Monthly Archives: November 2022

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం. విద్యార్ధులకు తొలి కర్తవ్యం ఏమిటంటే చదువు. ఇది అక్షర సత్యం. అయితే చదువుతో బాటు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, వారికి సామాజిక అవగాహన అంతే ముఖ్యం. ఎందుకంటే వారు సంఘంలో భావి పౌరులుగా జీవించాలి. కాబట్టి సంఘంతో ఎలా మసలుకోవాలో అవగాహన ఉండాలి. అందుకు చదువుతో బాటు అప్పుడప్పుడు సాంఘిక కార్యక్రమంలో భాగంగా వారు కూడా సంఘసేవలో పాల్గొనడం చేత, వారికి సంఘంపై అవగాహన ఉంటుంది. ఇంకా ఆయా విద్యార్ధులపై సంఘంలో సద్భావన ఏర్పడుతుంది. స్వార్ధము మనిషికి పరిచయం చేయనవసరం లేదు. అదే మనసును పట్టుకుని ఉంటుందని అంటారు. కాబట్టి స్వార్ధ రహిత పనులు చేయడం వలన నిస్వార్ధము యొక్క గొప్పతనం కూడా విద్యార్దులకు పరిచయం అవుతుంది. కాబట్టి విద్యార్ధి దశలోనే సంఘంలో సేవా పనులు చేయడానికి ప్రయత్నించాలని అంటారు. అపకారికి ఉపకారం చేయి అని అన్నారు. అపకారికి కూడా ఉపకారం చేసేటంత ఓర్పు రావడానికి మొదటి మెట్టు స్వార్ధరహిత పనులలో శ్రద్ద పెట్టడడమేనని అంటారు. ఇతరులకు సాయపడాలనే సద్భావన మంది మనసులలో పెరగడం వలన సమాజంలో సృహృద్భాన పెరుగుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు కావునా మంచి సమాజ నిర్మాణం కోసం, విద్యార్ధి దశలో సంఘసేవ చేయడం కూడా అలవాటు చేయాలని అంటారు.

ఎటువంటి కార్యక్రమములు ప్రధానంగా సంఘసేవగా చెబుతున్నారు?

  • ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తమవంతు సాయం చేయడానికి కృషి చేయడం
  • ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడం.
  • మొక్కలు నాటడం
  • ముసలివారికి సాయంగా ఉండడం.
  • దివ్యాంగులకు సాయం చేయడం.
  • అవసరం ఎరిగి, దానం చేయడం
  • సాంస్కృతిక కార్యక్రమములలో పాల్గొనడం
  • తమ చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయడం.
  • పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం
తదితర కార్యక్రమములు సామాజికపరంగా మేలుని చేస్తాయి. ఇంకా ఆయా విద్యార్ధులపై సంఘంలో సద్భావన పెరగడానికి తోడ్పడతాయి. ఎవరైనా సంఘసేవ చేయడానికి పదవులు అవసరం లేదు. సేవచేయాలనే సేవాతత్పరత ఉంటే చాలు… అందుకు తగిన మార్గము గోచరిస్తుందని అంటారు. కావునా విద్యార్ధులకు సంఘసేవ ఆవశ్యకతను తెలియజేయలి. సంఘసేవ వలన సంఘంలో ఏర్పడే సద్భావన గురించి తెలియజేయాలి. వివిధ సంఘసంస్కర్తల గురించి వివరించాలి. లోకంతో ఎలా మెసులుకోవాలో? విద్యార్ధులకు తెలియాలంటే, వారితో సంఘసేవను చేయించడం వలన వారికి లోకంతో ఎలా ఉండాలో ఒక అవగాహన వస్తుందని అంటారు. సంఘంలో సంఘజీవిగా ఉండేవారు సంఘంతో మమేకం కావడానికి సాంఘిక కార్యక్రమములలో పాల్గొడనమే ప్రధానం. విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం. విశ్వంపై పరిశోధనాత్మక దృష్టి ఉంటే, లోకంలో అద్బుతాలను ఆవిష్కరించవ్చని అంటారు. ఇప్పుడు మనం విశ్వంలోని అనేక విషయాలను దృశ్యమానంగా ఎక్కడబడితే అక్కడే వీక్షించగలుగుతున్నాము అంటే అందుకు ఎవరో ఒకరి పరిశోధన ఫలితమే… మొదటి పరిశోధనకు మరింత పరిశోధన చేసి, దానిని మరింత సౌలభ్యం అభివృద్ది చేయడానికి లోకంలో పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. విజ్ఙాన శాస్త్రం విశ్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది. పరిశోధనాత్మక దృష్టి విశ్వ రహస్యాలు సైతం గోచరిస్తాయని అంటారు. అలా పరిశోధకులు ప్రతిభ కారణంగా మన సమాజంలో ఆవిష్కరింపబడిన అద్భుతంగా టెలివిజన్ కుదిస్తే, టి.వి. తెలుగులో దీనిని దూరదర్శన్ అంటారు. అంటే దూరంగా ఉన్నవాటిని దర్శింపజేసేది. ఇంట్లో కూర్చుని ఎక్కడెక్కడి విషయాలను దృశ్యమానంగా చూపించే, దూరదర్శన్ మానవుడి జీవన విధానంపై ప్రభావం చూపింది.

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం

గాలిలో ప్రసారం చేయబడుతున్న దృశ్య తరంగాలను దృశ్యాలుగా చూపించే దూరదర్శన్ బ్రిటన్లో 1936 లో వెలుగులోకి వచ్చింది. ఈ దూరదర్శన్ ని స్కాట్ దేశానికి చెందిన్ ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928 సంవత్సరంలో కనిపెట్టినట్టు చరిత్ర చెబుతుంది. లోకంలో దూరదర్శన్ లేకుండా ఇల్లు ఉండదు. కొత్తగా ఇల్లు కట్టుకుంటే, టి.వి. ఫిట్ చేసుకోవడానికి ప్రత్యేక ప్లేస్ కేటాయించడం కామన్ గా మారింది. అంతలాగా దూరదర్శన్ మానవ జీవితంలో భాగమైపోయింది. కారణం టి.వి. ద్వారా అనేక కార్యక్రమాలు వీక్షించవచ్చును. వినోదం పంచే సినిమాలు వీక్షించవచ్చును. లోకంలో జరుగుతున్న విశేషాలు చూడవచ్చును. ప్రభుత్వ, ప్రవేటు రంగంలో విశిష్ట సంఘటనలు ప్రతి విషయం ప్రత్యక్ష ప్రసారంలోనే టి.విలలో వీక్షించవచ్చును. అనేక రంగాలలో జరుగుతున్న అభివృద్ది, అనేక రంగాలలో మారుతున్న పరిస్థితులు, అనేక రంగాలలో రావాల్సిన మార్పులు… ఇలా సామాజికంగా సామాజిక విశ్లేషకులు అభిప్రాయాలు వీక్షించవచ్చును. ప్రజలు చైతన్యవంతం కావడానికి టి.వి. ఉపయోగపడుతుంది. ప్రజలు కాలక్షేపం చేస్తూ, కాలం వృధా చేయడానికి కూడా టి.వి. ఉపకరిస్తుంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

దూరదర్శన్ – టెలివిజన్ – టి.వి. – స్మార్ట్ టివి

వ్యామోహానికి గురికాకుండా ఉంటే, టి.వి. ద్వారా విజ్ఙానం పొందవచ్చని అంటారు. ఎందుకంటే ఇప్పుడు టి.వి. మరింతగా వృద్ది చెంది… స్మార్ట్ టి.వి. అవతరించింది. స్మార్ట్ టివి వలన కేవలం కొందరు ప్రసారం చేసే, ప్రత్యక్ష ప్రసారాలతో బాటు, మనకు కావాల్సిన విజ్ఙాన విషయాలను వెతికి చూడవచ్చును. కంప్యూటర్లో బ్రౌజింగ్ చేసినట్టు స్మార్ట్ టి.విలో కూడా బ్రౌజింగ్ చేయవచ్చును. ఇంటర్నెట్ సాయంతో అనేక విజ్ఙాన విషయాలను తెలుసుకోవచ్చును. ఉపయోగించుకుంటే స్మార్ట్ టివి సాంకేతిక గురువు వలె ఉపయోగపడుతుంది.

తెలుగు వ్యాసాలు వాతావారణం పర్యావరణం మరికొన్ని వ్యాసాలు

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలులో పర్యావరణం గురించి తెలుగు వ్యాసం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే, అదే పెద్ద ఆస్తి. మనిషి ఆరోగ్యంగా ఉండడం చేత, శక్తివంతంగా పనిచేయగలడు. తన సమర్ధవంతమైన పని వలన, శ్రమకు తగిన ఫలితం పొందగలడు. అలాగే ఆరోగ్యవంతుడు మాత్రమే, తనకు ప్రీతికరమైన ఆహార పదార్దములు స్వీకరించగలడు. వాటిని జీర్ణం చేసుకోగలడు. అటువంటి ఆరోగ్యం ఉన్న మనిషి జీవనం సాఫీగా కొనసాగుతుంది. అదే అనారోగ్యంగా ఉండే మనిషికి తినడానికి కూడా సమస్యలు ఉండవచ్చును. కావునా మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనిషి సుఖంగా జీవించడానికి తన శరీర వ్యాయామంతో బాటు, అతని చుట్టూ ఉండే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండడం చేత మనిషి మనుగడ భూమిపై సుఖంగా సాగుతుంది. లేదంటే తన శరీర సమస్యలపైనే పోరాడాల్సిన స్థితి వస్తుంది. కాబట్టి మనిషి తన మరియు తన తరువాతి తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి ప్రస్తుత వాతావరణమును సక్రమముగా వినియోగించుకోవాలి. పర్యావరణమును పరిశుభ్రతలో అశ్రద్దగా ఉండరాదు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలు:

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

మన సమాజంలో కొన్ని కర్మాగారాల నుండి విడుదల వ్యర్ధ పదార్ధాలు, వాతావరాణానికి హానికరం. పరిశ్రమలలో సరైన చర్యలు లేకపోవడం వలన, కొన్ని పరిశ్రమల వలన కూడా వాతావరణం కాలుష్యం చెందుతుందని అంటారు. అంతే కాకుండా నిత్యం ఎక్కువమంది ఉపయోగించే మోటారు వాహనాలు వలన కూడా వాయు కాలుష్యం ఎక్కువగా జరుగుతుందని అంటారు. ఇంకా…. చెత్తను ఎక్కడపడితే అక్కడే పడవేయడం వలన మురికినీరు ఏర్పడి, ఆ నీటి వలన వివిధ క్రిములు పెరగడం, అవి రోగకారకాలుగా మారడమే కాకుండా, నీటి కాలుష్యం ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా వాతావరణం, పర్యావరణం పరిరక్షణలో తగు జాగ్రత్తల విషయంలో చూపే అశ్రద్ధ జల కాలుష్యం, వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం అంటారు.
వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

నిర్లక్ష్యం వలన కర్తవ్యం దెబ్బతింటుంది. పర్యావరణం విషయంలో కొందరి అశ్రద్ద వలన వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దీని వలన భయానక పరిస్థితులను మనిషి ఎదుర్కొనవలసిన ఆగత్యం ఏర్పడుతుందనే అభిప్రాయానికి బలం చేకూరుతుంది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించిందని అంటారు. ఎందుకంటే, దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

వాతావరణ కాలుష్యం పరిష్కారం:

ఏదైనా ఒక సమస్యకు కారణం నిర్లక్ష్యం కారణం అయితే, అవగాహనారాహిత్యం కూడా మరొక కారణం కాగలదని అంటారు. వాతావరణం విషయంలో అందరూ తమ వంతు కర్తవ్యం గుర్తించాలి. ప్రతివారు తమ చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులను గమనించి, అక్కడ జరుగుతున్న కాలుష్యమును నివారించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ సంస్థలు కూడా వాతావరణ ప్రభావం గురించి, ప్రజలలో అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం ఇంకా చేయాలి. కర్మాగారాలు, పరిశ్రమలు నడిపేవారు కూడా నిబంధనల ప్రకారం, తమ తమ పరిశ్రమలలో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో మరింత శ్రద్ద వహించాలి. వాతావరణం విషయంలో మనిషి ఎంత జాగ్రత్తపడితే, అంత సామాజిక సేవ చేసినవారుగా ఉంటారు. భావితరానికి ఆరోగ్యకర పరిస్థితులను అందించినవారవుతారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు