పడుతాయి. అలాంటి మాటలను కొందరు మంచికి ఉపయోగిస్తే, కొందరు చెడుకు ఉపయోగించవచ్చు. కొందరు చెడు అలవాట్ల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది. చెడు అలవాట్ల కొరకు మాట్లాడే మాటలు చెప్పుడు మాటలుగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి మాటలు, వారి స్వార్ధం కొరకు మాత్రమే ఉంటూ, విన్నవారికి చేటును చేసే అవకాశం ఉంటుంది. మరికొందరికి చెడు గుణాలను కలిగి ఉండవచ్చు. మంచి సంబంధాలను చూసి ఓర్వలేని గుణం కలిగి, కొందరు సమాజంలో ఉండవచ్చు. ఇలాంటి వారి మాటలు మంచి సంబంధాలకు చేటును చేస్తాయి. ఇవే చెప్పుడు మాటలుగా సమాజంలో చెబుతారు. మౌనం మనిషిని మునిగా మారిస్తే, మాటలు మనిషిని మాటకారిగా మారిస్తే, మంచికి ఉపయోగిస్తే, వారి వలన వారి చుట్టూ ఉన్నవారికి శాంతి చేకూరుతుంది. కానీ మాటకారికి చెప్పుడు మాటలు చెప్పే స్వభావం ఉంటే మాత్రం, వారి చెప్పుడు మాటలకు సత్సంబంధం బలి అయ్యే అవకాశం ఉంటుంది. అదే మాటకారికి మంచి గురించి చెప్పే అలవాటు ఉంటే, […]
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. మనిషి బ్రతకడానికి శక్తి కావాలి. శక్తి ఆహార పదార్ధాలు ఆరగించడం ద్వారా లభిస్తుంది. శక్తి వలననే మనిషి పని కొనసాగించగలడు. అందుకు అవసరమైన ఆహారం దేశంలో రైతు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం యొక్క చరిత్ర […]
కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి. మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది. మనసుకు అయిష్టాలు చాలానే ఉండవచ్చు. నచ్చని మాట వినబడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నచ్చనివారు ఎదురుపడిన కోపం […]
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు రాముని చుట్టూ ఉంటారు. అలా రాముడి ధర్మమే రామాయణంలో చాలా ప్రధానంగా ఉంటుంది. అలాంటి సుగుణాభిరాముడి గురించి […]
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం. డిజిటల్ యుగంలో, మొబైల్(సెల్) ఫోన్లు మన జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. ఈ పరికరాలు నిత్యం సోషల్ మీడియాతో కనెక్ట్ కావడానికి, మరియు వినోదంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. మొబైల్ వాడుక విస్తృతంగా పెరుగుతున్న వలన, అదే ఆందోళనకు దారితీస్తుంది. ఎందుకంటే మొబైల్ ఒక వ్యసనం వలె మారే అవకాశం ఉంది. ఈ వ్యాసం మొబైల్ వ్యసనానికి కారణాలు, పర్యవసానాలు మరియు సంభావ్య పరిష్కారాలను అన్వేషిస్తుంది, […]
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుందని మీరు అంగీకరిస్తారా? అవును ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం ఒక నేస్తంలాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను ఎందుకు ఒంటరిగా ఉంటే పుస్తకం ఓకే నేస్తం మాదిరిగా ఉంటుందని అంటున్నాను అంటే, పెద్దలు ఇదే మాటను ఎక్కువగా చెబుతారు. పుస్తకం వలన విషయపరిజ్ఞానం పెరుగుతుందని అంటారు. పెద్దలు పలికే పలుకలలో పుస్తకాలు ఎక్కువగా చదవండి… అగవగాహన చేసుకోండి… విషయాలపై ఆలోచన చేయండని చెబుతారు. కావున పెద్దల మాటలను బట్టి చూస్తే, పుస్తకాలు ఒక మంచి మిత్రుడు మాదిరిగా మారతాయి. నా దృష్టిలో నుండి చూస్తే నాకు తెలుగు పుస్తకం తెలుగు నేస్తంలాగా, ఇంగ్లీష్ పుస్తకం ఒక గుడ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. తెలుగు పుస్తకం చదివితే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. బాగా తెలుగు తెలిసిన స్నేహితుడి మాటలు తెలుగులో అక్షరాలుగా పదాలు పేరాలలో పేరుకుపొతే అవి ఒక తెలుగు మిత్రుడి మాటలుగా నా మనసులోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు నా స్నేహితులతో లేకుండా ఒంటరిగా ఉంటే పది మంది మిత్రులు ఉన్నట్టే. ఎందుకంటే నాకు ఉన్న సబ్జెక్ట్ పుస్తకాలే నాకు మిత్రులు. ఇంకా గ్రంధాయలం నుండి ఎరువు తెచ్చుకునే తాత్కాలిక నేస్తం అప్పుడప్పుడు పలకరిస్తుంది. గ్రంధాలయం నుండి ఒక నాయకుడు చరిత్ర పుస్తకం అయితే ఓ పాతకాలపు నేస్తం నాకు దొరికినట్టే… అలాగే నేటి నాయకుల చరిత్ర అయితే ఓ సోషల్ ఫ్రెండ్ ఉన్నట్టే… ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది.. తరం మారుతుంది తరతరాల సంస్కృతి పుస్తకం వలననే తరం నుండి తరానికి చేరుతుంది… అంటే పుస్తకం ఒక దీర్ఘకాలిక నేస్తమే అవుతుంది… మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది. మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది. ఎందుకంటే మంచి పుస్తకం అంటే అందరికి మక్కువ ఉంటుంది. కాలంలో కలిసిపోయిన విషయాలను పుస్తకం గుర్తుకు తేగలదు. ఓ మంచి నాయకుడు జీవితం ఒక పుస్తకంగా మారితే, ఆ నాయకుడు కాలం చేసాక కూడా ఆయన జీవితం పుస్తకరూపంలో లోకంలో ఉంటుంది. ఆ పుస్తకం ఎంతోమందికి మంచిమిత్రుడులాగా ఉపయోగపడుతుంది. […]
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్ ఫ్రీగా లభించే మూవీస్ లిస్ట్ ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసుకుని వాచ్ చేయడానికి… తెలుగు మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్… ఈ మొబైల్ యాప్ తెలుగు పాపులర్ మూవీస్ లిస్ట్, ఫ్యామిలి డ్రామా మూవీస్ లిస్ట్, యాక్షన్ మూవీస్ లిస్ట్… డ్యుయల్ రోల్ మూవీస్ లిస్ట్, లవ్ స్టోరీ మూవీస్ లిస్ట్, ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీస్ మొదలైన మూవీస్ లిస్టులు డిస్ప్లే అవుతాయి. వాటి నుండి మీకు […]
లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు
లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు ఎలా ఉంటాయో గమనించుకోవడం మనకు మనం మేలు చేసుకోవడం అంటారు. అవసరం లోన్ గురించి తెలుగులో వ్యాసం. అవసరానికి తగినంత డబ్బు లేనప్పుడు లోన్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. తిరిగి చెల్లించడం కష్టం కాకుండా చూసుకోవడం ప్రధానం. అటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మనసులో గుర్తు ఉంచుకోవలసిన ఆలోచన… ఎందుకంటే ఆలోచనే మనసును మరింత ముందుకు నెడుతుంది. లోన్ తీసుకునేటప్పుడు ఆలోచన, అవసరాలకు అనుగుణంగా లోన్ తీసుకోవడం ప్రధానం అయితే, […]
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి. అర్జునుడికి భగవంతుడు బోధించిన బోధ కాబట్టి భగవద్గీత అన్నారు. అటువంటి భగవద్గీత పరమ పవిత్రమైనది. కోర్టులలో కూడా సాక్ష్యం తీసుకునేటప్పడు భగవద్గీతపైనే ప్రమాణం చేయిస్తారు. ఆత్మసాక్షాత్కరం, జ్ఙాన మార్గం, కర్మయోగం, భక్తి మార్గం అంటూ భగవానుడి బోధ కనబడుతుంది. నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి మనసుకు వారికే తెలియాలి. ఎందుకంటే? భగవద్గీత చదవాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది వారి […]
డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి
డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన శైలితో అమెరికన్లను ఆకట్టుకున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యాపారవేత్త…. వ్యాపారవేత్తగా ఎదిగాకా రాజకీయాలలోకి వచ్చి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు… డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటనలు చేయడం వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకీ, డొనాల్డ్ కు మద్య స్నేహపూర్వక సంబంధం పత్రికల ద్వారా తెలియబడుతుంది. ప్రపంచంలో అగ్రరాజ్యం […]
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో వ్యాసం చదవండి. దేవాయలం అంటే దైవ నిలయం… దేవుడిని ప్రతిష్టించి, పూజించడం, లేక వెలసిన దేవుడికి ఆలయనిర్మాణం జరిగి పూజించడం దేవాలయాలలో జరుగుతంది. ప్రతి దేవాయమును అర్చకస్వామి ఉంటారు. ఈ దేవాలయం కొందరు దేవస్థానం అంటారు, మరికొందరు మందిరం అంటారు. కొన్ని చోట్ల గుడి అని వాడుక భాషలో అంటారు. మన దేశం చాలా విశిష్టమైన దేశం సంప్రదాయబద్దమైన కుటుంబ జీవనం భారతదేశంలో ఆనాదిగా వస్తుంది. అనేక […]
మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం
మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయడపడతాయి. మాటపై వేలమందిని నడిపించగలిగే శక్తి నాయకుడుకి సొంతం. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడి గురించి వ్యాసంలో వివరించడానికి తెలుగువ్యాసాలులో ఒక పోస్టు. లోకంలో అనేకమంది ప్రజలకు, ఎన్నో సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చును… అలా అవగాహన ఉన్నా, ప్రతి సమస్యకు పరిష్కారం తోచకపోవచ్చును… పరిష్కారం లభించినా, పరిష్కరించే […]
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
వేడుక వలె జరుపుకనే పండుగ అనగానే ముందుగా మనసులో సంతోషం కలుగుతుంది. పండుగ అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో దైవమునకు ప్రత్యేక పూజలు చేయడం, బంధువులను ఆహ్వానించడం మొదలైనవి ఉంటాయి. సామూహికంగా జరిగే పండుగలు జాతరలుగా ఉంటాయి. కుటుంబపరంగా కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో జరిగేవి కొన్ని పండుగలు ఉంటాయి. అయితే కొన్ని పండుగలకు సామూహికంగానూ, కుటుంబంలోనూ కూడా కార్యక్రమములు నిర్వహిస్తారు. కొన్ని పండుగలు కేవలం కుటుంబం వరకే పరిమితం అవుతాయి. కుటుంబంలో బంధువులతో కలిసి పండుగ నిర్వహించుకుంటూ […]
ఈ సంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏకాదశి తిధులు, మాసశివరాత్రులు
ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు , ఏకాదశి తిధులు, వరలక్ష్మీవ్రతం, వినాయక చవితి, దసరా దీపావళి తదితర పం ఏఏ తేదీలలో ఏఏ రోజులలో ఏఏ పండుగలు వచ్చాయో.. జనవరి మాసంలో పండుగలు తెలుగులో 2వ తేదీ జనవరి 2021 అనగా శనివారము – సంకష్టరహర చతుర్ధి9వ తేదీ జనవరి 2021 అనగా శనివారము– సఫల ఏకాదశి10వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము- ప్రదోష వ్రతం11వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- మాస శివరాత్రి13వ […]
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి. అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది. సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో ఎక్కువమంది ఎవరిని పొగుడుతున్నారో… వారిలో సహజంగానే మంచి గుణాలు ఉంటాయి. మంచి గుణాలు అంటే ఉపకారం చేయడం, […]
2020 అంతా స్టాప్ దేర్ 2021?
2020 అంతా స్టాప్ దేర్ 2021? గత ఏడాది పురుడు పోసుకున్న కరోనా ఈ ఏడాది రూపాంతరం చెందుతుంది… కొత్త ఏడాదిలోకి జర జాగ్రత్తతో అడుగు పెట్టడంతో బాటు జర జాగ్రత్త అవసరం. గతేడాదిలోకి కరోనా జాగ్రత్తలతో ఆరంభం చేయడం జరిగింది. సంవత్సరమంతా జాగ్రత్తగా ఉన్నవారు కరోనా బారిన పడలేదు. జాగ్రత్తలేనివారికి వైరస్ సోకింది. అందరికీ 2020సంవత్సరం ఇంత తొందరగా గడిచిందా? అనే ఆశ్చర్యంగానే 2020 ముగుస్తుంది. 2019 ఎండింగులో కరోనా వస్తుందేమో ఆలోచన… 2020అంతా కరోనా […]
నక్షత్రములు పాదములు మొదటి అక్షరం
చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పుట్టిన సమయం బట్టి ఉన్న చూసేవి. నక్షత్రములు పాదములు బట్టి మొదటి అక్షరం ఏమిటి అనేది. 27 నక్షత్రములు 108 పాదములు ఎవరు పుట్టినా ఈ 108 పాదములలోకి వస్తారు. పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, నక్షత్రం యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం నిర్ణయిస్తూ ఉంటారు. ఈ క్రింది నక్షత్రముల జాబితాలో ప్రతి నక్షత్రమునకు ఎదురుగా నాలుగు అక్షరములు గలవు. అంటే పాదమునకు ఒక అక్షరము గలదు. నాలుగు […]
కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం
నిత్య దీపారాధనతో చేసినా, కార్తీకమాసంలో చేసే దీపారాధన ప్రముఖమైనదిగా చెబుతారు. ఇంకా కార్తీకమాసంలో ప్రత్యేకతిధులలో చేసే దీపారాధన విశిష్టమైనదిగా చెబుతారు. అయితే కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం అంటే మరింత విశిష్టమైనదిగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కార్తీకమాసంలో సోమవారంతో కూడిన కార్తీకపౌర్ణమి రోజున కార్తీకదీపం పెట్టే విధంగా రోజులు వచ్చి ఉంటాయి. అయితే ఆ సమయంలో అందరికీ ఆ భాగ్యం తెలిసి ఉండకపోవచ్చును. లేకా తెలిసినా చేసే అవకాశం లేకపోవచ్చును. అందరికీ తెలిసేలా కొందరు చేసే […]
లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు
లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం. లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా […]
జ్ఙాన బోధ గీత అయితే
జ్ఙాన బోధ గీత అయితే రాముడు చెబితే రామగీత, శివుడు చెబితే శివగీత, కురుక్షేత్రంలో చెబితే భగవద్గీతగా మనకు వివిధ గీతలు ఉన్నాయి. గీత అంటే ఉపదేశముగా భావింపడుతుంది. భగవద్గీత అంటే భగవంతుడు, భక్తుడికి చేసిన బోధ కాబట్టి భగవద్గీతగా చెబుతారు. అలా భగవానుడు ఉపదేశించిన గీతాసారమను భగవద్గీతగా చెబుతారు. మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన గీతాబోధను భగవద్గీతకు అందరికీ తెలుసు. జ్ఙాన బోధను గీతగా చెబితే, అలా చెప్పిన జ్ఙాన బోధలు మనకు ఇంకా […]
సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది
అతి సర్వత్రా వర్జయేత్ అనగా అతి చేయడం అన్ని విషయాలలోనూ, అన్ని చోట్లా, అన్ని సమయాలలోనూ మంచిదికాదని అంటారు. అతి మాట్లాడేవారికి విలువ వేరుగా ఉంటుంది. అతిగా అదేపనిగా పనిచేసుకుంటూ ఉండేవారికి లోకంతీరు తెలియదు. అతిగా తినేవారికి విలువ ఉండే విలువను ఇంకొకరు కోరుకోరు. అతిగా సంపాదించేవారిని అనుసరించాలనుకుంటారు కానీ అతిగా సంపాదించేవారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారంటారు. అలాగే అతిగా అనుసరించడం, అతిగా వినడం ఏదైనా, అతి అన్నింటా అంత మంచిది కాదనే విషయం చాలమంది చెబుతూనే […]
న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు
న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు ప్రజలకు సమాజంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేకిత్తిస్తూ, అవగాహనను ఏర్పరుస్తాయి. జరుగుతున్న పరిణామాలపై ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది. గతంలోని నాయకులు ప్రభావం వలన ఏ పరిణామలు సంభవించాయి? ఇప్పటి పరిణామలు సామాజిక స్థితిని ఎలా ప్రభావితం చేయబోతాయో? అవగాహన చర్చాకార్యక్రమములు చూడడం ద్వారా ఏర్పడవచ్చును. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ, ప్రజావేదిక కూల్చివేతతో సంచలనానికి తెరదీసింది. అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు రీటెండర్ అంటూ మరో సంచలనం సృష్టించింది. […]
పిల్లలకు స్త్రీ గౌరవం నేర్పకపోతే భవిష్యత్తు ప్రమాదంలోనే

పిల్లలకు స్త్రీ గౌరవం నేర్పకపోతే భవిష్యత్తు ప్రమాదంలోనే | Women Respect & Social Responsibility “ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం” అని మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలో గొప్ప సామాజిక సందేశం దాగి ఉంది.ఇది ఆడువారు కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేయాలనే కాదు, సమాజం మొత్తం కలిసి మహిళల భద్రతను కాపాడాలి అనే భావన. కానీ నేటి పరిస్థితులు చూస్తే, మహిళలపై జరుగుతున్న దారుణాలు సమాజం తన బాధ్యతను మరచిపోయిందనే సంకేతం […]
అమ్మ చెప్పే కథలు ఎందుకు ముఖ్యమో తెలుసా? పిల్లల జీవితాన్ని మార్చే నిజం

తెలుగు భాష గొప్పతనం “దేశభాషలందు తెలుగులెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాట తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తుంది. తెలుగు గురించి పూర్తిగా అవగాహన ఉన్నవారు ఈ మాట నిజమే అని అంగీకరిస్తారు. అటువంటి తెలుగులో అమ్మ చెప్పే కథలు ఎందుకు ముఖ్యమో తెలుసా? ఈరోజుల్లో మనం తెలుగులో మాట్లాడుతున్నప్పటికీ, అనేక ఇంగ్లీష్ పదాలను కలిపి వాడుతున్నాం. అయినా కూడా తెలుగు భాష గొప్పతనం దాని భావప్రకటనలో స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు భాషలో పదాల విలువ మన రోజువారీ […]
గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు
గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు […]
తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్
తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి. తెలుగులో కొన్ని కేటగిరీలలో గల పోస్టులను రీడ్ చేయండి. శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు చిన్న పిల్లల తెలుగు పేర్లు గల పేజిలు దర్శించండి. అచ్చ తెలుగులో బాలబాలికల పేర్లు చూడండి. తెలుగులో రెండు, మూడు పదాలతో కూడిన పేర్లు కూడా మీకు ఆ పేజిలలో ఉంటాయి. బాలుర కొరకు గల తెలుగు పేర్లను ఒక పేజిలో బాలికల కొరకు గల తెలుగు పేర్లను మరొక పేజిలో ఉంటాయి. […]
