Monthly Archives: April 2021

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో మన దేశం భారత దేశం గురించి వ్రాయండి…

పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి…. అంటూ సాగే తెలుగు సినిమా పాటలో భారతదేశపు మహనీయుల గురించి కీర్తించబడింది.

మనదేశం భారతదేశం అనేక మంది మహానుభావులను అందించిన దేశం. అందరు విశ్వమును సమభావముతో చుసిన మహానుభావులే కావడం విశేషం.

స్వామి వివేకానందా, రామ కృష్ణ పరమహంస, గాంధీ తదితర మహనీయులు ప్రపంచం చేత కీర్తింపబడ్డారు. ఆ మహానుభావులు మన భారతదేశపు గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశారు.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము…. అను భారతీయ తెలుగు జాతీయ గీతాన్నిరాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. దేశమంటే ఏకాదటిపై నడిచే ప్రజా వ్యవస్థ అని తెలియజేసే మేలుకొలుపు గీతాలు మనకు లభిస్తాయి.

ఇంకా దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. అంటూ సాగే పాటలు మన మనసులో ఆలోచన సృష్టిస్తాయి.

ఇంతమంది మహనీయులు దేశం గురించి అంతగా ఆలోచన చేసి, తపనతో పాటలు రచించారు… అంటే, వారి వారి మనసులలో దేశమంటే ఎంత ప్రీతి? దేశమంటే ఎంత భక్తి భావం ఉందో తెలియవస్తుంది. మనదేశం ఇటువంటి సాహితి వేత్తలను అందించింది.

ఎక్కడైనా ఏదో ఒక విధానం ఉంటుంది. ఏదో ఒక విధానం వలన కొందరు ఇమడలేకపోవచ్చు. ఇంకా జీవన పరమార్ధం విషయంలో అయితే ఆయా దేశాలలో ఏదో ఒక వీధి విధానం మాత్రమే అనుమతి ఉంటుంది.

కానీ మన దేశం మన మాతృదేశం అయిన భారతదేశంలో జీవనపరమార్ధం విషయంలో అనేక మతాలు ఉన్నాయి. నచ్చిన మతాచారం అందుకుని జీవనగమ్యం వైపు వెళ్లడానికి అందరికీ హక్కులు రాజ్యాంగం ఇచ్చింది. ఈ మతస్వేచ్ఛ రాజ్యాంగంలో మరే ఏ దేశంలోనూ లేదని అంటారు.

ఆచారవంతమైన విధానంలోనే ఇంత స్వేచ్ఛను భారతీయ పౌరలకు లభిస్తుంటే, మిగిలిన విషయాలలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉంటుందో… ఆలోచన చేయవచ్చు. మనదేశం వ్యక్తిగత స్వేచ్ఛకు ఆలవాలం.

ఎవరో ఒక గొప్పవాడు, డబ్బున్నవాడు దేశంలో స్వేచ్ఛగా జీవించడం ఎక్కడైనా ఉంటుంది. కానీ ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా జీవించగలగడమే నిజమైన ప్రజస్వామ్యం అయితే, అది మనదేశంలోనే ఉంది.

సామాన్యుడు నుండి అసామాన్యుడు వరకు స్వేచ్చను అందించే మనదేశం మన భారత దేశం… శాంతికి మూలాధారం లాంటిది.

ఏదో దేశంవారు మరొక దేశంపై క్రూరంగా దాడి చేయడం, వారు ప్రతీకార చర్యలకు పాల్పడడం ఎక్కువగా జరుగుతుంది. మనదేశంపైన కూడా అప్పుడప్పుడు జరుగుతుంది.

కానీ భయబ్రాంతులకు గురయ్యే అవకాశం మన దేశం భారత దేశంలో తక్కువ. మన దేశం భారత దేశం శాంతిని కోరుకునే దేశం. అందులో నాయకత్వ లక్షణాలు మన దేశం భారత దేశానికి ప్రతినిద్యం వహించే వారిలో పుష్కలంగా కనబడతాయి.

ఈ అంశంలో స్వామి వివేకానందా వంటివారు నిరూపించారు. శాంతిగా ఉన్నచోట మానవ మనుగడ ప్రశాంతతో ఉంటుంది. అంతకుమించిన గొప్ప సమాజం ఏముంటుంది?

మన దేశం భారత దేశంలో శాంతికి ఆలవాలం ఎలా?

ఏనాటి నుండో ఉన్న మన భారతీయ సాంప్రదాయంలో స్త్రీలు శాంతితో ఉన్నారు. వారి వలన గొప్ప గొప్ప సామాజిక, తత్వవేత్తలు మన దేశం భారత దేశంలో జన్మించారు. వారి వలన దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయం గురించి తర్వాతి తరాలకు తెలియబడుతూ వచ్చింది.

అందుకు సాక్ష్యంగా అనేక దేవాలయాలు, వాటి వాటి స్థల పురాణములు ఉంటాయి. ఎందరో భక్తులు దైవాన్ని తెలుసుకున్నట్టుగా పురాణాలు చెబుతాయి.

యోగులు శాంతితో సామాజిక సంక్షేమం కోరుతూ, ధర్మ ప్రచారం చేయడం, ప్రజలను శాంతివైపు నడిపించే విధానం గురించి విస్తృత ప్రచారం చేసి ఉండడం మరొక ప్రధాన కారణం… మన దేశం భారత దేశం శాంతికి మూలం.

మన దేశం భారత దేశంలో సాహితి వేత్తలు, సామాజిక వేత్తలు, తత్త్వ వేత్తలు వలన సామాజిక సమస్యలపై అవగాహన సమాజంలో ఏర్పడుతూ ఉంది. తత్వవేత్తల వలన వ్యక్తిలో చిత్తశుద్దిపై ఆలోచన ఉంటుంది… ఈ ఈ విధానాలు మనిషిలో శాంతి అనే అంశం ఉంటూ ఉంటుంది.

ఎన్నో పర్యాటక ప్రాంతాలు, ఎన్నో చరిత్రాత్మ ప్రాంతాలు, ఎన్నో పురాణ కట్టడాలు, ఎంతో మంది యోధులు, సాధువులు, యోగులు మన దేశం భారత దేశంలో జన్మించారు.

నిత్య శాంతి కోసం తపించే నాయకత్వం మన దేశం భారత దేశంలో ఎప్పుడూ ఉంటుంది. ఆ నాయకత్వం అంగీకరించే ప్రజలు సమాజం శాంతితో ఉండడానికి పునాదిగా ఉంటుంది.

విశ్వశాంతి అంటే అది భారతదేశం వలననే సాధ్యమనే భావం ప్రపంచం అంతటా ఉండడం, మన దేశం భారత దేశం యొక్క కీర్తి తెలియబడుతుంది.

ఇంతటి మన దేశం భారత దేశంలో పాలన కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో ఏ రాష్ట్రనికి, ఆ రాష్ట్రమే పరిపాలన కొనసాగించే అధికారం ఉంది. ఇవి కాక కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.

మన దేశం భారత దేశంలో గల రాష్ట్రాలు తెలుగులో

ఆంధ్రప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్
అస్సాం
బీహార్
చత్తీస్ గఢ్
గోవా
గుజరాత్
హర్యానా
హిమాచల్ ప్రదేశ్
జార్ఖండ్
కర్ణాటక
కేరళ
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
మణిపూర్
మేఘాలయ
మిజోరాం
నాగాలాండ్
ఒడిషా
పంజాబ్
రాజస్థాన్
సిక్కిం
తమిళనాడు
తెలంగాణ
త్రిపుర
ఉత్తరప్రదేశ్
ఉత్తరాఖండ్
పశ్చిమబెంగాల్

కేంద్రపాలిత ప్రాంతాలు మన దేశం భారత దేశంలో

అండమాన్ నికోబార్ దీవులు
చండీగడ్
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ
జమ్మూ కాశ్మీర్
లడఖ్
లక్షద్వీప్
ఢిల్లీ
పాండిచ్చేరి

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది. భక్తీ, ముక్తికి భగవద్గిత మనసుకు ఔషధం వంటిది అని అంటారు.

మహాభారతములో భీష్మ పర్వములో ప్రారంభం అయ్యే భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంధంగా ప్రసిద్ది చెందింది.

భగవద్గీత ఉపనిషత్తుల సారమని అది జీవితానికి దిశా నిర్దేశం చేయగలదని అంటారు. భక్తీ భావనతో గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంటుంది. భగవద్గీత చదువుతూ, చిత్తశుద్దితో జీవించడం పాపహరణకు ఒక మార్గమని పెద్దలు చెబుతారు.

మనిషి జీవనంలో యోగం ఉంటుంది. మనిషి జీవించే క్రమంలో కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు ఉంటాయి.

భగవానుడు అర్జునునిడికి బోధించిన భగవద్గీతలో ఆత్మ తత్వము, జీవన కర్తవ్యము – కర్మ, జ్ఞానము, భక్తి, యోగ సాధన, భగవత్తత్వము, శ్రద్ధ, గుణ విభాగము తదితర విషయాలు ప్రస్తావించబడతాయి.

అనేక మంది మహానుభావులు భగవద్గీతను రీడ్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకుంటారు. ఎక్కువ మంది భగవద్గీతను జ్ఞానం కొరకు చదువుతూ ఉంటారు.

స్వాతంత్ర్య ఉద్యమం దేశమంతా వ్యాప్తి చెంది, దేశాన్ని ఒక తాటిపై నిలబెట్టిన మహాత్మా గాంధి కూడా భగవద్గీత పారాయణం చేసినట్టు ఆయన రచనలే చెబుతాయి.

వ్యక్తిలో స్ఫూర్తిని రగిలించే శక్తి భగవద్గీత పఠనం వలన వస్తుందని అంటారు

“నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.”

— మహాత్మా గాంధీ

జ్ఞానం అందించే భగవద్గీతలో విభాగాలు ఉంటాయి. అవి ఈ క్రింది యోగములుగా చెబుతారు.

అర్జునవిషాద యోగము
సాంఖ్య యోగము
కర్మ యోగము
జ్ఞాన యోగము
కర్మసన్యాస యోగ:
ఆత్మసంయమ యోగము
జ్ఞానవిజ్ఞాన యోగము
అక్షరపరబ్రహ్మ యోగము
రాజవిద్యారాజగుహ్య యోగము
విభూతి యోగము
విశ్వరూప సందర్శన యోగము
భక్తి యోగము
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
గుణత్రయవిభాగ యోగము
పురుషోత్తమప్రాప్తి యోగము
దైవాసురసంపద్విభాగ యోగము
శ్రద్దాత్రయవిభాగ యోగము
మోక్షసన్యాస యోగము 

ఎరుకలో ఉన్నవాడికి పొంచి ఉన్న ప్రమాదంపై అవగాహన ఉంటుంది. పాములు పట్టేవానికి పాముల గురించి బాగుగా ఎరుకలో ఉంటుంది. కావున అతను పామంటే భయపడడు. అలాగే జీవన పరమార్ధం ఎరుకలో ఉన్న వ్యక్తికి, బాధించే విషయాలు ఉండవని అంటారు.

భగవద్గీత వలన విషయ వాసనలు నశించి, విషయములకు ఆలవాలమైన మనసు గురించి మనసే ఆలోచన చేయడమే ఒక అద్బుతమని అంటారు.

మనసు అనేది మననము వలన దుఃఖము, సుఖము తెచ్చుకుంటుంది అంటారు. సుఖదుఃఖాలు మనసుపై ప్రభావం చూపుతూ ఉంటాయి. సుఖంగా ఉంటే సంతోషం, దుఃఖంగా ఉంటే విచారం…

విషయాల వలన విచారం ఎక్కువయ్యే మనసుకు భక్తిభావన ఒక ఆలంబనగా ఉంటుందని అంటారు. భక్తితో ఆలోచన చేసే మనసు శాంతిగా శోచించడం అలవాటు చేసుకోగలుగుతుందని అంటారు.

భక్తి భావన భగవద్గీత రీడ్ చేయడం ద్వారా కూడా పెంపొందించుకోవచ్చు. భక్తితో మెదిలే మనసులో వ్యగ్రత కన్నాశాంతస్వభావం పెరుగుతుంది.

మనసులో భక్తి భావనలు పెంచుకునే ప్రక్రియలో భగవానుడు బోదించిన భగవద్గీతను చదువుకోవడం మంచి అలవాటుగా చెబుతారు.

భగవద్గీతకు సంబంధించిన వివిధ పుస్తకాలు ఆన్ లైన్లో రీడ్ చేయడానికి లేదా మీ ఫోనులో పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయడానికి ఈ క్రింది బట్టన్ పై క్లిక్ చేయండి.

భక్తి భావనలు

తెలుగురీడ్స్

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు. ప్రవచనాలు వినడం వలన భాగవతం బాగుగా మనసులో నాటుకుంటుంది.

వినుడు భాగవతం భగవంతుడిని చేరాలనే భావనను పెంపొందించుకో… తెలుగులో భాగవతం విను, అలా భాగవతం వినగా వినగా… కాలంలో వచ్చే కష్టానికి కారణం కనబడగలదు.

భాగవతం రచించిన తరువాతే వ్యాసుని మనసు శాంతించినది అని పండితులు చెబుతారు. అలాంటి భాగవతం వినాలనే సంకల్పం చేయడం, భక్తి అనే భావన బలపడుతుంది.

చదివే భాగవతం మనసులో బలంగా నాటుకోవాలంటే, పెద్దల మాటలలో భాగవతం గురించి వినాలని అంటారు.

వినడం అలవాటు అయితే, ఆలోచన అగుతుంది. వింటున్న విషయం పైనే మనసు నిలబడుతుంది. అలాంటి మనసుకు భాగవతం వినాలనే తలంపును తెచ్చిపెడితే, భక్తి భావన బలపడే అవకాశం ఎక్కువ.

చదవకూడని బుక్స్ అనెకంగా అందుబాటులో ఉంటాయి… అవి చదవాల్సిన బుక్స్ చదవకుండా ఉండడానికి అవరోధాలుగా ఉంటాయి.
కాబట్టి చదవకూడని విషయాలు చదివిన మనసుకు పెద్దలమాట మంత్రంలాగా పనిచేస్తుందని అంటారు. కాబట్టి భాగవతం పండితుల ప్రవచనాల ద్వారా వినడం ప్రధానం అంటారు.

భగవంతుడిని గురించి, భగవంతుడి అనుగ్రహం పొందిన భక్తుల గురించి భాగవతం చక్కగా తెలియజేస్తుందని అంటారు. అందువలన భాగవతం గురించి ప్రవచనాలు వినాలనే అంటారు.

భక్తి భావం బలపాడడానికి భాగవతం చక్కగా ఉపయోగపడుతుందని అంటారు. పుస్తక రూపంలో లభించే భాగవతం పండితుల వాక్కులలో మరింతగా మనసును చేరగలదు.

ఒక్కడే అయినా అనేక రూపాలలో దర్శనమిచ్చే భగవంతుడు గురించి భాగవతం బాగుగా తెలియజేస్తుందని అంటారు. వ్యాస భాగవతం పోతనా మాత్యుల ద్వారా తెలుగులోకి అనువదించబడింది.

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం చదవడం సాధన వైపు మనసు మరలుతుంది

పలువురు పండితులు భాగవత ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి. భాగవతం గురించి తెలుగులో ప్రవచనాలు విని, భాగవతం చదవడం మొదలుపెడితే, చదివేటప్పుడు ఊహించే అలవాటు గల మనసుకు పెద్దల మాటలు మార్గదర్శకం కాగలవు.

భాగవతం గురించిన పెద్దల మాటల ప్రభావం మనసుపై భాగవతం చదివేటప్పుడు పడుతుంది. భగవంతుడు గురించి విన్న మనసు, భగవంతుడి గురించి చదువుతుంటే, సక్రమమైన ఊహాశక్తి పుడుతుంది.

మనసుకు ఉండే బలం ఊహా శక్తి అయితే, అది చెడు విషయాలపైకి వెళితే, అదే దాని బలహీనత… అదే మనసు భగవంతుడు గురించి ఊహ చేయడం మొదలుపెడితే, అదే బలం. అయితే సదాచారం వలన సక్రమమైన పరివర్తన ఉన్నట్టు… పెద్దల మాటల వలన సక్రమమైన ఆలోచన ఉంటుందని అంటారు.

తపించే హృదయానికి భావావేశం ఎక్కువైతే, అది భాగవతం వైపు మరలితే, భక్తి భావన బలపడుతుంది. భక్తి భావన బలపడడం అంటే, మనోబలం పెంచుకోవడమే అంటారు.

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం. అవగాహన కోసం వ్యాసం. ఆరోగ్యం కోసం ఎప్పుడూ వైద్యుని సలహాలే పాటించాలి.

ఇది భారతదేశంలో ప్రాచీన వైద్య విధానం. ఆధునిక వైధ్యం అందుబాటులో రాని కాలంలో ఆయుర్వేద వైద్యమే ఆధారంగా ఉండేది.

దేశంలో పల్లె ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండి, ఆయుర్వేద వైధ్యం అందుబాటులో ఉండేది. మూలికలు ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు.

శరీరంలో అనారోగ్య సమస్యలను దోషాలుగా చెబుతారు. దోషాలకు విరుగుడుగా మూలికలతో చేసిన ఆయుర్వేద మందులు వాడటం పరిపాటి.

ఇంకా నాటువైద్యం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉండటం కూడా ఉండేది. ఆయుర్వేద మూలికలను చూర్ణంగా తయారు చేసి నాటు వైద్య్లులు వివిధ శారీరక రుగ్మతలకు మందులుగా ఇస్తూ ఉండేవారని అంటారు.

నాటు వైద్యంలో ఔషద మొక్కల నుండి ఆకులు సేకరించి, వాటి రసం ద్వారా కూడా శరీర గాయాలకు పూయడం ఉంటుంది.

ఇంట్లో పూజలు అందుకునే తులసి మొక్క ఔషధ గుణాలతో కుడి ఉంటుందని అంటారు.

ఇప్పటికీ దేశంలో కొన్ని చోట్ల నాటు వైద్యం అందుబాటులో ఉంటుంది.

ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ప్రధానంగా మూడు దోషాలకు మందులు తయారు చేస్తారు. అవి వాతం, పిత్తం మరియు ఖఫం దోషాలుగా చెబుతారు.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు శారీరక రుగ్మతలను దూరం చేస్తాయని అంటారు.

ఇంగ్లిష్ మందులు అందుబాటులోకి వచ్చాక, ఆయుర్వేద వైద్యం నుండి ఆధునిక వైద్య పద్దతులకు ప్రజలు అలవాటు పడ్డారు. నాటు వైద్యం కన్నా ఆర్‌ఎం‌పి డాక్టర్ వద్ద చికిత్స పొందడానికి ప్రజలు అలవాటు పడ్డారు.

కాలం మారుతున్న కొలది వైద్య విధానం పూర్తి ఆధునిక పద్దతులలోకి మారింది. ఆధునిక పద్దతులలో వివిధ పరీక్షల ద్వారా రోగి శారీరక సమస్యలను కనుగొని, రోగానికి మందులు వేయడం బాగా అభివృద్ది చెందింది. ఈ విధానంలో శస్త్రచికిత్సలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

ఎన్ని ఆధునిక పద్దతులు వచ్చినా, ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకుని జీవించేవారు ఉన్నారని అంటారు. ఇంకా దీర్ఘ కాలిక అనారోగ్యం ఉన్నవారు ఆయుర్వేద వైద్య విధానం వైపు చూడడం జరుగుతుంది.

అనారోగ్యం – ఆందోళన – నమ్మకం – వైద్యం

అనారోగ్యంతో ఉన్నవారు ఆందోళనకు గురి అయితే, మనసు పొందే భయం వలన రోగం మరింత ముదురుతుందని అంటారు. రోగి ఏ విధానంలో వైద్యం పొందినా ముందుగా వారి మనసులో ఆందోళన అధికమవ్వకుండా చూసుకోవాలని పెద్దలంటారు.

ఎక్కువమందికి చికిత్స చేసిన వైద్యులకు, అనేక రోగాలపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. అనుభవజ్నులు అయిన వైద్యులకడకు వెళ్ళడం, వారి వైద్యంపై నమ్మకం ఉంచి, చికిత్స పొందడం ప్రధానమని పెద్దలు అంటారు.

శరీరం మనసుతో పెనవేసుకుని ఉంటుంది. రోగ నివారణకు మందులతోబాటు మనసుకు ప్రభావం చూపుతుందని అంటారు. కనుక మనసులో అపనమ్మకం వదిలి సరైన వైద్య విధానం వైపు వెళ్ళడం ద్వారా రోగం త్వరగా నయం చేసుకోవచ్చని అంటారు.

ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పద్దతులలో రోగ నిర్ధారణ చేసుకోవడం సులభం. ఖర్చుతో కూడుకున్న విధానం అయినా రోగ నిర్ధారణ అవ్వడం వలన రోగం నయం చేసుకోవడానికి మార్గం త్వరగా ఏర్పడుతుందని అంటారు. కావున ముందుగా రోగ నిర్ధారణ చేసుకోవడం ఆపై అనుభవజ్నులైన వైద్యుడిని కలవడం ప్రధానం అంటారు.

ఆయుర్వేదం అయిన ఆధునిక పద్దతి అయినా నమ్మకంలో సరైన వైద్యులను సంప్రదిస్తే, అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.

ప్రాచీనమైన ఆయుర్వేదం పూర్వులు ఎక్కువగా ఆధారపడి జీవిస్తే, ఇప్పుడు ఆధునికమైన వైద్యముపై మనము ఆధారపడి జీవిస్తున్నాము.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం, అమృతం వంటిది. అమ్మ ఆప్యాయంగా చేసే స్పర్శలోనే అమృతత్వం ఉంటుంది.

అమ్మా అనిపించకుండా బాధ ఊరుకోదు. అమ్మా అని ఆర్తితో అరిపించకుండా కష్టం కూర్చోదు. ఒక వయసుకు వచ్చాక కూడా అమ్మా అంటూ బాధను అనుభవిస్తాం… గతంలో అమ్మ చూపిన ఆప్యాయత గుర్తుకు రాగానే బాధను మరుస్తాం…. అంటే అమ్మ అమృతమైన ప్రేమను పంచేస్తుంది.

అమ్మలేని జీవిలేదు. అమ్మలేని జీవితం లేదు. అమ్మతోనే వెలుగు ఆరంభం. లోకంలోకి ప్రయాణం ప్రారంభం అమ్మ ఒడి నుండే… మొదలు.

ఏడుపుతో ప్రారంభం అయ్యే జీవనంలో అమ్మఒడి ఓదార్పు బడి. అమ్మఒడి భయానికి బదులు చెబుతుంది. అమ్మఒడి అప్యాయతకు భాష్యం చెబుతుంది.

అమ్మఒడి చిన్నారికి బాలబడి. అమ్మఒడి ఊయల. అమ్మఒడి చిన్నారికి కధాప్రాంగణం. రచయిత అయినా, సామాన్యుడు అయినే, ప్రధాని అయిన అమ్మఒడిలో భయం వలన రక్షణ పొందిన దీనుడే…

ఎన్నో రచనలు కీర్తించేది అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వమునే

బిడ్డను కనే అమ్మ చేసే త్యాగం, బిడ్డను పెంచడంలో అమ్మ చూపే ఆప్యాయత రచనామృతాన్ని చిన్నవిగా చేస్తే, రచనలు అమ్మను పొగడడంలో పోటీపడి నాన్నను మరిచిపోవడంలో అతిశయోక్తి లేదు.

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం భగవానుడినైనా కట్టిపడేస్తుంది.

అమ్మ గురించి చెప్పడంలో పడిన వ్యాసానికి, అమ్మ గురించి అనే ఆలోచన అలవాటు అయిపోయింది. అమ్మ గురించి వ్రాయడంలో అలవాటు పడిన కలం కదులుతూనే ఉంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న ముందుంటాడు. నాన్న వలన నలుగురిలో గౌరవం దక్కుతుంది. నాన్న వలన నలుగురు పరిచయం అవుతారు. నాన్నతోనే సామాజిక ప్రభావం ప్రారంభం.

అమ్మ గురించి చెప్పడంలో పడి నాన్నను మరిచిపోయిన రచనలు అన్నట్టుగా నాన్న కన్నా అమ్మనే రచనలు కీర్తిస్తాయి. కానీ అవిరామ శ్రమ నాన్నలో ఉంటుంది.

పిల్లలకు నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు. అలాంటి ఆలోచనకు పునాది నాన్న వలననే కలుగుతుందని అంటారు.

కేవలం చదువుకునే వయసులోనే నలుగురిలో గౌరవం లభిస్తుందంటే, అది నాన్నపై సమాజంలో నిలిచిన మర్యాదే. ఎదుగుతున్న బాలబాలికలకు సమాజంలో ఏర్పడే స్థితి నాన్నతో ముడిపడి ఉంటుంది.

కన్నబిడ్డల కోసం కన్నతల్లి అమృతమైన ప్రేమను అందిస్తే, వారి పోషణకు నాన్న తన రక్తాన్నిధారపోస్తాడు. కష్టపడి ఇష్టంతో కాలంలో కలిగే కష్టాలను ఎదుర్కుంటాడు.

తనను నమ్ముకుని ఎదుగుతున్నవారి ఆశలకు నాన్న జీవం పోస్తాడు. నాన్న ఉన్నాడనే ధైర్యంతో పిల్లలు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలరు.

సమాజంలో నాన్న ఇచ్చే రక్షణ మరే ఇతరులు ఇవ్వలేరని అంటారు. నాన్న అంటేనే భరోస… నాన్న బ్రతుకుకి భరోస కల్పించగలడు.

అమ్మాయి అల్లరిని ఆధారిస్తాడు. అబ్బాయి బరువును మోస్తాడు. అమ్మాయి ఆలోచనకు విలువనిస్తాడు. పిల్లల మనోభావాలను ఎరిగి, వారి వారి ఆశయాలకు అనుగుణంగా నాన్న చేసే కృషి అద్బుతమే అవుతుంది.

ఎదిగే పిల్లలకు ఆదర్శంగా కనిపించేవారిలో, నాన్నే మొదట నిలుస్తాడు. నాన్న ఆదర్శంలో మార్గదర్శకంగా మారతాడు. నాన్నను అనుసరించాలనే ఆలోచన పిల్లలకు కలగకమానదు.

ఎదిగే వయస్సు చేసే అల్లరికి నాన్న ఒక అడ్డుగోడ. నాన్నను దాటి అల్లరి అల్లరి చేయలేదు.

జీవనగమ్యం చేరడంలో నాన్న ఆచరించిన కుటుంబ పద్దతి, తర్వాతి తరానికి కూడా విధానం అయి కూర్చుంటుంది.

నాన్న లేని సమాజంలో బిడ్డడి, భవిష్యత్తు ఆగమ్యగోచరం. నాన్న వలననే మర్యాద, మన్నన మొదటగా సమాజం నుండి లభిస్తాయి. నాన్నను అనుసరించే అమ్మకు, నాన్నే మార్గదర్శకం. బిడ్డలకు నాన్నే మార్గదర్శకం.

సమాజంలో ఒక కుటుంబానికి ఏర్పడిన గుర్తింపు నాన్న సంపాదించిన విలువైన ఆస్తి వంటిది. ఆ ఆస్తిని ఎవరు దొంగిలించలేరు. పోగొట్టుకుంటేనే పోతుంది తప్ప, విలువైన ఆస్తి నాన్న సంపాదించిన గౌరవ, మర్యాదలు మనిషికి వెన్నంటి జీవితాంతం ఉంటాయి.

ఎప్పుడూ నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అయితే

నాన్న తనకోసం తను కష్టపడింది… తక్కువగానే ఉండవచ్చు. కానీ బిడ్డల కోసం పడే కష్టం, తపన ఎక్కువగానే ఉంటుంది. అదే నాన్న తత్వం.

కష్టాన్ని ఇష్టంగా ధారపోసే నన్నతత్వం పెద్దగా గుర్తింపు పొందకపోయినా…. నాన్న మాత్రం తనవారి కోసం తాను శ్రామిస్తూనే ఉంటాడు.

అన్నీ తెలిసినా ఏమి తెలియనివాడిలాగా ఉండడం నాన్నతత్వంలోనే ఉంటుంది. పిల్లల దగ్గర నేర్చుకుంటున్నట్టు ఉండగలడు. పిల్లలు గాడి తప్పుతుంటే, భయాన్ని చూపించగలడు.

వయసుకు వస్తున్నవారికి అలవాట్లు అలుముకోకుండా, వ్యసనాలు వంటబట్టకుండా నాన్న అనే భయం బిడ్డడిని కాపాడుతూ ఉంటుంది.

అమ్మ చూపే అమృతమైన ప్రేమ ముందు, నాన్న శ్రమ, నాన్న తపన కనబడదు. కానీ బిడ్డలు సాధించే విజయాలకు ఆరంభం అమ్మ అయితే, పట్టుదల నాన్నే అవుతాడు.

యువకుడుగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవమే, నాన్నగా మరగానే ఆలోచనగా మారిపోతుంది. నిత్యం పిల్లల శ్రేయస్సుకొరకు తపన ప్రారంభం అవుతుంది. పిల్లల కట్టడికి కారణం, సమాజంలో తాను చూసిన సామాజిక పరిస్థితుల ప్రభావం అవుతుంది.

కఠినంగా ఉన్నట్టు కనబడే నాన్న హృదయం వెనుకాల, బిడ్డడి భవిష్యత్తు బాగుండాలనే తాపత్రయం వరదలా ప్రవహిస్తుంది. నాన్న కనబడని ప్రేమ ప్రవాహం వంటి వాడు.

నాన్న ప్రేమ ప్రవాహం కనబడకుండా భవిష్యత్తు కోసం తీసుకునే ప్రణాళిక, ప్రణాళిక అమలు కోసం చేసే నిర్ణయాలు, అలవాట్లకు అంటుకోకుండా చేసే కట్టడి… తదితర విషయాలు కప్పిపుచ్చుతాయి.

ఎదిగే పిల్లల చెడు ఆలోచనలకు నాన్న ఆనకట్టవంటివాడు.

పిల్లల కోసం పాటుపడే తల్లిదండ్రులలో ఎక్కువతక్కువలనే భావనే ఉండదు. అలాంటి వారిలో క్రమమైన ఆలోచనను అమలుపరిచేది నాన్న యొక్క దీక్షే.

నాన్నకు ప్రేమతో మంచి అనిపించుకోవడంలో ముందుండాలి. నాన్నకుప్రేమతో ఇచ్చే కానుక అంటే, సమాజంలో చెడు అనిపించుకోకుండా బ్రతకడమే అంటారు.

బిడ్డకు నాన్న ఇచ్చిన బారోసా ముందు జీవితం ఇచ్చే బారోసా చిన్నదిగానే కనబడుతుంది. కష్టంలో నాన్న పడ్డ కష్టం చూస్తే, జీవితంలో కష్టం ఎదుర్కోవలనే పట్టుదల, దీక్ష కలుగుతాయని అంటారు.

జీవితంలో ఆకాశం అందుకునే అవకాశం వస్తే, అందుకునే పట్టుదల, తెగువ, దీక్ష నాన్న నుండే వస్తాయని అంటారు. కష్టంలోనూ నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం.

ప్రయత్నంలో నాన్న పట్టుదల, నాన్న దీక్ష, సమస్యలను ఎదుర్కోవడంలో నాన్న చూపే తెగువ… సాధనలో నాన్నచూపే దక్షత. ఆరంభనికి నాన్న తీసుకునే దీక్ష… అన్నింటిలో నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు… మీకు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ శుభాకాంక్షలు…

రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము మననము చేయడము జీవనగమ్యము చేరడానికే. రాముడు అనుగ్రహం ఉంటే, సాధ్యం కానీ విజయం సిద్దిస్తుంది.

శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామనామము జపించడమే మార్గం.

ఏమి కర్మలు చేసి ఉన్నమో? ఏమి కర్మలు వెంటాడుటయో? కాలం – కర్మ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుటయో? ఎవరికెరుక? ఆ రామునికెరుక… కనుక రామునే పట్టుకుంటాను. రామనామము నిత్యము మననము చేస్తా!

శ్రీరామనామము జపిస్తూ, రామభజనము చేసే పోతనకు రామానుగ్రహం అయ్యింది. శ్రీమద్భాగవతమ్ సంస్కృత భాష నుండి తెలుగు భాషకు అనువదించారు.

రామానుగ్రహం పొందిన పోతనామాత్యులు, శ్రీమద్భాగవతమ్ రామునికే అంకితం అందించారు… కానీ డబ్బుకోసం మరే ఇతర విషయాలకు ఆశపడలేదు. తన మనసును రామస్వరూపముతో నింపేసుకున్నారు. మనసు నిండా రాముడే ఉంటే, మరి ఆ మనిషి కావలసినదేముంటుంది.

రామదాసు రామునిపైనే దృష్టి. రామదాసు జీవితం సుఖంలో ఉన్నప్పుడు రామాలయం నిర్మించారు. కష్టంలో ఉన్నప్పుడూ దాశరది శతకం అందించారు. రామానుగ్రహం కలిగితే మంచి పనులు జీవనోద్దరణ నిర్మాణమే మనసులో ఉంటుంది.

ఎంత కష్టం వచ్చిన రామునిపై నమ్మకంతో ఉండి, జీవితాల్ని ధన్యం చేసుకున్నవారు బమ్మెర పోతన, రామదాసు…

శ్రీరాముడు కేవలం పోతనను అనుగ్రహించడమే అనుకుంటే, రామదర్శనం పొందితే చాలు. కానీ రాముడు తెలుగువారందరినీ అనుగ్రహించాలని అనుకున్నాడు.

రావణాసురుడిని చంపడమే కాకుండా, చాలా కాలం భూమిపై ఉండి, మనుష్య జాతిని ఉద్దరించిన శ్రీరాముడు, తెలుగువారందరినీ అనుగ్రహించడం కోసం బమ్మెర పోతనతో భాగవతం అనువాదం చేయించాడు.

అలాగే శ్రీరాముడు రామదాసును అనుగ్రహించడమే అనుకుంటే, రామదాసు గుడి కడుతున్నప్పుడే గోపన్న మనసులో శ్రీరాముడు చేరాడు. కానీ అందరినీ అనుగ్రహించడం కోసం రామదాసుతో శతకం అందించాడు.

మన శ్రీరాముడు కేవలం భక్తుడునే అనుగ్రహించడం కాదు, భక్త జనాన్నే అనుగ్రహించడం చేస్తూ ఉంటాడు.

అలాంటి మన శ్రీరాముడు అందరి మనోసింహాసహనంలో సీతాలక్ష్మణ ఆంజనేయులతో అధిష్టించాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు…

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే”

భక్తిభావనాలు తెలుగులో

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉండడమే పెద్ద ఆస్తి అన్నారు.

ఆరోగ్య నియమాలు ప్రక్కన పెట్టి, జీవితం అంతా కష్టపడి పాతిక లక్షలు సంపాదించి, చివరలో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవలసి వస్తే, జీవితాంతం పడ్డ కష్ట ఫలితం?

సరిగ్గా తినక, తినడంలో సమయ పాలన పాటించకుండా, మనసు పాడు చేసుకుని, శరీరాన్నిఇబ్బందికి గురిచేసి, అనారోగ్యంపాలు చేయడం వలన, వారిని నమ్ముకుని ఉండేవారికి కూడా ఇబ్బందే.

అదే ఆరోగ్య నియమాలు పాటించి, జీవితాంతం మొత్తం పదిలక్షలు కూడబెట్టినా, ఆ డబ్బు నమ్ముకున్నవారికి ఉపయోగం. ఇంకా ఆరోగ్యంగా జీవితం ఉంటుంది.

అనుభవజ్నులు అయిన వైద్యుల సలహాలు పాటిస్తూ జీవనం సాగాలని వైద్య నిపుణులు అంటారు. ఎందుకంటే నేటి సమాజంలో ఆహారం పైనా ఇంకా పర్యావరణం పైన కాలుష్య ప్రభావం పడుతుంది.

నిజమైన సంపద అంటే ఆరోగ్యంగా ఉండడమే అంటారు.

అసలైన సంపద ఆరోగ్యంగా ఉండడమే అని అంటారు. ప్రశాంత చిత్తం కలిగిన వారు సుఖ నిద్ర పొందుతారు. అంతకన్నా ఆస్తి ఏమి ఉంటుంది?

ఇంకా పరుగులు పెడుతున్న సంపాదనా మార్గాలు మనిషిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశాలు కూడా ఎక్కువ అంటారు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆహార నియమాలు పాటించాల్సిందేనని అంటారు.

ఆరోగ్యంగా ఉంటే కష్టపడి పనిచేసి ఆర్ధిక ప్రగతి సాధించవచ్చు. అనారోగ్యం పాలైతే, సంపాదన హరించుకుపోతుంది. సంపాదన తగ్గుతుంది.

ఆరోగ్యవంతమైన శరీరధారి లక్షణాలు

వ్యక్తి వయస్సు మరియు వ్యక్తి ఎత్తును బట్టి సరైన బరువు కలిగి ఉంటారు.

శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.

ఆరోగ్యవంతుల గుండె లయబద్దంగా కొట్టుకుంటుంది.

అలాగే ఆరోగ్యంతో ఉండేవారి నాడీ కూడా లయబద్దంగా కొట్టుకుంటుంది.

శరీరంలో రక్త ప్రవాహం తగినంతగా సాగుతుంది.

అరుగుదల సక్రమంగా ఉంటుంది.

మల విసర్జనలో, మూత్ర విసర్జనలో సమస్యలు ఉండవు… తదితర విషయాలలో శరీర పనితీరు చక్కగా ఉంటుంది.

ఆరోగ్యం గురించి శ్రద్దగా పాటించవలసినవి

పౌష్టకాహారం

ఆహారం తీసుకునే విషయంలో సమయ పాలన

మంచినీరు తగినంతగా త్రాగుట

శరీరానికి నిర్ధిష్ట సమయంలో వ్యాయామం అవసరం

అలాగే నిర్ధిష్ట సమయంలో మనసుకు వ్యాయామం ఉండాలి.

నిత్యం నిర్ణీత సమయంలో ధ్యానం చేయడం తదితర నియమాలు చెబుతారు.

అద్బుతమైన పరికరాలను అపురూపంగా చూసుకుంటూ ఉంటే, మరి శరీరం కన్నా అద్బుతమైన సాధనం ఈ సృష్టిలో మరొకటి లేదని అంటారు.

పరికరాలను మనిషి సృష్టించగలడు, కానీ శరీరమును కాదు. ఇది మాతృగర్భంలో జరిగే ప్రక్రియ…. కాబట్టి వెలకట్టలేని శరీరాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకోవడం వ్యక్తి యొక్క కర్తవ్యం.

బలమైన మనసును నియంత్రణలో ఉంచుకోవడం అంటే తనని తను జయించడం అంటారు.

ఆరోగ్యం విషయంలో మనసు చాలా కీలకం. నియమాలు పాటించాలన్నా, విడిచిపెట్టాలన్నా మనసే ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కాబట్టి శరీరం, జీవితం విలువ తెలియజేసే రచనలు, పెద్దల మాటలు వలన మాటవినని మనసు కూడా నియమాలు పాటించడానికి సిద్ద పడుతుంది.

ఆరోగ్యం కన్నా గొప్ప ఆస్తి లేదు. అనారోగ్యంగా కన్నా పెద్ద శత్రువు లేడు. మనసు మద్యలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. దానిని నియంత్రించడమే ప్రధానం అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది. భక్తి భలే మందు మనుసుకు. భక్తిభావన చేత మనసు శాంతికి దగ్గరగా అశాంతికి ఆమడ దూరంగా ఉంటుంది.

భక్తి భావనలు… భక్తి భావన బలమైనది

దైవంపై మనసుకు ఏర్పడే భక్తి భావన ఎంత బలంగా ఉంటే, అంతటి మనోశక్తి అంటారు. విగ్రహం ముందు నిగ్రహం మనలో మనోశక్తికి మూలం అంటారు.

ఎవరికి ఇష్టమైన దైవం, వారి వారి మనసు మూలంలో ఉంటారు. కానీ మనసు తనకు తాను ఏర్పరచుకునే విషయలాలస వలన మూలలోనే మిగిలిపోతుంది.

మనసు ఏర్పరచుకునే విషయాలు, అలవాటుగా మారి ఉంటాయి. అలా అలవాటులు మనసులో ఉన్న భక్తి భావనను తొక్కి పెడతాయి. బలమైన అలవాటులు శక్తిని హరిస్తూ ఉంటే, మనసు మాత్రం అలవాటుకు లొంగుతుంది.

నియంత్రణ ప్రధానంగా ఆచారం ఉంటే, కేవలం మన మనసును విషయవాసనల నుండి దూరం చేయడానికే ఆచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అయితే, ఆచరించడం మనసుకు మందు వేయడం వంటింది.

సమాజంలో మనిషి చుట్టూ ఉండే విషయాలు మనసులో గూడు కట్టుకుని ఉంటాయి. మదిగదిలో మెదిలే ఆలోచనలు కేవలం విషయాలవైపు మాత్రమే వెళితే, ఆ మనసుకు వ్యాపకాల పరంపర అంటే అమిత ఇష్టం ఏర్పడుతుంది.

విషయాలను చూస్తూ, విషయాల సృష్టికి ఆధారమైన వాడిని తలుస్తూ ఉండడం వలన మనసులో మూలలో దాగి ఉన్న భక్తి పైకి వచ్చే మార్గం కూడా ఏర్పడుతూ ఉంటుంది.

మనకు భక్తి భావం బలమైనది మనసుకు శాంతి అందించడంలో భక్తి భావం ముందుంటుంది. కారణం కష్టాలకు చలించిపోకుండా మనసుకు దైవమున్నాడనే భావన మనసులో చేరిన ఆందోళనను చెరుపుతుంది. ఆందోళన లేని మనసు అది శాంతిగా ఉంటుంది. దాని చుట్టూ ఉండేవారిని శాంతితో ఉండనిస్తుంది. కాబట్టి భక్తి భావం మనసుకు శాంతిని అందిస్తుంది.

బలమైన మనసుకు బలహీనతే అద్దంకి. బలహీనత కూడా బలంగా మార్చగలిగే శక్తి దైవానికి ఉందని పెద్దలంటారు. కానీ భక్తి భావన బలంగా లేకపోవడం వలననే, మనసు ఆందోళనకు దగ్గరగా, అశాంతిని అనుకుని ఉంటుంది.

ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న అనుభవాలు అనుభవిస్తూ, మనసులో మరో మూలన పడిన భక్తి భావనను పైకి తీసుకువచ్చే ఆలోచనలకు కూడా అవకాశం ఇవ్వడమే భక్తి భావన బలపడడానికి మార్గం అంటారు.

జీవితంలో కష్టసుఖాలు కామన్. కానీ కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. ఇష్టపడి పనిచేస్తే, కష్టం తెలియకుండా పని పూర్తి అవుతుంది. అది కూడా మనసు వలననే అంటారు.

అలాంటి మనసుకు భక్తి భావనను కూడా పెంచే విధంగా ఆలోచనలకు అవకాశం ఇవ్వడమే భక్తి భావన పెరుగుదలకు బీజం పడుతుంది.

విగ్రహం ముందు నిగ్రహం వహించడం నియంత్రణలో ప్రాధమిక ప్రయత్నం

విగ్రహం ముందు నిగ్రహం వహించడం నియంత్రణలో ప్రాధమిక ప్రయత్నం అయితే, భక్తి భావన బలపడడానికి అది ఆది ప్రయత్నం అవుతుంది.

మనకు అనేక మతాలు, అనేక దైవాలు, దేవతలు ఉన్నారు. మన సమాజంలో మత స్వేచ్చ ఉంది. దైవనామ స్మరణకు, దైవారాధనకు షరతులు లేవు.

మనసు ఉండాలే కానీ మార్గములు అనేకం. భక్తి అనే భావన మనసులో మెదలాలి కానీ దేవతలకు కొదువలేదు.

ఒక దైవం అనుకుని. ఆ దైవంపై నమ్మకం ఉంచుకుని, ఆ దైవ నామస్మరణ చేయడం. ఆ దైవ స్వరూపమును మనసులో ముద్రించుకోవడం ప్రధానం అయితే అందుకు విగ్రహారాధన మొదటిమెట్టు అంటారు.

దైవ స్వరూపమును మనసులో బలంగా ముద్రించుకోవడానికి మార్గం విగ్రహం ముందు నిగ్రహంతో ఉండడం.

నిగ్రహం అలవాటు కావడానికే విగ్రహం ముందు కూర్చుని నియమాలతో ఉండడం. స్తోత్రం చేయడం, దైవ సేవ చేయడం అంటారు.

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో చదవండి. ప్రకృతిలో గాలి, నీరు, అగ్ని, భూమి ప్రకంపనల వలన విపరీతాలు సంభవిస్తే వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు.

ఈ పంచభూతాలలో ఏది అధికమైనా అది ప్రకృతి వైపరీత్యంగా సంభవించి, వాటివలన మనవాళికి అపారనష్టం జరుగుతూ ఉంటుంది.

ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుడు అడ్డుకోవడం కష్టం. కానీ కొన్నిసార్లు ప్రకృతిలో జరుగుతున్నా మార్పులు గమనించి, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయగలడు.

అలా ముందుగానే ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసినప్పుడు మాత్రం, ముందస్తు చర్యల వలన ప్రకృతి వైపరీత్యాల వలన మానవాళికి జరగబోయే అపారనష్టం నుండి కొంతవరకు బయటపడగలడు.

ఎన్ని ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నష్టం తీవ్రంగానే ఉంటుంది. కారణం ప్రకృతిలో పంచభూతాలు ప్రకోపిస్తే, వాటి ప్రతాపం చాలా ప్రభావం చూపుతాయి.

భూకంపాలు – భూమి కంపించుట వలన ప్రకృతి వైపరీత్యాలు

భూమి అడుగుభాగం వివిధ పొరలతో వివిధ లోహాలతో ఉంటుంది. భూమి లోపల కూడా నీరు, ఖనిజాలు ఉంటాయి. భూమి లోపల చర్యలు జరిగినప్పుడు భూమి ప్రకంపనలకు గురి అవుతుంది.

అకస్మాత్తుగా భూమిలోపల ఏర్పడే చర్యలతో లేక విడుదల అయ్యే శక్తి వలన భూమి కంపిస్తుంది. అలా భూమి కంపించినప్పుడు భూమి పగిలి బీటలువారుతుంది.

భూమి కంపించడం భూమి పగలడం వలన భూమిపైన ఉండే భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదాలు వలన ప్రాణనష్టం, ఆస్తినష్టం, ఆర్ధిక నష్టం జరుగుతూ ఉంటుంది.

ఇలా భూమి నుండి ఏర్పడే ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కొరకు భూకంపాలను అంచనా వేసే పరికరాల సాయంతో భూకంపం సంభవించే సమయం ముందుగానే పసిగడితే, ముందస్తు చర్యలు వలన ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చు.

అయితే ఆస్తి నష్టం, ఆర్ధిక నష్టం అడ్డుకోవడం అసాధ్యం.

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు
ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

అగ్ని ప్రమాదాలు వైపరీత్యాలు

అగ్ని వలన జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వలననే జరుగుతాయి. గ్యాస్ లీక్ కావడం, కెమికల్ లీకేజ్ తదితర తప్పుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.

ఇటువంటి అగ్ని ప్రమాదాలు నుండి రక్షణ కొరకు నీరు, ఇసుక, వాయువులు వంటివి అందుబాటులో ఉండడం వలన అగ్ని ప్రమాదాలు పెద్ద ప్రమాదాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడవచ్చు.

పెద్ద మొత్తంలో గ్యాస్ లీకేజ్ వంటివి అపార నష్టం చేయగలవు. మానవ తప్పిదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే, అగ్ని ప్రమాదాల నుండి రక్షణ ఉంటుంది.

అగ్నిమాపక సిబ్బంది వలన చాలావరకు అగ్ని ప్రమాదాలను ఆర్పిన ఘటనలు ఉన్నాయి.

గాలి-నీరు ప్రకృతి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించేది గాలి-నీరు వలనే. తుఫాన్, అతి భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులు ఇంకా సునామీ వంటి విపత్తులు మనవాళికి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి.

సముద్రగర్భంలో జరిగే విపరీత చర్యలు వలన సునామీ ఏర్పడితే, తీర ప్రాంతం అంతా నీటిమయం అవుతుంది. తీరప్రాంతాలు అన్నీ నీట మునుగుతాయి. ఇటువంటి సునామీలు వలన ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలు అపారనష్టం తీసుకువస్తాయి.

ఇంకా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వలన తీవ్ర వర్షాలు, అతి భారీ వర్షాలు కురవడం వలన కూడా నదులు విపరీతంగా ప్రవచించి వరదలుగా సంభవిస్తాయి.

వరదల వలన ప్రాణ నష్టం, పంటనష్టం, ఆస్తి నష్టం, వ్యవస్థలు స్తంభించడం వంటివి జరుగుతాయి. వాయుగుండం తీరం దాటుతున్నప్పుడు ఈదురు గాలులు, అతిభారీ వర్షాలు చాలా నష్టం కలిగిస్తాయి.

వాతావరణం మార్పులు గమనిస్తూ, ముందస్తు హెచ్చరికలు చేయడం వలన ఒక్కోసారి గాలి-నీరు వలన సంభవించే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త వహించినా ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవించేది.

గాలి-నీరు వలన సంభవించే విపత్తుల నుండి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడగలరు కానీ ఆస్తినష్టం, ఆర్ధికనష్టం, వ్యవస్థలు స్తంభించడం వంటివి జరగకుండా అడ్డుకోవడం అసాధ్యమే అవుతుంది.

అయితే ప్రకృతి వైపరీత్యాలు జరిగిన వెంటనే పునరుద్దరణ చర్యలు తీసుకునే వ్యవస్థ మనకు అందుబాటులో ఉండాలి. అందుకు అందరూ స్పందించి తగినంత సాయం చేయాలి. ఇటువంటి సాయం చాలామంది చేసి ఉన్నారు… కూడా.

ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు

ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు, అంటే ప్రకృతిలో అసహజత్వం జరగకుండా చూసుకోవడమే అంటారు.

సహజంగా ఏర్పడిన పర్యావరణంలో భూమిపై గాలి, నీరు, నిప్పు సాయంతో జంతుజాలం, మానవుడు నివాసం ఉంటారు. జంతువులు కేవలం వాటి ఆహారం, నివాసం విషయంలో ప్రకృతిలో లభించే సహజస్థితిలోనే జీవిస్తాయి.

ప్రకృతిని తనకు నచ్చినట్టుగా మార్చుకునే తెలివి, సామర్ధ్యం మనిషికి సొంతం. అటువంటి తెలివి ప్రకృతి సహత్వాన్ని దెబ్బతీసి, ప్రకృతి సమతుల్యత పాడైతేమాత్రం ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి.

ఎంత సహజంగా ప్రకృతి ఉంటే అంతా ఆహ్లాదకరమైన ప్రకృతి, ఎంత అసహజత్వానికి గురి అయితే, అంతటి విపత్తులను పొందుతుంది. అది విపరీత స్వరూపాన్ని పొందితే మానవాళికి నష్టమే కానీ లాభం ఉండదు.

ప్రకృతి విపరీత స్థితికి చేరడానికి గాలి-నీరు ఎక్కువగా సాయపడతాయి. ప్రకృతిలో కుత్రిమ చర్యలు సహజత్వాన్ని పాడు చేయకుండా తగు జాగ్రత్తలు టేసుకోవాలి.

మనిషితోబాటు కలిసి జీవించే జంతుజాలం వలన కూడా ప్రకృతి సమతుల్యత ఉంటుంది అని అంటారు. కాబట్టి ప్రకృతిలో జంతుజాలం అంతరించిపోయే చర్యలను కూడా నివారించాలి.

ప్రకృతి వైపరీత్యాల నివారణకు, ప్రకృతిని సహజత్వం నుండి దూరం చేయకుండా ఉండడమే ప్రధానం…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో! భూమి, గాలి, నీరు ఉన్న చోట మొక్కలు, చెట్లు, జంతువులు ఉంటే, దానిని సహజ పర్యావరణం అంటారు. ప్రకృతి నియమాల ప్రకారం అనేక జీవజాతులు ప్రకృతిలో నివసిస్తాయి.

అటువంటి పర్యావరణంలో మనిషి కూడా ఒక భాగస్వామి. బుద్ది కుశలత, తెలివి కలిగిన మానవుడు ప్రకృతిని తనకు సౌకర్యంగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటాడు.

అలాంటి మనిషి కొన్ని ప్రాంతాలలో మనిషి ఏర్పచుకునే నివాసాలలో ప్రకృతి మార్పుకు గురి అవుతుంది. అటువంటి మనిషి చుట్టూ పర్యావరణం తన సహత్వానికి బిన్నంగా మారుతుంది. కొన్ని చోట్ల పకృతికి హాని జరిగే విధంగా చర్యలు ఉంటే, పర్యావరణం దెబ్బ తింటుంది. ఇది మనిషి ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది.

సహజమైన నీరు స్వచ్చంగా ఉంటూ, మనిషికి ఉపయోగపడుతుంది. స్వచ్చమైన గాలి మనిషిని ఆహ్లాదపరుస్తుంది. కానీ ప్రకృతి సహజత్వాన్ని దెబ్బతీయడం వలన ప్రకృతి వనరులు కూడా సహజత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. దాని వలన మనిషికే నష్టం వాటిల్లనుంది. సహజ వనరుల శక్తి మనిషికి అందె అవకాశం తగ్గుతూ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ గురించి పాటు పడవలసిన అవసరం ప్రతి ఒక్కరి సామాజిక బాద్యత.

ప్రకృతిలో సహజంగా లభించే వనరులు వలన సృష్టిలో అనేక జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. చెట్లు వదిలే గాలి మనిషికి ప్రాణవాయువు అయితే, చెట్లు వలన మనిషి ఎంతో ప్రయోజనం పొందుతున్నాడు.

పర్యావరణంలో చెట్లు చేసే పని, అవి బ్రతికినంతకాలం కొనసాగుతుంది. చెట్లు ఎక్కువగా ఉన్న చోట గాలి స్వచ్చంగా ఉంటూ, గాలి కాలుష్యం తక్కువగా ఉంటుంది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా

అందుకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజంగా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతావరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.

సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు జరుగుతున్నాయి. అంటే మనిషి వలన ప్రకృతికి జరుగుతున్న నష్టం ఏమిటో? పెద్దలు గుర్తించారు. కాబట్టే పర్యావరణ పరిరక్షణ నినాదాలు వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఏర్పడింది.

అంతగా పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారుకాగలవు… కావున మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది.

వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగినంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవులపైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.

నీటి దుర్వినియోగం కూడా పర్యావరణ పరిరక్షణకు చేటు చేస్తుంది.

గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో…

వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమిలో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగుతుంది. అందువలన నీటి దుర్వినియోగం అయితే, భూమిలోపల నీరు తగ్గుతుంది. దానితో భూమిలోపల సమతుల్యత లోపిస్తుంది.

నీటి వాడకం జాగ్రత్తగా జరిగితే, భూమి నుండి వెలికి తీసే నీటి శాతం తగ్గుతుంది. ప్రకృతి సహజంగా నీరు వానరూపంలో కురవడానికి అనేక చెట్లను తయారుచేసుకోవలసిన అవసరం నేటి మానవాళిపై ఉంది.

వివిధ పరిశ్రమల నుండి నిషిద్ద జలాలు వెలువడితే, వాటి వలన కూడా పర్యావరణకు ప్రమాదము.

నేటి మొక్కలే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి వృక్షాలుగా మారాలి.

నేటి మొక్కలే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి వృక్షాలుగా మారాలి అంటే, పర్యావరణ పరిరక్షణలో విధ్యార్ధులు పాత్రతను తీసుకోవాలి. విధ్యార్ధులు పర్యావరణ పరిరక్షణ గురించి, మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి, తెలియని వారికి తెలియజేస్తూ ఉండాలి.

భవనాల నిర్మాణం కొరకు, రోడ్ల నిర్మాణం కొరకు చెట్లను తొలగించడం కోసం పాటుపడే వారికన్నా, మొక్కలు నాటి, వాటిని పెంచడానికి పాటు పడేవారి శాతం తక్కువ.

కాబట్టి నేడు నాటిన మొక్కలలో ఏదో ఒక్కటి అతి పెద్ద వృక్షంగా మారగలదు. ఆక్సిజన్ అందించగలదు. ఎండ నుండి రక్షణ కల్పించగలదు. కావున మొక్కలు నాటడం, వాటిని చెట్లుగా ఎదిగేవరకు కృషి చేయడం గురించి ఉదృతమైన ప్రచారం ఒక ఉద్యమం లాగా జరగాల్సిన ఆవశ్యకతను నేటి ప్రకృతి సమస్యలు తెలియజేస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచుకుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉంటుంది.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం. శతకాలు చదవమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉన్నత తరగతి పాఠ్యాంశాలలో కూడా తెలుసు శతకాలు ఉంటాయి.

పలువురు పెద్దలు శతకాలను చదవమని చెప్పడమే, శతకాలు చదవానికి ఒక ప్రేరణ. ఇంకా ఉన్నత తరగతి పాఠ్యాంశాలలోనూ తెలుగు శతకాలు ఉండడం కూడా ప్రధాన కారణంగా కనబడుతుంది.

సమాజనికి మేలు చేసే విషయాలు బాల్యం నుండి అలవాటు చేయడం కోసం పలు పాఠ్యాంశాలు విధ్యార్ధులకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ విధంగా ఆలోచన చేస్తే, శతకాలకు మన పెద్దలు ఇచ్చిన ప్రాధాన్యత గుర్తించవచ్చు.

ఎందుకు శతకాలు చదవాల్సిన అవసరం ఉంది?

తెలుగులో శతకాలను చదవమని ప్రేరేపించవలసిన అవసరం ఎందుకు అంటే, శతకాలు విశేషమైన అర్ధాన్ని కలిగి ఉంటాయి. వాటిలో వివిధ తాత్విక, దైవిక, సామాజిక, వ్యక్తిత్వ విషయాలను సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జీవనగమ్యం గురించి ఆలోచన రేకెత్తించేవిధంగా శతకాలలో పద్యాలు ఉంటాయి.

శతకాలు నీతిని ప్రభోదిస్తాయి. విలువలను గురించి ఆలోచనలు రేకెత్తిస్తాయి.

జీవితలక్ష్యం, జీవిత పరమార్ధం, సామాజిక సంబంధం ఇలా పలు విషయాలలో ప్రశ్నలు ఉంటాయి. వ్యక్తిత్వం, వ్యక్తి యొక్క మనస్తత్వం గురించి శతకాలు యందు ఉండేడి పద్యాలలో ఉంటాయి.

శతక పద్యాలు చిన్న పదలతోనే ఉంటాయి. కానీ బావం బలంగా ఉంటుంది. ఇంకా శతకాలలో భక్తి భావనను పెంచే విధంగా పలు పద్యాలు ఉంటాయి.

భక్తి భావన మనిషి మనసుకు శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. కాబట్టి భక్తి పరమైన భావనలు పెరడానికి శతక పద్యాలు ఉపయుక్తంగా ఉంటాయి.

ముఖ్యంగా శతకాలు మనిషి చిత్తశుద్దిని ప్రశ్నిస్తూ కూడా ఉంటాయి. ఇంకా సమాజంలో గల వివిధ స్వభావుల గుణాలను కూడా తెలుపుతాయి.

ఆసక్తికరమైన విషయం తెలుగు శతకాలు ఎక్కువగా వాడుక భాషలోనే ఉంటూ, వివిధ విషయాలలో ఆసక్తికరమైన ఆలోచనను మనసులో ఏర్పరచగలవు. అయితే తెలుగు వాడుక భాష వివిధ భాషలతో కలిసి భాషలో పదాలు మరుగున పడడం వలన తెలుగు వాడుక భాష కూడా గ్రాంధిక భాష వలె అనిపించడం నేటి సమాజంలో సహజమైంది.

తెలుగులో గల వివిధ శతకాలు

  • వేమన శతకం
  • దాశరధి శతకం
  • సుమతి శతకం
  • భాస్కర శతకం
  • శ్రీ కాళహస్తీశ్వర శతకం

ఇంకా వివిధ తెలుగు శతకాలు కలవు.

ప్రతి తెలుగు శతకం పద్యం చివరలో మకుటం ఉంటుంది. ఆ మకుటం శతక పద్యాలు రచించిన వారి పేరుతో కూడి ఉండవచ్చు. లేక రచయత ఇష్టదైవ పేరుతో కూడి ఉండవచ్చు.

వేమన శతకం యొక్క మకుటం విశ్వదాభిరామ వినురవేమ అయితే సుమతీ శతకం మకుటం సుమతీ…

శ్రీకాళహస్తీశ్వరా శతకం రచయిత దూర్జటి, శ్రీకాళహస్తీశ్వరా శతకం మకుటం శ్రీకాళహస్తీశ్వరా దూర్జటి యొక్క ఇష్ట దైవం.

పద్య రూపంలో నీతిని బోధించే శతకాలు వ్యక్తిలోని చిత్త శుద్దిని ప్రశ్నిస్తూ ఉంటాయి. శతక పద్యాల యొక్క భావన బలపడ్డ వ్యక్తి యొక్క మనసు చెడుకు దూరంగా ఉంటుంది.

తెలుగులో గల శతకాలు చదవడం వలన మనసుకు మేలు జరుగుతుందని పెద్దలంటారు… కావున శతకాలు చదవడం మంచి అలవాటు అవుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో ఈ పోస్టు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

మనిషికి మరచిపోవడం ఎంత సహజమో అంతకన్నా ఎక్కువ విషయాలు గుర్తులో ఉంటాయి. ఏదైనా మరిచిపోయే విషయం అతిగా ఉండడం అంటే బాగా వయస్సు అయిపోయాక జరిగేది మాత్రమే…

మరిచి పోవడం అనేది చాలా సహజం, అయితే అన్నీ విషయాలు మరిచిపోము. ఎప్పుడో ఏదో ఒక విషయం మరిచిపోతే మనకు పది విషయాలు గుర్తుకు ఉంటాయి. అంటే ఇక్కడ మరిచిపోయినది, గుర్తుకు రాకపోయేసరికి కలిగే చికాకు వలన మనసు పొందే భావన వలన మిగిలిన విషయాలు ప్రక్కకు వెళ్ళిపోతాయి.

ఇది పాఠాలు విషయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రాని ప్రశ్నలు గురించి ఆలోచించి వచ్చిన ప్రశ్నల సమాధానాలు మరిచిపోవడం జరుగుతూ ఉంటుంది.

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా అంటే, సహజంగా పాఠాలు అర్ధం చేసుకోవడం మేలైన విధానం అయితే, తగినంత సాధన చేయడం మరింత మంచి ఫలితం వస్తుంది.

పాఠాలు గుర్తులో లేకపోవడానికి కొన్ని కారణాలు

  • అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం
  • సబ్జెక్టులో ఏదో ఒక సెక్షన్ పై అనవసరపు భావన (కొందరు లెక్కలు బాగా చేస్తారు. కానీ ఆల్జీబ్రా అంటే ఆసక్తి తక్కువ. అంటే ఆసక్తి లేని విషయాలలో సాధన చేయకపోవడం)
  • ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం
  • పరీక్షా సమయంలో వేరొకరి భావన బలంగా మనసులో ఉండిపోవడం

అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం

ఒకటికి పదిసార్లు పుస్తకాలలో పాఠాలు బట్టి బట్టడం వలన కొన్నిసార్లు గుర్తుకు ఉంటాయి. కొన్నిసార్లు ఒత్తిడిలో గుర్తుకు రాకపోవచ్చు. పుస్తకంలో పాఠాలు అర్ధం చేసుకుంటూ చదివి ఉండక పోవడం వలన అవి గుర్తుకు రాకపోవచ్చు.

అదే పుస్తకంలో పాఠాలు పాఠశాల తరగతిలో చెప్పినప్పుడు శ్రద్దగా వింటే, అసలు పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటో తెలియబడుతుంది. ప్రాధమికంగా పుస్తకంలో చాప్టర్ ప్రస్తావిస్తున్న అంశం అర్ధం అయితే, ఆ అంశంపై మైండులో ఆలోచనలు పెరుగుతాయి. తద్వారా ఆ అంశంపై అవగాహన పెరిగి, ఆ అంశంలో ప్రశ్నలకు సమాధానాలు సమయానికి తట్టే అవకాశం ఉంటుంది.

లెక్కల పుస్తకంలో ఉండే సూత్రాలు అర్ధం అయితే, లెక్కలు చేయడం చాలా తేలిక. అలాగే తెలుగు అయినా, సోషల్ అయినా, సైన్స్ అయినా చాప్టర్ లో ఉన్న అంశం గురించి సరైన అవగాహన ఉంటే, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం సులభం అవుతుంది.

కేవలం వచనంతో పాఠాలు అయినా, ఆ పాఠాలలో ప్రస్తావించే అంశం ఏ విషయానికి సంబంధించినది? తెలుసుకుని, ఆ అంశం గురించి మనకు తెలిసి ఉన్న విధానాల ద్వారా కూడా పరిజ్ణానమ్ పెంచుకోవచ్చు.

సహజంగా తరగతి గదిలో చెప్పే పాఠాలు గురించి ఆలోచన చేయడం వలన సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం సాధ్యపడుతుంది.

ఉదాహరణకు సోషల్ సబ్జెక్టులో చరిత్ర ఉంటే, చరిత్రకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. అవి చూస్తే, చరిత్ర గురించి అవగాహన మైండులోకి సులభంగా చేరుతుంది. అలాగే ఆర్ధిక బడ్జెట్ వంటి విషయాలు, స్టాటిస్టిక్స్ గురించి కేవలం పుస్తకాల ఉండే కాకుండా పత్రికలలో న్యూస్, వీడియోలు కూడా చూసి తెలుసుకోవచ్చు. ఒకే రకమైన పద్దతిలో చదువు కన్నా పలు రకాలుగా పరిజ్ణానమ్ పెంచుకోవడమే చదువుకునేతప్పుడు చేయాలి. అర్ధం కానీ పాఠాలు గురించి, తెలిసిన స్నేహితులను అడగడం వలన ఆ పాఠం గురించి గుర్తు ఉంటుంది. ఎందుకంటే స్నేహితుడితో ముచ్చట్లు మైండుకు బాగా పడుతుంది. అలాగే టీచర్లను అడగడం. టీచర్ల అంటే భక్తి, భయం ఉండడం వలన కూడా వారిని అడిగిన పాఠాలు ఎక్కువగా గుర్తులో ఉండే అవకాశాలు ఎక్కువ. ఏదైనా అర్ధం కానీ సబ్జెక్టులో వివిధ పద్దతిలో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ సబ్జెక్టులో కూడా మేలైన ఫలితాలు రాబట్టవచ్చు. సరైన సాధన, పట్టుదలతో చేస్తే, సాధించలేనిది అంటూ ఉండదని పెద్దలు అంటారు.

సబ్జెక్టులో ఏదో ఒక సెక్షన్ పై అనవసరపు భావన (కొందరు లెక్కలు బాగా చేస్తారు. కానీ ఆల్జీబ్రా అంటే ఆసక్తి తక్కువ. అంటే ఆసక్తి లేని విషయాలలో సాధన చేయకపోవడం)

చదువుకునే వయస్సులో టీచర్ల అంటే భయంతో పాటు తోటివారితో అల్లరి కూడా ఉంటుంది. అల్లరితోనో, భయంతోనో ఏదో ఒక సబ్జెక్టులో సాధన తక్కువగా ఉండవచ్చు.

ఇష్టమున్న సబ్జెక్టులో మైండ్ ముందుగానే స్పందిస్తుంది. ఇష్టం లేని సబ్జెక్టులో మైండ్ మాట్లాడదు. మైండుకు ఏదో కష్టం అనే భావన బలపడిన చోట, తప్పించుకోవాలని చూడడం దాని సహజ లక్షణం. కాబట్టి కష్టం అని అనిపించే సబ్జెక్టులో మొదటి నుండి ప్రత్యేకమైన సమయం కేటాయించి, దాని సంగతి చూడాలి.

ఏదైనా మొదటిగా ఏర్పడే భావన, చాలా కాలం ఉంటుంది. ఒక సబ్జెక్టు గురించి పాఠాలు విన్నప్పుడు, సరిగా అర్ధం చేసుకోకపోతే, ఆ సబ్జెక్టుపై మొదటి భావన కష్టమనే భావన ఏర్పడవచ్చు. అందుకే పాఠశాల తరగతులలో పాఠాలు మొదటి నుండి సరిగ్గా వినాలి. మొదటి నుండి సరిగ్గా విని ఉండక పోవడం వలన సబ్జెక్టుపై ఏర్పడే భావన, మైండుపై పరీక్షలలో చూపుతుంది. అలా పరీక్షల నుండి ఆ భావన మరింత బలపడే అవకాశం.

వీక్ సబ్జెక్ట్ ఉందంటే, ఆ సబ్జెక్టులో పాఠాలు సరిగా వినలేదు లేక సరైన సాధన చేయలేదని గుర్తించాలి. ప్రత్యేక సమయం కేటాయించి, ఆ సబ్జెక్టులో సాధన చేయాలి.

ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం

పాఠశాలలో చదువుకునే సమయంలో సబ్జెక్టులపై దృష్టి పెట్టడం మానేసి, పరీక్షల ముందు పుస్తకాలు చదివేసి, పరీక్షలలో వాటిని గుర్తుకు తెచ్చుకుని వ్రాసేయడానికి అలవాటు పడడం వలన ప్రధాన పరీక్షలలో కూడా అదే అలవాటు ఉంటుంది.

బాగా గుర్తుకు ఉండే సబ్జెక్టులు బాగా వచ్చినట్టు, గుర్తులేని సబ్జెక్టులు రానట్టు మనసు భావన పొందుతుంది. ఒక తరగతి సబ్జెక్టులలో అన్నీ బట్టీ బట్టీ చదివే అవకాశం ఉండదు. అందుకనే వచనంలో ఎక్కువ మార్కులు వచ్చే వారికి లెక్కలు, సైన్స్ సబ్జెక్టులలో మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉండవచ్చు.

తరగతి పాఠాలు సరిగా వినక, బట్టీ బట్టి చదివిన పాఠాలు ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయడం కన్నా పాఠాలు సరిగ్గా విని వాటిలో సరైన సాధన చేయడం ఉత్తమం.

పరీక్షల సమయంలో మైండును సహజంగా పని చేసే విధంగా చూసుకోవాలి కానీ ఆందోళనతో ఆలోచించకూడదు.

పరీక్షా సమయంలో వేరొకరి భావన బలంగా మనసులో ఉండిపోవడం

“ఈ సారి మార్కులు తక్కువ వచ్చాయో… నీ పని చెబుతా” ఇక పరీక్షలకు ముందు టీచర్లు కానీ ఇంట్లో పెద్దవారు కానీ మందలించడం కూడా సహజం. ఎందుకంటే భయంతోనైనా భాగా చదువుతారేమో అని వారి ఆలోచనగా ఉంటుంది. అయితే ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని బాగా చదవడానికి ప్రయత్నం చేయాలి… కానీ భయం పెంచుకోకూడదు. ప్రయత్నించక పోతే కచ్చితంగా తప్పే. ప్రయత్నిస్తూ భయం పెట్టుకోవడం అనవసరం… వారు చెప్పినట్టు మంచి మార్కుల కోసం పట్టుదలతో చదవడమే పనిగా పెట్టుకున్నప్పుడు అనవసర భయాలు, భవనాలు వృధా…. కొందరు అలాంటి భయాలే, పరీక్షల సమయానికి కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ పరీక్షల సమయానికి సరైన సాధన చేసి ఉంటే, మైండులో భయం పొందడానికి స్థానం ఉండదు. అయితే గుర్తుకు తెచ్చుకుని భయం పెట్టుకోవడం వలన అనవసర ఒత్తిడి వస్తుంది. పరీక్షల సమయంలో ఎప్పటికీ ఏ సబ్జెక్టులో పాఠాలు అవసరమో, ఆ పాఠాలు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి.

ఇలాంటివి అన్నీ ముఖ్యంగా మనసుకు సంబంధించినవే…. కాబట్టి మనసుకు తర్ఫీదు ఇస్తే, చాలు. ఇంకా పౌష్టికాహారం సర్వ సాధారణం.

ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మాత్రం అవసరానికి అసలు విషయం గుర్తుకురాదు. ఆ సమయంలో మరింత చికాకు తెచ్చుకుని, కోపం తెచ్చుకుంటే, మరింత ఒత్తిడికి లోనయ్యి గుర్తులో ఉన్న విషయం కూడా మరిచే అవకాశం ఎక్కువ.

గుర్తులో లేదు, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే ముందు మనకు ముందు చేయవలసిన పనిని ముగించేసి, అప్పుడు గుర్తుకు రావలసిన విషయం గురించి ఆలోచించాలి.

చేయవలసిన పని ముందు ఉండగా, ఆ పని యొక్క ఒత్తిడి మైండుపై కొంత ఉంటుంది. ఆ పని వదిలి గుర్తులో లేని విషయం గురించి ఆలోచన చేస్తే, చేయవలసిన పని వలన ఉండే ఒత్తిడి మైండులో మరింత పెరుగుతుంది.

అదెలాగంటే ఉదాహరణ:

మీరు ఇంట్లో డ్రాయింగ్ వేయడానికి సిద్దం అయ్యారు. ప్రాజెక్టు వర్కులో భాగం ముఖ్యమైన డ్రాయింగ్ వేయాలి. దానికి సిద్దం అయ్యారు. ఈలోపు మీ అమ్మగారు వచ్చి “ఉదయం నీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టవు?” అని అడిగారు. వెంటనే మీరు బ్లాంక్ మైండుతో ఆలోచనలోకి వెళ్లారు. ఎందుకంటే ఉదయం స్కూల్ కు వెళ్ళే హడావుడిలో డబ్బులు తీసుకోవడం గుర్తు ఉంది. కానీ ఆతర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. సడన్ గా అమ్మ డబ్బులు అనగానే తీసుకోవడం గుర్తుకు వస్తుంది. కానీ డబ్బులు ఎక్కడ పెట్టడం జరిగిందో గుర్తుకు రాదు. ఇక ఆ డబ్బులు గురించే ఆలోచన చేస్తే, ఆలోచన పెరిగి పెరిగి చికాకు కలుగుతుంది. ‘ఒక ప్రక్క డ్రాయింగ్ వేయాలి’ అనే ఆలోచన మైండులో మెదులుతూ ఉంటుంది. కానీ డబ్బులు గురించి ఆలోచన కూడా వస్తుంది. డబ్బులు గుర్తుకు రాకపోతే, అమ్మ మరొకమారు అడిగేటప్పటికి కోపం కూడా కలుగుతుంది. అలా కాకుండా అమ్మ డబ్బులు అడగగానే, ముందుగా అమ్మతో “నేను డ్రాయింగ్ అర్జెంటుగా వేయాలి, ఈ పని పూర్తయ్యాక డబ్బులు ఎక్కడ పెట్టానో వెతికి ఇస్తాను” అని చెబితే, ముందుగా మీరు డబ్బులు గురించిన ఆలోచన నుండి బయటకు వచ్చేయవచ్చు. డ్రాయింగ్ వేయడం, సంతృప్తిగా పూర్తి చేశాక, ఆలోచిస్తే డబ్బులు విషయం వెంటనే గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. శాంతితో ఉండే మనసు పనితీరు అద్భుతమని చెబుతారు.

ఇలా మీకు క్వశ్చన్ పేపరులో కూడా సడన్ గా ఆమ్మ అడిగిన ప్రశ్నలాగానే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని మొదట మరిచిపోవాలి. బాగా వచ్చిన క్వశ్చన్స్ గురించి బాగా వ్రాసేసి, ఆపై గుర్తులో లేని ప్రశ్నలు సంగతి చూడాలి.

అంటే గుర్తు లేకపోవడం అంటే మనసులో జరిగే ప్రక్రియ. ఏదో ఒక విషయంలో మరుపు సహజం. అయితే అది శాశ్వతం కాదు. మరలా అది గుర్తుకు వస్తుంది. కానీ ఒత్తిడి గురి అయితే మాత్రం చికాకు, అసహనం కలుగుతాయి.

ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకోవడం ఎలా?

ఒత్తిడిలో ఉన్నప్పుడూ గుర్తుకు తెచ్చుకోవడం ఎలా? ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది?

సహజంగా పరీక్షా కాలంలో ఒత్తిడి ఉంటుంది. దీనివలన నాకు మతి మరుపు ఉందేమో అనే ఆలోచనలు కూడా పెరుగుతాయి.

ఇంకా కొందరికి పెద్దవారు భయపెడుతూ చెప్పిన మాటలు వలన అనవసరపు భయాలు పొందుతారు. బాగా చదివే వారికి కూడా ఈ భయం వలన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది.

ఒక్కసారి పరీక్షా హాలులో కూర్చుంటే, కేవలం క్వశ్చన్ పేపరులో ఉన్న క్వశ్చన్స్ గురించి మాత్రమే చూడాలి. ప్రశ్నలకు సమాధానాలు చక్కగా వ్రాయడానికి ప్రయత్నం చేయాలి, కానీ గతంలో విన్న హెచ్చరికల గురించి కాదు.

మరిచిన విషయాలు గుర్తుకు తెచ్చుకునే సమయం మనసు శాంతిగా ఉండాలి. అంటే అప్పటికి చేయవలసిన పనిని పరిపూర్ణంగా చేయాలి.

ఒక సంవత్సరంలో ఒక తరగతి విధ్యార్ధులు పరీక్షలు నిర్వహించ బడతాయి. వాటిలో ఉత్తీర్ణత శాతం, ప్రతి విధ్యార్ధికి ఒక గుర్తింపు తెచ్చిపెడుతుంది.

ఎక్కువ మార్కులు వచ్చేవారికి ప్రశంశలు, తక్కువ మార్కులు వచ్చినవారికి హెచ్చరికలు సహజంగా వస్తాయి.

చదువుకునే కాలంలోనే నేర్చుకునే వయస్సు. ఎంత నేర్కుకుంటే అంతా పనితనం అబ్బినట్టు, ఎంత చక్కగా ఏకాగ్రతతో పాఠాలు వింటే, అంతా చక్కగా పాఠాలు అర్ధం అవుతాయి. సబ్జెక్టుపై సరైన అవగాహన ఏర్పడుతుంది. మరింత సాధన చేస్తే, సమాధానాలు సారవంతంగా అర్ధవంతంగా వ్రాయగలరు.

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

మాయొక్క పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం , కొత్తగా కట్టబడిన మా పాఠశాలలోకి మేము ఈ మద్యనే మారాము. అందమైన భవనంలోకి మా పాఠశాల మార్చబడింది.

ఊరికి దూరంగా కొత్తగా నిర్మించిన పాఠశాల చుట్టూ చెట్లు ఉంటాయి. చాలా ప్రశాంతంగా పాఠశాల వాతావరణం ఉంటుంది. మూడు అంతస్తుల భవనంలో అన్నీ తరగతులు మరియు తరగతుల సెక్షన్ల వారీగా గదులు ఉంటాయి.

నేను చదువుకునే తరగతి గది చివరి ఫ్లోర్. మాతరగతి గదికి ఒక డోర్, ఇంకా రెండువైపులా కిటికీలు ఉంటాయి. కిటికీల వలన సహజమైన గాలి మా తరగతి అంతా వ్యాపిస్తుంది.

ప్రతిరోజు సరైన సమయానికి విధ్యార్ధులు తరగతులకు హాజరు కావాల్సిందే. అలాగే మాకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా పాఠాలు టైమ్ టేబల్ ప్రకారం ప్రారంభిస్తారు.

తరగతిగది కిటికీలో నుండి బయటకు చూస్తే, పొలాలు, చెట్లు కనబడతాయి. స్కూల్ చుట్టూ వేయబడిన మొక్కలు వలన పాఠశాల ఆవరణ అంతా అందంగా కనబడుతుంది.

మా పాఠశాలలోని పిల్లలంతా ఆటలు ఆడుకోవడానికి పాఠశాల ముందు పెద్ద ఖాళీస్థలం ఉంది. ఆ స్థలంలో మేమంతా చక్కగా ఆటలు ఆడుకుంటాము.

ఆస్థలంలో ఆటవస్తువులు కూడా మాకు మా పిఇటి సర్ ఇస్తారు.

పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్ లోనే విషయాలమైన హాల్ ఉంది. అందులో స్టేజ్ కూడా ఉంది. ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగితే, మేమంతా ఈ హాల్ నందే కూర్చుని వీక్షిస్తాము. స్టేజ్ కు ఉన్న గోడపై ఎల్‌సి‌డి స్క్రీన్ ఉంది. దానిపై మాకు ఆన్ లైన్ క్లాస్ వీడియోలు ప్రదర్శిస్తారు.

మాకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అంతా మాకు తరగతి గదులలోనే చక్కగా పాఠాలు చెబుతారు. చాలా అర్ధవంతంగా పాఠాలు చెబుతారు.

ఇంకా ఆన్ లైన్ ద్వారా కూడా పాఠాలు గల వీడియోలు మాకు చూపిస్తారు. ఏవైనా సందేహాలు అడిగితే, వాటికి వివరణ ఇస్తూ, మాకు అర్ధం అయ్యేలాగా పాఠాలు చెబుతారు.

మా పాఠశాలలో ఉపాధ్యాయులు సగం మంది పైగా చాలాకాలం నుండి మాపాఠశాలలోనే పాఠాలు చెబుతున్నారని, మా ప్రిన్సిపల్ సర్ చెబుతారు.

దూరం నుండి, పొరుగుళ్ళ నుండి వచ్చే విధ్యార్ధులను పాఠశాలకు తీసుకురావడానికి స్కూల్ బస్సులు కలవు. పాఠశాల నిర్వహణ ఉన్న ప్రతిరోజు బస్సుల ద్వారా చాలామంది విధ్యార్ధులు దూరం నుండి, పొరుగుళ్ళ నుండి వస్తూ ఉంటారు. పాఠశాల తరగతులు అయిపోగానే, మరలా అవే బస్సులలో ఇంటికి బయలుదేరతారు.

చుట్టూ చెట్లు, పొలాలు ఉండే, మాపాఠశాలకు శభ్ద కాలుష్యం ఉండదు. చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో పాఠాలు వింటాము. లంచ్ బ్రేక్ లో మేమంతా భోజనాలు చేయడానికి, విశాలమైన గది మాకు ఉంది. అందులోనే మేమంతా భోజనాలు చేస్తాము. అందరికీ త్రాగు నీరు అందుబాటులో ఉంటుంది.

రోజు సాయంకాలం సమయంలో మా పాఠశాల ముగింపు బెల్ కొట్టగానే మేమంతా పాఠశాల నుండి మా మా ఇళ్లకు బయలుదేరతాము…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం. స్త్రీలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. బాలుర కన్నా ఎక్కువగా బాలికలు చదువులో ముందుంటున్నారు.

అయితే వారికి సరైనా భద్రత కల్పించగలిగితే, స్త్రీలు మరింత ముందుకు సాగుతారు. మెరుగైన ఫలితాలు రాబట్టగలరు. ఓర్పు వహించడంలో స్త్రీలు ముందు ఉంటారు.

కనుక వారికి సమాజంలో సరైన భద్రత కల్పించగలిగితే, మెరుగైన సమాజం మన ముందు ఉంటుంది.

ఒక పురుషుడైన, ఒక స్త్రీ అయినా అమ్మ ఒడిలో పాఠాలే, ఎప్పటికీ మదిలో ఉండిపోతాయి. అటువంటి స్త్రీకి ఉన్నత చదువులు ఉంటే, మరింతమంది నైపుణ్యం కలిగినవారు మన సమాజంలో తయారుకాగలరు.

ఎందుకు భద్రత విషయంలో అంటే, స్త్రీలపై బౌతికదాడులకు పాల్పడడం, లైంగిక వేదింపులకు పాల్పడడం కొందరికి అలవాటుగా ఉంటుంది. అలాంటి వారి వలన స్త్రీలకు భద్రత కరువు అవుతుంది.

సహజంగానే స్త్రీలను గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. అలాంటి సంప్రదాయం గల మన భూమిలో స్త్రీలపై దారుణాలు జరగడం దురదృష్టకరం.

ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలలో రక్షణ ప్రధాన సమస్య. సమాజంలో పురుషులతో సమానంగా కష్టపడుతూ కేవలం లింగబేధం వలన స్త్రీలపై లైంగిక దాడులు చేయడానికి కొందరు ఆకతాయిలు ప్రయత్నం చేయడం జరుగుతుంది.

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలలో ప్రధానంగా వారి భద్రత విషయంలో రాజీపడని వ్యవస్థ సమాజంలో ఉండాలి.

అయితే ఎంత వ్యవస్థ ఉన్న అల్లరితనం అలవాటు అవుతున్నవారిని నియంత్రించడం కష్టం. అయితే రోగ నివారణ చర్యలు కన్నా రోగం బారిన పడకుండా తీసుకునే చర్యలే ఉత్తమము అంటారు.

స్త్రీల విషయంలోనూ తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. స్త్రీ యొక్క గొప్పతనం తెలియజేసే విధంగా వ్యవస్థలు పనిచేయాలి.

ఒక నాయకుడైనా, ఒక పనివాడు అయినా, ఒక కలెక్టర్ అయినా, ఒక ముఖ్య మంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా, అఖిరికి ఆ భగవానుడి గురించి తెలియజేసే గురువు అయినా సరే అమ్మ కడుపులో నుండే పుట్టాలి. బిడ్డను కనడానికి అమ్మ చావుతో పోరాటం చేస్తుంది.

అమ్మ చావుతో పోరాటం చేసి బిడ్డను కంటుంది. అటువంటి అమ్మ సాదారణంగానే పూజ్యనీయురాలు. అలాంటి అమ్మగా మారాబోయే అమ్మాయిలు అంటే, గౌరవంతో నడుచుకునే విధంగా వ్యవస్థలలో చర్యలు తీసుకోవాలి.

ఉద్యోగం చేసే స్త్రీ ఒక అమ్మ, మనల్ని కన్న అమ్మ వంటిదే, ఉద్యోగం చేసే అమ్మ కూడా… అని సాటి ఉద్యోగస్తులు ప్రవర్తించే విధంగా వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి.

అమ్మ ప్రేమ చేతనే, బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుతాడు. అటువంటి ప్రేమాభిమానాలు గల స్త్రీకి సమాజం నుండి లభించాల్సింది… ప్రధమంగా గౌరవం…

స్త్రీల గురించి పవిత్రమైన భావనలు బాల్యం నుండే అలవాటు చేయాలి

విద్యా విధానంలోనే స్త్రీల గురించి పవిత్రమైన భావనలు కలిగే విధంగా చర్యలు ఉండాలి. గొప్ప పుస్తకం చదివే అలవాటు ఉన్నవాడి ఆలోచనలు గొప్పగానే ఉంటాయి.

అలాగే పుస్తకాలలో చదివిన గొప్ప విషయాలు మనిషిలో మంచి ఆలోచనలను ఏర్పరుస్తాయి. కావునా స్త్రీల గురించి మంచి ఆలోచనలు పెరిగే విధంగా చర్యలు అన్నీ వ్యవస్థలలోనూ ఉండాలి.

స్త్రీని లోకువగా చూసే సమాజం నుండి, స్త్రీని గౌరవించే సమాజంలోకి సమాజం మార్పు చెందాలి. అదే స్త్రీ అభ్యున్నతికి మొదటి మెట్టు… ప్రధానమైనది…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం. క్లాసులో సమాధానం చెప్పాలి. పరీక్షలో పేపరుపై బాగా వ్రాయాలి. అర్ధవంతంగా సమాధానాలు వ్రాయడం ప్రధానం.

SSC పరీక్షలు ఫెయిల్ అయితే అంతే, అనే భావన కొందరిలో ఉంటుంది. అటువంటి భావన వలన బాగా చదివేవారు కూడా పదవతరగతికి వచ్చేసరికి వెనుకబడే అవకాశం ఉంటుంది. కనుక పదవతరగతి బాగా చదవాలనే బలమైన సంకల్పం చేసుకోవాలి. అందుకోసం కృషి చేయాలి.

ఇష్టపడి చదివితే, చదివే సమయం కష్టం తెలియకుండా ఉంటుంది. సమయం అంతా చదువుపై అవగాహన ఏర్పడడంలోనూ లేక గుర్తుపెట్టుకోవడంలోనూ సాగిపోతుంది. ఇష్టమైన హీరో సినిమా బాగుంటే, 2.30 గంటలు ఇట్టే గడిచినట్టు, పదవతరగతి చదివే సమయం అంతా చదివే ప్రక్రియలోనే గడిచిపోతుంది.

SSC ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి గ్రేడ్ సాధిస్తే, జీవితంలో అదొక మైలురాయి. ఎప్పుడు మైలు రాయిని చేరుకునే సమయంలో ముందడుగు వేయాలి… కానీ బలహీనతలు గుర్తుకు తెచ్చుకోకూడదు.

పరుగు పందెంలో పాల్గొన్న అందరిలోనూ ఒక్కడే విజేత అవుతారు. కానీ మిగిలినవారు విజేతలు కాకపోయినా, ప్రయత్నం లోపం ఉండదు. కాబట్టి వారు పందెంలో గెలవకపోయినా తమ ప్రయత్నంపై తాము తృప్తిగా ఉంటారు. మరొకసారి బాగా ప్రాక్టీస్ అయ్యి, విజేతగా నిలవడానికి గట్టి ప్రయత్నం చేస్తారు.

అలాగే SSC చదువుతున్న విధ్యార్ధులు కూడా, నెలవారి టెస్టులలో తమకు లభిస్తున్న మార్క్స్ గమనించుకోవాలి. ప్రతిసారి గట్టి ప్రయత్నంతో చదవాలి. ఇంటర్నల్ గా స్కూల్లో జరిగే టెస్టుల్లో మార్క్స్ మెరుగుపడుతూ ఉండేలా చూసుకుంటూ ఉంటే, అదే అలవాటు SSC ఎగ్జామ్స్ అప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది.

ప్రధానంగా పదవతరగతి ప్రారంభం నుండే తమకు బలమున్న సబ్జెక్టులలో పట్టు పెంచుకుంటూ, తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో తగినంత కృషి చేయాలి. బలమున్న సబ్జెక్టులు అంటే, మీకు ఆయా సబ్జెక్టులలో అవగాహన ఎక్కువ. కాబట్టి పాఠాలు వింటున్న సమయంలోనే వాటిలో మీకు పట్టు పెరుగుతుంది.

తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో అవగాహన ఏర్పరచుకోవడంలో ఏదో లోపం ఉంటుంది. అది గుర్తిస్తే వాటిలో కూడా మంచి మార్కులు సాధించవచ్చు. ఎంత ప్రయత్నించినా అవగాహన కానీ సబ్జెక్టులలో ఒకటికి పదిసార్లు చదివి గుర్తుపెట్టుకునే విధానం ఉత్తమం.
ఇంకా ఇలా తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో ముఖ్యమైన ప్రశ్నలు పేపరుపై వ్రాస్తూ ఉండడం కూడా మేలైన పద్దతి.

ఒకసారి వ్రాయడం అంటే, కొన్ని సార్లు చదవడం వంటిది. ఎక్కువ సార్లు వ్రాసిన సమాధానం గుర్తు ఉండే అవకాశం ఎక్కువ.
అతి అన్నింటిలోనూ అనర్ధం అంటారు. బాగా మార్కులు వచ్చే సబ్జెక్టులపై నిర్లక్ష్యం ఉండకూడదు. అలాగే తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులంటే భయం లేక చికాకు ఉండకూడదు.

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా సమాధానాలు వ్రాయడం ప్రధానం

ఇక క్వశ్చన్ పేపర్ చూడగానే, చదవని క్వశ్చన్స్ వస్తే, టెన్షన్ తెచ్చుకోవడం. చదివిన క్వశ్చన్స్ వస్తే ఓవర్ ఎగ్జైట్ అవ్వడం మానేయలి.
ఎగ్జామ్స్ వ్రాసే సమయంలో క్వశ్చన్ పేపర్ తీసుకుని, దానిలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటిని చదివాలి. అలా క్వశ్చన్ పేపర్లో బాగా గుర్తు ఉన్న క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అలా బాగా వచ్చిన క్వశ్చన్లకు చూసుకుని, వాటికి సమాధానాలు వ్రాయడానికి మైండును సరిగా ప్రిపేర్ చేసుకోవాలి.

ముందుగా బాగా గుర్తున్న క్వశ్చన్లకు సమాధానాలు తేలికగా వ్రాయవచ్చు. అలా వ్రాసిన సమాధానాలు పాయింట్ల రూపంలో అర్ధవంతంగా వ్రాయగలిగితే, మంచి ఇంప్రెషన్ ఉంటుంది.

కొన్ని క్వశ్చన్లకు సమాధానాలు పూర్తిగా గుర్తు ఉండవు. అలాంటి క్వశ్చన్లను ముందుగా వ్రాయడం మొదలు పెడితే, బాగా గుర్తు ఉన్న సమాధానాలు కూడా మరిచిపోయే అవకాశం ఉండవచ్చు. కాబట్టి మైండులో పూర్తి సమాధానాలు గుర్తుకు వస్తున్న ప్రశ్నలకు ముందుగా సమాధానాలు వ్రాయడం మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది.

బాగా గుర్తు ఉన్న క్వశ్చన్లకు సమాధానాలు వ్రాయడం పూర్తయ్యాక, సగం, సగం గుర్తు ఉన్న క్వశ్చన్లకు సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు. అయితే సగం సగం గుర్తు ఉన్న క్వశ్చన్లు ఎక్కువగా ఉంటే, అలాంటి క్వశ్చన్లకు అన్నింటికీ సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టడం బెటర్. అయితే ప్రతి క్వశ్చనుకు సమాధానం వ్రాశాక కొంచెం ఖాళీ ఉంచుకోవాలి. సగం సగం గుర్తు ఉన్న క్వశ్చన్లు అన్నింటికీ సమాధానాలు వ్రాసేసి, ఆ తర్వాత మిగిలిన ఆన్సర్స్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం మేలు.

మొత్తానికి ఒక క్వశ్చన్ పేపరులో మనకు బాగా వచ్చిన ప్రశ్న నుండి సమాధానం వ్రాయడం మొదలు పెట్టాలి. బాగా గుర్తు ఉన్న క్వశ్చన్లు అన్నీ ముందుగా వ్రాయడం వలన పేపరు దిద్దేవారి దృష్టిలో మంచి గుర్తింపు పడుతుంది. ఆపై గుర్తుకు వచ్చినంత సమాధానాలు మిగిలిన క్వశ్చన్లకు వ్రాయడం చేయాలి.

గుర్తు ఉన్నంతవరకు సమాధానాలు వ్రాశాక, తెలిసిన మేరకు సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టాలి. మొత్తానికి క్వశ్చన్ పేపర్లో వ్రాయవలసిన అన్నీ క్వశ్చన్లకు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి.

పరీక్ష వ్రాసేటప్పుడు గుర్తుకు రాని క్వశ్చన్లకు సమాధానాలు వెతకడం అంటే, సమయం వృధా చేయడమే అవుతుంది. చివరలో హడావుడిగా బాగా వచ్చిన సమాధానం కూడా తప్పులతో వ్రాసే అవకాశం ఎక్కువ.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎటువంటి జాగ్రత్తలు అంటూ ఆలోచన అనవసరం. సాదారణ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే ప్రిపేర్ అయితే చాలు. కానీ చదివేటప్పుడు మాత్రం కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇష్టపడి చదివితే, సబ్జెక్టుపై అవగాహన సులభంగా వస్తుంది.

అనవసరపు భయాలు, ఒత్తిడికి గురి కావడం అనేది మీ మనసులోనే ఉంటుంది. మీ మనసులో ఒక్కటే ఎగ్జామ్స్ బాగా వ్రాయాలి…. చదివిన క్వశ్చన్స్, గుర్తులో ఉన్న క్వశ్చన్స్, గుర్తుకు వస్తున్న క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడం ప్రధానం.

ఎంత బాగా చదివినా, ఎంత బాగా పేపరుపై వ్రాయగలమో అన్నీ మార్క్స్ గెయిన్ చేయగలరు. మంచి గ్రేడ్ సాధించగలరు.

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం పడుతుందా? తెలుగులో వ్యాసం. అవినీతి అనేది ఒక అంటువ్యాధి వంటిది. ఒకరి నుండి ఒకరికి వ్యాధి పాకినట్టు, అవినీతి అనేది కూడా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది.

అంటువ్యాధి ఆరోగ్యానికి హాని చేసినట్టు, అవినీతి కూడా సామాజిక అభివృద్దికి కూడా అడ్డుపడుతుంది. అలా అనడానికి అసలు అవినీతి అంటే నీతి తప్పి ప్రవర్తించడం అంటారు.

నీతి తప్పి ప్రవర్తించడం అంటే, తాను చేయవలసిన పనికి తగిన జీతం లభిస్తున్నా, అదనపు ప్రతిఫల అందుకుంటూ, అర్హతలేని వారికి కూడా పనులు చేసి పెట్టడం అవినీతికి పాల్పడడం అంటారు.

ప్రమాణం ప్రధానంగా విధానం ఉంటుంది. అది విధ్యా విధానం కావచ్చు. నిర్మాణ విధానం కావచ్చు. రోగనివారణ చర్యలు కావచ్చు. తయారీ విధానం కావచ్చు. అలాంటి విధానం సరిగా సాగడం అంటే ఎవరి కర్తవ్యం వారు సరిగ్గా నిర్వహించడమే పెద్ద సామాజిక సేవ అంటారు.

ఎవరి పని వారు చేసుకుంటున్నంత కాలం, సమాజంలో పనులు వేగంగా సాగుతాయి. కానీ అవినీతికి అలవాటుపడి అదనపు ప్రతిఫలం కోసం తమ తమ పనులు నిలుపుదల చేయడం అంటే, అభివృద్దికి అడ్డుపడడం అవుతుంది.

అలా ఎక్కువమంది అదనపు ప్రతిఫలం ఆశిస్తూ పనులు నిలుపుదల చేసుకుంటూ పోతే, సమాజంలో పనులు సరైన రీతిలో కొనసాగవు. ఇంకా పనులలో నాణ్యతా లోపం ఏర్పడే అవకాశం ఎక్కువ.

నాణ్యతా లోపం వలన నిర్మాణాలు మనుషుల ప్రాణాలు బలిగొనవచ్చు. నాణ్యత లేని వస్తువులు సరిగా పని చేయవు. నాణ్యత లేని వాహనాలు ప్రయాణంలో ఇక్కట్లు కల్పించవచ్చు. నాణ్యత లేని వస్తువులు తగినంత కాలం పనిచేయవు ఇంకా అవసరంలో అవి ఆగిపోవచ్చు. ఇలాంటి నాణ్యతా లోపం అవినీతి వలన సమాజంలో విస్తరించే అవకాశం ఎక్కువ. కాబట్టి అవినీతి నిర్మూలన చేయడం అంటే సమాజాన్ని ప్రగతి పధం వైపు నడిపించడమే అవుతుంది.

కార్యలయంలో అధికారి అవినీతి, సమాజంపై ప్రభావం చూపుతుంది.

ఒక కార్యలయం సజావుగా సాగుతుంటే, ఆ కార్యలయం నుండి వచ్చే అనుమతులు సమాజంలో సక్రమంగా పనులు చేయించే అవకాశం ఉంటుంది.

అలా కాకుండా ఒక కార్యాలయంలో ఒక అధికారి తన స్వార్ధం కోసం, తన అవసరం తీరడం కోసం అదనపు ప్రతిఫలం పొంది ఎవరికైనా అనుమతి అనుమతి ఇస్తే, ఆ అధికారిని మరొకరు అనుసరించే అవకాశం ఎక్కువ. అధికారుల అవినీతికి పాల్పడితే, సమాజంలో అర్హత లేనివారికి అనుమతులు లభించే అవకాశం ఉంటుంది.

అర్హత లేనివారి పనితీరు ప్రమాణాలకు దూరంగా ఉంటాయని అంటారు. ప్రమాణాలు పాటించని వ్యక్తుల పనులు నాణ్యతా లోపం కలిగి ఉంటాయి.

ఒక రహదారి నిర్మాణపు పనులు అర్హత లేనివారికి, సరైన ప్రమాణాలు పాటించని వ్యవస్థకు అనుమతులు ఇస్తే, సదరు వ్యవస్థ చేపట్టే రహదారులు నాణ్యతా లోపం కలిగి ఉంటాయి. అనుమతులు పొందే విషయంలోనే నియమం తప్పే వ్యవస్థలు, పనులు నిర్వహించే సమయంలో ప్రమాణాలు ప్రకారం పనులు చేయిస్తారనే నమ్మకం తక్కువ అని అంటారు.

సరి అయిన ప్రమాణాలు పాటించక నిర్మించే రహదారులు వానలకు పాడయ్యి, వాహన ప్రమాదాలకు కారణం కాగలవు. రవాణా సౌకర్యాలపై ప్రభావం చూపుతాయి. రవాణా సమయం పెరగడం వలన కాలం ఖర్చు ఎక్కువ, ఇందన ఖర్చు ఎక్కువ… ఈ విధంగా అవినీతి వలన అనుమతులు సమాజంలో అభివృద్దిపై ప్రభావం చూపుతాయి.

అనుసరించడం మనిషి అలవాటు అయితే అది అవినీతి విషయంలో కూడా జరగవచ్చు

లోకంలో ఒకరిని చూసి మరొకరు అనుసరించే వ్యవహారం ఉంటుంది. పెద్దవారిని చూసి అనుసరించేవారు ఉంటారు. తోటివారిని చూసి అనుసరించేవారు ఉంటారు.

అయితే అవినీతి విషయంలో మాత్రం ఎక్కువగా తోటివారిని చూసి అనుసరించే అవకాశం ఎక్కువ. పక్కింటావిడను చూసిన ఆవిడ, పక్కింటావిడ బడాయి పనులు అనుసరిస్తే, అలా అనుసరించిన వారి సంసారం ఇబ్బందుల పాలైనట్టు, అవినీతి అధికారిని అనుసరించే మరికొందరి వలన ఆ కార్యలయం పనితీరుపై సమాజంలో సందేహం ఏర్పడుతుంది.

అనుసరించడం అనేది మనిషికి సహజమే అంటారు. అయితే అలాంటి అలవాటు మంచి విషయాలలో అయితే, ఆ అలవాటు వలన సమాజానికి మేలు జరుగును. అదే అవినీతి విషయంలో అయితే ఆ అలవాటు సమాజనికి చేటు చేస్తుంది.

ఒక వ్యక్తికి సమాజం రక్షణవలయంలాగా ఉంటుంది. రాత్రుళ్లు దొంగతనం చేసే దొంగ సమాజం మేల్కొని ఉండగా దొంగతనం చేయలేడు. అసభ్యంగా ప్రవర్తించే గుణం కలిగినవారు, సమాజం మేల్కొని ఉండగా, అసభ్యంగా ప్రవర్తించలేడు. అలా సమాజం దుష్ట వ్యక్తుల నుండి, దుష్ట చేష్టితముల నుండి మనిషి ఒక రక్షణ వలయంగా ఉంటుంది.

అలా సమాజం మనుషులందరికి ఒక రక్షణగా ఉంటుంటే, అటువంటి రక్షణ ఇచ్చే సమాజమునే, తర్వాతి తరానికి అందించడమే నిజమైన వారసత్వపు ఆస్తి అవుతుంది.

అవినీతి ప్రభావం

మనిషికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎక్కువగా దొంగలు తయారైన సమాజంలో బధ్రత ఉండదు. మనిషి ప్రశాంతత దెబ్బతింటుంది.

కావున అవినీతి అనేది మనిషి మనుగడకు, సామాజిక ప్రగతి ఒక అడ్డుగోడ వంటిది అయితే, దానికి నిర్మూలించవలసిన అవసరం ఉంది.

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం పట్టవచ్చు. ఎందుకంటే ఎవరి పని వారు సరిగా నిర్వహించడం వలన పని విధానం ప్రమాణాత్మకంగా సాగుతుంది.

నిర్మాణ విధాన ప్రమాణాలతో కొనసాగితే, కట్టడాలు, రహదారులు ఎక్కువకాలం ఉంటాయి. నాణ్యత కలిగిన రహదారులు వలన రవాణాలో సమయాభావం ఏర్పదు. నాణ్యతతో కూడిన కట్టడాలు, అకస్మాత్తుగా కూలిపోయే అవకాశం తక్కువ.

ఇలా ఏ రంగంలోనైనా ప్రమాణాలతో కూడిన విధానం కొనసాగితే, సమాజం ప్రగతిబాటలో సాగుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు. ఈ శీర్షికన తెలుగులో వ్యాసం. సాధన చేత లోకంలో పనులు సముకూరును అంటారు. కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడు. సరైన సాధన మనిషికి బలం అవుతుంది.

కృషి, పట్టుదల, దీక్ష తదితర గుణాలు మనిషిలో సాధనకు బలం అవుతాయి. మనసులో బలమైన సంకల్పం ఉంటే, ఆ వ్యక్తి యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి మనసుకు మార్గం తెలియబడుతుందని పెద్దలంటారు.

మంచి ఆశయం అంటే అది సమాజనికి మేలును చేకూర్చే ఆశయం అయితే, అటువంటి ఆశయం కలిగిన వ్యక్తి గొప్పవాడుగా మారతాడు. అయితే అదే అతని మనసులోనే ఉన్నప్పుడు మాత్రం అతనూ సాదారణ వ్యక్తే.

ఎప్పుడైతే సమాజనికి మేలును చేకూర్చే అంశంవైపు అడుగులు వేస్తాడో, అప్పుడే సమాజం నుండి గుర్తింపు లభించడం ప్రారంభం అవుతుంది. సదరు ఆశయం పరిపూర్ణమైనప్పుడు మాత్రం, ఆ వ్యక్తి సమాజంలో విశేషమైన గుర్తింపు పొందుతాడు.

ప్రతి మనిషిలోను ఏదో ఒక అంశంలో నైపుణ్యత ఉంటుందని పెద్దలంటారు. అంటే మనిషిగా పుట్టిన ప్రతివారు విశేషమైన ప్రతిభను ఏదో విషయంలో కలిగి ఉంటారు.

తమ యొక్క ప్రతిభను గుర్తించి, సాధన చేస్తే, సదరు వ్యక్తి సమాజంలో మంచి గుర్తింపున పొందగలడు. అద్భుతమైన ఫలితాలను సామాన్యుడు సైతం సాధించగలడు.

ఒక తరగతిలో చదువుకునే విధ్యార్ధులందరికీ ఒకే అభిరుచి ఉండదు. అలాగే అందరూ ఒకేలాగా చదవలేరు. అలాగే అందరూ ఒకేతీరుగా ఆలోచన చేయకపోవచ్చు… కానీ తరగతిలో బోధించే పాఠాలు మాత్రం అందరికీ ఒక్కటే.

అయితే ఆ తరగతిలో ఉన్న విధ్యార్ధులు అందరూ ఒకేలాగా పాఠాలు గ్రహించకపోవచ్చు. కానీ ప్రాధమికమైన అవగాహన పాఠాలపై తరగతి విద్యార్ధులందరికీ ఉంటుంది. అలాగే అందరికీ అన్నీ సబ్జెక్టులపై ఆసక్తి ఉండకపోవచ్చు.

కానీ ఒకరికి తెలుగంటే ఇష్టం ఉంటే, ఇంకొకరికి లెక్కలంటే ఇష్టం ఉండవచ్చు. మరొకరికి సైన్స్ ఇష్టం ఉంటే, వేరొకరికి సోషల్ అంటే ఆసక్తి ఉండవచ్చు… ఎవరికైతే ఆయా సబ్జెక్టులలో సరైన ఆసక్తి ఉంటుందో, వారు ఆయా సబ్జెక్టులలో ఉన్నత స్థాయి పరిశోధన చేయగలిగే స్థితికి చేరే అవకాశం ఉంటుంది. అయితే ఆయా సబ్జెక్టులలో ఆయా విధ్యార్ధులకు తగు సాధన అవసరం.

ఒక తరగతిలో కామన్ లెస్సన్స్ వినే విధ్యార్ధులలో ఆసక్తి వ్యత్యాసం ఉన్నట్టు, సమాజంలో సైతం వివిధ వ్యక్తులకు వేరు వేరు విషయాలలో లేక అంశాలలో ఆసక్తి ఉండడం సహజం.

ఆసక్తి వలన మనసు సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు చేయగలరు.

తమ తమకు గల ఆసక్తియందు తమకుగల ప్రతిభను, ఆయా వ్యక్తులు గుర్తెరగాలి. తమ యందు ఉన్న ప్రతిభకు మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తే, మేలైన ఫలితాలు వస్తాయి.

అయితే ఆయా వ్యక్తులు తమకు గల ఆసక్తి, తమలో ఉన్న ప్రతిభను తెలుసుకుని, మరింత సాధన చేస్తే, సదరు వ్యక్తులు సమాజంలో విశిష్టమైన గుర్తింపు పొందవచ్చు. సమాజం చేత విశిష్టమైన గుర్తింపు అంటే, అది ఏదో ఒక అద్భుతం

పదే పదే దేని కోసం ఆలోచన చేస్తే, దానినే పొందే మనసుకు సాధన అనేది ఆయుధంగా మారుతుంది.

తీపి అంటే ఇష్టమున్న వ్యక్తి మనసు ఎప్పుడు తీపి పదార్ధాలపై మక్కువ చూపుతుంది. అలాగే ఆ వ్యక్తితో అవసరం ఉన్నవారు ఆయనకు తీపి పదార్ధాలనే కానుకగా సమర్పించి, తమ తమ పనులు నెరవేర్చుకుంటారు. అంటే ఇక్కడ తీపిని ఇష్టపడే మనసు, పలుమార్లు మక్కువతో ఆలోచన చేయడం, అదే విషయం తెలిసిన వారివద్ద తెలియజేయడం వలన సదరు వ్యక్తి మనసు తీపి పదార్ధాలను పొందుతుంది.

ఇలా ఏ విషయంపై మనసు ప్రీతిని పొందుతుందో, ఆ విషయంలో ఆ యొక్క వ్యక్తికి నైపుణ్యత వృద్ది చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తగినంత సాధన, కృషి అవసరం అవుతాయి.

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు అనడానికి మనసు యొక్క విశిష్టతను గుర్తెరగడం ద్వారా సాధ్యం అవుతుంది.

మనుషులందరికి ఉండే మనసుకు, అందరి యందు ఒకే విధంగా ఉండదు. దానికి బలము – బలహీనత ఉంటాయి. అలాంటి మనసు సాధన చేత, దాని బలమే ఆయుధం వ్యక్తికి అయితే, దాని యొక్క బలహీనత కూడా బలంగా మారుతుంది.

మాటలు వలన మనసి మహనీయుడు కాగలడు… కానీ చెప్పుడు మాటలు వినడం వలన మనిషి పాడవుతాడని అంటారు… చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

కోపము రావడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధనలో కోపం రావచ్చు. సాధనాలోపం కారణంగా కోపం రావచ్చు. సాధనకు అడ్డుపడే విషయాలు వలన కోపం రావచ్చును… కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధి ఒకరికి వస్తే, వారి నుండి మరొకరికి, మరొకరి నుండి ఇంకొకరికి…. ఇలా కొందరికి…. కొందరి నుండి మరి కొందరికి సోకి సమాజంలో వృద్ది చెందే అవకాశం ఎక్కువ… అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉంటే మనసు మాయదారి ఆలోచనలు చేస్తూ ఉంటుంది… కానీ ఒంటరిగా ఉన్నప్పుడూ పుస్తకం మంచి నేస్తం కాగలదు… ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం అవుతాయి… తెలుగులో వ్యాసం. చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో వాటిని గుడ్డిగా నమ్మడం కూడా అంతే తప్పు.

సమాజంలో మనిషికి మనిషికి మద్య ఏర్పడే సంబంధాలలో మరొక మనిషి పాత్ర ఉంటుంది. అవి మొదట్లో ఉన్నట్టు భవిష్యత్తులో ఉండవు. కారణం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరి చెప్పుడు మాటలు విని, నమ్మడమే అవుతుంది.

ఒక మనిషి ఇంకొక మనిషి ఏర్పడిన పరిచయం ప్రక్రుతి వలన కానీ మరొక మనిషి వలన కానీ జరుగుతుంది. అలా ఏర్పడిన కొన్ని సంబంధాలు ఎక్కువకాలం కొనసాగుతుంది. అలాంటి బంధాలలో కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉంటాయి.

కుటుంబ బాంధవ్యం ప్రకృతిపరంగా సహజంగా జరుగుతుంది. స్నేహ సంబంధం మనసును బట్టి, మనసు ఇష్టాయిష్టాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. స్నేహం, కుటుంబ సంబంధం మనిషి మనసుకు బలంగా మారతాయి.

 ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే

అలాంటి మానవ సంబంధాలు ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు సంబంధాలకు చేటు చేస్తాయి. అవి స్నేహ సంబంధం కావచ్చు. లేక కుటుంబ సంబంధం కావచ్చు.

మనిషికి మాటల వలననే మంచి సంబంధాలు ఏర్పడుతాయి. అలాంటి మాటలను కొందరు మంచికి ఉపయోగిస్తే, కొందరు చెడుకు ఉపయోగించవచ్చు. కొందరు చెడు అలవాట్ల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది.

చెడు అలవాట్ల కొరకు మాట్లాడే మాటలు చెప్పుడు మాటలుగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి మాటలు, వారి స్వార్ధం కొరకు మాత్రమే ఉంటూ, విన్నవారికి చేటును చేసే అవకాశం ఉంటుంది.

మరికొందరికి చెడు గుణాలను కలిగి ఉండవచ్చు. మంచి సంబంధాలను చూసి ఓర్వలేని గుణం కలిగి, కొందరు సమాజంలో ఉండవచ్చు. ఇలాంటి వారి మాటలు మంచి సంబంధాలకు చేటును చేస్తాయి. ఇవే చెప్పుడు మాటలుగా సమాజంలో చెబుతారు.

మౌనం మనిషిని మునిగా మారిస్తే, మాటలు మనిషిని మాటకారిగా మారిస్తే, మంచికి ఉపయోగిస్తే, వారి వలన వారి చుట్టూ ఉన్నవారికి శాంతి చేకూరుతుంది.

కానీ మాటకారికి చెప్పుడు మాటలు చెప్పే స్వభావం ఉంటే మాత్రం, వారి చెప్పుడు మాటలకు సత్సంబంధం బలి అయ్యే అవకాశం ఉంటుంది.

అదే మాటకారికి మంచి గురించి చెప్పే అలవాటు ఉంటే, మాత్రం ఆ మాటకారి వలన అతని చుట్టూ ఉండేవారికి మంచి జరుగుతుంది.

మనిషికి మానవ సంబంధాలు కాలంలో కలిగే కష్టసుఖాలను ఎదుర్కోవడంలో సాయపడతాయి. ఒక ఓదార్పుగా మనిషికి మేలు చేసే మానవ సంబంధాలు చాలా విలువైనవి… డబ్బు ఇవ్వలేని మానసిక శాంతి, కుటుంబ సంబంధం, స్నేహ సంబంధం వలన కలుగుతుంది.

చెప్పుడు మాటలకు లోబడి

అయితే అటువంటి బంధాలు చెప్పుడు మాటలకు లోబడి చెడగొట్టుకోగూడదు. బంధం బలం, బంధం విలువ తెలిసినవారు చెప్పుడు మాటలు చెప్పారు, వాటిని వినరు.

బంధం మద్యలో చెప్పుడు మాటలు చేరి, ఆ బంధానికి చేటు చేయడానికి డబ్బు కూడా కారణం కావచ్చు. కావున డబ్బు సంపాదనలో కూడా ధర్మబద్దమైన జీవనం మేలును చేస్తుందని పెద్దలంటారు.

కావునా మంచి మిత్రుడిని లేక మిత్రురాలిని చెప్పుడు మాటలు విని, దూరం చేసుకోకూడదు. ఎటువంటి ఆధారం లేకుండా పుట్టుకొచ్చే చెప్పుడు మాటలు అసలు నమ్మకూడదు.

మాట విలువ తెలిసినవారి చుట్టూ, మంచి మనుషులు పెరుగుతారని పెద్దలంటారు. అటువంటి మాటను మంచిని పెంచడానికి, మంచిని పంచడానికి ఉపయోగించడం కూడా సామజిక సేవగానే పరిగణిస్తారు.

చెప్పడు మాటలు చెప్పడం వలన ఇద్దరి మద్య సంబంధం తెగిపోవచ్చు. చెప్పుడు మాటలు చెప్పడం వలన చెడు అలవాట్లు ఏర్పడవచ్చు. చెప్పుడు మాటల వలన మరొక మనిషి మనసు ఆందోళన చెందవచ్చు… కావునా చెప్పుడు మాటల వలన చేటు జరిగే అవకాశాలు ఎక్కువ.

అలాగే చెప్పుడు మాటలు వినడం వలన కూడా సంబంధాలు బలహీనపడతాయి. మంచిమిత్రుడిని లేక మంచి స్నేహితురాలిని కోల్పోవలసిరావచ్చు. కావున చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, వాటిని విని నమ్మడం అంతే తప్పు….

ఆధారం లేకుండా, అనాలోచితంగా మాట్లాడేవారి మాటలు పెడచెవిన పెట్టాలని పెద్దలంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు