Monthly Archives: July 2024

సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం

సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది? ఇది ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉండడం వలన పిల్లలపై కూడా ప్రభావం చూపగలదు. కావునా సినిమాల్లో అశ్లీలతను తొలగించాలి.

ఎందుకంటే, సినిమాలు ప్రత్యేకంగా చూడరు. అందరూ కలిసి చూస్తారు. ఇంకా కుటుంబసమేతంగా సినిమాలు చూస్తారు. కనుక సినిమాలు నిర్మించేవారు తమ సినిమాల్లో అశ్లీలత లేకుండా చూడాలి.

ఆకట్టుకోవడానికి అర్ధరహితంగా హీరోయిన్ అంగాంగములను శృంగారంగా చూపించడం వలన సినిమాకు కలెక్షన్లు రావచ్చును కానీ అది సమాజంలో చెడు ప్రభావానికి దారితీస్తుంది. కావునా ఈ విషయంలో సినిమాలలో అశ్లీలత లేకుండా చూడాలి.

యువత పెడద్రోవ పట్టకుండా ఉండడానికి ఇటువంటి ప్రదర్శనలు గల చిత్రాలు ఉండరాదు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?

రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి? రాజకీయాలలో మార్పులు అనివార్యం. ఎందుకంటే సమాజంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని అంటున్నారు. కానీ ఏళ్లతరబడి పరిష్కారం కాని విషయాలు అలాగే కొనసాగుతున్నాయని అంటారు. సమాజంలో మార్పును తీసుకురాగల రంగం రాజకీయ రంగం కనుక రాజకీయాలలో మార్పులు అవసరం అంటారు.

ఎటువంటి మార్పు రాజకీయాలలో అవసరం అని నీవు భావిస్తావు?

రాజకీయాలలో మార్పు మంచి పరిణామంగా భావించాలి. అలా భావించలేని భావజాలం రాజకీయాలలో పాతుకుపోయినప్పుడు, నేను ఖచ్చితంగా రాజకీయాలలో మార్పును కోరతాను.

ఎటువంటివారు రాజకీయాలలో కొనసాగరాదని నీవు బావిస్తావు? ఎప్పుడు రాజకీయాలలో మార్పు అనివార్యంగా భావిస్తావు?

ప్రధానంగా అవినీతిని అంతం చేయడంలో ప్రభుత్వాలు ఫలితం సాధించలేనప్పుడు, రాజకీయాలలో మార్పు అనివార్యం అని భావిస్తాను. ఇంకా అవినీతి మరకలు అంటిన నాయకులకు రాజకీయాలలో చోటు ఉండరాదు.

అభివృద్దిని సాధించకుండా కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే పనిచేసే నాయకులు రాజకీయాలలో అనర్హులు. ప్రగతివైపు పయనించని ప్రాంతంలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి కాబట్టి స్వార్ధ ప్రయోజనాల కోసమే రాజకీయాలలో ఉండేవారిని, రాజకీయాల నుండి దూరం చేయాలి.

ప్రజలకు చెందవలసిన ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగతం చేసే నాయకులను రాజకీయాల నుండి దూరం చేయాలి. ప్రజలకు చేరవలసిన సంక్షేమ పధకాలలో అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను రాజకీయాల నుండి దూరం చేయాలి.

ఎటువంటివారిని నీవు రాజకీయాలలో నాయకుడిగా ఎన్నుకుంటావు?

ప్రజాశ్రేయస్సు కోసం ఆలోచించేవారిని, రేపటి సామాజిక భవిష్యత్తు కోసం, తాత్కలిక ప్రయోజనాలను రక్షిస్తూ, ప్రజలలో అవగాహన కల్పిస్తూ, ప్రణాళిక రచన చేసి, సమాజాన్ని అభివృద్దివైపు నడిపించే నాయకత్వ లక్షణాలు గల నాయకుడికి ప్రజలు పట్టం కడతారు.

సంస్థలున బలోపేతం చేసి, సంస్థల ద్వారా సంపదను సృష్టించి, సమాజాన్ని ప్రగతి బాట పట్టించే నాయకులకు రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉంటుంది.

పాత ఆలోచలనే అమలు చేస్తూ, కొత్త ఆలోచనలకు ఆస్కారం ఇవ్వని నాయకత్వం వలన సమాజం అభివృద్ది చెందలేదు కనుక సామాజిక పరిస్థితులకనుగుణంగా కాలంలో వచ్చే మార్పులను పరిశీలిస్తూ, రేపటి గురించి ఆలోచించగలిగే నాయకులకు రాజకీయాలో ప్రజలు పెద్దపీఠ వేస్తారు.

అన్ని కులాల వారిని సమభావంతో ఆదరించగలిగే నాయకులకే రాజకీయాలలో భవిష్యత్తు.

మతసామరస్యం లేని నాయకులకు రాజకీయాలలో చోటు ఉండదు.

సమాజాన్ని అభివృద్దివైపు నడిపించడంలో వచ్చే సమస్యలకు పరిష్కారం కనుగొంటూ, సమాజంలో శాంతి భద్రతలు, వ్యవస్థల పనితీరు చక్కగా ఉండే పరిపాలన రావాలని అటువంటి మార్పు రాజకీయాలలో కావాలని అందరూ ఆశిస్తారు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

పరిచయం – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

రాజకీయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ సమాజానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది. యువశక్తి రాజకీయాలలో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఇది చైతన్యవంతమైన మరియు ప్రగతిశీల సమాజాలకు మూలస్తంభంగా ఉంది. అనేక ఉద్యమాల నుండి నేటి వాతావరణ సమ్మెల వరకు, విద్యార్థులు సమస్యలపై పోరాటపటిమను చూపుతూ, సమాజంపై చైతన్యవంతమైన ప్రభావం కనబరుస్తున్నారు. ఇంకా సామాజిక సమస్యలపై అవగాహనతో, అవసరమైనప్పుడు తమ యువగళం వినిపిస్తున్నారు. వ్యాసం రాజకీయాలలో విద్యార్థుల ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను, వారు ఎదుర్కొనే సవాళ్లను మరియు సమాజంపై వారు చూపే పరివర్తన ప్రభావాన్ని విశ్లేషిస్తుంది.

చారిత్రక దృక్పథం

భారతదేశంలో పేరుకుపోయిన అవినీతి గురించి గళమెత్తిన అన్నా హజారేకు మద్దతుగా విద్యార్ధిలోకం నిలిచింది. దేశవ్యాప్తంగా ఆ ఉద్యమం సంచలనం కావడానికి విద్యార్ధులు దోహదపడ్డారు. ఇలా సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడే నాయకులకు విద్యార్ధులు మద్దతుగా నిలబడడం శుభపరిణామం.

ఆధునిక సందర్భం – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

నేటికాలంలో సామాజిక మాధ్యమ ప్రభావం చాలా కీలకంగా మారింది. అందులో యువత బాగా ఆరితేరారు. విద్యార్ధులకు సోషల్ మీడియా మంచి వేదికగా ఉంది. తమ గళం వినిపించడానికి వారు సోషల్ మీడియా వేదికగా ప్రతిస్పందిస్తారు. అదేవిధంగా విద్యార్ధులకు అనేక విషయాలపై అవగాహన రావడానికి సోషల్ మీడియా తోడ్పడుతుంది. వారు రాజకీయాలలో కీలక పాత్ర పోషించడానికి సోషల్ మీడియా బాగా సాయపడుతుంది. విద్యార్థులు మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి, కమ్యూనికేట్ చేయడానికి మరియు వాదించడానికి వీలు కల్పిస్తుంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు రాజకీయ క్రియాశీలతకు అవసరమైన సాధనాలుగా మారాయి, విద్యార్థులకు అవగాహన పెంచడానికి, మద్దతును సమీకరించడానికి మరియు విధాన రూపకర్తలను ఒత్తిడి చేయడానికి వీలు కల్పిస్తుంది. .

రాజకీయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు

ఒకటి చెబుతూ మరొకటి చేసే రాజకీయాలు విద్యార్ధులకు మింగుడుపడని అంశంగా ఉంటుందని అంటారు. క్రియాశీలక రాజకీయాలలో ఆదర్శవంతంగా పనిచేయడం సవాలుగానే మారుతుంది. సంస్థాగత, వ్యవస్థాగత లోపాలు వారికి ఆటంకంగా మారతాయి. అవి మారాలంటే రాజకీయాలలో మార్పు అవసరం. మార్పు రావాలంటే, మంచి నాయకత్వం అవసరం. మంచి నాయకత్వం మంచి రాజకీయ వాతావరణం ఉన్నప్పుడే సాధ్యం. కావునా రాజకీయాలు రేపటి భవిష్యత్తుకోసం, సామాజిక శ్రేయస్సుని కాంక్షిస్తూ సాగాలని అంటారు.

విద్యార్థుల ప్రమేయం యొక్క ప్రయోజనాలు

రాజకీయాలలో విద్యార్థుల ప్రమేయం అనేక ప్రయోజనాలను సమాజంలో మంచి మార్పును తెస్తుంది. విద్యార్ధుల తాజా దృక్కోణాలు మరియు వినూత్న విధానాలు పాత పద్ధతులను సవాలు చేస్తూ, కొత్త మార్పులకు నాంది కాగలవు. కొత్త ఆలోచనలను రాజకీయాలకు పరిచయం చేయగలవు. విద్యార్థుల నిశ్చితార్థం క్రియాశీల పౌరసత్వం యొక్క సంస్కృతిని కూడా ప్రోత్సహిస్తుంది, ఇతరులను పాల్గొనడానికి మరియు మార్పు కోసం వాదించేలా ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలంలో, నేటి విద్యార్థి కార్యకర్తలు రేపటి నాయకులుగా మారే అవకాశం ఉంది, వారి అనుభవాలను మరియు విలువలను ప్రభావం మరియు అధికార స్థానాల్లోకి తీసుకువస్తుంది.

ముగింపు – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

విద్యార్ధి దశలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడితే, రేపటి సమాజంలో వారే సమాజాన్ని నడిపించే నాయకులుగా మారతారు. దేశ భవిష్యత్తుని మార్చే శక్తిగా మారతారు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు మరియు లక్ష్యాలను సాధించడానికి ఒక సంస్థ లేదా వ్యక్తికి మార్గనిర్దేశం చేసే వ్యూహాత్మక రూపకల్పన. దీర్ఘకాలిక ప్రణాళికలు వలన ఉపయోగాలు ఉంటాయి.

స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటిని సాధించడానికి తగిన సమయం లభిస్తుంది.

ఆర్ధిక వనరులు, మానవ వనరులు మరియు బౌతిక వనరులు వినియోగించుకుని వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి దిశను నిర్ధేశిస్తాయి.

భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులు గుర్తించడంలో, ఆయా పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించడంలో సాయపడతాయి.

దీర్ఘకాలిక ప్రణాళిక అమలులో తాత్కాలిక ప్రణాళికలు అమలు చేసుకుంటూ, దీర్ఘకాల లక్ష్యాలను నిర్ధేశించుకోవచ్చును.

స్థిరమైన అభివృద్దిని సాధించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉపయోగపడతాయి.

దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా, పరిస్థితులకు అనుకూలంగా స్వల్పకాలిక ప్రణాళికను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది.

విశ్వసనీయత ఉంటుంది. అమలు చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఫలితం కూడా ఎక్కువకాలం ఉంటుంది.

ఈ విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేసిన సంస్థలో మరియు సంస్థపై విశ్వనీయత వస్తుంది.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? మహా భారతం ఇతిహాసం అంటే గతంలో జరిగినది… దానిని గ్రంధస్తం చేశారు. కాబట్టి జరిగిపోయినది. కానీ పంచమవేదంగా మహాభారతాన్ని చెబుతారు. అందులో నుండి ధర్మ సూక్ష్మములు తెలుసుకోవచ్చును అని పెద్దలు చెబుతారు.

మహాభారతం గొప్పగ్రంధం అందులోని కొందరి జీవితాలను పరిశీలిస్తే, జీవితంలో ఎలా ఉండకూడదో? ఎలా ఉండాలి? వంటి కొన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అంటారు. అలా కర్ణుడి గురించి పరిశీలిస్తే….

పాండవులకు తల్లి అయిన కుంతీదేవి, వివాహమునకు ముందే కర్ణుడికి కన్నతల్లి. కుంతీదేవి బాలికగా ఉన్నప్పుడే, దుర్వాస మహర్షికి సేవలు చేసి, ఆ మహర్షి మెప్పు పొందింది. కనుక దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక మంత్రమును ఉపదేశిస్తాడు. సూర్యుని చేసి, దుర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రమును ఆమె పఠించడంతో, సూర్యుడు ప్రత్యక్షం అవుతాడు. కుంతీదేవికి సంతానం ప్రసాదిస్తాడు. వివాహం కాకుండా సంతానం ఉండకూడదని భావించిన కుంతీదేవి, కర్ణుడిని ఒక పెట్టెలో భద్రంగా పెట్టి, ఆ పెట్టెను నదీ ప్రవాహంలో వదిలిపెడుతుంది. అలా కుంతీదేవి వదలిని పెట్టె, రాధాదేవికి లభిస్తుంది. అప్పటి నుండి కర్ణుడు సూతుడు, రాధాదేవిల ప్రేమానురాగాల మద్య పెరుగుతాడు.

సూతుడు, దృతరాష్త్రుడు స్నేహితులు కావునా, కురు, పాండవులతో పాటే, ద్రోణాచార్యుల వద్ద విలువిద్యను కర్ణుడు కూడా అభ్యసిస్తాడు. అస్త్రములను పొందుతాడు. ఆ తర్వాత పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రమును పొందుతాడు.

కర్ణుడు గొప్ప గుణములను కలిగి ఉంటాడు. గొప్ప పరాక్రమవంతుడు. కుమార విద్య ప్రదర్శన సమయంలో కర్ణుడు, అర్జునుడితో పోటీపడతాడు. దుర్యోధనుడి వలన అంగరాజ్యమునకు రాజు అవుతాడు.

అలా కర్ణుడు అంగరాజుగా మారినప్పటి నుండి దుర్యోధనుడు, కర్ణుడి మైత్రి స్థిరపడుతుంది. విడివడలేని స్నేహబంధంగా మారుతుంది. ఇక అక్కడి నుండి పాండవుల పతనం కోరుకుంటున్న, దుర్యోధనుడి పధక రచనలలో కర్ణుడి పాత్ర కీలకంగా మారుతుంది. ఇంకా దుర్యోధనుడు పాండవులపై విపరీతమైన పగను పెంచుకోవడం కర్ణుడి పాత్ర కూడా ఉంటుందని చెబుతారు.

కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? ధర్మం వైపు నిలబడకపోతే

ఇక కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు, అర్జునుడి చేతిలో హతుడవుతాడు. అందుకు ఆయనకు గల శాపాలు కూడా కలసివస్తాయి. అయితే అందరూ అనేది ఏమిటంటే?

శాపాలు లేకపోతే, కర్ణుడుని, అర్జునుడు ఏమిచేయలేడు. ఇంకా అరణ్యపర్వంలో కవచకుండళాలు ఇంద్రునికి ఇవ్వకుండా ఉండి ఉంటే, కర్ణుడిని గెలవడం కూడా కుదరదని అంటారు.

అవును అని అంగీకరించాలి కూడా… అయితే ఎందుకు మరి దేవతలు ఈ విధంగా చేశారు.

పుట్టుకతో కవచ కుండలాలు గల కర్ణుడు, కేవలం ధర్మం వైపు నిలబడకపోవడం వలననే అతనికి అజేయశక్తినిచ్చే, కవచ కుండళాలు అతనికి దూరం అయినాయి అంటారు. ఎందుకు కర్ణుడు అధర్మపరుడైన దుర్యోధనుడివైపు వెళ్ళి ఉంటాడు?

ఆది నుండి అర్జునుడు అంటే, కర్ణుడికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా విలువిద్యలో అర్జునుడు పొందుతున్న మెప్పు కన్నా తన విద్య మెప్పు పొందాలనే భావన… వలన అర్జునుడి కంటే, తను గొప్ప అనిపించుకోవాలనే బలమైన భావన వలన బహుశా కుమార విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడు, అర్జునుడితో పోటీ పడతాడు. అందులో కర్ణుడి ప్రతిభ చూసిన దుర్యోధనుడు, కర్ణుడిని అంగరాజుగా చేయడంతో, దుర్యోధనుడితో మైత్రి పెరిగింది.

కర్ణుడి పతనానికి కారణం ఏమిటి?

కుఠిల బుద్ది, అసూయపరుడైన దుర్యోధనుడి ఆలోచనలకు అనుకూలంగా కర్ణుడు ఆలోచనలు చేయడమే, అతని శక్తి క్షీణించడానికి కారణం అంటారు.

ధర్మాన్ని గెలిపించడమే దేవతల కర్తవ్యం అని, అందులో భాగంగా మానవులను పావులుగా చేసుకుంటారు. అందుకు వారి స్వభావమును దోషముగా చూపుతారని అంటారు.

సహజంగా కర్ణుడు గొప్ప గుణములు గలవాడు. కానీ చెడు సావాసం చేయడం. ఆ చెడు సహవాసంతో మమేకం కావడమే అతని పతనానికి నాంది అంటారు. మరీ ముఖ్యంగా ద్రౌపదీ వస్త్రాపహరణకు దుర్యోధనుడిని మాటలతో ఉసిగొప్పింది కర్ణుడేనని అంటారు. అదే అక్కడి చాలామంది పతనానికి నాంది అంటారు.

అంటే ఎంత పరాక్రమం, ఎంతటి శక్తి ఉన్నా సరే చెడ్డవారితో స్నేహం చేస్తే, సహజ లక్షణాలు కూడా శోభించవు.

ఎన్ని గొప్పగుణాలు ఉన్నా, చెడ్డవ్యక్తితో స్నేహం చేస్తే, ఆ స్నేహం వలన గొప్ప గుణాలు కూడా మసకబారిపోతాయి.

కావునా కర్ణుడి జీవితం నుండి ఏం గ్రహించాలి? అంటే మంచి వారితో స్నేహం చేయలేకపోయినా, చెడ్డవారితో స్నేహం కూడదు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మధువు మీనింగ్ ఇన్ తెలుగుచిత్తము అనే పదానికి తగిన అర్థం

నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?

నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? నేరస్థులు పాలకులైతే పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిపోతుంది. వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా కార్యాచరణ ముందుకు సాగదు. అడ్డగోలు నిర్ణయాలు అమలవుతాయి. నిబంధనలు పాటించకపోవడం పరిపాటిగా మారుతుంది.

ముఖ్యంగా మంచి – చెడుల గుర్తింపు మారిపోతుంది. చెడు మంచిగానూ, మంచి చెడుగానూ ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అందరూ తాత్కాలిక సౌఖ్యం కోసమే వెంపర్లాడడం మొదలవుతుంది. మంచి మాటను పెడచెవిన పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. అందువలన ఆ ప్రాంతపు పరిస్థితులలో శాంతి లోపిస్తుంది.

ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలంటే, అందుకు మంత్రివర్గంతో సమావేశం, అఖిల పక్షంతో సమావేశం చేసి, తమ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యంతో బాటు, తమ నిర్ణయం వలన ప్రజలకు జరిగే ప్రయోజనం ఎంతో, చర్చను నిర్వహించి, చర్చల తర్వాత, ప్రభుత్వం నిర్ణయాన్ని ఆమోదిస్తుంది. అదే పాలకులు నేరస్థులైతే, ప్రజా ప్రయోజనాల కన్నా, తమ స్వార్ధ ప్రయోజనాలే ప్రధానంగా మారతాయి. ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటాయి.

ఒక ప్రాంతానికి ఇతర ప్రాంతాలలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే, పాలకులు నేరస్థులైనప్పుడు.

నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? – నేరాలు పెరుగుతాయి.

ఇంకా నేరప్రవృత్తి బాగా పెరిగిపోతుంది. నేరాలను అదుపు చేయడం కష్టంగా మారుతుంది. నేరాలను అదుపు చేసే వ్యవస్థ అప్రతిష్టను మూటగట్టుకుంటుంది.

హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, మహిళలపై చులకన భావన ఇంకా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం వంటి నేరాలు పెరిగిపోతాయి. బాలల్లో కూడా నేరప్రవృత్తి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసిన వారికి శిక్షలు లేకపోవడం వలన సమాజంలో నేరప్రవృత్తి వైపు ఆకర్షితులు కావడం జరుగుతుంది.

సామాజిక అభద్రత పెరిగిపోతుంది. కావునా ఎటువంటి పరిస్థితులలోనూ నేర స్వభావం ఉన్నవారికి అధికారం అప్పగించకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అది సామాజిక వినాశనానికి దారి తీస్తుంది.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మధువు మీనింగ్ ఇన్ తెలుగుచిత్తము అనే పదానికి తగిన అర్థం

ఏపీకి ఏం కావాలి? అంటే

ఏపీకి ఏం కావాలి? అంటే, అభివృద్ది కావాలి. పేదలకు సంక్షేమం అందాలి. పరిశ్రమలు పెరగాలి. వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందాలి. గ్రామాలలో సౌకర్యాలు కావాలి. రోడ్లు బాగుపడాలి. వ్యవసాయానికి సమృద్దిగా నీరు కావాలి. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కావాలి. అందరికీ శుభ్రమైన త్రాగు నీరు కావాలి…… ఏపీకి ఏం కావాలి? అంటే…. అవసరం అయిన అన్ని ఏపీకి కావాలి.

2014 విభజనలో రాష్ట్రం లోటు బడ్జెట్ తో స్తార్ట్ అయ్యింది. 2019 చివరకు ఏపీకి అప్పులు పెరిగాయి. 2024 ఏప్రిల్ వరకు ఏపీకి అప్పులు మరింతగా పెరిగాయి. అవి అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని ప్రస్తుత సమయంలో మీడియాలో చర్చ. ఏపీ అప్పులు గురించి మీడియాలోనే వార్తలు, చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాల విడుదల చేస్తుంది.

ఏపీకి బాబు కావాలి అంటూ 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో ఏపి ప్రజలు తీర్పు చెప్పారు. ఆర్భాటంగా అమరావతి ఆరంభించారు. పోలవరం ప్రొజెక్టు కట్టడం వేగంగా జరుగుతూ వచ్చింది. ప్రజలు పోలవరం చూడడానికి బస్సులతో తీసుకువెళ్లారు. కియా మోటార్స్ వచ్చింది… 2014 – 2019 కొంతవరకు పరిస్థితి ఆశాజనకంగా అనిపించిందని అంటారు. అయితే 2018 వచ్చే సరికి ఏపీలో జరుగుతున్న అభివృద్ది సరిపోదు, ఇంకా కావాలి అంటూ…. ప్రచారం జరిగిందని అందుకే ప్రజలు జగన్ అయితే మరింత వేగంగా వృద్ది చెందుతుందని భావించరని, అందుకే 2019 ఎన్నికలలో ఏపీకి ఏం కావాలి? అంటే జగన్ కావాలి అంటూ, గతంలో ఎవ్వరికీ రాని మెజార్టి ప్రజలు వైసిపికి ఇచ్చారని విశ్లేషకులు వివరించారు.

2024లో ఏపీకి ఏం కావాలి? అంటే కూటమి కావాలి అంటూ…

కానీ కారణాలు మీడియాలోనే ఉన్నాయి. అమరావతి పనులు ఆగాయి. పోలవరం ప్రొజెక్టు పూర్తికాలేదు. కొత్తగా పరిశ్రమలు రాలేదు. 2019 – 2024 మద్యలో అభివృద్ది కన్నా సంక్షేమమే మిన్న అని వైసిపి పార్టీ అభిప్రాయపడినట్టుంది… అందుకే ఒక్క బటన్ నొక్కడం వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేవిధంగా పనిచేశారని అంటారు. అయినా 2023 సంవత్సరం చివరికి ఏపీ ప్రజల ఆలోచనలో పెద్ద మార్పు వచ్చిందని ఈ సారి విశ్లేషకులు కూడా గ్రహించలేకపోయారని మీడియాలో చర్చ.

2024లో జరిగిన ఎన్నికలలో ప్రజల తీర్పు 2019 ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఇంకా ఎక్కువ మెజార్టీని కూటమికి కట్టబెట్టారు. ఏపీకి ఏం కావాలి? అనే ప్రశ్నకు ప్రజలు చాలా క్లారీటితోనే ఉంటున్నారు. అభివృద్దిని వేగంగా ఆశిస్తున్నారు.

అయితే అభివృద్ది అలా వేగంగా జరగాలంటే, ఆరంభంలోనే సాధ్యం కాదు. కానీ ప్రారంభం జరిగిన కొన్నాళ్లకు అభివృద్దిలో వేగం ఉంటుంది కానీ ఏదైనా ఆరంభంలోనే అభివృద్ది వేగంగా జరగదని అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఎవరు ఎలా విశ్లేషించకున్నా… ఏపీ ప్రజలు ప్రభుత్వానికి ఇస్తున్న గడువు అయిదేళ్లు మాత్రమే… ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే, పూర్తి వ్యతిరేక తీర్పును ప్రజలు ఇచ్చేస్తున్నారు. అది ప్రభుత్వ అంచనాకు కూడా అందని విధంగా ఉంటుంది.

ఏపీకి ఏం కావాలి? అంటే, సామాన్యులకు, మధ్య తరగతివారికి ఆదాయం పెరగాలి.

సామాన్యుడికి ఆదాయం ఉండాలి. సామాన్యుడికి ఆదాయం ఉంటే, అతను తనకు వచ్చిన ఆదాయంలో కొంత సొమ్మును ఖర్చు చేస్తాడు. అలాంటి సామాన్యులు అనేకమంది ఖర్చు చేసే, ఖర్చు వలన సమాజంలో మనీ రోటేషన్, వ్యాపారం, వాణిజ్యం పెరుగుతుంది. అభివృద్ది సాధనలో భాగంగా సామాన్యుడి ఆదాయం పెరగడం మొదటి పనిగా చెబుతారు.

ఎందుకంటే, నగరాలలోనూ, పట్టణాలలోనూ, పల్లెల్లోనూ కూడా సామాన్యులు ఎక్కువగా ఉంటారు.

ఇక మధ్యతరగతి ప్రజలకు ఆదాయం పెరిగితే, వారి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా వారు ఎక్కువగా పన్నులు చెల్లించడంలో కూడా ఉంటారు. కాబట్టి ఈ వర్గం ప్రజల ఆదాయం కూడా పెరిగే విధంగా అభివృద్ది ప్రణాళిక ఉండాలి.

అంటే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెరగాలి. ఉద్యోగ రూపకల్పన జరగాలి. చిన్న పరిశ్రమల పోత్సాహం జరగాలి.

ఏపీలో పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగితే, ఏపీలో పరిశ్రమలు వస్తాయని అంటారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటారు.

ముసలివారికి, అనారోగ్యవంతులకు, వితంతువులకు తదితర ఆధారపడి జీవించేవారికి ఏపీలో సంక్షేమం ఒక వరంగా ఉంది. కావునా ఏపీలో సంక్షేమం పధకాల అమలు అవసరం.

విద్యా ప్రమాణాలు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు పెరగాలి. నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా చర్యలు ఉండాలి.

వ్యక్తిగత అభిప్రాయాలను, సాంఘిక అభిప్రాయాలుగా పరిగణించకుండా, సామాజిక శ్రేయస్సును కాంక్షించేవిధంగా చర్చలు జరగాలి. ప్రజలలో సామాజిక ప్రయోజనాలు, సామాజిక అభివృద్ది, సామాజిక శాంతి బాగుంటే, అందులో జీవించే కుటుంబ వాతావరణం బాగుంటందనే అవగాహన ప్రజలలో ఉండాలి. అప్పుడే అసాంఘిక కార్యకలాపాలు సాగించేవారిలో మార్పు ఉంటుంది.

ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం, ప్రభుత్వానికి ప్రజలలో భరోసా ఇవ్వడం ప్రధానం

ఏపీకి రాజధాని పూర్తికాలేదు. ఏపీకి గుండెకాయలాంటి ప్రొజెక్టు పూర్తి కాలేదు… అవి పూర్తయ్యే సరికి ఏపీ బాగుంటుంది. కానీ ఏపీ ప్రజలు ఇచ్చిన సమయం ఐదేళ్లు మాత్రమే… ఈ ఐదేళ్ళలో ప్రభుత్వం ప్రజల నమ్మకం పొందాలి. అప్పుడే ఏపి అభివృద్ది చెందడానికి కావాల్సిన సమయం ప్రభుత్వానికి లభిస్తుంది.

ప్రధానంగా ఏపీకి ఏం కావాలి? అంటే ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం కావాలి. ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంలేదనే భరోసాని ప్రజలలో కల్పించాలి. ఎందుకంటే ప్రచారంలో మంచి చెడులు మద్య సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కావునా ఎటువంటి ప్రచారం, ఎప్పుడు ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియదు. కావునా ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం పోకూడదు. ఇంకా పారిశ్రామిక వేత్తలలో ఏపీపై నమ్మకం బలపడాలి.

ఎన్నో అవకాశాలు ఉంటాయి. కష్టపడాలి అనే స్వభావం గల వ్యక్తికి సమాజం అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. అలాగే భవిష్యత్తుపై అవగాహన ఉన్న నాయకుడికి సమాజంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. అయితే ప్రధానం నాయకుడిపై ప్రజలకు దీర్ఘకాల నమ్మకం, అలాగే ప్రజలలో తనపై ఉన్న నమ్మకం వమ్ముకాకుండా, నాయకుని పరిపాలన ఉంటే, ఏపీలో అభివృద్ది సాద్యమే… నమ్మకమే ఇప్పుడు ప్రధానం అయితే, అసత్య ప్రచారాలను పట్టించుకోకుండా ఉండడం మరింత ముఖ్యం.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మధువు మీనింగ్ ఇన్ తెలుగుచిత్తము అనే పదానికి తగిన అర్థం

పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం

పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం, అవి విని పిల్లలు విలువలపై ఆసక్తిని పెంపొందించుకోగలరు. ముఖ్యంగా తల్లి చెప్పే నీతి కథలు పిల్లలపై మంచి ప్రభావం చూపుతాయి అంటారు. నీతి కథలు సామాజిక బాధ్యతను, సామాజిక భావనలు అర్ధం చేసుకోవడంలో పిల్లలకు సాయపడతాయి. సమాజంలో బ్రతకడానికి, సామాజిక అవగాహన అవసరమే కదా! పిల్లలపై నీతి కథల ప్రభావం?

పిల్లలు నిద్రపోవడానికి మారాం చేస్తే, అమ్మ పాట పాడి నిద్రపుచ్చుతుంది. ఇంకా వయస్సు పెరిగే కొద్ది పిల్లలకు అమ్మ కథలు చెబుతూ నిద్రపుచ్చుతుంది. అటువంటి సమయంలో అమ్మ చెప్పే నీతి కథలు పిల్లలపై మంచి ప్రభావం చూపుతాయని అంటారు.

రక రకాల నీతి కథలు సామాజిక స్థితిపై, చరిత్రపై, పిల్లలలో ఆసక్తిని పెంచుతాయి. బాల్యం నుండి పిల్లలు నీతి కథలు వినడం వలన, వారి వ్యక్తిత్వంపై ఆ నీతి కథల ప్రభావం ఉంటుందని అంటారు. అలా పిల్లలను ప్రభావితం చేయడానికి నైతిక కథనాలను సమర్థవంతంగా ఉపయోగించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

పిల్లల వయస్సును బట్టి నీతి కథలు ఎంపిక: పిల్లల వయస్సు మరియు గ్రహణశక్తి స్థాయికి తగిన కథనాలను ఎంచుకోండి. చిన్న పిల్లలకు స్పష్టమైన నైతికతలతో కూడిన సరళమైన కథలు చెప్పడం ఉత్తమం, పెద్ద పిల్లలు మరింత క్లిష్టమైన కథనాలను అర్ధం చేసుకోగలరు.

నీతి గురించి చర్చించండి: ఒక నీతి కథ చెప్పిన తర్వాత, కథలోని నీతి ఏమిటో పిల్లలను ప్రశ్నించండి. పిల్లలతో నైతికత గురించి చర్చించండి. పాత్రల చర్యలు, వాటి పర్యవసానాలు మరియు వారి గురించి పిల్లవాడు ఏమనుకుంటున్నాడనే దాని గురించి ప్రశ్నలు అడగండి. ఇది విమర్శనాత్మక ఆలోచన మరియు లోతైన అవగాహనను ప్రోత్సహిస్తుంది.

నిజ-జీవిత పరిస్థితులకు సంబంధించినది: చరిత్రలో కథలే కాకుండా, నేటి సామాజిక పరిస్థితుల బట్టి, నీతి కథలు ఎంపిక చేసుకోవాలి. లేదా ఆనాటి కథలనే, నేటి సామాజిక పరిస్థితలకు అనుగుణంగా, పిల్లలకు అర్ధం అయ్యేటట్టు కథలు చెప్పండి. మహాభారతంలో కొన్ని నీతి కథలు ఎప్పటికీ సామాజిక స్థితిని, వివిధ స్వభావాలను అంచనా వేయడంలో ఉపయోగపడతాయని అంటారు. కథలో బోధించిన విలువల ఆచరణాత్మక అన్వయాన్ని చూడడానికి ఇది వారికి సహాయపడుతుంది.

పిల్లలపై నీతి కథలు ప్రభావం – తండ్రి ఆదర్శం

విభిన్న పాత్రలు మరియు పరిస్థితులను ఉపయోగించండి: ఒకే కథను రోజూ వినిపిస్తే, పిల్లలకు కథలపై ఆసక్తి తగ్గిపోతుంది. అందుకని, చారిత్రాత్మక కథలు, సాంఘిక పరమైన కథలు, బీర్బల్ కథలు, రామాయణ, మహాభారత గ్రంధాలలో కొన్ని సంఘటనలు…. వివిధ రకాలు భిన్నమైన కథలు పిల్లలలో నీతిపై ఆసక్తి కలిగే విధంగా పిల్లలకు నీతి కథలు బోధించాలి. భిన్న కథల ద్వారా పిల్లలను విభిన్న పాత్రలు మరియు పరిస్థితులకు బహిర్గతం చేయండి. విభిన్న దృక్కోణాలు మరియు సంస్కృతుల గురించి విస్తృత అవగాహనను పెంపొందించడానికి ఇది వారికి సహాయపడుతుంది.

తండ్రి పిల్లలకు పెద్ద హీరో: అమ్మను అనుకరిస్తే, నాన్నను గమనిస్తూ, ఆదర్శశంగా తీసుకోవడంలో పిల్లలు ముందుంటారు. నాన్న స్టైల్, మాటతీరు, గమసిన్తూ ఉంటారు. వయస్సు పెరిగే కొద్ది సమాజం నుండి నాన్నకు లభించే గౌరవ, మర్యాదలు కూడా పిల్లలపై ప్రభావం పడతాయి. కావునా పిల్లలకు ఆదర్శంగా నిలబడడంలో, తండ్రి ఆచరణ ఆదర్శనీయంగా ఉండాలి. పెద్దలను గమనించడం ద్వారా పిల్లలు చాలా నేర్చుకుంటారు. మీ చర్యల ద్వారా మీ పిల్లలలో మీరు నాటాలనుకుంటున్న విలువలను ప్రదర్శించండి. ఇది కథల నుండి పాఠాలను బలపరుస్తుంది.

పిల్లలు కథలు చెప్పడాన్ని ప్రోత్సహించండి: పిల్లలు వారి స్వంత కథలను సృష్టించి చెప్పనివ్వండి. ఇది వారు నేర్చుకున్న విలువలు మరియు నైతికతలను అంతర్గతీకరించడానికి మరియు వారి అవగాహనను సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది.

పిల్లలకు నచ్చిన నీతి కథలు మరలా పునరావృతం

పునరావృతం మరియు ఉపబలము: వారికి నచ్చిన నీతి కథలను మరలా తిరిగి చెప్పడం చేయండి. పునరావృతం నైతిక పాఠాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది మరియు వాటిని మరింత అంటుకునేలా చేస్తుంది.

ఇంటరాక్టివ్ యాక్టివిటీలు: నీతి కథలను పిల్లలకు డ్రాయింగ్ రూపంలో చూపించండి. ఏదైనా బొమ్మల కథల పుస్తకాలను పెట్టుకుని పిల్లలకు కథలను వివరించడంలో వలన వారిలో కథలపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ కార్యకలాపాలు కథను మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి మరియు నీతి పాఠాన్ని మరింత ప్రభావవంతం చేస్తాయి.

వినడం ఒక వరం అంటారు. వినడం వలన వినయం వస్తుందని అంటారు. కనుక పిల్లలకు నీతి కథలను చెప్పడం ద్వారా వారిలో వినే శక్తిని పెంచవచ్చును. ఇంకా బొమ్మల కథలు వంటికి కూడా వివరించడం వలన వారిలో విషయాసక్తి కూడా పెరుగుతుంది.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మధువు మీనింగ్ ఇన్ తెలుగుచిత్తము అనే పదానికి తగిన అర్థం

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా? తెలుగు వార్తల్లో వాస్తవం ఎంత? ఒక వ్యక్తి పై గానీ, సామాజిక అంశం గురించి గానీ వస్తున్న వార్త, నిజమేనా? లేదా పుకారా? ఆ వార్తలో వాస్తవం ఎంత? సోషల్ మీడియా వాడకం పెరిగాకా, వార్తలో ఉన్న వాస్తవికత చూడడం కన్నా, ప్రచారానికి పెద్ద పీఠ పడుతుంది.

రెండు పార్టీ ప్రధాన పార్టీలు ఒక ప్రాంతంలో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా ఉంటాయి. ఆయా పార్టీల వారికీ కూడా వార్తలో వాస్తవం ఉందో లేదో కూడా తెలియడానికి కూడా రెండు మూడు ఛానల్స్ చూడాల్సిన స్థితి ఉంటుందట.

ఒక వార్తని రెండు మూడు ఛానల్స్ నందు చెక్ చేసుకోవాల్సిన స్థితికి సమాచార వ్యవస్థ మారిపోవడం విడ్డూరం.

ఎక్కువమంది ఆసక్తి చూపించిన తర్వాత వార్త వైరల్ అవుతుందా? లేక ఎక్కువమంది ఆసక్తి చూపే విధంగా వార్త వైరల్ అవుతుందా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సోషల్ మీడియా సాంకేతికతపై అవగాహన ఉన్నవారికే తెలియాలి.

ఎక్కువగా ఇది రాజకీయ అంశాలపై ప్రభావం ఉంటుంది.

అయితే రాజకీయ వార్తలపై న్యూట్రల్ ఉండే న్యూస్ ఛానల్స్ కూడా తక్కువనేట. ఏదో ఒక ఛానల్ ఏదో ఒక పార్టీకి ఎంతో కొంత అనుకూలంగా ఉంటుందనే విషయం కూడా నమ్మకం ప్రజలలో బలపడింది.

అనేక యూట్యూబ్ ఛానల్స్ వచ్చి, ఒక ఛానల్ వచ్చిన వార్తను వైరల్ చేస్తూ ఉంటాయి. ఆ వార్తపై పాజిటివ్ గా విశ్లేషించేవారు, నెగిటివ్ గా విశ్లేషించేవారు కూడా యూట్యూబ్ ఛానల్స్ నందు ఉంటున్నారు. అధికార పక్షానికి అనుకూలంగా విశ్లేషించేవారు, అందుకు అనుకూలంగా ఉండే మీడియా, ప్రతిపక్షానికి అనుకూలంగా విశ్లేషించేవారు, అందుకు అనుకూలంగా ఉండే మీడియా…. ప్రజలు ఇలా రెండు రకాల మీడియాతో రోజూ టచ్ లో ఉంటారు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

ఇలా అయితే ప్రభుత్వ అనుకూల వార్తలే ఒక వ్యక్తికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతని ఫోన్ ప్రభుత్వ అనుకూల మీడియా వీక్షణలే ఎక్కువగా ఉండడం కావచ్చును

అలాగే ప్రతిపక్షాల వార్తలే కనిపించే విధంగా ఇంకొక వ్యక్తి సోషల్ మీడియా సబ్ స్క్రిబ్షన్లు ఉంటే, అతనికి ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే వార్తలే వస్తూ ఉంటాయి. ఇలా ఒకరు అధికార పక్షం గురించిన పాజిటివ్ వేవ్, మరొకరికి ప్రతిపక్షానికి సంబంధించిన పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతూ ఉంటే, మరి రెండు వైపులా ఉండే వాస్తవం ఎప్పుడు విశీదికరించబడుతుంది?

ఈ విధంగా సమాజంలో వ్యక్తుల ఆసక్తిని బట్టి, వార్తలు కనబడే విధంగా సామాజిక మీడియా ఉంటుంది. ఆ విధంగా ఒకే విధానం వలన ఎక్కడో జరిగిన వాస్తవ ఘటన కన్నా, దానిపై కల్పిస్తున్న ప్రచారానికే ప్రధాన్యత వస్తుంది. అదే ఎక్కువమందికి చేరే అవకాశం ఉంటుంది.

వార్తలో వాస్తవం గుర్తెరగడం మన కర్తవ్యం. కాబట్టి ఇందుకు మార్గం

మీడియాలో మార్పు అంటే, అవి వ్యవస్థలో ఒక వైపు చేరిపోయి ఉంటాయి. వాటిలో మార్పు కన్నా వ్యక్తి ఆసక్తిని మరల్చడమే తేలిక. ఒక వ్యక్తికి కాంగ్రెస్ అంటే, ఇష్టం అతను కాంగ్రెస్ అనుకూలం మీడియాతో బాటు, టిడిపి అనుకూల మీడియాలో వార్తలను కూడా తమ ఆసక్తిలో చేర్చుకోవడం వలన వార్తపై క్రాస్ చెక్ చేసుకోవచ్చును.

న్యూట్రల్ గా ఉండే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. కానీ అవి ఎంతకాలం న్యూట్రల్ గా ఉండగలవో తెలియదు. కాబట్టి వ్యక్తి తన ఆసక్తిలోనే అధికార, ప్రతిపక్ష అనుకూల మీడియాలకు చోటు కల్పించక తప్పదు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

నేటి నీ కృషి రేపటికి నీకు

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మధువు మీనింగ్ ఇన్ తెలుగుచిత్తము అనే పదానికి తగిన అర్థం

Telugu Basic Words English Meaning

Telugu Basic Words English Meaning కొన్ని తెలుగు ప్రాధమిక పదాలు…

నేను (Nēnu) – I

నాకు (Naku) – For me

నువ్వు (Nuvvu) – You (informal)

మీరు (Mīru) – You (formal)

అతను (Atanu) – He

ఆమె (Āme) – She

అది (Adi) – It

వాళ్లు (Vāḷḷu) – They

ఇది (Idi) – This

అది (Adi) – That

ఎవరు (Evaru) – Who

ఏమి (Ēmi) – What

ఎక్కడ (Ekkada) – Where

ఎప్పుడు (Eppuḍu) – When

ఎలా (Elā) – How

ఎందుకు (Enduku) – Why

అవును (Avunu) – Yes

కాదు (Kādu) – No

దయచేసి (Dayacēsi) – Please

ధన్యవాదాలు (Dhanyavādālu) – Thank you

నాన్న (Nanna) – Father

అమ్మ (Amma) – Mother

అక్క / చెల్లి (Akka / Chelli) – Sister

అన్న / తమ్ముడు (Anna / Tammudu) – Brother

సారీ (Sārī) – Sorry

హలో (Halo) – Hello

శుభోదయం – గుడ్ మార్నింగ్ (Guḍ Mārning) – Good morning

శుభ సాయంత్రం – గుడ్ ఈవినింగ్ (Guḍ Īvining) – Good evening

శుభరాత్రి – గుడ్ నైట్ (Guḍ Naiṭ) – Good night

వీడ్కోలు (Vīḍkōḷu) – Goodbye

ప్రేమ (Prēma) – Love

కన్ను (Kannu) – Eye

హృదయం (Hrudayam) – Heart

సంతోషం (Santōṣaṁ) – Happiness

స్నేహం (Snēhaṁ) – Friendship

కుటుంబం (Kuṭumbaṁ) – Family

బంధువులు (Bandhuvulu) – Relatives

అత్త (Atta) – Aunty

విశ్లేషణ (Vishleshana) – Analysis

మామ (Mama) – Uncle

బావ (Bava) – Brother in law

మరదలు (Maradalu) – Sister in law

ఆలోచన (Alochana) – Think

పని (Pani) – Work

గృహం (Gṛhaṁ) – House

పాఠశాల (Pāṭhaśāla) – School

విద్య (Vidya) – Education

నాయకుడు (Nayakudu) – Leader

నేర్చుకోవడం (Nerchukovadam) – Learning

నైపుణ్యం (Naipunyam) – Skill

పదం (Padam) – Word

పాదం (Paadam) – Foot

ఆహారం (Āhāraṁ) – Food

నీళ్లు (Nīḷḷu) – Water

కాఫీ (Kāphī) – Coffee

పాలు (Pālu) – Milk

చక్కెర (Cakkēra) – Sugar

మామూలు (Māmūlu) – Normal

వయస్సు (Vayassu) – Age

ప్రత్యేకం (Pratyēkaṁ) – Special

చిన్న (Cinna) – Small

పెద్ద (Pedda) – Big

అందమైన (Andamaina) – Beautiful

శక్తి (Shakti) – Energy

సామర్ధ్యం (Samardhyam) – Ability

బలం (Balam) – Strength

ముద్దు (Muddu) – Kiss

ఆశీర్వాదం (Āśīrvādaṁ) – Blessing

నచ్చింది (Naccindi) – Like

చేయలేను (Cēyalēnu) – Can’t

తినడం (Tinadaṁ) – Eating

నడవడం (Naḍavaḍaṁ) – Walking

పడుకోడం (Paḍukōḍaṁ) – Sleeping

చదవడం (Cadavadaṁ) – Reading

వినడం (Vinadaṁ) – Listening

మాట్లాడటం (Māṭlāḍaṭaṁ) – Talking

స్నానం (Snānaṁ) – Bath

బట్టలు (Baṭṭalu) – Clothes

రాయడం (Rāyaḍaṁ) – Writing

గురువు (Guruvu) – Teacher

విద్యార్థి (Vidyārthi) – Student

ఆసుపత్రి (Āsupatri) – Hospital

డాక్టర్ (Ḍākṭar) – Doctor

వైద్యం (Vaidyaṁ) – Medicine

రోగి (Rōgi) – Patient

బాగున్నారా? (Bāgunnārā?) – How are you?

బాగున్నాను (Bāgunnānu) – I am fine

అర్థం (Arthaṁ) – Understand

రాదు (Rādu) – Don’t

సహాయం (Sahāyaṁ) – Help

Telugu Basic Words English Meaning

సరే (Sarē) – Ok

వేడి (Vēḍi) – Hot

విషయం (Vishayam) – Thing

చల్లగా (Callagā) – Cold

కాలం (Kālaṁ) – Time

రోజు (Rōju) – Day

రాత్రి (Rātri) – Night

వారం (Vāraṁ) – Week

నెల (Nela) – Month

సంవత్సరం (Sanvatsaraṁ) – Year

కొత్త (Kotta) – New

పాత (Pāta) – Old

మంచి (Manchi) – Good

చెడు (Ceḍu) – Bad

సంతోషం (Santōṣaṁ) – Happy

బాధ (Bādha) – Sad

భయపడి (Bhayapaḍi) – Afraid

కష్టపడు (Kaṣṭapaḍu) – Try

దయ (Daya) – Mercy

స్వప్నం (Svapnaṁ) – Dream

నిజం (Nijaṁ) – Truth

అబద్ధం (Abaddhaṁ) – Lie

పుస్తకం (Pustakaṁ) – Book

కథ (Katha) – Story

పాట (Pāṭa) – Song

సినిమా (Sinimā) – Movie

ఆట (Āṭa) – Game

విందు (Vindu) – Feast

పండగ (Paṇḍaga) – Festival

ప్రయాణం (Prayāṇaṁ) – Travel

వస్తువు (Vastu) – Thing

సహాయం (Sāhāyaṁ) – Assistance

సంఘటన (Saṅghaṭana) – Event

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు? చాలా చాలమందికి తెలిసిన సమాధానమే. కానీ ఈ ప్రశ్న ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? పాఠ్యపుస్తకాలలో వచ్చే ప్రశ్న అవుతుంది. ముఖ్యమంత్రి హోదా, దాని గుర్తింపు వేరే లెవెల్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు కొత్తగా ఏమిటీ ప్రాధన్యత? గతంలో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వారు కొందరికి గుర్తు ఉండకపోవచ్చును.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రం చాలా ఫేమస్…. 2024 ఎన్నికల ముందు, ఎన్నికల వ్యూహం చెప్పి మరీ రాజకీయ పరిస్థితులను తలక్రిందులు చేసినవ్యక్తి. ఆ… ఏ చేస్తావులే? నీ మద్దతు? ఎవరికి లాభం ఉండదు. ముఖ్యం నీ గెలుపు ఒక ఎండమావి… ఎన్నో విమర్శలు. ఇంకా అవమానాలు. ఇంకా అతని అభిమానులకు అయితే, తలెత్తుకోగమలా ఈ సమాజంలో అనే ప్రశ్న… కానీ అభిమానులకు అండగా, మిత్రపక్షాలకు అండగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మార్గదర్శకంగా, అభివృద్దిని అటకెక్కించిన నాయకులకు సింహస్వప్నంగా మారాడు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

2024 ఎన్నికల ముందు ఏ పదవిలో పవన్ కళ్యాణ్ ఉంటారు అనుకునే వారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి మరింత పాపులారీటిని తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ తాను నిర్ధేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చగలిగితే, ఆ పదవికే వన్నె తెచ్చిన మొదటి ఉప ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకు అంటే?

ఉప ముఖ్యమంత్రి మాములుగా మంత్రిగా ఉన్నట్టే కానీ ప్రధాన్యత, రాజకీయ ఫలితం అంతా ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళుతుంది. కానీ నేడు ఏపి ఉప ముఖ్యమంత్రికి ముందుగానే మంచి రాజకీయ నాయకుడుగా గుర్తింపు వచ్చింది. ఇంకా నమ్మదగిన నాయకునిగా నమ్మే జనులు అనేకమంది ఉన్నారు. రాష్టరాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 2024 ఎలక్షన్స్ గా పేరు పొందారు. అంతటి పాపులారిటీ వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి కి మరింత పాపులారిటీ వస్తుంది. ఆ పదవిలో అయన చేయబోయే మంచి పనులకు, ఆయనకే ఎక్కువ ప్రధాన్యత గుర్తింపు దక్కుతుంది.

జన సైనికులు పవన్ కళ్యాణ్ మాటపై పొత్తులో భాగంగా ఎక్కువకాలం తెదేపాతో సఖ్యతతో ఉంటే, అదే విధంగా తెదేపా అనుచరుల నుండి సఖ్యత ఉంటే, ఒకరికొకరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేదోడు వాదోడుగా ఉన్నట్టు ఇరు పార్టీల అనుచరుల మద్య సఖ్యతగా ఎక్కువగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ముఖ చిత్రం కూడా త్వరలోనే మారుతుంది. ముఖ్యమంత్రితో పోటీపడే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టిస్తారు.

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది? వాన వస్తుందంటే? ఫరవాలేదు కానీ తుఫాన్ వస్తుందంటే? ఫరవాలేదు అనుకోము, జాగ్రత్తలు తీసుకుంటాము. ఒకరు అబద్దం నమ్మి మోసపోతే, అతనిని మరొకరు మోసం చేసే అవకాశం ఉండవచ్చును, కానీ ఒక ప్రాంతంలో అనేకమంది మోసపోతే, వారిని మరలా మోసం చేయడం అసాధ్యమే అంటారు. అంటే అబద్దం చెప్పి ఒకరిని కొన్ని సార్లు మోసం చేయగలరేమో, అది వ్యక్తి తెలివిపై ఆధారపడి ఉంటుంది. కానీ చాలామందిని రెండవసారి మోసం చేయడం అరుదు. ఎందుకంటే చాలామందిలో అనేకమందిని ప్రభావితం చేయగలిగే కొందరు ఉంటారు. ఆ కొందరు జాగ్రత్త వహిస్తారు, మరికొంతమందికి జాగ్రత్తలు తెలియజేస్తారు.

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

కనుక అబద్దం వలన వ్యక్తి విలువ తగ్గుతుంది. అదే నాయకుడికైతే, తన వైపు ఉన్న వ్యవస్థకే విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ, ఇంకా ఒక స్థాయికి వచ్చాకా, ఆదర్శవంతమైన మాటలు, ఆదర్శప్రాయమైన జీవనం కంటిన్యూ చేస్తూ ఉండాలి.

విన్న అబద్దం నమ్మినవారికి, గుణపాఠం చెబుతుంది. చెప్పినవారి విలువ తగ్గిపోతుంది. ప్రచారం చేసినవారికి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది.

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి? అంటే పేదరికం, నిరుద్యోగం, వ్యవస్థలలో లోపాలు, రుణభారం వంటివి ప్రధానంగా చెప్పబడతాయి. కారణాలు ఏవైనా అభివృద్ది సాధిస్తే, అది ఆదర్శంగా అనిపిస్తుంది. అభివృద్ది చెందనిదిగా ముద్రపడుతుంది. వ్యక్తిగా అభివృద్ధి సాధిస్తే, ఆ వ్యక్తి కుటుంబంలో అతను ఆదర్శం. నాయకునిగా అభివృద్ది సాధిస్తే, ఆ ప్రాంతంలో అతను ఆదర్శప్రాయం. ఒక సంస్థ అభివృద్ది సాధిస్తే, ఆ సంస్థ, ఆ సంస్థలో పనిచేసేవారు, అక్కడ ఉన్న సంస్థలకు, ఇతర ఉద్యోగులకు వారు ఆదర్శం. అభివృద్ది కాకపోతే, ఎందుకు అభివృద్ది జరగలేదో, అందుకు వారు వారు ఆయా స్థానాలలో నిదర్శనంగా మారవచ్చు.

పేదరికంలో ఉన్నవారు అభివృద్ది సాధించడం చాలా కష్టం అంటారు. అందుకు కారణాలు… పేదరికం వలన వ్యక్తి పోషణ చాలా కష్టంగా ఉంటుంది. జీవితంలో ఎక్కువ సమయం తన కడుపు నింపుకునే ప్రయత్నంతోనే సమయం సాగుతుంది. పేదరికం వలన అభివృద్ది అనే ఆలోచన కూడా పుట్టకపోవచ్చును. పేదరికంలో ఉండి, అభివృద్దిని సాధిస్తే, అది అద్భుతంగానే భావిస్తారు. చరిత్ర అవుతుంది.

ఒక ప్రాంతం అభివృద్ది సాధించాలంటే, ఆ ప్రాంతంలో నివసించేవారంతా కష్టపడి పనిచేయాలి. కష్టానికి తగిన ఫలితం వారికి దక్కాలి. అక్కడ జరిగిన కష్టం మరొక చోట బిజినెస్ జరగాలి. కానీ అలా ఒక ప్రాంతంలో జనులంతా కష్టపడడం అంటే, అక్కడ అందరికి ఉపాధి లభించి ఉండాలి. ఉపాధి లేకుండా జనులకు ఆదాయం ఉండదు. ఉపాధి ఉద్యోగ రూపంలోనూ, స్వీయ వ్యాపార రూపంలోనూ, చిరు వ్యాపార రూపంలోనూ, రోజువారీ వేతన రూపంలోనూ, ఒక ప్రాంతంలో అందరికి ఉపాధి ఉంటే, ఆ ప్రాంతం వేగంగా అభివృద్ది సాధిస్తుంది. కానీ ఒక ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంటే, ఆ ప్రాంతం అభివృద్ది చెందడానికి చాలా కాలం పడుతుంది. అభివృద్ధికి ఆటంకాలు అంటే నిరుద్యోగం ప్రధాన కారణం అవుతుంది.

వ్యవస్థలలో లోపాలు ఉంటే, అధికార యంత్రాంగం పనితీరు సరిగ్గా ఉండదు. ఆదాయ మార్గాలు గతి తప్పుతాయి. ఇవి పెద్ద శాపంగా భవిష్యత్తుకు భారంగా కాగలవు.

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

రుణభారం అంటే అప్పులు. వ్యక్తికైనా, వ్యవస్థకైనా అప్పులు ఎక్కువగా ఉంటే, వ్యక్తి కష్టం అయినా, వ్యవస్థ కష్టం అయినా ఫలితంలో భాగం వడ్డీలకే పోతుంది. తత్కారణంగా ఆదాయం పెరిగే అవకశాలు, ఉన్న ఆర్ధిక భారం పెరుగుతుంది. ఈ విధంగా పేదరికం, నిరుద్యోగం, వ్యవస్థ లోపాలు, రుణభారం అభివృద్దికి ఆటంకాలు….

నేటి నీ కృషి రేపటికి నీకు

నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది. ఈ రోజు పని ఈరోజే చేసేస్తే, రేపు ఇంకొక పనిని పూర్తి చేయవచ్చును. అలా కాకుండా నేటి పనిని రేపటికి వాయిదా వేస్తే, నేటి పనిని రేపు పూర్తి చేయలేకపోతే, నేడు, రేపు కూడా కాలం వృధా అవుతుంది. కాబట్టి నేటి నీ కృషి రేపటికి భరోసా అవుతుంది.

అలాగే నేటి నీ పరిశీలన రేపటికి అవకాశంగా మారవచ్చును. నేడు వస్తున్న వార్తలపై నీ పరిశీలన ఉంటే, రేపు వచ్చే వార్తలలో వాస్తవికతను తెలుసుకోగలం.

నేడు నీవు ఒక పుస్తకమును శ్రద్దతో చదివితే, రేపటికి ఆ పుస్తకంలోని విషయంపై సమగ్ర వివరణ ఇవ్వవచ్చును.

ఏదైనా నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది.

నేడు నీవు ఒక స్మార్ట్ ఫోన్ గురించి విపులంగా తెలుసుకుంటే, దాని గురించి సమగ్రంగా వివరణ ఇవ్వగలవు.

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి పట్టించుకోకుండా ఉంటే, అది మరలా మనకే చేటు చేస్తుంది. వాస్తవాలు గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పెద్దలు అంటారు. దేని గురించి అసత్య ప్రచారాలు? వాస్తవాలు ఏమిటి?

ఒక్కొక్కసారి అబద్దం ఎక్కువగా ప్రచారం అవుతుంది. అది యాదృచ్ఛికం అయితే, కావాలని అబద్దాలు ప్రచారం చేయడం అసత్యాన్ని సత్యంగా చూపించడం లేదా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే, ఆ సమాజంలో ప్రజలు అసత్య ప్రచారాలు, అందులోని వాస్తవికతను గ్రహించాలి అంటారు. లేకపోతే అసత్యమే సత్యంగా నమ్మే ఆస్కారం ఉంటుంది.

ఎందుకు? అసత్య ప్రచారాలు వస్తే, వాస్తవాలు గురించి ఆలోచించాలి?

ఒక్క ఉదాహరణ చూద్దాం!

ఒక ఊరిలో ఒక సర్పంచి గ్రామ అభివృద్ది పనులలో భాగంగా ఒక పనికి పూనుకున్నారు. కానీ అతని ప్రత్యర్ధి ఆ పనిలో సర్పంచి డబ్బులు సంపాదించుకుంటున్నారని, అసత్య ప్రచారం చేస్తే, దానిని ఆ ఊరి ప్రజలంతా నమ్మితే, ఆ అభివృద్ది పని ముందుకు సాగదు. ఇంకా ఎన్నికల జరిగినప్పుడు, ఆ సర్పంచి ఓడిపోవచ్చును. కుట్రతో అసత్య ప్రచారం చేసిన వ్యక్తి, అధికారంలోకి రావచ్చును. అప్పుడు ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అదే అసత్య ప్రచారం జరుగుతున్నప్పుడే, ప్రజలు వాస్తవం గ్రహించి ఉంటే, ఊరి ప్రజల సహకారం, ఆ ఊరి సర్పంచికి ఉంటాయి. ఆ ఊరి అభివృద్ది జరుగుతుంది. కనుక సమాజంలో వచ్చే అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి ప్రజలు పరిశీలన చేయాలని అంటారు.

అవాస్తావాలు నమ్మశక్యంగా ఉండవచ్చు లేదా నమ్మలేనివిగా ఉండవచ్చును. కానీ వాటిని ప్రచారం చేసేవారు బలంగా ప్రచారం చేస్తారు. కావునా ప్రచారం చేస్తున్న వ్యక్తి విశ్వనీయతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

అసత్య ప్రచారాలు ఇప్పుడైతే మరింత వేగంగా వ్యాపిస్తాయి. కారణం సోషల్ మీడియా చాలా వేగంగా పని చేస్తుంది. కావునా అప్రమత్తతో ఉండాలి. అందుకే అనేక న్యూస్ ఛానల్స్ అందుబాటులో ఉన్నట్టే, అనేకమంది న్యూస్ ఎనలిస్టులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు.

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ

మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ

నాకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి దట్టమైన అడవిలో పొగమంచుతో కూడిన ఉదయం యొక్క నిర్మలమైన అందం. మహోన్నతమైన చెట్ల మందపాటి పందిరి గుండా తెల్లవారుజాము యొక్క మొదటి కాంతి, అది తాకిన ప్రతిదానిపై మృదువైన, అత్యద్భుతమైన మెరుపును ప్రసరింపజేయడాన్ని ఊహించండి. గాలి చల్లగా మరియు తాజాగా ఉంటుంది, నాచు మరియు తడి ఆకుల మట్టి సువాసనతో నిండి ఉంటుంది. ఒక మృదువైన పొగమంచు భూమికి దిగువకు వేలాడుతూ, దాదాపు మాయా వాతావరణాన్ని సృష్టిస్తుంది, ప్రతి బిందువు చిన్న ఆభరణంలా మెరుస్తుంది.

