దానం గురించి దానం గొప్పతనం

దానం గురించి దానం గొప్పతనం
దానం గురించి దానం గొప్పతనం

దానం గురించి దానం గొప్పతనం. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు… తదితరుల గురించి చెబుతూ దానగుణం గురించి పుస్తకాలలో గొప్పగా చెప్పబడుతుంది. ఎందుకు దానగుణం గురించి తెలుసుకోవాలి. సమాజంలో ఉన్నవారు, లేనివారు రెండురకాల ప్రజలు ఉంటారు. లేనివారికి, ఉన్నవారు చేసే దానం వలన లేనివారి ఆనందానికి ఉన్నవారు కారణం అవుతారు. అయితే ఇది దానం చేయాలని ఎక్కడా రూల్ ఉండదు. అది వ్యక్తి యొక్క బుద్దిని బట్టి ఉంటుంది. కనుక విద్యార్ధి దశలోనే దానం గొప్పతనం తెలుసుకోవడం వలన వారు సమాజానికి ఉపయోగకరంగా మారతారు. తమ దగ్గర ఉన్నదానిని దానం చేయడానికి సందేహించరు. కావునా దానం గురించి గొప్పగా చెబుతారు. కర్మ కఠినమైనది కనుక కొందరి జీవితాలలో దారిద్ర్యం తాండవిస్తుంది. కర్మ సిద్ధాంతం బాగా నమ్మినవారు, తమ దగ్గర ఉన్న దానిని అవసరంలో ఉన్నవారికి దానం చేయడానికి సంకోచించరు.

పురాణాలలో దానం గురించి దానం గొప్పతనం

ఇక మన పురాణాలలో దానం చేసిన వారి గురించి చెప్పేటప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది కర్ణుడు…. ఒక రోజు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో నీదగ్గరకు వచ్చి నీ కవచకుండళాలను దానం అడుగుతాడు. ఇవ్వకు అని కర్ణుడుతో సూర్యుడు చెబుతారు. కానీ ఇంద్రుడంతటివాడు నాముందు దేహి అని నిలుచుంటే, నేను కాదనను దానం చేసేస్తాను అని కర్ణుడు సూర్యుడితో అంటాడు.

అలాగే ఇంద్రుడికి కర్ణుడు తన శరీరంతో కలసి ఉన్న కవచ కుండళాలను తీసి ఇచ్చివేస్తాడు. కవచకుండళాలు ఉంటే, కర్ణుడికి చావు ఉండదని అంటారు. కవచకుండళాలు లేకపోతే, కర్ణుడి మరణం తథ్యం అని తెలిసి కూడా, ఎల్లకాలం బ్రతికి ఉండడం కన్నా, దానం చేసేయడం మంచి పని అని కర్ణుడు గ్రహించాడు. కాబట్టి దానం చేశాడు.

ఇంకా బలి చక్రవర్తి దానం గురించి కూడా చాలా గొప్పగా చెప్పబడుతుంది.

వామనుడు బలి చక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల భూమిని దానంగా అడుగుతాడు. అందుకు బలి చక్రవర్తి అంగీకరిస్తాడు. కానీ శుక్రాచార్యులు, ‘వచ్చినవాడు సామాన్యుడు, కావు త్రివిక్రముడు, మొత్తం ఆక్రమించేస్తాడు… దానం ఇవ్వొద్దని బలిని వారిస్తాడు. కానీ బలి చక్రవర్తి ఆడిన మాట తప్పను, ఖచ్చితంగా దానం ఇచ్చేస్తానని, తన మాట ప్రకారం మూడడుగుల భూదానం ఇచ్చేస్తాడు.

అడిగినవారికి దానం చేసేయడం, ఆడిన మాట తప్పకపోవడం… ఏనాటి నుండో మన భారతీయ సంప్రదాయంలో ఉన్నదేనని చెబుతారు.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు