Category Archives: Telugu Bhasha gurinchi vyasam

Mana peddalu Telugu Bhasha gurinchi goppaga chebutaru. Variki mana Telugu Bhasha ante enaleni makkuva. endukante varu Telugu Bhashani ammato polcharu.

గొప్పదైన మన తెలుగు భాషను మన పెద్దలు అమ్మతో పోల్చి మాట్లాడుతారు. అంటే వారికి తెలుగు భాష ఎంతో మక్కువ. మన వాడుక భాష తెలుగు భాష కాబట్టి మన మాతృభాష తెలుగు భాష అటువంటి తెలుగు భాష Telugu Bhasha gurinchi Vyasalu… తెలుగు భాష గొప్పతనం తెలిపే తెలుగు వ్యాసాలు..

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

Telugu Bhasha gurinchi Vyasalu
గొప్పదైన మన తెలుగు భాషను మన పెద్దలు అమ్మతో పోల్చి మాట్లాడుతారు. అంటే వారికి తెలుగు భాష ఎంతో మక్కువ. మన వాడుక భాష తెలుగు భాష కాబట్టి మన మాతృభాష తెలుగు భాష అటువంటి తెలుగు భాష Telugu Bhasha gurinchi Vyasalu… తెలుగు భాష గొప్పతనం తెలిపే తెలుగు వ్యాసాలు..
తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు
మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది. అమ్మ మాట్లాడే భాషలోనే పెరిగిన పిల్లలు, అదే భాష ద్వారా విషయాలను గ్రహించడంలో అలవాటు పడి ఉంటారు. కావునా మాతృభాషలో విద్య వలన త్వరగా విద్యార్ధులకు విషయావగాహన ఉంటుందని అంటారు.

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? తెలుగువ్యాసం

పుట్టి పెరుగుతున్నప్పటి నుండి అమ్మతోబాటు మనకు తోడుగా ఉండే భాష మాతృభాష. కావునా మాతృభాషలో వివిధ భావనలు సులభంగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మాతృభాషలో విద్య అవసరం అంటారు.

భాషాపరమైన అంశాలలో, చారిత్రక అంశాలలో, సామాజిక అంశాలలో మాతృభాషలో విద్యా బోధన సదరు ప్రాంతంలోని విద్యార్ధులకు మేలు చేయగలదు. అయితే అదే స్థితిలో ఇతర సబ్జెక్టుల పరంగా చూసినప్పుడు ఆంగ్లభాష కూడా అవసరం ఉంటుంది.

అయితే విషయాలు అవగాహన చేసుకోవడంలో మాతృభాషలో ఉన్నంత సౌలభ్యం ఇతర భాషలలో తక్కువగా ఉంటుందని అంటారు. కానీ విశేష ప్రతిభ ఉన్నవారికి భాష ఏదైనా ఒక్కటే… అయితే అందరూ ఒకే విధంగా సబ్జెక్టులను అర్ధం చేసుకోలేకపోవచ్చును. ఎక్కువమంది మాతృభాషలో విషయావగాహన సులభంగా ఉంటుందనే అభిప్రాయపడతారు.

ఎక్కువమందికి ఏది అవసరమో అది వ్వవస్థాపరంగా అందుబాటులో ఉండాలనే కనీస న్యాయమని భావించినప్పుడు… మాతృభాషలో విద్య అవసరం అనే భావనకు బలం చేకూరుతుంది.

మారుతున్న సామాజిక పరిస్థితులలో సాంకేతికత చాలా ప్రముఖ స్థానాన్ని పొందుతుంది. సాంకేతికత ఎక్కువగా ఆంగ్లభాష ఆధారంగా పని చేస్తున్నప్పుడు అందరికీ ఆంగ్లభాష అవసరం ఏర్పడుతుంది.

పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా మనిషికి మానసిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంటే, వారికి మన భారతీయ సంప్రదాయంలో సాహిత్యం రీడ్ చేయడం ద్వారా మనోవిజ్ఙానం పెరిగే అవకాశం ఉన్నప్పుడు మాతృభాషలో సరైన పట్టులేకపోవడం వారికి భాధాకరం కావచ్చును. మనోవిజ్ఙానం వలన మనోరుగ్మతలనుండి మనసును కాపాడుకోవచ్చని చెబుతున్పప్పుడు మనసు గురించి మాతృభాషలో అవగాహన ఏర్పడినట్టుగా ఇతర భాషలలో ఏర్పడకపోవచ్చును.

అయితే నేటి సమాజంలో వివిధ విషయాలలో ఇతర భాషాల ప్రాముఖ్యత రిత్యా, ఇతర భాషలలో కూడా ప్రావీణ్యత అవసరం ఉంది. కావునా మాతృభాషలో విద్య ఐచ్చికంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం బలపడుతుంది.

సాదారణ పరిస్థితులలో అంటే ప్రాధమికంగా మాతృభాషలో విద్య అందించి, అవగాహన చేసుకునే బలం పెరిగే కొలది ఐచ్చిక భాషలో విద్యా బోధన మంచి ఫలితం ఇవ్వగలదని ఆశించవచ్చు అంటారు.


అమ్మదగ్గర నేర్చుకునే మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?


అమ్మ దగ్గర ఏ భాష ద్వారా వివిధ విషయాలను తెలుసుకుంటూ ఉంటామో? తమ తమ కుటుంబాలలో ఎప్పుడూ మాట్లాడే వాడుక భాష హిందీ అయితే వారికి మాతృభాష హిందీ భాష అవుతుంది. అలాగే పుట్టినప్పటి నుండి తమిళం మాట్లాడేవారికి, మాతృభాష తమిళం అవుతుంది. అలాగే కుటుంబలోనూ, సమాజంలోనూ వాడుక భాష తెలుగుభాష అయితే అదేవారికి మాతృభాష. అలా తెలుగులోనే మాట్లాడేవారికి తెలుగు భాష మాతృభాష


ముందుగా చెప్పుకున్నట్టే… మాతృభాషలో అందరికీ అవగాహన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా అవగాహన ఎలా ఉంటుందో, అలానే విద్యాబోధన ఉపాధ్యాయులు చేస్తూ ఉంటారు. కారణం ఏవిధంగా విద్యార్ధికి పాఠం చెబితే, అర్ధం అవుతుందో, ఆవిధంగానే పాఠాలు బోధిస్తూ, విద్యార్ధులకు విద్యను అందిస్తారు. కావునా ఈ దృష్టికోణంలో ఆలోచిస్తే, మాతృభాషలో విద్యను సమర్ధించవచ్చును.


మాతృభాషలో విద్యతో బాటు ఇతర భాషలలో పట్టుకూడా అవసరం.


మనకు తెలిసిన భాషలోనే సమాజం అంతా ఉండదు. సమాజంలో అందరూ ఉండరు. సమాజంలో అన్ని పనివిధానాలు ఉండవు. ఇక ప్రాంతాలు మారితే మాట్లాడే భాష కూడా మారుతుంది. కావునా మాతృభాష మనకు అవగాహన చేసుకోవడం సులభం అయితే, ఇతర భాషల వలన ఇతర ప్రాంతాలలో కూడా మనం సంభాషించగలం.


కాబట్టి మాతృభాషలో పట్టు పెంచుకుంటూ, ఇతర భాషలలోనూ పట్టు సాధించడం వలన అనుషంగిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగరిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇతర భాషలలో మాట్లాడవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రయాణాలలో కూడా ఇతర ప్రాంతాలకు చేరితే, అక్కడ ఇతరులతో సంభాషించడానికి, ఆ ప్రాంతపు భాష అవసరం లేదా జాతీయ భాష అవసరం.


కనుక మాతృభాషతో పాటు జాతీయ భాష హిందీ కూడా వచ్చి ఉండడం వలన దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగం నిర్వహించగలుగుతాము. అంతర్జాతీయ భాష ఇంగ్లీషు కూడా మనకు ప్రధానం.


ప్రతి విద్యార్ధికి మూడు భాషలు మన విద్యాబోధనలలో ఉన్నాయి. ఒక్కటి మాతృభాష, రెండు జాతీయ భాష, మూడు అంతర్జాతీయ భాష.


తెలుగు రాష్ట్రాలలో విద్యా బోధనలలో భాషలు



  1. ఒకటవ భాష గా తెలుగు

  2. రెండవ భాషగా హిందీ

  3. మూడవ భాష ఇంగ్లీషు

  4. తర్వాత సబ్జెక్టులు ఉంటాయి.


అలాగే ఇతర భాషలలో కూడా ఒకటవ భాష వారి ప్రాంతపు వాడుక భాష ఉంటే, రెండవ భాషగా హిందీ, మూడవ భాష ఇంగ్లీషు తర్వాతి వరుసలలో సబ్జెక్టులు ఉంటాయి.


అంటే అందరికీ మాతృభాష ప్రధానంగా పట్టు ఉండాలి. తర్వాతి మిగిలిన భాషలలో పట్టు ఉండాలి. సబ్జెక్టులు వచ్చి ఉండాలి అని విద్యాబోధన పద్దతిలోనే కనబడుతుంది.


ధన్యవాదాలు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు.

అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన మాటలే కాదు పద్యాలు పలికిన మహానుభావులు మన తెలుగు పూర్వీకులు.

మన కవులు అందించిన కవిత్వంలోని మాధుర్యం ఆస్వాదించాలంటే, తెలుగు భాషలో పరిజ్ఙానం అవసరం.

హితము చేయు తెలుగు సాహిత్యం రీడ్ చేయడానికి తెలుగు భాష తెలుసుకో

రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, దైవ మూలం తెలుసుకోవాలంటే, అవసరమైన తత్వజ్ఙానం మన మాతృభాషలోని తెలుగు రచనలు రీడ్ చేయడం వలననే సాధ్యం… కాబట్టి తెలుగు తెలుసుకో… తెలుసుకో మన తెలుగు భాష గొప్పతనం.

యోగి వేమన పద్యాలు మన వాడుక భాషలో ఉన్నట్టుగా ఉంటాయి. అందరికీ అర్ధం రీతిలో పద్యాలలో పదాలు ఉంటాయి. కానీ ఆ మాటలలో మనిషి మనసులో ఆలోచనలను సృష్టించగలవు.

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ

చూడటానికి ఉప్పు – కర్పూరము ఒకే రంగులో ఉంటాయి కానీ రుచులు చూడగా వేరుగా ఉంటాయి. అదే తీరున పురుషులలో పుణ్య పురుషులు వేరు… వారి మనసుతో పరిచయం పెరిగితేనే వారి వ్యక్తిత్వం గోచరమవుతుంది…. వేమన తెలుగు పద్యాలలో వ్యక్తి, వ్యక్తిత్వం, వ్యవస్థలో విషయాలపనలు ఎన్నో అంశాలలో ఆలోచనలు రేకెత్తించేవిధంగా పదాలు ఉంటాయి.

తెలుసుకుంటేనే కదా తెలుగు పదాలలోని తత్వం

తెలుగులో తెలుసుకుంటేనే కదా తెలుగు పదాలలోని తత్వం బోధపడేది. మన వాడుక భాషలోని తెలుగు పదాలకు సరిగ్గా అర్ధం తెలియకుండానే కొన్ని తెలుగు పదాలు వాడేస్తూ ఉంటామని అంటారు.

తెలుగువారలమైనందులకు ఆనందించిన మన మహానుభావులు అనేకమంది కవులుగా ఎన్నెన్నో అద్భుత రచనలు చేశారు. తెలుగు భాషలోకి అనువాదాలు చేశారు. మన తెలుగువారికి తత్వం తెలియాలంటే తెలుగు సాహిత్యంలోని ఎందరో రచనలు ఉపయోపడతాయని అంటారు.

ముఖ్యంగా వ్యక్తి జీవనలక్ష్యం అయిన పరమపదం గురించిన తత్వం భక్తిరూపంలో తెలియబడాలంటే భాగవతమే అవసరం అంటారు. అటువంటి భాగవతమును మన మహనీయుడైన బమ్మెర పోతనామాత్యులు సంస్కృతం నుండి తెలుగులో తర్జుమా చేశారు. పోతనామాత్యుడి తెలుగు పద్యాలు మంత్రసమానమని పెద్దలు భావిస్తారు.

తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు తెలుగు గురించి మరింతగా

వ్యక్తిగా ఆచరణలో శ్రీరాముడిని ఆదర్శప్రాయుడు అని అంటారు. అటువంటి శ్రీరామడు గురించి తెలియబడే శ్రీరామాయణం వచనం చదవడానికి తెలుగు చదవడం వచ్చి ఉంటేనే కదా పురాణ పురుషుడి మనోగతం పుస్తక రూపం నుండి మన మనసులోకి చేరేది.

ఒక వ్యక్తికి కర్తవ్య బోధ చేయడంలోనూ, జీవన్ముక్తి జ్ఙానం అందించడంలో ప్రధమంగా కనబడే గ్రంధం భగవద్గీత… తెలుగు తెలిసి ఉంటే కదా భగవద్గీతలో భగవానుడు బోధించిన విజ్ఙానం తెలియబడేది. విషయ పరిజ్ఙానం తెలుసుకోవడానికి విషయాలు మనసు నుండి వేరు బడటానికి భగవద్గీత ఒక గొప్ప గ్రంధమని చెప్పబడుతుంది.

మనిషి శరీరం అలసినప్పుడు మనసు విశ్రాంతికి త్వరగా ఉపక్రమిస్తుంది. మనిషి శరీరానికి పని తక్కువ ఉంటే, అలుపు లేని మనసు ఆలోచనల్లో అదుపు తప్పితే, అది అశాంతితో చెలిమి చేస్తుంది. అటువంటి మనసుపై నియంత్రణ రావాలంటే మాత్రం మన తెలుగులో ఉండే తాత్విక పరిజ్ఙానమే మందు అంటారు. అటువంటి భక్తి, జ్ఙాన, వైరాగ్య జ్ఙానము మన తెలుగు పుస్తకాలలో ఇమిడి ఉంటే, వాటిని చదివి అవగాహన చేసుకోవడానికి తెలుగు భాషలో పరిజ్ఙానం అవసరమే కదా….

తెలుగు వాడివైనందుకు తెలుగు భాషలో మరింత పట్టు పెంచుకో

ఇంగ్లీషు భాష మాట్లాడడం వలన సమాజంలో మెరుగైన ఉపాధి పొందవచ్చును. మాథ్స్ బాగా నేర్చుకోవడం వలన మంచి ఉపాధి పొందవచ్చును. అలాగే ఇతర సబ్జెక్టులలో మంచి పరిజ్ఙానం పెంచుకోవడం వలన మంచి ఉపాధి అవకాశాలు పెరగవచ్చును. కానీ మన వాడుక భాష మరియు మాతృభాష అయిన తెలుగు పుట్టినప్పటి నుండి మనతో ఉంది. దానిలో పరిజ్ఙానం పెంపొందించుకుంటే, అవగాహన ఏర్పరచుకోవడం మనసుకు మరింత సులభదాయకంగా ఉంటుంది.

తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు తెలుగు భాషలో మరింతగా పట్టు పెంచుకో… మన పూర్వీకులు మనకోసం అందించిన జ్ఙానమంతా పుస్తకరూపంలో ఉంటే, అది ఆన్ లైన్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. తెలుగు పుస్తకాలు రీడ్ చేసి పరిజ్ఙానం పెంపొందించుకోవడానికి తెలుగు భాషలో పట్టు పెంచుకో… అవసరమైన విజ్ఙానం తెలుగు పుస్తకాలలో లభిస్తుంది.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు కూడా అమ్మ సంతోషం కోసం అమ్మ చేత కట్టబడ్డాడు… కాబట్టి తల్లి సంతోషం కన్నా కొడుకు సాధించేదేముంటుంది?

ఛత్రపతి శివాజీ ఎందుకు అంత గొప్పగా కీర్తిస్తున్నాము? అంటే ఆయన ఆచరణలో విన్నది చేసి చూపించాడు. తన తల్లి చెప్పిన మంచి విషయాలు గుర్తు పెట్టుకుని ప్రవర్తించాడు. రాజు తలచుకుంటే చేయలేనిదేముంటుంది? కానీ అటువంటి రాజు విశృంకలంగా ఉండకుండా పరస్త్రీయందు పరదేవతా మూర్తిని దర్శించాడు. అందుకే మంచి మాట చెప్పినవాని కంటే, మంచి మాటను ఆచరించి చూపినవాడిని లోకం కీర్తిస్తుంది. ఎంతకాలం అంటే మంచిమాట అవసరం అయిన ప్రతిసారీ మంచి మాటను ఆచరించి చూపించిన వారినే ఆదర్శంగా చూపుతుంది.

పరస్త్రీని మాతృభావనతో చూడాలని తెలిసి, అలా చూడకుండా పరదేవతా స్వరూపమైన సీతమ్మను కామదృష్టితో చూడబట్టి రావణాసురుడంతడివాడు నశించిపోయాడు. కానీ కలియుగంలో కూడా రాజుగా పుట్టి, రాచరికంలో పెరిగిన బాలుడు మాతృభావనతో ఎదిగాడు. మాతృభావనతో అతని మనసు నిండిపోయింది. కాబట్టి మాతృభావన అతనిని ఉద్దరించింది. లేదంటే అతని కాలంలో జీవించి, కాలంలో గడిచిపోయిన ఎందరో రాజులులాగానే శివాజీ మహరాజ్ కూడా మిగిలిపోయేవాడు… కానీ మాతృభావనతో ఇతర స్త్రీలయందు మాతృత్వమును దర్శించాడు కాబట్టే ఆయన శరీరంతో లేకపోయినా లోకంలో మాతృభావన అంటే శివాజీ మహారాజ్ గుర్తుకు వచ్చే విధంగా మన మనసులోకి చేరుతున్నాడు.

మాతృభావన శివాజీకి ఎలా ఏర్పడింది?

శివాజీకి ఎలా ప్రేరణ కలిగింది ? అని ఆలోచన అనవసరం. శివాజీ స్త్రీలయందు ప్రవర్తించిన ప్రవర్తన వలన అతను పాఠ్య పుస్తకంలో ఒక పాఠ్యాంశముగా ఉన్నాడు. లోకంచేత కీర్తింపబడుతూనే ఉన్నాడు.

జీవితాన్ని ఉద్దరించుకోవడానికే కదా తల్లిదండ్రుల కష్టపడుతూ పిల్లలను పెంచి పోషిస్తారు. లేదంటే వారు పిల్లలు వద్దనుకుంటే స్త్రీకి మరణతుల్యమైన యాతన ఉండదు. జీవితాంతము కష్టపడుతూ ఉండాల్సిన ఆగత్యం తండ్రికి ఉండదు. అయినా వారు తమ జీవితాలను పిల్లల కనడానికి, వారిని పెంచి పోషించడానికి ప్రధాన కారణం జీవితం ఉద్ధరింపబడాలనే ధర్మం గురించే.

పిల్లల జీవితం నలుగురిలో గొప్పగా ఉండాలనే బలమైన కాంక్షతోనే పిల్లలను పెంచి పోషిస్తారు. వారు లేనప్పుడు కూడా పిల్లలు తగు గౌరవంతో సమాజంలో జీవించాలనే కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులకు ఆనందదాయకమైన కొడుకులే సమాజం చేత కీర్తింపబడతారు.

ప్రధాని కావాలన్న ఆశయం అందరికీ నెరవేరదు. ముఖ్యమంత్రి కావాలన్న ఆశయం అందరికీ నెరవేరదు. అలా కొందరికే పరిమితం అయ్యే పదవులు ఉంటాయి…. కానీ మాతృహృదయంలో ప్రతి కొడుకుకు స్థానం ఉంటుంది. అంటే లోకంలో అందరికీ కామన్ గా ఒక సదాశయం ఉండే అవకాశం ఉంది… అదే తల్లిహృదయంలో మంచి స్థానం. ఎప్పుడు తల్లి సంతోషిస్తుందంటే తనలాంటి స్త్రీకి కూడా తన కొడుకు గౌరవించినప్పుడే… పరస్త్రీయందు తల్లిని దర్శిస్తున్ననాడు, అతడిని కన్నతల్లి మిక్కిలి సంతోషిస్తుంది. ఇంకా అలాంటివారు ఎక్కువగా ఉండడం వలన ప్రకృతి స్వరూపం అయిన స్త్రీ సంతోషంగా జీవించగలుగుతుంది. స్త్రీ సంతోషంగా మనగలగడమే మంచి సమాజం.

మాతృభావన బలమైన ఆశయంగా అందరిలో ఉన్నప్పుడే శివాజీ మాతృభావనకు మనం వారసలుగా ఉండగలం. మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? శివాజీ మాతృభావనతో ఉంటే ఒక రాజ్యం అంతా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ మాతృభావనతో ఉంటే ప్రతి కుటుంబంలోనూ సంతోషాలు పెరుగుతాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో… తెలుగు సామెతలలో పదాలు పదునైన మాటలను కలిగి ఉంటాయి.

మాటలు మనసును తాకుతాయి. మాటలు మనసును కదిలిస్తాయి. మాటలు మనసును బాధిస్తాయి. మనసుకు ఓదార్పు అవుతాయి.

ఒక వ్యక్తి తన మాటల ద్వారా నలుగురిని కలుపుకోవచ్చు. మనిషికి మాటల ద్వారా తగువులు పెరుగుతాయి. మనిషి మాటల ద్వారా మనిషి మరింతమందికి దూరం అవ్వవచ్చు… దగ్గరకావొచ్చు… మాట అంత శక్తివంతమైనది.

అలాంటి మాటలు పెద్దల ద్వారా చమత్కారంగా చలోక్తులుగా వినబడుతూ ఉంటాయి. అలాంటి మాటలలో ఎంతో అర్ధం వెతకవచ్చు అంటారు.

మాటల ఒక మనసులోని భావము చక్కగా ఎదుటివారి మనసులోకి ప్రవేశింపజేయవచ్చు. మాటలు అంతటి ప్రభావవంతమైనవి.

అంతటి ప్రభావం చూపగలిగే మాటలు కొన్ని వ్యాక్యాలుగా చాలా సార్లు వింటూ ఉంటాము. కొన్ని చోట్ల ఎక్కడో గోడపై చదువుతూ ఉంటాం…

అలా మనసుపై ప్రభావం చూపగలిగే మాటలు వ్యాక్యాలుగా వ్రాసి ఉంటాం. అలా కొన్నిసార్లు పదునైన మాటలు పదాలుగా ఉండే వ్యాక్యాలు…

కొన్ని సార్లు చక్కని చమత్కార మాటలు పదాలుగా గలిగి వ్యాక్యాలుగా ఉంటాయి.

మరి కొన్ని సార్లు నిష్టూరపు మాటలు పదాలుగా గలిగి వ్యాక్యాలుగా ఉంటాయి…

భిన్నమైన భావనలను కలిగించే మాటలు కూడా పదాలుగా ఉండే వ్యక్యాలు కూడా ఉంటాయి…..

ఇలాంటి మాటలు కలిగి ఉండి, మనసులో ఆలోచనను రేకెత్తించే వ్యక్యాలు సామెతలుగా ఉంటాయి. అలాంటి తెలుగు సామెతల గురించి….

సామెతలు ఏదో సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏదో స్వభావ లోపాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏదో సామాజిక మూస పద్దతిని తెలుపుతూ ఉంటాయి.

ఒక్కోసారి ఏదో విధానమును తెలుపుతూ ఉంటాయి. ఒక్కోసారి మనసును కదిలిస్తాయి. కాలం విలువను తెలియజేస్తాయి. మాట విల్వాను తెలియజేస్తాయి. స్వభావాన్ని ప్రశ్నిస్తాయి…. సామెతలు మనసుపై ప్రభావం చూపేవిధంగా ఉంటాయి.

ముఖ్యంగా తెలుగు సామెతలు సందర్భానుసారం వాడుతూ ఉంటారు.

అంటే కాలంలో అప్పటి సమయం, ఆ సమయంలో పరిస్థితులు బట్టి కొందరు ఉపయోగించే సామెతలు ఆలోచింపజేస్తాయి.

కరోన కాలంలో కేవలం పనిని మాత్రమే చేసుకుంటాను… అని ఏమాత్రం కోవిడ్ నియమాలు పట్టించుకొని వ్యవస్థ దగ్గర పని చేయడానికి సిద్దపడేవారు ఉంటే, వారి దగ్గర “కొరివితోతలగోక్కున్నట్లు” అనే సామెత అతికినట్టు సరిపోతుంది.

లాక్ డౌన్ వేల పనికి పోతాను అంటే “బతికుంటేబలుసాకుతినవచ్చు” అను సామెత… అంటే ఏదైనా పరిస్థితులను కూడా గుర్తు చేస్తూ సామెతల ప్రభావం మనసుపై ఉంటుంది.

పెద్దలమాట చద్దిమూట అను ఒక సామెత ఉంది.

పెద్దలమాట చద్దిమూట అంటే అనుభవం కలిగి ఉన్న వారి మాట ఎంత బలమైనదో తెలియజేయడానికి ఈ సామెత చెబుతారు. పుద్దుటే తినే చద్ది అన్నం బలం అని అంటారు. అలాంటి బలంతోనే పెద్దలమాటను పోల్చారు.

అయితే ఇక్కడ పెద్దలంటే చేస్తున్న పనులలో పూర్వానుభవం కలిగి ఉన్నవారు. పూర్వకాలం వయసుతోబాటు పనులు చక్కగా సాగుతూ ఉండడం వలన పెద్దలకు ఎక్కువ విషయాలు తెలిసి ఉండేవి. మారిన కాలంలో చదువులు మారాయి. వయసుతో సంబంధం లేకుండా విషయావగాహన ఉంటుంది.

అనుభవజ్నుల మాట వినడంవలన పనులలో ఆటంకాలు ఏర్పడకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు… ఈ పెద్దలమాట చద్దిమూట నుండి గ్రహించవలసిన విషయం.

తెలుగులో తెలుగు సామెతలు

పెద్దలమాట చద్దిమూట

ఆహారానికి ముందు వ్యవహారానికి వెనుక

అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు

అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

అభ్యాసం కూసు విద్య

అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

అయితే ఆదివారం కాకుంటే సోమవారం

ఇల్లు పీకి పందిరేసినట్టు

అనువు గాని చోట అధికులమనరాదు

ఇంట గెలిచి రచ్చ గెలువు

ఆడి తప్పరాదు పలికి బొంకరాదు

అతి రహస్యం బట్టబయలు

కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

కుక్క కాటుకు చెప్పుదెబ్బ

ఎనుబోతు మీద వాన కురిసినట్టు

నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

ఆది లొనే హంస పాదు

పిట్ట కొంచెము కూత ఘనము

మీసాలకు సంపంగి నూనె

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

వాన రాకడ ప్రాణపోకడ

చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

కందకు లేని దురద కత్తిపీటకెందుకు

కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు

ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట

కోటి విద్యలు కూటి కొరకే

ఆరోగ్యమే మహాభాగ్యము

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

ఆకాశానికి హద్దే లేదు

ఆవు పొలంలో మేస్తే, దూడ గట్టుపై మేస్తుందా?

“అబద్ధము ఆడితే అతికినట్లు ఉండాలి”

అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకుంఠం

అగ్నికి గాలి తొడైనట్లు

ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

ఆలస్యం అమృతం విషం

అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు

అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట

ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు

ఆకలిరుచియెరుగదు,నిద్రసుఖమెరుగదు

అప్పుచేసిపప్పుకూడు

బెల్లంకొట్టినరాయిలా

ఆరిపోయేదీపానికివెలుగుయెక్కువ

భక్తిలేనిపూజపత్రిచేటు

అందితేజుట్టుఅందకపోతేకాళ్ళు

“ఏఎండకుఆగొడుగు”

చాదస్తపుమొగుడుచెబితేవినడు,గిల్లితేఏడుస్తాడు

చేతకానమ్మకేచేష్టలుఎక్కువ

అడగందేఅమ్మైనాపెట్టదు

అయ్యవారినిచెయ్యబొతేకోతిబొమ్మఅయినట్లు

చాపకిందనీరులా

అయ్యవచేవరకుఅమావాస్యఆగుతుందా

అంగట్లోఅన్నీఉన్నా,అల్లుడినోట్లోశనిఉన్నట్లు

బూడిదలోపోసినపన్నీరు

బతికుంటేబలుసాకుతినవచ్చు

చెరువుకినీటిఆశ,నీటికిచెరువుఆశ

చదివేస్తేఉన్నమతిపోయినట్లు

దరిద్రుడిపెళ్ళికివడగళ్ళవాన

చచ్చినవానికండ్లుచారెడు

చింతకాయలుఅమ్మేదానికిసిరిమానంవస్తే,ఆవంకరటింకరవియేమికాయలనిఅడిగిందట

చక్కనమ్మచిక్కినాఅందమే

డబ్బుకులోకందాసోహం

చేతులుకాలినాకఆకులుపట్టుకున్నట్లు

విద్యలేనివాడువింతపశువు

చీకటికొన్నాళ్ళు,వెలుగుకొన్నాళ్ళు

దూరపుకొండలునునుపు

దెయ్యాలువేదాలుపలికినట్లు

చిలికిచిలికిగాలివానఅయినట్లు

ఎవరికివారేయమునాతీరే

ఈతకుమించినలోతేలేదు

దురాశదుఃఖమునకుచెటు

దున్నపోతుమీదవర్షంకురిసినట్లు

చెడపకురాచెడేవు

దొంగకుతేలుకుట్టినట్లు

ఎవరుతీసుకున్నగోతిలోవారేపడతారు

చింతచచ్చినాపులుపుచావలేదు

గోరుచుట్టుమీదరోకలిపోటు

గంతకుతగ్గబొంత

గుడ్డువచ్చిపిల్లనువెక్కిరించినట్లు

దేవుడువరంఇచ్చినాపూజారివరంఇవ్వడు

గుడ్డియెద్దుజొన్నచేలోపడినట్లు

దాసునితప్పుదండంతోసరి

గాడిదసంగీతానికిఒంటెఆశ్చర్యపడితే,ఒంటెఅందానికిగాడిదమూర్ఛపోయిందంట

దిక్కులేనివాడికిదేవుడేదిక్కు

దొంగకుదొంగబుద్ధి,దొరకుదొరబుద్ధి

గతిలేనమ్మకుగంజేపానకము

గురువుకుపంగనామాలుపెట్టినట్లు

తిన్నఇంటివాసాలులెక్కపెట్టినట్లు

గుడినీగుడిలోలింగాన్నీమింగినట్లు

ఇంటికన్నగుడిపదిలం

గుమ్మడికాయలదొంగఅంటేభుజాలుతడుముకొన్నాడట

కాచినచెట్టుకేరాళ్ళదెబ్బలు

కాకిముక్కుకుదొండపండు

గాజులబేరంభోజనానికిసరి

ఇసుకతక్కెడపేడతక్కెడ

కాలుజారితేతీసుకోగలముకానినోరుజారితేతీసుకోగలమా

కాసుంటేమార్గముంటుంది

గుడ్డికన్నామెల్లమేలు

కలకాలపుదొంగఒకనాడుదొరుకును

కలిమిలేములుకావడికుండలు

గుడిమింగేవాడికినందిపిండీమిరియం

కంచుమ్రోగునట్లుకనకంబుమ్రోగునా!

గుడ్లమీదకోడిపెట్టవలే

కాగలకార్యముగంధర్వులేతీర్చినట్లు

గుర్రముగుడ్డిదైనాదానాలోతక్కువలేదు

జోగిజోగిరాజుకుంటేబూడిదరాలిందంట

కాకిపిల్లకాకికిముద్దు

ఇంటిదొంగనుఈశ్వరుడైనాపట్టలేడు

ఇంటిపేరుకస్తూరివారువీధిలోగబ్బిలాలకంపు

కాలంకలిసిరాకపోతేకర్రేపామైకాటువేస్తుంది

కొత్తఅప్పుకుపొతేపాతఅప్పుబయటపడ్డదట

కడుపుచించుకుంటేకాళ్ళపైనపడ్డట్లు

కొత్తబిచ్చగాడుపొద్దుయెరగడు

కుడుముచేతికిస్తేపండగఅనేవాడు

కలిసివచ్చేకాలంవస్తే,నడిచివచ్చేకొడుకుపుదతాదు

కోతివిద్యలుకూటికొరకే

కంచేచేనుమేసినట్లు

కుక్కవస్తేరాయిదొరకదురాయిదొరికితేకుక్కరాదు

కృషితోనాస్తిదుర్భిక్షం

కూసేగాడిదవచ్చిమేసేగాడిదనుచెరిచిందిట

సామెతలలో అర్ధవంతమైన మాటలు కలిగిన పదాలు ఉంటాయి

కోతికికొబ్బరిచిప్పఇచ్చినట్లు

కీడెంచిమేలెంచమన్నారు

కొరివితోతలగోక్కున్నట్లు

ఎప్పుడూఆడంబరంగాపలికేవాడుఅల్పుడు

కొండల్లేవచ్చినఆపదకూడామంచువలేకరిగినట్లు

కందకుకత్తిపీటలోకువ

కందెనవేయనిబండికికావలసినంతసంగీతం

కరవమంటేకప్పకుకోపంవిడవమంటేపాముకుకోపం

మెరిసేదంతాబంగారంకాదు

కొండనాలికకిమందువేస్తేఉన్ననాలికఊడినట్లు

లేనిదాతకంటేఉన్నలోభినయం

కొండనుతవ్వియెలుకనుపట్టినట్లు

కొన్నదగ్గిరకొసరుగానికోరినదగ్గరకొసరా

మనిషిమర్మముమానుచేవబయటకుతెలియవు

కూటికిపేదైతేకులానికిపేదా

మంత్రాలకుచింతకాయలురాల్తాయా

కోతిపుండుబ్రహ్మాండం

మనిషికొకమాటపశువుకొకదెబ్బ

కొత్తొకవింతపాతొకరోత

మొరిగేకుక్కకరవదు

ముల్లునుముల్లుతోనేతీయాలివజ్రాన్నివజ్రంతొనేకొయ్యాలి

మనిషికిమాటేఅలంకారం

ముందుకుపోతేగొయ్యివెనుకకుపోతేనుయ్యి

క్షేత్రమెరిగివిత్తనముపాత్రమెరిగిదానము

నోరుమంచిదయితేఊరుమంచిదవుతుంది

నేతిబీరకాయలోనెయ్యియెంతఉందోనీమాటలోఅంతేనిజంఉంది

మొక్కైవంగనిదిమానైవంగునా

లోగుట్టుపెరుమాళ్ళకెరుక

ముందరకాళ్ళకిబంధాలువేసినట్లు

మంచమున్నంతవరకుకాళ్ళుచాచుకో

నీచెవులకురాగిపొగులేఅంటేఅవీనీకులేవేఅన్నట్లు

మందియెక్కువయితేమజ్జిగపలచనఅయినట్లు

నిజంనిప్పులాంటిది

మనిషిపేదఅయితేమాటకుపేదా

ఏకుమేకైనట్టు

మెత్తగాఉంటేమొత్తబుద్ధిఅయ్యిందట

మనిషికొకతెగులుమహిలోవేమాఅన్నారు

నూరుగుర్రాలకుఅధికారిఐనాభార్యకుయెండుపూరి

మీబోడిసంపాదనకుఇద్దరుపెళ్ళాలా

నెల్లాళ్ళుసావాసంచేస్తేవారువీరుఅవుతారు

పచ్చకామెర్లువచ్చినవాడికిలోకంఅంతాపచ్చగాకనపడినట్లు

పేనుకుపెత్తనమిస్తేతలఅంతాకొరికిందట

మొసేవానికితెలుసుకావడిబరువు

నూరుగొడ్లుతిన్నరాబందుకైనాఒకటేగాలిపెట్టు

ముందుందిమొసళ్ళపండుగ

ఊరంతాచుట్టాలుఉత్తికట్టతావులేదు

నిండుకుండతొణకనట్టు

ముంజేతికంకణముకుఅద్దముయెందుకు

నడమంత్రపుసిరినరాలమీదపుండు

పట్టిపట్టిపంగనామంపెడితేగోడచాటుకువెళ్ళిచెరిపివేసుకున్నాడట

నక్కకినాగలోకానికిఉన్నంతతేడా

నవ్వునాలుగువిధాలాచేటు

పనిలేనిమంగలిపిల్లితలగొరిగినట్లు

నిదానమేప్రధానము

పోరానిచోట్లకుపోతేరారానిమాటలురాకపోవు

రామేశ్వరంవెళ్ళినాశనేశ్వరంవదలనట్లు

నిమ్మకునీరెత్తినట్లు

శుభంపలకరాయెంకన్నాఅంటేపెళ్ళికూతురుముండఎక్కడఅన్నాడంట!

నిజంనిప్పులాంటిది

తంతేగారెలబుట్టలోపడ్డట్లు

ఎక్కడైనాబావకానీవంగతోటదగ్గరమాత్రంకాదు

చంకలోపిల్లవాడినిఉంచుకునిఊరంతావెతికినట్టు

ఒకఒరలోరెండుకత్తులుఇమడవు

ఊపిరిఉంటేఉప్పుఅమ్ముకొనిబ్రతకవచ్చు

బతికిఉంటేబలుసాకుతినవచ్చు

తెగేదాకలాగవద్దు

పాకిదానితొసరసమ్కంటేఅత్తరుసాయిబుతోకలహంమేలు

పాముకాళ్ళుపామునకెరుక

పాపమనిపాతచీరఇస్తేగోడచాటుకువెళ్ళిమూరవేసిందట

సింగడుఅద్దంకిపోనూపొయ్యాడురానూవచ్చాడు

పండితపుత్రఃశుంఠ

ఉల్లిచేసినమేలుతల్లికూడచేయదు

పరిగెత్తిపాలుతాగేకంటేనిలబడినీళ్ళుతాగడంమేలు

ఉరుముఉరుమిమంగళంమీదపడ్డట్టు

పెదిమదాటితేపృథివిదాటును

పెళ్ళంటేనూరేళ్ళపంట

పెళ్ళికివెళుతూపిల్లినిచంకనపెట్టుకువెళ్ళినట్టు

తాళిబొట్టుబలంవల్లతలంబ్రాలవరకుబతికాడు

పెరుగుతోటకూరలోపెరుగుయెంతఉందోనీమాటలోఅంతేనిజంఉంది

పిచ్చికోతికితేలుకుట్టినట్లు

పిచ్చోడిచేతిలోరాయిలా

పిల్లిశాపాలకుఉట్లుతెగుతాయా

పిల్లికిచెలగాటంయెలుకకుప్రాణసంకటం

పిండికొద్దీరొట్టె

పిట్టకొంచెముకూతఘనము

పోరునష్టముపొందులాభము

ఉత్తికెక్కలేనమ్మస్వర్గానికెక్కినట్టు

పొర్లించిపొర్లించికొట్టినమీసాలకుమన్నుకాలేదన్నదట

పుణ్యంకొద్దీపురుషుడు,దానంకొద్దీబిడ్డలు

పువ్వుపుట్టగానేపరిమళించినట్లు

రాజుగారిదివాణంలోచాకలోడిపెత్తనము

రామాయణంలోపిడకలవేట

రమాయణంఅంతావినిరాముడికిసీతయేమౌతుందిఅనిఅడిగినట్టు

వినాశకాలేవిపరీతబుద్ధి

రెడ్డివచ్చేమొదలుపెట్టుఅన్నట్టు

రొట్టెవిరిగినేతిలోపడ్డట్లు

రౌతుకొద్దీగుర్రము

ఋణశేషంశత్రుశేషంఉంచరాదు

ఏకులుపెడితేబుట్టలుచిరుగునా

సంతొషమేసగంబలం

సిగ్గువిడిస్తేశ్రీరంగమే

ఎద్దుపుండుకాకికిముద్దు

శివునిఆజ్ఞలేకచీమైనాకుట్టదు

వీపుమీదకొట్టవచ్చుకానికడుపుమీదకొట్టరాదు

శ్వాసఉండేవరకుఆశఉంటుంది

తాచెడ్డకోతివనమెల్లచెరిచిందట

తాడితన్నువానితలతన్నేవాడుఉంటాడు

వెర్రివెయ్యివిధాలు

తానుపట్టినకుందేలుకుమూడేకాళ్ళు

తాటాకుచప్పుళ్ళకుకుందేళ్ళుబెదురుతాయా

తాతకుదగ్గులునేర్పినట్టు

తేలుకుపెత్తనమిస్తేతెల్లవార్లూకుట్టిందట

తనకోపమేతనశత్రువు

తన్నుమాలినధర్మముమొదలుచెడ్డబేరము

ఉపకారానికిపోతేఅపకారమెదురైనట్లు

తప్పులువెదికేవాడుతండ్రిఒప్పులువెదికేవాడువోర్వలేనివాడు

తీగలాగితేడొంకఅంతాకదిలినట్లు

వాపునుచూసిబలముఅనుకున్నాడట

తిక్కలోడుతిరణాళ్ళకువెలితేఎక్కాదిగాసరిపొయిందంట

తినేముందురుచిఅడుగకువినేముందుకథఅడుగకు

తినగాతినగాగారెలుచేదు

తింటేగారెలుతినాలివింటేభారతంవినాలి

తియ్యటితేనెనిండిననోటితోనేతేనెటీగకుట్టేది

తెలుగులో సామెతలు చాలా చాలా ఉంటాయి. అవి ఎంతో సారవంతమైన భావాలను తెలియజేస్తూ ఉంటాయి. కాలాన్ని బట్టి పరిస్థితులపై కూడా ఆలోచింపజేసేవిధంగా సామెతలు ఉంటాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం

మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు. అటువంటి తెలుగు పుస్తకాలు చదివితే, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాష ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది.

మాతృభాష అయిన తెలుగు భాష గొప్పతనం గురించి మరింతగా

మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, తెలుగు సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి.

తెలుగు భాషలో గల పద్యములందు ఉండు అర్ధములు విశేషమైన విషయమును తెలియజేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పదాలతో నాలుగు లైన్లలో ఉండే ఈ పద్యాలలో ప్రతిపదార్ధము వచనంలో ఎక్కువగా ఉంటుంది. వీటి భావాలు విశేషమైన అర్ధమును తెలియజేస్తాయి.

అలాగే సామెతలు ఒక్క లైనులోనే ఉంటాయి…కానీ చాలా అర్ధవంతమైన భావమును వ్యంగ్యంగానూ, హాస్యంగానూ తెలియజేస్తాయి…

ఇంకా సూక్తులు కూడా కేవలం ఒక వ్యాక్యములోనే ఉంటాయి… కానీ భావము మాత్రము బలమైన అంతరార్ధమును కలిగి ఉంటాయి. మంచిగా ఆలోచించే శక్తి ఉండాలే కానీ ఒక సూక్తి చాలు మనసులో మార్పు రావడానికి… అంటారు.

అంటే ఇలా పద్యాలు, సూక్తులు, సామెతలు గమనిస్తే, చాలా తక్కువ పదాలతో ఎక్కువ భావమును ఇముడ్చుకోవడంలో తెలుగు భాష గొప్పదనం కనబడుతుందని అంటారు.

దైవచింతన, తత్వచింతన, సామాజిక పోకడలు ఇలా అన్నింటపైనా తెలుగు భాషలో తెలుగు పద్యాలు విశేషమైన భావాలను వ్యక్తపరుస్తాయి. ఇంకా ఇవి చాలా తక్కువ నిడివి గలిగిన వ్యాక్యాలతో ఉంటాయి… అవి కూడా మూడు వ్యాక్యాలు ఇంకా ఒక మకుట వ్యాక్యం కలిగి ఉంటాయి.

తెలుగు భాష గొప్పతనం అంతా భావప్రకటనలో, చాలా చిన్న చిన్న తేలికపాటి పదాలతో ఇమిడి ఉంటాయి. చిన్న చిన్న వ్యాక్యాలలోనే జీవిత పరమార్ధమును తెలియజేసే విధంగా ఉంటుంది.

స్వచ్ఛమైన మన తెలుగు భాష ఈనాటిది కాదు… మన మాతృభాష గొప్పతనం ఏనాడో పెద్దలు పుస్తకాల ద్వారా తెలియజేశారు…

మాతృభాష తెలుగు భాషలో పుస్తకం చదవడం

పురాణాలు మాతృభాషలో చదవగలిగితేనే, అవి అర్ధం అవ్వడం సులభం

మనకు తెలుగు ప్రాంతాలలోనే అనేక సంప్రదాయాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల గతంలోని సంప్రదాయం చరిత్రలో కలిసి పోయి ఉంటుంది. కానీ రచయితల వలన మనకు మన పూర్వపు సంప్రదాయల గొప్పతనం తెలియబడుతుంది. వారు తమ రచనల ద్వారా సంప్రదాయం గురించి వ్రాసిన విషయాలు గతం గురించి వివరిస్తాయి.

వాడుక భాషలో కొన్ని మాటలు వ్యాకరణార్ధములు చూస్తే, మన తెలుగు భాష విశిష్టత ఏమిటో తెలియబడుతుంది. వ్యాకరణం తెలిసినవారికి తెలుగు భాష గొప్పతనం ఏమిటో బాగా తెలిసి వస్తుంది. అందుకేనేమో… శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలలో తెలుగు లెస్స అనుంటారు.

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం లో కొద్ది పాటి వివరణ ఇవ్వడం జరిగింది…. తెలుగు భాష గొప్పతనం అంటే తెలుగు సాహిత్యం చదివితే, తెలుగు వెలుగు రుచి తెలుస్తుంది… అది స్వయంగా చదివితేనే దాని గొప్పతనం మనకు అనుభవంలోకి వస్తుంది… అంతవరకు విన్నట్టుగానూ, చదివినట్టుగానూ మాత్రమే తెలుగు భాష గొప్పతనం గురించి తెలియబడుతుంది.

పురాణాలు, ఇతిహాసాలు తెలుగు భాషలో

తెలుగు భాష గొప్పతనం గురించి మనకు మరింత అవగాహన పురాణాలు చదువుతుంటే, బాగా తెలుస్తుందని అంటారు. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ ఉండే సన్నివేశాలు వివరిస్తూ ఉండే పద్యాలలోని పదాలలో విశేషమైన అర్ధం కలిగి ఉంటాయి. ఆయా పదాలకు గల భావం అర్ధం అవుతుంటే, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది.

కవులు మనకు పురాణాలను, ఇతిహాసాలను తెలుగులోకి అనువదించారు. వారి కారణంగా మనం మన మాతృభాష తెలుగు భాషలోనే వాటిని చదువుకోగలుగుతున్నాము. మన తెలుగులో ఎందరో కవులు, ఎంతో సాహిత్యమును తెలుగు భాషలలో గ్రంధములుగా అందించారు. ఆయా గ్రంధములను చదవగలిగితే జీవితం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అటువంటి జీవన ప్రాధాన్యత మనకు బాగా తెలిసిన మాతృభాష తెలుగు భాషలోనే చదివితే, త్వరగా వాటి సారం మనసుకు చేరుతుందని అంటారు.

మన పురాణేతిహాసాలు వివిధ పాత్రలు, ఆయా పాత్రల గొప్పదనం మనకు అర్ధం అయ్యేవిధంగా తెలుగు భాషలో గొప్పగా వివరించబడి ఉంటాయి. వాడుక భాషకు బాగా దగ్గరగా ఉండే పుస్తకాల వలన మనకు రామాయణ, భారత, భాగవత గ్రంధములలో వివిధ రకాల స్వభావాలు ఎలా ఉంటాయో తెలియబడుతుంది.

తెలుగు భాష చరిత్ర గురించి

తెలుగు భాష సంస్కృతం నుండి పుట్టిందని, తెలుగు భాష ద్రావిడ భాష నుండి విడివడిందని… భిన్నాభిప్రాయాలు కనబడతాయి. భాషా పండితుల అభిప్రాయం ప్రకారం తెలుగు భాష 2400 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. సాదారణంగా మనం వాడుతున్న పేపరు, దానిపై రచించిన రచనలు వ్రాయడానికి బాల్ పెన్ పుట్టింది 150 సంవత్సరాలకు లేదా అంతకన్నా ఎక్కువగా కావచ్చును. కానీ మన ప్రాచీన గ్రంధాలు సాదారణ పేపరుపై వ్రాసినవి కావు. కాబట్టి రచనలు ప్రకారం వాస్తవికతను అంచనా వేయడం కష్టమే అవుతుంది.

వాస్తవిక విషయాలు మూల గ్రంధాలు చదివితే తెలియబడుతుందని అంటారు. అవి గ్రాంధిక తెలుగు భాషలో ఉంటాయి. రచన చేసినవారి మక్కువను బట్టి కొన్ని విషయాలు రూపాంతరం చెంది గ్రంధస్తం చేయబడతాయి కాబట్టి మూల గ్రంధాలు చదివినవారికి వాస్తవ విషయాలు తెలియబడతాయని అంటారు. కావునా తెలుగు భాష ఎప్పుడు పుట్టింది అనే దాని కన్నా భాష మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఏవిధంగా మన మాతృభాషను వృద్ది చేసుకోవాలనే ఆలోచన మెరుగు.

ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి?

ఎందుకంటే, తెలుగు భాషలో పుట్టి పెరిగాము. మన మనోభావాలు తెలుగు పదాలలో మనకు పరిచయమే. అలాంటి పదాలతో కూడిన తెలుగు భాష వలన మనకు మనోవిజ్ఙానం బాగా అర్ధం అవుతుంది. మన సంప్రదాయంలో మనోవిజ్ఙానమే అన్నింటిలోనూ నియంత్రణతో ఉండే శక్తిని అందిస్తుందని అంటారు. అంటే మనోవిజ్ఙాన గ్రంధాలు మన మనసుపై పరిశీలన చేసినవి. అవి విలువలతో కూడిన మనోవిజ్ఙానాన్ని మనకు అందిస్తాయి. విలువలతో కూడిన వైజ్ఙానిక శాస్త్రం విషయ పరిజ్ఙానంతో బాటు, మన మనసు గురించి తెలియజేస్తాయి. తెలుగు భాషలో మనో విజ్ఙాన గ్రంధాలు చదివితే, మనసు యొక్క విశిష్ఠత, మనసు యొక్క చాంచల్యం…. వంటివి తెలుస్తాయి. ముందుగా మనసు ఒక అద్భుతమైనది… దానిని నియంత్రిస్తే చాలు, జీవితం గాడిన పడుతుందనే విషయం తెలుగు భాషలో రచించిన గొప్ప రచనలు చదవడం వలన తెలియబడుతుంది. అందుకని తెలుగు భాషను నేర్చుకోవాలి అంటారు.

తెలుగు భాష మన మనసులో వెలుగు వెదజల్లుతుంది.

జీవితానికి మార్గదర్శకత్వం వహించేవారు గురువు అయితే, ఆ గురువులుగా మొదటి తల్లిదండ్రులు తర్వాత పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. ఇంకా వైవాహిక జీవితం ప్రారంభం అయ్యాక కూడా గురువు అవసరం అయితే, మొదటి స్థానంలో పుస్తకమే మెదులుతుంది. అప్పటికి విద్యాభ్యాసం పూర్తయి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార పనులలో బిజిగా ఉంటాము. కావునా అప్పుడు కూడా మనసుకు మార్గదర్శకత్వం అవసరం అయితే, గొప్ప గొప్ప పుస్తకాలు మనకు మంచి మిత్రుడులాగా ఉపయోగపడతాయి. అలాగే రామాయణ, భారత, భాగవత పుస్తకాలు గురువు వలె బోధన చేయగలవు. అవి తెలుగు భాషలో రచించిన పుస్తకాలు చదివితే, తెలుగు భాష మన మనసులో వాటి వెలుగును వెదజల్లుతుంది.

మనకు మాతృభాష అయిన తెలుగులో మనకు మార్గదర్శకత్వం వహించగలిగే పుస్తకాలు ఉంటాయి. అవి వ్యక్తిగత జీవితంలో ఒక మిత్రుని వలె ఉపయోగపడతాయని అంటారు. అలాంటి పుస్తకాలు చదవడానికి తెలుగు భాషలో కొంతమేరకు ప్రావీణ్యత ఉంటే, అద్భుతమైన తెలుగు సాహిత్యం మన మనసులోకి చేరే అవకాశం ఉంటుంది. వాటిని చదవడం కోసం తెలుగు చదువుకోవలసని అవసరం ఉంది.

తెలుగు భాష గొప్పతనం గురించి తెలియడానికి మనకు తెలుగు భాషా పండితుల రచనలు చదవాలి. అప్పుడే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు