Category Archives: karapatram

karapatram కరపత్రం ఎలా రాయాలి తెలుగులో, వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో, మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు., ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి.

telugu vyasalalo karapatram ela rayali….Telugureads telugulo vyasalu pillalaperlu

వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో

నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో….

వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను

పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి అనగానే వరకట్నం ఎంత? వరకట్నం కోసం కూడబెట్టిన డబ్బు లేకపోతే, ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలు వర్ణానీతతం…. ఒక రాబోవు కొత్త రోజులు అయినా ఈ పద్దతి మారుతుందో లేదో తెలియదు… కానీ చదువుకున్న మనం అయినా ఈ వరకట్నం అనే దురాచారం రూపుమాపుదాం…. కనీసం మన వరకట్నం వద్దని నిలబడదాం.

ప్రేమతో జీవించవలసిన ఆలుమగల మద్యలో ఆర్ధిక పరమైన మనస్పర్ధలు రావడానికి వరకట్నమే కారణం అవుతున్నాయి. వరకట్నం పూర్తిగా తేలేదని వేధింపులకు గురయ్యే మహిళలు ఉంటున్నారు. ఇంకా అదనపు కట్నం కోసం వేధించే ఘనులు కూడా ఉంటే, అది మరీ విడ్డూరం…

మనదేశంలో పేదరికం, పేదరికంతో బాధపడే మద్యతరగతి ప్రజలు అదికంగా ఉంటే, వారిలో వివాహం చేయడం, ఇల్లు కట్టడం వంటి విషయాలు గగనంగా మారుతుంది…. పూర్వమెప్పుడో… వివాహాలకు కట్నం ఇచ్చినా అది… తక్కువ మొత్తంలో ఉంటే, నేడు అది అందనంత పెద్ద మొత్తాలుగా మారడం శ్రేయష్కరం కాని విషయం. కాబట్టి వరకట్నం వద్దని చెప్పడం కాదు వరకట్నం వద్దని నిర్ణయించుకోవాలి…. నేటి యువత తర్వాతి తరానికి మార్గదర్శకంగా నిలబడాలంటే, వరకట్నం తీసుకోకుండా వివాహం చేసుకోవాలని సత్సంకల్పం చేసుకోవాలి. అది ఆచరించాలి.

వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో కరపత్రం

అన్యోన్య దాంపత్యమునకు వరకట్నం వద్దనే మాటే నాంది అయితే

వధువుకు సహజంగానే తండ్రిపై పరమ ప్రీతి ఉంటుంది. అటువంటి తండ్రి తనకు వివాహం చేయడానికి నానా కష్టాలు పడుతుంటే, ఆ కూతురికి సహజంగానే వరుడుపై కోపం కలగవచ్చును… భార్య మనసులో స్థానం పదిల పరచుకోవడానికి, తన పుట్టింటి వారి మేలుకోసం ఒక మంచి మాట చెప్పిన చాలని అంటారు. ఇక వివాహంలో పెద్ద కష్టం అంటే వరకట్నం కోసం డబ్బు సమకూర్చుకోవడమే… అయితే ఆ కష్టం కేవలం ఒక్కమాటతో పోతే, ఆమె మనసు నీ ఇంటి వృద్దిపై ధృడపడిపోతుంది.

ఇంటిలో మహాలక్ష్మీ వలె అల్లరి చేసే అమ్మాయి…. ఒక్కసారి వధువుగా మారి, నీకోసం ఇంటిల్లిపాది ప్రేమకు దూరం అవుతుంది. ఇంటిలోని అన్ని బంధాలకు దూరంగా నీవద్దకు వచ్చేస్తుంది. కేవలం తండ్రి మాటకోసం, నీ మనసేమిటో కూడా తెలియని అమ్మాయి… వధువుగా నిన్ను వరిస్తుంది….

ఎంతో గొప్పదైన మన వివాహ వ్యవస్థ, తర్వాత ఏర్పడే అమూల్యమైన దాంపత్య జీవితం… చక్కగా ఉండడానికి వరకట్నం వద్దని, వధువును వివాహమాడే ధీరులు మనసమాజంలో ఎంత పెరిగితే, అంతలా సమాజంలో స్త్రీ సంతోషపడుతుంది. ఎక్కడ స్త్రీ సంతోషపడుతుందో… అక్కడ దేవతలు సంతోషిస్తారని ప్రతీతి…

మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు.

అపకారికి కూడా ఉపకారం చేసేవారి గురించి, ఏమి ఆశించకుండా సాయపడే గుణం ఉన్నవారి గురించి, ద్వితీయాలోచన లేకుండా సాయం చేయడానికి చూసేవారి గురించి, తమ చుట్టూ ఉన్నవారి గురించి మంచినే చెబుతూ ఉండేవారి గురించి… ఇలా ఏదైనీ ఒక మంచి గుణ విశేషంగా ఉన్నప్పుడు మంచి వ్యక్తిగా గుర్తిస్తారు… ఎక్కువగా మంచి గుణాలు గల మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు.

తనకు అవసరమైనప్పుడు సాయం అందించకుండా మోసం చేసిన మిత్రునికి అవసరమైప్పుడు సాయం చేసేవారుంటే, అటువంటి వారిని అపకారికి కూడా ఉపకారం చేసే మహానుభావుడు అంటారు…. ఇంకా అతనిలో ఉండే దానగుణం, మాటతీరుని బట్టి ఆ మనిషిని మంచితనానికి మారు పేరు అని లోకం చెప్పుకుంటుంది.

కానీలోకం నుండి మంచివారుగా గుర్తింపు అంత త్వరగా ఏర్పడదు… అలా ఏర్పడిన గుర్తింపు అంత త్వరగా మాసిపోదు… అది మంచి అయినా…. చెడు అయినా….

సాయం చేయవసిన సమయంలో తనకు ఏమిలాభం? అని స్వలాభాపేక్ష లేకుండా సాయంచేసేవారిని కూడా లోకం గుర్తిస్తుంది. ఇంకా ఎప్పుడూ తమ చుట్టూ ఉండే వ్యక్తులతో మంచితనంతో మెసులుకోవడం వలన సమాజం నుండి మంచివారిగా గుర్తింపు లభిస్తుంది.

అయితే కావాలని చెడు చేయలానే ఆలోచన ఉంటే చాలు, గడించిన మంచితనం మంటగలిసిపోతుంది. అందుకే అంటారు. చెడు అనిపించుకోడానికి క్షణం చాలు… మంచి అనిపించుకోవడానికి జీవితం చాలదని. మరి మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు?

మంచివారిగా గుర్తింపు పొందినంత సులువుకాదు, ఆ గుర్తింపు నిలబెట్టుకోవడం. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో మైండు పనిచేయాలని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి పని మూడు ఉంటే…. ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసే వ్యక్తి, వేళకి తింటారు. వేళకి నిద్రిస్తారు… ఏదైనా కల్తీ వలన కానీ ఏదైనా అంటువ్యాది సోకితే, ఆనారోగ్యంపాలు అవుతారమో కానీ వారి శరీరం వలనే వారికి ఆనారోగ్యం కలగదు… కారణం కష్టం చేసే కాయంలో వృధా కొవ్వు ఉండదు. వేళకి తినడం, నిద్రించడం ఉంటుంది. ఇలా వ్యక్తికి కాయకష్టం లేకపోతే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

వ్యక్తి ఆరోగ్యం వ్యక్తికి ఆహారపు అలవాట్లు, నిద్రకుపక్రమించే వేళలు, నిద్ర మేల్కోనే వేళలు మరియు నిద్రించు సమయం…. వీటిపై ఆధారపడి ఉంటే, ప్రతిరోజు చేసే వ్యాయమం చేయడం వలన శరీరారోగ్యమును కాపాడుకోవచ్చును… ఇంకా వాకింగ్ చేయడం కూడా చెబుతారు.

మొదటి నుండి అలవాటుగా ఉన్నవాటిని అకస్మాత్తుగా మార్చుకుంటే, శారీరక మానసిక ఇబ్బందులు తప్పవని అంటారు. కాబట్టి ప్రస్తుతం వ్యక్తికి ఉన్న ఆహారపు అలవాట్లలో దోషములు ఎంచాలి. ఇక నిద్రించు సమయం, నిద్రించు వేళలు, నిద్ర మేల్కొను వేళలు… ఎంతవరకు అవసరమో బేరీజు వేసుకోవాలి… ఆపై వైద్యుని సలహామేరకు ఆహారపు అలవాట్లలో మార్పును తీసుకురావాలని అంటారు.

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం
మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

మనిషికి అలవాటు అయిన పనులలో అతని మనసు నిమగ్నం కాకపోయినా అతని శరీరం యాంత్రికంగా చేసుకుపోతుంది… అటువంటి అలవాట్లు మార్చుకునేటప్పుడు పూర్తిగా మనసును సిద్దం చేసుకుని మార్పులు మొదలు పెట్టాలి… కానీ ఆరంభశూరత్వం లాగా అలవాట్లు మార్చుకుంటే, మనసు ఎదురుతిరుగుతుందని అంటారు.

కావునా అనారోగ్య లక్షణాలు ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ… మనసులో ఆవేదనను కలిగించుకోరాదు… ముందు అనారోగ్య లక్షణాలకు మూలం తెలుసుకోవాలి. అనారోగ్య లక్షణాలకు మూలం తెలియజేయగలిగేది… వైద్యుడే కాబట్టి వైద్యుడిని సంప్రదించి, ఎంతవరకు అలవాట్లలో మార్పులు తీసుకురాగలమో… ఆలోచన చేసుకుని… మార్పుకు నాంది పలకాలని చెబుతారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి! శాంతిగా ఉండే మనసు బాగా ఆలోచన చేయగలిగితే, అశాంతితో ఉండే మనసు అసహనంతో ఉంటుంది. పరిష్కార ధోరణి కానరాదు.

శాంతియుత వాతావరణంలో వ్యక్తి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. శాంతస్వభావం ఉన్నవారి మాటతీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. శాంతము లేని చోట సౌఖ్యముండదని అంటారు. దైనందిన జీవితంలో సమస్యల వలయం ఏర్పడుతూనే ఉంటే, అశాంతితో ఉన్నవారు ఆ వలయంలో చిక్కుకుంటారు. శాంత చిత్తంలో ఆలోచించేవారు సమస్యలకు పరిష్కార ధోరణితో ముందుకు సాగగలరు.

మనిషి శాంతిగా ఉండడం చేత, తన చుట్టూ ఉండేవారి మనసులో కూడా శాంతిని పెంపొందించగలడు. అందుచేత వ్యక్తి జీవితంలో శాంతి ఆవశ్యకత ఉంది. ఆగ్రహం అవసరం మేరకు ఉండాలి. ఆప్తులపై అనుగ్రహం ఉండాలి. కానీ ఎప్పుడూ ఆగ్రహావేశాలతో మనిషి మమేకం కాకూడదు.

ఆగ్రహావేశాలతో మనిషి మమేకం కావడం చేత తన మనసులో శాంతిని కోల్పోయే అవకాశం ఉంటుంది. స్వస్థత పొందడంలో శాంతియుత స్వభావం చాలా ముఖ్యమంటారు.

ఒక కుటుంబం అయినా, ఒక సంస్థ అయినా సమస్యను ఎదుర్కొనవలసిన ఆగత్యం ఏర్పడుతుంది. ఆ సమయంలో శాంతియుత వాతావరణమే సమస్యకు పరిష్కారం చూపగలదు… కానీ ఆగ్రహావేశాలకు గురయ్యే స్వభావం వలన సమస్య మరింత జఠిలం కాగలదు. కావునా కుటుంబ వృద్దికి కానీ, సంస్థ వృద్దికి కానీ శాంతి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది.

సమాజంలో శాంతి గురించి హితోక్తులు చాలా ఉంటాయి.

మహాభారత యుద్ధం దుర్యోధనుడి అసూయ ధ్వేషము కారణం. కానీ దుర్యోధనుడుకి శాంత స్వభావం లేకపోవడం వలన రాజ్యాధికారం దక్కినా ప్రశాంతంగా జీవించలేకపోయాడు. ప్రతికారేచ్చతో పాండవుల పతనానికి ప్రయత్నించి, తన పతనాన్ని కొనితెచ్చుకున్నాడు.

ధర్మరాజు శాంత స్వభావం వలన, ధీరులైన సోదరులను నియంత్రించగలిగాడు. అతని సంరక్షణకు పరమాత్మ సైతం ప్రయత్నించాడు. యుద్ధం దగ్గరపడుతున్న సమయంలో కూడా ధర్మరాజు ఇరుపక్షాల ప్రయోజనార్ధం శాంతియుత చర్చలకు ప్రయత్నించాడు. సఫలం కాకపోయినా, సమాజంలో కీర్తిని గడించాడు.

అంటే శాంతిగా ఉండడం చేత వ్యక్తి దీర్ఘకాలిక కీర్తిని గడించవచ్చనే అభిప్రాయం ప్రకటితం అవుతుంది.

స్వాతంత్ర సమరంలోనూ శాంతియుత ఉద్యమాలు నడిచాయి.

దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్ర్య కాంక్షను దేశవ్యాప్తంగా రగల్చడంలో స్వాతంత్ర్య పోరాట యోధులు విజయవంతం అయ్యారు. అయితే శాంతియుత ఉద్యమాలు చేయడంలో మహాత్మగాంధీ ముందుండి నాయకత్వం వహించారని అంటారు.

చివరకు మన దేశ స్వాతంత్ర్యం కూడా శాంతియుత మార్గంలోనే లభించిందని చెబుతారు.

దీనిని బట్టి శాంతియుతంగా చేసే ప్రయత్నం దీర్ఘకాలిక ప్రయత్నంగా కనిపించినా, అది విజయవంతం అయిన రోజు చారిత్రికరోజుగా మిగిలిపోతుంది.

సమాజంలో శాంతి ఆవశ్యకత చాలా ఉంటుంది.

కారణం సమాజంలో వ్యక్తులతో కూడిన కుటుంబాలు, ఉద్యోగులతో కూడిన సంస్థలు, నిర్ధేశిత విధానలతో నడిచే వ్యవస్థలు… అనేక రంగాలలో అనేక వ్యవస్థలు కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. అయితే వాటిలో పనిచేసి, ఆయా రంగాలలో వృద్దికి కృషి చేసేది… వ్యక్తులే… అటువంటి వ్యక్తులు శాంతిగా ఉంటేనే, సమాజిక పరిస్థితులు బాగుంటాయి. వ్యవస్థలు, సంస్థలు వృద్దిలోకి వస్తాయి.

ఒకరు అశాంతితో ఉంటే, మరొకరిపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంటే, మరొకరి అశాంతి ఇంకొకరి అశాంతికి కారణం కాగలదు… ఎందుకంటే మనిషి మనసు భావాలకు ప్రతిస్పందిస్తూ ఉంటుంది… కాబట్టి సమాజంలో శాంతి ఆవశ్యకత చాలా అవసరం. సమాజంలో శాంతికి వ్యక్తులు, వ్యవస్థలు కృషి చేయాలి…. శాంతి వలననే అభద్రతా భావం తొలగుతుంది.



కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు.

ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం కాచచ్చు లేక సమావేశం ఏర్పాటు గురించి కావచ్చును. లేదా ఏదైనా అంశములో ప్రజలలో అవగాహన కొరకు కూడా కరపత్రం ప్రచురిస్తూ ఉంటారు.

పాంప్టేట్ అంటే తెలుగులో కరపత్రం ఏదైనా సందర్భం గురించి తెలుపుతూ ఒక ఆహ్వాన లేఖ మాదిరిగా ఉండవచ్చును. లేకా ఒక అంశమును గురించి సమగ్రంగా తెలియజేసే సమాచార పత్రంగా కూడా ఉండవచ్చును. ఏదైనా సందర్భమును, దాని ఆవశ్యకతను కరపత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

అంటే కరపత్రం అంటే వ్యాసం వ్రాసినట్టుగా ఉండవచ్చును. అయితే అందులో ఆహ్వానిస్తూ ఉండవచ్చును. లేదా ఒక అంశమును గురించి ప్రచారముగా కూడా ఉండవచ్చును.

పాంప్లేట్ కరపత్రం ఎలా రాయాలి?

కరపత్రంలో ముందుగా టైటిల్ ఎంపిక చాలా ముఖ్యం. ఇది కరపత్రంలోని సారాంశమును ప్రతిబింబించేలాగా ఉండాలి.

అంశమునకు ఎంచుకునే టైటిల్ అంటే తెలుగులో శీర్షిక… కరపత్రం యొక్క ఉద్దేశ్యమును తెలియజేసే విధంగా ఉండాలి. అందువలన కరపత్రం చదివేటప్పుడు దానిని మరింత లోతుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ టైటిల్ అంటే శీర్షిక వాడుక పదాలతో కలిసి ఉండడం వలన కరపత్రంపై ఆసక్తి కూడా పెరుగుతుంది.

కరపత్రమునకు ఆయుష్షు ఉంటుంది.

ఇక ప్రతీ కరపత్రానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఒక తేదీ నుండి మరొక తేదీ తర్వాత ఆ కరపత్రము చరిత్రలో సంఘటనకు ఆధారము మాత్రమే. అంటే ఒక షాప్ ఓపెనింగ్ కు ఒక కరపత్రం అంటే ఇంగ్లీషులో పాంప్లేట్ తయారు చేయబడితే, షాప్ ఓపెన్ అయిన కొన్నాళ్ళకు ఆ కరపత్రము గతించిన సంఘటనకు సాక్ష్యం మాత్రమే.

కాబట్టి కరపత్రం ఇంగ్లీషులో పాంప్లేట్ వ్రాసేటప్పుడు టైటిల్ కు ఎగువ కానీ దిగువ కానీ తేదీ వ్రాయడం ప్రధానం…. లేదా తేదీని ఉంటంకిస్తూ… ఒక హెడ్ లైన్ ప్రధానం.

టైటిల్ వ్రాశాకా ఆ టైటిల్ ని క్లుప్తంగా వివరిస్తూ, సందర్భమును తెలియజేయడం ప్రధానం.

క్లుప్త వివరణ తర్వాత టైటిల్ ను బట్టి ప్రధానాంశాలు అప్పటి సందర్భమును బట్టి కొన్ని పేరాలు గా విభజిస్తూ…. సమగ్ర వివరణ ఉండాలి. ప్రధానంగా టైటిల్ ని బట్టి సందర్భము యొక్క ఉద్దేశ్యము, దాని ప్రధాన్యత ఉండాలి.

సామాజికపరమైన అంశము అయితే, కరపత్రములో సంబంధిత శీర్షికను బట్టి విషయము యొక్క ఆవశ్యకత, దాని యొక్క భవిష్యత్తు పరిణామాలు, సమాజంపై సంబంధిత విషయము యొక్క ప్రభావం అన్ని సమగ్రంగా తెలియజేయాలి.

ఆహ్వాన కరపత్రం అయితే ప్రజలను ఆహ్వనిస్తూ ముగించాలి. లేదా సామాజిక అంశము గురించి అవగాహన కరపత్రం అయితే, విషయమును పరిశీలించమని కోరుతూ ముగించాలి.

ప్రధానంగా కరపత్రము యొక్క డిజైన్ ఆకట్టుకునే విధంగా కూడా ఉండాలి.