Monthly Archives: December 2021

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి ! అంటే వ్యక్తి యొక్క తత్వమును తెలియజేయునదిగా చెప్పబడుతుంది. సమాజంలో వ్యక్తి తన యొక్క తత్వముతో ప్రభావం చూపుతూ ఒక గుర్తింపును పొందుతూ ఉంటే, ఆ తత్వమును అతని యొక్క వ్యక్తిత్వముగా చెబుతూ ఉంటారు.

వ్యక్తిత్వంలో వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు, అభిరుచులు మొదలైనవి మిళితమై ఉంటాయి. వ్యక్తి తనకు ఉన్న విశిష్టమైన లక్షణాల వలన, గుణాలు వలన, అభిరుచుల వలన తన యొక్క ప్రవర్తనతో వివిధ పరిస్థితులలో వివిధ విధాలుగా గుర్తింపు పొందుతూ ఉంటాడు. అయితే వ్యక్తి అన్ని చోట్లా అన్ని వేళలా శోభించే గుణాలు, లక్షణాలు అతని యొక్క స్వభావముగా గుర్తింపు పొంది, అది ఆ వ్యక్తి యొక్క విశిష్ట తత్వముగా గుర్తింపు పొందుతుంది.

మనిషి యొక్క వ్యక్తిత్వమును పూర్తిగా ప్రభావితం చేసే అతని యొక్క మనసు మాత్రమే. ఎవరి మనసు వారి యొక్క ప్రవర్తనకు కారణం కాగలదని అంటారు. మనసులో ఏర్పడిన భావాలు, మనసులో గుర్తుగా మారిన సంఘటనలు, మనసులో గుర్తించబడిన విషయాలు, మనసులో కదులుతు ఆలోచనలు కలిసి సంఘర్షణగా మారుతుంటే, మనిషి యొక్క చేతలు తదనుగుణంగా ఉంటూ ఉంటే, తత్పరిణామ ఫలితమే మనిషికి ఒక గుర్తింపు పొందగలగడంలో మనసు తన ప్రత్యేకతను చాటుతుంది. ఇందుకు ఆ మనిషి చుట్టూ ఉంటే పరిస్థితలు, వ్యక్తులు కూడా బాగస్వామ్యం కాగలవు.

వ్యక్తి వ్యక్తిత్వం పై ప్రభావం

గుర్తింపు పొందిన వ్యక్తి యొక్క మనసు తన గుర్తింపును కొనసాగించడానికి ఆలోచనలు చేస్తుందని అంటారు. అలాగే అతనికి గుర్తింపును ఆపాదించినవారు కూడా సదరు ఆలోచనలకు కారణం కాగలరు. మొత్తానికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పెరుగుతున్న పరిస్థితులలో నేర్చుకున్న విషయ పరిజ్ఙానం, స్నేహం చేస్తున్న వ్యక్తుల, సంరక్షణ చేస్తున్న వ్యక్తుల ప్రభావంతో పాటు తన మనసు యొక్క స్పందనలు అనుసరించి… వ్యక్తిత్వం ఏర్పడుతూ… ఉంటుంది.

ఒక్క పూటలోనూ… ఒక్క నెలలోనూ వ్యక్తిత్వం ఏర్పడదు… అది పెరుగుతున్న వయస్సు నుండి… తన చుట్టూ ఉన్న వ్యక్తుల మరియు పరిస్థితుల ప్రభావం ప్రకారం ప్రతిస్పందిస్తున్న తీరు బట్టి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఒక్కసారి గుర్తింపు పొందిన వ్యక్తిత్వం జీవితకాలంపాటు కొనసాగుతుంది.

ఆసక్తులు, ఆశలు, కోరికలు, కోరికలు తీర్చుకోవడానికి సహకరిస్తున్నవారు, కోరికలు తీర్చుకోవడంలో భాగస్వాములు అవుతున్నవారు, కోరికలకు కారణం అవుతున్నవారు… ఆశలు కల్పిస్తున్నవారు… ఆశలు సృష్టిస్తున్న పరిస్థితులు, ఆశలకు కారణం అవుతున్నవారు… ఇలా ఏదైనా ఒక స్వభావం వృద్ది చెందడానికి వ్యక్తి మనసుతో బాటు సమాజం కూడా కారణం కాగలదు.

వ్యక్తిని బట్టి సమాజం దృష్టి, సమాజం తీరుని బట్టి వ్యక్తి

లోకంలో వ్యక్తిని బట్టి సమాజం దృష్టి, సమాజం తీరుని బట్టి వ్యక్తి ప్రవర్తన ఉంటుందని అంటారు. సమాజంలో వ్యక్తి జీవించాలి. కాబట్టి సమాజంలోని పోకడలు గమనిస్తూ, తన అవసరాల కొరకు తను మాట్లాడవలసినవారితో మాట్లాడుతూ, పనిచేయవలసిన చోట పని చేస్తూ, పని చేయించవలసిన చోట పని చేయిస్తూ… సమాజంలో తన యొక్క మనుగడకు తను ప్రవర్తించే ప్రవర్తన ఆధారంగా గుర్తింపు పొందే వ్యక్తి స్వభావం లేదా వ్యక్తిత్వంగా ఉంటుంది.

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి

మనసుకు బాగా దగ్గరగా మెసిలేవారికి వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వం తెలియబడుతుంది. ఎక్కువమందికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో కొన్ని గుణాలు మాత్రమే తెలియబడతాయి.

ఒక సినిమా హీరో నటనా చాతుర్యం ఒక విశిష్ట గుణం అయితే, అది సినిమా ప్రేక్షకులందరికీ తెలియబడుతుంది. కానీ ఆ సినిమా హీరోయొక్క వ్యక్తిత్వం గురించి మాత్రమే అతనికి బాగా దగ్గరగా మెసిలే మనుషులకే తెలియబడుతుంది.

పాపులారిటీని బట్టి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పూర్తిగా అంచనా వేయలేం…. అలాగే వ్యక్తిని బాగా దగ్గరగా పరిశీలించేవారికి మాత్రమే పూర్తి స్థాయి వ్యక్తిత్వం తెలియబడుతుంది. వారికే అతని యొక్క మంచి మరియు చెడు ఆలోచనల తీరు తెలియబడుతుంది.

ఒక వ్యక్తి వ్యక్తిత్వం మరొక వ్యక్తి వ్యక్తిత్వం

లోకంలో ఒక వ్యక్తి వ్యక్తిత్వం మరొక వ్యక్తి వ్యక్తిత్వం ఒకదానితోఒకటి ప్రభావం చూపగలవు.

ఇద్దరు వ్యక్తులు: ఏ అను ఒక వ్యక్తి, బి అను మరొక వ్యక్తి ఉన్నారనుకుంటే.

ఏ అను వ్యక్తి మనసులో పుట్టిన ఒక ఆలోచన బి అను వ్యక్తి మనసుపై ప్రభావం చూపింది. అప్పుడు బి అను వ్యక్తి యొక్క మనసు ప్రతిస్పందించడంలో వలన ఏ అను వ్యక్తి మనసు ప్రభావితం అవుతుంది. మరలా ఏ అను వ్యక్తి ప్రతిస్పందిస్తే, తిరిగి బి అను వ్యక్తి ప్రతిస్పందించడం జరుగుతుంది. ఇలా… ఇద్దరు వ్యక్తుల మద్య స్పందనలు ఉండవచ్చును.

అలా సమాజంలో ఇద్దరు వ్యక్తుల మద్య సంబంధాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి వివిధ వ్యక్తులతో బంధమేర్పడి ఉంటుంది. ఒక వ్యక్తికి… అన్న లేక తమ్ముడు, అక్కా లేకా చెల్లెలు, బావ లేక బావమరిది, మేమమామ, మేనత్త, మామగారు, అల్లుడుగారు, చిన్నాన్న, పెదనాన్న, పిన్నమ్మ, పెద్దమ్మ… ఇలా రకరకాల బంధాలతో వ్యక్తి మనసు ఎదుగుతూ… తను గ్రహించిన విషయాల వలన, తను గుర్తు పెట్టుకున్న సంఘటనల వలన, తనపై ప్రభావం చూపిన పరిస్థితులతో బాటు… నేర్చిన విద్యాబుద్దుల వలన వ్యక్తి వ్యక్తిత్వం ప్రభావితం అవుతూ ఉంటుంది.

మనసు ఒక సముద్రం అయితే, సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రపు అలలు ఆనందాన్నిస్తాయి. సముద్రపు లోతు ఎరుగము. సముద్రం పౌర్ణమినాడు పోటెత్తుతుంది. సముద్ర పొంగితే, అది వికృత ప్రభావం చూపుతుంది… అలా సముద్రం గురించి చెబుతూ ఉంటారు. అలా ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు అతనికి విశిష్టంగా వ్యక్తిత్వం అను సర్టిఫికెట్ లభిస్తుంది.

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి! జీవితంలో కర్తవ్య నిర్వహణ పాటించినవారికి జీవితపు లక్ష్యం నెరవేరగలదని అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏర్పడే లక్ష్యాలు, తాము నిర్వహించే కర్తవ్యమును అనుసరించి ఉండే అవకాశం ఉంటుందని అంటారు.

వ్యక్తి కర్తవ్య నిర్వహణలో కృతకృత్యుడైతే, వచ్చే గుర్తింపు కలకాలం కొనసాగుతుందని అంటారు.

వృత్తిరిత్యా కర్తవ్యతా దృష్టితో ఉండేవారి మనసు వృత్తిలో తమ పనిని తాము సమర్ధవంతంగా నిర్విహించగలగడానికి వారి మనసు సహకరించగలదని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు.

ఒక పోలీసు తన కర్తవ్య నిర్వహణలో కృతకృత్యుడైనప్పుడు, ఆ ప్రాంతములో సమాజిక భద్రత బాగుంటుంది.

అలాగే ఒక విద్యార్ధి కర్తవ్యతా దృష్టితో ఉన్నప్పుడు, ప్రశాంత చిత్తముతో తన చదువును కొనసాగించగలడు. ఎటువంటి పరిస్థితులలోనూ చదువు నుండి ధ్యాస బయటికి పోదు. కేవలం చదువులో శ్రద్దాసక్తి కలిగి ఉండే అవకాశం ఎక్కువ.

శ్రీరామచంద్రుడు కర్తవ్యతా దృష్టితో

శ్రీరామచంద్రుడు కర్తవ్యతా దృష్టితో ఉండడం వలన ఎంతటి విపత్కర పరిస్థితులలోనూ సున్నితంగా వ్యవహరించాడని చెబుతారు.

శ్రీరాముడిని దశరధుడు పిలిచి రాజ్యం ఇస్తానంటే, శ్రీరాముడు సరేనన్నాడు. మరుసటి రోజు అడవులకు పొమ్మన్నాడనే మాటను పట్టుకుని అడవులకు ఇష్టపూర్వకంగా సీతాసమేతుడై వెళ్ళాడు. లక్ష్మణుడు కూడా అన్నగారిని అనుసరించాడు.

గురువు దగ్గరైనా… ఎక్కడైనా శ్రీరాముడు వినయంగా నడుచుకున్నాడనే పెద్దలు పలుకుతూ ఉంటారు…. శ్రీరాముడంటి కర్తవ్యతా దృష్టి కలిగినవారు మనకు మార్గదర్శకులు అని పెద్దలు ప్రవచిస్తూ ఉంటారు.

కర్తవ్యము మనిషి మనసుకు బలం అవుతుంది. కర్తవ్యతా దృష్టి వలన కష్టంలోనూ ఇష్టంగా ప్రవర్తించగలిగే స్వభావం కాలంలో ఏర్పడగలదని అంటారు. అందువలన కర్తవ్యతా దృష్టి అలవరచుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు.

కర్తవ్య నిర్వహణలో పరిస్థితుల ప్రతికూల ప్రభావం కూడా అడ్డుకాదని అంటూ ఉంటారు.

ఎందుకు అంటే? కర్తవ్య నిర్వహణలో అవకాశవాదిగా మనసు మారదని పెద్దలు అంటారు.

కర్తవ్య నిర్వహణ బాగుంటే, మనసు అవకాశవాదం వైపు

కర్తవ్య నిర్వహణ బాగుంటే, మనసు అవకాశవాదం వైపు వెళ్ళదు.

పట్టాభిషేకం జరిపిస్తానని, దశరధుడు శ్రీరాముడికి స్వయంగా చెప్పాడు. శ్రీరాముడు సరేనన్నాడు.

అడవులకు వెళ్ళమని దశరధుడు నీకు చెప్పలేక, నన్ను చెప్పమని చెప్పాడంటూ శ్రీరాముడికి కైకేయి చెప్పింది. దశరధుడు ప్రత్యక్షంగా చెప్పకపోయినా… శ్రీరాముడు తండ్రి మాట అవాస్తవం కాకుడదనే ఉద్దేశంతో…. కాలం వలన తనకు కలుగుతున్న కర్తవ్యం ఏమిటో గ్రహించి, అడవులకు ఇష్టపూర్వకంగా బయలుదేరాడు.

తండ్రి వద్దని వారించినా, లక్ష్మణుడు రాజ్యం తీసుకోమని పట్టుబట్టినా, ఎవరెన్ని చెప్పినా అవకాశవాదం వైపు శ్రీరాముడు మనసు మొగ్గుచూపలేదు. కాలం తనకు పినతల్లి రూపంలో కర్తవ్యం బోధిస్తుందని గ్రహించాడు…. కాబట్టి కానలకు వెళ్లడానికి కాలం నిశ్చయించిన పరిస్థితులను ఆహ్వానించాడు…

కనుక కర్తవ్య నిర్వహణ అలవాటు అయితే, మనసులో కర్తవ్యతా దృష్టి పెరుగుతుంది. తత్ఫలితంగా మనసుకు కష్టనష్టాలలో ధడంగా ఉండే స్వభావం పెరిగే అవకాశం ఎక్కువ అని చెబుతారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా?

మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా? నేటి స్మార్ట్ సమాజంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ కారణంగా మాట్లాడే వాయిస్ కాల్ రికార్డింగ్ అయ్యే అవకాశం ఉండవచ్చు.

బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు… నెలవారీ డేటా ప్లాన్స్… స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా వివిధ పనులు సులభంగా చక్కబెట్టగలగడం… వెరసీ స్మార్ట్ ఫోన్ అవసరం అందరికీ ఏర్పడడంతో… అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయింది.

నార్మల్ ఫోన్ అయితే ఆఫోన్ కంపెనీ వారు కాల్ రికార్డింగ్ ఆప్సన్ ఇస్టేనే, మాట్లాడే వాయిస్ కాల్స్ రికార్డ్ చేయగలరు.

కానీ స్మార్ట్ ఫోన్ అయితే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. వాటి సాయంతో ప్రతి వాయిస్ కాల్ రికార్డ్ చేయవచ్చును.

కొన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లలో వాయిస్ కాల్ చేస్తున్నప్పుడు రికార్డింగ్ సింబల్ కనబడే విధంగా సెట్టింగ్స్ చేయబడి ఉంటాయి. అప్పుడు ఆ సింబల్ టచ్ చేస్తే చాలు మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ అవుతుంది.

నార్మల్ ఫోన్లలో కూడా ముందుగా ఆప్సన్లలోకి వెళ్లి ప్రతి వాయిస్ కాల్ రికార్డింగ్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది….

ఆర్ధిక లావాదేవీలు అధికంగా నిర్వహించేవారు ఇటువంటి వాయిస్ రికార్డ్ ఆప్సన్ ఉన్న ఫోన్స్ మాత్రమే వాడుతూ ఉంటారు.

కొందరు పర్సనల్ కాల్స్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది….

అయితే మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా? ఎలా తెలుసుకోవాలి?

మనతో ఫోన్ మాట్లాడే సమయంలో మన ఫోనులో మన వాయిస్ మనకే ఒక రీసౌండ్ లాగా వినబడుతుంటే… ఆ ఫోన్ కాల్ రికార్డ్ చేయబడుతుందని అంటారు.

కావునా అపరిచితులతో ఫోన్ మాట్లాడేటప్పుడు ఆచీతూచి మాట్లాడడం శ్రేయష్కరం అంటారు.

డిసెంబర్ 31 జనవరి 1

డిసెంబర్ 31 జనవరి 1 ఒకటి వస్తుందని ముందురోజే ఒక రాత్రిని ఖర్చు చేయడమనే అలవాటు ఆలవాలం డిసెంబర్ 31 ఎందుకంటే జనవరి 1 వస్తుంనే సంతోషం… అయితే ఆ సంవత్సరంలో ఏంచేయాలో నిర్ణీత ప్రణాళిక వేసుకున్నవారికి… మాత్రం అది మంచి ఫలితాన్నే ఇస్తుందని అంటారు.

నూతన సంవత్సరపు కొత్త ఆలోచనలు… ఆత్మ నిత్యనూతనం… ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉండే మనసుకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చి పరాకు చెబుతూ ఉంటాయి. ఎప్పుడూ కష్టంగా గడిచే కాలంలో సంతోషాలు సరికొత్త ఉత్సాహాన్నిందిస్తాయి.

అటువంటి నూతన సంవత్సరం మనకు రెండు మార్లు వస్తూ ఉంటాయి. అంటే ఒక సంవత్సరంలో రెండు రోజులు నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరపు రోజును తెస్తూ ఉంటాయి. ఒకటి ఉగాది…. రెండు న్యూఇయర్…

డిసెంబర్31 వస్తుందంటే సరికొత్త సంతోషం మనసులో మెదులుతూ ఉంటుంది. ప్రతినెలా నెలాఖరుకు ఖర్చుకు డబ్బు ఉండకపోయినా, ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలాఖరు ఖర్చుకు మాత్రం డబ్బు కూడబెట్టుకుంటూ ఉంటారు. ఆరోజు రాత్రి సెలబ్రేషన్లకు డబ్బును దాచుకునేవారు ఉండవచ్చును. ఆనందంగా స్నేహితులతో గడుపుతూ న్యూఇయర్ విషెస్ తెలియజేస్తూ…. కొత్త సంవత్సరానికి సంతోషంతో స్వాగతం పలకడానికి ప్రతివారు సంతోషంగా సిద్దపడతారు.

డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండి

అటువంటి నూతన సంవత్సరం మనకు డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండి ప్రారంభం అవుతుంది. జనవరి 1స్ట్ కొత్త సంవత్సరంలోకి సంతోషంతో సాగుతారు. అయితే ఈ సందర్భంగా డిసెంబర్31 సెలబ్రేషన్లలో మధుపానం చేయడం జరగడం వలన, అది ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు.

డిసెంబర్ 31 రాత్రి సెలబ్రేషన్లలో మొదటిసారిగా పాల్గొనేవారికి కొత్తగా లేట్ నైట్ స్లీప్ పరిచయం అయ్యే అవకాశం ఇక్కడే జరుగుతుందని అంటారు.

ఇక సెలబ్రేషన్ అంటే స్నేహితులతో కలిసి చేసుకోవడం అయితే డిసెంబర్31 మాత్రం ప్రధానంగా ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా గడుపుతారని… అయితే అలాంటి ఫ్రెండ్స్ లో చెడు అలవాట్లున్నవారు ఉంటే, ఈ డిసెంబర్31 రాత్రి అవి ఆ ఫ్రెండ్ సర్కిల్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అంటారు.

ఆనందంగా ఉండాలి…. కానీ సంతోషంతో కొత్త అలవాట్లకు ఆహ్వానం పలికేముందు వాటి వలన మనకు ఎంతవరకు ఉపయోగం అని ఆలోచన చేయాలని పెద్దలు అభిప్రాయపడతారు.

ఎన్నో డిసెంబర్ 31 రాత్రుళ్ళు జీవితంలో వస్తూ ఉంటే, ఏ డిసెంబర్31 మన మనసులో వస్తున్న మార్పు మన జీవితాన్ని ఎటువంటి మార్పుకు నాంది కాబోతుందో? ప్రశ్న ఉదయిస్తే… డిసెంబర్31 మనపై చూపుతున్న ప్రభావం ఏమిటో తెలియబడుతుందని అంటారు.

ఏదైనా మంచి భవిష్యత్తుకోసం తపనపడే మనిషికి అప్పుడప్పుడు సంతోషంతో సాగే సెలబ్రేషన్స్ ఆనందంగా ఉంటే, మితిమీరిన తీరు మనిషికి హానిని కలిగిస్తాయని అంటారు.

అలవాటుగా వచ్చిన డిసెంబర్ 31 రాత్రి సెలబ్రేషన్, కొత్త అలవాట్లకు ఆలవాలం అయిన రోజుగా కాకుండా… జీవితానికి ఉపయుక్తమైన మంచి ఆలోచనలకు మూలం అయితే… అది ఆనందదాయకం అంటారు.

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు.

ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం కాచచ్చు లేక సమావేశం ఏర్పాటు గురించి కావచ్చును. లేదా ఏదైనా అంశములో ప్రజలలో అవగాహన కొరకు కూడా కరపత్రం ప్రచురిస్తూ ఉంటారు.

పాంప్టేట్ అంటే తెలుగులో కరపత్రం ఏదైనా సందర్భం గురించి తెలుపుతూ ఒక ఆహ్వాన లేఖ మాదిరిగా ఉండవచ్చును. లేకా ఒక అంశమును గురించి సమగ్రంగా తెలియజేసే సమాచార పత్రంగా కూడా ఉండవచ్చును. ఏదైనా సందర్భమును, దాని ఆవశ్యకతను కరపత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

అంటే కరపత్రం అంటే వ్యాసం వ్రాసినట్టుగా ఉండవచ్చును. అయితే అందులో ఆహ్వానిస్తూ ఉండవచ్చును. లేదా ఒక అంశమును గురించి ప్రచారముగా కూడా ఉండవచ్చును.

పాంప్లేట్ కరపత్రం ఎలా రాయాలి?

కరపత్రంలో ముందుగా టైటిల్ ఎంపిక చాలా ముఖ్యం. ఇది కరపత్రంలోని సారాంశమును ప్రతిబింబించేలాగా ఉండాలి.

అంశమునకు ఎంచుకునే టైటిల్ అంటే తెలుగులో శీర్షిక… కరపత్రం యొక్క ఉద్దేశ్యమును తెలియజేసే విధంగా ఉండాలి. అందువలన కరపత్రం చదివేటప్పుడు దానిని మరింత లోతుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ టైటిల్ అంటే శీర్షిక వాడుక పదాలతో కలిసి ఉండడం వలన కరపత్రంపై ఆసక్తి కూడా పెరుగుతుంది.

కరపత్రమునకు ఆయుష్షు ఉంటుంది.

ఇక ప్రతీ కరపత్రానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఒక తేదీ నుండి మరొక తేదీ తర్వాత ఆ కరపత్రము చరిత్రలో సంఘటనకు ఆధారము మాత్రమే. అంటే ఒక షాప్ ఓపెనింగ్ కు ఒక కరపత్రం అంటే ఇంగ్లీషులో పాంప్లేట్ తయారు చేయబడితే, షాప్ ఓపెన్ అయిన కొన్నాళ్ళకు ఆ కరపత్రము గతించిన సంఘటనకు సాక్ష్యం మాత్రమే.

కాబట్టి కరపత్రం ఇంగ్లీషులో పాంప్లేట్ వ్రాసేటప్పుడు టైటిల్ కు ఎగువ కానీ దిగువ కానీ తేదీ వ్రాయడం ప్రధానం…. లేదా తేదీని ఉంటంకిస్తూ… ఒక హెడ్ లైన్ ప్రధానం.

టైటిల్ వ్రాశాకా ఆ టైటిల్ ని క్లుప్తంగా వివరిస్తూ, సందర్భమును తెలియజేయడం ప్రధానం.

క్లుప్త వివరణ తర్వాత టైటిల్ ను బట్టి ప్రధానాంశాలు అప్పటి సందర్భమును బట్టి కొన్ని పేరాలు గా విభజిస్తూ…. సమగ్ర వివరణ ఉండాలి. ప్రధానంగా టైటిల్ ని బట్టి సందర్భము యొక్క ఉద్దేశ్యము, దాని ప్రధాన్యత ఉండాలి.

సామాజికపరమైన అంశము అయితే, కరపత్రములో సంబంధిత శీర్షికను బట్టి విషయము యొక్క ఆవశ్యకత, దాని యొక్క భవిష్యత్తు పరిణామాలు, సమాజంపై సంబంధిత విషయము యొక్క ప్రభావం అన్ని సమగ్రంగా తెలియజేయాలి.

ఆహ్వాన కరపత్రం అయితే ప్రజలను ఆహ్వనిస్తూ ముగించాలి. లేదా సామాజిక అంశము గురించి అవగాహన కరపత్రం అయితే, విషయమును పరిశీలించమని కోరుతూ ముగించాలి.

ప్రధానంగా కరపత్రము యొక్క డిజైన్ ఆకట్టుకునే విధంగా కూడా ఉండాలి.

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి? చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా నిరక్షరాస్యులు ప్రయాణం చేసేటప్పుడు, వారికి ఎదురయ్యే అనుభవాలు బాగుంటాయి.

నిరక్షరాస్యులు ఏమి తెలియని కొత్త ప్రదేశాలలో ప్రయాణం చేయాలంటే, వారు వారి గమ్యస్థానం చేరేవారికి ఇతరులపై ఆధారపడాలి. అయితే సమాజంలో మంచివారు ఉంటారు. మోసం చేసేవారు ఉంటారు. మంచివారు ఎదురైతే వారికి మేలు కలగవచ్చును. కానీ మోసం చేసేవారు ఎదురైతే మాత్రం నష్టపోతారు.

అంటే చదువు రాకపోతే కలిగే కష్టాలలో భాగంగా కొత్త కొత్త ప్రదేశాలలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది.

ఆర్ధిక లావాదేవీల విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండడానికి కూడా మరొకరిపై ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. ఆర్ధిక అంశాలు అంటేనే మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. కనీస చదువు రాకపోవడం వలన ఆర్ధిక అంశాలలో మోసపోయే అవకాశం ఉంటుంది.

చదువు రాకపోతే లోకంలో మనకు తెలియవలసిన విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదువు రాకపోతే ఇప్పుడున్న కాలంలో స్మార్ట్ ఫోన్ కూడా వాడలేని స్థితి ఉంటుంది. ఎంత వాయిస్ బేస్డ్ సర్వీసెస్ ఉన్నా కొన్నింటికి ఓటిపి వెరిఫికేషన్ చాలా ముఖ్యం. కాబట్టి మినిమం 10త్ క్లాస్ చదువులు అందరికీ అత్యవసరమే.

సరదా కోసం సినిమాకెళ్ళి, సినిమా నచ్చకపోతే, సినిమా నిడివి ఉన్నంతసేపు, సినిమాని భరించాల్సి ఉంటుంది. అదే చదువు వచ్చి ఉంటే, నచ్చిన పుస్తకం ఎంపిక చేసుకుని ఉన్నచోటే కాసేపు చదువుకోవచ్చును…. పుస్తకం చదవడానికి కనీస చదువు అవసరం.

లోకంలో చాలా విషయాలు స్వయంగా తెలుసుకునే అవకాశం చదువు రాపోతే ఉండదు. కాబట్టి చదువు రాకపోతే దైనందిన జీవితంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాలి…

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత. అనేక మత గ్రంధాలు ఉన్నా, గ్రంధానికి జయంతి జరుపుకోవడం భగవద్గీతకే చెల్లిందని అంటారు. శ్రీ మద్భగద్గీత గొప్ప స్వయంగా భగవానుడే చెప్పడం చేత, దీనికి ఈ ప్రత్యేకత అంటారు.

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత
గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

ఇక ఈ గీతాజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? అంటే ప్రతిఏడాది మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిధి రోజున గీతాజయంతిగా జరుపుతారు. ఎందుకంటే ఆరోజే భవగతుండి గీతాసారం అర్జునుడికి బోధించినరోజుగా చెబుతారు. మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశీ తిధినే మోక్ష ఏకాదశిగా చెబుతారు.

ఈ సంవత్సరం 2022లో మనకు గీతాజయంతి డిసెంబర్ 14న చెబుతున్నారు. గీతాజయంతి రోజున గీతగురించి ఆలోచన చేయాలనే తలంపు రావడమే ఒక మంచి ఆలోచనగా చెబుతారు. భగవదనుగ్రహం ఉంటే, మంచి తరుణంలో మంచి తలంపులు మనసు తలుస్తుందని అంటారు.

