బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చరిత్రలో సంఘటనలను చదివి ప్రేరేపితం అయిన మనసు వర్తమానంలొని సంఘటనలతో సంఘర్షణ చెందుతూ భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్

తెలుగుబుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో సారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ తెలుగు బుక్ రీడింగ్ మనకు మేలును చేస్తుంది, అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి పుస్తకం మనసుకు మంచి మార్గాన్నిస్తుంది అని పెద్దలు అంటారు.

కటికి చీకటిలో మనిషి కళ్ళకు ఏమి కనబడదు అందకారం, రోజూ తిరిగే చోటే ఉన్నా ఒక్కసారిగా చీకటి అలుముకుంటే, ఎలా గందరగోళంగా ఉంటుందో…అలాగే మనకు అవసరమైన విషయాలలో మనసుకు సరైన అవగాహన లేకపోతే చీకట్లో ఉన్న స్థితే ఉంటుంది, అంటారు. తెలుగు విషయాలలోని సారం, తెలుగు పుస్తకాలలో ఉంటే, వాటిని రీడ్ చేయడంతో గ్రహించవచ్చును.

సందేశం సినిమాలలోనూ, పుస్తకాలలోనూ ఉంటుంది. అయితే ఒక తెలుగుసినిమా చూస్తున్నప్పుడు పాత్రలలో కనిపించే సందేశం కన్నా వారి వేషధారణ, భావప్రకటనను మనసు పట్టుకుని, వాటినే అనుసరిస్తుంది. అయితే ఒక తెలుగుబుక్ రీడింగ్ చేస్తుంటే మాత్రం, ఆ తెలుగుపుస్తకంలోని పాత్రలను మన మనసే ఒక ఊహను చేయడం ప్రారంభిస్తుంది. మనసు తనకు తానుగా ఊహించడం మొదలుపెడితే, దానియొక్క బలం పెరుగుతుంది. అయితే అది అందరికీ ఆమోదయోగ్యమైనప్పుడు మరింత విలువను సంతరించుకుంటుంది. రాజమౌళి బాహుబలి సినిమా మాదిరి….

సినిమా తీసేవారికి కూడా బుక్ రీడింగ్ చేసే అలవాటు ఉంటుంది. తిరిగి వారు రచన చేయడం కూడా చేస్తారు. అంటే బుక్స్ రీడ్ చేయడం వలన ఆ తెలుగుబుక్స్ లోని సారం గ్రహించిన మనసు మరలా కొత్తగా ఊహించి ఇంకొక కొత్త రచన చేయగలిగే స్థాయివరకు ఊహించగలుగుతుంది. అంతటి శక్తి మనసుకు తెలుగుబుక్ రీడింగ్ వలన వస్తుంది, అంటారు. బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్.

తెలుగు పుస్తకాలలో విజ్ఙానం అందించేవి, పౌరాణిక ప్రమాణాలను అందించేవి, వికాసం తెచ్చే తెలుగుబుక్స్ చాలానే ఉంటాయి. సామాజిక స్థితిని, పూర్వపు సామాజిక చరిత్రను, గతకాలపు గొప్పవారి జీవిత చరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్ కూడా మనకు రీడ్ చేయాడానికి ఆన్ లైన్లో లభిస్తాయి.

తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు సాహిత్యపు రచనలు చదవడం ద్వారా మనకు తెలుగు సాహిత్యం తెలుస్తుంది. ఇంకా చారిత్రక తెలుగు బుక్స్ రీడ్ చేస్తే, చరిత్రలో మన పూర్వుల ఘనత తెలియబడుతుంది. చరిత్రలోని సంఘటనలు చదివి, వర్తమానంలోని సంఘటనలు చూసి ప్రభావితం అయిన మనసు భవిష్యత్తు సామాజిక స్థితిని అంచనా వేయగలదు. కాబట్టి చారిత్రాత్మక తెలుగుబుక్ రీడింగ్ చేయడం ఒక అలవాటుగా ఉండడం మంచిది, అంటారు.

తెలుగులో చారిత్రక పుస్తకాలు ఆన్ లైన్లో ఉచితంగా చదవాలంటే, ఇక్కడ ఈ అక్షరాలను తాకండి చారిత్రాత్మక తెలుగు బుక్స్ ఉచితంగా మీరు రీడ్ చేయవచ్చును. బక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

ధన్యవాదాలు. తెలుగురీడ్స్

పుస్తకం చదువుట మంచి అలవాటు?

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి.

తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు.

రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు.

తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు.

రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు.

తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు ఇతరత్రా భావనలు రేకెత్తిస్తూ…ఉంటాయి. మంచి మౌనం లాంటిది అయితే ఇతరములు అరుపులులాంటివి అవుతాయి. మౌనం మనిషిని కుదురుగా ఉంచితే, అరుపులు ఆవేశమును ప్రేరేపిస్తాయి. అలా పుస్తకములు మంచివి, మంచిని పెంచేవి ఎంపిక చేసుకుని చదువుకుంటే వాటి వలన మనసుకు విజ్ఙానం వస్తుంది.”

రీడ్స్: ”వాట్ ఇజ్ విజ్ఙానం”

తెలుగుతాతయ్య: ”విజ్ఙానం మీన్స్ నాలెడ్జ్ ఎబౌట అవర్ సర్కమ్ స్టేన్స్ విత్ నీడెడ్ థింగ్స్” అని తెలుగు ఇలా చెప్పనారంభించాడు తెలుగుతాత రీడ్స్…తో”విజ్ఙానం అంటే తెలిసి ఉండడం కాబట్టి, నిండుకుండ తొణకకుండా ఉన్నట్టు, అన్ని తెలిసిన మనసు అనవసరంగా ఆవేశపడకుండా ఆలోచనతో కూడిన ఆవేశాన్ని అవసరమైతేనే తీసుకుంటుంది. తెలిసిన మనసుకు తెలియని మనసుకు ప్రవర్తనలో తేడా ఉంటుంది. అలాగే ఎదుటివారిని ప్రభావితం చేయడంలోనూ అదే ప్రభావం చూపుతుంది. కాబట్టి మనసుకు అది నివసించే మనిషిని బట్టి తగు జ్ఙానం అవసరం అంటారు.

ఏమి తెలుసుకోవాలి…అంటే మనకు తెలియనవి చిన్ననాటి నుండి అమ్మనాన్న దగ్గర నుండి కొంత నేర్చుకుంటే, అన్నదమ్ములు, అక్కచెల్లెలు దగ్గరనుండి మరికొంత నేర్చుకుంటాము. తర్వాత గురువులు, గురుకులంలో స్నేహితుల ద్వారా మరికొంత నేర్చుకుంటూ పెరుగుతాము. అయితే అక్కడికే అవసరమైన జ్ఙానం బ్రతుకుబండిని నడపడానికి వచ్చేస్తుంది.”

రీడ్స్: ”వాట్ ఇజ్ గురుకులం….తెలుగుతానా”

తెలుగుతాతయ్య: ”గురుకులం అంటే స్కూల్” అని మరలా ఇలా చెప్పసాగాడు

”అయితే అనుకోని కష్టాలు వచ్చినప్పడు కూడా మనకు మునుపు చెప్పబడిన నీతులు కానీ మంచిమాటలు కానీ మరిచే అవకాశం ఉంటుంది. కొందరైతే నీతులు స్వీకరించకపోవచ్చును. ఇలాంటి సమయంలో మంచి పుస్తకం చదివే అలవాటు ఉంటే, కాలంలో కష్టం కలిగినప్పుడు అప్పటికి ఆ పరిస్థితులలో అవసరమైన జ్ఙానం ఇచ్చే పుస్తకం వైపే వెళ్లే అవకాశాలు ఎక్కువ అంటారు. కాబట్టి పుస్తకములు చదవడం అనేది మంచి అలవాటుగా చెబుతారు.

పుస్తకం ఎందుకు చదవాలంటే, పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకు ఒక ఊహాత్మక శక్తి అభివృద్ది చెందుతుంది, అంటారు. ఒక సినిమా తీసే దర్శకుడు అయినా ఒక రచయిత రచించిన ఊహాత్మక కల్పిత కధ ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తారు. అంటే కోట్టు ఖర్చు చేయించే ఊహాశక్తి కేవలం పుస్తకములు చదివి, ఆలోచించే అలవాటు ఉన్నవారికి సాధ్యం అన్నమాట!” అంటూ తెలుగు తాతయ్య ముగించాడు.

గురుకుల్ అనే వెబ్ సైటులో అనేక రకాల బుక్స్ వివిధ వర్గాలుగా విభజించి పి.డి.ఎఫ్ ఫార్మట్‌లో ఉచితంగా లభిస్తున్నాయి. అక్కడ మీకు నచ్చిన మీరు మెచ్చిన పుస్తకము మీ కంప్యూటర్ / ట్యాబ్/ స్మార్ట్ ఫోను ఇతర సాంకేతిక పరికరములలో చదువుకోవచ్చును.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్….

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ

దుర్గములను తొలగించే తల్లి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ శ్రీ కనకదుర్గమ్మతల్లి విజయవాడపై కొలువుదీరి కొలిచిన భక్తుల కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ కనకదుర్గమ్మతల్లి దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందిస్తూ….మీకు దిగ్విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….తెలుగురీడ్స్.కామ్.

తెలుగురీడ్స్ వెబ్ మరియు మొబైల్ యాప్ ద్వారా సకుటుంబసమేతంగా చూడదగిన తెలుగుసినిమాలను గురించి తెలియజేస్తూ, వాటిలో సాంఘిక, భక్తి, జానపద సినిమా వర్గాలుగా మీకు తెలుగురీడ్స్ అందిస్తూ…పుస్తకముల గూర్చిన విషయములపై వివిధ పోస్టులను కూడా మీరు తెలుగురీడ్స్ ద్వారా చదవవచ్చును. పురాణములు, విజ్ఙానము, వికాసము, ఇతిహాసములు, నీతి కధలు, చరిత్ర, భగవద్గీత, జీవితచరిత్రలు ఇలాంటి వర్గాలలో లభించే బుక్స్ గురించి తెలుగురీడ్స్ తెలియజేస్తుంది.

మరలా మీకు విజయదశమి శుభాకాంక్షలు…..

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి తెలుగురీడ్స్! మనకు తెలిసి ఉండడం వలన మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు? సామాజిక మార్పులలో అవగాహన ఏర్పరచుకోవడం కొరకు అంటారు. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన వస్తుంది అంటారు.

విజ్ఙానం విషయముల యందు జ్ఙానం, అంటే విషయముల గురించి తెలిసి ఉండుట! అది ఒక వస్తువు వాడుక గురించి అయ్యి ఉండవచ్చును. ఒక వస్తువు తయారి చేయడం గురించి అయ్యి ఉండవచ్చును. వర్తమానంలో జరుగుతున్న విషమయుల వలన భవిష్యత్తులో సంభవించే మార్పుల గురించి అయ్యి ఉండవచ్చును. ఏదైనా కానీ ఆయా విషయముల యందు పూర్తి అవగాహనతో కూడిన ఎరుక ఉండడం విజ్ఙానం అని అంటారు.

విజ్ఙానం, తెలిసి ఉండటం, ఎరుక కలిగి ఉండటం మూడు పదాలు ఒక్కటే కానీ అది లేకపోతే, జీవితం మరో జీవితంపై శక్తి కలిగి ఉన్నా ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒక ఊరు నుండి మరొక ఊరుకు వెళ్లాలి, కానీ అతనికి బస్సుపై వ్రాసి ఉన్న అక్షరాలను కూడా చదవలేడు, కానీ అతను పూర్తి ఆరోగ్యవంతుడు. అప్పుడు అతను బస్సులో ఎన్ని గంటలు అయిన కూర్చుని ప్రయాణం చేయగలడు, కానీ అతను ఎక్కవలసిన బస్సు తెలుసుకోవాలంటే ఇంకొకరిపై లేక ఇంకొక వస్తువుపై ఆధారపడాలి.

ఇలా ఒక వ్యక్తి తన జీవితంలో నివసిస్తున్న మరియు తాను పని చేస్తున్న పరిస్థితులలో అవసరమైన పనిమూట్ల విషయంలోనూ, తన పరిచయస్తులో మన:వృత్తులపై ఒక అవగాహనతో కూడిన ఎరుక ఉంటే, అతని జీవితం సాఫీగా సాగుతుంది. లేకపోతే ఒక పనిమట్టు వాడాలంటే, ఇంకొకరిపై ఆధారపడాలి. ఇతరులతో మాట్లాడాలంటే మధ్యవర్తి అవసరం. ఇలా కొన్ని అవసరాలకు కొందరిపై ఆధారపడాల్సి వస్తుంది.

అయితే అందరికీ అన్ని తెలియవు కాబట్టి కొందరిపై ప్రతివ్యక్తి ఆధారపడాల్సిరావడం సమాజంలో సహజస్థితి. అయితే మనకు ఉన్న టాలెంటును బట్టి మనం నేర్చిన విద్యలో ఎరుక అంటే తెలిసి ఉండడం అనేది పరిపూర్ణంగా ఉండాలి. అలా ఒక విషయం అంటే ఒక వస్తువు వాడుక, ఒక వస్తువు తయారి, ఒక సామాజిక అవగాహన ఏదో ఒక విషయంలో పరపూర్ణ జ్ఙానం ఉండడం అవసరం. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్.

మనకు ఏదో ఒక విషయంలో పరిపూర్ణ జ్ఙానం ఉండడం చేత, దానిని బట్టి మనకు రాని విషయములలోకూడా మనం సామాజికంగా ప్రయోజనం పొందగలం. ఎందుకంటే మనకు తెలిసి ఉన్న మన చుట్టూ ఉన్నవారిలో మరొకరికి తెలియకుండా ఉంటుంది. అలాగే అతనికి తెలియని విషయం మనకు తెలిసి ఉంటుంది. అలా ఇరువురు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండడం చేత సామాజిక స్నేహభావన ఉంటుంది. ఇలా మనకు సమాజంలో ఒక గుర్తింపు విజ్ఙానం వలన వస్తుంది, అంటారు.

ఇప్పటికే మనకు తెలిసి ఉన్న విషయాలతో మనం సమాజంలో ఒక గుర్తింపుతో జీవిస్తూ ఉంటాం, అయితే సామాజికంగా వచ్చే మార్పులలో భాగంగా మనకు కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. అందుకే పుస్తకము చదవడం వలన లోతైన పరిశీలన కూడా అలవాటు అవుతుంది. అలాంటి అలవాటు ఇప్పుడున్న సాంకేతిక పరికరాల వాడుకలో కూడా ఉపయోగపడుతుంది. తెలుగుపుస్తకములు తెలుగులో రీడ్ చేసే విధంగా ఉండే అనేక పుస్తకములు గురుకుల్ అనే వెబ్ సైటులో ఉచితంగా చదవవచ్చును. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి.

ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో వ్యక్తి బాధ్యతను గుర్తు చేస్తూ మాట్లాడే ప్రసంగాలలో వ్యక్తిత్వ వికాసం గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు.

విజ్ఙానంతో ఉండడం వికాసం అంటే విషయములందు జ్ఙానమును కలిగి ఉండుట, మరియు నిర్వహించు పనులలో బుద్ది వికసించి పనిచేయుటగా చెబుతారు. మనసుకు తాను చేస్తున్న పనులకు సంబంధించి సరైన జ్ఙానం కలిగి ఉండడం చేత, బుద్ది వికసించి ఆయా పనులలో సరైన రీతిలో స్పందించడం చేత పనులు సత్ఫలితాలను ఇస్తుంది, అంటారు.

ఒక డాక్టర్ ఉంటే స్కూలు చదువుతున్న కాలం నుండే అతని మనసు పట్టుకున్న సైను బక్ రీడింగ్, గ్రహించిన సైన్సు సారంశం అతనిని కళాశాలకు వచ్చేటప్పటికి జీవశాస్త్రం, రసాయిన శాస్త్రం లాంటి సబ్జెక్టులవైపు వెళ్లేలా బుద్ది ప్రభావితం అవుతుంది అంటారు. అలా ఒక వ్యక్తి తన స్కూలు వయస్సు నుండే చదివే పుస్తకములలోని జ్ఙానాన్ని గ్రహించడం చేత, ఆయొక్క జ్ఙానాన్ని అనుసరించి, అతని భవితవ్యం ఆధారపడుతూ ఉంటుంది. వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ .

మనసు నేర్చుకున్న విషయాలను బట్టి బుద్ది వికాసం ఉంటుంది కాబట్టి మనసును మేలు చేసే విషయముతో నింపితే, మనిషి బుద్ది శాంతికి దారితీస్తుంది. కామంతో కూడిన పుస్తకాలే చదివితే, ఆ మనసు కామము తీర్చుకోవడానికి తపిస్తుంది. ఇతర పుస్తకాలు చదివితే ఇతరా విషయములవైపు బద్ది పోతుంది. కాబట్టి బుక్ రీడింగ్ అనే మంచి అలవాటుని, గుడ్ తెలుగు బుక్ రీడింగుకు చేయడానికి వెళితే, గుడ్ హ్యాబిట్ గా మనకు మేలునే చేస్తుంది.

వికాసం తెలుగువారి తెలుగు రచనలను తెలుగుభాషలో చదువుతూ తెలుగు భాషపై పట్టు పెంచుకోవడం చేత తెలుగుసాహిత్యం ఇంకా మనకు మరింత చేరువకావడంతో బద్ది వికాసానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తెలుగు పుస్తకములు చదవడానికి గురుకుల్ మీరు విజిట్ చేయడం ద్వారా అనే తెలుగు పుస్తకములను రీడ్ చేయవచ్చును. వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ .

ధన్యవాదాలు తెలుగురీడ్స్ బుక్స్

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ.

దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి గుప్తదానం చేసి, అతని అదృష్టాన్ని పరీక్షించమని చెబుతాడు. ఆచార్యుడు చెప్పినట్టే ఒక బ్రాహ్మణ పండితుడికి వజ్రాలు, వైఢూర్యములతో కూడిన నగలు పైకి కనబడకుండా ఒక గుమ్మడి కాయలో పెట్టి రాజు దానం చేస్తాడు. దానం స్వీకరించిన పేద బ్రాహ్మణుడు ఆగుమ్మడికాయను రాజు సమక్షం నుండి బయటకురాగానే నేలకేసి కొట్టి, తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. అది చూసిన రాజు పరివారం అంతా ”ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కానీ గ్రహాల ప్రభావం కాదు” అని ఆచార్యులతో అంటారు. ఆచార్యులు ఎంత చెప్పిన నవగ్రహశాంతి పూజ చేయడానికి సత్యపాల మహారాజు ఒప్పుకోడు.

అకాలంలో పల్లెప్రజలు రాజధానికొచ్చి జేగంట మోగిస్తారు. సత్యపాలమహారాజుతో వారు తమపై క్రూర మృగాల దాడి ఎక్కువైందని చెప్పడంతో సేనాని వీరసేనుడు(రాజనాల), స్వయంగా వచ్చి మీ సమస్యను తీరుస్తారని అంటాడు. అతని సహచరులు కూడా మహారాజే స్వయంగా ఆపని చేస్తే బాగుంటుందని ప్రోత్సహిస్తారు. అయితే రాణి మరియు ఆచార్యులు రాజును నవగ్రహాలను పూజించి వెళ్లవలసినదిగా కోరతారు. కానీ సత్యపాల మహారాజు వారిమాటని త్రోసిరాజని వేటకు వెళతాడు.

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

వేటకొరకు ప్రయాణం చేసిన సత్యపాలమహారాజు విశ్రాంతి మందిరంలో నిద్రిస్తుండగా క్రూరమృగం శబ్ధం రావడంతో అడవిలోకి వెళతాడు. కానీ ముసుగులాంటి వేషధారణలో ఉన్న భటులు రాజును కొట్టి ఒక నూతిలో పడవేస్తారు. మహారాజు కనిపించడంలేదు అనే మిషతో అంత:పురానికి తిరిగి వచ్చిన వీరసేనుడు మహారాణిని అంత:పుర బందీగా ఉంచి, రాకుమారుని తీసుకుపోతాడు. మహారాజు అడవిలో నూతిలోనే కొన్ని రోజులపాటు ఉండిపోతాడు. నీటికోసం వచ్చిన కొందరు మనుషులు సత్యపాలుడిని పైకి లాగుతారు.

మహారాజుని వెతక్కుంటూ మహారాణి రాకుమారుడిని తీసుకుని అడవికి బయలుదేరుతుంది. సత్యపాల మహారాజు మరలా అంత:పుర ప్రవేశం చేస్తాడు. అయితే వంచకుడు వీరసేనుడు మహారాజుని వంచించి, మహారాజుని నిర్భందిస్తాడు. వీరసేనుడు సత్యపాలమహారాజును క్రూరంగా హింసించి, చనిపోయాడు అని భావించి, మహారాజును బయటిప్రారవేయిస్తాడు. అలా మహారాజు ఒక నాటకాల బృందానికి దొరుకుతాడు.

మహారాణి తన అన్నగారి దగ్గరకు వెళితే, అక్కడ ఆమెకు నిరాధారణ ఎదురవుతుంది. ఆమె దిక్కుతోచని స్థితిలో తిరుగు ప్రయాణం అవుతుంది. ఇలా సత్యపాల మహారాజు గ్రహాచారం బాగుండకపోవడం వలన అష్టకష్టాలు పడతాడు. అయితే మహారాజు తన కాళ్లు పోయినా, అది మానవ తప్పిదమే అంటాడు కానీ గ్రహాలను ప్రార్ధించడు. అయితే చివరకు మహారాజు ఆశ్రయం ఇచ్చిన వారి పసిపాపడు ప్రాణం పోవడంతో చలించిన మహారాజు, వారికోసం నవగ్రహాలను శరణువేడతాడు. వెంటనే మహారాజు కాళ్లు, చేతులు రావడం, చనిపోయిన పిల్లాడు బ్రతకడం జరుగుతుంది.

సత్యపాల మహారాజు తిరిగి తన రాజ్యనికి వెళ్లి, వీరసేనుడిని మట్టుపెడతాడు. తన గురువు ఆచార్యులను చెరశాల నుండి విముక్తి చేయించి, తిరిగి తన ఆస్థానంలో కూర్చుంటాడు. నవగ్రహాల శక్తిని తక్కువ అంచనా వేసి, గురువుగారి మాట విననందుకు, ఆచార్యులకు మహారాజు క్షమాపణ చెప్పి, ఇదంతా నవగ్రహ పూజా మహిమగా కొనియాడడంతో సినిమా శుభం అవుతుంది.

గ్రహస్థితి బాగుండనప్పుడు మనిషి బుద్ది ఎలా మందగిస్తుందో? చిన్న చిన్న తప్పులతో పెద్ద పెద్ద ఆపదలను కొని తెచ్చుకోవడమో లేక అవకాశాలను కోల్పోవడమో? ఇలాంటి సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ .

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

దీపావళి తెలుగు పాత సినిమా

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు పాత సినిమా.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. దీపావళి తెలుగు పాత సినిమా.

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమాకు కమాలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా అరుణ్ గోవిల్, పద్మావతిగా భానుప్రియ నటించగా మిగిలిన పాత్రలలో తదితర తారాగణం నటించారు. ఈ తెలుగుసినిమాలో శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం బాగా చూపించారు.

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుమూవీ ప్రారంభం శ్రీవినాయకుడు, వేదవ్యాసుడు మాటలతో ప్రారంభం అవుతుంది. వినాయకుడుకు, వ్యాసుడు శ్రీ ఏడుకొండలస్వామి అవతారం గురించి చెబుతూ, శ్రీమహావిష్ణువు ఏకారణం చేత వేంకటేశ్వరావతారం స్వీకరించిందీ, ఏడుకొండలు ఏఏ దేవతా స్వరూపాలు భూలోకంలో అవతరించింది వివరిస్తారు. తర్వాత పద్మావతి – వేంకటేశ్వరస్వామి పరిణయం ఘట్టం వెండితెరపై కనులవిందుగా ఉంటుంది. అలా శ్రీనివాసుడు ఎలా ఏడుకొండలపై పద్మావతి సమేతంగా శ్రీ ఏడుకొండలస్వామిగా ఎలా వెలసింది వినాయకుడికి వేదవ్యాసుడు వివరిస్తారు.

నారదుడు ఆకాశమార్గంలో నారాయణ జపం చేస్తూ, సంచారం చేస్తూ ఉండగా, నారదమహర్షికి శనైశ్చరుడు తారసపడతాడు. వారిద్దరి మద్య శ్రీ ఏడుకొండలస్వామి శ్రీనివాసుని గురించి ప్రస్తావన వస్తుంది. పరమశివుడినే కొన్ని ఘడియలపాటు పీడించిన నాకు, కలియుగంలో వేంకటేశుని పీడించడం ఏపాటిది, అని నారదునితో అని శ్రీ వేంకటేశ్వరుని నిలయానాకి చేరి అక్కడ భంగపడతాడు. శ్రీ ఏడుకొండలస్వామి మహిమ అర్ధం చేసుకున్న శనైశ్చరుడు ఆ ఏడుకొండలస్వామి గురించే తపస్సు చేస్తాడు.

శనైశ్చరుని తపస్సుకు మెచ్చిన శ్రీఏడుకొండలస్వామి, శనైశ్చరుని ముందు సాక్షాత్కరించిన శ్రీవేంకటేశ్వరుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు శనైశ్చరుడిని. అప్పుడు శనైశ్చరుడు శ్రీ ఏడుకొండలస్వామిని ఇలా రెండు వరాలు అడుగుతాడు. ఒకటవ వరం: ఒక్క శనివారం మాత్రమే నిన్ను పూజిస్తే, వారంలో మిగిలిన ఆరు రోజులు నిన్ను పూజించినంతటి పూజాఫలం అనుగ్రహించమని కోరతాడు. రెండవ వరం: గ్రహచారం ఉన్నవారు నీ భక్తుల అయినా సరే వారిని నేను పీడించడానికి నీవు ఆడ్డు పడకూడదు అని అడుగుతాడు. శ్రీనివాసుడు తధాస్తు అని అంతర్ధానం అవుతాడు.

అప్పుడు వినాయకుడు, వ్యాసమహర్షితో ఇలా అంటాడు ”శనైశ్చరుడికి రెండవ వరం కూడా అనుగ్రహించడంలో శ్రీ ఏడుకొండలస్వామి ఆంతర్యం ఏమిటి” అని. బదులుగా వ్మాసమహర్షి ”ఆ జగన్నాధుని లీలలు అర్ధం అవ్వడం అంత సులభం కాదు, ఇదిగో ఆ జగన్నాటకంలో భాగంగా ఆయన ఆడిస్తున పాత్రలు చూస్తే ఆ పరమార్ధం నీకు అర్ధం అవుతందని” అంటాడు. శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం తెలుగు భక్తి సినిమా.

పెద్దలు అందరూ జయంతి, జయంత్ ల వివాహం నిశ్చయం చేసుకుంటారు. అయితే వరాహమిత్రుడు అనే బ్రాహ్మణస్వామి జాతక పరిశీలనలో జయంత్ కు అపమృత్యు దోషం బయటపడుతుంది. అయితే ఇద్దరికి వివాహం జరిగితే, జయంతి జాతకబలం చేత, జయంత్ జాతకంలోని దోషం పోతుందని వివాహం లగ్నం నిశ్చయం చేస్తారు. వివాహం జరిపించి వరాహమిత్రుడు జయంతితో మాట్లాడుతూ ”సరిగ్గా నేటి నుండి ఏడవ శనివారం నాడు, నీ భర్త జయంత్ కు మృత్యుగండం ఉంది” అని చెబుతాడు. అయితే శ్రీ ఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతం గురించి జయంతికి చెప్పబోతూ వరాహమిత్రుడు ప్రాణాలు కోల్పోతాడు.

జయంతితో ఎవరు ఏడుశనివారాల వ్రతం చేయిస్తారు? జయంత్ మృత్యు గండం నుంచి తప్పించుకున్నాడా? శ్రీ ఏడుకొండలస్వామి అనుగ్రహం వలన ఏవిధం జయంతి, జయంతుల జీవితం సంతోషమయం అయ్యింది? శ్రీ ఏడుకొండలస్వామి తెలుగు సినిమాలో చక్కగా చూపిస్తారు. ఆ ఏడుకొండలస్వామిని భక్తితో కొలిస్తే, ఎటువంటి గ్రహదోషం అయినా తప్పించుకోవచ్చు అనే విధంగా ఈ శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం సినిమా తీర్చిదిద్దారు.

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమా యూట్యూబ్ వీడియో చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి.

ధన్యవాదాలు- తెలుగు రీడ్స్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

సైరా నరసింహారెడ్డి

తెలుగు వెర్షన్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ తో సైరా నరసింహారెడ్డి సినిమా ప్రారంభం అవుతుంది. అనుష్క ఎంట్రీతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం గురించిన వివరణ ప్రారంభం అవుతూ ఆరంభం అధరగొడుతుంది.

నరసింహారెడ్డి జాతరలో ఎద్దుల భారీ నుండి ప్రజలను కాపాడడంతో బాటు ఎద్దుల ప్రాణాలను కూడా కాపాడడం చాలా ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ దొర నరసింహారెడ్డి సహచరుడికి గుండు కొట్టించి పంపించడంతో, ఆ బ్రిటిష్ దొరను టైము చెప్పి చంపుతానని శపధం చేసి మరి ఊరి ప్రజలు చూస్తుండగా అతనిని చంపే యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లక్ష్మికి ఇచ్చిన మాట తప్పడంతో, లక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు నరసింహారెడ్డి మాటలు ఆకట్టుకుంటాయి. ఆ మాటలు స్పూర్తితో లక్ష్మి ఉద్యమ స్ఫూర్తిని అందరిలో నింపుతూ, తమిళ ప్రజల వరకు ఉద్యమాన్ని తీసుకువెళుతుంది.

ఊరిబాగు కోసం యజ్ఙంలో భాగంగా సిద్దమ్మ చిన్ననాడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో తాళి కట్టించుకుని, అతనే లోకంగా బ్రతకుతుంది. మరలా సిద్దమ్మ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక్కటవటం కూడా ఊరి కరువు తీర్చే యజ్ఙంలో భాగంగానే జరుగుతుంది. ఇంకా ఉద్యమం కోసం కూడా వారు విడివిడిగా జీవించడానికి ఇష్టపడతారు. వీరిద్దరి మద్య ఈ సన్నివేశాలే ఉన్నా అవి మనసుని స్పందింపజేస్తాయి.

క్లైమాక్స్ ఈ సినిమాకు ఆయువుపట్టు, మనం తలతిప్పుకోకుండా నిడివి ఎక్కువైనా ఆ ఎమోషనల్ సీన్స్ ను చూస్తూనే ఉంటాం. తెలుగువాడి పౌరుషం నయవంచనకు గురి అయ్యి, అతని తల తెంచి, కోటగుమ్మానికి వ్రేలాడదీస్తే, కంటతడిపెట్టని తెలుగువాడు ఉండడు.

సుదీప్ చేసిన పాత్ర చాలా చాలా బాగుంటుంది. చిరంజీవి గురువుగా అమితాబ్ నటన, తమన్నా పాత్ర ఆకట్టుకుంటే, ఒక స్వాతంత్ర్య పోరాటయోధునిగా మెగాస్టార్ చిరంజీవి పాత్రలో ఒదిగిపోయాడు.

సమాజానికి స్పూర్తినిచ్చే సినిమాలు సమాజంలో అవసరం అనే విషయం సామాజిక వేత్తల అభిప్రాయంగా కూడా ఉంది. అవును మంచి సినిమాల ద్వారా ఇచ్చే సందేశం, చారిత్రక సినిమాల ద్వారా ఇస్తే దాని స్పూర్తి ప్రభావం మరింత ఉంటుంది. అటువంటి చారిత్రక సినిమాను తీసిన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి టీమ్ ని ఖచ్చితంగా అభినందించాలి.

దేశభక్తి సినిమా అంటే అందరిలో దేశభక్తుడుగా ఒక పెద్ద హీరో ఎలా నటించాడో అన్న ఆత్రుత ఉంటుంది. ఆంగ్లేయులపై తిరగబడ్డ తొలి భారతీయుడు అనగానే ఇంకా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సపోర్టు ఇచ్చిన మిగిలిన పాత్రలను వెండితెరపై చూడడానికి రివ్యూతో పనిలేకుండానే చూడాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.

కుటిల రాజకీయాలు చేస్తూ, భారతీయుల పౌరుష పరాక్రమాలను తమకు అనుకూలంగా మార్చుకునే బ్రిటిష్ పాలన, మనదేశాన్ని పట్టి పీడించింది. అట్టి పాలకులను ఎదురించిన మన భారతీయుల చరిత్రను తిరిగి తెరపై చూడడమంటే ఎంతో సంతోషం.

ఫిక్షన్ స్టోరి అయిన బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన సాధించన తెలుగు సినిమా ఇండస్ట్రీనుండి వచ్చిన మరో భారీ ప్రొజెక్టు ఈ సినిమా. ఇప్పుడు చారిత్రాక అంశంతో వస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా అందరూ చూసి, మన దేశ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా

మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి.

తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడు భీష్ముడు అటువంటి భీష్ముని పాత్రను ఎన్టీ రామారావుగారు పోషించారు. ఈ తెలుగు సినిమా టైటిల్ కూడా భీష్మనే. గంగాదేవికి శంతనమహారాజుకు కలిగిన సంతానమే భీష్ముడు. అయితే శంతనమహారాజుకు భీష్ముడు ఏకైక సంతానం. కానీ రాజులకు ఒక్కడే కొడుకు ఉండడం వలన వంశం నిలబడడానికి ఎక్కువ సంతానం అవసరం కావునా, ఇంకా పుత్రసంతానం కొరకు ద్వితీయ వివాహం చేసుకోవాలనే కోరిక, ఒక మత్య కన్య అయిన సత్యవతిని చూడగానే శంతనమహారాజుకు కలుగుతుంది. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా .

అయితే సత్యవతిని శంతనమహారాజుకు ఇచ్చి వివాహం చేయడానికి, ఆమె తండ్రి దాసరాజు ఒక షరతు పెడతాడు. భవిష్యత్తులో సత్యవతికి కలగబోయే పుత్రసంతానానికే రాజ్యాధికారం వచ్చే విధంగా మాట ఇమ్మంటాడు. అప్పటికే భీష్ముడు ఆ రాజ్యానికి యువరాజు, ఇంకా భీష్ముడు పరమ ధర్మాత్ముడు. కావునా నేను ఆ మాటను ఇవ్వజాలను అని శంతనమహారాజు అంత:పురానికి వెనుదిరుగుతాడు. అయితే రాజు మనసులోని బాధను గుర్తించిన భీష్ముడు విషయం తెలుసుకుని దాసరాజు దగ్గరకు వెళతాడు.

భీష్ముడు దాసరాజు దగ్గరకు వెళ్లి తన తండ్రి వివాహం గురించి అడుగుతాడు. అయితే దానికి దాసరాజు షరతుకు భీష్ముడు అంగీకరిస్తాడు. కానీ భవిష్యత్తులో నీ సంతానం నీవు ఇచ్చిన మాటపై నిలబడతారనే నమ్మకం ఏమిటి? అని ప్రశ్నిస్తాడు…దాసరాజు, భీష్ముడుని. అప్పటివరకు కేవలం మాట మాత్రమే ఇచ్చిన భీష్ముడు, పంచభూతాల సాక్షిగా, ఆ రాజ్య పెద్దల మద్య ”తన తండ్రికొరకు తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని” భీషణ ప్రతిజ్ఙ చేస్తాడు. అప్పటిదాక ఆయన పేరు దేవవ్రతుడు, ఆ ప్రతిజ్ఙతో ఆయన పేరు భీష్ముడుగా మారింది.

అక్కడి నుండి భీష్ముడు కురు సామ్రాజ్యాన్ని కాపాడడంలో, కురు వంశం వృద్ది విషయంలో ఎదుర్కొన్న సంఘటనలు, పరీక్షలు భీష్మ చిత్రం. రామారావు, అంజలీదేవి, రేలంగి తదితరులు భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా నటించారు

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

శుభలేఖ చిరంజీవి క్లాసికల్ మూవీ

చిరంజీవి – కె విశ్వనాధ్ కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ

కొందరు ఒక్కపని చేయడంలో కూడా తడబడుతూ ఉంటే, ఒక్కొక్కరు మాత్రం ఒకటి కంటే ఎక్కువ రంగాలలో ప్రతిభను కలిగి ఉంటారు, కానీ చదువు మాత్రం సాగదు. మన శుభలేక హీరో కూడా మల్టిటాలెంటెడ్ హీరో. ఈయన పేరు నరసింహ మూర్తి (చిరంజీవి) డిగ్రీ ఫైయిల్ అవ్వడంతో, ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే అతనికి అంకెల ఆదిశేషయ్య (కైకాల సత్యనారాయణ) నడుపుతున్న కళాశాలలో టీచర్ గా పనిచేస్తున్న సుజాత (సుమలత) అనే అమ్మాయి పరిచయం పెరుగుతుంది. వరకట్నం వరుని బహుమతిగా ఇచ్చే దశ నుండి బలవంతంగా వసూలు చేసే స్థాయికి వరకట్నం విలువలు పడిపోతున్న తరుణంలో ఆదిశేషయ్య తన కుమారుడు మోహన్ (గిరీశ్)తో సహా పెళ్ళిచూపులకి సుజాత ఇంటికి వస్తారు. ఆదిశేషయ్య అడిగిన వరకట్నం తమ కుటుంబం స్తోమతకి మించి ఉండడంతో, సుజాత అతనితో వాదనకి దిగుతుంది. దీంతో తల్లిదండ్రులు తమతోనే ఉంటే తమ కుమార్తె వివాహం చెయ్యలేమని, సంఘంలో తలెత్తుకు తిరగలేమని భయపడిన తల్లిదండ్రులు సుజాతను ఇంటినుండి పంపించేస్తారు.

ఆదిశేషయ్య కూడా సుజాతని పనిలోంచి తీసేయగా నిరాశ్రయురాలైన సుజాతకు, మూర్తి అనే అతను తన ఇంటిలోనే చోటిస్తాడు. అయితే సంఘం వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగడుతుంది. ఒక సన్మాన సభలో ఆదిశేషయ్య నిజస్వరూపాన్ని మూర్తి బయటపెడతాడు. అలా తనని అవమానించనందుకు గాను, ఆదిశేషయ్య రౌడీలతో మూర్తిని కొట్టించి, అతని ఉద్యోగం కూడా తీయించేస్తాడు. చెడుకు బలం ఎక్కువ, వెంటనే వ్యాపిస్తుంది. అయితే ధర్మం ఎప్పుడూ నిదానంగానే ఫలితం ఇస్తుంది. మూర్తి సుజాతతో బాటు హైదరాబాదు చేరి, తనకి పరిచయం ఉన్న ఆల్విన్ లో ఉన్నతోద్యోగి అయిన రావు (అరుణ్) తో మాట్లాడి సుజాతకి కొత్త ఉద్యోగం ఇప్పిస్తాడు. సుజాత చెల్లెలు లక్ష్మి (తులసి)ని మోహన్ తమ్ముడు మురళి (శుభలేఖ సుధాకర్) ప్రేమిస్తాడు. నరసింహమూర్తి, సుజాతల, మురళి, లక్ష్మిలు ఎలా ఒక్కటయ్యారనేది ఈ సినిమాకు ముగింపు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

అలనాటి పాత తెలుగు సినిమాలలో నలదమయంతి తెలుగుభక్తి సినిమా ఒక్కటి. ఈ తెలుగు సినిమాలో నలమహారాజు, దమయంతిల వివాహ ఘట్టం నుండి సన్నివేశాలు ఉంటాయి.

నలదమయంతి కధ మహాభారతంలో ధర్మరాజు విన్న కధలలో ఒక్కటి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, అగ్రజుడు అయిన ధర్మరాజు ఈ కధ వింటాడు. ఇక ఈ సినిమా అయితే నలదమయంతిల హంసరాయభారంతో ప్రారంభం అవుతుంది. హంస రాయభారంతో నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఒకరంటే ఒకరికి ఇష్టం మానసికంగా ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. దానికి నలుడు కూడా బయలుదేరతాడు.

దమయంతి అందచందాలు గురించి, గుణగణాలు గురించి బాగా విన్న దేవతలు ఆమెను పరీక్షించాలనుకుంటారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యమధర్మరాజు నలుడు దగ్గరకు వచ్చి, ముందుగా ఒక మాట తీసుకుంటారు. వారికి నలుడు ప్రతిజ్ఙ చేస్తాడు, మీరు చెప్పిన పనిని చేసిపెడతానని. వెంటనే వారు దమయంతికి తమగురించి గొప్పగా చెప్పి, తమలో ఎవరినైనా ఒకరిని వరించేలా, ఆమె మనసుని మార్చమని అడుగుతారు. నలుడు నేనెలా అంత:పుర కన్యతో మాట్లాడేది, అనగా దానికి వారు నలుడు అదృశ్యమయ్యే శక్తిని ఇస్తారు.

అంత:పురంలో దమయంతి ఒంటరిగా ఉన్నప్పుడు, నలుడు అక్కడికి వస్తాడు, ఆమెకు దేవతలు గురించి చెబుతాడు. అయితే ఆమె నలుడే తన భర్త అని తేల్చి చెబుతుంది. ఈ విషయం తెలుసుకున్న దేవతలు స్వయంవరం సభలో తాము కూడా నలుడులాగా మారి, సభాసినులై ఉంటారు. స్వయంవరంలో అయిదుగురు నలుడులు కనిపించేసరికి, దమయంతి అమ్మవారిని ప్రార్ధిస్తుంది. అప్పుడు దమయంతికి అమ్మవారు అంతర్లీనంగా ఒక సూచన చేస్తుంది. ”దేవతలు కనురెప్ప వేయరు, ఎవరు కనురెప్పలు వేస్తూ ఉంటారో అతనే నలుడు” అని చెప్తుంది. దానితో దమయంతి నలుడినే వరిస్తుంది. నలదమయంతి తెలుగుభక్తి సినిమా.

నలదమయంతిలకు ఇద్దరు పిల్లలు కలుగుతారు. అయితే సోదరుడు పుష్కరుడు చేసిన మోసపూరిత జూదంలో రాజ్యాన్ని కోల్పోతాడు. దమయంతి పిల్లలను తన పుట్టింటికి పంపించేసి, తాను నలుడితో కలసి కానలకు వెళ్తుంది. అడవులలో నలదమయంతిలకు తినడానికి ఏమి దొరకక నానా కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు నలుడు దమయంతి ”ఇన్ని కష్టాలు నాతో నీకెందుకు, నీవు నీ పుట్టింటికి వెళ్లు” అంటాడు. అందుకు బదులుగా దమయంతి నలుడితో ”త్రిమూర్తులు కన్నా నాకు మీరే మిన్న అన్నట్టుగా” పలికి ఆమె అతనితోనే ఉంటుంది. ఆమెతోనే ఉంటే ఆమె పుట్టింటికి వెళ్లకుండా నాతోనే ఉండి ఈ అష్టకష్టాలు పడుతూనే ఉంటుందని భావించిన, నలుడు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెను ఆ అడవిలో వదిలేసి వెళతాడు.

దమయంతి నిద్రలేచి చూసేసరికి ఒక కొండచిలువ ఆమెకు కనబడుతుంది. ఆమె తప్పించుకునే లోపు ఆమెను కొండచిలువ చుట్టుముడుతుంది. ఆమె ఆర్తనాదం విన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కొండచిలువను చంపి, ఆమెను రక్షిస్తాడు. తర్వాత దమయంతి వారి గూడెంకు వెంటబెట్టుకుని వెళతాడు.

ఇక మరొ ప్రక్క నలుడు అడవిలో నడుస్తూ, ఆకలితో అలమటిస్తుండగా అక్కడ దగ్గరిలో మంటలలో ఉన్న పాము ఒక్కటి కనిపిస్తుంది. నలుడు వెంటనే పాముని మంటలలో నుండి కాపాడతాడు. వెంటనే పాము నలుడి కాలుపై కాటు వేస్తుంది. దానితో నలుడు తన అందమైన రూపం కోల్పోయి, వికృత రూపంలోకి మారతాడు. అప్పుడు ఆ పాము ఒక మానవరూపంలో ప్రత్యక్షమై, ఇది నీ మేలుకే వచ్చింది. ఈ రూపంలోనే నీవు ఆయోధ్యాధీశుడు అయిన ఋతుపర్ణుడిని సేవించమని చెప్పి అంతర్ధానం అవుతాడు. నలదమయంతి తెలుగుభక్తి సినిమా.

దమయంతి ప్రాణాలను కాపాడిన వాడే, దమయంతిని బలత్కారం చేయబోతాడు, అప్పుడు ఆమె పరాశక్తిని ప్రార్ధించడంతో, దమయంతి అక్కడి నుండి రక్షించబడుతుంది. తర్వాత దారిలో కొందరి బాటసారుల ద్వారా ఆమె తన తండ్రి ఇంటికి చేరుతుంది.

నలుడు ఋతుపర్ణుడి దగ్గర బాహుకుడు అను నామధేయంతో సేవకుడిగా చేరతాడు. ఇలా విధి విలాసంలో భాగంగా వేరు అయిన నల దమయంతులు చివరికి ఎలా కలుసుకున్నారు. విడదీసిన విధే తిరిగి వారు కలవడానికి ఎలా సహకరించింది? ఈ విధంగా చిత్రం సాగుతుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

సూర్య, మోహన్ లాల్, ఆర్యల బందోబస్త్

సూర్యకు తమిళమే కాకుండా తెలుగులోనూ మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. గజినితో గుర్తింపు తెచ్చుకున్న సూర్య, యముడు, సింగం, సింగం2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బందోబస్తు. ఇందులో సూర్యతో బాటు మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖిని, పూర్ణ తదితరులు నటించారు.

దేశ ప్రధానమంత్రి చుట్టూ కధ తిరుగుతుంది, ప్రధానిని రక్షించే అధికారిగా రవికాంత్ (సూర్య) ఇందులో జీవిస్తాడు. లండన్ పర్యటనలో ఉన్న ప్రధానిపై ఎటాక్ జరగబోతుందనే ఇంటిలెజన్స్ రిపోర్టు ప్రకారం, రవికాంత్ లండన్‌లో ప్రధానిని రక్షిస్తాడు. అయితే ప్రధాని పి.ఏ. అంజలి రవికాంత్ ఉగ్రవాది అనుకుని పొరపాటు పడుతుంది. కానీ ప్రధానికి కాపాడాకా, అసలు విషయం తెలుసుకుని, ఆమె అతనికి దగ్గరవుతుంది. రవికాంత్ ఎన్.ఎస్.జి కమాండుగా నియమితుడవుతాడు. కానీ టెర్రరిస్టు విక్రమ్ మరో పధకం ప్రకారం కాశ్మీర్లో బాంబ్ బ్లాస్ట్ జరిపించి ప్రధాని చంద్రకాంత్ ని చంపించేస్తాడు.

తర్వాత చంద్రకాంత్ కొడుకు అభిషేక్(ఆర్య), దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తాడు. కానీ కుర్రవాడు అయిన అభిషేక్ తనకు రాజకీయం అనుభవం లేకపోవడంతో, ఒకసారి తన తండ్రిని రక్షించిన రవికాంత్ ని పి.ఎస్.ఓ గా నియమించుకుంటాడు. మహదేవ్ అనే వ్యాపారవేత్త, గ్యాస్ కొరకు గోదావరి పరిసరాలలో భూమిని నాశనం చేయడం పనిగా పెట్టుకుంటాడు. తనకు ఎదురుతిరిగినవారిని, తనను ప్రశ్నించినవారిని అడ్డుతొలగించుకుంటూ ఉంటాడు. అటువంటి మహాదేవ్ కు, ప్రధాని అభిషేక్ అడ్డుపడతాడు. దాంతో మహాదేవ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? దేశప్రధానిని చంపించాల్సిన అవసరం ఎవరికి? ఎందుకు? ఏ ఏ పధకాలు ప్రకారం కధ నడుస్తుందనే సస్పెన్స్ వెండితెరపై చూడాలి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

గద్దలకొండ గణేష్ విడుదలకు ముందు వాల్మీకిగా ప్రచారం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శింపడుతుంది. గతంలో గబ్బర్ సింగ్-1 చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ కు ఆస్థాయిలో మరో హిట్ రాలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రం అనూహ్య విజయంగానే అంచనా వేస్తున్నారు. అనూహ్య విజయాలు ఎప్పుడూ కొత్త రికార్డులవైపు వెళుతూ ఉంటాయి. అయితే వరుణ్ తేజ్ కు వచ్చిన హిట్ టాక్ ఏస్థాయిలో కనెక్షన్లు రాబడతాడో దానిని బట్టి సినిమా హిట్ రేంజ్ ఉంటే, ఇప్పుడు మాత్రం సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

వరుణ్ తేజ్ – పూజా హెగ్డే కలసి నటించిన ఈ చిత్రంలో కధానాయకుడి అభినయం ఆకట్టుకునే విధంగా ఉండడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింటు. ఇంకా జతకట్టిన పూజాహెగ్డే తక్కువ సమయమైనా, జోడి వర్కవుట్ అయ్యింది. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి వచ్చేవరకు భారీ చిత్రాలు ఏమిలేవు కాబట్టి గద్దలకొండ గణేష్ గట్టి హిట్ నే సొంతం చేసుకోనున్నాడు.

వాల్మీకిగా ప్రచారం పొంది, గద్దలకొండ గణేష్ గా గట్టి హిట్ అందుకున్న వరుణ్ తేజ్, హరీష్ శంకర్.

3 నెలల్లో కోటికి పైగా వ్యూస్ ఉన్న రోషగాడు సినిమా కధ?

రోషగాడు సినిమా చూడడానికి ఈ అక్షరాలను తాకండి

వైవిధ్యం కన్నా కధలో పట్టు ఉండి, ఆశయం సామాజిక స్పృహను గుర్తిస్తే, ఆ విషయం సమాజంలో తొందరగా చేరుతుంది. అలాంటి ఒక చిత్రం రోషగాడు తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన సినిమా. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఒక కోటికి పైగా వ్యూస్ పొందింది.

యుక్తవయస్సులోకి మారే వ్యక్తి, తన చుట్టూ ఉండే సమాజంలో తన ఐడింటిటీని చెక్ చేసుకుంటాడు. తనను సమాజం ఏవిధంగా ఐడింటిఫై చేస్తుంది? సమాజంలో ఎలా ఉంటే మనం హీరోలాగా బ్రతకవచ్చు? ఈ రెండు ప్రశ్నలు యుక్త వయస్సుకు వస్తున్న బాలురలో అధికంగా ఉంటాయి.

బాలురలో చెడు ఆసక్తులు ఉంటే, సాదారణంగా అయినవారు వాటిని నివారించడానికి ప్రయత్నిస్తే, స్వార్ధపరులు వాటిపై ఇంకా వ్యామోహం పెంచి, తమ స్వార్ధానికి వాడుకుంటారు. అలాంటి ఒక కధే రోషగాడు సినిమా కధ.

బాబ్జీ అనే వ్యక్తి బాల నేరస్తులకు పెద్దగా శిక్షలు ఉండవు కాబట్టి, సిటిలో కొత్తగా వచ్చిన బాలురకు చెడు అలవాట్లను నేర్పించి, తర్వాత వారితో హత్యలు కూడా చేయిస్తూ ఉంటాడు. అతనికి సిటిలో పలుకుబడి అన్ని పెరగుతూ ఉంటాయి, అతని వలన సిటిలో చాలామంది యువకుల జీవితాలు నేర ప్రవృత్తి వైపు ఆకర్షితులవుతారు.

సమాజం అంతా నా బంధవులే అని ప్రేమించే ఒక పోలీసు అధికారి తమ్ముడు, అన్నపై కోపంతో అన్నను వదిలేసి, సిటికి పారిపోతాడు. తమ్ముడిని వెతుక్కుంటూ నగరానికి వెళ్లిన పోలీసు అధికారికి, తమ్ముడు ఒక నేరస్తుడుగా కనబడతాడు. తప్పని పరిస్థితులలో తన తమ్ముడిని తానే రోడ్డుపై కాల్చి చంపుతాడు. తర్వాత తన తమ్ముడికి పట్టిన గతి సిటిలో ఉన్న మరే ఇతర తమ్మునికి పట్టకూడదు, అని నిశ్చయించుకుంటాడు. అప్పటి నుండి బాబ్జీ అంతు చూసేవరకు అతను నిద్రపోడు. బాబ్జీ అంతు చూశాకా అతనే నిద్రకు ఉపక్రమిస్తాడు.

బాబ్జీ అంతు చూడడానికి ఆ పోలీసు అధికారి ఎంచుకున్న మార్గం మాత్రం సినిమాకు హైలెట్. ఏవిధంగా బాబ్జీ యువకుల దృష్టిలో హీరో అయ్యాడు, అదే విధంగా బాబ్జీ జీరో అయ్యేలాగా పరిస్థితులను తీసుకువస్తాడు. మంచి సందేశాత్మకంగా ఉంటుంది. విజయ్ ఆంటోని పోలీసు పాత్రలో ఒదిగిపోయాడు.

బాలనాగమ్మ

బాలనాగమ్మ ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించగా వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ సినిమాకు దర్శకత్వం వహించారు.

రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది. సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య దిక్కున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు ఆరగించు, ఇతోదకమైన సంతానం కలుగుతుంది” అని ఆకాశవాణిగా పలుకుతాడు. మహరాణి వెంటనే చెట్టు దగ్గరకు వెళుతుంది.

చెట్టున ఉన్న ఫలాలు మహారాణి భూలక్ష్మికి అందకపోవడంతో ఆమె అక్కడే చెట్టు క్రింద ఉన్న పుట్టపై కాళ్లు పెట్టి, చెట్టు కొమ్మల నుండి అందినంతలో ఉన్న ఫలాలను కోసుకుని, క్రిందికి దిగుతుంది. అలా మహారాణి పుట్టమీద నుండి క్రిందికి దిగగానే, ఆమె చెంగులో ఉన్న ఫలాలు ఒక్కటి మినహా మిగిలినవి అన్ని మరలా చెట్టుకి చేరతాయి. ఇక అక్కడి పుట్టలోని నాగరాజు మానవరూపంలో ప్రత్యక్షమై, మహారాణిని పేరాశకు, ఆమె చేసిన తప్పుకు శిక్షించదలుస్తాడు. అయితే నేను తల్లిని అయ్యేవరకు నాకు గడువు ఇవ్వవలసినదిగా మహారాణి, నాగరాజుని ప్రార్ధన చేయడంతో, నాగరాజు బిడ్డ పుట్టిన ఆరుమాసాలకు తిరిగి వస్తానని, అప్పుడే నిన్ను కాటువేసి చంపుతానని చెప్పి అంతర్ధానం అవుతాడు.

ఈ విషయం మహారాజుకు చెప్పకుండా మహారాణిభూలక్ష్మి దాచి ఉంచుతుంది. కొన్నాళ్లకు వారికి ఏడుగురు ఆడ శిశువులు జన్మిస్తారు. అయితే దు:ఖిస్తున్న రాణిని, విషయం అడిగి తెలుసుకున్న మహారాజు మొత్తం నాగులన్నింటిని చంపించే ప్రయత్నం చేస్తాడు. కానీ వారి ప్రయత్నం అలా సాగుతున్నా నాగరాజు అంత:పురంలోకి వచ్చి మహారాణిని కాటువేసి వెళ్లిపోతాడు. పసిపిల్లలను పెంచకుండానే మహారాణి ప్రాణాలు విడుస్తుంది. మహారాజు తనకు పుట్టిన ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాడు. ఏడుగురుపిల్లల్లో ఆఖిరి పిల్లపేరు బాలనాగమ్మ. పిల్లలు పట్టు మేరకు మహారాజు మరోరాణి మాణిక్యాన్ని వారికి తల్లిగా తీసుకువస్తాడు. మొదట్లో ఆమె పిల్లలను బాగానే చూసుకుంటుంది. కానీ చెలికత్తె చెప్పుడు మాటలకు మాణిక్యం మనసులో స్వార్ధం పెరిగి, పిల్లలను నానా కష్టాలకు గురి చేస్తూ ఉంటుంది. రాజుకు ఈ విషయం తెలిసి రాజు ఆగ్రహించి, మాణిక్యాన్ని దాసిని చేస్తాడు. తర్వాత మాణిక్యం తన చెలికత్తె సహకారంతో రాజుకు మందు పెట్టి, మహారాజును వశపర్చుకుంటుంది. తనకు వశపడిన రాజుని, నీ పిల్లలని చంపేయమని రాజుకు చెబుతుంది. మాణిక్యానికి వశపడి ఉన్న రాజు, మాణిక్యం మాటానుసారం చిన్న పిల్లలను చంపడానికి అడవికి తీసుకువెళతాడు. అక్కడ చంపలేక వారిని అక్కడే వదిలేసి, తన రాజ్యానికి వెళ్లిపోతాడు. తిరిగి వెళ్లిన రాజు, మాణిక్యం రాణిగా ఉంటే, రాజు పూర్తిగా అమెకు వశపడి ఉంటాడు. తర్వాత ఆ పిల్లలు అడవిలోనే పెరుగుతారు.

పానుగంటి పురం రామవర్తికి తన చెల్లెలు అయిన భూలక్ష్మి కోల్పోవడంతో, ఆమె పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. అతనికి ఏడుగురు కొడుకులు, ఆఖిరివాని పేరు కార్యవర్తి. అడవిలో భూలక్ష్మి పిల్లలు పెరిగి పెద్దవుతారు. భూలక్ష్మి అన్న రామవర్తి పిల్లలు కూడా తమ మేనత్త పిల్లల జాడ కోసం ప్రయత్నిస్తూ పెరుగుతారు. వరుస అయిన ఏడు జంటలు విడివిడిగా పెరిగి యుక్త వయస్సుకు వచ్చాక వారు ఒకరినొకరు తారసపడే అవకాశం వస్తుంది. రామవర్తి అనుజ్ఙతో అతని ఏడుగురు పిల్లలు తమ మేనత్త సంతానం ఎక్కడ ఉందో వెతుకుతూ అడవికి వస్తారు. ఆ అడవిలో వారు కలుసుకోవడం, వారికి పెళ్లిళ్లు కూడా జరుతాయి.

పెళ్లైన తర్వాత బాలనాగమ్మకు ఒక పిల్లవాడు జన్మిస్తాడు, తర్వాత ఆమె మాంత్రికుడి చేత అపహరింపబడుతుంది. ఆమెను దక్కించుకోవాలని మాంత్రికుడు, బాలనాగమ్మను బంధించి ఉంచుతాడు. బాలనాగమ్మని విడిపించడానికి వెళ్లిన కార్యవర్తి మాంత్రికుడి మంత్రప్రభావంతో శిలగా మారిపోతాడు. చివరకు బాలనాగమ్మ కొడుకు వచ్చి తన తల్లిదండ్రులను విడిపిస్తాడు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

మాయాబజార్ వీడియో వీక్షణకు ఇక్కడ క్లిక్ లేక టచ్ చేయండి

పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది.

అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. రేవతి-బలరాముల ఆడబిడ్డ శశిరేఖని, సుభద్ర-అర్జునుల మగబిడ్డ అభిమన్యునికి ఇచ్చి వివాహాం చేయాలని, వారి బాల్యంలోనే పెద్దలు మాటలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటుపై సుభద్ర అభిమన్యుని తీసుకుని తన మెట్టింటికి బయలుదేరుతుంది.

శ్రీకృష్ణుడు పాండవులు రాజసూయ యాగం నుండి ద్వారకకు తిరిగి వస్తూ, ధర్మరాజు ఇచ్చిన బహుమతులను తీసుకుని వస్తాడు. వాటిని బలరాముడికి, శశిరేఖకు బహూకరిస్తాడు. బలరామునికి ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”దానిపై నిలబడిన ఎవరైనా సరే, వారి మనసులోని కుఠిలం స్వయంగా వెల్లడి చేసేస్తారు.” ఇంకా శశిరేఖకు ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”ఆ పెట్టెని తెరిచి చూస్తే మనసులో ఏది ఎక్కువ ఇష్టంగా ఉంటే ఆ వస్తువు కానీ లేక ఆ వ్యక్తికాని కనబడతారు” దానిని తెరిచి చూసిన శశిరేఖకు తన బావ అభిమన్యుడు కనబడతాడు.

శ్రీకృష్ణుడు వేరొక చోట ఉండగానే, పాండవులకు జగిరిన అన్యాయం తెలుసుకుంటాడు. అప్పుడు నిండుసభలో ద్రౌపదిపై జరిగిన ఆకృత్యం కూడా స్వామికి తెలయబడడం, ఆమెకు శ్రీకృష్ణ భగవానుడు తనమహిమచేత నిరంతర వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు పరధ్యానంలోకి వెళ్లడం గమనించిన బలరాముడు, శ్రీకృష్ణుడిని ఏమయ్యిందని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు, తనవారితో పాండవులకు జరిగిన అన్యాయం గురించి, కౌరవులు వడిగట్టిన దారుణాలను వివరిస్తాడు. వెంటనే బలరాముడు ”నేను ధర్యోధనుడిని హెచ్చరించి, పాండవులు రాజ్యాన్ని పాండవులకు తిరిగి వచ్చేలా చేస్తానని” ద్వారక నుండి హస్తినాపురానికి బయలుదేరతాడు.

హస్తినాపురంలో ధర్యోధనుడుకి బలరాముడు వస్తున్నాడనే సమాచారంతో దిగులు చెందుతుంటే, అతని మేనమామ శకుని ”ఎందుకు..దిగులు, బలరాముడుని స్థుతి చేయడం ద్వారా అతనిని ఇట్టే ప్రసన్నం చేసుకోవచ్చును, కావునా బలరాముడికి బ్రహ్మరధం పట్టేవిధంగా ” ఆహ్వానం పలకమని చెబుతూ ఇంకా ”మన లక్ష్మణ కుమారునికి, బలరాముని కూతురు శశిరేఖను ఇచ్చ వివాహం చేయమని అడుగు, ఈ వివాహం జరిగితే భవిష్యత్తులో యాదవ వంశంవారు అంతా మనవైపే ఉండవలసి ఉంటుంది” అని బోధ చేస్తాడు. శకుని సలహాతో ధర్యోధనాధులు సంతోషిస్తారు. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

బలరామునికి ధర్యోధనుడు సకల మర్యాదలు చేసి, ఆసనం వేసి పాదసేవ చేస్తూ ఉంటు అన్ని విషయాలు తమకు అనకూలంగా ఏకరువు పెడతారు. పాండవులు తప్పు చేసినట్టుగా, పాండవులపై ఆరోపణలు చేస్తూ బలరాముడికి ధుర్యోధనాదులు మాటలు ఎక్కిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణ కుమారుడుకు, శశిరేఖను ఇచ్చి వివాహం చేయవలసినదిగా వరం కోరతాడు, ధర్యోధనుడు. అప్పటికే ధర్యోధనుడు కపట మర్యాదలకు సంతోషించిన బలరాముడు, ధర్యోధనుడు కోరికకు అంగీకారం తెలుపుతాడు. అక్కడి నుండి బలరాముడు, ధర్యోధనుడు ఇచ్చిన అనేక కానుకలను స్వీకరించి తిరిగి ద్వారకకు వస్తాడు.

పాండవుల వనవాసానికి వెళ్లే సమయంలో సుభద్ర తన వీరకుమారుడు అభిమన్యునితో కలసి, శ్రీకృష్ణుడి నివాసానికి చేరుతుంది. అయితే ధర్యోధనుడికి ఇచ్చన మాటకు లోబడిన, రేవతి-బలరాములు శశిరేఖను, అభిమన్యునితో కలవకుండా కట్టడి చేస్తారు. శశిరేఖా-లక్ష్మణ కుమారుల వివాహం నిశ్చయం చేస్తారు. సుభద్ర బలరాముడిని తనకు ఇచ్చిన మాట గురించి అడిగినా, రేవతి, బలరాముల మనసు మారదు. దాంతో సుభద్ర అభిమన్యుని తీసుకుని, పాండవుల దగ్గరకు బయలుదేరుతుంది.

అయితే అడవిలో భీమసేనుడి కుమారుడు అయిన ఘటోత్కచుడు ఉన్న చోటికే అభిమన్యుడు చేరుకుంటుండగా, ఘటోత్కచుడు-అభిమన్యుడికి యుద్దం జరుగుతుంది. చివరికి సుభద్ర ప్రతిజ్ఙ చేయబోతూ తనవారి పేరు చెప్పడంతో…వెంటనే ఘటోత్కచుడు సుభద్ర కాళ్లపై పడి శరణు వేడుకుంటాడు. తను ఎవరో చెబతాడు. సుభద్ర, అభిమన్యులు ఘటోత్కచుని ఆహ్వానం మేరకు, వారి నివాసానికి చేరతారు. శశిరేఖా పరిణయం గురించి వివరం తెలుసుకున్న ఘటోత్కచుడు, ద్వారకలో శ్రీకృష్ణుడిని కలుసుకుంటాడు. అక్కడి ఇరువురి మాయా పధకంలో భాగంగా అసలు శశిరేఖని అభిమన్యుని దగ్గరకు చేర్చి, ఘటోత్కచుడు శశిరేఖ వేషంలో లక్ష్మణ కుమారునితో వివాహ ప్రక్రియలో పాల్గొంటాడు. ఇక అక్కడి సినిమాలో తిరిగే మలుపులు మనసుని మరింత రంజింప చేస్తాయి. శ్రీకృష్ణుడి పర్యవేక్షణలో ఘటోత్కచుని మాయాప్రభంజనం ధుర్యోధనాదులను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందీ…వివరణ కన్నా వీక్షణ బాగుంటుంది. మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా అలనాటి పాత సినిమాలలో ఒక్కటి. సతీ సక్కుబాయి సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా కృష్ణభక్తితో పరవశించే ఇల్లాలు. ఎక్కడైనా, ఏ వస్తువులోనైనా ఎప్పుడైనా సరే కృష్ణుడిని చూస్తూ, ఆరాధించే అరుదైన అదృష్టవంతురాలి కధ. ప్రదేశాన్ని బట్టి, సమయానుసారం కృష్ణలీలలను కాంచుతూ ఉంటుంది.

సక్కుబాయి పండరీలో పాండురంగడి గుడిలో పాటపాడుతూ మయమరిచి, స్వామి పాదాలపై పడి ఉంటుంది. ఆమె తల్లీదండ్రులు అక్కడికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకుపోతారు. అయితే ఇంటి దగ్గరకూడా ఆమె నిత్యం పాండురంగడి ధ్యానంలోకి వెళుతూ ఒంటరిగా ఉంటుంది. యుక్తవయస్సుకు వచ్చినా ఇంత భక్తిపరాయణత్వం ఏమిటా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అయితే ఒకరోజు సన్యాసి ఆ ఇంటికి వచ్చి, సక్కుబాయిని ఆశీర్వదించి ఆమెకు పాండురంగ స్వామి విగ్రహమును ఇచ్చి వెళతాడు. నాటి నుండి సక్కుబాయి ఆపాండురంగడి విగ్రహమే సర్వస్వంగా ఉంటుంది.

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

ఒక శుభమూహర్తమున సక్కుబాయికి, ఒక రైతుకుటుంబంలోని బిక్షపతికి ఇచ్చి వివాహం జరిపించి, ఆమెను అత్తవారింటికి పంపించేస్తారు. బిక్షపతి తల్లి గయాళి అయితే, అతని చెల్లెలు గంగ కూడా తల్లిని మించిన గయ్యాళి. సక్కుబాయి-బిక్షపతిల వివాహానంతరం అతని చెల్లెలు గంగ తన మెట్టింటికి వెళుతుంది. సక్కుబాయి అత్తవారింటికి కూడా తనకు స్వామిజీ ప్రసాదించిన పాండురంగడి విగ్రహాన్ని తీసుకుపోయి, నిత్యం పూజలు చేస్తూ ఉంటుంది.

అది చూసి ఆమె అత్తగారు హెచ్చరిస్తుంది. ఇక నుండి పూజలు చేయవద్దు, ఇంటి పనులు మాత్రమే చేయాలని ఖచ్చితంగా చెబుతుంది. సక్కుబాయి అత్తగారి మాటలకు ఎదురు చెప్పకుండా, ఇంటిపనులు చేస్తూ కూడా, ప్రతిపనిలోనూ కృష్ణలీలలను కాంచుతూ పరవశిస్తూ ఉంటుంది. బిక్షపతి మాత్రం తన భార్యభక్తికి ఏవిధంగానూ అడ్డు చెప్పడు, ఆమెపై మనసునిండా ప్రేమను నింపుకుని ఉంటాడు. సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా.

సక్కుభాయి ఇంట్లో ఒక రోజు మజ్జిగ చిలుకుతూ, వెన్నముద్దను చూడగానే కృష్ణలీలలు గుర్తుకు వచ్చి, నిజంగానే కృష్ణుడు వచ్చి వెన్నతింటున్నట్టుగానే పరవశిస్తుంది. కానీ సక్కుబాయి చేతిలోని వెన్నముద్దను పిల్లి తింటూ, పాలకుండతో ఇంట్లోకి వస్తున్న ఆమె అత్తగారికి కనబడుతుంది. అత్తగారు వచ్చి ఆమెను మందలించి, తన చేతిలోని పాలకుండ సక్కుబాయికి ఇచ్చి, ఉట్టి మీద పెట్టమంటుంది. అక్కడకు వెళ్లిన సక్కుబాయి ఉట్టిని చూడగానే మరలా కృష్టుడు గుర్తుకు వచ్చి, కృష్ణుడికి పాలుపోస్తున్నట్టుగా పరవశిస్తూ, తన చేతిలోని పాలను నేలపై పోస్తుంది. దాంతో అత్తగారు ఆమెపై చిరాకు పడుతుంది. సక్కుబాయి ఇలా ఏవిధంగా ఏపనిలోనైనా కృష్ణలీలలను గుర్తు చేసుకుంటూ, కృష్ణ భక్తిలో పరవశిస్తూ ఉంటుంది.

ఒకరోజు చేతిలో కృష్ణుడి బొమ్మ ఉంచుకుని పరవశిస్తూ నిలబడి ఉన్న సక్కుబాయిని చూసిన, ఆమె అత్తగారు అక్కడకు వచ్చి సక్కుబాయి చేతిలోని పాండురంగడి బొమ్మని తన చేతులలోకి తీసుకుని నేలకేసి కొట్టి ముక్కలు చేస్తుంది. వెంటనే ఆ బొమ్మ మరలా యధావిదిగా అతుక్కుని, సక్కుబాయి చేతిలోకి చేరుతుంది. అత్తగారు ఆశ్చర్యపోయి, ఆ బొమ్మని మాయాబొమ్మగా భావిస్తుంది. అప్పుడే పుట్టింటికి వచ్చిన గంగ కూడా సక్కుబాయి చేతిలోని బొమ్మని తీసుకుని, నీళ్ళున్న భావిలో పడేస్తుంది. వెంటనే భావిలో నీరు అంతా ఇంకిపోయి, భావిలో నుండి బొమ్మ వచ్చి గంగ నెత్తిమీద దెబ్బలు వేసి, మరలా సక్కుబాయి చేతిని చేరుతుంది. గంగకు దాహం వేస్తుంది. కానీ నూతిలో నీరు ఉండదు, ఇంట్లోకి వెళితో ఇంట్లోనూ నీరు ఉండదరు. వారికి ఆశ్చర్యం వేసి, ఇదంతా ఆ మాయాబొమ్మ వల్లే అనుకుంటారు. ఎలాగైనా సక్కుబాయి తిక్క కుదర్చాలని భావించి, గదినిండా ఉన్న గోదుమలను తెల్లారేసరికి పిండి చేయమని చెబుతారు.

నాటి మేటి సినిమా సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

సక్కుబాయి పాండురంగడిని తలుచుకుంటూ, గోదుమలను పిండి చేస్తూ శోష వచ్చి పడిపోతుంది. తర్వాత కృష్ణుడే వచ్చి ఆపని చేసి అంతర్ధానం అవుతాడు. స్పృహకోల్పొయి పడి ఉన్న సక్కుబాయిని చూసిన ఆమె భర్త బాదపడతాడు. తన వల్లే నీకు ఈ కష్టాలు అంటూ భార్యతో బాధని పంచుకుంటాడు. భిక్షపతి తన చెల్లెలు గంగను మెట్టింటికి పంపించేయాలని భావించి, తన బావగారిని తీసుకురావడానికి బయలుదేరతాడు. భిక్షపతి ఊరినుండి తన బావని తోడ్కొని వచ్చే సమయానికి, తల్లీకూతుళ్లు ఇద్దరూ కలసి సక్కుబాయిని చిత్ర హింసలు పెడతారు. ఈ విధంగా వారిద్దరూ సక్కుబాయిని నానావిధాలుగా నిందిస్తూ, అష్టకష్టాలు పెడుతుంటారు. ఒకరోజు సక్కుబాయి పండరీకి బయలుదేరుతుంటే, ఆమెను అడ్డగించి ఒకస్థంబానికి కడతారు. అప్పుడు ఆ పాండురంగడే, సక్కుబాయిని భర్తరూపంలో విడిపించి ఆమెను పండరికి బయలుదేరేలా చేస్తాడు.

ఇక పాండురంగడు అక్కడే సక్కుబాయి రూపంలో ఉండి వారివురికి బుద్ది చెబుతాడు. గంగ సంసారం చక్కదిద్దుతాడు. ఇంకా పండరీలో ప్రాణం విడిచిన సక్కుబాయిని, తిరిగి పునర్జీవుడిని చేసి, ఆమె సంసారం చక్కదిద్దుతాడు. సినిమా ఆద్యంతం కృష్ణభక్తిని ప్రబోదం చేస్తూ, శ్రీకృష్ణుని లీలలతో సాగుతుంది. మంచి భక్తిరసచిత్రంగా అలరించిన అలనాటి ఆణిముత్యం సతి సక్కుబాయి సినిమా. ఇందులో కృష్ణుడిగా కాంతారావు, సక్కుబాయిగా అంజలీదేవి, ఆమె భర్తగా ఎస్వీ రంగారావు, సక్కుబాయి అత్తగా సూర్యాకాంతం, సక్కుబాయి ఆడపడచుగా గిరిజ, సక్కుబాయి ఆడపడచు భర్తగా రేలంగి నరసింహారావుగారు, సన్యాసిగా గుమ్మడి తదితరులు నటించారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

కె.వి. రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

పెద్దమనుషులను చూడడానికి ఇక్కడ తాకండి

వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే అవగతమవుతుంది.

దర్శకులలో మేటి దర్శకుడుగా కీర్తిగాంచిన కె.వి.రెడ్డిగారు దర్శకత్వం వహించిన పెద్దమనుషులు చిత్రం. ఒక ఊరిలో పెద్దమనుషుల కుటుంబాలలో ఉండే స్థితిని, ఇంటిబయట వారికి సమాజంలో ఉండే స్థితిని చాలా చక్కగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. బయట సన్మానాలు సత్కారాలు, వారి మాటకు తిరుగు ఉండదు, ఇంట్లో వారి మాటకు విలువ ఉండదు. సమాజంలో అవసరానికి దణ్ణం పెడితో, ఇంట్లో అవసరం ఉన్నా పట్టించుకోని బంధాలతో సాగే పెద్దమనుషుల కధే ఈ చిత్రం.

ఒక ఊరిలో అయిదుగురు పెద్ద మనుషులలో నలుగురు పెద్దమనుషుల జీవితం పైన వివరించనట్టే ఇంటాబయటా కూడా అలానే ఉంటుంది. అయితే అందులో అయిదో పెద్దమనిషి మాత్రం ఇంటా బయటా గౌరవం ఉంటుంది. ఇంకా అతని చెంత ధనం కన్నా ధర్మం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత అతని బీద కుటుంబం అయినా ఓ మధ్యతరగతి పెద్దమనిషిగా ఇంటాబయటా సమాన గౌరవం పొందుతూ తనపని తాను చేస్తూ ఉంటాడు. అతని పేరే రామదాసు, అతను భార్య, గుడ్డి కూతురితో కలసి తాను నిర్వహిస్తున్న పత్రికా ప్రింటింగ్ ప్రెస్ తో కూడి ఉన్న ఇంటిలోనే నివాసం ఉంటారు.

అయితే ఈ రామదాసు మాత్రం ఆ ఊరి చైర్మెన్ అంటే అభిమానం, నమ్మకం మరియు గౌరవం ఇంకా స్వామి భక్తి ఎక్కువ. ఎందుకంటే రామదాసు ఆద్యర్యంలో ఒక శరణాలయం నిర్వహణ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బాధ్యతలో ఎక్కడా తప్పుడు లెక్కలు చూపించకుండా, వచ్చిన విరాళపు సొమ్ము అంతా శరణాలయానికే ఖర్చు చేస్తూ ఉంటాడు. కానీ చైర్మెన్ ఇతర సహచరులు అయిన పూజారి, వ్యాపారి, కాంట్రాక్టరుతో ఎంతోకొంత సొమ్మును ఎప్పటికప్పుడు చైర్మెన్ గారికి చాటుమాటున చేరవేస్తూ ఉంటారు. వీరు ముగ్గురు చేసే వారి వారి వృత్తులలో లాభాలు అక్రమమార్గంలో అర్జించి, వాటిలో వాటాను మాత్రం చైర్మెన్ గారికి ఇస్తూ ఉంటారు. ఇదంతా రామదాసుకు తెలియదు. ఇంకా రామదాసు విషయంలో చైర్మెన్ ఏది అడగడు, అతను చెప్పినదానికి సరేనంటూ పైకి నటిస్తూ ఉంటాడు. అందుకే రామదాసు తన పత్రికలో రామదాసుగారి ప్రజాసేవ గురించి గొప్పగా వ్రాస్తాడు.

చైర్మెన్ గారికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు, అతని ఇంట్లోనే ఉంటారు. తమ్ముడు తిక్క శంకరం ఎప్పుడూ అన్నయ్యని అల్లరి చేస్తూనే ఉంటాడు. అతను మేక వన్నె పులిగానే వర్ణిస్తూ..ఉంటాడు. వాస్తవానికి తమ్ముడుని పిచ్చోడు అని ముద్ర వేసి, చెల్లిని ఒక ముసలోడికిచ్చి వివాహం చేసి, ఆస్తిని తమ్ముడికి, చెల్లెలకు పంచే అవకాశం లేకుండా చైర్మెన్ తగు జాగ్రత్తలతో ఆస్తిని కాపాడుకుంటాడు. మొత్తమ్మీద చైర్మెన్ పైకి పెద్దమనిషి, లోపల చిన్న మనిషి. చిల్లరకు చాటుమాటున చేయి చాస్తూ, పైకి పెద్ద పెద్ద దానాలు చేస్తూ ఉంటాడు. ఇంకా చైర్మెన్ గారి కొడుకు పట్నంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉంటాడు.

చైర్మెన్ గారి అబ్బాయికి అతని బాబయి తిక్క శంకరం, పత్రికా సంపాదకుడు రామదాసు, అతని ఫ్యామిలి అంటే బాగా ఇష్టం. అతని మద్య మద్యలో ఊరికి వచ్చినప్పుడు రామదాసుగారింటికి వెళ్లి వస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే రామదాసు కూతురుకి కళ్ళ ఆపరేషన్ చేయించడానికి పూనుకుంటాడు. ఒక్కసారి పట్నం తీసుకుపోయి పరీక్షలు చేయించి తీసుకువస్తాడు కూడాను.

ఇదిలా ఉండగా చైర్మెన్ గారి కారు డ్రైవరు, చైర్మెన్ విధవ చెల్లెలతో సరసమాడుతూ కనబడతాడు. వెంటనే చైర్మెన్ తన దగ్గర ఉన్న తుపాకితో ఆ కారు డ్రైవరుని కాల్చి చంపుతాడు. అక్కడే ఉన్న రామదాసు, చైర్మెన్ గారి చేతిలో తుపాకి తీసుకుని, కారు డ్రైవరు దగ్గరకు పరుగు పరుగున వెళతాడు. అందరూ అక్కడికి చేరతారు, కారు డ్రైవరు రామదాసు చేతుల్లోనే కన్నుమూస్తాడు. అక్కడికి చైర్మెన్ కూడా వస్తాడు. అప్పటికే వచ్చిన పోలీసులు ఇది ఎలా జరిగిందని అడగడంతో, రామదాసు నేనే పొరపాటున పిట్టను కాల్చబోతే, అది ఇతనికి తగిలిందని సమాధానం చెబుతాడు. రామదాసుకు కోర్టు కొంతకాలం కారాగార శిక్ష విధిస్తుంది. జైలులో రామదాసుని కలసిన చైర్మెన్, తాను నిజం చెప్పి పోలీసులకు లొంగిపోతానని నంగనాచి వినయం ప్రదర్శిస్తాడు. రామదాసు అది నిజమనుకుని, మీరు ఎట్టి పరిస్థితులలోనూ నిజం చెప్పవద్దు అని, మీరు ప్రజాసేవ చేయాలని చెబుతాడు.

ఇక రామదాసు జైలుకెళ్లడంతో చైర్మెన్ సహచరుల అరాచకాలు ఎక్కువ అవుతాయి. అనాధ శరణాయం నుండి కూడా దోపిడి చేస్తూ ఉంటారు. ఇంకా రామదాసు కూతురు, చైర్మెన్ గారి అబ్బాయిని వల్లో వేసుకుందని, చైర్మెన్ గారికి మాటలు ఎక్కిస్తారు. తరువాత రామదాసు భార్యని, అతని గుడ్డి కూతురుని అవమానించడంతో వారు ఊరు వదిలి వెళ్లిపోతారు.

రామదాసు జైలు నుండి వచ్చాక వారి ఆరాచకాలకు ఏవిధంగా అడ్డు వచ్చాడు. వారిని భగవంతుడు ఏవిధంగా శిక్షించింది? తెరపై చూడాలి. ఇంకా రామదాసు కూతురు చైర్మెన్ గారి అబ్బాయి ఒక్కటవటంతో కధ సుఖాంతం అవుతుంది. తిక్క శంకరయ్య సన్యాసం స్వీకరించడంతో సినిమాకు ముంగింపు పలకుతారు కె.వి. రెడ్డిగారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

ధర్మరాజుగారి గురించి పూర్తి స్థాయిలో ఉన్న చిత్రం?

ఎప్పుడైనా చారిత్రాత్మకమైన పుస్తకాలు చదివితే, ఒక రాజు గురించి చెప్పేటప్పుడు, అతను ”ఆ దేశానికి రాజు, ఈ దేశానికి రాజు” అంటూ ఎందరో రాజుల గురించి చరిత్రలో చదువుకుంటాం కానీ ధర్మానికి రాజుగా మాత్రం ధర్మరాజునే ప్రవచనకారులు చెబుతారు. ధర్మాన్ని అంతలా ఆచరించిన మహానుభావుడుగా ద్వాపరయుగంలో కీర్తింపబడిన ధర్మరాజు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ధర్మరాజుగారి మాటకు ముల్లోకాల్లోనూ విజయాలను సాధించిన అర్జునుడు లొంగి ఉంటే, బలమైన భీమసేనుడు ధర్మరాజుగారి కనుసైగకు లొంగి ఉంటే, సాక్షాత్తు పరమాత్మ ధర్మరాజుగారికి నమస్కారం చేస్తారని చాలా గొప్పగా ధర్మరాజుగారి గురించి చెప్పబడుతుంటే, ధర్మరాజుగారి గొప్పతనం శాశ్వతంగా ఉంటే, కేవలం ధర్మరాజుగారి గురించి గొప్పగా చూపే బలమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్న తెలుగు చిత్రం చెప్పండి?

సతీ సుకన్య తెలుగుపాత సినిమా

సతీ సుకన్యను చూడడానికి ఇక్కడ తాకండి

ఆనాటి పాత చిత్రాలలో సతీ సుకన్య తెలుగుపాత సినిమా కృష్ణకుమారి ప్రధాన పాత్రగా కధ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. జీవితంలో పొరపాట్లు జరిగినా ఓర్పుతో జీవితాన్ని స్వీకరిస్తే, ఎలాంటి ఫలితాలు ఉంటాయో? ఈ చిత్రం ద్వారా తెలియబడుతుంది.

అయోద్య రాజ్యపు యయాతి కుమార్తె అయిన రాజకుమారి సుకన్య, తన ప్రియసఖులతో కలసి వనవిహారం చేస్తూ, అడవిలోకి వెళుతుంది. అక్కడ ఆ అడవిలో ఆడుతూ పాడుతూ తాను విసిరిన పూలమాల వెళ్లి ఒక పుట్టపై పడుతుంది. అక్కడికి వెళ్లిన రాజకుమారి సుకన్య పుట్టలోంచి కాంతులు వెదజల్లుతూ, కేవలం రెండు రంధ్రాలు మాత్రమే మెరవడం చూస్తుంది. అది ఆమెకు వింతగా తోచడమో లేక విధివైపరీత్యమో కానీ, అవి మెరుస్తూ ఉండడం ఏమిటో చూడాలని అక్కడే ఉన్న దర్బలతో ఆ రెండు రంధ్రాలను పొడుస్తుంది. అంతే భూమి కంపిస్తుంది. జంతువులు ఆక్రొసిస్తూ ఉంటాయి. ప్రజలు అందరూ తెలియని వ్యాధతో బాధపడడం ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా రాజనగరిలో

ప్రజలందరూ యయాతి మహారాజుగారి దగ్గరకు వెళ్లి జరుగుతున్న పరిణామాలపై రాజుగారితో మొరపెట్టుకుంటారు. అకారణం కనిపిస్తున్న ఈ దుష్ఫలితాలకు రాజు చింతిస్తూ ఉండగా, అక్కడికి నారదమహర్షి చేరుకుంటారు. నారదుని ఆహ్వానిస్తూ, రాజు తమ రాజ్యంలో ఈ దుష్పరిణామాలకు కారణం ఏమిటో అడుగుతాడు. దానికి బదులుగా నారదమహర్షి, ఎవరైనా సాధుపుంగవునికి అన్యాయం జరిగితే, భూమి భరించదని, వెంటనే తన విళయరూపం ప్రదర్షిస్తుందని, ప్రకృతి వికృతంగా తయారవుతుందని చెబుతాడు. ఇంకా ఇలాంటి ఉపద్రవం సంభవించడానికి కారణం, నీ కూతురు సుకన్యేనని, తనకు తెలియకుండానే, తపస్సు చేసుకుంటున్న చ్యవన మహర్షి కళ్లను అమె పొడిచి, వాటిని పోగొట్టిందని చెబుతాడు. విషయం తెలియగానే రాజు తనపరివారంతో సంఘటనా స్థలానికి చేరతారు.

శతాధిక సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధుని వివాహం చేసుకోవడానికి సిద్దపడిన సుకన్య

ఆక్కడి వెళ్లిన మహారాజుకు కళ్లు పోగొట్టుకుని బాధతో ఉన్న చ్యవన మహర్షి కనబడతాడు, అది చూసిన, రాజు చాలా బాధతో, వినయంగా మహర్షిని ఈ ఘోరమునకు చింతిస్తూ, తన కూతురు చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతూ, ”కళ్లు లేకుండా కారడవిలో మీరు ఉండడం కష్టం స్వామి, తన రాజప్రసాదానికి విచ్చేయండి, నేను మీ సేవ చేసుకుంటానని” అడుగుతాడు. దానికి మహర్షి ”తాపసికి వనముకన్న మించిన ప్రశాంత ప్రదేశం ఏముంటుంది? కాబట్టి కానలు వదిలి రాలేనని” చెబుతాడు. అంతలో అక్కడకు చేరిన నారద మునీంద్రుడు ఆ సమస్యకు పరిష్కారంగా చ్యవనుడికి ఎవరైన మంచి కన్యను ఇచ్చి వివాహం చేయండి, అంటూ… పత్ని సేవ వలన మహర్షి తపస్సుకు భంగం ఉండదు అని చెబుతాడు. చ్యవన మహర్షికి తగిన కన్య ఎవరా..? అని ఆలోచిస్తుండగా…నారదుడి మాటలతో…ఆలోచనలో పడిన సుకన్య ”నేను చ్యవనమహర్షిని వివాహం చేసుకుంటానని” అంటుంది. కానీ సుకన్య తల్లిదండ్రులు ఇద్దరూ ఈ విషయాన్ని అంగీకరించరు.

అయితే ఇది ఈశ్వరేచ్ఛ కాబట్టి నేను విసిరిన పూలమాల వెళ్లి పుట్టపై పడింది, అందుకే నేనే ఈ చ్యవన మహర్షిని పతిగా స్వీకరిస్తానని అంటుంది, సుకన్య. దానికి తండ్రి తిరిగి సుకన్యకు నచ్చజెప్పుతూ…”తల్లీ…తెలియక చేసిన తప్పు..తప్పుకాదు, నీవు తెలియక విసిరిన మాల పొరపాటున పడింది ” అని చెప్పగా, సుకన్య తండ్రితో ”ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరు శిక్ష అనుభవించడం న్యాయంకాదు, కావునా నేనే వివాహమాడతాను, అంగీకరించమని” తండ్రిని కోరుతుంది. అయితే చ్యవనుడు కూడా సుకన్యను వివాహమాడడానికి సంకోచిస్తాడు. ఎందుకంటే శతాధిక వృద్ధుడైన అయిన నాకు కన్యతో వివాహం వలదని వారిస్తాడు. అయితే నారదముని కూడా సుకన్య-చ్యవనుల మహర్షుల వివాహం దైవ నిర్ణయం అని చెప్పడంతో అందరూ వివాహామునకు అంగీకరిస్తారు. ఒక శతవృద్ధుడైన చ్యవనుడికి, యవ్వనవతి అయిన సుకన్యకు వివాహం చేస్తారు. సతీ సుకన్య తెలుగుపాత సినిమా.

వివాహం కాగానే సుకన్య తన ఒంటిపై ఉన్న ఆభరణాలన్నింటిని తీసి తల్లికిచ్చేస్తుంది. నారబట్టలు కట్టుకుని చ్యవనునితో సుకన్య కాపురం చేయడం ప్రారంభిస్తుంది. పతిసేవ చేస్తూ…సుకన్య చ్యవన ఆశ్రమంలో, పతియే దైవంగా చ్యవన మహర్షిని సేవిస్తూ ఉంటుంది. యవ్వనవతి అయి కూడా, ఒక వృద్ధుని సేవలో కాలాన్ని వెలబుచ్చడం మనసా..వాచా..కర్మణా ఆచరిస్తుంది. గుడ్డివాడైనా వృద్ధమునికి ఆమె కళ్లుగా మారుతుంది. అలా కాలం గడుస్తుండగా ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సుకన్యకు ప్రసాదములో, సుందర ఉద్యానవనంలో విహరిస్తున్నట్టుగా కల వస్తుంది. మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిద్రలేచిన సుకన్యకు, చ్యవనుని ద్వారా ఆరోజంతా పరీక్షా కాలంగానే గడుస్తుంది. ఇది ఇలా ఉండగా

ఇంద్రసభలో అశ్వనీ దేవతలు ప్రతిజ్ఙ

ఇంద్రసభలో అగ్నిదేవుడు యాగంలో వచ్చిన అహిర్భావం తీసుకువచ్చి, ఇంద్రుని ఎదుట నిలబడతాడు. త్రిభువనాధిపతి అయిన ఇంద్రుడు ఆ సోమరసం పంచమని ఒక నర్తకికి చెబుతాడు, అమె అశ్వని కుమారులకు తప్ప అందరి దేవతలకు ఆ అహిర్భావం అందిస్తుంది. అవమానంగా భావించిన అశ్వనీదేవతలు, లేచి తమకు అహిర్భాగానికి అర్హత లేదా? అని దేవేంద్రుడిని ప్రశ్నిస్తారు. దేవేంద్రుడు ఆగ్రహించి, అశ్వనీ దేవతలను అవమానించడంతో, వారు కలత చెందుతారు. అహిర్భావం అందుకున్న నాడే తిరిగి ఇంద్రసభలో ప్రవేశిస్తాం అని ప్రతిజ్ఙ చేసి, అశ్వనీ కుమారులు నిష్ర్కమిస్తారు. అప్పుడే వేంచేసిన, నారదమహర్షి విషయం దేవేంద్రుని ద్వారా తెలుసుకుంటాడు. విచారంలో ఉన్న అశ్వనీ దేవతలను నారదమహర్షి కలుసుకుని వారి అభ్యర్ధన మేరకు, ఆ విషయాన్ని వారి తండ్రి సూర్యభగవానుడికి దగ్గరకు వెళతాడు, నారదమహర్షి. సూర్యలోకం చేరిన నారదునితో సూర్యభగవానుడు ”అశ్వనీ కుమారు తమ అర్హతను నిరూపించుకోవాలసి ఉంటుంది” అని అంటాడు.

అశ్వనీ దేవతలు సుకన్యకు పరీక్ష పెట్టుట

ఇక చ్యవనుని ఆశ్రమంలో పతిసేవలో ఉన్న సుకన్యకు అశ్వనీ దేవతల ద్వారా కఠిన పరీక్షే ఎదురవుతుంది. ఒకరు అందమైన యువకుడిగా మారి సుకన్యను ఆహ్వానిస్తూ ఉంటే, మరొకరు వృద్ధ చ్యవన మహర్షి వేషంలో, సుకన్యపై దుర్భాషలాడుతూ ఉంటాడు. అక్కడ ఒకప్రక్క భర్త ద్వేషభావం ప్రకటిస్తుంటే, మరో ప్రక్క సుందరాకారుడు వలపుల వల విసురుతూ ఉంటే, ఆమెలో ఓర్పు సహించ ఆ యువకుడుని శపించబోతుంది. అమె పతి భక్తికి మెచ్చిన అశ్వనీ దేవతలు, నిన్ను పరీక్షించి నీకు మేలు చేయడానికే మేము నీవద్దకు వచ్చామని, మమ్మల్ని క్షమించమని వేడుకుంటారు. అప్పుడు ఆమెకు ఏమి కావాలో వరం కోరుకోమని సుకన్యతో అశ్వనీ దేవతలు పలకగా, అందుకు ఆమె తనపతినే అడగమని, వారిని ఆశ్రమంలోకి తీసుకువెళ్లి, భర్తకు చెబుతుంది. అంతలోనే నారద మహర్షి కూడా ఆశ్రమంలోకి వేంచేస్తాడు. అయితే అశ్వనీ దేవతలు, నారదముని సలహా మేరకు యవ్వనవతి, సౌందర్యవతి అయిన సుకన్య భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ఆమెను సుఖపెట్టడానికి తనకు యవ్వనము, దృష్టిని ప్రసాదించమంటాడు. ధర్మబద్దమైన అతని కోరికను అశ్వనీ దేవతలు నెరవేర్చి అక్కడి నుండి నిష్క్రమిస్తారు. సుకన్య-చ్యవనులు సంతోషంగా ఉంటారు. సతీ సుకన్య తెలుగుపాత సినిమా.

అయితే దేవలోకంలో దేవేంద్రునికి నారదమహర్షి, చ్యవనుడు యవ్వనవంతుడు కావడం, దానికి అశ్వనీదేవతలు సహాయం చేయడం గురించి చెబుతాడు. ఆగ్రహించిన దేవేంద్రుడు అశ్వనీదేవతలను గాడిదలుగా మారమని శపిస్తాడు. గాడిదలుగా మారిన అశ్వనీ దేవతలు చ్యవనుని ఆశ్రమం వద్దకు వస్తారు. అక్కడ సుకన్య మొదటిగా వాటిని తరిమినా, తరువాత భర్త ద్వారా విషయం తెలుసుకుని, వారిని తన ప్రాతివత్యాన్ని ధారపోసి, మరలా వారి స్వస్వరూపంలోకి మారేలాగ చేస్తుంది. అశ్వనీ దేవతలు అక్కడి నుండి నిష్రమించాక, దేవేంద్రునికి అశ్వనీదేవతలపై ఎందుకు కోపం, వారి జన్మ వృత్తాంతం ఏమిటి? అని సుకన్య భర్తని ప్రశ్నిస్తుంది.

అశ్వనీ దేవతల జన్మ వృత్తాంతం చ్యవనుడు, సుకన్యకు చెప్పుట

సుకన్యతో చ్యవనుడు ఈ విధంగా చెప్పనారంభిస్తాడు..సూర్యదేవుని భార్య అయిన సంధ్యాదేవి, సూర్యుని వేడిని తాళలేక కొన్నాళ్లుపాటు తన పుట్టింట్లో ఉండటానికై నిశ్చయించుకుని, తనయొక్క ఛాయకు ప్రాణం పోస్తుంది. అటుపై ఆమెను తనస్థానంలో ఉండమని, నేను నా పుట్టింటికి పోయి వచ్చెదనని, అప్పటివరకు తన భర్తను, తన పిల్లలను సేవించమని చెప్పి, సంధ్యాదేవి తన పుట్టింటికి వెళుతుంది. కొంతకాలం గడిచేసరికి ఛాయకు, సూర్యభగవానుడికి ఇద్దరు సంతానం కలుగుతారు. ఇక పుట్టింటికి వెళ్లిన సంధ్యని ఆమె తండ్రి విశ్వకర్మ కారణం అడుగుతాడు. ఇన్నాళ్లు ఎందుకు నీవు భర్తను విడిచి ఉన్నట్టు అని? ఇంకా నేనే నిన్ను నీ భర్తచెంతకు చేరుస్తానని, విశ్వకర్మ అనడంతో…అప్పుడు సంధ్యాదేవి, విశ్వకర్మతో తాను తన భర్తకు తెలియకుండా వచ్చిన విషయం చెబుతుంది. భర్తకు ద్రోహం చేశావు అని ఆగ్రహించిన విశ్వకర్మ, ఆమెను అశ్వముకమ్మని శపిస్తాడు. దాంతో పశ్చాత్తపడిన సంధ్యాదేవి తండ్రిని ప్రార్ధించగా, ఎప్పుడైతే నీ భర్త, నిన్ను గుర్తించి తిరిగి నిన్ను చేరదీస్తాడో అప్పుడే నీకు శాపవిమోచనం అవుతుందని చెబుతాడు. అంతటితో సంధ్యాదేవి ఒక అశ్వమై అడవిలో సంచరిస్తూ ఉంటుంది. ఇక సూర్యలోకంలో ఛాయదేవి తన పిల్లలను ఒకలాగా.., సంధ్యాదేవి పిల్లలను మరొకలాగా చూడడంతో, సూర్యభగవానుడు అనుమానం కలిగి, ఆమెను ప్రశ్నించడంతో… ఆమె ”తాను సంధ్యాదేవి ఛాయను మాత్రమేనని, సంధ్యాదేవి పుట్టింటికి వెళ్లిందని” చెబుతుంది. అప్పుడు సూర్యభగవానుడు తన భార్య సంధ్యాదేవి ఎక్కడ ఉందో తెలుసుకుని, ఆమె అశ్వరూపంలో ఉన్నట్టు గుర్తించి, తాను కూడా ఒక అశ్వంలాగా మారి, ఆమెచెంతకు చేరతాడు. తత్ఫలితంగా వారికి ఇరువురు కుమారులు కలుగుతారు. వారే అశ్వనీపుత్రులు. అని సుకన్యకు చ్యవనుడు చెప్పి, వీరు అశ్వములకు జన్మించారనే నెపంతో దేవతలు వీరిని చులకనగా చూస్తూ ఉంటారని, చెప్తాడు.

దేవేంద్రుడు కల్పించిన కష్టంలో భాగంగా సుకన్య అగ్నిప్రవేశం

అశ్వనీ దేవతలకు శాపవిమోచనం కలిగించిన సుకన్య-చ్యవనులపై ఆగ్రహించిన దేవేంద్రుడు వారి, అహంకారం అణచాలంటూ విద్యాధరుడిని ప్రయోగిస్తాడు. అప్పుడు విద్యాధరుడు ముసలి చ్యవనుడి వేషంలో ఒక శవంలాగా నది ఒడ్డున పడి ఉంటాడు. అక్కడకు వచ్చిన చ్యవనుడి పాత శిష్యుడు, తమ గురువు మరణించాడని భావించి, ఆ శవానికి అంత్యక్రియలు చేస్తాడు. ఈలోపుగా సుకన్య తల్లికి, తన కూతురిపై బెంగతో మంచాన పడడం, ఆమె బెంగను తీర్చడానికి సుకన్య తండ్రి చ్యవనుని ఆశ్రమం దగ్గరకు వెళ్లడము జరుగుతుంది. అక్కడ వృద్ద చ్యవన మహర్షి లేకుండా యవ్యనముని కౌగిట్లో కూతురిని చూసిన మహారాజు ఆగ్రహించి వారివురిని బంధిస్తాడు. వారి మాటలను పెడచెవిన పెట్టి, వారివురుని చెరశాలకు తరలిస్తాడు. నాయ్యవిచారణలో భాగంగా సుకన్య అగ్నిప్రవేశం చేసి, తన సౌశీల్యం నిరూపించుకుంటుంది. చివరకు యయాతి చ్యవన మహర్షి ఆద్వర్యంలో పుత్రకామేష్టియాగం తలపెడతాడు. ఆ క్రతువులో అశ్వనీ దేవతలకు అహిర్భావం ఇవ్వడం ప్రధానంగా ఈ యాగం చేయడం ప్రారంభించారని దేవేంద్రుడుకు నారదుడు చేరవేస్తాడు. ఆ క్రతువులు ఎలా జరుగుతుందోనని దేవేంద్రుడు చూస్తానిని అంటాడు. చివరకు సుకన్య ప్రాతివ్రత్యమహిమ చేత యాగం పూర్తవుతుంది. ఇంద్రుడికి పరాభవం, అశ్వనీ దేవతలకు అహిర్భావం అందుతుంది. సుకన్య పతిభక్తిని అందరూ కొనియాడుతారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

పాత పౌరాణిక సినిమాలలో ఆంజనేయుని గురించి అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఆంజనేయుడు అంటే అందరికీ ఇష్టేమే. అలాంటి శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా గురించి తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. శ్రీ ఆంజనేయచరిత్ర సినిమాను చూడడానికి ఇక్కడ తాకండి

నిత్యం రామనామజపంతో చిరంజీవిగా ఉండే శ్రీఆంజనేయస్వామి అనేకమంది భక్తులను కలిగిన పరమ శ్రీరామభక్తుడు. రామసంకీర్తనం చేస్తూ, శ్రీరామచంద్రుడిని హృదయంలో పదిలపర్చుకున్న భక్తాగ్రేసుడు, హనుమ, ఆంజనేయస్వామి, మారుతి, అంజనీపుత్రుడు, రామదూత అంటూ అనేక నామాలతో నిత్యం భక్తుల మనసులో మెదులుతూనే ఉంటాడు.

శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా భక్తి చిత్రాలలో ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకోవడంలో బాగుంటుంది. ఆంజనేయుడు అన్నా వినాయకుడు అన్నా పిల్లలకు మహాఇష్టంగా ఉంటే, వారికి కూడా పిల్లలంటే మహాప్రీతి. అలాంటి ఆంజనేయుని పుట్టుక, విద్యాభ్యాసం, హనుమ విజయాలు గురించి శ్రీ ఆంజనేయ చరిత్ర సినిమాలో చక్కగా చూపించారు.

ధర్మరాజు సోదరుడు భీమసేనుడికి ఒక ముసలికోతి తోకతో గర్వభంగం

శ్రీ ఆంజనేయచరిత్ర తెలుగు సినిమా ప్రారంభం శ్రీరామసంకీర్తనం చేస్తున్న హనుమతో ప్రారంభం అవుతుంది. హనుమా రామగానం చేస్తూంటే, భీమసేనుడు అటువైపుగా వచ్చే సన్నివేశాలు పాట మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. పాట పూర్తయ్యేసరికి, భీమసేనుడి రాకను గమనించిన, అంజనీపుత్రుడు ఒక ముసలికోతి వేషం వేసుకుని, తనతోకను దారికి అడ్డుగా పెట్టి, ఒకరాయికి ఆనుకుని లేవలేని స్థితిని తలపిస్తూ కూర్చుని ఉంటాడు. అటుగా వెళ్తూ అక్కడికి చేరిన భీమసేనుడు దారిలో కనిపించిన తోకను గమనించి, ఆతోక ఎక్కడి నుండి వచ్చిందో గమనించి, ఆవైపు చూస్తాడు. తోకను అడ్డుతీయమని భీముడు ఆంజనేయస్వామితో వాదిస్తాడు.

ఆంజనేయుడు భీమసేనుడితో…”నీవే తోకను నీవే తీసి, నీదారిన నీవు వెళ్లు” అంటాడు. భీముడి శతవిధాలా ప్రయత్నించినా…ఆంజనేయుని తోకను ఒక్క ఇంచుకూడా కదపలేకపోతాడు. అప్పుడు భీమసేనుడు ఇది సామాన్య కోతికాదు అని గ్రహించి, ఆ ముసలికోతితో తన అహంకారానికి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు ఆంజనేయస్వామి తన నిజస్వరూపంతో ప్రత్యక్షమవుతాడు. ఇద్దరు సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, పరామర్శించుకుంటారు. తరువాత భీమసేనుడు అభ్యర్ధన మేరకు తన జీవితచరిత్రను, చెప్పడం ప్రారంభిస్తాడు, ఆంజనేయస్వామి.

భీమసేనుడితో హనుమ తనకధను తానే చెప్పడం

అంజనీదేవి సంతానాపేక్షతో పరమశివుని కొరకు తపము చేస్తూ ఉంటుంది. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆదేశానుసారం, వాయుదేవుడు ఒక పురుషస్వరూపంలో ఆంజనీదేవికి సాక్షాత్కారిస్తాడు. అప్పుడు వాయుదేవుడు నీకు సంతానం అనుగ్రహించడానికే, నేను వచ్చాను అని చెప్పి, ఒక దివ్యమైన ఫలమును అంజనీదేవికి వాయదేవుడు అనుగ్రహిస్తాడు. శివానుగ్రహం వలన, అంజనీదేవికి పుత్రుడు జన్మిస్తాడు. బాలుడైన హనుమ దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ, చెట్లు ఎక్కుతూ అల్లరి చేస్తూ ఉంటాడు. అలా ఒక్కసారి ఆకాశంలో సూర్యబింబం చూసి, అదేదో ఒక పండు అనుకుని, అందుకోవడానికి వాయువేగంతో ఆకాశంలోకి వెళతాడు, బాలహనుమ. సూర్యబింబాన్ని అందుకోబోతున్న బాలహనుమపై, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు.

దానితో బాలహనుమ ఆకాశం నుండి క్రిందపడిపోతూ ఉంటే, అతని తండ్రి వాయుదేవుడు, ఆ బాలుడిని పట్టుకుని, ఇంద్రుడుపై ఆగ్రహించి, తన సహజస్వభావాని లోకాల నుండి నిష్క్రమింపజేస్తాడు. దాంతో లోకాల్లో వాయుస్థంభన జరిగి, ప్రపంచం స్థంబింపజేయడంతో ఇంద్రుడు, త్రిమూర్తులు, వాయుదేవుని దగ్గరకు వచ్చి, హనుమకు అనేకవరాలు ఇచ్చి వెళతారు. చిరంజీవిగా, అత్యంత బలవంతునిగా, శస్త్రాస్త్రములతో బంధింపబడనివానిగా వరములు ప్రసాదిస్తారు. ఇంతటి శక్తిసంపన్నుడైన బాలహనుమకు ఆగడాలు, అల్లరి ఇంకా ఎక్కువ అవుతుంది.

ఆంజనేయుని అల్లరికి ఋషులు కూడా గురికావడంతో, ”నీ శక్తిని నీవు మరిచిపోవుదవని…” ఒక ఋషి హనుమకు శాపానుగ్రహం ఇస్తారు. అక్కడకు పరుగున వచ్చిన అంజనీదేవి ప్రార్ధనమేరకు ”ఎవరైనా ఆంజనేయునికి, తన శక్తి ఏమిటో గుర్తు చేస్తే, తిరిగి అతను అత్యంత శక్తివంతుడై, అఖండ విజయాలను ” సాధిస్తాడని చెబుతాడు. ఇంకా వేదాధ్యయనం కొరకు సూర్యభగవానుని దగ్గరకు ఆంజనేయుని, పంపమని ఋషులు చెబుతారు. సూర్యభగవానుని వద్ద విద్యనభ్యసించిన ఆంజనేయస్వామి, సూర్యాదేశం ప్రకారం, కిష్కిందలోని సుగ్రీవుని వద్దకు చేరతాడు.

సుగ్రీవుని రాజ్యం నుండి తరిమేసిన వాలీ

మాయారాక్షసుని చేతిలో వాలి యుద్ధం చేస్తూ మరణించాడని భావించిన సుగ్రీవుడు, పెద్దల సలహాతో సింహాసనం అధిష్ఠించి, మారుతిని మహామంత్రిగా నియమించుకుంటాడు. అయితే సుగ్రీవుడు ఒకరోజు సభలో కొలువుతీరి ఉండగా, వాలి సభాప్రవేశం చేసి, సుగ్రీవుని అక్కడి నుండి వెళ్లగొడతాడు. అన్నదమ్ముల మద్య గొడవకు కలుగజేసుకోవడం, ధర్మంకాదని అనుకుని, హనుమ సుగ్రీవుని అనుసరిస్తాడు. వారివురూ ఋష్యమూకం పర్వతంపైకి చేరతారు.

సుగ్రీవుని-శ్రీరామునికి మైత్రి

సీతావియోగంతో…సీతాన్వేషణ చేసుకుంటూ రామలక్ష్మణులు అటుగా రావడం, సుగ్రీవుడు గమనిస్తాడు. నారబట్టలు కట్టుకుని వస్తున్న వారిని చూసిన సగ్రీవుడు వారెవరో కనుగొని, మిత్రులైతే తీసుకురమ్మని చెప్పి హనుమను వారి దగ్గరకు పంపుతాడు. వారెవరో తెలుసుకోవడానికి మారుతి మారువేషంలో వారి వద్దకు వెళతాడు. ఒక బ్రాహ్మణ వేషంలో తనముందుకు వచ్చిన హనుమను చూసిన శ్రీరాముడు ఆంజనేయా అని సంబోదిస్తాడు. వెంటనే రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతంపైన సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళతాడు. అక్కడ శ్రీరామునికి, సుగ్రీవునికి స్నేహం కుదురుతుంది.

తర్వాత సుగ్రీవుడు వాలిని రెచ్చగొట్టి, వాలితో తలపడతాడు. ఇద్దరూ ఒకేలాగ ఉండడంతో శ్రీరాముడు బాణ ప్రయోగం చేయడం సాద్యపడదు. దానితో వాలీ చేతిలో చావు దెబ్బలు తిని చివరికి పారిపోయి సుగ్రీవుడు బయటపడతాడు. అయితే ఈ సారి సుగ్రీవుడు ఒకమాలను ధరించి, మరలా వాలీని యుద్ధానికి పిలుస్తాడు. యుద్ధానికి మరలా బయలుదేరుతున్న వాలీని, తార వారిస్తుంది. కానీ తారమాటను పట్టించుకోకుండా వాలీ సుగ్రీవునితో యుద్ద చేస్తాడు.

అప్పుడు శ్రీరాముడు తన బాణంప్రయోగం చేస్తాడు. వాలీ మరణం తర్వాత సుగ్రీవుడు కిష్కిందకు పట్టాభిషక్తుడవుతాడు. వానాకాలం కాగానే సీతాన్వేషణ చేద్దామని, సుగ్రీవుడు లక్ష్మణునితో చెబుతాడు. శీతాకాలం ప్రారంభంగానే సుగ్రీవుడు వానరసైన్యాన్ని వివిధ నాయకత్వంలో వానరులను ఒక మాసం గడువు విధించి నలుదిశలా పంపుతాడు. దక్షిణదిశకు అంగదుని నాయకత్వంలో హనుమతో కూడిన వానరులు బయలదేరతారు. అలా వెళుతున్నవారికి ఎంతకూ సీత కనబడదు. ఇంకా వారికి సముద్రం కనబడుతుంది. సముద్రం దాటి సీతాన్వేషణ చేసేవారెవరు అని వానరులు అంతా వారిలోవారు చర్చించుకుంటూ ఉంటారు.

ఆంజనేయుడు సముద్రం దాటుట

అప్పుడు జాంబవంతుడు, అంగదుడు అంతా ఆంజనేయస్వామిని పొగడ్తలతో, అమితమైన శక్తివంతునిగా కీర్తించి, హనుమశక్తిని, హనుమకు గుర్తు చేస్తారు. ఋషిశాపం వలన మరిచిన తన శక్తి ఏమిటో తిరిగి తెలుసుకున్న ఆంజనేయస్వామి, నూరు యోజనాల సముద్రమును దాటడానికి సిద్దపడతాడు. తోటివారి ఆశీష్సుల అందుకున్న ఆంజనేయుడు అపరిమిత శక్తివంతుడుగా మారి, విడిచిపెట్టిన రామబాణంలాగా సముద్రం దాటి లంకవద్దకు ప్రవేశిస్తాడు. అక్కడ లంకిణిని ఒక దెబ్బతో శాపవిమోచనం కలుగజేస్తాడు. అక్కడి నుండి ఎడమపాదం లంకలో పెట్టి, లంకాప్రవేశం చేస్తాడు.

సీతమ్మని కలసిన హనుమ

అశోకవనంలో సీతాదేవి కూర్చుని ఉన్న చెట్టు వద్దకు, రావణుడు వచ్చి, సీతదేవితో పరుష మాటలు మాట్లాడతాడు. రావణుడు రెండు మాసాలు గడువు విదించి, అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. రావణుడి మాటలకు గాయపడిన మనసుతో విలపిస్తున్న సీతమ్మకు రామగానం చేయడం ప్రారంభిస్తాడు, అప్పటికే ఆ చెట్టుపై చేరిన హనుమ. తర్వాత హనుమ, సీతమ్మ తల్లి ముందుకు వస్తాడు. ఆంజనేయునిపై సందేహం వెలిబుచ్చిన సీతమ్మతల్లికి, శ్రీరాముని గుర్తులు తెలియజేస్తాడు. దానితో సీతమ్మతల్లి హనుమపై నమ్మకం ఏర్పడి, శ్రీరాముని క్షేమం అడుగుతుంది. అప్పుడు హనుమ సీతావియోగంతో శ్రీరాముని శోకమును గురించి వివరిస్తూనే, శ్రీరాముడు చేసిన పనుల గురించి చెప్పి, సీతమ్మకు ధైర్యం చెబుతాడు. తర్వాత హనుమ సీతమ్మ దగ్గర ఆనవాలుగా చూడామణిని స్వీకరించి, అక్కడి వనమును అంతా కకావికలం చేయనారంభిస్తాడు. అనేకమంది రాక్షసులను ముప్పుతిప్పలు పెడతాడు. విషయం తెలుసుకున్న రావణుడు కుమారుడు, ఆంజనేయునితో యుద్ధ చేసి మరణిస్తాడు. తర్వాత రావణుడి మరో కుమారుడు మేఘనాధుడు, వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. బ్రహ్మగారిపై గౌరవంతో, ఆ అస్త్రమునకు పట్టుబడతాడు.

శ్రీరామలక్ష్మణులు వానరసైన్యంతో సముద్రం దాటి లంకకు చేరుట

బ్రహ్మాస్త్రమునకు పట్టుబడిన హనుమ లంకాధినేతతో హితవు చెబుతాడు. సీతమ్మని వదిలి శ్రీరాముని శరణువేడుకోమని, లేకపోతే నీతోబాటు లంకానాశనం తప్పదని చెబుతాడు. కానీ రావణుడు ఆంజనేయుడిని ఒక కోతిగా భావించి, హనుమతోకకు నిప్పంటిస్తారు. వెంటనే హనుమ అదే నిప్పతో లంకాపట్టణాన్ని కాలుస్తాడు. తర్వాత శ్రీరామచంద్రుడి వద్దకు వచ్చి, సీతమ్మ జాడను రామచంద్రునికి తెలియజేస్తాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి అందిజేస్తాడు, ఆంజనేయుడు. వానసైన్యంతో రామలక్ష్మణులు సముద్రం దగ్గరకు చేరతారు. అక్కడికి రావణుడి తమ్ముడు అయిన విభీషణుడు వచ్చి, శ్రీరాముని శరణు వేడుకుని, రాముని పక్షంలో చేరతాడు. అటు తర్వాత సముద్రంపై వానర సాయంతో నీలుడు ఆధ్వర్యంలో వారధిని నిర్మించి, శ్రీరామసేన అంతా సముద్రం దాటి లంకకు చేరతారు. రావణుడి సేనతో జరిగిన బీకర యుద్దంలో లక్ష్మణుడు మూర్ఛబోతే, వెంటనే హనుమంతుడు సంజీవిని పర్వతమునే ఆ యుద్ధభూమికి తీసుకువస్తాడు. ఆంజనేయుడు తెచ్చిన సంజీవిని సాయంతో లక్ష్మణుడు బతుకుతాడు. తరువాయి శ్రీరాముని చేతిలో రావణహతం జరగుతుంది.

అయోద్య సభలో ఆంజనేయ హృదయంలో శ్రీరామదర్శనం శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

రావణ మరణం తర్వాత సీతసమేతంగా రామలక్ష్మణ, ఆంజనేయాదులు అయోద్యకు చేరతారు. అయోద్యలో శ్రీరామపట్టాభిషేకం అంగరంగవైభవంగా జరుగుతుంది. తర్వాత ఆంజనేయునికి సీతమ్మతల్లి ఒక హారమును కానుకగా ఇస్తుంది. అయితే ఆ హారములోని ముత్యములలో శ్రీరాముని రూపం వెతుకుతూ..ముత్యములను కొరికి పారేస్తాడు. అందరూ ఆక్షేపించగా రాముని రూపం ఏ ముత్యము రామభక్తునికి అక్కరలేదని అంటాడు. అప్పుడు అందరూ రామ రూపం అంతటా ఉంటే, నీ హృదయంలో చూపించు అని అంటారు. అందుకు సమాధానంగా హనుమ తన హృదయమును చీల్చి శ్రీరాముని రూపం చూపిస్తాడు. ఆ గాధను అంతా భీమసేనుడికి వివరించిన హనుమ, మరలా శ్రీరామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు. ఆంజనేయ చరిత్ర ఎక్కువ భాగం రామునితో ముడిపడి ఉండడం చేత ఈ చిత్రంలో ఆంజనేయుని చరిత్రలో భాగంగా సీతాన్వేషణ నుండి రామ కధ అంతా మనకు కనిపిస్తుంది.

ధన్యవాదాలు –తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం
కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి ఇస్తాడు. పరమశివుడు ఆ ఫలమును పార్వతికి ఇస్తాడు. పార్వతి మాత ఆయొక్క జ్ఙానఫలమును, తమ పిల్లలకు ఇవ్వడానికి నిశ్చయిస్తుంది. అయితే ఆదిదంపతుల కుమారులు ఇరువురు, ఆఫలము తమకు కావాలని అంటారు. అప్పుడు ఆ ఫలమును చెరిసగం చేసుకుని స్వీకరించమని, పార్వతిమాత సెలవిస్తుండగా, పరమశివుడు మాతకు మాటకు అడ్డుపడి, వలదు..వలదు… ఆఫలమును ఎవరో ఒకరే భుజించవలసి ఉంటుంది, అని పలుకుతాడు. అప్పుడు మాత పార్వతిదేవి, మహాదేవునితో ”మీరే పరిష్కారం చెప్పమనగా..” అప్పుడు శంకరుడు ”ఎవరైతే…ముల్లోకములకు ప్రదక్షిణ చేసి, ముందుగా కైలాసం వస్తారో…వారికే, ఈ జ్ఙాన ఫలము” అంటూ సమాధానం చెబుతాడు.

వెంటనే కుమారస్వామి..ఇప్పుడే ముల్లోకములకు ప్రదక్షిణ చేసి వచ్చెదనని కైలాసం నుండి బయలుదేరతాడు. అయితే వినాయకుడు కైలాసంలోనే ఉండి, మాతాపితలకు ప్రదక్షిణ చేస్తే, ముల్లోకములకు ప్రదక్షిణ చేసినట్టే, అని భావించి, విఘ్నేశ్వరుడు పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి, ఆఫలమును స్వీకరిస్తాడు. అయితే ముల్లోకములను చుట్టి తిరిగి కైలాసం వచ్చిన కుమారస్వామి, విషయం తెలుసుకుని, ఆగ్రహంతో మరలా కైలాసం వదిలి వెళతాడు. కైలాసం వీడి వెళుతున్న కుమారస్వామిని ఆపడానికి, ఆది దంపతులు ఇద్దరూ ప్రయత్నిస్తారు. అయినను వినక వెనుదిరగకుండా వెళుతున్న కుమారస్వామిని, ఆపడానికి ఒక అవ్వ ప్రయత్నిస్తుంది. కానీ విఫలం అవుతుంది. ఇక అప్పుడు జగన్నాత పార్వతిదేవి, కుమారస్వామి దగ్గరకు వచ్చి శివమహిమను తెలిపే, శివలీలలను చెప్పడం ప్రారంభిస్తుంది.

పాండ్యరాజు అంత:పురంలో తన రాణితో ఇష్టాగోష్టిలో ఉండగా అతనికి ఒక సందేహం వస్తుంది. స్త్రీకేశముల సువాసనను సహజంగా కలిగి ఉంటాయా? అనే సందేహం కలుగుతుంది. దానికి రాణి దగ్గర కూడా సమాధానం లేకపోయేసరికి, ఇదే విషయంలో సందేహం తీర్చినవారికి వేయిబంగారు నాణెముల నజరానతో కూడిన ప్రకటన తన పాండ్యరాజ్యంలో చేయిస్తాడు. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

రాజ్యంలో ప్రకటించబడిన బహుమతికై ఆశతో ఎదురుచూసిన ధర్మి అనే ఒక పేద బ్రాహ్మణునికి, దేవాలయంలో శివుడే మారువేశంలో వచ్చి, ఆ సందేహ నివృత్తి కవితను ఇచ్చి వెళతాడు. దానితో ఆ పేద బ్రాహ్మణుడు ఆ కవితను తీసుకుని, పాండ్యరాజు గారి సభకు బయలుదేరతాడు. అక్కడ సభలో ఎవరూ ఆ సందేహ నివృత్తిని చేయగలిగేవారు లేకపోవడంతో రాజుగారు ఆశ్చర్యపడతారు. అప్పుడే శివానుగ్రహి అయిన ధర్మి బ్రాహ్మణుడు ఆ సభలోకి ప్రవేశిస్తాడు. ధర్మి తనకు శివుడు అందించిన తాళపత్రంలోని కవితను పాండ్యరాజుగారికి చదివి వినిపిస్తాడు. ఆ కవితకు మెచ్చినరాజు, ధర్మికి బహుమానం అందజేయబోతుండగా, అక్కడి ఆస్థాన పండితుడు అయిన నక్కీరుడు, ధర్మితో ఆ కవితను నీవే వ్రాశావా? అందులో దోషముంది అని చెబుతాడు. ఇక చేసేది లేక ధర్మి సభనుండి నిరాశతో నిష్క్రమించి, దేవాలయమునకు చేరి దు:ఖిస్తూ కూర్చుంటాడు. అక్కడకు మరలా వచ్చిన శివుడు సభలో జరిగిన విషయం చెప్పమని ధర్మిని ప్రశ్నిస్తాడు. ధర్మి నీవు వ్రాసిన కవితలో దోషముంది అని సభలో చెప్పినట్టుగా శివునితో చెబుతాడు. దానికి బదులుగా శివుడు అలా చెప్పినవారిని నాకు చూపించమని, ధర్మిని రాజుగారి సభకు తీసుకువెళతాడు. రాజుగారి సభలో నక్కీరుడు, పరమశివునితో కూడా మీరు కవితలో భావదోషముందని, ఆరోపిస్తాడు. ఆగ్రహించిన పరమశివుడు తన త్రినేత్రంతో నక్కీరుని దగ్ధం చేస్తాడు. తరువాయి రాజుగారి ప్రార్ధనతో పరమశివుడు, నక్కీరుడిని పునర్జీవునిగా చేస్తాడు. తరువాత ధర్మికి వేయి బంగారు నాణేములు బహుమతిగా లభిస్తాయి. ఇక్కడ ధర్మికి బంగారు నాణేములు, నక్కీరునికి పాండిత్యపరీక్ష రెండూ ఒకేసారి చేయడం శివలీలగా పార్వతి మాత కుమారస్వామికి వివరిస్తుంది.

ఇంకా శివుని లీలలు గురించి కుమారస్వామితో మాట్లాడుతున్న పార్వతి మాత, తనను కూడా మహాదేవుని ఏవిధంగా పరీక్షించిందీ…ఆ వివరం కూడా చెప్పనారంభిస్తుంది.

లోకమాత అయిన దాక్షాయినికి, తన తండ్రి అయిన దక్షుడు చేస్తున్న యజ్ఙం గురించి తెలియవస్తుంది. ఆ యొక్క యాగమునకు వెళ్లాలని నిశ్చయించుకున్న దాక్షాయినిదేవి, పరమశివుని తన కోరికను తెలియజేస్తుంది. అప్పుడు మహాదేవుడు వలదని, నీవు నీపుట్టింటి మమకారంతో ఇప్పుడు దక్షుని యజ్ఙమునకు వెళ్లినచో అవమానం పొందుతావు అని వారిస్తాడు. కానీ జగన్మాత మహాదేవునితో వాదించి, శివుని అంగీకారం అడుగుతుంది. అప్పుడు పరమశివుడు విధి లోకమాతతో కూడా ఆడుకుంటుంది అని అనుకుంటూ, వెళ్లమని దాక్షాయినికి అనుజ్ఙ ఇస్తాడు. అప్పుడు లోకమాత దక్షయజ్ఙానికి బయలుదేరుతుంది.

నిరీశ్వర యాగానికి పరమశివుని పిలవకుండా చేయడం వలదని, మంత్రి సలహా ఇస్తాడు. అయినను దక్షుడు వినకుండా నిరీశ్వర యాగమునకు చేయడానికి పూనుకుంటాడు. అక్కడకు వచ్చిన జగన్మాత, తనకు తండ్రి అయిన దక్షునికి నచ్చజెప్పబోతుంది. కానీ దానికి దక్షుడు నిరాకరిస్తాడు. అవమాన భారంతో దాక్షాయిని మరలా కైలాసం చేరి, శివుని చేరుతుంది. కైలాసంలో శివునికి, పార్వతికి వాదం పెరిగి యుద్దమునకు దారి తీస్తుంది. ఆ యుద్ద ఫలితంగా శక్తి అయిన దాక్షాయిని దేహం దగ్గమవుతుంది. (గమనిక: దాక్షాయిని శరీరత్యాగం గురించి, పురాణ ప్రవక్తల మాటలు ప్రకారం అయితే దాక్షాయిని, దక్షయజ్ఙంలోనే ఆత్మార్పణం చేసుకున్నట్టుగా చెబుతారు.) తర్వాత దేవతల ప్రార్ధన మేరకు పార్వతిదేవిగా జగన్మాతకు తిరిగి శివుని చేరుతుంది. ఈ గాధను కూడా శ్రద్దగా ఆలకించిన కుమారస్వామికి ఇంకా మహాదేవి మరో శివలీల గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

బెస్తనాయకుడి కూతురుగా పుట్టిన లోకపావని గంగా అను నామంతో యుక్తవయస్సులో ఉండగా తనతోటివారితో సముద్రపు ఒడ్డున ఆటాలాడుకుంటూ ఉంటుంది. అక్కడికి శివుడు కూడా ఒక బెస్తవాని రూపంలో వచ్చి, గంగను అల్లరి చేసి వెళతాడు. తర్వాత సముద్రంలోకి వెళ్లిన బెస్తవారు, అందరూ తిరిగి వెనుకకు రాలేకపోతూ ఉంటారు. ఎందుకంటే సాగరంలో ఉన్న తిమింగళం, సముద్రంలోకి వచ్చిన బెస్తవారిని తినేస్తూ ఉంటుంది.

దానితో బెస్త నాయకుడు సాగరంలో తిమింగళాన్ని చంపినవానికే, నాకూతురు గంగను ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు.బెస్తనాయకుడు కూతురు అయిన గంగ అక్కడి ఉన్న ధైర్యవంతులతో కూడి, సముద్రంలోకి వెళ్లడానికి బయలుదేరుతుంది. కానీ అక్కడికి బెస్తవాని వేషంలో వచ్చిన శివుడు తానే సముద్రంలోకి బయలుదేరతాడు. సముద్రంలో తిమింగళం బెస్తవాని వేషంలో ఉన్న శివునితో పోరాడి మరణిస్తుంది. అలా మరణించిన తిమింగళంతో బెస్తవాడు ఒడ్డుకు చేరతాడు. అలా బెస్తవారి వేషంలో ఉన్న పార్వతి, పరమేశ్వరులు ఒక్కటవుతారు. ఈ గాధను కూడా ఆలకించిన షణ్ముఖునికి, అమ్మ పార్వతిమాత ఇంకా ఒక అహంకారి సంగీత విద్వాంసుని విషయంలో శివలీలను వివరించడం ప్రారంభిస్తుంది.

హేమనాధ భాగవతులు పేరుగాంచిన గొప్ప సంగీత విద్వాంసుడు. సరస్వతీ కటాక్షం పొందిన హేమనాధ భాగవతులు ఎన్నో సత్కారాలు అందుకున్న పిదప, అతను పాండ్యారాజ్యానికి చేరతాడు. అక్కడ హేమనాధ భాగవతులకు, పాండ్యరాజే స్వయంగా స్వాగతం పలుకుతాడు. అహంకారం హెచ్చిన హేమనాధ భాగవతులు, తనకు స్వాగతం పలికిన పాండ్యరాజుతో చాలా గర్వంగా మట్లాడి, సభాప్రవేశం చేస్తాడు. సభలో హేమనాధుడు చేసిన గానకచేరికి, రాజు సంతోషించి, స్వయంగా హేమనాధుని దగ్గరకు వచ్చి, చాలా వినయంతో బహుమతులు సమర్పిస్తాడు. అయితే అహంకరించి ఉన్న హేమనాధుడు, నేను చాలా గొప్పవాడిని, నన్ను ఎవరైనా మీ సభలో ఓడించినచో, నేను పాండ్యరాజ్యానికి మొత్తం నాసంపదను దారాదత్తం చేస్తానని, లేకపోతే పాండ్యరాజ్యం మొత్తం నామాటకు దారాదత్తం కావాలని సవాలు చేస్తాడు. ఇంకా నేను గెలిచాక పాండ్యరాజ్యంలో ఎవరూ పాటలు పాడరాదని కూడా పలుకుతాడు.

పోటికి సమ్మతించిన పాండ్యరాజు, పోటిని రేపు నిర్వహిస్తానని చెప్పి, హేమనాధుడికి అతిధి గృహంలో ఆతిధ్యం స్వీకరించమని చెబుతాడు. అటు తరువాయి తన ఆస్థాన పండితులను ”మీలో హేమనాధునితో పోటిపడేవారు ఎవరు?” అని అడుగుతాడు. కానీ వారిలో ఎవరూ ముందుకు రారు. పాండ్యరాజు సంకటంలో పడతాడు. అయితే పాండ్యరాజుకు మంత్రి ఒక సలహా ఇస్తాడు. అదేమిటంటే..”అహంకారం ఉన్న వ్యక్తికి, అనుగ్రహం ఉన్న వ్యక్తి చేతిలో ఓటమి తప్పదు” కాబట్టి దైవానుగ్రహం భాణబట్ట అనే సాధారణ గాయకుడిని తీసుకువచ్చి పోటిలో నిలబెడదాం అని చెబుతాడు. దానికి పాండ్యరాజు అంగీకరిస్తాడు. భాణబట్టుని, పాండ్యరాజు హేమనాధునితో పోటిపడవలసినదిగా ఆజ్ఙాపిస్తాడు. ఆయొక్క రాజాజ్ఙతో భాణబట్ట పరమశివుని ఆలయానికి వెళ్లి, నాకేమిటి ఈ పరీక్ష అంటూ శివుని వేడుకుంటూ, శివలింగం దగ్గరే పడి ఉంటాడు.

అప్పుడు శివుడు ఒక కట్టెలమ్ముకునేవాని వేషం ధరించి, ఆ నగరంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన పరమశివుడు (కట్టెలవాని వేషంలో) హేమనాధుడు విశ్రమించిన అతిధిగృహం దగ్గర ఉన్న ఒక మండపంపై కూర్చుని అద్భుతమైన గానం చేస్తాడు. ఆ గానం విన్న హేమనాధుడు బయటకు వచ్చి, ఆ అద్భుతగానం చేసిందెవరని వెతుకుతాడు. అక్కడే ఉన్న కట్టెలవానిని, ఇప్పుడు అద్భుతగానం చేసిందెవరని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, హేమనాధునితో నిద్రపట్టక నేనే ఏదో ఒక కూత కూశానని చెబుతాడు. దానికి ఆశ్చర్యపడిన హేమనాధుడు, నీవు ఈ పాట ఎవరిదగ్గర నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, బాణబట్టు పేరు చెబుతాడు. దానితో దిమ్మతిరిగిన హేమనాధుడికి తన ఎంత అహంకరించినది..ఆలోచన చేసుకుంటాడు. తనతో పోటీపడబోయే శిష్యుని గానం ఇంత గొప్పగా ఉంటే, మరి ఆ బాణబట్టు గానం ఇంకెంత గొప్పగా ఉంటుందో అని ఊహించిన హేమనాధుడు ఊరి విడిచి వెళ్లిపోతాడు. వెళ్లేముందు, తన సంగీతం అంతా పాండ్యరాజ్యానికి ధారదత్తం చేస్తున్నట్టు వ్రాసిన తాళపత్రం కట్టెలవాని చేతికి ఇస్తాడు. ఆ పత్రాన్ని శివుడు శివాలయంలో ఉన్న బాణబట్టుకు అందజేసి, శివలింగంలోకి చేరతాడు. ఇలా లోకమాత కుమారస్వామికి శివలీలలు వివరించి, కుమారస్వామి మనసుని శాంతింపజేస్తుంది. శివుడు వినాయకునితో కలసి, కుమారస్వామి, పార్వతిమాత ఉన్న కొండకు వస్తారు.

ఏకొండపై కుమారస్వామికి లోకమాత శివలీలు వివరించిందో…ఆకొండే పళనిగా ప్రసిద్ది చెందుతుందని వరమిస్తారు. సినిమా సుఖాంతం అవుతుంది.

సాదారణంగా శివుని లీలలు గురించి వింటే, మాములు మనిషి మనసు శాంతిని పొందుతుంది. ఇక సాక్షత్తు మహాదేవుని కుమారుడు అయిన కుమారస్వామి మనసు ఇంకెంత శాంతిని పొంది ఉంటుంది. అంత శాంతిని పొందిన కుమారస్వామి వెలిసిన కొండ పళని కొండ. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ధన్యవాదాలు, తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

సైరా నరసింహారెడ్డి చిత్రం అంచనాలు ఆకాశంలోకి….

మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక పాత్రలో నటించిన చిత్రం, సైరా నరసింహారెడ్డి తెలుగు చలన చిత్రం. ఈ భారీ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం టీజరుకు కూడా ఒక్కొక్క భాషకు, ఆయా భాషలలో టాప్ హీరోస్ వాయిస్ అందించడం దేశవ్యాప్తంగా మరింత ఆసక్తి పెరిగింది. భారీ నిర్మాణం, భారీ తారగణం, చారిత్రాత్మక కధ ఇలా చాలా విషయములతో సైరా నరసింహారెడ్డి చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

బ్రిటీష్ వారిపై తొలి తిరుగుబాటు చేసిన భారతీయుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ చేపట్టారు. భారీ అంచనాలు సృష్టించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఆక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే టీజరుతో ఆకట్టుకున్న సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ ఈరోజున విడుదల అయ్యింది. తెలుగు టీజరుకు పవన్ అందించిన వాయిస్ అందరిలోనూ ఇంకా ఆసక్తిని పెంచింది.

ఈ క్రింది వచనం పాతది.

Megastar Chiranjeevi Syeraa Narasimhareddy Teaser Release సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు చలన చిత్రం. అంగ్లేయులపై తిరగబడ్డ తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకి పెరిగేల ప్రాచుర్యం పొందుతుంది. ఆగష్టు 22 అనగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు విడుదల అయిన సైరా నరసింహారెడ్డి తెలుగు మూవీ టీజర్. ఇప్పటికే విడుదల అయిన సైరా నరసింహారెడ్డి పోస్టర్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి, సోషల్ మీడియాలో సదరు చిత్రాలు ఎక్కువగా షేర్ అవుతుంటే, ఇప్పుడు ఈ చిత్రం టీజర్ మరింత ఉత్సుకతను పెంచాయి.

ఎప్పటికప్పుడు గంటలలో విడుదల అంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో హాల్ చల్ చేసి అభిమానుల్లో ఆత్రుత పెంచి విడుదల సైరా నరసింహారెడ్డి టీజర్ అంచనాల ప్రకారం వీడియో వీక్షణ రికార్డులు సృష్టిస్తుంది. ప్రసిద్ద భారతీయ చలనచిత్ర నటులు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, అల్లు అర్జున్, కన్నడ నటుడు సుదీప్, నయనతార తదితరులు నటిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి సృష్టిస్తుంది. సినిమా టీజర్ ఇంకా చిత్రంపై అంచనాలు భారీగా పెంచుతుంది. ‘Megastar Chiranjeevi Syeraa Narasimhareddy Teaser Release’

మీడియాలో వచ్చే విషయాల్లో విశేషం ఎక్కువ చలన చిత్రాల గురించే ఉంటే, ఇక మెగాస్టార్ చిత్రమంటే మరింత ఆసక్తి కలుగుతుంది. అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్న సైరా నరసింహారెడ్డి టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. చిరంజీవి 151వ చిత్రంగా వస్తున్న ఈచిత్రం టీజర్ ఆయన అభిమానులే కాకుండా అందరిని ఆకర్షించే విధంగా ఉండి, యూట్యూబ్‌లో లక్షల వీక్షణాలతో సంచలనం సృష్టిస్తుంది.
బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. “Megastar Chiranjeevi Syeraa Narasimhareddy Teaser Release” ఉదయం 11.౩౦ నిమిషాలకి రామ్ చరణ్ నాయనమ్మగారి చేతుల మీదుగా విడుదల అయ్యి యూట్యూబ్‌లో అధిక వీక్షణలకు సాగుతుంది.

ధన్యవాదాలు

బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు

బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు చక్కగా చూపుతుంది. బలరామకృష్ణులు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

బలరామకృష్ణులు అలంపురం ఊరిలో ఇద్దరి అన్నదమ్ముల మద్య జరిగే కధలో ఒక యువజంట ప్రేమాయణం ఈ చిత్ర కధ. బలరామయ్య(శోభన్ బాబు) – కృష్ణమూర్తి(కృష్ణమూర్తి) అన్నదమ్ములు అయితే తండ్రి ఒక్కరే తల్లులు వేరు. కృష్ణమూర్తికి ఒక చెల్లెలు (కల్పన). మొదట్లో ఇద్దరు అన్నదమ్ములు చెల్లెలతో సంతోషంగా ఉన్నట్టు, గిట్టనివారు చెప్పుడు మాటలతో బలరామయ్య, తన తమ్ముడుని, చెల్లెల్ని దూరంగా పెట్టినట్టు చిత్ర ప్రారంభంలోనే రమ్యకృష్ణ ద్వారా తెలియజేస్తారు. బలరామయ్యకు పెళ్లీడుకొచ్చిన పూజ అను కూతురు ఉంటుంది.

వీర శివాజీ(జగపతిబాబు) పనికోసం అంటూ తన మేనమామ అయిన కృష్ణమూర్తి దగ్గరికి చేరతాడు. ఇద్దరి అన్నదమ్ముల మద్య చిచ్చు పెట్టే వ్యక్తిగా చెడిపోయిన కొడుకుకు తండ్రిగా చింతామణి (గొల్లపూడి మారుతీరావు) నటిస్తే, చింతామణి కొడుకుగా అంతర్వేది (తనికెళ్ల భరణి) నటించారు. అలంపురంలో సారాకొట్టు పెట్టి తీరాలని బావించే వ్యక్తిగా ఉగాది (రామిరెడ్డి) నటించారు. బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు గురించి చదండి.

ఊరిపెద్దగా ఉండే బలగం బలరామయ్య అంటే ఆఊరి వారికి శాసనం అలాగే తమ్ముడు కృష్ణమూర్తికి కూడా బలరామయ్య అంటే ఎనలేని ప్రేమ. అన్న ద్వేషిస్తున్న, అన్న కుటుంబ క్షేమం కోసం ఆలోచించే వ్యక్తి కృష్ణమూర్తి నడుచుకుంటాడు. అయితే బలరామయ్య తన కూతురు పూజ-శివాజీల ప్రేమగురించి తెలిసి కోపంతో, తన కూతురు పూజని నీచుడు అయిన చింతామణి కొడుకు అంతర్వేదితో చేయాలని నిశ్చయం చేస్తాడు.

పూజ-శివాజీ ప్రేమ గురించి పూర్తిగా అవగాహన ఉన్న కృష్ణమూర్తి, వారి వివాహం చేయదలుస్తాడు. చివరికి శివాజీ-పూజల ప్రేమ ఎలా ఫలించింది? అన్నదమ్ములను చివరికి ఎలా ఒక్కటి అయ్యిందీ? చిత్రం చూసే కొలది ఆసక్తిగా ఉంటుంది. రాజశేఖర్ – రమ్యకృష్ణల కెమిష్ట్రి ఈచిత్రానికి బాగా ప్లస్ పాయింట్. శోభన్ బాబు-శ్రీవిద్య, జగపతిబాబు, గొల్లపూడి, తనికెళ్లభరణి నటన చిత్రకధను పట్టుతో నడిపిస్తాయి. బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు పండించిన తెలుగు పాత సినిమా

తెలుగురీడ్స్

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

యూట్యూబ్ వచ్చాక మనకు నచ్చినా లేక మనం మెచ్చి ఎంపిక చేసుకున్న సినిమాలో స్మార్ట్ ఫోనులో కానీ లాప్ టాపులో కానీ చూడడానికి అవకాశం వచ్చింది. ఎక్కువగా కొత్తసినిమాలలో సమాజంలో ఉండే ట్రెండు, యూత్ ఆకర్షితులయ్యే విషయాల గురించే ఎక్కువగా ఉండడం లేదా ఏదైనా అసాధారణ సంఘటనల ఆధారంగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి ట్రెండును బట్టి వచ్చేసినిమాలో అందరికీ నచ్చకపోవచ్చును. ఎందుకంటే, సమాజం విభిన్న సంస్కృతులు, భిన్న మతాలు అలాగే భిన్నమైన తరాలు కలిపి ఉంటుంది. విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

యూత్ ఇప్పటి తరం అయితే, మద్యవయస్సువారు నిన్నటితరం అయితే, ముదుసలివారు మొన్నటి తరం అయితే, సమాజం మూడుతరాలతో కలిసి ఉంటుంది. మూడు తరాలను మెప్పించే చిత్రాలు ఇప్పుడు వస్తున్న అన్ని చిత్రాలకు అసాద్యమే అవుతుంది. చిత్రవిచిత్రమైన విషయాలతో సాగే చలనచిత్రాలు సమాజంలో సగటు వ్యక్తి చిత్తముపై ప్రభావం చూపుతాయి. అలనాటి పాతచిత్రాలకు అభిమానులు కూడా మనకు ఎక్కువగానే ఉంటారు, అటువంటివారు యూట్యూబ్ ద్వారా పాతచిత్రాలను వీక్షించడానికి అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోను కూడా పెద్దతెరను కలిగి ఉండడం వలన స్మార్ట్ ఫోనులోనే యూట్యూబ్ సినిమాలను వీక్షించడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పటి సాంకేతిక ట్రెండుననుసరించి స్మార్ట్ టివీల వాడకం కూడా పెరుగుతుంది. పాతటీవిల స్థానంలో స్మార్ట్ టివీల వినియోగం పెరగుతుంది. కారణం స్మార్ట్ టివీలలో కూడా బడ్జెట్ టివీలు రావడం కావచ్చు. ఏదైనా యూట్యూబ్ ద్వారా పాతచిత్రాలను ఎంపికచేసుకుని చూడడానికి అవకాశం ఉంది. విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

సంక్రాంతి సినిమా చూడండి యూట్యూబ్ ద్వారా కోటిమంది ఈ చిత్రాన్ని చూశారు, అంటే ఫ్యామిలి విలువలను తెలియజేసే ఈ చిత్రాన్ని కోటిమంది చూడడం అంటే, కుటుంబవిలువలను గూర్చి తెలియజెప్పే చిత్రాలను ఆదరించడంలో ధియేటరకు వెళ్లి చూసే ప్రేక్షకులే కాకుండా, సోషల్ మీడియా ప్రేక్షకులు కూడా పెద్దపీట వేస్తున్నారు. సహజంగా సంక్రాంతి పండుగ కుటంబం అంతా కొత్త బట్టలు ధరించి, కొత్త వంటకాలు చేసుకుని, బంధువులను ఇంటికి ఆహ్వానించి, సంతోషంగా కుటుంబం అంతా గడిపే పండుగుగా ఉంటే, ఈ సంక్రాంతి సినిమా మాత్రం ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు సంక్రాంతే అంటుంది.

చిన్న కుటుంబంలోకి చుట్టాలు వస్తే, ఆకుటుంబంలో ఆరోజు పండుగ వాతావరణం కనబడుతుంది. మరి ఉమ్మడి కుటుంబం అయితే, రోజు ఎక్కువమంది కలసి ఉండేవారు ఉండడం, రోజూ ఎవరో ఒకరి తరపు బంధువులు చుట్టపుచూపుకు ఇంటికి రావడం ఉంటే, ఆకుటుంబంలో రోజు పండుగా వాతావరణమే. వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, స్నేహ, ఆర్తిఅగర్వాల్, సంగీత, శారద, చంద్రమోహన్ తదితరులు నటించిన సంక్రాంతి సినిమా, ఉమ్మడి కుటుంబంలో ఒకరిపైఒకరికి అవగాహన ఉంటే ప్రతిరోజూ సంక్రాంతే అంటుంది. సంక్రాంతి సినిమా యూట్యూబ్ ద్వారా చూడడానికి ఈ క్రింది వీడియోపై టచ్ చేయండి.

అమ్మను మించిన దైవమున్నదా అన్నట్టుగా అమ్మపై అంతులేని అభిమానాన్ని పెంచేసుకున్న పెంపుడు కొడుకుపై కపటప్రేమను చూపుతూ ఉండే తల్లి, ఆ ఇద్దరికి ఒకరికి భార్యగా, మరొకరికి కోడలుగా తెలివైన అమ్మాయితో సినిమా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం సెంటిమెంటు సన్నివేశాలతో బాటు, హాస్యసన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కధలో పట్టులేకపోతే ఆదరించని సమయంలో, మంచి కుటుంబకధాచిత్రంగా అందరిని ఆకట్టుకున్న తెలుగుచలనచిత్రం. సంక్రాంతి అంటే పైన ఉన్న పెద్దరికం నుండి ఆశీస్సులను పొందే పండుగ అయితే, ఈచిత్రంలో విషం ఇచ్చిన అమ్మలో కూడా అమ్మ ఆశీర్వాదాన్నే చూసిన ఉత్తమ భారతీయ కొడుకుగా అబ్బాయిగారు చిత్రం ఉంటుంది.

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

ధర్మచక్రం తెలుగు చలనచిత్రం తండ్రి దుర్మార్గానికి బలైన ఒక వ్యక్తికధ, కొన్ని చిత్రాల విశ్లేషణ కన్నా చూసి, తెలుసుకోవడమే బాగుంటుంది. అటువంటి చిత్రంగా ధర్మచక్రం తెలుగుచలనచిత్రం కూడా. తల్లితర్వాత కొడుకుకు తండ్రి మార్గదర్శకుడు అవుతాడు, అయితే ఈ ధర్మచక్రం సినిమాలో తండ్రి దుర్మార్గుడు, తల్లిదేవత, కొడుకు ఉత్తమ లక్షణాలను కలిగి ఉన్నవాడు. అటువంటి తల్లిదండ్రులకు, వారి యొక్క కొడుకు మద్య జరిగే సంఘర్షణ ఈచిత్రంలో కనబడుతుంది.

శోభన్ బాబు సోగ్గాడు

సోగ్గాడ్ సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ జంటగా నటించిన తెలుగుచలనచిత్రం సోగ్గాడు చిత్రానికి బాపయ్య దర్శకుడు. Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu old movie. పొలం పని చేస్తూ పల్లెటూరిలో నివసించే శోభనాద్రి ఆ ఊరిలో సోగ్గాడుగా ప్రసిద్ది. అతని మామ పరమేశం (అల్లు రామలింగయ్య) కూతురు సరోజ(Jayasudha), శోభనాద్రి ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే సరోజ పెద్ద చదువు పట్నంలో పూర్తి చేసుకుని, తిరిగి ఊరికి వచ్చాక, శోభనాద్రి (Shobhan babu)ఊరి పెద్దలతో అతని మామ పరమేశం ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తారు. సరోజ తండ్రి పరమేశం పట్నంలో చదువుకున్న నా కూతురుని పొలం పనులు చేసుకునే నీకు ఇచ్చి పెళ్లి చేయనని చెబుతాడు.

పరమేశం శోభనాద్రి – సరోజ(Jayasudha)ల పెళ్లి ప్రస్తావన కాదనడమే కాకుండా, నలుగురి ముందు నీలా మట్టి పిసుక్కోనేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదని హేళనగా మాట్లాడతాడు. సోగ్గాడికి కోపం వచ్చి నీ కూతురు కంటే అందమైన చదువుకున్న అమ్మాయినే వివాహం చేసుకుంటానని చాలెంజ్ చేస్తాడు. తోటివారి ప్రోద్బలంతో ఒక్కడే పట్నం బయలుదేరతాడు, సోగ్గాడు శోభనాద్రి (Shobhanbabu). ‘Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu’

మరోప్రక్క జమిందారీ కుటుంబంలో పుట్టి పెరిగిన లత(JayaChitra)కి, తన మేనమామ భూపతి అంటే ఆమెకి మహాభయం. ఆ జమీను అంతటికి లత వారసురాలు కావడం వలన, లతని భూపతి (Satyanarayana)పెళ్లి చేసుకుని, ఆమె ఆస్తిని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు. లతను చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదని, కావునా లతని నేనే పెళ్లి చేసుకుంటానని, భూపతి లత(JayaChitra) తల్లితో చెప్పి, పెళ్లి ముహూర్తం పెట్టిస్తాడు. సరిగ్గా పెళ్లి సమయానికి, పెళ్లికూతురుగా అలంకరించబడిన లత పట్నం పారిపోతుంది, ప్రసాదు సహాయంతో.

తన మామ కూతురు సరోజ కన్నా అందమైనా, చదువుకున్నా అమ్మాయి కోసం పట్నం బయలుదేరిన శోభనాద్రి, మేనమామతో పెళ్లి ఇష్టం లేని లత హైదరాబాదుకి ఒకే రైలులో ప్రయాణం చేస్తారు. హైదరాబాదు చేరుకున్న శోభనాద్రి, సన్యాసిరావు ద్వారా ఒక లాడ్జిలో దిగుతాడు. ప్రసాదు(Giribabu) తో రైలులో హైదరాబాదుకు బయలుదేరిన నగలు ధరించి ఉన్న లత(JayaChitra), రైలు హైదరాబాదు చేరుకునే సమయానికి ఒంటరిగా మిగులుతుంది.

Lata (JayaChitra) Shobhanadri (Shobhan Babu) Marriage in Lodge – Soggadu Movie.

శోభనాద్రిని హోటలుకి చేర్చిన సన్యాసిరావు మరలా లతని కూడా అదే హోటలుకు చేరుస్తాడు. శోభనాద్రి, లతలు ఒకే గదిలో చేరతారు, సన్యాసిరావు వలన. రైలులో లత నగలుతో ఊడాయించిన ప్రసాదు అదే హోటల్లో వేరే అమ్మాయితో లతకి కనబడతాడు. ఆ విషయం లత, శోభనాద్రికి చెప్పగానే, సోగ్గాడు శోభనాద్రి(Shobhan Babu) ప్రసాదుకి బుద్ది చెప్పి లత నగలను ప్రసాదు దగ్గర నుండి తిరిగి లతకి ఇప్పెస్తాడు. Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu

లత-శోభనాద్రిలు ఒకరంటే ఒకరు ఇష్టపడి, ఊరికి వెళ్లగానే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో, పెళ్లి సామానులు హోటల్ రూముకి తెచ్చుకుంటారు. అయితే ఆ హోటలుకి పోలీసులు రావడం వలన, అదే హోటల్లో లత మెడలో తాళి కట్టేస్తాడు, సోగ్గాడు శోభనాద్రి. ఇద్దరూ కలసి లత ఇంటికి వెళతారు. అక్కడ లత తల్లి వారిని ఆదరించినా, మోసగాడు అయిన లత(Jayachitra) మేనమామ, శోభనాద్రిని పోలిసులకు పట్టిస్తాడు.

దుర్మార్గుడు అయిన భూపతి, లత జీవితంలోనే కాకుండా, గతంలో శోభనాద్రి తల్లి జీవితంలో కూడా దుర్మార్గంగా నడుస్తాడు. జైలునుండి ఇంటికి తల్లి దగ్గరికి వచ్చిన శోభనాద్రి, తన తల్లి గతం తెలుసుకుని, కోపంతో రగిలిపోతాడు. దానికి తోడు భూపతి మోసం వలన లత-శోభనాద్రిల పెళ్లి చెల్లదని కోర్టు తీర్పు ఇస్తుంది. ఎలాగైనా లత(JayaChitra) ఆస్తిని కాజేయాలని భూపతి దుర్మార్గపు పధకాలు వేస్తూ ఉంటాడు.

గతంలో సోగ్గాడి శోభనాద్రి తండ్రిని చంపి, శోభనాద్రి తల్లి అయిదోతనాన్ని దూరం చేసిన భూపతి, ఇప్పుడు శోభనాద్రి భార్య లత జీవితానికి కూడా ప్రమాదంగా మారిన భూపతి ప్రోద్బలం పలన పరమేశం పధకం, అతని కూతురు సరోజ ప్రాణాలు తీస్తుంది. చెడుకు దగ్గరగా చేరితే, చెడు చేసే దారుణం ఎంత ప్రమాదకరమో పరమేశం జీవితం ఈచిత్రంలో కనబడుతుంది.

ఆస్తి కోసం మనిషి ప్రాణాలు తీసే భూపతిని శోభనాద్రి అంతం చేయడంతో ఈ చిత్రం ముగుస్తుంది. భూపతి, శోభనాద్రి తండ్రి ప్రాణాలు ఎలా తీసాడో, అదే విధంగా శిక్షింపబడి, చివరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళతాడు. రైతు పండించిన అన్నం తింటూ రైతులను పీడింపచేసే భూపతికి దగ్గరగా, ఊరి పెద్దగా ఉన్న పరమేశం జీవితంలో కూతురుని కోల్పోయాక సోగ్గాడిలాంటి రైతు విలువ ఏమిటో తెలుసుకుని, భూపతి గురించి పోలిసులకు తెలియజేస్తాడు. రైతులను, మంచివారిని పీడించిన భూపతి జైలుకు వెళితే, భూమిని నమ్ముకున్న సోగ్గాడు బంధువర్గంతో సంతోషంగా ఉండటం చిత్ర కధ ముగుస్తుంది.

లతగా నటించిన జయచిత్రకు తెలుగులో తొలి చిత్రం. శోభన్ బాబుకు, జయసుధకు, జయచిత్రకు మంచి విజమవంతమైన తెలుగుచలనచిత్రం. “Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu”

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన పాత చిత్రాల్లో దక్షయజ్ఞం ఒక మంచి చిత్రం. ‘దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా’.

పౌరాణిక గాధలలో సందేశం మిళితమై సందేశం కోసం సన్నివేశాలు సంఘటనలతో కూడిన గాధలు ఉంటాయి. అలా పార్వతి పరమేశ్వరుల గురించి చెప్పబడినప్పుడు తరుచూ తగిలే గాధ దక్షయజ్ఞం గాధ! పార్వతి మాత గతజన్మ వృత్తాంతం కావడం ఆ జన్మలోను ఈ జన్మలోను శివుడు మరు జన్మ లేకుండా పార్వతి మాతకు నాధుడై ఉండడం ఈ దక్షయజ్ఞం పౌరాణిక గాధ మనసులో భక్తిని ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అలాగే దక్షయజ్ఞం గురించి పురాణ ఫలశ్రుతి ఉంటే, ఈ పౌరాణిక ద్వారా సాక్ష్యాత్తు త్రిమూర్తుల అండ ఉన్నా అహంకరిస్తే ఏస్థితికి ఎటువంటి వారైనా ఎలా పతనం చెందుతారో తెలియబడుతుంది. అటువంటి దక్షయజ్ఞం దైవ చరితను వెండితెరకు ఎక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన వారు కడారు నాగభూషణం, కన్నాంబ. భక్తీ, మనోబలాన్ని, పుణ్యాన్ని పెంచే దైవగాధ తెలుగు తెరపై ప్రేక్షకులకు చిరపరిచయమే.

త్రిమూర్తుల అనుగ్రహం కలిగిన దక్షుడు శాపానుగ్రహాలు ఇవ్వడం

భూలోకమున ప్రాజాపత్యం పెరగడానికి బ్రహ్మ సృష్టించిన ప్రజాపతులలో దక్షుడు ప్రధానంగా ప్రఖ్యాతి గడించి, గర్వంతో అందరికి శాపానుగ్రహాలు ఇట్టే ఇచ్చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో తనతో వాదం ఆడినందులకు కన్నా కుమారులకు సైతం పామరులు కమ్మని, తన కుమారులకు సన్యాస బోధ చేసారని ఆరోపిస్తూ నారద మహర్షికి శాపాలు అనుగ్రహిస్తాడు. ఇలా ఉండే దక్షప్రజాపతికి దత్త పుత్రికలు రోహిణి మొదలైన వారితో27మందితో బాటు, తన వరపుత్రిక అయిన సతిదేవి ఉంటారు.. వారిలో రోహిణి చంద్రుడుని వరిస్తే, ఆమె అభీష్టం మేరకు చంద్రుడికి కబురు పెట్టి రోహిణి అభీష్టం గురించి చెబుతాడు, దక్షుడు. అలాగే బ్రహ్మ అజ్ఞామేరకు దత్త పుత్రికలందరికి పతి ఒక్కడే ఉండాలి, కాబట్టి నీకు సమ్మతమైతే నా దత్త పుత్రికలందరిని నీకిచ్చి వివాహం చేస్తానని అంటాడు. అందుకు అంగీకరించిన చంద్రుడితో 27మంది దత్త పుత్రికలకు వివాహం జరిపిస్తారు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ఆ వివాహనికి విచ్చేసిన త్రిమూర్తులలో శివుడు దక్షుడు కోరిక మేర అతిథిగా దక్షుని నివాసంలోనే ఉంటాడు. అక్కడ సతిదేవి శివుడికి పరిచర్యలు చేస్తుంది. శివుని కోసమే పుట్టిన అమ్మ, శివుని ఆరాధనలోనే ఉంటుంది. ఇప్పుడు శివుని వివాహమాడ తలుస్తుంది.
చంద్రుడిని పరిణయమాడిన 27మంది దత్త పుత్రికలలో రోహిణి మినహా అందరూ సంతోషంగా ఉండరు. కారణం చంద్రుడు కేవలం రోహిణిని మాత్రమే ఆదరిస్తూ ఆమెతోనే ఉంటాడు. ఈ కారణం గ్రహించిన నారదుని సూచనా మేరకు, మిగిలిన దత్త పుత్రికలు 26గురు తమ తండ్రి దక్షునితో మొరపెట్టుకుంటారు. దక్షుడు చంద్రుడిని పిలిచి, భార్యలందరినీ సమంగా చూడకపోవడం తప్పు అని చెప్పబోతే, చంద్రుడు తన సంసారం గురించి మాట్లాడడం మర్యాద కాదు అని బదులు ఇవ్వడంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుడిని క్షయ వ్యాదిగ్రస్తుడుగా ఉండమని శాపానుగ్రహం ఇస్తాడు.
వెంటనే చంద్రుడు పరమశివుడుతో మొరపెట్టుకుంటే చంద్రుడుని తన సమక్షంలో ఉండమని, అలాగే దక్షుని శాపం కూడా నిష్ప్రయోజనం కాకుండా పదిహేనురోజులు క్షయిస్తూ, పదిహేనురోజు వృద్ది పొందుతూ ఉండమని అనుగ్రహిస్తాడు. అలా పరమేశ్వరుడు అనుగ్రహం వలననే చంద్రుడు అమావాస్య నుండి పెరుగుతూ, పౌర్ణమి నుండి తగ్గుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన దక్షుడు తన మాట మన్నిస్తానని మాట ఇచ్చిన పరమశివుడు, తన శాపానికి మార్పు చేసి చంద్రుడిని అనుగ్రహించడం నచ్చక పరమశివుడిపైన ద్వేషభావం పెంచుకుంటాడు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

సతీదేవిని వివాహమాడిన పరమశివుడు

అహంకారంతో వరగర్వంతో ఉండే దక్షుడుకి పరమశివుడుపై ఆగ్రహం రావడంతో తన వరపుత్రిక అయిన సతీదేవికి వివాహం చేయదలచి, సతీదేవి ఇష్టాన్ని ప్రక్కన పెట్టి స్వయంవరం ప్రకటిస్తాడు. సతీదేవి స్వయంవరం విషయం నారద మహర్షి ద్వారా తెలుసుకుని పరమశివుడు, సతీదేవి మనోభిష్టం నెరవేర్చాలని పరమశివుడు భావిస్తాడు. స్వయంవరం సభలో సతీదేవి విగ్రహరూపంలో ఉన్న పరమశివుడు పూలమాల వేసి వరిస్తుంది. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై సతీదేవితో అంతర్ధానం అవుతారు.

ఈ సంఘటనతో దక్షుడి అహంకారం పరమశివుడుపై పూర్తీ ద్వేషభావంతో నిండిపోతుంది. ఇక మహర్షులు లోకాల శ్రేయస్సు కోసం తలపెట్టిన యజ్ఞంలోకి అందరితో బాటు దక్షుడిని ఆహ్వానిస్తారు. ఆ యాగానికి విచ్చేసిన దేవతలు త్రిమూర్తులతో సహా అక్కడే ఆసీనులై ఉంటారు. యాగానికి వస్తున్న దక్షుడుని చూసి అందరూ గౌరవంతో లేచి నిలబడితే త్రిమూర్తులు అందరికన్నా పెద్దవారు కాబట్టి ఆసీనులై ఉంటారు. అయితే దక్షుడు పరమశివుడిని చూసి అల్లుడు మామని గౌరవించక పోవడం ఏమిటి అని అంటాడు. అందులకు పరమశివుడు సభలలో బాంధవ్యాలకు తావుండదు. నే త్రిమూర్తులలో ఒక్కరిగా ఇక్కడ ఉన్నాను అంటాడు. అయిన అహంకారి అయిన దక్షుడు పరమశివుడిని దూషిస్తాడు. ఇక సభలో శాపానుగ్రహాలు వస్తాయి.

దక్షప్రజాపతి తలపెట్టిన నిరీశ్వర యాగం

సభలో తనకు పరాభవం జరిగింది, నా అల్లుడు నన్ను గౌరవించలేదు అని భావించిన దక్షుడు, శివుడుపై ఇంకా ద్వేషంతో రగిలిపోతాడు. తత్ఫలితంగా నిరీశ్వర యాగం తలపెడతాడు, అంటే శివుడు లేని యజ్ఞం చేయ నిశ్చయిస్తాడు. వరబలం మెండుగా ఉన్న దక్షుడంటే మహర్షులకు, దేవతలకు హడలు, ఆ భయంతో ఈ నిరీశ్వర యాగానికి వారు దక్షుడితో చేరతారు. బాంధవ్య దృష్టితో చూసి ఆది శక్తిని, శక్తి ఆధారమైన శివాన్ని కాదనడం దక్షుడు అహంకారం ఏ స్థితికి చేర్చిందో ఇక్కడ ప్రస్పుటం అవుతుంది. ఆది దంపతులని ద్వేషించడంలోనే దక్షుడు పతనం చెందాడు, అయితే ఫలితం కనబడే సంఘటన మాత్రం అతడు తలపెట్టిన నిరీశ్వర యాగం స్థలం. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

జగదంబ అయిన సతీదేవి తనతండ్రి తలపెట్టిన యాగం చూడాలని పరమశివుని ప్రార్ధిస్తుంది. అయితే పరమశివుడు సతీదేవితో దక్షుడి ద్వేషభావన గురించి అప్పుడు చెప్పి, సతీదేవిని వెళ్ళవద్దని వారిస్తాడు. పుట్టింటిపై మమకారంతో అందులోను తనతోబుట్టువులు కూడా ఆ యాగానికి వెళ్ళారని తెలియడంతో అమ్మమనసు అమ్మదగ్గరికి వెళ్ళాలనే నిశ్చయించుకోవడంతో పరమశివుడు శివపరివారంతో సతీదేవిని దక్షయజ్ఞానికి పంపిస్తాడు. యాగానికి వచ్చిన సతీదేవిని యాగశాలలో ఎవరు పలకరించారు, తండ్రి ముఖం చాటేస్తాడు. భర్తమాట కాదని వచ్చినందులకు నాకు తగిన శాస్తి జరిగినది, అని తలచిన అమ్మ అగ్నిలో ఆత్మత్యాగం చేస్తుంది.

విషయం పరివారం ద్వారా విన్న శివుడు ప్రళయ రుద్రుడై నాట్యం చేసి, తన జటాజుటం నుండి వీరభద్రుడిని సృష్టిచేసి దక్షయజ్ఞం నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. వీరభద్రుడు దక్షయజ్ఞంలో భీబత్సం సృష్టిస్తాడు. దక్షుడి తలతెగి అగ్నికి ఆహుతి అవుతుంది. అయితే మహా ప్రతివ్రత అయిన దక్షుడి భార్య వైరిని ప్రార్ధనతో త్రిమూర్తులు ప్రత్యక్ష్యమై దక్షుడికి మేక తలను పెడతారు. అలాగే దక్షయజ్ఞం నిర్విఘ్నంగా జరిగేల ఆశీర్విదిస్తారు. అయితే జగదంబ మాత్రం దక్షుడి కుమార్తె మరలా పునర్జీవిగా రావడానికి ఇష్టపడని కారణంగా అమ్మ అదృశ్యంగానే ఉంటుంది. దక్షయజ్ఞం చలనచిత్రం ముగుస్తుంది. ఎంతటి శక్తిమంతులైనా సరే ఆహంకరిస్తే, గర్వంతో ఇతరులను నొప్పిస్తే ఎంతటి పరిణామాలు ఉంటాయో, ఎందరి జీవితాలు తలక్రిందులు అవుతాయో ఈ దక్షయజ్ఞం చిత్రం ద్వారా కనబడుతుంది. దక్షుడి అహంకారం సాక్ష్యాత్తు పరమశివుడు భార్య జగదంబ జీవితాన్నే మార్చేసింది. అలాగే అల్లుడు చంద్రుడు జీవితంపై తీవ్రప్రభావం చూపించింది. దక్షుడితో బంధుత్వం ఏర్పడిన కారణంగా పరమశివుడే నిందింపబడ్డాడు. ఇలా అహంకారి దక్షుడితో సంభందం కలిగిన అందరూ ప్రభావితులైనారు. అయితే దేవతా శక్తికి ప్రకృతి మార్పులతో మొదలువుతుంది కాబట్టి అవన్నీ లోకకళ్యాణం కోసం ఉపయోగపడ్డాయి. “దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

అప్పుచేసిపప్పుకూడు తెలుగు పాత చలనచిత్రం

అప్పు చేసి పప్పు కూడు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie విజయ ప్రొడక్షన్స్ పతాకం పై ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో NT రామరావు, SV రంగారావు, సావిత్రి, కొంగర జగ్గయ్య, జమున, చిలకలపూడి సీతారామాంజనేయులు, రేలంగి వెంకటరామయ్య, గిరిజ, అల్లు రామలింగయ్య, ముక్కామల, రమణారెడ్డి, సూర్యకాంతం, తదితరులు నటించారు.

అప్పుచేసి పప్పుకూడు పరపతిని ఉపయోగించుకుని అప్పులు చేసే వ్యక్తి, ఆ అప్పులు తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు గురి అవుతారో ఎందరి జీవితాలతో అడుకుంటారో ఈ చిత్రం ద్వారా కనబడుతుంది. రావు బహద్దూర్ రామదాసు పరపతితో అప్పులు చేయడం, ఇంకా తన కోడలుని కాదని ఇంకో జమిందారి సంబంధం కోసం ప్రాకులాడడంతో మొదలయ్యే చిత్రం, దివాన్ బహద్దూర్ ముకుందరావు తన మనవరాలికి మహారాజాతోనే పెళ్లి చేయాలనీ భావించండంతో చిత్రకధ అనేక మలుపులు తిరుగుతుంది. ‘Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie’.

రావు బహుద్దూర్ రామదాసు జమిందారు అయితే నిండా అప్పుల్లో మునిగి ఉంటాడు. అతనికి ఒక రఘు అనే కొడుకు, పట్నంలో చదువు కుంటూ ఉంటాడు. రావు బహుద్దూర్ రామదాసు కింద గుమస్తాగా భజగోవిందం పని చేస్తూ ఉంటాడు. అయితే రావు బహుద్దూర్ రామదాసు తన కొడుకు రఘు రాజారావు చెల్లెలు లీలతో వివాహం జరిగి ఉంటుంది, అయితే విదేశాలకు చదువు నిమిత్తం రఘు, ఉద్యమంలో భాగంగా రాజారావు జైలు కి వెళ్ళినప్పుడు, డబ్బుపై పేరాశతో రావు బహుద్దూర్ రామదాసు లీల ఇంటినుండి గెంటివేస్తాడు. తరువాత లీల చనిపోయిందని విదేశాల్లో ఉన్న రఘుకి చెబుతాడు. అంతేకాకుండా సాటి జమిందారు అయిన దివాన్ బహుద్దూర్ ముకుందరావు మనవరాలు మంజరికి ఇచ్చి పెళ్లి చేస్తే వచ్చే సొమ్ముతో బాకీలు తీర్చివేయవచ్చు అని భావిస్తాడు.

భజగోవిందం, రాజారావు కలసి వేసే వేషాలతో కధకు ముగింపు

అలాగే దివాన్ బహుద్దూర్ ముకుందరావు దగ్గర పనిచేసే గుమస్తాకి రావు బహుద్దూర్ రామదాసు లంచం ఇచ్చి సంబంధం ఖాయం చేసేవిధంగా చూడమాని చెబుతాడు. స్వతంత్ర సమరంలో జైలుకి వెళ్లి జైలు నుండి విడుదల అయిన రాజారావు వచ్చేటప్పటికి భజగోవిందం, మంజరి జరిగిన విషయాలు రాజారావుకి చెబుతారు. ఇంటినుండి గెంటివేయబడిన లీలని మరల రామదాసు ఇంటిలో తీసుకువస్తాడు, రాజారావు. సుగుణవతి అయిన లీలని ఇంట్లో పని మనిషిగా అయితే ఉండు, నా ఇంటికోడలుగా కాదు అని ఒప్పిస్తాడు. రావు బహద్దూర్ రామదాసు. రావు రామదాసు గారికి గుణపాఠం చెప్పడానికి, మంజరి, లీలల జీవితాలను కాపాడడం కోసం రాజారావు ఒక జమిందారు గా వేషం వేసుకుని దివాన్ బహద్దూర్ ముకుందరావు గారి ఇంటికి వస్తాడు. విదేశాల నుండి రఘు చదువులు పూర్తీచేసుకుని వస్తాడు. రఘు వచ్చాక అతని భార్య అయిన లీలని పనిమనిషిగా పరిచయం చేస్తాడు. Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie

కానీ ఆ పని మనిషే లీల అని రఘు తరువాత తెలుసుకుని, తను కూడా ఆ విషయం తెలియనట్టే రావు బహద్దూర్ రామదాసు దగ్గర నటిస్తూ ఉంటాడు. అయితే రాజారావు ఆడుతున్న రాజావారి నాటకం తెలుసుకున్న రావు బహద్దూర్ రామదాసు రాజారావు చెల్లెలుని తీసుకువచ్చి బెదిరించి, జమిందారు దగ్గర నుండి దివాన్ బహద్దూర్ దగ్గర నుండి పంపించేస్తాడు. అలాగే రావు రామదాసు దివాన్ బహద్దూర్ ముకుందరావు దగ్గరికి వచ్చి అతని మనవరాలు మంజరిని తన కొడుకు రఘుకి ఇచ్చి చేయమని, లేకపోతే దొంగ రాజాని ఇంట్లో పెట్టుకొని నాటకం సంగతి కోసం నలుగురి చెప్పి మనవరాలి మంజరి పెళ్లి జరగనివ్వనని బెదిరిస్తాడు. Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie

ఇక భజగోవిందం సూచనతో రాజరావు మరలా సన్యాసి వేషం వేసి, దివాన్ బహద్దూర్ ముకుందరావు దగ్గరికి చేరతాడు. రాజారావుతోబాటు భజగోవిందం కూడా సన్యాసి వేషంతో రావు బహద్దూర్ రామదాసు ఆటలకు చెక్ పెడతారు. చివరికి లీల-రఘు, ఉష-భజగోవిందం, మంజరి-రాజారావు జంటలుగా పెద్దలు అంగీకరించడంతో చిత్రం ముగుస్తుంది. “Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie”. దురాశ దుఃఖానికి చేటు, అయితే అయినవారి చొరవతో పెడదారి సరిచేయబడితే బుద్ది తెచ్చుకున్న ఒక పెద్దమనిషిచేత ప్రభావితమైనవారు వేసే వేషాలు ఈ చిత్రంలో ఆకట్టుకుంటే, పాటలు కూడా బాగుంటాయి.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

అలనాటి పాత సినిమాలు

Our Films are in Youtube Old Telugu Movies Popular Actors సమస్యలతో సతమతయ్యే వారికి వినోదంగా ఒకప్పుడు హరికథలు, నాటకాలు ఉంటే అవి పౌరాణిక కధలతో సామజిక కుటుంబ సందేశాలను మిళితం చేస్తూ, కొన్నింటిలో అయితే అప్పటి సామజిక దోరణిలను వ్యంగ్యంగానో చెప్పటం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎక్కువగా సత్యహరిశ్చంద్ర, వల్లికళ్యాణం, చింతామణి లాంటి డ్రామాలు ఉంటే, ఎన్నెన్నో హరికధలు దేవతలపై చెప్పబడేవిగా చెబుతారు. సాంకేతికత అభివృద్ధి చెంది, నాటకాలను చలనచిత్రాలుగా వెండితెరపై కెక్కించి విజయంతం అయ్యారు.

కధనంలో జరుగుతున్నా సమకాలిక సామజిక పరిస్థితులనుసరించి పౌరాణిక గాధలు ఎక్కువగా సినిమాలుగా వస్తే, జానపద కధలు, చారిత్రక విశేషాలు ఇలా చెబుతూ పొతే అనేకానేక పాత చిత్రాల్లో సందేశాన్ని సామరస్యంగా చెప్పడంలో చక్కగా చిత్రాల్లో చూపినట్టు, మనకి పాత చిత్రాల్లో కనబడుతుంది. సున్నితమైన అంశాల గురించి సున్నితంగానే చెప్పడం కూడా పాతచిత్రాలకే కనబడుతుంది. ఇప్పటి చిత్రాల సందేశాలు ఇప్పటికి అధునాతనమైనవి అయితే అప్పటి చిత్రాల సందేశాలు అప్పటికి అధునాతనంగానే ఉంటాయి. ఎందుకంటే సినిమాలు గతకాలపు సంఘటనలు లేక గ్రందాల విషయాలతో కూడి ప్రస్తుతానికి దగ్గరగా భవిష్యత్తుపై ఊహతో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చిత్రాలు చెబితే గతకాలపు అంశాలలో మంచి చెడులను, లేక భవిష్యత్తు సామజిక పయనం ఎటు ? అనే అంశాలతో మిళితమై ఉంటాయి.

ప్రస్తుతం అంటే అప్పుడు ఎప్పుడు చేదుగానే ఉంటుంది, ఎందుకంటే వర్తమానంలో సామజిక విషయాల అనేక మంది ఆచరణచేసేవి సమాజంలో పోకడలుగా దోరణిలుగా కొనసాగుతాయి. కాబట్టి వాటిపై వచ్చే విమర్శలు, సూచనలు అనేక మంది మానవ మేధ ఒక్కరి మేధాశక్తిని నమ్మజూడదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఊహలు కలలుగానే ఉంటాయి, కొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటే, అవి అందరూ అవగతం చేసుకునే అయ్యే స్థితిని సమాజంలో కల్పించలేవు. అందుకే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం గురించి వచ్చిన చిత్రాలు మాత్రం అవార్డు చిత్రాలుగా ఉంటాయి.

కధను బట్టి పాత్ర, పాత్రను బట్టి పాత్రదారి పాతచిత్రాల తీరు

పాతచిత్రాల కధానాయకులుగా నాగయ్య, ఎస్ వి రంగారావు, నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, భానుమతి, షావుకారు జానకి, అంజలి దేవి, కాంచన, రాజశ్రీ, కన్నాంబ, కృష్ణ కుమారి, జమున, వాణిశ్రీ మొదలైనవారు అనేక తెలుగు చిత్రాల్లో నటిస్తే, చాలామంది వారు సినిమాల్లో జీవించారు అని చెబుతారు. Youtube Old Telugu Movies Popular Actors

కాని పాత చిత్రాలు సాద్యమైనంతవరకు సందేశంతో ఉన్నా సకుటుంబానికి కావాల్సిన విషయాలు వాటిలో ఉండే అందరిని ఎక్కువకాలం అలరించాయి. ఇప్పటికి కొంతమంది యూట్యూబ్ లాంటి వీడియో వెబ్ / మొబైల్ ఆప్స్ ద్వారా వీక్షించేవారు అధికంగానే ఉంటారు. ఎన్నో ఉత్తమ చిత్రాలు ఉంటే కొన్ని చిత్రాలు గురించి ఇప్పటికి, మరికొన్ని రానున్న కాలంలో… క్రిందగా ఉన్న కొన్ని చిత్రాల (Chitralu) గురించి Youtube Old Telugu Movies Popular Actors చదవండి….

లక్ష్మికటాక్షం – పేరాశతో పరుల ధనానికి ప్రతినాయకుడి పాట్లు, లక్ష్మిదేవి అనుగ్రహం కలిగిన కధానాయకుడు

అలనాటి తెలుగు చిత్రాలలో వినోదంతో పాటు సమాజ శ్రేయస్సుకోసం సందేశాలు కూడా కధనంలో కలసి చక్కగా కుటుంబంతో కలసి చూడదగిన చిత్రాలే ఎక్కువగా ఉంటే, వాటిలో లక్ష్మికటాక్షం చిత్రం ఒకటి. NTR KR Vijayala LakshmiKataksham Telugu Movie చిత్రాన్ని విఠలాచార్య దర్శకత్వం వహించారు. అర్హత లేనివాటి కోసం వేషం మార్చుకుని చేసే ప్రయత్నాలు ఫలించవు అని, ఒకవేళా ఫలించిన నశించిన బుద్దితో ఆ సంపద దక్కదని ప్రచండుడి పాత్రలో ప్రస్పుటం అవుతుంది. వేషం మార్చుకుని వేషాలు వేయించగలిగే శక్తిని సంపాదించి కూడా పేరాశతో భోగాలు కోసం అంతులేని సంపదని ఒక్కడి స్వార్ధం కోసం చేసిన ప్రయత్నం విఫలమై చివరికి దుష్ట సర్పంగా మారి అడవులపాలు అయ్యేలా చేసిన పేరాశను పట్టుకున్న ప్రచండుడు. విధిరాతను బట్టి ఎక్కడిజీవితంలో అక్కడ సంతోషంగా గడిపే కులవర్ధనుడుకి ప్రచండుడి ప్రయత్నాలే కులవర్ధనుడుని మహారాజుగా మార్చాయి. ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

కలసిఉంటే కలదు సుఖం – టైటిలే చిత్రానికి కాప్షన్ అయ్యేలా చిత్రం పేరు చిత్రకధ

కలసి ఉంటే కలదు సుఖం నందమూరి తారకరామారావు సావిత్రి జంటగా నటించిన కుటుంబ కధా చిత్రం. తెలుగు చిత్రాలలో కుటుంబ విలువలను అందులోను ఉమ్మడి కుటుంబ విలువలను గూర్చి చక్కగా చెప్పే పాత చిత్రాల్లో కలసి ఉంటే కలదు సుఖం ఒక మంచి చిత్రంగా ఉంది. స్వర్గీయ ఎన్టిఆర్ సావిత్రల కలియకలో ఎస్వి రంగారావుగారు, సూర్యకాంతం, రేలంగి తదితరుల అద్బుత నటనతో చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram Ummadi kutumbamlo bandhalu gurinchi venditerapai veligina chitrarajamu. ముద్దబంతి పూలు పెట్టి, మొగలి రేకులు జడను అంటూ సాగే పాట సూపర్ హిట్ సాంగ్. శ్రీ సారది స్టూడియోస్, బ్యానర్ పై రామరావు, రేలంగి, ఎస్విఅర్ సావిత్రి, గిరిజ హేమలత, రమాదేవి తదితరులు నటించిన తెలుగు చలనచిత్రం కలసి ఉంటే కలదు సుఖం చిత్రానికి తాపి చాణుక్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

కృష్ణుడు భాగవతంలో కధానాయకుడు అయితే భారతంలో ధర్మాన్ని గెలిపించిన భగవానుడు.

మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించారు.ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

పరమానందయ్య శిష్యుల కధ – హాస్య భరిత పౌరాణిక చిత్రం

Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie శ్రీ దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పరమానందయ్య శిష్యుల కద చిత్రం– సి పుల్లయ్య దర్శకత్వంలో నాగయ్య, ఎన్టిఆర్, పద్మనాభం, అల్లు రామలింగయ్య, రాజబాబు తదితరులు నటించారు. సహజమైన నవ్వు ఆరోగ్య స్థితిని తెలియజేస్తూ ఉంటే, బుద్దిహీనతతో చేసే పనుల వలవ వచ్చే నవ్వులతో కూడిన హాస్యకదాచిత్రము పరమానందయ్యా శిష్యుల కధ ‘ ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

రాముడు, కృష్ణుడు, శివుడు భగవానుడిని భక్తితో తెలుగుకు పరిచయం చేసిన మహాభక్తుడు

అలనాటి మేటి చిత్రాల్లో భక్తపోతన భక్తీచిత్రం. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana Samskrutam nundi Telugulo Anuvadinchina Bhakta Potanaamaatyulu శ్రీకృష్ణుడు మహాభారతం నడిపించడానికి ద్వాపరయుగంలో ధర్మానికి అధర్మానికి యుద్దంలో ధర్మాన్ని రక్షించబూనిన వారికి మద్దతుగా ఉంటూ ధర్మ సంస్థాపన చేయడానికి అవతరిస్తే, ఆ మహాభారతాన్ని సంస్కృత రచన చేసిన వేదవ్యాసుడు, ఆ పరబ్రహ్మ లీలలను కూడా చెప్పదలచి భాగవతం కూడా రచనచేసి ఆత్మతృప్తిని పొందినట్టుగా శాస్త్ర పండితులు పలువురు ప్రవచన కారులు చెబుతారు. భాగవతం వింటే పుణ్యం కలుగుతుంది అని, మరీ భక్తిశ్రద్దలతో వింటే మోక్షమే ప్రాప్తిస్తుంది అని కూడా ప్రవచన కారులు వారి వారి ప్రవచనాల ద్వారా చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల చేత చెప్పబడుతున్న మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహానుభావుడు, తెలుగుజాతికి విలువైన భక్తీ గ్రంధాన్ని అందించిన బమ్మెర పోతరాజు గురించిన తెలుగు చలనచిత్రం చూడడం కూడా ఒక అదృష్టమే అంటారు. ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

మాటపై నిలబడడం అంటే నిప్పులపై నిలబడడం అని నిరూపించిన చిత్రం

NTR Satya Harishchandra Full Story Telugu Movie, Satyaharischandra Maharaju Satyavrata Pouranika Gaadha పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప చిత్రం సత్యహరిశ్చంద్ర గాధ53 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, ఎస్ వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ తదితరులు నటించారు. సత్యహరిశ్చంద్ర చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించగా ప్రముఖ దర్శకులు కె.వి. రెడ్డి నిర్మాణదర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సత్యహరిశ్చంద్ర గాధని చిత్రంగా సంస్థ నిర్మించింది. ఈ చిత్రం గురించి ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అలనాటి మేటి తెలుగు చిత్రాలకు సాటి రాగల చిత్రాలు అలనాటి చిత్రాల్లోనే ఒకదానితో ఒకటి పోటి పడుతూ ఉంటాయి. గొప్ప గొప్ప కధలతో రచయితలు వస్తే, గొప్ప దార్శనికతతో దర్శకుల చిత్రాలను తీస్తే ఎన్నెన్నో చిత్రాలు మనకి లభిస్తాయి.  అనేక పాత Chitra లు మనకి యూట్యూబ్‌లో videoలుగా లభిస్తున్నాయి. ఈ పాత చిత్రాల వీడియోలు ఎప్పుడైనా ఎక్కడైనా smartphones ద్వారా వీక్షించవచ్చు.  “Youtube Old Telugu Movies Popular Actors” మరి కొన్ని…..

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

లక్ష్మీ కటాక్షం అలనాటిమేటి చిత్రము

లక్ష్మికటాక్షం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

అలనాటి తెలుగు చిత్రాలలో వినోదంతో పాటు సమాజ శ్రేయస్సుకోసం సందేశాలు కూడా కధనంలో కలసి చక్కగా కుటుంబంతో కలసి చూడదగిన చిత్రాలే ఎక్కువగా ఉంటే, వాటిలో లక్ష్మికటాక్షం చిత్రం ఒకటి. NTR KR Vijayala LakshmiKataksham Telugu Movie చిత్రాన్ని విఠలాచార్య దర్శకత్వం వహించారు.

రాజవంశీకులు భద్రపరిచిన నిధిసంపదకోసం శృంగారవరపు రాజ్యం వారు, పురందర రాజ్యం వారు కొన్ని తరాలుగా పోరాడుతూ ఉంటారు. అలాగే శృంగారవరపు రాజ్య మహారాజు మధురవర్మ గురువు అయిన కోదండపానేశ్వరుడు తన శిష్యగణంతో గ్రంధాలు అన్ని తిరగేస్తారు. లక్ష్మి బాండారం (LakshmiBandaram) గురించి తాళపత్ర గ్రంధాలలో వెతికి ఆ లక్ష్మి బాండారం ఎక్కడ ఉందో కనిపెట్టిన రాజగురువులు కోదండపాణి తన ఇద్దరు శిష్యులు వినయదండ (M Balaiah), ప్రచండ (Kaikala Satyanarayana)లతో శృంగారపురపు మండలేశ్వరుడు మధురవర్మ మహారాజు దగ్గరకి వెళ్తాడు. గురువుగారి కోసమే ఎదురు చూస్తున్న మధురవర్మ.

గురువుగారు రాగానే ఆసనం ఇచ్చి, గౌరవించి, లక్ష్మిబండారం గురించిన వివరాలు ఏమైనా తెలిసాయ అని అడుగుతారు. డానికి గురువుగారు లక్ష్మిబాండారం రహస్యం మీ సింహాసనం క్రిందనే ఉన్నాయి అనగానే, సింహాసనం దగ్గర నిక్షిప్తం చేసిన వివరాలు గురువుగారికి ఇస్తారు. మీ వజ్రనాథ వంశంలో తొమ్మిదవ తరంవారికి ఈ లక్ష్మిబాండారం సంపాదించి, సామ్రాజ్యాన్ని సుభిక్షంగా ఏలుతారు అని చెబుతారు. అయితే అప్పటికి ఆ రాజు ఎనిమిదవ తరం వారు అవ్వడం రాజు భార్య గర్భం ధరించి ఉండడం వలన పుట్టబోయే యువరాజు తొమ్మిదవ తరం రాజు కావునా అతడే ఈ లక్ష్మిబాండారం సాధిస్తాడు అని వారు అనుకుంటారు. ‘NTR KR Vijayala LakshmiKataksham Telugu Movie’.

పేరాశతో ప్రచండుడు లక్ష్మి బాండారం కోసం ప్రయత్నించి భంగపడడం

రాజగురువు తన ఇద్దరి శిష్యులకు హితబోధ చేసి, మీకు తెలిసిన విద్యను పరులకు సేవచేసేవిగా ఉపయోగించమని చెప్పి, తాను తపస్సుకు వెళ్తాడు. అయితే ఇద్దరి శిష్యులలో ప్రచండుడు స్వార్ధ పరుడై గురువుగారు దువుతుండగా లక్ష్మి బాండారం గురించిన రహస్యం చదివి తెలుసుకుంటాడు. గురువుగారు తపస్సుకు వెళ్ళగానే లక్ష్మిబాండారం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అక్కడ గణపతి విగ్రహం అతనిని దండిస్తుంది, అక్కడ ఆకాశవాణి అడిగిన మూడు ప్రశ్నలకు జవాబు చెప్పలేని ప్రచండుడుకి ఆకాశవాణిగా కేవలం మధురవర్మ మహారాజు కొడుకు మాత్రమే ఈ నిధిని సాధించగలడని చెబుతుంది.

మహారాణి అమ్మవారి గుడిలో మగశిశువుని ప్రసవించగానే ప్రచండుడు తన మంత్ర శక్తితో అందరిని మూర్చపోయేటట్టు చేసి మధురవర్మ రాజకుమారుడిని ఎత్తుకువెళ్లిపోతాడు. మహారాజ దంపతులు దుఃఖిస్తూ ఉంటే, రాజ పురోహితులు జాతకం చూసి, ఖచ్చితంగా రాజకుమారుడు తిరిగి వచ్చి సామ్రాజ్యాన్ని దేవేంద్ర వైభవంతో పరిపాలిస్తాడని చెబితే వారు తేరుకుంటారు. రాజ పుత్రుడుని తీసుకుపోయిన దుష్ట ప్రచండుడు, రాజ కుమారుడుకి కులవర్ధనుడు(NT Ramarao)గా నామకరణం చేసి, పెంచి పెద్దచేసి సకల విద్యలు నేర్పిస్తాడు. పూర్తీ విద్యార్హత వచ్చింది అనగానే అతడిని మరల లక్ష్మిబాండారం కోసం ప్రయత్నిస్తాడు. రాకుమారుడు గణపతి దగ్గర ఆకాశవాణి అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో లోపలికి ప్రవేశం లభిస్తుంది. లోపాలకి వెళ్ళిన కులవర్ధనుడు గుడ్లు గ్రహించుకుని బయటికి వస్తాడు.

కులవర్ధనుడుతో లక్ష్మిబాండారం కోసం ప్రచండుడి ప్రాకులాట

మొదటి ప్రయత్నంలో విఫలమైన ప్రచండుడి ప్రయత్నం కులవర్ధనుడు ద్వారా రెండో రహస్యం దక్కించుకొని, మరలా రాజకుమారుడు దగ్గర నుండి శక్తులను గ్రహించి అతనిని తన మాయ శక్తితో గాలిలో దూరంగా విసిరేస్తాడు. అలా విసిరివేయబడ్డ కులవర్ధనుడు అడవిలో ఎక్కడో పడితే, మేకలు కాసుకునేవారి దగ్గర చేరతాడు. అయితే కులవర్ధనుడు గతంలో జరిగినది అంతా మరిచి ఉంటాడు. ప్రచండుడు లక్ష్మిబాండారం కోసం తన ప్రయత్నాలు చేయడానికి వెళ్తూ ఉంటే, అతని సహా శిష్యుడు కూడా ప్రచండుడుని అనుసరిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను ఒక గుడ్డుపై వ్రాసి ఉన్నట్టుగా అనుసరించి, ఒక బేతాళ చెట్టు దగ్గరికి వెళితే అక్కడ ఒక పాత్ర లభిస్తుంది. గుడ్డు ముక్కలు వజ్రనాథ వంశపు పట్టపురాణి చేత పాయసం చేయించి ఆ పాయసంలో కత్తిని మూడు సార్లు ముంచి ఆ పాత్రని గీరినప్పుడే అందులో కొన్ని వివరాలు లభిస్తాయి అని వ్రాసి ఉంటుంది. మరల రాజకుటుంబంతో లంకె పడడంతో ప్రచండుడు మధురవర్మకి దగ్గరికి వస్తాడు. NTR KR Vijayala LakshmiKataksham Telugu Movie

ప్రచండుడు సహా శిష్యుడు అయిన వినయదండుడు అక్కడ దగ్గరిలో ఉన్న కోదండపానేశ్వరుల మిత్రులైన మంత్రదండులనే మరో ముని కలుస్తాడు. ఆ మునితో ప్రచండుడి గురించి చెబుతాడు. అప్పుడు ముని ఇంకా వివరాలు కావాల్సి ఉంటుంది, ఆ వివరాలు పురందర రాజ్యపు యువరాణి హేమమాలిని(KR Vijaya) వద్దనున్న నీలమణి వలననే ఇంకా కొన్ని వివరాలు లభిస్తాయి అనగానే అక్కడికి చేరి నీలమణి ద్వారా వివరాలు తెలుసుకుని వెళ్తాడు. అయితే అక్కడ పద్మరేఖలు కలిగిన హస్తం కనబడుతుంది.

ప్రచండుడు ప్రయత్నంలో మధురవర్మ పట్టపురాణి చేసిన ప్రయత్నంలో కూడా పాత్ర నుండి బయటపడిన వివరాలు కేవలం పద్మరేఖలు కలిగిన హస్తం ఉన్న వ్యక్తే చదవగలడని ఉంటాయి. ఇక పద్మరేఖలు ఉన్న హస్తం ఉన్న వ్యక్తి ఎవరో వెతికే ప్రయత్నంలో మహారాజు ప్రకటన చేస్తాడు. అరచేతిలో పద్మరేఖలు ఉన్న వ్యక్తికి లక్ష్మిబాండారం లభిస్తుందని. తన ప్రయత్నంలో అడ్డుపడుతున్నాడని వినయదండని కుక్కవి కమ్మని ప్రచండుడు మంత్ర ప్రయోగం చేస్తాడు. అడవిలో ఉంటున్న కులవర్ధనుడు అక్కడే ఉండే అమ్మాయి సింగారి(రాజశ్రీ)తో ఇష్టంగా మెసులుతూ ఉంటాడు. రాజ్యంలో లక్ష్మిబాండారం గురించి బాగా ప్రచారం జరుగుతుంది. రాజ్యంలో హస్తశాస్త్ర పండితులు.

లక్ష్మిబాండారం లభించాలంటే పద్మరేఖలు కలిగిన వ్యక్తి కోసం గాలింపు

ప్రజల చేతులను పరీక్ష చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ప్రజలు తమచేతులపై పద్మరేఖలు గీయించుకుని రాజుగారి రాజ సభకు వస్తారు, కానీ అసలు పద్మరేఖలు కలిగిన వ్యక్తి కనబడడు. అడివిలో మౌడ్యంలో ఉన్న కులవర్ధనుడు దగ్గరికి కుక్క రూపంలో ఉన్న వినయదండ వెళ్లి, అతనిని పాపనాశిని అయిన కొలను ఉన్న ప్రదేశానికి తీసుకుపోతాడు. అక్కడ దైవానుగ్రహం, రాకుమారుడు పోరాటం వలన కొలనులోకి ప్రవేశం లభిస్తుంది. ముందుగా ఆ కొలనులోకి కుక్క ప్రవేశించి, వినయదండగా బయటకి వచ్చి, కులవర్ధనుడు కూడా అందులో స్నానం చేయమంటాడు. అప్పుడు కులవర్ధనుడు కొలనులో ప్రవేశించి బయటకు తన పూర్వస్మృతితో బయటకువస్తాడు. అతనికి లక్ష్మిబాండారం గురించి ప్రచండుడి ప్రయత్నం గురించి, వివరిస్తాడు, వినయదండ. అయితే హటాత్ గా అతని చేయి చూసిన వినయదండ ఆశ్చర్యంతో లక్ష్మిబాండారం నీకే లభిస్తుంది అని వివరిస్తాడు. ఈ హస్తరేఖలు ఉన్న చేయి కలిగిన వ్యక్తి కోసం ప్రచండుడు గాలిస్తున్నాడు, జాగ్రత్తా అని వినయదండ కులవర్ధనుడుని హెచ్చరిస్తాడు. NTR KR Vijayala LakshmiKataksham Telugu Movie.

మధురవర్మ మహారాజు ఎంతవెతికినా ఆ చేయి గల వ్యక్తి దొరకలేదు అని చెబుతాడు. అయితే నేను క్షుద్ర పూజ ద్వారా ఆ విషయం తెలుస్తానని అందుకు సిద్దం చేయమంటాడు, ప్రచండుడు. ప్రచండుడు క్షుద్ర పూజలో కూర్చుంటాడు. పూజలో ఉండి, పద్మరేఖలు కలిగిన ప్రాణిని అవాహం చేస్తాడు. ఆ రాకుమరుడే మరలా అక్కడికి వచ్చి పడతాడు. అతనిని చూసి ఆశ్చర్యానికి గురి, ఆ రాకుమారుడుని మధురవర్మ రాజదంపతుల వద్దకు తీసుకువస్తాడు, ప్రచండుడు. అక్కడ తాళపత్రాలలో ఉన్న రహస్యం చదవమని ప్రచండుడు చెబుతాడు. అయితే కులవర్ధనుడు ఆ వివరాలు చదివినవారికి తప్పించి ఇతరులకు చెబితే లక్ష్మిబాండారం మసిగా మారుతుందని చెప్పడంతో ప్రచండుడు అసహనానికి గురి అవుతాడు.
రాజమందిరంలోనే విశ్రాంతి తీసుకుంటున్న కులవర్ధనుడుని తమ పుత్రుడుగానే మధురవర్మ రాజదంపతులు భావిస్తారు. అలాగే అక్కడికి పురందర రాజ్యపు యువరాణి పనిమనిషిగా వచ్చిన మాలినిని, కులవర్ధనుడుకి ఇచ్చి పెళ్లి చేయాలనీ మధురవర్మ దంపతులు భావిస్తారు. అయితే ఆపదలో అడవిలో ఉన్న తనని ఇష్టపడే సింగారిని రాజమందిరానికి తీసుకువస్తాడు, కులవర్ధనుడు.

ప్రచండుడు మరల కులవర్ధనుడు సహాయంతో లక్ష్మిబాండారం కోసం ప్రయత్నం.

కులవర్ధనుడు, ప్రచండుడు, మధురవర్మ, హేమమాలిని లక్ష్మిబాండారం కోసం బయలుదేరతారు. అయితే దారిలో పనిమనిషి మాలినిగా ఉన్న పురందర రాణిపై సందేహం వచ్చిన ప్రచండుడు, మధురవర్మ ఆమెను శిక్షిస్తూ ఉండగా వినయదండ వచ్చి ఆమెను, ఆమె రాజ్యాన్ని ప్రచండుడి మంత్రశక్తి భారిన పడకుండా అడ్డుకుంటాడు, అంతేకాకుండా తన శక్తితో ప్రచండ మంత్ర శక్తిని నాశనం చేస్తాడు. పురందర మహారాణి తన సైన్యంతో అందరిని బంధించి తమ రాజ్యానికి తీసుకుబోతుంది. కులవర్ధనుడుని మాత్రం పురందర రాజ్యంలో పెట్టుకుని, రాజుని, ప్రచండుడుని రాజ్యం దాటిస్తారు. ప్రచండుడు దారిలో రధికుడుని చంపి రాజు మధురవర్మతో తప్పించుకుంటారు. NTR KR Vijayala LakshmiKataksham Telugu Movie.

పోయిన శక్తిని తిరిగి పొందడానికి ప్రచండుడు మరల క్షుద్ర పూజలు ప్రారంభిస్తే, కులవర్ధనుడు లక్ష్మిబాండారం కోసం బయలుదేరతాడు, తన సహవాసితో. తాళపత్ర గ్రందాలలో ఉన్న సూచనలు అనుసరించి, కులవర్ధనుడు లక్ష్మిదేవి అనుగ్రహం సంపాదిస్తాడు, అలాగే అమ్మ దర్శనంతో మధురవర్మ కుమారుడు తానే అని తెలుసుకుని అమ్మ అనుగ్రహించిన సంపదను గ్రహించి బయలుదేరతాడు. ప్రచండుడు తన ప్రయత్నం ఫలించి మరలా శక్తివంతుడు అవుతాడు. తిరిగి వస్తున్న కులవర్ధనుడు గమనం గమనించిన ప్రచండుడు, మధురవర్మ రాజదంపతులని, హేమమాలినిని తన గృహలో బంధిస్తాడు. అలాగే ప్రచండుడి గృహపై నుండి లక్ష్మిబాండారంతో పోతున్న కులవర్ధనుడుని కూడా గృహలోకి రప్పిస్తాడు.

ప్రచండుడు కులవర్ధనుడుకి గురువు కావడం వలన, గురువుగారి కోరిక మేరకు లక్ష్మిబాండారం ప్రచండుడుకె అప్పగిస్తాడు. అయితే ప్రచండుడు హేమమాలినిని కూడా కోరడంతో అది తప్పని వారిస్తాడు, కులవర్ధనుడు ప్రచండుడుని. కామంతో కళ్ళు మూసుకుపోయిన ప్రచండుడు కులవర్ధనుడుని రెచ్చగొట్టి అతనితో తలబడతాడు. లక్ష్మి అనుగ్రహం కలిగిన కులవర్ధనుడు విజయం సాధిస్తాడు, అర్హత లేని ప్రచండుడు అందరి ఆగ్రహానికి గురి అవుతాడు. అఖిరికి కోందండపానేశ్వరుల ఆగ్రహానికి గురై సర్పమై అడవుల పాలు అవుతాడు. కులవర్ధనుడు పురందర మహారాణి హేమమాలినిని, అడవి పిల్లని పరిణయమాడి లక్ష్మి అనుగ్రహంతో రాజ్యానికి రాజు అవుతాడు. “NTR KR Vijayala LakshmiKataksham Telugu Movie”.

అర్హత లేనివాటి కోసం వేషం మార్చుకుని చేసే ప్రయత్నాలు ఫలించవు అని, ఒకవేళా ఫలించిన నశించిన బుద్దితో ఆ సంపద దక్కదని ప్రచండుడి పాత్రలో ప్రస్పుటం అవుతుంది. వేషం మార్చుకుని వేషాలు వేయించగలిగే శక్తిని సంపాదించి కూడా పేరాశతో భోగాలు కోసం అంతులేని సంపదని ఒక్కడి స్వార్ధం కోసం చేసిన ప్రయత్నం విఫలమై చివరికి దుష్ట సర్పంగా మారి అడవులపాలు అయ్యేలా చేసిన పేరాశను పట్టుకున్న ప్రచండుడు. విధిరాతను బట్టి ఎక్కడిజీవితంలో అక్కడ సంతోషంగా గడిపే కులవర్ధనుడుకి ప్రచండుడి ప్రయత్నాలే కులవర్ధనుడుని మహారాజుగా మార్చాయి. చిత్రం అంతా నిధికోసం కావాల్సిన మార్గాలను వెతుక్కుంటూ ప్రయత్నాలతో సాగిపోతుంది. ధనం మీద ఆశలేని వ్యక్తి మహారాజు, అయితే పేరాశతో పెడదారిన పడిన ప్రచండుడు పాముగా మారి అడవులలోకి పోయాడు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

కలసి ఉంటే కలదు సుఖం తెలుగు చలన చిత్రం

కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

కలసి ఉంటే కలదు సుఖం నందమూరి తారకరామారావు సావిత్రి జంటగా నటించిన కుటుంబ కధా చిత్రం. తెలుగు చిత్రాలలో కుటుంబ విలువలను అందులోను ఉమ్మడి కుటుంబ విలువలను గూర్చి చక్కగా చెప్పే పాత చిత్రాల్లో కలసి ఉంటే కలదు సుఖం ఒక మంచి చిత్రంగా ఉంది. స్వర్గీయ ఎన్టిఆర్ సావిత్రల కలియకలో ఎస్వి రంగారావుగారు, సూర్యకాంతం, రేలంగి తదితరుల అద్బుత నటనతో చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram Ummadi kutumbamlo bandhalu gurinchi venditerapai veligina chitrarajamu. ముద్దబంతి పూలు పెట్టి, మొగలి రేకులు జడను అంటూ సాగే పాట సూపర్ హిట్ సాంగ్. శ్రీ సారది స్టూడియోస్, బ్యానర్ పై రామరావు, రేలంగి, ఎస్విఅర్ సావిత్రి, గిరిజ హేమలత, రమాదేవి తదితరులు నటించిన తెలుగు చలనచిత్రం కలసి ఉంటే కలదు సుఖం చిత్రానికి తాపి చాణుక్య దర్శకత్వం వహించారు. ‘NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

రైతు సోదరులు పట్టాభిరామయ్యా, సుందరయ్య ఇద్దరూ ఒకే కుటుంబంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఒకే ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యాక కూడా కలిసే ఉంటారు. పట్టాభిరామయ్య(SV Rangarao) భార్య పేరు సౌభాగ్యం (Suryakantam), సుందరయ్యా భార్యపేరు రమణమ్మ. అయితే పట్టాభిరామయ్య-సౌభాగ్యంలకు పిల్లలు పుట్టరు, కానీ తమ్ముడు సుందరయ్యా – రమణమ్మలకు ఇద్దరు మగసంతానం ఉంటుంది. అయితే పెద్ద కుమారుడు బాల్యంలో గాలిపటం కోసం కరెంటు స్థంభంపైకి ఎక్కి గాలిపటం పట్టుకోబోయి కరెంటు వైర్ పట్టుకోవడంతో ఆ బాలుడికి కరెంటు షాక్ వలన చేయి అవిటిగా మారుతుంది, ఆ బాలుడు పేరు కిష్టయ్య(NT Ramarao), మనసు బంగారంగా ఉంటుంది. కిష్టయ్యకి అతని కుటుంబ సభ్యులు అంటే మహా అభిమానం. అతనికి అమ్మ నాన్నలకు తోడు పెదనాన్న, పెద్దమ్మ ఒకే కుటుంబంలో ఉంటారు. అలాగే అతనికి ఒక తమ్ముడు మధు(Haranath) పట్నంలో చదుకుకుంటూ ఉంటాడు.

అనాదిగా వస్తున్న కుటుంబ సంప్రదాయంలో రంగూన్ నుండి వచ్చి చిచ్చు పెట్టిన రాజా

రమణమ్మ, సుందరయ్య, పట్టాభిరామయ్య (SV Rangaro), కిష్టయ్య(NT Ramarao) సౌమ్యంగా ఉంటే, సౌభాగ్యం మాత్రం కటువు మాటలతో గయ్యాళిగా ఉంటూ ఉంటుంది. సంక్రాంతి పండుగకు పట్టాభిరామయ్య అందరికి కొత్తబట్టలు కొని కుటుంబ సభ్యుల అందరికి ఇస్తాడు. తరువాత సంతకి వెళ్ళిన రమణమ్మకి సంతలో ఒక అనాధ అమ్మాయి కనబడుతుంది, పేరు రాధా (Savitri), ఆమెను తోడ్కొని ఇంటికి తీసుకువస్తుంది రమణమ్మ, పట్టాభిరామయ్యకి చెప్పి ఆమెను ఇంట్లోనే పెట్టుకుంటారు. సౌభాగ్యం అన్నగారి సంతానం అయిన  కొడుకు రంగూన్ రాజ (Relangi Narasimharao), కూతురు జానకి (Girija) ఇద్దరు అన్నాచెల్లెళ్ళు పట్టాభిరామయ్య ఇంటికి వస్తారు. అప్పటిదాకా ఒక సౌభాగ్యం తప్ప మిగతా అందరి సభ్యులతో ప్రశాంతతో కూడిన కుటుంబంలో ముసలం వచ్చినట్టుగా ఉంటుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.

పట్టాభిరామయ్య తన తమ్ముడి కొడుకు అయిన మధు(Haranath)కు పెళ్లి సంభందం తమ్ముడి సమక్షంలోనే ఖాయం చేస్తాడు. మధు(Haranath) పట్నం నుండి ఇంటికి రాగానే, పెళ్లి చేసేయాలని భావిస్తారు పట్టాభిరామయ్య, సుందరయ్యాలు. అయితే రంగూన్ రాజా(Relangi) వచ్చి రాగానే అత్తయ్య సౌభాగ్యంకు వేరు సంసారాల గురించి, పాశ్చాత్య దేశాల సంస్కృతి గురించి గొప్పగా చెబుతూ, సౌభాగ్యం(Suryakantam) మనసుపై ప్రభావం కల్పిస్తాడు. అయితే అతని ప్రవర్తనతో పట్టాభిరామయ్య, కిష్టయ్య, రాధలకు ఇబ్బందిగా ఉంటుంది. రమణమ్మ సుందరయ్యాల చిన్నకొడుకు మధు(Haranath) పట్నం నుండి ఇంటికి వస్తాడు. రంగూన్ రాజ చెల్లెలు జానకి (గిరిజ)ని చూసి మధు ఇష్టపడతాడు, ఇక ఇద్దరికి ఇష్టం కుదిరి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలాగే జరగాలని కోరుకునే సౌభాగ్యం (Suryakantam), రంగూన్ రాజా(Relangi) లు వారి చేతుల మీదుగానే పట్టభిమరామయ్య– సుందరయ్యాలను విడదీస్తారు. అస్తిపంపకాలు జరిపించి, ఇంటి మద్యలో గోడ కట్టిస్తారు.

జానకి-మధు, రాధా-కిష్టయ్యల వివాహాలు కష్టాలతో

తరతరాలుగా కలసి ఏకకుటుంబంగా వస్తున్న అన్నదమ్ముల సంప్రదాయం, కుటుంబ ఆచారాలు పాటించే కుటుంబం ఇప్పుడు రంగూన్ రాజా మాటలకూ తలవంచిన సౌభాగ్యం వలన విడిపోతే, జానకి(Girija) మీద ఇష్టంతో సుందరయ్య చిన్నకొడుకు మధు(Haranath) రంగూన్ రాజా మాటలు వింటాడు. ఆ మాటలు వలన కిష్టయ్య-మధుల వాటాలు కూడా పంచేసి, మధు(హరనాథ్)ని తమ దగ్గరే అట్టేపెట్టుకుంటారు, సౌభాగ్యం-రంగూన్ రాజాలు, పట్టాభిరామయ్య అచేతనంగా అసహనంగా భావన చెందుతాడు.. అన్నగారు అంటే అభిమానించే సుందరయ్య మంచాన పడతాడు.  ఆ సమయంలోనే పట్టాభిరామయ్య – సుందరయ్యలు కలసి  కుదిర్చిన పెళ్లిని కాదని, జానకి-మధులకు పెళ్లి చేసేస్తారు. నాన్నకు బాగోలేదని సుందరయ్య చావుబతుకుల మధ్య ఉన్నాడని కిష్టయ్య (NT Ramarao) బ్రతిమాలినా మధు అందుకు ఒప్పోకోడు. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.

దుఃఖంతో నిండిన కుటుంబంలో కిష్టయ్య పెళ్లి ఒక సమస్యగా ఉంటుంది. అన్నకు పెళ్లికాకుండానే తమ్ముడు మధు పెళ్లిచేసుకోవడంతో రమణమ్మ – సుందరయ్యాలు ఆలోచనలో పడతారు. అయితే ఇంట్లోనే ఉంటున్న రాధతో కిష్టయ్య పెళ్లిచేస్తే బాగుంటుంది అనే రమణమ్మ ఆలోచనను కిష్టయ్య తోసిపుచ్చుతాడు. నీకే ఆడకూతురు ఉంటే, నాలాంటి కుంటివాడికి ఇచ్చిచేయడానికి ఒప్పుకుంటావా, నీ కూతురు అయితే ఒకలాగా వేరేవారి కూతురు అయితే ఒకలాగా ఆలోచన చేయవద్దని కిష్టయ్య చెబుతాడు. అయితే కిష్టయ్య మంచి మనసుని ఇంట్లోకి వచ్చినప్పటి నుండి గమనించిన రాధా కిష్టయ్యతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇక రాధా-కిష్టయ్యల పెళ్ళితో ఆ కుటుంబం కొంచెం కుదుటపడుతుంది.

రంగూన్ రాజా ప్రభావం పట్టాభిరామయ్య పచ్చని సంసారం పట్నం పాలు

సౌభాగ్యం, జానకి, మధులు పూర్తిగా రంగూన్ రాజా మాటల మాయలో ఉంటారు. మధుకు ఉద్యోగం రావడంతో, ఉద్యోగం నిమిత్తం మధు పట్నం బయలుదేరుతుంటే, రంగూన్ రాజా కూడా పట్నం బయలుదేరతారు. అయితే వెళ్ళేటప్పుడు సౌభాగ్యం దగ్గర పట్నంలో వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తెసుకువస్తానని చెప్పి, పెద్దమొత్తంలో సొమ్ములు అడుగుతాడు. ఆ సొమ్ములు సౌభాగ్యం పట్టాభిరామయ్య గారిచే తనఖా సంతకం చేయించి అప్పు తీసుకుని రంగూన్ రాజాకి ఇచ్చి పంపుతుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.

జానకి-మధులకి ఒక బాబు పుడతాడు అలాగే తరువాత రాధాకిష్టయ్యలకు ఒక బాబు పుడతాడు. జానకి మధులు వారి బిడ్డకు తండ్రి పేరు పెట్టుకుని, ఆ నామకరణ ఉత్సవం పూర్తవ్వగానే ముగ్గురు పట్నం వెళ్తారు. కిష్టయ్య అవిటితనం నయం చేసే ప్రత్యేక వైద్యులు పట్నంలో ఉన్నారు అంటే రాధా కిష్టయ్యలు ఇద్దరు పట్నం వెళ్తారు. పెద్దమొత్తంలో సొమ్ములు తీసుకువెళ్ళిన రంగూన్ రాజా దగ్గరి నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి కానీ సొమ్ములు రావు. అప్పుల వారి సతాయింపు కారణంగా సౌభాగ్యం తన అన్నకొడకు రంగూన్ రాజ కోసం పట్నం వెళ్తుంది. కొత్త కాపురం పెట్టిన జానకి మధులు, డబ్బు సంపాదనలో మోసపోయిన రంగూన్ రాజా అతని కోసం వచ్చిన సౌభాగ్యం, వైద్యం కోసం పట్నం వచ్చిన రాధా కిష్టయ్యలు పట్నంలో కష్టంలో కలుసుకుంటారు. కష్టం దాటాక కుటుంబ విలువలు తెల్సుకుని కుటుంబాన్ని అభిమానించి కిష్టయ్య, మానవత్వంలో అతని గొప్పతనం గ్రహించి అందరూ ఒక్కటి అవుతారు. చివరికి కిష్టయ్య కాలు చెయ్యి బాగుపడి, అందరిలో సంతోషం నిండుకుంటుంది. అక్కడితో చిత్ర కధ ముగుస్తుంది.

ఉమ్మడి కుటుంబం వలననే సంస్కృతి సంప్రదాయాలకు విలువలు పెరుగుతాయనే విషయం ప్రస్ఫుటం చేసే చిత్రం కలసి ఉంటే కలదు సుఖం.

కుటుంబంలో కర్మతో భాదపడేవారు ఉంటే వారికి సేవ చేసేవారికి మంచి జీవితం, వారిని హేళన చేసేవారికి కష్టాలు తప్పవు అని ఈచిత్రంలో కనబడితే, అవిటితనం ఉన్నా అది శరీరానికే గాని మనసుకు కాదని ఈ చిత్రంలో కిష్టయ్య పత్రంలో కనబడుతుంది. ఆత్మీయత అనుభందం కోరుకుంటే, స్వార్ధం బంధాలను తెంచుతుంది, మనసులని భాదిస్తుంది అని ఈ చిత్రం నిరూపిస్తుంది. ఈ చిత్రంలో ప్రధానంగా అంటే పట్టాభిరామయ్యగారి కుటుంబమే అన్నట్టుగా ఉంటుంది. పట్టాభిరామయ్యగా SV రంగారావు గారు నటన, కిష్టయ్యగా రామారావు నటన, రాధగా సావిత్రి, మధుగా హరనాథ్, రంగూన్ రాజాగా రేలంగి గయ్యాళిగా సూర్యకాంతం ఇలా ఎవరి పాత్రలో వారు కనిపిస్తూ చిత్రకధని కుటుంబ బంధాల మధ్య భావనలు చక్కగా చూపిస్తారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక్కటిగా ఉండకబోతే, రకరకాల జాతుల, మతాల వారు ఎలా కలసి ఉండేది, భారతమాతను సంతోష పెట్టె కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది ? మంచి సందేశాత్మక చిత్రం ఉమ్మడి కుటుంబ గురించి గొప్పగా చెప్పిన చిత్రాల్లో కలసి ఉంటే కలదు సుఖం చిత్రం ఒకటి. “NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి చిత్రము

శ్రీకృష్ణావతారం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna, Hari Krishna Acted as Child SriKrishna. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు  శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించారు.

దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం, ఋషులు, దేవతలు, భూమాత మొరపెట్టుకుంటే శిష్ట రక్షణార్ధం దుష్టులను నిర్జించడానికి అవతరిస్తానని మాట ఇచ్చిన శ్రీమహావిష్ణువు. సాధుజనులకు ధర్మపరాయణులకు రక్షకుడు అయినా శ్రీమహావిష్ణువు అవతారం కృష్ణావతారం.

కంసుడు తన చెల్లెలికి దేవకికి వసుదేవుడుని ఇచ్చి వివాహం చేసి అంగరంగ వైభంగా రధసారధిగా బావగారిని చెల్లెల్ని అత్తవారింటికి సాగనంపుతుంటే ఆకాశవాణి హెచ్చరిక చేస్తుంది, నీ చెల్లెలి కడుపున పుట్టబోయే ఎనిమిదవ బాలుడు చేతిలో మరణం ఉంటుంది అని. అందుకు వెంటనే చెల్లెలిపై కత్తి దూసిన కంసుడుని వసుదేవుడు వారించి, నీ చెల్లెలి వలన నీకు ఆపద లేదు కదా నీ చెల్లెలి సంతానం వలననే కదా, ఆమెకు సంతానం కలగగానే నీకు అప్పజెప్పుతానని చెప్పడంతో ఆలోచనచేసిన కంసుడు ఆ ప్రయత్నం విరమిస్తాడు. అయితే అంతవరకూ దేవకీ-వసుదేవులను తన ఇంటే ఉంచుతాడు. కారణాంతరాల వలన తన భద్రత కోసం ఏడుగురు పిల్లల్ని చంపుతాడు కంసుడు. దేవకీ వసుదేవులను కారాగారంలో బందించి ఉంచుతాడు. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

అష్టమ గర్భంతో ఉన్న దేవకీ కారాగారంలో భర్త వసుదేవులతో కలిసి ఉంటుంది. శ్రావణ మాసం అష్టమి తిథి రాత్రి సమయంలో చీకటిలో శ్రీమహావిష్ణువు దేవకీ అష్టమ గర్భవాసం చేసి కారాగారంలో జన్మిస్తాడు. వెంటనే శ్రీమహావిష్ణువుగా దేవకీవసుదేవులకు కనిపించి తనని గోకులంలో వదిలి అక్కడి యోగమాయ శిశువుగా ఉంది, ఆ శిశువుని ఇక్కడకు తెచ్చి పెట్టమని చెప్ప అంతర్ధానం అవుతారు. వసుదేవుడు బిడ్డని చేతుల్లోకి తీసుకోగానే కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపాలదారులు మాయానిద్రలోకి జారుతారు. వసుదేవుడు తన బిడ్డని ఎత్తుకుని గోకులంవైపు వెళ్తుంటే, యమునా నది రెండుగా చీలి దారి ఇస్తుంది. గోకులంలో ఆ బాలుడుని వదిలి, అక్కడి యోగమాయా శిశువుని తీసుకుని కారాగారం దగ్గరికి వచ్చేస్తాడు, వసుదేవుడు.

శ్రీకృష్ణ జననంతోనే లీలలు ప్రదర్శించే భగవానుడు

వసుదేవుడు కారాగారంలోకి రాగానే అక్కడ కమ్మిన యోగమాయ తొలగి స్థితి యదాస్థితిలోకి వస్తుంది. పసిపాప ఏడుపు వినగానే కాపలాదారు వెళ్లి కంసుడుకి చెప్పగానే, కంసుడు కారాగారంలో వచ్చి ఆ పసిపాపను చంపబోతాడు. కానీ కంసుడు ప్రయత్నం విఫలమై ఆ పాపా ఆకాశంలో శక్తిగా మారి నాతొబాటు పుట్టిన బిడ్డ క్షేమంగా ఉన్నాడు. అన్యాయంగా పసిబిడ్డలను చంపిన నీకు ఆ బాలుడి చేతిలోనే మరణం ఉంటుంది అని చెప్పి అంతర్ధానం అవుతుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

కృష్ణుడు నంద గోకులంలో బాల్యం నుండే లీలలు ప్రదర్శిస్తూ పెరుగుతాడు. పాలు త్రాగే వయసులోనే దుష్టబుద్ది కలిగిన పోతన అనే రాక్షసిని సంహరిస్తాడు. అలాగే శకటాసురుడిని కాలుతో తన్ని సంహరిస్తాడు. ప్రజలు నీరుత్రాగే కొలనులో విషం చిమ్ముతూ ఉండే కాళియ సర్పంపై నృత్యం చేసి, ఆ సర్పాన్ని కొలను నుండి వెల్లగొడతాడు. తన అల్లరితో అమ్మని ఆబాలగోపాలాన్ని అలరిస్తూ నందగోకులాన్ని ఆనందంలో ,ముంచెత్తుతాడు. కంసుడుని సంహరించి తన కన్నతల్లిదండ్రులతో కలిసి ద్వారకలో ఉంటాడు.

రుక్మిణికళ్యాణం, సత్యభామ, జాంబవతిలతో వివాహం

బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడైన కృష్ణుడు విదర్భరాకుమారిగా ఉన్న శ్రీమహాలక్ష్మి అవతారం అయిన రుక్ముణిని వివాహమాడతాడు.
అయితే అనుకోకుండా శ్రీకృష్ణుడు పాలలో చంద్రుడిని దర్శిస్తాడు. అది వినాయకచవితి కావడం వలన ఆరోజు గణపతిని పూజించకుండా చంద్రదర్శనం చేసినవారికి నీలాపనిందలు ఉంటాయి, అని చంద్రుడికి అమ్మవారి శాపానుగ్రహం ఉంటుంది. వెంటనే జరిగిన పొరపాటుని గ్రహించిన శ్రీకృష్ణుడు వినాయక పూజ చేసిన అక్షతలను నెత్తిమీద వేసుకుని, విఘ్నేశ్వరుడుని ప్రార్ధన చేస్తాడు. ఇక తత్ఫలితం శ్రీకృష్ణుడికి సత్రాజిత్ రూపంలో నీలాపనింద వస్తుంది. సూర్యభగవానుడిని ప్రార్ధించి శమంతకమణిని పొందిన సాత్రజితు దేదిప్యామానంగా వెలుగాతాడు. శమంతకమణిని తనకు ఇవ్వవలసినదిగా అడిగిన కృష్ణుడి మాటను మన్నించడు సత్రాజిత్. అయితే సత్రాజిత్ సహోదరుడు అయిన ప్రసేనుడు మణిని ధరించి అడవికి వెళతాడు. అయితే మణిని ధరించి అడవికి వెళ్ళిన సోదరుడు ఎంతకీ రాకపోయేసరికి, తన సహోదరుడిని సంహరించి ఆ మణిని శ్రీకృష్ణుడే కాజేసాడని సత్రాజిత్ శ్రీకృష్ణుడిని నిందమోపుతాడు. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

నిందలపాలు అయిన శ్రీకృష్ణుడు మణిని ధరించి అడవికి వెళ్ళిన ప్రసేనుడుని వెతుకుతూ అడవికి బయలుదేరతాడు. వినాయకుడి అనుగ్రహం వలన శ్రీకృష్ణుడుకి దారిలో సింహ చంపిన ప్రసేనుడి శవం, సింహం జాడలతో బాటపట్టిన కృష్ణుడుకి మరణించిన సింహం కనబడి, ఆ దారిలో బల్లూకం జాడలు కనబడతాయి. ఆ జాడలు వెంటబడిన శ్రీకృష్ణుడు జాంబవంతుడి గృహకి చేరతాడు. అక్కడ జాంబవంతుడితో శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడు. రామావతారంలో రాముడితో యుద్ధం చేయాలనే కోరికను కోరిన జాంబవంతుడు, కృష్ణావతారంలో కృష్ణుడుతో తలబడతాడు. అయితే పోరాటంలో ఓడిన జాంబవంతుడుకి విషయం అవగతం అయ్యేలా శ్రీకృష్ణుడు చేస్తాడు. కృష్ణావతారంలో శ్రీరాముడు అని గ్రహించి తనకుమార్తె జాంబవతిని, శమంతక మణిని ఇచ్చి వివాహం చేస్తాడు.

శమంతకమణిని సత్రాజిత్ కి శ్రీకృష్ణుడు ఇచ్చేస్తాడు. అయితే సత్రాజిత్ తన తప్పుని తెలుసుకుని, శమంతక మణిని తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడుకి ఇచ్చి వివాహం చేస్తాడు. వినాయక చవితి రోజున చంద్ర దర్శనం చేసినందుకు నీలాపనిందలు కలిగితే, విఘ్నేశ్వరుడు అనుగ్రహం వలన శమంతకమణి తో బాటు ఇద్దరు భార్యామణులు లభిస్తారు. ఈ పౌరాణిక గాధకి ఫలశ్రుతిని కూడా పండితులు చెబుతారు, అంతలా ప్రసిద్ది పొందిన ఈ గాధ ప్రతి వర్షమున వినాయక చతుర్ధి రోజున పూజలో చెప్పుకోవడం కూడా మన భారతీయ సంస్కృతిగా అనాది నుండి వస్తుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

రాజసూయ యాగంలో శిశుపాలుని నూరో తప్పు

పాండవులు రాజసూయ యాగం చేస్తూ, ఆ యాగా ధర్మకర్తగా అగ్రపూజకు శ్రీకృష్ణుడుని ధర్మరాజు భీష్మాచార్యుల సూచనతో ఆహ్వానిస్తాడు. నిండుసభలో అగ్రపూజ అందుకోబుతున్న శ్రీకృష్ణుడిని అందుకు అర్హుడు కాదు అని శిశుపాలుడు అడ్డుపడి, శ్రీకృష్ణుడిని నానా దుర్భాషలాడుతాడు. శతతప్పుల వరకు వేచి చూస్తాను నూరవ తప్పు చేయగానే శిశుపాలుడిని సంహరిస్తానని శిశుపాలుడి తల్లికి మాట ఇచ్చిన శ్రీకృష్ణభగవానుడు, ఈ సభలో వందో తప్పు చేసిన శిశుపాలుడిని తన చక్రాయుధంతో సంహరిస్తాడు. ధర్మరాజు తన పూజని నిర్విఘ్నంగా ముగిస్తాడు.

బాల్యస్నేహితుడు అయిన కుచేలుడు కడు పేదరికంతో ఉండి, శ్రీకృష్ణ దర్శనార్ధం ద్వారకకు వస్తాడు. వచ్చిన చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణుడు కోసం అటుకుల మూట తీసుకువస్తాడు. సభలో శ్రీకృష్ణుడుచేత సేవలు పొందుతున్న కుచేలుడు తెచ్చిన అటుకులు ఇవ్వడానికి మొహమాటపడితే, శ్రీకృష్ణ భగవానుడు ఆ అటుకులను అభిమానంతో ఆరగిస్తున్నా కొలది కుచేలుడుకి దరిద్రం పోయి, అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.
మాయాజూదంలో ఓడిన పాండవ ధర్మపత్నిని నిండుసభలో ఘోర అవమాన ప్రయత్నంలో భాగంగా దుస్శాసునుడు ద్రౌపది వస్త్రపాహరణ దుశ్చర్యకు పాల్పడతాడు. ఆపదలో ద్రౌపది ప్రార్ధనని ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు, ద్రౌపదికి చీరలిచ్చి ఆమెకు రక్షణ కల్పిస్తాడు. కురుపాండవుల మధ్యలో యుద్ధం అనివార్యమైన స్థితిలో ధర్మరాజువైపు నిలబడి, ధర్మరాజు వైపు రాయభారిగా సుయోధనుడికి హితవు చెప్పినా వినని పరిస్థితులలో యుద్దానికి దారితీస్తుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna

కురుక్షేత్రం అధర్మం ధర్మం మధ్య యుద్దం

కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో అద్బుతమైన ఘట్టం అక్కడే దుష్ట శిక్షణ శిష్ట రక్షణతో జరగడానికి ముందు లోకానికి అవసరమైన జ్ఞానాన్ని అర్జున విషాదయోగం ద్వారా భోదించాడు. భావంతుడి నోట భక్తుడికి చేసిన గీతపోదేశం భగవద్గీతగా జగద్విఖ్యాతి చెందింది. యుద్ధం రాజధర్మం కనుక నీవు రాజ్యాన్ని పాలించే రాజువి కాబట్టి నీ కర్తవ్యం ధర్మ రక్షణ చేయడం, అటువంటి ధర్మరక్షణలో తనకుమాలిన ధర్మంతో ఉంటావో నీకర్తవ్యమెరిగి ధర్మరక్షణ చేయుదువో నిర్ణయించుకో, ఫలితం నాకర్పించు, నీ పని నీవు చేయి అని తేల్చి చెబుతాడు. మోహం తొలగిన అర్జునుడు యుద్ధం ప్రారంభిస్తాడు.

యుద్దంలో భీష్మ పితామహ యుద్దానికి నిలబడలేకపోయిన అర్జునుడి ముందు శిఖండిని రప్పించే సూచనా, ద్రోణాచార్యులతో అస్త్ర సన్యాసం చేయించడానికి ధర్మరాజుతో అశ్వత్దామా అనే ఏనుగు మరణవార్తని, అశ్వత్దామా మరణించాడు అని గట్టిగా వినబడేలాగా ఏనుగు అని మెల్లగా చెప్పించిన శ్రీకృష్ణ భగవానుడు దృతరాష్ట్రుడి కుటిల బుద్దిని కనిపెట్టి, అతని భారి నుండి భీముడిని కాపాడి, గాంధారి చేత శాపానుగ్రహం పొందుతాడు. యదువంశంలో వారిలో వారే కలహించుకుని యదువంశం నశిస్తుందని. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna.

గాంధారి, మునుల శాపం వలన యదుయోధుల కలహం, వంశ క్షయం.

మునుల శాప ఫలితంగా యదువంశంలో ముసలం పుడుతుంది, ఆ ముసలం అరగదీసి సముద్రంలో కలిపేస్తారు యదుయోధులు. అయితే కొన్నాళ్ళకు సముద్రపు ఒడ్డులోనే మద్యం సేవించి ఒకరితో ఒకరు కలహించుకొని యదుయోధులు మరణిస్తారు. బలరాముడు సముద్రంలోకి వెళ్తాడు. ఒక కిరాతుడు అటుగా వస్తూ ఉంటే ముసలం ముక్క దొరుకుతుంది. ఆ ముక్కని బాణానికి పెట్టి జింక అనుకుని పొదలలో పడుకుని ఉన్న శ్రీకృష్ణ భగవానుని బొటనవేలుని కొడతాడు. తప్పు తెలుసుకున్న ఆ కిరాతుడు వచ్చి శ్రీకృష్ణ భగవానుడి కాళ్ళ మీదపడి జింక అనుకుని మీపాదానికి గురిపెట్టి కొట్టానని చెబుతాడు.

అందుకు శ్రీకృష్ణుడు మానవుడుగా పుట్టిన ప్రతిజీవి ఎదో ఒక సమయంలో చేసిన కర్మలకు ఫలితం అనుభవించాలి. త్రేతాయుగంలో నేనేరాముడుని నీవు వాలివి, నే నిన్ను సుగ్రీవుడు కోసం చెట్టుచాటు నుండి బాణంతో కొట్టాను. ఆ కర్మఫలితం ఇప్పుడు నీద్వారానే నాకు తీరిపోయింది. అని చెప్పి, అవతారం చాలిస్తాడు, శ్రీకృష్ణభగవానుడు.

మనసు, బుద్ది ప్రధానంగా సాగే సంసారంలో బుద్ది బలం యొక్క గొప్పతనం ధర్మాన్ని పట్టుకుంటే ధర్మంద్వారా ధర్మాన్ని పట్టుకున్నవారికి భగవానుడు రక్షణ చేస్తాడు, అని నిరూపిస్తూనే భగవానుడు అయినా మనిషిగా అవతరిస్తే కర్మశేషం అనుభవించాల్సిందే అనే సందేశం ఈచిత్రంలో కనబడుతుంది. రామావతారంలో జాంబవంతుడుకి ఇచ్చిన మాట, ధర్మంవైపు నిలిచిన సుగ్రీవునికి సహాయం చేయడానికి, జాతిధర్మం ప్రకారం వాలిని చెట్టుచాటు నుండి కొట్టిన ఫలితం కారణంగా, కృష్ణావతారంలో అదే వాలి కిరాతుడుగా పుట్టి బాణంతో పొదలమాటున నిద్రిస్తున్న కృష్ణుడు పాదంపై బాణప్రయోగం చేస్తాడు. అసలు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుట్టడం కూడా అంతకుముందు జన్మలలో వారికి భగవానుడు ఇచ్చిన వరమే. అలాగే యశోద దగ్గర పరమాత్మ పాలు త్రాగడానికి కూడా గత జన్మల్లో ఆమె చేసుకున్న పుణ్యఫలమే అని పండితులు చెబుతూ ఉంటారు.
కృష్ణావతారం గాధలు లీలలతో నిండి ఉంటే ఆ లీలలు ఏవయసు వారికి ఆ వయసుకు తగ్గట్టుగా మంచిని సూచిస్తూ ఉంటుంది. Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

పరమానందయ్య శిష్యులు కధ

పరమానందయ్య శిష్యులకధ సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie శ్రీ దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పరమానందయ్య  శిష్యుల కద చిత్రం- సి పుల్లయ్య దర్శకత్వంలో నాగయ్య, ఎన్టిఆర్, పద్మనాభం, అల్లు రామలింగయ్య, రాజబాబు తదితరులు నటించారు.

సహజమైన నవ్వు ఆరోగ్య స్థితిని తెలియజేస్తూ ఉంటే, బుద్దిహీనతతో చేసే పనుల వలవ వచ్చే నవ్వులతో కూడిన హాస్యకదాచిత్రము పరమానందయ్యా శిష్యుల కధ ‘Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie’. కధ ప్రారంభంలో స్త్రీలోలుడైన మహారాజు (ఎన్టిఆర్) ఎప్పుడు రాజనర్తకితోనే గడుపుతూ ఉంటాడు, కానీ రాజ్యవ్యవహారాలు పట్టించుకోడు. అటువంటి మహారాజుకి రాజగురువుగా ఉన్న పరమానందయ్యా (నాగయ్యగారు) గారు హితబోధ చేస్తూ శివపూజని చేయండి, శివుడు సకల శుభాలని ఇచ్చే దైవమని చెబుతారు. వ్యసనం ఉన్నా పెద్దలంటే గౌరవం, దైవమంటే భక్తీ భావన మనసులో సహజంగా ఉండడం వలననేమో, శివపూజ చేస్తానని మహారాజు పరమానందయ్యా గారికి మాట ఇస్తాడు.

భావనలే ప్రధానంగా ఉంటే వాటి ప్రభావం పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటాయి.

ఎన్ని శక్తులు ఉన్న తొందరలో బుద్దిబలం తగ్గుతుంది, అలాగే కాని కోరిక వలన స్థితి మారుతుంది. అని చిత్రలేఖ విషయంలో కనబడితే, ఆమె పరమశివుడి భక్తురాలు కావడం వలన కాలంలో కలిగిన కష్టానికి తోడుగా మరో శివభక్తుడి ద్వారా ఆశ్రయం లభించింది. మానవజాతి అంటే చులకన భావంతో ఉన్న చిత్రలేఖ అదే మానవునితో వివాహ జీవనం కొనసాగిస్తుంది. చూసే దృష్టిలో తేడా ఉంటే, వచ్చే కష్టాలు కూడా ఆ దృష్టితోనే ముడిపడి ఉంటాయి. అని ఇక్కడ అర్ధం అవుతుంది. Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie.

శివునికి అర్చించేవారిలో మానవులు మరియు భూమిమీద నివసించే వారే కాకుండా దేవతలు కూడా శివుని పూజిస్తూ ఉంటారు. అలా గంధర్వ కన్య అయిన చిత్రలేఖ పరమశివుని భక్తురాలు. ఈశ్వరేచ్చ వలననే లోకాల్లో స్థితిగతులు మారుతూ ఉంటాయి. అకారణంగా గందర్వకన్య అయిన చిత్రలేఖ భూలోకం వచ్చి జలక్రీడలు ఆడుతుంటే, అక్కడికి అనుకోకుండా వచ్చిన ఋషి అనుయాయులను చూసి, చిత్రలేఖ వారిని శపిస్తుంది. అయితే చిత్రలేఖ ఊహించిన తలంపు లేని ఋషి అనుచరులు, తమ ఋషి రాగానే మొరపెట్టుకుంటారు.  తప్పు తెలుసుకున్న చిత్రలేఖ తనవివాహం అయినవెంటనే మునులకు శాపవిమోచనం అవుతుందని చెబుతుంది. అయితే మహర్షి కుడా ఆమెకు ఒక హెచ్చరిక చేస్తాడు. అదేమిటంటే ఇకపై నీవు భూలోకంలోకి వచ్చి ఏమానవునితో నైన మాట్లాడిన స్పర్శించినా శాశ్వతంగా మానవ కన్యగానే ఉంటావు అని చెబుతారు.

చిత్రలేఖ రాజమందిరంలోనే మానవ కన్యగా ఉండి, మహరాజునే వివాహమాడడం

ఇక ఆమె తన అనుచర కన్యలతో ఆకాశానికి వెళ్తుంది, కానీ శివుడు ఇచ్చిన రుద్రాక్ష మాలను అక్కడే కొలను దగ్గర మరిచి వెళుతుంది. శాపగ్రస్తులైన ఆ మునులు ఋషి సూచన మేరకు బుద్దిహీనులై పరమానందయ్యాగారి దగ్గర విద్యార్ధులుగా చేరతారు. అయితే అడవికి వేటకు వచ్చిన మహారాజు కొలనువైపు వస్తుండగా, దగ్గరలో కనబడిన రుద్రాక్ష మాలను గ్రహించి, తన రాజభవనానికి వెళతాడు. చిత్రలేఖ తనలోకం వెళ్ళాక శివుడి ఇచ్చిన రుద్రాక్షమాల గుర్తుకు వచ్చి, ఎక్కడ మరచినది గుర్తు చేసుకుని మరలా భూలోకం వచ్చికొలను పరిసరాలలో వెతుకుతుంది. అయితే తనకున్న దివ్యదృష్టిచేత ఆ రుద్రాక్ష మాలా ఎక్కడ చేరిందో గ్రహించి, అక్కడకు వెళ్లి రాజు దగ్గర రుద్రాక్ష మాలను గ్రహించడంలో రాజుని తాకడం వలన, మాట్లాడడం వలన ఋషి శాపానుగ్రహం చేత ఆమె భూలోక కన్యగా మారుతుంది.

మహారాజు గారి గురువు పరమానందయ్యా గారి సూచనతో, చిత్రలేఖ మళ్ళి దైవలోకం చేరే మార్గం గురించి ఆలోచన చేస్తూ ధ్యాసలో ఉంటూ ఉంటే మహారాజు ఆమెను వివాహచేసుకునే ఉద్దేశ్యంతో ఉంటాడు. “Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie” పరమానందయ్యా శిష్యులుగా వచ్చినా ఆ మునికుమారులు చేసే బుద్దిలేని పనులు చిత్రంగా ఉంటాయి. పరమానందయ్యాగారి దగ్గర శిష్యులు రాజమందిరంలో ఉన్న చిత్రలేఖకు మహారాజుకి పెళ్లిచేసి శాపవిమోచనం కావడంతో చిత్రకధ ముగుస్తుంది. అయితే బుద్ది హీనతతో మునికుమారులు చేసే పనులు తింగరగా ఉన్నాఆ పనుల వలన పరమానందయ్యాగారికి మేలునే చేస్తాయి. చిత్రం హాస్యంగానూ కధాపరంగా ఆసక్తిగాను సాగుతుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

భాగవతం తెలుగులోకి అనువదించిన భక్తపోతన తెలుగు చిత్రం

భక్త పోతన సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

అలనాటి మేటి చిత్రాల్లో భక్తపోతన భక్తీచిత్రం. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana Samskrutam nundi Telugulo Anuvadinchina Bhakta Potanaamaatyulu శ్రీకృష్ణుడు మహాభారతం నడిపించడానికి ద్వాపరయుగంలో ధర్మానికి అధర్మానికి యుద్దంలో ధర్మాన్ని రక్షించబూనిన వారికి మద్దతుగా ఉంటూ ధర్మ సంస్థాపన చేయడానికి అవతరిస్తే, ఆ మహాభారతాన్ని సంస్కృత రచన చేసిన వేదవ్యాసుడు, ఆ పరబ్రహ్మ లీలలను కూడా చెప్పదలచి భాగవతం కూడా రచనచేసి ఆత్మతృప్తిని పొందినట్టుగా శాస్త్ర పండితులు పలువురు ప్రవచన కారులు చెబుతారు. భాగవతం వింటే పుణ్యం కలుగుతుంది అని, మరీ భక్తిశ్రద్దలతో వింటే మోక్షమే ప్రాప్తిస్తుంది అని కూడా ప్రవచన కారులు వారి వారి ప్రవచనాల ద్వారా చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల చేత చెప్పబడుతున్న మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహానుభావుడు, తెలుగుజాతికి విలువైన భక్తీ గ్రంధాన్ని అందించిన బమ్మెర పోతరాజు గురించిన తెలుగు చలనచిత్రం చూడడం కూడా ఒక అదృష్టమే అంటారు. ‘BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

భాగవతమును తెలుగులోకి అనువదించిన మహానుభావుడు పోతనామాత్యుడు జీవితం ఆధారంగా తెలుగు చిత్రంగా మలిచిన మరో సినీమహానుభావుడు కె.వి. రెడ్డి(కద్రి వెంకటరెడ్డి)గారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన తెలుగుచలనచిత్రంలో పోతనగా చిత్తూరి నాగయ్య నటిస్తే, ఇంకా ముదిగొండ లింగమూర్తి, హేమలతదేవి, టంగుటూరి సూర్యకుమారి తదితరులు నటించారు. బమ్మెర పోతన జీవితంలో భాగవతం వ్రాయడానికి పురిగోల్పిన పరిస్థితులు, భాగవతం వ్రాస్తుండగా భగవానుడు సహకరించిన సన్నివేశాలతో చిత్రం BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana భక్తప్రదంగా సాగుతుంది.

వ్యాసభాగవతం ఆధారంగా తెలుగులో భాగవతం రచన ప్రారంభించిన భక్త పోతన

ఏకశిలానగరంలో శ్రీరామునిపై ప్రార్ధన పాటతో చిత్రం మొదలవుతుంది, అందరిని దైవ బిడ్డలుగా భావించే పోతనగారి ఔన్నత్యం ఆ పాట తరువాత కనిపిస్తుంది. కవిసార్వభౌమ శ్రీనాధుడు, పోతనామాత్యులు బావబావమరుదులు. శ్రీనాధుడి కూతురుకు, పోతన ఇంటిలోనే పెరుగుతూ ఉంటుంది. వారివురుకు వివాహం చేసే ఆలోచన కూడా ఉంటుంది. ఇంకా పోతన కూతురుతో భార్యాభర్తలు కలిసి ఇంటిలో ఉంటూ ఉంటారు. పోతన భక్తి పరిపక్వతకు వచ్చిందని పోతనను అనుగ్రహింప దలచిన భగవానుడు, ఆమాట సీతమ్మతల్లితో చెప్పి బయలుదేరతాడు. భోజనానికి కూర్చుండబోతున్న సమయానికి ఒక అన్నార్ది పోతన ఇంటికి వస్తాడు. వారు తమ భోజనం మాని, ఆ అతిథికి భోజనం కడుపునిండా పెట్టి పంపుతారు, పోతనామాత్యులు. ఇంటి బయటకు వచ్చిన ఆఅతిథి భగవానుడి రూపంలో అంతర్ధానం అవుతారు. పోతననే అనుగ్రహించిన భగవానుడు, పోతనకు శ్రీసీతారాములుగా కనిపించి, శ్రీమహాభాగవతముని తెలుగు అనువదించమని చెప్పి అంతర్ధానం అవుతారు.

పోతనామాత్యులు తనఇంటి పూజామందిరంలోనే, భగవానుణ్ణి అర్చించి, భాగవతం తెలుగులో రచన చేయడం ప్రారంభిస్తారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చేడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండేడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్యుత కవిత్వ మహాత్య పటుత్వ సంపదల్ లాంటి ఎన్నో మహిమాన్విత పద్యాలు భాగవతంలో పెక్కుగా ఉంటాయి.

గజేంద్రమోక్ష ఘట్టంలో పోతన వేషంలో పద్యరచన చేసిన శ్రీరామచంద్ర మూర్తి

గజేంద్రమోక్షం ఘట్ట రచనలో శ్రీమహా విష్ణువు వైకుంఠం నుండి ఉన్నఫలంగా బయలుదేరే సన్నివేశం వివరణ తోచని మహాకవి పోతనామాత్యులు, అయన కూతురు లక్ష్మిని అక్కడే పూజగదిలోనే కూర్చుండబెట్టి, గుడికి ఆలోచిస్తూ బయలుదేరతారు. పచార్లు చేసి ఆలోచనలతో తిరిగి ఇంటికి వచ్చిన పోతనామాత్యులకు గొప్ప విషయం తెలుస్తుంది. మరలా వ్రాయడానికి తాళపత్రం చూడగానే అందులో తాను వ్రాయదలచిన ఘట్టం వ్రాయబడి ఉంటుంది. ఎలా అనుకుండగా కూతురు లక్ష్మి మీరే కదా అలా వెళ్లి ఇలా వచ్చి పద్యం తట్టినది అని వ్రాసారు, అని చెబుతుంది. అప్పుడు అవగతం అవుతుంది  పోతనామాత్యులకు, తానూ బయటికి వెళ్ళాక, తన వేషంలో శ్రీరామచంద్ర మూర్తి వచ్చి శ్రీమహావిష్ణువు గజేంద్ర రక్షణార్ధం వైకుంఠం నుండి ఎలా బయలుదేరినది వివరించి వెళ్ళారని. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

విష్ణుభగవానుడి అవతార ఘట్టాలతో సాగే భాగవత రచన చేస్తున్న పోతనకు, పోతన కుటుంబ సభ్యలు సేవలు చేస్తూ సహకరిస్తూ ఉంటారు. పోతన భావమరిది అయిన కవిసార్వభౌమ శ్రినాధులు రాజాశ్రయంతో భోగభాగ్యాలతో ఉంటారు. అటువంటి సమయంలో పోతన రచన చేసిన ఒక పద్యం ఒకటిని శ్రీనాధకవిసార్వభౌముల వారు ఆ రాజుకి వినిపిస్తారు. ఆ పద్యం విన్న రాజుగారు పోతనను సత్కరింపదలుస్తారు. అలాగే ఆ భాగవతమును తనకు అంకితం ఇవ్వవలసినదిగా పోతనకు చెప్పమని, రాజుగారు బహుమానాలు శ్రీనాధకవిసార్వభౌముడితో పంపిస్తాడు. పోతనకు నేచెప్పి ఒప్పించెదనని పలికిన కవిసార్వభౌమ శ్రీనాధులు, పోతనకు ఇంటికి వస్తారు.

భాగవతం రాజుకి అంకితం ఇవ్వవలసినదిగా శ్రీనాధకవిసార్వభౌమ పోతనని అడుగుట

పోతనతో భేటి అయిన కవిసార్వభౌమ శ్రీనాధులు వారు, రాజుగారి తలంపును పోతనతో చెబుతారు. అందుకు పోతనామాత్యులు ఆరచన నాదైతే కధా ఆభాగవతం శ్రీరామంకితం నేను రాజుకి అంకితం ఇవ్వటానికి నాది అను కావ్యమేది లేదని చెబుతారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా పోతన మాటకే మద్దతుగా నిలబడతారు. పోతనామాత్యుల వారి మాట శ్రీనాధ కవికి, రాజుకి కూడా రుచించవు. రాజుగారి దగ్గర నుండి తనకు వచ్చిన బహుమానాలు పేదవారికి దానం చేస్తూ, పోతనామాత్యుల ఉంటుండగా, రాజపరివారంతో శ్రీనాధ కవిసార్వభౌములవారు పోతన ఇంటికి వస్తారు.

రాజుగారికి భాగవతం అంకితం ఇస్తావా సరే లేకపొతే నా కూతురు కూడా నీకు కోడలు కాదని హెచ్చరిస్తాడు, శ్రీనాధుడు పోతనని. కొడుకు కోసం ఒప్పోకోమని పోతన భార్య వేడుకున్నా, పోతనామాత్యుడు భాగవతం భగవంతుడి సొత్తు, అంకితం ఇవ్వడానికి నేనేవ్వరనే సమాధానమే చెబుతారు. ఇక చేసేది లేక శ్రీనాధకవిసార్వభౌమ పోతన కుటుంబానికి ఆలోచన చేసుకుని చెప్పమని కోరతాడు. ఆరోజు అంతా దుఃఖంతో మునుగుతుంది. ఆకష్టాలలో రాజుకు అంకితం ఇవ్వమనే ప్రోత్సహకానికి పోతనామాత్యులు ఎక్కడ లొంగుతారు అనో ఏమో సాక్ష్యాత్తు సరస్వతీ మాతే పోతన నట్టింట విలపిస్తూ కనబడడం భక్తీ హృదయాన్నే తాకుతుంది. ఆఅమ్మకు ఈ బిడ్డడు మాట ఇచ్చి, అమ్మ కన్నీరు తుడిచి, తన కుటుంబం కన్నీరుకు కారణంగా ఉంటారు పోతనామాత్యులు. కవిసార్వభౌమ శ్రీనాధులను పోతనగారు శ్రీమద్భాగవతం రాజుకి అంకితం ఇవ్వబోనని తేల్చి చెప్పి పంపుతారు. శ్రీరాముడినే నమ్ముకుని ఉన్న పోతనామాత్యులు భాగవత రచనని కొనసాగిస్తూ ఉంటారు.

పోతనామాత్యుల మాటను రాజధిక్కారంగా భావించిన ఆ రాజు, పోతనను దుర్హహంకారిగా జమకట్టి, సేనాధిపతిని సైన్యంతో పోతన ఇంటికి వెళ్లి భాగవతం తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. పరమరామ భక్తుడు అయిన పోతనామాత్యులు భగవదారాధనతో ఉంటుండగా, రాజ సేనాని రాజభటులతో పోతన ఇంటికి రావడం జరుగుతుంది. ఏకశిలానగరంలో పోతనామాత్యుల ఇంటిముందుకు వచ్చిన రాజభటులకు శ్రీఆంజనేయ స్వామి కనబడగానే, వారు రామభజన చేస్తూ పారిపోతారు. రాములవారి గుడిలో దీపారాధనని అవమానించిన వ్యక్తికి, ఆంజనేయస్వామి బుద్ది చెప్పుతాడు.

సీతమ్మ దయతో వందలమందికి పంచభక్ష్య పరవన్నాలతో ఆతిధ్యం ఇచ్చిన పోతనామాత్యుల కుటుంబం.

పోతన పేదరికం అంటే చిన్నచూపు చూపే పోతన బావగారు అనేకమంది తన తోటి పండితులను పోతనామాత్యుల ఇంటికి అతిథులుగా ఆతిధ్యం కోసం తీసుకువస్తాడు. ఇంట్లో ఒక బియ్యం గింజ లేని సమయంలో అతిధులు రావడం, పోతనామాత్యుల భార్య సీతమ్మతల్లిని ప్రార్ధన చేయడంతో, అమ్మ అనుగ్రహంతో పోతనామాత్యుల కుటుంబం వచ్చిన అతిథులకు పంచభక్ష్య పరవన్నాలతో ఆతిధ్యం ఇస్తారు. ఆతిధ్యం స్వీకరించిన పండితులంతా పోతనతో సమావేశమై నన్నయ్య, తిక్కన భారతం అంకితం ఇచ్చారని, అలాగే మీరు ఇవ్వవలసినదిగా సూచన చేస్తారు. అయినా పోతనామాత్యుల వారు భగవత్పరమైన భాగవతమును ఎవరికీ అంకితం ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పుతారు.

పండితుల మద్య వాదనకు దిగిన శ్రీనాధ కవిసార్వభౌమ భాగవత దూషణ చేయబోతు, గజేంద్ర మోక్షంలో పరుగు పరుగున వచ్చిన విష్ణుమూర్తి అలా రావడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. ఇదంతా వినోదంగానే తలపిస్తుంది అని అంటుండగా అంతలోనే ఇంటిబయట ఆడుకుంటున్న శ్రీనాధుడి కూతురుకి ఎదో అయ్యింది అని అరుపు వినగానే అందరూ గబాగబా బయటకి వస్తారు. వెంటనే పోతనామాత్యులవారు సన్నివేశం గుర్తు చేస్తూ, ప్రేమానుభందాలు కలిగిన మనమే ఇంత అల్లాడితే, మరి భగవంతుడు ఇంకెంత అల్లాడుతూ భక్తుల కోసం తపిస్తూ ఉంటాడు అని అనగానే, శ్రీనాధ కవిసార్వభౌమతో సహా వచ్చిన పండితులంతా పోతనకు నమస్కరించినిలబడతారు. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

ఇక రాజు శింగభూపాలుడు పోతనకు రాజ్య బహిష్కరణ విధిస్తారు. కట్టుబట్టలతో కుటుంబం రాజ్యాన్ని విడిచివెళ్ళాలని రాజు ఆజ్ఞాపించడంతో బమ్మెర పోతనామాత్యులు కుటుంబంతో సహా కట్టుబట్టలతో ఊరు వదిలి బయలుదేరతారు. అయితే పోతనామాత్యులు రచన చేసిన భాగవత గ్రంధం పోతనామాత్యుల పూజగదిలోనే ఉంటుంది. పోతనామాత్యులు ఊరు వదిలి వెళ్ళాక శ్రీమద్భాగవత గ్రంధాన్ని తీసుకొని పోదలిచిన రాజభటుల ప్రయత్నాలు విఫలం అవుతాయి. అయితే ఆఖిరికి సేనాధిపతి కూడా శ్రీమద్భాగవత గ్రంధ దరిదాపులకు చేరలేక పోతాడు. ఈ విషయం రాజుకి నివేదించగా రాజు పోతనామత్యుడి ఇల్లుని కూలగొట్టమని ఆజ్ఞాపిస్తాడు.

అందరి సమక్షంలో భాగవతాన్ని భగవంతుడికి అర్పించిన పోతనామాత్యులు

రాజభటులు పోతనామాత్యుల ఇంటిని కూలగొడుతున్న కొలది రాజభవనాల్లో ప్రకంపనలు వచ్చి, రాజు భయకంపితుడు అవుతాడు. ఇదంతా పోతనామాత్యుల భక్తీ ప్రభావమేనని తెలుసుకుని పోతనామాత్యుల వద్దకు వచ్చి బమ్మెర పోతన కాళ్ళపై పడతాడు రాజు. చివరికి రాజు సమక్షంలో శ్రీసీతారాములకే భాగవతం సమర్పిస్తారు, బమ్మెర పోతనామాత్యులు. ఎన్ని కష్టాలు కలిగిన ఓర్చుకుని భాగవతాన్ని భగవత్పరం చేసిన ఘనుడుగా పోతనామాత్యులని రాజు కొనియాడతాడు. “BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana”

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

పవన్ కళ్యాణ్ మూవీస్

తెలుగు తెరపై అగ్ర కధానాయకుడుకి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చి గోకులంలో సీతతో జతకట్టి సుస్వాగతం అంటూ కొత్త సంవత్సరం ప్రారంభించి తొలిప్రేమతో ఆకట్టుకుని తమ్ముడుగా బద్రి ఖుషి చేసుకుని, జానీతో తననితానే కొత్తగా పరిచయం చేసుకుని గుడుంబా శంకర్ గా బాలు బంగారంతో అన్నవరంతో జల్సా చేసుకుని పులితో తీన్ మార్ చేసిన పవన్ పంజా గబ్బర్ సింగుతో తనకితానే సాటి అనిపించుకుని కెమెరామేన్ గంగతో రాంబాబుగా వచ్చి అత్తారింటికి దారేది గోపాలా గోపాల అన్న సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడుల అజ్నతవాసిగా వచ్చి ప్రస్తుతం తెరనుండి కాకుండా నేరుగా ప్రజల్లో వెలుగుతున్న పవర్ స్టార్.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ ఫస్ట్ ఫిలిం.

మెగాస్టారు చిరంజీవి చినతమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తెలుగుచలనచిత్రంతో ఆంధ్ర-తెలంగాణా రాష్ట్ర ప్రజలకు తెరపై పరిచయం అయ్యారు. 1996 లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో చిరంజీవి సోదరుడు హీరో అయితే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ హీరొయిన్ గా నటించారు. ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. కాలేజీ ప్రేమకధ ఊరిలో పెద్దల పట్టుదల మద్య ప్రేమికులుగా కళ్యాణ్ – సుప్రియలు నటించారు. ఈచిత్రానికి పవన్ పేరు కళ్యాణ్ గానే పరిగణించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం పవన్ కళ్యాణ్ కి కళ్యాణ్ గా తొలి చిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

తమిళంలో హిట్టైన గోకులత్తిల్ సీత చిత్రం ఆధారంగా తెలుగులో పునర్మించిన చిత్రం గోకులంలో సీత, ఈ చిత్రానికి దర్శకుడు ముత్యాల సుబ్బయ్యగారు. పవన్ కళ్యాణ్ రెండవచిత్రంలో రాశి కధానాయకగా హరీష్ సహానటుడుగా నటించిన తెలుగు చలన చిత్రం. కేవలం సుఖాల వెంట తిరిగే వ్యక్తి, తన స్నేహితుడి కోసం పెళ్లిపీటల మీద నుండి అమ్మాయిని తీసుకువచ్చాక, స్నేహితుడు కాదంటే, ఆ అమ్మాయికి ఆశ్రయం కల్పించి, ఆ అమ్మాయి సహవాసంలో చెడుసావాసలకు దూరమయ్యే డబ్బున్నవ్యక్తిగా, ఆమెను ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నటించారు.

పవన్ కళ్యాణ్ మూడవ తెలుగుచలనచిత్రంగా సుస్వాగతం తెలుగుచలనచిత్రం కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువ ప్రేక్షకులకు ప్రేమసందేశాన్ని అందించారు. ఆకర్షణ అనో ప్రేమ అనో యువత సమయం వృదా చేసుకోరాదు, అలా చేసుకున్న యువకుడు జీవితం ఎలా ఉంటుందో ఈచిత్రం ద్వారా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుగారు చక్కగా చూపించారు. ప్రేమించే తండ్రి, ప్రాణమిచ్చే స్నేహితుల మద్యలో ఒక యువకుడు ఒక యువతి ప్రేమకోసం, ఆమె అంగీకారం కోసం నాలుగు సంవత్సరాలు వేచి ఉండే యువకుడు పాత్రలో పవన్ నటన చక్కగా ఉంటే, పాటలు మంచి ప్రజాదరణను పొందాయి. ఆలయాన హారతిలో ఆఖిరి చితిమంటలలో అంటూ చిత్రం ఆఖరున వచ్చే పాట కంటతడి పెట్టించే సన్నివేశాలతో ఉంటూ ఆకట్టుకుంటుంది.

తొలిప్రేమ ప్రేమకధా చిత్రాలలో ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ తెలుగుచలనచిత్రం

Power Start Pawan Kalyan Telugu Movies List

సుస్వాగతం చిత్రంతో యువతకు మంచి మెసేజ్ అందిస్తే, తొలిప్రేమ చిత్రంతో లక్ష్యం ఎంత గొప్పదో నిజమైన ప్రేమ ఏమి చేస్తుందో తొలిప్రేమ చిత్రం ద్వారా మధ్యతరగతి కుటుంబ భావనలతో సాగే చిత్రం యువతను బాగా ఆకర్షిస్తే, ఆ చిత్రం నిదానంగా సాధించిన విజయం ఇప్పటికి ఆ చిత్ర దర్శకుడుకి అంతటి స్థాయిలో పేరు తెచ్చిన చిత్రం మరేది రాలేదు. కుటుంబంలో అఖిరి కొడుకుగా నాన్నతో చివాట్లు తింటూ పెదనాన్న అభిమానంతో సరదాగా స్నేహితులతో గడిపేస్తూ ఉండే అబ్బాయి మదిలో అలజడి సృష్టించిన ఒక దీపావళి తెల్లవారుజాము అతని జీవితాన్నే ఏవిధంగా మలుపు తిప్పిందో చిత్రం చూస్తేనే బాగుటుంది. కొన్ని చిత్రాలకు విశ్లేషణ కన్నా వీక్షణ ఉత్తమం అలాంటి చిత్రాల్లో తొలిప్రేమ తెలుగుచలనచిత్రం ఒకటి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి, అలీ తదితరులు నటించగా ఏకరుణాకరన్ దర్శకత్వం వహించారు.

తమ్ముడు టైటిల్ కి తగ్గ పాత్రలలో నటించడం పవన్ చిత్రాల్లో మొదటి చిత్రం నుండి కనబడుతుంది. అలాగే తమ్ముడు చిత్రంలో కూడా ఆదర్శంగా ఉండే అన్నకి తమ్ముడుగా, అఖిరికి అన్నఆశయాన్ని నెరవేర్చే తమ్ముడుగా, ఎప్పుడు తండ్రితో తిట్లు తినే చిన్నవాడిగా ఉంటూ, చివరికి తండ్రి శభాస్ అనిపించుకునే కొడుకు పాత్రలో పవన్ నటన యూత్ కి అద్బుతంగా అనిపించింది. ఇంకా ఈ చిత్రంలో ప్రక్కనే ప్రేమ ఉన్నా పట్టించుకోకుండా పోకడలను పట్టుకుని ఆకర్షణని ప్రేమ అనుకుని తిరిగే కుర్రవాడిగా కూడా పవన్ చాలా చక్కగా నటించారు. చిరంజీవికి తగ్గ తమ్ముడుగా తమ్ముడు తెలుగుచలనచిత్రంతో పవన్ అందరితో అనిపించుకున్నారు. తమ్ముడు చిత్రానికి ఏఅరుణప్రసాద్ దర్శకత్వం వహించగా ప్రీతిజింగానియా, అదితి గోవిత్రికర్ హీరొయిన్లుగా నటించారు.

పవన్ కళ్యాణ్ బద్రి – ఖుషి సూపర్ డూపర్ హిట్ తెలుగు చిత్రాలు

Power Start Pawan Kalyan Telugu Movies List

బద్రి టైటిల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో పవన్ నటనే హైలైట్ ఈచిత్రానికి. నువ్వు నందా అయితే ఎవడిక్కావాలి నేను బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ డైలాగు పవర్ ఫుల్ డైలాగ్. ప్రకాష్ రాజు నందగా పవన్ బద్రిగా పోటిపడి నటించిన ఈ చిత్రానికి ప్రసిద్ద దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తిగా, ప్రియురాలితో పందెం కట్టి ఇంకొక అమ్మాయితో ప్రేమ నాటకం మొదలుపెట్టి, ఆ అమ్మాయితో ప్రేమలో పడడంతో ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కధ చిత్రంగా మారుతుంది. రేణుదేశాయ్, అమీషాపటేల్, అలీ తదితరులు నటించిన ఈతెలుగుచలనచిత్రం చక్కటి ప్రజాదరణను పొందింది.

ఖుషి తెలుగుచలనచిత్రం చూస్తున్నంతసేపు ఖుషిగానే చిత్రకధనం సాగుతుంది. చక్కటి కాలేజీ ప్రేమ కధకు ఇగో ఉన్న అమ్మాయి పాత్రదారి అయితే ఆ ప్రేమికుడు పడే పాట్లు ఈచిత్రంలో చాల చక్కగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ భూమిక ప్రేమికులుగా ఈచిత్రం అందరిని అలరించి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం నిలిచింది. ఫైట్లలో చిరంజీవి చిత్రాలు ప్రసిద్ది అయితే ఖుషి చిత్రం తరువాత చిరంజీవి తన చిత్రానికి కూడా ఫైట్ కంపోజ్ పవన్ కళ్యాణ్ చేయించుకోవడం విశేషం. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ జె సూర్య. పవన్ కళ్యాణ్ తారస్థాయిలో తీసుకువెళ్ళిన చిత్రం, ఖుషి తెలుగుచలనచిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

వరుస ఏడు హిట్ చిత్రాల హీరో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో భారి అంచనాల మద్య వచ్చిన జానీ తెలుగు చలనచిత్రం హాలీవుడ్ చిత్రానికి దగ్గరగా సగటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా నిలబడి, పవన్ కళ్యాణ్ మరియు పవన్ ఫాన్స్ కి నిరాశపరిచింది. రేణుదేశాయ్ పవన్ జంటగా వచ్చిన ఈతెలుగుచలనచిత్రం హాలీవుడ్ చిత్రం తరహాలో కధనం సాగుతూ సగటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా సన్నివేశాలు ఉంటూ భారిగా ఫెయిల్ అయిన చిత్రాల్లో చేరిపోయింది. ఖుషి వరకు ప్రతి చిత్రంతో అంచనాలు అందుకుంటూ అన్ని చిత్రాలతో అందరిని ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ జానీ చిత్రం విడుదల తర్వాత అంచనాలు తలక్రిందులు చేసింది.

ఇక అటుతరువాత వచ్చిన గుడుంబా శంకర్ తెలుగుచలనచిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించగా మీరాజాస్మిన్ జతగా నటించింది. ఈచిత్రం ఒక చిల్లర దొంగతనాలు చేసే దొంగగా, ఆపదలో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడి, ఆ అమ్మాయి ఆపదను తొలగించడానికి ఆ దొంగ పడేపాట్లు ఈ చిత్ర కధాంశం. అయితే గుడుంబాశంకర్ చిత్రం పవన్ కి తగ్గ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కాని పాటలు ప్రాచుర్యం పొందాయి.

తొలిప్రేమ దర్శకహీరోల కాంబినేషన్ బాలు తెలుగుచలనచిత్రంతో పునరావృతం అయ్యింది. బాలు తొలిప్రేమచిత్రంలో పాత్రపేరు, అదే టైటిల్ ఆ చిత్రదర్శకుడుతో వచ్చిన బాలు చిత్రంలో శ్రియ, నేహ ఒబెరాయ్ జతగా నటించారు. పాటలు ప్రజాదరణ పొందాయి, చిత్రం విజయవంతం అయినా పవన్ పూర్వస్థాయిలో విజయం సాధించలేకపోయింది అప్పటికి, అయితే చిత్రం రెండవభాగం బాగా ఆకట్టుకుంటుంది. మొదటి భాగం హాస్యభరితంగా సాగిన రెండవ భాగం కధనం బాగుంటుంది. అమ్మాయి కోసం అన్ని చేసే పెట్టె ఒక యువకుడు అనే అర్ధం వచ్చే లా బాలు టైటిల్ ట్యాగ్ లైన్ ఉంటుంది.

Power Start Pawan Kalyan Telugu Movies List

పవన్ కళ్యాణ్ బాలు తరువాత బంగారంగా ప్రేక్షకుల వద్దకు వచ్చారు. ప్రేమంటే పడని పని అంటే పడిపడి చేసే ఒక యువకుడు, సాటి యువతి ప్రేమ కోసం యుద్దమే చేస్తాడు. తన అవసరం తీరిన తనదారిన తాను పోకుండా, ఉపకారం పొందిన ఇంటిపెద్దకి ఇష్టం లేకపోయిన ఆ ఇంటి కూతురు ప్రేమని రక్షించి బంగారంగానే నిలబడతాడు. పాటలు చక్కగా ఉంటాయి, పవన్ కళ్యాణ్, మీరా చోప్రా, రీమసేన్ ప్రధానంగా నటించారు. ఈచిత్రంలో కేవలం ఇంకొకరి ప్రేమకోసం పాటుపడే కధానాయకుడుగానే ఉంటాడు, ప్రేమకోసం కాకుండా పనికోసం పాటుపడే యువకుడుగా పవన్ నటన బాగుంటుంది. Pawan Kalyan’s Eleventh Movie is Bangaram. ఈ చిత్రానికి దర్శకుడు తమిళ చిత్రాల దర్శకుడు ధరణి దర్శకత్వం వహించారు.

అన్నగా అన్నవరం ప్రేమికుడుగా తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్

చెల్లెలుపై మిక్కిలి మమకారం ఉన్న అన్నగా అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ చిత్రంలో నటించారు. చెల్లెలు అంటే అమితమైన అభిమానం ఉన్న అన్నయ్యగా ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించి, అక్కడ చెల్లెలు కాపురానికి అడ్డుగా ఉన్నసామజిక పరిస్థితులపై పోరాటం చేసి, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడే వ్యక్తులను అందుకు సహకరించే పెద్దమనుషులకు బుద్ది చెబుతాడు. సమాజంలో చెడు సాధారణ జీవితానికి ఎలా అడ్డంకిగా ఉంటుందో ఈ చిత్రంలో కనబడుతుంది. పవన్ కళ్యాణ్ అన్నగా నటిస్తే, అతడికి చెల్లెలిగా ప్రేమిస్తే ఫేం సంధ్య నటించింది. పవన్ కళ్యాణ్ కి జతగా అసిన్ నటించింది. సుస్వాగతం హీరోదర్శక కాంబినేషన్లో ఈతెలుగుచలనచిత్రం వచ్చింది. Annavaram Powerstar Pawan Kalyan’s Twelth Movie as hero.

Power Start Pawan Kalyan Telugu Movies List

Pawan Kalyan Thirteenth Film is Jalsa, Super Hit entertainer. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు చిత్రంలో నటించాల్సిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా తెలుగుచలనచిత్రంలో నటించడం విశేషం. ఈచిత్రం పవన్ అభిమానులకు ఖుషిలాగా జల్సా తెచ్చింది. పునరావాసం పొందిన నక్శలైట్ , కాలేజీలో చదువుకునే స్టూడెంట్ పాత్రలో పవన్ నటించారు. ఒక పోలీసు అధికారికి ఉన్న ఇద్దరి అక్కచెల్లెలికి ఒకే ప్రేమికుడుగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. ప్రకాష్ రాజ్ పోలీసు అధికారిగా నటిస్తే, పోలీసు అధికారి కూతుళ్ళుగా  ఇలియానా, కమిలినిముఖర్జీ నటించారు. పార్వతి మెల్టన్ ఇలియానాకు స్నేహితురాలుగా పవన్ కళ్యాణ్ అభిమానిగా నటించారు. ఈ చిత్రంలో పాటలు ప్రజాదరణ పొందాయి.

ఖుషి కాంబినేషన్లో హీరోదర్శకులతో పులి తెలుగుచలనచిత్రం వచ్చింది. పవర్ ఫుల్ పోలీసు ఆఫీసు పాత్రలో పవన్ నటన బాగున్నా చిత్రం ఆశించనంత విజయం సాధించలేకపోయింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జతగా నికిష పటేల్ నటించింది.

పులి తరువాత తీన్ మార్ చిత్రంలో పవన్ నటించారు. అమ్మాయితో మాట్లాడాలంటే సంవత్సరాల సమయం పట్టే కాలం, అమ్మాయితో రోజుల వ్యవధిలోనే తెగతెంపులు చేసుకునే కాలానికి పోల్చుతూ ఈ చిత్రంలో ఒకే సమయంలో రెండు తరాల ప్రేమకధలు కనిపిస్తూ కధనం సాగుతుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో త్రిష, కృతి కర్బందా పవన్ కళ్యాణ్ కి జతగా నటించారు. ప్రస్తుతంలో అందాలని ఆస్వాదిస్తూ ఉండే యువకుడు గడిచిన ప్రేమకధని వింటూ, తన జీవితంలో ప్రేమను పొందే యువకుడు కధగా ఈ చిత్రం ఉంటుంది. గతంలో ప్రస్తుతంలో ప్రేమకధలలో కధానాయకుడుగా పవన్ కళ్యాణ్ నటన బాగుటుంది. పాటలు బాగుంటాయి.

పవన్ పంజా గబ్బర్ సింగ్ చిత్రంలో

Power Start Pawan Kalyan Telugu Movies List

వివాదమైన న్యాయం ఉంటే ఆ వివాదానికి ప్రాచుర్యం లభిస్తుంది. పంజా చిత్రంలో ఒక క్రిమినల్ నిజాయతీ, అతని అంతరంగంలో ఉండే ఆవేదన చిత్రంలో పవన్ నటనలో కనబడుతుంది. యాక్షన్ త్రిల్లర్ గా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన పంజా చిత్రం కమర్షియల్ విజయం సాధించలేకపోయిన హీరో నటనపరంగా ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్, జాకిష్రాఫ్, సారా జేన్, అలీ తదితరులు నటించారు. జై పాత్రలో పవన్ నటనతో ఈచిత్రంలోమెప్పించారు. తనను చేరదీసిన యజమాని కొడుకు దురాగతాలను అడ్డుకోవడానికి, యజమానిపై ఉండే విశ్వాసానికి ప్రతీకగా ఒక నేరస్తుడు మదిలో మెదిలే సంఘర్షణ యాక్షన్ త్రిల్లర్ గా ఈ చిత్రంలో ఉంటుంది.

హిందీలో విజయవంతమైన చిత్రం ఆధారంగా ఒక తిక్క పోలీసు ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ధియేటర్లో కూర్చున్న వ్యక్తి విరామం కోసం వేచి చూడకుండా దృష్టి తెరపైనే ఉంచగలిగే కధనం ఉంటే ఆ చిత్రం సూపర్ హిట్టే. గబ్బర్ సింగ్ చిత్రం చూస్తున్నంత సేపు చిత్రంలో లీనమవ్వడమే ఈ చిత్ర కధనం తిక్క పోలీసు ఆఫీసర్ నటన ప్రత్యేకత. పవన్ కళ్యాణ్, శృతిహసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది డైలాగ్ ప్రసిద్ది చెందింది. పాటలు అన్ని ఆకట్టుకునే విధంగా చక్కగా ఉంటాయి. తిక్క పోలీసు ఆఫీసర్ ప్రేమ కధలో పవన్ నటన ఆకట్టుకుంటుంది.

Power Start Pawan Kalyan Telugu Movies List

కెమెరా మేన్ గంగతో రాంబాబుగా టివి విలేకరిగా పనిచేస్తూ సమాజ సేవ చేసే బాద్యత కలిగిన పౌరుడుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించారు. రాంబాబు పవన్ కళ్యాణ్ అయితే గంగగా తమన్నా నటించింది. ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో రాజకీయంగా అతని ఆకృత్యాలను అడ్డుకునే టివి విలేఖరిగా, చివరికి అతనిపై పోరాటానికి యువతలో చైతన్యం కలిపించి పోరాడే పాత్రలో పవన్ నటిస్తే, ప్రతిపక్ష నాయుకుడు కొడుకుగా ప్రకాష్ రాజ్ నటించారు. బద్రి దర్శకహీరో కాంబినేషన్లో కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం రావడం విశేషం. సామాజికమైన అంశాలకు సహజంగా స్పందించే వ్యక్తిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. ఇప్పుడు సమాజ సేవకోసం రాజకీయాలలోకి వచ్చి జనసేనపార్టికి నాయకత్వం వహిస్తున్నారు.

సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది అంటూ అందరిని అలరించిన పవన్ కళ్యాణ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ తెలుగుచలనచిత్రంగా నిలించింది. జల్సా దర్శకహీరో కాంబినేషన్లో ఈచిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రేమకోసం ఇంటినుండి దూరంగా ఉంటున్న అత్తకోసం అల్లుడు పడేపాట్లు, అత్తకూతుళ్ళతో ఆటలు ఈచిత్రం సాగి, చివరికి సెంటిమెంట్ సన్నివేశంతో అందరిని ఆకట్టుకుంటుంది. అత్తగా నదియా నటిస్తే, మరదళ్ళుగా సమంతా, ప్రణీత నటించారు. ఒక మిల్లినియర్ పాత్రలో పవన్ నటన ఈ చిత్రానికి హైలైట్. పాటలు, కధనం, సెంటిమెంట్, కామెడీ అన్నింటితో అందరిని అలరించే అత్తారింటికి దారేది. నెట్లో సగం సినిమా లీక్ అయ్యిన సూపర్ హిట్ అయ్యిన చిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలయికలో వచ్చిన బహుతార తెలుగుచలనచిత్రం గోపాల గోపాల ఒక గోపాల భక్తుడు అయితే ఇంకో గోపాల దేవుడు. భక్తుడుగా వెంకటేష్ నటిస్తే, భగవానుడుగా పవన్ కళ్యాణ్ నటించారు. భక్తీ ముసుగులో కొంతమంది చేసే మోసాలను ఎండగడుతూ, పోరాడే ఒక భక్తుడు కోసం దిగివచ్చిన దేవుడుగా పవన్ ఈ తెలుగుచలనచిత్రంలో నటించారు. వెంకటేశ, శ్రియ భక్తులుగా నటించిన ఈ చిత్రంలో విష్ణువు అవతారం కృష్ణుడుగా పవన్ కళ్యాణ్ నటించి మెప్పించారు. హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించారు.

గబ్బర్ సింగ్ చిత్రానికి అనుకరణ చిత్రంగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది, కానీ గబ్బర్ సింగ్ స్థాయిలో ఈ చిత్రం విజయవంతం కాలేకపోయింది. ఎదురులేని ఒక వ్యక్తి నిర్మించుకున్న దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చి, అతని నుండి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిని, ఆమె ఆస్తిని రక్షించే పోలీసు పాత్రలో అలాగే ఆమెకు ప్రియుడుగా ఈ తెలుగుచలనచిత్రంలో పవన్ కళ్యాణ్ కనబడతారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పండిన హాస్యం ఈచిత్రంలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ కాజల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు.

Power Start Pawan Kalyan Telugu Movies List

కాటమరాయుడు అత్తారింటికి దారేది చిత్రంలో పాట పల్లవి, అదే పేరుతో ఒక ఊరి పెద్దమనిషి పాత్రలో పవన్ నటించారు. ఆడవాళ్లంటే పడని వ్యక్తిగా తమ్ముళ్ళతో కలిసి ఉంటాడు. అయితే అతని తమ్ముళ్ళ తమ ప్రేమ ఫలించాలంటే అన్నకూడా ప్రేమలో పడాలని, భావించి, అతని జీవితంలోకి అవంతిక అనే అమ్మాయి వచ్చేలా చేస్తారు. అమ్మయాలంటే ఇష్టంలేని పెద్దమనిషికి అవంతికతో ఎలా ప్రవర్తించడం, ఆ అమ్మాయి కుటుంబ సమస్యని పరిష్కరించడం కోసం చూడడం ఉంటుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ శ్రుతి హసన్ జంటగా నటించిన తెలుగుచలనచిత్రం కాటమరాయుడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడుసార్లు నటించిన పవన్ కళ్యాణ్

జల్సా చేసి అత్తారింటికి దారేది అంటూ అందరిని ఆనందింప చేసిన కాంబినేషన్ అజ్ఞాతవాసి తెలుగుచలనచిత్రంతో అభిమానులను నిరాశపరిచారు. తన తండ్రిని చంపినవారి ఆచూకికోసం తన కంపెనీలోనే ఒక ఉద్యోగిగా చేరి, వారిని తుదమొట్టించడమే ఈ చిత్ర కధాంశం. పవన్ కళ్యాణ్ కి జతగా కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

సత్యహరిశ్చంద్ర తెలుగు భక్తి చిత్రాలు

మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప చిత్రం

స్టార్ ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో టి.ఏ. రామన్ దర్శకత్వంలో హరిశ్చంద్ర తెలుగు చిత్రం 1930 దశకంలోనే వచ్చింది. ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి, పి కన్నాంబ, బందర్ నాయుడు, పులిపాటి వెంకటేశ్వర్లు, మాస్టర్ భీమారావు, ఆకుల నరసింహారావు, జె. రామకృష్ణారావు తదితరులు నటించారు.

ఇంకా రాజ్యం పిక్చర్స్ సమర్పణలో హరిశ్చంద్ర పేరుతోనే మరలా ఈ చిత్రం తెరకెక్కించగా, ఇందులో ఎస్వీ. రంగారావు, లక్ష్మిరాజ్యం, రేలంగి, గుమ్మడి, సూరిబాబు, రఘురామయ్య, ఏ.వి. సుబ్బారావు, గౌరిపతిశాస్త్రి తదితరులు నటించారు.

తర్వాత సత్యహరిశ్చంద్ర గాధ53 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, ఎస్ వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ తదితరులు నటించారు. సత్యహరిశ్చంద్ర చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించగా ప్రముఖ దర్శకులు కె.వి. రెడ్డి నిర్మాణదర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సత్యహరిశ్చంద్ర గాధని చిత్రంగా సంస్థ నిర్మించింది.

సత్యహరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాధనుండి తెలుగు తెరపై కె.వి. రెడ్డిగారు నందమూరి తారక రామారావుగారిని సత్యహరిశ్చంద్రగా చూపించారు. ప్రముఖ గాయని అయిన ఎస్ వరలక్ష్మిగారిని సత్యహరిశ్చంద్ర భార్యగా చంద్రమతిగా చూపించారు. తెలుగుతెర తొలి కధానాయకుడు అయిన నాగయ్యగారిని వశిష్ఠ మహర్షి పాత్రలో చూపించారు. ప్రముఖ నటుడు ముక్కామలగారిని మహర్షి విశ్వామిత్రుడుగా చూపిస్తూ, విశ్వామిత్ర ప్రధాన శిష్యుడు నక్షత్రకుడు పాత్రలో రమణారెడ్డి గారిని చూపించారు. కాశి పట్టణవాసిగా కాలకౌశికుడు పాత్రలో రేలంగి నరసింహారావుగారిని చూపిస్తూ, కాల కౌశికుడుకి గయ్యాళి భార్యగా గిరిజని చూపించారు. మిక్కిలినేని గారిని ఇంద్రుడుగా చూపిస్తూ పార్వతిపరమేశ్వరులుగా సబితాదేవి-ప్రభాకర్ రెడ్డిగార్లని చూపించారు. ఇంకా వివిధ పాత్రల్లో ఎల్ విజయలక్ష్మి, రాజబాబు, రాజనాల, రాజశ్రీ, వాణిశ్రీ, మీనాకుమారి, మోహన, చదలవాడ, బాలకృష్ణ మొదలైనవారు SatyaHarisChandra Movie నటించారు. ‘NTR Satya Harishchandra Full Story Telugu Movie’

ఇంద్రసభలో వశిష్ఠుడు-విశ్వామిత్రుల సంవాదం

ఆడినమాట తప్పని హరిశ్చంద్ర మహారాజు సూర్య వంశస్తుడుగా పరమశివ భక్తుడు. రాజసూయ యాగము చేసి యజ్నఫలాన్ని పొందిన హరిశ్చంద్ర మహారాజు ఆ యజ్నఫల మహిమ రాజ్యంలో ప్రజలందరికి కలగాలని రాజసభలో యజ్న ఫల దర్శన భాగ్యం అయోధ్య ప్రజలకు కల్పిస్తారు. పిమ్మట యజ్న ఫలం గొప్పతనం రాజర్షి దాత అయిన హరిశ్చంద్ర మహారాజు గురించి రాజవంశగురువు వశిష్ఠ మహర్షి సభకు తెలియజేస్తారు. అదే సభలో ఒక యోగి వచ్చి మహారాజు దగ్గర మాట ఆ యజ్నఫలాన్ని అర్ధిస్తారు. అంతటి మహిమ కలిగిన యజ్నఫలాన్ని ఆ యోగికి దానం చేసేస్తారు, హరిశ్చంద్ర మహారాజు. (అయితే ఆ నిష్కామయోగిగా వచ్చింది పరమశివుడే, యజ్నఫలాన్ని పట్టుకుని ఆ యోగి, హరిశ్చంద్ర మహారాజు పూజామందిరంలోకి వెళ్లి అంతర్ధానం అవుతారు. అక్కడ వాక్కులుగా  హరిశ్చంద్రుడు యొక్క సత్యనిష్ఠని పరీక్ష చేయదలచానని పరమశివుడు పార్వతిమాతతో పలకడం వినబడుతుంది.)

ఇంద్ర సభలో మహర్షులతో సమావేశమై ఉన్న దేవేంద్రుడు, సభలో మహర్షులతో అందరిని పేద, ధనిక బేదాలు లేకుండా అందరిని తరింపజేసే వ్రతం ఏదైనా సెలవియ్యండి అని అనగా…. విశ్వామిత్ర మహర్షి అందరికి తగిన ఏకైక వ్రతం ఏది లేదు అర్హతను బట్టి వారి వారి తాహతు బట్టి మాత్రమే వ్రతాలు వుంటాయి అని చెబితే, మహర్షి వశిష్టులు మాత్రం అందరూ ఆచరించి తరించగలిగే వ్రతం సత్యవ్రతం ఒక్కటే అని బదులు చెబుతారు. సత్యవ్రతం ఆచరింప అసాద్యం అని అందులోను మానవమాత్రులు ఆచరించడం అనేది కుదరదు. వారి జీవన విధానం రిత్యా మానవులు సత్యవ్రతం అసాద్యం అని మహర్షి విశ్వామిత్రులువారు చెబుతూ వశిష్ఠ మహర్షి ప్రతిపాదనని తోసిపుచ్చుతారు. వశిష్ఠ – విశ్వామిత్ర వాదనల పిదప దేవేంద్రులువారు అలాంటి సత్యవ్రతం చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని వశిష్ఠమహర్షిని అడుగుతారు.

అందుకు వశిష్ఠ మహర్షి సూర్య వంశస్తుడు త్రిశంకువు కుమారుడు అయిన సత్యహరిశ్చంద్ర మహారాజు గురించి చెబుతారు. ఆ మాటకు కూడా విశ్వామిత్ర మహర్షి ఇంకో వాదనను తీసుకువస్తారు. ఈ వశిష్ఠ మహర్షి హరిశ్చంద్ర వంశానికి గురువు కావున వశిష్టులు హరిశ్చంద్ర మహారాజు గురించి గొప్పగా చెబుతున్నారు అని అంటారు. ఇక ఇంద్ర సభలో దేవతలు, మహర్షుల సమక్షంలో విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్ర మహారాజు సత్యనిష్టతని పరిక్షిస్తానని అందులో హరిశ్చంద్ర మహారాజు కచ్చితంగా అసత్యమాడేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. అందుకు వశిష్ఠ మహర్షి ఒకవేళ సత్యహరిశ్చంద్రుడు అబద్దమాడితే నేను ఆచార బ్రష్టుడినై బ్రతుకుతాను అని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే విశ్వామిత్ర మహర్షి సత్యహరిశ్చంద్ర మహారాజుతో అసత్యవాక్కు పలికించలేకపోతే తన తపశక్తిలో సగభాగం సత్యహరిశ్చంద్ర మహారాజుకి ధారపోస్తానని, సహస్ర వర్షములు సకల చక్రవర్తిగా పరిపాలన చేస్తాడని, అంతేకాకుండా చిరకాలం 14 మన్వంతరముల వరకు దేవేంద్ర సింహాసనంలో సగభాగం కలిగి ఉండేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

విశ్వామిత్ర మహర్షి పరీక్షలో భాగంగా రాజ్యదానం చేసేసిన హరిశ్చంద్ర

స్వర్గం నుండి బూలోకం వచ్చిన విశ్వామిత్ర మహర్షి తన ప్రధాన శిష్యుడు నక్షత్రకుడుతో కలిసి అయోధ్యకు హరిశ్చంద్ర రాజసభకు వస్తారు. ఒక ఎత్తైన మదపుటేనుగుపై ఒక పహిల్వాన్ ఎక్కి అతను విసిరిన రత్నం ఎంత పైకి వెళితే అంత ధనరాశి కావాలి అంటారు. సాదారణంగా ఒకమహారాజు అంతధనము ఇవ్వడమంటే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడమే అవుతుంది. హరిశ్చంద్రుడుని అంత ధనము అడిగితే, రాజు సంకోచించి మాట వెనుకకు తీసుకుంటాడెమో అని ఆలోచన చేసిన మహర్షి అంత మొత్తం ధనమును హరిశ్చంద్ర మహారాజుని కోరతారు. అడిగిన వెంటనే అంతధనము మీదే పట్టుకుని వెళ్ళండి అని అన్న హరిశ్చంద్ర మహారాజు మాటకు విశ్వామిత్ర మహర్షి ఆ ధనమును అవసరమైనప్పుడు తీసుకుంటాను నీవద్దనే ఉండని అని చెప్పి, రాజ సభనుండి నిష్క్రమిస్తారు.

విశ్వామిత్రవెనువెంటనే తన మాయ సృష్టిద్వారా క్రూరమృగాలను సృష్టించి అడవులలో స్వేచ్చగా వదిలేస్తారు, ఆ మృగాలు అడవి నుండి ఊళ్లపైకి వచ్చి పడతాయి. ప్రజలు మొర ఆలకించిన హరిశ్చంద్ర మహారాజు క్రూర మృగాల వేటకు అడవికి వెళ్లి, వాటిని వేటడతారు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఇద్దరు స్త్రీలను సృష్టించి అడవిలో ఉన్న హరిశ్చంద్ర మహారాజు వద్దకి పంపిస్తాడు. ఆ స్త్రీలు హరిశ్చంద్ర మహారాజు ముందు ఆడి పాడి, మహారాజుని పెండ్లి చేసుకోవలసినదిగా కోరతారు. వారిని వారించిన వినని స్త్రీలను మహారాజు తన సైన్యం ద్వారా అడ్డుకుంటారు. వారు మరలా విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వచ్చి మొరపెట్టుకుంటారు.

మహర్షి ఆగ్రహంలో ఉండగా అక్కడికి హరిశ్చంద్ర మహారాజు వస్తారు. వచ్చి జరిగిన విషయం వివరిస్తారు. అయితే వరించిన తన కుమార్తెలను పెండ్లి చేసుకోవలసిందే అని చెబుతారు. (వివాహమహోత్సవంలో అందరిముందు అగ్ని సాక్షిగా చేసే మంత్రపూర్వక ప్రతిజ్ఞ ఉంటుంది. ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు కోరి వచ్చారు కదా అని ఆ స్త్రీలను వరిస్తే అసత్య దోషమే వస్తుంది.). అయితే ఇప్పుడు ఇప్పటికే అగ్నిసాక్షిగా సంతానం కోసమే వివాహమాడిన ధర్మపత్ని ఉండగా, ఈ స్త్రీలను వివాహమాడడం అధర్మమని హరిశ్చంద్ర మహారాజు చెబితే, అందుకు బదులుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, తపోధనుల మాట వినడమే రాజధర్మం అని చెబుతారు. రాజర్షి అయిన హరిశ్చంద్రుడు అటువంటి ధర్మం కలిగిన ఈ రాచరికం నాకు వద్దు అని రాజ్యదాననికే సిద్ధపడతారు. నిండు రాజసభలో సకల రాజ్యాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రకు ధారపోసి కట్టుబట్టలతో తన భార్య, కుమారుడుతో కలిసి రాజ్యాన్ని వదిలి అడవికి బయలుదేరతారు, సత్య హరిశ్చంద్రుడు. రాజ్యాన్ని వీడుతున్న రాజుని చూసి ప్రజలు విలపిస్తూ హరిశ్చంద్రుడుకి వీడ్కోలు పలుకుతారు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

హరిశ్చంద్రుడు రాజభోగాలను త్యజించి, తన భార్యాపిల్లలతో అడవులలోకి

మొదటగా విశ్వామిత్ర మహర్షికి దానం చేసిన సొమ్ము హరిశ్చంద్ర మహారాజు వద్ద ఉంటుంది, అయితే సకల రాజ్యం దానంగా ఇచ్చిన మహారాజు విశ్వామిత్రుడికి ముందుగా ఇచ్చిన దానం ఋణంగానే ఉంటుంది. రాజ్యం నుండి బయటకు వచ్చిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్ర మహర్షి తనకు దానంగా ఇచ్చిన సొమ్ము నీవద్దనే ఉంది, కావునా అది నీకు రుణమే ఆ ఋణం తీర్చుకో అని చెబుతారు. అందుకు హరిశ్చంద్రుడు నెలరోజులు గడువు కోరతారు. అయితే ఆ రుణనిమిత్తం అయోధ్య రాజ్యంలో కానీ, అయోధ్య సామంత రాజ్యాలలో కానీ సంపాదన చేయకూడదని విశ్వామిత్ర మహర్షి అజ్నపిస్తారు హరిశ్చంద్రుడిని.

అడవుల బారిన పడిన హరిశ్చంద్రుడిని అతని భార్య పిల్లలు అనుసరిస్తారు, అలాగే రుణ వసూలు కోసం నక్షత్రకుడు హరిశ్చంద్రుడుని అనుసరిస్తారు. అయితే అడవులలో కూడా నక్షత్రకుడు ప్రవర్తనకు తోడూ, వశిష్టుడుగా మారువేషంలో ఒక రాక్షసుడు వచ్చి, విశ్వామిత్ర మహర్షి మోసం నాకు తెలుసు నేను అతన్ని అంతం చేస్తాని, నీవు నీ రాజ్యాన్ని దక్కించుకో అని చెబుతాడు. దానికి సత్యహరిశ్చంద్రుడు దానం చేసిన రాజ్యాన్ని నేను పొందగోరను, అని బదులు చెబుతాడు. తరువాత దావాగ్ని దహించుకుంటూ అడవినలువైపులా నుండి హరిశ్చంద్రుడివైపు వస్తూ ఉంటుంది. NTR Satya Harishchandra Full Story Telugu Movie

అలా వస్తున్న అగ్నిదేవుడు నక్షత్రకుడుతో మీ నిజమైన పేర్లు మీవి కావు అని చెప్పినా మీకు ప్రమాదం ఉండదని చెపుతాడు. ఆ విషయం హరిశ్చంద్రుడుకి చెప్పి, తానూ బ్రహ్మర్షి విశ్వామిత్రుని శిష్యుడుని కాదు నాపేరు నక్షత్రకుడు కాదు అని చెప్పి, అగ్నిలోకి వెళ్లి, క్షేమంగా వచ్చేస్తాడు. అలా వెళ్లి వచ్చి హరిశ్చంద్రుడుని, అతని భార్య చంద్రమతిదేవిని కూడా ఆ పని చేయమంటాడు. పేర్లు తమవి కావు అని అనడమంటే అసత్యమే అవుతుంది. ఆ పని నేనుచేయననే చెబుతారు(కేవలమ పేరు తనది కాదు తాత్కాలికంగా నేను నేను కాదు అని చెప్పినా అసత్యదోషమే అవుతుంది అని భావించిన హరిశ్చంద్రుడు, వారి భార్య పిల్లలు). తరువాత చంద్రమతి దేవి ప్రార్ధనతో అగ్నిదేవుడు శాంతించి వెనుతిరుగుతాడు.

కాశీ పట్టణంలో భార్యా విక్రయం

ఇక అక్కడి నుండి బయలుదేరిన వారు కాశి పట్టణం చేరుకుంటారు. కాశి పట్టణంలో శ్రీమంతుల కొరకు దాసిలను విక్రయించే స్థలం ఉంటుంది. ఋణం చెల్లించవలసిన గడువు నేటితో తీరిపోతుంది అని అన్న నక్షత్రకుడు మాటలతో, హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి దేవి, తనను విక్రయించి ఆ ఋషి ఋణం గడువులోపు తీర్చేయండి అని సలహా హరిశ్చంద్రుడుకి సలహా ఇస్తుంది. అందుకు హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మలేను, నేనే దాసిగా అమ్ముడయ్యి, ఆ ఋణం తీర్చేస్తాను అని చెబుతాడు. అయితే అమ్మకంలో రుణానికి సరిపడా సొమ్ములు రాకపోతే, నీవు ఋణగ్రస్తుడుగానే మిగిలిపోతావు అని నక్షత్రకుడి మాటలకూ, హరిశ్చంద్రుడు అచేతనావస్థలో ఉంటారు. అప్పుడు చంద్రమతి దేవి తననే విక్రయించి, ఆ ఋణం తీర్చేయమని హరిశ్చంద్ర మహారాజుకి చెబుతుంది. గత్యంతరం లేని హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మడానకి కాశి పట్టణంలో అయిష్టంగా సిద్దపడతాడు.

కాల కౌశికుడు కాశిపట్టణంలో గయ్యాళి భార్య భాదలకు లోనవుతూ తద్దినాలకు వెళుతూ ఉంటాడు. అలాంటి కాలకౌశికుడుకి తోడుగా జడబట్టు ఉంటూ ఉంటాడు. తద్దిన భోజనానికి వెళ్ళిన కాల కౌశికుడు వేషంలో పరమశివుడే వచ్చి కాశిపట్టణ దాసీ విక్రయ స్థలానికి వచ్చి చంద్రమతి దేవిని కాలకౌశికుడుకి దాసిగా నక్షత్రకుడు అడిగిన రుణసొమ్మును చెల్లించి, చంద్రమతి దేవిని కాల కౌశికుడు ఇంటికి చేరుస్తాడు. దాసిగా అమ్ముడైన చంద్రమతిదేవితోనే వారి కుమారుడు లోహితాస్వుడు వెళతాడు. విశ్వామిత్ర మహర్షి ఋణం తీర్చుకున్న సత్యహరిశ్చంద్రుడుకి ఇంకో ఆపద్ధర్మ ఋణం వచ్చి పడుతుంది. ఇన్నాళ్ళు హరిశ్చంద్రుడు వెనుక తిరిగిన నక్షత్రకుడుకి బత్యం బకాయి పడతాడు, హరిశ్చంద్రుడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

నక్షత్రకుడి జీతం చెల్లించడానికి తనని అమ్మకానికి పెట్టమని హరిశ్చంద్రుడు నక్షత్రకుడుని కోరతాడు, అప్పుడు నక్షత్రకుడు కాశిపట్టణంలో సత్యహరిశ్చంద్రుడుని ఒక కాటికాపరి వీరబాహుకి అమ్మి వచ్చిన సొమ్ముతో వెనుతిరుగుతాడు. బానిసగా అమ్ముడుపోయిన హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేస్తూ ఉంటాడు. కాటికాపరి వీరబాహు చెప్పినట్టు, శవదహనానికి తగిన ధాన్యము, ధనము తీసుకుని ఆ పని చేస్తూ ఉంటారు, సత్యహరిశ్చంద్ర రాజర్షి.

కాటిదాకా వెళ్లిన విశ్వామిత్ర పరీక్ష

బానిసగా కాలకౌశికుడు ఇంట్లో పనిచేస్తున్న చంద్రమతి, లోహితాస్వులను, గయ్యాళి కాలకౌశికుడు భార్య భాదలు పెడుతూ ఉంటుంది. అందులో భాగంగా లోహితాస్వుడుని దర్బలకోసం కాలకౌశికుడు శిష్యులతో అడవికి పంపుతుంది, కాలకౌశికుడు భార్య, అక్కడ అడవిలో మాయసర్పం కాటుతో లోహితాస్వుడు మరణిస్తాడు. విషయం తెలిసిన చంద్రమతి దేవి లోహితాస్వుడు దగ్గరికి వెళ్లి విలపించి, కుమారుడి శవాన్ని పట్టుకుని కాటికి వెళుతుంది. కాని అక్కడ కాటికాపరి అయిన హరిశ్చంద్రుడు, శవదహన సొమ్ము చెల్లించనదే శవాన్ని కాల్చడానికి వీలులేదని అడ్డుకుంటాడు. భర్తని గుర్తుపట్టిన చంద్రమతిదేవి భర్త అసత్యదోషమేర్పడకుండా ఉండడానికి శవాదహన రుసుం తన యజమాని దగ్గర నుండి తీసుకువస్తానని మరలా కాలకౌశికుడు ఇంటికి బయలుదేరుతుంది.

అయితే విశ్వామిత్ర సృష్టిలో భాగంగా మాయ దొంగ, కాశి రాజు యొక్క కుమారుడుని చంద్రమతి వేషంలో ఎత్తుకొచ్చి అడవిలో వదిలి వెళ్ళిపోతారు. కాలకౌశికుడు ఇంటికి వెళ్తున్న చంద్రమతి దేవికి దారిలో పసిబిడ్డ ఏడుపు వినిపించి, ఆ పసిబిడ్డదగ్గరకి వెళుతుంది, అప్పటికే ఆ బిడ్డడు మరణించి ఉంటాడు. మాయదొంగని వెంబడించిన కాశి రాజు సైనికులు చంద్రమతిదేవిని బంధించి, కాశి రాజుదగ్గర నిలబెడతారు. బిడ్డ ఆమెవలననే మరణించింది అని భావించిన కాశి రాజు చంద్రమతిదేవికి మరణదండన విధిస్తాడు. ఆ మరణదండనను అమలు చేయవలసినదిగా వీరబాహుకి అప్పజేపితే, ఆపనిని వీరబాహు హరిశ్చంద్రుడుకి అప్పజేప్పుతాడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

కాటికాపరి వృత్తిరిత్యా హరిశ్చంద్రుడు తనభార్యని చంద్రమతిని వీరబాహు ఆదేశానుసారం హతం చేయడానికి సిద్దపడతాడు. అయితే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి వారించిన వినకుండా భార్య శిరస్సుని హరిశ్చంద్రుడు ఖండించబోతాడు. విశ్వామిత్రుడు ఓటమిని అంగీకరించినా చంద్రమతి శిరస్సుని ఖండించాబోయిన ఖడ్గం పూలమాలగా చంద్రమతిదేవి మెడలో ప్రత్యక్ష్యం అవుతుంది. పరమశివుడు, ప్రత్యక్షమై సత్యహరిశ్చంద్రుడు కుమారుడిని, కాశిరాజు కుమారుడుని బ్రతికిస్తాడు. బ్రహ్మశ్రీ విశ్వామిత్రుల వారు తన ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటారు. సత్యహరిశ్చంద్ర మహారాజు పరమశివ ప్రార్ధనతో “NTR Satya Harishchandra Full Story Telugu Movie” చిత్రం ముగుస్తుంది.

తెలుగు రీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

Jr.NTR తెలుగు సినిమాలు

బాలనటుడుగా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర లో కనిపించి, బాలనటుడుగా ఉన్నప్పుడే ప్రధాన పాత్రలో రామాయణం తెలుగుసినిమాలో నటించి, నిన్ను చూడాలని చిత్రంలో యువ కధానాయకుడుగా వచ్చి స్టూడెంట్ నెం.1 తెలుగుమూవీతో అందరిని ఆకట్టుకుని, సుబ్బు తెలుగుచిత్రం తర్వాత ఆది, అల్లరి రాముడు నాగ తెలుగుసినిమాల్లో నటించి, సింహాద్రి తెలుగుచిత్రంతో సంచలనం సృష్టించి, ఆంధ్రవాల అంటూ సాంబ నాఅల్లుడు, నరసింహుడు, అశోక్ తెలుగు చిత్రాలతో అందరిని అలరించారు. రాఖి, యమదొంగ, కంత్రి, అదుర్స్ అంటూ బృందావనంలో శక్తిగా ఊసరవెల్లిలో దమ్ము చూపించి బాక్స్ఆఫీసు బాద్ షాగా అనిపించుకున్నారు. రామయ్య వస్తావయ్యగా రభస చేసి టెంపర్ గా నాన్నకు ప్రేమతో అంటూ జనతా గారేజ్ అన్న ఎన్టిఆర్ జైలవకుశ తెలుగు మూవీలో విబిన్న పాత్రల్లో కనిపించరు. అరవింద సమేత వీర రాఘవగా వచ్చి, ఎన్టిఆర్ రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు.

బాలనటుడుగా ఉన్నప్పుడే ప్రధాన పాత్రలో రాముడుగా కనిపించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టిఆర్ నిన్ను చూడాలని చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు. Jr. NTR first movie is Ninnu Choodalani as a hero. కాని స్టూడెంట్ నెం.1 చిత్రంలో స్టూడెంట్ పాత్రలో చక్కగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్ అయితే ప్రపంచ ప్రసిద్ది పొందిన రాజమౌళి మొదటి తెలుగుమూవీ స్టూడెంట్ నెం.1 కావడం విశేషం.

సుబ్బు తెలుగుమూవీలో కూడా స్టూడెంట్ పాత్రలో కాలేజీ బ్యాక్ డ్రాప్ తెలుగుచిత్రంలో నటించిన ఎన్టిఆర్ ఆది తెలుగుచిత్రంతో అందరి దృష్టి బాగా ఆకర్షించారు. ఆది చిత్రంలో స్టూడెంట్ పాత్రలో కనిపించిన ఫ్యాక్షన్ కధలో వీరోచితమైన హీరోగా ఆకట్టుకున్నారు. అమ్మతోడూ అడ్డంగా నరికేస్తాను అనే డైలాగ్ ప్రచారం పొందితే, చిరంజీవితో ఠాగూర్ హిట్ చిత్రం తీసిన అగ్రదర్శకుడు వివి వినాయక తొలి తెలుగుసినిమా ఆది కావడం విశేషం.

రాజమౌళి దర్శకత్వంలో మూడు మూవీల్లో నటించిన ఎన్టిఆర్ స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ

అల్లరి రాముడు తెలుగుచిత్రంలో అంచనాలు అందుకోని నాగ సింహాద్రి తెలుగు చిత్రంతో సంచలనమే సృష్టించారు. అప్పటికి అప్పటివరకు ఉన్న బాక్సాఫీసు రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. దర్శకుడు రాజమౌళికి రెండవ మూవీగా ఎన్టిఆర్ కెరీర్ కష్టకాలంలో సూపర్ హిట్ తెలుగు చిత్రంగా సింహాద్రి నిలవడం విశేషం.

అటు తర్వాత అందరిలో అంచనాలు పెంచిన ఆంధ్రావాల అంచనాలను అందుకోలేకపొతే, సాంబ తెలుగుచిత్రంతో సరిపెట్టుకుని నా అల్లుడుగా నరసింహుడుగా నటించిన ఎన్టిఆర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖి తెలుగుచిత్రంలో నటనతో ప్రేక్షకులని మెప్పించారు. తెలుగింటి ఆడపడచులకు అన్నగా, ఆడువారిపై దాడులు చేసే వారిపై ఎదురుదాడి చేసే సందేశాత్మక పాత్రను పోషించారు.

రాజమౌళి యమదొంగ తెలుగుచిత్రంలో యమయమగా యముడితో పోటి పడి విజయవంతం అయ్యారు. ఈ తెలుగుచిత్రం పోషియో ఫాంటసీ టైపులో యమలోకం బ్యాక్ డ్రాప్లో అందరిని ఆకట్టుకుంటుంది. కంత్రిలో కనిపించి అదుర్స్ తెలుగుచిత్రంతో అందరితో అదుర్స్ అనిపించుకున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన తెలుగుచిత్రం కామెడీగా ఉండి, అందరిని అలరించింది.

బృందావనం కుటుంబ కధా చిత్రంలో నటించి మెప్పించిన ఎన్టిఆర్ ఊసరవెల్లి చిత్రంలో చాలా చక్కగా నటించారు. తరువాత వచ్చిన దమ్ము చిత్రం మంచి టైటిల్ చిత్రంగా మిగిలింది. రామయ్య వస్తావయ్య అంటూ రభస చేసినా టెంపర్ చిత్రాన్ని బాగా ఆదరించారు. టెంపర్ తెలుగుచిత్రంలో కేవలం డబ్బే ప్రధానమని భావించిన పోలీసు, మనిషి చుట్టూ మంచివారు ఉంటే, ఆ మనిషి ఎలా మంచిమనిషి గా మారిపోతారు అనే మాటకు అర్ధం వచ్చేలా నటించారు.

రాఖి, టెంపర్ తెలుగుచిత్రాలలో మంచి అన్నగా గుర్తింపు పొందిన ఎన్టిఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంతో మంచి కొడుకుగా మంచి మార్కులు సాధించారు. తండ్రి కధ విని, దానిని కధగా కొట్టిపారవేయకుండా సాధించి చూపే యువకుడు పాత్రలో ఎన్టిఆర్ నటన అద్బుతంగా ఉంటుంది. ఒక కుటుంబం మంచి మార్గాన్నే ఎంచుకుని ఉంటే వారసులు కూడా సదరు మంచి గుణాలు పుణికి పుచ్చుకుంటారు అనే మాట మాదిరి జనతా గారేజ్ తెలుగుచిత్రం ఉంటుంది. సమాజానికి సేవ చేయడంలో వెనకడుగు వేయని కుటుంబ కధ జనతా గారేజ్ చిత్రం.

జై లవకుశ చిత్రంలో మూడు పాత్రల్లో విబిన్నంగా నటించిన ఎన్టిఆర్ ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో మల్టి స్టారర్ సినిమాలో నటిస్తున్నారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

అల్లుఅర్జున్ అందరూ మెచ్చే మెగాహీరో – తెలుగురీడ్స్

మనకున్న మోస్ట్ పాపులర్ హీరోలలో అల్లు అర్జున్ అంటే అందరికి ఇష్టం, అల్లు అర్జున్ అభినయం, డాన్స్ అంటే ఎవరైనా మెచ్చుతారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన మోస్ట్ టాలెంటెడ్ మెగా హీరో మన అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ నటించిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం తెలుగురీడ్స్...చదవండి.

అయితే కొత్తగా నిర్మితమవుతున్న అల్లు అర్జున్ సినిమా గురించి మొదటిగా చూసి, తర్వాత పూర్వపు చిత్రాల గురించి క్లుప్తంగా.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి , జులాయి సినిమాలు రాగా, ఇప్పుడు వీరి కాంబినేషన్లో అల వైకుంఠపురములో రాబోతుంది. ఈ చిత్రంలో ఇంకా పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తుండగా, టబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

తెలుగు చలనచిత్రాలు. విజేత, స్వాతిముత్యం చిత్రాల్లో బాలనటుడిగా తెలుగు తెరపై కనిపించిన అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి డాడి చిత్రంలో డాన్సర్ గా కనిపించారు. గంగోత్రి చిత్రంతో హీరోగా తెలుగుతెరపై కనిపించి, మా అవార్డుగా ఉత్తమ నూతన నటుడు గెలుచుకున్నారు. అటు తరువాత అనుమెహతాతో వన్ సైడ్ లవర్ గా ఆర్యగా అల్లరి చేసి అందర్నీ అలరించిన బన్ని, తరువాత బన్నిగా గౌరీ ముంజల్ జోడీగా సూపర్ హిట్ అందుకున్నారు. అల్లు అర్జున్ ఆర్య చిత్రానికి నంది స్పెషల్ జ్యూరి పురష్కారం గెలుచుకున్నారు.

జెనిలియా డిసౌజాతో హ్యాపీగా వెండితెరపై డాన్సులు వేసిన అల్లు అర్జున్ సన్యాసినితో ప్రేమాయణం సాగించి దేశముదురుగా గుర్తింపు పొందారు. ఈ చిత్రానికి బన్నీకి ఉత్తమనటుడుగా ఫిలిం ఫేర్ పురష్కారం లభించింది. దేశముదురు చిత్రంతో క్యూట్ నటిగా గుర్తింపు పొందిన నటి హన్సిక మోత్వాని. అతిథి పాత్రలో శంకర్ దాదా జిందాబాదు చిత్రంలో కనిపించిన బన్నీ. తరువాత అల్లు అర్జున్ షీలాతో జతకట్టి పరుగుపెట్టి ఆర్య2, వరుడు, వేదం బద్రీనాథ్ జులాయి ఇద్దరమ్మాయలతో రేసుగుర్రంతో ఎవడు సన్ అఫ్ సత్యమూర్తికి రుద్రమదేవికి సరైనోడుగా దువ్వాడ జగన్నాధంతో నాపేరు సూర్య నాఇల్లు ఇండియా దాకా వచ్చారు.

అల్లు అర్జున్ (Allu Arjun) మూవీస్ వినోదంతో బాటు సందేశాత్మ చిత్రాలుగా కూడా ఉంటాయి. గంగోత్రి మూవీ మ్యూజికల్ హిట్ అయితే, ఆర్య ప్రేమిస్తూ ప్రేమించబడడం లేదనే వారికి ఓదార్పు సందేశంగా వన్ సైడ్ లవర్ల కోసమా అన్నట్టు ఉంటుంది. అలాగే అల్లుఅర్జున్ చిత్రాలలో నటనపరంగా చిన్న చిన్న పాత్రలు కూడా ఉన్నాయి. రుద్రమదేవిలో చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్ర, వేదం చిత్రంలో ఒక పేదప్రేమికుడుగా అందరిని అలరిస్తే, ఆర్య2 చిత్రంలో అల్లు అర్జున్ నటన ఆకట్టుకుంటుంది. ఎలాగైనా డబ్బే ప్రధానమని భావించే రోజులలో విలువలు గురించి మాట్లాడే యువకుడి పాత్రలో అల్లుఅర్జున్ నటించి మెప్పించారు. సన్ అఫ్ సత్యమూర్తి చిత్రంలో.

అల్లు అర్జున్ గంగోత్రి సినిమా మ్యూజికల్ హిట్ అయితే ఆర్య చిత్రంతో యువతలో క్రేజ్ పెరిగింది. ఒక ప్రేమకధని విబిన్న రీతిలో చెప్పిన దర్శకుడు సుకుమార్. సున్నితమైన మనసు కలిగిన అమ్మాయితో ప్రేమించకపోతే చస్తాను అన్నా యువకుడిని సహజంగా ఆమె ఒప్పుకుంటుంది. అటువంటి బెదిరింపు ప్రేమ నిజమైనది కాదు అనే అంశంగా ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కధగా చూపుతుంది. పాటలు బన్ని నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

Allu Arjun Telugu Movies అల్లు అర్జున్ హ్యాపీ, దేశముదురు, పరుగు చిత్రాలు

సమాజంలో ప్రజాసేవ చేసేవారు ఉంటే వారిని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. అటువంటి తీరులోనే బన్ని చిత్రం ఉంటుంది. రంగరాజు భూపతిరాజు పోలవరం ప్రాజెక్ట్ కోసం తన ఆస్తిని త్యాగం చేస్తాడు, అయితే అతని వెనుకనే ఉంటూ సోమరాజు మైసమ్మ సహాయంతో రంగరాజు భూపతిరాజుని హతమార్చి, ఆస్తిని హస్తగతం చేసుకుంటాడు. ఆ రంగరాజు భూపతిరాజు కొడుకే బన్ని. తన తండ్రి ఆశయం నెరవేర్చడానికి ప్రయత్నించి సఫలికృతుడౌతాడు.

చదువుకుని డాక్టర్ కావాలనే ఆశయంతో ఉండే మధుమతికి బన్ని పరిచయం ఆమె జీవితాన్నే మలుపు తిప్పుతుంది. తండ్రి చూసిన పెళ్లి చేస్తాను అంటే వద్దు చదువుకుంటాను అని చదువుని కొనసాగించే మధుమతి బన్నిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. లక్ష్యం మీద ధ్యాస ఉండే ఆమెకు, అమెపైనే ఆరాధన పెంచుకునే బన్నికి మధ్య జరిగిన కధే, హ్యాపీ చిత్రం ప్రేమకధా చిత్రం.

ప్రేమికుడుగా, మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ దేశముదురు చిత్రంతో ఏనార్జేటిక్ హీరోగా పాపులర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ బాడీతో డాన్సులు, ఫైట్లు, యాక్షన్ ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తుంది. కుటుంబ గొడవల్లో చిక్కుకున్న ఒక యువతి సన్యాసినిలతో కలిసి ఆశ్రమంలో ఉంటే, ఆ సన్యాసినిని చూసిన బన్నీ ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె వెంటపడడం, ఆమె వెనుక ఉన్న సమస్యకు కారణమైనవారిని తుదముట్టించి, ఆమెను పెళ్ళాడతాడు.

మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా సీక్వెల్ చిత్రాలల్లో రెండవది అయిన శంకర్ దాదా జిందాబాదులో అతిథి పాత్రలో అల్లుఅర్జున్ కనిపిస్తాడు. ఆ తరువాత పరుగు చిత్రంలో నటించాడు.  ఎప్పుడు పరుగులు పెడుతూ ఉండే యువకుడు ఒక ప్రేమజంటకు పెళ్లి చేస్తాడు, సదరు పెళ్ళికూతురు తరపువారు అతడిని తీసుకువెళ్ళి బందిస్తారు. అక్కడ ఒక అమ్మాయని ప్రేమిస్తాడు అతడు. ఆ కుర్రాడి వలన ఆ కుటుంబలో ఏర్పడిన పరిస్థితులకు, ఆ కుర్రాడు చెల్లించిన మూల్యం ఏమిటి ? అనేది చిత్ర కధాంశం  చివరికి ప్రేమ గెలుస్తుంది. ముందు  వెనుకలు చూడకుండా ఆకర్షితులయ్యే యువతని దృష్టిలో ఉంచుకుని తీసినట్టు ఈ చిత్రకధ వలన తెలుస్తుంది.

ఆర్య డైరెక్టర్ సుకుమార్ ఆర్యకి కొనసాగింపు చిత్రంగా ఆర్య2 చిత్రీకరించారు, అయితే కధ కొత్తది, పాత కధకి సంభందం లేకుండా ఉంటుంది. ఒక యువకుడిలో ఒకేసారి ప్రేమ మరియు స్నేహం కోసం పడే తపన ఈ చిత్రం కధాంశం. తాను ప్రేమించిన అమ్మాయినే స్నేహితుడు ప్రేమిస్తే, అతని కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి అవసరం అయితే ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ద పడే యువకుడి పాత్రలో అల్లుఅర్జున్ నటన హైలైట్ గా ఉంటుంది.

అల్లుఅర్జున్ వరుడు, వేదం, భాద్రినాథ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన తెలుగు మూవీస్ – చలనచిత్రాలు

లేచిపోయి గుళ్ళోనో రిజిస్ట్రార్ ఆఫీసులోనో పెళ్లిచేసుకునే కాలంలో పాత పద్దతిలో పెళ్లిని అయిదు రోజుల పండుగలా చేయమని తల్లిదండ్రులను కోరే కొడుకుగా అల్లు అర్జున్ వరుడు చిత్రంలో కనబడతారు. అంతేకాకుండా తాళి కట్టే సమయం వరకు పెళ్లి కూతురుని చూడకుండా ఆమె ఎలా ఉన్నా చేసుకోవడానికి సిద్దపడతాడు. పెళ్లి పండుగలాగా చేసే పద్దతిలో చిత్రం సాగుతుంది.

గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రధాన హీరో అయినా వేదం చిత్రంలో ఒక పరిమిత క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటించడమే కాకుండా, ఆ చిత్రం ప్రమోషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఒక బీద యువకుడు, ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనే భావించే పాత్రలో అల్లుఅర్జున్ నటించాడు.

బద్రినాథ్ గుడిని చూపిస్తూ, బద్రీనాథ్ చుట్టూ తిరిగే ప్రేమకధ బద్రీనాథ్ చిత్రం. ఇందులో అల్లు అర్జున్ బద్రీనాథ్ గురించి, వివరించే గైడ్ పాత్రలో కనిపించారు. పెళ్లి చేసుకోకుండా గుడిలో గురువుగారి దగ్గర జీవితాంతం ఉంటానని ప్రమాణం చేసిన యువకుడుగా అల్లుఅర్జున్ నటించారు.

కాలిగా తిరిగే యువకుడిని ఇంట్లో జులాయి అని అతని తండ్రి తిడుతూ ఉంటుంటే, ఉండబట్టలేక కొంత డబ్బు ఇవ్వండి సాయంత్రానికి నాలుగు రెట్లు ఎక్కువ చేసి చూపిస్తాను అంటాడు. డబ్బు తీసుకుని వెళ్ళిన యువకుడి జీవితమే మలుపు తిరుగుతుంది, ఒక అతిపెద్ద నేరంలో సాక్షిగా మారి, పోలీసుల పర్యవేక్షణలో నేరస్తుడిని పట్టుకోవడమే ధ్యేయంగా ఉండే యువకుడు పాత్రలో జులాయి చిత్రంలో అల్లుఅర్జున్ నటించారు.

ఒక అమ్మాయితో ప్రేమిస్తున్నట్టు ఉంటూ, తన అసలు ప్రేమ కధని తెలియజేస్తూ, ఆ ప్రేమ కధలో శత్రువులైన వారిని ఇప్పుడున్న అమ్మాయి ద్వారా పట్టుకుని శిక్షించడమే ధ్యేయంగా సాగే పాత్రలో అల్లుఅర్జున్ ఇద్దరమ్మాయలతో ప్రేమ కధ చిత్రంలో నటించారు.

పోలీసు ఆఫీసరుకి తమ్ముడుగా ఉంటూ, అల్లరి పనులు చేస్తూ, అన్నపై కోపాన్నే ప్రదర్శిస్తూ ఉండే తమ్ముడు పాత్రలో కనిపిస్తాడు. అయితే తన అన్నపై చేయబోయిన హత్యాప్రయత్నం తెలియగానే అన్న కోసం పోరాటం మొదలు పెడతాడు. రేసుగుర్రం చిత్రం యాక్షన్ కామెడీ ఎంటర్టైనరుగా ఉంటుంది.

ఎవడు చిత్రంలో కనిపించేది రామ్ చరణ్ అయినా ఆ కధకి మూలమైన పాత్ర అంతా అల్లు అర్జున్ నటించిన పాత్రదే. చావునుండి బ్రతికిన ఒక యువకుడు తన రూపం కోల్పోయి ఇంకో రూపాన్ని పొంది, తన చావుకోసం ప్రయత్నించిన వారిపై పగ తీర్చుకుంటాడు. చావుదాక వెళ్ళిన యువకుడి పాత్రలో అల్లు అర్జున్ నటించారు.

విలువలతో కూడిన ఆస్తులు అంతస్తుని గౌరవాన్ని పెంచుతాయి – సన్ అఫ్ సత్యమూర్తి

సన్ అఫ్ సత్యమూర్తి చిత్రం టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా అంతా తండ్రి సత్యమూర్తి గారి ఆలోచనతో జీవించే యువకుడి కధ. తన తండ్రికి చిన్న మాట కూడా రావడం ఇష్టంలేని సత్యమూర్తిగారి అబ్బాయిగా దానికోసం ఎంతటి రిస్క్ అయిన చేసే యువకుడిగా అల్లుఅర్జున్ నటించారు. విలువలే ఆస్తులు, విలువలేని ఆస్తి వ్యర్ధం అంటూ చిత్రం సాగుతుంది.

గమ్మునుండవోయ్ అనే మానరిజం బాగా అక్కట్టుకుంటుంది ఈ రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా ఒక పాత్రలో అల్లుఅర్జున్ నటన ఆకట్టుకుంటుంది.

సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ నటన చాలా ఎనర్జీటిక్ గా ఉంటుంది. విలన్ ఒక పవర్ ఫుల్ పాత్రలో ముఖ్యమంత్రి కొడుకుగా అక్రమాలు చేస్తుంటే, అతనిని అంతకన్నా డామినేట్ చేస్తూ ఉండే పాత్రలో అల్లుఅర్జున్ నటించారు. సరైనోడు టైటిల్ కి తగ్గ చిత్రంలో టైటిల్ కి తగ్గ పాత్రలో నటించిన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

ఒక బ్రాహ్మణ బాలుడుగా ఉన్నప్పుడు సమాజంలో ఎదురైనా సంఘటనలతో, సమాజంలో జరిగే చెడుని తొలగించాలి అని నిర్ణయించుకున్న బ్రాహ్మణ యువకుడు కధ. రహస్యంగా చెడు కార్యక్రమాలు చేసే వారిని శిక్షిస్తూ, వృత్తి రిత్యా పౌరోహిత్యం చేస్తూ ఉండే పాత్రలో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటించారు.

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మిలిటరీ అధికారి కధ. అదుపులేని కోపం కలిగిన యువకుడు సైన్యంలో చేరి, కోపం వలననే సైన్యం నుండి తొలగించబడడం. మరలా అతను సైన్యంలో చేరడానికి చేసే ప్రయత్నాలే ఈ చిత్ర కధాంశం.

చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు సమాచారం. ఇది షూటింగ్లో ఉన్న ప్రస్తుత చిత్రంగా ఉంది, 2019లో విడుదల కానుంది.

ఇవి ఇప్పటివరకు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన తెలుగు మూవీస్ – చలనచిత్రాలు

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ యాప్ డౌన్ లోడ్ చేయండి

సంసారం ఒక చదరంగం కుటుంబకధా తెలుగు చలనచిత్రం

సంసారం ఒక చదరంగం కుటుంబకధా తెలుగు చలనచిత్రం అంటే సాగరం ఈదడం లాంటిది అంటారు. ఇక మధ్యతరగతి సంసారం అయితే నడి సముద్రంలో దిక్కులు చూస్తున్నట్టే ఉంటుంది. మనదేశంలో మధ్యతరగతి జీవనమే ఎక్కువ.  అలాగే ఎక్కువగా వ్యాపార సేవా వ్యవహారాలు కూడా మధ్యతరగతి సమాజంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్యోగి అతనిపై నలుగురు ఆధారపడి ఉండడం, లేక ఇద్దరు కన్నా ఎక్కువమంది పనిచేసే కుటుంబమైతే పలురకాల సమస్యలు వస్తూ సంసార తీరం మీద బెంగలేకుండా చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త బెంగలు పుట్టిస్తూ.

కుటుంబ బాద్యతలను మోస్తూ చివరి దశలో ఉన్న మధ్యతరగతి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల భావనల చేత ప్రభావితమయ్యే కుటుంబం ఈ సంసారం ఒక చదరంగం చలనచిత్రం. గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, శరత్ బాబు, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్, ముచ్చెర్ల అరుణ తదితరులు నటించిన తెలుగు చలనచిత్రం. ప్రతిష్టాత్మకమైనా సంస్థ ఏవిఎం వారు ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో నిర్మించారు.

సంసారం ఒక చదరంగం కుటుంబ కధ

గోదావరి (అన్నపూర్ణ)- అప్పల నర్సయ్యల(గొల్లపూడి మారుతీరావు)ది మధ్యతరగతి కుటుంబం, వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు, పెద్ద కొడుకు ప్రకాష్ (శరత్ బాబు)ని బికాం చదివించారు, రెండవ కొడుకు రాఘవ(రాజేంద్ర ప్రసాద్)ని పనికి పంపించారు, చిన్న కొడుకు కాళిదాసు పది పరిక్షలు రాస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. పెద్ద కొడుక్కి భార్యగా ఉమా(సుహాసిని) వస్తే, కూతురు సరోజ(కల్పన)కి పెళ్లి సంభందాలు చూస్తూ ఉంటారు. ఆ ఇంటికి మొదటి నుండి ఉండే పనిమనిషి చిలకమ్మా(షావుకారుజానకి) ఉంటుంది.

కూతురు సరోజకి పెళ్లి సంభందం వస్తే అప్పటికప్పుడే ఆమె కాదని చెబుతుండగా, పెళ్లి చూపులకి వచ్చిన వారు వెళ్ళిపోతారు. తరువాత అప్పల నర్సయ్య ఆ పెళ్లి చూపులకు వచ్చిన వారింటికి వెళ్లి క్షమాపణ చెబుతాడు. పద్దతి నచ్చిన అతను అప్పల నర్సయ్య కొడుకికి తన కూతురు వసంతని చేసుకోవలసిందిగా కోరతాడు. అప్పల నర్సయ్య అంగికరించి ఇంటికి వచ్చేస్తాడు. అప్పలనర్సయ్యకు కూతురు సరోజ తన ప్రేమించిన పీటర్ గురించి చెబుతుంది. అలా కూతురు కొడుకు ఇద్దరి పెళ్ళిళ్ళు చేసేస్తాడు.

పెళ్ళిళ్ళు పూర్తయ్యాక అప్పలనర్సయ్య పెద్ద కోడలు పురిటికి పుట్టింటికి వెళుతుంది, ఆ సమయంలో కూతురు సరోజ భర్తతో తగవు పెట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది, రెండవ కోడలు కొడుకు రాఘవతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతుంది, రెండు సంఘటనలు ఒకేసారి జరుగుతాయి. అలాగే ఎప్పుడు జమా ఖర్చులు లెక్కలు వేసుకునే ప్రకాష్, తన భార్య ఉమా ఇప్పుడు పుట్టింట్లో ఉంది కాబట్టి, తనవాటా ఖర్చు కింద ఎప్పుడు ఇంట్లో ఖర్చుకు ఇచ్చే మొత్తంలో నుండి సగం తగ్గించి గోదావరికి ఇస్తాడు.

అందరూ 10 నెలలకె పుడితే నీవు పది నెలల పదమూడు రోజులు కడుపులోనే పెరిగావు, అప్పుడు నేను లెక్కలు చూడలేదే అని గోదావరి కొడుకు ప్రకాష్ తో అంటే, అందుకున్న అప్పల నర్సయ్యతో ప్రకాష్ వాదం పెంచుకుంటాడు. ప్రకాష్ మాటలకి విసిగిన అప్పల నర్సయ్య ఇంటినుండి వెళ్ళిపోమంటాడు. ప్రకాష్ తాను ఇంతకుముందు పెళ్ళిళ్ళకి ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లిస్తే వెంటనే వెళ్ళిపోతాను అంటాడు. ఆ సంఘటనతో నట్టింట్లో అడ్డుగా గీత గీసుకుని, పెద్ద కొడుకు తండ్రి విడిపోతారు.

పురిటికి పుట్టింటికి వెళ్ళిన ఉమా వచ్చేటప్పటికి ఇంటి పరిస్థితిని చూసి, భాదపడి ఆ ఇంట్లో సమస్యగా మారినా విషయాలపై దృష్టి సారించి సరి చేస్తుంది. చివరికి ఉమా-ప్రకాష్ దంపతులు తమ పిల్లవాడితో ఇల్లు వదిలి బయటికి అద్దెకు సభ్యతతో వెళతారు. అందరి నటన పాత్రలపరంగా చక్కగా ఉంటుంది. సకుటుంబ సమేతంగా చూడదగిన సాంఘిక చిత్రాల్లో సందేశంతో కూడిన చిత్రంగా ఆకట్టుకుంటుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొని పరదేశస్తుల పాలనను ప్రారద్రోలారు. ఆ మహానుభావులు ఎంతమందో? చరిత్రకెక్కింది ఎంతమంది ? చరిత్ర విశేషాలే గణిస్తే కనుక చరితకు రాని మహానుభావులు ఎంతమందో వారిలో చరితకెక్కిన కొంతమందిని అన్నా స్వాతంత్ర్య దినోత్సవం ఆగష్టు 15 న తలచి జోహార్లు చెబుదాం.

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు: పరాయి పాలనలో వందల సంవత్సరాలు మగ్గిన భారతావనిని, భారతీయులు మొత్తంగా ఏకమై పరుల అధికారం నుండి దేశాన్ని స్వాతంత్ర్య దేశంగా సాధించుకోవడంలో ఎంతోమంది నాయకుల జీవితాల త్యాగం ఉంది. కొందరి జీవితం కాల్పుల్లో కలిసిపోతే, కొందరి జీవితం జైళ్లలో అంతరించి ఎంతోమంది దేశభక్తుల జీవితం పోరాటంలో పాల్గొని 90 సంవత్సరాల కాలం పోరాటం తరువాత స్వాతంత్ర్య భారతావని సాధించారు. 1857 – 1947 స్వాతంత్ర్య పోరాటం జరిగితే పోరాటంలో పోయిన ప్రాణత్యాగాల, ఎంతోమంది తమ జీవితాలను భరతమాత దాస్య సంకెళ్ళ విముక్తికై అర్పించిన దేశభక్తుల జీవిత త్యాగాల ఫలితం 1947 ఆగష్టు 15 తేది సంబరాలు.

మరుదనాయగం, వీరపాండ్య కట్టబొమ్మన్, మంగళ్ పాండే, నానసాహిబ్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్, బహదూర్ షా, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, టంగుటూరి ప్రకాశం, చంద్రశేఖర ఆజాద్, చిత్తరంజన్ దాస్, కొమరం భీం, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ కరం చంద్ గాంధి, జవహర్ లాల్ నెహ్రు, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాల లజపతి రాయ్ లాంటి ఎందఱో మహానుభావుల పోరాట ఫలితం నేటి మన స్వతంత్ర భారతదేశం.

పుస్తకాల ద్వారా స్వాతంత్ర్య పోరాటం, పోరాటంలో పాల్గొన్న నాయకుల గురించి పుస్తకాలలో చదువుకున్నాం, చదువుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లో అయితే మహానుభావుల గురించిన బయోగ్రఫీ మొబైల్ ఆప్స్ లభిస్తాయి. ఇంకా చలనచిత్ర రూపంలో కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల చరిత లభిస్తుంది. గతకాలపు చరిత్రలో కలిసి ఉన్న మన స్వాతంత్ర్య సమరయోధుల గురించి, స్వాతంత్ర్య దినోత్సవ రోజులలో గుర్తుచేసుకోవడానికి పుస్తకాల రూపంలో మొబైల్ ఆప్స్ రూపంలో సినిమాల రూపంలో యూట్యూబ్‌లో లభిస్తాయి.

స్వాతంత్ర్య సమరయోధుల నాయకుల చరిత చలనచిత్రాలు

భారతదేశపు స్వాతంత్ర్య పోరాటంలో తెలుగువారిలో ఆంధ్రకేసరి అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు వారలబ్బాయిగా చదువుకుని ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వరాజ్య పత్రికకు సంపాదకీయం చేసారు, 1922 స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా 30000 స్వచ్చందకులతో ప్రదర్శన నిర్వహించారు. మద్రాసులో సైమన్ కమిషన్ ఎదుట తుపాకీ కాల్పులకు రొమ్ము విరిచి నిలబడి ఆంధ్రకేసరిగా ప్రసిద్దికెక్కారు. ఆగష్టు 23, 1872లో జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు 1957 మే20న స్వర్గస్తులైనారు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు చిత్రం ఆంధ్రకేసరి. విజయచందర్ ఆంధ్రకేసరిగా నటించి, ఆ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించారు.

పాండ్యరాజైన జగ్విర్ మరణానంతరం పాంచల్ మకురుచ్చీ ప్రాంతానికి రాజు అయిన వీరపాండ్య కట్టబొమ్మన్ పూర్వికులు ఆంధ్రులు. దక్షిణాది నామమాత్రపు నవాబు అయిన ఆర్కాట్ నవాబు ఈస్టిండియా కంపెనీకి తన అధీన రాజ్యాలపై కప్పం వసూలు చేసే ప్రక్రియని అప్పగిస్తాడు. అయితే కప్పం వసూలు చేసే నెపంతో స్థానిక రాజ్యాలను ఆక్రమించుకునే క్రమంలో ఉన్న ఈస్టిండియా కట్టబొమ్మన్ కప్పం కట్టకుండా ఎదురిస్తాడు. కప్పం వెంటనే కట్టకపోయిన పరవాలేదు, కట్టడానికి అంగీకరిస్తే చాలు అనే రాయబారాన్ని కూడా అంగీకరించడు. తొమ్మిదేళ్లుగా కట్టబొమ్మన్ ఏమిచేయలేకపోయిన ఈస్టిండియా కంపెనీ పాంచల్ మరుకుచ్చీపై యుద్దానికి వస్తారు. భారీ సైనిక దళంతో ఉన్న బ్రిటిష్ వారే యుద్దంలో పైచేయి సాధిస్తారు, కానీ కట్టబొమ్మన్ శత్రువుకు పట్టుబడకుండా తప్పించుకుంటాడు. అయితే మరలా ఇతర రాజులతో కలిసి యుద్ధం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న కట్టబొమ్మన్ ని పుదుక్కోట్టాయ్ జమిందారు తొండైమాన్ వంచనతో తన కోటకి ఆహ్వానిస్తాడు. అది పసిగట్టలేకపోయినా కట్టబొమ్మన్ బ్రిటిష్ వారికి బందీగా పట్టుబడతాడు. ఉరితీసే సమయంలో భరతమాతని తలుచుకుని ఉరితాడు తనకి తానే తగిలించుకుని ప్రాణత్యాగం చేస్తాడు. ఈవీరుని చరిత చలనచిత్రంగా వీరపాండ్య కట్టబ్రహ్మనగా తెలుగులోకి డబ్ చేయబడి ప్రేక్షకాదరణ పొందింది. బి.ఆర్. పంతులు నిర్మాణ దర్శకత్వంలో శివాజీ గణేషన్, ఎస్ వరలక్ష్మి, జెమిని గణేషన్ తదితరులు నటించారు.

1827 సంవత్సరం, జులై 19న జన్మించిన మంగళ్ పాండే 1857 సిపాయి తిరుగుబాటుకి ముందు బ్రిటిష్ వారిని ఎదిరించిన దేశభక్తుడు. సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసి తయారుచేసిన తూటాలను ఇచ్చి ఉపయోగించమన్న బ్రిటిష్ అధికారిని కాల్చి చంపి బ్రిటిష్ వారిని ఎదిరించిన తొలి భారతీయుడుగా చరిత్రకెక్కారు. 1857 సిపాయి తిరుగుబాటుకి మంగళ్ పాండే కలకత్తా దగ్గర బరాక్ పూర్ వద్ద 1857 మార్చి 29న బ్రిటిష్ వారికి ఎదురుతిరిగిన సంఘటన ప్రేరణగా చరిత్రకెక్కింది. ఈస్టిండియా కంపెనీ బెంగాల్ రెజిమెంట్ నందు సిపాయిగా ఉన్న మంగళ్ పాండే దాదాపు రెండు వందల ఏళ్ల తరబడి ఏలుతున్న పాలనకు ఎదురొడ్డి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన వీరుడుగా, స్వాతంత్ర్య సమరానికి ఆద్యుడుగా నిలిచాడు. ఈ దేశభక్తుడుపై చలనచిత్రం హిందీ భాషలో మంగళ్ పాండే ది రైజింగ్ పేరుతో ఉంది. కేతన్ మెహతా దర్శకత్వంలో అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ, అమీషా పటేల్ తదితరులు నటించారు.

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

ఒక స్వాతంత్ర్య సమరయోదుడుపై ఎక్కువ చలనచిత్రాలు ఉన్నది బహుశా భగత్ సింగ్ ఒకరే అయ్యివుంటారు. భగత్ సింగ్ 22 సెప్టెంబర్ 1907 సంవత్సరంలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమిలిస్తుంది అంటారు, అలా భగత్ సింగ్ చిన్ననాడే తండ్రికి చెప్పిన సమాధానంతో నిజమనిపిస్తుంది. కిషన్ సింగ్ భగత్ సింగ్ తో తోటకి వెళ్తే అక్కడ పొలంలో అడుకుంటూ గడ్డి పరకలను నాటుతుంటే, తండ్రి ఏమిటని ప్రశిస్తే బాల భగత్ సింగ్ నోట వచ్చిన మాట తుపాకులు నాటుతున్నాని. అలాంటి భగత్ సింగ్ 13 ఏళ్ల వయసులో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమంతో ప్రభావితుడై బ్రిటిష్ ప్రభుత్వ పాఠశాల పాఠ్యపుస్తకాలు, వారి దిగుమతి దుస్తులు తగులబెడతాడు, అయితే అహింసావాదం ఉపయోగం ఉండదని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్ హింసాత్మక ఉద్యమం ఉదృతం చేస్తాడు. లాలాలజపతి రాయ్ హత్య నేపద్యంలో బ్రిటిష్ పోలీసు అధికారిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. భగత్ సింగ్ విప్లవ స్పూర్తిగా నిలిచిన భగత్ సింగ్ ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. భగత్ సింగ్ పై 1954లో షహీద్ ఎ-ఆజాద్ భగత్ సింగ్, 1963లో షహీద్ భగత్ సింగ్, 1965లో షహీద్ బాలీవుడ్లో చిత్రాలు వచ్చాయి. 2002 లో మూడు హిందీచిత్రాలు భగత్ సింగ్ ప్రేరణతో వచ్చాయి షహీద్ ఎ అజం, 23 మార్చ్ 1931 షహీద్, ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్. 2006లో భగత్ సింగ్ కాలం నాటి రోజుల నేపద్యంలో రంగ్ దే బసంతి విప్లవాత్మక చిత్రంగా ఉంది. 2008లో ఇంక్విలాబ్ 40నిమిషాల డాక్యుమెంటరీ చిత్రం ఉంది.

అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలకు నాయకత్వం వహించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి స్వాతంత్య్ర సమరయోధుడు. సాటి స్వాతంత్ర్య సమరయోధుల మాదిరి అతను ఉరితీయబడకుండానే అల్లూరి సీతారామరాజుని విచారణ లేకుండా కాల్చి చంపారు అంటే, ఆ ప్రభుత్వం ఎంత భయపడి ఉంటే ఆ పని చేస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయపెట్టించిన అల్లూరి సీతారామరాజు జననం 1897 జులై 4 వ తేది అయితే మరణం 7వ తేది మే 1924 సంవత్సరం. అయితే ఒక బుర్రకధలో సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ ! వీరుడు మరణించడు, విప్లవానికి పరాజయం లేదు అని అన్నారంటే అల్లూరి సీతారామ రాజు విప్లవ స్పూర్తి ఎంతమంది భారతీయులలో ప్రేరణగా ఉండి ఉంటుంది. మన్యం ప్రాంతంలో ఆటవికులపై అమానుష చర్యలకు పాల్పడే బ్రిటిష్ ప్రభుత్వానికి అల్లూరి సీతారామరాజు ఎదురు తిరిగి, మన్యం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఈ స్వాతంత్ర్య సమరయోధుడిపై అల్లూరి సీతారామరాజు పేరుతో తెలుగు చలన చిత్రం ఉంది. వి రామచంద్రరావు, కెఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల, కొంగరజగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు, చంద్రమోహన్, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, త్యాగరాజు, కెవి చలం, మంజుల, రాజశ్రీ, జయంతి తదితరులు నటించారు.

మహాత్మా గాంధి జీవిత చలన చిత్రాలు

మహాత్మాగాంధి స్వాతంత్ర్యాన్ని శాంతిమార్గంలో సాధించాలని యోచించి, అనేక చోట్ల వేర్వేరుగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటాలలో ఐక్యతను సాధించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పంపించిన మహానుభావుడుగా జాతిపితగా భారతజాతి హృదయంలో నిలిచారు. భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్, అల్లూరి సీతారామరాజు వంటివారు సాయుధ పోరాటంలో సాధించలేని స్వాతంత్ర్య నిరాయుధ అహింసా మార్గంలో సాధించినవారిగా ఖ్యాతిగాంచారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఎలాంటి పదవి స్వీకరించకుండ ఉన్నారు, చివరికి నాదురాం గాడ్సే చేత కాల్చబడి చనిపోయారు. మహాత్మా గాంధీజీ జీవితం ఆధారంగా స్వాతంత్ర్య పోరాట చరిత నేపధ్యంలో గాంధీ టైటిల్ తో ఆంగ్ల చిత్రం ఉండడం విశేషం అలాగే ఆ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఆంగ్ల నటులతో ఆంగ్లంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. అలాగే గాంధి భావాలతో, గాంధి చరిత్ర ఆధారంగా హిందీ చిత్రాలు కూడా ఉంటే, తెలుగులో మాత్రం గాంధి ఆదర్శాలకి ప్రభావితమయ్యే ఒక గుండా కధ శంకర్ దాదా జిందాబాద్ చలనచిత్రం ఉంది. ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మాకోటక్, షియాజీ షిండే, సదా, పవన్ కళ్యాణ్ తదితరులు నటించారు. ఇవి స్వాతంత్ర్య సమరయోధుల నాయకుల చరిత చలనచిత్రాలు

ఆగష్టు15 పరతంత్ర పాలనా నుండి విముక్తి పొందిన దినం మన స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన నాయకుల జీవితాల త్యాగ ఫలితం. ఇంటి కష్టాలు చూసి చదువు మానేసి పనిచేసి సంపాదించి కుటుంబ భాద్యతని నెత్తిన వేసుకున్న యువకుడి మాదిరి భారతమాత దాస్య పాలనను చూసి జీవితాలని పణంగా పెట్టి పోరాడిన మహానుభావుల కృషి ఫలితం ఆగష్టు15 దినోత్సవం. ఒక విప్లవం పుట్టాలంటే ఎదో ఒక సంఘటన నాంది కావాలి, అటువంటి సంఘటనలలో ఎంతోమంది అప్పటికి బలై ఉంటారు. ఒక బలమైన అరాచాకత్వాన్ని ఎదురించాలంటే ఎన్ని బలమైన సంఘటనలు జరిగితే ఎంతమంది ప్రాణత్యాగాలు జరిగితే మొదలవుతుంది. విప్లవం నడవాలంటే శక్తివంతమైన నాయకుడు అవసరం, దేశంలో అనేక చోట్ల విప్లవాలు వేర్వేరుగా జరిగాయంటే ఎంతమంది నాయకులు నాయకత్వం వహించాలి. చరిత్రకి తెలిసేది విశేషం అయితే ఆ విశేషాన్ని అందించే జీవితాలు ఎన్ని ఉండి, ఉంటాయి. అలా జీవిత ప్రాణ త్యాగాలను చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులందరికీ జోహార్లు చెబుతూ జైహింద్.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు.

బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు. సాదారణంగా టైటిల్ తగ్గ చిత్రంగా కొన్ని ప్రసిద్ద టైటిల్స్ విషయంలో అంచనాలు తప్పవచ్చు, కాని అతడు విషయంలో అంచనాలు లేకుండా బిన్నమైన టైటిలుతో విడుదల అయ్యాక ఎక్కువకాలం గుర్తుకు ఉన్న చిత్రం అతడు. సహజత్వానికి దగ్గరగా ఎక్కువమంది ఆలోచనలతో సరిపోలే విధంగా ఉండేవి నిదానంగా అందరి ఆలోచనల్లో మెదులుతూ ఉంటాయి. అతడిని ఒకరు కాదంటే ఇంకొకరు ఒప్పుకున్నారు, ఆ తరువాత అందరు ఒప్పుకున్నారు.

ప్రతిపక్షంలో కూర్చున్న రాజకీయ పార్టీ నాయకుడు శివారెడ్డి రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల సానుభూతి అవసరమని గ్రహిస్తాడు. ప్రజల సానుభూతి అంటే మరణం నుండి తప్పించుకున్న వ్యక్తి సహజంగానే ఉంటుంది, అదే పార్టీ నాయకుడు అయితే, అతడిని ముఖ్యమంత్రి చేసేంతగా ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఆ క్రమంలో శివారెడ్డి (బులెట్ గాయం అవుతుంది, శివారెడ్డి చావకూడదు) పాల్గొనబోయే సమావేశంలో హత్యాప్రయత్నం జరిగేల పధకం రచిస్తారు, ఆ పార్టీ ఉపనాయకులు బాజిరెడ్డి తదితరులు. అందుకు నందు, మల్లి ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని పురమాయిస్తారు.

కాని సమావేశంలో పధకం ప్రకారం శివారెడ్డిని నందు కాల్చే లోపులోనే, శివారెడ్డి ఇంకొక బులెట్ తగిలి నిజంగానే చంపబడతాడు. విషయం గ్రహించిన నందు బిల్డింగ్ పై నుండి ట్రైనుపైకి దూకి, ట్రైను లోపలకి ప్రవేశిస్తాడు. పోలీసులు కూడా ఆ ట్రైనుని అనుసరిస్తారు. బాల్యంలో చేసిన పొరపాటుకు ఊరినుండి పారిపోయిన పార్ధు, చాన్నాళ్ళ తర్వాత తిరిగి ఇంటికి అదే రైలులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ట్రైనుపై నుండి లోపలికి వచ్చిన నందు పార్ధు ఎదురుగానే కూర్చుంటాడు. ట్రైను తరువాతి స్టేజికి చేరాక పోలీసులు జరిపిన కాల్పుల్లో నందు స్థానంలో పార్ధు మరణిస్తాడు. పార్ధు విషయాలు విన్న నందు పార్ధు ఇంటికి పార్ధుగా వెళ్తాడు.

తనవలననే ప్రాణాలు కోల్పోయిన అతడి కుటుంబంలోకి అతడు.

ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన అతడిని అందరు ఆదరిస్తారు వివరాలేమిటో అడగకుండానే అతడిని పార్ధుగా గుర్తిస్తారు. నేరం చేసి ట్రైనుపై దూకి పారిపోయిన అతడి కోసం కేసు సిబిఐకి వెళ్తుంది. పార్ధు స్నేహితులు, వచ్చి అతడిని కలిసి బాల్య విషయంలో బాల్యంలో అతడు చేసిన తప్పు ఏమిటో వివరిస్తారు. తన వల్లే చనిపోయిన పార్ధు కుటుంబానికి ఏదైనా సాయం చేయాలనీ భావించిన నందు, పార్ధు చిన్ననాడు చేసిన తప్పుకు బలైన మాస్టారుగారి అవసరం తీరుస్తాడు. అలాగే పార్ధు తాతగారి పొలం తగాదాని సరిచేస్తాడు. పార్ధు తాతగారి మనవరాలి పెళ్లిని తన ఖర్చుతో చేస్తాడు. పార్ధు మరదలు ప్రేమిస్తే, ఆమెను ప్రేమిస్తాడు. అలా అతడు పార్ధుగా మారిపోతాడు.బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు.

అయితే సిబిఐ అధికారి ఆంజనేయ ప్రసాద్ ఇన్వెస్ట్ గేట్ చేసి పార్ధు స్థానంలో నందు చలామణి అవుతున్నట్టు కనుక్కుంటాడు. పార్ధు కుటుంబానికి సహాయం అందించడంలో నందు పని పూర్తయ్యేటప్పటికి, ఆంజనేయ ప్రసాదు ఆధారాలతో నందుని వెతుక్కుంటూ పార్ధు తాతగారి ఇంటికి వస్తాడు. గ్రహించిన నందు ఆంజనేయ ప్రసాదు వచ్చేటప్పటికి తప్పించుకుంటాడు. అధికారులు వెళ్లిపోయాక వచ్చి అతడు తిరిగి వచ్చి జరిగిన సంఘటనలలో తన భావన తెలియజేస్తాడు. తాతగారు అతడినే పార్దుగా ఆదరిస్తారు.

జరిగిన శివారెడ్డి హత్యలో భాగం బాజిరెడ్డికి ఉంటుందని గ్రహించిన నందు, బాజిరెడ్డి దగ్గరి నుండి నిజాన్ని రికార్డు చేసి, అసలు నేరస్తుడు మల్లిని చంపుతాడు. సిబిఐ అధికారి ఆంజనేయప్రసాదుకి తన దగ్గర ఉన్న ఆధారం అందజేస్తాడు. అదారంతో ఎదురుగా ఉన్న ఆంజనేయప్రసాదు ముందే బాజిరెడ్డి తననితనే కాల్చుకుని చనిపోతాడు. నేర ప్రవృత్తి ఉన్నా మంచి మనుషుల మద్య మనిషిగా మారిన అతడిని ఆంజనేయ ప్రసాద్ వదిలివేసి కేసు క్లోజ్ చేయడంతో అతడు కధ సుఖాంతం అవుతుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు చిత్రంలో మహేష్ బాబు, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, త్రిష, సోను సూద్, కోట శ్రీనివాసరావు, షియాజీ షిండే, నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, అజయ్, గిరిబాబు, సుధ, తనికెళ్ళ భరణి, కె విశ్వనాధ్, గిరిధర్, చరణ్ రాజ్ తదితరులు నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

అంతఃపురం చిత్రంలో అమ్మతనం ఆరాటపోరాటం బిడ్డడి భవిష్యత్తుకోసం

అంతఃపురం చిత్రంలో అమ్మతనం ఆరాటపోరాటం బిడ్డడి భవిష్యత్తుకోసం సాగిస్తుంది. తన బిడ్డడిని ఫాక్షనిస్టుల మధ్య నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి ఆరాటపడుతూ కష్టంతో పోరాటం చేసే కన్నతల్లి ప్రయత్నం. ఏతల్లి అయినా బిడ్డడి క్షేమం కోరుతుంది, పోరాటం చేస్తుంది, ప్రాణాలకు తెగించి కూడా తల్లి పోరాడుతుంది అని ఈచిత్రం చూపుతుంది. విమర్శకుల ప్రసంశలు కొన్ని చిత్రాలకే దక్కుతాయి అలా ఈ చిత్రానికి ఈచిత్ర యూనిట్ కు కూడా దక్కాయి. అంతఃపురం అమ్మతనం ఆరాటం పోరాటం.

అమ్మగా సౌందర్య నటిస్తే, అమ్మ భర్తగా సాయి కుమార్ నటిస్తే అమ్మ భర్తకి తండ్రిగా అమ్మకి మామగా ప్రకాష్ రాజ్ నటన అందరిని ఆకట్టుకుంటే, సౌందర్య నటన అందరిని మెప్పిస్తుంది. అమ్మభర్తకి తల్లిగా ప్రకాశ రాజ్ భార్యగా సౌందర్యకు మద్దతు పలికే అత్తగా ఫ్యాక్షన్ ఫ్యామిలీలో ఇల్లాలులా శారద నటన ఉంటుంది. ఇలా అందరి నటన ఈ చిత్ర కధనం చిత్రాన్ని ఒక సచ్చిత్రంగా మలిచింది. ఈ చిత్రంలో అసలేం గుర్తుకు రాదు… అంటూ సాగే పాట బాగా ప్రాచుర్యం పొందింది.

ఫ్యాక్షన్ వాతావరణంలో ఉండలేక విదేశాల్లో నివసించే శేఖర్ (సాయికుమార్) అక్కడే స్థిరపడ్డ ఒక బిజినెస్ మేన్ కూతురు బానుమతి (సౌందర్య)ని వివాహం చేసుకుంటాడు. వారివురు అన్యోన్యమైన సంసార ఫలితంగా కలిగిన కొడుకుతో సంతోషంగా విదేశాల్లోనే ఉంటారు. అయితే ఊరినుండి వచ్చిన కబురుతో శేఖర్ ఫ్యామిలీతో సొంతఊరికి వస్తాడు. శేఖర్ తండ్రి ఊరిలో ప్రసిద్ద ఫ్యాక్షన్ నాయకుడు అతని పేరు నరసింహ, పేరుకు తగ్గట్టే అతని ప్రవర్తన ఉంటుంది. ఎప్పుడు దాడి ప్రతిదాడిలతో సాగే ఆ కుటుంబవాతావరణంలోకి బానుమతి తన బిడ్డడితో బిక్కుబిక్కుమంటూ ప్రవేశిస్తుంది.

నరసింహ ప్రత్యర్ధుల దాడిలో శేఖర్ తన ప్రాణాలు కోల్పోతాడు, భర్తని కోల్పోయిన భానుమతి తన బిడ్డడితో మరలా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. భానుమతి మామ అయినా నరసింహా వారిని ఆప్ తండ్రిని చంపిన వారిపై కక్ష తీర్చుకునే భాద్యత నీ బిడ్డడిపై ఉంది, నీ బిడ్డడు నాకు వారసుడు అని భానుమతి ప్రయాణాన్ని అడ్డుకుంటాడు. తన మూర్ఖత్వాన్ని ఎదిరించిన భానుమతిని నరసింహ గదిలో బందించి ఉంచుతాడు.

అత్తగారి సహాయంతో భానుమతి బిడ్డడితో ఇల్లు దాటి బయటపడుతుంది, నరసింహ మనుషులు వెంటపడతారు. ఎలాగైనా వారికి దొరకకుండా బిడ్డడితో కొనసాగించే ప్రయాణ ప్రయత్నంలో భానుమతి పడే కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. చివరికి జగపతిబాబు సహాయంతో ఆమె తన ప్రయత్నంలో విజయవంతం చేయగలుగుతుంది.

సహజత్వానికి దగ్గరగా కధనం నడిపించడంలో సన్నివేశాల్లో విబిన్నతను చూపే కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకుడు. మంచి చిత్రాలకు ఆదరణ నిదానంగా వచ్చిన ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు, అలా సందేశాత్మక చిత్రాలు, సామజిక ఇతివృత్తాలు ఉంటాయి. అంతఃపురం చిత్రం ముఠాకక్షల మద్య కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో చూపుతుంది. సౌందర్య, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, శారద, జగపతి బాబు, చిన్నా, ఎంఎస్ నారాయణ, బాబు మోహన్ తదితరులు నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

కర్తవ్యం వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి

ఈ చిత్రంలో కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి కధ కర్తవ్యం కధ. ఘటనా ఘటనలను తెలియజేస్తూ వాస్తవాలను సమాజానికి తెలియపరిచే సమాచార వ్యవస్థ ఒకటి ఉంటే పాల్గొనేవారి కర్తవ్యం ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలి, రోగికి చికిత్స చేయాలి, రోగాలను అదుపు చేయాలనీ వ్యవస్థచే ఏర్పరచుకున్నది వైద్యవ్యవస్థ, ఇక్కడ రోగికి చికిత్స, రోగనివారణ మార్గాల సూచన ప్రధమ కర్తవ్యం. ఇలా పలురకాలుగా వ్యవస్థల్లో వివిధ రంగాలలో ప్రజాపనుల కోసం, సమాజ సేవలు కోసం  వ్యవస్థలు ఏర్పడడం, వ్యవస్థచే వ్యక్తులు నియమింపబడడం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నిగా ప్రైవేటు రంగ సంస్థలుగా కొన్ని ఉంటే, అధికారికంగా ఉండే వ్యవస్థల్లో రక్షణ వ్యవస్థ ప్రధానమైనది, ప్రభుత్వపరమైన వ్యవస్థ.

ఏ రంగానికైనా సమయాలు ఉంటే రక్షణ వ్యవస్థ ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆపదలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వస్తాయో చెప్పలేరు. అలాంటి రక్షణ వ్యవస్థను అధికార రాజకీయవర్గాలు శాసిస్తూ ఉంటాయి. ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థలో ఉద్యోగం చేయడం అంటే అది సమాజ సేవచేయడంలో ముందుండే వ్యక్తిత్వం ఉన్నవారికే ఉంటుంది. శక్తి ఉండి సమాజానికి సహాయకారిగా ఉంటే సమాజమే మెచ్చుతుంది, తెలివితో శక్తితో సమాజం నుండి పొందినా సమాజం సహకరిస్తుంది. ఏర్పరచుకున్న వ్యవస్థలో నియమ నిభందనలు ఉంటే, సమాజంలో వ్యక్తులు, వారి కుటుంబాలు, కులాలు, మతాలు వివిధ వ్యవస్థలు అన్ని అధికార అనధికార వ్యవస్థలుగా గుర్తింపు పొందినవిగా కొన్ని పొందనవిగా కొన్ని ఉంటాయి. ఒకరు ఒక రకంగా సేవ చేస్తూ ఉంటే, వారు మరొక రకంగా సేవను పొందుతూ ఉంటారు. సమాజం ద్వారా సేవ చేయడం, పొందడం ఉంటుంది.

స్వార్ధమనే విషయం పొందడంలో చూపిన చొరవ చేయడంలో చూపదు, అలాంటి స్వార్ధమే ఒక వ్యక్తిలో నిండిపొతే సదరు వ్యక్తి ప్రవర్తన పొందడంలోనే ఉంటుంది. దానికోసం ఇతర వ్యవస్థల లేక ఇతరుల కర్తవ్యానికి కూడా అడ్డుపడతారు. అలాంటివారు ముందుగా డబ్బు, తరువాత పదవి దాంతో అవసరమైన వ్యవస్థ అందులో అధికారులపై పట్టుబిగిస్తూ ఉంటారు. అధికారం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రక్షణ వ్యవస్థే. రక్షణ వ్యవస్థలో కర్తవ్యతా భ్రస్టత ఏర్పడితే వ్యవస్థ చిన్నాబిన్నం అయ్యి సమాజంలో సమతుల్యత అదుపుతప్పుతుంది. అందుకే శాంతి భద్రతలను కాపాడే వ్యవస్థగా రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

కర్తవ్యమే కార్యంగా పనిచేసే అధికారులు సమాజంలో తాత్కాలిక కష్టాలు ఉంటే

వ్యవస్థలో స్వార్ధపరుల ఆటకట్టించే రక్షణవ్యవస్థలో రక్షణాదికారిగా ఒక స్త్రీ పనిచేస్తే అది కర్తవ్యంతో చేస్తే ఎలా ఉంటుందో కర్తవ్యం చిత్రం చూపుతుంది. సమాజంలో స్వార్ధంతో పెద్దమనుషుల బలంతో అధికారంతో ఆటలాడే వ్యక్తుల గురించి చెప్పడంలో దర్శకుడు ఎ మోహన్ గాంధి సిద్దహస్తుడు.  పూజకు పనికిరాని పువ్వు, ఆడపడచు, న్యాయానికి సంకెళ్ళు, మౌనపోరాటం, జడ్జ్ మెంట్, పీపుల్స్ ఎన్కౌంటర్, ఆశయం, పోలీసు బ్రదర్స్, సంభవం, శంఖారావం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కర్తవ్యం చిత్రాన్ని నిర్మించింది ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం. ఒకేఒక్కడు, ప్రేమికులరోజు, స్నేహం కోసం, బంగారం, ఖుషి, భారతీయుడు, పెద్దరికం లాంటి పలు చిత్రాలని నిర్మించారు.———————————–

తెలుగు చలన చిత్రం కర్తవ్యం కధలోకి వెళ్తే

మంత్రి బాబురావు (బాబుమోహన్) 32 ఫైళ్లపై అర్హతలు చూడకుండా సంతకం చేస్తే, ఆ ఫైళ్ల తాలూకా కుంభకోణం గురుంచి ప్రముఖ రాజకీయ వ్యక్తి దత్తు నిరాహారదీక్ష చేస్తాడు. మంత్రిబాబురావు సంతకాలు చేసిన ఫైళ్లలలో నగరంలో పెద్దమనిషి ముద్దుకృష్ణ (అట్లూరి పుండరీకాక్షయ్య) ఫైల్ కూడా ఉంటుంది. ఇదే విషయం అతనికి చెప్పి దత్తు సంగతి చూడమంటాడు మంత్రి. నేరాలు ఎదేచ్చగా చేస్తూ పోలీసు, న్యాయ వ్యవస్థలలో వ్యక్తులను డబ్బుతో లొంగదీసుకుంటూ ఉండే ముద్దుకృష్ణ దత్తుపై లారీని ఎక్కించేసి చంపించేస్తాడు. ఆ కేసుని CI కాశిపాతి, లాయర్ కలిసి అది ఆక్సిడెంట్ అని ఫైల్ క్లోజ్ చేస్తారు.

కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి ఏఎస్పి వైజయంతి నిజాయితీ గల అధికారి ఆమె వచ్చి ఈ ఫైల్ కేసు తిరిగి విచారణ చేపడుతుంది. ముద్దుకృష్ణ డబ్బు అధికారంతో ఆ కేసుని గెలుస్తాడు. డ్రైవర్ తప్పతాగి ఆ ఆక్సిడెంట్ చేసారని నిరూపిస్తారు. CI కాశిపతి చేతిలో అవమానపాలు అయిన పోలీస్ కానీస్టేబుల్ కొడుకు సూరిబాబు కాశిపతిని చంపబోయి ఇంకో కానిస్టేబుల్ ని కాలుస్తాడు. దాంతో సూరిబాబు ఉద్యోగం పోగొట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏఎస్పి వైజయంతి మారుటతల్లి కొడుకు ముద్దుకృష్ణ కొడుకుతో జతకట్టి అతనికోసం తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో పరీక్షా ప్రశ్న పత్రాలను దొంగిలించి అతనికి ఇస్తాడు. అలాగే వైజయంతి స్కూల్ మాస్టర్ గారి కూతురిని మానభంగం చేయడానికి ముద్దుకృష్ణ కొడుకుని అతని స్నేహితులు ప్రోత్సహిస్తారు. మానభంగానికి గురైన యువతి వెంటనే కోర్టుకి వెళితే, ముద్దుకృష్ణ కొడుకుని పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు.

CI కాశిపతి చెయ్యి విరక్కొట్టుకుని ఆ నేరం ముద్దుకృష్ణ కొడుకే చేసాడని నిరూపిస్తే, ఒకేవ్యక్తి ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో రెండు నేరాలు చేయలేడు, అలాగే మానభంగం కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందువలన కోర్టు ముద్దుకృష్ణ కొడుకుని కొద్దిపాటి శిక్ష విధిస్తుంది. ఈ నేరం విషయంలో వైజయంతి వదలదని భావించిన ముద్దుకృష్ణ తన కొడుకు పుట్టిన రోజుని ఘనంగా నిర్వహించి రాజకీయ యువ నాయకుడుగా మంత్రిచే చేయిస్తాడు. మానభంగం కేసులో శిక్ష తప్పించుకున్న ముద్దుకృష్ణ కొడుకుని కనుబొమలతో సహా గుండు గీసి బయటతిరగకుండా చేస్తాడు, సూరిబాబు. మండిపడ్డ ముద్దుకృష్ణ జైలులో ఉన్న సూరిబాబుని బయటకి లాక్కొచ్చి గొడవ సృష్టించి ఆ గొడవలో వైజయంతి కాళ్ళు విరిగేలాగా చేస్తాడు. కాళ్ళు విరిగినా మరలా కోలుకుని వృత్తిలో వచ్చిన వైజయంతి ముద్దుకృష్ణ అంతుచూస్తుంది. మానభంగం చేసేటప్పుడు ప్రోత్సహించిన ముద్దుకృష్ణ కొడుకు స్నేహితులు, అదే అమ్మాయికి తాళి కట్టేవిధంగా ప్రోత్సహించి, చేసిన తప్పు సరిదిద్దుకుంటారు.

అధికారి కర్తవ్యమే వ్యవస్థకు ఆధారం, సమాజానికి మేలు

వ్యక్తి కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి తన కర్తవ్యం తను నిర్వహించడంలో కాళ్ళు పోగొట్టుకున్న నిరుత్సాహపడకుండా పోరాడడమే ఈ చిత్ర కధాంశం. తన స్వార్ధ కోసం ముద్దుకృష్ణ చేసే తప్పుడు పనులను కర్తవ్యం గాలికి వదిలేసి రక్షణ శిక్షణ అధికారులు అమ్ముడు అయ్యే అధికారులు, కర్తవ్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టె అధికారులు ఈ చిత్రంలో కనబడుతారు. విజయశాంతి, వినోద్ కుమార్, సాయికుమార్, పిఎల్ నారాయణ, పరచూరి వెంకటేశ్వరరావు, చరణ్ రాజ్, నిర్మలమ్మ, బాబూమోహన్, నూతన్ ప్రసాద్, సాక్షి రంగారావు, పి.జె. శర్మ, సంజీవి, మోహన్, మీనా మొదలైనవారు నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హై స్కూల్ చదువు పూర్తిచేయని ఒక సాదారణ వ్యక్తి పోలీసులకు దొరకకుండా పోలీసు కమిషనర్ కొడుకు హత్యని ఆక్సిడెంట్ కేసుగానే క్లోజ్ అయ్యేలా చేయడం ఈ చిత్ర కధాంశం. చూస్తూ చూస్తూ ఉండే మనసు చూసే వస్తువునే తలుస్తుందట అలాగే ఎప్పుడు కేబుల్ టివి యజమానికూడా సినిమాలు చూస్తూ తెలివితేటలతో తన కుటుంబం చేసిన హత్యని ఆక్సిడెంట్ కేసుగా చూపుతాడు.

కనిపించేదంతా దృశ్యంగా ఉంటే అందులో మర్మం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. సినిమాల ద్వారా పోలీసుల దృష్టి ఎంతవరకు ఉంటుందో అవగాహనా పొందిన ఒక సినీ వీక్షకుడి నుండి వచ్చిన సస్పెన్స్ మూవీ దృశ్యం. కనిపిస్తున్నాయి కదా అని కానివి కోరుకుంటే కాయమే కోల్పోతామని మనసుని హెచ్చరించే దృశ్యమానందృశ్యంలో కనిపిస్తుంది. అన్ని అందుతుంటే సమయానికి సౌకర్యాలు సమకురుతూ సహజంగా ఇతరులను కూడా సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించేవారు ఉంటారు. జీవితం విలువ తెలియకుండానే సౌకర్యాలు ఎక్కువైతే వచ్చే అనర్ధాలు జీవితాన్ని కోల్పోయేవరకు సాగుతాయి.

ఇక కధలోకి వెళ్తే రాజవరంలో రాంబాబు కేబుల్ టివి నిర్వహిస్తూ ఉంటూ, కేబుల్ ఆఫీసులో సినిమాలు చూస్తూ ఉంటాడు.రాంబాబు అతని భార్య ఇద్దరు ఆడపిల్లలతో ఆఫీసుకి దూరంగా కాపురం ఉంటూ ఉంటారు. అంజు ఇంటర్ చదువుతుంటే, చిన్నమ్మాయి స్కూల్ కి వెళుతూ ఉంటుంది. అంజు కాలేజీలోనే కమిషనర్ కొడుకు వరుణ్ చదువుతూ ఉంటాడు. ఇంటి సభ్యులతో గడుపుతూ సరదాగా కేబుల్ ఆఫీసులో సినిమాలు చూస్తూ గడిపే మధ్యతరగతి వ్యక్తి రాంబాబు జీవితంలోకి వచ్చే విషాదానికి కారణమే కమిషనర్ కొడుకు వరుణ్ కోరిక.

ఆకర్షణలకు లొంగితే అది జీవితాలతో ఆడుకుంటుంది.

అతి చాదస్తపు అలవాట్లు ఇంటిపట్టున ఉండేవారిని ఇబ్బంది పెడితే, మితిమీరిన సౌకర్యాలు సమయం కానీ సమయంలో కూడని విషయాలవైపు తీసుకువెళతాయి. తండ్రి అనుమతితో కాలేజీ టూర్‌కి వెళ్ళిన అంజు బట్టల మార్చుకునేటప్పుడు వీడియో చిత్రీకరించి, సదరు వీడియోతో అంజుని తన కోరిక తీర్చవలసినదిగా వరుణ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. గతిలేని అంజు అమ్మ జ్యోతితో చెబుతుంది. జ్యోతి అంజులు కల్సి వరుణ్ కి నచ్చజెప్పబోతే అతను జ్యోతినే కోరికను తీర్చమని అంటాడు, ఆ మాట విన్న అంజు అతని తలపై బలంగా కొట్టగానే వరుణ్ మరణిస్తాడు.

వరుణ్శవాన్ని వారు పాతిపెట్టి రాంబాబు వచ్చిన తరువాత విషయం చెబుతారు. అక్కడ నుండి రాంబాబు వేసే అడుగులు పోలీసులకు అంతుబట్టదు. వరుణ్ వాడిన కారు దొరకగానే చిత్రం ఇంకా సస్పెన్స్ గా సాగుతుంది. చివరకి కుటుంబం మొత్తాన్ని ఇంట్రాగేషణ్ చేసిన ప్రయోజనం ఉండదు. కమిషనర్ రాంబాబుని రిక్వెస్ట్ చేసిన పిదప జరిగిన విషయం చెప్పి, వారి కొడుకు చేసిన తప్పుని తెలియజేస్తాడు.

ధర్మంగా తనపని తాను చేసుకుంటూ ఉండే సాదారణ వ్యక్తి చేతిలో నేర్చుకునే వయసులో నేర్వడం మాని పెడద్రోవ పట్టిన యువకుడు గతిని కనుక్కోవడానికి కమిషనర్ వల్ల కూడా కాకపోవడం ఈ చిత్రంలో విశేషం. ఆకర్షణకు గురై పరిది దాటి ప్రవర్తించిన యువకుడి జీవితం ముగిస్తే, ఆ ప్రభావానికి ఒక కుటుంబం ఆవేదనకు గురిచేసింది, దృశ్యం చిత్రంలో.

చిన్న పిల్లలకు ఖరీదు అయిన స్మార్ట్ ఫోను ఇచ్చినా, బంతి ఇచ్చినా ఒకేలాగా విసిరేస్తూ, కింద మీద పడేస్తూ ఆడుకుంటాడు. చల్లని నీరు వేడి నీరు అయినా నిప్పు అయినా ముట్టుకుంటాడు. జీవితం విలువ తెలియనివారు ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు, ఒక్కోసారి వారి జీవితం కోల్పోతారు. అలాంటి కోవలోకే వరుణ్ వెళ్ళాడు.

ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. కేబుల్ ఆపరేటర్ రాంబాబుగా వెంకటేష్, అతని భార్య జ్యోతిగా మీనా, వారి పెద్ద కూతురు అంజుగా (కృత్తిక జయకుమార్) చిన్న కూతురుగా ఎస్టర్, హెడ్ కానిస్టేబుల్ గా పరుచూరి వెంకటేశ్వరరావు, కమిషనర్ గా నదియా, కమిషనర్ భర్తగా నరేష్, వారి కొడుకు వరుణ్ గా రోషన్ బషీర్, కానీస్టేబుల్ వీరభద్రంగా రవి కాలే మొదలగు పాత్రల్లో ఇతరులు నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి

పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి అంటూ అన్న నందమూరి తారకరామారావుగారు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో పాడితే, ఆ చిత్రంలో హీరోగా నటించిన మోహన్ బాబు పుణ్యభూమి నాదేశం అంటూ సందేశాత్మక చిత్రం తీసారు. రెండింటికి నిర్మాత కధానాయకుడు మోహన్ బాబుగారే.

నటినటులు: మోహన్ బాబు, మీనా, శుభశ్రీ, బ్రహ్మానందం, బాబూమోహన్, దాసరి నారాయణరావు,
దర్శకుడు: ఏ కోదండరామిరెడ్డి
నిర్మాణం: శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్,
నిర్మాత: మోహన్ బాబు

పుణ్యభూమి నాదేశ తెలుగు చలనచిత్ర కధ

స్వాతంత్ర్య సమరయోధుడు తాతాజీ తన మనవడు భరత్ అనే బాలుడుతో  తాతగారు పెన్షన్ కోసం పెన్షన్ ఆఫీసుకి వెళతాడు. అక్కడ భరత్ ప్రభుత్వ అధికారులతో గొడవపడితే తాతగారు ప్రభుత్వ అధికారికి క్షమాపణ చెప్పమని చెబుతాడు. అప్పటిదాక బాగా చదువుకునే భరత్ ఆ సంఘటనతో తన పంధా మార్చుకుంటాడు. స్కూల్ మానేసి స్నేహితులతో ఆటలు ఆడుతూ చెడు అలవాటులకు చేరువ అవుతాడు. ఆఖరికి తాతాజీ గారి ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడు తామ్రపత్రాన్ని కూడా తాకట్టు పెట్టి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఈ విషయాలు తాతాజీగారికి తెలిసి గుండెపోటుతో మరణిస్తాడు. భరత్ ని ఆమె తల్లి ఇంటి నుండి తరిమి కొడుతుంది.

అలా ఇంటినుండి వెళ్ళిన భరత్ బంగారయ్య అనే పిసినారి కొడుకుని కాపాడి అతని దగ్గర చేరతాడు. బంగారయ్యకి లక్ష్మి కాలనీ ఉంటుంది, ఆ కాలనీలో అద్దె వసూలు చేస్తూ అదే లక్ష్మికాలనీలో భరత్ పెరుగుతాడు. సమాజంలో చెడుపై స్పందిస్తూ పత్రికల్లో కధనాలు వ్రాస్తూ జర్నలిస్ట్ స్వాతి అదే కాలనీలో ఉంటుంది. చైతన్యవంతంగా ఆలోచన చేస్తూ సాదారణంగా కాలనీ తిరిగే భరత్ కి జర్నలిస్ట్ స్వాతికి వాదం జరుగుతూ ఉంటుంది. బంగారయ్య కొడుకు శ్రీపతి కూతురు ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే బంగారయ్య శ్రీపతి ఇద్దరూ బాల్యమిత్రులు, వారిద్దరి వివాహం కాయం చేస్తారు. బంగారు తనకొడుకుతో బాటు భరత్ పెళ్లికూడా చేయాలనీ చూస్తాడు.

శ్రీపతి ద్వారా లక్ష్మికాలనీ భూమి అంతా గనితో నిండి ఉందని, మంత్రికి, గుండా కాళీకి, ఆవులయ్యకి తెలుస్తుంది. ఎలాగైనా లక్ష్మికాలనీ కాళీ చేసి ఆ గనిని స్వాధీన పరుచుకోవాలని చూస్తారు. లక్ష్మి కాలనీ మతగొడవలు సృష్టించి, ఆ కాలనీ స్వాదీనపరచుకోవాలని చూస్తారు, అయితే భరత్ మాటలతో కాలనీ వాసులు తేరుకుని వచ్చిన ఆవులయ్య, మంత్రిని, పోలీసులని, శ్రీపతిని రాళ్ళతో కొట్టి వెనుకకు పంపిస్తారు. కాళి బంగారయ్యతో లక్ష్మికాలనీ తనకు అమ్మేసినట్టు పత్రాలు వ్రాయించుకుని బంగారయ్యని తన మనుషులతో చంపించేసి, లక్ష్మికాలనీలో చెట్టుకు వ్రేలాడదీస్తారు.

భరత్ కాళీ, శ్రీపతి, ఆవులయ్య మొదలైన దుర్మార్గులను కాల్చి చంపుతాడు, కోర్ట్ భరత్ కి ఉరిశిక్ష విధిస్తుంది. తనని నాలుగు గోడలమధ్య కాకుండా నలుగురి మద్య భగత్ సింగ్ మైదానంలో ఉరి తీయలవసినదిగా భరత్ ఆఖరికోరికగా తెలియజేస్తాడు. అందరు చూస్తూ ఉండగా ఉరి తీయబోతున్న సమయంలో కోర్టు వారు ఉరిశిక్ష రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తారు. కాని కాల్పులలో మరణించని కాళి మరలా తుపాకీతో అక్కడ దాడి చేస్తాడు. భరత్ కాళిని చంపడంతో చిత్రం ముగుస్తుంది.

సందేశాత్మక సామజిక ఇతివృత్తం పుణ్యభూమి నాదేశం చలనచిత్రం

మొండివాడు రాజుకంటే బలవంతుడు అని భరత్ ని చూసి అంటారు ఈ చిత్రంలో బంగారయ్య పాత్రలో దాసరి నారాయణరావు గారు. నీ మాటల తూటాలు, నీ మాటలతో విప్లవ జ్వాల వెలిగించు అని భరత్ ని చూసి అంటుంది జర్నలిస్ట్ స్వాతి. భరత్ ని మావయ్య అంటూ పిలిచి ఒక కుర్రవాడు కధ చెప్పమంటే, అందుకు భరత్ బ్రతకలేక చావడం చావలేక బ్రతకడం ఇదే పెద్ద కధ అని చెబుతాడు. అయితే భరత్ కాలనీలో అన్యాయాన్ని భరిస్తూ బ్రతికేవారిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. కులమతాలను వాడుకుంటూ సమాజంలో రాజకీయం చేసే నాయకులంటే ఏవగింపుగా ఉండే భరత్ వారిని ఎదురించడంలో చూపించే ధైర్యం లక్ష్మికాలనీ వాసులకు మార్గదర్శకంగా ఉంటుంది.

కులం అనేది బంధాలను సక్రమంగా పెంచుకునే ప్రక్రియలో భాగంగా అనేక కుటుంబవ్యవస్థలను కలిగి వర్ణ వ్యవస్థగా ఏర్పడినది. అంతేకాని కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేయమని లేక కులాన్ని అడ్డుపెట్టుకుని చెడుని సమర్ధించమని కాదు. మతం అనేది జీవనమార్గంలో నిచ్చెన ఎక్కే సాధనా సంప్రదాయం కాని ప్రచారం చేసుకునే ప్రక్రియ కాదు, పారమార్ధిక ధర్మాలను పదిమందికి తెలియపరచడమే మతం అవుతుంది కానీ ఒకరి సిద్దాంతాలు ఇంకొకరిపై రుద్దడం మతం అవదు.

పుణ్యభూమి నాదేశం చిత్రం అంతా సమాజంలో ఉండే కులమత ఘర్షణలు వాటిపై అజ్ఞానంతో ఆలోచనచేసే లక్ష్మి కాలనీ వాసులను చూపుతూ ఉంటుంది. వాటిని చూస్తూ నవ్వుకునే భరత్ వారికోసమే దుష్టశిక్షణ చేస్తాడు. మతంపేరుతో మోసం చేసే వారు మోసపోయేవారు, భయం సమాజంలో ఎలా వ్యాపించి ఉందో, ఈ చిత్రం చూపుతుంది. భరత్ పాత్రలో మోహన్ బాబు, బంగారయ్యగా దాసరి నారాయణరావు, స్వాతిగా మీనా, శ్రీపతిగా గొల్లపూడి మారుతిరావు, అవులయ్యా గా ఏవిఎస్, భరత్ తల్లిగా అన్నపూర్ణ నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు

చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకుంటే సరదాగా సమయం గడిచిపోతుంది. మనసు విశ్రాంతి కలుగుతుంది. కొంత సమయం సినిమా హాలులో కూర్చోబెట్టి, ఆ కొంత సమయంలోనే మధ్యలో విశ్రాంతి ఇస్తారు. ఒక గంటా పదిహేను నిమిషాలపాటు నిరంతరంగా పనిచేసే మనిషి ఇంద్రియాలకు విశ్రాంతి సమయం ఇచ్చి మరల ప్రారంభిస్తారు. డ్రామా సినిమా యాక్షన్ సినిమా అయినా భక్తీ చిత్రం అయినా కుటుంబ కధా చిత్రం అయినా ప్రేమ కధా చిత్రం అయిన చివరి హాస్య చిత్రం అయినా గంటదాటాక విశ్రాంతి మాములే.

నేడు చిత్రంగా పిల్లలు కూడా చదువు అని పుస్తకాలూ మోసి మోసి, చదివి చదివి ఒత్తిడిలోకి నెట్టబడడమే ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. ఇలా చదువుకునే వారి దగ్గర నుండి కుటుంబ భాద్యత రిత్యా కష్టపడే కష్టజీవి అందరు ఎదో ఆర్ధిక సమస్య అనో, కుటుంబ సమస్య అనో, ఆరోగ్య సమస్య అనో ఒత్తిడికి లోనయ్యేవారి శాతం అధికమే. ఒత్తిడికి దూరంగా అంటే చతురతకు దగ్గరగా వెళ్ళడమే అంటారు. చతురత అంటే హస్యమంటారు.

హాస్య చిత్రాలలో హాస్యకధానాయకుడిగా కామెడీ చేసే హీరోలలో మనకి రాజేంద్ర ప్రసాదు గారి చిత్రాలు చాలానే చాలా మందిని సంతోషపెట్టాయి. కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలు ఆడే హాలుకు వెతుక్కుని మరి వెళ్లి చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ చిత్రాలకు ఆదరణ సాదారణ ప్రేక్షకులతో బాటు ప్రముఖ వ్యక్తులు కూడా అభిమానులే అంటారు. చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు

యూట్యూబ్ – వీడియో వీక్షణలకు

ఇంతకుముందు కామెడీ చిత్రాలు చూడాలంటే ధియేటర్లకు వెళ్ళడం లేకపోతే CD/DVD ల ద్వారా వీక్షించడం ఉండేది. కానీ కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకోవడానికి కామెడీ కోసం కామెడీ సీన్స్ స్మార్ట్ ఫోన్లతో యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. హీరో రాజేంద్రప్రసాద్ చిత్రాలలో కామెడీ చిత్రాల గురించి సంక్లిప్త వివరణ.

చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు లాంటి హాస్య చిత్రాలు

అహనా పెళ్ళంటా

జంధ్యాల కలం నుండి జాలువారిన హాస్య కధనం అహనా పెళ్ళంటా చిత్రం. పిసినారితనాన్ని తారాస్థాయిలో చూపించిన కామెడీ మూవీ. కోటశ్రీనివాసరావు పిసినిగొట్టుతనానికి బ్రహ్మానందం ముఖ కవళికలు కామెడీగా ఆకట్టుకుంటాయి. ఒక ఆస్తిపరుడు కొడుకు ఈ పిసినారి కూతుర్ని ప్రేమించి, తండ్రితో పందెం కట్టి ఈ పిసినారి ఊరికి వచ్చి తను పిసినిగొట్టుతనంలో పండితుడుగా నటిస్తాడు. రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. జంద్యాలగారు దర్శకత్వం వహించారు.

బామ్మా మాట బంగారు బాట

రాజేంద్ర ప్రసాద్, గౌతమి, భానుమతి, నూతన్ ప్రసాద్, ఏవిఎం బ్యానర్ నిర్మించారు. రాజశేఖర్ దర్శకత్వం వహించారు. బామ్మా మీద కోపంతో అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయినా యువకుడు ఒక అమ్మాయిని పెళ్లిచేసుకుని పట్నంలో కాపురం పెడతాడు. బెంగపెట్టకున్న బామ్మా మంచాన పడుతుంది. అనుకోకుండా పట్నంపోయిన మనవడికి మగపిల్లవాడు పుట్టినట్టుగా విన్న బామ్మ తేరుకుని మనవడి దగ్గరికి ముని మనవడిని చూడడానికి వస్తుంది. ఆ అబద్దాన్ని నిజం చేయడానికి ఆ దంపతుల పాట్లు చిత్ర కధాంశం. కారుతో కామెడీ సన్నివేశాలు రాజేంద్ర ప్రసాద్, నూతన ప్రసాద్‌ల కామెడీ ఆకట్టుకుంటుంది.

చెట్టుకింద ప్లీడర్

వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చక్కటి కామెడీతో బాటు చక్కని పాటలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ఒక డబ్బున్న గోపాల కృష్ణ అనే వ్యక్తి సుజాత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని చనిపోతే, అతని ఆస్తిని ఆమెకు దక్కకుండా సదరు బంధువులు ఆమెకు లాయర్ నోటిసు పంపిస్తారు. సుజాత – గోపాలకృష్ణలకు అసలు వివాహమే కాలేదు అని ఆమె ఆస్తి కోసం అబద్దం చెబుతుందని. బాలరాజు అనే వాదనలో అనుభవం లేని ప్లీడర్ సహాయంతో ఆమె తన ఆస్తిని తను దక్కించుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్, కిన్నెర, ఊర్వసి, గొల్లపూడి మారుతీరావు, శరత్ బాబు, మల్లిఖార్జునరావు తనికెళ్ళ భరణి తదితరులు నటించారు.

రెండురెళ్ళు ఆరు

జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కధా హాస్యచిత్రంలో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, రజని, ప్రీతి, సుత్తివీరభద్రరావు, శ్రీలక్ష్మి, సుత్తివేలు, తదితరులు నటించారు. బాల్యవివాహం జరిగిన ఇద్దరు బాలబాలిక జంట పెరిగి పెద్దయ్యాక కూడా పట్నంలో తామెవరో వివరం తెలియకుండానే వారిద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఇద్దరికీ చిన్ననాటి బాల్య వివాహం సమస్యగా ఉంటుంది. ఊరిలో పెద్దలు బాల్యవివాహాన్ని యువవివాహంగా చేయడానికి కబురుచేసే వారిరువురు తమతమ స్థానంలో ఇతరులను పంపిస్తారు. అలా వెళ్ళిన వారు ఏమయ్యారు, బాల్యవివాహం చేసుకున్న వారు ఎలా కలిసారు. అదే చిత్ర కధాంశం.

చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం

రేలంగి నరసింహారావు హాస్య చిత్రదర్శకుల దర్శకత్వంలో వచ్చిన చలాకిమొగుడు చాదస్తపు పెళ్ళాం చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రజని,సీత నిర్మలమ్మ తదితరులు నటించారు. ఉద్యోగం చేసుకునే వ్యక్తి పెళ్లిచేసుకుని, ఆ దంపతులు కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లికూతురికి ఉన్న బామ్మ తన చాదస్తపు ప్రభావం మనవరాలి కొత్త కాపురంపై ప్రభావం చూపుతుంది. చాదస్తపు అలవాట్ల్తతో ఉన్న భార్యతో చలాకిమొగుడు పాట్లు చిత్రకధాంశం.

బంధువులొస్తున్నారు జాగ్రత్త

శరత్ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కధా హాస్యచిత్రంలో రాజేంద్ర ప్రసాద్-రజని జంటగా నటించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని వంటరివాడుగా ఉండే చిట్టిబాబు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ, బంధువులు అంటే అభిమానం పెంచుకుంటాడు. అలా ఉండే చిట్టిబాబు ఎక్కువమంది బంధువులు కలిగిన తన స్నేహితుడు సుధాకర్ ఇంటికి పెళ్ళికి వెళ్తాడు. అలా పెళ్ళికి వెళ్ళిన చిత్తబాబుకి, సుధాకరు చిన్నాన్న కూతురికి ప్రేమ పుడుతుంది. తత్ఫలితంగా వారు ఒకటై కొత్త కాపురం ప్రారంభిస్తారు. కొత్తకాపురంలో బంధువుల తాకిడి తగులుతుంది. బంధువులంటే అభిమానం ఎక్కువగా ఉండే చిట్టిబాబు సంసారంలో బంధువుల బాగోతమే ఈ చిత్ర కధాంశం.

లేడీస్ టైలర్

సుందరం తన చేస్తున్న దర్జీ పనిమీద దృష్టి పెట్టడం మానేసి జాతకాల మీద నమ్మకంతో అదృష్ట ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి తొడపై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లిచేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అని చెబుతారు. ఊరిలో బట్టలు అమ్మేవ్యక్తి బట్ల సత్యం సహాయంతో ఊరిలో పెళ్ళికాని అమ్మాయలకు ఎవరి తొడపై పుట్టుమచ్చ ఉందో వెతికే పనిలో పడతాడు. ఆ ప్రయత్నంలో ఊరిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయనితో ప్రేమలో పడతాడు. చివరికి పుట్టుమచ్చ ఉన్నది లేనిది అనే అంశం ప్రక్కన పెట్టి ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. రాజేంద్ర ప్రసాద్, అర్చన, శుబలేఖ సుధాకర్ తదితరులు నటించారు, వంశి దర్శకత్వం వహించారు.

అప్పుల అప్పారావు

అందరి దగ్గర అప్పులు చేస్తూ అప్పులవాళ్ళతో ఇంటిదగ్గర క్యూ కట్టించుకునే అప్పారావు అప్పుల అప్పారావుగా ప్రసిద్ది. అతనికి అప్పు తీసుకోవడమే కానీ తీర్చడం ఉండదు. అలా అప్పారావుకి డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి ఇస్తాడా ఇవ్వడా అంటూ మంచమెక్కిన ఒక వ్యక్తి ఆసుపత్రి పాలు అవుతాడు. అప్పారావుకి అప్పునే తలుస్తున్న ఆ వ్యక్తి అప్పారావు చేతుల మీదుగా అప్పు తిరిగి తీసుకోగానే మరణిస్తాడు. సాదారణంగా అప్పులు తీసుకున్నవారు ఇబ్బంది పడితే, ఇక్కడ అప్పు తీసుకున్న అప్పారావు హ్యాపీగా అప్పులు చేస్తూ బ్రతికేస్తూ ఉంటాడు. అటువంటి అప్పారావు ప్రేమ కధ అనేక మలుపులు తిరిగి ఇద్దరి పెళ్ళాల పెళ్ళితో ముగుస్తుంది.

ఏప్రిల్ 1 విడుదల

వంశీ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ విలక్షణ కామెడీ హిట్ చిత్రాలుగా ఉంటాయి. అటువంటి వాటిలో ఏప్రిల్ 1 విడుదల. నెలరోజుల పాటు నిజమే చెప్పాలనే పందెం ఈ చిత్రం యొక్క కధాంశం. ఫంక్షన్లకు వీడియో షూటింగ్‌లు చేస్తూ, ఇంటికి కాసెట్లు అద్దెకు ఇచ్చే దివాకరం అందరితోనూ అబద్దాలే చెబుతూ ఉంటాడు. అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం, తమ పందెం విషయం ఎవరికీ చెప్పకుండా కేవలం నిజాలే చెప్పడం మొదలుపెడతాడు. అలా నిజాలు చెప్పి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. అయినా అబద్దం చెప్పడు. అతనిని వదిలించుకుందాం అని పందెం కాసిన ఆ అమ్మాయి అతని సిన్సియారిటికి అతన్ని పెళ్లి చేసుకోవడంతో చిత్రం ముగుస్తుంది.

మాయలోడు ఆ ఒక్కటి అడక్కు రాజేంద్రుడు గజేంద్రుడు ఆ n నలుగురు

మాయలోడు

వీధులలో గారడి చేసే వీరబాబు ఒక చిన్నపాప కళ్ళు తెప్పించడానికి అని పాటుపడుతూ ఉంటాడు. అయితే ఆ పాపా మేనమామే అప్పలకొండ ఆ పాపని చంపాలని చూస్తాడు. అలాగే వీరబాబుని హత్యకేసులో ఇరికిస్తాడు. జైలుకి వెళ్లిన వీరబాబు జైలులోనే ఉంటూ తన మాయ విద్యలతో అప్పలకొండ ఆట ఎలా కట్టించాడో ఈ చిత్ర కధాంశం. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య, నిర్మల, గుండు హనుమంతరావు, బ్రహ్మానందం, అలీ బాబు మోహన్, పద్మనాభం తదితరులు నటించారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, స్టొరీ, సంగీత దర్శకత్వం చేసారు. కామెడీ చైల్డ్ సెంటిమెంట్ చిత్రం సరదాగా ఉంటుంది.

ఆ ఒక్కటి అడక్కు

కష్టపడకుండా కోటీశ్వరుడు అవుదామని జాతకాన్ని నమ్మి సంవత్సరంలో నేనే కింగుని అనుకుంటూ కాళిగా తిరిగే అటుకుల చిట్టిబాబుని, కష్టపడి కోటీశ్వరుడు అయిన రొయ్యలనాయుడు కూతురు రంభ ప్రేమిస్తుంది. జ్యోతిష్కుడు కుడా రంభని పెళ్లి చేసుకుంటే కోట్లు కల్సి వస్తాయంటే, రంభని పెళ్లి చేసుకోవడానికి చిట్టిబాబు సిద్దపడతాడు. అయితే అప్రయోజకుడుగా తిరుగుతూ ఉండే అటుకుల చిట్టిబాబుతో పెళ్ళికి రొయ్యలనాయుడు ఒప్పోకోడు. రంభ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో పగటి కలలు కనే చిట్టిబాబుని లక్ష కట్నం ఇచ్చి నా కూతుర్ని పెళ్లిచేసుకో అనిచెబుతాడు. లక్ష కట్నం కోసం చిట్టిబాబు ప్రయత్నాలే చిత్ర కధాంశం. రాజేంద్ర ప్రసాద్, రంభ, రావుగోపాలరావు, రాధాబాయి తదితరులు నటించారు.

రాజేంద్రుడు గజేంద్రుడు

రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రుడుగా ఏనుగు గజేంద్రుడుగా ఈ చిత్రం హాస్యభరితంగా ఉంటుంది. ఇంటి అద్దెకూడా కట్టుకోలేని రాజేంద్రుడుకి గజేంద్రుడు బహుమతి లాటరీలో వస్తుంది. తనకే తిండికి గతిలేనిది తను ఏనుగుకి తిండి పెట్టడం ఎలా అనుకుంటూనే అదృష్టాన్ని నమ్మకుని ఏనుగుని ఇంట్లో పెడతాడు. a విషయంలో అద్దేవిషయంలో చెప్పినట్టే ఇంటి యజమానికి మాయమాటలు చెప్పి ఒప్పిస్తాడు. రాజేంద్రుడు గజేంద్రుడు ఎలా కలిసి సహజీవనం చేస్తారో ఈ చిత్రం చూడాల్సిందే. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఇంకా సౌందర్య, గుండు హనుమంతరావు, కోటశ్రీనివాసరావు, గుమ్మడి, బ్రహ్మానందం, అలీ, బాబుమోహన్ తదితరులు నటించారు.

ఆ నలుగురు

కామెడీ చిత్రాలతో నవ్వించే రాజేంద్ర ప్రసాద్ కొన్ని సందేశాత్మక చిత్రాలలో కూడా నటించారు. అటువంటి వాటిలో ఆనలుగురు విమర్శకుల ప్రశంశలు పొందిన చిత్రం. కుటుంబంపై ఎంత భాద్యత ఉందో సమాజంపై కూడా అంటే భాద్యతతో మెసిలే ఓ మాములు మధ్యతరగతి వ్యక్తి కధ. పత్రిక ఎడిటర్ గా ఉంటూ, సమాజంలో అందరి క్షేమం కోరుతూ వచ్చిన డబ్బుతో విలవలు కాపాడుకుంటూ జీవించిన వ్యక్తికి అతని కొడుకులు తలగోరివి పెట్టడడం కన్నా డబ్బే ప్రధానంగా భావిస్తే సమాజంలోంచి అతని కోసం వచ్చిన స్పందన చూసి తీరాల్సిందే. రాజేంద్ర నటన అద్బుతంగా ఉంటే, ఈ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం చంద్ర సిద్దార్ధ వహించారు.

మిస్టర్ పెళ్ళాం

రాజేంద్ర ప్రసాద్ – ఆమని జంటగా మధ్యతరగతి ఉద్యోగులుగా ఈ చిత్రం సరదాగా సందేశాత్మాకంగా సాగుతుంది. ఉద్యోగానికి వెళ్ళే భర్తకి ఇంట్లో ఇద్దరి పిల్లలకి సమయానికి సేవచేస్తూ భర్తని ఆఫీసుకి పిల్లలని స్కూలుకి పంపించే ఇల్లాలుగా ఆమని నటన అందరిని ఆకట్టుకుంటుంది. బ్యాంకు ఉద్యోగిగా ఉండే రాజేంద్ర ప్రసాద్ బ్యాంకు మేనేజర్ చేత మోసగింపబడి ఉద్యోగబ్రష్టుడు అవుతాడు. కుటుంబ భాద్యతగా ఆమని ఉద్యోగం చేయడం, రాజేంద్ర ప్రసాద్ వంటచేయడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఇద్దరి మద్య వచ్చే చిన్న చిన్న తగాదాల ఫలితం ఏమిటి, చివరికి భర్త ఉద్యోగిగా మారడం చిత్ర కధాంశం. బాపు దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కావ్యం.

ఇంకా రాజేంద్ర ప్రసాద్ కామెడీ మూవీస్ గోల్ మాల్ గోవిందం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, భలేమొగుడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, బ్రహ్మచారి మొగుడు, అత్తింట్లో అద్దె మొగుడు, వద్దుబావా తప్పు,

దొంగకోళ్ళు, ఆలీబాబా అరడజను దొంగలు, పెళ్ళాం పిచ్చోడు, వాలుజడ తోలుబెల్ట్, పేకాట పాపారావు, తెనేటిగ, వివాహ భోజనంబు, జూలకటక, చిక్కడు దొరకడు, అల్ రౌండర్, కొబ్బరిబొండం, ఖుషి ఖుషిగా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ముత్యమంత ముద్దు, శ్రీరామచంద్రులు తదితర చిత్రాలు కలవు.

చిత్రం భళారే విచిత్రం చంటబ్బాయ్ ఆడుతూ పాడుతూ

చిత్రం భళారే విచిత్రం

నగరంలో ఉద్యోగం లేని నిరుద్యోగులు, అద్దెకు ఉండే ఉద్యోగుల చిత్రంగా పడే పాట్లు విచిత్రంగా ఈ సినిమాలో కనిపిస్తాయి. మూవీ పేరు చిత్రం భళారే విచిత్రంగా ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుంది. సుధాకర్, బ్రహ్మానందం స్నేహితుడుతో కలిసి గరుడాచలం ఇంట్లో అద్దెకు ఉంటుంటే వారికి తోడూ ఉద్యోగాల వేటకు రాజా రాఘవ వస్తారు. మద్యం సేవించి నానావాగుడు వాగినందుకు గరుడాచలం సుధాకర్‌ని అతని స్నేహితుల్ని ఇంట్లోంచి గెంటివేస్తాడు. అద్దె ఇల్లు కోసం రాజా ఆడవేషంలో వారు ఒక కుటుంబంలాగా అద్దింట్లో వారు పడే పాట్లు ఈ చిత్ర కధాంశం. జంధ్యాల దర్శకత్వంలో నరేష్, బ్రహ్మానందం, శుబలేఖ సుధాకర్, మహర్షి రాఘవ, కోట శ్రీనివాసరావు తులసి తదితరులు నటించారు.

చంటబ్బాయ్

చిరంజీవి హాస్యభరితంగా నటించిన చిత్రం చంటబ్బాయ్, ఈ చిత్రానికి జంధ్యాల దర్శకత్వం వహించారు. డిటెక్టివ్ ఏజెన్సీ కంపెనీలో డిటెక్టివ్ జేమ్స్ పాండ్(చిరంజీవి) గా పనిచేస్తూ, మర్డర్ చేసిన తమ కంపెనీ మేనేజర్ నేరాన్ని బయటపెట్టి ప్రమోషన్ పొందుతాడు. ఆ కేసులో పరిచయమైనా జ్వాల(సుహాసిని) స్నేహితురాలి(ముచ్చెర్ల అరుణ)అన్నయ్యని వెతికి పట్టుకునే కేసుని జేమ్స్ పాండ్ స్వీకరిస్తాడు. ఇన్వెస్ట్ గేటు చేసి ఒక వ్యక్తిని చంటబ్బాయ్ గా తీసుకువస్తే, ఇంకొకరు వచ్చి నేనే చంటబ్బాయ్ అంటాడు. చివరకి చంటబ్బాయ్ ఎవరు అనేది చంటబ్బాయ్ చేత కనుగొనబడడం ఈ చిత్ర విశేషం. చిరంజీవి, సుహాసిని, అల్లు అరవింద్, చంద్రమోహన్,ముచ్చెర్ల అరుణ, జగ్గయ్య తదితరులు నటించారు.

ఆడుతూ పాడుతూ

గోపి సొంతబస్సు ఉండి, కిరాయిలు దొరక్క ఇంటికి అద్దె కట్టలేక, నగరంలో స్థిరంగా ఉండే ఇల్లు లేక గోపి(శ్రీకాంత్) అతని స్నేహితుడు పాపారావు(సునీల్) ఇద్దరూ బాచిలర్స్ బస్సులోనే నివాసం ఉంటూ ఉంటారు. అలాంటిది వారి బస్సింట్లోకి అంతుబట్టని భాషలో మాట్లాడే అమ్మాయి వచ్చి చేరుతుంది. ఆ అమ్మాయని వదిలించుకునే ప్రయత్నంలో గోపి ఆ అమ్మాయితో ప్రేమలో పడడం జారుతుంది. దుబాయ్ వెళ్లాలనుకునే పాపారావు పాస్ పోర్ట్ కొట్టేసిన ఎలుకపై పాపారావు రివెంజ్ సన్నివేశాలు కామెడీగా ఉంటాయి. శ్రీకాంత్, సునీల్, గాయత్రి తదితరులు నటించారు.

ప్రముఖ హాస్య దర్శకుల చిత్రాలు చాలానే తెలుగులో ఉంటాయి. జంధ్యాల, ఈవివి సత్యనారాయణ లాంటి దర్శకుల నుండి అనేక కామెడీ చిత్రాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ట్రెండ్ అయితే యాక్షన్ చిత్రాల్లో కూడా కామెడీ కలసి ఉండే విధంగా చిత్రాలు సాగుతున్నాయి. వాటిలో వెంకి, డి, రెడీ, రేసుగుర్రం, శంకర్ దాదా MBBS వంటి చిత్రాలు కామెడీ వంతు ఎక్కువగానే ఉంటుంది. చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు మొదలైన చిత్రాలు యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి

రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి: రమ్యకృష్ణ బహు భాషలలో నటించిన నటిమణి, దర్శకుడు కృష్ణవంశీ భార్య. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలతో బాటు టెలివిజన్ కార్యక్రమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటి. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు చలనచిత్రం బాహుబలిలో ప్రధాన పాత్రను పోషించింది. దక్షిణాది అగ్రహీరోలందరితో నటించింది. 1989 సూత్రదారులు తెలుగు చిత్రంలో మంచినటిగా గుర్తింపు వచ్చినా అవకాశాలు అల్లుడుగారు చిత్రంతో పెరిగాయి. ఈ చిత్రంలో ముద్దబంతి నవ్వులో మూగ బాసలు అంటూ సాగే పాట బాగుంటుంది, మూగమ్మాయి పాత్రలో రమ్యకృష్ణ చక్కగా నటించింది.

అల్లరి మొగుడు చిత్రంలో నటి మీనాతో కలసి నటించిన రమ్యకృష్ణ అల్లరి అల్లుడు చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో నటించింది. అల్లరి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, ఆయనకిద్దరూ, అదిరింది అల్లుడూ, అల్లుడా మజాకా, అమ్మోరు, ఆహ్వానం, అన్నమయ్య చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇలా అతో ప్రారంభం అయ్యే సినిమాలు రమ్యకృష్ణకి బాగానే కలిసి వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఇతర హీరొయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు అలా రంభ, మీనా, సౌందర్య, నగ్మా నటించిన చిత్రాల్లో జరిగింది.

చిరంజీవి, బాలకృష్ణ, రజనికాంత్, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్ తెలుగు హీరోలతో తెలుగు చిత్రాలలో రమ్యకృష్ణ జతకట్టి ప్రేక్షకులను అలరించారు. నటనతో మెప్పించగల సామర్ధ్యం ఉండి, అందాల ఆరబోతకు ఆమె వెనకడుగు వేయలేదు. హలో బ్రదర్ చిత్రంలో హాట్ గర్ల్ లాగా నాగార్జున అక్కినేనితో కల్సి నటించారు. నటనలో కూడా అంత పవర్ ఫుల్ గా నటించింది. రమ్యకృష్ణ నరసింహ చిత్రంలో రజనికాంత్ తో పోటిపడి నటించి చిత్రాన్ని రక్తికట్టించింది.

సోగ్గాడి పెళ్ళాం చిత్రంలో అమాయకపు పల్లెటూరి ఆడపడచుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కంటే కూతుర్నే కను చిత్రానికి గాను రమ్యకృష్ణకి ఉత్తమ నటిమణి నంది పురష్కారం గెలుపొందారు. రాజు మహారాజు చిత్రంలో నటనకుగాను ఉత్తమ సహాయనటి నంది పురష్కారం గెలుచుకున్నారు. ఆహ్వానం చిత్రంలో సగటు మధ్యతరగతి ఇల్లాలుగా డబ్బు వ్యామోహంలో వేరే అమ్మాయిని వివాహం చేసుకునే భర్తకి ఎంత శాస్త్రబద్దంగా పెళ్లి జరిగిందో అంతే శాస్త్ర బద్దంగా విడాకుల వేడుక నిర్వహించే విబిన్న మహిళగా రమ్యకృష్ణ నటించారు.

బాహుబలి సీక్వెల్ చిత్రాలలో శివగామి రాజమాతగా

వయసు తగ్గ ప్రధాన పాత్రల్లో కూడా ఆమె నటన అందరిని ఆకట్టుకోవడం విశేషం, బాహుబలి చిత్రంలో రాజమాత అంటే ఏమిటో ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టు తెలుగు తెరపై నటించి చూపారు. రాజమాత శివగామి పాత్ర ప్రసిద్ది చెందడంలో రమ్యకృష్ణ నటన అంత బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ఉత్తమ సహాయక పాత్రగా నంది, ఫిలిం ఫేర్ పురష్కారాలు గెలుపొందారు. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో నాగార్జునకు తల్లిగా, భార్యగా నటించారు.

తెలుగు జెమినీ టివి ఛానల్ బంగారం మీకోసం కార్యక్రమానికి రమ్యకృష్ణ హోస్ట్ గా చేసారు అలాగే తమిళ భాషలో సన్ టివి కార్యక్రమాల్లో హోస్ట్ గా ఉన్నారు. ప్రస్తుతం నాగచైతన్య, అను ఇమ్మన్యుయల్ జంటగా రూపొందుతున్న శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో రమ్యకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్నారు. శైలజారెడ్డి అల్లుడు విడుదలకు సిద్దంగా ఉంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి

మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి: కొంతమంది సినీజీవితం బాల్యం నుండే ప్రారంభం అవుతుంది, అలా బాల్యం నుండే సినిమాలలో నటించిన నటి మీనా. సిరివెన్నల, రెండురెళ్ళు ఆరు చిత్రాల్లో బాలనటిగా నటించిన మీనా కర్తవ్యంలో సినిమాలో మినిస్టర్ కొడుకు చేత మోసగింపబడిన చేయబడిన యువతిగా నటించింది. చెంగల్వ పూదండ చిత్రంలో నెచ్చెలిగా నటించి నవయుగంలో కనిపించింది.

సీతరామయ్యా మనవరాలిగా ప్రసిద్దికెక్కి చంటితో జతకట్టి సుందరకాండ చేసే అబ్బాయిగారితో సూర్యవంశంలో  పెళ్ళాం చెబితే వినాలి అంటూ గిల్లికజ్జాలు పెట్టుకునే అల్లరిమొగుడుతో మొరటోడు నామొగుడు అంటూ అల్లరిఅల్లుడుతో అల్లరిపిల్లగా నటించింది. పంజరం, చిలకపచ్చకాపురం, భరతసింహారెడ్డి, కొంగుచాటు కృష్ణుడు, బొబ్బిలివంశం అమ్మాయికోసం శ్రీవాసవివైభవం పుట్టింటికి రాచెల్లి అంగరక్షకుడు రాజేశ్వరికళ్యాణం జగన్నాటకం పేరులేనిసినిమా సింహాచలం స్నేహంకోసం ముద్దులమొగుడు బొబ్బిలిసింహం ఇంద్రభవనం అశ్వమేధం ప్రెసిడెంటుగారి పెళ్ళాం, ముఠామేస్త్రి, కృష్ణబాబు, వెంగమాంబ మాఅన్నయ్య చిత్రాలలో నటించింది.

సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో మనవరాలు పాత్రలో తెలుగింటి ఆడపడచులా అందరిని ఆకట్టుకున్నారు. చంటి సినిమాలో అతి అభిమాని అన్నయ్యల నిర్భందంలో ఉండే తెలుగుంటి అమ్మాయిగా అలరించారు. పెళ్ళాం చెబితే వినాలి చిత్రంలో ఒక చదువుకున్న అమ్మాయిగా తన తోడికోడళ్ళు కుటుంబ గౌరవం కోసం తపనపడే కోడలి పిల్లగా అక్కట్టుకున్నారు. సుందరకాండ చిత్రంలో అమాయకపు పల్లెపడచుగా అందరిని అలరించారు. అల్లరిఅల్లుడు, బొబ్బిలిసింహం, ముఠామేస్త్రి చిత్రాలలో చలాకి అమ్మాయిగా అల్లరిఅమ్మాయి అయ్యి అక్కట్టుకుంటే ప్రెసిడెంటుగారి పెళ్ళాం చిత్రంలో పొగరుబోతు అమ్మాయిగా దృశ్యంలో స్వామిలో పుణ్యభూమి నాదేశం చిత్రంలో నటించింది.

తెలుగు కుటుంబానికి చెందిన ప్రముఖ తమిళ నటి రాజమల్లిక కూతురు అయిన మీనా కళాత్మకమైన ముఖంతో అందంగా కనబడే మీనా అందంతోను అభినయంతోను తెలుగు ప్రేక్షకుల్ని బాగా మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్రహీరోలందరితో జోడీగా నటించారు. చిరంజీవి, రజనికాంత్, కమలహాసన్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్, అర్జున్ తదితర నటులతో నటించారు. దక్షిణ భారత దేశంతో పాటు రజనికాంత్ సరసన నటించిన చిత్రాలవలన జపాన్‌లో కూడా ప్రేక్షకాభిమానం కలిగి ఉన్నారు.

చిరంజీవి శివుడు అయితే మీనా పార్వతిగా వచ్చిన శ్రీమంజునాధ చిత్రం తెలుగు కన్నడ భాషలలో విజయవంతమైనది. ముత్తు, బామనే సత్యభామనే కమిషనర్ రుద్రమనాయుడు, క్రిమినల్, వీరా, డబుల్, తెనాలి, రఘుపతి ఐపిఎస్, నంద, ప్రచండ వంటి మొదలైన కన్నడ తమిళ భాషలలో నటించారు.

మీనా-వెంకటేష్ ప్రధాన పాత్రలలో వచ్చిన దృశ్యం చిత్రం విమర్శకుల ప్రశంశలు అందుకుంది, వాస్తవానికి దగ్గరగా నేటి సామజిక పరిస్థితులలో యువత తీరుని బట్టి ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమాగా వచ్చింది. కేవలం రెండు పాటలు మాత్రమే ఉండే ఈ చిత్రం పాటలు తక్కువగా ఉన్నాయనే భావన కలగదు. నటి మీనా తెలుగు తమిళ భాషలలో సుమారు దశాబ్ద కాలం అగ్రనటిగా పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు. సాంఘిక, భక్తీ చిత్రాల్లో నటించి రెండు భాషల్లో ప్రేక్షకులను మెప్పించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

మహేష్ బాబు తెలుగు సినిమాలు

మహేష్ బాబు రాజకుమారుడు నుండి భరత్ అను నేను వరకు చిత్రాలు: మహేష్ మహేష్ మహేష్ అంటూ మహిళలు కలవరిస్తారు అంటూ చాటి చెప్పే తెలుగు చిత్రం వచ్చి మహేష్ పేరుపై ఉన్న క్రేజీని చూపింది. ఆపేరుకు అంతలా క్రేజీ ఎందుకు క్రేజ్ వచ్చింది అంటే మహేష్ బాబు అంటారు. అష్టాచమ్మా చిత్రంలో మహేష్ పేరు గురించి ఆ చిత్ర కధానాయికలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక నిజజీవితంలో మహేష్ లు చాలామందే ఉంటారు. ప్రముఖులు కూడా ఉంటారు. అయితే సినిమా హీరో మహేష్ బాబు మాత్రం మంచి క్లాస్ ఇమేజ్ ఉన్న హీరో.

హీరోగా చేసిన తొలిచిత్రంతోనే నూతన ఉత్తమ నటుడుగా నంది పురష్కారం అందుకున్నారు. మహేష్ కృష్ణగారబ్బాయిగా ఆగష్టు9 1975లో జన్మించారు. నీడ, పోరాటం, శంఖారావం, బజారురౌడి, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు చిత్రాలలో బాలనటుడుగా నటించారు. కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేసారు.

1999 సంవత్సరంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రం ద్వారా మహేష్ బాబు హీరోగా పరిచయం అయ్యారు. తొలిహీరో చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 2000 సంవత్సరంలో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో యువరాజు చిత్రంలో ఒక బిడ్డ తండ్రిగా రెండవ చిత్రంలోనే నటించేసి ఆశ్చర్యపరచారు. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ చిత్రంలో తనతో వెండితెరని షేర్ చేసుకున్న ఆమెతోనే మహేష్ బాబు తన జీవితాన్ని షేర్ చేసుకుంటున్నారు. 2001 సంవత్సరంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం ద్వారా స్పెషల్ జ్యూరి నంది పురష్కారం అందుకున్నారు. అరె ఒరేయ్ అని తనను కన్నవారితో కూడా పిలవబడని ఒక యువకుడుగా మహేష్ మురారి చిత్రంలో నటించారు.

తండ్రికి కౌబోయ్ చిత్రాల్లో ఉన్న క్రేజ్ వలననో ఏమో 2002లో టక్కరిదొంగ అనే కౌబోయ్ చిత్రంలో నటించారు. ఆశించినంత ఆర్ధిక విజయం సాధించకపోయినా మహేష్ బాబు నంది స్పెషల్ జ్యూరి పురష్కారం అందుకున్నారు. అలాగే అదే సంవత్సరం వచ్చిన బాబి చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2003 సంవత్సరంలో వచ్చిన ఒక్కడు ఆ సంక్రాంతి సీజన్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది, ఉత్తమ నటుడుగా మహేష్‌బాబు ఫిలిం ఫేర్ పురష్కారం అందుకున్నారు. అదే సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం నిజానికి బాగున్నా అభిమానులకు అంతగా ఎక్కలేదు. కాని నిజానికి మహేష్ బాబు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

నాని, అర్జున్, పోకిరి విబిన్నమైన కధా చిత్రాలలో మహేష్ నటన

2004 సంవత్సరంలో మహేష్ నానిగా నటించారు. 8ఏళ్ల బాలుడు 28 ఏళ్ల యువకుడుగా మారితే ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చూడగలం. తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య దర్శకత్వంలో అమీషా పటేల్ హీరొయిన్ గా ఈ చిత్రం వచ్చి, పాటల పరంగా ఆకట్టుకుంది. అదే సంవత్సరంలో చెల్లెలు కోసం ప్రాణాలకు తెగించే అన్నగా అర్జున్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు, తత్ఫలితంగా నంది స్పెషల్ జ్యూరి పురష్కారం అందుకున్నారు.

అర్జున్ చిత్రం తర్వాత వచ్చిన అతడు అందరిని ఆకట్టుకున్నాడు, టివిలలో చాలా కాలం ఈ చిత్రం ప్రదర్శితమైంది. మహేష్ అను అతడుకి ఉత్తమ నటుడుగా 2005 సంవత్సరానికి నంది పురష్కారం వచ్చింది. చిత్రంగా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ చేయనంటే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో తీసి పవన్ ప్రశంశ అందుకున్నారు.

2006లో పోకిరి చిత్రంలో పోకిరి యువకుడుగా నటించిన మహేష్ బాబుకి సూపర్ డూపర్ హిట్ తో బాటు ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడు పురష్కారం లభించింది. పోకిరి తరువాత అంతపెద్ద భారి విజయాలు సాధించని సినిమాలుగా సైనికుడు, అతిథి (2007), ఖలేజా(2010) చిత్రాలు మిగిలాయి. దూకుడు తగ్గించిన 2011లో దూకుడు చిత్రంతో కలెక్షన్ల దూకుడు పెంచారు. అలాగే దూకుడు చిత్రానికి కూడా మహేష్ బాబు ఉత్తమ నటుడుగా నంది పురష్కరానికి ఎంపిక అయ్యారు. 2012లో బిజినెస్ మేన్ చిత్రం కూడా దూకుడులాగానే విజయవంతమైంది.

తెలుగులో మల్టీ స్టారర్ చిత్రంగా 2013 లో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చిన్నోడుగా మహేష్ బాబు అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో పెద్దోడుగా వెంకటేష్ నటించారు. 2014 లో మహేష్ 1అంటూ వచ్చి, ఆగడు అంటూ 2015లో శ్రీమంతుడుగా మంచి హిట్  కొట్టారు. 2016 వచ్చిన బ్రహ్మోత్సవం ఉత్సాహం తగ్గించి 2017లో కూడా స్పైడర్ పై చూపించింది. ప్రస్తుతం 24వ చిత్రంగా మహేష్ బాబు భరత్ అను నేను అంటూ మంచి హిట్ చిత్రంతో దూకుడును మళ్ళి మొదలు పెట్టారు. అంతఃకరణ శుద్ధితో అనే డైలాగ్ ప్రసిద్ది చెందింది.

మనిషి ఋషి అయితే ఎంత గొప్పవాడు అవుతాడో, అంతటి గొప్పవాడు రైతు తర్వాతే అని సాటి చెప్పే చిత్రంగా వచ్చిన మహర్షి సినిమాలో మహేష్ బాబు కధానాయకుడుగా నటించారు. వ్వవసాయం గొప్పతనం గురించి గొప్పగా మాట్లాడుకునే విధంగా సమాజాన్ని ప్రభావితం చేసిన సినిమాగా మహర్షి సినిమా ప్రశంసలు అందుకుంది. ఇంకా ఈ మహర్షి సినిమాలో అల్లరి నరేష్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, పూజా హెగ్డే నటించారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

డైనమిక్ హీరో, సుప్రీమ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ కలిగన హీరోగా ప్రసిద్ది కెక్కిన తెలుగు నటుడు చిరంజీవి. డైనమిక్, సుప్రీమ్ హీరో మెగాస్టారు అంటూ అందరితో అనిపించుకుని రెండుతెలుగు అశేష ప్రేక్షకభిమానాన్ని స్వయంకృషితో సంపాదించుకున్న మధ్యతరగతి వ్యక్తి చిరంజీవి. పునాదిరాళ్ళూ చిత్రంలో మొదటి వేషం వేస్తె మొదటగా తెలుగుతెరపై ప్రాణంఖరీదు చిత్రంతో వచ్చారు. సుమారు 60 మంది  చలన చిత్రదర్శకుల చిత్రాలలో నటించారు. 1978 సంవత్సరం నుండి 2018 వరకు సుమారు 40 సంవత్సరాలలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ ప్రభుత్వం తిరగబడ్డ తెలుగుబిడ్డ చరిత్ర ఆధారంగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

40 సంవత్సరాలలో ఒక్కో సంవత్సరములో ఒక ప్రధాన చిత్రంగా చిరంజీవి నటించిన తెలుగు చిత్రాల నుండి ప్రాణంఖరీదు పునాదిరాళ్ళూ, పున్నమినాగు, న్యాయం కావాలి, శుభలేఖ, ఖైదీ, చాలెంజ్, అడవిదొంగ, చంటబ్బాయ్, స్వయం కృషి, రుద్రవీణ, స్టేట్ రౌడి, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు, ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడామజాకా, అతిథిగా సిపాయి చిత్రం, మాస్టర్, చూడాలనిఉంది, స్నేహంకోసం, అన్నయ్య, మంజునాధ, ఇంద్ర, డాడీ, ఠాగూర్, శంకర్ దాదా MBBS, అందరివాడు, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నంబర్ 150 ఉంటే అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించారు.

1978

ప్రాణంఖరీదు

1979

పునాదిరాళ్లు

1980

పున్నమినాగు

1981

న్యాయంకావాలి

1982

శుబలేఖ

1983

ఖైదీ

1984

ఛాలెంజ్

1985

అడవిదొంగ

1986

చంటబ్బాయ్

1987

స్వయంకృషి

1988

సందేశాత్మకచిత్రం రుద్రవీణ

1989

మాస్ ఎంటర్టైనర్ స్టేట్ రౌడి

1990

జగదేకవీరుడు అతిలోకసుందరి

1991

మైటీ మెగాస్టార్ గ్యాంగ్ లీడర్

1992

మెగాస్టార్ ఘరానామొగుడు

1993

ముఠామేస్త్రి

1994

ముగ్గురుమొనగాళ్ళు

1995

అల్లుడా మజాకా

1996

అతిథిగా సిపాయి

1997

మెగామాస్టర్

1998

చూడాలనిఉంది

1999

స్నేహంకోసం

2000

అన్నయ్య

2001

శ్రీమంజునాథ

2002

ఇంద్ర

2003

ఠాగూర్

2004

శంకర్ దాదా

2005

అందరివాడు

2006

స్టాలిన్

2007

శంకర్ దాదా2

2017

రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత పదేళ్ళకు బాస్ యాజ్ ఖైదీ నంబర్ 150

2018

కొత్త చిత్రంగా రానున్న బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడ్డ తెలుగుబిడ్డ సైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి మరిన్ని తెలుగు హిట్ చిత్రాలు

చిరంజీవి నటన, డాన్సులు, ఫైట్లు యువతను ఆకట్టుకోవడంతో బాటు  డైనమిక్ హీరోగా, సుప్రీమ్ హీరోగా మెగాస్టార్ గా బిరుదులు లభించాయి. కుటుంబ కధా చిత్రాలతో కామెడీ, డ్రామా, యాక్షన్, సెంటిమెంట్, లవ్, ఫాంటసీ తదితర చిత్రాలలో నటించి మెప్పించారు. తొలి దర్శకులుగా గుడాపటి రాజ్ కుమార్ ఉంటే, మొదట విడుదల అయిన చిత్రానికి దర్శకులు కె. వాసు. ,ప్రముఖ దర్శకులు కె. బాలచందర్, కెఎస్ ఆర్ దాస్, కె బాపయ్య, లక్ష్మిదీపక్, బి గోపాల్, రవిరాజా పినిసెట్టి,  కె రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కె విశ్వనాధ్, కోడి రామ కృష్ణ, విజయబాపినీడు, సురేష్ కృష్ణ, వంశీ, ముత్యాల సుబ్బయ్య, ఈవివి సత్యనారయణ, జంధ్యాల, వివి వినాయక్, శ్రీను వైట్ల  మొదలైన దర్శకులు చిరంజీవి గారిని డైరెక్ట్ చేసారు.

పైన చెప్పబడిన విజయవంతమైన చిత్రాలే కాకుండా ఇంకా మొగుడుకావాలి, చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, పట్నం వచ్చిన ప్రతివ్రతలు, మంచు పల్లకి, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు, శివుడు శివుడు, గూడచారి నెం.1, ఆలయశిఖరం, మగమహారాజు, రోషగాడు, మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, హీరో, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, దొంగ, రక్త సింధూరం, విజేత, కిరాతకుడు, కొండవీటి రాజా, మగధీరుడు, రాక్షసుడు, వేట, దొంగమొగుడు, ఆరాదన, చక్రవర్తి, జేబుదొంగ, మంచిదొంగ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, త్రినేత్రుడు, యుద్దభూమి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్రనేత్ర, రాజా విక్రమార్క, కొదమసింహం, కొండవీటి దొంగ, రౌడి అల్లుడు, మెకానిక్ అల్లుడు, హిట్లర్, బావగారు బాగున్నారా, డాడి, అంజి మొదలైన విజయవంతమైన చిత్రాలలో నటించారు.

తెలుగులోనే కాకుండా హిందీలో ప్రతిభంద్, ఆజ్ కా గుండారాజ్, ది జెంటిల్ మేన్ చిత్రాలతో బాలీవుడ్లో కూడా అడుగు పెట్టారు, అలాగే కొన్ని తమిళ కన్నడ చిత్రాలలో కూడా నటించారు. మగధీర చిత్రంలో గెస్ట్ పాత్రలో కనబడ్డారు..

ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి షూటింగ్ ముగింపు దశలో ఉండగా ఫస్ట్ లుక్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22, 2018 తేదిన విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రం స్వాతంత్ర్య సమరం ప్రారంభం కాకముందు బ్రిటిష్ ప్రభుత్వంపై తొడగొట్టిన తెలుగుబిడ్డ చరిత ఆధారంగా తెరకెక్కుతుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

సకుటుంబానికి వినోదం అందించే తెలుగు చలన చిత్రాలు

జీవితం కష్టసుఖాలతో కలిసి మమకార మిత్రులతో ఆత్మీయ బంధువులతో కలసి ఉండే కుటుంబ సభ్యులతో సాగిపోతూ ఉంటుంది. ఒకసారి ఒకరి సంతోషం కుటుంబానికి అంతటికి సంతోషం, ఇంకోసారి ఒకరి దుఖం కుటుంబానికి కష్టం కలిగించే సందర్భం. ఇలా జీవితం అన్ని రకాల భావనలతో మిలితిమై మనిషిని ఆశానిరాశ నిస్పృహలలో తేల్చుతూ కాలంలో సంతోషాలను కలిగిస్తూ ఉంటుంది.

జీవితంలో ఒత్తిడిలు ఎదుర్కొంటూ కేవలం సందేశం అందించే చిత్రాలను చూడడానికి కుటుంబసమేతంగా అంటే సాధ్యం కాదు. ఒకరు ఎదో ఆలోచనలో ఎదో భావనలతో విబిన్న భావనలతో ఉండే వ్యక్తుల కలయిక కుటుంబం. చిన్న కుటుంబమే అయినా ఒకరికి వంద ఆలోచనలు వంద సమస్యలు అన్ని సమస్యల మధ్య కేవలం సందేశం కూడిన ట్రాజెడి సినిమాలు చూడాలంటే ఇబ్బందే.

సందేశం కధలో కలిసిపోయి, సాదారణ ధర్మాలతో ధర్మం కోసం సాహసం చేసే కధానాయకుల కధలో కామెడీ, డ్రామా, యాక్షన్ వంటి సన్నివేశాలతో అక్కడక్కడ అవసరానికి సెంటిమెంట్ సన్నివేశాలతో కుటుంబ వ్యక్తిగత సామజిక విలువను కోల్పోకుండా సాగే హీరోల సినిమాలు చూడడంతో బాటు, తమతోటి వారితో కలిసి చూడవచ్చు. ప్రేమ కోసం ఫైట్ చేస్తూ, ఇంటికోసం ఆలోచన చేస్తూ, కుటుంబం కోసం త్యాగం చేస్తూ, బందం కోసం భాద్యత తీసుకుంటూ, సమాజం కోసం పాటు పడుతూ సాగే కధలలో అవసరమైన సరదా సన్నివేశాలతో సాగే చిత్రాలు ఆనందదాయకంగా ఉంటుంది.

బహుశా 1990 – 2000 మధ్యలలో వచ్చిన తెలుగు చిత్రాలు సూపర్ హిట్ అయ్యి అందరిని అలరించిన కొన్ని చిత్రాలను గుర్తు చేసే ఉద్దేశ్యంతో ఈ పై వివరణ ఉంది. త్యాగంతో కూడిన కధానాయకుడుకి గంభీరమైన మనసుతో దుఃఖాన్ని లోపలే దాచుకునే చిత్రాలు కొన్ని ఉంటే, నీతి శాస్త్రాలు చదవకపోయినా సహజస్వభావం నీతివైపే వెళ్ళే కధానాయకుల చిత్రాలు కొన్ని ఉంటాయి.

ఇంటికి పెద్దరికం వహిస్తూ ఇంటి సభ్యులకు మార్గదర్శకంగా నిలిచే వ్యక్తుల చిత్రాలు కొన్ని ఉంటే, డబ్బుకోసం ఏపని అయినా చేసే వ్యక్తి, ధర్మం తెలుసుకుని అధర్మాన్ని అడ్డుకునే బలవంతుల కధలు కొన్ని ఉంటాయి. అమ్మే దేవత అమ్మమాట అంటే దేవుడి మాటకన్న గొప్పగా భావించే ఒక కొడుకుని మోసం చేయబోయి బుద్ది తెచ్చుకున్న ఒక అమ్మ కధ ఇలా అనేక విధాలు అనేక చిత్ర విచిత్ర కధలతో తెలుగు చిత్రాలు ఆయా సంవత్సరాలలో సకుటుంబంగా సినిమాహాలులో చూడదగిన చిత్రాలుగా ఉన్నాయి.

ఇప్పటి కాలంలో వచ్చే చిత్రాలు కొన్నింటిని కుటుంబంతో కలిసి చూడలేము అంటారు. అలా అంటున్న ఈ కాలంలో కూడా కొందరి చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉండడం ఉంది. కాని గతకాలపు చిత్రాలలో ఉన్న విలువలు ఈకాలపు పరిస్థితులలో తెలుసుకోవడము మంచిదే. అందరిని అలరించగలిగే వినోదభరితం, సందేశం అంతర్లీనంగా ఉండే కదల చిత్రాలు కొన్ని క్రిందగా చదవండి.

మ్యూజికల్ హిట్ తెలుగు చలనచిత్రం

అల్లుడుగారు సరదాగా సాగేపోయే కుటుంబ సెంటిమెంట్ చిత్రం. తన తండ్రితో చెప్పిన అబద్దం కారణంగా, తండ్రి ఆరోగ్యరిత్యా ఆ అబద్దాన్ని నిజం చేయాల్సిన పరిస్థితిలో ఒక వ్యక్తిని తీసుకువచ్చి భర్తగా పరిచయం చేసే కధతో చిత్రం ప్రారంభం అవుతుంది. జైలునుండి విడుదల అయిన వ్యక్తి సరాసరి ఒక ఎస్టేట్ ఓనర్ కూతురికి భర్తగా నటించాల్సి వస్తే, కేవలం డబ్బు కోసం ఒప్పుకుంటాడు. అలా ఇద్దరు అపరిచితులు భార్యభర్తలుగా ఒక పెద్దమనిషి దగ్గర నటిస్తూ, ఆ పెద్దమనిషి ఆరోగ్యం కోసం వారు దగ్గరై ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడంతో చిత్రం ముగుస్తుంది. అయితే చివరకు ఎక్కడ నుండి వచ్చినవారు అక్కడికే చేరుకుంటారు. అయితే ప్రేమ కధ సరదా సన్నివేశాలతో మంచి మంచి పాటలతో ప్రేక్షకులని మెప్పిస్తుంది.

సూపర్ హిట్ ఫాంటసీ తెలుగు చిత్రం

పురాణాల్లో నారదుడు వచ్చాడు అంటే సాదారణ స్థితికి భిన్నంగా ఇంకేదో జరగబోతుంది అనేది ప్రకృతి నియమంగా కనబడుతుంది. దేవలోకంలో నారదుడు రాగానే దేవేంద్రుడు కూతురు ఇంద్రజ దీవెనలు తీసుకుని భూలోకంలో హిమాలయాలు సందర్శించడానికి వస్తుంది. పిల్లలతో కలిసి ఉండే రాజు, తన దగ్గర ఉండే అనాధ పిల్ల కాలువైద్యం నిమిత్తం మూలిక కోసం హిమయలకు వస్తాడు. హిమాలయాల్లో మహిమగలిగిన తన ఉంగరాన్ని ఇంద్రజ చేజార్చుకుని తిరిగి స్వర్గం చేరుకుంటుంది. మూలికతోబాటు ఆ ఉంగరాన్ని అందుకున్న రాజు ఇంటికి వచ్చేస్తాడు. ఉంగరం పోగొట్టుకొని స్వర్గలోక ప్రవేశం కోల్పోయిన ఇంద్రజ భూలోకంలో ఉన్న రాజు ఇంటికి చేరుతుంది. అక్కడ నుండి ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

మ్యూజికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్

ముక్కోణపు ప్రేమ కధా చిత్రాలు అనేకంగా మనకి తెలుగులో లభిస్తాయి. అలాంటి చిత్రాలలో నారి నారి నడుమ మురారి చిత్రం ఒకటి. సూపర్ హిట్ రొమాంటిక్ సాంగులతో ఆద్యంతం చిత్రం సరదాగా సాగిపోతుంది. కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు మాత్రమే ఉండి, ఆద్యంతం సరదాగా ప్రేమ సన్నివేశాలతో సాగిపోయే తెలుగు చిత్రం. పొగరుబోతు అత్తకి బుద్ది చెప్పడానికి మామ సహయంతో పక్కింటిలోకి వచ్చిన బావతో మరదళ్ళు సాగించే ప్రేమకలాపాలు మంచి కాలక్షేపాన్ని అందిస్తాయి. పాటలుకూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇద్దరు మరదళ్ల ప్రేమను భరించే వ్యక్తిగా బాలకృష్ణ నటిస్తే, మరదళ్ళుగా శోభన, నిరోషా నటించారు. ఇంకా కైకాల సత్యనారాయణ, శారద, అల్లు రామలింగయ్య, రమాప్రభ, సుత్తివేలు తదితరులు నటించారు.

చంటి

అల్లారు ముద్దుగా పెరిగే జమిందారుగారి చెల్లెలు, మొద్దుగా అనిపించుకునే పాటలు పాడే పనివాడికి మద్యలో జరిగిన ప్రేమకధలో నలిగే అనుబంధాలు కలిగిన చంటి చిత్రం అందరిని అలరించింది. మొద్దుబారిన కొడుకు ఎప్పుడు జీవితం ఎలా ఉంటుందో అని భాదపడే తల్లికి కొడుకుగా, ఊరిలో వారు కన్నెత్తి చూడడానికి బయపడే అమ్మాయి ఎదుట నిలబడి పాటలు పాడే వ్యక్తిగా చంటి పాత్రలో వెంకటేష్ నటించారు. జమిందారు చెల్లెలి పాత్రలో మీనా నటించింది. జమిందారుగా నాజర్ నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. తమిళ చిత్రం చినతంబి చిత్రకధ ఆధారంగా తెలుగు రీమేక్ చేసారు. ఇంకా మంజుల, బ్రహ్మానందం తదితరులు నటించారు.

గ్యాంగ్ లీడర్

గ్యాంగ్ లీడర్ అంటే పెద్ద గ్యాంగ్ వేసుకుని ఒక సమాజ సేవో లేక దోపిడినో చేసే గ్యాంగ్ అని ఊహిస్తాం కానీ ఈ చిత్రం కుటుంబకధతో ఒక భాద్యత కలిగిన యువకుడి ఔన్నత్యం ఉన్నతమైన మనసు ప్రేక్షకుల గుండెలకి గ్యాంగ్ లీడర్ అయ్యాడు. మధ్యతరగతి కుటుంబ భాద్యతను నెత్తిన వేసుకుని జీవించే రఘుపతి(మురళిమోహన్)కి రెండవ తమ్ముడు రాఘవ(శరత్ కుమార్) ఐఏఎస్ చదువుకు రెడీ అవుతూ ఉంటాడు. ఆ చదువుకు ఫీజు కట్టడానికి అవసరమైన డబ్బు లేకపోతే, చిన్న ఆక్సిడెంట్ కేసు నెత్తిన వేసుకుని డబ్బు అన్నకి అందజేసి జైలుకు వెళతాడు మూడవ తమ్ముడు రాజారామ్(చిరంజీవి). రఘుపతి ఒకరోజు తాను చూసిన ఒక రాజకీయ హత్యకేసు గురించి పోలీసులకు చెప్పి, సదరు హత్య చేసిన ఏకాంబరం కనకాంబరం చేతిలో హతుడవుతాడు. రఘుపతి హత్య విషయం తెల్సిన స్నేహితులు రాజారామ్ తో చెబితే ఆవేశంతో ప్రాణాలు మీదకు తెచ్చుకుంటాడు అని భావించి, స్నేహితులు హోమ్ మినిస్టర్ కి దరఖాస్తు పెట్టుకుని వారు కూడా ఏకాంబరం కనకాంబరం చేతిలో హతులవుతారు. నిజం తెలిసిన రాజారామ్ కుటుంబాన్ని కాపాడుకోవడంలో ముందు ఉంటూ అన్యాయం చేసే గ్యాంగ్ ని మట్టు బెట్ట గ్యాంగ్ లీడర్ అవుతాడు రాజారామ్.

అమ్మే దైవంగా భావించే అబ్బాయిగారు

మాతృదేవోభవ అని పెద్దలు చెబితే ఇక్కడ ఈ చిత్రంలో ఈ అబ్బాయి మాత్రం మారుటతల్లి అయినా దేవతగానే చూసుకోవడం విశేషం. తల్లి తనకి ద్రోహం చేస్తుందని తెలిసినా అమ్మని దేవతగానే భావించిన అబ్బాయిగారి కధ. చిన్నతనంలో తండ్రి తీసుకువచ్చి ఈమే నీ తల్లి అనగానే ఆతల్లి మాటను అనుసరించి బడికికూడా పోకుండా అమ్మ చెప్పిన మాటలల్లా వింటాడు. అస్తికోసమే రెండోపెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఈ పిల్లవాడిని కీలుబొమ్మగానే మారుస్తుంది. కొడుకుకు ఇంకో తింగరి అమ్మాయిని ఇచ్చి చేస్తే ఆస్తివిషయంలో తిరుగులేదు అనుకుంటున్నా సమయంలో కొడుకు అనుకోని పరిస్థితిలలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని రావడంతో చిత్రకధ ఆసక్తిగా ఉంటుంది. చదువుకున్న కోడలిని చంపడానికి చేసిన విష ప్రయత్నంలో విషం కొడుకే త్రాగుతాడు. అమ్మమీద మాటపడడం ఇష్టం లేని అబ్బాయిగారు. కట్టుకున్న పెళ్ళాం అమ్మనిజస్వరూపం గురించి చెప్పినా అమ్మమీద నమ్మకంతో ప్రాణాలు మీదకు తెచ్చుకున్న కొడుకుని చూసి బుద్ది తెచ్చుకుంటుంది ఆ తల్లి. అమ్మకి తనపై కపట ప్రేమ ఉన్నా కన్నతల్లి కాకపోయినా ఆ తల్లిమాట వినే అబ్బాయిగారుగా వెంకటేష్ నటిస్తే, తల్లిగా జయచిత్ర నటించారు. మీనా వెంకటేష్ కు జోడీగా నటించారు.

మరెన్నో తెలుగు చిత్రాలు ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ వినోదం అందించే చిత్రాలు తెలుగులో ఉన్నాయి. ఇంకా కొన్ని చిత్రాల గురించి తరువాత…వ్రాయగలను

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

కుటుంబసమేతంగా చూడదగిన కుటుంబకధా తెలుగు చలనచిత్రాలు​

తెలుగు చిత్రాలు అనేకంగా వస్తున్నాయి, అధునాతన కధలతో చిత్రమైన కధనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా వస్తున్నాయి. కానీ కుటుంబసమేతంగా చూడదగిన కుటుంబకధా తెలుగు చలనచిత్రాలు అంటే నెట్లో వెతకాల్సి ఉంటుంది. భవిష్యత్తు సామాజిక దృష్టికన్నా ఇప్పుడు సామాజిక పరిస్థితులతో కలిసి చిత్ర కధలు కధనాలుగా తెరకేక్కుతున్నాయి. కామెడీ కోసం తనపై తనే జోకులేసుకునే స్థితిలో కూడా కొన్ని చిత్ర సన్నివేశాలు ఉంటున్నాయి. సినిమా అంటే చిన్న, పెద్ద, యువత అందరు చూసే చిత్రం అయితే కొన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూసే వీలులేని సన్నివేశాలతో కలిసి ఉంటున్నాయి.

కధాంశం ఉపయుక్తమైనదిగా ఉన్న సన్నివేశాలు మాత్రం అనుసరణ బుద్దికలవారికి చెడుని దగ్గర చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతికత అభివృద్ధి చెందాక నెట్ ద్వారా టివిలలో కావాల్సిన చిత్రాలను చూసే అవకాశం ఉంది. సాంకేతికత పరిచయం ఎక్కువగా ఉన్నవారికి గతకాలపు మంచి చిత్రాల పరిచయం ఉండి, ఉండకపోవచ్చు. తెలిసినవారికి తెలియనివారికీ గుర్తు ఈ చిత్రాలు కొన్ని చిత్రాలు కాళీ సమయంలో కాలక్షేపంతో బాటు మంచి సందేశాలు అందించే కుటుంబ కధా చిత్రాల గురించి కొంత సంక్లిప్త వివరణ దిగువలో చదవగలరు.

సూత్రదారులు

సూత్రదారులు తెలుగు చలనచిత్రం అక్కినేని, మురళిమోహన్, సుజాత, భానుచందర్, కైకాల సత్యనారాయణ, కెఆర్ విజయ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం. గంగిరెద్దును ఆడించే వృత్తిలో హనుమద్దాసు పాత్ర(అక్కినేని నాగేశ్వర రావు)లో అతని బావమరిది అనుచరుని పాత్రలో మురళి మోహన్ నటించారు. పల్లెలో ఉండే పెద్దమనిషి (కైకాల సత్యనారాయణ) కామ దాహానికి హరికధలు చెప్పుకునే వ్యక్తియొక్క భార్య (కెఆర్ విజయ) గురి అవుతుంది. ఇక ఆమె ఊరినుండి పట్నానికి వెళ్ళుతుంటే, హనుమద్దాసు కొడుకు ఆమెకూడా వెళతాడు. అలా వెళ్ళిన హ హనుమద్దాసు కొడుకు కలెక్టర్ (భానుచందర్) అయ్యి ఊరికి తిరిగి వస్తాడు. ఊరి పెద్ద మనిషి ఆగడాలను ఆ ఊరి జనాలతోనే అడ్డగించే విధంగా చేయడంలో ఒక ఐఏఎస్ అధికారి(భానుచందర్), అతని తల్లిదండ్రులు చేసే ప్రయత్నం. సమస్య వచ్చినప్పుడు రావాల్సింది కోపం కాదు ఆలోచన, ఆలోచనతో సమస్యను సమూలంగా రూపుమాపాలని ఈ చిత్రం చూపుతుంది. కలెక్టర్ అయినా తనవారి అదుపు ఆజ్ఞానలలో ఉండే వ్యక్తిగానే భానుచందర్ వ్యక్తిత్వం, అతనిపై రమ్యకృష్ణకి ఉండే ప్రేమ ఒక పల్లె కధ అందంగా కనబడుతుంది. ఈచిత్రం సందేశంతో ఉంటుంది కానీ సరదాగా సాగుతుంది.

K విశ్వనాథ్

కళాతపస్వి కె విశ్వనాధ్. ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు. వాస్తవికతకు దగ్గరగా సమాజంలోని పరిస్థితులను చూపిస్తూ, వ్యక్తికి కావలసిన వ్యక్తిత్వవిలువలను ప్రతిబింబించే విధంగా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. సందేశాత్మక శుభ సూచిక చిత్రాల దర్శకుడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం,స్వాతిముత్యం,సిరివెన్నెల, శృతిలయలు, సాగరసంగమం, స్వయంకృషి,స్వాతికిరణం శుభసంకల్పం లాంటి గొప్ప చిత్రాలకు దర్సకత్వం చేసారు.

కుటుంబంలో అమ్మమనసుని చూపుతూ మదిని తాకే చిత్రం

అమ్మరాజీనామ

ఊర్వశి శారద ప్రముఖ నటి

అమ్మరాజీనామా చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న శారదగారు రెండు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు.

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ ! ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంబింపచేసే తంత్రాలు ఎన్నో || పాటని వ్రాసి పాటకలిగిన చిత్రాన్ని తెరకెక్కించినది స్వర్గీయ దాసరి నారాయణరావుగారు.  పిల్లలకి చేసే సేవలో కష్టం మాట మరిచి, కుటుంబ భాద్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించే ఇంటి ఇల్లాలి కధ. పెరిగిపెద్దయ్యాక వచ్చిన మార్పులతో అమ్మమనసు గాయపడి అమ్మే రాజీనామా చేస్తే ఎలా ఉంటుందో చూపుతూ, వచ్చిన చిత్రం అమ్మరాజీనామా. పిల్లల మనస్తత్వాన్ని అర్ధం అయ్యినా పెద్దవారిగా వారి బుద్దులు చూసి బుద్ది తెచ్చుకుని నడిచే తల్లిగా శారద గారి నటన బాగుటుంది. పిల్లలకు కష్టం కలిగితే తల్లడిల్లే అమ్మ చేసే త్యాగానికి హద్దులుండవు అని చాటే చిత్రం. తెలుగు కుటుంబ కదా చిత్రం. ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్నా కమ్మని కావ్యం సిరివెన్నల రాసిన పాట ప్రేక్షకాదరణ పొందింది. శారద, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, సాయికుమారు తదితరులు నటించారు. దాసరి నారాయణగారి దర్శకత్వం వహించి, ఒక బిక్షగాడి పాత్రలో నటించారు. అమ్మపై వచ్చిన చిత్రాల్లో అమ్మ గురించి బాగుగా చెప్పిన సాంఘికకధా చిత్రం ఇదే ఉంటుంది.

కుటుంబ సమేతంగా చూడదగిన తెలుగు కధా చలనచిత్రాలు

పెళ్లి పుస్తకం

శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం అంటూ సాగే పాటలోనే చిత్రకధని టైటిల్ కి తగినరీతిలో కధనాన్ని నడిపించిన దర్శకులు బాపుగారు అయితే రాజేంద్రప్రసాద్ – దివ్యవాణిల నటన చిత్రానికి ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒక మధ్యతరగతి జంట తమ కొత్తకాపురం ప్రారంభిస్తూ తమ తమ తల్లిదండ్రుల కుటుంబ భాద్యతల వలన ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులలో ఒకే కంపెనీలో ఏ సంభందం లేని ఇద్దరు వ్యక్తులుగా ఉద్యోగాలలో జాయిన్ అవుతారు. ఆ పరిస్థితులలో వారు పడే ఇబ్బందులు,అబద్దం వలన వారి కాపురం వచ్చిన కష్టాలు ఎలా గట్తెక్కుతారు అనేది, కధాంశం.

కుటుంబకధా చలనచిత్రం

పలు అవార్డు చిత్రాలకు దర్శకుడుగా నిర్మాతగా ఉన్న క్రాంతి కుమార్ గారు సీతారామయ్య గారి మనవరాలు క్రాంతి కుమారు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు తాతగా అయన మనవరాలిగా మీనా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన చిత్రం. అలాగే నాలుగు నంది అవార్డులు 3 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న ఈ చిత్రానికి నిర్మాత వి దొరస్వామిరాజు. తనికెళ్ళభరణి, దాసరి నారాయణరావు, కోట శ్రీనివాసరావు, మురళిమోహన్ మొదలైనవారు నటించారు.

మోహన్ బాబు – రజనికాంత్

పల్లెటూరి కట్టుబాటులలో పోలీసులతో కూడా పనిలేకుండా తీర్పులు చెబుతూ చుట్టూ ప్రక్కల గ్రామాలలో కూడా పేరు ప్రతిష్టలు కలిగిన కుటుంబ కధా చలనచిత్రం పెదరాయుడు. రజనికాంత్ పాపారాయుడి పాత్రలో నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటే, మోహన్ బాబు ద్విపాత్రాభినయం, భానుప్రియ, సౌందర్యల నటనతో ఈచిత్రాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తాయి. పల్లెవాతావరణంలో సాగే కధని రవిరాజా పినిశెట్టి చక్కగా చూపించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, జయంతి, చలపతిరావు, శుభశ్రీ, ఆనంద్ రాజ్, రాజా రవీంద్ర, బాబు మోహన్ మొదలైనవారు నటించారు. పాటలు కూడా చక్కగా ఉంటాయి.

వెంకటేష్ – సౌందర్య హిట్ కాంబినేషన్లో వచ్చి తెలుగు మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా చిత్రంగా నిలిచింది. సకుటుంబ సపరివారంగా చూడదగిన చిత్రాలలో పవిత్రబంధం ఒకటిగా ఉండి, భారతీయ స్త్రీమూర్తి సహనం, పతిసేవా తత్పరతను తెలియజేసే తెలుగు చలనచిత్రం పవిత్రబంధం. సెంటిమెంట్ చిత్రాల దర్శకులుగా పేరుపొందినవారిలో ముత్యాల సుబ్బయ్య గారు ఒకరు. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై పోసాని కృష్ణ మురళి కధ అందిస్తే, ఎంఎం కీరవాణి సంగీతం అందివ్వగా పవిత్రబంధం చిత్రాన్ని వెంకట రాజు – శివరాజులు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మించారు. వెంకటేష్ – సౌందర్యల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటే, సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన పవిత్రబంధం చిత్రం, చాల పవిత్రమైన బంధం విలువని తెలియజేస్తుంది

కుటుంబ కధా చలనచిత్రం

పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం.

శతమానంభవతి

ఈమధ్యకాలంలో ఎక్కువగా ఆకర్షణీయంగానే వస్తున్న చిత్రాల మద్య కుటుంబ విలువలను చూపుతూ ఉంటే ప్రేక్షకులు కూడా సదరు చిత్రాలను ఎంతలా ఆదరిస్తారో చూపిన చిత్రం.

ప్రకాష్ రాజ్ – జయసుధ రాజుగారు-జానకమ్మ దంపతులుగా ఆత్రేయపురంలో ఆదర్శవంతమైన కుటుంబంగా ఉంటే, వారి సంతానం మాత్రం వారికి దూరంగా విదేశాల్లో స్థిరపడి ఉంటారు. కనీసం సంవత్సరానికి ఒక్క పండుగకు కూడా సొంతఊరు రాలేని సంతానం గురించి ఊరిలోనే మగ్గిపోయే దంపతులు పడే ఆవేదన ఈచిత్ర కధాంశం. జానకమ్మగారి భాదని చూసి రాజుగారు తమ బిడ్డలకు ఒక అబద్దం చెప్పి ఇంటికి రప్పించడం జరుగుతుంది. అలా విదేశాల నుండి ఇంటికివచ్చిన వారితో కుటుంబ సభ్యుల మధ్య జరిగే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. రాజుగారి మనవడిగా అందరితో ఆత్మీయంగా కలిసిపోయే శ్రీరాం (శర్వానంద్) చక్కగా నటిస్తే, అతనికి మరదలుగా నిత్య(అనుపమ పరమేశ్వరన్) నటించారు. చక్కటి ప్రేక్షకాదరణ పొందిన కుటుంబ కధా చిత్రం శతమానంభవతి. పల్లెల్లో అయినా పట్నాలలో అయినా విదేశాలలో అయిన భారతీయ సంస్కృతి నుండి వచ్చినవారికి కుటుంబ సామజిక విలువలే ప్రధానం అని చెప్పిన చిత్రం.

మరెన్నో కుటుంబకధా తెలుగు చలన చిత్రాలు మనకి ఉన్నాయి. తాతమనవడు, ఆలయశిఖరం, విజేత, దేవత, త్రిశూలం, మామగారు, ఆమె, అనుభందం, చంటి, బలరామకృష్ణులు, సూరిగాడు, ఆపద్భాందవుడు, పెళ్లిలాంటి కధాపరమైన చిత్రాలు కధనంలో ఐతే, గమ్యం లాంటి చిత్రాలు అనేకంగా ఉంటాయి. కానీ ఈమధ్య కొన్ని టివి చానెళ్ళలో కూడా కొత్తచిత్రాల ప్రభావమే ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబసమేతంగా చూడదగిన కుటుంబకధా తెలుగు చలనచిత్రాలు కుటుంబంతో కలిసి చిత్రవీక్షణ ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ అందులోను స్మార్ట్ టివిలు గాడ్జెట్లు వచ్చాక మనకి నచ్చిన సినిమా మనమే నెట్ ద్వారా స్మార్ట్ టివిలలో వీక్షించవచ్చు. అటువంటి సమయంలో సందేశం, వినోదం, చక్కటి కధతో కూడిన చిత్రాలను చూడడం వలన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు మంచి అలవాటులు అలవడే అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

తెలుగు చిత్ర సీమలో హాస్య చిత్ర దర్శకులు

సూపర్  హిట్ చిత్రాలలో యాక్షన్, ఫాంటసీ, డ్రామా, విబిన్న కదాంశాలతో తెలుగు చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ కామెడీ చిత్రాలు మనుసుకి హాయిని తీసుకువస్తాయి. Telugu Comdey Hasya Chitra Darshakulu, తెలుగులో కొంతమంది కామెడీ డైరెక్టర్స్ తీసిన చిత్రాలు. హాస్య ప్రధానంగా చిత్రాలను తెరకెక్కించే దర్శకులు. మనిషికి నవ్వే ఆరోగ్యంగా సంతోషం సగం బలంగా చెబుతూ ఉంటారు. అటువంటి నవ్వు తెప్పించే కొన్ని కామెడీ చిత్రాలను అందించిన దర్శకులు. జంద్యాల, ముత్యాల సుబ్బయ్య, వంశీ, ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కె విజయ భాస్కర రెడ్డి లాంటి దర్శకులు కామెడీ, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా లాంటి చిత్రాలని అందించారు, కొంతమంది దర్శకులు కె రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కె ఎస్ ఆర్ దాస్ మొదలైనవారు యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, సామజిక అంశాలపై చిత్రాలను తెరకెక్కించారు. కొంతమంది హాస్యమే ప్రధానంశంగా చిత్రాలను దర్శకత్వం వహించారు.

శివనాగేశ్వర రావు

కిడ్నాప్ కధని కామెడీగా మనీ మనిషిని ఎలా అడిస్తుందో వెండితెరకెక్కించి, దర్శకుడుగా పరిచయం అయ్యారు శివనాగేశ్వర రావు. తరువాత హాస్య ప్రధానంగా పలు హాస్య (కామెడీ) చిత్రాలను తెరకెక్కించారు. వన్ బై టూ, లక్కీ ఛాన్స్, మనీ మనీ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. పసిపిల్లవాడు ప్రధాన పాత్రధారిగా హాస్య చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగార్జున కొడుకు అయిన అఖిల్ ని మాస్టర్ అఖిల్ గా చిన్నప్పుడే సిసింద్రిగా పరిచయం చేసారు. ఆద్యంతం సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రాలలో బ్రహ్మానందంతో హాస్య సన్నివేశాలు బాగా ప్రేక్షకాదరణను పొందినాయి. పట్టుకోండి చూద్దాం, ఓ పనైపోతుంది బాబు, హాండ్స్ అప్, రమణ, ధనలక్ష్మి ఐ లవ్ యు, మిస్టర్ & మిసెస్ శైలజా కృష్ణమూర్తి, భూకైలాస్, నిన్ను కలిసాక చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రేలంగి నరసింహారావు – కామెడీ ఫిలిం డైరెక్టర్

రాజేంద్ర ప్రసాదుతో పలు హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా హాస్య ప్రధానంగా సాగే కధనమే రేలంగి నరసింహారావు గారి చిత్రాలలో కనిపిస్తుంది. పోలీసుగా నరేష్ ని చూపిస్తూ అతని బార్యగా సీతని కలెక్టర్ గా మార్చి పోలీసుభార్య అనే మహిళ కదా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాదుతో ఎదురింటిమొగుడుగా దివ్యవాణిని పక్కింటిపెళ్ళాంగా చూపించి చివరికి ఇద్దరినీ ఒక్కటే చేసే హాస్య చిత్రం ఎదురింటిమొగుడు పక్కింటిపెళ్ళాం నవ్వు తెప్పించే చిత్రం. ఇంకా ఇద్దరు పెళ్ళాల ముద్దులపోలీసు, రొటేషన్ చక్రవర్తి, చిక్కడు దొరకడు, పరుగో పరుగు, సుందరి సుబ్బారావు, పెళ్ళాం చాటు మొగుడు పలు హాస్య కుటుంబ కదా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

శ్రీనువైట్ల – కామెడీ, ఫ్యామిలీ, లవ్ డ్రామా ఫిలిం డైరెక్టర్

పెద్ద హీరోలతో కూడా ప్రధానంగా కామెడీ చేయించే దర్శకుడు అంటే శ్రీనువైట్ల, చిరంజీవితో అందరివాడు, నాగార్జునతో కింగ్, వెంకటేష్ తో నమోవేంకటేశా, మహేష్ బాబుతో దూకుడు, ఆగడు, Jr. ఎన్టీఆర్ తో బాద్ షా యాక్షన్ చిత్రాలను హాస్యప్రధానంగా చెప్పే ప్రయత్నంలో విజయవంతం అయ్యారు. మొదట నీకోసం చిత్రంతో దర్శకుడుగా ప్రేమకధను తెరకెక్కించిన శ్రీనువైట్ల ఆనందంతో కామెడీ లవ్ ఎంటర్టైన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకి, డీ, రెడీ, ఆనందం, దూకుడు, బాద్ షా తెలుగు చిత్రాలు దిగ్విజయాన్ని సాధిస్తే, నీకోసం చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.

జి నాగేశ్వరరెడ్డి కామెడీ ఫిలిమ్స్ డైరెక్టర్

6టీన్స్ వెరైటీ పేరుతొ టైటిల్ పెట్టి కామెడీతో కడుపుబ్బా నవ్వించే చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన జి నాగేశ్వరరెడ్డి, రోహిత్ హీరోగా 6టీన్స్, గర్ల్ ఫ్రెండ్, నేను సీతామహాలక్ష్మి, గుడ్ బాయ్ వంటి హాస్య ప్రేమకదా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ హీరోగా సీమశాస్త్రి, సీమటపకాయ్, ఇంట్లో దెయ్యం నాకేం బయ్యం చిత్రాలను డైరెక్ట్ చేసారు. హాస్య, ప్రేమ కదా చిత్రాలను ఎక్కువగా అందించారు. ఇదే నా మొదటి ప్రేమలేఖ, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, కాస్కో, దేనికైనారెడీ, కరెంటు తీగ, ఈడోరకం ఆడో రకం, ఆటాడుకుందాం రా, ఆచారి అమెరికా యాత్ర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇ సత్తిబాబు –

శ్రీకాంత్, రవితేజ, బ్రహ్మానందం, రోజా, మహేశ్వరీ, కోవై సరళ జంటలుగా తిరుమల తిరుపతి వేంకటేశా చిత్రంతో దర్శకుడుగా పరిచయమై పలు హాస్య ప్రధానంగా సాగే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓ చినదాన ప్రేమకధా చిత్రాన్ని శ్రీకాంత్ హీరోగా తెరకెక్కించి, అల్లరి నరేష్ నేను చిత్రంతో ఒక విబిన్నమైన పాత్రలో చూపించారు. ఒట్టేసి చెబుతున్నా, ఏమండోయ్ శ్రీవారు, వియ్యాలవారి కయ్యాలు, బెట్టింగ్ బంగార్రాజు, యముడికి మొగుడు, జంప్ జిలాని, మీలో ఎవరు కోటీశ్వరులు చిత్రాలను హాస్య ప్రధానంగా కుటుంబ కధలను, ప్రేమకధాలను వెండితెరపై చూపించారు.

శ్రీనివాస్ రెడ్డి కామెడీ ఫిలిమ్స్ డైరెక్టర్

హాస్య కుటుంబ కదా చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ్యా చంద్రం చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యారు. శివాజీ, శ్రీకాంత్, తొట్టెంపూడి వేణులు హీరోలుగా కొన్ని కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాగార్జున – అనుష్కలతోతో శివ భక్తి గల డమరుకం చిత్రానికి దర్శకత్వం వహించారు. అదిరిందయ్యా చంద్రం, యమగోల మళ్ళి మొదలైంది, కుబేరులు, బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్, అ ఆ ఇ ఈ, డమరుకం, సింగినాథం జీలకర్ర, బాబురావు నిన్నోదల, దుర్గ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రవిబాబు కామెడీ, లవ్, హారర్ ఫిలిమ్స్ డైరెక్టర్

పలు హాస్య, ప్రేమ, భయానక చిత్రాలను దర్శకత్వం వహించి తెరకెక్కించారు, అయితే మొదట హాస్య ప్రధానంగా సాగే అల్లరి చిత్రంతో దర్శకుడు పరిచయం అయ్యారు. రవిబాబు నటుడు చలపతిరావుగారి అబ్బాయి. ఈవివి సత్యనారాయణ ద్వితీయ కుమారుడిని అల్లరి నరేష్ గా పరిచయం చేసి తానూ దర్శకుడుగా పరిచయం చేసుకున్నారు. అలాగే అల్లరి నరేష్ తో పార్టీ, లడ్డు బాబు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంకా కొత్తవాళ్ళతో అమ్మాయిలు అబ్బాయిలు, నువ్విలా, నచ్చవులే వంటి హాస్యభరిత ప్రేమకదా చిత్రాలను అందించారు. భూమిక ప్రధాన పాత్రలో అనసూయతో అందరిని భయపెట్టి, హారర్ చిత్రాల్లో కూడా మెప్పించే దర్శకుడుగా అవును అనిపించుకున్నారు. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, అనసూయ, నచ్చవులే, అమరావతి, మనసారా, నువ్విలా, అవును, లాడ్డుబాబు, ఆవును2 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కామెడీ చిత్రాలే కాకుండా కుటుంబ, సామజిక, భయానక, ప్రేమ, సాంఘికా కదాంశాలతో నవరస చిత్రాలను అందించే తెలుగు దర్శకులు మనకి చాలామందే ఉంటారు. సందేశాత్మక చిత్రాలు కొన్ని సరదాగా సాగితే, కొన్ని వాస్తవిక పరిస్థితుల ప్రకారంగా సాగుతాయి. పలు రకాల కధంశాలతో కామెడీ ప్రధానంగా వచిన కొన్ని చిత్రాలు అశేష ప్రేక్షకాదరణను పొందాయి. పైన కొంతమంది దర్శకుల గురించి Telugu Comedy Hasya Chitra Darshakulu పోస్టు టైటిల్ గా చెప్పడం జరిగింది. మరికొంతమంది దర్శకుల చిత్రాల తరువాయి జైచిత్ర పోస్టులలో చదవగలరు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

సింగితం శ్రీనివాసరావు, బాపు, బి.గోపాల్, క్రాంతి కుమార్, ఎస్వీ కృష్ణారెడ్డి

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy, VijayaBhaskar: సింగీతం శ్రీనివాసరావు, బాపు, బి గోపాల్, క్రాంతి కుమార్, ఎస్వి కృష్ణారెడ్డి, విజయ భాస్కర్ ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకులు.

సింగీతం శ్రీనివాసరావు – SingeetamSrinivasaRao

సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మమైన పుష్పకవిమానం, ఆదిత్య 369 చిత్రాలకు దర్శకత్వం వహించారు. పుష్పకవిమానం చిత్రం మాటలు లేకుండానే ప్రారంభమై ముగుస్తుంది, కేవలం నటనతో నవ్వుతెప్పించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదిత్య369 టైం మెషిన్ అనే యంత్రంతో కాలంలో ప్రయాణించే ప్రయోగం చేసారు. 1990లలో వ్యక్తులు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యానికి వెళితే ఎలా ఉంటుంది, వారే 2500 సంవత్సరాలలోకి వెళితే ఎలా ఉండబోతుందో ఈ చిత్ర సన్నివేశాలు ఉంటాయి.

కమలహాసన్ తో అమావాస్య చంద్రుడు, సొమ్మొకడిది సోకొకడిది, పుష్పకవిమానం, మైకేల్ మదన కామరాజు, అపూర్వ సహోదరులు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా ప్రయోగాత్మక సందేశాత్మక కుటుంబ కధలను తెరకెక్కించారు. మయూరి, తరం మారింది, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, భైరవద్వీపం, మేడం, బృందావనం, జమిందారు గారి అమ్మాయి, నీతి నిజాయితీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బాపు – Bapu

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy

బాపు బొమ్మ, బాపు వ్రాత, బాపు కార్టూన్, బాపు ఫాంట్ ఇలా కొన్నింటిలో బాపు పేరు బ్రాండు గా ఉంది. అలాగే బాపు చిత్రాలలో నటించిన నటిమణిని కూడా ఒక బాపు బొమ్మగా చూస్తారు, తెలుగు చలనచిత్ర అభిమానులు. పౌరాణిక బొమ్మలు గీసిన సాంఘిక బొమ్మలు గీసిన బాపు బొమ్మల బహు ప్రసిద్ది పొందినవి, అలాగే బాపు కార్టూన్స్ కూడాను. ఇలా బహుముఖ ప్రజ్ఞా పాటవాలు కొంతమందికే ఉంటాయి, అటువంటి వారిలో బాపు ఒకరు. సాక్షి తెలుగు చిత్రంతో దర్శకులుగా మారిన బాపుగారు పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపుగారిపై ఆరుద్రగారు పద్యం చెప్పడం బాపుగారి ప్రజ్ఞా ఏపాటిదో అర్ధం అవుతుంది.

పలు పౌరాణిక సాంఘిక తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, ముత్యాల ముగ్గు చిత్రాలకు పలు అవార్డులు వచ్చాయి. ఇంకా సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు, బాలరాజు కధ, అందాలరాముడు, శ్రీ రామాంజనేయ యుద్ధం, త్యాగయ్య, రాదా కళ్యాణం, కళ్యాణ తాంబూలం, రాధగోపాలం, శ్రీనాధ కవిసార్వభౌమ, శ్రీరామరాజ్యం, శ్రీకృష్ణావతారం, భక్త కన్నప్ప, మంత్రిగారి వియ్యంకుడు,మనవూరి పాండవులు మొదలైన తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బి. గోపాల్ – BGopal

ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన బి. గోపాల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించారు. కలెక్టర్ గారి అబ్బాయి, బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడి, లారీ డ్రైవర్, స్టేట్ రౌడి, మెకానిక్ అల్లుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి లాంటి అగ్రహీరోలకు అందించారు. యాక్షన్ చిత్రాలను కుటుంబ కదా చిత్రాలను ఎక్కువ తెరకెక్కించిన బి. గోపాల్, రాయలసీమ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు దర్శకత్వం వహించి విజయవంతమైనారు.

క్రాంతి కుమార్ – KrantiKumar

మహిళా పాత్రలు ప్రధానంగా కుటుంబ కదా చిత్రాలను దర్శకత్వం చేసి మరియు నిర్మాతగా తెలుగు చిత్రాలను అందించారు. క్రాంతి కుమార్ నిర్మించిన ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు చిత్రాలతోనే చిరంజీవి వెండితెరకి పరిచయం అయ్యారు. అలాగే మీనా కూడా క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనువరాలు చిత్రంతో ప్రధాన పాత్రలో పరిచయం అయ్యారు. దర్శకులుగా నిర్మాతగా కూడా నంది అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.

శుభసంకల్పం చిత్రం

స్వాతి, అగ్నిగుండం, స్రవంతి, హీరో బాయ్, అరణ్యకాండ, శారదాంబ, గౌతమి, నేటి సిద్ధార్ధ, సీతారామయ్యగారి మనుమరాలు, అక్క మొగుడు, రాజేశ్వరి కళ్యాణం, సరిగమలు, భలేపెళ్ళాం, పాడుతా తీయగా, 9 నెలలు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. జ్యోతి, శారద, ఊర్వశి, కల్పన, పునాదిరాళ్ళు, ప్రాణంఖరీదు, సర్దారు పాపారాయుడు, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, శివుడు శివుడు శివుడు నేటి సిద్దార్ధ, రిక్షావోడు, 9 నెలలు మొదలైన చిత్రాలను నిర్మించారు.

ఎస్వి కృష్ణారెడ్డి – SVKrishnaReddy

ఎస్వి కృష్ణారెడ్డి కొబ్బరిబొండం చిత్రానికి కధని అందించి ఆ చిత్రానికే సంగీతం కూడా స్వరపరచారు, మాయలోడు చిత్రానికి కధ, కధనం, సంగీతం, దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్ – సౌందర్య కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో వరుసగా ఎస్వి కృష్ణారెడ్డి చిత్రాలు వచ్చి మహిళా ప్రేక్షకాదరణను పొందాయి. ఎక్కువ కుటుంబ కధలను హాస్య, సెంటిమెంట్ చిత్రాలను తెరకెక్కించారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, యమలీల, శుభలగ్నం, మావిచిగురు, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, ప్రేమకు వేళాయారా, సర్దుకుపోదాం రండి, పెళ్ళాం ఊరెళితే వంటి కుటుంబ కదా చిత్రాలను అందిచారు. ఉగాది, అభిషేకం చిత్రాలలో కధానాయకుడిగా నటించారు.

కె విజయ భాస్కర్ – VijayaBhaskar

1991 ప్రార్ధన చిత్రంతో దర్శకులుగా పరిచయమైనా విజయ భాస్కర్ మరలా తొమ్మిది సంవత్సరాలకు 1999లో వేణు తొట్టెంపూడి – లయ ప్రధాన పాత్రలుగా స్వయంవరం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్ర విజయం తరువాత తరుణ్ – రిచా లతో నువ్వే కావాలి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇక వరుసగా నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, నాగార్జునతో మన్మధుడు, చిరంజీవితో జైచిరంజీవ చిత్రాలకు దర్శకత్వం వహించిన కె విజయ భాస్కర్ క్లాస్ మేట్స్ భలేదొంగలు, ప్రేమ కావాలి, మసాలా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. హాస్య ప్రధానంగా కుటుంబ ప్రేమ కధలను అందించి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను దర్శకత్వం చేసారు. నువ్వే కావాలి చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు పొందారు.

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy, VijayaBhaskar Telugu chalanachitra darshakulu.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

శుభసంకల్పం

ShubhaSankalpam Alpa vishayalaki Ateetamga untundi శుభసంకల్పం కమలహసన్, ఆమని, ప్రియారామన్, కె విశ్వనాధ్ ప్రధాన పాత్రలుగా ఉంటే, రాళ్ళపల్లి, నిర్మల, గొల్లపూడి తదితరులు నటించిన ఈ చిత్రం శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్ పతాకంపై SP బాలసుబ్రహ్మణ్యం కె విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు, చిత్ర పాటలు మంచి ప్రజాదరణను పొందాయి.

రాయుడు (కె విశ్వనాధ్) సముద్రతీరాన నివాసం ఉండే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పెద్దమనిషి, అయన సంకల్పమే ఆచరణలో శుభసంకల్పంగా మన ముందుకి వచ్చింది. సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మత్యకారులకు పడవలు చేయించి ఇస్తూ, వారి మంచిచెడులను చూసుకునే పెద్దమనిషి. రాయుడుకి ఒక కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు, ఆమె మనుమరాలు తాతయ్య అంటే ప్రేమ కొద్ది, ఆ పల్లెకి వచ్చి వెళుతూ ఉంటుంది. ఇంకా రాయుడుకి ఒక దత్తపుత్రుడు ఉంటే అతను చెడు అలవాట్లకు బానిసగా మారతాడు.

సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మత్యకారులలో దాసు (కమలహాసన్) చాల తెలివైనవాడు. పేపర్ పెన్ను అవసరం లేకుండా ఎప్పటి లెక్కలు అయినా కావలసినప్పుడు చెప్పగలిగే జ్ఞాపక శక్తి కలిగిన వ్యక్తి, అయితే అతను ఏమాత్రం అక్షరజ్ఞానం లేని వ్యక్తి. దాసు అంటే రాయుడుగారికి ఎనలేని అభిమానం ఉంటుంది.

చెడు అలవాటులకు దగ్గరైన తన కొడుకుని డబ్బు వ్యవహారాలకు దూరంగా ఉంచడంతో చెడు అవసరార్ధం రాయుడు కొడుకు అయిన దత్తుడుజ, పట్నంలో ఒక వ్యక్తి దగ్గర (కోట శ్రీనివాసరావు) దగ్గర లక్షల కొద్ది అప్పు చేస్తాడు. ShubhaSankalpam Alpa vishayalaki Ateetamga untundi

గంగామహాలక్ష్మి – దాసుల వివాహం

పడవలు తయారుచేసే ఒక తాగుబోతు కూతురు అయిన గంగామహాలక్ష్మి (ఆమని) దాసు ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ విషయం తెలిసిన రాయుడు వాళ్ళిద్దరికీ పెళ్ళిచేసి, మరలా దాసు – గంగామహాలక్ష్మికి పుట్టిన కొడుకుకి నామకారణం కూడా తన ఖర్చులతో చేయిస్తాడు.

పట్నంలో అప్పు చెల్లించవలసిన రాయుడు కొడుకు దత్తుడు, రాయుడు ఆఫీసులో లేని సమయంలో వచ్చి బలవంతంగా డబ్బు తీసుకుని వెళ్లిపోతుంటే, దాసు అడ్డుకుని ఆ లక్షల డబ్బుని తన ఇంట్లో దాస్తాడు. తరువాత విషయం ఊరిని నుండి వచ్చిన రాయుడికి వివరిస్తారు.

డబ్బుని దాసు ఇంటిలోనే ఉంచి, వ్యాపార వ్యవహారాలకు ఉపయోగించమని, మీ అందరికి తలా ఒకరికి ఒక ఇల్లు, ఒక పడవ సొంతంగా ఉండి, మీరు సంతోషంగా ఉండాలి అదే నా సంకల్పం అని రాయుడు అంటారు. తన సంకల్పానికి దాసుని సహకారంగా ఉండమని చెబుతారు. ఇక ఆ డబ్బు వ్యవహారాలు అన్ని దాసు గుడిస నుండి జరుగుతూ ఉంటాయి.

ఒకరోజు దాసు వేటకి అని సముద్రంలోకి వెళ్తాడు, అదును కోసం చూస్తున్న రాయుడి కొడుకు మనుషులు దాసు ఇంటికి వచ్చి దాడి చేస్తారు. ఆ డబ్బుని కాపాడే క్రమంలో దాసు నాయనమ్మ ప్రాణాలు కోల్పోతుంది. గుడిసె నుండి డబ్బుని తీసుకుని గంగామహాలక్ష్మి పడవమీద సముద్రంలోకి వెళ్తుంది, వెంటాడిన మనుషులకు డబ్బులు దక్కకుండా ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతుంది. ShubhaSankalpam Alpa vishayalaki Ateetamga untundi

వేటకు వెళ్ళిన దాసుకి డబ్బు గంగా మహాలక్ష్మి వలలో చిక్కుతారు, అయితే గంగా మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయి, డబ్బుని రక్షిస్తుంది. దాసు నాయనమ్మ మరణం చూసిన రాయుడికి గుండెపోటు వస్తుంది. రాయుడి ప్రాణరక్షణార్ధం గంగామహాలక్ష్మి బ్రతికే ఉన్నట్టు అబద్దం చెబుతాడు దాసు.

హాస్పిటల్ నుండి గంగ కోసం ఎదురుచూసే రాయుడు, తిరిగిరాని లోకాలకు తరలిపోయిన తనభార్య క్షేమంగా వస్తుంది అని రాయుడికి అబద్దం చెబుతూ దాసు పాత్ర విబిన్నంగా కనిపిస్తుంది. అందరూ ఉండి కూడా దాసు తన భార్యకు తన కొడుకుతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు, రాయుడి ప్రాణ రక్షణకోసం. ఈ సన్నివేశాలు కంటతడిబెట్టిస్తాయి. చివరికి రాయుడికి గంగవిషయం తెలుస్తుంది, తరువాత రాయుడి కలల్ని దాసు నిజం చేస్తాడు.

నటన అంటే కమలహాసన్ చిత్రాలే సమాధానాలుగా చెబుతారు, అటువంటి నటనకి కె విశ్వనాధ్ గారి దర్శకత్వం తోడైతే ఆ చిత్రం నటన విశ్వరూపమే కనిపిస్తుంది. అటువంటి ఈ చిత్రం ఒక శుభసంకల్పాన్ని నెరవేర్చే పాత్రలో కమలహాసన్ నటన అద్బుతంగా ఉంటుంది. ఒక మంచి చిత్రం ఉంది అని చెప్పగలం కానీ ఆ మంచి చిత్రం గురించి గొప్పగా చెప్పడం కన్నా మంచి చిత్రాలే చూస్తేనే బాగుంటుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

సౌందర్య – విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగుచిత్రం

PavitraBandham, ViktariVenkatesh, Soundaryala Telugu Chitram ayite Mutyala Subbaiah Director. పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం. వెంకటేష్ – సౌందర్య హిట్ కాంబినేషన్లో వచ్చి తెలుగు మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా చిత్రంగా నిలిచింది. మారుతున్నా సామజిక పరిస్థితిలో భాగం ఎక్కువమంది ఉన్నత కుటుంబంలో తమ పిల్లల్ని ఇతరదేశాలలో చదివించడం పరిపాటి. అలా ఇతర దేశాలలో చదువుకుని ఇంటికి వచ్చి ఒక ఉన్నత కుటుంబ కుర్రాడుగా వెంకటేష్ నటిస్తే, సనాతన ధర్మం కల్గిన భారతదేశంలో సగటు మహిళగా, ఒక ఫాక్టరీలో ఉద్యోగిగా సౌందర్య చక్కగా నటించిన చిత్రం, పవిత్రబంధం.

సకుటుంబ సపరివారంగా చూడదగిన చిత్రాలలో పవిత్రబంధం ఒకటిగా ఉండి, భారతీయ స్త్రీమూర్తి సహనం, పతిసేవా తత్పరతను తెలియజేసే తెలుగు చలనచిత్రం పవిత్రబంధం. సెంటిమెంట్ చిత్రాల దర్శకులుగా పేరుపొందినవారిలో ముత్యాల సుబ్బయ్య గారు ఒకరు. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై పోసాని కృష్ణ మురళి కధ అందిస్తే, ఎంఎం కీరవాణి సంగీతం అందివ్వగా పవిత్రబంధం చిత్రాన్ని వెంకట రాజు – శివరాజులు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మించారు. PavitraBandham, ViktariVenkatesh, Soundaryala Telugu Chitram.

జనతాగారేజ్ చిత్ర సమీక్ష చదవండి

విశ్వనాధ్(SP బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆస్తిపరుడైన అతనికి ఒక కొడుకు విజయ్(విక్టరివెంకటేష్) ఫారిన్లో చదువుపూర్తీ చేసుకుని స్వదేశానికి ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చిన విజయ్ తో విశ్వనాధ్ పెళ్లి చేసుకుని బిజినెస్ వ్యవహారాలు చూసుకోవలసినదిగా కోరతాడు. స్వేచ్చగా స్వదేశం వదిలి విదేశంలో తిరగడం అలవాటు పడిన విజయ్ కేవలం సంతోషకరమైన విషయాలతో సంతోషిస్తూ ఉంటాడు.

రాధ (సౌందర్య) మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈమె తన కుటుంబ పోషణార్ధం విశ్వనాధ్ ఆఫీసులో విశ్వనాధ్ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. రాధ (సౌందర్య) కుటుంబంలో అన్న నిరోద్యోగిగా ఉంటూ ఉంటే, పెళ్ళైన ఆమె అక్క జబ్బుతో బాధపడుతూ ఇంటిలోనే ఉంటుంది. పెళ్లికావాల్సిన చెల్లెలు ఉంటుంది. కుటుంబ పోషణ మొత్తం రాదే చూసుకుంటూ ఉంటుంది.

విజయ్ ఇంటికి వచ్చాక పాశ్చాత్య ధోరణిలో ఉంటూ క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పెళ్లి సంభందం గురించి మాట్లాడితే విజయ్ చెప్పిన మాటలకు విశ్వనాధ్ అవాక్కవుతాడు. నేను పెళ్లిచేసుకుంటాను కానీ ఆమెతో సంవత్సరం కాపురం చేసాక మా ఇద్దరికీ ఇష్టంగా ఉంటే కాపురం కొనసాగిస్తాం, ఒకవేళ సంవత్సరం తరువాత అలా ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా విడిపోవటానికి అంగీకరించిన అమ్మాయి అయితే నాకు సరే అని చెబితే అవాక్కవ్వని తెలుగు తండ్రి ఉండడు. ఆ విధంగా కొడుకు ప్రవర్తనకు కారణం తల్లిలేకుండా ఉండడం ఒకటి, విదేశ సంస్కృతిలో అలవాటు పడి ఉండడం ప్రధాన కారణం అని గ్రహించిన విశ్వనాధ్.

విజయ్ (విక్టరివెంకటేష్) రాధ(సౌందర్య) అగ్రిమెంట్ వివాహం

ఆఫీసులో తనకు పర్సనల్ సెక్రటరీగా చేస్తున్న రాధను చూసి ఈమె అయితే తన కొడుకు విజయ్నిమార్చగలదు అని భావించి, ఆమెకు తన కొడుకుని పెళ్లి చేసుకోవలసినదిగా కోరతాడు. ఆత్మాభిమానం కలిగిన రాధ తన కుటుంబ కష్టాలు తీరాలంటే డబ్బు అవసరం, ఆ డబ్బు విశ్వనాధ్ గారి అబ్బాయి కండిషన్ తెలిసి, పెళ్లి తరువాత ప్రేమతో విజయ్ ని మార్చుకుంటాననే నమ్మకంతో ఆమె పెళ్ళికి ఒప్పుకుంటుంది. అయితే విశ్వనాధ్ గారి బరోస వలననే ఆమె తనపై తనకు గల నమ్మకంతో విజయ్ ని పెళ్లి చేసుకుంటుంది రాధ.

పెళ్లికి ముందే అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు చేసుకుంటారు కాబోయే భార్య భర్తలు. తర్వాత రాధవిజయులు అన్యోన్యంగా కలిసి ఉండడం ముచ్చటగా ఉంటూనే, మరోప్రక్క విజయ్ అగ్రిమెంట్ ఆసక్తిగా కధనం సాగుతుంది. రాధ కుటుంబ కష్టాలు విశ్వనాధ్ గారు తీర్చుతారు. రేచీకటితో బాధపడే సుధాకర్, బ్రహ్మానందం హాస్య సన్నివేశాలు మద్య మద్యలో వస్తూ ఉంటాయి.

సంవత్సరం గడిచేలోపు విజయ్ కి ఆక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో రాధ అతనికి సేవలు చేసి అతనిని కాపాడుకుంటుంది. ఆ క్రమంలో వచ్చే పాట అపురూపమైనది అమ్మ ఆడజన్మ అంటూ సాగే సాంగ్ చిత్రీకరణ కధలో భాగమై సాగుతుంది. పాట పూర్తీ అయ్యేసరికి సంవత్సరం గడవడం అగ్రిమెంట్ ప్రకారం తనకు రాధపై ఫీలింగ్స్ లేవని వివాహం రద్దు చేసుకుందామని అంటే, విజయ్ తండ్రి బ్రతిమాలినా వినని విజయ్ విచిత్రంగా విడిపోవడానికి ఇష్టపడతాడు. విజయ్ ఇష్టప్రకారం రాధ తన పుట్టింటికి వెళుతుంది.

అలా పుట్టింటికి వెళ్ళిన రాధ లేని లోటు విజయ్ కి తెలిసి వచ్చి, ఆమెపై తనకి ఉన్న ప్రేమను గుర్తించి రాధ కోసం రాధ పుట్టింటికి వెళితే విజయ్ ని రాధ తిరస్కరిస్తుంది. ఎవరు చెప్పిన రాధ వినకుండా ఒంటరిగా ఉంటూ అందరి చేత మాటలు పడుతుంది. అలా ఎందుకు రాధ చేసింది అనేది చిత్రం చూడడమే బాగుంటుంది. చివరికి ఇద్దరు ఒకటవటంతో చిత్ర కధ ముగుస్తుంది. అయితే ఆద్యంతం కుటుంబ వాతావరణ సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. రాధ పాత్రలో సౌందర్య నటన అద్బుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ – సౌందర్యల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటే, విశ్వనాధ్ పాత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగారి నటన సెంటిమెంట్ బాగా పండిస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన పవిత్రబంధం చిత్రం, చాల పవిత్రమైన బంధం విలువని తెలియజేస్తుంది. PavitraBandham, ViktariVenkatesh, Soundaryala Telugu Chitram.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్