Monthly Archives: July 2022
శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం
శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం కలుగుతుంది. మన సంప్రదాయంలో ప్రతి నెలకూ ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణమాసంలోనే ప్రతియేడాది పండుగలు కొత్తగా ప్రారంభం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చే పండుగలలో శ్రావణమాసంలోని పండుగల తర్వాత వినాయక చవితి నుండి శ్రీరామనవమి వరకు పండుగలు వరుసగా వస్తూనే ఉంటాయి.
చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవమాసంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణమాసంలోనే మహిళలు వ్రతదీక్షలకు శ్రీకారం చుడతారు. చక్కగా మహిళల మహాలక్ష్మీ అవతారం ధరించినట్టేగానే ఉంటుంది.
ఈ మాసంలో పౌర్ణమి తిధినాడు, చంద్రుడు శ్రవణా నక్షత్రంతో ఉంటాడు. కాబట్టి ఈమాసానికి శ్రావణమాసంగా చెబుతారు.
ఇంకా శ్రవణా నక్షత్రమే శ్రీమహావిష్ణువుకు జన్మనక్షత్రం. కాబట్టి భర్త జన్మించిన నక్షత్రం కాబట్టి శ్రీమహాలక్ష్మీకి కూడా శ్రావణమాసం ప్రీతికరం అంటారు. ఈ శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు పరమ పవిత్రంగా భావిస్తారు. తిధిలను బట్టి ఆయా వారాలలో వ్రతదీక్షలు ఉంటాయి. వాటి ఫలితాలు కూడా అద్భుతమేనని అంటారు.
కాబట్టి శ్రావణమాసం పవిత్రమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ నెలలో మహిళల వ్రతదీక్షలు ప్రారంభం అవుతాయి. మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంపాదించడానికి శ్రావణమాసం మంచికాలం….
సంతోషం కలిగినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించగలిగే అవకాశం అమ్మవారి అనుగ్రహం ఉండడం వలననే ఉంటుందని అంటారు. మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీతో బాటు మీ కుటుంబ సభ్యులందరిపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….
శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి
వానరలు సముద్రం దగ్గరకొచ్చి, సముద్రం దాటడానికి తమ తమ శక్తి సామర్ధ్యాలను అంచనా వేసుకుంటున్నారు. అందులో ఉన్న హనుమంతుడు మాత్రం మౌనంగానే ఉన్నాడు. అంతా తమ వల్లకాదని తేల్చుకుని, హనుమంతుడే ఈ పని చేయగలడని అందరూ భావిస్తారు. అప్పుడు హనుమంతుణ్ణి వారు సముద్రం దాటాలని సూచిస్తారు. వారంతా హనుమంతుడి శక్తి సామర్ద్యాలను కీర్తిస్తారు. కొందరికి తమ గురించి తమకు తక్కువ అంచనా లేకపోయినా, తమ శక్తి ఏమిటో తము గ్రహించి ఉండకపోవచ్చునని హనుమంతుడిని చూస్తే అర్ధం అవుతుంది. అలాంటివారికి వారి శక్తి గురించి, వారికి తెలియజేయడం వలన కార్యములను సాధించుకోవచ్చని తెలుస్తుంది. తమ తోటివారి ప్రార్ధన మేరకు తన శక్తి ఏమిటో తెలుసుకున్న హనుమంతుడు సముద్రం దాటడానికి పూనుకుంటాడు. అక్కడే ఉన్న పెద్ద కొండపై హనుమంతుడు నిలబడతాడు. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైనవారందరిని హనముంతడు స్మరిస్తాడు. దేవతలందరికీ నమస్కరించి, హనుమ తన లక్ష్యం గురించి దృష్టి పెడతాడు. ఇక్కడ హనుమంతుడిని చూడడం వలన ఏదైనా కార్యం తలపెడుతున్నప్పుడు… అందరి అంగీకారం తీసుకుని, దానికి కారణం అయినవారిని స్మరిస్తూ, తనకు శక్తియుక్తులను ప్రసాదించినవారికి నమస్కరించాలని తెలుస్తుంది. కొండపై నిలబడి ఉన్న హనుమ దృష్టి లంకలోకి చేరింది. అంతే ”హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి, చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను అణగదొక్కి పైకి ఎగిరాడు.”లక్ష్యం చేధించేవారి మనసు, లక్ష్యమును ముందుగానే చేరుతుందని, హనుమంతుడి గురించి ఆలోచిస్తే అర్ధం
గమనిస్తే… హనుమంతడు సముద్రానికి ఇటువైపున ఉండగానే, హనుమ మనసు సముద్రం అటువైపున ఉన్న లంకానగరంలోకి ప్రయాణం చేసింది. అంటే హనుమ మనసు ముందుగానే లక్ష్యం చేరుకుంది. అలాగే కార్యసాధకుడి మనసు ముందుగానే లక్ష్యం గురించి అవగాహన ఉండాలి. సముద్రంపై ఎగురుతూ వెళుతున్న హనుమంతుడికి ఆతిధ్యం ఇస్తామని ఆహ్వానం అందింది…. సున్నితంగా తిరస్కరించారు. కేవలం లక్ష్యం చేరడానికి రామబాణం మాదిరి హనుమ లంకలోకి అడుగుపెడతాడు. లక్షలమంది వానరలు సీతాన్వేషణకు బయలుదేరితే, హనుమంతుడిపైన మాత్రమే సుగ్రీవుడికి గురి… రాముడికి నమ్మకం కలిగాయి. తనపై నమ్మకం కోల్పోకుండా హనుమంతుడు తన రాజు దగ్గర నడుచుకున్నాడని అర్ధం అవుతుంది. సేవ చేయడంలో హనుమంతుడి కన్నా స్ఫూర్తివంతమైనవారు కానరారు.మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలుబంధాలు బలపడడానికి ఏం చేయాలి?
బంధాలు బలపడడానికి ఏం చేయాలి?
జీవితం చాలా విలువైనది! అందరికీ తెలిసిన విలువైన మాట కూడా ఇదే! అందరూ అశ్రద్ధ చేసే విషయం కూడా ఇదేనని అంటారు. ఎందుకంటే ఎక్కువగా నీరు లభించే చోట, నీటిని ఎలా పడితే అలా వాడినట్టుగా, ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండేవారితో ప్రవర్తన కూడా అలానే ఉంటుందని అంటారు. నీటి కరువు ఉన్న చోట, నీటిని చాలా పొదుపుగా వాడుతారు. నీరు సమృద్దిగా ఉన్న చోట, నీటిలో పడి స్నానం చేసేస్తూ ఉంటారు. అరుదుగా లభించేవాటిని అపురూపంగా చూడడం. విరివిగా లభించేవాటిని విచ్చలవిడిగా వాడడం అలవాటుగా ఉంటే, ప్రమాదం అంచనా వేయకుండా, అది పొంచుకొచ్చి జీవితాన్ని పాడు చేస్తుందని అంటారు. కావునా వెంట తోడు ఉండే బంధాల విలువ ఏమిటో తెలుసుకోవాలి.సక్రమ సంబంధాలు బలపడడానికి ఏం చేయాలి?
ప్రేమ వివాహం కానీ నిశ్చయ వివాహం కానీ పెద్దల సమక్షంలో జరిగిన వివాహ క్రతువుతో భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడం ప్రధానం. ఎందుకు భార్యభర్తలు కలిసి జీవిస్తే కుటుంబానికి ఒరిగిదేమిటి? వారికి కలిగే సంతానం విషయంలో మేలు కలుగుతుంది. భార్యభర్తల ఇద్దరూ ఒకే మాటపై ఉండడం చేత కలసి మెలసి ఉంటే, ఎంతో బాగుంటుందనే భావన ఉంటుంది. అమ్మా-నాన్న కీచులాడుకుంటూ ఉంటే, పిల్లల మనసులలో భయందోళనలే అధికంగా ఉంటాయి. భార్య భర్తలు ఇద్దరూ ఒక్కటిగా ఉండడం చేత, వారు పిల్లల సంరక్షణలో మమేకం కాగలరు. అందువలన అజ్ఙానంలో ఉండే పిల్లల సక్రమమైన పద్దతిలో ఎదిగే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా అమ్మా నాన్న ఎడమొఖం, పెడమొఖంగా ఉంటే, వారి సంరక్షణలో పిల్లల జీవితం ఎటు మరలుతుందో? ఎవరు ఊహించగలరు? కాబట్టి ఉత్తమ సామాజిక భవిష్యత్తు మంచి పౌరులను తయారు చేయడానికి ఉత్తమ దాంపత్య జీవితం అవసరం కాబట్టి ప్రేమ వివాహం అయినా నిశ్చయ వివాహం అయినా ఏర్పడిన బంధం ఎంతో ప్రధానమైనది అని మరొకరి జీవితాన్ని శాసించే స్థాయిలో దాంపత్యం ఉంటుందని గ్రహించాలి. అప్పుడే భార్యాభర్తలు కలిసేది… సామాజిక ప్రయోజనంతో పాటు వ్యక్తిగత జీవన పారమార్ధిక అంశం దాగుందని అర్ధం అవుతుంది.సక్రమ సంబంధాలు బలపడడానికి ఏం చేయాలి?
పెద్లల సమక్షంలో ప్రేమ పెళ్ళి జరిగినా? నిశ్చయించుకున్న పెళ్ళి జరిగినా పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. ప్రతి సంవత్సరం వచ్చే పంట వలన ఒక కుటుంబం తిని బ్రతకడమే కాకుండా, ఆ ధాన్యం కొనుగోలు చేసినవారు కూడా జీవిస్తారు. అలాగే వివాహం ద్వారా ఏర్పడిన బంధం బలంగా ఉండడం వలన ఆ బంధంతో ఏర్పడే బంధాలు కూడా సక్రమమైన పద్దతిలో పెరిగి క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను కలిగి ఉంటారు. కాబట్టి వివాహ బంధం చాలా చాలా ప్రధానమైనది. విలువైన జీవితాన్ని శాసించేదని గ్రహించాలి కానీ ఇష్టానుసారం ప్రవరించేది కాదని గ్రహించాలి. వివాహ బంధం, పెళ్ళి బంధం.. ఏదైనా దాంపత్యం అంటే కేవలం సెక్స్ కాదు… సామాజికి, పారమార్ధిక ప్రయోజనాలు అని గమనిస్తే, బంధంపై గౌరవం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామిపై గౌరవం పెరుగుతుంది.బంధాలు బలపడడానికి ఏం చేయాలి? చెప్పుడు మాటలకు తావు ఇవ్వకూడదు.
చూసి ఓర్వలేనివారికి చక్కనైన జంట కంటగింపుగానే కనబడతారు. కాబట్టి మీ చుట్టూ అటువంటివారు ఉంటే, వారితో మితంగా మాట్లాడడమే అసలైన మందు అంటారు. ఇరువురి మద్య ఏర్పడిన బంధం ఒక నమ్మకంతో పెరుగుతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇరువురు కలసిమెలసి నడుచుకోవడం ప్రధానం.మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన
కొత్తతరం అంటే నేటి కళాశాల విద్యార్ధులే, రేపటి సామాజిక నేతలు కావచ్చును. కాబట్టి కళాశాల రోజుల నుండే విద్యార్ధులకు రాజకీయా గురించిన అవగాహన ఉండడం మేలు అంటారు. సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న తరుణంలో పారిశ్రామికపరమైన విధానాలు, వ్యవస్థ యొక్క విధానాలు.. చాలా రకాల విధానాలు సాంకేతికతతో ముడిపడి ఉంటున్నాయి. సాంకేతికతను ఆధారంగా చూసినా కూడా, కొత్తతరం రాజకీయ నేతల వలన సాంకేతికతపై రాజకీయాలలో మరింత అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. సమాజాన్ని శాసించే రాజకీయాల గురించి విధ్యార్దులకు సరైన అవగాహన ఉండడం చేత వారు గొప్ప నేతలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. విద్యార్ధులకు రాజకీయ అవగాహన లేకుండా ఉండడం చేత, అర్హత లేనివారు కూడా రాజకీయ నేతలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్వార్ధపరులు, అవినీతిపరులకు అవకాశం ఉండకూడదంటే, విద్యార్ధులకు రాజకీయ అవగాహన ఉండాలి. వారు సమాజంలో నేతలుగా మారినప్పుడు తాము చూసిన సమాజాన్ని మార్చగలిగే రాజకీయనేతలుగా మారగలరు.మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం
Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం. ఎక్కువగా ఈ తెలుగు పదం, పరిశ్రమల గురించి తెలిపే క్రమంలో వాడుతూ ఉండడం గమనించవచ్చును. ఒక పరిశ్రమ ఏ వస్తువుని తయారు చేస్తుందో చెబుతూ ఈ తెలుగు పదం వాడుతారు. మరొక పరిశ్రమ ఎలాంటి ఉత్పత్తులు చేస్తుందో వివరిస్తారు. అంటే పట్టుక అనవచ్చును. పుట్టించుట అనవచ్చును.
అలాగే ప్రత్యుత్పత్తి అంటే తిరిగి ఉత్పత్తి చేయడం అంటారు. తయారు చేసి, అందించడం. ఒక వస్తువుని తయారు చేసి, దానిని వాడుకోవడానికి అందించే ప్రక్రియను ఉత్పత్తిగా చెబుతూ ఉంటారు.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు
పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు
పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు
మన సమాజంలో నగర జీవనం, పట్టణ జీవనం, పల్లె జీవనం, అటవీ జీవనం… ఇలా మానవులు వివిధ ప్రదేశాలలో జీవనం సాగిస్తూ ఉంటారు. అటవీ జీవనం పల్లెటూళ్ళ కన్నా సహజంగా ఉంటుంది. అయితే అక్కడ క్రూర మృగాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనిషికి ప్రశాంతత ఉండదు. పట్టణాలు, నగరాలు అభివృద్ది చెందిన ప్రదేశాలు. కానీ అక్కడ సంపాదన ఉన్నంతగా వాతావరణంలో సహజత్వం ఉండదు. కాబట్టి వాతావరణం అసహజంగా ఉండడమే మనిషిలో అశాంతికి ఆలవాలం అవుతుంది. పట్టణ, నగర జీవనాలు కేవలం యాంత్రికమైన జీవనంగా కూడా ఉండవచ్చని కొందరి అభిప్రాయంగా చెబుతారు. ఇక పల్లెలు… ఇవి నిజంగానే ప్రశాంతతకు పుట్టిళ్ళుగా అనిపిస్తాయి. పూర్వం మనకు పల్లెలు ఎక్కువ. చక్కని చెట్లు, చక్కని ఇల్లు. చక్కనైన వాతావరణం పల్లెటూరు వాతావరణం, ఆప్యాయంగా పలకరించుకునే బంధాలు. ఊరంతా చుట్టమే అన్నట్టుగా అందరూ బంధుభావనతో మెసులుకుంటారు.పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు ఎందుకు?
ముందుగా పల్లెల్లో ఇల్లు చాలా విశాలంగా ఉంటాయి. ఇంకా ఇంటిలో జనం ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ వచ్చిపోయే చుట్టాలు ఉంటారు. మనుషుల మద్య సత్సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. విశాలమైన ఇంటి వాతావరణంలో ఉండే చెట్లు చక్కని గాలిని అందిస్తాయి. సాయం వేళల్లో ఇంటి ముందునుండి వెళ్ళేవారి పలకరింపులు ఉంటాయి. ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరికొకరు సాయం అందించుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఏదైనా సమస్య ఎదురైతే ఊరంతా ఒక్కటే నిలబడతారు. అంటే ఊరంతా ఒక్కటేననే భావన పల్లెటూళ్ళల్లో బలంగా ఉంటుంది. ఇలాంటి భావన మనిషికి మరింత మనోబలాన్ని పెంచుతుందని అంటారు. ఊరి క్షేమం కోసం ఉత్సవాలు ఉంటాయి. ఉత్సవాలు జరిగినప్పుడు బంధు మిత్రులకు ఆహ్వానం పంపుతారు. పండుగలు జరుపుకోవడంలో పల్లెలు ముస్తాబయినట్టుగా పట్టణాలలో కుదరదు. పల్లెటూరు వాతావరణం వలన వ్యక్తి జీవనం పల్లెటూళ్ళల్లో సహజ జీవనంగా అనిపిస్తే, పట్టణ, నగరాలలో యాంత్రిక జీవనంగా అనిపిస్తుంది. ప్రకృతి సహజత్వం పల్లె జీవనంలో ఉంటుంది కాబట్టి ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ అని భావిస్తాము.మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలువ్యాసం చదవడం వలన ఉపయోగాలు
వ్యాసం చదవడం వలన ఉపయోగాలు
ప్రధానంగా వ్యాసం ఒక విషయం గురించి విజ్ఙాన దృష్టితో వివరించబడి ఉంటుంది. ఒక విషయంపై ఒక వ్యక్తి దృష్టి కోణం నుండి ఒక వ్యాసం ఉంటుంది. ఒక వ్యక్తి గురించి కొందరి అభిప్రాయాల ఆధారంగా మరొక వ్యక్తి వ్యాసం రచించి ఉండవచ్చును. సామాజిక స్పృహ కొద్దీ సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ ఒక వ్యక్తి వ్యాసం వ్రాసి ఉండవచ్చును. ఒక వస్తువు వలన ప్రయోజనాలు ఏమిటి? అనే ప్రశ్నను సంధిస్తూ ఒక వ్యక్తి వ్యాసం రచించి ఉండవచ్చును. ఒక విషయం వలన సామాజిక పురోగతి ఎలా ఉంటుందో? వివరిస్తూ వ్యాసం ఉండవచ్చును…. ఇలా పలు రకాలు వివిధ అంశాలలో వివిధ విషయాలపై వ్యాసం ఉండవచ్చును. అవి అర్ధవంతంగా విషయాన్ని విపులంగా వివరిస్తాయి. కాబట్టి వ్యాసాలు చదవడం వలన విషయావగాహనకు అవకాశం ఉంటుంది.తెలుగు వ్యాసాలు – వ్యాసం చదవడం వలన ఉపయోగాలు
ముఖ్యంగా విషయాలలో పరిజ్ఙానం పెంచుకోవడానికి, విషయాలపై ఒక అవగహనకు రావడానికి వ్యాసాలు చదవడం వలన ప్రయోజనం ఉంటుందని అంటారు. గొప్పవారి గురించి తెలుసుకోవచ్చును. చారిత్రిక సంఘటనలను గురించి చదవవచ్చును. సామాజిక అవగాహన ఏర్పరచుకోవచ్చును. నూతన పోకడలను తెలుసుకోవచ్చును. సామాజిక మార్పులు, ప్రభావాలు తెలుసుకోవచ్చును. వివిధ వస్తువుల పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకోవచ్చును. సామాజికంగా ప్రభావం చూపే అంశాలలో అవగాహన పెంచుకోవచ్చును. దురభిప్రాయాలపై అవగాహన ఏర్పరచుకోవచ్చును. మనిషి మనుగడ గురించి…. ఇలా ఏదైనా అంశంతో సామాజిక శ్రేయస్సుని సూచిస్తూ… వ్యక్తిగత ప్రభావం చూపే వివిధ విషయాల గురించి విమర్శకులు చేసే అభిప్రాయాలను తెలుసుకోవచ్చును. వ్యాసం విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి విషయ విజ్ఙానం పెంచుకోవడానికి వ్యాసం చదువుతారు. తదితర విధాలుగా వ్యాసం చదవడం వలన ఉపయోగాలు ఉంటాయి.మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలునిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు
చిన్న వయస్సులో బాలుడిలో పుట్టే ప్రశ్నలో సైన్సు ఉంటుంది. వస్తు తయారీకి, వస్తు పరిశోధనకు, విషయ పరిశోధనకు సైన్సు ఆధారం. కాబట్టి నిత్య జీవితంలో వ్యక్తికి ఎదురయ్యే అనేక విషయాలతో సైన్సు మమేకం అయి ఉంటుంది. పరిశీలిస్తే వివిధ కుటుంబ సంప్రదాయాలలో ఉండే ఆచారాలు కూడా సైస్సును బట్టి ఉంటాయని అంటారు. ఇంకా వ్యక్తి ఆహార పదార్ధములపై నియమ నిబంధనలు కూడా సైన్సుని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని అంటారు. సైన్సు మన జీవితంలో మనకు తెలియకుండానే భాగమై ఉంటుంది. ఆచారం అయినా, సంప్రదాయం అయినా, వస్తువుల అయినా… ఎలా చూసినా సైన్సు కనబడుతుంది. పరిశోధనాత్మక దృష్టి ఉన్నవారికి నిత్య జీవితం కూడా ఒక పరిశోధనాలయం గా కనబడుతుంది. వంట చేస్తున్నప్పుడు గమనిస్తే… సైన్సు కనబడుతుంది. సైన్సు ఉపయోగాలు ఏమిటో తెలుస్తాయి. వ్యక్తి శరీరం, వ్యక్తి జీర్ణాశయం, అందులో జరిగి జీర్ణక్రియలు గమనిస్తే, సైస్సు ఉపయోగాలు తెలుస్తాయి. ఒక ఫ్యాన్, ఒక టివి, ఒక ఫోన్…. ఇల ఏ వస్తువు గమనించినా అందులోని వాడిన పదార్ధాలు, ఆయా పదార్ధాల లక్షణాలు గమనిస్తే… సైన్సు ఉపయోగాలు తెలియబడతాయి. అద్దంలో ముఖం చూసుకుంటే, ఎందుకు మన ముఖం ప్రతిబింబిస్తుంది? ప్రశ్న పుడితే… అదో పరిశోధనాంశంగా మనసుని సైన్సు వైపుకు మళ్ళించవచ్చును. ఇలా విశ్వంలో విజ్ఙానం ఒక సంద్రం వలె ఉంటుంది. దానికి హద్దు లేదు…. పరిశీలించే కొలది కొత్త ఆవిష్కరణలకు కొంగ్రొత్త ఆలోచనలు పుట్టగలవు. సాధన చేస్తే… కొత్త ఆవిష్కరణలు సాధ్యపడగలవు. ఆలోచిస్తే నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు అనేకంగా కనబడుతాయి.మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?
న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు? న్యూస్ అంటే వ్యూ ఆఫ్ ట్రూత్ అంటారు. కానీ చెప్పే విషయానికి హెడ్ లైన్ కాదు జరిగిన విషయానికి హెడ్ లైన్… వివరాలలో వ్యూస్ ఆప్ ట్రూత్ ఉండాలి. కానీ ఏదో ఆసక్తికరంగా టైటిల్ పెట్టేసి, న్యూసెన్స్ ను వ్యూస్ ఆఫ్ ట్రూత్ అన్నట్టుగా వ్రాస్తే, అటువంటి న్యూస్ వ్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే ఎవరైనా ట్రూత్ తెలుసుకోవాలనుకుంటారు కానీ న్యూసెన్స్ కాదు.
ఇప్పుడు న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?
గతంలో న్యూస్ వార్తాపత్రికలలో రోజుకొక్కసారి ఉదయం కనబడితే, రేడియోలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రసారం జరిగితే, దూరదర్శన్ లో కూడా రోజు రాత్రి వేళల్లో న్యూస్ ప్రసారం జరిగేవి… ఆయా సమయాలలో న్యూస్ వినడానికి ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు న్యూస్ 24గంటలు ప్రసారం జరుగుతూనే ఉంటాయి. సంచలనం సృష్టించిన న్యూస్ అయితే, అదే న్యూస్ రోజంతా ప్రసారం. లేకపోతే వివిధ విశ్లేషణలు, వివిద రకాల కార్యక్రమములతో న్యూస్ ఉంటుంది.
న్యూస్ హెడ్ లైన్ ఆకట్టుకునే విధంగా, న్యూస్ డిటైల్స్ లో మాత్రం విషయసారం లేకపోవడం ఉంటే, అటువంటి న్యూస్ చదవడానికి వ్యూవర్స్ ఆసక్తి చూపరు. ఎందుకంటే హెడ్ లైన్ నమ్మశక్యంగా లేకుండా ఉండి, దాని డిటైల్స్ కూడా హెడ్ లైన్ లోని భావనను బలపరచకుండా ఉండడం వలన సహజంగానే అటువంటి న్యూస్ ఒక అబద్దపు న్యూస్ గా భావించే అవకాశం ఉంటుంది. అది కేవలం వ్యూవర్ ని ఆకట్టుకోడానికి చేసిన ప్రయత్నంగా న్యూస్ వ్యూవర్ కు అర్ధం అవుతుంది.
ఈ విధంగా న్యూస్ అంటే వార్తలు వాస్తవికతను వదిలి కేవలం ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే, వాటిని చదివేవారు కూడా మరలా అటువంటి వార్తలపై ఆసక్తి చూపరు.
మరొక ప్రధాన కారణం చేతను న్యూస్ వ్యూస్ తగ్గడం జరగవచ్చును.
అదేమిటంటే… మరలా మరలా ఒకే వార్తను చెప్పడం. చెప్పినదే చెప్పడం. చూపినదే చూపడం. వ్రాసినదే మరలా మార్చి వ్రాయడం…. జరగడం కూడా న్యూస్ వ్యూస్ తగ్గడానికి ప్రధాన కారణం అంటారు.
ఇంకా రాజకీయ ప్రసంగాలు కూడా న్యూస్ పై ప్రభావితం చేయగలవు.
అది ఎలా అంటే?
ఒక ఊరికి ఒక డమ్మీ పేరు పెట్టుకుందాం. అలాగే ఆ ఊరిలో ఒక డమ్మీ సమస్య గురించి, రాజకీయ ప్రకటనలు ఏ విధంగా కొనసాగితే, ఆ ఊరి ప్రజలకు ఆ ప్రసంగాలపై విశ్వాసం ఉండదో చూద్దాం….
ఒక ఊరికి ఒకపురం అని పేరు పెట్టుకుంటే, ఆ ఊరి సమస్య…. ఊరికి రోడ్డు లేదు. దీనిపై ఆ ఊరిలో వివిధ పార్టీల రాజకీయ ప్రసంగాలు ప్రగల్భాలుగా మారితే…
అయ్యా! ప్రజలారా.. గతంలో ఎందరో వచ్చారు. ఈ ఊరి కోసం ఏమి చేయలేదు. ఎవరు ఏమి చేయలేకపోయిన ఊరికి రోడ్డు సమస్యను నేను గెలవగానే తీర్చేస్తాను. ఇక ఒకపురం ఊరికి సిమెంటు రోడ్డు వస్తుంది. అది చెక్కు చెదరని రోడ్డు. వాన వచ్చినా కొట్టుకు పోనీ రోడ్డు…. అంటూ పలు మార్లు ఎన్నికల జరిగినా ప్రతిసారీ అదే ప్రసంగం ఉంటూ… ఊరికి రోడ్డు మాత్రం రాకపోతే…. ఆ ఊరి ప్రజలు విసిగి… ఆ రోడ్డు సమస్య గురించి మాట్లాడని వారుంటే, వారి మాటలు వినడానికి ఆసక్తి చూపుతారు. కానీ రోడ్డు గురించి మాట్లాడడం మొదలు పెట్టగానే… అవి బూటకపు మాటలుగా జమ కట్టే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలకు వాస్తవాలు కావాలి. సమస్యలకు పరిష్కారం కావాలి. దానినే ప్రజలు గుర్తిస్తారు. ఇలా ఒకపురం రోడ్డు గురించిన న్యూస్ కు విలువ లేకుండా చేసినదెవరు?
బూటకపు మాటలు, పరిష్కారం లేని మాటలు, వక్రీకరించిన ప్రసంగాలు ఆకట్టుకునే విధంగా ఉండవచ్చును కానీ సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చలేవని అంటారు. న్యూస్ వాటిని ఫాలో అయినప్పుడు వ్యూవర్స్ న్యూస్ పై ఆసక్తి తగ్గుతుంది.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు
తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు
శ్రీవేంకటేశ్వర స్వామిని మెప్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్య. అన్నమయ్య కీర్తన వినని తెలుగవారు ఉండరు. అన్నమయ్య కీర్తన పెట్టని గుడి ఉండదు. అన్నమయ్య కీర్తనలు ఊరూరా… వినబడుతూనే ఉంటాయి. అంతటి ప్రసిద్ది చెందిన అన్నమాచార్యుడి శ్రీవేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు.
తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు
చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి
చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఏది ఏమిటో? ఏది ఎందుకో? దేని గుణమేమిటో? అవగాహన లేకపోవడం వలన పిల్లలు పనులు అజ్ఙానంతో చేసే పనులుగా ఉంటాయి. తెలియక చేసే వారి చేష్టల వలన వారికి అపాయం కూడా ఏర్పడవచ్చును. కావునా పిల్లలను తల్లి ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ…. లేకపోతే ఏడుస్తూ… నిద్రిస్తూ… లేకపోతే ఆడడం… అవగాహన తక్కువ చేష్టలు ఎక్కువ…. నిద్ర ఎక్కువ.. ఇలా బాల్యంలో చిన్న పిల్లల చేష్టలుంటాయి.
అమాయకత్వంతో ఉండే చిన్న పిల్లల చేష్టల ముఖ్యంగా ఎదుటివారిని అనుకరించే అవకాశం ఉంటుంది. అలా అనుకరించడంలో వారికి ఆ చేష్టలపై ఎటువంటి అవగాహన ఉండదు… కానీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు చూసినది చూసినట్టుగా చేసే అవకాశం కూడా ఉంటుంది. కావునా చిన్న పిల్లల ముందు పెద్దలు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే హుందా ప్రవర్తన వారికి అలవాటు అవుతుందనే సదుద్దేశ్యం పెద్దలలో ఉంటుంది.
చిన్న పిల్లల చేష్టల గురించి
కొందరు పిల్లలు బాల్యం నుండే మొండివారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతిదానికి పేచి పెట్టడం. కావాలనిపించినది దానికోసం మరితంగా మారాం చేస్తూ ఉంటారు. ఏదైనా కావాలనే మొండితనం లేక పేచీ పెట్టి సాధించుకోవడం చిన్న వయస్సులోనే ప్రారంభం అవుతూ ఉంటుంది.
చిన్న పిల్లల చేష్టలు అసంకల్పితంగా జరిగినట్టుగా ఉంటాయి. తల్లి సంరక్షణలో పిల్లలు అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటారు. చిన్న పిల్లల చేష్టల అల్లరిగా అనిపిస్తాయి. ముద్దుగా అనిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి ప్రమాదావశాత్తు ఇబ్బందులకు కూడా ఏర్పడతాయి. ఏమి తెలియనివారికి అన్నింటిని పట్టుకుని ఆడుకోవడమే తెలుసు. కాబట్టి ప్రతి వస్తువుని ఒక ఆట వస్తువుగా బావిస్తారు. ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఇంకా చిన్న పిల్లల చేష్టలలో ఏ వస్తువునైనా నోటిలో పెట్టుకుని చీకడం వంటివి చేస్తారు. ప్రతి వస్తువును వారు అదే పని చేస్తారు. వేడి వస్తువైనా, చల్లగా ఉన్న వస్తువైనా ఏదైనా వారు పట్టుకుని నోటిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలకు అమ్మ దగ్గర వస్తు వివేకం ఏర్పడుతుంది.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?