Monthly Archives: July 2021

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ వ్రాయమని అంటే ఎలా వ్రాయాలి.

ముందుగా లేఖ ఎవరు ఎవరికి వ్రాయాలి?

విద్యార్ధి అయితే, స్కూల్ ప్రిన్సిపల్ కు ఉద్యోగి అయితే తన పై అధికారికి సెలవు ధరఖాస్తు పెట్టుకుంటారు.

ఇప్పుడు ఒక విధ్యార్ధి స్కూల్ హెడ్ మాస్టర్ కు లేఖ వ్రాయాలంటే, ఎలా వ్రాయాలి?

మొదటగా సెలవు ధరఖాస్తు అంటే ఆంగ్లంలో అయితే లీవ్ లెటర్ అంటూ హెడ్డింగ్ పేపర్ పైభాగంలో వ్రాయాలి.

ఆ తరువాత స్కూల్ ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ ను సంభోదిస్తు, స్కూల్ పేరు, స్కూల్ అడ్రసు రాయాలి. అభ్యర్ధనగా తిరిగి సంభోదిస్తూ, సెలవు ధరఖాస్తు వ్రాయడం మొదలు పెట్టాలి.

సాధారణంగా తెలుగులో అయితే అయ్యా, అని సంభోదిస్తారు. ఆంగ్లంలో అయితే సర్ అని సంభోదిస్తారు.

సెలవు ధరఖాస్తు వ్రాస్తున్న విధ్యార్ధి తన పేరు, తన రోల్ నెంబర్, తన తరగతి తెలియజేస్తూ, ఆపై తనకు సెలవు కారణం వ్రాయాలి. కారణం వ్రాశాక అందుకు ప్రాతిపదికను కూడా తెలియ పర్చాలి.

విద్యార్ధికి అనారోగ్యం అయితే, అది ఎప్పటి నుండో తెలియజేస్తూ, వైధ్యుని సలహా మేరకు లేదా తండ్రి సలహా మేరకు స్కూల్ సెలవు అడుగుతున్నట్టుగా వ్రాయాలి.

సెలవు కోసం వివరం తెలియజేశాక, ఏ తేదీ నుండి ఏ తేదీవరకు సెలవు అవసరమో తెలియాయజేయాలి. తరువాత ధన్యవాదలు తెలుపుతూ లెటర్ పూర్తి చేయాలి.

చివరగా ఇట్లు, భవదీయుడు అంటూ మీ పేరు వ్రాసి, సంతకం చేయాలి.

ఈ క్రింది సెలవు ధరఖాస్తు గమనించగలరు.

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ
అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే

నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే నిర్మల మనసుతో భగవంతుడిని చేరడానికి చేసే ప్రయత్నం అంటారు.

అసలు నిర్మల అంటే మాలిన్యం లేనిది అయితే నిర్మల మనసు అంటే మనసులో మలినం లేకుండా ఉండడం.

మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, అందులో ఉన్న మలినం, అందులో ఉండే మంచి గుణాలు తెలియబడతాయని అంటారు.

అంతేకానీ ప్రశాంతత లేని మనసులో తన గురించిన ఆలోచన కన్నా ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.

స్వీయ పరిశీలన వలన మనసు శాంతితో ఉండవచ్చు అంతే, స్వీయ పరిశీలనకు కూడా ఆలంబన భక్తి అంటారు.

ఎందుకంటే ముందు మనసు లోకంలో ఉండే విషయాల గురించి ఆలోచన చేయడం భాగా అలవాటు అయ్యి, అటువంటి ఆలోచనలతో స్వీయ పరిశీలనకు ఆస్కారం లేకుండా చేసుకుంటుంది.

బహుశా అందుకేనోమో భగవానుడు వివిధ రూపాలలో అవతరించి లోకరీతిలో భక్తుడి మనసులోకి వెళ్ళేవిధంగా కనబడతాడేమో?

మనసు ముందుగా తనపై తన పరిశీలన చేయడానికి అంగీకరించదు… కాబట్టి ఒక జడ్జి మనసులోకి రావాలి. ఆత్మ స్వరూపుడైన ఈశ్వరుని మనసులో జడ్జిగా నియమించుకుంటే, స్వీయ పరిశీలనకు మనసుకు మార్గం లభిస్తుందని అంటారు.

భగవంతుడు ముందు మనసులోకి వచ్చాడనే ఎరుకను మనసు కలిగి ఉంటే, తన లోపల ఒకరికి జవాబుదారీ అనే ఆలోచన మనసు చేయగలదు.

కానీ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు… ఇప్పుడు అది కాదు ముఖ్యం అనుకుంటే, భగవంతుడు లోపలే ఉన్నాడనే ఎరుక మనసు కలిగి ఉండదు.

ఒకసారి భగవంతుడు మనసులోనే ఉన్నాడు. మనసుకు ఆధారమైన అత్మే భగవానుడు… అని గ్రహిస్తే, మనసు తాను చేస్తున్న కర్మలలో విచక్షణ కోల్పోదు అని అంటారు.

చేస్తున్న కర్మలకు ఒకడు అధికారి లోపాలే ఉన్నాడనే భావన, మనసుని తప్పు చేయనివ్వదని అంటారు.

అలా జడ్జిగా మనసులో ఉన్న భగవానుడు, మనసుని శుద్ది చేయడం మొదలైతే చిత్తశుద్ది ఏర్పడి, మనసు నిర్మలం కావడానికి కారణం కాగలదని అంటారు.

నిర్మల భక్తి అంతే ఏమిటో అని ఆలోచన చేస్తూ, కాలం వృధా చేయడం కంటే, ఆత్మస్వరూపుడైన భగవానుడిని ఇష్టదేవత రూపంలో నిత్యస్మరణ శ్రేయష్కారం అంటారు.

మనసు శాంతిగా ఆలోచన చేయడానికి అలవాటుపడితే, ప్రశాంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటారు.

ప్రశాంతమైన ఆలోచనలు కలిగిన మనసు నిర్మల మనస్తత్వంతో మనగలగుతుంది. ప్రశాంతమైన ఆలోచన పరమాత్మ స్వరూపం గురించిన ఆలోచన మనసుతోనే ఉంటుందని అంటారు..

ఏది ఏమిటి అను తెలుసుకునే ఆలోచన సందేహాలకు తావు ఇస్తూ ఉంటే, ఒక్కడు ఉన్నాడు. వాడు అధికారి అనే ఆలోచన మనసును సరి అయిన దారిలో పెట్టవచ్చని అంటారు.

తెలుగు భక్తి

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం. స్మార్ట్ ఫోన్ వాడుక పెరిగాక డిజిటల్ చెల్లింపులు అధికమయ్యాయి.

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుక విధానం చాల సులభంగా మారింది. కేవల అక్షర జ్ఞానం ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ వాడుక చాల తేలిక. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ భాష ప్రాంతీయ భాషలలోకి మార్చుకోవచ్చు.

సాధారణంగా అయితే కరెంట్ బిల్లులు వంటి నెలవారీ చెల్లింపులు క్యూలో నిలబడి కట్టుకునేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వలన ఆన్ లైన్ చెల్లింపులు సులభతరం అయ్యాయి. పేమెంట్ వాలేట్స్ అందుకు బాగా సహకరిస్తున్నాయి. ఎవరికైనా మని పంపాలంటే మనియార్డర్ లేదా బ్యాంకు నుండి లావాదేవీలు నిర్వహించవలసి ఉండేది.

అయితే స్మార్ట్ ఫోన్, టాబ్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడుక పెరగడంతో బ్యాంకర్లు ఆన్ లైన్ బ్యాంకింగ్ బాగా ప్రోత్సహించడంతో లావాదేవిలు కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా జరుతున్నాయి.

పేమెంట్ వాల్లెట్లు వచ్చాక చెల్లింపులు కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా జరగడం ఎక్కువ అయ్యింది. పేటీయం, ఫోన్ పే, జిపే వంటి పేమెంట్ వాల్లెట్లు ప్రజలు బాగా వాడుతున్నారు.

ఇలా స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులు పెరిగి, నగదు లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి.

నగదు లావాదేవీలలో చొర భయం ఉంటుంది.

ఇంకా నగదు లావాదేవిలలో రశీదు కీలకం. నగదు రశీదు వలన నగదు ముట్టినట్టు లేదా ముట్టనట్టుగా పరిగణిస్తారు.

కానీ డిజిటల్ చెల్లింపులు నేరుగా ఖాతాదారుని ఖాతాకు జమ అవ్వడంతో దానికి డిజిటల్ ప్రూఫ్ ఉంటుంది. బౌతికంగా రశీదుతో పని ఉండదు.

అయితే డిజిటల్ చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ఉన్నవారికే డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.

బ్యాంకు ఖాతా లేనివారికి మాత్రం డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ లేద టాబ్ వంటి పరికరాలతో పేమెంట్ చెల్లింపులు చేయలేరు.

ఏదైనా ఒక జాతీయ బ్యాంక్ ఖాతాతో, సులభంగా యూపిఐ ద్వారా పేమెంట్ వాలెట్స్ లో నమోదు చేసుకుంటూ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి.

ఇక ముందు మన దేశంలో కూడా ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ వచ్చే అవకాశం ఉంది.

కనీస అక్షర జ్నానమ్ కలిగినవారు, తమ ఆర్ధిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ మనదేశంలో అమలు అయితే ఎక్కువమంది డిజిటల్ కరెన్సీ ఉపయోగించే అవకాశం ఉంటుంది.

అప్పుడు నగదు చెల్లింపులు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం వలన పెరుగుతూ నగదు లావాదేవీలను కట్టడి చేశాయని భావిస్తారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం తెలుగులో….

నాయకుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు. ప్రజా సమస్య నుండి, దాని సాధించడానికి ప్రజల మధ్య నుండే నాయకత్వం ఉదయిస్తుందని అంటారు.

నాయకత్వం వహించేవారు పెత్తనం చేయాలనే తపన కాదు… నాయకత్వం అంటే సమస్యను పరిష్కరించుకోవడంలో తను ముందుండి అందరికీ మార్గదర్శకంగా నిలబడడం అంటారు.

కొందరు నాయకత్వం లక్షణాలు ఉన్నవారిలో అజమాయిషీ అనే ఆలోచన ఉండదు… వారిలో లక్ష్యాన్ని సాధించాలనే ఉండే పట్టుదల, లక్ష్యసాధనకు వారు చేసే కృషివలన అందరూ ఆ నాయకత్వమును అంగీకరిస్తారని అంటారు.

ఏదైనా నాయకత్వం అంటే ఇలా నాయకత్వ లక్షణాలు…

ఒక సమూహానికి లేక ఒక ప్రాంతవాసులకు ఒక వర్గమువారికి సంబంధించిన ఒక ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి చిన్న చిన్న లక్ష్యాలు నిర్ధేశిస్తూ, వాటి అమలుకు సహచరులు సలహాలు, తీసుకుంటూ అనుచరులను కలుపుకుంటూ ఒక వ్యక్తి అందరి మద్దతుతో ముందుకెళ్ళే ఒకా సాంఘిక ప్రక్రియ ప్రభావంతంగా సాగుతుంటే నాయకత్వంగా చెబుతారు.

పెద్ద లక్ష్యాన్ని చేధించడానికి అడ్డు వచ్చే సమస్యలపై పోరాడుతూ, పెద్ద లక్ష్యంవైపు నుండి అందరి దృష్టి మరలిపోకుండా చూసుకోవడంలో నాయకత్వ ప్రభావం కనబడుతుంది. ఇక ఆ లక్ష్యం చేరేవరకు సరైన ప్రణాళిక రచనా చేస్తూ, ఆ ప్రణాళికను అమలుచేయడంలో నిశ్చయాత్మక బుడ్డితో వ్యవహరించేవారు లక్ష్యంవైపు అనుచరలను నడిపించడంలో మార్గదర్శకంగా ఉంటారు.

సహచరులను కలుపుకుంటూ, సాంఘికంగా తమ లక్ష్యం యొక్క అవశ్యకతను తమ ప్రాంతంలో లేక తమ వర్గంలో ఉన్న అందరికీ అర్ధం అయ్యేలాగా తెలియజేస్తూ, లక్ష్య సాధనకోసం అందరిలో ప్రేరణ కలిగించే విధంగా మాట్లాడగలగడం నాయకత్వ లక్షణాలలో ప్రధానమైనదిగా చెబుతారు.

ముందుగా ఒక సామాజిక లేదా ప్రాంత లేదా వర్గము యొక్క లక్ష్యం సాధించాలంటే, ఒక్కరి వలన కాదు సమిష్టిగానే సాధించవలసి ఉంటుందని నాయకుడు గుర్తిస్తాడు. అందుకోసం అందరినీ సమిష్టిగా కలిసి తమ లక్ష్యం సాధించుకోవలసిన అవశ్యకతను తెలియజేస్తూ ఉంటాడు.

పరిస్థితులు ఆకళింపు చేసుకోవడం

వ్యక్తి యొక్క తెలివి, పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం, సాధ్యాసాధ్యాలు అంచనా వేయడం, భవిష్యత్తుపై అవగాహన, ధృఢమైన సంకల్పం, పట్టుదల, ధైర్యంగా మాట్లాడగలగడం, కొత్త కొత్త విషయాలను ఆహ్వానించగలగడం, శ్రేయస్సు కోసం పాటుపడే తత్వం, వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత ప్రవర్తన మొదలైన లక్షణాలు నాయుకునికి లేదా నాయకురాలికి ఉంటాయని అంటారు.

ప్రధానంగా నాయుకుడు లేదా నాయకురాలుకి ఉండవలసిన లక్షణం అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకోగలగడం…. ఆలోచన విధానం అందరినీ ఆలోచింపజేసెదిగా ఉండాలి అని అంటారు.

లక్ష్యంపై పూర్తి అవగాహన ఉండడం, సామాజికపరమైన అవగాహన, సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళిక రచన చేస్తూ, తమ లక్ష్యా సాధనకు కృషి చేయడం, అందరినీ ఆ యొక్క లక్ష్యంవైపుకు నడిపించడం.

లక్ష్యసాధనకు అందరిలోనూ స్పూర్తిని అంధించే కార్యక్రమాలు చేపట్టడం తదితర లక్షణాలు నాయకత్వ లక్షణాలుగా చెబుతారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే

చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే

చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే, శాస్త్ర ప్రకారం పెట్టుకున్న పేరు ప్రభావం ?
పిల్లలకు పేరు పెట్టేటప్పుడు పంతులుగారికి పుట్టుక సమయం, తేదీ అందించి, వివరాలు అడిగి పేరు ఎంపిక చేస్తాం.
కానీ పిల్లలకు మాత్రం చిట్టి చిట్టి పేర్లకు పలికే విధంగా అలవాటు చేయడం జరుగుతూ ఉంటుంది.
అలా చిట్టి పొట్టి పేర్లతో పిల్లలను పిలుచుకునేటప్పుడు శాస్త్రప్రకారం నామకరణం చేయడం ఎందుకు అనే ప్రశ్న ఉదయించకమానదు.
బాబుకు కానీ పాపకు కానీ పేరు పెట్టే సమయంలో మంచి చెడు ఆలోచించి పేరు పెట్టేవారు… వారిని పిలవడంలో మాత్రం ముద్దుపేరు అంటూ మరొక పేరుతో పిలవడం కొందరు చేస్తూ ఉంటారు.
చింటూ…, బంటూ… కిట్టు… అంటూ చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే, వారు ఆపేరుకే పలకడం అలవాటుపడతారు. ఇక ఎప్పటికీ ఆపేరుకే పలుకుతూ ఉంటారు.
అసలు పేరు ఎందుకు పెడతారు అంటే, చిన్నారికి ఒక గుర్తింపు అలవాటు చేయడంతో బాటు… చిన్నారి కర్మ ప్రభావం బట్టి ఏ దైవ నామంతో పిలిస్తే, చిన్నారి కర్మప్రభావం బాగుంటుందని పండితులు సూచిస్తారో అటువంటి దైవనామం పేరు ప్రారంభంలో ఉండేలాగా పేరు పెడతారు.
ఎక్కువగా నక్షత్ర పాదం బట్టి మొదటి అక్షరం ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ నక్షత్రం లేక ఆ నక్షత్ర అధిదేవత లేక ఆ రాశి అధిదేవతకు ప్రీతికరమైన అక్షరశబ్ధం ఉండవచ్చు.

పెద్దలు ఎప్పుడు పిల్లల శ్రేయస్సు కోరి పిల్లల యోగక్షేమాలు చూస్తూ ఉంటారు.
కాబట్టి చిట్టి పొట్టి పేర్లకు చిన్నారులను పలికే విధంగా కాకుండా వారి నక్షత్ర లేక గ్రహబలం బట్టి పెట్టే పేరుకు వారిని పలకడం అలవాటు చేయాలని అంటారు.

పిల్లల పేర్లు పెట్టేది వారి శ్రేయస్సు కొరకు అయినప్పుడు, వారి శ్రేయస్సు కోసం వారి నక్షత్ర బలం పెరిగే విధంగా పెద్దలు పెట్టిన పేరుతో పిలవడం శ్రేయస్కరం అంటారు.

ముద్దు పేరుతో పిలిచినా, అసలు పేరుకే పలకడం పిల్లలకు అలవాటు చేయాలి… కానీ ముద్దు పేరు అసలు పేరును మరిపించేలా ముద్దు పేరుతో పిలవడం వలన నామకరణ ప్రక్రియ అనవసరం అని అంటారు.

చిట్టి పొట్టి పేర్లతో పిలవకుండా సార్ధక నామముతో పిల్లలను పిలవడం మొదలు పెడితే, వారు ఆ పేరుకే పలకడం అలవాటుగా మారుతుంది.

చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది

భక్తి భావన బలపడడంలో ప్రధాన పత్రం చిత్తం పోషిస్తే, అటువంటి చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిదిగా ఉంటుంది.

వ్యక్తి జీవితం యొక్క భక్తి మార్గములో మనసు చాలా ప్రధానమైనది. అది ఎటు తిరిగితే, జీవనగతి అటే ఉంటుంది.

అటువంటి మనసుపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి.

ఒక వ్యవస్థలో వ్యక్తి చుట్టూ పరిసరాల నుండి చేరే ప్రాపంచిక విషయాలు మనసుకు అలవాటుగా మారతాయి.

జీవనంలో వ్యక్తి మనసులోకి ప్రవేశించిన అనేక విషయాల్లో కొన్నింటిపై మనసు మమకారం పెంచుకుంటుంది.

అలా మనసులో మమకారం పెరగడంలో ప్రధాన పాత్ర పోషించేది చిత్తం అంటారు.

చిత్తం మనసు యొక్క భావనలలో పొందిన అనుభవాలను జ్నప్తికి తెస్తుందని అంటారు.

చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది. అంటే ఆన్ లైన్ హిస్టరీకి సంబంధించిన అంశాలలోనే మనం ఆన్ లైన్లోకి వెళ్ళిన ప్రతిసారి విషయాలు కనబడుతూ ఉంటాయి.

మన ఫోనులో జోడించబడిన ఉన్న మెయిల్ ఐడి ఆధారంగా మన ఫోనులో ఆన్ లైన్ సెర్చ్ హిస్టరీ సేకరించబడుతూ ఉంటుంది. ఆ ఈమెయిల్ ఎక్కడ ఓపెన్ చేసిన ఆ హిస్టరీకి సంబంధించిన విషయాలే కనబడుతూ ఉంటాయి.

యూట్యూబ్ ఖాతాకు జిమెయిల్ ఆధారంగా యూట్యూబ్ వీడియో హిస్టరీ కూడా ఆన్ లైన్లో సేవ్ అవుతుంది.

మరొక పరికరంలో జిమెయిల్ ఖాతా ఓపెన్ చేస్తే, మన ఫోనులో కనబడే వీడియోలే కనబడతాయి. గతంలో చూసిన అంశాలలో వీడియోలు కనబడుతూ ఉంటాయి.

యూట్యూబ్ కానీ ఫేస్ బుక్ కానీ గతంలో లైక్ చేసినవి లేక వాచ్ చేసినవి… ఆయా అంశాలలో పాపులర్ థింగ్స్ మనకు చూపుతూ ఉంటాయి… అలా చూపడానికి ప్రధాన ఆధారం ఆన్లైన్ హిస్టరీ.

అటువంటి ఆన్లైన్ హిస్టరీ డిలీట్ చేయాలంటే జిమెయిల్ ఖాతా అడ్మిన్ సెటింగ్స్ లో హిస్టరీ డిలీట్ చేయాలి….

అలాగే చిత్తము యొక్క చరిత్రను రూపుమాపలంటే ఆత్మ అనే అడ్మిన్ దగ్గర మనసు నిలబడాలి.

మనసు అటువంటి ఆత్మ దగ్గర నిలబడడానికి భక్తి ఒక మంచి మార్గం అని సులభమైన మార్గమని అంటారు.

ముఖ్యంగా చిత్తశుద్దికి భక్తిమార్గం మేలైన మార్గంగా పెద్దలు చెబుతూ ఉంటారు.

భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని

భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని, భాగవతము భగవంతునిపై అచంచల విశ్వాసము కలిగిన భక్తుల గురించి, భగవంతుడి గురించి తెలియజేస్తుంది.

రోజు మంచిమాటలు వింటూ నిద్రిస్తూ ఉంటే, మనసు భగవంతుడిపైకి మరలుతుందని దృతరాష్ట్రుడి నిష్క్రమణ తెలియజేస్తుంది.

సకలభోగాలు అనుభవించిన పాండవులు, కృష్ణనిర్యాణం కాగానే సర్వము త్వజించి ఉత్తరదిక్కుకు ప్రయాణం చేసే విధానం, భోగాలపై మనసులో వైరగ్యా అవసరాన్ని తెలియజేస్తుంది.

శివుని గురించి చెబుతుంది. లోకాలను రక్షించడం కోసం విషమును కంఠమునందే నిలుపుకున్న పరమేశ్వరుడి గురించి భాగవతం తెలియజేస్తుంది.

పశువులకు కూడా భక్తి ఉంటుందని… పశువులు కూడా భగవంతుడి అనుగ్రహం పొందగలవని గజేంద్రమోక్షం తెలియజేస్తుంది.

త్రాగు నీటిని పాడు చేస్తూ, అమాయకులైన ప్రజలను భక్షిస్తే, భగవంతుడు శిక్షిస్తాడని కాళీయమర్ధనం తెలియజేస్తూ ఉంటుంది.

భగవంతుడి లీలలను చూపుతూ భగవంతుడిపై ఆరాధన పెంచే క్రమంలో భాగవతం ఒక తీపి పదార్ధం వంటిది అంటారు.

మనసుకు బాగా నచ్చిన విషయంలో, అది బాగా స్పందిస్తుందని మనోవేత్తలు చెబుతారు. అలా మనసుకు బాగా నచ్చే విధంగా భగవంతుడు గురించి చెప్పడమే శాస్త్రం పని అయితే, అది భాగవతములో పుష్కలంగా ఉందని అంటారు.

కృష్ణుడి అల్లరిలో అద్బుతమైన లీలలు మనసుని కట్టిపాడేస్తాయి.

ఎంత నియమ నిష్ఠలతో ఉన్నా, మనసు చెడిపోవడానికి ఒక్క క్షణం చాలని అజామిలోపాఖ్యానం తెలియజేస్తుంది.

ప్రతిరోజూ భగవంతుడి కధలు వినాలనే సూచన పరీక్షత్తు కధ తెలియజేస్తుంది..

భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని….

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

విద్యాలయ తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణ మొదట్లో మనసుకు కష్టమనిపిస్తుంది. కానీ లక్ష్యం తెలిసిన మనసుకు మంత్రమే.

స్కూల్ క్లాస్ రూమ్ లో పాఠాలు వినడానికి వెళ్ళే స్టూడెంట్ కు ముందుగా యూనిఫార్మ్ ఉంటుంది.

గ్రహించాలి కానీ అంతా ఒక్కటే అనే భావనా డ్రెస్సింగ్ కోడ్ అందిస్తూ ఉంటుంది. స్కూల్ ఆవరణకు వచ్చేటప్పటికీ మైండులో అటెన్షన్ మొదలౌతుంది.

స్కూల్ టీచర్ ను చూడగానే కర్తవ్యం గుర్తుకు వస్తుంది. అప్పజెప్పిన పనిని చూపించే అలవాటు అబ్బుతుంది.

తరగతి గదిలో కూర్చునే విద్యార్ధికి కుదురు అలవరుతుంది. తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణను అలవాటుగా చేస్తుంది.

విధ్యార్ధి మనసు ఒకేచోట కెంద్రీకృతం అయ్యే అవకాశం తరగతి గది ఆరంభం అవ్వవచ్చు.

అనేకమండి విధ్యార్ధుల హోరులో ఒక్కడైనా ఏకాగ్రతతో టీచర్ చెప్పే పాఠాలను వినడం అంటే, అది ఆ విధ్యార్ధికి ఉన్న ఏకాగ్రతా దృష్టే కారణం కాగలదు.

వినడం వలన విద్య గురించి తెలుస్తుంది. సాధనతో విధ్య వికశిస్తుంది.

వినడానికి క్రమశిక్షణ అవసరం అయితే అది తరగతి గదిలో ఏర్పడినట్టుగా మరొక చోట ఏర్పడడం కష్టమే.

విధ్యార్ధికి వినయం విధేయత అబ్బాడానికి పెరిగే పరిస్థితులు కారణం అయితే, విద్యాలయ తరగతి గది ప్రధానం అవుతుంది.

ఒక విద్యార్ధికి జీవన లక్ష్యం ఏర్పడడానికి తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ అలవాటు అవ్వడం వలన పుట్టే తపన కారణం కావచ్చు.

త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది.

త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటాడు…

కానీ ఒక్కటే అనే భావం బలపడడానికి మాత్రం మనసే కదలాలని అంటారు.

శివుడు – లయకారుడు

విష్ణువు – స్థితికారుడు

బ్రహ్మ – సృష్టికర్త

తమోగుణం

రజోగుణం

సత్వగుణం

శివుడు లయకారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

విష్ణువు స్థితికారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

బ్రహ్మ సృష్టికర్త కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

అంటే త్రిమూర్తులకు మూలం పరబ్రహ్మమని అంటారు.

అలాగే త్రిమూర్తులకు భార్యలు

శివుడుకి భార్య పార్వతి, విష్ణువుకి భార్య లక్ష్మి, బ్రహ్మకు భార్య సరస్వతి.

ముగ్గురమ్మలకు మూలం పరబ్రహ్మమనే అంటారు.

ఎలా చెప్పినా ఏం చెప్పిన ఈ త్రిమూర్తి తత్వం ప్రధానంగా ప్రస్తావిస్తూ భగవంతుడి లీలలు, సుగుణాలు గురించి చెబుతూ ఉంటారు.

సృష్టి ప్రారంభం బ్రహ్మ చేస్తే, బ్రహ్మకు మూలం విష్ణువు అని వైష్ణవులు, శివుడు అని శైవులు అంటూ ఉంటారు. అందుకు తగినట్టుగానే పురాణాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు.

అయితే ఏనాడో ప్రారంభం అయిన సృష్టిలో మనం ఎప్పటివారమో మనకూ తెలియదు….

ప్రారబ్దం వలన పుట్టుక ఉంటే, ఆ ప్రారాబ్దానికి కారణం ఏనాటిదో ఈనాడు తెలియడం కష్టమే కానీ ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం చేయడమే శ్రేయస్కరం అని పెద్దలు అంటూ ఉంటారు.

ఏనాడో ఓనాడు పుణ్యకర్మ, ఎప్పుడో ఒకప్పుడు పాపకర్మ ఈజన్మలో ప్రారబ్ధం అయితే, అప్పటి పాపపుణ్యాలు భగవంతుడికి వదిలి ఇప్పటి కర్తవ్య నిర్వహణకు మనసుని ప్రిపేర్ చేయడానికి భక్తిమార్గం ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు.

త్రిమూర్తులలో త్రిమూర్తి తత్వం ఉంటుంది. ఒకరిలో ఒక తత్వమే చూడడం అవివేకం అంటారు. ముగ్గురికి ఒకరే యజమాని అయినప్పుడు… ఒకరిలో మూడు తత్వాలు ఉంటాయనేది పెద్దల సూచన.

విష్ణువు ఒక మనిషిగా పుడితే, ఆ మనిషికి కోపం వస్తే, చెడుని శిక్షించే క్రమలో లయకారుడు అయితే, అదే సమయంలో శిష్టరక్షణ చేసే స్థితికారుడుగా కూడా… సృష్టికి స్థితికి లయకి ఒకదానికొకటి అవినాభావ సంభందం ఉన్నప్పుడూ… త్రిమూర్తులు, ముగ్గురమ్మలు ఒక్కటే అవుతారు.

ఎక్కువ ఆలోచనలు గందరగోళం అయితే ఒకే ఆలోచన సాధనకు సాకారం అవుతుంది.

భిన్నాభిప్రాయాలు గల మనసులో శాంతి తక్కువ అయితే, ఏకాభిప్రాయం ఉండే మనిషిలో అశాంతి తక్కువ!

అలాంటి మనసుకు బలాన్నిచ్చే భక్తిలో భిన్నాభిప్రాయాలను కలిగి ఉండడం కన్నా ఏకాభిప్రాయంతో సాగడమే ఎవరికివారు శ్రేయస్కులుగా మారతారు.

త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం ఈ కోణంలో భక్తిభావనలు మనసుకు మేలు చేస్తాయని పండితుల ఉవాచ.

త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటే, మనసు మాత్రం తనలో ఉండే భిన్నాభిప్రాయాలతో ఏకాభిప్రాయం సాధించాలని చెబుతారు.

అందుకు పురాణశ్రవణం, పురాణపఠనం, సద్విచారణ సాయపడతాయని అంటారు.

తెలుసుకుంటే సాధించాలనే తపన ఉండే మనసుకు పురాణాలు పరమర్ధాన్ని అందిస్తాయని చెబుతారు.

తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన

తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన మంచి ఫలితం ఇస్తుందని అంటారు. స్కూల్ కు వెళ్ళే బాలబాలికలను తెల్లవారు జామునే చాడువుకోమన్నట్టుగా…

స్కూల్ కు వెళ్ళే ఒక పిల్లవాడు ఎంత శ్రద్ద పెడితే, అన్ని మార్కులు పరిక్షలలో సాధించగలడు. అటువంటి పిల్లవానికి ఏకాగ్రత కోసం తెల్లవారు జాములో చదువుకోమని పెద్దలు చెప్పేవారు.

అంటే భగవంతుడి విషయంలో కూడా స్కూల్ పిల్లవాని వలె భక్తునికి శ్రద్ద అవసరం అనుకుంటా…

అందుకే స్కూల్ పిల్లవానిని చాడువుకోమన్నట్టుగా తెల్లవారుజామునే భగవంతుడిని ప్రశాంత చిత్తంతో ప్రార్ధన చేయమంటారు.

అవును శ్రద్ధ వలననే ఒక పిల్లవాడు పుస్తకంలోని విషయం గ్రహిస్తున్నాడు. విషయసారం గ్రహింఛి కొత్త విషయం కనుగోనడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అలాగే భక్తుడు కూడా భగవంతుడిపై శ్రద్ద పెడితే, భగవతత్వం మనసులోకి వచ్చేస్తుందేమో?

మరి భగవంతుడిపై శ్రద్ద పెట్టె ఆసక్తి మనసులో కలగాలంటే, దానికి ఆలంబన కోసం పురాణ పుస్తకాలూ చదవడం లేక పురాణ ప్రవచనాలు వినడం చేయమంటారు.

పురాణాలు చదవకపోయినా ప్రతిరోజు ఈశ్వరుని పూజ చేస్తూ ఉండాలని అంటారు.

కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తూ, ఆ సాయం ఈశ్వరునికి అర్పించేవారు ఉంటారు.

ప్రతి పనిలోనూ ఈశ్వరుని చూడడం ప్రధానమని అంటారు.

ఈశ్వర సంభందంగా జీవనం సాగించేవారిని ఆ ఈశ్వరుడే రక్షణ చేస్తాడని అంటారు. అయితే ఈశ్వరుడు చిత్తశుద్దిని చూస్తాడని చెబుతారు.

ఈ చిత్తశుద్ది ఉంటే, మనిషి మహనీయుడు అని అంటారు.

అటువంటి చిత్తశుద్ది కలగాలంటే ప్రశాంతమైన చిత్తం కలిగి ఉండాలి.

ప్రశాంతమైన చిత్తం కదిలే మనసులో కన్న, ఒక చోట దృష్టి సారించే మనసులో ఎక్కువగా ఉంటుందని అంటారు.

అలా మనసు ఒక చోట దృష్టి కేంద్రీకృతం చేయాలంటే, దానికి ఎంతో ఇష్టం అయితేనే దృష్టి పెడుతుందని అంటారు.

అలా మనసు ఒక చోట కేంద్రీకృతం అయ్యేలాగా దృష్టి పెట్టడానికి పూజ పునాదిగా చెబుతారు.

సంసారం సాగించేవారికి పూజ ప్రధానం అంటారు.

సంసారం సమస్యలను తెస్తుంది, సుఖదుఖాలను తీసుకువస్తుంది… వాటిని దాటి మనసుని ఏకీకృతం చేయడం చాలా కష్టమంటారు… అలాగే అది అసాద్యమేమి కాదని కూడా అంటారు.

చిత్తశుద్దితో పూజ చేయడానికి సాదారణ పూజ ప్రశాంత చిత్తంతో తెల్లవారు జామున ప్రారంభించడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఆన్ లైన్ సాధనాలతో ఆన్ లైన్ తరగతులు

కరోన కారణంగా స్కూల్స్ మూతబడ్డాయి. ఆన్ లైన్లో పాఠాలు ప్రారంభం అవుతున్నాయి. ఆన్ లైన్ సాధనాలతో టీచర్లకు కొత్త బోధనా పద్దతులు అలవాటు చేసుకోవలసిన స్థితి. ఇప్పటికే ప్రేవేటు స్కూల్స్ ఆన్ లైన్ సాధనాలతో ఆన్ లైన్ తరగతులు పాఠాలు అందిస్తున్నాయి.

ప్రైవేటు స్కూల్స్ లో ఆన్ లైన్ క్లాస్ టీచింగ్ ప్రారంభం అయ్యాయి. పాఠాలు ఒక చోట ఉంటూ, వేరు వేరు చోట్ల ఉన్న అనేకమంది విద్యార్ధులకు పాఠాలను డిజిటల్ సాధనాలతో చెబుతున్నారు.

ఇందుకు క్లౌడ్ మీటింగ్ యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి… జూమ్, గూగుల్ మీట్ వంటి క్లౌడ్ మీటింగ్ యాప్స్ సాయంతో ఆన్ లైన్ పాఠాలు పిల్లలకు అందిస్తూ ఉన్నారు.

జూమ్ క్లౌడ్ మీటింగ్ అయితే అందులో ముందుగా మీటింగ్ క్రియేట్ చేయాలి. టీచింగ్ అంటే మరలా అదే సమయంలో క్లాస్ ఉంటుంది కాబట్టి జూమ్ లో మీటింగ్ క్రియేట్ చేసేటప్పుడు రీకరింగ్ మీటింగ్ ఆప్షన్ టిక్ చేయాలి. సమయం ఎంపిక చేసుకుని, మీటింగ్ క్రియేట్ చేస్తే, ప్రతి రోజు ఒకే సమయానికి మీటింగ్ ప్రారంభించవచ్చు. ఉచిత జూమ్ క్లౌడ్ మీటింగ్ 40 నిమిషాల పాటు ఉంటుంది. అయితే రీకరింగ్ మీటింగ్ క్రియేట్ చేసి ఉంటే, మరలా వెంటనే అదే మీటింగ్ ఐడితో మరలా మీటింగ్ స్టార్ట్ చేయవచ్చు.

గూగుల్ మీటింగ్ కూడా మీటింగ్ క్రియేట్ చేసుకుని మీటింగ్ ద్వారా టీచింగ్ స్టార్ట్ చేయవచ్చును. క్రియేట్ చేసిన మీటింగ్ లింక్ షేర్ చేసి, ఆ లింక్ ద్వారా మీటింగ్ కు స్టూడెంట్స్ ని ఆహ్వానించవచ్చు.

గూగుల్ మీట్, జూమ్ క్లౌడ్ మీటింగ్స్ యాప్స్ ద్వారా స్క్రీన్ షేర్ చేస్తూ పాఠాలు బోధించవచ్చు. వీటిలో మీటింగ్ సెటింగ్స్ ప్రధానంగా తెలుసుకోవాలి. అప్పుడే క్లాస్ పై కమాండింగ్ ఉంటుంది.

లేకపోతే స్టూడెంట్స్ అల్లరి ఆన్ లైన్లో కూడా కంటిన్యూ అవుతుంది. స్టూడెంట్స్ ని మ్యూట్ చేయడం, ఆన్ మ్యూట్ చేయడం… వారి వీడియో హైడ్ చేయడం. స్టూడెంట్ ని వెయిటింగ్ రూమ్ కు చేర్చడం వంటి సెటింగ్స్ తెలుసుకోవాలి.

ఫోన్ ద్వారా చాలా సులభంగానే ఆన్ లైన్ క్లాస్ చెప్పవచ్చు. అలాగే లాప్ టాప్ ద్వారా కూడా ఆన్ లైన్ క్లాస్ చెప్పవచ్చు.

డెస్క్ టాప్ కంప్యూటర్ అయితే మాత్రం వెబ్ కెమెరా మరియు మైక్ వంటి పరికరాలు ఆధానంగా యాడ్ చేయాలి. అప్పుడే డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ తరగతులు నిర్వహించవచ్చు.

డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ తరగతి క్లాస్ నిర్వహణకు కంప్యూటర్ కాన్ఫిగిరేషన్ బాగా ఓల్డ్ అయితే ఆడియో డ్రైవర్స్, వెబ్ కెమెరా డ్రైవర్స్ వంటివి మాన్యుయల్ గా ఇంస్టాల్ చేసుకోవాలి.

లేటెస్ట్ కంప్యూటర్ అయితే మాత్రం ఆటొమాటిక్ డ్రైవర్స్ ఇన్స్టలేషన్ ఉంటుంది.

నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు

నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు. వ్యక్తి పుట్టుకకు ప్రయోజనం భగవంతుడిని చేరడమే అయితే, అందుకు తొమ్మిది భక్తి మార్గాలను పెద్దలు చెబుతూ ఉంటారు.

తొమ్మిది భక్తి మార్గాలలో దేనిని భక్తితో శ్రద్దతో ఆచరించినా తరించవచ్చు అని అంటారు.

శ్రవణం, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలు నారదుడు ధర్మరాజుకు చెప్పినట్టుగా ఐతీహ్యం.

శ్రవణం

శ్రవణము అనగా వినడము… అంటే భగవంతుని గూర్చి చెప్పబడిన గాధలు వినడం. ఇంకా భగవంతుడి గురించిన ప్రవచనాలు వినడం. ఇంకా భగవంతుని భక్తుల గురించి వినడం. భగవంతుడి లీలలు గురించి వినడం. ఏదైనా భగవంతుని గురించి శ్రద్ధాభక్తులతో వినడం శ్రవణభక్తి అంటారు.

ధర్మరాజు, జనమేజేయుడు, పరిక్షత్తు వంటి వారు భగవంతుడి గురించి విని తరించారని పెద్దలు చెబుతారు.

వినడానికి ఇప్పుడు భగవంతుడి కీర్తనలు, పాటలు, కధలు, ప్రవచనలు అన్నీ కూడా ఆడియో రూపంలో అందుబాటులో ఉంటున్నాయి…

కీర్తనం

కీర్తనము అంటే గొప్పగా చెప్పుట… భగవంతుడి గొప్పతనం గురించి చెప్పుట. సుగుణాలను కీర్తిస్తూ ఉండడం. సుగుణాలపై ఆరాధన భావంతో మనసును భగవంతుడిపైనే లగ్నం చేయడం. నిత్యం భగవంతుడి సుగుణాలను మనసులో తలుస్తూ, వాటి గురించి మాట్లాడుతూ ఉండడం వలన మనసు భగవంతుడిపై సులభంగా లగ్నం అవుతుందని అంటారు. పూర్వం భక్తులు చేసిన కీర్తనలు భగవంతుడి యొక్క గొప్ప సుగుణాలను తెలియజేస్తూ ఉంటాయి. వాటిని మనసులో మననం చేసుకుంటూ, భగవంతుడి సంకీర్తనలు పాడుతూ ఉండడం…

త్యాగరాజు, అన్నమయ్య వంటి భక్తులు భగవంతుడిని కీర్తించి తరించారు.

స్మరణం

స్మరణ అంటే తలచుకొనుట. సాదారణంగా ఒక్కోసారి దూరంగా ఉండే, స్నేహితుడిని గుర్తు చేసుకుంటాం. అలాంగే దూరంగా ఉండే బంధువును గుర్తు చేసుకుంటాం. ఏదో ఒక బందం దూరంగా ఉన్నప్పుడూ, గుర్తుకు వచ్చిన ప్రతిసారి వారిని తలచుకుంటూ ఉంటాం… జీవిత భాగస్వామి అయితే దగ్గరగా వచ్చేవరకు తలుస్తూ ఉంటాం… అంతవరకు ఏ పనిలోనూ భాగస్వామి ప్రతిరూపం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. అదే తరహాలో భగవంతుడిని తలుచుకోవడం గురించి కూడా స్మరణ భక్తిగా నవ విధ భక్తిలో చెబుతారు.

భాగవన్నామ స్మరణ చేస్తూ నారదుడు ముల్లోకాలు సంచారం చేస్తూ ఉంటాడు. భగవంతుడి లీలలు వింటూ ఉంటే, స్మరించే స్థాయికి మనసు చేరుకుంటుందని అంటారు.

పాదసేవనం

సేవించడం…. భగవంతుడికి సేవలు చేయడం. ఒక గుడిలో రుసుము చెల్లించి సేవలు చేయడమే కాకుండా, స్వహస్తలతో భగవంతుడి సేవలో పాల్గొనడమని చెబుతారు. ఒక పండుగకు ముందు గుడిని శుభ్రపరుస్తూ ఉంటే, అందులో పాలుపంచుకోవడం. భగవంతుడి పల్లకి మోయడం… శరీరమును భగవంతుడి సేవకు వినియోగించడం వలన భగవంతుడి అనుగ్రహం సులభం అంటారు.

అర్చనం

అర్చన భగవంతుడిని పూజించడం. దూప, దీపా నైవేద్యాలతో భగవంతుడిని పూజించడం. సనాతనధర్మంలో శాస్త్రం సూచించిన మాదిరిగా భగవంతుడికి పూజ ద్రవ్యాలు మనసు పెట్టి సమర్పించడం…. మానసికంగా భగవంతుడికి పూజ చేయగలిగే స్థాయి వచ్చే వరకు పూజా ద్రవ్యములతో భగవంతుడిని నిత్యం పూజించడం… మనసులో పూజా మెదులుతూ ఉంటే, మనసు భగవంతుడి పాదాల వద్దే ఉండడం… పూజలో పరమావధి అంటారు. భగవంతుడిని విగ్రహ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ పూజా ధ్రవ్యములతో పూజ చేస్తూ ఉంటారు.

వందనం.

వందనం భగవంతుడి ముందు వినయంగా ఉండడం. వినయంతో నిత్యం భగవంతుడికి వందనం చేయడం. శిరస్సు వంచి పెద్దలకు గౌరవభావంతో వందనం చేసినట్టు, నిత్యం భగవంతుడి రూపానికి మనసులో వందనం సమర్పిస్తూ, బౌతిక దర్శనంలో భగవంతుడి పాదాలకు నమస్కరిస్తూ ఉండడం అంటారు.

ప్రహ్లాదుడు నిత్యం అన్నింటా శ్రీహరి దర్శిస్తూ, అంతటా నమస్కార భావంతోనే ఉండేవాడు.

దాస్యం

దాస్యం చేయడం కూడా సేవ చేయడం లాంటిదే. అయితే దాస్యంలో ఫలితం ఆశించకుండా యజమానికి లొంగి పని చేస్తాం. అలాగే భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి, భగవంతుడిని ఆరాదిస్తూ ఉండడం.

భగవంతుడికి తనంతట తానుగా దాసుడిగా మారిన హనుమ. అలాగే లక్ష్మణుడు కూడా ఈశ్వరుని వెంటే నిలిచాడు.

సఖ్యం

సఖ్యంగా ఉండడం అంటే స్నేహం చేయడం. ఒక మంచి స్నేహితుడితో ఎలా నడుచుకుంటామో అలాగే భగవంతుడితో స్నేహభావం పెరిగే విధంగా ప్రయత్నం చేయడం. పాండవులు ఈశ్వరునితో సఖ్యతతో ఉండి, నిరంతరం రక్షింపబడ్డారు…. చివరికి తరించారు.

ఆత్మనివేదనం

ఆత్మనివేదనం తనను ఈశ్వరుడికి అర్పించివేయడమే. ఆత్మను ఈశ్వరుడికి అర్పించడంలో బలి చక్రవర్తిని ఉదాహరణగా చెబుతారు.

నేటి రోజులలో స్మరణ చేయడం సులభం… భగవంతుడి గూర్చి చెప్పబడిన ప్రవచనాలు, పాటలు, కీర్తనలు వింటూ ఉండడం వలన మనసు భగవంతుడిపై లగ్నం కాగలదని అంటారు.

భగవంతుడి వైపు మరలిన మనసు భగవంతుడిని స్మరించడం మొదలు పెడుతుంది.

భాగవతం, రామాయణం, మహా భారతం వంటి పురాణ ప్రవచనాలు వినడం అలవాటు అయితే, అది శ్రేయస్కరమని అంటారు.

నవ విధ భక్తి భగవంతుడిపై భక్తికి మార్గాలు

దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు

తెలుగు భజన పాటలు వింటూ

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

భక్తి భావనలు

తెలుగురీడ్స్

భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు

భక్తి భావన వృద్దికి భాగవతం వినడం సాధనం కాగలదు.

తెలుగులో వ్యాసాలు

తెలుగులో పిల్లల పేర్లు అచ్చ తెలుగులో బాబు పేర్లు

తెలుగులో శుభాకాంక్షలు కొట్స్

దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు

దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు. తగు నియమాల వలన మనసులో దైవంపై భక్తి శ్రద్దలు పెరుగుతాయని చెబుతారు.

దేవాలయం అంటే భక్తులను అనుగ్రహించడానికి దైవము కొలువుతీరిన క్షేత్రం. ఆ క్షేత్రం పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన పరమాత్మ భక్తుల కోరికలు తీర్చడానికి కొలువైన పరమ పావన దైవనివాసం. అంతరి పరమపుణ్య ప్రదమైన దేవాలయములో దైవ దర్శనమునకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిభందనలు చెబుతారు.

గుడికి వెళ్ళే భక్తులు (స్త్రీ / పురుషులు) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేయవలెను. నుదుట కుంకుమ ధరించాలి.

గుడి ఆచారం ప్రకారం సంప్రదాయమైన దుస్తులు ధరించాలి. మగవారు పంచె, కండువా… ఆడువారు సంప్రదాయక చీరలు.

దేవాలయమునకు బయలుదేరుతున్నప్పుడే భగవన్నామ స్మరణ మేలని అంటారు.

భగవంతుడికి భక్తితో పూజించడానికి కనీస పూజా సామాగ్రి ఉండాలి… అంటే ధూప దీప నైవేద్యాలు…

దేవాలయ ప్రాంగణం చేరుకోగానే, ప్రాంగణం బయటే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతారు.

దేవాలయం ఆలయం ప్రవేశించడానికి ముందు, ఆలయ గోపురానికి నమస్కరించి ఆపైన మెట్లకు నమస్కరించాలి.

దేవాలయం లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ మనసు భగవంతుడిపైనే పెట్టాలి.

దేవాలయం చుట్టూ ఆలయంలొని దైవమును అనుసరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటారు.

ప్రదక్షిణ సమయంలో మనసంతా భగవంతుడిపైనే ఉండడం శ్రేయస్కరం అంటారు.

దేవాలయంలో పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిలబడాలని అంటారు.

ఆలయంలో దైవమును ఆపాదమస్తకం వీక్షించాలని అంటారు. అంటే కాళ్ళ దగ్గర నుంటి ముఖం వరకు పూర్తిగా దైవమును దర్శించాలని అంటారు.

దైవదర్శనం అయిన తరువాత ఆలయంలో కాసేపు కూర్చొని ఆలయంలో కొలువుతీరిన దైవనామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో కాసేపు దేవాలయంలోనే ఉండాలని అంటారు.

దైవ ప్రసాదం భక్తితో స్వీకరించడం వలన భగవంతుంది అనుగ్రహం కలుగుతుందని అంటారు.

ఇంటికి తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ ఆలయంలోని స్వామికి నమస్కరించుకుని ఆలయం బయటికి వచ్చిన తరువాత మళ్ళీ తిరిగి గోపురానికి నమస్కరించి వెళ్ళాలని అంటారు.

వివిధ ప్రాంతాలు వివిధ పద్దతులను బట్టి ఆయా దేవాలయములలో కొన్ని ప్రత్యేక నియమాలు చెబుతూ ఉంటారు. అటువంటి క్షేత్రముల దర్శనమునకు వెళ్ళే ముందు, ఆయా క్షేత్రముల చరిత్రను, నియమాలను ముందుగా తెలుసుకోవడం శ్రేయస్కరం అంటారు.

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది. నేర్చుకునే ఆసక్తి ఉన్నంత కాలం, మనసు నిత్యం విషయసారం గ్రహిస్తూనే ఉంటుంది.

తెలుసుకోవడం విధ్య అయితే, నేను నిరంతరం నిత్య విధ్యార్ధిని అనే భావన, నిరంతరం ఏదో ఒక విషయం తెలుసుకునేలాగా మనసును ప్రేరేపిస్తుంది.

నాకు అంతా తెలుసు అనే భావన, అలసత్వానికి నాంది అవుతుంది. రాను రాను తెలుసు అనే భావన తెలిసిన విషయాలను మరిపించే అవకాశం కూడా ఉండవచ్చు.

విధ్యార్ధికి విద్యాలయంలో విధ్య నేర్పించబడుతూ ఉంటే, అందరికీ సమాజం కూడా ఒక పాఠశాల మాదిరిగా ఉంటుంది.

బడిలో తపన ఉన్న విధ్యార్ధి ఉత్తమ ఫలితాలను తెచ్చుకుంటూ ఉంటే, ఆసక్తి కనబరచని విధ్యార్ధి అధమ ఫలితాలను పొందుతూ ఉంటాడు. తపనకు శ్రద్ద తోడైతే, శ్రద్దకు సరైన బోధన అందితే, ఆ తపన మనిషిని ఉన్నత శిఖరం వరకు తీసుకువెళుతుంది.

ఒక స్కూల్ వలె సమాజం కూడా అందరికీ ఒక పాఠశాల వంటిదే అంటారు.

నిత్యం సమాజంలో అనేకానేక విషయాలు మనిషి చుట్టూ ఉంటాయి. అనేక సమస్యలు మనిషికి వస్తూ ఉంటాయి. అనేక సమస్యలు పరిస్కారం అవుతాయి. ప్రతి పరిస్కారం ఏదో ఒక పాఠం మిగిలుస్తుంది.

ఏదో నేర్చుకోవాలనే బలమైన భావనకు ప్రేరణ నేను నిత్య విధ్యార్ధిని అనే భావన!

సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్పవారు సైతం, ఇంకా ఏదో నేర్చుకోవాలనే బలమైన భావనతో ఉంటారు. వారికి నేర్చుకోవడంలోనే తృప్తి ఉంటుందేమో….

ఏదైనా అలవాటు ఉన్న మనసు, ఆ అలవాటువైపే చూస్తూ, మనిషిని ఆ అలవాటు దగ్గరికి తీసుకుపోతూ ఉంటుంది… అలా నేర్చుకోవడం ఒక అలవాటుగా మారితే, మరి వారి మనసు ఏదో కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

‘‘జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూశారు. మీరు చూడని సక్సెస్‌ అంటూ లేదు.. ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన మీకెందుకు.?’’ అని మెగాస్టార్‌ చిరంజీవిని ప్రశ్నిస్తే, ‘నేనింకా నేర్చుకోవాల్సింది చాలా వుంది.

—చిరంజీవి

అమ్మ ఒడిలో ఆరంభం అయ్యే విధ్య, విద్యాలయంలో కొనసాగి, సమాజంలో ఒక గుర్తింపుగా మారుతుంది. అలా గుర్తింపు పొందిన వ్యక్తికి జీవితం ఏదో ఒక పాఠం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

సత్యం కోసం తపనపడే మనసు, అబద్దాన్ని ఛేదించేవరకు సాధన చేస్తూనే ఉంటుంది. నిత్య సత్యం చుట్టూ అబద్దం అల్లుకుంటూనే ఉంటే, సత్యాన్వేషణ చేసేవారికి, అబద్దం నిత్యం, ఏదో ఒక పాఠం అందిస్తూనే ఉంటుంది.

లోకం మనిషికి కొత్త అనుభవం అందిస్తూనే ఉంటుంది. కాలంతో బాటు లోకం తీరు మారుతుంది… లోకం తీరు గమనించేవారు, లోకాన్ని అనుసరించడం ద్వారా తమనుతాము అభ్యాసకులుగా మార్చుకుంటారు.

వినేవారు ఉండాలే కానీ చెప్పేవారికి కొదువలేదు… ఆసక్తి ఉంటే అశక్తతో ఉన్నా సరే ఓపికతో వినినిపించేవారు ఉంటారు. వారికి చెప్పడంలో ఉండే తృప్తి, వినేవారికి వరంగా మారుతుంది.

తన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులను పరిశీలిస్తే ప్రతిదినం ప్రతిఘడియ నూతన అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటారు. ఇలా మనిషి నిత్య విధ్యార్ధిగా ఉండే అవకాశాలు ఎక్కువ.

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.
నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

జీవితంలో ప్రతిరోజు, ప్రతిక్షణం పరిశీలన దృష్టి ఉంటే, ఒక కొత్త పాఠం నేర్చుకోవడమే అవుతుంది.

పుట్టిన వ్యక్తి పెరుగుతూ, తన జీవన కాలంలో ఎన్నో పాత్రల పోషిస్తూ ఉంటారు. ప్రతి పాత్రకు ఎదురయ్యే అనుభవాలు, కొత్త పాఠాన్ని నేర్పుతూ ఉంటాయి.

విశాఖలో ఎయు సైన్సు కళాశాల దినోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను అనునిత్యం విద్యార్థిగా వివిధ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు

—చంద్రబాబు నాయుడు

నేను నిత్య విధ్యార్ధిని అను భావనకు సాధన తోడైతే నిత్య సమాజమే ఒక పాఠశాల

అభ్యాసం ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తుంది. విధ్యార్ధి దశలో పాఠాలపై ఆసక్తి ఉంటే, ఉద్యోగంలో పనితీరు మెరుగుపరచుకోవడంలో అభ్యాసం, కొత్త విషయాలు తెలుసుకునేలాగా ప్రేరణ అవుతుంది.

ఒక ఉద్యోగికి తను పనిచేసే చోట అన్ని విషయాలు తెలిసే అవకాశం తక్కువ. కొత్తలో తెలిసిన విషయాలతో పని ప్రారంభం అయితే, తరువాత తెలియని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, అది అభ్యాసం వైపు మరలుతుంది.

తెలిసిన విషయాలు తెలియనివారికి తెలియజేస్తూ, తెలియని విషయాలు తెలుసుకోవడం అనేది కార్యాలయాలలో జరుగుతూ ఉంటుంది.

ఎదిగే పిల్లలకు ఇంట్లో అమ్మా, నాన్న, అక్క, అన్నయ్య… అందరూ అధ్యాపకులే అవుతారు…

ఒక్కోసారి చిన్నవారే పెద్దవారికే తెలిసిన విషయంలో సూచనలు అందిస్తూ ఉంటారు. ఎక్కువమంది ఉండే ఉమ్మడి కుటుంబంలో ఎన్నో విషయాలు తెలియబడుతూ ఉంటాయి.

నిత్య విధ్యార్ధికి ఇంటి నుండి బడి నుండి సమాజం…. పాఠశాలగానే కనబడితే, అను నిత్యం అభ్యాసమే….

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం. ఇప్పటి ప్రసాద సాధనాలు యువతపై రెండు రకాల ప్రభావం చూపించే అవకాశం కలదు.

ఒకటి: ఉపయుక్తమైన విషయ సంగ్రహణం చేసే క్రమంలో ఉత్సాహావంతులకు ప్రోత్సాహకరంగా నేటి సాంకేతికత ఉపయోగపడును.

రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బ్లేడు రెండువైపులా పదును కలిగి ఉండి, దానిని ఉపయోగించేటప్పుడు చేతి వెళ్లకు ప్రమాదకరంగా ఉంటుందో, నేటి సాంకేతికత కూడా ఎదిగే మనసుకు అలాగే ఉంటుంది.

ప్రసార సాధనాల ప్రభావం సమాజంలో ముఖ్యంగా యువతపై ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా మొబైల్స్ రూపంలో ప్రసార సాధనాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది.

ఒకప్పుడు ప్రసార సాధనాలు కేవలం పత్రికల రూపంలోనే ఉండేవి. అవి మాస పత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు, దిన పత్రికలు అంటూ పత్రికల ద్వారకా సమాచారం అందేదీ.

రేడియో కార్యక్రమాలు ప్రజలను అలరిస్తూ వచ్చేవి, సాయం వేళలో సాంగ్స్ వినడం ఒక అలవాటుగా కూడా ఉండేదని అంటారు.

ఆ తరువాత టి‌విల వలన ప్రసార సాధనాల పనితీరు మెరుగు పడింది. అనేక అంశాలు ప్రతి ఇంటిలోకి వార్తలుగా రావడం… ఇంకా వినోద కార్యక్రమాలు సంఘజీవిని ఇంటికే పరిమితం చేయడంలో టి‌విల పాత్ర ప్రముఖమైనది అంటారు.

టి‌విల నుండి వేగం అందుకున్న ప్రసార సాధనాలు ఇప్పుడు అందరి చేతులలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే అందించే క్రమానికి మారాయి.

పత్రిక – రేడియో – టి‌వి – కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ – స్మార్ట్ ఫోన్ ఇలా ప్రసార సాధనాలు అక్షర రూపంలో, శబ్ధరూపంలో, దృశ్య రూపంలో ప్రసారం అయ్యి, ఇప్పుడు దృశ్యం రూపం పెద్ద పెద్ద స్క్రీనుల నుండి అతి చిన్న స్క్రీనులా ద్వారా కూడా ప్రపంచాన్ని అరచేతిలో చూపుతున్నాయి.

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం
యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోన్, ఇది ఒక మాయల మరాఠి చేతిలో మంత్రదండం లాగా మనిషి చేతిలో ఇమిడిపోయింది.

ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టడానికి క్యూ కట్టిన జనులు ఇప్పుడు ఉన్న చోట నుండే కదలకుండా కరెంట్ బిల్ పే చేసే స్థితిని ప్రసార సాధనాలు కల్పిస్తున్నాయి.

సమయం సేవ్ చేయడంలో ఇది మంచి పరిణామం అయితే, అదే సమయంలో సహనం స్థానంలో అసహనం ఏర్పడే అవకాశం కూడా ఈ స్మార్ట్ ఫోన్ వంటి సాధనాల రూపంలో కలిగే అవకాశం ఉంటుంది.

ఇలా ఏదైనా నెలవారి చెల్లింపులు చేయడంలో చేతిలోని స్మార్ట్ ఫోన్ పనితీరు ఒక అద్బుతమే అని చెప్పాలి. ఇది నిజంగానే చేతిలో మంత్రదండం వలె ఉంటుంది.

ఇక వినోద కార్యక్రమాలు అయితే సరే సరి. ఎప్పుడంటే అప్పుడే, ఎక్కడంటే అక్కడే టైమ్ పాస్ కావడానికి స్మార్ట్ ఫోన్లో ఎన్నో వినోదాత్మక వీడియోలు దర్శనమిస్తాయి. వినోదభరిత పెట్టె వలె చేతిలో ఇమిడిపోతుంది.

ఒకటి: ఉపయోగకరమైన విషయ సంగ్రహణకు కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ మరియు స్మార్ట్ ఫోన్లు చాలా ఉపయోగకరంగా….

ఉంటున్నాయనే చెప్పాలి.

ఒక విధ్యార్ధి తరగతిలో టీచర్ చెప్పిన విషయం అర్ధం కాకపోతే, ఇంటర్నెట్ ఆధారిత పరికరములలో శోధించి సాధించవచ్చు.

అలాగే ఒక ఉద్యోగి తన కార్యచరణలో సందేహాలకు సమాధానాలను ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వచన రూపంలో కానీ దృశ్య రూపంలో కానీ పరిస్కారం కనుగొనవచ్చు.

నేర్చుకునే వయస్సులో ఆసక్తికి నేటి సాంకేతికత అదనపు ఆయుధంగా మారుతుంది. అయితే అది మంచి ఆసక్తి అయితే, అది అతని ఉన్నత స్థితికి హేతువు కాగలదు…

అవసరానికి ఆలోచన తోడైతే, ఆ ఆలోచన అందరికీ ఉపయోగపడేది అయితే, అదే ఆలోచనను అభివృద్ది పరచి అందరికీ ఉపయోగపడేలా చేయడంలో నేటి సాంకేతికత ఒక ప్రోత్సాహకరంగా ఉండగలదు.

రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం

కూడా నేటి సాంకేతికత ద్వారా అభివృద్ది చెందిన ప్రసార సాధనాలు కారణం కావచ్చు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో వ్యక్తికి స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది.

అతను శోధించే అంశం అతనికే పరిమితం అవుతుంది కానీ అతని శ్రేయోభిలాషులకు తెలిసే అవకాశం తక్కువ.

వయసుకు మించిన విషయాలు కూడా ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు ఉపయోగించేవారి దృష్టికి వచ్చే అవకాశం నేటి ప్రసార సాధనాల ప్రభావం ద్వారా ఉండవచ్చు.

వాటిని ఉపయోగించే వారి విజ్నతను బట్టి ప్రసార సాధనాల ఉపయోగం ఫలితం ఉంటుంది.

ఈ ప్రసార సాధనాల ప్రభావంతో వ్యక్తి ఆలోచనా తీరు వేగం పుంజుకుంటే, దానికి సరి అయిన పరిస్కారం యోగా అంటారు.

మనసుని నియంత్రించే ప్రక్రియలో యోగా మేలైనదిగా చెప్పబడుతుంది.

ఇప్పటి ప్రసార సాధనాలు అనెక అంశాలు యువత మదిలోకి చొచ్చుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే శ్రేయస్సు కలిగించే విషయాలు మాత్రం మనిషికి శాంతిని అందిస్తే, ఆకట్టుకునే విషయాలు మనసులో అశాంతికి ఆలవాలం కాగలవు.

మంచి చెడులు ఒకరిని అనుసరించి తెలుసుకునే రోజుల నుండి శోధించే తెలుసుకునేవిధంగా ప్రసార సాధనాలు మార్పును తీసుకువచ్చాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు