10వ తరగతిలో లక్ష్యం లేకుండా ఉంటే, వారి చదువు ఎలా ఉండవచ్చు. చెప్పలేం. లక్ష్యం లేకపోతే, విద్యార్థి ఏదో ఒక పనిని చేయడం వరకే పరిమితం అవుతాడు. కానీ దానికి సరైన ఫలితాలు రాకపోవచ్చును. మంచి ఫలితం వచ్చినా, లక్ష్యంతో పనిచేసి సాధించిన ఫలితమే సంతృప్తినిస్తుంది.
ఉదాహరణ:
ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా వ్యక్తి బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో, ఊహించండి. ఖర్చులు వృధా అవుతాయి. అలాగే లక్ష్యం లేకుండా చదివితే, కాలం వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
లక్ష్య ఉంటే, విద్యార్ధి ప్రణాళిక ప్రకారం శ్రద్దతో చదువుతాడు. లక్ష్యం ఉంటే, తరగతిలో పాఠాలు శ్రద్దగా వింటాడు. లేకపోతే తోటివారిని డిస్ట్రబ్ చేసే అవకాశం లేకపోలేదు.
మొదటి ముగ్గురిలో నేనుండాలి అనే లక్ష్యం ఉన్నవారు తమ దృష్టిని చదువుపైనే పెడతారు.
పదవ తరగతి ఫలితం విద్యార్ధిగా నాకు గుర్తింపు తెచ్చే తొలి ఫలితం, అది ఉత్తమంగా ఉండాలని భావించిన విద్యార్ధి ఖచ్చితంగా చదువుపై మరింత శ్రద్ద పెట్టగలడు.
లక్ష్యం లేకపోతే విద్యార్థి, తన చదువులో నిర్లక్ష్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మొక్కుబడిగా చదువుతూ కాలయాపన చేస్తాడు.
ప్రయత్నానికి ప్రేరణ:
పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలి అనే ధృఢమైన లక్ష్యం ఉంటే, పట్టుదలతో మంచి ఫలితం కోసం ప్రయత్నం చేస్తాడు.
పరీక్షలలో పాస్ కావడం గురించి ఒత్తిడి చేయకుండా, పరీక్షలలో పాస్ అవ్వడం ఒక సాధన, దానిపై ప్రయత్నం చేయమని విద్యార్ధిని పోత్సహించాలి.
పదవ తరగతి ఫలితం తన జీవితంపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించిన విద్యార్ధి, ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పరచుకుంటాడు. లక్ష్యం ఉన్న విద్యార్ధి, ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నిస్తాడు.
జీవితంపై అవగాహన రాకముందే, అనవసర విషయాలవైపు దృష్టి మళ్ళే వయస్సులో పదవ తరగతి విద్యార్ధులు ఉంటారు కాబట్టి, వారిని స్నేహ పూర్వకంగా ప్రేరేపించాలి.