By | June 26, 2021

మనకు అనేక తెలుగు కధలు ఉన్నాయి… అయితే కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే, కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని వ్యాక్యాలలో కధ గురించి…. ఈ తెలుగు వ్యాసంలో

కధ అంటే ఎదో ఒక సత్యమైన విషయమును తెలియజేస్తూ, కల్పనతో కూడిన వచనం గాని, వాక్కుగా గాని చెబుతారు. పరిణామం ప్రకారం కధలు చిన్న కధలు, పెద్ద కధలు, నవలలు, ఒక పేజి కధలు… అలా కొన్ని రకాలుగా కధలు ఉంటాయి.

కధలు చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి అమ్మ చెప్పే కమ్మనైన కధలు ఉంటాయి. ఇలా చిన్న పిల్లలకు అమ్మ చెప్పే కధలలో నీతికధలు కూడా ఉంటాయి. ఇంకా అవి పురాణాలలోని కధలు కావచ్చు. సమాజంలో నానుడి పొందిన కధలు కావచ్చు… కానీ అమ్మ చెప్పే కమ్మని కధలు వీనులకు విందుగా ఉంటాయి.

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

ఇంకా చిన్న పిల్లలకు అమ్మమ్మ, తాతయ్యలు కూడా ఓపికగా కధలు చెబుతూ ఉంటారు. వీరు చెప్పే కధలలో కూడా రామాయణ, భారతం లాంటి పురాణేతిహాస కధలు ఉండవచ్చు… లేక వారే కల్పించి కధను చెప్పవచ్చు.

అంతర్లీనంగా నీతిని ప్రభోదించడం

అమ్మ చెప్పినా, అమ్మమ్మ చెప్పినా కధలలో నీతి ఉంటుంది. అంతర్లీనంగా నీతిని ప్రభోదించడం ఇటువంటి కధలలో ఉంటుంది. ఇలాంటి కధలు గతంలో గద్యంగా రచించబడి ఉండవచ్చు.. లేదా ప్రసిద్ది చెందినవారి వాక్కులుగా ఉండవచ్చు..

తెలుగులో అనేక కధలు ఉన్నాయి. అవి కవులు రచించిన కధలు ఉంటాయి. ప్రసిద్ది చెందిన రచయితల కధలు దిన, వారపత్రికలలో ప్రచురితం అవుతూ ఉంటాయి.

సంభాషణలలో కధలు పుడుతూ ఉంటాయి. సరదాగా మాట్లాడుకుంటూ కధలు అల్లి చెప్పగలిగే సామర్ధ్యం ఉన్నవారు, సమాజంలో తారసపడవచ్చు…. అప్పటికప్పుడు మాటల మధ్యలోనే కధ అల్లి చెప్పేస్తారు… ఇలాంటి కధలను కట్టు కధలని అంటారు. ఇవి ఎలాగైనా ఒక విషయం గురించి ఎదుటి వ్యక్తిని ఒప్పించే ప్రయత్నంలో పుడుతూ ఉంటాయి.

కధలు ఆసక్తిగా ఉంటూ, అంతర్లీనంగా నీతిని, సుగుణాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి. సుగుణాలపై ఆసక్తి కదల వలన కూడా కలుగుతుందని అంటారు. కద అంత శక్తిని కలిగి ఉంటాయని చెబుతారు. ఇందుకు ఉదాహరణ… శివాజీ మహారాజుకు మంచి గుణాల కలగడంలో, అతనికి చిన్నతనంలో తనతల్లి చెప్పిన సాహస కధలు కారణం అంటారు.

తెలుగు కధ వృత్తాంతం బట్టి కధలను

కధలలో కధ వృత్తాంతం బట్టి కధలను కొన్ని వర్గాలుగా చెబుతారు. సాహస వీరుల గురించి తెలియజేసే కధలను సాహస కధలు అని అంటారు. ప్రక్రుతి గురించి అయితే, ప్రక్రుతి కదలని అంటారు. నీతిని ప్రధానంగా ప్రభోదిస్తూ ఉంటే నీతి కదలని అంటారు. నేర ప్రవృత్తిని తెలియజేసే కధలను క్రైం కదలని అంటారు.

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

చరిత్రను తెలుపుతూ ఉంటే, చారిత్రిక కదలని, పురాణాల నుండి వెలువడిన కధలు అయితే, పురాణ కదలని అంటారు.

కధలను చెప్పేవారిని కధకులు అంటారు. పురాణాలలో హరి గురించి తెలియజేసే కధలను చెప్పేవారిని హరిదాసు అంటారు.

కధలో ప్రధాన వ్యక్తి, కధానాయకుడు అయితే, అతనిని అనుసరించే స్త్రీని కధానాయిక అవుతుంది. కొన్ని కధలలో స్త్రీ ప్రధాన పాత్రగా ఉంటే, కధానాయికగా ఉంటే, ఇందులో కదానాయుకుడు, కధానాయికను అనుసరించేటట్టు ఉంటుంది. కధలో ప్రధానవ్యక్తి మరణిస్తే, కదా శేషుడు అంటారు. ప్రధానస్త్రీ మరణిస్తే, కదా శేషురాలు అంటారు.

అసలు కధ అనే పాదం కథ్ అనే ధాతువు నుండి పుట్టిన పదంగా చెబుతారు. ఈ కధానిక ప్రస్తావన అగ్ని పురాణంలో చెప్పబడినట్టుగా చెబుతారు.

ఇక కధలలో రకాలు…

రంగమును బట్టి కధలు ఉంటాయి. సినిమాలు నిర్మించడానికి తయారుచేసుకునే కధలు ఉంటాయి. వీటిని సినిమా కధలుగా చెబుతారు. ఎక్కువగా కల్పితం ఉండే కధలు ఇవి.

చిన్న పిల్లలకు బొమ్మల రూపంలో చెప్పే కధలను బొమ్మల కదలు అంటారు. ఇవి చందమామ వంటి పత్రికలలో ప్రచురితం కాబడి ఉంటాయి.

రేడియోలాలో ప్రసాదం కావడానికి తయారు చేసుకునే కధలను లేదా రేడియోలలో చెప్పబడిన కధలను రేడియో కధలు అంటారు.

పత్రికలలో ప్రచురితం కావడానికి తయారు చేసుకునే కధలను లేక ప్రచురితం అయిన కధలను పత్రికా కదలని అంటారు.

సామజిక సమస్యలను స్పృశిస్తూ, సామజిక బాధ్యతను గుర్తు జేసే కధలను అభ్యుదయ కదలని అంటారు.

ఒక వ్యక్తి చేత ఎక్కువ చెప్పబడిన కధలను ఆ వ్యక్తి పేరుతొ కధలుగా చెబుతారు. అలాగే ఒక వ్యక్తి ప్రధాన పాత్రగా సాగే అనేక కధలను, ఆ వ్యక్తి పేరుతొ గల కధలుగా చెబుతారు. ఉదా: తెనాలి రామకృష్ణ కధలు

అలాగే ఒక మార్గం లేదా ఒక ప్రాకృతిక అంశం ఆధారంగా చెప్పబడే కధలను కూడా ఆ అంశము పేరుతొ గల కధలుగా చెబుతారు. ఉదా: చందమామ కధలు, కాశి మజిలి కధలు.

ఇంకా చిన్న చిన్న కధలను చిన్న కదలని, పిట్ట కదలని, తాతమ్మ లేక తాతయ్య కధలు అంటారు.

మన తెలుగులో పిట్ల కధలు, కట్టు కధలు తదితర తెలుగు కధలు

పిట్ట కధలు, కట్టు కధలు, తాతమ్మ కధలు ఎక్కువగా కల్పితమైనవిగానే ఉంటాయి.

పురాణాలలోని కొందరు వ్యక్తుల గుణాలు తెలియజేస్తూ చెప్పే కధలు పురాణ కధలు లేక ఇతిహాస కధలుగా చెబుతారు.
చరిత్రలో ధీరుల గురించి, వీరుల గురించి, నాయకుల గురించి, వారి వారి సుగుణాలను తెలియజేస్తూ చెప్పే కధలను చారిత్రక కధలు అంటారు.

జానపదుల చేత చెప్పబడిన కధలను జానపద కధలు అంటారు.

ఆసక్తిని రేకెత్తిస్తూ, వివిధ విషయాల సారమును పొందుపరిచే మాటలతో, చివరకు నీతివ్యాక్యమును గుర్తుకు తెచ్చేవిధంగా సాగడమే కద యొక్క గొప్పతనంగా చెప్పబడుతుంది.

బాలబాలికలలో మంచి గుణాలపై ఆసక్తిని పెంపొందించే సాధనాలలో కధ ప్రధానమైనదిగా ఉంటుందని అంటారు. మంచి వ్యక్తిత్వం కొరకు మంచి మంచి నీతి కధలు వినాలని అంటారు.

వినే కధ యొక్క కధావస్తువును బట్టి మనసులో మెదిలే ఆలోచనలు ఉంటాయని అంటారు. అందుకే పిల్లలకు నీతి కధలను వాక్కు రూపంలో కానీ, బొమ్మల రూపంలో కానీ తెలియజేస్తూ ఉంటారు.

కాలక్షేపం కోసం చెప్పుకునే కధలను కాలక్షేప కధలు లేక సంభాషణ కధలు అని అంటే, అలాంటి కాలక్షేప కధలకు స్మార్ట్ ఫోన్ ఒక బ్రేక్ ఇచ్చినట్టే అంటారు. స్మార్ట్ ఫోన్ వంటి పరికరాలలో అనేక కాలక్షేప విషయాలు మనిసి మనసుకు ఆకర్షిస్తాయి…కాబట్టి.

కధ వలన నీతి అనే మాట మనసును తాకుతుంది. కావున కధలు ఇప్పటికి అమ్మ నోటివెంట వెలువడుతూనే ఉంటాయి. తాతయ్య, తాతమ్మ వంటి పెద్దల మాటలలో కధలు కదులుతూనే ఉంటాయి…

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే కధ మంచి విషయమును అంతర్లీనంగా అందిస్తూ, ఆసక్తిగా సాగే వచన రూపం కానీ వాక్ రూపం కానీ అయి ఉంటుంది. కధలు తెలియజేసేదేమిటి? అంటే నీతిని ఎక్కువగా ప్రభోదిస్తూ ఉంటాయి.