Monthly Archives: February 2021

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్ ఫ్రీగా లభించే మూవీస్ లిస్ట్ ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసుకుని వాచ్ చేయడానికి…

తెలుగు మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్… ఈ మొబైల్ యాప్ తెలుగు పాపులర్ మూవీస్ లిస్ట్, ఫ్యామిలి డ్రామా మూవీస్ లిస్ట్, యాక్షన్ మూవీస్ లిస్ట్…

డ్యుయల్ రోల్ మూవీస్ లిస్ట్, లవ్ స్టోరీ మూవీస్ లిస్ట్, ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీస్ మొదలైన మూవీస్ లిస్టులు డిస్ప్లే అవుతాయి. వాటి నుండి మీకు నచ్చిన మూవీస్ మీరు యాప్ ఫేవరెట్ స్క్రీనులోకి చేర్చుకోవచ్చు…

ఒక్క టచ్ తో మీకు నచ్చిన మూవీస్ లిస్ట్ ఒక ఫేవరెట్ లిస్టుగా మార్చేయండి.. అప్పటి నుండి మీరు యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి అదే లిస్ట్ కనబడుతుంది.

అవసరం లేని మూవీస్ జాబితా నుండి ఒక్క టచ్ తో రిమూవ్ చేయాయవచ్చు. ఫేవరెట్ లిస్ట్ మేకింగ్ కోసం తెలుగు ఫుల్ మూవీస్ యాప్ ఫ్రీ గా ప్లే స్టోర్ నుండి ఈ క్రింది బటన్ కు గల లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండీ.

గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా అందుబాటులో ఉన్న మూవీమాయా మొబైల్ యాప్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఇంస్టాల్ చేసి ఓపెన్ చేయగానే ఈ క్రింది ఫోటోలో ఉన్నట్టుగా మీ మొబైల్ ఫోనులో స్క్రీన్ ఉంటుంది.

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్

పైన ఫోటోలో మాదిరిగా మూవీమాయా ఫస్ట్ ఓపెన్ ఉంటుంది. పైఫోటోలో తెలుగు మూవీస్ లిస్ట్ వివిధ కేటగిరీలలో లింక్ చేయబడి ఉంటాయి.

మీరు క్లిక్ చేసిన కేటగిరీలో తెలుగు ఫుల్ లెంగ్త్ మూవీస్ లిస్ట్ ఉంటుంది. ఆ మూవీస్ పై లవ్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ పై క్లిక్ చేయగానే, సదరు సింబల్ కలిగిన మూవీ ఇదే యాప్ లో ఫేవరెట్ స్క్రీనులోకి జోడించబడుతుంది.

ఛత్రపతి సినిమాపై గల ఫేవరెట్ సింబల్ పై క్లిక్ చేయగానే ఛత్రపతి సినిమా వీడియో లింకుతో సహా ఫేవరెట్ స్క్రీనులోకి వస్తుంది. ఈ క్రింది ఫోటోలో మాదిరిగా….

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్

పైన గల చిత్రంలో ఛత్రపతి సినిమా వీడియొ యాడ్ చేయబడింది… క్రిందగా “+” సింబల్ చూడండి. దానిపై క్లిక్ చేస్తే మరలా కేటగిరీల లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో ఉన్న సబ్ లిస్టుల నుండి మరొక సినిమా ఫేవరెట్ స్క్రీనుకు యాడ్ చేయవచ్చు.

అలాగే మరొక కేటగిరీలోని స్నేహం కోసం అనే చిరంజీవి సినిమాపై గల ఫేవరెట్ సింబల్ పై టచ్ చేయగానే, ఆ సినిమా కూడా ఫేవరెట్ స్క్రీనులోకి జోడించబడుతుంది.

ఇప్పుడు ఇంతకుముందు యాడ్ చేసిన ఛత్రపతి సినిమా దిగువగా స్నేహం కోసం సినిమా లింకు వీడియో కూడా జోడించబడుతుంది. ఈ క్రింది స్క్రీన్ చూడండి.

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్

చూసారా పై ఫోటో ఉన్నట్టుగా ఎన్ని సినిమా వీడియోలు అయిన ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసి, తిరిగి యాప్ ఓపెన్ చేయగానే, మీరు ఎంచుకున్న సినిమాల లిస్టుతో యాప్ ఓపెన్ అవుతూ ఉంటుంది.

కేవలం “+” సింబల్ పై టచ్ చేసి యాప్ లో గల కేటగిరిస్ వాటిలో గల సినిమా లిస్టులను చూడవచ్చు.

మీరు చూసిన మూవీస్ మూవీమాయా యాప్ ఫేవరెట్ లిస్ట్ నుండి తొలగించవచ్చు. పై ఫోటోలో గమనించండి. డిలీట్ సింబల్ ఉంది. ఆ డిలీట్ సింబల్ పై టచ్ చేయగానే, సదరు మూవీ ఫేవరెట్ స్క్రీను నుండి రిమూవ్ అవుతుంది. మీరు ఫేవరెట్ స్క్రీనునుండి అన్నీ మూవీస్ రిమూవ్ చేస్తే, యాప్ లో గల ఫేవరెట్ స్క్రీన్ ఈ క్రింది ఫోటోలో మాదిరిగా ఉంటుంది.

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్

పై ఫోటోలో మరలా + గుర్తుపై టచ్ చేస్తే మరలా మూవీ కేటగిరీల స్క్రీన్ వస్తుంది. ఈ క్రింది ఫోటో మాదిరిగా….

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్

ఈ పైన ఉన్న ఫోటోలో యాక్షన్ మూవీస్ లిస్ట్, లవ్ స్టోరీ మూవీస్ లిస్ట్, డ్యుయల్ రోల్ మూవీస్ లిస్ట్, పాపులర్ మూవీస్ లిస్ట్, ఫ్యామిలి డ్రామా మూవీస్ లిస్ట్, ఇంకా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రాజేంద్ర ప్రసాద్… తదితర హీరోల మూవీస్ లిస్ట్ కలవు. ఆయా లిస్టుల నుండి మీకు నచ్చిన మూవీని ఫేవరెట్ స్క్రీనులోకి జోడించవచ్చు… తిరిగి తొలగించవచ్చు.

క్రింది లిస్టులలో గల సినిమా ల లిస్టు స్క్రీనులు కొన్నింటిని చూడండి.

మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ ఫ్రీ ఆండ్రాయిడ్ డౌన్ లోడ్ చేయడానికి ఈ క్రింది బటన్ పై క్లిక్ చేయండి.

Home

లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు

లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు ఎలా ఉంటాయో గమనించుకోవడం మనకు మనం మేలు చేసుకోవడం అంటారు.

అవసరం లోన్ గురించి తెలుగులో వ్యాసం. అవసరానికి తగినంత డబ్బు లేనప్పుడు లోన్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. తిరిగి చెల్లించడం కష్టం కాకుండా చూసుకోవడం ప్రధానం.

అటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మనసులో గుర్తు ఉంచుకోవలసిన ఆలోచన… ఎందుకంటే ఆలోచనే మనసును మరింత ముందుకు నెడుతుంది.

లోన్ తీసుకునేటప్పుడు ఆలోచన, అవసరాలకు అనుగుణంగా లోన్ తీసుకోవడం ప్రధానం అయితే, తిరిగి చెల్లించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు గమనిచడం అంతకన్నా ప్రధానం.

నియంత్రణ గల మనసు పొరపాటుకు తావులేకుండా ఉండగలుగుతుంది. లోన్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు తగు ఆలోచన అవసరం అంటారు.

లోన్ తీసుకోవడం తేలిక కానీ తిరిగి చెల్లించడం కష్టం. తీసుకునేటప్పుడు ఉండే ఆసక్తి కట్టేటప్పుడు కనబడదని కొందరంటారు. కేవలం లోన్ చెల్లించడంలో ఒక్కసారి అశ్రద్ధ మొదలైతే ఇక అంతే, ఆ లోన్ పూర్తయ్యేవరకు మనశ్శాంతి ఉండదు.

ఎందుకు లోన్ తీసుకుంటాము అంటే అవసరం కోసం లోన్ తీసుకుంటాము. ఒక వస్తువు కొనడానికి లేదా ఒక కార్యక్రమము చేయడానికి లోన్ తీసుకుంటాము లేదా ఒక కట్టడము కట్టడానికి లేదా ఒక వాహనము కొనుగోలు చేయడానికి లోన్ వైపు వెళ్తూ ఉంటారు.

ఒక వస్తువు లేదా ఒక వాహనం కొనడానికి మన దగ్గర తగినంత ధనం లేనప్పుడు అదనపు ధనం కోసం లోన్ వైపు ఆసక్తి కనబరుస్తము.

అలాగే ఒక కట్టడం కట్టడానికి సరిపడా సొమ్ములు లేనప్పుడు కూడా మనం లోన్ వైపు మొగ్గు చూపుతాము.

ఇంకా ఏదైనా కార్యక్రమము జరపించడానికి కూడా తగినంత ధనం లేకపోతే లేదా గ్రాండుగా కార్యక్రమం జరిపించాలని తలిస్తే, లోన్ వైపు ఆసక్తి చూపుతాం.

వీటిలో సహజంగా వస్తువుల కోసం తీసుకునే లోన్స్ తిరిగి చెల్లింపులు బాగానే చేయగలం. ఎందుకంటే వస్తువు వాడకం మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి వస్తువు ఉపయోగం కనబడడంతో మనసు తృప్తిగానే ఉంటుంది.

కార్యక్రమం కోసం లోన్ తీసుకుంటే

కాని ఒక్కోసారి ఏదైనా కార్యక్రమం కోసం లోన్ తీసుకుంటే, లోన్ తీసుకునేటప్పుడు ఆసక్తి ఉంటుంది. కార్యక్రమం అయిపోయాక ఆ విషయం గురించి మరుపు మనసుకు ఉంటుంది. కానీ లోన్ తీరేవరకు మాత్రం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడో జరిగిన కార్యక్రమం మరిచిన మనసు మాములుగానే అశ్రద్ధను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

కార్యక్రమం గురించి అయితే లోన్ తీసుకోవడం కన్నా తక్కువలో తక్కువ ఉన్న డబ్బులతోనే సదరు కార్యక్రమం నిర్వహించడం శ్రేయష్కరం అంటారు.

తాహతుకు మించి కార్యక్రమం తలపెట్టడం కన్నా, ఉన్నంతలో సర్దుకుని కార్యక్రమం తృప్తిగా నిర్వహించడం ఉత్తమమని పెద్దలంటారు.

ఇక వస్తువులు వీలైనంతలో చేతిలో ఉన్న సోమ్ములకు సరిపడా వస్తువునే ఎంచుకోవడం ఉత్తమమైన ఆలోచనగా పెద్దలు చెబుతారు.

ప్రారంభంలో ఉండే ఆసక్తి అంత్యములో ఉండదు. కాబట్టి ప్రారంభంలో మోజు కన్నా అవసరం గుర్తెరిగితే, ప్రారంభంలో ఉండే మనోస్థితి అంత్యములోనూ ఉంటుంది. ఈ విధానంలో ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం లేక వస్తువు కొనుగోలు వ్యవహారాలు నిర్వహించ తలిస్తే, అప్పులు లేక లోన్స్ వైపు ఆసక్తి ఉండదు.

తప్పని సరి పరిస్తితిలో లోన్ తీసుకుంటే, అందుకు తగ్గట్టుగా రాబడి పధకం మన దగ్గర ఉండాలి. లేకపోతే తీసుకున్న లోన్ తిరిగి చెల్లించలేక బాధపడాలి.

వస్తువు మీద ఆసక్తికి అధిక ఆలోచన తోడైతే, ఆ వస్తువుపై మోజు పెరుగుతుంది. మోజు పడ్డ మనసు వస్తువుకు లొంగుతుంది… అటువంటి ఆలోచనను ఆరంభంలోనే తుంచేయడం శ్రేయస్కరం అని పెద్దలంటారు.

లోన్ తీసుకోవడానికి ప్రధాన కారణం అవసరం అయితే, అది భవిష్యత్తులో భారం కాకుండా చూసుకోవడం విజ్ఞులు చేసే మంచి పని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ, పరోక్షంగా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది.

పరిశుభ్రత మనిషి ఆరోగ్య సూత్రాలలో ప్రధానమైనది. మనిషి తన వంటికి పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే తన నివాసం పరిశుభ్రతగా ఉంటుంది.

తను ఆరోగ్యంగా ఉండడం తన ప్రధాన అవసరం అయితే, తన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం సామజిక అవసరం.

తన గురించి తన చుట్టూ ఉండే వారి గురించి పరిశుభ్రతను పాటిస్తే, ఒక సామజిక బాద్యత నిర్వహించిన వారవుతారు. మనిషి ఆరోగ్యం పరిశుభ్రత ఆధారంగా ప్రభావితం అవుతుంది. పరిశుభ్రత గల ప్రదేశంలో పరిశుభ్రతతో ఉన్న శరీరంతో పరిశుభ్రతమైన ఆహారం తీసుకోవడం కుటుంబ ధర్మాలలో ఒక్కటిగా ఉంటుదని అంటారు.

ఒక మనిషి తన పరిశుభ్రతతో బాటు పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటిస్తే అది సమాజం పట్ల తన కర్తవ్యమ్ నిర్వహించినట్టే అవుతుంది. అలాగే సామాజిక పరిశుభ్రత కోసం కృషి చేయడంతో సామజిక సేవ చేసినట్టే అవుతుంది.

వ్యక్తీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలలో ఉండే పరిసరాలు అంటే అవి నివసించే ఇల్లు, తిరిగే దారులు, పనిచేసే కార్యాలయాలు, నేర్చుకునే స్థలాలు, చదువుకునే విద్యాలయాలు ఇలా అనేక రకమైన పనులలో అనేక రకాలుగా పరిసరాలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి.

ఇల్లు పరిశుభ్రతతో ఉంటే, ఆ ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది.

ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అంటువ్యాది వస్తే, అది ఆ ఇంట్లో అందరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు పరిసరాలలో పేరుకుపోయిన చెత్త వలన క్రిములు పెరిగి, ఆ క్రిముల వలన వ్యాధులు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి అంటువ్యాధులు నివారణకు ముందుగానే పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవడం మనిషిగా కనీస సామజిక బాధ్యతగా చెబుతారు.

చదువుకునే విద్యార్ధులు ఉండే విద్యాలయాలు పరిశుభ్రతగా లేకపోతే ఆ పరిసరాలలో ఏర్పడే సూక్ష్మజీవుల వలన అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని విద్యాలయాల కార్యవర్గం, విద్యాలయాలలో ఉండేవారు, విద్యార్ధులు కూడా అందరు ఆయా విద్యాలయాల పరిసరాల పరిశుభ్రత గురించి శ్రద్ధ తీసుకుని పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలి.

పరిశుద్దమైన ఆహారం, పరిశుద్ధమైన పానీయం తీసుకోవడం వ్యక్తిగా అందరికి ఆరోగ్య నియమలుగా చెబుతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం మరొక వ్యక్తిపై పడుతుందని కరోన వైరస్ కారణంగా అందరికి తెలిసి వచ్చింది. ఆరోగ్యం చెడినవారికి కరోన వైరస్ త్వరగా వ్యాపించి, వారిద్వారా మరింతమందికి కరోన సోకినా ఘటనలు ప్రపంచంలో గత ఏడాది నుండి జరిగాయి.

ఈ కరోనా వైరస్ కారణంగా పారిశుధ్యం, ఆరోగ్యం పరిశుభ్రత, పరిశుభ్రత నినాదాలు పెరిగాయి. పారిశుధ్యంతో కూడిన ఆహారం తీసుకుంటే, వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే, అంటువ్యాధులు త్వరగా సోకవు. లేకపోతే అంటువ్యాధులు ప్రభాలుతాయి. కావున వ్యక్తి తన ఆరోగ్యపరిరక్షణ చేసుకోవడం పరోక్షంగా సామజిక పరిరక్షణ కూడా చేసినట్టే అవుతుంది.

బలమైన వ్యక్తికీ బరించే బలం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేవారు వైరస్ బారిన పడకుండా తమనుతాము రక్షించుకుంటూ ఇతరులను అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడినవారవుతారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం అంటే, సమాజాన్ని ఆరోగ్యపరంగా రక్షించినవారమవుతాము.

పనిచేసే కార్యాలయాలలో, పని చేసే కర్మాగారాలలో ఆయా పరిసరాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఒక కార్యాలయంలో కానీ ఒక కర్మాగారంలో కాని వ్యక్తికి అంటువ్యాధి సోకితే, వారి ద్వారా, వారి చుట్టూ ఉన్నవారికి ఇంకా వారి వారి కుటుంబ సభులకు కూడా అంటువ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటువ్యాధులు ప్రభాలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన కర్తవ్యం అందరిపైన ఉంటుంది.

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ తద్వారా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు