By | January 10, 2021

మన జాతి పిత గాంధీ గురించి తెలుగులో వ్యాసం…

గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. దేశంలో స్వాతంత్ర్యం గురించి జరుగుతున్న సమరంలో అందరి భారతీయులను ఒకతాటిపైకి తీసుకువచ్చి, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయత్వం వహించారు. సత్యము, అహింస, సహాయ నిరాకరణ వంటి ఆయుధాలతో స్వాతంత్ర్య పోరాటం జరిపించిన దేశ నాయకుడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో కృషి చేసినవారిలో అగ్రగణ్యుడు…

మోహన్ దాస్ కరంచంద్ 1869సంవత్సరంలో ఆక్టోబర్ నెలలో 2వతేదీన గుజరాత్ రాష్ట్రంలో ఫోర్ బందర్లో జన్మించారు. తండ్రి పేరు కరంచంద్ గాంధీ, పుతలీభాయి… వారిది ఆచారాలు పాటించే సభ్యకుటుంబము.

గాంధీ బాల్యం నుండి అబద్దాలకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. అప్పటి ఆచారము ప్రకారము 13ఏండ్ల వయస్సులోనే గాంధీకి కస్తూరిబాయితో పెండ్లి జరిగింది. వీరికి నలుగురు కుమారులు. గాంధీ నలుగురు కుమారుల పేర్లు హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ..

పోర్ బందర్, రాజ్ కోట్ లలో విద్యాభ్యాసం చేసిన గాంధీ 1888సంవత్సరంలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్లారు. విదేశాలకు వెళ్ళినా, వ్యసనాలకు దూరంగా ఉండడం గాంధీకే చెల్లింది. ఇంకా అనేక మతగ్రంధాలను అయన పఠించారు. న్యాయవాద పట్టభద్రుడైన గాంధీజి 1891సంవత్సరములో తిరగి స్వదేశానికి వచ్చారు.

1893సంవత్సరంలో మరలా విదేశానికి వెళ్లారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఒక లా కంపెనీలో జాయిన్ అవ్వడానికి సౌతాఫ్రికా వెళ్లారు. ఇక్కడే ఈకాలంలోనే గాంధీజి మార్పుకు బలమైన పునాదులు పడ్డాయని అంటారు. నల్లవాడు అని రైలు నుండి గెంటివేయబడిన సంఘటన గాంధీజి జీవితంలో జరిగింది. ఇంకా హోటళ్ళలోకి కూడా రానివ్వకపోవడం. అక్కడి సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం, సమస్యలను ఎదుర్కొనే పోరాటపటిమను పెంచుకోవడం ఈకాలంనే వృద్ది చేసుకున్నట్టుగా చెబుతారు.

గాంధీజి ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంధం భగవద్గీత అంటారు.

స్వాతంత్ర్య సమరంలోకి గాంధీ

1914సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజి భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో పొల్గొనడం ప్రారంభించారు. ఆనాటి ప్రధాన నాయకులలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే, గాంధీకి భారత సమస్యలు, ఇక్కడి రాజకీయాలను పరిచయం చేశారు.

అహింసయే పరమధర్మంగా భావించిన గాంధీ, తను నమ్మిన సిద్దాంతముననుసరించే స్వాతంత్ర్య ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా సత్యాగ్రహం చేయడం వంటివి ఉన్నాయి. సహాయనిరాకరణోధ్యమం, ఉప్పుసత్యాగ్రహం, స్వరాజ్యము, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలు కీలకంగా మారాయి. దేశప్రజలనుండి విశేషమైన స్పందన కూడా లభించింది. అలాగే సమాజంలో ఉన్న దురాచారాలను ఖండించడం కూడా చేసేవారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో బాగంగా గాంధీజి జైలు జీవితం కూడా అనుభవించారు. 1922 సంవత్సరంలో రెండేళ్ళు జైలులోనే గాంధీజి జీవితం సాగింది. ఈకాలంలోనే భారతీయ కాంగ్రెసులో అతివాద, మిత్రవాద వర్గాలు మద్య భేదబావం మరింత పెరిగింది. ఆ తర్వాత గాంధీజి మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో పాల్గొన్నారు.

1927వ సంవత్సరంలో గాంధజీ సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ, స్వరాజ్య ఉద్యమంలోనూ తనదైన పాత్రను నిర్వహించారు. దేశప్రజలను ఉద్యమాల బాట పట్టించిన నాయకులలో గాంధీ ప్రముఖ పాత్ర ఉంది. అందుకు తగ్గట్టుగా మార్గద్శకంగానే గాంధీజి నడుచుకునేవారు.

జాతి పిత గాంధీ గురించి ఉద్యమాలే బాగా వివరిస్తాయి.

ఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ దేశం చేపట్టిన ఉప్పుసత్యాగ్రహోద్యమం సమయంలో గాంధీజి దాదపు 400 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. అహ్మదాబాద్ నుండి దండివరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రతరం కావడంతో గాంధీతో సహా కాంగ్రెస్ కార్యవర్గం అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన సహదర్మచారిని కస్తూరిబాయి పరమపదించారు. 1944లో గాంధీజి జైలు నుండి విడుదలయ్యారు.

చివరకు బ్రిటిష్ వారు శాంతియుత స్వాతంత్ర్య సమరానికి తలొంచి స్వాతంత్ర్యం ఇవ్వడానికి అంగీకరించారు. అయితే స్వాతంత్ర్యం ఇచ్చేముందు హిందూ, ముస్లింలకు వేరు వేరు ప్రాంతాలుగా స్వాతంత్ర్యం ఇవ్వడానికి చూడడం గాంధీజికి నచ్చలేదు… కానీ చివరకు హిందూ, ముస్లింల ప్రాతిపదికనే రెండు దేశాలుగా భారతదేశం స్వాతంత్ర్యం గాంధీ నాయకత్వంలో వచ్చింది.

స్వాతంత్ర్యం వచ్చాకా గాంధీజిని గాడ్సే కాల్చి చంపడంతో ఆయన పరమపదించారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం మన ముందు తరాలవారీ జీవితాల త్యాగ ఫలితం అని గాంధీజి జీవితాన్ని చూస్తే అర్ధం అవుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు