చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా

చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా ఎగబ్రాకింది. ఇప్పుడు చాయ్ త్రాగకుండా రోజు గడపలేనివారు కూడా ఉంటారు.

అలా మనకు చాయ్ అనేది అలవాటుగా ఉంది. కొందరికి అతిగా త్రాగే అలవాటు కూడా ఉండవచ్చు.

ఛాయ్‌ చైనాలో పుట్టిందట. క్రీ.పూ. 2737వ సంవత్స‌రంలో చైనాను షెన్ నాంగ్ అనే చ‌క్ర‌వ‌ర్తి చేత చాయ్ కనుగొనబడిందట. అంటే యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనలో చాయ్ సదరు చైనా చక్రవర్తి తాగారట. అది ఎలా అంటే, గాలిలో ఎగిరి వచ్చిన కొన్ని ఆకులు, మరుగుతున్న నీటిలో పడ్డాయట. ఆ నీరు చక్రవర్తి కోసం మరిగుస్తున్నారు. అయితే నీటిలో ఆకులు పడడం ఆ సేవకురాలు గమనించలేదట. అలాగే ఆ వేడి నీటిని గోరువెచ్చగా చేసే, చక్రవర్తికి అందించిందట. అది త్రాగిన చక్రవర్తికి
ఆ గోరువెచ్చని నీటిని అలాగే తాగిన‌ చ‌క్ర‌వ‌ర్తికి ఏదో ఉత్తేజభరిత భావన కలిగిందట. తత్కారణంగా ఆ నీటిలో కలిసిందేమిటి? ఆ కలసిన ఆకుల సంగతి ఏమిటి? ఆరా తీయడం… వాటిని మరలా ఉపయోగించడంతో చాయ్ అనే ప్రక్రియ చైనాలో మొదలైనట్టు కధనాలు కనబడుతుంటాయి. తేయాకుతో టీ చేయడమ చైనాలో అలా మొదలైందట.
15వ శతాబ్దం వ‌చ్చేప్ప‌టికి చైనాలో పుట్టి పెరిగిన చాయ్ యూరోపియ‌న్ దేశాల్లో టీగా ప్రాకిందట. అలా చైనాలో పుట్టిన చాయ్ టీగా… చాయ్ గా మనందరికీ ఒక అలవాటుగా మారింది…