ప్రకృతి మేల్కొనే మెత్తని ధ్వనులతో అడవి సజీవంగా ఉంది. పక్షులు తమ ఉదయపు హోరును ప్రారంభిస్తాయి, వాటి పాటలు చెట్ల గుండా ప్రతిధ్వనిస్తున్నాయి, అయితే ప్రవహించే ప్రవాహం యొక్క సుదూర ధ్వని సన్నివేశానికి ఓదార్పు లయను జోడిస్తుంది. అప్పుడప్పుడు, ఒక జింక కనిపించవచ్చు, మనోహరంగా మరియు నిశ్శబ్దంగా కదులుతుంది, పరిసరాలలో సజావుగా కలిసిపోతుంది.

ప్రకృతిలో ఈ ప్రశాంతమైన క్షణం, దాని ప్రశాంతత మరియు జీవితం కలగలిసి, సహజ ప్రపంచం యొక్క అందం మరియు సంక్లిష్టత యొక్క ఖచ్చితమైన రిమైండర్. ఇది ప్రశాంతత మరియు కనెక్షన్ యొక్క భావాన్ని అందిస్తుంది, మన చుట్టూ ఉన్న సరళమైన, ఇంకా లోతైన, అద్భుతాలను పాజ్ చేసి, మెచ్చుకునే అవకాశాన్ని అందిస్తుంది.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

చెట్టునే పండిన మామిడి పండు

మంచి ఒక చెట్టునే పండిన మామిడి పండు ఐతే,

చెట్టున ముగ్గిన మామిడిపండు రుచియే… రుచి!

మంచి మనసు ఉన్నవారే… ఉన్నవారు!

చెట్టునే పండిన మామిడి పండు ఆత్మీయులకే అందిస్తే,

మంచివ్యక్తికి మేలు జరగాలని మనసారా ప్రార్దిస్తాం…!

మేలు కోసమో? మంచి అనిపించుకోవడం కోసమో?

మంచితనం కలిగి ఉండడం కాదు వారికి 

సహజంగానే మంచి మనసు ఉంటుంది.

మామిడిపండు రుచులలో చెట్టునపండిన పండు

రుచి, దానిని ఆరగించినవారికే తెలియును… అలాగే

మంచి వారితో స్నేహం చేసినప్పుడే మంచివలన 

కలిగే విలువ తెలియబడుతుంది.

ఏ మామిడికాయకు ఉండదు చెట్టునే ముగ్గాలని,

కానీ గాలికో, రాయికొ రాలిపోతాయి లేక చిక్కానికి చిక్కుతాయ్!

ఎవరికి ఉండదు మంచి అనిపించుకోవాలని, కానీ కష్టానికో,

అవసరానికో పరిస్థితులు పరాభవించవచ్చు కానీ మనిషిలో

మంచి మరుగున పడదు…. అవకాశం వస్తే ఆకాశమంతా

మంచితనం పంచె హృదయం మనిషిలోనే ఉంటది.

కానీ కష్టంలో ఇష్టంగా మంచివైపు మక్కువతో ఉంటూ,

చెట్టున ముగ్గిన పండువలె అందరిచేత మన్నన పొందే కొందరు

చాలామందికి ఆదర్శం అయితే, అటువంటి వారిని లోకం ఆదరిస్తుంది.

రసాలు వేరైనా చిన్నరసం రుచి మేలు, చెట్టునే పండిన ఆ పండు రుచియే రుచి…

గుణాలు ఏవైనా మంచి మనసు చెడు గుణాలకు దూరంగా ఉంటుంది…

మరొకరికి ఆదర్శంగా ఉంటుంది… ఆచరించమని చెప్పే ఆదర్శం మామిడికాయ అయితే

ఆచరిస్తూ ఆదర్శంగా నిలవడం అంటే చెట్టునే పండిన మామిడి పండు వంటిది…

భలే మామిడి పండు భాగు భాగు మా మంచి మనిషి… మేలైన మనిషి!

కొన్ని తెలుగు పదాలు అర్ధములు

పురోహితుడు – పురమునకు హితుడు పురోహితుడు… పురము యొక్క హితము కొరకు పూజలు చేయువారు…

కలిమి: అంటే కలిగి ఉండుట… ఆస్థిపరులు, ధనవంతులుగా చెప్పబడుతుంది.

శోధన: వెతుకుట అను అర్ధము వస్తుంది. సెర్చ్ చేయడం లేదా శోదించడం

తనిఖీ: శోదించడం… చెకింగ్ చేయడానికి తనిఖీ అంటారు.

వెంబడించడం: అంటే వెంటపడడం… వెంటాడుట

తతంగం: తంతువు

తారతమ్యం: తేడాలు లేదా బేధాలు

తనువు: శరీరము… కాయము…

మనువు: వివాహము, పెండ్లి

అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా?

అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా? ఎందుకు రామాయణ భారత భాగవతం వంటి పుస్తకాలు చదవాలి అంటారు. చదివే అవకాశం ఉన్నవారు తప్పక చదవాలా?

అంటే మన భారతీయ సాంప్రదాయంలో పూర్వకాలపు రోజులలో ఎవరి పని వారికి ఉంటే, చదువుకున్నవారు జ్ఞానం గురించి చెప్పేవారని అంటారు. ఇక ఆ కాలంలో పనుల చేసి అలసిన ప్రజలు రామాయణ భారతాలు వింటూ ఉండడం ఒక అలవాటుగా ఉండేది అంటుంటారు..

ఆకాలంలో అలా ఉంటే, ఆనాడు అక్షరజ్ఞానం ఉన్నవారు తక్కువగా ఉంటే, అక్షరజ్ఞానం ఉన్నవారికి కూడా పని ఉండేది… జ్ఞానం గురించి చెప్పడమే అంటారు… అంటే జ్ఞానం అంటే జీవన పరమార్ధిక జ్ఞానం అంటారు. జ్ఞానం ప్రభోదించే వారిలో నియమ నిబంధనలు ఎక్కువ అని అంటారు.

అయితే జ్ఞానం ఇప్పుడు అందరికీ అందుతుంది… ఐతే అది ఎటువంటి జ్ఞానం అనేది… ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తి ఇష్టాయిష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని

సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని కలిగి ఉంటే, అలా సమస్యకు పరిష్కారం ఆలోచించేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. సమస్య కలిగిన వారు పరిష్కారం సూచించగలిగేవారి మధ్య ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సమాజంలో సమస్యలకు కొదువ ఉండదు. సమస్య లేని జీవితం ఉండదు. కాబట్టి పరిష్కారం చుట్టూ సమస్య ఉన్నవారి ఆలోచన ఉంటుంది.

డాక్టర్ చుట్టూ రోగి తిరిగినట్టుగా, పరిష్కారం చుట్టూ సమస్య తిరుగుతూ ఉంటుంది. సానుకూలంగా ఆలోచించగలిగే తత్వంలోనే పరిష్కారపు ఆలోచనలు తడతాయని అంటారు. ఒక విద్యార్ధి సానుకూల దృక్పధంతో వైద్యశాస్త్రమును సావధానంగా పరిశీలించి, పరిశోధించి సాధన చేస్తే, మంచి డాక్టర్ కాగాలగినట్టుగా సమస్యలను సానుకూల దృక్పదంతో అలోచించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని అంటారు.

చదువులలో సారం గ్రహించి, సమాజంపై పరిశీలన చేసి, గ్రూప్ పరిక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించినవారు గొప్ప అధికారిగా మారినట్టు, సమాజంలో సమస్యలపై అవగాహన ఏర్పరచుకుని, ఆ సామజిక సమస్యలపై తన చుట్టూ ఉన్నవారికి అగవగాహన కల్పిస్తూ, ప్రజలకు మంచి భవష్యత్తు కోసం, ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే విధంగా ప్రోత్సహించగలిగేవారు నాయకులుగా ఎదగగలరు.

ఏదైనా పరిష్కార ధోరణితో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఉండేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. చాణక్య నీతి ఇప్పటికీ ప్రసిద్ది… వాటిని అనుసరించి ఆలోచన చేయడం ద్వారా పరిష్కార ధోరణి అలవాటు అవుతుంది అంటారు.

ఆలోచన ఊహగా ఉంటే, ఆచరణ ఫలితం ఇస్తూ ఉంటుంది. ప్రతి ఆలోచన ఆచరణ సాద్యం కాకపోవచ్చు. ప్రతి ఆలోచన పరిష్కారం కాకపోవచ్చు… కానీ ఆచరించే ఆలోచన మాత్రం సమస్యను సృష్టించేది కాకూడదని అంటారు.

డబ్బు సంపాదన కొరకు వ్యక్తులు, వ్యవస్థలు

లోకం డబ్బు చుట్టూ తిరిగితే, డబ్బు కోసం కష్టం చేసేవారు ఎక్కువ. డబ్బు సంపాదన కొరకు వ్యక్తులు, వ్యవస్థలు కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు అవసరాలు తీరుస్తుంది. సరదాలు తీరిస్తుంది. సౌకర్యాలు అందిస్తుంది. డబ్బుతో కూడిన జీవితం సౌకర్యవంతంగా సుఖవంతంగా ఉంటుంది. అయితే ఆ సంపాదన మార్గాన్ని సమాజం గమనిస్తూ ఉంటుంది.

సమాజంలో వ్యక్తికి పని ఉంటె, ఆ వ్యక్తి చేసిన పనికి ప్రతిఫలంగా ధనం లభిస్తుంది… అలా సంపాదించిన ధనంలో కొంత ధనం తిరిగి ఖర్చు పెడుతూ ఉంటే, వ్యక్తి అవసరాలకు తగిన సరుకులు సేవలు అందించేవారు వ్యాపారం నిర్వహిస్తారు. అలా ఖర్చు పెట్టేవారు, సరుకులు, సేవలు అందించేవారు ఎక్కడ ఎక్కువగా ఉంటే, అది పెద్ద మార్కెట్ అవుతుంది. అక్కడ బాగా వ్యాపారం జరుగుతుంది.

వ్యాపారం వలన ఒకరికి సరుకులు, సేవలు అందితే, వాటిని అందించినవారికి లాభం ముడుతుంది. సమాజంలో ఎక్కడైతే తగినంత సమయం కష్టం చేస్తూ, ధనార్జన చేస్తూ, తిరిగి తమ తమ అవసరాలు తగినంత ఖర్చు చేస్తూ ఉంటారో అక్కడక్కడ సమాజం ఆర్ధికంగా పుష్టిగా ఉంటుంది. అంటే ధనం ఒక వాహకంగా ఉండడం వలన సమాజంలో అవసరాలు, సౌకర్యాలు, సేవలు సక్రమంగా సాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ లాభాపేక్ష పెరిగి స్వార్ధంతో వ్యవస్థను పీడించేవారు ఉండవచ్చు… అలాంటి వారి వలన వ్యవస్థ మరియు వ్యవస్థలో వ్యక్తులకు సమస్యలు తప్పవు… ఇవి కాకుండా ప్రకృతి వలన వచ్చే కష్టనష్టాలు వ్యక్తికి సమస్యలతో సతమతం కాక తప్పదు…. కారణం పర్యావరణం కాలుష్యం కావడం… కాబట్టి లోకంలో సమస్యలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి.

దీర్ఘకాలిక సమస్యలు సమాజంలో ఉంటూనే ఉంటే, వ్యక్తి చుట్టూ తిరిగే సమస్యలు

దీర్ఘకాలిక సమస్యలు సమాజంలో ఉంటూనే ఉంటే, వ్యక్తి చుట్టూ తిరిగే సమస్యలు పుడుతూ ఉంటాయి. కాలంలో ఏళ్లతరబడి సమాజంలో సమస్యలు కొన్ని ప్రాంతాన్ని బట్టి ఉంటూ ఉండవచ్చు… ఆయా ప్రాంతాలలో ఆయా సామజిక పరిస్థితులలో జీవించే వ్యక్తికి అతనికి సమస్య ఉన్నా లేకపోయినా అక్కడి సామజిక సమస్య మాత్రం అతని చుట్టూ ఉండే అవకాశం ఉంటుంది.

ఒక ప్రాంతంలో నీటిఎద్దడి ఉంది. ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తికి మాత్రం ఇతర సమస్యలు ఎలా ఉన్నా, నీటి సమస్య మాత్రం అందరితో బాటు అతనికి కూడా ఉంటుంది.

అలాగే ఒక ప్రాంతంలో కరెంట్ కట్టింగ్ ఉంది… ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తికి అతని సమస్యతో బాటు కరెంట్ కట్టింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇంకా ఒక ప్రాంతంలో నెట్ సిగ్నల్ సరిగ్గా లేదు… ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తికీ కానీ అక్కడికి వచ్చిన వ్యక్తికీ కానీ అక్కడి నెట్ వర్క్ సమస్య వస్తుంది… అంటే సమాజంలో దీర్ఘకాలికంగా ఏదైనా సమస్య ఉంటె, ఆ సమాజంలో నివసించేవారికీ కానీ అక్కడికి నివాసం ఉండడానికి వచ్చినవారికి కానీ ఆ సామజిక సమస్య కూడా తోడు అయ్యే అవకాశం ఉండవచ్చు

ఇలా సమాజంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపగలిగేది ప్రభుత్వం అయితే, అందులో పరిష్కారం చూపించేవారు వ్యక్తులే ఉంటారు… అలాంటి వ్యక్తిగా ఎదిగేవారు చిన్న నాటి నుండే సామజిక సమస్యలపై దృష్టి సారిస్తూ ఉంటారు.

కొన్ని వ్యవస్థలు సమస్య పరిష్కారం చూపించడానికి ఏర్పడుతూ ఉంటాయి… ప్రభుత్వం తరపు కూడా న్యాయవ్యవస్థ ఉంటుంది.

పరిష్కారం కోసం సమస్య ఉన్నవారు చూస్తూ ఉంటారు. పరిష్కారం చూపే వారి కోసం సమస్యలకు పరిష్కారం అందించే సంస్థలు ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పటికే ఉన్నవారు ఉన్నా కొత్తవారి కోసం చూడడం ఉంటుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, సాధించలేనిది ఏముంటుంది?

సాహిత్యం గురించి చదువుతూ చదువుతూ అది అలవాటుగా మారి చదివి చదివి అది ఒక తపస్సు అయితే, అలా చదివినవారు మరొక పుస్తకం సృష్టించే స్థాయికి చేరగలరు… లేదా ఒక విషయాన్ని విపులంగా అర్ధవంతంగా పదిమందికి వివరించి ప్రసంగించగలరు. చదవడం ఒక తపస్సు అయితే, అలా తపస్సు చేసినవారు గురువుగా మారగలరు.

ఒక విషయంలో తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, ఆ విషయం ఆ వ్యక్తి చేత సాధించబడుతుంది.

సమాజంపై ప్రభావం చూపించే అనేక వస్తువుల సృష్టికి ముందు… ఆ వస్తువు యొక్క తయారీ విధానం ఒక ఆలోచనగా ఒక వ్యక్తి మెదడులో మెదిలితే, అలా మొదలైన ఆలోచన గురించి ఆ వ్యక్తి తపిస్తే, ఆ ఆతపన వలన ఆ ఆలోచన ఆచరణకు వస్తే, ఇప్పటి కాలంలో అనేక వస్తువులు సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అలాంటి వాటిలో రేడియో, టి‌వి, ఫోన్ వంటి వస్తువులు ఎన్నో ఉంటాయి.

అందరూ తపించి తపించి వస్తువు కనిబెడితే, మరి వాటిని వినియోగించేది ఎవరు?

ఇలాంటి ప్రశ్నకూడా పుట్టే అవకాశం ఉంటుంది. అది సహజమే కాలం మనల్ని ప్రశ్నించేవరకు సాధారణంగా అలవాటు అయిన జీవితాన్నే కొనసాగించడం మనసుకు ఉండే అలవాటు అంటారు. కానీ కాలం ప్రశించేవరకు అంటే, మనం కాలం మములుగానే ఖర్చు అయిపోయినట్టే…

జీవితంలో సరదాలు కోల్పోతామనేది బ్రమ మాత్రమే. ఎందుకంటే చిన్నప్పుడు మన పోషణ కొరకు కష్టపడే తల్లిదండ్రులు మనకున్నట్టే… ఒక సినిమా వెళ్దాం అని ప్రోత్సహించేవారు మన చుట్టూ ఉంటారు.. కాబట్టి సినిమాకు వెళ్లాలనే సరదా కోసం తాపత్రయపడనవసరం లేదు. అలాంటి చిన్న చిన్న సరదాల కోసం ప్రోత్సహించేవారు లేదా అలాంటి సౌకర్యాలు అందించే వ్యవస్థలు కూడా ఉన్నాయి.

అంటే సినిమాకు వెళ్లాలంటే ఒకరు ముందుగా టికెట్ తీసుకోవడానికి థియేటర్ కు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా టిక్కెట్స్ ఆడించే వ్యవస్థలు కూడా ఉన్నాయి. వ్యక్తికి సరదాలు అందించే విషయంలో మన చుట్టూ వ్యక్తులే కాదు వ్యవస్థలు కూడా ఉన్నప్పుడు, జీవితంలో సరదాలు కోల్పోయే బ్రమ అవసరం లేదని అంటారు.

దేని కోసం తపన ఉండాలి? ఇదే ప్రధాన ప్రశ్న అయితే

జీవితపు లక్ష్యం కొందరికి చిన్నప్పుడే బలపడితే, దాని సాధనకు వారు చదువుకునే వయస్సు నుండే ప్రేరిపింపబడుతు ఉంటారు… అంటే స్కూల్లో టాపర్ గా ఉంటూ కాలేజీ చదువులలో కూడా అదే ఫలితాలు రాబుడుతూ చదువును పూర్తి చేసుకునేవారు తమ తమ ఆర్ధిక, సామాజిక లక్ష్యాలను అందుకుంటూ ఉంటారు.

అలాగే కొందరికి వృత్తి నేర్చుకునేటప్పుడు లక్ష్యం ఏర్పడుతూ ఉంటుంది… పట్టుదలతో తాము నేర్చుకుంటున్న వృత్తిలో శ్రద్దాశక్తులు కనబరుస్తూ తమ జీవిత లక్ష్యానికి మార్గం సుగమం చేసుకుంటూ ఉంటారు.

కొందరు చదువుకునే వయసులో ఆటలతో కాలం గడిపి, ఒక వయసు వచ్చాక అవసరాల కోసం ఆర్జన చేసే సమయంలో లక్ష్యం ఏర్పడే అవకాశం ఉంటే, ఆ వయసులో వారు తమ జీవన లక్ష్యం కోసం పాటుపడతారు…

ఇలా జీవితంలో ఎప్పుడైనా తమ జీవితపు లక్ష్యం ఏర్పడుతూ మనిషిని తన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి లక్ష్యం తీసుకెళుతుందని అంటారు.

ఒకరి జీవితపు లక్ష్యం ఒక వ్యవస్థగా మారవచ్చు. ఒకరికి కలిగిన అసౌకర్యం ఒక వ్యవస్థను సృష్టించే విధంగా ఆలోచనను కలిగించవచ్చు.

ఆలపాటి రామచంద్రరార్రావు ఆర్ధికంగా ఎదుగుదల జీవితపు లక్ష్యం అయితే, ఇప్పుడు అది అంబికా దర్బార్ అనే వ్యవస్థ.

ఊరి ప్రయాణం కోసం కలిగిన అసౌకర్యం ఒక వ్యక్తికి ఆలోచనను కలిగిస్తే, అది ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ… రెడ్ బస్ టికెట్ బుకింగ్…

ఇలా జీవితపు లక్ష్యం చిన్నప్పుడే ఉంటే, అది చదువు నుండి కొనసాగవచ్చు… ఒక్కోసారి జీవితపు మద్యలో లక్ష్యం ఏర్పడవచ్చు… కానీ అది ఆ వ్యక్తిలోను, సమాజంలోను మార్పుకు నాంది కాగలదని అంటారు.

నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం

నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం! విద్యాలయంలో విద్యను బోధించే ఉపాధ్యాయుడి ప్రభావం ప్రతి వ్యక్తిపై బాల్యంలోనే పడుతుంది. ఉపాధ్యాయుడు ఏమి విద్యార్ధులకు బోధిస్తాడో, విద్యార్ధులు దానిని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు.

అంతకన్న ముందు ప్రతి వ్యక్తికి అప్యాయతను, అమృతమైన ప్రేమను పంచే అమ్మ తొలి గురువుగా ఉంటుంది. తర్వాత తండ్రి ఆదర్శవంతంగా గురువుగా ఉంటాడు. ఇది ఇప్పటి నుండి ఉంది కాదు. పురాణాలలో కూడా మనకు ఋషుల సంప్రదాయం గమనిస్తే కనబడుతుంది. వ్యాసుడు, పరాశరుడు, శక్తి, వశిష్ఠుడు… అలా తండ్రి గురువుగా ఉన్నట్టుగా ప్రాచీన సంప్రదాయం ఉంది. అయితే ఋషి సంప్రదాయం అంతా ఆద్యాత్మికంగా ఉంటుంది. గురువు ఉపదేశిస్తే, చాలు శిశ్యుడు విజ్ఙాన సముపార్ఝను కృషి చేసేవారని అంటారు.

తర్వాతి కాలంలో విద్య పుస్తకాల రూపంలో ఉండి, ఆచరణకు దూరంగా ఉండడం చేత, ప్రత్యేకంగా గురువు అవసరం… ప్రస్తుత కాలంలో ఎన్నెన్నో విద్యలు వివిధ విభాగాలు మారిపోవడం, ప్రతి విషయంలో ప్రత్యేక కోర్సులు రావడం… ఇలా విద్య నూతన విధానంతో సాంకేతిక రూపంలోకి మారడం జరుగుతుంది. గురువు లేకుండా కూడా విషయాలను తెలుసుకునేంతగా నేడు సాంకేతిక విజ్ఙానం పెరిగింది.

అంతెందుకు మహాభారతంలో కూడా ఏకలవ్యుడు గురువు దగ్గర ప్రత్యక్షంగా కాకుండా, పరోక్షంగా ద్రోణాచార్యుని విగ్రహం ముందు సాధన చేసి, విశేషమైన ధనుర్విద్యను అభ్యాసం చేసి, విశేష ప్రతిభను కనబరిచాడు. కానీ గురువు దగ్గర అభ్యాసం లేని కారణంగా, ఆ విద్య దుర్వినియోగం అవుతుందనే వాదన ఉంటుంది.

అందుకే ఎంత సాంకేతికంగా విషయాలు తెలుసుకునే సౌకర్యం ఉన్నా, గురువు దగ్గర క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం చాలా చాలా ప్రధానమని పెద్దలు చెబుతారు. కావునా ఉపాధ్యాయుని పాత్ర చాలా ప్రధానం.

విద్యార్దిఎల్.కె.జి నుండి అక్షరాలను, అంకెలను గుర్తించడం దగ్గర నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఒక విషయంపై లోతైన అధ్యయనం చేసేవరకు ఉపాధ్యాయుని బోధన ప్రభావం అతనిపై ఉంటుంది.

నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం విద్యార్ది పై హైస్కూల్ విద్యా సమయంలో బాగా పడుతుంది. ఎందుకంటే, ఆ సమయంలోనే విద్యార్ధి స్యయంగా ఆలోచన చేయడానికి అలవాటు పడతాడు. విషయాలు తెలుసుకునే ఆసక్తి కనబరచే సమయం కూడా అదే.

కాబట్టి నేటి సమాజంలో విద్యార్ధికి బోధించే విషయాలు విద్యార్ధి ఆలోచనలపై ప్రభావం చూపగలవు.

ఇప్పుడు సాంకేతిక విజ్ఙానం మరియు పరికరాలు అందుబాటులో ఉండడం వలన, ఉపాధ్యాయుడు చెప్పే బోధనాంశాలపై విద్యార్ధికి వచ్చే సందేహాలకు సమాధానాలు కనుగొనడం తేలిక…

అందుకే విద్యార్ధి వాస్తవికత, విషయంపై సమగ్ర అవగాహన కల్పించగలిగితే, నేటి సమాజంలో విద్యార్ధులు అనేక అంశాలలో నైపుణ్యతను సాధించగలరు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

నేటి నీ కృషి రేపటికి నీకు

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని…

కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని… ఈ క్రింది లింకును క్లిక్ చేసి, న్యూస్ పేపరులో వచ్చిన న్యూస్ ఆర్టికల్ చదవండి… అందులో కంగనా రనౌత్ స్టేట్ మెంట్ మరియు ప్రతి కామెంట్స్ వ్రాయబడి ఉంది.

కంగనా కంగుమనిపించే కామెంట్ 1947లో వచ్చింది.

కానీ ఇప్పుడు ఎవరు ఏమి కామెంట్ చేసిన మన పూర్వికులంతా కలసి సాధించిన విజయంగా 1947 ఆగష్టు పదిహేను నుండి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటున్నాము. తర్వాతి కాలంలో పరిపాలన అందుబాటులోకి వచ్చిన రోజుగా జనవరి 26 వ తేదీ నుండి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాము.

1947కు ముందు ఏమన్నా నష్టం జరిగిందంటే అందులో బ్రిటీష్ అధికారుల నిర్ణయాలు అలాగే ఏమైనా మేలు పనులు చేసినా బ్రిటీష్ వారు పరిపాలనా సౌలభ్యం కోసం చేసుకున్న ప్రయత్నాలు అంటారు. ఏమైతేనేం వారు పరిపాలించారు. మనం పరిపాలించబడ్డాము. తిరగబడ్డారు. స్వాతంత్ర్యం పోరాటం చేశారు. స్వాతంత్ర్యం తీసుకువచ్చారు.

అప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందంటే బ్రిటీష్ వారు మన స్వాతంత్ర్య పోరాట యోధులను చూసి ఆశ్చర్య పడడం, పోరాట స్పూర్తిని చూసి నివ్వెరపోయిన సందర్భాలు అనేకమని పెద్దలు చెబుతారు. చరిత్రలో ఎంతో మంది భారతీయుల పోరాటపటిమ గురించి ఉందని అంటారు. మన స్వాతంత్ర్య యోధుల పోరాట పటిమను చూసి బ్రిటీష్ వారు ఆశ్చర్య పడడం అంటే వారి దగ్గర అంత పోరాడే పటిమ లేనట్టుగానే భావింపబడుతుంది.

బ్రిటీష్ వారు భారత్ లోకి వ్యాపారం గురించి వచ్చినట్టుగా వచ్చి

ఇక్కడ బ్రిటీష్ వారు భారత్ లోకి వ్యాపారం గురించి వచ్చినట్టుగా వచ్చి, ఆ తర్వాత మనకు తెలియని కుళ్ళు రాజకీయాలు చేసి, రాజుల ఐక్యతను దెబ్బతీసి, రాజుల మద్య చిచ్చు పెట్టి ఇద్దరి రాజుల మద్య యుద్దవాతావరణం సృష్టించి, ఆ యుద్ద మరణమృదంగం నుండి అధికారాన్ని చేజిక్కుంచుకున్న నీచ రాజకీయం అప్పటి బ్రిటీష్ వారికే చెల్లిందని చరిత్ర చెబుతున్నది. అలాంటి వారిపై పోరాటం చేయడం కాదు వ్యతిరేకించడం… వారిని తరిమికొట్టడం అయితే… మనలో మనకు సంపూర్ణ ఐక్యత రావడానికి ఏళ్ళ తరబడి కాలం పట్టింది కాబట్టి వారు దేశం విడిచి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది.

దొంగ దెబ్బ తీసేవారిని యోధులుగా పరిగణించారు. అలాంటిది యోధులను వేధించి, వేదించి ఉద్యమం నీరుగార్చే ప్రయత్నం చేసిన బ్రిటీష్ వారు చేసింది పోరాటం కాదు.. అరాచకం… అటువంటి అరాచకం దేశం నుండి తొలగించే ప్రక్రియలో ఎంతోమంది వీరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఏదైన దొడ్డిదారిన దేశానికొచ్చి నీచ రాజకీయాలతో అధికారం చేజిక్కుంచుకుని దేశాన్ని వారుకు నచ్చినట్టుగా పరిపాలించిన ప్రభుత్వం ప్రజలనుండి ఎదురైన తీవ్రవ్యతిరేకత కారణంగా మరలా పలాయనం బాట పట్టారు. అలా వారు వెళ్ళాక మనల్ని మనమే పాలించుకున్నాము.

అయితే చాలామంది అప్పటి బ్రిటీష్ పాలన యంత్రాంగ ప్రభావం చాలాకాలం కొనసాగిందనే అభిప్రాయం వస్తూ ఉంటుంది.

అటువంటి ప్రభావం ఏమిటనేది? పరిపాలించినవారికి అప్పటి పరిస్థితులు గమనించినవారికే తెలియాలి.

ఒకవేళ అలా ఏదైనా పరిపాలన కొనసాగి ఉంటే, అందులో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న మనకు బాధ్యత ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన ఘటనలను తలచుకుని ఇప్పుడు ఆలోచన చేయడం కన్నా దేశంలో ఎదురౌతున్న అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించడం మేలైన పని.

ఇంకా అప్పటి కాలంలో గతించిన చాలామంది మహానుభావుల జీవిత త్యాగాలను తక్కువ చేసి చూడడం ఏమాత్రం సబబు కాదు… కానీ అప్పటి నుండి ఎవరైనా తప్పును కంటిన్యూ చేసి ఉంటే మాత్రం అది వారు తెలిసి చేసి ఉంటే అందుకు నిదర్శనంగా వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ప్రజలు చాలాకాలం నాయకులను భరిస్తూ ఉంటారు. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు నాయకుడు మంచినే చేయడానికి ప్రయత్నించి సఫలీకృతులౌతారని…

పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి?

పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి? ఆస్తులు కాదు విలువలు అని ఉపరాష్ఠ్రపతి వెంకయ్యనాయుడుగారు అంటారు. నెల్లూరు వెంకటాచలంలో జరిగిన మీటింగులో వెంకయ్యనాయుడు గారు కేవలం ఆస్తులే కాదు సేవాదృక్పధం పిల్లలకు వారసత్వంగా అందించాలని అన్నారు.

దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం

దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం. ఒకేసారి రెండు భావనలు అంటే అద వ్యతిరేక భావనగా భావింపడుతుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆలోచన వివిధ కోణాలలో ఉండాలని అంటారు.

నిజాన్ని అబద్దం అల్లుకుని ఉంటే, అబద్దమునకు ఆర్భాటం ఎక్కువ కాబట్టి కళ్ళకు ముందుగా అబద్దమే కనిపించవచ్చును. చెవులకు ముందుగా అబద్దమే వినబడవచ్చును. పదే పదే అబద్దమే చూడడం లేదా వినడం వలన మననోటి నుండి కూడా అబద్దమే బహిర్గతం అవుతుంది. సహజంగా నిజమంటే ఇష్టపడేవారు కూడా అబద్దమునకు ప్రచారం కల్పించే అవకాశం ఉంటుంది. ఈ తీరున ఆలోచన చేస్తే ఒక విషయమును గానీ ఒక అంశమును గాని గుడ్డిగా నమ్మరాదు. నమ్మకం లేకుండా ఉండరాదు. మూలమేదో నిజమే అయ్యుంటుంది కానీ మన దరిచేరుతున్న విషయంలో ఏది మనం గ్రహిస్తున్నామనేది చాలా ప్రధాన విషయం.

ప్రకృతి అందమైనది. ప్రకృతి సహజ సౌందర్యంగా ఉంటుంది. అటువంటి ప్రకృతిలో అద్బుతమైన శక్తి ఉంది. అందమైన ప్రకృతిలోనూ వికృతి ఉంటుంది. వికృతి భయానకంగా ఉండే అవకాశం ఎక్కువ.

మన మహనీయుడు పొట్టి శ్రీరాములు

మన మహనీయుడు పొట్టి శ్రీరాములు.

కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు

పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు

భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.

శ్రీ శ్రీ మన మహనీయుడు

శ్రీ శ్రీ మన మహనీయుడు

ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.
‘తెలుగు సాహిత్యం’పై శ్రీశ్రీదే అసలైన ‘ముద్ర’. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద వైచిత్రికీ, కల్పనా చాతుర్యానికీ పెట్టింది పేరు. మళ్లీ ఆ రెంటినీ ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తరవాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనేలేదనిపించేంతలో- నేటికాలంలో ‘మహాప్రస్థానం’ మేరువై, జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూంటుంది.

మన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి

మన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి

నిరాడంబరంగా కనిపిస్తూ తెలుగు జీవనం గురించి అనర్గళంగా ఉపన్యసించే గొప్ప వక్త ‘సుందరాచారి. ఆయన రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనేది మన రాష్ట్ర గేయంగా స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన అనేక గ్రంథాలు రాశారు. తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహం ఉంది. ఇటువంటి గొప్పవారి చరిత్రలు తెలుసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని దిద్దుకోవాలి.

మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

మన మహనీయుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు.

సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం.

రేడియోకు “ఆకాశవాణి” అన్నపేరు పెట్టింది శర్మగారే. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. ‘నిగమశర్మ అక్క’, ‘నాచన సోముని నవీన గుణములు’, ‘తిక్కన తీర్చిన సీతమ్మ’, ‘రాయలనాటి రసికత’ అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. ‘పెద్దన పెద్దతనము’ అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు.

ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు భాషా కోవిదుడు, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి కీ.శే. పి.వి.నరసింహారావు. గొప్ప పండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు.

మన మహనీయుడు గుఱ్ఱం జాషువా

మన మహనీయుడు గుఱ్ఱం జాషువా

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు. నిత్య జీవితంలో కాని సాహితీ జీవితంలో గాని ఎన్ని కష్టాలు ఎదురైన ధీరత్వంలో నిబ్బరంగా ఎదుర్కోవడం ఆయన విజయ సంకేతం.

మన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు

మన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు

కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.
కందుకూరి వీరేశలింగం పంతులు
విశిష్టత

ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:

మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి
తెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి
విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు.

తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.

దామోదరం సంజీవయ్య మన మహనీయుడు

దామోదరం సంజీవయ్య మన మహనీయుడు

దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కరణల అమలు ఇలా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారు.

మన మహనీయుడు గురజాడ

సాహిత్య విమర్శకుడుగా గురజాడ
‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్‌ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది… నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు. నాటక ప్రక్రియలో, కవితా వ్యాసంగంలో, వ్యవహారిక భాషకు పునాది వేసిన గురజాడ విమర్శన మార్గాన్ని కూడా అనుసరించాడు. ప్రత్యేకించి విమర్శనాత్మక రచనలు చేయలేదు. కాని లేఖల్లో, ‘అసమ్మతి పత్రం’లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన హేతువాద విమర్శనా దృష్టికి ఉదాహరణగా నిలుస్తాయి. నాటకంలో, కవిత్వంలో ఆయన కళాత్మక నైపుణ్యం కనిపించినట్టే, విమర్శకి సంబంధించిన ఆయన శాస్ర్తీయ ఆధునిక దృష్టిని ఆ అభిప్రాయాలు తెలియచేస్తాయి.

భోగరాజు పట్టాభి సీతారామయ్య మన మహనీయుడు

భోగరాజు పట్టాభి సీతారామయ్య మన మహనీయుడు

భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన.

1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు. 1948లో జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం నాటికి కాంగ్రెస్‌ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్‌ కంపెని (1925), హిందు స్తాన్‌ ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు.

నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య.

మాడపాటి హనుమంతరావు మన మహనీయుడు

ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు : తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు తెలంగాణాలో గౌరవంలేని రోజుల్లో ‘మేం ఆంధ్రులం’ అని చెప్పగలిగిన ధైర్యశాలిగా మాడపాటి హనుమంతరావు కీర్తించబడ్డారు.

మన మహనీయుడు త్యాగరాజు శాస్త్రీయ సంగీత చక్రవర్తి

మన మహనీయుడు త్యాగరాజు శాస్త్రీయ సంగీత చక్రవర్తి

శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజు

త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.

సంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి.

మన మహనీయుడు గరిమెళ్ళ సత్యనారాయణ

“మాకొద్దీ తెల్ల దొరతనం” అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి… “దండాలు దండాలు భారత మాత” అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే ” దండాలు దండాలు భారత మాత ‘ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

ఎల్.వి.ప్రసాద్ మన మహనీయుడు

మన మహనీయుడు ఎల్.వి.ప్రసాద్

ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్‌.వి. ప్రసాద్‌ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసారు.

మన మహనీయుడు ఘంటసాల

ఘంటసాల వెంకటేశ్వరరావు గారు (1922, డిసెంబర్ 4 – 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారు.