Tag Archives: అభివృద్ది

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి. ఎన్నికల వేళలో మేలైన నిర్ణయాన్ని ప్రకటించడమే ఓటరు బాధ్యత. వ్యక్తి ప్రయోజనం కన్నా, వ్యవస్థ ప్రయోజనం మిన్న అని భావించే నాయకులను ఎన్నుకోవడం వారి కర్తవ్యంగా చెబుతారు. ఎన్నికల ప్రక్రియలో ఒక ప్రాంతంలో ఒక నాయకుడిని ఎన్నకోవడం ద్వారా, అలా పలు ప్రాంతాలలో ప్రజలు తమ తమ నాయకులను ఎన్నుకోవడం పూర్తయ్యాక, ఆ నాయకులు అందరికి మరలా నాయకత్వం వహించే బాద్యతను అప్పగించే ప్రక్రియ ద్వారా అధికారిక ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఓటరు ఓటు ఉపయోగపడుతుంది. సమాజంలో ఓటు ద్వారా ప్రజలను పాలించే అధికార యంత్రాంగాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓటు ద్వారా ప్రభుత్వ పనితీరుకు తీర్పు ప్రజల ద్వారా లభిస్తుంది.

ఓటు వేసి గెలిపించిన నాయకుడు, మరలా ఆ నాయకుడు ఎంచుకున్న ముఖ్యనాయకుడి పాలనపై తీర్పు చెప్పే అవకాశం ప్రతి అయిదేళ్ళకు ఒకసారి ఓటరుకు వస్తుంది. అందువలన రాజకీయ పార్టీల అధికారం ప్రతి ఐదేళ్ళకు ప్రజలు ఇచ్చే తీర్పుపై అధారపడి ఉంటుంది.

ఓటేసి గెలిపించిన ప్రజలు ప్రభుత్వం నుండి మంచి పాలనను ఆశిస్తారు. ప్రాంతీయ అభివృద్ధిని, వ్యక్తి ఉపాధిని కావాలని ఆశిస్తారు. తాము ఆశించిన పనితీరును ప్రభుత్వం నెరవేర్చలేకపోతే, ప్రజలు తమ అభిప్రాయం మార్చుకుని, ప్రభుత్వం తలరాతను మార్చేస్తారు, ఓటు ద్వారా…

దేశంలో 18ఏళ్ళు నిండిన ప్రజందరికీ ఓటు హక్కు ఉంటుంది. తమకు నచ్చిన నాయకుడికి ఓటేసి స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ కల్పించింది. అందుకే సామాన్యుడి చేతిలో ఓటు బలమైన ఆయుధంగా చెబుతారు.

అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మిత్రపక్షపార్టీలు… ఇలా రాజకీయ పార్టీలు ఎన్నికలలో తమ తమ పార్టీలు పనితీరుని గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాయి.

విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ నాయకులు టివి డిబేట్లలోనూ, ప్రెస్ మీట్లలోనూ హడావుడిగా ప్రచారాలతోనూ ప్రజలకు తమ పార్టీల గురించి వివరించే ప్రయత్నం చేస్తాయి.

ప్రభుత్వం వలన అభివృద్ది ఎంత జరిగిందనేది, ఆయా ప్రాంతపు ప్రజలకే తెలుస్తుంది. అయితే జరిగిన అభివృద్ది, జరగని అభివృద్ది గురించి రాజకీయ పార్టీలు చేసే ప్రచారం మాత్రం ఎక్కువగానే ఉంటుంది.

అభివృద్ది, ఆర్ధికాభివృద్ది, ఉపాధి….

  • ఒక కుటుంబంలో ఎంత సంపాధన వస్తుందో, అంతే ఖర్చు ఉంటే, ఆ కుటుంబం ఆర్ధికంగా బలపడడానికి చాలా కాలం పడుతుంది.
  • అదే ఒక కుటుంబంలో ఎంత సంపాధన వస్తుందో అంతకన్నా ఎక్కువ ఖర్చు ఉంటే, ఆ కుటుంబం ఎప్పటికీ ఆర్ధికంగా బలపడుతుందనే నమ్మకం ఉండదు.
  • అలాగే ఒక కుటుంబంలో ఎంత సంపాధన వస్తుందో, ఖర్చు అంతకన్నా తక్కువగానే ఉంటే, ఆ కుటుంబం త్వరలోనే ఆర్ధికంగా బలపడుతుందనేది వాస్తవం.

అయితే పై మూడు పాయింట్లలోనూ ఆ కుటుంబానికి వారసత్వపు ఆస్తి ఉంటే, తమ తమ ఆర్ధిక స్థితి ఏమిటి? తమ భవిష్యత్తులో ఆర్ధిక స్థితి ఏమిటో? లెక్క చూసుకోకపోతే, వారసత్వంగ వస్తున్న గౌరవం కూడా కోల్పోయే విధంగా కుటుంబ ఆర్ధిక స్థితి పడిపోవచ్చును. కావునా… ఒక కుటుంబానికైనా, ఒక సంఘానికైనా, ఒక ప్రాంతానికైనా, ఒక ప్రభుత్వానికైనా… ఆదాయం కన్నా అప్పులు ఎక్కువ ఉండరాదు.

కాబట్టి ఓటరు ఎప్పుడూ కూడా వ్యవస్థను సక్రమంగా నడిపిస్తూ, తమ ప్రాంతపు అభివృద్దిని కాంక్షించే నాయకులకు ఓటేసి గెలిపించుకోవడం ద్వారా రేపటి తరానికి, మంచి సామాజిక స్థితిని ఏర్పరచినవారు అగుదురు.

ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉద్యోగం లేకపోతే, అతను తన కుటుంబానికి భారం అవుతారు. అదే వ్యక్తి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తే, అతను కుటుంబానికి ఆదాయ వనరుగా మారుతారు…

ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం

అలా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా, ఒక ప్రాంతమును ఆర్ధికముగా అభివృద్ది చేయవచ్చును.

యువతకు ఉద్యోగములు లభించాలంటే, ఆ ప్రాంతములో పరిశ్రములు రాక అవసరం.

ఇంకా చేతి వృత్తి పనులకు ఆదరణ పెరగడం, వ్యవసాయాభివృద్దిని సాధించడం… ఇలా ప్రాంతంలో ప్రకృతి పరంగా లభించే వనరులను ఉపయోగించుకుంటూ… యువతకు ఉపాధి అవకాశాలు పెరిగితే….

కుటుంబాలు తమ కుటుంబం కోసం ఇళ్ళ నిర్మాణాలు పెంచుకుంటూ, ఉంటే భవన నిర్మాణ కార్మికులకు ఆదాయం పెరుగుతుంది.

ఒక రంగం ఆర్ధికంగా బలపడుతుంటే, ఆరంగంలో ఉన్నవారు ఖర్చు చేసే ఖర్చు వేరొక రంగంలోని వారికి ఆదాయంగా మారుతుంది. కాబట్టి ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచడమే ప్రభుత్వాల యొక్క బాధత్యగా చెప్పబడుతుంది.

కాబట్టి మన సమాజం బాగుపడడానికి ఓటరుగా తమ ప్రాంతపు అభివృద్దిన కాంక్షించే నాయకులకు ఓటరు పట్టం కట్టాలని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు.

అభివృద్దిని ఆశించు, తాత్కాలిక ప్రయోజనం కాదు.

  • కుటుంబం కోసం నీవు కష్టపడతావు.
  • కుటుంబ పోషణ కోసం నీవు శ్రమిస్తావు.
  • కుటుంబం ఆర్ధిక స్థితి మెరుగుపరచుకోవడం కోసం నీవు ఆలోచన చేస్తావు.
  • కుటుంబ భవిష్యత్తు కోసం ఏమి చేయాలో? నీవు ప్రణాళిక వేసుకుంటావు.

కానీ అదే పిల్లల భవిష్యత్తు కోసం రేపటి సమాజాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నావు? ఈ ప్రశ్న ఓటు వేసే ఓటరు వేసుకోవాలి అంటారు.

ఎటువంటి మార్గదర్శకత్వం వహించే నాయకుని ద్వారా అటువంటి సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తూ, కష్టం చేసే మనము, రేపటి తరం కోసం సామాజిక శ్రేయస్సు కోసం కూడా ఆలోచన చేయాలి.

కాబట్టి సామాజిక శ్రేయస్సు, సామాజిక అభివృద్ది, వ్యవస్థల పనితీరుని మెరుగుపర్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా, రేపటి తరానికి మంచి సామాజిక పరిస్థితులను అందించగలం.

సామాజిక ప్రయోజనాలు దీర్ఘకాలిక ప్రణాళికపై ఆధారపడి ఉండవచ్చును. కావునా తాత్కాలిక ప్రయోజనాలకు పెద్దపీఠ వేయకుండా, సామాజిక శ్రేయస్సును కాంక్షించాలని పెద్దలు అంటారు.

మెరుగైన సమాజం కోసం మీడియా సంస్థలు వార్తా విశేషాలను, నాయకులు నిర్ణయాలను, విశ్లేషకుల అభిప్రాయాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటాయి. వీటన్నింటిని నియంత్రించే ముఖ్య నాయకుడి ఆలోచనా దృక్పధం బట్టి ఆయా రంగాల ప్రభావం సమాజంపై చూపుతాయి. కావునా మంచి నాయకునికి పట్టం కట్టే విధంగా ఓటరు ఆలోచన చేయాలి.

నేటి మన ఓటు రేపటి సామాజిక పరిస్థితులను ప్రభావితం చేయగలవని ఓటు వేసే ఓటరు ఆలోచన చేయాలి.

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం?

వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక క్రమశిక్షణ దోహదపడుతుంది.

ఒక వ్యక్తి సామాజిక స్థితిని ఆర్ధిక పరిస్థితి శాసిస్తుంది.

సమాజంలో గౌరవం వ్యక్తి యొక్క ఆర్ధిక స్థితి ఆధారంగా ఉంటుంది.

కుటుంబ జీవనంలో ఆర్ధిక వనరులు కీలక పాత్ర పోషిస్తాయి.

సామాజిక అభివృద్ది అయినా వ్యక్తి అభివృద్ది అయినా ఆర్ధిక వనరులు, ఆర్ధిక సంపాదన వలననే సాద్యపడుతుంది… ఇంకా ఎన్నో అవసరాలు ఆర్ధిక స్థితి ఆధారంగా తీరుతూ ఉంటాయి. అటువంటి ఆర్ధిక రంగంలోనే మోసానికి తావు ఉండేది. ఏరంగం అయినా స్థాపించబడే ప్రధానంగా ఆర్ధిక ప్రయోజనాలు కోసమే అయితే కొన్ని సేవా రంగాలు కూడా ఆర్ధిక స్థితి బాగుంటేనే అవి మనగలవు. కాబట్టి ఆర్ధిక క్రమశిక్షణ అనేది అందరికీ అవసరం.

ఆలోచిస్తే ఆర్ధిక క్రమశిక్షణ ఒక వ్యక్తికి జీవిత పర్యంతము ఉంటే, అతని సంపాధన అతనిపై ఆధారపడినవారికి సరిగ్గా అందుతుంది.

ఒక సంస్థ కట్టుదిట్టమైన ఆర్ధిక క్రమశిక్షణను కలిగి ఉంటే, ఆ సంస్థ దీర్ఘకాలం కార్యకలాపాలు సాగించి, ఆ సంస్థను నమ్ముకున్నవారికి సరైన న్యాయం చేయగలదు. ఇలా వ్యక్తి అయినా సంస్థ అయినా ఆర్ధికపరమైన విషయాలలో క్రమశిక్షణను కలిగి ఉంటే ఎక్కువకాలం సమాజంలో మనగలవు. ఆర్ధిక అవసరాలలో తమవంతు సాయం చేయగలవు.

ఆర్ధిక క్రమశిక్షణ వలన ఆర్ధిక అవసరాలపై పట్టు ఉంటుంది.

కష్టం చేసేవారికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంటుంది. కష్టపడి కూడా ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే, జీవితంలో పడ్డ కష్టానికి విలువ పోగొట్టుకున్నట్టే… అవుతుంది.

ధనం సంపాదించేవారికే ధనం ఖర్చు చేసే అధికారం అంటారు. కష్టపడ్డవారికే తెలుసు కష్టం విలువ. ఆ కష్టం ద్వారా వచ్చిన ధనం విలువ.

కూర్చుని తినేవారికి ఏమి తెలుసు? డబ్బు కేవలం వినోదాలకు ఖర్చు చేయడమే అవసరం అనే అజ్ఙానంతో ఉంటారు. ఇలాంటి వారి చేతికి ధనం వచ్చినా అది విలాసాలకు లేదా మరొకరి జీవితాన్ని పాడు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఆర్ధిక పరిస్థితి బాగున్న కుటుంబంలో కుటుంబ యజమాని ఆర్ధిక క్రమశిక్షణ దాగి ఉంటుంది. అదే కుటుంబంలో సభ్యుడు ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే, ఆ కుటుంబ ఆర్ధిక పరిస్థితి భవిష్యత్తులో పడిపోయే అవకాశం ఉంటుంది. ఆర్ధిక స్థితి కుంటుపడితే, కుటుంబ గౌరవం కూడా సన్నగిల్లడం ప్రారంభం అవుతుంది. అలాగే సంస్థ అయినా సరే!

ఈ ఆర్ధిక క్రమశిక్షణ అంటే ఏమిటి?

వ్యక్తికి అయినా వ్యవస్థకు అయినా ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు అవసరాలు, గతానికి సంబంధించిన ఖర్చులు… మూడు కాలంలో కలుగుతూ ఉంటాయి.

ప్రస్తుత అవసరాలు

అంటే నిత్య జీవనంలో మనిషి, మనిషిపై ఆధారపడిన వారి పోషణకు సంబంధించినవి.

భవిష్యత్తు అవసరాలు

కుటుంబ ప్రయోజనాలు, ఒక ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులకు, పిల్లల ఉపాధికి సంబంధించిన అంశాలలో ధనం అవసరాలను గుర్తెరిగి ఉండడం

గడిచిన విషయాలు

గడిచిన కాలంలో ఇచ్చిన మాట ప్రకారం కానీ, ప్రణాలిక చేసుకున్న పధకం ప్రకారం కానీ వర్తనమానంలో కానీ భవిష్యత్తులో కానీ ఖర్చు పెట్టవలసిన సమయానికి ఖర్చు చేయకపోతే అది వ్యక్తి నమ్మకం కానీ సంస్థ గౌరవం కానీ తగ్గిపోతుంది.

ప్రస్తుత ఖర్చులలో వర్తనమాన, భూత, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుటుంబం లేదా సంస్థ యొక్క శ్రేయస్సు కోసం వ్యక్తిగత ప్రయోజనాలకు కానీ స్వార్ధ ప్రయోజనాలకు కానీ విలువ ఇవ్వకుండా ఖర్చుల నిర్వహణ చేయడం ఆర్ధిక క్రమశిక్షణ అయితే అది అందరికీ అవసరం అంటారు.

డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడమే ఆర్ధిక క్రమశిక్షణ

జీవితంలో డబ్బు మనిషి మనుగడకు ఆక్సిజన్ వంటిది. ఒకానొక సందర్భంలో ప్రాణవాయువు కూడా డబ్బు పెట్టి కొనుక్కోవాలసిన ఆగత్యం వ్యక్తి ఏర్పడుతుందంటే అర్ధం చేసుకోవచ్చును… డబ్బు వ్యక్తి జీవితంలో ఆక్సిజన్ వంటిదని.

ఒక వ్యక్తి డబ్బును సక్రమంగా ఖర్చు చేయడం వలన, ఆ వ్యక్తిని అనుసరించేవారు కూడా డబ్బును సక్రమంగా ఖర్చు చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు.

ఏదైనా సంస్థ డబ్బు విషయంలో సక్రమమైన విధానమును కలిగి ఉంటే, అందులో ఉద్యోగులు కూడా ఆ సక్రమమైన విధానమునే అనుసరించే అవకాశం ఉంటుంది.

సహజంగా అవసరాల కోసం పనిచేసే చిన్న వయస్సు నుండి లేక ఇష్టం కోసం పనిచేసే బాల్యం నుండే డబ్బు అనే ఆలోచన పుడుతూ ఉంటుంది. అయితే అది సక్రమమైన పద్దతిలో సంపాదించే ఆలోచనకు పునాది ఎక్కడంటే సక్రమంగా ఖర్చు పెట్టడం నుండే అంటారు.