తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజంపైన పడుతుందా? అవుననే అంటారు. ఎందుకంటే ఒకప్పుడు హిట్ సినిమాను బట్టి, ఆ సినిమా చీరలు అని అమ్మకాలు కొనసాగించేవారు.
అంటే పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ అయ్యింది… ఆ తురువాత బట్టల షాపులలో పెళ్ళిసందడి చీరలు అంటే అమ్మకాలు ఎక్కువగా ఉండేవి… అదేవిధంగా తెలుగు సినిమా హీరోల స్టైల్ కూడా యువతపై ప్రభావం చూపుతుంది.
మన తెలుగు సినిమాల కధలు సమాజంలో ఎదో ఒక మూల జరిగిన సంఘటన ఆధారంగా లేక రచయిత మైండులో పుట్టిన ఆలోచన ఆధారంగా కావచ్చు.
కాని ఆయా తెలుగు సినిమాల ప్రభావం మొత్తం తెలుగు సమాజంపై ఉంటుంది.
ఎక్కువ అభిమానులు కలిగిన హీరో సినిమా అయితే, ఎక్కువమంది యువకులపై ప్రభావం చూపుతుంది.
ఏమిటి? ఈ తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజం పైన…
అంటే ఆలోచనా ధోరణిలోకి సినిమాలలో ఉండే విషయాలు వచ్చి చేరతాయి.
ఎలాంటి విషయాలు ఆలోచన ధోరణికి దగ్గరవుతాయి? అంటే కధానాయకుడు వేష ధారణ యువకులలో అనుసరించాలనే ఆసక్తిని పెంచవచ్చు.
అలాగే కధానాయిక యొక్క వేషధారణ కు యువత మనసులో మెదులుతూ ఉంటుంది.
ఇంకా మాటల ప్రభావం కూడా ఉండవచ్చు. అంటే సినిమాలో నాయకా నాయికలు మాట్లాడే భాషా శైలి యువతను ఆకట్టుకుంటే, అటువంటి శైలిని యువత అనుసరించడానికి ఆసక్తి కనబరచవచ్చు.
ఇలా తెలుగు సినిమాల వలన వేషధారణ, మాటతీరు తెలుగు సమాజంపై పడే అవకాశం ఉంటే, ఇంకా సినిమా కధలో చేయవచ్చు, చేయకూడదు అనే పనులపైన కూడా సినిమా ప్రభావం ఉండవచ్చు.
సమాజంలో ఎదో ఒక ప్రాంతంలో ఏదైనా వింత ప్రవర్తన ఉన్న వ్యక్తి ఉంటే, అటువంటి వ్యక్తి కధను సినిమాగా మరల్చడం ద్వారా ఆయా ప్రాంతీయ పోకడ మొత్తం సమాజానికే తెలియబడుతుంది.
ఒక దర్శకుడి వినూత్న ఆలోచన సినిమాగా వచ్చినా ఆ ఆలోచన కూడా యువత మైండులో మెదులుతుంది.
ఇలా కొందరి ఆలోచనా సృష్టి, సమాజంలో యువతపైన ప్రభావం చూపించే అవకాశం సినిమాల వలన ఎక్కువగా ఉండవచ్చు.
తెలుగు భజన పాటలు వింటూ ఉంటే, మదిలో పాటల పల్లకి అవుతుంది. కీర్తనలు భజన పాటల రూపంలో భజించడం అంటే మనసును భక్తివైపు మరల్చడమే.
భక్తుడి భజన వలన భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అలాగే భక్తుని మది గుడిలో నుండి మనసంతా వ్యాపిస్తాడని అంటారు.
భజన చేయడం వలన భగవంతుని అనుగ్రహం త్వరగా పొందవచ్చని పెద్దల మాట. పదే పదే భగవణ్ణామమ్ భజించడం అంటే భగవంతుని అనుగ్రహం కోసం తపించడమే అంటారు.
కర్మ ప్రభావం చేత మనిషి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటే, సుఖంలోనూ దుఖంలోనూ భగవంతుడిని దర్శించడమే భక్తి అని చెబుతారు.
నిత్యము విషయ లాలస చేత, మనిషికి భక్తిపై మనసు లగ్నం కానప్పుడు మాత్రం, భజన చేయడం వలన మనసు భక్తికోసం తపిస్తుంది అంటారు.
తెలుగు భజన పాటలు వింటూ ఉంటే మనసు తన్మయంతో పరవశిస్తుందని అంటారు.
వ్యక్తిని సత్యదూరం వైపు నడిపించే విషయాలు వ్యక్తి చుట్టూ చేరడంలో చాలా వేగంగా వస్తాయి. కానీ సత్యంవైపు నడిపించే భక్తిమార్గం వైపు మాత్రం వ్యక్తి నడవడానికి భగవంతుడి అనుగ్రహం అవసరం అంటారు. భగవంతుడి అనుగ్రహం భజన చేత త్వరగా కలిగితే, భజన పాటలు భగవంతుడిని స్తుతి చేస్తూ ఉంటాయి.
భగవంతుడి భజన పాటలు మనసును కుదుటపరుస్తాయని అంటారు. భజన పాటలు భగవంతుడిపై మనసు లగ్నం అయ్యేవిధంగా ప్రభావం చూపగలవని పెద్దల మాట.
భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనసుతో భజన చేయడం అంటే అదొక తపస్సు అని అంటారు. భక్తి భజన పాటల వలన మనసు త్వరగా భగవత్సరూపమును పట్టుకుంటుందని అంటారు.
తెలుగు భక్తి భజన పాటల పుస్తకాలు ఉచితంగా మీ ఫోనులో కానీ కంప్యూటర్ లో కానీ లాప్ టాప్ లో కానీ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది అక్షరాలను క్లిక్ చేయండి.
భక్తి కోసం మనసు తపించడమే, కష్టం కలిగినప్పుడు అది శాంతించదనికి, భక్తి మనసుకు మంచి మందు అంటారు. మంచిమందు కోసం మనసు ముందుగా ఇష్టపడకపోవచ్చు కానీ అలవాటు అయితే మాత్రం ఆ మంచి మందును అందరికీ పంచే మంచి ప్రయత్నం మనసు చేయగలదని అంటారు.
తపన ఉంటే తపస్సు చేసేవరకు మనసు ఊరకుండదు అని అంటారు. అటువంటి తపన భక్తివైపు మరలితే, జీవితం ధన్యత పొందుతుందని చెబుతారు. అటువంటి తపనకు నాంది భగవంతుడి భజన అంటారు.
తెలుగు భజన పాటలు వింటూ , భజన చేస్తూ భాగవన్నామ స్మరణలో మనసు తన్మయావస్తకు చేరడం ఒక తపస్సు వంటిది అంటారు. అలాంటి తపస్సు వలన లోపాలే ఉండే భగవంతుడు కష్టంలోను మనసు చలించకుండా బుద్దిని సన్మార్గంలో నడిపిస్తాడని పెద్దలంటారు.
భగవంతుడు కోసం పాటలు రచించినవారు ఎందరో… ఆ మహానుభావులు రచించిన పద్యాలు, కీర్తనలు భజన రూపంలోకి మార్చినవారు కూడా ఉన్నారు.
అలాంటి రచనలే భజన పాటలుగా మారితే, ఆ తెలుగు భజన పాటలు వింటూ మనసు భగవంతుడి వైపు తిరుగుతుందని అంటారు.
భజ గోవిందం భజగోవిందం అంటూ సాగే భజన పాటతో గోవిందుడి అనుగ్రహం పొందడం సులభతరం అంటారు.
ఎందుకు భజన పాటలు వ్యక్తి మనసుని భక్తి మార్గం వైపు తిప్పగలవని అంటారు.
ఎందుకంటే భక్తి వలన ముక్తి సులభమనే సూచన పొందినవారంతా భక్తికై తపిస్తారు.
భక్తుల మొర అలకించే భగవానుడు, త్రికరణశుద్దితో పలికే పలుకులను భగవంతుడు అలకిస్తాడు.
ఒకరే ఒక చోట కూర్చుని ఉంటే, అతని మనసు పలు పలు విధాలుగా తలంపులు చేయడానికే ప్రయత్నం చేయవచ్చు.
ఇంకా ఒక్కరే కూర్చుని భక్తితో భగవానుదిని స్మరించే సమయంలో ఏదో ఒక సమస్య మనసుపై ఒత్తిడి తేవచ్చు…
ఎలాగో లాగా ఒక వ్యక్తి ఒక చోట కూర్చోవడానికి ప్రయత్నం చేయడానికే చాలా సమయం పడుతుంది. కానీ సావాసంలో మనసు త్వరగా నిలకడ పొందగలదని అంటారు.
పదిమండి ఒక చోట కూర్చుని, క్రమశిక్షణతో ఒక పని మొదలు పెడితే, ఆ పనిలో వారంతా లీనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పదిమందిలో ఎక్కువమంది పనిమీద ధ్యాస పెట్టగలరు. అలాగే భగవంతుడిని ప్రార్ధించేవారిలో కూడా పదిమంది ఒక చోట కూర్చుని భాగవన్నామ సంకీర్తన చేస్తుంటే, ఎక్కువమంది మనసు ఆ సంకీర్తన ఆలాపన చేస్తూ ఉంటుంది.
అందుచేత పదిమంది కలసి చేసే పనిలో ఎక్కువమంది శ్రద్దాశక్తులు కలిగి ఉండే అవకాశం ఎక్కువ. ఇక భజన పాటలు పాడడం మొదలు పెడితే మాత్రం, ఎక్కువమంది మనసు భగవంతుడి వైపు వెళుతుంది.
ఏకాగ్ర చిత్తం కలిగి ఉండడం భక్తిలో మొదటి మెట్టుగా చెబుతారు.
భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ అంటే తెలుగు వారందరికి గర్వ కారణమే. కరిగిపోతు కొవ్వొత్తి వెలుగు ఇస్తుంది…
అలా ఒక తెలుగు గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డ దార్శనికత నేటి మన భారత ఆర్ధిక పురోగతి అని పెద్దలు ప్రశంసిస్తూ ఉంటారు.
ఇప్పుడు ప్రశంశలు అందుకుంటున్న అలనాటి తెలుగు బిడ్డ అప్పటి భారతదేశ ప్రధానమంత్రి.
ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన పాలనలో దేశం పురోగతికి పురుడు పోసుకుంటూ ఉంటే, ఆయన తెలివికి నిశ్చేష్టతో చరిత్ర తన పని మరిచి పోయి ఉండవచ్చు.
ఇప్పటికే ఆ మహానుభావుడు ఎవరో తెలుగువారికి అర్ధం అయ్యి ఉంటుంది…. ఆయనే పాములపర్తి వెంకట నరసింహరావు…
ఆర్ధికంగా అప్పులపాలు అయ్యి, ప్రపంచంలో అధిక అప్పులు ఉన్న దేశాలలో మూడవ స్థానంలో ఉన్న భారత దేశానికి ప్రధానిగా బాద్యతలు స్వీకరించిన తెలుగుబిడ్డ.
సాధారణంగా ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే, మునుపటి పార్టీ అనుసరించిన విధానాలను మార్చివేయడం పరిపాటి… కానీ మన తెలుగుబిడ్డ పివి నరసింహరావుగారి విధానాలను కొనసాగించడమే కాకుండా… ఆయనను అప్పటి ప్రతిపక్ష పార్టీ తరపు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రశంసించడం అంటే… పివి ఘనత ఏమిటో తెలియబడుతుంది.
లోకం వినేవారికి వినిపిస్తూనే ఉంటుంది. విననివారిని విడుస్తూనే ఉంటుంది. చేసేవారితో చేయించుకుంటూనే ఉంటుంది…. అలా పివి నరసింహరావుగారితో దేశం రక్షింపబడింది. అయితే ఆయనకు గుర్తింపు ఇవ్వడంలో వెనకబడింది అని వాపోయినవారు ఉంటారు.
ఘనుడు ఘనత కోసం ప్రాకులాడడు. తన కర్తవ్యం తాను చేసుకుపోతాడు… అలా ఆయన కర్తవ్యం నేటి దేశ వర్తమానంగా చెబుతారు.
వర్తమానంలో మంచిని అడ్డుకునేవారు చరిత్రను శాసించగలిగితే, మంచి చేసేవారికి గుర్తింపు ఆలస్యం అవుతుంది. అయితే ఆలస్యంగా వచ్చే గుర్తింపు చిరకాలం కొనసాగుతుంది…
అప్పుడు పాలించిన పివి నరసింహరావుగారు, ఇప్పటికే వెలుగు విరజిమ్ముతున్నారు…
అందుకే ఇప్పుడు ఆయన గురించి మరింత మందికి ఓ మహానుభావుడుగా తెలియజేద్దాం… మన భవిష్యత్తు తరానికి ఓ గొప్ప వ్యక్తి గురించి తెలుపుతూ ఉందాం…
అప్పుడు తాను దర్శించిన భారతం కోసం, ఎంతో కృషి చేసిన ఆ తెలుగుబిడ్డ గురించి తెలుగుతరం అంతటా తెలిసేలా తెలియజేద్దాం. ముందుగా మనం గుర్తుకు తెచ్చుకుందాం… గుర్తుపెట్టుకుందాం… పిల్లలకు తెలియజేద్దాం!
భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ, మన తెలుగు గడ్డలో పుట్టిన తెలుగుజాతి ముద్దు బిడ్డ పివి నరసింహరావు గారు.
మీ చానెల్లో యొక్క యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేయడం ఎలా? ఈ బ్లాగు పోస్టులో….
అప్ లోడ్ చేయబడిన మీ యూట్యూబ్ వీడియో మరల మీ డెస్క్ టాప్ కంప్యూటర్ నందు డౌన్ లోడ్ చేయాలంటే, కొన్ని వెబ్ సైట్స్ ఉంటాయి. మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ నందు మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేసుకోవడం సులభమే.
కంప్యూటర్ బ్రౌజర్లో వీక్షిస్తున్న వీడియో url ఈ క్రింది విధంగా ఉంది అనుకోండి. క్రింది యుఆర్ఎల్ గమనించండి….
https://www.youtube.com/watch?v=3wnG9k3VbVE
పై యుఆర్ఎల్ నందు https://www. ఆంగ్ల అక్షరాల తరువాత youtube.com/watch?v=3wnG9k3VbVE ఈ ఆంగ్ల అక్షరాలకు ముందు ss అను రెండు అక్షరాల ఈ క్రింది యుఆర్ఎల్ మాదిరిగా జత చేసి ఎంటర్ చేయగానే… యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ లింక్ అందించే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
https://www.ssyoutube.com/watch?v=3wnG9k3VbVE
చుడండి పై యుఆర్ఎల్ నందు బోల్డ్ చేయబడిన ఆంగ్ల అక్షరాలు ఎక్కడ టైపు చేయబడి ఉన్నాయో… అలాగే ఏదైనా యూట్యూబ్ వీడియో లింకులో ss అను ఆంగ్ల అక్షరాలు లింక్ మద్యలో యాడ్ చేసి, సదరు వీడియోను డౌన్ లోడ్ చేయవచ్చు.
మరొక వెబ్ సైట్ ద్వారా కూడా మీ చానెల్ నందు గల యూట్యూబ్ వీడియోలను సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు.
మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?
గూగల్ నందు ఈ క్రింది విధంగా y2mate అను ఆంగ్ల అక్షరాలు టైపు చేయండి. ఆ తరువాత గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఉంటుంది.
పై చిత్రంలో చూపిన విధంగా మొదట్లోనె కనబడుతున్న యుఆర్ఎల్ ఈ క్రింది విధంగా ఉంది. దాని పై క్లిక్ చేయగానే, సదరు వై2మేట్ వెబ్ సైట్ మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది.
https://www.y2mate.com
ఈ క్రింది చిత్రం గమనించండి…. వై2మేట్.కాం ఓపెన్ అయితే ఈ క్రింది ఇమేజ్ మాదిరిగా ఉంటుంది.
మీరు ఈ వెబ్ సైట్ నుండి మీయొక్క యూట్యూబ్ చానెల్ లోని వీడియోలు లేదా ఆ వీడియోకి సంబందించిన ఆడియో ఫైల్ సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రింది చిత్రం గమనించండి.
పై చిత్రంలో ఒక యూట్యూబ్ వీడియో మీ యూట్యూబ్ వీడియో అయితే, దాని వీడియోలో కూడా పై చిత్రంలో చూపినట్టుగానె లైక్, అన్ లైక్ బట్టన్స్ మరియు షేర్ బట్టన్ ఉంటుంది. షేర్ బటన్ పై క్లిక్ చేస్తే, ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఒక పోప్ అప్ విండో వస్తుంది. క్రింది ఇమేజ్ చుడండి.
మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?
పైన గల ఇమేజ్ లో వీడియో లింక్ ఎదురుగా copy అను ఆంగ్ల అక్షరాలు బ్లూ కలర్లో కనబడుతున్నాయి… కదా ఆ ఆంగ్ల అక్షరాలపై క్లిక్ చేయగానే, వీడియో యొక్క లింక్ copy అవుతుంది.
అలా మీ చానెల్ యూట్యూబ్ వీడియో లింక్ copy చేసి, దానిని అప్పటికే ఓపెన్ చేసి ఉన్న వై2మేట్.కాం బ్రౌజర్లో ఈ క్రింది చిత్రంలో మాదిరిగా పేస్ట్ చేయగానే, ఆడియో వీడియో డౌన్ లోడ్ బట్టన్లు కనబడతాయి.
మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?
పైచిత్రంలో చూపిన విధంగా వీడియో లింక్ బట్టన్ పై క్లిక్ చేయగానే, క్రింది చిత్రంలో మాదిరి మరొక పోప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ గ్రీన్ కలర్లో ఉన్న డౌన్ లోడ్ బట్టన్ పై క్లిక్ చేయగానే, మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ కావడం మొదలు అవుతుంది.
కొన్ని బ్రౌజర్ సెట్టింగ్స్ బట్టి ఈ క్రింది చిత్రంలో మాదిరిగా, డౌన్ లోడ్ ఫైల్ ను సేవ్ చేయవలసిన పోప్ అప్ విండో ఓపెన్ అవ్వవచ్చు… అప్పుడు ఒకే బట్టన్ క్లిక్ చేస్తే, మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ అవుతుంది.
మీ నెట్ వర్క్ ఇంటర్నెట్ వేగం బట్టి, వీడియో డౌన్ లోడ్ సమయం ఉంటుంది.
మనకు అనేక తెలుగు కధలు ఉన్నాయి… అయితే కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే, కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని వ్యాక్యాలలో కధ గురించి…. ఈ తెలుగు వ్యాసంలో
కధ అంటే ఎదో ఒక సత్యమైన విషయమును తెలియజేస్తూ, కల్పనతో కూడిన వచనం గాని, వాక్కుగా గాని చెబుతారు. పరిణామం ప్రకారం కధలు చిన్న కధలు, పెద్ద కధలు, నవలలు, ఒక పేజి కధలు… అలా కొన్ని రకాలుగా కధలు ఉంటాయి.
కధలు చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి అమ్మ చెప్పే కమ్మనైన కధలు ఉంటాయి. ఇలా చిన్న పిల్లలకు అమ్మ చెప్పే కధలలో నీతికధలు కూడా ఉంటాయి. ఇంకా అవి పురాణాలలోని కధలు కావచ్చు. సమాజంలో నానుడి పొందిన కధలు కావచ్చు… కానీ అమ్మ చెప్పే కమ్మని కధలు వీనులకు విందుగా ఉంటాయి.
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
ఇంకా చిన్న పిల్లలకు అమ్మమ్మ, తాతయ్యలు కూడా ఓపికగా కధలు చెబుతూ ఉంటారు. వీరు చెప్పే కధలలో కూడా రామాయణ, భారతం లాంటి పురాణేతిహాస కధలు ఉండవచ్చు… లేక వారే కల్పించి కధను చెప్పవచ్చు.
అంతర్లీనంగా నీతిని ప్రభోదించడం
అమ్మ చెప్పినా, అమ్మమ్మ చెప్పినా కధలలో నీతి ఉంటుంది. అంతర్లీనంగా నీతిని ప్రభోదించడం ఇటువంటి కధలలో ఉంటుంది. ఇలాంటి కధలు గతంలో గద్యంగా రచించబడి ఉండవచ్చు.. లేదా ప్రసిద్ది చెందినవారి వాక్కులుగా ఉండవచ్చు..
తెలుగులో అనేక కధలు ఉన్నాయి. అవి కవులు రచించిన కధలు ఉంటాయి. ప్రసిద్ది చెందిన రచయితల కధలు దిన, వారపత్రికలలో ప్రచురితం అవుతూ ఉంటాయి.
సంభాషణలలో కధలు పుడుతూ ఉంటాయి. సరదాగా మాట్లాడుకుంటూ కధలు అల్లి చెప్పగలిగే సామర్ధ్యం ఉన్నవారు, సమాజంలో తారసపడవచ్చు…. అప్పటికప్పుడు మాటల మధ్యలోనే కధ అల్లి చెప్పేస్తారు… ఇలాంటి కధలను కట్టు కధలని అంటారు. ఇవి ఎలాగైనా ఒక విషయం గురించి ఎదుటి వ్యక్తిని ఒప్పించే ప్రయత్నంలో పుడుతూ ఉంటాయి.
కధలు ఆసక్తిగా ఉంటూ, అంతర్లీనంగా నీతిని, సుగుణాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి. సుగుణాలపై ఆసక్తి కదల వలన కూడా కలుగుతుందని అంటారు. కద అంత శక్తిని కలిగి ఉంటాయని చెబుతారు. ఇందుకు ఉదాహరణ… శివాజీ మహారాజుకు మంచి గుణాల కలగడంలో, అతనికి చిన్నతనంలో తనతల్లి చెప్పిన సాహస కధలు కారణం అంటారు.
తెలుగు కధ వృత్తాంతం బట్టి కధలను
కధలలో కధ వృత్తాంతం బట్టి కధలను కొన్ని వర్గాలుగా చెబుతారు. సాహస వీరుల గురించి తెలియజేసే కధలను సాహస కధలు అని అంటారు. ప్రక్రుతి గురించి అయితే, ప్రక్రుతి కదలని అంటారు. నీతిని ప్రధానంగా ప్రభోదిస్తూ ఉంటే నీతి కదలని అంటారు. నేర ప్రవృత్తిని తెలియజేసే కధలను క్రైం కదలని అంటారు.
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
చరిత్రను తెలుపుతూ ఉంటే, చారిత్రిక కదలని, పురాణాల నుండి వెలువడిన కధలు అయితే, పురాణ కదలని అంటారు.
కధలను చెప్పేవారిని కధకులు అంటారు. పురాణాలలో హరి గురించి తెలియజేసే కధలను చెప్పేవారిని హరిదాసు అంటారు.
కధలో ప్రధాన వ్యక్తి, కధానాయకుడు అయితే, అతనిని అనుసరించే స్త్రీని కధానాయిక అవుతుంది. కొన్ని కధలలో స్త్రీ ప్రధాన పాత్రగా ఉంటే, కధానాయికగా ఉంటే, ఇందులో కదానాయుకుడు, కధానాయికను అనుసరించేటట్టు ఉంటుంది. కధలో ప్రధానవ్యక్తి మరణిస్తే, కదా శేషుడు అంటారు. ప్రధానస్త్రీ మరణిస్తే, కదా శేషురాలు అంటారు.
అసలు కధ అనే పాదం కథ్ అనే ధాతువు నుండి పుట్టిన పదంగా చెబుతారు. ఈ కధానిక ప్రస్తావన అగ్ని పురాణంలో చెప్పబడినట్టుగా చెబుతారు.
ఇక కధలలో రకాలు…
రంగమును బట్టి కధలు ఉంటాయి. సినిమాలు నిర్మించడానికి తయారుచేసుకునే కధలు ఉంటాయి. వీటిని సినిమా కధలుగా చెబుతారు. ఎక్కువగా కల్పితం ఉండే కధలు ఇవి.
చిన్న పిల్లలకు బొమ్మల రూపంలో చెప్పే కధలను బొమ్మల కదలు అంటారు. ఇవి చందమామ వంటి పత్రికలలో ప్రచురితం కాబడి ఉంటాయి.
రేడియోలాలో ప్రసాదం కావడానికి తయారు చేసుకునే కధలను లేదా రేడియోలలో చెప్పబడిన కధలను రేడియో కధలు అంటారు.
పత్రికలలో ప్రచురితం కావడానికి తయారు చేసుకునే కధలను లేక ప్రచురితం అయిన కధలను పత్రికా కదలని అంటారు.
సామజిక సమస్యలను స్పృశిస్తూ, సామజిక బాధ్యతను గుర్తు జేసే కధలను అభ్యుదయ కదలని అంటారు.
ఒక వ్యక్తి చేత ఎక్కువ చెప్పబడిన కధలను ఆ వ్యక్తి పేరుతొ కధలుగా చెబుతారు. అలాగే ఒక వ్యక్తి ప్రధాన పాత్రగా సాగే అనేక కధలను, ఆ వ్యక్తి పేరుతొ గల కధలుగా చెబుతారు. ఉదా: తెనాలి రామకృష్ణ కధలు…
అలాగే ఒక మార్గం లేదా ఒక ప్రాకృతిక అంశం ఆధారంగా చెప్పబడే కధలను కూడా ఆ అంశము పేరుతొ గల కధలుగా చెబుతారు. ఉదా: చందమామ కధలు, కాశి మజిలి కధలు.
ఇంకా చిన్న చిన్న కధలను చిన్న కదలని, పిట్ట కదలని, తాతమ్మ లేక తాతయ్య కధలు అంటారు.
మన తెలుగులో పిట్ల కధలు, కట్టు కధలు తదితర తెలుగు కధలు
పిట్ట కధలు, కట్టు కధలు, తాతమ్మ కధలు ఎక్కువగా కల్పితమైనవిగానే ఉంటాయి.
పురాణాలలోని కొందరు వ్యక్తుల గుణాలు తెలియజేస్తూ చెప్పే కధలు పురాణ కధలు లేక ఇతిహాస కధలుగా చెబుతారు. చరిత్రలో ధీరుల గురించి, వీరుల గురించి, నాయకుల గురించి, వారి వారి సుగుణాలను తెలియజేస్తూ చెప్పే కధలను చారిత్రక కధలు అంటారు.
జానపదుల చేత చెప్పబడిన కధలను జానపద కధలు అంటారు.
ఆసక్తిని రేకెత్తిస్తూ, వివిధ విషయాల సారమును పొందుపరిచే మాటలతో, చివరకు నీతివ్యాక్యమును గుర్తుకు తెచ్చేవిధంగా సాగడమే కద యొక్క గొప్పతనంగా చెప్పబడుతుంది.
బాలబాలికలలో మంచి గుణాలపై ఆసక్తిని పెంపొందించే సాధనాలలో కధ ప్రధానమైనదిగా ఉంటుందని అంటారు. మంచి వ్యక్తిత్వం కొరకు మంచి మంచి నీతి కధలు వినాలని అంటారు.
వినే కధ యొక్క కధావస్తువును బట్టి మనసులో మెదిలే ఆలోచనలు ఉంటాయని అంటారు. అందుకే పిల్లలకు నీతి కధలను వాక్కు రూపంలో కానీ, బొమ్మల రూపంలో కానీ తెలియజేస్తూ ఉంటారు.
కాలక్షేపం కోసం చెప్పుకునే కధలను కాలక్షేప కధలు లేక సంభాషణ కధలు అని అంటే, అలాంటి కాలక్షేప కధలకు స్మార్ట్ ఫోన్ ఒక బ్రేక్ ఇచ్చినట్టే అంటారు. స్మార్ట్ ఫోన్ వంటి పరికరాలలో అనేక కాలక్షేప విషయాలు మనిసి మనసుకు ఆకర్షిస్తాయి…కాబట్టి.
కధ వలన నీతి అనే మాట మనసును తాకుతుంది. కావున కధలు ఇప్పటికి అమ్మ నోటివెంట వెలువడుతూనే ఉంటాయి. తాతయ్య, తాతమ్మ వంటి పెద్దల మాటలలో కధలు కదులుతూనే ఉంటాయి…
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే కధ మంచి విషయమును అంతర్లీనంగా అందిస్తూ, ఆసక్తిగా సాగే వచన రూపం కానీ వాక్ రూపం కానీ అయి ఉంటుంది. కధలు తెలియజేసేదేమిటి? అంటే నీతిని ఎక్కువగా ప్రభోదిస్తూ ఉంటాయి.