అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పులు ఎంత ఉన్నాయో? లెక్క వేయాలి. ఏ పద్దతిలో ఆదాయం వస్తుందో, దానిని బట్టి అప్పులు తీర్చడానికి ఆలోచన చేయాలి. బిజినెస్ మ్యాన్ అయితే, ఎక్కువ మొత్తం, తక్కువ వడ్డీకి తీసుకుని వచ్చి, ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న చిన్న, చిన్న అప్పులు తీర్చేసి, పెద్ద అప్పు నెలవారీ చెల్లించడానికి చూస్తాయి. అయితే ఎంత మొత్తం అప్పుచేసినా, అది నెలవారీ వచ్చే ఆదాయంలో నలభై శాతానికి మించకుండా చూసుకోవాలి.
రుణాన్ని క్లియర్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, వీటిలో క్రిందివి గమనించండి:
బడ్జెట్‌ను అభివృద్ధి చేయండి మరియు దానికి కట్టుబడి ఉండండి: మీ ఆదాయం మరియు ఖర్చులను నిర్వహించడంలో మీకు సహాయపడే బడ్జెట్‌ను సృష్టించండి మరియు దానికి కట్టుబడి ఉండండి. ఇది మీరు ఖర్చులను తగ్గించుకునే ప్రాంతాలను గుర్తించడంలో మరియు మీ అప్పులను చెల్లించడానికి ఎక్కువ డబ్బును కేటాయించడంలో మీకు సహాయం చేస్తుంది.
రుణాలకు ప్రాధాన్యత ఇవ్వండి: ముందుగా అత్యధిక వడ్డీ రేట్లతో రుణాలను చెల్లించడంపై దృష్టి పెట్టండి, ఎందుకంటే ఇవి దీర్ఘకాలంలో మీకు ఎక్కువ ఖర్చు చేస్తాయి.
ఆదాయాన్ని పెంచుకోండి: మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడం లేదా సైడ్ హస్టిల్‌ను ప్రారంభించడం వంటి మార్గాల కోసం వెతకండి, తద్వారా మీరు మీ అప్పులను చెల్లించడానికి ఎక్కువ డబ్బును ఉంచవచ్చు.
రుణదాతలతో చర్చలు జరపండి: మీ రుణదాతలను సంప్రదించండి మరియు వారు తక్కువ వడ్డీ రేటు లేదా మీ కోసం మెరుగ్గా పనిచేసే చెల్లింపు ప్రణాళికను చర్చించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో చూడండి.
రుణ ఏకీకరణను ఉపయోగించండి: రుణ ఏకీకరణ రుణం లేదా బ్యాలెన్స్ బదిలీ క్రెడిట్ కార్డ్ వంటి రుణ ఏకీకరణ ఎంపికలను పరిశీలించండి, ఇది బహుళ రుణాలను ఒకే చెల్లింపులో కలపడం ద్వారా మీ రుణ చెల్లింపును సులభతరం చేయడంలో సహాయపడుతుంది.
క్రెడిట్ కౌన్సెలింగ్ పొందండి: వ్యక్తిగతీకరించిన రుణ చెల్లింపు ప్రణాళికను రూపొందించడానికి లాభాపేక్షలేని క్రెడిట్ కౌన్సెలింగ్ ఏజెన్సీతో కలిసి పనిచేయడాన్ని పరిగణించండి. వారు మీ ఎంపికలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడగలరు మరియు మీరు కొనుగోలు చేయగల ప్రణాళికతో ముందుకు రావడానికి మీ రుణదాతలతో కలిసి పని చేయవచ్చు.
అంతిమంగా, మీ అప్పులను తీసివేయడానికి మీ ప్రయత్నాలలో స్థిరంగా మరియు ఓపికగా ఉండటం చాలా కీలకం. దీనికి కొంత సమయం పట్టవచ్చు, కానీ పటిష్టమైన ప్రణాళిక మరియు సంకల్పంతో, మీరు అప్పుల నుండి బయటపడవచ్చు.
ఉద్యోగి అయినా, సరే లెక్కించిన అప్పుల మొత్తం, ఎంతకాలం వచ్చిన జీతంలో 25శాతం అప్పులు చెల్లిస్తే సరిపోతుందో చూసుకోవాలి. అందుకు తగ్గట్టుగా అదనపు ఖర్చులు నియంత్రించుకోవాలి. ఉన్న అప్పులు వడ్డీతో లెక్కింపు, నెలవారీ ఆదాయంలో 25శాతం అప్పుతీర్చడానికి చూసుకున్నప్పుడు, ఖచ్చితంగా ఖర్చులు తగ్గించుకోవాలి.
ఉదాహరణకు నెలకు నలభైవేలు జీతం వచ్చే ఉద్యోగికి, నాలుగు లక్షలు అప్పులు ఉన్నాయి అనుకుంటే,
చిన్న చిన్నగా అప్పులు ఉంటే, వాటికి వడ్డీ ఎక్కువగా ఉంటుంది. కావునా నాలుగు లక్షలు, ఒకే కంపెనీ నుండి తీసుకుంటే… నాలుగు లక్షలు అప్పు చేసి, తిరిగి చెల్లించడానికి నెలకు 18000 వేల రూపాయిలు పైగా చెల్లిస్తే, రెండు సంవత్సరాలలో అప్పు తీరే అవకాశం ఉంటుంది. కానీ ఇది అతని ఆదాయంలో నలభై శాతానికి మించిపోతుంది. నెలకు వస్తున్న నలభై వేలలో ఖర్చులను నియంత్రించి, 25 వేలు రూపాయిలు ప్రక్కన పెడితేనే, రెండెళ్ళలో సవ్యంగా అప్పు తీర్చవచ్చును. ఎందుకంటే సంఘజీవి అయిన మనిషికి ఏడాదిలో అదనపు ఖర్చులు వస్తూ ఉంటాయి. అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి లోన్ పద్దతిలో చెల్లించే అప్పులు జీతంలో 25 శాతానికే పరిమితం అయితే, లోన్ సవ్యంగా పూర్తి చేయగలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే, ఆదాయంలో నెలవారీ ఖర్చులు పోగా మిగిలిన మొత్తం లోనుకే పరిమితం అయితే, ఆనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు, మరొక అప్పు కోసం చూడాల్సి వస్తుంది.
ఆప్పు చేసేటప్పుడే, అది ఆదాయంలో 40శాతానికి మించకుండా జాగ్రత్తపడాలి. ఆదాయానికి మించిన అప్పులు పెనుభారంగా మారతాయి. కావునా అప్పులు చేయడానికి ముందే, అప్పు ఎంతమేరకు అవసరం? ఎంత అప్పుచేస్తే? ఎంతకాలంలో తీర్చగలం? ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తేనే… అప్పు చేయడానికి చూడాలి.
అప్పులు తీరే మార్గం అప్పులు తీరే మార్గం చెప్పండి
ఆదాయాన్ని బట్టి అప్పులు తీరే మార్గం ప్రధానంగా ఖర్చుల నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. అప్పులు ఎక్కువగా ఉన్నాయనే పేరుకే పరపతి తగ్గిపోతూ ఉంటుంది. కావునా ఆదాయానికి మించిన అప్పులు జోలికి పోకూడదు. అప్పులు తీరే మార్గం ఎప్పుడూ ఖర్చుల నియంత్రణ మరియు రాబడిని బట్టి ఉంటుంది. ఈ రెండు బేరీజు వేసుకోవాలి.
అప్పులు పుట్టే మార్గం ఉందంటే, అందుకు తగిన పరపతి మనకు ఉన్నట్టే. అయితే ఆ పరపతిని కాపాడుకోవడానికి అప్పులు సవ్యంగా చెల్లించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మరలా అప్పు పుట్టదు. కాబట్టి అప్పులు, ఆదాయం, ఖర్చులు మూడింటిని సరిగ్గా లెక్కించి, అప్పులు తీర్చే ప్రయత్నం చేయాలి.
ఒకవేళ నెలవారీ వచ్చే ఆదాయంలో నెలవారీ చెల్లింపు ఆదాయంలో సగానికి ఉంటే, అటువంటి అప్పులు తీర్చడంలో జాప్యం చేయకూడదు. ముందు వాటి వడ్డీ శాతం తగ్గించే ప్రయత్నం చేయాలి. వడ్డీ తగ్గించుకుంటే, నెలవారీ చెల్లింపులో కాస్త వెసులుబాటు కలుగుతుంది. కావునా అప్పులు తీర్చడంలో ముందు వడ్డీ గణనం ప్రధానం. నెలవారీ ఆదాయం ఉన్నవారికి నెల నెలా చెల్లింపు ప్రక్రియలో నిర్ణీత గడువులో అప్పు తీర్చేవిధంగా మాట్లాడుకోవాలి.
ధన్యవాదాలు
తెలుగులో వ్యాసాలు
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు