ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే వ్యక్తి శరీరం ఆరోగ్యంగా ఉంటే, ఆ శరీరంతో కష్టపడి పని చేయగలడు. డబ్బు సంపాదించగలడు… తనను తాను పోషించుకుంటూ, తనపై ఆధారపడినవారిని పోషించగలడు… కానీ అనారోగ్యంతో ఉంటే, తను ఇతరులపై ఆధారపడాలి…. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట చద్దిమూట వంటిదే.
ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలామంది ప్రతిరోజూ నడవండి… అంటారు. వేళకు భోజనం చేయండి అని సలహాలు చెబుతూ ఉంటారు. రోజూ ఎనిమిది గ్లాసులు నీరు త్రాగండి అంటూ ఉంటారు. ఇంకా కొందరు అయితే కూరగాయల జ్యూస్ త్రాగండి అంటారు. పౌష్టికాహారం తీసుకోండి అంటారు. ఎన్ని చెప్పినా ముందు తెలియాల్సింది… అసలు అనారోగ్యానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు బదులు తెలియకుండా, ఏ ప్రయత్నం చేసినా తాత్కలిక ఉపశమనం కావచ్చును కానీ దీర్ఘకాలిక ఆరోగ్యం చెప్పలేరు.
అరుగుదల తక్కువగా ఉన్నప్పుడు, పౌష్ఠికాహారం తీసుకున్నా, అది అరగక ఇంకా ఇబ్బందులకు కారణం కావచ్చును. ఇంకా ఇప్పుడు ప్రధాన సమస్య కల్తీ…. ఆహార పద్దారముల కల్తీ కూడా జరుగుతుందని అంటారు. కావునా అనారోగ్యానికి కారణం కనిపెట్టి, తరువాత వైద్యుని సలహాతో రోగ తీవ్రతను తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండడానికి తగిన ఆహార నియమాలు, వ్యాయమాలు చేయడం వలన ఉపయోగం ఉండవచ్చని అంటారు. అసలు అనారోగ్యమునకు కారణం తెలుసుకోవడం ప్రధానమని అంటారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి!
వ్యక్తి అలవాట్లలో చెడు అలవాట్లు ఉంటే, చెడు అలవాట్లు అనారోగ్యమునకు కారణం కాగలవు. ఇలాంటి వారు ఖచ్చితంగా తమ చెడు అలవాట్లను ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవాలి. చెడు అలవాట్లను దూరం చేసుకోవడం వలన అనారోగ్యమునకు దూరం జరగడమేనని అంటారు.
మద్యం సేవించడం, ధూమపానం చేయడం వంటివి ప్రమాదకరమైన అలవాట్లు అంటారు. మద్యపానం వలన అనేక రకాలు అనారోగ్య సమస్యలు చెబుతారు. అలాగే ధూమపానం చేసేవారికి, అది పీల్చే ఎదుటివారికి కూడా అనారోగ్యం అంటారు. కావునా మద్యం సేవించడం, ధూమపానం చేయకపోవడం సర్వదా శ్రేయష్కరం.
ఇం ఏదో ఒక రుచిని ఎక్కువగా స్వీకరించడం కూడా అలవాటే అంటారు. అటువంటి అలవాటు ఎక్కువ అయితే, అది అనారోగ్యమునకు కారణం కాగలదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తీపి అంటే బాగా ఇష్టం. కాబట్టి అతను తీపి పదార్దములను అదే పనిగా ప్రతిరోజూ ఎక్కువగా తినడం వలన అతని మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని అంటారు. కావునా ఇష్టమైన రుచి విషయంలో నియంత్రణ కలిగి ఉండడం వ్యక్తి శ్రేయష్కరం అంటారు.
కొందరికి జంక్ పుడ్స్ ఇష్టం అయితే, వాటి వలన కూడా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును. కావునా ఏదైనా ఇష్టమయిన ఆహార పదార్ధమును స్వీకరించడంలో తగు నియంత్రణ ఉండడం శ్రేయష్కరం.
ఆరోగ్యంగా ఉండాలంటే కాయ కష్టం ఉండాలి అంటారు.
సౌకర్యాలు పెరిగే కొలది, కాయ కష్టం తక్కువగా ఉంటుంది. తక్కువగా కష్టం చేసే కాయం కష్టాలకు అలవాలం అవుతుందని అంటారు. కాయం అంటే శరీరం. రోజూ తగినంత శరీర శ్రమ ఉంటే, శరీరం పనితీరు మెరుగ్గా ఉంటుందని అంటారు.
రోజూవారీ కష్టజీవులకు కాయ కష్టానికి లోటు ఉండదు. ఎందుకంటే వారి ఆదాయానికి ప్రధాన వనరు వారి శరీరమే కాబట్టి. రోజూ తగినంత శ్రమ కలిగిన శరీరములో అరుగుదల సమస్యలు రాకపోవచ్చును. అయితే కల్తీ ఆహారం అయితే ఎవరికైనా హనికరమేనని అంటారు.
ఇక అధిక సమయం ఒక చోట కూర్చుని ఉండే పనులు వలన శరీరమునకు తగినంత శ్రమ లేకపోవడం అనారోగ్యమునకు కారణం అవుతుంటే, అటువంటివారు రోజూ తగినంత వ్యాయమం చేయడం లేదా తగినంత దూరం నడవడం మేలు అంటారు.
ప్రధానంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అనారోగ్యమునకు కారణం అయిన వాటి విషయంలో వైద్యుని సూచన మేరకు మెడిషన్ స్వీకరించడం. ఆ తరువాత అనారోగ్యమునకు కారణం అయిన ఆహార పదార్ధముల స్వీకరణంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం… తగినంత శరీరక శ్రమ ఉండేవిధంగా దైనందిన జీవనం సాగించాలని అంటారు. ఆరోగ్యం విషయంలో ప్రయోగాలు చేయకుండా మెరుగైన వైద్యం అందించే, వైద్యుని సలహాలు స్వీకరించాలి.
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు చూస్తే, కాలం కర్మ వెంటాడినా, వద్దని వారించినా, శ్రీరాముడి పట్టుదలే ప్రధాన కారణంగా కనబడుతుంది. శ్రీరామదృష్టి కోణం ధర్మమునే చూడడం వలన శ్రీరాముడు, ధర్మము ప్రకారం శ్రీరాముడు వనవాసం చేయడానికి సిద్దపడ్డాడనే భావిస్తారు.
అయోధ్యాధీశుడైన దశరధ మహారాజు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని సభలో సభికులతో చెబుతారు. సభలో అందరూ హర్షిస్తారు. శ్రీరామ పట్టాభిషేకానికి ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుసుకున్న దశరధుడు, శ్రీరాముడిని పిలుపించుకుంటాడు. పట్టాభిషేక విషయం శ్రీరాముడితో దశరధుడు స్వయంగా చెబుతాడు. శ్రీరాముడు సరేనంటాడు. పట్టాభిషేక మహోత్సవమునకు అయోధ్య ముస్తాబు అవుతుంది. అదే సమయంలో కైకేయి మనసులో మంధర మాటలు నాటుకుంటాయి.
మంధర మాటలకు ప్రభావితురాలు అయిన కైకేయి…గతంలో దశరధుడు తనకు ఇచ్చిన వరాలు కోరడానికి నిశ్చయించుకుంటుంది. తత్ఫలితంగా కైకేయి దశరధుడుని తనకు ఇచ్చన వరాలు తీర్చమని చెబుతూ….. శ్రీరామ వనవాసం కోరుకుంటుంది. భరతుడి పట్టాభిషేకం కోరుకుంటుంది. హతాశుడైనా దశరధుడు శ్రీరాముడుని అడవులకు పంపడానికి ఇష్టపడడు…
మరునాడు శ్రీరాముడు పట్టాభిషేకానికి సిద్దపడి దశరధుడి వద్దకు వస్తాడు… అయితే కైకేయి చెప్పిన మాటలు విన్న శ్రీరాముడు, అడవులకు వెళ్ళడానికి సిద్దపడతాడు. కాలంలో కర్మ ఒక్కరోజులో ఎలా తిరిగినా తండ్రి మాట నిలబడాలంటే, అడవులకు వెళ్ళడమే కర్తవ్యమని శ్రీరాముడు భావించాడు. కర్తవ్య నిర్వహణలో శ్రీరాముడు పట్టుదల గలవాడు… కాబట్టి దశరధుడు ఇచ్చిన వరాలు కారణంగా కైకేయి మాటనే, దశరధుడి ఆజ్ఙగా శ్రీరాముడు స్వీకరిస్తాడు.
ముఖ్యంగా శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
కైకేయికి దశరధుడు ఇచ్చిన వరాలు
మంధర వాటిని గుర్తు చేస్తూ కైకేయికి మాటలు నూరిపోయడం
దశరధుడు వరములుగా మంధర మాటలే మారడం
తన కోరికలే దశరధుడి మాటగా శ్రీరాముడుకి కైకేయి చెప్పడం
ప్రధానంగా కారణమైతే, శ్రీరాముడి కర్తవ్యతా దృష్ఠి… తండ్రి ఆజ్ఙను పాలించాలనే ధర్మదీక్ష… కారణంగా శ్రీరాముడు వనవాసం చేయడానికి కాలం కదిలించిన పరిస్థితులుగా చెబుతారు.
శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా ఉంటుంది… మంధర మాటలు వినడానికి వినసొంపుగా అనిపిస్తే, అటువంటి మాటలు వ్యక్తిని చులకన చేస్తాయి… కైకేయి విషయంలో అదే జరిగింది.
మంధర కైకేయి దగ్గర సేవకురాలు. కైకేయి దశరధుడి భార్యలలో ఒకరు. దశరధుడి కుమారులలో భరతుడు కైకేయి కుమారుడు, శ్రీరాముడు కౌసల్య కుమారుడు… శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగితే, కౌసల్య రాజమాత అవుతుంది. అదే భరతుడికి పట్టాభిషేకం జరిగితే, కైకేయి రాజమాత అవుతుంది. రాజమాత వద్ద సేవకిగా తన పరపతి బాగా పెరుగుతుంది… కాబట్టి కైకేయి రాజమాత కావడానికి మార్గం అన్వేషించడంలో మంధర ఆలోచనలు సాగుతాయి.
భరతుడుకి తల్లి అయిన కైకేయికి శ్రీరాముడంటే పరమప్రీతి… శ్రీరాముడికి పట్టాభిషేకం అంటే ఆమె సహజంగా ఎంతో ఆనందిస్తుంది… శ్రీరాముడుపై ఆమె చూపిన ఆదరణ అమెకు మంచి కీర్తిని తీసుకువస్తే, మంధర మాటలు విన్న తర్వాత ఆమె సహజ ప్రవర్తన ఆమెకు దూరం అయింది. తత్ఫలితంగా ఆమె శ్రీరామపట్టాభిషేకమును అడ్డుకుంది. శ్రీరాముడంటే ఇష్టపడే అందరూ, కైకేయిని ద్వేషించారు. అలా అపకీర్తిపాలు అయ్యింది… కైకేయి కేవలం మంధర మాటలు వినడం వలననే అంటారు. కాబట్టి మంధర వంటి వ్యక్తులు తమ స్వార్ధం కోసం తాము సేవ చేస్తున్నవారి ద్వారా అయినా తమ స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారనే వెల్లడి అవుతుంది. కాబట్టి కపటధారి మాటలు ఆలకించకుండా ఉండడం శ్రేయష్కరం అంటారు.
రామాయణం నాటి కాలమైనా, నేటి కాలమైనా వ్యక్తిత్వంలో మంధర పాత్ర స్వభావం చూస్తే మాత్రం తగు జాగ్రత్తగా వ్యవహరించమని పెద్దలు చెబుతారు. మంధర మాటలు వంటి మాటలు వింటే, చెడుకు చేరువ అవుతున్నట్టుగానే ఉంటుంది.
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి! నీటి ఎద్దడి ఎదుర్కొనేవారికి నీటి విలువ తెలుస్తుంది. వారు నీటిని పొదుపుగా వాడతారు. నీరు వాడడంలో నీటి వృధా కానివ్వరు. నీటి యొక్క ఉపయోగాలు బాగా గుర్తెరిగి ఉంటారు. నీటి వృధా చేసేవారికి నీటి విలువ తెలియకుండానే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు… ఎవరు ఎలా ఉపయోగించినా గాలి తరువాత మనిషి మనుగడకు నీరు చాలా చాలా అవసరం.
త్రాగు నీరు లేనిదే మనిషి మనుగడ లేదు… అలాగే భూమిమీద ఉండే జీవరాశికీ నీరే ఆధారం…. అటువంటి నీటిని మనిషిగా వృధా చేయడమంటే, సాటి జీవరాశికి ద్రోహం చేసినట్టేనని అంటారు. కావునా నీరు మనతో పాటు భూమిపై జీవించే జీవులకు కూడా ప్రాణాధారమేనని గుర్తించి… నీటిని శ్రద్దతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి…
భూమిపై నీరు లేకపోతే భూమిపైన జీవం ఉండలేదు. నీటికి ప్రధాన వనరులు వర్షం, మంచు… వర్షం వలన చెరువులు, కాలువలు, నదులలోకి నీరు వచ్చి చేరుతుంది.
అయితే ఇదే సందర్భంలో ఎక్కువగా నీరు వృథా జరుగుతోంది. జనాభా పెరుగుదల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. నీటిని వృధా చేయకుండా నీటిని పొదపుగా వాడుకోవాలి. మన నీటి అవసరాలను తీర్చుకోవడానికి మన ప్రయత్నం కూడా ఉండాలి. అందుకు వర్షపు నీటి సంరక్షణ పద్ధతి కీలకమైనది.
ఇష్టారీతిన నీటిని వాడడం అంటే, భవిష్యత్తు తరానికి నీటి వనరుల కొరత ఏర్పడానికి అవకాశం ఇచ్చనట్టే అవుతుందని అంటారు. నీరు లేకపోతే మనిషి మనుగడ అసాధ్యం కాబట్టి నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలి… నీటిని సంరక్షించుకోవాలి…
నీరు మనకు ప్రకృతి ప్రసాదించిన వరం…. వరమెప్పుడూ శ్రద్దతో స్వీకరించాలి కానీ నిర్లక్ష్య దోరణితో వనరుల యందు ప్రవర్తించరాదు.
నీటి యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.
నీటితోనే మన దినచర్య మొదలు అవుతుంది. నీరు శరీరంలో సరిపడా ఉండడం వలన, తలపోటు సమస్యలు అంతగా ఉండవని అంటారు.
శరీరంలో తగినంత నీరు గల వ్యక్తి చురుకుగా ఉండగలడని అంటారు. మనిషికి ఆరోగ్యపరంగా నీరు ఎంతో ఉపయోగపడతుంది. నీరు లేనిదే ఆచారమే లేదని అంటారు. మన దేశ సంప్రదాయంలో నీటి యొక్క గొప్పతనం అలా చెప్పబడుతుంది.
ఒక వస్తువును సాదారణ శుభ్రతకు నీటినే ఉపయోగిస్తాము… ఇంటిని శుభ్రపరచడానికి నీటినే ఉపయోగిస్తాము… నీరు లేకుండా శుచి, శుభ్రతలు సాద్యపడవు.
అభివృద్ధి చేయడానికి తలపెట్టే నిర్మాణాలకు వల్ల నీటి అవసరం ఎంతైనా ఉంటుంది.
ఇంట్లో నీటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది….
కాబట్టి నీటి పొదుపుకు కృషి చేయాలి….. అందుకు నీటిని వృధా కాకుండా నీరుని పొదుపుగా వాడుకుంటూ… నీటి నిల్వ పద్దతులు పాటించాలి. జల సంరక్షణ అంటూ చేపట్టే కార్యక్రములలో పాల్గొంటూ నీటి పొదుపు ఆవశ్యకతను నలుగురికీ తెలియజేయాలి…. నీటి ప్రాముఖ్యతను తెలుపుతూ, నీటి సంరక్షణ కొరకు విధానాల గురించి తెలుసుకోవాలి. తెలియజేయాలి… నీటి సంరక్షణ పద్దతులు పాటించాలి.
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు కొన్నింటిని…. మంచి విద్యార్ధిగా ఉన్నప్పుడు మంచి లక్షణాలు ఉండడం చేత ఉపాధ్యాయుని వద్ద మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా ఉపాధ్యాయుడు మంచి లక్షణాలు గల విద్యార్ధులకు పాఠాలు చెప్పడంలో ఆసక్తి చూపుతారు. అంటే ఒక విద్యార్ధికి మంచి లక్షణాలు ఉంటే, అవి తోటివారికి కూడా సాయపడతాయి… అనుకరణలో విద్యార్ధులు ఒకరిని చూసి మరొకరు చేస్తూ ఉంటారు… కాబట్టి మంచి లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
విద్యార్ధి తమ వైఖిరి పట్ల తాము సానుకూల దృక్పధంతో ఉండాలి.
లక్ష్య సిద్ది కోసం కృషి చేయడం
పరిశీలనాత్మక దృక్పధం
నేర్చుకునే అంశాల పట్ల శ్రద్దతో వ్యవహరించడం
స్వీయ ఆలోచనతో పనిచేసే సామర్ధ్య పెంపొందించుకోవడం
సాధనలో పట్టుదల కలిగి ఉండడం
సమయ పాలనలో క్రమశిక్షణ తప్పకుండా ఉండడం
మంచి దస్తూరి కొరకు సాధన చేయడం
అవసరమైన ఆంగ్లభాషలో పట్టు సాధించడం
కలిసిమెలిసి వ్యవహరించడం
నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం
విద్యార్ధి తమ వైఖిరి పట్ల తాము సానుకూల దృక్పధంతో ఉండాలి.
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
ఎప్పుడూ తనపై తాను నమ్మకం కోల్పోయి ఉండకూడదు. తనపై తనకు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడూ టీచర్ ముందు నిలబడితే, విశ్వాసంతో నిలబడే ప్రయత్నం చేయాలి…. వినయంతో ఉంటూ, తనకు తెలిసిన పాఠ్య విషయం గురించి, తనతోటి వారి ముందు నిర్భయంగా బహిర్గతం చేయగలగాలి. తనమీద తనకున్న నమ్మకం మంచి లక్షణంగా పరిగణింపబడుతుంది.
లక్ష్య సిద్ది కోసం కృషి చేయడం
నేర్చుకునే వయస్సులోనే నేర్చుకుంటున్న చదువులో ఒక లక్ష్యం ఉండాలి. ఆయొక్క లక్ష్యం సాధించడానికి కృషి చేయాలి…. అలా చదువులో ఏర్పరచుకున్న చిన్న చిన్న లక్ష్యాలు నెరవేర్చుకోవడం వలన జీవితంలో అతి పెద్ద లక్ష్యం నిర్ధేశించుకునే సమయానికి సరైన లక్ష్యం ఏర్పడే అవకాశం ఎక్కువ. కావునా నిర్ధేశించుకన్న లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. లక్ష్యం ఉండడం మంచి లక్షణంగా పరిగణింపబడుతుంది.
పరిశీలనాత్మక దృక్పధం
పరిశీలన చేయడం వలన విషయాలపై అవగాహన పెరుగుతుంది. కేవలం విని ఊరుకోవడం వలన జ్ఙానం వృద్దికాలు… పాఠ్యపుస్తకంలో ఉండే అక్షరాలే మీ మెండులోనూ ఉంటాయి. దాని వలన ఫలితం పరీక్షలలో ఆ అక్షరాలను వ్రాయడం వరకే పరిమితం… కానీ పరిశీలనాత్మక దృక్పధం వలన విషయ విజ్ఙానం వృద్ది చెందుతుంది. కొంగ్రొత్త విషయావిష్కరణకు పరిశీలనాత్మక దృష్టి నాంది… అంటారు. విచారించే గుణం మంచి లక్షణంగా పరిగణింపబడుతుంది.
నేర్చుకునే అంశాల పట్ల శ్రద్దతో వ్యవహరించడం
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
చదివిస్తున్నారు కాబట్టి స్కూలుకెళ్ళడం… స్కూలుకొచ్చాము కాబట్టి క్లాసులో కూర్చోవడం. క్లాసులో కూర్చున్నాము కాబట్టి పాఠాలు వినడం… విన్నాము కాబట్టి పరీక్షలలో రాయడానికి ప్రయత్నించడం… ఇది యాంత్రికం… కానీ ఉత్తమ విద్యార్ధి మాత్రం స్కూలుకు శ్రద్దతో వస్తాడు… నేర్చుకోవాలనే తపనతో క్లాసులో కూర్చుంటాడు. వింటున్న పాఠాలను ఆసక్తితో వింటాడు. చదివేటప్పుడు శ్రద్ద పెడతాడు… నేర్చుకునే విషయంలో తనకొక మంచి లక్ష్యం నిర్ధేశించుకుంటాడు…. శ్రద్ద వలన మంచి లక్ష్య సిద్ది ఏర్పడుతుంది. శ్రద్దాసక్తులు మంచి లక్షణంగా పరిగణింపబడుతుంది.
స్వీయ ఆలోచనతో పనిచేసే సామర్ధ్య పెంపొందించుకోవడం
ఒకరు చెబుతుంటే, వినాలి కానీ తిరస్కరించకూడదు… ఒకరు చెబుతుండగా అనుసరణీయంగా పనులు చేయడం కన్నా స్వయంగా ఆలోచించి స్వీయశక్తితో పనులు చేయడానికి విద్యార్ధి దశ నుండే ప్రారంభించాలి. అంతేకానీ ఒకరి పర్యవేక్షణలో పదే పదే పనులు చేయడానికి అలవాటు పడకూడదు. స్వశక్తితో కార్యాచరణ మంచి లక్షణంగా పరిగణింపబడుతుంది.
సాధనలో పట్టుదల కలిగి ఉండడం
పట్టుదలలో విక్రమార్కుడిలాగా ఉండాలని అంటారు. నిర్ధేశించుకున్న లక్ష్యం చేరడంలో అలసత్వం ప్రదర్శించకుండా ఉండాలి. లక్ష్యం చేరడంలో ఆటంకాలు ఏర్పడినా, పట్టుదలతో ప్రయత్నించాలే కానీ నీరుగారిపోకూడదు… పట్టుదల ఉంటే, సాధ్యం కానిదేదిలేదని అంటారు. ప్రయత్నలోపం లేకుండా పట్టుదలతో సాధన చేయాలి. పట్టుదల మంచి లక్షణంగా పరిగణింపబడుతుంది.
సమయ పాలనలో క్రమశిక్షణ తప్పకుండా ఉండడం
విద్యార్దిగా ఉన్నప్పుడే సమయాన్ని సరిగ్గా వినియోగంచుకోవడం అలవాటు అవ్వాలి… లేకపోతే కార్యములందు భంగపాటు తప్పదని అంటారు…. కావునా నిర్ధేశించుకున్న సమయానికి చదువుకోవడం. నిర్ధేశించుకున్న సమయానికి ఆడుకోవడం, నిర్ధేశించుకున్న సమయానికి తినడం, నిర్ధేశించుకున్న సమయానికి నిద్రించడం, నిర్ధేశించుకున్న సమయానికి మేల్కోవడం… క్రమం తప్పకుండా స్కూలుకు సమయానికి చేరుకోవడం… ఇలా సమయపాలన విషయంలో ఎంత క్రమశిక్షణతో ఉంటే, అది జీవితంలో అంత సహాయకారి అవుతుందని అంటారు. సమయపాలన మంచి లక్షణంగా పరిగణింపబడుతుంది.
మంచి దస్తూరి కొరకు సాధన చేయడం
రైటింగ్ బాగుంటే, మనం వ్రాసినది అందరికీ అర్ధం అవుతుంది. రైటింగ్ బాగోకపోతే, మనం వ్రాసినది మనకు కూడా అర్ధం కాకపోవచ్చును. రైటింగ్ బాగుండే, పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు రైటింగ్ స్కిల్స్ డవలప్ చేసుకోవాలి.
అవసరమైన ఆంగ్లభాషలో పట్టు సాధించడం
ఇప్పుడు ఆంగ్లభాష తప్పనిసరి. కారణం ప్రపంచమంతా ఆన్ లైన్ ద్వారా ఒక ఊరు మాదిరిగా మారిపోయింది… ఒకప్పుడు వేరు ప్రాంతానికి వెళ్ళినప్పుడే, అక్కడి భాషతో అవసరం ఉంటే, ఇప్పుడు ఉన్న చోట నుండే ఇతర భాషలు మాట్లాడేవారితో మాట్లాడవలసిన అవసరం ఏర్పడుతుంది. అందులో ముఖ్యంగా ఆంగ్లభాష ప్రధానంగా ఉంటుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ మెంటు ఉండాలి.
కలిసిమెలిసి వ్యవహరించడం
ముభావంగా ఉండడం మంచి పద్దతి కాదని అంటారు. అందువలన మనసు కూడా అలజడిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ తోటివారితో స్నేహంగా మెసులుకుంటూ ఉండడం శ్రేయష్కరం అంటారు. కలిసిమెలిసి ఉండడం వలన ఒకరి జ్ఙానం మరొకరికి చేరే అవకాశం కూడా ఉంటుంది. తెలియని విషయాలు కూడా సరదాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కలిసిమెలిసి వ్యవహరించడం మంచి లక్షణంగా పరిగణింపబడుతుంది.
నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం
నాయకుడు ముందుండి మార్గదర్శకుడుగా నిలబడతాడు. అలాంటి నాయకత్వ లక్షణాలు విద్యార్ధి దశ నుండే అలవరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో పనిచేసే చోట కార్యనిర్వహణ సామర్ధ్యం పెరగడానికి నాయకత్వ లక్షణాలు కీలకం కాబట్టి చదువుకునే వయస్సులోనే మార్గదర్శకుడిగా మారే ప్రయత్నం చేయాలి.
ఇలా వివిధ రకాలుగా మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు చెబుతూ ఉంటారు. పై లక్షణాలన్నీ అందరికీ అబ్బుతాయని చెప్పలేరు… కానీ ప్రయత్నిస్తే అవి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయత్నించడానికే కదా విద్యార్ధి దశ… ఆ దశలోనే మంచి లక్షణాలు అలవరచుకోవడం వలన జీవితంలో ఉన్నత స్థితికి చేరే అవకాశాలు ఉంటాయని అంటారు.
కుటుంబ వ్యవస్థను అర్ధం చేసుకోవాలి. ముందుగా మనకున్న కుటుంబం గురించి తెలుసుకోవాలి. మన కుటుంబంలో పూర్వీకుల ఆచార వ్యవహారాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవారిపై ఎందుకు గౌరవం కలిగి ఉండాలో, తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి నమ్మకం… ఒకరి స్వభావం గురించి ఒకరికి అవగాహన కలిగి ఉంటూ, ఒకరిపై ఒకరికి సదభిప్రాయం కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనం ఏం చేయాలో మనకొక ఆలోచన పుడుతుంది.
కుటుంబంలో సభ్యుల వలన ప్రయోజనం పొందుతూ, వారి గురించి ఆలోచన చేయక, ఇతర ఆలోచనల వైపు దృష్టిసారిస్తూ, ఆసక్తికి అనుగుణంగా మెసలుకోవడం మొదలుపెట్టే వ్యక్తులు కుటుంబంలో ఉంటే, అటువంటి వారి ఆలోచనలు కుటుంబ సభ్యుల ఐక్యతపై ప్రభావం చూపుతుంది.
కలసి ఉండే కుటుంబంలో ఒక సభ్యుడి ఆలోచన, మిగిలిన కుటుంబ సభ్యులపై ఉన్నప్పుడు, ఆ కుటుంబ దృక్పధం ప్రకారం ఇతని గురించిన ఆలోచన మిగిలిన సభ్యులకు ఉంటుంది. అంటే ఈ విధమైన దృక్పధం వలన ఒకరి గురించి ఒకరికి పట్టింపు ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఆప్యాయత ఉంటుంది. అయితే ఇక్కడ అహంకరించడం అనే ఆలోచన మొలకెత్తితే మాత్రం.. కుటుంబ సభ్యుల మద్య సంబంధాలు మారతాయి.
అంటే కుటుంబ వ్యవస్థ బాగుగా కొనసాగాలంటే, ముందుగా మనమే మన కుటుంబ సభ్యుల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి…. అలా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించేటప్పుడు… సదరు సభ్యుల మంచి విషయాలనే మననం చేయాలి…. అప్పుడే వారిపై సదభిప్రాయం త్వరగా ఏర్పడుతుంది. ఎంత త్వరగా సదభిప్రాయం కుటుంబ సభ్యులపై ఏర్పడితే, అంత త్వరగా కుంటుంబంతో మమేకం కావచ్చును.
అలా కుటుంబంలోని అందరిపై సదభిప్రాయం ఏర్పరచుకోవడంతో, వారు సూచించే సూచనలు మనలో ఆలోచనలను పుట్టిస్తాయి… వారు చెప్పే మాటలలో ఆంతర్యం అవగతమవుతుంది… అదే కుటుంబ సభ్యులపై సదభిప్రాయం లేకపోతే, కుటుంబ సభ్యుల ఉనికి కూడా నచ్చకపోవచ్చును…
కాబట్టి కుటుంబ వ్యవస్థ చక్కగా కొనసాగాలంటే, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కుటుంబంలో ఏర్పడడానికి కృషి చేయాలి… ఎట్టి పరిస్థితులలోనూ మనస్పర్ధలు పొడచూపకుండా, జాగ్రత్తపడడమే కుటుంబ వ్యవస్థ బాగుపడడానికి మూలం అవుతుంది.
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు… అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు… అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా లభిస్తుంది.
చేసిన మేలు మరిచేవాడిని కృతఘ్నుడు అంటాము… కృతఘ్నుడికి క్షమా బిక్షలేదని అంటారు. మరి చెట్టు మానవజాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి… కాబట్టి చెట్లకు నీరు అందించి వాటిని సంరక్షించాలి. చెట్లను తొలగించడము అంటే, మన ముప్పుకు మనమే కారణం అవుతున్నట్టేనని అంటారు.
చెట్లను రక్షించుకుంటూ మన భవిష్యత్తు తరానికి ఆహ్లాదకరమైన ప్రకృతిని అందించడానికి మనమంతా కృషి చేయాలి…. లేకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నవారమవుతాము…
ఎదిగిన కొడుకు ఎలా చేతికందివస్తాడో… అలాగే పెద్ద పెద్ద వృక్షాల వలన ప్రకృతికి మేలు చేస్తూ, మనకు శ్రేయస్సు చేయగలవు… కావునా చెట్లను తొలగించడంలో తొందరపాటు పనికిరాదు.
ఒకవేళ మానవాళి ప్రయోజనాల దృష్ట్యా ఒక చెట్టును తొలగించాల్సిన ఆగత్యం ఏర్పడితే, ఆ చెట్టు ఉన్న ప్రాంతంలో కొన్ని మొక్కలను పెంచి, పోషించే బాద్యతను తీసుకోవాలి… అవి మొక్కగా బ్రతికి, ఎదగడానికి అనువుగా ఉన్నప్పుడు చెట్టును తొలగిస్తే, కొంతకాలానికి ఆదే ప్రాంతంలో నాటిన మొక్కలు మరి కొన్ని చెట్లుగా అవతరించవచ్చును… తద్వారా ప్రకృతి పర్యావరణం బాగుంంటుంది.
అంతేకానీ మన సౌకర్యం కోసం చెట్లను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తే, ఒకనాటికి మానవాళికి అవసరమయ్యే ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే, అది మానవాళి మనుగడకు తీవ్ర అంతరాయం….
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు ఎంతో మేలు జరుగుతుందని తెలుసుకోవాలి… తెలియజేయాలి… చెట్ల వలన మనిషి పొందుతున్న ప్రయోజనాలు ఏమిటో అందరికీ తెలియజేయాలి… చెట్లను కాపాడుకోవాలనే కాంక్ష అందరిలోనూ పుట్టే విధంగా చెట్ల సంరక్షణకు పూనుకోవాలి.
లోకంలో అనుసరించే గుణం ఉంటే, మంచి పనులను ఎక్కువమంది చేస్తే, తక్కినవారు మంచిపనులే చేయడానికి పూనుకుంటారు… మనకు చెట్లను కాపాడుకోవడం వలన పర్యావరణం రక్షించుకొన్నవారమవుతాం… కావునా ”చెట్లను కాపాడండి” అనునది నినాదం కావాలి…
మన మహనీయుడు వేమన యోగి, తన పద్యములతో వ్యక్తులను ప్రశ్నించాడు. సూటిగా ప్రశ్నించే భావములు వేమన పద్యాలలో ఉంటాయి.
యోగి వేమన సుమారు 1652 – 1730 మధ్య కాలములో జీవించారిన చరిత్ర. కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని చెబుతారు. వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలోకి వచ్చాయి.
లోకం తీరు గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి స్వభావం గురించి ఆలోచించే విధంగా వేమన పద్యాలు ఉంటాయి.
వేమన పద్యం విననివారుండరు. అంతగా తెలుగులో మన మహనీయుడు వేమన పద్యాలు ప్రసిద్దికెక్కాయి.
ఎటువంటివారికైనా అవగతమయ్యే రీతిలో వేమన పద్యాలు ఉంటాయి. సాదారణ పదాలే అయినా ఆలోచిస్తే ఏదో తత్వ బోధ కనబడుతుందని అంటారు.
ఎక్కువగా వ్యక్తి చిత్తశుద్ది, ఆచరణ వంటి విషయంలో వివిధ పద్యాలు వ్యక్తిని ఆలోజింపజేస్తాయని ప్రతీతి.
ఉప్పు – కర్పూరం రెండూ కూడా ఒకే రంగులో ఉంటాయి కానీ వాటి రుచులు చూస్తే వేరుగా ఉంటాయి… అలాగే పురుషులు – పుణ్య పురుషులు వారి మనసులు తరిచి చూస్తేనే తెలిసేది వారి అంతరంగం ఎలాంటిదో….
గోవు పాలు గరిటెడు చాలు ఉపయోగం… మేక పాలు కుండనిండా ఉన్నా వృధా… ఇలా చాలా పద్యాలు జీవిత సత్యాలను తెలియజేస్తూ ఉంటాయి.
యోగి వేమన పద్యాలు మదిలో మెదులుతూ ఉండడమంటే, ఆ వ్యక్తి మదిలో తాత్విక చింతన ఉంటుందని అంటారు.
ఇంతటి మహత్తు ఉన్న పద్యాలు చెప్పిన యోగి వేమన… పూర్వ భాగం చాలా విలాసవంతమైన జీవితం గడిపారు. ఇంకా స్త్రీలోలుడు… కానీ ఆకస్మాత్తుగా వదినగారి మాటల ప్రభావం, వేశ్య ప్రవర్తన వేమనలో పెను మార్పుకు కారణం అవుతాయి… వైరాగ్యం పొందిన వేమన శివానుగ్రహం చేత జ్ఙానిగా మారి, లోకానికి ఉపయోగపడే సద్భావనలు తెలియజేసే తెలుగు పద్యాలు ఎన్నో పలికారు.
మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన తల్లిదండ్రులు.
1962 లో తొలిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రివర్యులు గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రివర్యులుగా పదవులు నిర్వహించారు. ఆ తరువాత 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఎటువంటి గ్రూపులు లేని పివి నరసింహరావుగారు అందరికీ ఆమోదయోగ్యులుగా
పి.వి. నరసింహారావుగారు 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకునే ఉద్దేశ్యంతో ఉన్న ఈయనకి ప్రధానమంత్రి పదవి వరించింది. రాజీవ్ గాంధీ హఠాన్మరణంతో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఎదురైంది. గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండే కాలంలో తనకంటూ ప్రత్యేకంగా ఎటువంటి గ్రూపులు లేని పివి నరసింహరావుగారు అందరికీ ఆమోదయోగ్యులుగా కనబడ్డారు.
ఈయన ప్రధానమంత్రి పదవిని అలంకరించడంతో, నంధ్యాల లోక్ సభ అభ్యర్ధి చేత రాజీనామా చేయంచి, అక్కడ లోక్ సభ అభ్యర్దిగా పివి నరసిహారావుగారు నిలబడ్డారు. తెలుగువారు అనే గౌరవంతో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావుగారు తమ పార్టీ తరపున ఎవరిని ఎన్నికలలో నిలబెట్టలేదు.
మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల కాలంపాటు పాలించిన ప్రధానిగా
మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల కాలంపాటు పాలించిన ప్రధానిగా పివి నరసింహారావు గారు కీర్తి గడించారు. ఈయన ప్రధానిగా ఉన్న కాలంలోనే ఆర్ధిక సంస్కరణలు జరిగాయి. అప్పటి ఆర్ధికమంత్రికి మన్మోహన్ సింగ్ కు అవసరమైన స్వేచ్ఛను ఇచ్చి, భారతదేశం అంతర్జాతీయంగా ఆర్ధిక శక్తిగా పుంజుకోవడానికి బాటలు వేశారని కీర్తి గడించారు.
అణు పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత పివి నరసింహారావుగారిదేనని అంటారు.
మన తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడైన పివి నరసింహారావుగా పలు భాషలలో ప్రవేశం ఉంది. ఈయన జర్నలిస్ట్, రచయిత కూడా.
కానీ ఈయన మరణానికి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత తగు గౌరవం పొందలేదనే విమర్శ ఉంది. ఈయన 2004 సంవత్సరంలో డిసెంబర్ 23న పరమపదించారు.
పావురం గురించి తెలుగులో వ్యాసం ! ప్రధానంగా తెల్లని పావురం శాంతికి సంకేతంగా చెబుతారు. పావురం ప్రధానంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్నవాటిని కూడా ఇవి గుర్తించగలవు. 16గంటలు అవిశ్రాంతంగా ఆకాశంలో ఎగురగలవు. అందుకే వీటిని పూర్వపు కాలంలో సందేశాలు ఒక ప్రాంతం నుండి మరొక సుదూర ప్రాంతానికి పంపడానికి ఉపయోగించేవారు.
పావురాలు తలను పైకెత్తకుండానే ఆహారాన్ని స్వీకరించగలవు. కానీ ఇతర పక్షలు పావురం మాదిరి ఆహారాన్ని స్వీకరించలేవని అంటారు. ఇంకా పావురం గుండె నిమిషానికి ఆరువందల సార్లు కొట్టుకుంటుందట.
వీటి పిల్లలు చాలా అరుదుగా కనబడతాయి. పావురం గొంతులో సంచివలె ఒక గ్రంధి ఉంటుంది. అందులో పాలవలె ఉండే ద్రవం ఊరుతుంది. ఆ ద్రవాన్ని పిల్లలో నోటిలో వేయడం వలన పిల్ల పావురాలు జీవిస్తాయి. సుమారు రెండు నెలల కాలం తర్వాత పిల్ల పావురాలు ఆకాశంలోకి ఎగురగలవని అంటారు.
పావురం గురించి చెప్పే విశిష్ట గుణం
ఆడ పావురం గానీ మగ పావురం గానీ తమ జీవితమంతా ఒక్క పావురముతోనే జతకడతాయి. ఒకవేళ మగపావురం తోడు అయిన ఆడ పావురం చనిపోతే, మగపావురం మరొక ఆడపావురము కొరకు చూడదని అంటారు.
పావురం ద్వారా సందేశం పంపడమే కాదు. పావురం కధ ద్వారా దాన గుణం గురించి గొప్పగా చెప్పే శిబి చక్రవర్తి గాధ కూడా మనకు ప్రాచుర్యంలో ఉంది.
కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు.karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు.
ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం కాచచ్చు లేక సమావేశం ఏర్పాటు గురించి కావచ్చును. లేదా ఏదైనా అంశములో ప్రజలలో అవగాహన కొరకు కూడా కరపత్రం ప్రచురిస్తూ ఉంటారు.
పాంప్టేట్ అంటే తెలుగులో కరపత్రం ఏదైనా సందర్భం గురించి తెలుపుతూ ఒక ఆహ్వాన లేఖ మాదిరిగా ఉండవచ్చును. లేకా ఒక అంశమును గురించి సమగ్రంగా తెలియజేసే సమాచార పత్రంగా కూడా ఉండవచ్చును. ఏదైనా సందర్భమును, దాని ఆవశ్యకతను కరపత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
అంటే కరపత్రం అంటే వ్యాసం వ్రాసినట్టుగా ఉండవచ్చును. అయితే అందులో ఆహ్వానిస్తూ ఉండవచ్చును. లేదా ఒక అంశమును గురించి ప్రచారముగా కూడా ఉండవచ్చును.
పాంప్లేట్ కరపత్రం ఎలా రాయాలి?
కరపత్రంలో ముందుగా టైటిల్ ఎంపిక చాలా ముఖ్యం. ఇది కరపత్రంలోని సారాంశమును ప్రతిబింబించేలాగా ఉండాలి.
అంశమునకు ఎంచుకునే టైటిల్ అంటే తెలుగులో శీర్షిక… కరపత్రం యొక్క ఉద్దేశ్యమును తెలియజేసే విధంగా ఉండాలి. అందువలన కరపత్రం చదివేటప్పుడు దానిని మరింత లోతుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ టైటిల్ అంటే శీర్షిక వాడుక పదాలతో కలిసి ఉండడం వలన కరపత్రంపై ఆసక్తి కూడా పెరుగుతుంది.
కరపత్రమునకు ఆయుష్షు ఉంటుంది.
ఇక ప్రతీ కరపత్రానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఒక తేదీ నుండి మరొక తేదీ తర్వాత ఆ కరపత్రము చరిత్రలో సంఘటనకు ఆధారము మాత్రమే. అంటే ఒక షాప్ ఓపెనింగ్ కు ఒక కరపత్రం అంటే ఇంగ్లీషులో పాంప్లేట్ తయారు చేయబడితే, షాప్ ఓపెన్ అయిన కొన్నాళ్ళకు ఆ కరపత్రము గతించిన సంఘటనకు సాక్ష్యం మాత్రమే.
కాబట్టి కరపత్రం ఇంగ్లీషులో పాంప్లేట్ వ్రాసేటప్పుడు టైటిల్ కు ఎగువ కానీ దిగువ కానీ తేదీ వ్రాయడం ప్రధానం…. లేదా తేదీని ఉంటంకిస్తూ… ఒక హెడ్ లైన్ ప్రధానం.
టైటిల్ వ్రాశాకా ఆ టైటిల్ ని క్లుప్తంగా వివరిస్తూ, సందర్భమును తెలియజేయడం ప్రధానం.
క్లుప్త వివరణ తర్వాత టైటిల్ ను బట్టి ప్రధానాంశాలు అప్పటి సందర్భమును బట్టి కొన్ని పేరాలు గా విభజిస్తూ…. సమగ్ర వివరణ ఉండాలి. ప్రధానంగా టైటిల్ ని బట్టి సందర్భము యొక్క ఉద్దేశ్యము, దాని ప్రధాన్యత ఉండాలి.
సామాజికపరమైన అంశము అయితే, కరపత్రములో సంబంధిత శీర్షికను బట్టి విషయము యొక్క ఆవశ్యకత, దాని యొక్క భవిష్యత్తు పరిణామాలు, సమాజంపై సంబంధిత విషయము యొక్క ప్రభావం అన్ని సమగ్రంగా తెలియజేయాలి.
ఆహ్వాన కరపత్రం అయితే ప్రజలను ఆహ్వనిస్తూ ముగించాలి. లేదా సామాజిక అంశము గురించి అవగాహన కరపత్రం అయితే, విషయమును పరిశీలించమని కోరుతూ ముగించాలి.
ప్రధానంగా కరపత్రము యొక్క డిజైన్ ఆకట్టుకునే విధంగా కూడా ఉండాలి.
మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది.
చూసి నేర్చుకునే విద్యైనా, చదివి తెలుసుకునే విద్య అయినా సరే గురువు ద్వారా నేర్చుకునే విద్యకు రాణింపు ఉంటుంది. మంచి గుర్తింపుతో బాటు మనోవిద్య కూడా అలవరుతుంది. ప్రధానంగా గురువు వలననే వ్యక్తి మనసు సంస్కరింపబడుతుందని అంటారు.
ఇంకా చెప్పాలంటే, గురువులేని విద్య గుడ్డి విద్య అని కూడా అంటారు. అంటే జీవితంలో ఏదైనా విద్య నేర్చుకోవడానికి గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో తెలియబడుతుంది.
ప్రకృతిలో సాధన చేస్తూ ప్రకృతి శక్తులను వినియోగించుకోవచ్చును… కానీ గురువు లేకుండా చేసే సాధన వలన వ్యక్తి స్వీయనియంత్రణ తక్కువగా ఉంటుంది… స్వేచ్చ ఎక్కువై అది వ్యక్తి పతనానికి నాంది కాగలదు. అదే గురువు ద్వారా విద్యను అభ్యసిస్తే, ప్రకృతి శక్తిని ఎంతమేరకు ఏవిధంగా వినియోగించుకోవాలో ఒక అవగాహన కలిగి ఉండే అవకాశాలు ఎక్కువ.
వ్యక్తి పట్టుదలకు, సాధించాలనే తపనకు గురువు మార్గదర్శకం తోడైతే, ఆ వ్యక్తి ఉత్తమ స్థాయికి చేరగలడని అంటారు. గురువు విషయంలో పరమాత్ముడైన భగవానుడు కూడా ఒక విద్యార్ధిగానే ఉన్నాడు… కానీ స్వీయ శక్తి ప్రదర్శనకు పూనుకోలేదు.
శ్రీమహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించాకా, కుల గురువు దగ్గర శాస్త్రపరమైన విషయాలు, గురువు విశ్వామిత్రుని దగ్గర ధనుర్విద్యా రహస్యాలు గ్రహించాడు. అంతేకాదు కేవలం తండ్రి లేక గురువు ఆదేశాల ప్రకారమే శక్తిని ప్రయోగించాడు కానీ తన ప్రతాపాన్ని చూపించడానికి, ప్రగల్భాల కోసం విద్యను ప్రదర్శించలేదు. గురువులు వశిష్ఠుడు, విశ్వామిత్రుల ప్రభావం శ్రీరామచంద్రుని జీవితంలో ఎంతగానో ఉందని పండితులు చెబుతారు.
బాల్యంలోనే ఆశ్చర్యకరమైన లీలలను ప్రదర్శించిన జగద్గురు శ్రీకృష్ణపరమాత్మ సైతం గురువు సాందీపుని వద్ద విద్యను అభ్యసించాడు. కాలాన్ని బట్టి శక్తిని ప్రయోగించాడు. ఇంకా కురుక్షేత్ర సమయంలో యుద్ధం చేయించాడు కానీ చేయలేదు….
ఎంతటివారైనా కాలంలో మనసును నియంత్రించడానికి స్వశక్తి చాలనప్పుడు గురువుగారి మాటలే వేదవాక్కులుగా ఉంటాయని అంటారు. గురువుగారి మాటలు తలచుకోవడంతోనే తనను నియంత్రించుకునే తత్వం మనసులో పుడుతుందని పెద్దల అభిప్రాయం.
వ్యక్తి జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది.
కుటుంబపెద్ద తండ్రి గురువుగా ఉండడం చేతనే, కుటుంబంలో పిల్లలు క్రమశిక్షణకు అలవాటు పడతారు. అక్కడి నుండి విద్యాలయం చేరిన విద్యార్ధులు సహవాసులతో కూడా క్రమశిక్షణతో మెసులుతున్నారంటే, అందుకు కారణం విద్యాలయంలో గురువుల శిక్షణే కారణమంటారు.
ఇంకా కార్యలయములో కూడా ఒక ఉద్యోగికి అతనికంటే సీనియరు ఒక గురువుగా ఉంటే, ఆ ఉద్యోగి సీనియర్ మార్గదర్శకాలను అనసరిస్తూ, కార్యలయములో కూడా తన ఉత్తమ పనితీరు ప్రదర్శించగలడు. ఇలా ఎక్కడ చూసిన వ్యక్తి జీవితంలో గురువు ప్రాముఖ్యత చాలా ఉంటుందని చెప్పవచ్చును.
ఒకవ్యక్తికి బాల్యంలో తల్లిదండ్రులు, విద్యాలయంలో ఉపాధ్యాయులు, సమాజంలో తనకంటే వయస్సులో పెద్దవారు, ఆఫీసులో అనుభవంగలవారు ఎందరో గురుత్వ స్వభావంతో వ్యవహరిస్తూ ఉండడం వలననే వ్యక్తి తన జీవన గమ్యం చేరడంలో కృతకృత్యుడు అవుతాడు అని అంటారు.
అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షత్తు పరబ్రహ్మ అంటూ మనకు శ్లోకము కూడా ప్రసిద్ది.
గురువు మనసులో విజ్ఙాన మార్గమును సృష్టించగలడు కాబట్టి బ్రహ్మ… గురువు మనసును నియంత్రించే విధంగా మాట్లాడగలడు కాబట్టి విష్ణువు… గురువు సంపూర్ణ జ్ఙానము ఇవ్వగలడు కాబట్టి శివుడు…. గురువు మూడు గుణాలకు అతీతమైన శక్తిని దర్శింపజేయగలడు కాబట్టి పరబ్రహ్మ… అంటారు.
గురువు కారణంగా జీవనమార్గం గాడిలో పడగలదు.
సద్గురు కారణంగా త్రిగుణాతీతమైన ఆత్మస్థితిని పొందవచ్చును. గురువు కారణంగా ఏదైనా సాధించవచ్చునని పురాణాలు ఘోషిస్తున్నాయి… కాబట్టి గురువులేని జీవితం ఊహాతీతం…. గురువు గల జీవితం క్రమశిక్షణతో కూడిన జీవితమై మరొక జీవితానికి మార్గదర్శకం కాగలదు. వ్యక్తి జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలానే ఉంటుంది.
కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది.
ముఖ్యంగా తాత-ముత్తాతలు, అమ్మమ్మ, అమ్మకు అమ్మమ్మలు మాటలు పిల్లలలో మంచ అవగాహనను కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు చూపుకునే ప్రేమాభిమానాలు ఎదుగుతున్న పిల్లలో ఒంటరితనం అనే భావన లేకుండా, పాజిటివ్ దృక్పధం పెరిగే అవకాశాలు ఎక్కువ. ఒకప్పుడు గొప్పవారంతా పెద్ద కుటుంబం నుండి వచ్చినవారే ఎక్కువ అంటారు. అంటే ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలే, ఒకనాడు గొప్పవారు కీర్తింపబడ్డారని కూడా చెబుతారు.
అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన పూర్వికులలో ఉంటే, నేటికి మాత్రం కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. ఎవరికివారే యమునాతీరు అన్నట్టుగా నేటి కుటుంబ వ్యవస్థ మారడం వలన పిల్లలలో పెద్దలంటే గౌరవభావం మనసులో ఉన్నా ప్రవర్తనలో కనబడకపోవడం విచిత్రమనిపిస్తుందనేవారు లేకపోలేదు. కారణం చూస్తున్న సినిమాలు, సీరియల్స్ లో పిల్లలే పెద్దలను హేళన చేసే సంప్రదాయం పిల్లలకు కనబడడం ఉంటుంది. ఏదైతేనేమి… పిల్లలకు బుద్దులు చెప్పే ముత్తాతలు కాదు కదా తాతలు కూడా కరవవుతున్నారని వాపోయేవారు కూడా ఉండవచ్చును.
కుటుంబంలో పిల్లల బంగారు భవితకు
ఎవరైనా ఆలోచన చేసేది పిల్లల భవిష్యత్తు బాగుండాలనే… కుటుంబంలో పిల్లల బంగారు భవితకు బాటలు వేయడానికి తల్లిదండ్రులకు శ్రమిస్తారు. అయితే తాము, తమ సుఖం అంటూ ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయినవారు. తమ పిల్లల బాద్యత తామే పరివేక్షించుకోవాలి. ఆ ప్రయత్నంలో కొందరు తల్లిదండ్రులు ఉండవచ్చును. అయితే కొందరు సంపాదనలో పడి, పిల్లల ఆలనా పాలనా కూడా చూసుకోలేని బిజిలో తల్లిదండ్రులు చేరుతుంటే, ఇక కుటంబ వ్యవస్థలో యాంత్రికమైన పరికరాల వాడుక పెరడమే అవుతుంది.
కారణాంతరల వలన ఉమ్మడి కుటుంబం చిన్నకుటుంబంగా మారినా, మరలా కుటుంబ విలువలు, పెద్దలు సలహాలు అవసరం అని నేటి తరం తల్లిదండ్రులు గుర్తించడం మరలా మొదలైంది.
అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా ఒకరంటే ఒకరికి జవాబుదారీతనం ఉంటుంది. దాని వలన తప్పు చేసే ఆస్కారం ఉన్నా, తప్పు చేయడానికి మనస్సంగీకరించదు. అదే ఒక్కరిగా ఉంటే తప్పుకు అవకాశం తీసుకునే మనసుకు రహదారి ఏర్పడినట్టేనని అంటారు.
ప్రపంచంలో మన కుటుంబ వ్యవస్థకు ఉన్న గుర్తింపు మరెక్కడా ఉండదు. సంప్రదాయక కుటుంబ వ్యవస్థ, తప్పులు చేయడానికి ఒప్పుకోని సదాచారం కలిగి ఉండడమే ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని అంటారు.
విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి.
పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి?
మొక్కగా ఉన్నప్పుడే వంగని మొక్క, అది పెరిగి చెట్టుగా మారాకా మాత్రం వంగుతుందా? ఒక మొక్క వలె వ్యక్తి బాల్యం సుకుమారంగా ఉంటుంది. వారి మనసు చాలా సున్నితంగా ఉండవచ్చును. అటువంటి చిన్నప్పుడే వారికి వినయవిధేయతలు అలవాటు కాకపోతే, వారు పెద్దయ్యాకా కూడా వారు అలాగే వినయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రమశిక్షణారాహిత్యంగా ఉండడం చేత వారికి జీవితంలో అవకాశాలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వినయపరులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. వ్యక్తి జీవితంలో తనకున్న పరిస్థితులలో కుటుంబంలో కానీ, పని చేసే కార్యాలయంలో కానీ, పని చేయించుకునే కార్యాలయంలో కానీ సత్ప్రవర్తన చేతనే అవి వృద్దిలోకి తీసుకుని రాగలరు. వ్యక్తి ఉత్తమ స్థితికి క్రమశిక్షణతో కలిగిన ప్రవర్తన ఎంతో సహాయపడుతుంది కావునా పిల్లలగా ఉన్నప్పుడే, వారికి క్రమశిక్షణ నేర్పించాలని చెబుతారు.
ఇంకా సృజనాత్మకత, తెలివి, అవగాహన ఏర్పరచుకునే వయస్పు కాబట్టి, ఆ వయస్సులో ఎటువంటి విషయాలలో శ్రద్ద చూపితే, ఆ విషయాలు మనసులో బలంగా నాటుకుంటాయి. ఇక చదువు విషయంలో బాలబాలికలు చూపే శ్రద్ద వలన, కాబట్టి క్రమశిక్షణ అనేది వ్యక్తికి విద్యార్ధి దశ నుండి చాలా అవసరం అని అంటారు.
ఎలా చెబితే, పిల్లలకు క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నిస్తారు?
పిల్లలకు సులభంగా అనుకరిస్తూ ఉంటారు. అంటే తాము గమనించింది, చేయడానికి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంట్లోవారు ప్రవర్తించే ప్రవర్తనను, పిల్లలు గమనిస్తూ, అదేవిధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల ముందు పెద్దవారు క్రమశిక్షణతో ప్రవర్తించడం చాలా మేలైన విషయంగా చెప్పబడుతుంది. క్రమశిక్షణతో ఉండమని చెప్పడం కన్నా, క్రమశిక్షణతో వారి ముందు ప్రవర్తించడమే సరైన మార్గముగా చెబుతారు.
విద్యాలయాలలో కేవలం పిల్లలకు క్రమశిక్షణ గురించి బోధించడమే కాదు. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన అందరూ ప్రదర్శించినప్పుడే, విద్యార్ధులకు వ్యవస్థ అంటే క్రమశిక్షణ ప్రధానం అనే ఆలోచన బలపడుతుంది. లేకపోతే విద్యార్ధి దశ నుండే, క్రమశిక్షణ కేవలం మాటలకే పరిమితం, అది ఒక వ్యాసరచన చేసి, మార్కులు సంపాదించుకోవడానికే అనే అభిప్రాయం బలపడే అవకాశం ఉంటుంది. కావునా పిల్లలకు క్రమశిక్షణతో కూడిన బోధనతో బాటు, క్రమశిక్షణతో వ్యవహరించడం చాలా చాలా ప్రధానం.
అలాగే కుటుంబంలోనూ కూడా పెద్దవారు, చిన్నవారి ముందు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనతో ఉండడం చేత, మరింత మంచి ఫలితం పొందవచ్చును. క్రమశిక్షణ అంటే ఏమిటి?
క్రమమైన పద్దతిని అనుసరించడమే క్రమశిక్షణ అంటారు. ప్రతి పనికి, ఆ పనిని పూర్తి చేయడానికి ఒక క్రమము ఉంటుంది. అలాంటి క్రమమును గురించి తెలుసుకునే, అదే పద్దతిలో నడుచుకోవడం క్రమశిక్షణ అంటారు. ఉదాహరణకు మనం స్వీకరించే ఆహారం.
ఒక పనిని క్రమపద్దతిలో చేయకపోతే?
మనం తీసుకునే ఆహారం ముందుగా వండుతారు. అది ఏ క్రమములో ఉంటుంది? మనం రోజు తినే ఆహారంలో ప్రధానంగా అన్నం ఉంటుంది. దానికి అనుషంగికంగా కూరలు ఉంటాయి. అన్నమును ఒక క్రమములోనే వండుతారు.
శుభ్రపరిచిన పాత్ర
నిర్ణీత పరిమాణంలో బియ్యం
బియ్యమును నీటితో శుభ్రపరుచుట
కడిగిన బియ్యమును, శుభ్రపరిచిన పాత్రలో వేయడం, తగినంత నీరును పోయడం
గ్యాస్ స్టౌవ్ వెలిగించడం
కడిగిన బియ్యము, తగినంత నీరు కలిగిన శుభ్రపరిచిన పాత్రను గ్యాస్ స్టౌవ్ పై ఉంచడం.
బియ్యము అన్నముగా మారేవరకు ఉడికించడం.
ఉడికించిన అన్నమును ఆహారముగా తీసుకుంటారు. (ఏదైనా క్రమపద్దతిలో వండిన కూరతో కానీ పచ్చడితో కానీ స్వీకరించడం)
ఇప్పుడు చూడండి… పై పద్దతిలో ముందుగా ఏదైనా పనిని చేస్తే ఎలా ఉంటుంది? 1 వ పాయింట్ అంటే, శుభ్రం చేయకుండానే ఒక పాత్రంలో బియ్యమును పోసి, అందులో బియ్యం వేసి, నీరు పోసి స్టౌవ్ పైన పెట్టేసి, ఆ పాత్రలో బియ్యమును ఉడిస్తున్నాం… ఇప్పుడు ఇందలో స్కిప్ చేయబడినవి ఏమిటి?
పాత్ర శుభ్రం చేయలేదు. బియ్యమును కూడా శుభ్రం చేయలేదు.
శుభ్రం చేయని పాత్రను అన్నం వండడానికి ఉపయోగించాము కాబట్టి, గ్యాస్ స్టౌవ్ పై అన్నం ఉడుకుతున్న పాత్రను శుభ్రం చేయాలంటే, అందులో వేసిన బియ్యం వృధా అవుతాయి. కాలం వృధా అవుతుంది. గ్యాస్ వృధా అవుతుంది. ఇంకా శరీరానికి హాని చేసే క్రిములు మనం తీసుకునే ఆహారంలో ఉండవచ్చును….
క్రమశిక్షణ లేని పనితనం సరైన ఫలితం?
ఇలాగే ఏదైనా ఒక పనిని క్రమ పద్దతిలో చేయకపోతే, ఆ పని ఫలితం సరైన సమయంలో పొందలేరు. ఇంకా అతి విలువైనా కాలం కూడా హరించుకుపోతుంది. అన్నం వండుకోవడం సక్రమంగా చేయకపోతే, మరలా వండుకునే అవకాశం ఉంటుంది. అదే అనేకమంది నడిచే ఒక బ్రిడ్జ్ కడితే, ఆ బ్రిడ్జ్ పరిస్థితి, అక్కడ నడిచే మనుషులు పరిస్థితి ఏమిటి? అలాగే ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగితే?… అంటే కొన్ని కొన్ని పనులు మరలా చేసుకునే అవకాశం ఉంటుందేమో కానీ కొన్ని పనులకు ఒక్కసారే అవకాశం, రెండవ అవకాశం ఉండదు. దాని యొక్క నష్టం భరించాల్సి ఉంటుంది. అప్పుడే సాధనలో ఉండే దోషాలు బయటపడతాయి.
ఇలా ఒక క్రమపద్దతిలో చేసే పనులు గురించి, విద్యలో భాగంగా నేర్చుకుంటూ ఉంటాము. అవి అనేక పుస్తకాలలో కూడా లభిస్తూ ఉంటాయి. కానీ క్రమశిక్షణ మాత్రం ఎదుగుతున్న వయస్సులోనే, ప్రవర్తిస్తూ అలవాటు చేసుకునే క్రియ కాబట్టి… అది చూసి నేర్చుకునే వయస్సులోనే అలవాటు కాబట్టి క్రమశిక్షణ విషయంలో పిల్లలు, పెద్దలు కూడా క్రమశిక్షణతో నడుచుకోవడం ప్రధానం అని సూచిస్తారు.
అన్నం వండుకోవడానికి మొదటగా కడిగిన పాత్ర ఎలాగో, విద్యను పూర్తి స్తాయిలో అభ్యసించడానికి విద్యార్ధికి ప్రాధమిక దశలో క్రమశిక్షణ చాలా ప్రధానం అంటారు. ప్రాదమిక దశలో కేవలం విషయాలు పరిచయం అవుతాయి. కళాశాల విద్యలోనే లోతైన విశ్లేషణ, మరియు పరిశోధనాత్మక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కావునా క్రమపద్దతిలో తెలుసుకోవడం అనే ప్రక్రియలో క్రమశిక్షణ పిల్లలకు అవసరం అంటారు.
ఏ వ్యవస్థ అయినా ముందుగా ఒక నియమావళి ఉంటుంది.
ఏదైనా ఒక వ్యవస్థ మనుగడ సాగిస్తుందంటే, ఆ వ్యవస్థలో పాటించే నియమ నిబంధనలు క్రమశిక్షణతో ఆచరించే వ్యక్తుల వలననే అంటారు. ఒక వ్యవస్థలోని వ్యక్తులంతా ఒక్కమాటపై నిలబడితే, ఆ వ్యవస్థపై అంటే సమాజంలో అందరికీ నమ్మకం ఉంటుంది. అలా ఒక వ్యవస్థలో అంతా ఒక్కమాటపై నిలబడే తత్వం క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తులకే సాధ్యం అంటారు. ఒక వ్యవస్థ స్థాయిని పెంచేది, దించేది కూడా ఆ వ్యవస్థలో భాగస్వాములైన వ్యక్తులే కారణం అవుతారు. కాబట్టి వ్యవస్థాగత అభివృద్దికి వ్యక్తి క్రమశిక్షణ చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది… కావునా విద్యార్ధులకు విద్యార్ధి దశలోనే క్రమశిక్షణ చాలా అవసరం అంటారు. ఎందుకంటే నేటి విద్యార్ధులే రేపటి వ్యవస్థలో భాగస్వాములు కాగలరు కాబట్టి…
ఇలా రంగం ఏదైనా సరే ఆయా రంగాలలో ఉండే వ్యక్తుల క్రమశిక్షణ చేతనే రంగం అభివృద్దిని పొందుతుంది… సమాజంలో వివిధ రంగాలు, వివిధ వ్యవస్థలు, సంస్థలు భాగమై ఉంటే, సజావుగా సాగుతున్నంతకాలం సమాజంలో వ్యక్తుల జీవన విధానం కూడా మెరుగ్గా ఉంటుంది. అంటే సమాజంలో వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి కారణం వ్యక్తి క్రమశిక్షణతో కూడిన పని కారణం అవుతుంది కాబట్టి విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణ అలవరచుకోవాలని అంటారు.
విద్యార్థులు క్రమశిక్షణ విద్యార్ధి దశ నుండే ప్రారంభించాలి
మొక్కై ఒంగనప్పుడు మానై ఒంగునా అనే నానుడి ప్రసిద్ది… అంటే మొక్కగా ఉండనప్పుడు ఒంగనది రానిది అది పెరిగి పెద్దదయ్యాక ఒంగుతుందా…. అలాగే విద్యార్ధి దశలో క్రమశిక్షణ అలవాటు అవ్వకపోతే, వ్యక్తిగా ఎదిగాక క్రమశిక్షణ అలవాటు అవుతుందా? చిన్నప్పుడు లేని క్రమశిక్షణ పెద్దయ్యాక ఉండదనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది.
విద్యార్ధి దశ అంటే నేర్చుకునే దశ… అనుకరించే దశ. చూసి పట్టుకునే దశ. విని సాధన చేసే దశ. కాబట్టి విద్యార్ధి దశలోనే విద్యార్థులు క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి.
సమయానికి తగిన పనులు చేయడం.
ఏ సమయంలో ఏ పనులు చేయాలో, అటువంటి పనులు చేయడం
పెద్దలు మాటలు ఆలకించి, మంచిని సాధన చేయడం.
క్రమశిక్షణతో కూడిన సాధన మంచి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణ చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి.
శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం? వ్యక్తికి శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యక్తులందరూ శ్రీరామాయణం చదవడం వలన సమాజానికి ప్రయోజనం ఏమిటి? శ్రీరామాయణం రీడ్ చేయడం వలన కలుగు మేలు ఏమిటి?
ఎన్ని ప్రశ్నలు సంధించుకున్నా, ఆ ప్రశ్నకోణంలోనే, తగు సమాధానం మనసులో ధ్యోదకం అయ్యేలాగా శ్రీరామాయణం చేయగలదని పండితులు అంటారు. ఎన్ని సార్లు చదివినా కొత్తగా చదువుతున్న అనుభూతి కలగడంతో బాటు శ్రీరామాయణం చదవడం వలన శ్రద్ధాసక్తులు పెరుగుతాయని అంటారు.
ప్రధానంగా ధర్మము తెలిసి ఉండడం గొప్పకాదు. తెలిసిన ధర్మమును ఆచరించడం గొప్ప అని శ్రీరామాయణం చదవడం వలన తెలియబడుతుంది. ఎందుకంటే శ్రీరామాయణంలో శ్రీరాముడు తెలుసుకున్న ధర్మము అనుష్టించి తరించాడు. రాక్షసుడైన రావణుడు ధర్మశాస్త్రములు ఎక్కువగా తెలిసి ఉన్ననూ తను ఆచరించడంలో నిర్లక్ష్యపు ధోరణి కనబడుతుంది.
శ్రీరాముడు ధర్మమును అన్ని వేళలా పాటించాడు. రావణుడు తన వ్యక్తిగత అభిప్రాయాలకే పెద్దపీఠ వేశాడు. ఇంకా పరస్త్రీని వాంఛించాడు… శ్రీరామాయణంలో రావణుడు పాత్ర ద్వారా గ్రహించవలసినది ఏమిటి అంటే, పరస్త్రీలయందు కామమోహితుడు కాకుడదని తెలియబడుతుంది.
తెలిసిన ధర్మమును ఇతరులకు చెప్పడానికి ముందు తను ఆచరించాలనే స్వభావం శ్రీరాముడుది… ఇంకా శ్రీరాముడు ఏపనిచేసినా శాస్త్రప్రకారం నిర్వహించాడని పెద్దలు అంటారు. అదే రావణుడు అయితే తన అభీష్టము నెరవేర్చుకోవడానికి ఎవరినైనా బాధిస్తాడు. అందుకే రావణుడుది రాక్షస ప్రవృత్తిగా పరిగణించబడుతుంది.
ఇలా శ్రీరామాయాణంలో దర్మమునకుఅదర్మమునకు గల వ్యత్యాసము కనబడుతుంది. అందువలన శ్రీరామాయణం రీడ్ చేయడం వలన అధర్మమునందు అనాసక్తి, ధర్మమునందు ఆసక్తి పెరుగుతుంది. అలా అందరు వ్యక్తులు శ్రీరామాయణం రీడ్ చేయడం వలన సమాజంలో అందరూ తమ తమ కర్తవ్య నిర్వహణలో ఉంటారు. ఎందుకంటే ధర్మము ఎప్పుడూ కర్తవ్యమునే బోదిస్తుంది.
అందువలన శ్రీరామాయణం అందరూ చదవడం వలన సమాజంలో శాంతియుత పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. పరధనం మీద, పరస్త్రీల మీద వ్యామోహం లేకుండా ఉండడమే మనోశాంతికి మంచి మార్గము అంటారు. కాబట్టి శ్రీరామాయణం చదవడం వలన దురలవాట్లు అలవరకుండా ఉంటాయి.
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును.
ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు?
కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు. మనిషి ఆక్సిజన్ పీల్చుకుని బొగ్గుపులుసు వాయువును బయటకు వదులుతాడు. అలా మనిషి వదిలిన బొగ్గుపులుసు వాయువును చెట్టు పీల్చుకుని, అవి మరలా మనిషికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయి. అందువలన భూమిపై చెట్లు లేకపోతే ఇక మనిషి భూమిపై బ్రతకలేడు.
ఇంకొక కారణం వృక్షాల వలన ప్రకృతిలో పర్యావరణ సమతుల్యతకు ఎంతగానో సహాయపడతాయని అంటారు. పర్యావరణ సమతుల్యత వలన సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి. వర్షాల వలన నదులలో నీరు చక్కగా ఉంటుంది. ఎప్పుడూ ప్రవహించే నదులలో నీరు ఉండడం వలన వ్యవసాయానికి కాలువల ద్వారా నీరు అందుతుంది. తత్పలితంగా మనిషి తినడానికి అవసరమైన ఆహారం వృద్ది చెందుతుంది.
ఇంకా వర్షాల వలన కురిసే వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వలన భూమిలో జలనవరులు తగ్గిపోకుండా ఉంటాయి. అందువలన భూమి నుండి పైకి బోరుల ద్వారా నీరు తెచ్చుకుంటున్న మనిషికి నీరు లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనిషికి గాలి సెకను సెకనుకు అసరం అయితే నీరు గంట గంటకు అవసరం అవుతుంది.
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
గాలి నీరు భూమిపై ఉండే చెట్ల ఆధారంగా ప్రకృతిలో సహజంగా ఉండగలవు. ప్రకృతిని సహజ సిద్దంగా ఉంచడంలో చెట్లు లేదా వృక్షాల పాత్ర అమోఘమైనది… అదో అద్భుతమైన ప్రక్రియ… ప్రకృతి ప్రకోపాలు భూమిపై పెరుగుతున్నాయంటే, భూమిపై చెట్లను ఎక్కువగా తొలగిస్తూ, అడవులను నశింపజేయడమే ప్రధాన కారణమని అభిప్రాయపడుతూ ఉంటారు.
అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు నీడనిస్తాయి.
రహదారికి ఇరువైపులా ఉండే చెట్లు గాలిలో ఆక్సిజన్ శాతం పెంచేవిధంగా చేయగలవని అంటారు. అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు రహదారికి ఇరువైపులా ఉండడం వలన ప్రయాణికులకు ఎండ నుండి రక్షణ ఉంటుంది. కాసేపు చెట్ల నీడ నుండి మనిషికి రక్షణ ఏర్పరచగలవు. ఇంకా జోరున వర్షం పడుతున్నా, కాసేపు పెద్ద చెట్ల క్రింద తడవకుండా జాగ్రత్తపడవచ్చును. అదే రోడ్డు ప్రక్కన ఒక బిల్డింగ్ ఉంటే, ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం మరొక మనిషి అవసరం ఉంటుంది. అదే రోడ్డు ప్రక్కన అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు మెయింటెనెన్స్ కోసం మనిషి అవసరం లేదు… ఇంకా అవే ప్రకృతిలో సమతుల్యతను మెయింటనెన్స్ చేయగలవు.
వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు?
పైన చెప్పుకున్నట్టుగా రోడ్ ప్రక్కన పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే, నిజంగా అవి మనకు అతి పెద్ద ఆస్తులే అవుతాయి. కారణం అవి ఇప్పటికే పెద్ద పెద్ద చెట్లు కావడం వలన ప్రత్యేకంగా నీరు ప్రతిరోజూ అందించనవసరం లేదు. సహజ సిద్దంగా కురిసే వాన నీరు వాటికి చాలు. ఇంకా అవి ప్రకృతిలో సమతుల్యతను పాటించడంలో ఒక తల్లి వంటి పాత్రను పోషిస్తాయి. ఆస్తులా ? అమ్మా ? అంటే అమ్మే అనేవారు ఎందరో ఉంటారు. మరి చెట్లు కూడా మనకు అంత మేలు ప్రకృతి రూపంలో చేస్తున్నప్పుడు వృక్షాలను పూజించడంలోనూ తప్పులేదనే భావనే బలపడుతుంది.
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
ఇంకా కొన్ని రకాల వృక్షాల వలన మనకు గృహోపకరణాలు తయారు చేస్తారు.
కొన్ని రకాల చెట్లతో పేపర్ తయారు అవుతుంది.
మరి కొన్ని రకాల చెట్ల ఆకులు వైద్యంలో ఉపయోగిస్తారు.
వైద్య రంగంలో మూలికలు కూడా కొన్ని రకాల చెట్ల ఏరుల నుండి సేకరిస్తారు.
ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే చెట్లు మానవాళికి ఎంతగానో మేలు చేసే ప్రకృతి పరమైన ఆస్తులు అందుకే వాటిని వృక్షాలను వృక్ష సంపదగా పరిగణిస్తారు. అలాంటి వృక్ష సంపదను రక్షించుకుని తర్వాతి తరానికి మేలు సమాజాన్ని అందించడంలో మనవంతు పాత్రను మనం పోషించాలి.
మనిషి జీవనంలో సెల్ ఫోన్ బాగం అయింది కానీ వృక్ష సంపద వృద్ది భాగస్వామ్యం కావాలి.
ఇప్పుడు నిత్య జీవితంలో చేతిలో స్మార్ట్ ఫోన్ దానిని చూస్తూ గంటల తరబడి గడిపేయడం. దాని వలన మనిషికి మనిషికి మద్య గ్యాప్ పెరుగుతుంది. దాని వలన అదొక వ్యసనంగా మారుతుంది. దాని వలన డ్రైవింగ్ లో ప్రమాదం. దాని వలన సెల్పీ తీసుకుంటూ మరణించినవారు ఉన్నారు. ఇంకా దాని వలన మనిషి మెదడుకు ఇబ్బందే… ఇన్ని రకాల ఇబ్బందులు మనిషికి కలిగిస్తున్న స్మార్ట్ ఫోన్ ఆదరించే మహానుభావులు వృక్షాలను ఆదరిస్తే, రానున్న కాలంలో మరింత ఆక్సిజన్ కలిగిన ప్రకృతిని వృద్ది చేసినవారమవుతాము.
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. అటువంటి మహాభాగ్యము సహజ సిద్దమైన ప్రకృతి వలననే కలిగితే అటువంటి సహజ సిద్ద ప్రకృతిని అందించడంలో చెట్లు లేక వృక్షాల పాత్ర అమోఘమైనది. కాబట్టి చెట్ల పెంపకం వృక్ష సంపద పరిరక్షణ అందరి బాద్యతగా అందరూ గుర్తించాలి. ఇది ఒక ప్రభుత్వానిదో లేక ఒక వ్యవస్థకో బాధ్యత కాదు. అందరికీ చెట్ల పెంపకం గురించి అవగాహన ఉండాలి. చెట్లను పెంచాలి. జీవితంలో ఒక మొక్కను మానుగా మార్చాలనే సంకల్పం మనిషికి ఏర్పడితేనే అతను సామాజిక పరమైన కనీస బాద్యతను నెరవేర్చినట్టు అవుతుంది.
ఒక చెట్టు భూమిపై నుండి తొలగించే ముందు ఆ చెట్టు తాలుకా పది మొక్కల పెంపకం మొదలు పెట్టి, ఆపై ఆ చెట్టుని తొలగించాలనే ఆలోచన ప్రతివారిలోనూ మెదలాలి.
కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది…
మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం.
వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా చెబుతారు. అనేక ఆలోచనలు సృష్టించే మనసు వివిధ విషయాలపై వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇలా ఒక విషయంపై ఒకే భావనాత్మక ఆలోచన దృష్టిని వృత్తి అనవచ్చును.
వైర అంటే వైరము అనగా శత్రుత్వము అంటారు. వ్యక్తిని చూసినప్పుడు మన మనసులో వ్యతిరేక భావములు కలిగి, వ్యక్తిపై కోపము కలిగే విధంగా ఉండే భావములను శత్రుత్వముగా చెబుతారు. మిత్రుడు కానీ వాడు తటస్తుడు అయితే అతనిపై ఎటువంటి భావనా ఉండదు. కానీ మిత్రుడుగా ఉన్నవాడు వ్యతిరేకిగా మారితే, అతనే శత్రువుగా మారే అవకాశం కూడా ఉంటుంది. పరిచయం కలిగిన వ్యక్తి ఎక్కువగా మనతో ముడిపడి ఉన్నవారు మనల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వ్యతిరేక భావనలు పెరిగి పెరిగి మనసులో శత్రుత్వ భావన బలపడుతుంది. ఒకసారి శత్రుత్వ భావన మనసులో బయలుదేరితే, మనసు వైరవృత్తిని కొనసాగిస్తుంది.
దీర్ఘ అంటే ఎక్కువ అనగా కాలము చెప్పే సమయంలో దీర్ఘకాలము అంటారు. ఎక్కువ కాలము దీర్ఘకాలము అంటారు. అలాగే ఎక్కువగా ఆలోచన చేస్తుంటే, దీర్ఘాలోచన అంటారు. ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటే సుదీర్ఘప్రయాణం అంటారు. ఇలా ఏదైనా ఒక విషయమును ఎక్కువ చేసి చెప్పడానికి పద ముందు దీర్ఘ పదం ఉంచుతారు.
వ్యక్తికి దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
ఎవరికైనా దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం అంటే వ్యక్తికి ఎక్కువ కాలం శత్రుత్వ ఆలోచన ఉంటే, అది ఆ వ్యక్తికే కీడు చేస్తుంది కానీ మేలు చేయదు. ఎందుకంటే శత్రుత్వ ఆలోచన మనసులో అలజడి సృష్టిస్తూ, అశాంతికి కారణం కాగలదు. అశాంతిగా ఉండే మనసు తను కుదురుగా ఉండదు. తన చుట్టూ ఉండేవారిని కుదురుగా ఉండనివ్వదు.
అశాంతితో ఉండే మనసు ఎట్టి పరిస్థితులలోనూ మేలు కాదు. అలాంటప్పుడు దీర్ఘకాలం పాటు ఎవరిమీదనైననూ శత్రుత్వం పెట్టుకుంటే, అది ఆ వ్యక్తికి మరింత భారం అవుతుంది. ఇంకా ఇద్దరి మద్య వైరం మరింత పెంచుతుంది. ఇంకా వైరం ఉన్న వ్యక్తికి ఉన్న బంధు మిత్రులకు కూడా మనకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కావునా దీర్ఘ వైర వృత్తి ఎప్పటికీ చేటునే తీసుకువస్తుంది కానీ మేలును చేయదు.
దుర్యోధనుడు శత్రుత్వం వలన పాండవులంటే అభిమానమున్న భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, శల్యుడు తదితరులు పాండవులకు శత్రువులుగా యుద్దరంగంలో పాండవులతో యుద్ధం చేయవలసిన ఆగత్యం ఏర్పడింది. కాబట్టి ఎక్కువ కాలం వైర వృత్తి మనసులో ఉండకూడదని అంటారు. అలా ఉండడం ఏమాత్రం మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు.
దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది.
ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావులలో ధర్మరాజు గొప్పవానిగా కీర్తింపబడ్డాడు.
క్షత్రియ ధర్మం ప్రకారం రాజ్యాధికారిగా ఉండేకాలంలో రాజుగా ఉండాలి కాబట్టి శ్రీకృష్ణునితో ధర్మరాజు చెప్పే మాటలు చాలా ప్రశస్తమైనవి. యుద్ధం చేసుకుంటే జరిగే ప్రాణనష్టం ఎక్కువ. శాంతి వలన ప్రజలు సుభిక్షంగా ఉంటారు. నిత్యం ప్రజాక్షేమం ఆలోచించే ధర్మరాజు యుధ్దం కన్నా సంధియే మిన్నగా భావించాడు.
అందుకనే అర్ధరాజ్యం అడిగే హక్కు ఉన్నా అర్ధరాజ్యం ఇవ్వకపోయినా కనీసం ఐదూళ్ళు ఇచ్చినా చాలు సర్దుకుంటామని ధర్మరాజు చెప్పడం గమనార్హమైన విషయం. దీర్ఘకాల వైరం వలన ఒరిగేదేముంటుంది?
సర్దుకుపోతే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు అని ధర్మరాజు కోణాన్ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. దుర్యోధనుడికి కూడా సర్దుకు పోయే గుణం ఉండి ఉంటే, భారతంలో యుద్దమే లేదు.
పగపెంచుకుంటే బంధువులు కూడా శత్రువులుగానే కనబడతారని ధుర్యోధనుడి దృష్టినుండి చూస్తే అర్ధం అవుతుంది. ధర్మరాజు ఎప్పుడూ శాంత దృష్టితో చూస్తే, ధుర్యోధనుడు ఎప్పుడూ రాజ్య కాంక్షతో, ఈర్శ్యతో ఉండడం వలనే యుద్ధానికి బీజాలు పడ్డట్టుగా చెప్పబడుతుంది.
ధర్మరాజు దృష్టితో ఆలోచనలు పెంచుకుంటే దీర్ఘకాలం శాంత స్వభావముతో ఉండవచ్చును. జీవితంలో శాంతి ఉండాలి. వ్యక్తి శాంతిగా ఉంటే, వ్యక్తిపై ఆధారపడ్డవారు శాంతంగా ఉంటారు.
ధర్మరాజు శాంతంగా ఉండడం వలన పాండవులంతా అడవులలోనే ఉన్నా, చాలా ప్రశాంతమైన జీవనం సాగించారని భారతం తెలియజేయబడుతుంది. శత్రుభావనతో ఉండే ధుర్యోధనాదులు అంత:పురంలో ఉన్నాసరే, మనసు అశాంతితోనూ పగతోనూ రగిలిపోవడం వలన చివరికి బంధుమిత్రులను పోగొట్టుకున్నారు.
దీర్ఘకాల విరోధం వ్యక్తి పతనానికి నాంది అయితే అది అతనిపై ఆధారపడివారిపైన కూడా పడుతుంది. కాబట్టి ఎప్పటికీ ఉండే, వైర భావన మంచిదికాదు. దీర్ఘకాల శత్రుత్వం పతనానికి పునాది అవుతుంది.
జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. కేవలం వృత్తి పనితో బాటు తగిన చదువు ఉంటే, వ్యక్తి తనకు వచ్చిన పనితోనైనా జీవనం కొనసాగించగలడు. లేదా ఇతర కార్యాలయములలో ఉపాధి అవకాశాలు చూసుకోగలడు. కావునా ఈరోజులలో మనకు చదువు చాలా అవసరం. ఇంకా ఏవైనా చదవగలిగే జ్ఙానం అలవరుతుంది. ఇంకా వివిధ అంశాలలో విషయ విజ్ఙానం పెరుగుతుంది.
చదువు ఎందుకు అవసరం జీవితంలో చదువు విలువ ఎంత?
చదువు వల్ల కలిగే లాభాలు చాలా ఉంటాయి. సమాజంలో సహజంగా చదువుకున్న వ్యక్తికి కలిగే లాభాలు… పైన చెప్పినట్టు చేతిపని తెలిసినవారికి చదువు కూడా ఉండడం వలన ఆ పనిలో ఉన్నత స్థితికి వెళ్ళగలడు. లేదా తనకు తెలిసిన పనిని ఇంకా ఎక్కువ మందికి తెలియజేయడానికి చదువు ఉపయోగపడుతుంది. తనకు తెలిసిన పనిని మరింత నాణ్యతతో కొత్త పద్దతులలో చేయడానికి చదువు ఉపయోగపడే అవకాశం ఎక్కువ.
జీవితమును తమకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ముందుగా మరొకరిపై ఆధారపడవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణం చేసే సందర్భాలలో…
ప్రయాణాలలో తెలిసి వస్తుంది. చదువు ఎందుకు అవసరం? అని
అక్షర జ్ఙానం లేకపోతే ప్రయాణించవలసిన ఊరు పేర్లు కూడా చదవలేము. అదే చదువుకుని ఉండడం వలన ప్రయాణపు మార్గముల గురించి ఒకరిపై ఆధారపడకుండా తెలుసుకోగలము. ఇది చదువుకోవడం వలన వ్యక్తికి కలిగే ప్రాధమిక ప్రయోజనం.
అక్షరజ్ఙానం ఉంటే ప్రయాణంలో ఒక బస్సు వెళ్ళే రూటు గురించి వివరాలు కోసం మరొకరిపై ఆధారపడనవసంలేదు. విషయ విజ్ఙానం ఉంటే లోకంలో మనగలగడానికి మార్గం ఉంటుంది.
ఇంకా చదువుకుని ఉండడం వలన వివిధ ప్రాంతాలలోని విషయ పరిజ్ఙానం గురించి పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చును. చదువు వలన వ్యక్తి నిత్యవిద్యార్ధిగా ఉండవచ్చును.
మరీ ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు తమ పిల్లల పెంపకంలో కీలక పాత్రను పోషించగలరు.
ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవచ్చును. ఉపాధిని సృష్టించవచ్చును. ఎంత వ్యాపారం చేసినా, కనీస అక్షరజ్ఙానం అవసరం ఉంటుంది.
ఇంకా పరిశోధనాత్మకమైన తెలివితేటలు గల బాలుడికి సరైన చదువు తోడైతే, అతను ఒక శాస్త్రవేత్తగా మారే అవకాశాలు ఉంటాయి.
గత సామాజిక పరిస్థితులు, ఇప్పటి వర్తమాన పరిస్థితులు, భవిష్యత్తు సామాజిక పరిస్థితుల విశ్లేషణలు గ్రహించే శక్తి చదువుకుని ఉండడం తెలియబడుతుంది.
జీవితంలో చదువుకు ఎంత విలువ? అది జీవితాలను మార్చగలిగే శక్తిని అందించగలదు.
చదువు ఎందుకు పదిగోవులు కాసుకుంటే పాడి ఉంటుంది… గోవులు వృద్ది చెందుతాయి. ఆర్ధికాభివృద్ది ఉంటుంది… చిన్నతనం నుండి పని అలవాటు అవుతుంది. అనేవారు ఉంటారు.
అవును చిన్నతనం నుండి పనిచేయడానికి అలవాటు పడినవారు బద్దకించరు. చిన్నతనం నుండి సుకుమారంగా పెరిగినవారు, కష్టాలకు కుదేలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కష్టపడి రూపాయిలు సంపాధించినా అవి ఖర్చు చేయడానికి కూడా నేటి రోజులలో అక్షరజ్ఙానం అవసరం ఉంది.
ఇంకా పది గోవులు కాసుకుని పాడిని వృద్ది చేసుకునే వారు చదువుకుని ఉంటే, పాడి పంటలు, పశువుల పెంపకంలో మరిన్ని విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవచ్చును. ఇంకా పాడిపంటలు ద్వారా మరింత ఆర్దికాభివృద్ది సంపాదించి, మరికొంతమందికి ఉపాధి ఇవ్వవచ్చును. అంటే దీనిని బట్టి కష్టానికి చదువు తోడైతే, అది ఒక సంస్థగా మార్చుకునే శక్తి వ్యక్తి ఏర్పడగలదు. కాబట్టి చదువు మనిషికి మేలు చేస్తుంది.
ఇలా ఒక వ్యక్తి జీవితంతో చదువు యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది. చదువుకోని వారిని నేటి రోజులలో చూస్తుంటే, వారి సాంకేతిక పరికరాల విషయంలో ఇతరులపై ఆధారపడవలసి వస్తుంటుంది.
నేటి రోజులలో పెరిగిన డిజిటల్ చెల్లింపులు అంటే ఖర్చులు చేయడం అంటారు. అంటే ఖర్చు పెట్టాలన్న కనీస అక్షరజ్ఙానం అవసరం. ఇంకా సాంకేతిక పరికరాలలో డబ్బును కాపాడుకోవలన్నా, విద్య నేడు చాలా ముఖ్యం.
చదువు ఎందుకు అవసరం? క్రమశిక్షణతో కూడిన చదువు
శ్రద్దాసక్తులు పెరిగితే కార్యదక్షత పెరుగుతుంది. కార్యదక్షత వలన కార్యాలయములలో అధికారం లభిస్తుంది.
ఇప్పుడు అయితే స్మార్ట్ ఫోన్, ట్యాబ్ అంటూ అందరిచేతిలో సాంకేతికత సహాయంగా ఉంటే, దానిని ఉపయోగించుకోవడానికి ఎంతోకొంత చదువు ఉంటే, సాంకేతికత బాగా ఉపయోగించుకోవచ్చును.
అదే సాంకేతికతకు నాణ్యమైన చదువు ఉంటే, సాంకేతికతలో అద్భుతాలు సృష్టించవచ్చును. ఏదైనా చదువుకుని ఉండడం వలన వ్యక్తి ఉన్నతికి ఉత్తమమైన మార్గాలు ఎక్కువగా ఉంటాయి.
లోకంలో మంచిమాటలు ప్రాచుర్యంలో ఉంటాయి. అలాంటి మాటలలో ఒక్కటి.. ధనం దొంగిలించగలరు కానీ విద్యను దొంగిలించలేరని… విద్య వలన వ్యక్తికి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి.
వ్యక్తి చదువుకుని ఉంటే, అది అతని ఉన్నతికి మరింత ఊతం ఇచ్చినట్టే ఉంటుంది. కాబట్టి చదువు చాలా విలువైనది… కాలం చాలా చాలా విలువైనది. అలాంటి కాలాన్ని తగురీతిలో సద్వినియోగం చేసుకోవడంలో చదువు బాగా ఉపయోగపడుతుంది.
అక్షరజ్ఙానం, విషయ విజ్ఙానం జీవితానికి ఎంతో అవసరం ఉంది. ఇంకా సాంకేతికపరమైన వృత్తులు ఎక్కువగా పెరుగుతున్న నేపధ్యంలో చదువులు లేకుండా మనుగడ అసాధ్యమే.
అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు.
ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మవిషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే, అమ్మ పంచిన ప్రేమను తరిచి చూస్తే చాలు… పదాలు ప్రవహిస్తూ పేరాలుగా ఏర్పడుతూ పేజీలకు పేజీలు పెరుగుతూనే ఉంటాయి. అయినా…
అమ్మ గొప్పతనం మాటలలో చెప్పబడడం అంటే కష్టమే కానీ అమ్మ నన్ను కనడానికి పడ్డ కష్టం కన్నా పెద్ద కష్టం ఏముంటుంది? అవును మనసును మధించి మధించి అమ్మను కాకా పట్టనవసరంలేదు… ”అమ్మా… ”అంటూ ఆర్తిగా పిలవగానే బాబూ… కన్నా… చిట్టి… అంటూ ఏది ఊతపదం అయితే ఆపదంతో అమ్మ పంచే ప్రేమ ముందు సృష్టిలో ఏది నిలవదు. అంత గొప్పతనం అమ్మతనంలో ఉంటే, నన్ను కన్నతల్లి, నన్ను కన్నతల్లిని కన్న తల్లికి ధన్యవాదాలు.
భూదేవికున్న ఓర్పు అమ్మకుంటుంది. అంత ఓర్పు ఉంటుంది కాబట్టే మరణయాతనను అనుభవిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది… అమ్మ త్యాగం ఉంటేనే నేను. అమ్మ మృత్యువుతో యుద్దం చేస్తే నేను… అమ్మ సేవ చేస్తేనే నేను… నేను ఈ అకారము పొందిన పలువురిలో సుఖసంతోషాలతో జీవిస్తున్నాను అంటే అందుకు అమ్మ ఇచ్చిన ఈ జన్మే… అంతేకాదు అమ్మ నాకు ఊహ తెలిసేవరకు చేసిన సేవ వలననే నేను ఒక విద్యార్ధిగా సమాజంలో తిరగగలుగుతున్నాను. అమ్మ ఓర్పు భూదేవి ఓర్పు ఒక్కటే…
తను పస్తులుండైనా సరే పిల్లలకు అన్నం పెట్టే అమ్మలెందరో ఉంటారు. పిల్లలను పెంచడంలో పడిన తల్లి తనను తాను నిర్లక్ష్యం చేసుకోవడంలో ముందుంటుంది. పిల్లల శ్రేయస్సుకోసం పాటు పడుతూనే ఉంటుంది. పిల్లల ఎదుగుదల కోసం అమ్మ పడే ఆరాటానికి అలుపు ఉండదు.
ఆలోచిస్తే అమ్మను మించిన దైవం కానరాదు.
భవనాలలో ఉండేవారు అయినా గుడిసెలో వారు అయినా ప్యూన్ అయినా కలెక్టర్ అయినా అమ్మ దగ్గర తప్పటడుగులు వేసినవారే.
అమ్మ పాలు ఇస్తే పెరిగినవారు, అమ్మ అన్నం పెడితే తిన్నవారు… శక్తివంతులం అయ్యాము అంటే అమ్మ పెట్టిన బిక్ష… ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. అటువంటి భాగ్యం అమ్మ దగ్గర నుండే పెరుగుతూ ఉంటుంది.
అయితే విడ్డూరమైన విషయం అమ్మకు సేవచేసే భాగ్యమును పరులపరం చేయడం. లోకంలో వృద్ధాశ్రమములు పెరుగుతున్నాయంటే అమ్మ ఆధారించేవారు కరువు అవుతున్న కొడుకులు కారణమా? లేక కోడల్లు కారణమా? తెలియదు కానీ అలా అమ్మకు సేవ చేసే భాగ్యమునకు దూరం కాకుండా ఉండాలి…
చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్దకుటుంబాలు తక్కువగానే ఉంటున్నాయని అంటూ ఉంటారు. సాదారణంగా చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. కారణం పెద్ద కుటుంబాల వలన పెత్తనం ఉండే పెద్దవారి చాదస్తంతో చిన్నవారు ఇబ్బందులు ఎదర్కొంటున్నారనేది ఒక సమస్యగా ఏర్పడడంతో ఇటువంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చును. ఇంకా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ నినాదం కూడా పుట్టడానికి కారణం తక్కువమంది సభ్యులతో ఆర్ధికంగా లాభపడవచ్చును అని కూడా భావన ఉండవచ్చును.
కానీ కారణం ఏదైనా చిన్న కుటుంబంలో భార్యభర్తలిద్దరికీ ఏకాంత కాలం ఎక్కువగా ఉంటే, పెద్ద కుటుంబాలలో అటువంటి కాలం చాలా తక్కువగానే ఉండవచ్చును. చిన్న కుటుంబంలో స్వేచ్చా జీవనం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువనే అంటారు. కారణం కుటుంబంలో నిర్ణయం ఇద్దరి మద్యే ఉంటుంది. భార్యభర్తల ఇద్దరి మద్యే ఉంటుంది. అదే పెద్ద కుటుంబంలో అయితే పెద్దవారి పర్మిషన్ తప్పని సరి.
చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదం ఎందుకు పుట్టింది…?
భారతదేశంలో పెద్దకుటుంబాలలో అయితే భార్యభర్తలకు భర్తతరపు తల్లిదండ్రులు, భర్తతరపు తండ్రి సోదరులు వారి భార్యలు, భర్తతరపు భర్తగారి సోదరులు, వారి భార్యలు ఇంకా భర్తతరపు నానమ్మ, తాతయ్యలు కలిపి ఒక కుటుంబంలో పదిమందికి పైగా పెద్దవారు ఉండడం సహజంగా ఉంటే, పెద్దవారి పట్టు పద్దతి చిన్నవారిపై పడుతుంది. ఇంకా ఎక్కువమంది పెద్దవారు ఉండడం వలన ఏదైనా ఒక అంశంలో ఏకాభిప్రాయానికి సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు పుట్టడానికి కారణం అయ్యే అవకాశం కూడా ఉంది.
అదే చిన్న కుటుంబంలో అయితే కేవలం భార్యభర్తలిద్దరిలో ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకుంటే సరి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదము కుటుంబ నియంత్రణ పధకం అమలుకు ప్రధాన నినాదం అయి ఉండవచ్చు. కారణం కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండే కుటుంబాలు గతంలో మనదేశంలో ఎక్కువ… కాబట్టి జనాభా నియంత్రణకు కుటుంబ నియంత్రణ సాయపడుతుంది కాబట్టి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఒక నినాదం అయ్యింది.
అవును జనాభా నియంత్రణ ఒక సమస్యగా పరిణిమించిన నేపధ్యంలో కుటుంబ నియంత్రణ అమలుకు శ్రీకారం జరిగితే చిన్న కుటుంబం సుఖవంతమైన కుటుంబం అంటున్న నేపధ్యంలో పెద్దవారి మంచి మాటలు చిన్నవారికి చాదస్తంగా అనిపిస్తే, పెద్ద కుటుంబంలో మనస్పర్ధలు పెరగడానికి ఆస్కారం… ఏదో ఒత్తిడితో అందరితో కలిసి ఉండడం కన్నా ఎవరి జీవితం వారిది అన్నట్టుగా చిన్న చిన్న కుటుంబంగా విడిపోయే ఆలోచనలు కూడా భార్యభర్తలలో కలగడానికి ప్రేరణ కావచ్చును.
చిన్న కుటుంబంలో లాభాలు
అంటే చిన్న కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరూ ఇంకా వారి పిల్లలు ఉండడం చేత, కుటుంబ నిర్ణయాలకు పెద్ద చర్చలు ఉండవు.
ఇంకా చిన్న కుటుంబంలో ప్రధానంగా ఇద్దరి మద్యే ఏదైనా చర్చ కాబట్టి ఎక్కువ మనస్పర్ధలు అవకాశం ఉండదు.
ఇక ఆర్ధికంగా చిన్న కుటుంబం అయితే మేలు అనడానికి కారణం… భార్యభర్తలు కలసి ఇద్దరు పిల్లలతో ఉంటే, వారు ఆర్ధికంగా కొంచెం సొమ్ములు కూడబెట్టగలరు. అదే భార్యభర్తలు నలుగురైదుగురు పిల్లలతో ఉంటే, వారి సంపాధన కేవలం పిల్లల పెంపకం వరకే పరిమితం కాబట్టి… ఆర్ధికంగా నిలబడడానికి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఉండవచ్చును. ఆర్ధికంగా అయితే ఇద్దరి పిల్లలతో జీవించే భార్యభర్తల చిన్న కుటుంబం లాభదాయకమే అంటారు.
ఇలా చిన్న కుటుంబం వలన భార్యభర్తలిద్దరి మద్య మరింత ఏకాంత సమయం ఏర్పడుతుందనే ఇతరత్రా ఆలోచనలు అనేకం ఉండవచ్చును.
చిన్న కుటుంబంలో ఇప్పుడు సమస్యలు ఉన్నాయా?
మన సమాజంలో పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు వృద్ధాశ్రమములు తక్కువనే అంటారు. చిన్న కుటుంబాలు పెరిగా వృద్ధాశ్రమాలు పెరిగాయని అంటారు. అంటే చిన్న కుటుంబాలు పెరిగే కొలది కుటుంబంలో వృద్దులకు ఆసరా కరువైందనే భావన బలపడుతుంది.
పెళ్ళైన కొత్తల్లో చిన్న కుటుంబం చాలా స్వర్గదాయకంగా అనిపిస్తే, కాలం గడిచే కొలది అదే వెలితిగా కూడా మారుతుంది. పెద్ద కుటుంబంలో పెద్దల మద్య పెరిగే పిల్లలకు పద్దతులు చాలా బాగుండేవి… కారణం పిల్లలు ఎక్కువగా తాతయ్యలు, అమ్మమ్మల మద్య పెరిగేవారు… ఇప్పుడు అయితే భార్యభర్తలు ఇద్దరూ సంపాధనపరులు అయితే పిల్లలు ఆయాలకు చేరువ అవుతుండడం గమనార్హం.
చిన్న కుటుంబంలో ఎదుగుతున్న పిల్లలకు నాన్నే హీరో… అమ్మే హీరోయిన్…. అయితే కుటుంబంలో నిత్యం పరిశీలిస్తూ, చూసి నేర్చుకునే స్వభావానికి పెద్దలు మెరుగులు దిద్దే అవకాశం పెద్ద కుటుంబంలో ఉన్నంతగా చిన్న కుటుంబంలో ఉండదు. ఇంకా ఆయాల దగ్గర పెరిగే పిల్లలు అయితే, ఆయాకు ఎటువంటి స్వభావం ఉంటుందో, అటువంటి స్వాభావిక పద్దతులు నేర్చుకునే అవకాశం కూడా లేకపోలేదు.
జీవితమంటే ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య వచ్చినప్సుడు సమస్యకు పరిష్కారం ఆలోచిస్తే, కుటుంబంలో శాంతి. అదే ఆ సమస్యకు కారణం ఎవరు? అనే ప్రశ్నతో పీక్కుంటే అదే అశాంతి. పెద్ద కుటుంబాలలో సమస్యకు పరిష్కారం చూసే దోరణి నుండి సమస్యకు కారణం ఎవరు అనే కోణం అలజడులే సృష్టించేవని అంటారు.
ఒంటరితనం పిల్లలలో పెరిగే అవకాశం చిన్న కుటుంబాలలో ఎక్కువగా ఉంటే, పెద్ద కుటుంబాలలో పెద్దల సంరక్షణ ఒంటరితనం దూరం చేస్తుంది.
ఇంకా చిన్నకుటుంబంలో ఇద్దరి నిర్ణయం త్వరగానే అంగీకరించబడుతుంది… అది ఎటువంటి నిర్ణయమైనా…
చిన్న కుటుంబం వ్యతిరేకం పెద్ద కుటుంబం అనుకూలం అని ఆలోచించడం కన్న ఉన్న స్థితిలో అవగాహనతో మెసులుకోవడం అవగాహన కల్పిస్తూ ముందుకు సాగడం కుటుంబ జీవనం అయితే నమ్మకం ప్రధాన పాత్ర పోసిస్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకంతో మనస్పర్ధలు తావివ్వకుండా జీవించడమే ప్రధానంగా కుటుంబ శాంతి ఆధారపడుతుంది. అటువంటి శాంతియుత కుటుంబ వాతావరణమే పిల్లల ఎదుగుదలపై మంచి ప్రభావం చూపుతుంది.
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా… ఇది వంటబట్టించుకున్న వ్యక్తి అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అందరితో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.
ఆ మాటలోనే చాలా ఆంతర్యం ఉంటుంది. పోరు అంటే పోరాటం లేక యుద్ధం అంటారు. పొందు అంటే సఖ్యత, స్నేహం, కలిసి ఉండుట అనే అర్ఘాలు గ్రహిస్తారు. ఈ పూర్తి వ్యాక్యం యొక్క భావన శత్రుత్వం కన్నా మిత్రత్వం గొప్ప మేలు చేస్తుందని అర్ధం ఇస్తుంది. శత్రుభావన వలన పోరాడాలనే తలంపులే తడతాయి, మిత్ర భావన వలన పొందు(పొందు అంటే స్నేహం, సఖ్యత, మిత్రత్వం) కోరే ఆలోచన పుడుతుంది.
ఇద్దరి మద్య భేదాభిప్రాయాలు రాకుండా ఉండవు. అది సహజం. కాబట్టి ఇద్దరి మద్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ భేదాలకు తగిన కారణాంతరాలు ఏమిటో తెలుసుకొని, ఇద్దరి మద్య భేదం తగ్గించుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తూ ఉంటారు.
వ్యక్తుల మద్యే కాదు వ్యవస్థల మద్య ఉండే కార్యనిర్వహణాధికారుల మద్య వచ్చే పొరపొచ్చాలు కూడా వ్యవస్థల మద్య భేదాభిప్రాయాలు సృష్టించగలవు… కావునా ముందు వ్యక్తులలోనే పోరు నష్టం పొందు లాభమనే సూత్రం తెలియబడాలి. ఇచ్చిపుచ్చుకునే దోరణిలోకానీ మాటలలో కానీ అభిప్రాయ భేదం కలిగినప్పుడు తగిన సమయం తీసుకుని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఉత్తమ ప్రయత్నంగా చెప్పబడుతుంది.
పోరు వలన పోయేది కాలం. కాలం కరిగిపోతు వ్యక్తి ఉన్న సమయం ఖర్చు అయిపోతుంది. పోరు వలన ఖర్చు అయిన కాలం తిరిగి రాదు. అదే పొందు వలన వ్యక్తికి సమయం మిగులుతుంది. మిగులు సమయం బంగారమే అవ్వవచ్చును. కాలానికి విలువనిచ్చేవారు పోరుతో సమయం వృధా చేయకుండా పొందు ద్వారా తమకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని అంటారు.
ఎవరికైనా పోరు నష్టం పొందు లాభం వర్తిస్తుందని అంటారు.
సమాజంలో అనేక సమస్యలు ఇద్దరి మద్య పొడచూపవచ్చును. రెండు వ్యవస్థల మద్య పొడచూపవచ్చును. రెండు సంస్థల మద్య కూడా పొడచూపవచ్చును.
సినిమా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడితే, రాజకీయ నిర్ణయాలు సినిమారంగంపైనా ప్రభావం చూపుతాయి. ఇంకా సినిమా తారల మాటలు రాజకీయంగా ఒక పార్టీని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంటుంది. రెండు వ్యవస్థల మద్య పోరు వాటికే చేటు చేసే అవకాశం ఉంటుంది.
అలాగే ఏదైనా రెండు సంస్థల మద్య పోటీ పెరిగి, అది వాటి మద్య అవగాహనాలోపం వలన సమస్యలు సృష్టిస్తే, అవి ఆ సంస్థల వ్యాపార లావాదేవీలపైనా ప్రభావం చూపగలవు. వ్యక్తి బలాబలాను బట్టి ఇద్దరి వ్యక్తుల మద్య సంఘటనలు ఉంటే, అలాగే రెండు సంస్థల మద్య పోరు కూడా బలమైన సాంఘిక ప్రబావం ఉంటుంది.
వ్యక్తైనా, వ్యవస్థ అయినా, సంస్థ అయినా పోరుకు పోతే, పోయేది విలువైన కాలంతో బాటు లాభాలు కూడా అంటారు. అదే అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ఆదిలోనే పొందుకు ప్రయత్నించి సెటిల్ చేసుకుంటే, అది విలువైన కాలం వృధా కాకుండా ఉంటుంది. ఒక వ్యక్తికి కాలం కాంచన తుల్యం అని భావిస్తే, అదే సూత్రం వ్యవస్థలకు, సంస్థలకు కూడా వర్తిస్తుంది.
పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం. తినగ తినగా వేము తీయగుండు అంటారు. అంటే చేదుగా ఉండే వేపాకు కూడా తినగ తినగా తీయగా అనిపిస్తుంది అంటారు. అలాగే ఒక పని చేయగ చేయగా అదే అలవాటు అయ్యి, ఆ పనిని సునాయసంగా చేసేస్తూ ఉంటారు…
నేర్చుకునే వయసులో పిల్లలకు చూసి నేర్చుకోవడం, అలకిస్తూ ఆలోచించడం, వినడం ద్వారా నేర్చుకునే జ్ఞానం పెంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వయసులో మంచి విషయాలవైపు వారి దృష్టి వెళ్ళేలా చూడడమే వారికి చేసే పెద్దమేలు అంటారు. చిన్నతనం నుండే మంచి అలవాట్లు అబ్బేలా చూడాలి అంటారు.
పెద్దలను చూసి పిల్లలు అనుసరిస్తూ ఉంటే, పిల్లల ముందు పెద్దలు ఉత్తమ ప్రవర్తన కనబరుస్తూ ఉంటే, ఆ కుటుంబంలో పిల్లలు కీర్తిగడించే స్థాయికి వృద్ది చెందుతారని అంటారు. పెద్దల మంచి అలవాట్లు ఆచరిస్తూ ఉంటే, పిల్లలు కూడా పెద్దల మంచి అలవాట్లనే అనుసరించే అవకాశాలు ఎక్కువ.
ఏదైనా చూసిన విషయం గురించి కానీ ఆలకించిన ఆలాపన గురించి కానీ చెప్పబడిన విషయం గురించి కానీ ప్రయత్నం చేసే వయసులో పిల్లలకు ఎటువంటి విషయాలు చేరుతున్నాయనేది ప్రధాన విషయం… ఆ విషయాలను బట్టి పిల్లలకు అలవాట్లు దరి చేరే అవకాశం ఉంటే, అది మంచికి కావచ్చు ఇతరం కావచ్చు.
చదువుకునే పిల్లలకు మంచి అలవాట్లు అంటే…
పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం
నిర్ధిష్ట సమయంలో మేల్కొవడం చాలా ప్రధాన విషయం అయితే, ప్రతిరోజు వేళకు నిద్రించడం కూడా అంటే ప్రధానమైన విషయం.
ప్రతిరోజు వేళకు తిండి తినడం
పరిమిత సమయంలో ఆటలు ఆడడం, ప్రతి రోజు వ్యాయామం చేయడం… ఇలా పిల్లల ఆరోగ్యపరమైన విషయాలలో పెద్దలు బాధ్యతగా వ్యవహరించాలి.
ఆరోగ్యం ఇంకా చదువుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు తగు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.
ఇలా పెద్దలు, టీచర్లు పిల్లలకు జాగ్రత్తలు చెప్పే విషయాలలో స్మార్ట్ ఫోన్ కూడా చేరడం విశేషం. ఎందుకంటే స్మార్ట్ చేతిలో ఉండే లోకం… లోకంలో ఉండే మంచి చెడులను స్మార్ట్ ఫోన్ అరచేతిలోనే చూపుతుంది… కాబట్టి స్మార్ట్ ఫోన్ అలవాటు ఉంటే వయసుకు మించిన విషయాలలో పిల్లలు దృష్టి పెట్టె అవకాశం ఉండవచ్చు… కాబట్టి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగం అంత మంచి విషయం కాదు.
పిల్లలకు మంచి అలవాటు అంటే బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటుగా చెబుతారు… స్కూల్ కు వెళ్ళే పిల్లలు పుస్తకాలే చదువుతారు… కానీ ఒక లక్ష్యం ఏర్పడడానికి లేదా ఏదైనా ఆశయ సాధనకు ప్రయత్నించడానికి స్పూర్తినింపే వ్యక్తుల జీవిత చరిత్రలు లేదా గొప్పవారి మాటలు గల పుస్తకాలు చదివే అలవాటు పిల్లలకు ఉండడం మంచి అలవాటుగా చెబుతారు.
ఇంకా పిల్లలకు ఉండవలసిన ప్రధాన అలవాట్లలో వినయంతో ఉండడం… ఒకప్పుడు గురువు ఎదురుగా ఉండి… విధ్య కన్నా ముందు గురువు ముందు వినయంగా ఉండడం అలవాటు చేసుకునేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు విద్యా విషయాలు సాంకేతిక పరికరాల ద్వారా కూడా పిల్లలకు అందే అవకాశం ఎక్కువ… కాబట్టి తెలుసుకోవడం సులభం అయినప్పుడు గురువు కూడా గొప్పగా కనబడడు… కాబట్టి ఎలాంటి స్థితి అయినా వినయంగా ఉండడం విధ్యార్ధి ప్రధమ లక్షణం అనే హితబోధ పిల్లలకు చేయాలి… వినయంగా ఉండే ఉత్తమ అలవాటును పిల్లలకు చేయాలి.
అభ్యాసం చేసేతప్పుడు సొంతంగా సాధన చేయడం… తెలుసుకునేటప్పుడు అడిగి తెలుసుకోవడం, వినేటప్పుడు వినయంతో వినడం పిల్లలకు అలవాటుగా ఉండడం వారికి శ్రేయష్కరం అంటారు.
వేళకు నిద్రించడం కూడా చెప్పాలా ? అంటే
నేడు చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారని అంటూ ఉంటారు. వారు బాల్యంలో బాగా నిద్రించినవారే లేకపోతే బలంగా అవ్వలేరు కదా… కానీ నిద్రవలన ప్రయోజనలు బాగా తెలియకపోవడం వలన పనిలోపడి నిద్రను అశ్రద్ద చేయడం వలన నిద్రలేమి ఏర్పడే అవకాశాలు ఎక్కువ అంటారు. అదే వారికి నిద్ర వలన శరీరమునకు కలిగే ప్రయోజనలు తెలిసి ఉంటే, నిద్రను అశ్రద్ద చేయరు కదా?
అందుకే సరైన సమయానికి నిద్రించడం అనే అలవాటును పిల్లలకు అలవాటు చేయాలి. ఇంకా తగినంత నిద్ర శరీరానికి ఉంటే, తగినంత విశ్రాంతి శరీరానికి వస్తుందనే విషయం తెలియజేయాలి. అలాగే బద్దకం యొక్క ఫలితం కూడా తెలియజేయాలి. విశ్రాంతి పేరు చెప్పి బద్దకించేవారిని బద్దకస్తులుగా పేర్కొంటారు.. అలాంటి వారు పనుల చేయడంలో విఫలం చెందుతారు. తద్వారా జీవితంలో తమ లక్ష్యం కోసం పాటుపడడంలో వెనుకబడి పెద్దయ్యాక బాధపడతారు.
కావున అతి నిద్ర వలన కలిగే ఫలితాలు. వేళకు నిద్రించడం… వేళకు నిద్రలేవడం వలన కలిగే ప్రయోజనాలు… వారికి అర్ధం అయ్యే రీతిలో తెలియజేయాలి.
ఇంకొకటి సమయానికి తిండి తినడం
తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అనే సామెత ప్రాచుర్యంలో ఉంటుంది. మన పిల్లల విషయంలో అటువంటి మాట లోకం నుండి రాకుండా చూసుకోవాలి. శరీర బలం కోసం తిండి తినాలి. శరీర బలంతో పని చేయాలి. పని అంటే చదువుకునే వయసులో చదువుకుంటూ, శరీరమును తగినంత వ్యాయామం చేయించాలి.
తిండి తినడం కూడా నిర్ధిష్ట సమయంలో చేసేలా చూడాలి. జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే క్రమపద్దతిలో ఆహార నియమాలు కూడా అవసరమే అంటారు.
పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం
లోకంలో చాలామంది అజీర్ణ వ్యాధులతో బాధపడుతున్నట్టు చెబుతారు. అంటే ఎక్కువమంది వేళకు తినడం తగ్గించడం వలన అటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి…
సమాజంలో కల్తీ ఆహార పదార్ధాలు కూడా ఉంటూ ఉంటాయని అంటారు… కల్తీ ఆహార పదార్ధాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి… కల్తీ ఆహారం విషాహారంతో సమానమని అంటారు.
అతి అన్నింటిలోనూ అనర్ధమే
ఇది ప్రధానంగా బాగా అర్ధం అయ్యేటట్టు పిల్లలకు చెప్పాలి. నేర్చుకునే వయసులో పిల్లలకు ఏదో ఒక విషయంలోనో, అంశంలోనో అతి చూపిస్తూ ఉంటారు.
పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం
అలా అతిని ప్రదర్శించడం ప్రమాదకరం అనే విషయాన్ని మెల్ల మెల్లగా వారికి అర్ధం అయ్యే రీతిలో చెప్పాలి…
అతిగా చదువుతూ ఉంటే, పుస్తకాల పురుగు అంటారు.
అలాగే అతిగా ఆలోచిస్తూ ఉంటే, పిచ్చివారు అంటారు.
ఇంకా అతిగా ఆడుతూ ఉంటే, శరీరానికి సమస్యలు.
అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటే, అల్లరి పిల్లలు అంటారు.
ఎక్కువసేపు నిద్రిస్తూ ఉంటే బద్దకస్తులు అంటారు.
అతిగా తింటూ ఉంటే, తిండిపోతు అంటారు.
ఎక్కువగా అదే పనిగా పని చేస్తూ ఉంటే, ఏమి అనరు కానీ వాడుకుంటూ ఉంటారు. లోకువగా చూస్తారు.
ఏ విషయంలోనైనా సరే అతిగా స్పందిస్తూ ఉండడం ఉంటే, అది ఏ విషయంలో అలా జరుగుతుంది… ఆ విషయం వలన వచ్చే అనర్ధాలు ఏమిటి? లోకం నుండి ఎటువంటి ఫలితం వస్తుంది? ఆలోచించి… అతిగా ఉండడం తగ్గించే మానసిక దృక్పదం ఏర్పడేలా చూడాలి.
అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతి అన్నింటా అనర్ధమే.. అని అర్ధం. అదే పనిగా మొబైల్ వాడడం వలన అది వ్యసనం అవ్వడంతో బాటు కంటి సమస్యలు, మెడ సమస్యలు, నిద్ర సమస్యలు ఇంకా మనసుకు మరింత సమస్య…
కాబట్టి అతి అనేది ఏ విషయంలోనైనా మంచిది కాదు అని తెలియజేయాలి. అతిని నియంత్రించుకోవడం అతి పెద్ద మంచి అలవాటుగా జీవితంలో నిలబడిపోతుంది.
ఈ మంచి అలవాటును అందరూ అలవరచుకోవాలని పెద్దల సూచన
ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే గొప్ప లక్షణం అలవాటు చేయాలని అంటారు.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి. ఈ వ్యాసం చదివే ముందు… ఈ క్రింది పేరా చదివి అర్ధం చేసుకోండీ… ఆపై వ్యాసం చదవండి.
వాటర్ తో నింపిన ఒక పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. అలాగే ఒకే 20 లీటర్ల వాటర్ గల క్యానులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. ఆ తర్వాత రెండూ చూస్తే, పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసు మకిలి మకిలిగా కనబడితే, 20 లీటర్ల వాటర్ క్యాను మాత్రం మార్పు లేకుండా మాములుగానే ఉంటుంది. అంటే ఇక్కడ చిన్న గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి కలిపితే, ఆ వాటర్ మలినంగా కనబడుతుంది. ఆ వాటర్ త్రాగితే ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే 20 లీటర్ల వాటర్ క్యానులో ఒక టీ స్పూన్ మట్టి కలిపితే, అంత మలినం కాదు కానీ మలినమైన వాటరే… ఆ వాటర్ ప్రభావం కూడా తక్కువ. మట్టిలో హానికరమైన క్రిములు ఉంటే, వెంటనే హాని చేస్తాయి.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
ప్రకృతి సహజ సిద్దమైన నీటి శాతం ఎక్కుగావ ఉంటే, మిగిలినవాటి ప్రభావం తగ్గుతుంది. అలాగే ప్రకృతిలో ఏది ఎక్కువగా ఉంటే, దాని ప్రభావం మిగిలిన వాటిపై పడుతుంది. అదే అవసరమైన పరిణామంలో ఉంటే, అది మానవ మనుగడకు అనువుగా ఉంటుంది.
అలాంటి ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం… అంటే చెట్లు, మొక్కలు, ఊళ్ళు, పట్టణాలు, అడవులు, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, కోళ్ళు, కుక్కలు, నక్కలు, పిల్లులు, పక్షులు తదితర రకరకాల జీవరాశులతో పాటు మనిషి కూడా భూమిపై జీవిస్తున్నాడు. ప్రకృతి అలాగా సహజ వాతావరణం ఇస్తుంది. అటువంటి సహజ వాతావరణం పల్లె ప్రాంతాలలో కనబడుతూ ఉంటుంది.
పల్లె వాతావరణం సహజంగా నగర వాతావరణం అసహజంగా
అదే నగర వాతావరణంలో అయితే మనిషి, మనిషి నిర్మించుకున్న కట్టడాలు ఇవే ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనిషి పెంచుకునే జంతువులు, పక్షులు మరియు మనిషికి ఇష్టమైన వస్తువులు.
సహజ వాతావరణంలో జంతువులు చర్యలు, మొక్కలకు, మొక్కల చర్యలు మనిషికి, మనిషి చర్యలు ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలి అంటే, మనిషి తప్ప మిగిలిన వాటి చర్యలు పర్యావరణం నియమాలతోనే సాగుతాయి.
ఎందుకు మనిషి మాత్రం ప్రకృతిని ప్రభావితం చేయడం
ప్రకృతిని వినియోగించుకోవడంలో మనిషి తెలివైనవాడు కావడమే ప్రకృతిలో మార్పులకు మనిషి ఆలోచన పునాది అవుతుంది.
ఒకరు మొక్కలు పెంచాలనే ఆలోచన చేస్తే, అది ప్రకృతికి వరం అయితే, మరొకరు ఒక వృక్ష స్థావరంలో కట్టడం నిర్మించాలంటే, అది ప్రకృతికి శాపం…. ఇలా మనిషి ఆలోచనే ప్రకృతిలో పెను మార్పులకు మూలం అవుతుంది.
తన సౌకర్యం కోసం ప్రకృతిని మార్చుకుంటూ వస్తున్న మనిషి… నేడు ప్రకృతిలో సమతుల్యతను దూరం చేస్తున్నాడు.
ఒకే చోట ఒకే ప్రయత్నం చేయడం ప్రకృతికి శాపం
ఏదైనా ఒక ప్రాంతం తీసుకుంటే, అక్కడ పరిమిత వనరులు ఉంటాయి. అంటే గాలి కదులుతూ ఉంటుంది. ఇది అపరిమితం. నీరు మాత్రం పరిమితం. కానీ గాలిలో ఉండే క్రిములు ఆ ప్రాంతంలో ఉండే భూమి మరియు నీరు ఆధారంగానే ఉంటాయి.
గాలిలో ఉండే క్రిములు ఒక చోట నుండి మరొక చోటకు ట్రావెల్ చేస్తూ ఉంటే, బలమైన గాలులు వీచినప్పుడు మాత్రం భూమిపై ఉండే చెత్త కూడా ఒక చోట నుండి మరొక చోటకు వీలి నీటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి.. ఇది ప్రకృతిలో జరుగుతూ ఉంటుంది.
అయితే మనిషి అదే ప్రాంతంలో ఒక పరిశ్రమ నిర్మిస్తే ఆ పరిశ్రమ నుండి వచ్చే వాయువులు గాలిలో కలుస్తాయి. కొంత మేరకు గాలిని కలుషితం చేస్తూ ఉంటాయి. ఆలంటి వాయువులు వీచే పరిశ్రమలు అదే ప్రాంతంలో పెరిగితే, ఆ ప్రాంతమంతా వాయు కాలుష్యం చెందుతుంది. తద్వారా అసహజమైన గాలి వలన మనిషి ఆరోగ్యంతో బాటు జీవజాలం కూడా నశించే అవకాశం ఉంటుంది.
ఇంకా పరిశ్రమ ద్వారా విడుదలయ్యే ద్రవ పదార్ధాలు పూర్తి కలుషితం అయ్యి ఉంటాయి. అటువంటి ద్రవ పదార్ధాలు శుబ్రపరచకుండా విడుదల చేస్తే, ఆ ద్రవ పదార్ధాలు భూమిలోకి ఇంకి భూమిలో ఉండే నీటిని కలుషితం చేస్తాయి… (పైన్ ఫస్ట్ పేరాలో తక్కువ నీరులో చిటికెడు మట్టి ఎక్కువ ప్రభావం చూపుతుంది… అన్నట్టు ఇక్కడ కూడా ద్రవ పదార్ధాలు భూమిలోకి ఇంకితే, భూమిలోని నీటిని పాడు చేయవచ్చు… అలాగే) ఇంకా ద్రవ పదార్ధాలు ప్రవహించిన చోట వర్షం కురిస్తే, ఆ వర్షపు నీరు ప్రవహించి, అక్కడి ద్రవ పదార్ధాలు నిక్షేపలు ఒక చోట నుండి మరొక చోటకు నీటిలో చేరే అవకాశం కూడా ఉంటుంది.
ఇలాంటి కట్టడాలు ఒకే చోట ఒకే ప్రయత్నం చేయడం ప్రకృతికి శాపంగా మారుతుంటాయి.
ఒకే చోట ఎక్కువ మంది జీవనం చేయడం అంటే అది నగర ప్రాంతం
నగరాలలో లక్షలాది మంది ఒకే చోట ఉంటూ ఉంటారు. మామూలుగా అయితే మనిషి వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా పెరగకుండా ఉండాలంటే, చెట్లు, మొక్కలు ఎక్కువగా ఉండాలి. కానీ వాటి స్థానంలో స్థావరాలు పెరిగి పోతే, మనిషి చర్యలే మనిషికి హాని తలపెడతాయి.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
ఎక్కువమంది వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ప్రకృతిలో అసహత్వం సృష్టిస్తుంది అంటే, వాటికి తోడు మనిషి తన సౌకర్యం కోసం ఉపయోగించే యంత్రాలు విసర్జించే వాయువులు, ద్రవ పదార్ధాలు ఇంకా మనిషి ఉపయోగించే ప్లాస్టిక్ పదార్ధాలు…. ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీస్తుంటే, అది నగర ప్రాంతాలలో మరింతగా ఉంటుంది.
నగరప్రాంతం ఎక్కువ జనావాసలతో నిండి, నిత్యం జనులు వాహనదారులై ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయడం వలన మోటార్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది… తద్వారా గాలి కలుషితం అవుతూ నగరజీవనం పర్యావరణమునకు హానికరం అవుతుంది.
నగరములో కానీ నగర శివార్లలో కానీ ఉండే పరిశ్రమల నుండి విడుదలయ్యే ద్రవ పదార్ధాలు, వాయువులు తగు జాగ్రత్తలు పాటించకపోతే, అవి ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీస్తూ ఉంటాయి.
ఇంకా నగర జీవనంలో జనులు ఉపయోగించి, వదిలివేసే పదార్ధాలు ఒకే చోట పెరిగి, వాటి ద్వారా క్రిములు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వివిధ రకాల సౌకర్యాల కోసం ఉపయోగించి ఇంటి వస్తువులు కూడా ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలు ఉన్నట్టుగా పండితులు చెబుతూ ఉంటారు. అలాంటి వస్తువులు ఎక్కువగా పట్టణ, నగర జీవనంలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది…
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
ఏదైనా నగర జీవన విధానం ప్రకృతి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాలుష్యం నుండి ప్రకృతిని కాపాడుకోవడం
వివిధ రకాల కాలుష్యం నుండి ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఎక్కడో పట్టణంలోనో నగరంలోనో కాలుష్యం జరుగుతుంది… అని పల్లెల్లో మొక్కలు నాటడం ఆపకూడదు.
ఎక్కువగా మొక్కలు నాటడం చేయాలి… నాటిన మొక్కలు చెట్లుగా మారే వరకు వాటిని పరిరక్షించాలి.
ఎందుకంటే చెట్ల వలన అక్షిజన్ లభిస్తుంది… వర్షాభావ పరిస్థితులు ఏర్పడకుండ చెట్లు సహాయపడతాయి… మనిషి మనుగడకు చెట్లు శ్రీరామరక్షా అంటారు.
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి…
మోటార్ వాహనాల వినియోగం తగ్గించాలి… తక్కువ దూరం అయితే కాలినడక ఉత్తమం అంటారు.
ఇంకా శాస్త్రజ్నుల సలహాలు స్వీకరిస్తూ, మనిషి జీవనం సాగించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలి.
విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం. వ్యాసాలు విషయాలను విపులంగా విశదీకరిస్తాయి…. వచన రూపంలో ఉండే విషయాలు తెలుసుకోవడంతో బాటు వాటి గురించి బౌతిక పరిచయం కావడం వలన మనసుకి విషయ విజ్ఞానము వృద్ది చెందుతుంది. విజ్ఞానయాత్రలు చేయడం వలన లోకజ్ఙానం వస్తుంది. ప్రత్యేక స్థలాలకు ప్రయాణం చేయడానికి ఆసక్తి ఉంటుంది, అటువంటి ఆసక్తి చేత విజ్ఙానయాత్రలలో వినోదంతో బాటు విజ్ఙానం కూడా సంపాదించవచ్చును.
పుస్తకపఠం చేత విషయ జ్ఙానం లభిస్తే, విజ్ఙానయాత్రలు వలన విజ్ఙానంతో బాటు లోకానుభవం కూడా కలుగుతుంది. మనసుకు విహార యాత్ర మంచి బలం అయితే, విద్యార్ధి దశలో విజ్ఙాన విహార యాత్ర వలన విద్యార్ధులకు మేలును కలిగిస్తాయని అంటారు. ఒక వస్తువు ఎలా తయారు అవుతుందో పుస్తకాలలో వివరిస్తారు. కానీ దృశ్యమానంగా దర్శించాలంటే, వస్తువును తయారు చేసే పరిశ్రమకు వెళ్ళడం వలననే విద్యార్ధులకు వస్తువు తయారు ఎలా జరుగుతుందో చూడగలరు.
పుస్తకాలలో ఉండే విషయ విజ్ఞానము, ప్రకృతిలో పరిచయం అయ్యే విషయ వస్తువుల వలన మనసుపై ప్రభావం చూపుతాయి. పరిమితమైన పరిసరాలలో జీవించే వ్యక్తి కుటుంబంలోని విద్యార్ధికి వేరు ప్రాంతాలపై అవగాహన కూడా అవసరమే అయితే, అందు నిమిత్తం ఏర్పాటు చేయబడేదే విజ్ఞానయాత్రలు అంటారు.విజ్ఙానయాత్రలు విహారంగా ఉంటాయి. విజ్ఙానం అందిస్తాయి.
పుస్తకాలలో చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు, ఆ పుస్తకాలలో వ్రాయబడిన అంశంతో మనసు ఒక ఊహాత్మక దృష్టిని పొంది ఉంటే, విజ్ఞాన విహార యాత్రలు చేసినప్పుడు ఆ చారిత్రక ప్రదేశంలోకి రాగానే మనసు తాను తెలుసుకున్న అంశం ప్రత్యక్షంగా చూడడంలో మమేకం అవుతుంది. సదరు చారిత్రక అంశంలో మనసు పరిశీలన చేస్తుంది.
అలాగే ఏదైనా పరిశ్రమ విధానం గురించి చదివిన విద్యార్ధికి, ఆ విధానం కలిగిన పరిశ్రమను చూడగానే, ప్రత్యక్ష అనుభవం వలన మరింత పరిశోదనాత్మక దృష్టిని పెంచుకునే అవకాశం ఉంటుంది.
పుస్తకాలలో చదివిన విషయాలే, లోకంలో ప్రత్యక్ష్యంగా వీక్షించడం నేర్చుకునేవారికి బలంగా మారుతుంది. అలా పుస్తకాలలో చదివిన విషయాలలో ప్రత్యక్షంగా చూడగలిగేవి…
చారిత్రక ప్రదేశాలు
చారిత్రిక వ్యక్తులు నివసించిన ప్రాంతాలు
చారిత్రక వ్యక్తుల జన్మ స్థలం
వస్తు తయారీ కేంద్రాలు
భారీ వస్తు విక్రయ కేంద్రాలు
చారిత్రక కట్టడాలు
ఇలా అనేక ప్రాంతాలు, ప్రదేశాలు చూడదగినవిగా ఉంటాయి. వాటిని ప్రత్యక్ష్యంగా చూసిన వారికి విజ్ఞానమును పెంచుకున్నట్టు ఉంటుంది… విహార యాత్రలు చేసినట్టు ఉంటుంది.
విజ్ఞాన విహార యాత్రలు – చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు…
చారిత్రిక ప్రదేశాలు అంటే గోల్కొండ కోట వంటివి అయితే, చారిత్రక కట్టడాలు అంటే ఛార్మినార్ వంటివి… ఇంకా అత్యాధునికంగా తయారుచేయబడిన స్టూడియోలు వంటివి ఉండవచ్చు. ఇంకా హిందూ సంస్కృతిలో అయితే ఎక్కువ దేవాలయాలు ఉంటాయి. ఏనాటివో అయిన గోపురాలు ఉంటాయి.
విజ్ఞానమును పెంపొందించేవిధంగా విహారయాత్రలు విధ్యార్ధులతో చేయించవలసిన అవసరం ఉంటుందని అంటారు.
ఇంకా దేశ నాయకులు, స్వతంత్ర్య సమరయోధుల నివాస స్థావరాలు లేదా జన్మ స్థలాలు కూడా చూడదగినవిగా చెబుతారు.
వస్తు తయారీ కేంద్రాలలో వస్తు తయారీ విధానం ప్రత్యక్షంగా చూడడం వలన విధార్ధికి ఆ వస్తు తయారీ విధానంపై ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుంది.
ఇంకా ఆనకట్టలు దర్శించడం వలన ఆనకట్టలు కట్టించిన వారి గురించి తెలియబడుతుంది. ఆనకట్ట వలన ఉపయోగాలపై ఆవాహన పెరుగుతుంది… నీటి అవసరమా ఉపయోగం గురించి మరింత ఆవాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి.
టివి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే.
ప్రతిదినం ఎన్నో ఇళ్ల ముంగిట్లోకి వార్తలు చేరవేసే ప్రక్రియను వార్తా పత్రికలు చాలాకాలం నుండి మోసుకొస్తున్నాయి. టివి చూసినా సరే, వార్తా పత్రిక చదివితేనే వార్తలు చదివినట్టు ఉండదు అనేవారు కూడా కనబడతారు.
కొందరికి వార్తా పత్రికను చదువుతూ టీ త్రాగే అలవాటు ఉంటుందని అంటారు. వారికి వార్తా పత్రిక చదవకుండా టీ తాగితే, టీ తాగిన తృప్తీ ఉండదనే వారు ఉన్న ఆశ్చర్యపడనవసరం లేదంటారు.
అంటే ప్రతిదినం వార్తా పత్రిక చదవడం కొందరికి ఒక అలవాటుగా మారినట్టే.
ఇక సమాజనికి మీడియా ఒక స్తంభంలాంటిది అయితే, వార్తా పత్రికల ప్రధాన పాత్రను కలిగి ఉండేవి.
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం కల్పించడంతో బాటు, ప్రజా పాలనలోని లోటుపాట్లు, సామాజిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో వార్తా పత్రికలు కధనాలు చాలా కీలకమైనవి.
ఇంకా సమాజంలో ఎక్కడైనా అమానుషం ఘటన జరిగితే, దానిని నలుగురికి తెలిసేలాగా చేస్తూ, అందుకు కారణం అయినవారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టే విధంగా వార్తా పత్రికలలో కధనాలు సాయపడగలవని అంటారు.
ఉద్యమాలకు ఊపిరి పోయాలంటే, వార్తా పత్రికలలో వచ్చే కధనాలు కీలకంగా మారగలవు.
ప్రపంచంలో జరిగే విషయాలను, ప్రజలకు అక్షర రూపంలో చూపించే వ్యవస్థే వార్తా పత్రికలు
అక్షరం ఆయుధం కన్నా పదునైనది అంటారు. అక్షరంలో పలికే భావం, ఒక వ్యక్తిలో చైతన్యం తీసుకురాగలదు. అలాంటి వారిని ఎక్కువమందిని ఒకేసారి చైతన్య పరచగలిగే భావాలు, వార్తా పత్రికల ద్వారానే ప్రజాలలోకి చేరతాయి.
ప్రజలకు అవసరాలు పట్టించుకోకుండా, సామాజిక అభివృద్దిని కాదని ప్రవర్తించే ప్రభుత్వం ఉంటే, అటువంటి ప్రభుత్వ విధానాలను ఎండగట్టగలిగె అక్షర శక్తి వార్తా పత్రికల కధనాలలో కదులుతూ, ప్రజలలో అవగాహన తీసుకురాగలవు.
రాజకీయాలలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉంటే, ప్రజల పక్షం ఎప్పుడు ఉండేవి వార్తా పత్రికలుగా చెబుతారు. ప్రజా సమస్యలపై కధనాలు వ్రాస్తూ, ప్రభుత్వ అధికారులలో చలనం కలిగించే శక్తి వార్తా పత్రికలకు ఉంటుంది.
నేటి కాలంలో టివిలు, స్మార్ట్ ఫోన్లు అంటూ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నా, వార్తలను ప్రజలకు అందించడంలో వార్తా పత్రికలు పోటీ పడుతూనే ఉన్నాయి.
ఇంకా వార్తా పత్రిక పఠనం వలన విద్యార్ధులకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా సమాజంపై ఒక అవగాహన కూడా ఏర్పడగలదు.
గ్రంధములకు ఆలవాలమైన స్థలమునకు గ్రంధాలయం అని పేరు. అనేక గ్రంధములు ఈ గ్రంధాలయాలలో ఉంటాయి. గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి. అంటే లైబ్రరీ గురించి తెలుగులో వ్యాసం.
గ్రంధము అంటే పుస్తకము. ఆవహించడానికి అనువుగా ఉండేది. దేవాలయంలో దేవుడు ఆవహించినట్టుగా గ్రంధాలయములో గ్రంధములు ఆవహించు ఉంటాయి. గ్రంధములలో శాస్త్ర పరిజ్ఙానం నిక్షిప్తం అయి ఉంటుంది. ఇక గ్రంధాలయం అంటే పుస్తకాలయం. అంటే పుస్తకములు నిల్వ ఉంచు ప్రదేశముగా చెప్పవచ్చును.
ప్రజల ఉపయోగం కొరకు విజ్ఙాన విషయాలు తెలుసుకోగోరు వారికి, అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి, వాటిని పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు.
విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గ్రంధాలయాలలో లభించు పుస్తకాలు వివిధ విషయాలలో విజ్ఙానమును నిక్షిప్తం చేసుకుని ఉంటాయి.
ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు అయ్యిందని పరిశోధకులు భావిస్తారు.
చాలా గ్రంధాలయలు మనకు ఉంటున్నాయి. ఇంకా ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజి పెరిగాక ఆన్లైన్ లైబ్రరిలు పెరిగాయి.
వివిధ రకాల తెలుగు బుక్స్ స్టోర్ చేసుకుని, వాటిని చదివే అలవాటు ఉన్నవారికి, చదువుకునే నిమిత్తం బుక్స్ అందిస్తూ, చదువుకోవడం పూర్తయ్యాక వారి వద్ద నుండి బుక్స్ రిటర్న్ తీసుకోవడం… గ్రంధాలయాలలో జరుగుతూ ఉంటుంది.
విజ్నాన విషయాల గురించి వ్రాయబడిన పుస్తకాలు గ్రంధాలయాలలో లభిస్తాయి. ఇంకా వివిధ పాపులర్ రచయితల పుస్తకాలు లభిస్తాయి.
ముఖ్యంగా సామాజిక అంశాలలో వివిధ రచయితల పుస్తకాలు గ్రంధాలయాలలో లభిస్తాయి.
సమాజం చేత కీర్తింపబడ్డ ప్రముఖుల జీవిత చరిత్రలు పుస్తక రూపంలో గ్రంధాలయాలలో లభిస్తాయి.
పుస్తక పఠనం అంటే ఆ పుస్తకంలో వ్రాయబడిన అంశముతో మనసు మమేకం కావడమే అంటారు.
ఏదైనా ఒక వస్తువు తయారీ గురించి వ్రాయబడిన పుస్తకం ఒక వ్యక్తి చదువుతూ ఉంటే, ఆ వస్తువు తయారీ విధానంలో ఆచరించవలసిన విధివిధానాలపై మనసులో ఊహ పుడుతుంది.
తనకంటూ ఒక పూర్తి ఊహాత్మక విధానం తట్టేవరకు మనసు పుస్తములో విషయంపై దృష్టిసారిస్తుంది. అలా పుస్తక పఠనం అంటే మనసు పుస్తకం చదువుతూ ఉన్నంతసేపు ఏకాగ్ర చిత్తంతో ఉంటుంది.
ఇలాగే ఎవరైనా గొప్పవారి జీవిత చరిత్ర చదివినా అక్కడి అప్పటి పరిస్థితులపై మనసు ఊహ ఏర్పరచగలదు. కాబట్టి మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉండడం వలన మనసులో మంచి ఆలోచనలు పెరుగుతాయి.
జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుంది
గ్రంధాలయాలలో అన్నీ రకాల విజ్ఞాన పుస్తకాలు లభిస్తాయి.
ఏదైనా ఒక వస్తువు తయారీ విధానం గురించి పుస్తక రూపంలో ఉంటే అది గ్రంధాలయంలో ఉండవచ్చు.
ఎవరైనా గొప్ప వ్యక్తి గురించి పుస్తకం వ్రాయబడి ఉంటే, అది కూడా గ్రంధాలయంలో లభించే అవకాశం ఉంటుంది.
గతంలో జరిగిన సామాజిక చరిత్ర గురించి పుస్తకాల రూపంలో గ్రంధాలయాలలో లభిస్తుంది.
సామాజిక, తాత్విక, వేదాంత విజ్ఞానము, పిల్లల పెంపకం, పిల్లల పేర్లు, వ్యవస్థ, వ్యవస్థ విధి విధానాలు ఇలా ఎన్నో రకాల అంశాలలో పుస్తకాలు ఉంటే, అవి గ్రంధాలయంలో లభించే అవకాశం ఉంటుంది.
తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి గ్రంధాలయం ఒక విజ్ఞాన కూడలి అవుతుంది. విజ్ఙాన వేదికలు అన్నీ అక్షరరూపంలోకి మారితే, అవి గ్రంధాలయములలో అల్మారాలలో నిక్షిప్తం అయి ఉంటాయి.
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం తెలుగులో….
నాయకుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు. ప్రజా సమస్య నుండి, దాని సాధించడానికి ప్రజల మధ్య నుండే నాయకత్వం ఉదయిస్తుందని అంటారు.
నాయకత్వం వహించేవారు పెత్తనం చేయాలనే తపన కాదు… నాయకత్వం అంటే సమస్యను పరిష్కరించుకోవడంలో తను ముందుండి అందరికీ మార్గదర్శకంగా నిలబడడం అంటారు.
కొందరు నాయకత్వం లక్షణాలు ఉన్నవారిలో అజమాయిషీ అనే ఆలోచన ఉండదు… వారిలో లక్ష్యాన్ని సాధించాలనే ఉండే పట్టుదల, లక్ష్యసాధనకు వారు చేసే కృషివలన అందరూ ఆ నాయకత్వమును అంగీకరిస్తారని అంటారు.
ఏదైనా నాయకత్వం అంటే ఇలా నాయకత్వ లక్షణాలు…
ఒక సమూహానికి లేక ఒక ప్రాంతవాసులకు ఒక వర్గమువారికి సంబంధించిన ఒక ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి చిన్న చిన్న లక్ష్యాలు నిర్ధేశిస్తూ, వాటి అమలుకు సహచరులు సలహాలు, తీసుకుంటూ అనుచరులను కలుపుకుంటూ ఒక వ్యక్తి అందరి మద్దతుతో ముందుకెళ్ళే ఒకా సాంఘిక ప్రక్రియ ప్రభావంతంగా సాగుతుంటే నాయకత్వంగా చెబుతారు.
పెద్ద లక్ష్యాన్ని చేధించడానికి అడ్డు వచ్చే సమస్యలపై పోరాడుతూ, పెద్ద లక్ష్యంవైపు నుండి అందరి దృష్టి మరలిపోకుండా చూసుకోవడంలో నాయకత్వ ప్రభావం కనబడుతుంది. ఇక ఆ లక్ష్యం చేరేవరకు సరైన ప్రణాళిక రచనా చేస్తూ, ఆ ప్రణాళికను అమలుచేయడంలో నిశ్చయాత్మక బుడ్డితో వ్యవహరించేవారు లక్ష్యంవైపు అనుచరలను నడిపించడంలో మార్గదర్శకంగా ఉంటారు.
సహచరులను కలుపుకుంటూ, సాంఘికంగా తమ లక్ష్యం యొక్క అవశ్యకతను తమ ప్రాంతంలో లేక తమ వర్గంలో ఉన్న అందరికీ అర్ధం అయ్యేలాగా తెలియజేస్తూ, లక్ష్య సాధనకోసం అందరిలో ప్రేరణ కలిగించే విధంగా మాట్లాడగలగడం నాయకత్వ లక్షణాలలో ప్రధానమైనదిగా చెబుతారు.
ముందుగా ఒక సామాజిక లేదా ప్రాంత లేదా వర్గము యొక్క లక్ష్యం సాధించాలంటే, ఒక్కరి వలన కాదు సమిష్టిగానే సాధించవలసి ఉంటుందని నాయకుడు గుర్తిస్తాడు. అందుకోసం అందరినీ సమిష్టిగా కలిసి తమ లక్ష్యం సాధించుకోవలసిన అవశ్యకతను తెలియజేస్తూ ఉంటాడు.
పరిస్థితులు ఆకళింపు చేసుకోవడం
వ్యక్తి యొక్క తెలివి, పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం, సాధ్యాసాధ్యాలు అంచనా వేయడం, భవిష్యత్తుపై అవగాహన, ధృఢమైన సంకల్పం, పట్టుదల, ధైర్యంగా మాట్లాడగలగడం, కొత్త కొత్త విషయాలను ఆహ్వానించగలగడం, శ్రేయస్సు కోసం పాటుపడే తత్వం, వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత ప్రవర్తన మొదలైన లక్షణాలు నాయుకునికి లేదా నాయకురాలికి ఉంటాయని అంటారు.
ప్రధానంగా నాయుకుడు లేదా నాయకురాలుకి ఉండవలసిన లక్షణం అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకోగలగడం…. ఆలోచన విధానం అందరినీ ఆలోచింపజేసెదిగా ఉండాలి అని అంటారు.
లక్ష్యంపై పూర్తి అవగాహన ఉండడం, సామాజికపరమైన అవగాహన, సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళిక రచన చేస్తూ, తమ లక్ష్యా సాధనకు కృషి చేయడం, అందరినీ ఆ యొక్క లక్ష్యంవైపుకు నడిపించడం.
లక్ష్యసాధనకు అందరిలోనూ స్పూర్తిని అంధించే కార్యక్రమాలు చేపట్టడం తదితర లక్షణాలు నాయకత్వ లక్షణాలుగా చెబుతారు.
యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం. ఇప్పటి ప్రసాద సాధనాలు యువతపై రెండు రకాల ప్రభావం చూపించే అవకాశం కలదు.
ఒకటి: ఉపయుక్తమైన విషయ సంగ్రహణం చేసే క్రమంలో ఉత్సాహావంతులకు ప్రోత్సాహకరంగా నేటి సాంకేతికత ఉపయోగపడును.
రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
బ్లేడు రెండువైపులా పదును కలిగి ఉండి, దానిని ఉపయోగించేటప్పుడు చేతి వెళ్లకు ప్రమాదకరంగా ఉంటుందో, నేటి సాంకేతికత కూడా ఎదిగే మనసుకు అలాగే ఉంటుంది.
ప్రసార సాధనాల ప్రభావం సమాజంలో ముఖ్యంగా యువతపై ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా మొబైల్స్ రూపంలో ప్రసార సాధనాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది.
ఒకప్పుడు ప్రసార సాధనాలు కేవలం పత్రికల రూపంలోనే ఉండేవి. అవి మాస పత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు, దిన పత్రికలు అంటూ పత్రికల ద్వారకా సమాచారం అందేదీ.
రేడియో కార్యక్రమాలు ప్రజలను అలరిస్తూ వచ్చేవి, సాయం వేళలో సాంగ్స్ వినడం ఒక అలవాటుగా కూడా ఉండేదని అంటారు.
ఆ తరువాత టివిల వలన ప్రసార సాధనాల పనితీరు మెరుగు పడింది. అనేక అంశాలు ప్రతి ఇంటిలోకి వార్తలుగా రావడం… ఇంకా వినోద కార్యక్రమాలు సంఘజీవిని ఇంటికే పరిమితం చేయడంలో టివిల పాత్ర ప్రముఖమైనది అంటారు.
టివిల నుండి వేగం అందుకున్న ప్రసార సాధనాలు ఇప్పుడు అందరి చేతులలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే అందించే క్రమానికి మారాయి.
పత్రిక – రేడియో – టివి – కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ – స్మార్ట్ ఫోన్ ఇలా ప్రసార సాధనాలు అక్షర రూపంలో, శబ్ధరూపంలో, దృశ్య రూపంలో ప్రసారం అయ్యి, ఇప్పుడు దృశ్యం రూపం పెద్ద పెద్ద స్క్రీనుల నుండి అతి చిన్న స్క్రీనులా ద్వారా కూడా ప్రపంచాన్ని అరచేతిలో చూపుతున్నాయి.
యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం
స్మార్ట్ ఫోన్, ఇది ఒక మాయల మరాఠి చేతిలో మంత్రదండం లాగా మనిషి చేతిలో ఇమిడిపోయింది.
ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టడానికి క్యూ కట్టిన జనులు ఇప్పుడు ఉన్న చోట నుండే కదలకుండా కరెంట్ బిల్ పే చేసే స్థితిని ప్రసార సాధనాలు కల్పిస్తున్నాయి.
సమయం సేవ్ చేయడంలో ఇది మంచి పరిణామం అయితే, అదే సమయంలో సహనం స్థానంలో అసహనం ఏర్పడే అవకాశం కూడా ఈ స్మార్ట్ ఫోన్ వంటి సాధనాల రూపంలో కలిగే అవకాశం ఉంటుంది.
ఇలా ఏదైనా నెలవారి చెల్లింపులు చేయడంలో చేతిలోని స్మార్ట్ ఫోన్ పనితీరు ఒక అద్బుతమే అని చెప్పాలి. ఇది నిజంగానే చేతిలో మంత్రదండం వలె ఉంటుంది.
ఇక వినోద కార్యక్రమాలు అయితే సరే సరి. ఎప్పుడంటే అప్పుడే, ఎక్కడంటే అక్కడే టైమ్ పాస్ కావడానికి స్మార్ట్ ఫోన్లో ఎన్నో వినోదాత్మక వీడియోలు దర్శనమిస్తాయి. వినోదభరిత పెట్టె వలె చేతిలో ఇమిడిపోతుంది.
ఒకటి: ఉపయోగకరమైన విషయ సంగ్రహణకు కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ మరియు స్మార్ట్ ఫోన్లు చాలా ఉపయోగకరంగా….
ఉంటున్నాయనే చెప్పాలి.
ఒక విధ్యార్ధి తరగతిలో టీచర్ చెప్పిన విషయం అర్ధం కాకపోతే, ఇంటర్నెట్ ఆధారిత పరికరములలో శోధించి సాధించవచ్చు.
అలాగే ఒక ఉద్యోగి తన కార్యచరణలో సందేహాలకు సమాధానాలను ఇంటర్నెట్ ఆధారితపరికరాల ద్వారా వచన రూపంలో కానీ దృశ్య రూపంలో కానీ పరిస్కారం కనుగొనవచ్చు.
నేర్చుకునే వయస్సులో ఆసక్తికి నేటి సాంకేతికత అదనపు ఆయుధంగా మారుతుంది. అయితే అది మంచి ఆసక్తి అయితే, అది అతని ఉన్నత స్థితికి హేతువు కాగలదు…
అవసరానికి ఆలోచన తోడైతే, ఆ ఆలోచన అందరికీ ఉపయోగపడేది అయితే, అదే ఆలోచనను అభివృద్ది పరచి అందరికీ ఉపయోగపడేలా చేయడంలో నేటి సాంకేతికత ఒక ప్రోత్సాహకరంగా ఉండగలదు.
రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం
కూడా నేటి సాంకేతికత ద్వారా అభివృద్ది చెందిన ప్రసార సాధనాలు కారణం కావచ్చు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో వ్యక్తికి స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది.
అతను శోధించే అంశం అతనికే పరిమితం అవుతుంది కానీ అతని శ్రేయోభిలాషులకు తెలిసే అవకాశం తక్కువ.
వయసుకు మించిన విషయాలు కూడా ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు ఉపయోగించేవారి దృష్టికి వచ్చే అవకాశం నేటి ప్రసార సాధనాల ప్రభావం ద్వారా ఉండవచ్చు.
వాటిని ఉపయోగించే వారి విజ్నతను బట్టి ప్రసార సాధనాల ఉపయోగం ఫలితం ఉంటుంది.
ఈ ప్రసార సాధనాల ప్రభావంతో వ్యక్తి ఆలోచనా తీరు వేగం పుంజుకుంటే, దానికి సరి అయిన పరిస్కారం యోగా అంటారు.
మనసుని నియంత్రించే ప్రక్రియలో యోగా మేలైనదిగా చెప్పబడుతుంది.
ఇప్పటి ప్రసార సాధనాలు అనెక అంశాలుయువత మదిలోకి చొచ్చుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే శ్రేయస్సు కలిగించే విషయాలు మాత్రం మనిషికి శాంతిని అందిస్తే, ఆకట్టుకునే విషయాలు మనసులో అశాంతికి ఆలవాలం కాగలవు.
మంచి చెడులు ఒకరిని అనుసరించి తెలుసుకునే రోజుల నుండి శోధించే తెలుసుకునేవిధంగా ప్రసార సాధనాలు మార్పును తీసుకువచ్చాయి.
కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది?
వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారబడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే, ఆ వ్యక్తి చేతివృత్తికి విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా, అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభ ప్రదర్శించలేకపోతే, ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే అంటారు.
అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం లేక ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు, ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయడంపైన ఆధారపడి ఉంటుంది.
వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ, ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తూ ఉంటే, సేవలు సమయానికి ఉపయోగపడితే, సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. సదభిప్రాయం ఏర్పడితే, సదరు వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించగలరు. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదు.
గడువులోపులో పనిని పూర్తి చేయగలగడం వలన అవసరాలకు అంతరాయం కలగదు
ఒక మోటారు సైకిల్ మెకానిక్, ఒక వ్యక్తి యొక్క మోటారు సైకిల్ రిపైరు చేయడానికి రెండురోజులు గడువు కోరితే, అతను ఖచ్చితంగా తను కోరిన గడువులోపులో మోటారు సైకిల్ రిపైరు చేయగలిగితే, సదరు మోటారు సైకిల్ యజమాని యొక్క మన్ననకు పాత్రుడు కాగలడు. కానీ ఆ రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైరు చేయలేకపోతే మాత్రం, మరొకసారి మోటారు సైకిల్ రిపైరుకు వచ్చినప్పుడు సదరు యజమాని మరొక మెకానిక్ కొరకు శోచించే అవకాశం ఉంటుంది. అదే మోటారు సైకిల్ తన దగ్గర కొంతమంది సహాయకులను పెట్టుకుని, తన దగ్గరకు వచ్చిన ప్రతి మోటారు సైకిల్ రిపైరు చేసేస్తూ ఉంటే, అతని దగ్గరకు ఆ ప్రాంతపు మోటారు సైకిల్ యజమానులు మోటారు సైకిల్ రిపైరు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ కాలంలో అవసరానికి మోటారు సైకిల్ రిపైర్ చేయగలగడం వలన అతని ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఇంకా వాహనదారుల పని కూడా అంతరాయం ఏర్పడకుండా ఉంటుంది.
కాలంలో ఒక వ్యక్తి ఇచ్చే కమిట్ మెంట్, మరొక వ్యక్తి మరొకరికి ఇచ్చే కమిట్ మెంట్ కు కారణం కాగలదు. అంటే మోటారు సైకిల్ మెకానిక్ ఒక మోటారు సైకిల్ యజమానికి మోటారు సైకిల్ రిపైరుకు రెండురోజులు గడువు ఇస్తే, ఆ మోటారు సైకిల్ యజమాని కూడా తను పనిచేసే చోట కానీ, తన సేవలు అందుకునే వ్యక్తులకు కానీ అదే గడువు కోరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోటారు సైకిల్ మెకానికి రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైర్ చేయగలిగితే, అతని మాట నిలబడుతుంది. ఇంకా మోటారు సైకిల్ యజమాని మాట నిలబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే, కాలమును బంగారంగా మార్చుకోవడమే…. భవిష్యత్తులో మాటకు విలువ పెరగడమే అవుతుంది.
అలా ఒక మెకానిక్ తను కోరిన గడువులోపులో పనిని పూర్తి చేయగలగడం వలన అవసరాలకు అంతరాయం కలగదు.
ఇలా వ్యవస్థ అయిన సరే, తమ సంస్థ ఇచ్చే గడువులోపులో సేవలను అందించడమే, ఆ సంస్థ మనుగడకు ప్రధాన కారణం కాగలదు.
వ్యక్తి జీవితములో కాలం కన్నా విలువైనది ఉండదు.
బాల్యం అంటే చిన్నప్పుడు
యవ్వనం అంటే యుక్త వయసుకు వచ్చినవారు
వృద్దాప్యం అంటే ముసలివారు….
పై ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి.
బాల్యంలో ఆటలు ఆదుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా చాలా ప్రధాన విషయం. బాల్యంలో ఒక బాలుడు స్కూల్ కు వెళ్తూ చదువుకుంటూ, రోజు కొంత సమయం ఆటలు ఆడుకోవడం… ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు.
ఆటల వలన శరీరానికి అలుపు ఉంటుంది. సమయానికి తినడం వలన, తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వలన విషయ పరిజ్నానమ్ పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది.
సామాన్యమైన చదువు ఒక ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది.
అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యంగా ఉండేలా, బాల్యంలో చదివే చదువులు వ్యక్తి వృత్తికి సాయపడేలా ఉంటాయి… ఇక్కడ ఎంత శ్రద్దపెట్టి చదువు చదివితే, అంత గుర్తింపు… ఎంత చక్కగా తిండి తిని, సరైన వ్యాయామం కానీ ఆటలు కానీ అడితే, అంతటి ఆరోగ్యం అంటారు.
కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలమును ప్రభావితం చేస్తుంది. అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని, వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో పడుతుంది.
కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం
అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి… అందుకు శ్రమించాలి అని అంటారు.
కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై పడుతూ ఉంటాయి… అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగ పడుతుంది.
ఒక వ్యక్తి వ్యాయామంతో కాయమును పెంచితే, ఆ కాయము కాలంలో వచ్చే అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుందని అంటారు.
అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే, కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది.
ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే, కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు….
అంటే ఒక వ్యక్తి చేసే సాధన ఏవిధంగా ఉంటే, అదే విధంగా కాలంలో సమాజం నుండి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు.
ఈ విధంగా కాలం వ్యక్తి జీవితముపై అనేక విధాలుగా ప్రభావం చూపగలదు… కాబట్టి కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం… అందుకే కాలం చాలా విలువైనది… ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు… ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది…. మాత్రం సత్యం... కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం…
పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం. పక్షులకు ప్రధానంగా ఎగిరే గుణం ఉంటుంది. తమ ఆహార సముపార్జనకు ఆకాశంలో తమ శక్తిమేర ఎగురుతాయి.
ఈ పక్షులు అంతరోష్ణ జీవులు లేక ఉష్ణ రక్త జీవులు అంటారు. పక్షుల శరీరం ఎగరడానికి వీలుగా వాటి దేహ నిర్మాణం ఉంటుంది.
రెక్కల సాయంతో పక్షులు ఎగురుతాయి. శరీరంపైభాగం ఈకలతో కప్పబడి ఉంటుంది.
కొన్నిరకాల పక్షులు నీటిపై కూడా ఉండగలవు. వీటిని నీటిపక్షులు అంటారు.
కొన్ని పక్షులు రాత్రులు మేల్కొని ఉంటాయి, రాత్రివేళల్లో మాత్రమే సంచరిస్తాయి. వీటిని నిశాచర పక్షులు అంటారు.
మరికొన్ని పక్షులు ఒక నిర్ధిష్ట సమయం ప్రకారం చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి, మరల తిరిగి వస్తాయి. వీటిని వలస పక్షులు అంటారు.
నీటిపక్షులకు ఉదాహరణగా బాతు, హంస, నీటికోడి, నీటికాకి…. చెబుతారు.
నిశాచర పక్షులకు ఉదాహరణగా గుడ్లగూబ, పైడిగంట…. చెబుతారు.
రకరకాల పక్షులు భూమిపై జీవిస్తూ, ఆకాశంలో ఎగురుతాయి. పిచ్చుకలు, కాకులు, గ్రద్దలు, చకోర పక్షి, చిలుక, మైనా, పావురాలు, రాబందులు, కొంగలు, లకుముకి, వడ్రంగి, పాలపిట్ట, గోరింక తదితర పక్షులు ఉంటాయి.
పక్షులు గూడు గురించి
తల్లిపక్షి పిల్ల పక్షులను గూడులో ఉంచి కాపాడుతుంది. పిల్ల పక్షులకు ఆహారం తీసుకొచ్చి, పిల్ల పక్షుల నోటిలో పెడతాయి. పిల్ల పక్షులకు రెక్కలు వచ్చి ఎగిరేవరకు తల్లి పక్షి, పిల్ల పక్షులను రక్షిస్తుంది.
ఇక ఈ పక్షిగూళ్ళు పుల్లలు, గడ్డి, ఆకులు వంటి సేంద్రీయ పదార్థాలతో కలిసి ఉండవచ్చు, ఇవి రకరకాల పరిమాణాలలో ఉండవచ్చు. వివిధ ఆకారాలలో కనబడతాయి. ఇంకా రాయి, చెట్టు, లేక భవనాలలోని కిటికీ రంధ్రాలు కూడా గూడులుగా మార్చుకుంటాయి. కొన్ని పక్షి గూళ్ళు గుండ్రంగా ఉండవచ్చు. కొన్ని పక్షిగూళ్ళు పైకప్పు లేకుండా ఉంటాయి. కొన్ని గూళ్ళు కేవలం పుల్లలలో నిర్మితమై ఉంటాయి,
పక్షి పిల్లలు అన్నీ గూడులోనే ఉండి, తల్లి పక్షి అందించే ఆహారంతో బ్రతుకుతాయి. పిల్ల పక్షులు ఉన్న గూడును తల్లి పక్షి కాపలా కాస్తూ ఉంటుంది.
ఈ భూమిపై మనిషితో బాటు అనేక జంతువులతో బాటు పక్షులు కూడా చాలానే ఉండేవి…. కానీ కాలంలో మారిన పరిస్థితుల బట్టి పక్షి జాతులు అంతరిస్తున్నట్టు చెబుతారు.
పిచ్చుకలు ఎక్కువగా కనబడేవని. ఇప్పుడు అవి కనబడడం లేదు అంటారు. కారణం సెల్ టవర్స్ అని చెబుతారు.
ఇలా కొన్ని మానవ సౌకర్యాల కోసం ప్రకృతిలో చేసే మార్పులు మరొక జాతి అంతమునకు కారణం అవ్వడం విచారకరం.
మన దేశం గురించి వ్రాయండి తెలుగులో మన దేశం భారత దేశం గురించి వ్రాయండి…
పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి…. అంటూ సాగే తెలుగు సినిమా పాటలో భారతదేశపు మహనీయుల గురించి కీర్తించబడింది.
మనదేశం భారతదేశం అనేక మంది మహానుభావులను అందించిన దేశం. అందరు విశ్వమును సమభావముతో చుసిన మహానుభావులే కావడం విశేషం.
స్వామి వివేకానందా, రామ కృష్ణ పరమహంస, గాంధీ తదితర మహనీయులు ప్రపంచం చేత కీర్తింపబడ్డారు. ఆ మహానుభావులు మన భారతదేశపు గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము…. అను భారతీయ తెలుగు జాతీయ గీతాన్నిరాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. దేశమంటే ఏకాదటిపై నడిచే ప్రజా వ్యవస్థ అని తెలియజేసే మేలుకొలుపు గీతాలు మనకు లభిస్తాయి.
ఇంకా దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. అంటూ సాగే పాటలు మన మనసులో ఆలోచన సృష్టిస్తాయి.
ఇంతమంది మహనీయులు దేశం గురించి అంతగా ఆలోచన చేసి, తపనతో పాటలు రచించారు… అంటే, వారి వారి మనసులలో దేశమంటే ఎంత ప్రీతి? దేశమంటే ఎంత భక్తి భావం ఉందో తెలియవస్తుంది. మనదేశం ఇటువంటి సాహితి వేత్తలను అందించింది.
ఎక్కడైనా ఏదో ఒక విధానం ఉంటుంది. ఏదో ఒక విధానం వలన కొందరు ఇమడలేకపోవచ్చు. ఇంకా జీవన పరమార్ధం విషయంలో అయితే ఆయా దేశాలలో ఏదో ఒక వీధి విధానం మాత్రమే అనుమతి ఉంటుంది.
కానీ మన దేశం మన మాతృదేశం అయిన భారతదేశంలో జీవనపరమార్ధం విషయంలో అనేక మతాలు ఉన్నాయి. నచ్చిన మతాచారం అందుకుని జీవనగమ్యం వైపు వెళ్లడానికి అందరికీ హక్కులు రాజ్యాంగం ఇచ్చింది. ఈ మతస్వేచ్ఛ రాజ్యాంగంలో మరే ఏ దేశంలోనూ లేదని అంటారు.
ఆచారవంతమైన విధానంలోనే ఇంత స్వేచ్ఛను భారతీయ పౌరలకు లభిస్తుంటే, మిగిలిన విషయాలలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉంటుందో… ఆలోచన చేయవచ్చు. మనదేశం వ్యక్తిగత స్వేచ్ఛకు ఆలవాలం.
ఎవరో ఒక గొప్పవాడు, డబ్బున్నవాడు దేశంలో స్వేచ్ఛగా జీవించడం ఎక్కడైనా ఉంటుంది. కానీ ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా జీవించగలగడమే నిజమైన ప్రజస్వామ్యం అయితే, అది మనదేశంలోనే ఉంది.
సామాన్యుడు నుండి అసామాన్యుడు వరకు స్వేచ్చను అందించే మనదేశం మన భారత దేశం… శాంతికి మూలాధారం లాంటిది.
ఏదో దేశంవారు మరొక దేశంపై క్రూరంగా దాడి చేయడం, వారు ప్రతీకార చర్యలకు పాల్పడడం ఎక్కువగా జరుగుతుంది. మనదేశంపైన కూడా అప్పుడప్పుడు జరుగుతుంది.
కానీ భయబ్రాంతులకు గురయ్యే అవకాశం మన దేశం భారత దేశంలో తక్కువ. మన దేశం భారత దేశం శాంతిని కోరుకునే దేశం. అందులో నాయకత్వ లక్షణాలు మన దేశం భారత దేశానికి ప్రతినిద్యం వహించే వారిలో పుష్కలంగా కనబడతాయి.
ఈ అంశంలో స్వామి వివేకానందా వంటివారు నిరూపించారు. శాంతిగా ఉన్నచోట మానవ మనుగడ ప్రశాంతతో ఉంటుంది. అంతకుమించిన గొప్ప సమాజం ఏముంటుంది?
మన దేశం భారత దేశంలో శాంతికి ఆలవాలం ఎలా?
ఏనాటి నుండో ఉన్న మన భారతీయ సాంప్రదాయంలో స్త్రీలు శాంతితో ఉన్నారు. వారి వలన గొప్ప గొప్ప సామాజిక, తత్వవేత్తలు మన దేశం భారత దేశంలో జన్మించారు. వారి వలన దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయం గురించి తర్వాతి తరాలకు తెలియబడుతూ వచ్చింది.
అందుకు సాక్ష్యంగా అనేక దేవాలయాలు, వాటి వాటి స్థల పురాణములు ఉంటాయి. ఎందరో భక్తులు దైవాన్ని తెలుసుకున్నట్టుగా పురాణాలు చెబుతాయి.
యోగులు శాంతితో సామాజిక సంక్షేమం కోరుతూ, ధర్మ ప్రచారం చేయడం, ప్రజలను శాంతివైపు నడిపించే విధానం గురించి విస్తృత ప్రచారం చేసి ఉండడం మరొక ప్రధాన కారణం… మన దేశం భారత దేశం శాంతికి మూలం.
మన దేశం భారత దేశంలో సాహితి వేత్తలు, సామాజిక వేత్తలు, తత్త్వ వేత్తలు వలన సామాజిక సమస్యలపై అవగాహన సమాజంలో ఏర్పడుతూ ఉంది. తత్వవేత్తల వలన వ్యక్తిలో చిత్తశుద్దిపై ఆలోచన ఉంటుంది… ఈ ఈ విధానాలు మనిషిలో శాంతి అనే అంశం ఉంటూ ఉంటుంది.
ఎన్నో పర్యాటక ప్రాంతాలు, ఎన్నో చరిత్రాత్మ ప్రాంతాలు, ఎన్నో పురాణ కట్టడాలు, ఎంతో మంది యోధులు, సాధువులు, యోగులు మన దేశం భారత దేశంలో జన్మించారు.
నిత్య శాంతి కోసం తపించే నాయకత్వం మన దేశం భారత దేశంలో ఎప్పుడూ ఉంటుంది. ఆ నాయకత్వం అంగీకరించే ప్రజలు సమాజం శాంతితో ఉండడానికి పునాదిగా ఉంటుంది.
విశ్వశాంతి అంటే అది భారతదేశం వలననే సాధ్యమనే భావం ప్రపంచం అంతటా ఉండడం, మన దేశం భారత దేశం యొక్క కీర్తి తెలియబడుతుంది.
ఇంతటి మన దేశం భారత దేశంలో పాలన కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో ఏ రాష్ట్రనికి, ఆ రాష్ట్రమే పరిపాలన కొనసాగించే అధికారం ఉంది. ఇవి కాక కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
మన దేశం భారత దేశంలో గల రాష్ట్రాలు తెలుగులో
ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ చత్తీస్ గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఒడిషా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమబెంగాల్
కేంద్రపాలిత ప్రాంతాలు మన దేశం భారత దేశంలో
అండమాన్ నికోబార్ దీవులు చండీగడ్ దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ జమ్మూ కాశ్మీర్ లడఖ్ లక్షద్వీప్ ఢిల్లీ పాండిచ్చేరి
నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న ముందుంటాడు. నాన్న వలన నలుగురిలో గౌరవం దక్కుతుంది. నాన్న వలన నలుగురు పరిచయం అవుతారు. నాన్నతోనే సామాజిక ప్రభావం ప్రారంభం.
అమ్మ గురించి చెప్పడంలో పడి నాన్నను మరిచిపోయిన రచనలు అన్నట్టుగా నాన్న కన్నా అమ్మనే రచనలు కీర్తిస్తాయి. కానీ అవిరామ శ్రమ నాన్నలో ఉంటుంది.
పిల్లలకు నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు. అలాంటి ఆలోచనకు పునాది నాన్న వలననే కలుగుతుందని అంటారు.
కేవలం చదువుకునే వయసులోనే నలుగురిలో గౌరవం లభిస్తుందంటే, అది నాన్నపై సమాజంలో నిలిచిన మర్యాదే. ఎదుగుతున్న బాలబాలికలకు సమాజంలో ఏర్పడే స్థితి నాన్నతో ముడిపడి ఉంటుంది.
కన్నబిడ్డల కోసం కన్నతల్లి అమృతమైన ప్రేమను అందిస్తే, వారి పోషణకు నాన్న తన రక్తాన్నిధారపోస్తాడు. కష్టపడి ఇష్టంతో కాలంలో కలిగే కష్టాలను ఎదుర్కుంటాడు.
తనను నమ్ముకుని ఎదుగుతున్నవారి ఆశలకు నాన్న జీవం పోస్తాడు. నాన్న ఉన్నాడనే ధైర్యంతో పిల్లలు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలరు.
సమాజంలో నాన్న ఇచ్చే రక్షణ మరే ఇతరులు ఇవ్వలేరని అంటారు. నాన్న అంటేనే భరోస… నాన్న బ్రతుకుకి భరోస కల్పించగలడు.
అమ్మాయి అల్లరిని ఆధారిస్తాడు. అబ్బాయి బరువును మోస్తాడు. అమ్మాయి ఆలోచనకు విలువనిస్తాడు. పిల్లల మనోభావాలను ఎరిగి, వారి వారి ఆశయాలకు అనుగుణంగా నాన్న చేసే కృషి అద్బుతమే అవుతుంది.
ఎదిగే పిల్లలకు ఆదర్శంగా కనిపించేవారిలో, నాన్నే మొదట నిలుస్తాడు. నాన్న ఆదర్శంలో మార్గదర్శకంగా మారతాడు. నాన్నను అనుసరించాలనే ఆలోచన పిల్లలకు కలగకమానదు.
ఎదిగే వయస్సు చేసే అల్లరికి నాన్న ఒక అడ్డుగోడ. నాన్నను దాటి అల్లరి అల్లరి చేయలేదు.
జీవనగమ్యం చేరడంలో నాన్న ఆచరించిన కుటుంబ పద్దతి, తర్వాతి తరానికి కూడా విధానం అయి కూర్చుంటుంది.
నాన్న లేని సమాజంలో బిడ్డడి, భవిష్యత్తు ఆగమ్యగోచరం. నాన్న వలననే మర్యాద, మన్నన మొదటగా సమాజం నుండి లభిస్తాయి. నాన్నను అనుసరించే అమ్మకు, నాన్నే మార్గదర్శకం. బిడ్డలకు నాన్నే మార్గదర్శకం.
సమాజంలో ఒక కుటుంబానికి ఏర్పడిన గుర్తింపు నాన్న సంపాదించిన విలువైన ఆస్తి వంటిది. ఆ ఆస్తిని ఎవరు దొంగిలించలేరు. పోగొట్టుకుంటేనే పోతుంది తప్ప, విలువైన ఆస్తి నాన్న సంపాదించిన గౌరవ, మర్యాదలు మనిషికి వెన్నంటి జీవితాంతం ఉంటాయి.
ఎప్పుడూ నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అయితే
నాన్న తనకోసం తను కష్టపడింది… తక్కువగానే ఉండవచ్చు. కానీ బిడ్డల కోసం పడే కష్టం, తపన ఎక్కువగానే ఉంటుంది. అదే నాన్న తత్వం.
కష్టాన్ని ఇష్టంగా ధారపోసే నన్నతత్వం పెద్దగా గుర్తింపు పొందకపోయినా…. నాన్న మాత్రం తనవారి కోసం తాను శ్రామిస్తూనే ఉంటాడు.
అన్నీ తెలిసినా ఏమి తెలియనివాడిలాగా ఉండడం నాన్నతత్వంలోనే ఉంటుంది. పిల్లల దగ్గర నేర్చుకుంటున్నట్టు ఉండగలడు. పిల్లలు గాడి తప్పుతుంటే, భయాన్ని చూపించగలడు.
వయసుకు వస్తున్నవారికి అలవాట్లు అలుముకోకుండా, వ్యసనాలు వంటబట్టకుండా నాన్న అనే భయం బిడ్డడిని కాపాడుతూ ఉంటుంది.
అమ్మ చూపే అమృతమైన ప్రేమ ముందు, నాన్న శ్రమ, నాన్న తపన కనబడదు. కానీ బిడ్డలు సాధించే విజయాలకు ఆరంభం అమ్మ అయితే, పట్టుదల నాన్నే అవుతాడు.
యువకుడుగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవమే, నాన్నగా మరగానే ఆలోచనగా మారిపోతుంది. నిత్యం పిల్లల శ్రేయస్సుకొరకు తపన ప్రారంభం అవుతుంది. పిల్లల కట్టడికి కారణం, సమాజంలో తాను చూసిన సామాజిక పరిస్థితుల ప్రభావం అవుతుంది.
కఠినంగా ఉన్నట్టు కనబడే నాన్న హృదయం వెనుకాల, బిడ్డడి భవిష్యత్తు బాగుండాలనే తాపత్రయం వరదలా ప్రవహిస్తుంది. నాన్న కనబడని ప్రేమ ప్రవాహం వంటి వాడు.
నాన్న ప్రేమ ప్రవాహం కనబడకుండా భవిష్యత్తు కోసం తీసుకునే ప్రణాళిక, ప్రణాళిక అమలు కోసం చేసే నిర్ణయాలు, అలవాట్లకు అంటుకోకుండా చేసే కట్టడి… తదితర విషయాలు కప్పిపుచ్చుతాయి.
ఎదిగే పిల్లల చెడు ఆలోచనలకు నాన్న ఆనకట్టవంటివాడు.
పిల్లల కోసం పాటుపడే తల్లిదండ్రులలో ఎక్కువతక్కువలనే భావనే ఉండదు. అలాంటి వారిలో క్రమమైన ఆలోచనను అమలుపరిచేది నాన్న యొక్క దీక్షే.
నాన్నకు ప్రేమతో మంచి అనిపించుకోవడంలో ముందుండాలి. నాన్నకుప్రేమతో ఇచ్చే కానుక అంటే, సమాజంలో చెడు అనిపించుకోకుండా బ్రతకడమే అంటారు.
బిడ్డకు నాన్న ఇచ్చిన బారోసా ముందు జీవితం ఇచ్చే బారోసా చిన్నదిగానే కనబడుతుంది. కష్టంలో నాన్న పడ్డ కష్టం చూస్తే, జీవితంలో కష్టం ఎదుర్కోవలనే పట్టుదల, దీక్ష కలుగుతాయని అంటారు.
జీవితంలో ఆకాశం అందుకునే అవకాశం వస్తే, అందుకునే పట్టుదల, తెగువ, దీక్ష నాన్న నుండే వస్తాయని అంటారు. కష్టంలోనూ నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం.
ప్రయత్నంలో నాన్న పట్టుదల, నాన్న దీక్ష, సమస్యలను ఎదుర్కోవడంలో నాన్న చూపే తెగువ… సాధనలో నాన్నచూపే దక్షత. ఆరంభనికి నాన్న తీసుకునే దీక్ష… అన్నింటిలో నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు.
ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో చదవండి. ప్రకృతిలో గాలి, నీరు, అగ్ని, భూమి ప్రకంపనల వలన విపరీతాలు సంభవిస్తే వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు.
ఈ పంచభూతాలలో ఏది అధికమైనా అది ప్రకృతి వైపరీత్యంగా సంభవించి, వాటివలన మనవాళికి అపారనష్టం జరుగుతూ ఉంటుంది.
ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుడు అడ్డుకోవడం కష్టం. కానీ కొన్నిసార్లు ప్రకృతిలో జరుగుతున్నా మార్పులు గమనించి, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయగలడు.
అలా ముందుగానే ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసినప్పుడు మాత్రం, ముందస్తు చర్యల వలన ప్రకృతి వైపరీత్యాల వలన మానవాళికి జరగబోయే అపారనష్టం నుండి కొంతవరకు బయటపడగలడు.
ఎన్ని ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నష్టం తీవ్రంగానే ఉంటుంది. కారణం ప్రకృతిలో పంచభూతాలు ప్రకోపిస్తే, వాటి ప్రతాపం చాలా ప్రభావం చూపుతాయి.
భూకంపాలు – భూమి కంపించుట వలన ప్రకృతి వైపరీత్యాలు
భూమి అడుగుభాగం వివిధ పొరలతో వివిధ లోహాలతో ఉంటుంది. భూమి లోపల కూడా నీరు, ఖనిజాలు ఉంటాయి. భూమి లోపల చర్యలు జరిగినప్పుడు భూమి ప్రకంపనలకు గురి అవుతుంది.
అకస్మాత్తుగా భూమిలోపల ఏర్పడే చర్యలతో లేక విడుదల అయ్యే శక్తి వలన భూమి కంపిస్తుంది. అలా భూమి కంపించినప్పుడు భూమి పగిలి బీటలువారుతుంది.
భూమి కంపించడం భూమి పగలడం వలన భూమిపైన ఉండే భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదాలు వలన ప్రాణనష్టం, ఆస్తినష్టం, ఆర్ధిక నష్టం జరుగుతూ ఉంటుంది.
ఇలా భూమి నుండి ఏర్పడే ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కొరకు భూకంపాలను అంచనా వేసే పరికరాల సాయంతో భూకంపం సంభవించే సమయం ముందుగానే పసిగడితే, ముందస్తు చర్యలు వలన ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చు.
అయితే ఆస్తి నష్టం, ఆర్ధిక నష్టం అడ్డుకోవడం అసాధ్యం.
ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు
అగ్ని ప్రమాదాలు వైపరీత్యాలు
అగ్ని వలన జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వలననే జరుగుతాయి. గ్యాస్ లీక్ కావడం, కెమికల్ లీకేజ్ తదితర తప్పుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.
ఇటువంటి అగ్ని ప్రమాదాలు నుండి రక్షణ కొరకు నీరు, ఇసుక, వాయువులు వంటివి అందుబాటులో ఉండడం వలన అగ్ని ప్రమాదాలు పెద్ద ప్రమాదాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడవచ్చు.
పెద్ద మొత్తంలో గ్యాస్ లీకేజ్ వంటివి అపార నష్టం చేయగలవు. మానవ తప్పిదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే, అగ్ని ప్రమాదాల నుండి రక్షణ ఉంటుంది.
అగ్నిమాపక సిబ్బంది వలన చాలావరకు అగ్ని ప్రమాదాలను ఆర్పిన ఘటనలు ఉన్నాయి.
గాలి-నీరు ప్రకృతి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు
ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించేది గాలి-నీరు వలనే. తుఫాన్, అతి భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులు ఇంకా సునామీ వంటి విపత్తులు మనవాళికి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి.
సముద్రగర్భంలో జరిగే విపరీత చర్యలు వలన సునామీ ఏర్పడితే, తీర ప్రాంతం అంతా నీటిమయం అవుతుంది. తీరప్రాంతాలు అన్నీ నీట మునుగుతాయి. ఇటువంటి సునామీలు వలన ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలు అపారనష్టం తీసుకువస్తాయి.
ఇంకా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వలన తీవ్ర వర్షాలు, అతి భారీ వర్షాలు కురవడం వలన కూడా నదులు విపరీతంగా ప్రవచించి వరదలుగా సంభవిస్తాయి.
వరదల వలన ప్రాణ నష్టం, పంటనష్టం, ఆస్తి నష్టం, వ్యవస్థలు స్తంభించడం వంటివి జరుగుతాయి. వాయుగుండం తీరం దాటుతున్నప్పుడు ఈదురు గాలులు, అతిభారీ వర్షాలు చాలా నష్టం కలిగిస్తాయి.
వాతావరణం మార్పులు గమనిస్తూ, ముందస్తు హెచ్చరికలు చేయడం వలన ఒక్కోసారి గాలి-నీరు వలన సంభవించే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త వహించినా ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవించేది.
గాలి-నీరు వలన సంభవించే విపత్తుల నుండి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడగలరు కానీ ఆస్తినష్టం, ఆర్ధికనష్టం, వ్యవస్థలు స్తంభించడం వంటివి జరగకుండా అడ్డుకోవడం అసాధ్యమే అవుతుంది.
అయితే ప్రకృతి వైపరీత్యాలు జరిగిన వెంటనే పునరుద్దరణ చర్యలు తీసుకునే వ్యవస్థ మనకు అందుబాటులో ఉండాలి. అందుకు అందరూ స్పందించి తగినంత సాయం చేయాలి. ఇటువంటి సాయం చాలామంది చేసి ఉన్నారు… కూడా.
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు, అంటే ప్రకృతిలో అసహజత్వం జరగకుండా చూసుకోవడమే అంటారు.
సహజంగా ఏర్పడిన పర్యావరణంలో భూమిపై గాలి, నీరు, నిప్పు సాయంతో జంతుజాలం, మానవుడు నివాసం ఉంటారు. జంతువులు కేవలం వాటి ఆహారం, నివాసం విషయంలో ప్రకృతిలో లభించే సహజస్థితిలోనే జీవిస్తాయి.
ప్రకృతిని తనకు నచ్చినట్టుగా మార్చుకునే తెలివి, సామర్ధ్యం మనిషికి సొంతం. అటువంటి తెలివి ప్రకృతి సహత్వాన్ని దెబ్బతీసి, ప్రకృతి సమతుల్యత పాడైతేమాత్రం ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి.
ఎంత సహజంగా ప్రకృతి ఉంటే అంతా ఆహ్లాదకరమైన ప్రకృతి, ఎంత అసహజత్వానికి గురి అయితే, అంతటి విపత్తులను పొందుతుంది. అది విపరీత స్వరూపాన్ని పొందితే మానవాళికి నష్టమే కానీ లాభం ఉండదు.
ప్రకృతి విపరీత స్థితికి చేరడానికి గాలి-నీరు ఎక్కువగా సాయపడతాయి. ప్రకృతిలో కుత్రిమ చర్యలు సహజత్వాన్ని పాడు చేయకుండా తగు జాగ్రత్తలు టేసుకోవాలి.
మనిషితోబాటు కలిసి జీవించే జంతుజాలం వలన కూడా ప్రకృతి సమతుల్యత ఉంటుంది అని అంటారు. కాబట్టి ప్రకృతిలో జంతుజాలం అంతరించిపోయే చర్యలను కూడా నివారించాలి.
ప్రకృతి వైపరీత్యాల నివారణకు, ప్రకృతిని సహజత్వం నుండి దూరం చేయకుండా ఉండడమే ప్రధానం…
పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో! భూమి, గాలి, నీరు ఉన్న చోట మొక్కలు, చెట్లు, జంతువులు ఉంటే, దానిని సహజ పర్యావరణం అంటారు. ప్రకృతి నియమాల ప్రకారం అనేక జీవజాతులు ప్రకృతిలో నివసిస్తాయి.
అటువంటి పర్యావరణంలో మనిషి కూడా ఒక భాగస్వామి. బుద్ది కుశలత, తెలివి కలిగిన మానవుడు ప్రకృతిని తనకు సౌకర్యంగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటాడు.
అలాంటి మనిషి కొన్ని ప్రాంతాలలో మనిషి ఏర్పచుకునే నివాసాలలో ప్రకృతి మార్పుకు గురి అవుతుంది. అటువంటి మనిషి చుట్టూ పర్యావరణం తన సహత్వానికి బిన్నంగా మారుతుంది. కొన్ని చోట్ల పకృతికి హాని జరిగే విధంగా చర్యలు ఉంటే, పర్యావరణం దెబ్బ తింటుంది. ఇది మనిషి ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది.
సహజమైన నీరు స్వచ్చంగా ఉంటూ, మనిషికి ఉపయోగపడుతుంది. స్వచ్చమైన గాలి మనిషిని ఆహ్లాదపరుస్తుంది. కానీ ప్రకృతి సహజత్వాన్ని దెబ్బతీయడం వలన ప్రకృతి వనరులు కూడా సహజత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. దాని వలన మనిషికే నష్టం వాటిల్లనుంది. సహజ వనరుల శక్తి మనిషికి అందె అవకాశం తగ్గుతూ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ గురించి పాటు పడవలసిన అవసరం ప్రతి ఒక్కరి సామాజిక బాద్యత.
ప్రకృతిలో సహజంగా లభించే వనరులు వలన సృష్టిలో అనేక జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. చెట్లు వదిలే గాలి మనిషికి ప్రాణవాయువు అయితే, చెట్లు వలన మనిషి ఎంతో ప్రయోజనం పొందుతున్నాడు.
పర్యావరణంలో చెట్లు చేసే పని, అవి బ్రతికినంతకాలం కొనసాగుతుంది. చెట్లు ఎక్కువగా ఉన్న చోట గాలి స్వచ్చంగా ఉంటూ, గాలి కాలుష్యం తక్కువగా ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా
అందుకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజంగా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతావరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.
సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు జరుగుతున్నాయి. అంటే మనిషి వలన ప్రకృతికి జరుగుతున్న నష్టం ఏమిటో? పెద్దలు గుర్తించారు. కాబట్టే పర్యావరణ పరిరక్షణ నినాదాలు వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఏర్పడింది.
అంతగా పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారుకాగలవు… కావున మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది.
వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగినంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవులపైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.
నీటి దుర్వినియోగం కూడా పర్యావరణ పరిరక్షణకు చేటు చేస్తుంది.
గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో…
వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమిలో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగుతుంది. అందువలన నీటి దుర్వినియోగం అయితే, భూమిలోపల నీరు తగ్గుతుంది. దానితో భూమిలోపల సమతుల్యత లోపిస్తుంది.
నీటి వాడకం జాగ్రత్తగా జరిగితే, భూమి నుండి వెలికి తీసే నీటి శాతం తగ్గుతుంది. ప్రకృతి సహజంగా నీరు వానరూపంలో కురవడానికి అనేక చెట్లను తయారుచేసుకోవలసిన అవసరం నేటి మానవాళిపై ఉంది.
వివిధ పరిశ్రమల నుండి నిషిద్ద జలాలు వెలువడితే, వాటి వలన కూడా పర్యావరణకు ప్రమాదము.
నేటి మొక్కలే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి వృక్షాలుగా మారాలి.
నేటి మొక్కలే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి వృక్షాలుగా మారాలి అంటే, పర్యావరణ పరిరక్షణలో విధ్యార్ధులు పాత్రతను తీసుకోవాలి. విధ్యార్ధులు పర్యావరణ పరిరక్షణ గురించి, మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి, తెలియని వారికి తెలియజేస్తూ ఉండాలి.
భవనాల నిర్మాణం కొరకు, రోడ్ల నిర్మాణం కొరకు చెట్లను తొలగించడం కోసం పాటుపడే వారికన్నా, మొక్కలు నాటి, వాటిని పెంచడానికి పాటు పడేవారి శాతం తక్కువ.
కాబట్టి నేడు నాటిన మొక్కలలో ఏదో ఒక్కటి అతి పెద్ద వృక్షంగా మారగలదు. ఆక్సిజన్ అందించగలదు. ఎండ నుండి రక్షణ కల్పించగలదు. కావున మొక్కలు నాటడం, వాటిని చెట్లుగా ఎదిగేవరకు కృషి చేయడం గురించి ఉదృతమైన ప్రచారం ఒక ఉద్యమం లాగా జరగాల్సిన ఆవశ్యకతను నేటి ప్రకృతి సమస్యలు తెలియజేస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచుకుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉంటుంది.
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం. స్త్రీలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. బాలుర కన్నా ఎక్కువగా బాలికలు చదువులో ముందుంటున్నారు.
అయితే వారికి సరైనా భద్రత కల్పించగలిగితే, స్త్రీలు మరింత ముందుకు సాగుతారు. మెరుగైన ఫలితాలు రాబట్టగలరు. ఓర్పు వహించడంలో స్త్రీలు ముందు ఉంటారు.
కనుక వారికి సమాజంలో సరైన భద్రత కల్పించగలిగితే, మెరుగైన సమాజం మన ముందు ఉంటుంది.
ఒక పురుషుడైన, ఒక స్త్రీ అయినా అమ్మ ఒడిలో పాఠాలే, ఎప్పటికీ మదిలో ఉండిపోతాయి. అటువంటి స్త్రీకి ఉన్నత చదువులు ఉంటే, మరింతమంది నైపుణ్యం కలిగినవారు మన సమాజంలో తయారుకాగలరు.
ఎందుకు భద్రత విషయంలో అంటే, స్త్రీలపై బౌతికదాడులకు పాల్పడడం, లైంగిక వేదింపులకు పాల్పడడం కొందరికి అలవాటుగా ఉంటుంది. అలాంటి వారి వలన స్త్రీలకు భద్రత కరువు అవుతుంది.
సహజంగానే స్త్రీలను గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. అలాంటి సంప్రదాయం గల మన భూమిలో స్త్రీలపై దారుణాలు జరగడం దురదృష్టకరం.
ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలలో రక్షణ ప్రధాన సమస్య. సమాజంలో పురుషులతో సమానంగా కష్టపడుతూ కేవలం లింగబేధం వలన స్త్రీలపై లైంగిక దాడులు చేయడానికి కొందరు ఆకతాయిలు ప్రయత్నం చేయడం జరుగుతుంది.
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలలో ప్రధానంగా వారి భద్రత విషయంలో రాజీపడని వ్యవస్థ సమాజంలో ఉండాలి.
అయితే ఎంత వ్యవస్థ ఉన్న అల్లరితనం అలవాటు అవుతున్నవారిని నియంత్రించడం కష్టం. అయితే రోగ నివారణ చర్యలు కన్నా రోగం బారిన పడకుండా తీసుకునే చర్యలే ఉత్తమము అంటారు.
స్త్రీల విషయంలోనూ తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. స్త్రీ యొక్క గొప్పతనం తెలియజేసే విధంగా వ్యవస్థలు పనిచేయాలి.
ఒక నాయకుడైనా, ఒక పనివాడు అయినా, ఒక కలెక్టర్ అయినా, ఒక ముఖ్య మంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా, అఖిరికి ఆ భగవానుడి గురించి తెలియజేసే గురువు అయినా సరే అమ్మ కడుపులో నుండే పుట్టాలి. బిడ్డను కనడానికి అమ్మ చావుతో పోరాటం చేస్తుంది.
అమ్మ చావుతో పోరాటం చేసి బిడ్డను కంటుంది. అటువంటి అమ్మ సాదారణంగానే పూజ్యనీయురాలు. అలాంటి అమ్మగా మారాబోయే అమ్మాయిలు అంటే, గౌరవంతో నడుచుకునే విధంగా వ్యవస్థలలో చర్యలు తీసుకోవాలి.
ఉద్యోగం చేసే స్త్రీ ఒక అమ్మ, మనల్ని కన్న అమ్మ వంటిదే, ఉద్యోగం చేసే అమ్మ కూడా… అని సాటి ఉద్యోగస్తులు ప్రవర్తించే విధంగా వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి.
అమ్మ ప్రేమ చేతనే, బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుతాడు. అటువంటి ప్రేమాభిమానాలు గల స్త్రీకి సమాజం నుండి లభించాల్సింది… ప్రధమంగా గౌరవం…
స్త్రీల గురించి పవిత్రమైన భావనలు బాల్యం నుండే అలవాటు చేయాలి
విద్యా విధానంలోనే స్త్రీల గురించి పవిత్రమైన భావనలు కలిగే విధంగా చర్యలు ఉండాలి. గొప్ప పుస్తకం చదివే అలవాటు ఉన్నవాడి ఆలోచనలు గొప్పగానే ఉంటాయి.
అలాగే పుస్తకాలలో చదివిన గొప్ప విషయాలు మనిషిలో మంచి ఆలోచనలను ఏర్పరుస్తాయి. కావునా స్త్రీల గురించి మంచి ఆలోచనలు పెరిగే విధంగా చర్యలు అన్నీ వ్యవస్థలలోనూ ఉండాలి.
స్త్రీని లోకువగా చూసే సమాజం నుండి, స్త్రీని గౌరవించే సమాజంలోకి సమాజం మార్పు చెందాలి. అదే స్త్రీ అభ్యున్నతికి మొదటి మెట్టు… ప్రధానమైనది…
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.
మనిషి బ్రతకడానికి శక్తి కావాలి. శక్తి ఆహార పదార్ధాలు ఆరగించడం ద్వారా లభిస్తుంది. శక్తి వలననే మనిషి పని కొనసాగించగలడు. అందుకు అవసరమైన ఆహారం దేశంలో రైతు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.
వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి కీలకమైన అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి చాల ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రైతు గొప్పతనం గురించి ఇన్ తెలుగు
తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంలో ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు.
పంటలు పండించేవారిని మాత్రమే కాకుండా, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం తదితర పనులు చేపట్టిన వారిని కూడా రైతులు అనే అంటారు.
మనదేశంలో రైతు మూడు విధాలుగా పంటలు పండిస్తాడు. ఖరిప్, రబీ, జైద్ కాలాలుగా విభజించి, ఆయా కాలాల్లో తగు పంటలు రైతు పండిస్తాడు.
భూమిని నమ్ముకుని రైతు జీవనం సాగిస్తాడు. భూమిని సాగు చేస్తూ ఆహార పదార్ధాలుగా మారే ముడి పంటలను రైతే పండిస్తాడు. ఎక్కువమందికి భూమి సొంతంగానే ఉంటుంది. కొందరు ఇతరుల భూమిని బాడుగకు తీసుకుని సాగు చేస్తూ ఉంటారు.
ఎక్కువ భూమి ఉన్న రైతు కూలీల ద్వారా వ్యవసాయపు పనులు చేయిస్తూ ఉంటాడు. రైతు కాయకష్టం పైన మనదేశంలో ఆహార పదార్ధాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ఇంకా రైతు కూలీల శ్రమ వ్యవసాయం అభివృద్దికి తోడ్పడుతుంది.
జీవించే రైతే దేశానికి వెన్నుముక
భారత దేశ౦ వ్యవసాయక దేశం .ప్రప౦చ౦లో అత్యధిక జనాభా గల దేశాలలో రె౦డవదిగా ఉంది. ఇంకా ఇందులో ఎక్కువ శాతం ప్రజలు గ్రామీణ వాసులు ఉంటారు. వ్యవసాయ పనులలో పురుషులు, స్త్రీలు కూడా పాల్గొంటారు.
సమాజంలో పని చేయించేవారు, పని చేసేవారు, పని కల్పించేవారు మొదలైనవారిపై సమాజిక ఆర్ధిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. వీరందరికీ అవరసరమైన ఆహార ఉత్పత్తులు మాత్రం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. కావున ఏ దేశానికైనా వ్యవసాయం ప్రధానం. దానిని నమ్ముకుని జీవించే రైతే ఆ దేశానికి వెన్నుముకగా మారతాడు.
ప్రపంచంలో వ్యవసాయ భూమి ఉన్న దేశాలలో మొదటిది అమెరికా అయితే, రెండవది భారతదేశం. కానీ దిగుబడిలో మాత్రం ఆ దేశం వెనకబడి ఉండడం గమనించవలసిన విషయం.
రైతే మానవ మనుగడకు ప్రధానమైతే, అటువంటి రైతు ఇబ్బందులు ప్రక్రుతి పరంగా ఉంటాయి. అకాల వర్షం రైతుకు నష్టం తీసుకురావచ్చు. వర్షాభావం కూడా రైతుకు నష్టమే... అటువంటి ప్రక్రుతి ప్రభావాలలో మార్పులు రాకుండా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణలో కఠిన చర్యలు అవసరం.
దేశంలో రైతు ఆధారిత భూములకు తగినంత నీటి సదుపాయం కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆహార పదార్ధాలు ఉత్పత్తి చేసే రైతు సాగుకు నష్టం కలగకుండా పర్యావరణ పరిరక్షణ అందరి సామజిక బాద్యత… వ్యవసాయ ఆధారిత దేశంలో రైతు గొప్పతనం గురించి ఎంతచెప్పినా తక్కువే.
కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి.
మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది. మనసుకు అయిష్టాలు చాలానే ఉండవచ్చు.
నచ్చని మాట వినబడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నచ్చనివారు ఎదురుపడిన కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. నచ్చని పని చేయాలంటే, కోపం, అసహనం కలిగే అవకాశాలు ఉంటాయి.
కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
అసహనం పెరిగే కొలది చిరాకు, కోపం పెరుగుతూ ఉంటాయి. చిరాకు, చికాకు వలన చీటికి, మాటికి కోపం రావడం అలవాటు అయితే, అది ఇతరులపై ప్రదర్శించడం అలవాటు అయి, వారి మనసులో మనపై చికాకు భావన పెంచుకునే అవకాశం మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.
దాని పర్యవసానంగా పలు సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. నలుగురిలోనూ “వీడికి కోపం ఎక్కువ” అనే భావన బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కాని కోపం రాని మనిషి ఉండడు. అయితే కొందరు కోపాన్ని నియంత్రిస్తారు. కొందరు కోపాన్ని ఇతరులపై ప్రదర్శిస్తారు. కోపాన్ని నియంత్రించుకోగలగడం గొప్ప విషయంగా పెద్దలు పరిగణిస్తారు.
తన కోపమే తన శత్రువు అంటారు. అంటే ఎవరికీ కోపం వస్తే, అదే వారి శత్రువుగా మారుతుంది.
ఎందుకంటే ఎప్పుడూ కోపగించే తత్త్వం కలిగిన వ్యక్తితో ఎవరూ ఆప్యాయంగా మాట్లాడలేరు. ఆప్యాయంగా మాట్లాడే మనిషి ఒక్కరు కూడా లేకపోతే, ఒంటరితనం పెరిగి, మనిషి ఒంటరివాడుగా మారతాడు. కష్టసుఖాలు పంచుకోకుండా మనిషి మనసు ఉండలేదు.
ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే అలవాటు ఉంటే, అది చివరికి క్రోధంగా దారి తీసే అవకాశం ఉంటుంది. క్రోధం వలన మనసు విచక్షణ కోల్పోతుంది. అలాంటి సమయాలలో మనసు ఇష్టారీతిలో ప్రవర్తిస్తుంది.
ఇష్టానుసారం మెదిలే మనసుకు అంతులేని ఆలోచన, ఆందోళన, చికాకు ఎక్కువ అవుతాయి.
నచ్చిన విషయాలు మనసుకు ఎదురైనప్పుడు సంతోషించే మనసు, నచ్చని విషయం ఎదురైనప్పుడు మాత్రం అందుకు కారణం అయినవారిని వెతుక్కొని, వారిని తప్పుబడుతుంది.
అలాగే తమకు నచ్చినట్టు ప్రవర్తించే మనిషి అంటే ఇష్టం. తమకు నచ్చనట్టు ప్రవర్తించే మనిషి అంటే కష్టంగా కొందరి మనసు మారుతూ ఉంటుంది. కానీ అలంటే సమయంలో సంయమనం పాటించేవారిని, గొప్పవారిగా పెద్దలు చెబుతారు.
నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనిషికి నచ్చినట్టుగా కాకుండా శాస్త్రం లేక పెద్దలు ఆమోదించిన విధానం ప్రకారం ఉంటే, వారు మార్గదర్శకులుగా మారగలరు. కానీ నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనసును బట్టి ఏర్పరచుకుంటే, అదే అలవాటు కోపానికి కారణం కాగలదు.
తత్కారణంగా అలవాటు కోపంగా మారితే, తన కోపమే తన శత్రువుగా మారుతుంది.
ఆహారం ఒక పద్దతిగా వైద్యులు సుచించినట్టుగా తీసుకుంటే, అనారోగ్యం కూడా నయం అవుతుంది. అలా కాకుండా ఆహారం మనసు కోరినట్టుగా అతిగా ఆరగిస్తే, అదే ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నచ్చని ఆహారం తినవలసి వచ్చినప్పుడు కోపం కలిగే అవకాశం ఉంటుంది.
ఇలా పలు విషయాలలో మనిషికి నచ్చడం, నచ్చకపోవడం ఉంటుంది. కానీ నచ్చిన విషయం అందరికి ఆమోదయోగ్యమైతే, అది మంచి విషయంగా ఉండవచ్చు. నచ్చని విషయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండి, ఒక్కరికే నచ్చకపోతే, సదరు వ్యక్తి తన ఆలోచనను గమనించాలి.
కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి కోపం ఎందుకు వస్తుంది
మనిషి మనసుకు నచ్చడం, నచ్చకపోవడం, వినడం, వినకపోవడం, ఇష్టం, అయిష్టం వంటి వాటి భావనలు బలపడి ఉంటే, అవే కోపానికి కారణం కాగలవు, కీర్తికి కారణం కాగలవు.
ఒకరికి చదువుకోవడం ఇష్టం. అది మంచి, చదువుకునే విషయంలో కాలయాపన జరిగితే కోపం. అది మంచి చేసే కోపం. కానీ అదే కోపం పదే పదే తెచ్చుకుంటే, అది భాధకు కారణం కాగలదు.
మంచి విషయానికైనా, చెడు విషయానికైనా కోపం రావచ్చు. కానీ అది నియంత్రించబడాలి. అప్పుడే అది మనిషికి శాంతిని అందిస్తుంది. లేకపోతే కోపం వచ్చిన వ్యక్తి మనసుతోపాటు, ఇతరుల మనసు మదనపడుతుంది.
కావునా కోపమనేది కేవలం ఒక చెడు విషయాన్నీ ఖండించడానికి ఉపయోగపడాలి… కానీ మనసుకు అలవాటుగా మారకూడదు. అతి సర్వత్రావర్జయేత్ అంటారు.
అంటే అతి అన్నింటా అనర్ధమే అంటారు. కోపం విషయంలో ఇది నిజమని, గుర్తించకపొతే, మనసుకు కోపం చాలా చాలా నష్టాన్నే మిగిలుస్తుంది.
కారణం లేని కోపం చేటు చేస్తుంది. కారణాంతరాల వలన కోపం కలిగినా, దానిని నియంత్రించుకునే అలవాటు నేర్చుకోవాలి.
కోపం వలన కష్టాలు తీరవు కానీ కోపం వలన కొత్త కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ. కావునా కోపం అనే గుణం దుర్గుణంగా మారకుండా, కోపం అనే గుణంపై నియంత్రణ ప్రయత్న పూర్వకంగా సాధించాలి.
సాదారణ స్థితి మనిషికి మరొక మనిషితో సత్సంబంధం ఏర్పరిస్తే, కోపం వలన సత్సంబంధం మద్య బేధభావం ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి కోపం కారణంగా నష్టాలు అధికంగా ఉండవచ్చు.
అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగువ్యాసం. సమాజంలో అంటువ్యాధులు ప్రభలితే, వాటి ప్రభావం అందరి ఆరోగ్యంపైనా పడుతుంది. దీని గురించి అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం.
అంటువ్యాధి అంటేనే ఒకరి నుండి మరొకరికి పాకే గుణం కలిగి ఉంటుంది. సహజమైన వాతావరణంలో మనిషి సహజంగా తోటివారితో కలిగి జీవిస్తాడు. తద్ఫలితంగా అంటువ్యాధి వ్యాప్తి చెంది, నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ.
మనిషి సంఘజీవి, సమాజంలో కొందరితో కలిసి జీవించే మనిషి తనకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుని జేవిస్తూ ఉంటాడు. ఇంకా సమాజంలో పలువురితో కలిసి పని చేస్తూ, లేక చేయిస్తూ జేవిస్తూ ఉంటాడు. అలా మనిషి నిత్యం సమాజంలో కొందరితో కలిసి మెలసి, కొందరితో కలుస్తూ జీవనం కొన సాగిస్తూ ఉంటాడు.
అటువంటి మనిషికి ఒకరినొకరు కలవడం వలన సాంగత్యం ఏర్పడుతుంది. ఆ సాంగత్యం మనసుపైనా, శరీరం పైన ప్రభావం చూపుతుంది. అలా ఉండే మానవ జీవనంలో సహజమైన వాతావరణం మంచి స్థితిని అందిస్తే, అసహజమైన వాతావరణం చెడు ఫలితాలను అందిస్తుంది.
సహజమైన వాతావరణం అంటే పరిసరాల పరిశుభ్రతతో ఉండడం. ఇంకా పర్యావరణ సమతుల్యతతో కొనసాగడం జరుగుతుంది.
అపరిశుభ్రత వలన కలిగే అంటువ్యాధులు అపారనష్టం గురించి
అసహజమైన వాతావరణం అంటే పరిసరాలు అపరిశుభ్రతతో ఉండడం. పర్యావరణం కాలుష్యం అవ్వడం వంటివి జరుగుతాయి. ఇలా సమాజంలో వాతావరణం అసహజంగా మారడం వలన అనేక అంటువ్యాధులు ప్రభలుతాయి. సంఘజీవి అయిన మనిషి నిత్యం పరిచయస్తులతో కలుస్తూ, ఉండడం వలన వ్యాధులు ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఇలా అంటువ్యాధులు సమాజంలో ప్రమాదకరంగా మారితే, అవి సమాజానికి అపారనష్టం కలిగిస్తాయి. సమాజానికి అపార నష్టం అంటే, ఆర్ధికంగా, నైతికంగా మనుషులు ఆందోళనను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సహజమైన పరిస్థితులలో మనిషి మనుగడ చాలా బాగుంటుంది. దైనందిన జీవనం కొనసాగుతూ, ఆర్ధికంగా ఎదుగుతూ, తోటివారికి సాయం చేస్తూ ఉంటాడు.
అదే అసహజమైన పరిస్థితులు పెరిగి, అంటువ్యాధులు ప్రభలితే, అదే మనిషి సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఆర్ధిక వనరులు కోల్పోయే అవకాశం ఎక్కువ. ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుంది. తనకు సోకినా వ్యాధిని మరొకరికి వ్యాప్తి చెందడానికి కారకుడు కూడా కావచ్చును.
వ్యాధి గుణం ఒకరి నుండి మరొకరికి, ఆ మరొకరి నుండి ఇంకొకరికి ఆ ఇంకొకరి నుండి వేరొకరికి ఇలా ఒకరి నుండి రెండవ వారికి….మూడవవారికి… పదవవారికి… ఇరవైవారికి… అనేకమందికి పాకే గుణం వ్యాధికి ఉంటుంది. అటువంటి అంటువ్యాధులు చాలా ప్రమాదకరం.
కొన్ని రకాల అంటువ్యాధులు ప్రాణాంతకంగా మారతాయి. అటువంటి అంటువ్యాధులు మరింత ప్రమాదకరం.. వీటి వలన అనేకమంది ప్రాణాలు కోల్పోతారు.
మానవ మనుగడ అంతా ఒకరికొకరు సాయం వలననే సాగుతుంది. అటువంటి మనుషుల మద్య అంటువ్యాదులు తీవ్రత పెరిగితే, మానవ సంభందాలు ప్రభావితం అవుతాయి. కొందరు మనోధైర్యం కోల్పోయే అవకాశం కూడా అంటువ్యాధులు వలన ఏర్పడవచ్చు.
కావున అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా మనిషి చుట్టూ ఉండే సహజమైన వాతావరణం, సహజంగానే ఉండే విధంగా మనిషి కృషి చేయాలి. వ్యవస్థలు కూడా పరిసరాల పరిశుభ్రత విషయంలో పాటుపడాలి.
అంటువ్యాధులు నివారణ చర్యలు
ఎప్పుడైనా అంటువ్యాధి సమాజంలో వ్యాప్తి చెందుతూ ఉంటే, ముందుగా సంభందిత సామజిక వ్యవస్థలు మేల్కోవాలి.
వృద్ది చెందుతున్న అంటువ్యాధి లక్షణాలు గురించి పూర్తీ సమాచారం సేకరించాలి.
పెరుగుతున్న వ్యాధి గురించి సరైన అవగాహనా సమాజంలో కలగజేయాలి.
అంటువ్యాధి యొక్క సహజ లక్షణాలు గురించి అర్ధవంతంగా సంబందిత సమాజంలో తెలియజేయాలి
వ్యాధి లక్షణాలపై అపోహలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
అంటువ్యాధి గురించి పుకారు వార్తలను సమాజంలో పాకకుండా జాగ్రత్త తీసుకోవాలి
ముఖ్యంగా అంటువ్యాధి వ్యాపించకుండా సామజిక దూరం గురించి ప్రజలకు ప్రేరణ కలిగించాలి
అంటువ్యాధి నివారణకు ప్రాధమిక జాగ్రత్తలు ప్రాముఖ్యతను పదే పదే ప్రచారం కల్పించాలి
ఈ విధంగా ప్రాధమికంగా అంటువ్యాధి నివారణ చర్యలను, తగు వైద్య సూచనలు తెలియజేస్తూ సమాజంలో విస్తరింప జేస్తూ ప్రజల ద్వారానే ప్రజలలో వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా చూడాలి. ఆపై పెరుగుతున్న అంటువ్యాధి నివారణకు వైద్యపరమైన మార్గాలు అన్వేషించాలి.
తగిన సమయంలో సత్వర నిర్ణయాలు తెసుకునే వారి నాయకత్వంలో అంటువ్యాధి నివారణ గురించిన బాద్యతలు ఉంచాలి.
అంటువ్యాధి సమాజంలో ఒకసారి వ్యాపిస్తే, మరలా ఆ సమాజంలో వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. కావునా అంటువ్యాధికి టీకా సిద్దం చేయాలి. ఆ టీకా సమాజంలో ప్రజలందరికి వేయించాలి. ఇందుకోసం యుద్దప్రాతిపదికన చర్యలు అవసరం అని నిపుణులు అంటారు.
సమాజంలో ప్రమాదకరమైన అంటువ్యాధులు పెరిగితే, అవి సమాజంలో భారీ నష్టాన్ని అందిస్తాయి. కాబట్టి వాటిని వీలైనంత తక్కువ సమయంలో నివారించాలి.
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు రాముని చుట్టూ ఉంటారు. అలా రాముడి ధర్మమే రామాయణంలో చాలా ప్రధానంగా ఉంటుంది.
అలాంటి సుగుణాభిరాముడి గురించి శ్రీరామాయణం అంటే శ్రీరాముని పదహారు గుణాలను తెలుపుతూ ఉంటుంది.
ఈశ్వరునికి ఉండే పదహారు విశిష్టమైన గుణాలు ఒక మానవుడికి ఉంటే, ఆయనే శ్రీరామచంద్రమూర్తిగా ప్రవచనకారులు చెబుతారు.
ఇంకా శ్రీరాముడు పరమ ధర్మమూర్తిగా పురాణాలలో చెప్పబడతారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది… అనే ఆర్యోక్తి శ్రీ రామాయణంలో రాముని ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక ప్రాంతంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి, ఆ ప్రాంతవాసులకు ఆదర్శం అయితే, ఆ ప్రాంతం మిగిలిన ప్రాంతాలకు ఆదర్శప్రాయంగా కనబడును.
అలాగే ఒక కుటుంబ పెద్ద కూడా సమాజంలో తగినంత అనుభవం కలిగి ఉంటాడు. కాబట్టి కుటుంబ పెద్ద అయినా తండ్రి తనయుడికి ఆదర్శప్రాయంగా నిలిస్తే, అతనిని అనుసరించడం తనయుడి ధర్మం.
అటువంటి కర్తవ్య దీక్షనే శ్రీరామచంద్ర మూర్తి రామాయణంలో నిర్వహించినట్టుగా రామాయణం ద్వారా మనకు తెలియబడుతుంది.
కేవలం తండ్రి మాటపై గురువుతో రాముడు అడవులలో నడిచాడు.
అయోధ్యలో అంతపురంలో సౌకర్యవంతమైన జీవనం కలిగి ఉన్న శ్రీరాముడు, విశ్వామిత్రుడి వెంట అడవులలో నడిచాడు.
శ్రీరాముడిని తనతో పంపవలసినదిగా, దశరడుని విశ్వామిత్రుడు కోరతాడు. అప్పుడు దశరదుడు శ్రీరాముడిని, విశ్వామిత్రుని వెంట పంపుతాడు… విశ్వామిత్రుడి చెప్పినట్టు శ్రీరాముడు అడవులలో నడుచుకుంటాడు.
విశ్వామిత్రుడిని దగ్గర అనేక అస్త్ర, శస్త్రాలను శ్రీరాముడు పొందుతాడు… కానీ వాటిని స్వప్రయోజనానికి ఉపయోగించకుండా కేవలం ధర్మరక్షణకై ఉపయోగించడం రామాయణంలో రాముడి దగ్గరే తెలుసుకోవాలని పెద్దలంటారు.
ఎంతటి శక్తిని పొందినా గురువు దగ్గర ఎంతటి వినయంతో నడుచుకోవాలో రామాయణంలో శ్రీరాముడిని నుండి నేర్చుకోవాలి.
గురువుపై గురి కుదిరితే అత్యంత శక్తివంతమైన, అసాదరణమైన విజయం సాధించవచ్చని శ్రీరామాయణంలో శ్రీరాముడినిచూసి తెలుసుకోవచ్చు.
శక్తివంతులైన రాక్షసులకు, ఇతరులకు సాద్యం కానీ శివధనుస్సు ఎక్కుపెట్టగలగడం శ్రీరాముడికే సాద్యం అయ్యింది.
చెప్పుడు మాటలు వింటే, బుద్ది నశిస్తుందని రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు
చెప్పుడు మాటలు వింటే, బుద్ది నశిస్తుందని శ్రీరామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే శ్రీరాముడంటే అమితమైన ప్రేమ కలిగినవారిలో కైకేయి ఉంటుంది.
ఆమెకు రాముడంటే చాలా ఇష్టం. అటువంటి కైకేయి చెప్పుడు మాటల వలన సమాజంలో నిందితురాలిగా మారింది. కన్న కొడుకు కూడా ఆమెను అసహ్యించుకోవడం కైకేయి విషయంలో శ్రీరామాయణంలో చూడవచ్చు.
శ్రీరామపట్టాభిషేకం అడ్డుకుని, కొడుకుకు రాజ్యం ఇప్పించాలనే సంకల్పం, మంధర మాటల వలన కైకేయి మనసులో కలుగుతుంది.
వెంటనే దశరడుడిని కోరడంతో, ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి మాటమేరకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి అడవులకు బయలుదేరతాడు. శ్రీరాముడిని అడవులకు పంపింది, దైవమె అయినా, చెప్పుడు మాటలు వింటే, లోకనింద పొందే అవకాశం ఎక్కువ అని రామాయణంలో కైకేయి పాత్ర నిరూపిస్తుంది.
వ్యక్తి మహనీయుడుగా మారాలంటే అందుకు ఆదర్శప్రాయమైన పాత్రలు శ్రీరామాయణంలో చాలా కనబడతాయి. శ్రీరాముడులాగా అందరితో మంచి అనిపించుకుంటే, కష్టంలో అందరూ సాయపదతారని శ్రీరామాయణం చాటి చెప్పుతుంది.
అన్నీ తెలిసినా, మరొకరికి ఉపకారం చేయకుండా, అపకారం తలపెడితే, ఎంత ప్రమాదమో రామాయణంలో రావణుడు పాత్ర తెలియజేస్తుంది.
రావణుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. బలవంతుడు. అనేకమంది శక్తివంతులైన రాక్షసగణం కలిగినవాడు. అటువంటి వాడు అన్నీ తెలిసినా, మరొకరికి ఉపకారం చేయకుండా, అపకారం తలపెడితే, ఎంత ప్రమాదమో రామాయణంలో రావణుడు పాత్ర తెలియజేస్తుంది.
సాక్షాత్తు దైవానుగ్రహం కలిగి ఉన్నా, మన ప్రవర్తన ఇతరులకు అపకారం చేస్తే, ఫలితం అనుభవించాల్సిందే… రావణుడికి పరమేశ్వరుడి అనుగ్రహం కలిగింది. కాబట్టి పంచభూతాలను శాసించాడు.
ఇంకా లోకాన్ని పీదించాడు. మితిమీరి శ్రీరాముడి భార్యను తీసుకువెళ్ళి లంకలో కూర్చోబెట్టాడు. అందుకు ఫలితంగా సీతమ్మ తల్లి వేదనకు గురైంది…. సీత ఆవేదన, రావణుడికి పాపం పెరుగుతూ, పుణ్యం నశించడం మొదలైంది.
నశించిన పుణ్యం వలన కేవలం రావణుడికి దైవానుగ్రహం దూరం అయింది. రాముడు, రావణుడిని జయించాడు.
శ్రీరామాయణం వ్యక్తి సమాజంలోను, కుటుంబంలోను ఎలా జీవించాలో? తెలియజేస్తుందని పెద్దలు చెబుతారు.
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది.
పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది.
భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం.
వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి.
సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది.
ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి.
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి.
గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు.
ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది.
మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది.
భూమి, గాలి, నీరు, నిప్పు పల్లెటూళ్ళల్లో సహజంగా ఉంటాయి.
భూమి, గాలి, నీరు, నిప్పు ఎంత సహజంగా ఉంటే, ప్రకృతి అంట ప్రశాంతంగా ఉంటుంది. భూమిపై కొన్నాళ్లు ఉండి వెళ్ళిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి భవిష్యత్తుగా మారతాయి.
అలాంటి మనిషి కాపాడుకుంటున్న, కాపాడుకోవలసిన అంశాలలో పల్లెటూరి వాతావరణం, పశుసంరక్షణ ప్రధానమని పెద్దలు చెబుతారు. భూమి, గాలి, నీరు, నిప్పు వలననే మనిషి మనుగడ సాగుతుంది.
స్వచ్చమైన గాలి మనసుపై మంచి ప్రభావం చూపుతుంది. భూమిలో నుండి వచ్చే ఆహార పదార్ధాలు స్వచ్చంగా ఉంటే, మనిషి పూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండగలడు. స్వచ్చమైన నీరు మానవ శరీరం పోషణలో కీలకంగా ఉంటుంది.
ఈ విధంగా భూమి, గాలి, నీరు మనిషి ఆరోగ్యంపైన, మనసుపైనా కూడా ప్రభావం చూపుతాయని అంటారు.
సహజమైన ప్రక్రుతి పల్లెటూరిలో మెరుగ్గా ఉంటుంది. అందమైన పల్లెటూరు గురించి ఎంత చెప్పిన తక్కువే, ఎంత అనుభపూర్వకంగా తెలుసుకుంటే, అంత ప్రయోజనం తెలుసుకున్న వారికి ఉంటుంది.
పల్లె గురించి, పల్లె అందాల గురించి పల్లెటూరి కవితలు చెబుతాయి. గుడికి వెళ్లేముందు గుళ్ళో దేవుడి గురించి తెలుసుకుని వెళ్లినట్టు, పల్లెటూరికి వెళ్ళేముందు పల్లె గురించి తెలుసుకుంటే, ఆ వాతావరణం ఆస్వాదించగలం.
అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం
అందమైన పల్లెలో సహజమైన ప్రక్రుతి చాలా సహజంగా ఉంటుంది. అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం శ్రమతో కూడినది అయినా సంతృప్తికరమైనదిగా ఉంటుందని అంటారు.
ఒక వ్యక్తి కోడికూసే వేలకు నిద్రలేవడం పల్లెటూళ్ళల్లో ఉంటుంది. సూర్యోదయమునకు ముందే నిద్రలేవడం ఆరోగ్య లక్షణాలలో మొదటిదిగా చెబుతారు. అలా గ్రామంలో నివసించేవారు సహజంగా ఆరోగ్యలక్షణం పాటిస్తూ ఉంటారు.
ఇంకా గ్రామాలలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ఉంటుంది.
బంధువులు, భాందవ్యాలు బలంగా ఉండడంలో పల్లెటూరి ప్రశాంతత ప్రధానం అంటారు.
పల్లెలో నివాసం అంటే ప్రశాంతమైన ప్రకృతిలో పడుకున్నట్టే….
చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర అంటే జరిగినది, జరగబోయే రోజులలో వర్తమానంగా వర్తింపబడుతుంది. అంటే గతంలోని విషయాలు ఈరోజు తెలుసుకోవడం… జరుగుతుంది.
ఏదైనా ఒక సంఘటన జరిగినది. దానిని కొంతకాలం జరిగాక, గుర్తుకు చేసుకుంటే అది గతం అవుతుంది. అలాంటి గత సంఘటనలు సమాజంపై చూపిన ప్రభావాన్ని బట్టి చరిత్రగా మనకు మరలా గుర్తుకు వస్తుంది.
ఎవరైనా ఒక వ్యక్తి జీవితం ముగిసింది. ఆయన జీవితం గతించిన జీవితంగా పరిగణింపబడుతుంది. ఎవరైతే సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేస్తారో, వారు అనేకమందికి గుర్తుకు వస్తారు.
అలాంటి వారి గతంగా జీవిత చరిత్రలుగా సమాజం గుర్తిస్తుంది. అది పుస్తకం రూపంలో ఉంటాయి… ఈరోజులలో వెబ్ పేజిలుగా మారుతున్నాయి.
ఇంకా ఒక వస్తువు సమాజంలో పొందిన పాపులారిటీని కోల్పోయినా, అది ఒక చారిత్రాత్మక వస్తువుగానే పరిగణింపబడుతుంది. ఇక అది సమాజంలో ఒక గుర్తుంచుకోదగిని గతకాలపు వస్తువుగా మారిపోతుంది. ఇలాంటి వస్తువులు కూడా ఒక పుస్తకాలలో గానీ వెబ్ పేజిలలో గానీ చరిత్రగా మారతాయి.
చరిత్ర అంటే ఏమిటి?
అసలు చరిత్ర అంటే గతంలోని సమాజంపై ప్రభావం చూపిన విషయాలు వర్తమానంలో తెలుసుకోవడం చరిత్ర అంటారు.
అది ఒక విశిష్టమైన వ్యక్తి గురించి అయి ఉండవచ్చును. ఒక విశేషమైన ప్రభావం చూపిన సంఘటన కావచ్చును. ఒక విశేషమైన ప్రజాధరణ పొందిన పాపులర్ ఐటమ్ కావచ్చును.
ఇంకా ప్రకృతి వైపరిత్యాలు, ప్రకృతిలో విశిష్టమైన మార్పులు, సామాజిక మార్పులు, సామాజిక సమస్యలు, సామాజిక ఉద్యమాలు ఇలా విశిష్టమైన ప్రభావం సమాజంపై చూపాకా కాలంలో చరిత్రగా పరిగణించబడతాయి.
ఈ విధంగా మనకు అనేక రంగాలలో అనేక విషయాలలో సామాజికపరమైన చరిత్రలు, వ్యక్తిగతమైన చరిత్రలు, పౌరాణిక చరిత్రలు, టెక్నాలజీ చరిత్రలు, వ్యవస్థల చరిత్రలు, నాయకుల చరిత్రలు, జీవిత చరిత్రలు ఏర్పడు ఉంటాయి.
అలా ఏర్పడిన చరిత్ర మనకు పుస్తకం రూపంలో లభిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే డిజిటల్ బుక్స్ రూపంలో కూడా లభిస్తాయి.
గతం గురించి గుర్తు చేసే చరిత్ర గురించి ఎందుకు తెలుసుకోవాలి?
చరిత్ర ఒక పాఠం వంటిది… చరిత్ర చెప్పిన పాఠాలు వలన వర్తమానంలో అనుసరించవలసిన విధానం బోధపడుతుంది.
గతకాలంలోని అనుభవాలు ఒక చరిత్రగా మారతాయి. అలా అనుభవాలు పొందినవారు తమ తమ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలలోని సారం గురించి విశ్లేషిస్తూ ఒక జ్ఙాపకంగా మారుస్తారు.
అటువంటి జ్ఙాపకాలే చరిత్రగా మారి పుస్తకాలలో వస్తాయి… కాబట్టి చరిత్ర వలన విషయముల యందు అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.
సామాజిక చరిత్ర చదవడం వలన గత వందల సంవత్సరాలుగా సామాజిక పరిస్థితలు ఎలా ఉండేవో తెలియబడుతుంది.
అలాగే సామాజిక చరిత్ర బుక్స్ రీడ్ చేయడం వలన గతకాలపు మంచి చెడుల ప్రవర్తన వ్యక్తుల మద్య ఏవిధంగా ఉండేది అవగతం అవుతుంది.
గతకాలంలో జరిగిన సామాజిక ఉద్యమాలు, ఆ ఉద్యమాలు ఎందుకు పుట్టాయి? నాటి సమాజంలో గల పరిస్థితులు, సామాజిక సమస్యలు, వాటిపై పోరాటం జరిపిన నాయకుల గురించి చరిత్ర బుక్స్ చదివినవారికి తెలుస్తుంది.
తద్వారా వర్తమానంలో సామాజిక పరిస్థితిలు, వర్తమానంలో సామాజిక పోకడలు, వర్తమానంలో సామాజిక సమస్యలపై పరిశీలనకు చారిత్రక పుస్తకాలు ఉపయోగపడతాయి. సామాజిక భవిష్యత్తుపై ఊహ ఏర్పడే అవకాశం ఉంటుంది.
సామాజిక చరిత్రను తెలియజేసే తెలుగు బుక్స్ రీడ్ చేయడం, ఇప్పటి తెలుగు వ్యాసాలు చదువుతూ ఉండడం వలన మంచి సామాజిక పరిజ్ఙానం పెరుగుతుందని అంటారు.
ఎటువంటి రంగం గురించి చరిత్రను తెలుసుకుంటే ఆ రంగంలో విషయవిజ్ఙానం
సమాజంలో అనేకమంది అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది.
అందరి స్వభావాలు వేరు అయినా కొన్ని విషయాలలో అందరి భావన ఒక్కటిగానే ఉంటుంది. అటువంటి కొన్ని రంగాలుగా ఉంటాయి. విద్య అంటే నేర్చుకోవడం ఇది అందరిలోనూ ఒకే భావన ఉంటుంది… ఇది విద్యారంగం.
అయితే విద్యారంగంలో విద్యను గ్రహించడంలో ఒక్కొక్కరిది ఒక్కో విధానంగా ఉంటుంది. కానీ అందరిపై ఒకే రకమైన భావనలు కలిగి ఉండే రంగాలలో అనేక చరిత్రలు కూడా ఉంటాయి.
విద్యారంగంలో విశిష్టమైన కృషి జరిపిన వారి గురించి చరిత్రలు ఉంటాయి. విద్యారంగంలో జరిగిన మార్పులు గురించి చరిత్రలు ఉంటాయి. ఇలా రంగానికి కొన్ని చారిత్రక ఘటనలు, చారిత్రక వ్యక్తులు చరిత్రగా ఉంటారు.
ఇక ఒక వ్యక్తి ఎటువంటి రంగం గురించిన చరిత్రను తెలుసుకుంటూ ఉంటే, ఆయా రంగాలలో విషయ విజ్ఙానం తెలియబడుతుందని అంటారు.
తెలుగులో వ్యాసాలు రచించనవారు గురించి తెలుసుకోవడం. తెలుగులో వ్యాసాలు రచించడం ఎలా? అనే ప్రశ్న గురించి శోధించడం
వ్యాస రచన విధానం గురించి తెలుసుకోవడం… ఇలా వ్యాసాలు – ప్రయోజనాలు, వ్యాసాలు – ప్రాముఖ్యత అంటూ శోధించి, ఆలోచించడం మొదలు పెడితే, వ్యాసరచనపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆపై సరైన శిక్షణ తీసుకుంటే, ఆసక్తికి తగ్గట్టుగా వ్యాసరచన చేయగలుతారు.
ఆ విధంగా ఎవరైన ఏఏ రంగాలలో ఆసక్తి కలదో గమనించి, ఆయా రంగాలలో ఉన్న విశిష్ట సంఘటనల చరిత్రలు, ఆయా రంగాలలో ప్రభావం చూపిన వారి చరిత్రలు, ఆయా రంగాలలో ప్రాముఖ్యత వంటి చరిత్రను తెలుసుకుంటే, ఆయా రంగాలలో పరిజ్ఙానం పెరుగుతుందని అంటారు.
దైవభక్తి మెండుగా ఉన్నవారు దైవం గురించి చింతనతో ఉంటారు. దైవచింతనతో ఉండేవారు పౌరాణిక చరిత్రను తెలుసుకుంటూ ఉంటే, తాత్విక చింతనకు దారితీయవచ్చును… తాత్విక చింతన ద్వారా జ్ఙానమార్గంలోకి వెళ్ళవచ్చని అంటారు…. జ్ఙానం మార్గం మనిషికి విశిష్టమైన మార్గంగా చెబుతారు.
ఇలా వ్యక్తి ఆసక్తిని బట్టి చరిత్ర తెలుసుకోవడం వర్తమానంలో తన విధానమును వృద్ది చేసుకోవడానికి భవిష్యత్తులో లక్ష్యాన్ని చేరడానికి చరిత్ర ఉపయోగపడుతుందని అంటారు.
చరిత్ర గురించి తెలుగు వ్యాసం ఎందుకంటే? గతం గురించి తెలిపే చరిత్ర వలన విద్యావిషయాలలోనూ, అనేక విషయాలలో మనిషికి మేలు జరిగే అవకాశాలు ఉంటాయిన అంటారు.
పెద్దల అనుభవాలు, పండితులు మాటలు, గురువుల బోధ అన్ని పుస్తకాలుగా మారతాయి. కాలం గడిచే కొద్ది అవి చరిత్రగానే మారతాయి. ఏవి అయితే సమాజానికి ఎప్పటికీ మేలును చేస్తాయో, వాటిని చరిత్రకారులు చరిత్రగా మలుస్తారు… అటువంటి చరిత్రను తెలుసుకోవడం సామాజికంగా ప్రయోజనం అంటారు.
మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయడపడతాయి. మాటపై వేలమందిని నడిపించగలిగే శక్తి నాయకుడుకి సొంతం. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడి గురించి వ్యాసంలో వివరించడానికి తెలుగువ్యాసాలులో ఒక పోస్టు.
లోకంలో అనేకమంది ప్రజలకు, ఎన్నో సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చును… అలా అవగాహన ఉన్నా, ప్రతి సమస్యకు పరిష్కారం తోచకపోవచ్చును… పరిష్కారం లభించినా, పరిష్కరించే తీరిక ఉండకపోవచ్చును… కానీ ఒక నాయకుడుకి ఇటువంటి సమస్యలపై అవగాహన ఉంటుంది. పరిష్కరించే ఆలోచనా శక్తి ఉంటుంది. తన నోటిమాటతో ఆచరింపచేసే కార్యవర్గం కూడా ఉంటుంది. అటువంటి వ్యక్తిని నాయకుడుగా గుర్తింపు పొందుతారు. ప్రజా సమస్యల కోసం తీరిక చేసుకుని మరీ సమస్యల పరిష్కారానికి తపించే గుణం నాయకుడులో ఉంటుందని అంటారు.
మంచి నాయకుడు అంటే ఓ ప్రాంతంలో ప్రజలు మెచ్చిన నాయకుడుగా ఉంటాడు… అక్కడి ప్రాంతంలో అందరూ కొన్ని విషయాలలో అతనిని ఆదర్శప్రాయంగా తీసుకుంటారు. కొందరు యువత అయితే, కుటుంబపెద్దను అనుసరించడం కన్నా తమ ప్రాంత నాయకుడిని అనుసరించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అలా ఒక ప్రాంత నాయకుడు తమ ప్రాంతంలోని యువతపై ప్రభావం చూపగలుగుతారు. అలాంటి నాయకత్వం లక్షణాలు ఎలా ఉంటాయి?
నాయకుడు ముందుగా తనపై తాను పూర్తి నమ్మకంతో ఉంటారు…
తన అనుచరులకు కూడా అంతే నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు.
తన మాటచేత తన అనుచరులు కార్యరంగంలో దిగేవిధంగా, ఒక కార్యచరణను రూపొందించుకోగలుగుతారు.
నాయకుడు నడిచిన దారిలో నడిస్తే, మనకు మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయనే భావన బలంగా సమాజంలో వ్యాపింపజేయగలుగుతారు… వారే నాయకులుగా నిలుస్తారని అంటారు.
వ్యక్తిగత అభిప్రాయం కన్నా సామాజిక ప్రయోజనాలు మిన్న అని భావించడం ప్రధానంగా నాయకుడి లక్షణంగా భాసిస్తుంది. ఆకోణంలో ఉపన్యాసం ఇవ్వగలిగే గొప్ప ప్రతిభ వారియందు ఉంటుంది.
అలా ఒక సిద్దాంతమును ప్రకటిస్తూ, దానిపై ఉపన్యాసాలు ఇస్తూ, పదిమందిని ప్రభావితం చేసేవిధంగా నాయకత్వ లక్షణాలు నాయకుడిలో ప్రస్ఫుటంగా ఉంటాయని అంటారు. తను నమ్మిన సిద్దాంతంపై ఖచ్చితమైన అభిప్రాయం నాయకుడు యందు ఉంటుంది.
తను నమ్మిన సిద్దాంతమునకు చివరి వరకు కట్టుబడి ఉండి, ఆసిద్దాంతంలోకి ఇతరులను ఆకట్టుకోగలుగుతారు.
ప్రధానంగా నాయకుడిలో ప్రకాశించే మరో గుణం విషయమును పూర్తిగా వినడం… విన్న విషయములో వాస్తవితను అంచనా వేయగలగడం…
ఇంకా అనాలోచితంగా మాట్లాడకుండా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉండడం..
ఇలాంటి మరిన్ని లక్షణాలు వలన ఒక నాయకుడు ఒక వర్గమును కానీ, ఒక సంఘమును కానీ, ఒక ప్రాంతమును కానీ, ఒక వ్యవస్థను కానీ సమర్ధవంతంగా ముందకు నడిపించగలుగుతారు.
సమాజంలో నాయకుడు ఎలా పుట్టుకొస్తాడు?
కొందరు నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టుగానే, ఆటలలోనూ నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. కొందరు విద్యావిషయాలలో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.
మరి కొందరు చిన్న నాటి నుండి తాము ఉన్న అన్ని రంగాలలో నాయకత్వపు లక్షణాలతో ఒక నాయకుడుగానే పనిచేస్తూ ఉంటారు.
జీవితంలో ఎదగాలనే తపనతో ఉంటూ, నాయకత్వ లక్షణాలు కలిగినవారు తమ చుట్టూ పరిస్థితులపై పూర్తి అవగాహనను పెంచుకుంటూ ఉంటారు.
సమాజాన్ని సునిశితమైన పరిశీలన చేస్తూ, సమాజంలో సమస్యలపై దృష్టి సారిస్తూ, వాటిపై అవగాహన తెచ్చుకుంటూ ఉంటారు.
విశిష్టమైన లక్షణాలు కలిగిన వ్యక్తి ఒక వ్యవస్థలో చేరితే, అచిర కాలంలోనే ఒక పదిమందిని శాషించే అధికారిగా మారతారు. అలాగే ఒక విశ్వాసం వైపు మళ్ళితే, ఆ విశ్వాసంలోకి పదిమందిని తీసుకుని రాగలుగుతారు. ఒక సామాజిక అంశంవైపు దృష్టిసారిస్తే, ఆసమస్య పరిష్కారం కోసం పాటుపడతారు… పదిమందిని ప్రభావితం చేసేవిధంగా మాట్లాడగలుగుతారు.
ఇలా తమ ప్రతిభను తాము ఎరుగుతూ, సమస్యలపై పోకస్ చేస్తూ ఉంటారు… సమాజంలో అలాంటి సమస్య రాగానే స్పందిస్తారు… పదిమందికి మార్గదర్శకంగా నిలుస్తారు.
సమాజంలో సమస్య పుట్టిననాడే, ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక నాయకుడు సమాజంలో ఉంటూనే ఉంటాడు…
జనం మెచ్చిన నాయకుడు నిజమైన నాయకుడు
ఆ సమస్య ప్రజలను పట్టుకున్నప్పుడు, ఆ ప్రజల నుండే నాయకుడు పుట్టుకొస్తాడు… ఆ ప్రజలకు నాయకత్వం వహిస్తాడు…
జనాలు మెచ్చిన నాయకుడు జనుల కోసం పాటు పడతాడు.. ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించడం నాయకుడి గొప్పలక్షణంగా చెబుతారు.
వ్యవస్థలో కొందరికి నాయకత్వం వహించే నాయకుడు, తన ఎదుగుదల కన్నా తనను నమ్మినవారి బాగోగులు, తను పనిచేస్తున్న సంస్థ యొక్క బాగోగులను మాత్రమే చూస్తూ ఉంటాడు. ఆపై తనపై తను శ్రద్దతో ఉంటాడు.
సామాజిక శ్రేయస్సును కాంక్షించే నాయకుడు వ్యక్తిగత ఇష్టాఇష్టాలు కన్నా సామాజిక భద్రతనే కోరుకుంటూ ఉంటారు… సమాజం కోసం త్యాగం చేయడానికైనా నాయకుడు సిద్దపడతాడు.. అలాంటి నాయకుడినే ప్రజలు మెచ్చుకుంటారు.
జనం మెచ్చిన నాయకుడు విశేష అభిమానులను కలిగి ఉంటాడు. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా సమాజంలో మెసులుతూ ఉంటాడు..
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసంమీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి.
అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది.
సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో ఎక్కువమంది ఎవరిని పొగుడుతున్నారో… వారిలో సహజంగానే మంచి గుణాలు ఉంటాయి.
మంచి గుణాలు అంటే ఉపకారం చేయడం, దానం చేయడం, చెప్పిన మాట వినడం, సాయం చేసే గుణం కలిగి ఉండడం మొదలైనవి…
ఒక వ్యక్తి గురించి వ్యాసం వ్రాయాలంటే, ఆ వ్యక్తి గురించిన గుణగణములు తెలియాలి. ముఖ్యంగా ఆవ్యక్తిలో ప్రధానమైన మంచి గుణములు తెలియాలి.
అందరికీ నచ్చిన ఆ గుణములు గురించి మనకు తెలియాలి. సాధారణంగా వ్యాసరచన చేస్తున్నామంటే, అతని పాపులరిటి కలిగిన వ్యక్తి అయి ఉంటాడు.
కనుక అతని గుణగణాలు అందరికీ తెలిసినవే ఉంంటాయి. వాటిని మనం వార్తా పత్రికలు, టివిలు, ఆన్ లైన్ న్యూస్ చానల్స్ ద్వారా తెలుసుకోవచ్చును.
ఇంకా మన చుట్టుప్రక్కల ఉండే కొందరు పెద్ద మనుషుల గురించి కూడా మన చుట్టూ ఉండేవారు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి గురించి మనకు మాములుగానే తెలిసి ఉంటుంది.
అప్పుడు ఆ వ్యక్తి పేరు, పుట్టిన ఊరు, పుట్టిన తేది, పెరిగిన నేపధ్యం, చదువు, వృత్తి ఉద్యోగాలు, బంధు మిత్రులను పరిచయం చేస్తూ క్లుప్తంగా వివరించాలి.
ఆ తర్వాత అతని పుట్టిన నాటి నుండి అతని జీవితంపై ప్రభావం చూపిన సంఘటనలు వ్రాయాలి.
అతని జీవితంపై ప్రభావం చూపిన వ్యక్తులు, అతని జీవితంలో మార్పుకు నాంది పలికిన మలుపులు… తెలుసుకుని వాటి గురించి వ్రాయాలి…
ఇవి పూర్తయ్యాక ప్రధానముగా వ్యక్తి సమాజంలో కీర్తిగడించిన అంశమును గురించి వ్యాసములో విపులంగా విస్తారంగా వివరించాలి.
మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, బాగంగా అందరికీ తెలిసిన నరేంద్ర మోదీ గారి గురించి వ్యాసం
క్లుప్తంగా వివరణ:నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధానమంత్రి. అంతకుముందు ఆయన గుజరాత్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి. నరేంద్రమోదీ అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఈయన 1950 సెస్టెంబర్ 17న జన్మించారు. ఈయన తండ్రి దామోదర్ దాస్, తల్లి హీరాబెన్ మోదీ… రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఈయన శాకాహారి….
ఇప్పుడు నరేంద్ర మోదీ గారి బాల్యం గురించి
గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోదీ జన్మించారు. అక్కడి స్థానిక పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో నరేంద్రమోదీగారు రాజనీతి శాస్త్రములో మాస్టర్స్ డిగ్రి పట్టభద్రులయ్యారు. ఈయన విద్యార్ధి దశలోనే అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ నాయకుడిగా పనిచేశారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో ఒక మారుమూల టీ అమ్మిన ఈయన జీవితం అనేక మలుపులు తిరిగింది.
భారతీయ జనతా పార్టీలో నరేంద్రమోదీ 1987 సంవత్సరంలో చేరారు. అచిర కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అందుకున్నారు. ఎల్.కె. అద్వానీ నేతృత్వంలో 1990లో జరిగిన అయోధ్య రధయాత్రలో ఇన్ చార్జ్ గా పనిచేశారు. అదేవిధంగా మురళీమనోహర్ జోషి తలపెట్టిన కన్యాకుమారి టు కాశ్మీర్ రధయాత్రకు కూడా ఇన్ చార్జ్ గా పనిచేశారు. అనతి కాలంలోనే కేశుభాయ్ పటేల్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. 2001లో ముఖ్యమంత్రిగా మారిన మోదీగారు ప్రధాని అయ్యేవరకు గుజరాత్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రిగానే పనిచేస్తూ ఉన్నారు.
దేశప్రధానిగా నరేంద్ర మోదీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాని అభ్యర్దిగా పోటీ చేశారు. అంచనాలకు భిన్నంగా నరేంద్రమోదీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలలో విజయం సాధించింది. ఎంపిగా పోటీ చేసి, గెలిచిన తొలిసారే ప్రధాని పదవిని అధిష్టించారు.
ఈయన దేశప్రధానిగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెద్ద నోట్ల రద్దు ప్రక్రియగా ఉంది. అర్ధరాత్రి అప్పటికప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దేశ మొత్తం ఆశ్చర్యపోయింది. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. జిఎస్టీ అమలు చేయడంలో కూడా కృషి జరిగింది. ఇంకా మూడు సార్లు తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా(NRC) అమలు వంటివి ఉన్నాయి
2014 మే 26న భారతదేశ పదిహేనవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్నారు.
విశిష్ట లక్షణాలతో భారతదేశాన్ని ముందుండి ముందుకు నడిపిస్తున్నందుకు గాను మోడీకి అవార్డు అవార్డు దక్కింది జనవరి 14 2019 లో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకున్నారు.
పాపులర్ ప్రధానమంత్రిగా, అశేష ప్రజాధరణ కలిగిన నాయకుడు
నరేంద్ర మోదీ ప్రత్యేకతలు
రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు.
గుజరాత్ రాష్ట్రమునకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.
అందరికీ తెలిసిన వ్యక్తి గురించి వ్రాస్తే, వ్రాయడం ఎలా అనే కాన్సెప్ట్ అర్ధం అవుతుందిన నరేంద్రమోదీ గారి గురించి ఒక వ్యాసంలోకి తీసుకురావడం జరిగింది.
ఈయన గురించి ఇంకా చాలా వివరాలు ఆన్ లైన్లో పబ్లిక్ డొమైన్లలో లభిస్తుంది.
వ్యాసం ప్రారంభం, వ్యాసం ముగింపు క్లుప్తంగా అర్ధవంతంగా ఉంటే బాగుంటుంది.
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం అంటే మనం ఎరిగినవారిలో మంచి గుణాలు కలిగిన వారిని ఎంచుకోవాలి.
మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ఆ వ్యక్తి గురించి తెలిసినవారు ఏమనుకుంటున్నారో చూడాలి. లేదా ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడే వాస్తవాలు వ్రాయగలుతాము.