By | October 22, 2021

పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు… పాఠశాలలు ప్రత్యేకించి క్రమపద్దతిలో పాఠ్యాంశాలు బోధించడానికి ఉంటే, స్మార్ట్ ఇష్టానుసారం విషయ సంగ్రహణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్మార్ట్ ఫోన్ తగదని అంటారు. కానీ కొన్ని పరిస్థితులలో హోమ్ వర్క్ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే… ఎంతవరకు దానిని వాడుకోవాలి?

కొందరు విద్యార్ధులు పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సెర్చ్ చేయడం చేస్తూ ఉంటారు. కూడికలు చేయడానికి క్యాలిక్యులేటర్ వాడినట్టు, ఫోనులో వెతుకుతూ పాఠ్య ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం అలవాటుగా చేసుకోరాదు. అయితే ఆసక్తికి తగ్గట్టుగా విషయ పరిశీలన చేయవచ్చును కానీ సాధన మాత్రం స్వతహా అభివృద్ది చేసుకోవాలని అంటారు.

అంటే ఒక పాఠ్య పుస్తకంలో అంశంపై వ్యాసం వ్రాయాలి… అయితే వ్యాసం ఎలా వ్రాయాలి? వ్యాస రచన అంటే ఏమిటి? వ్యాస ప్రక్రియ ఎలా ఉంటుంది? వ్యాసం వలన విషయం ఎలా వివరించగలం? వంటి ప్రశ్నలకు సమాధానాలు స్మార్ట్ ఫోను వినియోగించి తెలుసుని, వ్యాసం వ్రాసేటప్పుడు మాత్రం ఫోనులో చూసి పుస్తకంలో వ్రాయడం తప్పుగానే పరిగణిస్తారు.

ఏదైనా ఒక రచనా దృష్టి మనసుకు అలవాటు పడాలంటే, రచనలే చదవాలి అయితే సాధన స్వయంగా చేయాలి.

సబ్జెక్టు ఫోనులో సెర్చ్ చేయడం

ధర్మరాజు గారి శాంత స్వభావం గురించి మీ మాటలలో వ్రాయండి’ అనే ప్రశ్న హోమ్ వర్క్ అనుకోండి.

అప్పుడు ధర్మరాజు గారి గురించి పాఠ్య పుస్తకంలో ఉన్నది మనసుకు ఎక్కలేదు… అప్పుడు ధర్మరాజు గారి గురించి మీకు మాటలు వ్రాయడానికి మనసులో మెదలకపోవచ్చును. అలాంటప్పుడు స్మార్ట్ ఫోను వాడకం అలవాటు ఉంటే, స్మార్ట్ ఫోనులో ధర్మరాజు గారి గురించి తెలుసుకోవడం వలన మీ మనసులో పాఠ్యంశమే వెళుతుంది. ఆ తర్వాత ధర్మరాజు గారి గురించి మీరు ఆలోచించి, మీ స్వంత మాటలు వ్రాయగలిగితే మాత్రం మీకు స్మార్ట్ ఫోన్ నుండి మంచి విషయం అందుతున్నట్టే… కానీ స్మార్ట్ ఫోనులో విషయం వింటూ, వ్యాక్యాలు మార్చి వ్రాస్తూ… కాఫీ చేస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ నుండి మీకు చదువుపరంగా ఎటువంటి ప్రయోజనం కలగదు.

పాఠ్య పుస్తకంలోనే అంశమే చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ బుర్రకెక్కలేదు… అప్పుడు స్నేహితుడిద్వారా పాఠ్యపుస్తకంలోని అంశం గురించి చర్చించడం ఉత్తమమైన పని. ఎందుకంటే మీరు మీ స్నేహితుడిని అడిగిన సబ్జెక్టు అతనికి కూడా ఒకసారి రివ్యూ అవుతుంది. అందువలన అతని మనసులో ఆ పాఠ్యాంశం ఎక్కువగా గుర్తులో ఉంటుంది. అలా మీరు ఏదైనా పాఠ్యాంశం గురించి మీ స్నేహితుడిని అడగడం వలన అతనికి మీరు మేలు చేసినవారే అవుతారు.

కొందరికి ఎవరు చెప్పినా ఎక్కదు… అప్పుడు ఖచ్చితంగా వారు గురువుగారినే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాట వినకపోవడం, స్నేహితుని మంచి మాటలు రుచించకపోవడం తగదని అంటారు.

స్మార్ట్ ఫోన్ ద్వారా మరింత చదువును వృద్ది చేసుకోవానికే కానీ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ మన మైండును బ్రష్టు పట్టించుకోవడానికి కాదు…