Monthly Archives: March 2022

రాధే శ్యామ్ ప్రేమ కధ

రాధే శ్యామ్ ప్రేమ కధ! భారీ ఫ్యాన్స్ గల హీరోల సినిమాలకు అంచనాలు ఎక్కువగా ఉంటే, వారి ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనా వేసుకునే సినిమా హీరోలలో ప్రభాస్ ముందుంటారు.

ప్రేమ కధను జాతకంలో ముడిపెట్టి, అందంగా తెరపై చూపించే ప్రయత్నం జరిగింది. ప్రభాస్ లవర్ బాయ్ గా, అతనికి జోడిగా పూజా హెగ్డె కనిపిస్తారు.

నలభై సంవత్సరాల గతానికి వెళితే, ఓ ప్రేమ కధ ఎలా సాగుతుందో? అలా తీయడానికి ప్రయత్నం జరిగింది.

విక్రమాదిత్య ప్రసిద్ద హస్తసాముద్రికుడు. ఒక్కవ్యక్తి చేయి, ఒక్కసారి చేయి చూసి అతని జాతకం మొత్తం చెప్పగల ప్రతిభ విక్రమాదిత్య(ప్రభాస్) సొంతం. ఇక ప్రేరణ ఒక డాక్టర్. ప్రేరణ (పూజా హెగ్డే) ఒక హాస్పటల్ డీన్ తమ్ముడి కూతరు. ప్రేరణ – విక్రమాదిత్య ఇద్దరి కలయిక, ఇద్దరి మద్య ప్రేమ బలపడడం. ఇద్దరి మద్య విధి విదించిన ప్రతిబంధకాలు, ఆ ప్రతిబంధకాలను నిలబడి ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారనేది… సినిమా కధ.

తెరపై ఎక్కువ సేపు కనిపించే ప్రభాస్ మెప్పిస్తాడు. అతనికి జోడిగా పూజా హెగ్డే బాగా నటించింది. కొన్ని ప్రయత్నాలు అంచనాలకు భిన్నంగా జరుగుతాయి. కాబట్టి ఒక మంచి ప్రేమ కధగా ఈ రాధే శ్యామ్ ప్రేమ కధ చాలా అందంగా తెరపై చూడవచ్చును.

రాధే శ్యామ్ ప్రేమ కధ పాయింట్ ఏంటంటే?

ప్రాణాలు కాపాడే డాక్టర్ ప్రాణాలు మింగేసి వ్యాధితో బాధపడుతుంటే, ప్రపంచాన్ని నడిపింఇచే అతీతశక్తి విధి గురించి తెలియజేసే వ్యక్తికి, అతని జీవితం ఎలా ఉండబోతుందో? ముందుగానే తెలియబడితే… వారి మద్య ఎలా విధి నడిపిస్తుంది? బహుశా ఈ పాయింట్ ఆధారంగా కధను తెరకెక్కించి ఉంటారు.

ఓ అందమైన ప్రేమ కధను ఆహ్లాదకరంగా చూడడానికి ధియేటర్ వెళ్ళి చూడాల్సిందే.