నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు తెలుగు వ్యాసం. ఆర్ధికపరమైన స్థితి బాగుంటే సమాజంలో గౌరవం బాగుంటుంది. సమాజంలో గౌరవం తనకు తనని నమ్ముకున్నవారికి రక్షగా ఉంటుంది. కబటి ఆర్ధిక అభివృద్ది కోసం చూసినప్పుడు నగరాలలో ఎక్కువగా ఉంటుంది.
అధిక జనాభా, ఎక్కువ అవసరాలు, తీరిక లేని జనులకు సేవలు, ఆర్ధిక స్థితి మెరుగుపర్చుకోవడానికి నగర జీవనంలో అవకాశాలు ఎక్కువ… ఇదే ప్రధానమైన అనుకూల అంశం… మిగిలినవన్నీ దీనికి అనుకూలంగా ఉంటాయి.
నగరంలో నివసించేవారికి ఆర్ధిక వనరులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నగరాలలో ఎక్కువమంది జీవిస్తూ ఉండడం వలన ఎక్కువ అవసరాలు ఉంటాయి. ఎక్కువమండి సంపాదిస్తూ ఉండడం వలన ఎక్కువ వ్యాపార కూడలి (బిజినెస్ సెంటర్స్) ఉంటుంది. ఎక్కువ బిజినెస్ సెంటర్స్ లలో బిజినెస్స్ ఎక్కువ ఉండడంతో ఎక్కువ ఆదాయం ప్రభుత్వాలకు లభిస్తుంది… ఆ ఆదాయం మరలా ప్రజలకు చేరుతుంది. ఈ విధంగా నగర జీవనం వలన ఆర్ధికమైన అభివృద్ది ఉంటుంది.
ముఖ్యంగా వైద్య సదుపాయాలు నగరాలలోనే ఎక్కువగా ఉంటాయి. ఆధునిక సౌకర్యాలతో వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు నగరములలో అందుబాటులో ఉంటారు. ఇది నగర జీవనంలో చాలా అనుకూలమైన అంశం.
వ్యక్తి ఉపాదికి నగర జీవనం అనుకూల అంశం
ఇంకా ఎక్కువగా పరిశ్రమలు నగర జీవనం చేసేవారికి అందుబాటులో ఉంటాయి. అందువలన నగర జీవనం చేసేవారికి ఏదో ఒక ఉపాది లభిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా ఉన్నత చదువులు అందించే విశ్వవిద్యాలయాలు (యూనివర్సిటీలు) నగర జీవనం చేసేవారికి అందుబాటులో ఉండడం ప్రధానమైన అనుకూల అంశం.
నిత్య విద్యుత్ సరఫరా నగరవాసుల నిరంతరాయ పనులకు అనుకూలంగా ఉంటుంది.
ఇలా అనేక అంశాలలో ఆర్ధికపరమైన విషయాలలో నగర జీవనం చాలా అనుకూలం.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం. స్త్రీని అబల కాదు సబల అని నిరూపించుకుంటున్న నేటి సమాజంలో కూడా స్త్రీ ఇంకా సమస్యలను ఎదుర్కోవడం దురదృష్టకరం అంటారు.
అమ్మ అయ్యే అమ్మాయి అయినా అమ్మ అయిన అమ్మాయి అయినా ఒక్క జీవితభాగస్వామికి తప్ప మిగిలినవారికి అమ్మవంటిదే… ఇదే మన సంప్రదాయం అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి దృష్టితో పురుషులు ఉండడం స్త్రీలకు మరియు సమాజనికి శ్రేయస్కరం అంటారు.
విమానం నడిపే మగవారికి సాటిగా స్త్రీలు విమానం నడుపుతూ ఉంటే, రాజకీయనాయకులకు ముచ్చెమటలు పట్టించిన ఐఏఎస్ అధికారీణులు మన సమాజంలో ఉన్నారు. మగవారికి తీసిపోనివిధంగా స్త్రీలు సమాజంలో అద్బుతాలు సాధిస్తున్నా మునుపటి కాలంలో జరిగిన స్త్రీల లైంగిక దాడులు గురించి వార్తలు వస్తూనే ఉంటున్నాయి.
ఎంత సాధించిన, ఎంత శక్తి ఉన్నా, స్త్రీలలో సహజంగా ఉండే బిడియం, సిగ్గు, లోభయం ఉంటాయి. ఇవి మగవారిని హైలెట్ చేయడానికి స్త్రీకి ఉండే సంపదగా చూస్తారు. వారు తమ శక్తిని తమ జీవితభాగస్వామి కోసం నియోగిస్తూ సాగుతారు. కానీ ఇలాంటి స్త్రీల సహజ గుణాలను ఆధారంగా వాటినే లోకువగా చూసి, స్త్రీలను చులకన భావంతో చూసేవారు కూడా ఉంటారు. అలా స్త్రీలను చులకన భావంతో చూడడం వారిని ఇబ్బంది పెట్టె దృష్టితో వారిని చూడడం చాలమందికి సర్వ సాదరణంగా ఉండడం, అదే అలవాటుగా మారి స్త్రీలపై అత్యాచారాలు జరిపే స్థాయికి వెళ్ళడం జరుగుతుందని అంటారు.
నేటి సమాజంలో స్త్రీలకు అనేక సమస్యలను చూపిస్తూ ఉంటారు.
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంటే అది లైంగిక వేదింపులుగానే చెబుతారు. లైంగికపరమైన చూపులు స్త్రీల మనసును ఇబ్బంది పెడుతూ ఉంటాయి. లైంగికపరమైన వేధింపులు స్త్రీలకు శాపంగా ఉంటున్నాయి. లైంగికపరమైన దాడులు స్త్రీల జీవితాలను తలక్రిందులుగా చేస్తూ, సమాజంపై దుష్ప్రభావం చూపుతున్నాయి.
స్త్రీలపై లైంగికపరమైన దృష్టి మగవారిలో ఉంటుంది. ఉండాలి కానీ అది జీవితభాగస్వామిపై మాత్రమే ఉండాలి. ఇతర స్త్రీలపై అటువంటి దృష్టి ఉన్నవారిని జారుడు స్వభావిగా పెద్దలు చెబుతారు. అలాంటివారు ఏమి సాధించిన, ఏస్థాయిలో ఉన్నా అది తిరోగమనంవైపు ఉంటుందని అంటారు.
మగవారిలో స్త్రీలపై చెడు భావనలు పెరగడానికి కొన్ని రకాల సినిమాలు, కొన్ని సినిమాలలో స్త్రీల వేషధారణ కూడా కారణం కావచ్చు అని అంటారు. ఏదైతేనేం స్త్రీలు సమాజంలో ఎదుర్కొంటున్న ప్రాధమిక సమస్యలలో ప్రధానమైన సమస్య స్త్రీలపై లైంగిక దాడులు, లైంగిక వేధింపులు.
ఇలాంటి లైంగికపరమైన చూపులు, వేదింపులు, దాడులు ఇవే స్త్రీల మానసిక స్థితిని మరింత దిగజార్చడం… అద్బుతాలు సాధించగలిగె స్త్రీశక్తి శాపంగా మారుతున్నాయి.
లైంగికపరమైన భావనల వలన స్త్రీలలోను మగవారిపై ఉండే సహజమైన ఆసక్తిని కొందరు ప్రేమపేరుతో మోసం చేయడం వలన స్త్రీలు సహజంగా జీవితభాగస్వామి వలన పొందవలసిన సహజ ప్రేమకు దూరం కావాల్సి రావడం కూడా నేటి సమాజంలో స్త్రీకి శాపమే అవుతుంది.
పురుషులు మాదిరిగానే కళాశాలకు స్త్రీలు చదువుకోవడానికి వస్తారు. కానీ కళాశాలకు స్త్రీ వచ్చిందంటే ప్రేమించాలనే భావన ఉన్నవారి వలన కళాశాలలలో చదువులు కాస్త ప్రేమాయణ చదువులుగా ఉండడం విషాదకరం.
చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు కూడా స్త్రీలకు లైంగికపరమైన చూపుల తాకిడి, లైంగికపరమైన వేధింపులు ఎక్కువ కావడం… సమాజనికి శ్రేయస్కరం కాదని అంటారు.
ఎందుకంటే స్త్రీ ఒకరిని సృష్టించగలదు. ఒక జీవికి జన్మను ఇవ్వగలదు. ఒక బాలుడిని శక్తివంతుడుగా, గుణవంతుడుగా, విజ్ఞానవంతుడుగా మార్చడంలో స్త్రీపాత్ర చాలా చాలా ముఖ్యమైనది. ఒక బాలుడు ఆజన్మాంతం మంచి మాట గుర్తు పెట్టుకున్నాడు అంటే అది అమ్మ మాటే అంటారు. కాబట్టి అటువంటి పుణ్యస్త్రీలను పాడు దృష్టితో చేసే పురుషులను సమాజం క్షమించకూడదు.
ఎన్నో సమస్యలు నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నట్టుగా చెబుతూ ఉంటే, వాటికి మూలం మాత్రం స్త్రీలపై పురుషులకు ఉండే సహజదృష్టి ధర్మం తప్పి ప్రవర్తించడమే…
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత తెలుగు వ్యాసం. బడికిపోయి చదువుకునే పిల్లలు, పనిని పరిశీలించే పిల్లలు, తండ్రిని అనుసరించే పిల్లలు, చదువుకోని పిల్లలు, వ్యతిరేకించే పిల్లలు… రకరకాల స్వభావాలతో పెరుగుతున్న పిల్లలే రేపటి యువత.
కొందరు బాల బాలికలు సహజంగా చదువుకోవడానికి సుముఖంగా ఉంటే, కొందరు బాల బాలికలు చదువుకోవడం కన్నా ఏదో నేర్చుకునే ప్రయత్నంలో ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కొందరు బాల బాలికలు ఖాళీగా తిరగడానికి ఆసక్తి చూపవచ్చు… కానీ తల్లిదండ్రుల ప్రోద్బలంతో విద్య బడికివెళ్ళే బాల బాలికలు ఉంటారు. ఆసక్తి రకరకాలుగా ఉంటుంది… కానీ చదువుకునే దశలో ఎక్కువమంది పాఠశాలకు పరిమితం అవుతూ ఉంటారు. ఎందుకంటే ఏ టాలెంట్ ఉన్నా సరే డిగ్రీ అవసరం… కాబట్టి బాల బాలికలకు బాల్యం నుండి యుక్త వయస్సు వరకు చదువు చాలా చాలా అవసరం.
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత
సమాజం ఏ స్థితిలో ఉన్నది? బడిలో చదువులు ఏ విధంగా సాగుతున్నది? అన్నదానిపై బాల బాలికలలో భావనలు పెరిగే అవకాశం ఉంటుంది. నేర్చుకునే బడిలో చెప్పే పాఠాలు బాల బాలికల మనసులోకి చేరతాయి… అలాగే వారు చూస్తున్న సామాజిక స్థితిగతులు కూడా బాల బాలికల పరిశీలనలోకి వస్తూ ఉంటాయి. పేదరికంలో గడిపే విద్యార్ధి దశలో మరింత సామాజిక పరిస్థితులు వారి దృష్టిలో పడతాయి. ఇలా సమాజం మరియు బడి బాల బాలికలపై ప్రభావం చూపుతూ ఉంటే, అలా పెరిగిన నేటి బాల బాలికలే యువతగా మరలా సమాజంపై ప్రభావం చూపుతారు.
అంటే ఎదుగుతున్న వయసులో నేర్చుకోవడానికి ప్రయత్నించే పిల్లలకు సమాజం ఏవిధమైన తీరుతెన్నులు చూపితే, ఆ రీతిలో నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువతగా మార్పు చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నేటి బాల బాలికలు భావి యువతగా మరడంలో తల్లిదండ్రుల ప్రభావం
వర్తమానంలో ఇంట్లో ప్రవర్తన బాలలపై ప్రభావం చూపుతుంది. ఏదైనా ఇంట్లో బాల బాలికల ముందే తల్లిదండ్రులు వాదులాడుకుంటూ ఉంటే, వారి మనసులో అలజడి భావనలు పెరిగే అవకాశం ఎక్కువ.
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత
తల్లిదండ్రులు వ్యతిరేక భావనలతో చికాకుగా ఉంటూ కీచులాడుకుంటూ… నిత్య వాతావరణం గందరగోళంగా ఇంటిని మార్చుకుంటూ ఉంటే, అదే గందరగోళ ప్రభావం బాల బాలికల మనసులలో నాటుకునే అవకాశం ఉంటుంది.
కుటుంబంలో తల్లిదండ్రులు ఇరువురు ప్రేమతో కలిసి ఉంటూ, బాల బాలికల ముందు హుందాగా ప్రవర్తిస్తూ ఉంటే, అదే హుందాతనం బాల బాలికలలో కూడా ప్రకాశించే అవకాశం ఉంటుంది.
కుటుంబ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పిల్లల పెంపకంలో ప్రభావం చూపవచ్చు. ఏదైనా బాల బాలికల దృష్టిలో ఎటువంటి విషయాలు పడుతూ ఉంటాయో అటువంటి విషయాల పరిశీలన వలన అటువంటి దృక్పధం బాల బాలికలలో పెరిగే అవకాశం ఎక్కువ.
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత
కొందరు పిల్లలు మాత్రం ఏవో తమకు తెలిసినట్టుగా కుటుంబ వాతావరణం ఎలా ఉన్న పువ్వు పుట్టగానే పరిమిళించింది అన్న చందాన సద్భావనతో ఉండవచ్చు… కానీ ఎక్కువమంది తమ చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావానికి లోనవుతూ, తమ మనసులలో సదరు భావాలను పదిల పరచుకునే స్థితి ఎక్కువమంది బాల బాలికలలో ఉంటుందని అంటారు.
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత మార్గదర్శకంగా మారాలంటే…
ఇప్పుడు ఎదుగుతున్న బాల బలికాలే రేపటి భావి భారత యువతగా మారి మరి కొందరికి మార్గదర్శకంగా నిలబడలంటే, ప్రస్తుతంలో జీవిస్తున్న బాల బాలికల ముందు మంచి విషయాలే వారి చుట్టూ ఉండాలి.
గొప్పవారి జీవిత విశేషాలు వారికి తెలియబడుతూ ఉండాలి.
లక్ష్యం లేని జీవితం నిరర్ధకం అనే భావనను వారిలో కలిగించాలి.
ఒక లక్ష్యం ఉన్న జీవితం ఏ విధంగా ఉంటుందో… తెలియజేస్తూ ఉండాలి.
నిత్యం అందుబాటులో ఉండే స్మార్ట్ ఫోన్ ద్వారా చెడు విషయాలపై ఆసక్తి కనబరచే విధంగా కాకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యా విషయాలు నేర్చుకునే విధంగా బాల బాలికలను మోటివేట్ చేయాలి.
వయసుకు మించిన ఆలోచనలు వస్తున్న బాల బాలికలకు వారి వయస్సు గురించి తెలియజేస్తూ… ఏ వయసుకు ఏ విషయం చూడ ముచ్చటగా ఉంటుందో చెబుతూ, వారి వయసు నేర్చుకునే వయసు కాబట్టి నేర్చుకునే వయసులో ఉండాల్సిన వినయ విధేయతల గురించి బాల బాలికలకు తెలుపుతూ ఉండాలి.
చదువు అంటే ఆసక్తి అంతగా కనబరచని బాల బాలికలకు చదువు యొక్క అవశ్యకతను తెలియజేస్తూ ఉండాలి.
విలువలతో కూడిన జీవితం ఎలా ఉంటుందో.. వారికి తెలియజేస్తూ ఉండాలి.
తమ జీవితానికి లక్ష్యం తామే నిర్ణయించుకునే వరకు వారికి మంచి విషయాలను తెలియజేస్తూ ఉండాలి.
స్వామి వివేకానంద, భగత్ సింగ్, సుభాస్ చంద్ర బోస్, అబ్దుల్ కలామ్ వంటి గొప్పవారి గురించిన పుస్తకాలు బాల బాలికలకు అందుబాటులో ఉంచాలి.
ముఖ్యంగా నేర్చుకునేవారి ముందు పద్దతిగా నడుచుకోవడం పెద్ద వయస్సుగల వారు చేయాల్సిన ప్రాధమికమైన పని.
ఎటువంటి విషయాలు బాల బాలికల చుట్టూ పరిబ్రమిస్తూ ఉంటాయో, అటువంటి విషయాలలోనే బాల బాలికలు నిష్ణాతులుగా మారే అవకాశం ఉంటే, ఎటువంటి విషయాలు వారి చుట్టూ పరిబ్రమించేలా చేస్తున్నామో పెద్దలు పరిశీలించుకోవాలి….
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువతగా మారతారు. కాలంలో జరిగే ఈ ప్రక్రియలో పెద్దల పెంపకం, బడిలో విద్యావిషయాలు, వారి వారి స్నేహితుల ప్రభావం బాల బాలికలపై ప్రభావం చూపుతాయి.
బాల బాలికల అందరి తల్లిదండ్రులు మంచి విషయాలే పిల్లల ముందు ప్రస్తావిస్తూ ఉంటే, పిల్లల్లో చెడు సావాసం చేసే అవకాశం చాలా తక్కువ కదా… సమాజం ద్వారా ఏ ఒక్కరో ప్రభావితం అయితే, కుటుంబ సభ్యుల వలన ఎక్కువమంది బాల బాలికలు ప్రభావితం చెందే అవకాశం ఉంటే, కుటుంబ వాతావరణం సరైన పద్దతిలో సాగితే, ఎక్కువమంది విద్యార్ధుల మనసు శాంతిగా ఉంటే, భావి భారత సమాజంలోకి మంచి యువత చేరుతుంది… కదా!
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి. ఈ వ్యాసం చదివే ముందు… ఈ క్రింది పేరా చదివి అర్ధం చేసుకోండీ… ఆపై వ్యాసం చదవండి.
వాటర్ తో నింపిన ఒక పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. అలాగే ఒకే 20 లీటర్ల వాటర్ గల క్యానులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. ఆ తర్వాత రెండూ చూస్తే, పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసు మకిలి మకిలిగా కనబడితే, 20 లీటర్ల వాటర్ క్యాను మాత్రం మార్పు లేకుండా మాములుగానే ఉంటుంది. అంటే ఇక్కడ చిన్న గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి కలిపితే, ఆ వాటర్ మలినంగా కనబడుతుంది. ఆ వాటర్ త్రాగితే ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే 20 లీటర్ల వాటర్ క్యానులో ఒక టీ స్పూన్ మట్టి కలిపితే, అంత మలినం కాదు కానీ మలినమైన వాటరే… ఆ వాటర్ ప్రభావం కూడా తక్కువ. మట్టిలో హానికరమైన క్రిములు ఉంటే, వెంటనే హాని చేస్తాయి.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
ప్రకృతి సహజ సిద్దమైన నీటి శాతం ఎక్కుగావ ఉంటే, మిగిలినవాటి ప్రభావం తగ్గుతుంది. అలాగే ప్రకృతిలో ఏది ఎక్కువగా ఉంటే, దాని ప్రభావం మిగిలిన వాటిపై పడుతుంది. అదే అవసరమైన పరిణామంలో ఉంటే, అది మానవ మనుగడకు అనువుగా ఉంటుంది.
అలాంటి ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం… అంటే చెట్లు, మొక్కలు, ఊళ్ళు, పట్టణాలు, అడవులు, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, కోళ్ళు, కుక్కలు, నక్కలు, పిల్లులు, పక్షులు తదితర రకరకాల జీవరాశులతో పాటు మనిషి కూడా భూమిపై జీవిస్తున్నాడు. ప్రకృతి అలాగా సహజ వాతావరణం ఇస్తుంది. అటువంటి సహజ వాతావరణం పల్లె ప్రాంతాలలో కనబడుతూ ఉంటుంది.
పల్లె వాతావరణం సహజంగా నగర వాతావరణం అసహజంగా
అదే నగర వాతావరణంలో అయితే మనిషి, మనిషి నిర్మించుకున్న కట్టడాలు ఇవే ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనిషి పెంచుకునే జంతువులు, పక్షులు మరియు మనిషికి ఇష్టమైన వస్తువులు.
సహజ వాతావరణంలో జంతువులు చర్యలు, మొక్కలకు, మొక్కల చర్యలు మనిషికి, మనిషి చర్యలు ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలి అంటే, మనిషి తప్ప మిగిలిన వాటి చర్యలు పర్యావరణం నియమాలతోనే సాగుతాయి.
ఎందుకు మనిషి మాత్రం ప్రకృతిని ప్రభావితం చేయడం
ప్రకృతిని వినియోగించుకోవడంలో మనిషి తెలివైనవాడు కావడమే ప్రకృతిలో మార్పులకు మనిషి ఆలోచన పునాది అవుతుంది.
ఒకరు మొక్కలు పెంచాలనే ఆలోచన చేస్తే, అది ప్రకృతికి వరం అయితే, మరొకరు ఒక వృక్ష స్థావరంలో కట్టడం నిర్మించాలంటే, అది ప్రకృతికి శాపం…. ఇలా మనిషి ఆలోచనే ప్రకృతిలో పెను మార్పులకు మూలం అవుతుంది.
తన సౌకర్యం కోసం ప్రకృతిని మార్చుకుంటూ వస్తున్న మనిషి… నేడు ప్రకృతిలో సమతుల్యతను దూరం చేస్తున్నాడు.
ఒకే చోట ఒకే ప్రయత్నం చేయడం ప్రకృతికి శాపం
ఏదైనా ఒక ప్రాంతం తీసుకుంటే, అక్కడ పరిమిత వనరులు ఉంటాయి. అంటే గాలి కదులుతూ ఉంటుంది. ఇది అపరిమితం. నీరు మాత్రం పరిమితం. కానీ గాలిలో ఉండే క్రిములు ఆ ప్రాంతంలో ఉండే భూమి మరియు నీరు ఆధారంగానే ఉంటాయి.
గాలిలో ఉండే క్రిములు ఒక చోట నుండి మరొక చోటకు ట్రావెల్ చేస్తూ ఉంటే, బలమైన గాలులు వీచినప్పుడు మాత్రం భూమిపై ఉండే చెత్త కూడా ఒక చోట నుండి మరొక చోటకు వీలి నీటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి.. ఇది ప్రకృతిలో జరుగుతూ ఉంటుంది.
అయితే మనిషి అదే ప్రాంతంలో ఒక పరిశ్రమ నిర్మిస్తే ఆ పరిశ్రమ నుండి వచ్చే వాయువులు గాలిలో కలుస్తాయి. కొంత మేరకు గాలిని కలుషితం చేస్తూ ఉంటాయి. ఆలంటి వాయువులు వీచే పరిశ్రమలు అదే ప్రాంతంలో పెరిగితే, ఆ ప్రాంతమంతా వాయు కాలుష్యం చెందుతుంది. తద్వారా అసహజమైన గాలి వలన మనిషి ఆరోగ్యంతో బాటు జీవజాలం కూడా నశించే అవకాశం ఉంటుంది.
ఇంకా పరిశ్రమ ద్వారా విడుదలయ్యే ద్రవ పదార్ధాలు పూర్తి కలుషితం అయ్యి ఉంటాయి. అటువంటి ద్రవ పదార్ధాలు శుబ్రపరచకుండా విడుదల చేస్తే, ఆ ద్రవ పదార్ధాలు భూమిలోకి ఇంకి భూమిలో ఉండే నీటిని కలుషితం చేస్తాయి… (పైన్ ఫస్ట్ పేరాలో తక్కువ నీరులో చిటికెడు మట్టి ఎక్కువ ప్రభావం చూపుతుంది… అన్నట్టు ఇక్కడ కూడా ద్రవ పదార్ధాలు భూమిలోకి ఇంకితే, భూమిలోని నీటిని పాడు చేయవచ్చు… అలాగే) ఇంకా ద్రవ పదార్ధాలు ప్రవహించిన చోట వర్షం కురిస్తే, ఆ వర్షపు నీరు ప్రవహించి, అక్కడి ద్రవ పదార్ధాలు నిక్షేపలు ఒక చోట నుండి మరొక చోటకు నీటిలో చేరే అవకాశం కూడా ఉంటుంది.
ఇలాంటి కట్టడాలు ఒకే చోట ఒకే ప్రయత్నం చేయడం ప్రకృతికి శాపంగా మారుతుంటాయి.
ఒకే చోట ఎక్కువ మంది జీవనం చేయడం అంటే అది నగర ప్రాంతం
నగరాలలో లక్షలాది మంది ఒకే చోట ఉంటూ ఉంటారు. మామూలుగా అయితే మనిషి వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా పెరగకుండా ఉండాలంటే, చెట్లు, మొక్కలు ఎక్కువగా ఉండాలి. కానీ వాటి స్థానంలో స్థావరాలు పెరిగి పోతే, మనిషి చర్యలే మనిషికి హాని తలపెడతాయి.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
ఎక్కువమంది వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ప్రకృతిలో అసహత్వం సృష్టిస్తుంది అంటే, వాటికి తోడు మనిషి తన సౌకర్యం కోసం ఉపయోగించే యంత్రాలు విసర్జించే వాయువులు, ద్రవ పదార్ధాలు ఇంకా మనిషి ఉపయోగించే ప్లాస్టిక్ పదార్ధాలు…. ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీస్తుంటే, అది నగర ప్రాంతాలలో మరింతగా ఉంటుంది.
నగరప్రాంతం ఎక్కువ జనావాసలతో నిండి, నిత్యం జనులు వాహనదారులై ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయడం వలన మోటార్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది… తద్వారా గాలి కలుషితం అవుతూ నగరజీవనం పర్యావరణమునకు హానికరం అవుతుంది.
నగరములో కానీ నగర శివార్లలో కానీ ఉండే పరిశ్రమల నుండి విడుదలయ్యే ద్రవ పదార్ధాలు, వాయువులు తగు జాగ్రత్తలు పాటించకపోతే, అవి ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీస్తూ ఉంటాయి.
ఇంకా నగర జీవనంలో జనులు ఉపయోగించి, వదిలివేసే పదార్ధాలు ఒకే చోట పెరిగి, వాటి ద్వారా క్రిములు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వివిధ రకాల సౌకర్యాల కోసం ఉపయోగించి ఇంటి వస్తువులు కూడా ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలు ఉన్నట్టుగా పండితులు చెబుతూ ఉంటారు. అలాంటి వస్తువులు ఎక్కువగా పట్టణ, నగర జీవనంలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది…
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
ఏదైనా నగర జీవన విధానం ప్రకృతి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాలుష్యం నుండి ప్రకృతిని కాపాడుకోవడం
వివిధ రకాల కాలుష్యం నుండి ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఎక్కడో పట్టణంలోనో నగరంలోనో కాలుష్యం జరుగుతుంది… అని పల్లెల్లో మొక్కలు నాటడం ఆపకూడదు.
ఎక్కువగా మొక్కలు నాటడం చేయాలి… నాటిన మొక్కలు చెట్లుగా మారే వరకు వాటిని పరిరక్షించాలి.
ఎందుకంటే చెట్ల వలన అక్షిజన్ లభిస్తుంది… వర్షాభావ పరిస్థితులు ఏర్పడకుండ చెట్లు సహాయపడతాయి… మనిషి మనుగడకు చెట్లు శ్రీరామరక్షా అంటారు.
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి…
మోటార్ వాహనాల వినియోగం తగ్గించాలి… తక్కువ దూరం అయితే కాలినడక ఉత్తమం అంటారు.
ఇంకా శాస్త్రజ్నుల సలహాలు స్వీకరిస్తూ, మనిషి జీవనం సాగించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలి.
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? వస్తువు కోసం డబ్బు ఖర్చు చేస్తే, మరి కాలం దేని కోసం ఖర్చు చేస్తున్నాం?
తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేసి వస్తువు కొనుగోలు చేసే హక్కు ఆ డబ్బు సంపాదించినవారికే ఉంటుంది. మరి కాలం ఖర్చు చేసేవారికి ఆ కాలం ఎలా వచ్చింది? మనకున్న పరిమితమైన కాలం మనకు ఎలా వచ్చింది? ఈ ప్రశ్న పుడితే, కాలం విలువ తెలుస్తుంది.
వస్తువు కొనలాంటే డబ్బు అవసరం. డబ్బు కావాలంటే, ఒంట్లో శక్తిని ఉపయోగించి తమకు ఉన్న పరిమిత కాలంలో పని చేయాలి. అప్పుడే డబ్బు వస్తుంది. దానితో అవసరం అయిన వస్తువును కొనుగోలు చేస్తాం… అయితే కాలం ఖర్చు దేనికి చేస్తున్నాం?
ఇది పెద్ద ప్రశ్నలాగా కనబడక పోవచ్చు కానీ సమాధానం మాత్రం పేజీలకు పేజీలే ఉండవచ్చు.
కారణం కాలం అనేది ఒక వరం. ఒక ఆస్తి… కానీ అది కచ్చితంగా పరిమితమైనదే… కొంత కాలమే మనిషికి ఉంటుంది. ఆ కొంత కాలం ఎలా ఖర్చు చేస్తే, అలా జీవితం మారుతూ ఉంటుంది.
వినడానికి కాలం ఖర్చు చేస్తే, విషయవిజ్ఞానం ఏర్పడుతుంది. విజ్ఞానం మనిషికి ఉపాధిని తీసుకువస్తుంది. ఉపాధి జీవిత అవసరాలకు ఉపయోగపడుతుంది. కుటుంబ బాధ్యతలకు ఉపాధి ఉపయోగపడితే, ఆ కుటుంబంలో ఉండేవారికి మంచి జీవితం ఏర్పడుతుంది… అలా కాలం వినే వయసులో వినడానికే ఖర్చు చేస్తే, చెప్పే వయసులో సరైన రీతిలో చెప్పగలరు. వినే వయసులో చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తే, చెప్పే వయస్సులో చెప్పడానికి విజ్ఞానం ?
ఫీజు చెల్లించి వినడానికి మాత్రమే నిర్ధేశించిన ప్రదేశాలలో కూర్చుని, ఏదో చెప్పడానికి ఆసక్తిని కనబరచడం మూర్ఖత్వం అవుతుందని అంటారు. నేర్చుకునే వయసులో నేర్చుకుంటూ… తమకు అవకాశం లభించినప్పుడు మాత్రమే తమకు తెలిసిన విషయంపై తమను ప్రశ్నించినప్పుడే చెప్పడానికి ప్రయత్నం చేసేవారు ఉత్తమ విద్యార్ధి అంటారు.
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నామో అవగాహన ఉన్నప్పుడు ఆ ఖర్చు చేసే డబ్బుకు ఒక విలువ ఉంటుంది. అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నామో ఆలోచన ఉంటే, ఆ ఆలోచనకు విలువ ఉంటుంది. అది మంచి ఆలోచన అయితే ఉత్తమ ఆలోచనగా ఉంటుంది.
వింటూ ఉన్నంతకాలం లోకం చెబుతూ ఉంటుంది.
వినడానికి సిద్దపడితే, చెప్పడానికి సిద్దపడతారు. వింటూ ఉన్నంతకాలం లోకం చెబుతూ ఉంటుంది. అయితే వినడం ఆపితే చెప్పడం తగ్గుతుంది. ఎంతకాలం వినాలి?
జీవితంలో వ్యక్తి నిత్యవిద్యార్ధి అంటారు. జీవితం పాఠాలు చెబుతూనే ఉంటుంది. జీవితం పాఠాలు ఎప్పుడు చెబుతుంది?
స్కూల్లో టీచర్ చెప్పే పాఠాలు వినకపోతే, పాఠాలు అర్ధం కావు. సబ్జెక్టులపై సరైన అవగాహన ఉండదు. పరీక్షల తర్వాత వచ్చే ఫలితాలు నిరాశను కలిగిస్తాయి… జీవిత ప్రారంభంలో విద్యార్ధి దశ కీలకం అయితే, ఇక్కడ వినడమే ప్రధానం… వినయంతో వినడం అత్యంత కీలకమైన విషయం.
ఇంట్లో వినడం మానేస్తే, తల్లిదండ్రులు చెప్పడం తగ్గిస్తారు. వినకపోవడం వలన ఉండే నష్టం జీవితపర్యంతం వెంట ఉంటుందని అంటారు.
కొందరు వినకపోవడం వలన చదువు దారి తప్పుతుంది. కొందరు వినకపోవడం వలన అసలు స్కూల్ కు వెళ్ళే అవకాశం కూడా కోల్పోతారు. కొందరు వినకపోవడం వలన మంచి మంచి సలహాలు కోల్పోతూ ఉంటారు. ఇక వీడు వినడు… అనుకుంటే, వాడితో మాట్లాడేవారు తగ్గుతూ ఉంటారు.
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?
వినాలనే భావన ఎప్పుడు ఉంటుంది?
డబ్బు ఖర్చు చేసి ఉండడం వలన వినడానికి వచ్చామన్నా భావన ఉంటే చాలు… వినాలనే ఆలోచనతోనే మనసు ఉంటుంది. కాలం ఖర్చు చేసి విద్య గురించి వినాలనే భావన బలపడుతుంది.
ఎవరు చెప్పినా వింటూ ఉండేవారు కొందరు ఉంటారు. విన్నది ఆచరించినా ఆచరించక పోయినా ముందు ఎదుటివారు చెప్పేది ఆలకిస్తూ ఉంటారు.
స్కూల్లో కానీ ఇంట్లో కానీ స్నేహితుడు కానీ గుడిలో కానీ ఎక్కడ ఎవరు చెప్పినా వినడం ఎక్కువగా చేస్తూ ఉండేవారు ఉంటారు.
తమలో ఏదో కొత్త విషయం తెలుసుకోవాలనే తపనకు, వింటూ ఉండడం కూడా అవసరమే అనే భావన బలంగా ఉండడం వలన కావచ్చు… ఎక్కువగా వింటూ ఉంటారు. విన్న విషయంలో తమకు తెలిసిందేమిటి? అనే ప్రశ్న పుడుతూ ఉంటుందీ.
ఇంకా తమకు తెలియవలసినది ఏదో ఉంది. అనే ఆలోచన మనసులో ఉన్నప్పుడు మాత్రం, మనసు వినడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది.
కొందరు అన్ని విషయాలలోను వినరు. కొన్ని విషయాలలో మాత్రమే శ్రద్దగా వింటూ ఉంటారు. బహుశా తమ లక్ష్యానికి దగ్గరగా ఉండే అంశాలలో మాత్రమే వినాలనే ఆసక్తిని కలిగి ఉంటారు.
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?
ఇక ఎవరైనా తమ తమ ఆసక్తి మేరకు వింటూ ఉండడం సహజమే కానీ ఒక లక్ష్యము పెట్టుకున్నవారు మాత్రం, తమ లక్ష్య సిద్దికి అవసరమైన అంశాలలో వినడానికి అత్యంత శ్రద్దను చూపుతారు.
ఇది లక్ష్యానికి చేరువ అయ్యేవారిలో ఉండే గొప్ప గుణం.
అయితే ఒక లక్ష్యం కానీ కాకపోతే అలవాటు అయిన ఆసక్తి కానీ వినాలనే ఆలోచనను మనసులో కలిగిస్తూ ఉంటాయి.
లక్ష్యం నిర్దేశించుకుంటే ఏర్పడుతుంది. లేకపోతే లేదు.
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?
అలవాటు అయిన ఆసక్తి అంటే…. బాల్యం నుండి వారి చుట్టూ ఉండే విషయాలలో ఉండే పరిశీలనా ప్రభావం చేత, మనసులో సహజంగా ఏర్పడే ఆసక్తి… అలవాటుగా మారి, ఆ ఆసక్తి చేత వినాలనే భావన కూడా పెరగవచ్చు. తద్వారా కొన్ని విషయాలలో వింటూ ఉంటారు.
వినకూడదనే భావన ఎప్పుడు ఉంటుంది?
తమకు తెలుసు అనే భావన ఉన్నప్పుడు వినడం తక్కువగా ఉంటుంది.
చెప్పడమే అలవాటుగా ఉన్నవారికి కూడా వినాలనే ఆసక్తి తక్కువగా ఉంటుంది. చెప్పడంలోనే సరదా ఉంటుంది.
ఎక్కువగా మాట్లాడేవారు కూడా మాట్లాడేస్తూ, చెప్పేవారిని చెప్పనీయకుండా మాట్లాడే అలవాటు కలిగి వినాలనే ఆసక్తి తక్కువగా కలిగి ఉండవచ్చు.
నాకు తెలుసు అనే భావన ఎప్పుడు పుడుతుంది? మనకి తెలిసిన విషయాలు మన తోటివారితో చెబుతున్నప్పుడు, వారు అలా చెప్పబడిన విషయాలతో ఏకీభవించినప్పుడు… నాకు తెలుసు అనే భావన బలపడుతూ… నాకు అన్ని తెలుసు అనే ఆలోచన కలిగి, ఇక వినాలనే ఆలోచన కన్నా చెప్పాలనే భావనే బలపడవచ్చు.
ఇక సహజంగానే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు, ఎదుటివారికి మాట్లాడే అవకాశం కల్పించకుండా తమకు తెలిసినది తెలియజేస్తూ… ఉండడం కూడా వినాలనే ఆసక్తి అడ్డంకి.
వినడంలో ఎదుటివారికి తెలిసిన విషయం మనకు తెలిసే అవకాశం ఉంటే, చెప్పడంలో మనకు తెలిసిన విషయం ఎదుటివారికి తెలిసే అవకాశం ఉంటుంది.
ఫీజు చెల్లించి వినేవారు వినడం ప్రధానం అయితే, ఫీజు తీసుకుని చెప్పేవారు చెప్పడం ప్రధానం.
మనసులో అనవసర విషయాలకు ప్రాధాన్యత పెరిగితే
మన మనసులో అక్కరలేని విషయాలకు విలువనిస్తూ ఉంటే, అవసరమైన విషయాలలో వినాలనే ఆసక్తి తగ్గుతుంది. అనవసర విషయాలలో మాట్లాడాలనే సరదా పెరుగుతుంది. ఆ సరదా కాస్త సమయాన్ని వృధా చేస్తుంది.
డబ్బు ఖర్చు అయితే, మరలా సంపాదించవచ్చు… కానీ గడిచిన కాలం మాత్రం తిరిగిరాదు.
జీవితములో ‘కాలము’ అనే ఆస్తి అందరికీ ఉంటుంది. ఆ కాలము కొందరితో ముడిపడి ఉంటుంది. అటువంటి కాలము మనిషికి ఒక ఆస్తి…. ఆ ఆస్తిని ఊరికే ఖర్చు చేస్తే, జీవితం శూన్యం.
మనం డబ్బు ఖర్చు చేస్తే, దానికి ఏదో ఫలితంగా వస్తువును పొందుతాం లేకపోతే సేవను పొందుతాం…. మరి కాలమును ఖర్చు చేసి ఏమిటి పొందుతున్నాం?
ఈ ప్రశ్న ఉంటే, ముఖ్యంగా నేర్చుకునే వయస్సులో ఈ ప్రశ్న పుడితే, వారి విద్య ఉత్తమ ఫలితాలకు దారి తీస్తుంది.
డబ్బు సంపాదించేవారికి దానిని ఖర్చు చేసే హక్కు ఉంటుంది. మరి కాలం ఎలా సంపాదించామో అన్న ప్రశ్న పుడితే, కాలం యొక్క గొప్పతనం తెలియబడుతుంది.
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?
గడిచిన కాలము అంటే, మనకు ఉన్న పరిమిత కాలం ఖర్చు చేసినట్టే. ఆ గడిచిన కాలములో గడించినది ఏమిటి?
ఈ ప్రశ్న పుడితే, అదే కాలమును సద్వినియోగపరచుకోవడాకి మార్గం అన్వేషించగలదు.
పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి విషయాలు మనిషి చుట్టూ ఉంటే, అలాంటి ప్రభావం మనిషిపై ఉంటే, మనిషి చుట్టూ వెలుగు నీడల మాదిరి మంచి చెడులు ఉంటాయి.
గుడిలో దైవం గురించి ఆలోచనలు పెరిగిన మనిషికి, ఆ గుడిలో గోవిందుడి గురించే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనసు గోవిందుడి లీలలపై ఆసక్తి పెంచుకుంటుంది. గుడిలో విగ్రహంపై ఉన్న పరిశీలన దృష్టి, ఆ కదలని గోవిందుడి గురించి ఆలోచనలు కలిగే విధంగా ప్రభావం చూపుతుంది. భక్తి పురోగతికి గుడిలో విగ్రహాన్ని పరిశీలనగా చూడడం నాంది అయితే…
బడిలో టీచర్ చెప్పే పాఠాలు విధార్ధి చెవికెక్కితే, ఆ విద్యార్ధి ఆ పాఠలలో ఉన్న సారమేమిటో తెలుసుకోవాలనే తపన ఉంటుంది. బోధనా విషయంపై ఉండే పరిశీలన దృష్టి, ఆ బోధనా విషయంలో లీనమయ్యే స్వభావం ఏర్పడే విధంగా ప్రభావం చూపుతుంది. అంటే విద్యార్ధికి సబ్జెక్ట్ పరిశీలన అతని పురోగతికి నాంది అవుతుంది.
పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి
అమ్మ ఒడిలో పెరిగిన బాలుడు నాన్నను పరిశీలిస్తూ, నాన్నవలె అనుకరణ మొదలు పెడతాడు. నాన్నను పరిశీలనగా చూడడం వలన లోకరీతికి అనుగుణంగా మారగలిగే పురోగతి ఆ బాలుడికి కలిగే అవకాశం ఉంటుంది.
బాల్యం నుండే ప్రారంభం అయ్యే పరిశీలన పురోగతికి నాంది అవుతుంది. ఎటువంటి అంశాలలో ఆసక్తి పెరుగుతూ ఉంటే, అటువంటి విషయాలలో నిష్ణాతుడు కాగలిగే అవకాశాలు పరిశీలన దృష్టి బలం బట్టి ఉంటుంది.
బడిలో చెప్పే పాఠలలోని సారం గ్రహించిన విద్యార్ధికి, మరొక పుస్తకం వ్రాయగలిగే శక్తి ఏర్పడవచ్చు. లేదా ఆ పుస్తకంలో విశీదీకరించిన విషయ విధానం ఆధారంగా మరొక కొత్త విషయం కనుగొనగలిగె శక్తి ఏర్పడవచ్చు… ఇదంతా ఆ విద్యార్ధి శ్రద్దాశక్తులను బట్టి ఉంటుంది… పరిశీలిస్తే ప్రభావంతమైన విద్యార్ధిదశలోనే జీవితనికి పునాది ఏర్పడుతుంది.
వ్యక్తి దృష్టిలో మంచి చెడులు పరిశీలన వలన అవగాహన ఉంటుంది.
ఒక వ్యక్తి బాల్యం నుండి అతని చుట్టూ అనేక విషయాలు ఉంటాయి. వాటిలో మేలు చేసే విషయాలు, దారి మళ్లించే విషయాలు ఉంటాయి. అతని దృష్టికి వచ్చే విధంగా మంచి చెడు విషయాలు ఉంటాయి.
చదువుకునే వయసులోనే చదువుపై శ్రద్దను దారి మళ్లించే విషయాలు వస్తాయి. వాటిని వదిలి చదువుపై దృష్టి పెట్టడం విధ్యార్ధి కర్తవ్యం.
బాలురకు తమ చుట్టూ ఉండే విషయాలను పరిశీలించే శక్తి పెరుగుతున్న కొలది, ఎటువంటి విషయాలు బాలుర చుట్టూ ఏర్పడుతూ ఉంటే, అటువంటి విషయాలపై దృష్టి సహజంగా ఏర్పడుతుంది. అది కుటుంబ జీవన పద్దతుల బట్టి ఉంటుంది.
స్వతంత్ర్యంగా వ్యవహరించే వయస్సు వచ్చేటప్పటికీ, తమకు ఏర్పడిన స్వభావాన్ని బట్టి సమాజంలో విషయ శోధన చేస్తూ ఉంటారు. అటువంటి వయసుకు వచ్చేవరకు ఎటువంటి విషయాలపై ఆసక్తి పెరిగి ఉంటే, అటువంటి విషయాలలో మనసు బలం చూపుతుంది.
పరిశీలన దృష్టి పెరుగుతున్న కొలది, తమ చుట్టూ ఉండే పరిశీలనాత్మ విషయాలు తమపై ప్రభావం చూపుతున్నట్టు, ఎదిగే వయస్సులో తెలియబడదు. పరిణితి పెరిగాక మాత్రం అప్పటికి ఏర్పడిన పరిశీలన దృష్టిని బట్టి తమపై తమ చుట్టూ ఉన్న విషయాలు ఎలాంటి ప్రభావం చూపించాయో కనుగొనగలుగుతారు.
మోటారు వాహనాల రిపేరింగ్ షెడ్డులో ఎదుగుతున్నవారు, మోటారు వాహనం పార్టులుగా విడదీసి, మరలా వాటిని యధాస్తితిలో అమర్చగలిగె శక్తిని పొందగలిగే అవకాశం ఎక్కువ… ఈ శక్తి ఆ ఎదిగేవారి పరిశీలనను బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ ఆ ఎదుగుతున్న బాలుడి చుట్టూ మోటారు వాహనం రిపేరు విధానం, అతని డ్రుష్టికి వచ్చే విధంగా ఉంటుంది. అతడు ఆ విధానంపై దృష్టి పెడితే, పరిశీలన పెంచుకుంటే, మోటారు మెకానిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
ఇలా ప్రతివారు చుట్టూ నేర్చుకునే విషయ విధానాలు ఉంటాయి. వాటిని పరిశీలన చేయడంలో పెట్టె దృష్టిని బట్టి, ఆయా విషయాలు పరిశీలనకు వస్తాయి.
తమ చుట్టూ ఉండే విషయాలలో ఎంతటి పరిశీలన ఉంటే, వాటిపై అంతటి ఆసక్తి. అలాగే ఎలాంటి విషయాలలో పరిశీలన ప్రారంభం అయితే, అలాంటి ఆలోచనలకు పునాది ఏర్పడుతుంది.
సమాజంలో మంచి చెడులు వెలుగు నీడలు వలె కలిసే ఉంటాయి. వాటిని వేరు చూసి వెలుగులో జీవిస్తే, మరొకరికి వెలుగు పంచే విధంగా జీవితం ఉంటుంది. లేక పోతే చెడు అనే విషయ లాలస చీకటిలో ప్రయాణించే విధంగా ఉంటుంది. పరిశీలన పురోగతికి పునాది అయితే అది ఎలాంటిదో మనమే పరిశీలించుకోవాలి.
లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం. ఒకప్పుడు ప్రపంచం చుట్టి వచ్చినవారి ద్వారా లోకంలో జరిగే విషయాలు తెలియబడుతూ ఉండేవట. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఉంటే లోకం మొత్తం దర్శించే అవకాశం ఉంది.
ఇక లోకం గురించి తెలియనిదేముంది? ఎక్కెడెక్కడో జరిగినవి, జరిగేవి, జరుగుతున్నవి… అప్పటికప్పుడు ఉన్న చోట నుండే తెలుసుకునే సౌకర్యం మొబైల్ వలన ఏర్పడుతుంది. స్మార్ట్ మొబైల్ అయితే లోకంలో జరుగుతున్న విషయాలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇలా మొబైల్ ఒక లోక దర్శిని మాదిరి ఉపయోగపడుతుంది.
అలాంటి లోక దర్శినితో విషయ విజ్ఞానం మరింతగా పెంచుకోవచ్చు.
ఒకప్పుడు నేర్చుకునేవారు వినయంగా గురువుకు ఎదురుగా కూర్చుని, విషయ విజ్ఞానం గురించి విని నేర్చుకునేవారట. కానీ ఇప్పుడు విద్య నేర్చుకోవడానికి చాలా సులభ మార్గములు వచ్చేశాయి.
విలువిద్య నేర్చుకోవాలనే తపనతో గురువు బొమ్మ ముందు సాధన చేసిన ఏకలవ్యుడు, విలువిద్యలో అసాధారణ ప్రతిభను కనబరిచాడట. కానీ ఇప్పుడు విషయ విజ్ఞానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు, ఒకసారి ఆ ఆసక్తిని మన చేతిలోని లోక దర్శనం చేయించగలిగె మొబైల్లో సెర్చ్ చేస్తే చాలు…. మరలా మరలా ఆ ఆసక్తికి సంభందించిన విషయాలే కనబడుతూ ఉంటాయి.
అబ్దుల్ కలామ్ వంటి మహానుభావులు విద్యాభ్యాసం ఎంతో కష్టపడి చేసేవారని అంటారు. కరెంట్ లేని రోజులలో చిన్న దీపాల కాంతులలో పుస్తకాలు చదివిన వారు ఉన్నారు.
కరెంట్ లేని ఇళ్ళల్లో పుట్టినవారు, వీధి స్థంబాల దగ్గర చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించనవారి గురించి కూడా వింటూ ఉంటాము…. వారి తపన ముందు అసౌకర్యం అనే ఆలోచన మురిగిపోయింది.
అంతటి తపన ఇప్పుడూ ఉన్నవారు ఉన్నారు. కానీ అటువంటి తపన ఏ ఒక్కరికో మాత్రమే ఉంటే చాలు అనుకుంటూ విద్యా మార్గాలు ఇంత సులభతరం అవ్వవు… కదా…
లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.
ప్రకృతిలో ఏది మనిషికి అవసరమో అది విరివిగా దొరికే విధంగా ప్రకృతి ఉంటుంది.
అన్నం లేకుండా కొన్ని రోజులు ఉండగలిగె మనిషి నీరు లేకుండా ఎక్కువ రోజులు ఉండలేడు. అలాగే నీరు లేకుండా కొద్ది రోజులు ఉండే మనిషి అయినా గాలి లేకుండా అసలు ఉండేలేరు… అంటే ప్రకృతిలో ప్రాణికి ఏది అత్యంత అవసరమో అది చాలా విరివిగా దొరుకుతుంది.
మల్టీ టాలెంట్ ఈ రోజులలో అవసరం అవుతుంది.
ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఏదో ఒక విద్యకు మాత్రమే పరిమితం అయితే, ఆ వ్యక్తి ఎక్కువ పోటీని ఎదుర్కోవాలి అంటారు. మల్టీ టాలెంట్ ఈ రోజులలో అవసరం అవుతుంది.
ఒకప్పుడు అక్కౌంటింగ్ పూర్తిగా వస్తే మంచి ఉద్యోగం ఉండేది… కానీ ఇప్పుడు అకౌంటింగ్ విద్యతో బాటు కంప్యూటర్ విద్య అవసరం అయింది. రెండింటిలోను నైపుణ్యత ప్రధానమైంది.
అలా ఏ రంగం చూసుకున్నా ఆయా రంగాలలో అవసరం అయ్యే కంప్యూటర్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ వాడుక కూడా బాగా తెలిసి ఉండాలి.
అప్పటికే డిగ్రీలు పూర్తయినవారు కంప్యూటర్ వచ్చాక వాటిపై అవగాహన పెంచుకుంటూ సాధన చేసినవారు ఉన్నారు. అప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు కంప్యూటర్ పై అవగాహన పెంచుకుని, ఉద్యోగాలలో నిలదొక్కుకున్నవారు ఉన్నారు.
కానీ ఇప్పుడు చదువుతూనే తమ ఎంచుకున్న రంగంలో అవసరమయ్యే అప్లికేషన్ పరిజ్ఞానం పెంచుకుంటూ విద్యాభ్యాసం చేసేవారు ఉంటారు. అద్భుతాలు సాధించాలంటే అందుకు తగ్గ పరిజ్ఞానం ఉండాలి కదా…
చదువుతూనే సందేహాలు తీర్చుకోవాలంటే ఒకప్పుడు కష్టం కానీ ఇప్పుడు చదువుతూనే విషయాలపై సందేహ నివృత్తి సులభంగా చేయవచ్చు.
కేవలం మొబైల్ ద్వారా మరొకరికి కాల్ చేసి సందేహ నివృత్తి చేసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ ఉంటే గూగుల్ సెర్చ్ చేసి సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అదే స్మార్ట్ ఫోన్ ద్వారా తమకున్న సందేహాలకు సమాధానాలు కలిగిన వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. సందేహ నివృత్తి స్మార్ట్ ఫోన్ వలన సులభమైంది.
లోక దర్శిని వంటి మొబైల్ ఫోనుతో విషయ విద్యా పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు.
సబ్జెక్టు వింటున్నప్పుడు సందేహాలు రావు… చెప్పేవారి సందేశం మాత్రం చెవులలోకి వెళుతుంది. కానీ కొందరికి చదివేటప్పుడు మాత్రం సందేహాల సామ్రాజ్యమే బయటపడవచ్చు. అటువంటి సబ్జెక్ట్ సందేహాలకు సమాధానాలు అందించే వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ వీడియోలు మనకు అనేకం మొబైల్ ఫోనులో లభిస్తాయి.
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే
సబ్జెక్ట్ పై మరింత అవగాహన పెంచుకోవచ్చు.
తెలియని విషయాల గురించి తెలుసుకోవచ్చు.
ఏదైనా నిర్ధేశిత అంశంలో వీడియో వీక్షణ ద్వారా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు.
మనకు తెలిసిన ప్రతిభను పదిమందికి పరిచయం చేయవచ్చు.
పనులు సులభంగా చేయవచ్చు. సులభంగా తెలుసుకోవచ్చు.
నేర్చుకునే వారికి నేర్చుకున్నంత అన్నట్టుగా స్మార్ట్ ఫోన్ ద్వారా విషయ విద్యా పరిజ్ఞానం పెంచుకోవచ్చు.
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత సాధన చేస్తే అంత ప్రతిభ.
అయితే ఎంత సులభంగా విషయ విద్యా పరిజ్ఞానం పెంచుకునే అవకాశాలు స్మార్ట్ ఫోన్ ద్వారా కలుగుతున్నాయో… అంతకన్నా సులభంగా జీవన గమ్యం చెదరగొట్ట గలిగె విషయాలు మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి… వాటివైపు దృష్టి పెడితే లక్ష్యం చెదురుతుంది.
స్మార్ట్ ఫోన్లో వ్యక్తిగత చరిత్ర ఆ వ్యక్తి ఆన్ లైన్ ఖాతాకు జోడించబడుతూ ఉంటుంది… అది స్మార్ట్ ఫోన్లో మరలా మరలా చూపిస్తూ ఉంటుంది… అటువంటి స్మార్ట్ ఫోన్లో ఒకసారి మనకు అవసరం లేని విషయాలు కానీ లక్ష్యాన్ని చెదిరేవిధంగా ప్రేరిపించే విషయాల వైపు కానీ దృష్టి వెళితే, స్మార్ట్ ఫోన్ హిస్టరీ అంతా అవే ఉంటాయి… అవే కనబడుతూ లక్ష్యం చెదురుతుంది…
కాబట్టి లోక దర్శిని వంటి స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు దానికి రెండువైపులా పదును ఉన్న బ్లేడ్ వలె విద్యార్ధి మనసుకు దగ్గరగా ఉంటుంది. అయితే మంచి విషయం వైపు మరలవచ్చు లేకపోతే చెడు విషయం వైపు మరలవచ్చు… అది మాత్రం రెంటిని చూపుతుంది… మన ఆసక్తి ఎటువెళితే, స్మార్ట్ ఫోన్ అటువంటి హిస్టరీని రెపీట్ చేస్తూ, మన మనసును ప్రేరేపించడంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఎక్కువ కాబట్టి…
స్మార్ట్ ఫోన్ లో అవసరం అయిన విషయ విద్యా పరిజ్ఞానం గురించి సెర్చ్ చేస్తూ అనవసర విషయాలు వదిలేస్తూ, ఆకర్షించే విషయాల గురించి సజ్జనుల దగ్గర సలహా తీసుకుంటూ ముందుకు సాగితే స్మార్ట్ ఫోన్ ఒక గురువుగా మారగలదు… ఒక మంచి గైడ్ గా ఉండగలదు.
లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో తెలుసుకోవడానికి కూడా అనేక తెలుగు వీడియోలు అనెక వెబ్ సైటులు అందుబాటులో ఉంటున్నాయి.
మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం విషయ విజ్ఞానం వలన పరిజ్ఞానం పెరుగుతుంది. ఎటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే, అటువంటి పరిజ్ఞానం పెరుగుతుంది అంటారు.
ఎటువంటి విషయాలు మన మొబైల్లో వెతుకుతూ ఉంటే, అటువంటి విషయాలతో కూడిన సెర్చ్ హిస్టరీ మన మొబైల్లోని గూగుల్ ఖాతాకు జోడించబడుతూ ఉంటుంది.
ఎందుకు మొబైల్ ద్వారా మంచి విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి?
మొబైల్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం వలన అవే విషయాలు మొబైల్ హిస్టరీగా ఉండి, మన ఫోన్ ఉపయోగించే ఇతరులకు అవే సూచించబడతాయి.
మన దగ్గర ఉండే మొబైల్ ద్వారా అనేక విషయాలు తెలియబడుతూ ఉంటాయి. లోకంలో జరిగే వింతలు, విశేషాలు, దారుణాలు, అక్రమాలు, అవినీతి విషయాలు అనేకానేక విషయాలు మొబైల్ ద్వారా మనల్ని పలకరిస్తూ ఉంటాయి.
ఇంకా మొబైల్ ద్వారా వినోద విషయాలు, సరదా విషయాలు ఎన్నెన్నో పలకరిస్తూ అందరినీ రంజింపజేయడంలో మొబైల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటువంటి మొబైల్ ఉన్నవారు తమ తాము ఒక్కరే కాకుండా ఇతరులు కూడా ఉపయోగించే అవకాశం ఉంటే, అలా వాడే వారు ఎవరు?
అలా ఒకరి మొబైల్ స్వతంత్రంగా ఎక్కువగా వాడే వారిలో జీవిత భాగస్వామి ఇంకా పిల్లలు ఉంటారు. జీవిత భాగస్వామి ఉపయోగించడంలో ఇద్దరి అభిరుచులు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుంది… ఇంకా వారికి మంచి – చెడులపై సరైన అవగాహన ఉంటుంది.
ఇక పిల్లలు ఫోన్ వాడుక ఎక్కువగా ఉంటుంది. తండ్రి లేదా తల్లి మొబైల్ ద్వారా పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం అలవాటుపడిన పిల్లలు మొబైల్లో ఉండే ఇతర విషయాల వైపు దృష్టి సారించే అవకాశం ఎక్కువ. కాబట్టి పిల్లలకు తల్లిదండ్రుల మొబైల్ ద్వారా విషయ విజ్ఞానం అందె అవకాశం ఉంటే, సదరు మొబైల్లో ఎటువంటి విషయాలు సూచించ బడుతున్నాయి. ఎలాంటి విషయాలు చరిత్రగా మొబైల్లో కనబడుతున్నాయనే దానిపై పిల్లలకు విజ్ఞానం పరిజ్ఞానం పెరిగే అవకాశం ఉంటుంది.
మొబైల్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం మొదలు పెడితే
మొబైల్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం మొదలు పెడితే, అంతకు ముందు ఉన్న మొబైల్ చరిత్ర చెరుగుతూ, కొత్త చరిత్ర నమోదు అవుతూ ఉంటుంది.
ఒక వస్తువు తయారీ విధానం గురించి, మనం యూట్యూబ్లో వీడియోలు సెర్చ్ చేస్తే, అది యూట్యూబ్ సెర్చ్ చరిత్రగా మన ఖాతాలో నమోదు అవుతుంది. అలాగే ఒక క్రైమ్ న్యూస్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే, అదే యూట్యూబ్ వీడియో సెర్చ్ చరిత్రగా నమోదు కావడం మొదలు అవుతుంది… ఏ విషయంపై ఎక్కువగా యూట్యూబ్లో వీడియోలు వెతుకుతూ ఉంటే, అదే యూట్యూబ్ ఖాతా చరిత్రగా నమోదు అవుతుంది.
ఈ విధానంలో మంచిని పెంచే వీడియోల గురించి సెర్చ్ చేస్తే, అదే మన యూట్యూబ్ వీడియో సెర్చ్ చరిత్రగా నమోదు అయ్యి, మరొకరికి మన మొబైల్ ద్వారా మంచి విషయాల పరిచయం జరిగే అవకాశం ఉంటుంది.
ఇంకా యూట్యూబ్ వీడియో సెర్చ్ మాత్రమే కాకుండా గూగుల్ సెర్చ్ కూడా ఒక చరిత్రగా మన ఖాతాకు నమోదు అవుతూ ఉంటుంది. ఇది గూగుల్ క్రోమ్ నందు సెర్చ్ చేసే సమయంలో కనబడుతుంది.
అంటే గూగుల్ సెర్చ్ ఎక్కువగా బ్లాగులు లేదా వెబ్ సైటుల లింకులను సేవ్ చేస్తుంది. గతంలో ఎటువంటి వెబ్ సైట్స్ మనం విజిట్ చేసి ఉంటే, అవే వెబ్ సైట్స్ మరలా క్రోమ్ చరిత్రగా మన ఖాతాకు కనబడుతుంది… కాబట్టి ఎటువంటి వీడియోలు లేదా వెబ్ సైట్స్ వెతుకుతున్నామో అదే మన మొబైల్ చరిత్రగా మన గూగుల్ ఖాతాకు జోడించబడుతుంది.
అంటే గూగుల్ ఖాతా మన మొబైల్లో మాత్రమే కాకుండా వేరే ఏదైనా కంప్యూటర్ లేక లాప్ టాప్ లేక టాబ్లెట్ వంటి పరికరాలలో ఓపెన్ చేసినా మన మొబైల్ ద్వారా నమోదు అయినా సెర్చ్ చరిత్ర వాటిలోనూ కనబడుతుంది.
మన మొబైల్లో మన వెతికే చరిత్ర మన గూగుల్ ఖాతా ద్వారా మనల్ని వెన్నంటి ఆన్లైన్ ద్వారా వస్తూనే ఉంటుంది. ఆ చరిత్రే మన ఖాతాకు సంబంధం ఉన్నవారికి తెలిసే అవకాశం ఉంటే, అది మన మొబైల్ చూసేవారికే తెలిసే అవకాశం ఎక్కువ. అలా ఎటువంటి విషయాలు మన మొబైల్లో వెతుకుతూ ఉంటే, అటువంటి విషయాలతో కూడిన సెర్చ్ హిస్టరీ ప్రభావం మన చుట్టూ ఉన్నవారిపై కూడా పడే అవకాశం ఉండవచ్చు.
మన మొబైల్ మనం మాత్రమే వాడుతూ ఉంటే, అది వ్యక్తిగతంగా ఉంటుంది… ఇతరులు వాడుతూ ఉంటే, అది మన అలవాట్ల గురించి తెలియజేసే అవకాశం ఉంటుంది.
విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం. వ్యాసాలు విషయాలను విపులంగా విశదీకరిస్తాయి…. వచన రూపంలో ఉండే విషయాలు తెలుసుకోవడంతో బాటు వాటి గురించి బౌతిక పరిచయం కావడం వలన మనసుకి విషయ విజ్ఞానము వృద్ది చెందుతుంది. విజ్ఞానయాత్రలు చేయడం వలన లోకజ్ఙానం వస్తుంది. ప్రత్యేక స్థలాలకు ప్రయాణం చేయడానికి ఆసక్తి ఉంటుంది, అటువంటి ఆసక్తి చేత విజ్ఙానయాత్రలలో వినోదంతో బాటు విజ్ఙానం కూడా సంపాదించవచ్చును.
పుస్తకపఠం చేత విషయ జ్ఙానం లభిస్తే, విజ్ఙానయాత్రలు వలన విజ్ఙానంతో బాటు లోకానుభవం కూడా కలుగుతుంది. మనసుకు విహార యాత్ర మంచి బలం అయితే, విద్యార్ధి దశలో విజ్ఙాన విహార యాత్ర వలన విద్యార్ధులకు మేలును కలిగిస్తాయని అంటారు. ఒక వస్తువు ఎలా తయారు అవుతుందో పుస్తకాలలో వివరిస్తారు. కానీ దృశ్యమానంగా దర్శించాలంటే, వస్తువును తయారు చేసే పరిశ్రమకు వెళ్ళడం వలననే విద్యార్ధులకు వస్తువు తయారు ఎలా జరుగుతుందో చూడగలరు.
పుస్తకాలలో ఉండే విషయ విజ్ఞానము, ప్రకృతిలో పరిచయం అయ్యే విషయ వస్తువుల వలన మనసుపై ప్రభావం చూపుతాయి. పరిమితమైన పరిసరాలలో జీవించే వ్యక్తి కుటుంబంలోని విద్యార్ధికి వేరు ప్రాంతాలపై అవగాహన కూడా అవసరమే అయితే, అందు నిమిత్తం ఏర్పాటు చేయబడేదే విజ్ఞానయాత్రలు అంటారు.విజ్ఙానయాత్రలు విహారంగా ఉంటాయి. విజ్ఙానం అందిస్తాయి.
పుస్తకాలలో చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు, ఆ పుస్తకాలలో వ్రాయబడిన అంశంతో మనసు ఒక ఊహాత్మక దృష్టిని పొంది ఉంటే, విజ్ఞాన విహార యాత్రలు చేసినప్పుడు ఆ చారిత్రక ప్రదేశంలోకి రాగానే మనసు తాను తెలుసుకున్న అంశం ప్రత్యక్షంగా చూడడంలో మమేకం అవుతుంది. సదరు చారిత్రక అంశంలో మనసు పరిశీలన చేస్తుంది.
అలాగే ఏదైనా పరిశ్రమ విధానం గురించి చదివిన విద్యార్ధికి, ఆ విధానం కలిగిన పరిశ్రమను చూడగానే, ప్రత్యక్ష అనుభవం వలన మరింత పరిశోదనాత్మక దృష్టిని పెంచుకునే అవకాశం ఉంటుంది.
పుస్తకాలలో చదివిన విషయాలే, లోకంలో ప్రత్యక్ష్యంగా వీక్షించడం నేర్చుకునేవారికి బలంగా మారుతుంది. అలా పుస్తకాలలో చదివిన విషయాలలో ప్రత్యక్షంగా చూడగలిగేవి…
చారిత్రక ప్రదేశాలు
చారిత్రిక వ్యక్తులు నివసించిన ప్రాంతాలు
చారిత్రక వ్యక్తుల జన్మ స్థలం
వస్తు తయారీ కేంద్రాలు
భారీ వస్తు విక్రయ కేంద్రాలు
చారిత్రక కట్టడాలు
ఇలా అనేక ప్రాంతాలు, ప్రదేశాలు చూడదగినవిగా ఉంటాయి. వాటిని ప్రత్యక్ష్యంగా చూసిన వారికి విజ్ఞానమును పెంచుకున్నట్టు ఉంటుంది… విహార యాత్రలు చేసినట్టు ఉంటుంది.
విజ్ఞాన విహార యాత్రలు – చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు…
చారిత్రిక ప్రదేశాలు అంటే గోల్కొండ కోట వంటివి అయితే, చారిత్రక కట్టడాలు అంటే ఛార్మినార్ వంటివి… ఇంకా అత్యాధునికంగా తయారుచేయబడిన స్టూడియోలు వంటివి ఉండవచ్చు. ఇంకా హిందూ సంస్కృతిలో అయితే ఎక్కువ దేవాలయాలు ఉంటాయి. ఏనాటివో అయిన గోపురాలు ఉంటాయి.
విజ్ఞానమును పెంపొందించేవిధంగా విహారయాత్రలు విధ్యార్ధులతో చేయించవలసిన అవసరం ఉంటుందని అంటారు.
ఇంకా దేశ నాయకులు, స్వతంత్ర్య సమరయోధుల నివాస స్థావరాలు లేదా జన్మ స్థలాలు కూడా చూడదగినవిగా చెబుతారు.
వస్తు తయారీ కేంద్రాలలో వస్తు తయారీ విధానం ప్రత్యక్షంగా చూడడం వలన విధార్ధికి ఆ వస్తు తయారీ విధానంపై ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుంది.
ఇంకా ఆనకట్టలు దర్శించడం వలన ఆనకట్టలు కట్టించిన వారి గురించి తెలియబడుతుంది. ఆనకట్ట వలన ఉపయోగాలపై ఆవాహన పెరుగుతుంది… నీటి అవసరమా ఉపయోగం గురించి మరింత ఆవాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఆధునిక కాలంలో కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం. వ్యక్తి జీవన విధానంలో వేగవంతమైన పోటీ పెరగడానికి కంప్యూటర్ కూడా కారణం కావచ్చు. వివిధ రూపాలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా అద్భుతమైన సదుపాయాలతో ఆకట్టుకునే ఫీచర్లతో వివిధ పరిణామలలో కంప్యూటర్ లభిస్తుంది.
ముఖ్యంగా పనులు వేగవంతం కావడానికి కంప్యూటర్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి కంప్యూటర్ ను వేగంగా ఉపయోగించే నిపుణుల మధ్య పోటీ… అలాంటి కంప్యూటర్ పరికరాలను మరింత శక్తివంతంగా రూపొందించడంలో వ్యవస్థల మధ్య పోటీ… ఇలా సమాజంలో వేగంగా సాగే జీవన విధానం కొనసాగడానికి కంప్యూటర్ కారణం అవుతుంది.
కంప్యూటర్ ముఖ్యంగా వ్యవస్థలలో పనితీరుని వేగవంతం చేసింది. పేపర్ ఉపయోగం తగ్గించింది. చెట్ల నుండి తయారు చేసే పేపర్ వాడకం తగ్గడం తగ్గడం శ్రేయస్కరం అంటారు.
ఇలాంటి ఈ కంప్యూటర్ అంటే ఏమిటి?
కంప్యూటర్ అంటే కంప్యూట్ చేసి చూపించేది? కంప్యూట్ అంటే కాలిక్యులేట్ చేయడం. అయితే ఇది ఏమిటి కంప్యూట్ చేసి చూపుతుంది. కంప్యూటర్ వివిధ పనులను చేసి చూపుతుంది… నిరంతరాయంగా ఎక్కువ కాలంపాటు ఒకే పనిని చేసి పెడుతుంది. ఒక్కసారి చేసిన పనిని పదే పదే పర్ఫెక్ట్ చేయగలదు.
ప్రధానంగా కంప్యూటర్ కి ఇచ్చిన డేటాను ప్రాసెస్ చేసి మరలా తిరిగి ఇస్తుంది. అంటే ఆదేశాలను స్వీకరించి, ఆ ఆదేశాలను అనుసరించి కార్యనిర్వహణ జరిపి మరలా ఆ కార్యమును అతి తక్కువ సమయంలో చూపుతుంది.
అంటే ఇన్ పుట్ టూల్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలను స్వీకరించి, ప్రొసెసింగ్ టూల్స్ ద్వారా కంప్యూట్ చేసుకుని ఔట్ పుట్ టూల్స్ ద్వారా కంప్యూటర్ చూపవచ్చును… ఇంకా ప్రింట్ చేయవచ్చు… ఇంకా ఆడియోగా అందించగలదు. వీడియోగా అందించ గలదు.
అలా కంప్యూటర్లో ఇన్ పుట్ టూల్స్ అంటే కీబోర్డ్, మౌస్ తదితర టూల్స్ ఉంటాయి. మానిటర్, ప్రింటర్ ప్రధానంగా ఔట్ పుట్ టూల్స్ గా ఉంటాయి. పెన్ డ్రైవ్, డివిడి వంటివి ఇన్ పుట్ మరియు ఔట్ పుట్ టూల్స్ గా ఉపయోగపడతాయి.
కంప్యూటర్ ని నడిపించే సాఫ్ట్ వేర్
కంపుటర్లోని ఇన్ పుట్, ప్రొసెసింగ్ సాధనాలు ఉపయోగిస్తూ… ప్రొసెసింగ్ చేసే ప్రక్రియను నిర్వహించే సాఫ్ట్ వేర్ ఉంటుంది. ఇది కంటికి కనబడదు కానీ దీని పనుల ఫలితం చూడగలుగుతాము… ఎలా అంటే మనిషి మనసు ఎలా మనిషిని నడిపిస్తుందో అలాగే కంప్యూటర్ ని సాఫ్ట్ వేర్ నడిపిస్తుంది.
ఇలా కంప్యూటర్ నడిపించే సాఫ్ట్ వేర్ ను ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు.
ఇందులో వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్స్ ఉంటాయి. పర్సనల్ కంప్యూటర్, లాప్ టాప్ వంటి పరికరాలను నడిపించే సాఫ్ట్ వేర్లలో విండోస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకా మ్యాక్ ఓఎస్, లైనక్స్… తదితర ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్స్ ఉంటాయి.
టాబ్స్ వంటి వాటిలో కూడా లైనక్స్, మ్యాక్, విండోస్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్స్ ఉంటాయి.
ఇక స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి లైనక్స్ ఆధారంగా తయారు చేయబడిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రముఖమైనది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా తయారు చేయబడిన స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువగా ఉంటుంది.
కంప్యూటర్ లో ప్రొసెసింగ్ పార్ట్
కంప్యూటర్ లో ఆదేశాలను ప్రాసెస్ చేసి చూపించే క్రమంలో కంప్యూటర్ ప్రధానమైన పార్ట్ సిపియు… ఇదే సెంట్రల్ ప్రొసెసింగ్ యూనిట్ అంటారు. ఈ సిపియు లో ప్రొసెసింగ్ టూల్స్ ప్రాసెసర్ ప్రధానమైనది అయితే దానికి సహకరించే సాధనాలు వలన అది ప్రొసెసింగ్ కార్యక్రమం నిర్వహించగలుగుతుంది.
సిపియులో ప్రాసెసర్ కి సహకరించే సాధనాలు… మదర్ బోర్డ్, రామ్, హార్డ్ డిస్క్, పవర్ యూనిట్, గ్రాఫిక్ కార్డ్ తదితర పార్ట్శ్ ఉపయోగపడతాయి.
లాప్ టాప్ ఇన్ పుట్ ఔట్ పుట్ సాధనాలు కలిపి ఉండే కంప్యూటర్
ఇలా ఒక కంప్యూటర్ వ్యక్తిగతంగా ఉపయోగించడానికి ఇన్ పుట్ సాధనాలు, ఔట్ పుట్ సాధనాలు ప్రొసెసింగ్ యూనిట్ కలిగి ఉంటే, దానిని పర్సనల్ కంప్యూటర్ అంటారు. వ్యవస్థలలో ఎక్కువగా ఉద్యోగులు ఉపయోగించేవి ఇవే ఉంటాయి. ఈ పర్సనల్ కంప్యూటర్ ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా ఉండేలాగా అందుకు అనుగుణంగా తయారు చేయబడేది… లాప్ టాప్ ఇందులో ఇన్ పుట్ ఔట్ పుట్ పరికరాలు, ప్రొసెసింగ్ యూనిట్ ఒక తెరిచి చూసుకునే దీర్ఘ చతురస్రాకార డబ్బా మాదిరి ఉంటుంది.
ఈ కంప్యూటర్ పరిణామం లాప్ టాప్ కన్నా చిన్న పరిణామంలో టాబ్ గా రూపాంతరం చెందింది… ఇది తేలికగా ఉండి, ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. అయితే ఇందులో ఇన్ పుట్ సాధనం అంటే ప్రధానంగా టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇదే దీనిలో ఇన్ పుట్ మరియు ఔట్ పుట్ సాధనం.
అంటే టచ్ చేస్తూ ఇన్ పుట్ ఆదేశం ఇస్తే, అది లోపల ప్రాసెస్ చేసుకుని అదే టచ్ స్క్రీనుపై ఔట్ పుట్ ప్రెజెంట్ చేస్తుంది. ఇంకా ఇన్ పుట్ – ఔట్ పుట్ సాధనం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ సెట్స్ ఉంటాయి.
టాబ్ కన్నా చిన్న పరిణామం గల స్మార్ట్ ఫోన్ చాలా శక్తివంతంగా అకారర్షణీయంగా ఉంటూ నేటి సమాజంలో అందరి చేతిలో లోకాన్ని చూపుతుంది. మరొక డిజిటల్ ప్రపంచం ప్రతి వ్యక్తికి ఏర్పడే విధంగా స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపుతుంది.
వ్యవస్థలలో మార్పుకు కంప్యూటర్ కారణం అయితే, వ్యక్తిలో మార్పుకు స్మార్ట్ ఫోన్ ప్రభావం ఉంటుంది.
కంప్యూటర్ వలన పనులు వేగంగా అవుతాయి
ఒక ఆర్టికల్ వ్రాయడానికి నిర్ధిస్థ పద్దతిలో కీ బోర్డ్ ద్వారా అక్షరాలను టైప్ చేస్తే, ఆ అక్షరాలను ఒక పేపర్ పై ప్రింట్ చేసే విధంగా స్క్రీనుపై చూపుతుంది. అయితే ఇదే పని టైప్ మెషిన్ కూడా చేస్తుంది. కానీ టైప్ మెషిన్ ఆధారంగా పేపర్ పై ఒక ఆర్టికల్ ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత మరలా అదే ఆర్టికల్ మరలా పేపర్ పై ప్రింట్ చేయాలంటే మరలా టైప్ చేయాలి అలా అదే ఆర్టికల్ వంద కాపీలు కావాలంటే మార్పులు లేకుండా అయితే జిరాక్స్ తీసుకోవచ్చు కానీ మార్పులు చేయాలంటే మరలా టైప్ చేయాలి. కానీ కంప్యూటర్ నందు ఒకసారి ఒక ఆర్టికల్ టైప్ చేసి బధ్రపరిస్తే, మరలా మరలా మార్పులు చేసి నిమిషాలలో అనేక ప్రింట్స్ చేయవచ్చు.
కంప్యూటర్ ద్వారా అనేక పనులు సులభంగా చేయవచ్చు. అయితే దానిని వినియోగించే విధానంపై సరైన అవగాహన ఉండాలి. లేకపోతే సాదారణ సమయం బట్టే పనులు కూడా చాలా కాలం వృధా అవుతాయి. ఈ సమస్య మనకు కొన్ని చోట్ల ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. వేగంగా టైప్ చేయలేని వ్యక్తికి ఆర్టికల్ ప్రింట్ చేయమని పని అప్పగిస్తే, నిమిషాలలో జరగవలసిన పని గంటల సమయం సాగే అవకాశం ఎక్కువ.
కంప్యూటర్ వలన మాన్యుఫ్యాక్చరింగ్ వ్యవస్థలో పనివేగం పెరిగింది. ఒక వస్తువుని తయారు చేసే మెషిన్ ఆపరేటింగ్ కంప్యూటర్ ద్వారా నిర్వహించడం వలన ఆ మెషిన్ నిర్ధిస్థ సమయంలో ప్రాడెక్ట్స్ రెడీ చేయగలగుతాయి.
ఇలా కాలాన్ని కంప్యూటర్ కాలంగా మార్చేసిన కంప్యూటర్ వివిధ రూపాలలో వ్యక్తి జీవన విధానంలో భాగమై, వ్యక్తిని ప్రభావితం చేస్తుంది.
కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం కేవలం కంప్యూటర్ గురించిన ఉపయోగం లేక దాని ప్రభావం గురించి వివరించే ప్రయత్నం అయితే పూర్తి కంప్యూటర్ పై అవగాహన కొరకు కంప్యూటర్ పార్ట్శ్, మరియు సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది.
ఈనాటి కాలంలో మొబైల్ యాప్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటిలో విజ్ఞానం అందించేవి ఉంటే వినోదం అందించేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.