ఎందుకు భగవద్గీతకు ఇంత ప్రాముఖ్యత అంటే, అది చదివి అర్ధం చేసుకున్న మనసుకు పరిపూర్ణమైన జ్ఙానం కలుగుతుందని అంటారు. ఏ విధమైన రంగంలో ఉన్నవారైనా సరే భగవద్గీత చదివితే, ఆయా రంగాలలో తమ తమ సమస్యలకు పరిష్కారం గోచరించే అవకాశాలు ఉంటాయని అంటారు. మహాత్మగాంధీ వంటి మహాత్ములకు భగవద్గీత మార్గదర్శిణి అంటారు.

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

వ్యక్తి జీవన లక్ష్యం ఏమిటో భగవద్గీత సూచిస్తుందని అంటారు. తత్కారణం చేత గీతలోని సారం జీవన పరమార్ధం వైపుకు వ్యక్తి గమనాన్ని మార్చగలదని చెబుతారు. భగవద్గీత వ్యక్తి జీవితాన్ని ఉద్దరించగలిగే జ్ఙానం ఇవ్వగలదు కాబట్టి భగవద్గీత పవిత్రగ్రంధం చెప్పబడిన రోజున గీతాజయంతిగా జరుపుకుంటారు.

ఈ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పుస్తకంపై ఒక పువ్వు పెట్టి నమస్కారం చేయాలి అంటారు. సమయం ఉన్నవారు భవగద్గీతను రోజు పఠించడం వలన మనసుకు మేలు అంటారు.

ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం

ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం ఉంటుందని అంటారు! ఎంతవరకు ఏమిటి అని విశ్లేషిస్తే…

బాగా కష్టపడి చదివినవారు పరీక్ష వ్రాస్తారు. బాగా చదవకుండా కూడా పరీక్ష వ్రాస్తారు. కష్టపడి చదివి పరీక్ష వ్రాసినా, కాఫీ కొట్టి పరీక్ష వ్రాసినా, సరైన సమాధానములకు మార్కులు వస్తాయి. ఆ రీతిలో పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులవుతారు. చదివి, చదవనివారు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటే, మరి కష్టపడి చదవడం ఎందుకు?

కష్టపడి చదివి పరీక్ష వ్రాసిన విద్యార్ధి, తనకు ఫలితం వలన ఆనందంగా మరొక చదువుకు పూనుకుంటాడు… కానీ కాఫీ కొట్టి వ్రాసిన విద్యార్ధి, తనకు లభించిన ఫలితం కేవలం నామమాత్రపు ఫలితంగానే భావిస్తాడు. కేవలం ఒక తరగతి నుండి మరొక తరగతికి మారడానికి ఒకప్పుడు హాజరు నమోదు చేసుకున్నట్టుగానే పరీక్షలో కూడా ప్రశ్నలకు సమాధానములు ఎలాగోలాగా వ్రాసాను అనే భావన మాత్రమే మిగులుతంది. ఈ భావన ఉత్తమ విద్యార్ధి లక్షణంగా పరిగణింపబడదు.

కాబట్టి కష్టపడితే వచ్చే ఫలితం కష్టపడకుండా సాధించేవారితో సమానంగా ఉన్నాసరే తను కష్టపడి సాధించిన ఫలితంగా కష్టపడ్డ వ్యక్తి భావిస్తే, యాధాలాఫంగా ఫలితం పొందానని కష్టపడకుండా ఫలితం పొందిన వ్యక్తి భావన ఉండిపోతుంది. ఈ భావన తృప్తికరంగా ఉండదని అంటారు.

సరే కష్టపడి చదివి బాగా పరీక్షలు వ్రాయగలిగితే, మంచి మార్కుల శాతంతో పరీక్షలు ఉత్తీర్ణులవుతారు. లేదా కష్టపడి పనిచేస్తే తగిన ఫలితం పొందవచ్చును. మరి ఇష్టపడి కష్టపడడం ఏమిటి?

ఇష్టపడి కష్టపడితే ఫలితం?

కొందరు అయిష్టంగానైనా చదివేసి, పరీక్షలు వ్రాసేసి, తర్వాత ఇతర పనులలో నిమగ్నం అవుతారు. చదివిన చదువుకు, చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉంటుంది. అందువలన తను చదివిన చదువు చేస్తున్న వృత్తిలో ఉన్నత స్థితికి మద్దతుగా నిలబడదు. ఆ కారణం చేత, తను చేస్తున్న పనిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వృత్తి ఉండే అవకాశం ఉంటుంది.

అదే ఇష్టపడి కష్టపడి చదివితే, ఆ చదువులో మనసు పరిశీలనాత్మక దృష్టితో ఉంటుంది. ఇంకా మనసుకు చదువు అనే అంశము తేలికగానే ఉంటుంది కానీ చదువు మనసుకు భారంగా ఉండదు. తత్కారణం తాను ప్రత్యేకించి చదువుతున్న అంశములో తగినంత నైపుణ్యమును సముపార్జించగలడు. తత్కారణంగా చదువుకు తగిన వృత్తిలో నిమగ్నం కాగలడు. చేస్తున్న వృత్తిలో ఉన్నత స్థితికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇష్టపడి కష్టపడి చదవమని పెద్దలంటారు.

ఇంకా చెప్పాలంటే ఇష్టమున్న అంశముపై మనసు ప్రత్యేక శ్రద్దను పెట్టగలదు. అదెలాగ అంటే?

ఒకరికి సినిమా అంటే ఇష్టం. సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు అంటే ఇష్టమున్నతని మనసు రాబోయే సినిమాలు ఏమేమిటి? అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభిస్తారు. రాబోయే సినిమాలు ఏమిటో తెలిశాక… అందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా సినిమా, సినిమాకు సంబంధించిన వార్తలు, విశేషాలు చదువుతూ సినిమా పరిజ్ఙానం పెంపొందించుకోవడం మనసు తపించి, శ్రద్దను పెంచుకుంటుంది…. అంటే మనసు ఇష్టపడితే, కష్టం కూడా ఇష్టంగానే భావిస్తుంది… కాబట్టి మన మనసుకు మంచి విషయములను ఇష్టంగా మార్చే ప్రయత్నం చేయాలని పెద్దలు చెబుతారు.

ఆటలంటే ఇష్టమున్న వారు కూడా ఆటలపై ఆసక్తితో ఆటల గురించి అనేక విధములుగా విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవడంలో మనసు తపిస్తుంది.

పరితపించే మనసుకు మంచి లక్ష్యమును అందిస్తే…

తపించే మనసు శ్రద్దను పెంచుకుంటూ విషయ పరిజ్ఙానమును పెంపొందించుకోగలదు… కావునా తపన ఉన్నవారికి మంచి విషయాలపై ఆసక్తి కలిగేలాగా చూడాలని పెద్దలు అంటారు. అలా పరితపించే మనసుకు మంచి లక్ష్యమును అందించడం చేత మనసుకు కష్టం కూడా ఇష్టంగా ఏర్పడి… ఇష్టపడి కష్టపడి శ్రమకు తగ్గ ఫలితం పొందేవరకు తపించగలదని అంటారు.

పిల్లలకు కష్టపడి వంటచేసే అమ్మకు తన కష్టమంతా ఇష్టంగానే అనిపిస్తుంది. ఇంకా పిల్లల భవిష్యత్తు కొరకు ఇష్టపడి కష్టపడే తండ్రికి కూడా కష్టం ఇష్టంగానే అనిపిస్తుంది. ఒకరి కష్టంపై ఆధారపడి జీవించేవారు, తమ జీవనస్థితిలో తమ కర్తవ్యం ఖచ్చితంగా నిర్వహించాలనేది ప్రకృతి నియమం అయితే, తల్లిదండ్రుల కష్టంపై చదువుకునే విద్యార్ధుల కర్తవ్యం ఇష్టపడి కష్టపడి చదవడమే ప్రధానమైన విషయంగా చెబుతారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు. ఈ వ్యాక్యం ఆధారంగా ఒక వ్యాసం వ్రాయాలంటే, మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనకో అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులలో, ఆ పరిస్థితులను ప్రభావితం చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలిసి ఉండాలి. ఇంకా ఎవరెవరు ఎటువంటి ప్రభావం చూపుతున్నారో తెలియబడి ఉండాలి. ఇలా మన చుట్టూ ఉన్న స్థితి మనకు అవగాహన ఉంటే, మన చుట్టూ మనకో మార్గదర్శకుడు కనబడతారు.

ఒక వ్యక్తి చుట్టూ ఒక అనేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనేకమంది వ్యక్తుల ప్రభావం ఒక వ్యక్తిపై పడుతూ ఉంటుంది. చాలామంది మాటలు ఒక వ్యక్తి మనసులో మెదులుతూ ఉంటాయి.

సాదారణ జనులలో మార్గదర్శకుడు

ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ప్రాంతంలోనైనా ఒక ప్రదేశంలోనైనా సాదారణ జనులు ఉంటారు. చెడు ప్రవర్తన కలిగినవారుంటారు. ఇంకా సత్ప్రవర్తన కలిగినవారుంటారు. అలాగే విద్యార్ధులు ఉంటారు. విద్యార్ధులు అంటే అభ్యసిస్తూ, గమనిస్తూ, పరిశీలనలో అనేక విషయాలలో విజ్ఙాననమును సముపార్జించుకుంటారు. అలా గమనించే విద్యార్ధుల దృష్టిలో ఎటువంటివారు ఎక్కువగా మెదులుతూ ఉంటారో, అటువంటి ఆలోచనలే విద్యార్ధుల మదిలో మెదులుతూ ఉంటారు.

సాదారణ జనులకు ఉండే లక్ష్యాలు కుటుంబ లక్ష్యాలే ఉంటాయి. తమ తమ కుటుంబం బాగుకోసం పాటుపడేవారు ఉంటారు.

ఇంకా సమాజంలో మంచి స్థితిని పొందినవారుంటారు. వారు ధనం వలన కానీ అధికారం వలన కానీ మంచి గుర్తింపు పొంది ఉంటారు. వారిని చూడడం వలన కలిగే ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఒక ధనవంతుడిని చూస్తే, ధనం ఉండడం వలన సమాజంలో ఎటువంటి స్థితి? ఉంటుందో తెలియబడుతుంది. అలాగే ఒక అధికారిని గమనిస్తే, ప్రభుత్వ అధికారం ఉంటే, సమాజంలో ఎటువంటి గుర్తింపు ఉంటుందో తెలియబడుతుంది. ఇలా సమాజంలో వ్యక్తికి ఏదో స్థితిని పొంది ఉంటారు.

దేశంలో ఒక కాలంలో ఒకరే ప్రధాని ఉంటారు. అలాగే ఒక రాష్ట్రములో ఒక కాలంలో ముఖ్యమంత్రిగా ఒకరే ఉంటారు. ఇలా పెద్ద పెద్ద స్థాయి కలిగినవారిని మార్గదర్శకంగా పెట్టుకుంటే అదే అసాధ్యంగానే అనిపిస్తుంది. అయితే క్రమశిక్షణతో తోటివారిలో ముందు మంచి గుర్తింపు పొందడం వలన జీవితంలో ఉత్తమ స్థానానికి వెళ్ళవచ్చును.

సాధ్యమయ్యే లక్ష్యాలలో మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు.

క్రమశిక్షణ కొరకు అయితే మనతో ఉండే సహవాసంలో కనబడవచ్చును.

ఆచారంలో మన ఇంటి పెద్దలలో కనబడవచ్చును.

చదువులో మన తోటివారిలో కనబడవచ్చును.

వినయం అంటే మన చుట్టూ మంచివానిగా గుర్తింపు పొందినవారిలో చూడవచ్చును.

ఇలా రకరకాల విషయాలలో మన చుట్టూ మనకు మార్గదర్శకుడు కనబడతారు.

మన చుట్టూనే ఉండేవారిలోనే మనకొక మార్గదర్శకుడుని ఎంచుకుంటే

ముందుగా నరేంద్రమోదీగారినే మనం ఒక మార్గదర్శకులుగా పెట్టుకుంటే, ఆయన అనుభవాలు తెలుసుకోవాలనే తాపత్రయం మొదలు అవుతుంది. అప్పుడు నరేంద్రమోదీగారినే అడిగి తెలుసుకోవాలంటే, ఆయనను కలవడం అందరికీ సాద్యం కాదు.

అదే మన చుట్టూనే ఉండేవారిలో మంచి గుణములు కలిగి ఉన్నారనే కీర్తి కలిగినవారినే మార్గదర్శకంగా భావిస్తే, మనకు అందుబాటులోనే ఉంటారు…. కాబట్టి పరిచయస్తుల ద్వారా మనం మనము ఎంచుకున్న మార్గదర్శకులను కలిసి మాట్లాడవచ్చును. అనేక విషయాలు తెలుసుకోవచ్చును. ఇంకా పెద్ద విషయం ఏమిటంటే, ఇద్దరూ ఒకే ప్రాంతం వారు కావడం వలన సామాజిక పరమైన అనుభవసారం కూడా తెలియబడుతుంది.

అందుకే తాత్కాలికంగా మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉండాలని అంటారు.

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు. సమయం అంటే కాలం. కదిలే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే మనకొక నానుడి కూడా ఉంది. అదేటంటే కాలం కాంచన తుల్యం అని అంటారు. అంటే క్షణ కాలం అయినా బంగారంతో సమానమని అంటారు.

సంపాదించేవారు ఎప్పుడూ సమయానికి ప్రాధన్యతనిస్తారు. వారు చేసే దినచర్య ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయపాలనను పాటిస్తారు. అందుకే వారు కాలాన్ని ధనముగా మార్చగలరు.

ఏది చేయాలన్నా మనకున్న కాలంలోనే సాధ్యం. మనం లేని కాలంలో ఏంజరుగుతుందో మనకు తెలియదు. మనము ఉన్న కాలంలో మనము కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటామో…. ఆ తర్వాత కాలంలో కూడా మన జ్ఙాపకాలు మిగిలి ఉంటాయని అంటారు.

ప్రధమశ్రేణికి కోసం ప్రయత్నించే విద్యార్ధి ప్రతీ క్షణమును విద్యలోని విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు.

ఏదైనా ఆటలో ఉన్నత స్థితిని కోరుకునేవారు, ప్రతిక్షణం సాధనకోసం వినియోగిస్తూ ఉంటారు.

ఒక శాస్త్ర పరిశోధనలో నిమగ్నమైనవారు, ప్రతిక్షణం కూడా పరిశోధనాత్మ దృష్టితోనే ఉంటారు.

వ్యవసాయదారుడు నిత్య పంటపొలాల పర్యవేక్షణకు ప్రధాన్యతనిస్తారు….

ఇలా సమయాన్ని తగువిధంగా ఉపయోగించుకున్నవారు, తమ జీవితంలో తాము అనుకున్న ప్రతిఫలం పొందుతారు. అందువలననే సమయాన్ని వృధా చేసుకోకూడదని అంటారు.

రైతు తనకున్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేయడం వలన పంటను బాగా పండిస్తాడు. అలా ఎక్కువమంది రైతులు ఈ విధంగా తమ సమయాన్ని సద్వినియోగం చేయడ వలన తగిన ఆహార పదార్దాలు సమాజంలో సమృద్దిగా లభిస్తాయి.

ఒక శాస్త్రజ్ఙుడు తనకున్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేయడం ద్వారా ఒక కొత్త విషయాన్ని సమాజానికి పరిచయం చేయగలడు.

అలాగే ఒక ఆటగాడు తనకున్న సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకోవడం వలన తన ఆటలో తాను ప్రపంచస్థాయి గుర్తింపు పొంది, తను కీర్తి గడించగలడు. అలాగే తన కుటుంబ సభ్యులకు కూడా గౌరవం అందించగలడు.

ఈ విధంగా కొందరు తమ తమ సమయాలను సరిగ్గా ఉపయోగించుకోవడం వలన వారు కీర్తిని గడించడమే కాకుండా తమతో కలిసి ఉండేవారికి కూడా గౌరవమును, గుర్తింపును తీసుకురాగలరు. కావునా కాలం కాంచన తుల్యం అంటారు. అందుకే సమయం వృధా చేసుకోకూడదు అంటారు.

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి , జనుల యందు ఎవరిలో అయితే ఎల్లప్పుడూ మంచి లక్షణాలను కలిగి ఉంటారో, వారిని సజ్జనులుగా లోకం కీర్తిస్తూ ఉంటుంది. తమకు ఎటువంటి పరిస్థితి ఉన్నాసరే తమయందు ఉన్న గొప్పగుణముల లక్షణాలను కోల్పోనివారిని సజ్జనులుగా లోకం గుర్తు పెట్టుకుంటుంది.

సహజంగానే వీరికి సహనం ఉంటుంది. ఎటువంటి స్థితిలోనూ తమ సహనాన్ని కోల్పోరు.

సజ్జనులు లక్షణాలు మంచి గుణములుగా మరొకరికి మార్గదర్శకంగా ఉంటాయిని అంటారు.

సాహసంగా వ్యవహరించగలరు.

క్లిష్ట సమయాలలో సమయస్పూర్తితో వ్యవహరించడంలో వీరు నైపుణ్యమును కలిగి ఉంటారు.

సమస్యను సానుకూల ధృక్పధంతో పరిష్కరించడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తూ ఉంటారు.

పెద్దలంటే గౌరవం కలిగి ఉంటారు. పెద్దలతో వ్యవహరించేటప్పడు భక్తిశ్రద్దలతో ప్రవర్తిస్తూ ఉంటారు.

సహచరులతో సఖ్యతతో మెసులుతారు.

అందరితో స్నేహపూర్వక భావనతో ఉంటారు. ముందుగానే ఎదుటివ్యక్తిని పలకరించడంలో ముందుంటారు.

సజ్జనులు ఎప్పుడూ మంచి స్నేహాన్ని వదిలిపెట్టరు.

మంచి లక్షణాలగల వారిని చూసి, వారిని తమ దృష్టిలో మార్గదర్శకంగా నిలుపుకుంటారు.

సమయపాలన విషయంలో సజ్జనులు చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు.

ఇతరుల విషయంలోనూ క్రమశిక్షణతో ఉండేవారిని ఇష్టపడతారు.

తల్లిదండ్రులను గౌరవిస్తారు.

చదువులలో సజ్జనులు ప్రధమస్థానంలో ఉండడానికి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటారు.

తమ చుట్టూ ఉన్నవారి ప్రశంసలు పొందుతూ ఉంటారు.

వీరిలో ముఖ్యంగా స్త్రీలంటే గౌరవభావం బలంగా ఉంటుంది. స్త్రీయందు మాతృభావనను కలిగి ఉంటారు.

నిందజేయడం సజ్జనుల లక్షణం కాదని అంటారు.

క్షమాగుణం మెండుగా ఉంటుంది.

ఇలా పలు మంచి గుణములు కలిగి, ఆ గుణముల వలన వీరి వ్యక్తిత్వం నలుగురిలో ప్రకాశిస్తూ ఉంటుంది. వీరితో బాటు వీరి కుటుంబ సభ్యులకు కూడా వీరి వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది.

చూసి నేర్చుకునే విద్యైనా, చదివి తెలుసుకునే విద్య అయినా సరే గురువు ద్వారా నేర్చుకునే విద్యకు రాణింపు ఉంటుంది. మంచి గుర్తింపుతో బాటు మనోవిద్య కూడా అలవరుతుంది. ప్రధానంగా గురువు వలననే వ్యక్తి మనసు సంస్కరింపబడుతుందని అంటారు.

ఇంకా చెప్పాలంటే, గురువులేని విద్య గుడ్డి విద్య అని కూడా అంటారు. అంటే జీవితంలో ఏదైనా విద్య నేర్చుకోవడానికి గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో తెలియబడుతుంది.

ప్రకృతిలో సాధన చేస్తూ ప్రకృతి శక్తులను వినియోగించుకోవచ్చును… కానీ గురువు లేకుండా చేసే సాధన వలన వ్యక్తి స్వీయనియంత్రణ తక్కువగా ఉంటుంది… స్వేచ్చ ఎక్కువై అది వ్యక్తి పతనానికి నాంది కాగలదు. అదే గురువు ద్వారా విద్యను అభ్యసిస్తే, ప్రకృతి శక్తిని ఎంతమేరకు ఏవిధంగా వినియోగించుకోవాలో ఒక అవగాహన కలిగి ఉండే అవకాశాలు ఎక్కువ.

వ్యక్తి పట్టుదలకు, సాధించాలనే తపనకు గురువు మార్గదర్శకం తోడైతే, ఆ వ్యక్తి ఉత్తమ స్థాయికి చేరగలడని అంటారు. గురువు విషయంలో పరమాత్ముడైన భగవానుడు కూడా ఒక విద్యార్ధిగానే ఉన్నాడు… కానీ స్వీయ శక్తి ప్రదర్శనకు పూనుకోలేదు.

శ్రీమహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించాకా, కుల గురువు దగ్గర శాస్త్రపరమైన విషయాలు, గురువు విశ్వామిత్రుని దగ్గర ధనుర్విద్యా రహస్యాలు గ్రహించాడు. అంతేకాదు కేవలం తండ్రి లేక గురువు ఆదేశాల ప్రకారమే శక్తిని ప్రయోగించాడు కానీ తన ప్రతాపాన్ని చూపించడానికి, ప్రగల్భాల కోసం విద్యను ప్రదర్శించలేదు. గురువులు వశిష్ఠుడు, విశ్వామిత్రుల ప్రభావం శ్రీరామచంద్రుని జీవితంలో ఎంతగానో ఉందని పండితులు చెబుతారు.

బాల్యంలోనే ఆశ్చర్యకరమైన లీలలను ప్రదర్శించిన జగద్గురు శ్రీకృష్ణపరమాత్మ సైతం గురువు సాందీపుని వద్ద విద్యను అభ్యసించాడు. కాలాన్ని బట్టి శక్తిని ప్రయోగించాడు. ఇంకా కురుక్షేత్ర సమయంలో యుద్ధం చేయించాడు కానీ చేయలేదు….

ఎంతటివారైనా కాలంలో మనసును నియంత్రించడానికి స్వశక్తి చాలనప్పుడు గురువుగారి మాటలే వేదవాక్కులుగా ఉంటాయని అంటారు. గురువుగారి మాటలు తలచుకోవడంతోనే తనను నియంత్రించుకునే తత్వం మనసులో పుడుతుందని పెద్దల అభిప్రాయం.

వ్యక్తి జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది.

కుటుంబపెద్ద తండ్రి గురువుగా ఉండడం చేతనే, కుటుంబంలో పిల్లలు క్రమశిక్షణకు అలవాటు పడతారు. అక్కడి నుండి విద్యాలయం చేరిన విద్యార్ధులు సహవాసులతో కూడా క్రమశిక్షణతో మెసులుతున్నారంటే, అందుకు కారణం విద్యాలయంలో గురువుల శిక్షణే కారణమంటారు.

ఇంకా కార్యలయములో కూడా ఒక ఉద్యోగికి అతనికంటే సీనియరు ఒక గురువుగా ఉంటే, ఆ ఉద్యోగి సీనియర్ మార్గదర్శకాలను అనసరిస్తూ, కార్యలయములో కూడా తన ఉత్తమ పనితీరు ప్రదర్శించగలడు. ఇలా ఎక్కడ చూసిన వ్యక్తి జీవితంలో గురువు ప్రాముఖ్యత చాలా ఉంటుందని చెప్పవచ్చును.

ఒకవ్యక్తికి బాల్యంలో తల్లిదండ్రులు, విద్యాలయంలో ఉపాధ్యాయులు, సమాజంలో తనకంటే వయస్సులో పెద్దవారు, ఆఫీసులో అనుభవంగలవారు ఎందరో గురుత్వ స్వభావంతో వ్యవహరిస్తూ ఉండడం వలననే వ్యక్తి తన జీవన గమ్యం చేరడంలో కృతకృత్యుడు అవుతాడు అని అంటారు.

అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షత్తు పరబ్రహ్మ అంటూ మనకు శ్లోకము కూడా ప్రసిద్ది.

గురువు మనసులో విజ్ఙాన మార్గమును సృష్టించగలడు కాబట్టి బ్రహ్మ… గురువు మనసును నియంత్రించే విధంగా మాట్లాడగలడు కాబట్టి విష్ణువు… గురువు సంపూర్ణ జ్ఙానము ఇవ్వగలడు కాబట్టి శివుడు…. గురువు మూడు గుణాలకు అతీతమైన శక్తిని దర్శింపజేయగలడు కాబట్టి పరబ్రహ్మ… అంటారు.

గురువు కారణంగా జీవనమార్గం గాడిలో పడగలదు.

సద్గురు కారణంగా త్రిగుణాతీతమైన ఆత్మస్థితిని పొందవచ్చును. గురువు కారణంగా ఏదైనా సాధించవచ్చునని పురాణాలు ఘోషిస్తున్నాయి… కాబట్టి గురువులేని జీవితం ఊహాతీతం…. గురువు గల జీవితం క్రమశిక్షణతో కూడిన జీవితమై మరొక జీవితానికి మార్గదర్శకం కాగలదు. వ్యక్తి జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలానే ఉంటుంది.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది.

ముఖ్యంగా తాత-ముత్తాతలు, అమ్మమ్మ, అమ్మకు అమ్మమ్మలు మాటలు పిల్లలలో మంచ అవగాహనను కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు చూపుకునే ప్రేమాభిమానాలు ఎదుగుతున్న పిల్లలో ఒంటరితనం అనే భావన లేకుండా, పాజిటివ్ దృక్పధం పెరిగే అవకాశాలు ఎక్కువ. ఒకప్పుడు గొప్పవారంతా పెద్ద కుటుంబం నుండి వచ్చినవారే ఎక్కువ అంటారు. అంటే ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలే, ఒకనాడు గొప్పవారు కీర్తింపబడ్డారని కూడా చెబుతారు.

అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన పూర్వికులలో ఉంటే, నేటికి మాత్రం కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. ఎవరికివారే యమునాతీరు అన్నట్టుగా నేటి కుటుంబ వ్యవస్థ మారడం వలన పిల్లలలో పెద్దలంటే గౌరవభావం మనసులో ఉన్నా ప్రవర్తనలో కనబడకపోవడం విచిత్రమనిపిస్తుందనేవారు లేకపోలేదు. కారణం చూస్తున్న సినిమాలు, సీరియల్స్ లో పిల్లలే పెద్దలను హేళన చేసే సంప్రదాయం పిల్లలకు కనబడడం ఉంటుంది. ఏదైతేనేమి… పిల్లలకు బుద్దులు చెప్పే ముత్తాతలు కాదు కదా తాతలు కూడా కరవవుతున్నారని వాపోయేవారు కూడా ఉండవచ్చును.

కుటుంబంలో పిల్లల బంగారు భవితకు

ఎవరైనా ఆలోచన చేసేది పిల్లల భవిష్యత్తు బాగుండాలనే… కుటుంబంలో పిల్లల బంగారు భవితకు బాటలు వేయడానికి తల్లిదండ్రులకు శ్రమిస్తారు. అయితే తాము, తమ సుఖం అంటూ ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయినవారు. తమ పిల్లల బాద్యత తామే పరివేక్షించుకోవాలి. ఆ ప్రయత్నంలో కొందరు తల్లిదండ్రులు ఉండవచ్చును. అయితే కొందరు సంపాదనలో పడి, పిల్లల ఆలనా పాలనా కూడా చూసుకోలేని బిజిలో తల్లిదండ్రులు చేరుతుంటే, ఇక కుటంబ వ్యవస్థలో యాంత్రికమైన పరికరాల వాడుక పెరడమే అవుతుంది.

కారణాంతరల వలన ఉమ్మడి కుటుంబం చిన్నకుటుంబంగా మారినా, మరలా కుటుంబ విలువలు, పెద్దలు సలహాలు అవసరం అని నేటి తరం తల్లిదండ్రులు గుర్తించడం మరలా మొదలైంది.

అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా ఒకరంటే ఒకరికి జవాబుదారీతనం ఉంటుంది. దాని వలన తప్పు చేసే ఆస్కారం ఉన్నా, తప్పు చేయడానికి మనస్సంగీకరించదు. అదే ఒక్కరిగా ఉంటే తప్పుకు అవకాశం తీసుకునే మనసుకు రహదారి ఏర్పడినట్టేనని అంటారు.

ప్రపంచంలో మన కుటుంబ వ్యవస్థకు ఉన్న గుర్తింపు మరెక్కడా ఉండదు. సంప్రదాయక కుటుంబ వ్యవస్థ, తప్పులు చేయడానికి ఒప్పుకోని సదాచారం కలిగి ఉండడమే ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు