కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020సంవత్సరం గత సంవత్సరంగా మారుతుంది…
మిత్రులతో మీటింగులు షురు అవుతాయి. మాటలు మూటలతో మిని మీటింగ్స్ ఉంటాయి.
పాత సంవత్సరం – కొత్త సంవత్సరం సంధి కాలంలో స్నేహితులతో సంతోషంతో, గడిపేస్తూ, విషెస్ చెబుతూ గంటల కాలం కరిగిపోతుంది…
ఎవరూ ఎలా ఉన్నా కదిలే కాలంలో తేదీని మారుస్తుంది… ప్రతి న్యూఇయర్ కొందరికి కష్టంగా, కొందరికి నష్టంగా, కొందరికి అద్భుతంగానే గడిచి ఉంటుంది. కానీ ఈ2020 సంవత్సరం మాత్రం అందరికీ కష్టాలనే తీసుకువచ్చింది..
రోటీన్ కు భిన్నమైన పరిస్థితిని ప్రకృతి తీసుకువచ్చింది. 2020సం.లో అరుదైన స్థితిని ప్రపంచంలోని ప్రజలంతా ఎదుర్కొన్నారు. 2020ఆరంభమే ఆందోళనలనకు తావిస్తు ఇయర్ స్టార్ట్ అయ్యింది.
చైనాలో పుట్టిన వైరస్ ఎక్కడ ఎవరి ద్వారా ఏ ప్రాంతానికి, ఎవరెవరికి సోకి ప్రాకుతుందేమోననే ఆలోచన మాత్రం అందరిలోనూ వచ్చింది.
పదవతరగతి పాస్ కావాలనే తపనతో విద్యార్ధి సంవత్సరం ప్రారంభిస్తే, అది ఎలా గడిచిందో పదవ తరగతి పరీక్షా ఫలితాలొచ్చాకే ఆలోచిస్తాడు. అలా అందరికీ కరోనా రాకుండా, కరోనా సోకకుండా, కరోనా వ్యాప్తి చెందకుండా ఎలా గడుస్తుంది? ఇది ఆలోచన కావచ్చును. భయం కావచ్చును. ఆందోళన కావచ్చును..
సంవత్సరం ఆరంభంలో ఉన్న ఆలోచనలకు తగ్గట్టుగానే ఇయర్ మద్యలో కరోనా వ్యాప్తి చెందింది. కొన్ని చోట్ల ఆందోళనకరంగానూ కొన్ని చోట్ల భయావాహ పరిస్థితులలోనూ కాలం సాగింది. అయితే కొన్ని రోజుల పాటు ప్రజలనందరిని ఇంటికే పరిమతం చేసిందీ…కరోనా.
బిజికి భిన్నంగా కొద్దిరోజులు
మనిషి ఎప్పుడూ బిజి…బిజిగా ఉండే వ్యక్తులు ఖాళీగా ఇంటికే పరిమితం అయ్యారు. సేవలోనో, వ్యాపారంలోనో, సంస్థలోనో…. ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూ లక్ష్యంవైపు బిజిగా సాగే కాలం కరోనా కారణంగా బిజికి భిన్నంగా కొద్దిరోజులు బ్రతకాల్సిన స్థితి ఈ 2020సంవత్సరం తీసుకువచ్చింది…
ఆర్ధికపరంగా తప్పించితే మరొక కోణంలో కూడా కరోనా వలన వచ్చిన లాక్ డౌన్ మరొక మేలును తీసుకువచ్చింది. అదే ప్రకృతిలో కాలుష్యం తగ్గడం… అంతా ఇంటికే పరిమితం కావడంతో వాహన వినియోగం తగ్గింది… వెహికల్స్ వాడకపోవడం వలన వాయుకాలుష్యం తగ్గింది. ఎక్కడా ట్రాఫిక్ లేకపోవడంతో ప్రకృతి సమతుల్యత పెరిగిందీ2020 సంవత్సరంలోనే….
ఇలా మనకీ2020 సంవత్సరంలో ఎక్కువగా ఆర్ధిక నష్టం జరిగింది. ప్రకృతి పరంగా కాలుష్య నివారణ జరిగింది. బిజి లైఫ్ నుండి కొంతకాలం తీరికగా బంధుమిత్రులతో మాట్లాడే అవకాశం అందరికీ వచ్చింది. జాగ్రత్త లేనివారికి 2020 జాగ్రత్తపై పరాకు చెప్పింది.
కరోనా ఆలోచనతోనే కొత్త సంవత్సరం ప్రారంభం…. కొత్త కరోనా ఆలోచనతో ఈ సంవత్సరం ముగింపు అయితే టీకా సిద్దమనే సంతోషకరమైన ఆలోచన మనకు బలం…
రివ్యూ2020 నుండి గుడ్ విజన్ తో 2021 కొత్త సంవత్సరంలోకి వెళ్లడమే మనకు మనోబలం. అనేక మార్పులకు 2020నాంది అయ్యింది. మార్పులు మొదలైనాయి… అవకాశాలు కొందరికి పోవచ్చును. కొందరికి రావచ్చును.
మనకు ఉన్న స్కిల్స్ ఉపయోగించి మంచి దృష్టికోణంతో ఆలోచన చేయగలిగితే 2021 సంవత్సరం అద్భుతాలకు నాంది కాగలదు…. పాఠం నేర్పిన 2020కు గుడ్ బై చెబుతూ…. 2021 వెల్కమ్ చెబుదాం….
మనకు కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో ప్రారంభం కావడానికి డిసెంబర్ 31 సెలబ్రేషన్ వస్తుంది… అన్ని మరిచి మిత్రులతో గడిపే కాలం మనకు మరింత బలాన్ని అందిస్తుంది.
ఆత్మీయుల మద్య ఆనందంగా గడిపే కాలంగా, డిసెంబర్ 31నైట్ సంతోషంతో 2020సంవత్సరానికి గుడ్ బై చెబుతూ… 2021 కొత్త సంవత్సరానికి… స్వాగతం పలుకుదాం…
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 కోట్స్ కొన్నింటిని తెలుగులో రీడ్ చేయండి
ఒక్కరోజులో జీవితం మారిపోదు
కానీ ఒక్క ఆలోచన జీవితాన్ని మలుపు తిప్పగలదు… అటువంటి ఆలోచనలు కలిగి ఉండే మనసుకు మిత్రుడు బలం… అలా నాకు బలమైన మిత్రమా నీకు నీ కుటుంబానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు….
కదిలిపోతూ కరిగిపోయే కాలంలో
పువ్వు ఒక్కపూటలో వాడిపోయిట్టుగా డిసెంబర్ 31 కాలం కరిగిపోతుంది… ఈ సమయంలో నీతోనే ఉంటే, నాకాలం వృధా కానట్టే… అటువంటి వ్యక్తిత్వం కలిగిన మిత్రమా నీకు నీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు.. హ్యాపీ 2022
మంచిమాట ఎప్పుడూ వినాలి అంటే..
డిసెంబర్31 న ఒక మంచిమాట వినడం కన్నా నీతో స్నేహమే నాకు మిన్న.. ఎందుకంటే నీలో ఉన్న మంచి నాకు ఎక్కడా కనబడలేదు… నీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు…
ప్రకృతికి ఇచ్చినవి తిరిగిస్తుంది…
డిసెంబర్31 మాట్లాడిన మాటలు మాత్రం తిరిగిరావు.. ఎందుకంటే అవి మాటలు కాదు…. మంచి భావనలు… నూతన సంవత్సరం శుభాకాంక్షలు..
మార్చి31 ఎక్కౌంట్స్ ఆడిట్ అయితే
డిసెంబర్ 31న మైండ్ ఆడిటింగ్ జరుగుతుంది… జనవరి ఫస్ట్ ఫ్రైస్ మైండుతో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్ 2022
31… డిసెంబర్ 2021 బై బై
ఎప్పుడూ మిత్రులతో మాటలు, సహచరులతో సన్నిహితంగా ఉంటూ…అందరిలో ఆనందం చూసే ఓ మిత్రమా డిసెంబర్ 31స్ట్ డిసెంబరుతో 2020 సంవత్సరంతో బాటు కరోనాకు బైబై చెబుతూ నీకు నీక కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు…
ఎలాంటి కరోనా అయినా నీ మనోనిబ్బరం ముందు…దిగదుడుపే… కరోనా నశించాలి.. సమాజం వర్ధిల్లాలి… అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు…
ఏడాదేడాదికి తేడా వయస్సులో ఉండవచ్చును కానీ మనసులో కాదు…
అలాగే సంవత్సరం సంవత్సరం డిసెంబర్31 కూడా వస్తుంది.. వెంటనే జనవరి ఫస్ట్ రోజుకు ఆనందంతో తీసుకుపోతుంది.. మీకు మీ కుటుంబ సభ్యులకు డిసెంబర్31త్ విషెష్…
ఇరవై ఇరవై వెళ్లింది… ఇరవైఇరవైఒక్కటి వచ్చింది…
తెచ్చింది నూతన సంవత్సరంలోని తొలిరోజుని ఆనందాల హరివిల్లుతో… మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… హ్యాపీ 2022
డిసెంబర్31, జనవరి1 తేదీలు కాదు..
స్నేహితులతో కలిసిన అనుబంధంతో కూడిన అనుభవం… అలాంటి అందమైన అనుబంధాలు మరింతగా మీకు పెరగాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021 సంవత్సరం.
ఆనందానికి హద్దులేదు డిసెంబర్ 31న మంచి మిత్రులతో మైమరిస్తే..
మిత్రబంధం, కుటుంబ బంధం, ఇలా బంధం ఏదైన డిసెంబర్31 రోజులో అందరికీ ఆనందమే… జనవరి ఫస్ట్ సంతోషంతో సాగాలనే ఆకాంక్షల అందరిలోనూ అదే అదే భావన… హ్యాపీ2022
31డిసెంబర్2020
ఆనందమానందమాయే జనవరి ఫస్ట్ సంతోషంతో సాగాలి….
నిత్యనూతనంగా ఉండే మీ మంచి మనసుతో అందరికీ ఆనందం పంచుతూ మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకుంటూ…. సంవత్సరం సాగాలి 2022 సంతోషంతో నిండిపోవాలి…
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021 న్యూఇయర్ కోట్స్
నీకు నచ్చని రోజు నాకు నచ్చదు…
నీవు మెచ్చిన రోజు, నేను మెచ్చుతాను.. కానీ డిసెంబర్31 అందరం మెచ్చుతాం… మీకు మీ కుంటుంబ సభ్యులకు డిసెంబర్31 సంతోషంతో ముగిసి, 2022 జనవరి ఫస్ట్ ఆనందంతో ప్రారంభం కావాలి…
నాలో… నీలో… కలిగే ఒకే భావ
నూతన సంవత్సరం అందరి కోరికలు తీరాలి… అందరూ సంతోషంగా ఉండాలి… అందులో మనముండాలి… అందుకే మిత్రమా నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… హ్యాపీ2022
ఈ కరోనా కాలంలో కష్టాలు చూశావు… కానీ కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్నావు.. కలకాలం కష్టాలు ఉండవనే నీ మనోభావనే మాకు ఆదర్శం… నీకు నీ కుటుంబ సభ్యులకు హ్యాపి 2021 విషెస్
నేస్తం నాతో లేవు కానీ నాలోనే ఉన్నావు…
గత ఏడాది ముగింపులో మన ఎడబాటు ప్రారంభం అయినా నీవు నాలోనే నిలిచావు.. నీ సర్వసమానత్వం నాలోనూ నిలిచింది… నేస్తమా… నీకు నీ కుటుంబ సభ్యులకు నూతనసంవత్సర శుభాకాంక్షలు… హ్యాపి 2021 టు యు అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్…
మరికొన్ని 2020 నుండి 2021 స్వాగతం పలుకుతూ హ్యాపీ 2021 విషెష్ కోట్స్
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 న్యూఇయర్ కోట్స్
కదిలే కాలంలో కలిగిన కరోనా వైరస్
కదిలే కాలంలో కష్టాలు వస్తాయి కానీ 2020లో కరోనా వచ్చింది. కరోనాను ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన మిత్రులారా మీకు మీ బంధుమిత్రులకు కూడా 2022 సంతోషాలు నింపాలని ఆశిస్తూ… మీ మిత్రుడు.. హ్యాపీ 2022
చేయివదలని మిత్రమా నామనసులో నిన్ను వదలదు.
కష్టంలో నాచేయి వదలని ఓ మిత్రమనా నా మనసులో నీ సాయం ఎప్పటికీ ఓ పర్వతంలాగా పేరుకుపోయి ఉంటుంది… ఆ మనుసుతో మిత్రమనా నీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు… నీ కుటుంబ సభ్యులకు కూడా ఓ నేస్తమా… హ్యాపీ 2022
పాత మనిషిగా పేరు పొందినా టెక్ యుగంలో
పాత కాలంనాటి మనిషవని అలుసుగా ఆడిపోసుకున్నా, వయస్సు కాయమునకే కానీ మనసుకు కాదని, ఈ టెక్ యుగంలోనూ టెక్నాలజీతో కమ్యూనికేట్ అవుతున్న నేస్తమా…. నీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు… హ్యాపీ 2022
అదే నీవు అదే నేను కరోనా వచ్చింది… పోతుంది.
కాలంలో సంవత్సరాలు గడిచిపోయాయి… కానీ 2020లో వచ్చిన కరోన కోరలు చాచింది… అందులో చిక్కకుండా అదే నీవు అదే నేను అలాగే ఉన్నాము… కరోనా 2020లో వచ్చింది…ఎప్పుడో పోతుంది…కానీ 2021 హ్యాపీగా సాగాలి… జాగ్రత్తలతో మెలగాలి… హ్యాపీ 2021.
2020 నుండి 2021
పది పరిక్షలు వ్రాసే విద్యార్ధికి సంవత్సర కాలం ఎలా గడిచిందో తెలియదు..కానీ 2020 సంవత్సరం కాలం అందరికీ అదే విధంగా గడిచింది… భయంతో వేగంగా గడిచిన 2020, సంతోషంతో 2021 సంవత్సరం అంతా గడవాలని ఆశీస్తూ.. హ్యాపీ 2021
మార్పు మంచిదే కానీ అందరిలో మార్పు
మంచి మార్పు మనిషికి మంచినే చేస్తుంది… కరోనా 2020లో జాగ్రత్తను అందరికీ గుర్తు చేసింది… సంతోషంగానే ఉంటూ సంతోషంలో జాగ్రత్తను మరవకుండా, మెలకువతో మనతోబాటు మన సమాజాన్ని సంరక్షించుకుందాం.కరోనా బారిన పడకుండా… హ్యాపీ 2021.
వేగంగా వచ్చేవి వేగంగానే పోతాయి…
ఎంత వేగంగా వచ్చేవి అంతే వేగంతో పోతాయి… కరోనా కూడా వేగంగానే వచ్చింది… వేగంలోనూ పోతుంది… మాస్క్ కరోనా కట్టడికి సహకరించిన అందరికీ 2022 సంవత్సరం అంతా సంతోషమయం కావాలి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు
జనవరి మాసం మొదలు కానీ
ఆలోచనల దగ్గరే ఆగి ఆచరణలోకి రానీ మంచి విషయాలను ఈ2021లో ఆచరించి, మందిచే మెప్పు పొందాలని ఆశిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకు 2021నూతన సంవత్సరం శుభాకాంక్షలు…
అందరి మేలును తలచి… తలచి…
అందరి మేలును ఆకాంక్షిస్తూ, నీమేలును మచిచే మిత్రమా నీకోసం నేను ఎప్పటికీ ఉంటాను… ఓ మంచి మిత్రమా నీకు నీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు… హ్యాపీ 2021…
కొత్త సంవత్సరం సంతోషంతో సాగాలని ఆకాంక్షించే తెలుగు కోట్స్ 2022
లక్షల్లో ఒక్కడిగా ఉన్నా… లక్షమందికి ఒక్కడిగా…
లక్షల మందిలో నేనూ ఒక్కడిని అనుకోకుండా లక్షమందికి ఆదర్శంగా నిలవాలనే నీ ఆశయం సిద్దించాలని కోరుకుంటూ… నీకు నీ బంధుమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… విష్ యు హ్యాపీ న్యూఇయర్…2021
కన్నుమిన్ను కానక ప్రవర్తించేవారి వలన
కన్నుమిన్ను కానక ప్రవర్తించేవారి వలన వ్యాధి వ్యాపిస్తుంది… కానీ కరోనా కన్నుమిన్ను కానక కోరలు చాచింది… అయితేనేం మాస్స్ దెబ్బకు, సోషల్ డిస్టేన్స్ దూరానికి, సానిటైజేష్ శుభ్రతకు అది ఆమడ దూరం పారిపోవడానికి సిద్దమైంది… కాస్త జాగ్తత్తను పెంచు మిత్రమా.. హ్యాపీ 2022 ఇయర్.
నీ సహచర్యంలో నేనేర్చిన విషయాలు
నీతో కలిసి పనిచేసే అవకాశం అందించిన దైవమునకు కృతజ్ఙతలు తెలియజేస్తూ… నీకు నీ కుటుంబ సభ్యులకు సంతోషం నింపాలనీ దైవప్రార్ధన చేస్తూ… నూతన సంవత్సరం శుభాకాంక్షలు…హ్యాపీ న్యూ ఇయర్ 2021
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022
మెరుపులాంటి ఆలోచనలతో ఉపాయం చెప్పే
మెరుపులాగానే ఉపాయాలు కూడా ఉంటాయని, నీ ఆలోచనను గమనిస్తే అర్ధం అవుతుంది… మెరుగైన పనికి మెరుగైన ఆలోచనను కనబరిచే నేస్తమా… నీకు నీ బంధు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు….
అంది వచ్చిన అవకాశం అందుకోవడమే
అంది వచ్చిన అవకాశం జారవిడవడం అంటే అదృష్ఠ చేజార్చుకోవడమే… కానీ అలాంటి అవకాశం అందించిన నీకు నీ బంధు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…వెరీ వెరీ హ్యాపీ న్యూఇయర్
ఆశే అందరికీ అవకాశం కోసం
ఆశ అందరినీ ఆడిస్తుంది… ఆశలు తీరే కాలం కానీ కాలం కరోనా కాలం.. ఆశాభంగం 2020లో ఎదురైతే, 2021లో మాత్రం కొత్త ఆశలు కూడా నెరవేరాలని కోరుకుంటూ…. నూతన సంవత్సర శుభాకాంక్షలు..
తిరిగేవన్నీ తిరగని వస్తువు ఆధారంగా
తిరిగేవన్నీ తిరగని వస్తువు ఆధారంగా తిరుగుతున్నట్టు… ఆలోచన లేని చోటు చుట్టూ ఆలోచనలు కల్పించే మనసుకు శాంతి చేకూరాలనీ కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు… హ్యాపీ 2022
మంచి మాట మౌనం కన్నా
అలాంటి మంచి మాటలే మాట్లాడుతూ మౌనం వహించని మిత్రమా, నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయన్ 2021
న్యూఇయర్ విషెష్ కోట్స్ 2022
అకారణంగా మాట్లాడకుండా
మాట మనసును తాకుతుందని, అకారణంగా మాట్లాడకుండా, ఎవ్వరినీ నొప్పించని నేస్తమా… నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…
వచ్చే వచ్చే వాన ఆగుతుందేమో
కానీ నేస్తమా నీ స్నేహంతో నేను ఎప్పుడూ ఉంటాను… ప్రతి సంవత్సరం కలిసే సెలబ్రేట్ చేసుకుందాం… అలాగే ఈ 2021 కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2021
ఇరవైఇరవైలో అంతా గందరగోళమే
కానీ ఇరవైఇరవై ఒక్కటిలో మాత్రం మిత్రమా మంత్రం వేసినట్టుగా కష్టాలు కరిగిపోవాలి…సంవత్సరమంతా సంతోషంగా సాగాలని ఆశీస్తూ… హ్యాపీ న్యూఇయర్ 2022.
వేడుకలో వెలిగే కాంతి
వేడుకలో వెలుగు వెదజల్లే కాంతి కిరణాలు నీ మంచి మనసులోని మాటల ప్రభావాలే… మిత్రమా నీకు నీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు… హ్యాపీ2021
సాహసం నీ శ్వాస
సాహసే లక్ష్మీ అన్నట్టుగా నా సాహసానికి ధైర్యం నీవే మిత్రమా…. నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు… హ్యాపీ 2021
విద్యలేనివాడు వింతపశువు
కానీ నాకు నీవుండగా విద్య అవసరంలేదు… నావిద్యే నీ స్నేహం… మిత్రమా నీకు నీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు... హ్యాపీ న్యూఇయర్ 2021
అటు అయినా ఇటు అయినా
ఎటు చూసినా నీవు చేసిన మంచే నిన్ను కాపాడుతుంది… అందరి మేలుకు ఆకాక్షించే మిత్రమా… నీకు నీ కుటుంబ సభ్యులకు నూతనసంవత్సర శుభాకాంక్షలు….
కాలంలో వచ్చాం కాలంలో కనుమరుగవుతాం
కానీ డిసెంబర్ 31 మాత్రం మిస్ కావద్దు… ఎందుకంటే మన స్నేహం మరింత బలపడేది ఆరోజే కదా…. అందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు…
ఆలోచనే మనసు బలం, ఆలోచనే మనసు బలహీనత
అయితే నీకు మాత్రము నీ మనసుకు బలం కలిగించే ఆలోచనలనే పుట్టించమని ఈశ్వరుని కోరుకుంటూ…. నీకు నీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 2021
అందరినీ ఆలోచింపజేసిన సంవత్సరం 2020
అయితే అందరికీ జాగ్రత్తపై పరాకు చెప్పిన ఈ 2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ… 2021లో కరోనా రహిత సమాజంగా మారాలని కోరుకుంటూ మీకు మీ బంధు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…
శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ అందమైన ఫ్యామిలీ కధలో ప్రేమకధ కూడా ఉంటుంది.
శుభకాంక్షలు తెలుగు మూవీ 1997 లో రిలీజ్ అయ్యింది. ఈ తెలుగుమూవీలో జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తెలుగు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ మూవీలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
ఆనందమానంద మాయె అనే పాట బాగా పాపులర్ అయితే గుండె నిండా గుడి గంటలు, అద్దంకి చీర కట్టే ముద్దుగుమ్మా,పంచవన్నెల చిలక నిన్ను పాటలు కూడా ఆకట్టుకుంటాయి.
ఇక శుభాకాంక్షలు తెలుగు మూవీ కధలోకి వెళ్తే…
స్టీఫెన్ క్రైస్తవ మతానికి చెందినవాడు. సీతారామయ్య హిందూ మతానికి చెందినవాడు. ఒకేవీధిలో రెండు కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తుంటారు. ఇంకా ఈ రెండు కుటుంబాల సభ్యుల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది.
ఆ కుటుంబాలలో అబ్బాయిలు మోసెస్, బలరామయ్యలు కూడా మంచి స్నేహంగా ఉంటూ ఉంటారు. ఈ క్రమంలో రాబర్ట్(మోసెస్ తమ్ముడు), జానకి(బలరామయ్య చెల్లెలు) ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఈ రెండు కుటుంబాలు వీళ్ళ ప్రేమను అంగీకరించరు.
దాంతో వీరిద్దరూ దూరంగా పారిపోయి పెళ్ళి చేసుకుంటారు. ఇక అప్పటినుండి ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి నెలకొంటుంది.
25 సంవత్సరాల తర్వాత స్టీఫెన్, బలరామయ్యల కుటుంబాలను ఏకం చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతనే చందు. ఆక్రమంలో చందు గోపి అనే తన స్నేహితుడితో పాటు ఆ ఊరు వచ్చి తను రాబర్ట్, జానకిల కొడుకునని అందరితో చెబుతాడు.
వాళ్ళకి ఇల్లు దొరకని పరిస్థితులలో నాదబ్రహ్మం అనే వ్యక్తి మాత్రం వాళ్ళను పిలిచి తన ఇంట్లో ఉండమంటాడు. ఆ తర్వాత చందు నెమ్మదిగా విడిపోయిన ఆ ఇద్దరి కుటుంబాలతో పరిచయం పెంచుకుంటాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తుంటాడు.
ఒకసారి స్టీఫెన్, సీతారామయ్య భార్యలిద్దరూ చందుకు పెళ్ళి చేయాలని చూస్తారు. అయితే వారిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు చందు కోసం పెళ్ళి సంబంధం తెస్తారు. వాళ్ళిద్దరి బారినుంచి తప్పించుకోవడం కోసం చందు తనకి ఇదివరకే నిర్మలా మేరీ అనే అమ్మాయితో పెళ్ళి అయిందని అబద్ధం చెబుతాడు.
అయితే ఆ అబద్దం నిజం చేస్తూ ఒక సన్నివేశం కధ మలుపు తిప్పుతుంది. ఉన్నట్టుండి నిర్మలా మేరీ అనే పేరుతో ఒక అమ్మాయి ఇతని కోసం వచ్చి తానే అతని భార్య అని చెబుతుంది.
చందు చెప్పిన అబద్దం నిజం చేస్తూ, వచ్చిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? చందు నందిని ప్రేమకధ ఏమయ్యింది? ఈ ప్రశ్నవలకు సమాధానాలు చివరకి ఏమవుతుందో సినిమా చూడాల్సిందే…
శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ
ఫ్యామిలీ హీరో జగపతిబాబు ప్రేక్షకులను మెప్పిస్తే, పాటలు అందరినీ అలరిస్తాయి. అందాల తార రాశి, జగపతిబాబుల మద్య ప్రేమ, జగపతిబాబు, రవళిల మద్య జరిగే సన్నివేశాలు కధను కొనసాగిస్తాయి.
శుభాకాంక్షలు తెలుగు మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించినది.
తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత. తెలుగు భాష అనేది ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంతములలోని వాడుక భాష. ఇంకా ఇతర పొరుగు రాష్ట్రాలలో మాట్లాడే వారు ఉంటారు. ఇతర దేశాలలో స్థిరపడినవారి కారణంగా అక్కడ కూడా తెలుగులో సంభాషించుకునేవారు ఉంటారు.
భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో మూడవ భాష తెలుగు భాష. ఇంకా తెలుగుభాష ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా అధికార భాష కూడా.
తెలుగు భాష యొక్క మూలాలు క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందినవి, దాని మాతృభాష సంస్కృతం నుండి ప్రత్యేక భాషగా అభివృద్ధి చెందిందని చెబుతారు. శతాబ్దాలుగా, తెలుగు దాని స్వంత ప్రత్యేక లిపి, వ్యాకరణం మరియు పదజాలం అభివృద్ధి చెందింది మరియు అభివృద్ధి చెందింది.
తెలుగుభాష వ్యాకరణం దృశ్య సౌందర్యాన్ని ఇస్తుంది మరియు ఇతర భారతీయ భాషలలో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. సాహిత్య పరంగా తెలుగుకు గొప్ప, ప్రాచీన సంప్రదాయం ఉంది. ప్రాచీన తెలుగు గ్రంథం “ఆంధ్ర మహాభారతం” తెలుగులోకి అనువదింపబడింది. ఇంకా రామాయణం, మహాభారతం వంటి సంసృత కావ్యాలు తెలుగులోకి తెలుగు కవులు అనువదించారు.
ఇటీవలి సంవత్సరాలలో, తెలుగు సినిమా లేదా టాలీవుడ్, భారతదేశంలోనూ మరియు అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందింది. కారణం దానికి మూలం తెలుగులో అనువదింపబడిన పురాణాలలో, పురాణాలలో పాత్రలే కీలకం… వాటిని అర్ధం చేసుకోవడానికి తెలుగు తెలిసి ఉండడం చాలా ప్రధానం. పూర్వుల ముందు చూపు వలన నిన్నటి తరం వారు తెలుగులో బాగా చదువుకుంటే, నేటి తరం తెలుగు నేర్చుకోవడానికి ఇబ్బందిపడుతుండడం విచారకరం అంటారు.
మనదేశంలో తెలుగు భాష సుదీర్ఘ చరిత్ర మరియు శక్తివంతమైన సాహిత్య మరియు సాంస్కృతిక సంప్రదాయంతో గొప్ప మరియు శక్తివంతమైన భాష.
తెలుగు అమ్మ వంటిది అమ్మ లేని జీవితం ఉండదు మాతృభాష మాట్లాడనివారు ఉండరు. తెలుగు చదవడం వలన తెలుగు గొప్పతనం మనకు తెలుస్తుంది…
మనకు తెలుగు భాష చిన్ననాటి నుండి అమ్మ దగ్గర నుండి పరిచయం
మాతృభాష అమ్మ దగ్గర నుండి మొదలై, నాన్న, బాబయ్, మావయ్య, అత్తయ్య, పిన్ని… ఇలా బంధుమిత్రుల ద్వారా మాతృభాషలో మాటలు ఒక పిల్లవానికి వస్తాయి.
అలాంటి మాతృభాష అంటే మానవునికి మిక్కిలి మక్కువ ఉంటుంది. అటువంటి మక్కువైన భాషపై గౌరవంతో అందరూ ఉంటారు.
అమ్మ తాత..తాత్త..తాత. అంటూ అత్త అని అమ్మా అని ఇలా వరుసలతో చిన్నారికి మాటలు తెలుగులోనే తెలుస్తాయి.
ఉహ తెలిసినప్పటి నుండి తెలుగు ప్రాంతాలలో పెరిగే పిల్లలకు తెలుగులో పట్టు పెరుగుతుంది. తెలుగు మాటలు మాట్లాడడం బాగా అలవాటు అవుతుంది. అదే అలవాటులో విద్య నేర్చుకుంటే, చక్కగా అర్ధం అవుతుంది.
మారాం చేస్తున్న పిల్లవానికి మాయచేసి, మురిపించి ముద్ద తినిపించినట్టు… తెలుగులోనే పాఠాలు ఉంటే, చదువు మీద శ్రద్దలేనివారు కూడా ఎప్పుడో ఒకప్పుడు చదువుకునే అవకాశం ఉంటుంది.
ఒక తెలుగు సభలో తెలుగు భాషలో మాట్లాడితే మన గొప్పతనం తెలుస్తుంది. ఒక స్కూలులో తెలుగు నేర్చుకుని ఉంటేనే కదా… తెలుగులో గొప్పగా మాట్లాడగలిగేది.
తెలుగు తెలుసుకుంటే తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత
తెలుగు తెలుసుకుంటే తెలుగు గొప్పతనం తెలుస్తుంది. వ్యక్తి పరిచయం పెరిగాక వ్యక్తి వ్యక్తిత్వం తెలిసినట్టుగా…
అలా తెలుగు తెలుసుకోవాలనే కుతూహలం పిల్లలో పెంచాలి. తింటే కదా గారె రుచి తెలిసేది… వింటే కదా భారతం గొప్పతనం తెలిసేది…
భారతం మన మాతృభాషలో ఉంటుంది. మన మాతృభాషలో విన్న భారతానికి, ఇతర భాషలలో విన్న భారతానికి తేడా ఉంటుంది కదా..
మన తెలుగులో మనం భారతం వింటే, భారతంలోని పాత్రలు మనలో మెదులుతాయి… ఇతర భాషలలో భారతం తెలుగువారు వింటే, భారతంలో పదాలకు అర్ధాలు వెతుక్కోవడంతో మనసు పని సరిపోతుంది. ఇక జీవితపరమార్ధం ఎక్కడ తెలియాలి?
అంతే కదా… సాదారణంగా తాత్విక చింతనతో చూసినా ఏవ్యక్తి ఎక్కడ పుట్టాలో ఆపైవాడు నిర్ణయం చేసేశాడు…
ఎందుకంటే, అనేక మంది పుట్టే ఆసుపత్రిల యందు ఒకరు పేద ఉంటాడు.. ఒకడు ధనికుడు ఉంటాడు. కాబట్టి పుట్టుక వ్యక్తి చేతిలో లేనిది… అది ఎవరి ఒకరి ద్వారా పైవాడి చేతిలో ఉండేది.
ఇక జీవిత పరమార్ధం అయితే ఏమిటి? అంటారు… జీవితం అనుభవించడానికే అని కొందరంటారు.
అనుభవించడానికి జీవితం అయితే తెలుగులో కవితలు, పద్యాలు, సాహిత్యం, కధలు.. ఇవన్నీ మనో వికాసానికే కదా… వికసించిన మనసే కదా… అనుభవించేది…
ఇంకొందరంటారు… జీవితం ఉన్న వ్యక్తి అనుభవించి, చివరికి పరమాత్మలో ఐక్యం కావాడానికే అంటారు. అటువంటి పరమాత్మను తెలియజేసే గ్రంధాలు ఉంటాయి. ఎవరి మాతృభాషలో వారికి తేలికగా అర్ధం అయ్యేలాగా పెద్దలు చేశారు.
మరి మన తెలుగువారికి అటువంటి పరమార్ధ రహస్యం తెలియాలంటే, తెలుగు బాగుగా తెలిసి ఉండాలి… లేదా తెలుగులో వినడానికి పండితులు కావాలి.
మనకు పరమార్ధ విడమర్చి చెప్పే పండితులు మనకు ఉన్నారు. మరి భవిష్యత్తులో అటువంటివారు ఉంటేకదా… చదవలేనివారికి పరమార్ధం గురించి తెలియజెప్పగలిగేది.
ఏదైనా ఎవరి మాతృభాషలో వారికి విద్య నేర్చుకోవడం సులభం. అయితే బ్రహ్మవిద్య నేర్చుకోవడం కష్టం.. అది అనుభేద్యకముగానే తెలియాలి అంటారు.
అటువంటి బ్రహ్మవిద్యను తెలియజేసే గ్రంధాలు మాతృభాషలో చదివితే బాగా అర్ధం కాగలవని అంటారు. మాతృభాష అమ్మ వంటిది అయితే మనకు తెలుగు భాష అమ్మవంటిది. అమ్మలేని జీవితం ఉండదు. తెలుగు మాతృభాష మాట్లాడనివారు ఉండరు.
తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత
ఒక వ్యాపారి కూడా అందరి దృష్టికోనం ఏ రంగంపై ఉందనేది? ఆలోచన చేసుకుని వ్యాపారం ప్రారంభిస్తాడు.
ఇలా ఒకవ్యాపారి, ఒక సేవాసంస్థ ఏదైనా అందరికీ ఆమోదయోగ్యమైన పనులను, సేవలను ఎంచుకుంటారు.
ఏదైనా కొత్త విషయం అందరికీ చెప్పాలంటే, అందరికీ తెలిసిన విషయంతో మొదలు పెట్టి చెప్పలసిన కొత్త విషయం చెబుతారు.
అలాంటప్పుడు మనకు కొత్త భాష నేర్చుకోవాలంటే, తెలుగులో మనకు ఉపోద్గాతం కొంత తెలిసి ఉండాలి… కదా.
తెలుగు మన బంధువులతో మాట్లాడే భాష… ఎక్కువమంది తెలుగులోనే సంబోదించుకుంటూ ఉంటాము… టెక్నాలజీ సంస్థలు భారతీయ భాషలలోకి అనువాదం చేసే అప్లికేషన్స్ అందిస్తున్నారంటే, మాతృభాషపై పట్టు ఉన్నవారు ఎంతమంది ఉంటారు?
అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు. బాబు పేర్లు, మగ పిల్లల పేర్లు, లిస్టు, అడ పిల్లల పేర్లు పుస్తకం, బేబీ పేర్లు, దేవుళ్ళు పేర్లు, నక్షత్రం ప్రకారం పేర్లు, చిన్నారి పేర్లు, తెలుగు బేబీ పేర్లు ఇలా ఏవైనా పేర్లు సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ యాప్
నేటి పిల్లలే రేపటి పౌరులు అలాగే నేటి పేరు పెట్టిన పేరే రేపటి కీర్తికి నాంది. పేరు పిలుపు కూడా మనసుపై ప్రభావం చూపుతుంది.
ప్రతి శబ్దానికి అర్ధం ఉంటుంది. ప్రతి శబ్దం మనసుపై ప్రభావం చూపుతుంది. మెలోడీ మ్యూజిక్ మనసుని శాంతింపజేసినట్టుగా.
అలా ఆడ లేక మగ పిల్లల పేర్ల ఎంపికలో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలని పెద్దలంటారు. అందుకే పెద్దల పేర్లు చాలా వరకు దేవుళ్ళ పేర్లునే సూచిస్తారు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయని అంటారు.
చిన్నారికి పేరు పెట్టేటప్పుడు తెలుగులో మంచి అర్ధం ఉండేవిధంగా పేర్లు పెట్టడం మేలని అంటారు. చిన్న పిల్లల పేర్లు సూచించే తెలుగు పుస్తకాలూ లభిస్తాయి. పిల్లల పేర్లకు ఎటువంటి అర్ధం తెలుగులో వస్తుంది చెక్ చేసుకొని పేరు పెట్టాలి.
వాటినే ముద్దు పేర్లుగా అనుకుంటాం… కానీ నక్షత్రం ప్రకారం పేరులో మొదటి అక్షరం చిన్న పిల్లల పేర్లలో ఉంటే, ఆ పేరునే పిలవడం వారికి శ్రేయస్కరం అంటారు. చిన్న పిల్లలను చిన్నప్పటి నుండి నక్షత్రం ప్రకారం పెట్టిన పేర్లతోనే పిలవడం ముఖ్యమని అంటారు.
తెలుగు పాపల పేర్లు దేవతల పేర్లతోనే ఉంటాయి… లక్ష్మీ, సరస్వతీ, దేవి, మాధవి, విజయలక్ష్మీ, వరలక్ష్మీ లలిత వంటి పేర్లు అటువంటి పేర్లలో కూడు మూడు అక్షరాల పేర్లు అమ్మాయి నేమ్స్ గా ఉంటే మేలు అంటారు. తెలుగు బేబీ పేర్లు
మగ పిల్లల పేర్లు తెలుగులో రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది అక్షరాలు వచ్చేలాగా ఉండడటం శ్రేయష్కరం అంటారు.
అంటే మగ పిల్లల పేర్లు లిస్టులో పేర్లు వెతికేటప్పుడు సరి సంఖ్యలో అక్షరాల సంఖ్య ఉండాలని అంటారు.
బేబీ పేర్లు తెలుగులోనే అచ్చంగా తెలుగు పేర్లు వినడానికి బాగుంటాయి. అవి నక్షత్రం ఆధారంగా పేరు పెట్టుకుంటే పిల్లలకు మేలు అంటారు.
తెలుగులో చిన్న పిల్లల పేర్లు మొదటి అక్షరం ఆధారం తెలుగు పేరు
సాధారణంగా పిల్లలు పుట్టిన సమయం బట్టి నక్షత్రం. పిల్లలు పుట్టిన నక్షత్రం బట్టి పేరులో మొదటి అక్షరం. చిన్నపిల్లల పేరులో మొదటి అక్షరం ఆధారం తెలుగు పేరు ఎంపిక ఉంటుంది.
పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం ఆధారంగా పిల్లల పేరులో మొదటి అక్షరం ఉండాలని అంటారు.
నక్షత్రం ప్రకారం బ్రాహ్మణస్వామి సూచించిన అక్షరాలలో మొదటి అక్షరం ఎంపిక చేయాలని అంటారు.
అలా మొదటి అక్షరం ఎంపిక నక్షత్రం ప్రకారం చూసుకుని, తర్వాత ఇష్ట దైవం కానీ తాత, ముతాత్తల పేర్లు కూడా కొందరు కలుపుకుంటారు. లేకా అమ్మమ్మ, నాయనమ్మల పేర్లను కలుపుకుంటారు.
తాతముత్తాతల పేర్లు, అమ్మమ్మ, నాయనమ్మల సాధారణంగా దేవుడి పేరుతోనే ఉంటాయి.
మల్లన్న, సుబ్బయ్య, లక్ష్మయ్య, రామస్వామి, చంద్రన్న ఇలా తాతల పేర్లు ఉంటే, లక్ష్మమ్మ, సీతమ్మ, పున్నమ్మ, శాంతమ్మ ఇలా ఉంటాయి.
ఇప్పుడు ఫ్యాషన్ కొద్ది చాలామంది సింపుల్ మహేష్, రమేష్, రాజేష్, విఘ్నేష్, విశ్వాస్ లాంటి పేర్లు ఎంపిక చేసుకుంటారు.
ష్యాషన్ కొద్ది పేరు స్టైల్ మార్చినా పేరులో మొదటి అక్షరం నక్షత్రం ఆధారంగా పెట్టడం మేలు అంటారు.
అలా నక్షత్రం ఆధారం మొదటి అక్షరం పెట్టిన పేరుతోనే బాలుడిని లేక బాలికను పిలవడం కూడా వారికి చాలా మేలు జరుగుతుందని అంటారు.
హిందూ బేబీ విషయంలో నేమ్ సెలక్షన్ చాలా ముఖ్యం. దేవుళ్ళ పేర్లను బట్టి కూడా పేరు పెట్టినా నక్షత్రం ఆధారంగానే దేవుని పేరు పుట్టిన బేబీకి పెట్టుకుంటారు.
తెలుగు బేబీ బేర్లు da(డా) అయితే పేర్లు తక్కువగా ఉంటాయి. డాకిని వంటి పేర్లు అరుదుగా ఉంటాయి.
అదే ఇంకొక అక్షరంతో తెలుగు బేబీ బేర్లు da(దా) అయితే పేర్లు సులభంగానే ఉంటాయి. దామిని, దాక్షాయిని, దామోదర్, దేవేందర్, దేవా, దేవానంద్, దేవిక, దేవీ, దైవాదీనం వంటి పేర్లు ఉంటాయి.
దేవుడి పేరు నచ్చినా, పెద్దవారి పేరు నచ్చినా, మోడ్రన్ పేరు నచ్చినా నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టుకోవడం ప్రధానం.
ఎవరైనా బేబీకి మ అక్షరం మీద పేర్లు పెట్టుకోవడానికి అనుకూలం. అయితే మ అక్షరంతో మహిత అని పెట్టుకోవచ్చును. మహాలక్ష్మీ అని కూడా పెట్టుకోవచ్చును.
ఇంకా మో అక్షరంతో పేరు అయితే మోహన్, మోహనరావు, మోహిత ఇలా పేర్లు ఉంటాయి.
నక్షత్రం ప్రకారం మొదటి అక్షరం బట్టి పేరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ
మొదటి అక్షరం p అయితే తెలుగు బేబీ పేర్లు p అక్షరంతో బాలికలకు అయితే
పావని, ప్రతీక, పరిణీత, ప్రవల్లిక, ప్రమీల, పావకి, ప్రసన్న వంటి పేర్లు చాలానే ఉంటాయి. అయితే పేరులో అక్షరాలన్నీ కలిపి, మూడు కానీ అయిదు కానీ ఏడు కానీ బేసి సంఖ్యలో అమ్మాయి పేర్లు ఉండేలా చూసుకోవడం మేలు.
అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్
ఒకే పరిణీత పేరు మీకు నచ్చితే అందులో అక్షరాలన్నీ కలిపి నాలుగే ఉంటున్నాయి. కాబట్టి పరిణీతకు మరొక మూడు అక్షరాలు కలిగిన పేరు జత చేస్తే సరిపోతుంది.
లేదా పేరులో ఒత్తులు కూడా కలుపుకోవచ్చా లేదా అనేదా బ్రాహ్మణస్వామిని అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.
అబ్బాయి పేర్లు p అక్షరంతో అయితే ప్రకాశ్, ప్రదీప్, ప్రశాంత్, ప్రసాద్, ప్రమోద్, ప్రవీణ్ చాలా పేర్లు ఉంటాయి. ఇవి మూడు అక్షరాలు ఉన్నాయి. అయితే అక్షరం క్రింద అక్షరం ఉండడం వలన నాలుగు అక్షరాలుగా పరిగణించవచ్చో లేదో పెద్దవారిని అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.
ఇలా బేబీకి పెట్టవలసిన తెలుగు పేర్లలో అచ్చ తెలుగులోనే పలకడానికి బాగుండేలాగా పెట్టుకుంటారు.
కొందరు భగవంతుడు పేరు తప్పనిసరిగా ఉండేలాగా పెట్టుకుంటారు. అవి చాలా పాత పేర్లుగా అనిపిస్తాయి కూడా…
సుబ్బారావు, రంగారావు, మల్లన్న, సుబ్బయ్య వంటి పేర్లు… అయితే ఈ పేర్లలో దైవంతోనే ఉంటాయి.
అచ్చ తెలుగు పిల్లల పేర్లు బాయ్ నేమ్స్ తెలుగులో
సుబ్రహ్మణ్యం పేరుకు వాడుక పేరే సుబ్బారావు… సుబ్రహ్మణ్యం స్వామి హిందూ దైవం…
అలాగే రంగారావు… పాండురంగడులో రంగకు రావుని జోడించి రంగారావు పేర్లు పూర్వంలో పెట్టుకునేవారు. ఇంకా మల్లన్న అంటే శ్రీశైలం మల్లన్న స్వామే. సుబ్బయ్య అన్నా సుబ్రహ్మణ్యం స్వామే…
ఇలా దేవుళ్ళ పేర్లతో కూడిన బేబీ పేర్లను చాలా మందికి ఉంటాయి. రావుతో కలిసిన పేర్లు చాల ఉంటాయి.
శ్రీనివాసరావు, రాజారావు, శ్రీహరిరావు, శివరావు, వేంకటేశ్వరరావు, రామారావు, కృష్ణారావు, కేశవరావు, ప్రసాదరావు ఇలా రావు చివరగా వస్తూ చాలా తెలుగు పేర్లు ఉంటాయి.
మోడ్రన్ గా అయితే పేర్లు ఇలా మారుతూ వచ్చాయి. రాజారావు రాజేష్, రామారావు రమేష్, శ్రీనివాసరావు శ్రీనివాస్, వేంకటేశ్వరరావు వెంకట్, రామారావు రామ్ మార్చుకోవడం కామన్ అయిపోయింది.
పూర్వకాలంలో భగవంతుడి పేర్లు పిల్లలకు ఎందుకు పెట్టుకునేవారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఒక్కసారి వినండి… పేరులో భగవన్నామం ఉండడం వలన కలిగే మేలు చెబుతారు. ఈ క్రింది వీడియో చూడండి.
శ్రీహరి అనే పేరు ఒక బాలుడికి పెట్టి, పదే పదే ప్రేమతో శ్రీహరి..శ్రీహరి…శ్రీహరి అని పిలుచుకునే పెద్దలు ధన్యులే అంటారు… మన ప్రవచన పెద్దలు.
అలాగే శ్రీదుర్గ అనే పేరు అమ్మాయికి పెట్టుకుని… దుర్గమ్మ… దుర్గ… దుర్గమ్మ అంటూ మురిసిపోతు పిలుచుకునే పెద్దలు అదృష్టవంతులంటారు… ప్రవచన పెద్దలు…
అలా ఎందుకు ధన్యులు..? ఎందుకు అదృష్టవంతులు ప్రవచనకారుల మాటలలోనే వింటే, మనసుకు బాగా పడుతుంది.
2020 అంతా స్టాప్ దేర్ 2021? గత ఏడాది పురుడు పోసుకున్న కరోనా ఈ ఏడాది రూపాంతరం చెందుతుంది… కొత్త ఏడాదిలోకి జర జాగ్రత్తతో అడుగు పెట్టడంతో బాటు జర జాగ్రత్త అవసరం.
గతేడాదిలోకి కరోనా జాగ్రత్తలతో ఆరంభం చేయడం జరిగింది. సంవత్సరమంతా జాగ్రత్తగా ఉన్నవారు కరోనా బారిన పడలేదు. జాగ్రత్తలేనివారికి వైరస్ సోకింది.
అందరికీ 2020సంవత్సరం ఇంత తొందరగా గడిచిందా? అనే ఆశ్చర్యంగానే 2020 ముగుస్తుంది. 2019 ఎండింగులో కరోనా వస్తుందేమో ఆలోచన…
2020అంతా కరోనా జాగ్రత్తలతో సాగింది. అయితే 2020ఎండింగ్ కూడా పాత కరోనా తగ్గుముఖం పట్టడంతో బాటు, టీకా అందుబాటులోకి రానుంది.
అంతలోనే కరోనా మరొక రూపం దాల్చింది… ఇక 2021 కూడా కరోనా నివారణ జాగ్రత్తలతోనే మెసులుకోవాలి.
ఆ ఆలోచనలే నిజమయ్యాయి… 2020లో కరోనా వైరస్ కోవిడ్-19 అను పేరు పొంది, ప్రపంచంపై పడింది.
కోవిడ్-19 విజృంభణ చాలామందిని బలిగొంది… చాలామందిని ఆసుపత్రిపాలు చేసింది… అనడం కన్నా చాలా దేశాలను ప్రభావితం చేసిందని అంటారు.
మనకు మార్చిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలియగానే, అందరం జనతా కర్ఫ్యూలోకి వెళ్లాం… ప్రధాని పిలుపు మేరకు.
నరేంద్రమోదిగారి పిలుపుకు దేశం మొత్తం స్వాగతించి, అంతా ఇంటికే పరిమితం అయ్యాం. ఆ విధంగా 2019లో పుట్టిన కరోనా వైరస్ అదే కోవిడ్-19 ఒక్కరోజు అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది.
అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుండడంతో లాక్ డౌన్ కేంద్రం విధించింది. లాక్ డౌన్ కాలంలో కొందరు అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరు కష్టాలు అధికంగా అనుభవించారు.
కొందరు ఇంటికి తిరుగు ముఖ పట్టారు. అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఎక్కడివారు అక్కడే అంటూ 2020 స్టాప్ దేర్…
అందరినీ కదలకుండా కొన్నిరోజులపాటు ఒకే చోట కట్టిపడేసింది.
2020 అంతా స్టాప్ దేర్ 2021 లో కూడా స్టాప్…
2019 లో చైనాలో పురుడు పోసుకున్న కోవిడ్-19 కోరలు ప్రపంచమంతా పాకాయి. స్టాప్ దేర్.. స్టాప్ వర్క్, స్టాప్ ట్రావెల్, స్టాప్ స్టడీ ఇలా అన్నింటిలోనూ, అందరిని స్టాప్ చేసేసిందీ2020.
అనుమానం పెనుభూతం అన్నారు. అలా అనుమానం పొంది ఆందోళన చెందకుండా ఉండేందుకు… దేశవ్యాప్తంగా కరోనా గురించిన ప్రచారమే జరిగింది.
కరోనా గురించినా జాగ్రత్తలే ప్రచారం జరిగింది. అన్నింటిని ఆపింది… అంతటా పుల్ స్టాప్ పెట్టింది.
మీడియా, అత్యవసరాలు తప్పించి కొన్నిరోజులపాటు చాలా చోట్ల స్టాప్ వర్క్ నడిచింది… అలా అందరికీ ఆర్ధిక నష్టాన్ని తీసుకువచ్చింది.
స్టాప్ స్టడీ చాలాకాలం నడిచింది… కేవలం ఆన్ లైన్ క్లాసెస్ మాత్రమే నడుస్తున్నాయి… ఇప్పుడిప్పుడే కొన్ని విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి…
సినిమా ధియేటర్లలో స్టాప్ షో… షోలు లేవు.. ధియేటర్లు ఓపెన్ కాలేదు..
2019సంవత్సరంలోనికోవిడ్ సంవత్సరమంతా అందరిపై ప్రభావం ఏదోవిధంగా చూపింది. మరి 2020 ముగింపుకు వచ్చింది…
ఇప్పుడు 2020 చివరి రోజులలో కొత్త వైరస్ గా మారిన కరోనా వైరస్ వార్తలు వచ్చాయి. ఏడాది క్రిందట వచ్చిన కోవిడ్-19 వైరస్ 2020ని ఒక ఊపు ఊపింది… స్టాప్ వర్క్ చెప్పింది.
మరి ఇప్పుడు 2020లో కొత్తగా వస్తున్న వైరస్ బ్రిటన్ లో వ్యాప్తి చెందిందంటున్నారు.. ఇప్పుడు ఇది కోవిడ్-2020 గా రూపాంతరం చెందినట్టయితే, అది వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలే ముక్యం.
ఇది ప్రపంచవ్యాప్తంగా వృద్ది చెందకుండా ఉండాలంటే సోషల్ డిస్టేన్స్, సానిటైజేషన్, మాస్క్ వంటి జాగ్రత్తలే ప్రధానమని అంటున్నారు.
https://www.youtube.com/watch?v=KJri61TS5oQ
2020 స్టాప్ దేర్ 2021?
తగు జాగ్రత్తలు ఉంటే 2021 సజావుగా సాగుతుంది. లేకపోతే 2021 కూడా స్టాప్ వర్క్ అయితే….?
ఇప్పటికే మన దేశ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే యుకె నుండి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేశారు.
వైరస్ కంటికి కనబడదు… ఏవిధంగా వస్తుందో తెలియదు… కనుక జాగ్రత్త… అనేది మనకు ముఖ్యం… ఆందోళన చెందకుండా ఉండడం ఎంత ముఖ్యమో… జాగ్రత్త చాలా ముఖ్యం.
కోవిడ్-19 వలన ఏర్పడిన అనుభవం, కోవిడ్-20 ను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చును. అందుకు ముఖ్యమైన పని తగు జాగ్రత్తలు పాటించడమే…
మనకు ఇప్పటికే వ్యాక్సిన్ రాబోతుంది… కాబట్టి అంతగా ఆందోళన ఉండదు… కానీ జాగ్రత్త మాత్రం చాలా ముఖ్యం…
ఈసంవత్సరం 2020 స్టాప్ దేర్ 2021 సంవత్సరం కూడా స్టాప్ వర్క్ కాకుడదంటే, మన జాగ్రత్తలే మనకు రక్ష…
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ క్రియేట్ చేయడం. ఒక అన్ లిమిటెడ్ లిస్టును ఒక స్క్రీనులో చూపించాలంటే రిసైక్లర్ వ్యూ ఉపయోగించాలి. ఈ రిసైక్లర్ వ్యూతో ఎంత పెద్ద లిస్టును అయినా ఒక స్క్రీనుపై చూపించవచ్చును.
అన్ లిమిటెడ్ గా ఏదైనా బిగ్ డేటా లిస్టులు వంటివి డిస్ల్పే చేయడానికి రిసైక్లర్ వ్యూ విడ్జెట్ నే ఉపయోగిస్తారు.
ప్లేస్టోర్ నందు యాప్స్ అన్ లిమిటెడ్ గా వస్తూనే ఉంటాయి… అటువంటి యాప్స్ నందు రిసైక్లర్ వ్యూ విడ్జెట్ నే ఉపయోగిస్తారు. లిస్టువ్యూను సింపిల్ లిస్టులు డిస్ల్పే చేయడానికే ఉపయోగిస్తారు.
అయితే రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ను ఒక ఏక్టివిటిలో లేదా ఒక ఫ్రాగ్మెంట్ లో ఉపయోగించవచ్చును.
ఏక్టివిటి కానీ ఫాగ్రెంట్ కానీ కొత్తది తీసుకుంటే, వాటికి ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ మరియు జావా ఫైల్ రెండూ క్రియేట్ అవుతాయి.
ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ప్రొజెక్టులో ఎన్ని ఏక్టివిటిస్ అయినా, ఎన్ని ఫ్రాగ్మెంట్స్ అయినా కొత్తవి క్రియేట్ చేయవచ్చును.
ఈ ప్రొజెక్టులో ప్రొజెక్టులో ఓపెన్ చేస్తున్నప్పుడే క్రియట్ అయిన, డిఫాల్ట్ మెయిన్ ఏక్టివిటిలో రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ఉపయోగిద్దాం.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ రిసైక్లర్ వ్యూ కు అవసరం అయ్యే ఫైల్స్
ఏక్టివిటి (ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ అండ్ జావా ఫైల్)
మోడల్ (జావా ఫైల్)
ఏడాప్టర్ (జావా ఫైల్)
ఐటెమ్ లేఅవుట్ (ఎక్స్.ఎం.ఎల్ ఫైల్)
ఏక్టివిటి (ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ అండ్ జావా ఫైల్)
రిసైక్లర్ వ్యూ విడ్జెట్ డిస్ప్లే చేసే ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ (ఇది డిఫాల్ట్ మెయిన్ ఏక్టివిటిలో ఉపయోగించవచ్చును. లేదా కొత్త ఏక్టివిటి లేదా కొత్త ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయవచ్చును.)
ఏక్టివిటి.మెయిన్.ఎక్స్.ఎం.ఎల్ ఫైలుకు అనుసంధానించబడిని జావా ఫైల్. ఈ జావా ఫైల్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్లో తీసుకున్న రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ను శాసించే కోడ్ వ్రాస్తాము.
మోడల్ (జావా ఫైల్)
మోడల్ అంటే రిసైక్లర్ వ్యూలో కనిపించే లిస్టు ఏవిధంగా ఉండాలో, అందులో ఉండే ఐటమ్స్ ముందుగానే సూచన చేయడం.
రిసైక్లర్ వ్యూలో పేరు, ఇంటి పేరు రెండింటిని చూపించాలి. అప్పుడు మోడల్ జావా క్లాసులో రెండు డేటా టైప్స్ డిక్టేర్ చేస్తాము.
ఆ తర్వాత మోడల్ క్లాస్ నందు డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కు కన్సట్రక్టర్ క్రియేట్ చేయాలి.
కన్సట్రక్టర్ క్రియేట్ చేశాకా, అవే వేరియబుల్స్ కు గెట్టర్ అండ్ సెట్టర్ సెట్ చేస్తాం… దాంతో మోడల్ క్లాసు పని పూర్తవుతుంది. ఇది ఈ ప్రొజెక్టు వరకు. సాదారణంగా రిసైక్లర్ వ్యూ ఐటమ్స్ డిస్ల్పే చేయడం వరకు అయితే… ఇంతే…
మీరు ఇంకా ప్రొజెక్టులో ఐడి, యాక్షన్స్ వంటివి యాడ్ చేస్తే, మోడల్ క్లాస్ నందు మరింత కోడ్ వ్రాయాలి.
ఎడాప్టర్ జావా ఫైల్ పేరులోనే ఉంది… ఏడాప్ట్ అంటే డేటాను కలపడం… ఒక మోడల్ విధానం ఏవిధంగా ఉందో, ఆవిధానం ప్రకారం అదనంగా తీసుకోబడిన లేఅవుట్ ఫైలు ద్వారా రిసైక్లర్ వ్యూలో డేటాను ఎడాప్ట్ చేస్తుంది.
ఇది చాలా కీలకమైన జావా ఫైల్. దీని ద్వారానే రిసైక్లర్ వ్యూని శాసిస్తాం… ప్రస్తుతం మన పేర్లు, ఇంటి పేర్లు డిస్ల్పే చేయడానికి సింపుల్ ఎడాప్టర్ ఉపయోగిస్తాం…
పెద్ద పెద్ద ప్రొజెక్టులకు అయినా ఎడాప్టర్ లో ఆటో క్రియేట్ చేయబడేవి కామన్ గానే ఉంటాయి. మీరు ఎంచుకున్న మోడల్ ను బట్టి ఎడాప్టర్ క్లాసులో జావా కోడ్ పెరుగుతుంది.
సింపుల్ మోడల్ కు ఎడాప్టర్ లో సింపుల్ కోడ్ ఉంటుంది.
ఐటెమ్ లేఅవుట్ (ఎక్స్.ఎం.ఎల్ ఫైల్)
ఐటెమ్ లేఅవుట్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్. ఇది రిసైక్లర్ వ్యూ లో చూపించ లిస్టుకు సంబంధించిన సింగిలో రో ఐటమ్ డిజైన్.
అంటే మీరు ఐడి, ఇమేజ్, పేరు, అడ్రస్, వివరం ఇలా అయిదు రకాలు రిసైక్లర్ వ్యూలో చూపించాలి.
ఐడికి ఒక టెక్ట్స్ వ్యూ, ఇమేజ్ కు ఒక ఇమేజ్ వ్యూ, పేరుకు ఒక టెక్ట్స్ వ్యూ, అడ్రస్ కు ఒక టెక్ట్స్ వ్యూ, వివరం ఒక టెక్ట్స్ వ్యూ అలా అయిదు విడ్జెట్లను ఏవిధంగా ఒక రోలో కనబడాలో డిజైన్ చేయాలి.
అయితే ఈ ప్రొజెక్టులో చూపించేది కేవలం పేరు, ఇంటిపేరు రెండు మాత్రమే. కాబట్టి ఇందులో రెండు టెక్ట్స్ వ్యూలు ఉపయోగిస్తాము. అవి ఒకదాని ప్రక్కన కనబడాలా? ఒక దాని క్రింద ఒకటి కనబడాలా? దానిని బట్టి ఈ లేఅవుట్ డిజైన్ చేసుకోవాలి.
ఈఐటమ్ లేఅవుట్ ఫైల్ ఏవిధంగా డిజైన్ చేస్తే, అదేవిధంగా రిసైక్లర్ వ్యూలో రోస్ కనబడతాయి.
ఈవిధంగా ఐటమ్ లేఅవుట్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ను ఎడాప్టర్ ద్వారా అనుసంధానం చేస్తూ, అదే ఎడాప్టర్ ద్వారా మోడల్ లిస్టును అనుసంధానం చేస్తూ, ఎడాప్టర్ ను ఏక్టివిటిలో రిసైక్లర్ వ్యూకు ఎటాచ్ చేయడంతో… రిసైక్లర్ వ్యూ డిజైన్ కోడింగ్ పూర్తవుతుంది.
ఇంకా డిజైన్ చేసిన రిసైక్లర్ వ్యూలో డేటా ఇన్ పుట్ ఇవ్వాలి. ఇది ఆన్ లైన్ వెబ్ సైట్ డేటా అయితే ఎడాప్టర్ కోడ్ మారుతుంది.
అదే ఇన్ పుట్ డేటా మాన్యువల్ గా ఆండ్రాయిడ్ స్టూడియోలో ఒక ఫైల్లో స్టోర్ చేసి, రిసైక్లర్ వ్యూలో చూపించవచ్చును. అప్పుడు ఏక్టివిటిలో కోడ్ పెరుగుతుంది.
ఇన్ పుట్ డేటా కేవలం రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ఉపయోగిస్తున్న ఏక్టివిటిలోనే ఉన్న జావా ఫైల్ లోనే వ్రాస్తే, కోడ్ సింపుల్ గా ఉంటుంది.
ఈ ప్రొజెక్టులో రిసైక్లర్ వ్యూ లోనే ఇన్ పుట్ డేటా తీసుకుంటాము.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియో యాప్ ప్రొజెక్టు ఇమేజులతో
ఈక్రింది ఇమేజులో రిసైక్లర్ వ్యూ విడ్జెట్ కోడ్ వ్రాయబడి ఉంది. ఇది మెయిన్ ఏక్టివిటి ఎక్స్.ఎం.ఎల్ ఫైల్… ఇప్పుడు దీనికి మోడల్ కావాలి… అంటే మోడల్.క్లాస్ అనే జావా ఫైల్ కావాలి.
ఇది ఆండ్రాయిడ్ స్టూడియో ప్రొజెక్టులో ఏక్టివిటిమెయిన్.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్. ఇందులో రిసైక్లర్ వ్యూ విడ్జెట్ కోడ్ వ్రాయబడి ఉంది.
మోడల్.క్లాస్ జావా ఫైల్ క్రియేట్ చేయాలి. ఈ క్రింది ఇమేజులో add to list అనే ఇంగ్లీషు అక్షరాలు బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ చేయబడి ఉన్నాయి. అక్కడ మౌజ్ పాయింటర్ పెట్టి, రైట్ క్లిక్ చేస్తే, సైడుగా ఒక మెను వస్తుంది.
అందులో మీరు మరలా New అనే ఇంగ్లీషు అక్షరాలను క్లిక్ చేస్తే, ఆ సైడుగా మరొక సబ్ మెను వస్తుంది. అందులో మరలా Java Class అనే ఇంగ్లీషు అక్షరాలను క్లిక్ చేస్తే, ఈ క్రింది ఇమేజులో చూపిన విధంగా పోప్ అప్ విండో వస్తుంది.
ఆ పోప్ అప్ విండోలో Name అనే ఇంగ్లీషు అక్షరాల దగ్గర మౌస్ కర్సర్ బ్లింక్ అవుతుంది. అక్కడ మీ మోడల్ జావాఫైల్ పేరు టైపు చేసి ఎంటర్ చేయాలి.
గమనించండి… ఆ పోప్ అప్ విండోలోనే Class అనే ఆంగ్ల అక్షరాలు బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ కాబడి ఉంది. అంటే మీరు పేరు టైపు చేసి ఎంటర్ చేస్తే, అది క్లాస్ ఫైల్ గా తీసుకుంటుంది.
అలా ఇంటర్ పేస్ ఎంపిక చేసుకంటే, ఇంటర్ పేస్ ఫైల్ క్రియేట్ అవుతుంది…
తెలుగులో ఆండ్రాయిడ్ స్టూడియో ట్యుటోరియల్
పై ఇమేజులో పోప్ అప్ విండోలో మోడల్ క్లాస్ ఫైల్ పేరు ModelName అని తీసుకోవడం జరిగింది.
ఈ క్రింది ఇమేజ్ చూడండి. అందులో publick class ModelName అని ఫ్లవర్ బ్రాకెట్స్ తో క్లాస్ ఫైల్ క్రియేట్ అయ్యింది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
రెండ్ స్ట్రింగ్ వేరియబుల్స్
ఫ్లవర్ బ్రాకెట్ల మద్యలో రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ తీసుకోవాలి. ఒకటి ఫస్ట్ నేమ్, రెండు లాస్ట్ నేమ్ కానీ సర్ నేమ్ కానీ… ఏవైనా రెండ్ స్ట్రింగ్ వేరియబుల్స్ డిక్లేక్ చేయండి.
క్రింది ఇమేజులో String name, String sir_name రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ డిక్లేర్ అయ్యాయి… వీటికి కన్సట్రక్టర్ క్రియేట్ చేయాలి.
రీసైక్లర్ వ్యూ యాప్ ఇన్ తెలుగు
దానికి ఫ్లవర్ బ్రాకెట్స్ మద్యలో కర్సర్ ఉండగా… మీ కీబోర్డులో Alt+Insert రెండు బటన్స్ ఒకే సారి ప్రెస్ చేయాలి.
ఈ క్రింది ఇమేజులో మాదిరిగా పోప్ అప్ మెను వస్తుంది…
తెలుగులో మొబైల్ యాప్ డవలప్ మెంట్
పై ఇమేజ్ చూడండి. అందులో కన్సట్రక్టర్ (constructor) బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ కాబడి ఉంది. దానిపై క్లిక్ చేస్తే, మీకు మరొక పోప్ అప్ విండో వస్తుంది. ఈ క్రింది ఇమేజ్ మాదిరిగా ఉంటుంది.
ఆండ్రాయిడ్ స్టూడియో గురించి తెలుగులో
పైచిత్రంలో చూపినట్టుగా మీరు మోడల్ తీసుకున్న రెండు వేరియబల్స్ కు కన్సట్రక్టర్ క్రియేట్ చేయాలి. కాబట్టి కనబడుతున్న రెండింటిని కూడా బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ అయ్యేలా చూసుకుని ఒకె బటన్ క్లిక్ చేయాలి.
అప్పుడు మీకు క్రింది ఇమేజులో మాదిరిగా కన్సట్రక్టర్ క్రియేట్ అవుతుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
కన్ట్స్రక్టర్ క్రియేట్ అయ్యాక, అవే వేరియబుల్స్ కు గెట్టర్ అండ్ సెట్టర్ సెట్ చేయాలి.
Alt+Insert బటన్స్ మరలా ప్రెస్ చేస్తే, క్రింది ఇమేజులో చూపిన విధంగా Getter and Setter అనే ఇంగ్లీషు అక్షరాలు బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ చేయబడి ఉన్నాయి.
తెలుగు ఆండ్రాయిడ్ స్టూడియో గురించి తెలుగుసుకుందాం.
పైన ఉన్న ఇమేజులో చూపినట్టుగా Getter and Setter ఇంగ్లీషు అక్షరాలపై క్లిక్ చేస్తే క్రిందివిధంగా మరొక పోప్ అప్ విండో వస్తుంది.
రీసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ యాప్ తెలుగులో
కన్సట్రక్టర్ మాదిరిగానే గెట్టర్ అండ్ సెట్టర్స్ కూడా రెండు స్ట్రింగులకు జనరేట్ చేయాలి.
ఆ తర్వాత మోడల్ క్లాస్ జావా ఫైల్ క్రియేట్ చేసిన విధంగానే మరలా లెఫ్ట్ సైడులో ఉన్న ప్యాకేజి నేమ్ పై రైట్ క్లిక్ చేసి, ఎడాప్టర్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేయాలి….
ఎడాప్టర్ జావా క్లాస్ ఫైల్
అలా క్రియేట్ చేసిన ఎడాప్టర్ ఫైల్ ఈ క్రింది ఇమేజులో మాదిరిగా ఉంటుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
పై ఎడాప్టర్ క్లాసు ఫైలులో ఉన్న కోడ్ గమనించండి….
ఆ కోడ్ ఈ విధంగా ఉంది. ముందుగా ఉన్న లైన్ ప్యాకెజి నేమ్… తర్వాత క్లాస్ క్రింది విధంగా ఉంది.
public class MyAdapter{
}
పై ఉన్న కోడ్ నందు ఉన్న మొదటి ఫ్లవర్ బ్రాకెట్ కు ముందు MyAdapter ఇంగ్లీషు అక్షరాల తర్వాత ఆ రెండింటి మద్యలో ఈ క్రింది ఇంగ్లీషు పదాలు వ్రాయాలి.
extends RecyclerView.Adapter<MyAdapter.MyViewHolder> అలా ఈ అక్షరాలు వ్రాసిన తర్వాత క్లాసు ఫైల్ ఎర్రర్ లైనుతోనూ, ఎర్రర్ టెక్ట్సుతోనూ కనబడుతుంది. ఈ క్రింది ఇమేజులో ఉన్నట్టుగా…
పైన ఉన్న ఇమేజులో ఎర్రర్ వర్డ్ MyViewHolder అనే పదంపై మౌజ్ పెడితే, రెడ్ బల్బ్ సింబల్ ఒక్కటి స్కీనుపై కనబడుతుంది.
ఆ రెడ్ బల్బ్ నందు గల ఏరో మార్కును క్లిక్ చేయగానే పోప్ అప్ మెను వస్తుంది.
దానిలో Create class ‘MyViewHolder’ అని బ్లూకలర్ బ్యాక్ గ్రౌండులో హైలెట్ చేయబడిన ఇంగ్లీషు అక్షరాలపై క్లిక్ చేయాలి.
పబ్లిక్ క్లాస్ క్రియేట్ అవుతుంది. మరలా ఎర్రర్ లైన్ అలానే కనబడుతుంది. మరలా ఎర్రర్ లైనుపై మౌస్ మూవ్ చేస్తే, రెడ్ బల్బ్ కనబడుతుంది.
ఈసారి రెడ్ బల్బ్ మెనులో క్రింది ఇమేజులో కనబడుతున్నట్టు Implement methods అను ఇంగ్లీషు అక్షరాలు బ్లూకలర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ అయ్యి కనబడుతున్న అక్షరాలను క్లిక్ చేయాలి.
ఈ క్రిందిఇమేజులో మాదిరి ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ పోపప్ విండోలో కనబడతాయి.
ఇంప్లిమెంట్ మెధడ్స్ యాడ్ అయ్యాక ఎడాప్టర్ ఫైల్ ఈ క్రింది ఇమేజులో ఉన్న విధంగా ఇంకా ఎర్రర్ లైన్ కనబడుతూ ఉంటుంది.
ఆ ఎర్రర్ లైను మరలా మౌస్ తీసుకువెళితే, మరలా రెడ్ బల్బ్ మెనులో ఉన్న బ్లూకర్ బ్యాక్ గ్రౌండుతో హైలెట్ చేయబడిన లైను చూడండి.
ఆ పై క్లిక్ చేయగానే, మైవ్యూహోల్డర్ క్లాస్ ఎక్ట్సెంట్ అవుతుంది. అలా ఎక్ట్సెండ్ అయిన వ్యూక్లాస్ ఫైల్ ఎర్రర్ లైన్ కలిగి ఉంటుంది.
దానిపై మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే, వచ్చే మెనులో Create constructor matching super అను ఇంగ్లీషు అక్షరాలపై క్లిక్ చేయాలి.
రిసైక్లర్ వ్యూ హోల్డర్ క్లాసుకు కూడా కన్సట్రక్టర్ క్రియేట్ చేశాక ఎడాప్టర్ క్లాస్ ఫైల్ ఈ క్రింది ఇమేజులో విధంగా ఉంటుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
ఇక్కడతో ఎడాప్లర్ క్లాసులో ఆటోమెటిక్ జనరేషన్ కోడ్ పూర్తవుతుంది.
ఈ ఎడాప్టర్ క్లాసులో కోడ్ మాన్యువల్ గా వ్రాయడం…
పైచిత్రంలో onCreateViewHolder మెథడ్ ఉంది. అందులో రిసైక్లర్ వ్యూలో చూపించవలసిన రో ఐటమ్ ను ఇన్ ఫ్లేట్ చేయాలి. అందుకు ముందుగా లేఅవుట్ ఫైల్ క్రియేట్ చేయాలి.
అందుకు పైఇమేజులో చూస్తే లెఫ్ట్ సైడులో ఉన్న res అని మూడు అక్షరాలు కలిగిన ఫోల్డర్ పై క్లిక్ చేస్తే, layout అనే ఆంగ్ల అక్షరాలతో మరొక ఫోల్డర్ వస్తుంది.
ఆ ఫోల్డర్ పై మౌస్ పాయింటర్ ఉంచి, రైట్ క్లిక్ చేస్తే, సైడుగా మెను వస్తుంది. అందులో New ఇంగ్లీషు అక్షరాలపై క్లిక్ చేయగానే ప్రక్కగా మరొక సబ్ మెను వస్తుంది. అందులో లేఅవుట్ రిసోర్స్ ఫైల్ పై క్లిక్ చేయాలి.
పై చిత్రంలో మీకు వచ్చిన లేవుట్ ఫైల్ డిజైనింగ్ కోడ్ వ్రాయాలి. ఈ క్రింది ఇమేజులో మాదిరిగా ఉంటంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
ఈపైనగల ఇమేజులో లైనర్ లేఅవుట్ ఓరియంటేషన్ వెర్టికల్ తీసుకోవడం జరిగింది. అందువలన ఆ లేవుట్లో ఎన్ని విడ్జెట్స్ తీసుకున్నా ఒకదాని తర్వాత ఒక్కటిగా నిలువుగా సెట్ అవుతాయి.
రెండు టెక్ట్సు వ్యూస్ పైన ఉన్న ఇమేజులో చూపించడం జరిగింది. ఒకటి ఫస్ట్ నేమ్, రెండవది లాస్ట్ నేమ్…
ఎడాప్టర్ క్లాసులో మొదటిగా రెండు వేరియబుల్స్ ఈక్రింది విధంగా డిక్లేర్ చేయాలి.
Context context;
List<ModelName> nameList;
ఈపై రెండు వేరియబుల్స్ కు కనస్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. ఆ కోడ్ ఈ క్రింది విధంగా వస్తుంది.
ఇప్పుడు లేఅవుట్ ఫైలును ఎడాప్టర్ యాడ్ చేయాలి. అందుకు ఆన్ క్రియేట్ కోడ్ ను ఈ క్రింది విధంగా మార్చాలి.
@NonNull
@Override
public MyViewHolder onCreateViewHolder(@NonNull ViewGroup parent, int viewType) {
View view = LayoutInflater.from(context).inflate(R.layout.recycle_item_layout,parent,false);
return new MyViewHolder(view);
}
ఐటమ్ లేఅవుట్ ఫైల్ యాడ్ చేశాకా, getItemcount మెథడ్ ఈక్రింది విధంగా మార్చాలి.
@Override
public int getItemCount() {
return nameList.size();
}
ఇప్పుడు MyViewHolder పబ్లిక్ క్లాసులో ఇందాక క్రియేట్ చేసిన లేవుట్ ఫైల్లోని ఐటమ్స్ ని అనుసంధానం చేయాలి. ఆ కోడ్ ఈ క్రిందివిధంగా ఉంటుంది.
public class MyViewHolder extends RecyclerView.ViewHolder {
TextView first_name, last_name;
public MyViewHolder(@NonNull View itemView) {
super(itemView);
first_name = itemView.findViewById(R.id.first_name);
last_name = itemView.findViewById(R.id.last_name);
}
తర్వాత onBindViewHolder మెథడులో ఐటమ్స్ కు ఇన్ పుట్ డేటా బైండ్ చేయాలి. ఆ కోడ్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
@NonNull
@Override
public MyViewHolder onCreateViewHolder(@NonNull ViewGroup parent, int viewType) {
View view = LayoutInflater.from(context).inflate(R.layout.recycle_item_layout,parent,false);
return new MyViewHolder(view);
}
దీంతో ఐటమ్ లేఅవుట్ ఫైలు, మోడల్ క్లాసు ఎడాప్టర్ కు అనుసంధానం చేయడం జరిగింది. ఏదైనా ఫైల్ కాపీ పేస్ట్ చేయవచ్చును… కానీ ఎడాప్టర్ క్లాసులో మెథడ్స్ వారీగా జనరేట్ చేసుకుంటూ, కాపీ పేస్ట్ చేయాలి కానీ ఒకేసారి ఫైల్ కోడంతా కాపీ పేస్ట్ చేస్తే మాత్రం ఒక్కోసారి ఎర్రర్ షో అవుతుంది.
మైఎడాప్టర్ క్లాసు ఈ ప్రొజెక్టువరకు మాత్రం ఫైనల్ గా ఈ క్రింది ఇమేజులో మాదిరిగా ఉంటుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
ఎడాప్టర్, మోడల్ క్లాసులను ఏక్టివిటిలోకి అనుసంధానం చేయడం
ఏక్టివిటిలో మెయిన్ఏక్టివిటి జావా ఫైల్ లో లిస్ట్, రిసైక్లర్ వ్యూ, లేఅవుట్ మేనేజర్, మైడాప్టర్ నాలుగు ముందుగా వేరియబుల్స్ గా డిక్లేర్ చేయాలి.
ఈక్రింది కోడ్ చూడండి… రిసైక్లర్ వ్యూ విడ్జెట్ ఐడితో కాల్ చేస్తున్నాం.
recyclerView = findViewById(R.id.myRecyclerView);
రిసైక్లర్ వ్యూ విడ్జెట్ కాల్ చేశాక… ఆ రిసైక్లర్ వ్యూకి లేఅవుట్ మేనేజర్ ను అనుసంధానం చేయడం… ఈ క్రింది కోడ్ చూడండి.
layoutManager = new LinearLayoutManager(this);
recyclerView.setLayoutManager(layoutManager);
ఇప్పుడు రిసైక్లర్ వ్యూకు మైఎడాప్టర్ ను అనుసంధానం చేయాలి. ఈ క్రింది కోడ్ చూడండి.
adapter = new MyAdapter(this,nameList);
recyclerView.setAdapter(adapter);
దీంతో ఏక్టివిటికి అంటే రిసైక్లర్ వ్యూ యూజరు కనబడే విధంగా తీసుకున్న స్క్రీనులోకి ఎడాప్టర్ ద్వారా మోడల్, లేఅవుట్ ఐటమ్, లేఅవుట్ మేనేజర్, ఎర్రేలిస్టు అనుసంధానం చేశాము.
ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి ఇన్ పుట్ డేటా ఇవ్వాలి. అందుకు ఏదైనా ఒక పేరుతో మెథడ్ కాల్ చేయాలి. addNames(); అనే పేరుతో ఒక మెథడ్ కాల్ చేశాను. ఆ మెథడులో కోడ్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
private void addNames() {
ModelName name = new ModelName("చిరంజీవి","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("బాలకృష్ణ","నందమూరి");
nameList.add(name);
name = new ModelName("నాగార్జున","అక్కినేని");
nameList.add(name);
name = new ModelName("వెంకటేష్","దగ్గుబాటి");
nameList.add(name);
name = new ModelName("మహేశ్","ఘట్టమనేని");
nameList.add(name);
name = new ModelName("మహేశ్","ఉప్పలపాటి");
nameList.add(name);
name = new ModelName("పవన్ కళ్యాణ్","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("రామ్","పోతినేని");
nameList.add(name);
name = new ModelName("నాని","ఘంటా");
nameList.add(name);
name = new ModelName("గోపిచంద్","తొట్టెంపూడి");
nameList.add(name);
}
ఇన్ పుట్ డేటా కోడ్ యాడ్ చేయడంతో ఒక రిసైక్లర్ వ్యూ కోడింగ్ వ్రాయడం పూర్తయింది. మెయిన్ఏక్టివిటి.జావా ఫైల్ ఈ క్రింది ఇమేజులో..
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
చివరగా అవుట్ పుట్ ఈ క్రింది ఇమేజులో మాదిరిగా ఉంటుంది.
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
ఇదే రెండు పేర్లను ఒకదాని ప్రక్కగా ఒక్కటిగా కనిపించే అనేక వరుసలను ఒకే స్క్రీనులో చూపే రీసైక్లర్ వ్యూ…
పూర్తిగా ఒక ఫస్ట్ నేమ్, సర్ నేమ్ లతో కూడిన రీసైక్లర్ వ్యూ యొక్క పుల్ కోడ్ ఫైల్స్ ఈ క్రిందగా చూడండి…
ModelName.java
package add.to.list;
public class ModelName {
String name;
String sir_name;
//press at a time Alt+Insert buttons on your keyboard
public ModelName(String name, String sir_name) {
this.name = name;
this.sir_name = sir_name;
}
//press again Alt+Insert buttons on your keyboard
public String getName() {
return name;
}
public void setName(String name) {
this.name = name;
}
public String getSir_name() {
return sir_name;
}
public void setSir_name(String sir_name) {
this.sir_name = sir_name;
}
}
MyAdapter.java
package add.to.list;
import android.content.Context;
import android.view.LayoutInflater;
import android.view.View;
import android.view.ViewGroup;
import android.widget.TextView;
import androidx.annotation.NonNull;
import androidx.recyclerview.widget.RecyclerView;
import java.util.List;
public class MyAdapter extends RecyclerView.Adapter<MyAdapter.MyViewHolder> {
Context context;
List<ModelName> nameList;
public MyAdapter(Context context, List<ModelName> nameList) {
this.context = context;
this.nameList = nameList;
}
@NonNull
@Override
public MyViewHolder onCreateViewHolder(@NonNull ViewGroup parent, int viewType) {
View view = LayoutInflater.from(context).inflate(R.layout.recycle_item_layout,parent,false);
return new MyViewHolder(view);
}
@Override
public void onBindViewHolder(@NonNull MyViewHolder holder, int position) {
holder.first_name.setText(nameList.get(position).getName());
holder.last_name.setText(nameList.get(position).getSir_name());
}
@Override
public int getItemCount() {
return nameList.size();
}
public class MyViewHolder extends RecyclerView.ViewHolder {
TextView first_name, last_name;
public MyViewHolder(@NonNull View itemView) {
super(itemView);
first_name = itemView.findViewById(R.id.first_name);
last_name = itemView.findViewById(R.id.last_name);
}
}
}
package add.to.list;
import androidx.appcompat.app.AppCompatActivity;
import androidx.recyclerview.widget.LinearLayoutManager;
import androidx.recyclerview.widget.RecyclerView;
import android.os.Bundle;
import android.widget.ArrayAdapter;
import android.widget.ListView;
import java.util.ArrayList;
import java.util.List;
public class MainActivity extends AppCompatActivity {
List<ModelName> nameList = new ArrayList<>();
RecyclerView recyclerView;
RecyclerView.LayoutManager layoutManager;
MyAdapter adapter;
@Override
protected void onCreate(Bundle savedInstanceState) {
super.onCreate(savedInstanceState);
setContentView(R.layout.activity_main);
recyclerView = findViewById(R.id.myRecyclerView);
layoutManager = new LinearLayoutManager(this);
recyclerView.setLayoutManager(layoutManager);
adapter = new MyAdapter(this,nameList);
recyclerView.setAdapter(adapter);
addNames();
}
private void addNames() {
ModelName name = new ModelName("చిరంజీవి","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("బాలకృష్ణ","నందమూరి");
nameList.add(name);
name = new ModelName("నాగార్జున","అక్కినేని");
nameList.add(name);
name = new ModelName("వెంకటేష్","దగ్గుబాటి");
nameList.add(name);
name = new ModelName("మహేశ్","ఘట్టమనేని");
nameList.add(name);
name = new ModelName("మహేశ్","ఉప్పలపాటి");
nameList.add(name);
name = new ModelName("పవన్ కళ్యాణ్","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("రామ్","పోతినేని");
nameList.add(name);
name = new ModelName("నాని","ఘంటా");
nameList.add(name);
name = new ModelName("గోపిచంద్","తొట్టెంపూడి");
nameList.add(name);
name = new ModelName("శ్రీకాంత్","మేకా");
nameList.add(name);
name = new ModelName("వేణు","తొట్టెంపూడి");
nameList.add(name);
name = new ModelName("అర్జున్","అల్లు");
nameList.add(name);
name = new ModelName("రానా","దగ్గుబాటి");
nameList.add(name);
name = new ModelName("తారకరామారావు","నందమూరి");
nameList.add(name);
name = new ModelName("విజయ్","దేవరకొండ");
nameList.add(name);
name = new ModelName("రామ్ చరణ్","కొణెదల");
nameList.add(name);
name = new ModelName("మోహన్ బాబు","మంచు");
nameList.add(name);
name = new ModelName("నరేష్","ఇవివి");
nameList.add(name);
name = new ModelName("కళ్యాణ్ రామ్","నందమూరి");
nameList.add(name);
}
}
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్ ఇప్పుడు ట్రెండింగులో ఉన్న సాఫ్ట్ వేర్ డవలప్ మెంటు.
ఒకనాడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామింగులో ఒక ఊపు ఊపిన జావా, ఇప్పుడు మొబైల్ రంగంలో యాప్ డవలప్ మెంటులో కూడా అదే చేసింది.
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే మొబైల్ యాప్స్ కూడా పెరిగాయి.
మొబైల్ యాప్ డవలపర్స్ పెరిగారు. మొబైల్ యాప్స్, గేమ్స్ అనేకంగా వస్తున్నాయి. గేమ్ డవలప్ మెంట్ అయితే యానిమేషన్ కూడా తెలిసి ఉండాలి.
యాప్ డవలప్ మెంటుకు లాజికల్ థింకింగుకు జావా లాంగ్వేజ్ తోడైతే, ఆలోచనకు రూపకల్పన చేయవచ్చును.
ఆండ్రాయిడ్ ఫోన్లలో మొబైల్ యాప్స్ అనేకంగా ఉన్నాయి. అయినా అందరీ ఆలోచన ఒకలాగా ఉండదు. కొందరి ఆలోచన కొందరికే నచ్చవచ్చును. కానీ కొందరి ఆలోచన అందరికీ నచ్చవచ్చును.
అలా అందరికీ నచ్చేవిధంగా మీరు ఆలోచన విధానం ఉంటే, మాత్రం టెక్నాలజీని వాడుకునే అవకాశం వదులుకోకూడదు. ఒకే అంశంపై రక రకాల మొబైల్ యాప్స్ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా అందరికీ నచ్చేలా ఉందే, విజయవంతం అవుతంది.
ఆవిధంగా అందరికీ నచ్చేవిధంగా మన ఆలోచనా విధానం ఉందో లేదో తెలియాలంటే, మనకు ఆలోచనను ఒక రూపం ఇచ్చి, దానిని అందరికీ పరిచయం చేయడమే…
అందరికీ పరిచయం చేసిన విషయం పాపులర్ అయితే, మన ఆలోచనా విధానం చాలామందికి నచ్చింది. ఎంత ఎక్కువమందికి నచ్చితే…. అంత పాపులారిటీ….
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్
పొందిన పాపులారిటీ వృధా అవ్వదు. చాలా ఉపయోగపడుతుంది. వెంటనే ఆలోచనను మరింత వృద్ది చేసి, మరింత ప్రయోజనకారిగా యాప్ డవలప్ చేస్తే, అది ఇంకా ఎక్కువమందికి చేరుతుంది.
ఐడియా ఉండాలి. ఐడియా డవలప్ చేయాలి. అందరికీ ఉపయోగపడేలాగా…
అలా పొందిన పాపులారిటిని మరింతగా డవలప్ చేసుకోవచ్చును. అసలు ఐడియా ఉండాలి. ఉన్న ఐడియా ఎక్కువమందికి ఉపయోగపడాలి. ఐడియా డవలప్ చేయాలి. అందరికీ ఉపయోగపడేలాగా…
ఎలాంటి ఐడియా అయినా దాని వలన భవిష్యత్తు సమజ మనుగడకు అడ్డు రాకుండా ఉండాలి. ఏదో ఒక ఆలోచన పట్టుకుని గొప్ప ఐడియాగా భావిస్తే, అది భవిష్యత్తును దెబ్బతీయవచ్చును.
అలాంటి వాటిలోకి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు అందరూ బాగా వాడారు. అంటే అప్పట్లో అది గొప్ప ఆలోచన కావచ్చును… కానీ ఇప్పుడ ప్లాస్టిక్ భూతం మానవ మనుగడకు ముప్పు అనే కధనాలు అనేకంగా చదువతున్నాం… అటువంటి ఐడియాలు… వేస్ట్…
కరెంట్ సిట్యుయేషన్లో యూజ్ అవ్వడమే కాదు… ఫ్యూచర్లో కూడా ఉపయోగంగానే ఉంటే, దాని ఉపయోగం ఉన్నన్నాళ్ళు మన ఆలోచన గొప్పదే… దాని ఫలితం పదిమందికి ప్రయోజనంగా ఉంటుంది.
గుడ్ ఐడియా ఉండాలి. మంచి ఆలోచనను యూజుపుల్ గా మార్చాలి. ఎలా డవలప్ చేస్తే మన ఐడియా అందరికీ ఉపయోగపడుతుందో… సరిగా ఆలోచన చేసి, దానిని అభివృద్ది చేయాలి.
అందరికీ ఉపయోగపడే ఐడియా మన దగ్గర ఉంటే, దానిని టెక్నాలజీతో ఒక రూపకల్పన చేసి, నలుగురికీ ఉపయోగపడేలా చేయవచ్చును.
ఇప్పుడు టెక్నాలజిలో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువమంది వాడుతున్నారు.
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్… ఏదైనా విషయం ఎక్కువ మందికి చేరేలా ఉంటే, అదే సమాజాన్ని శాసిస్తుంది.
చాలా చాలా మందే ఆండ్రాయిడ్ ఓస్ ఉన్న స్మార్ట్ ఫోనులో సమాజంలో వాడుతున్నారు. ఏదైనా విషయం ఎక్కువ మందికి చేరేలా ఉంటే, అదే సమాజాన్ని శాసిస్తుంది.
ఇప్పుడు సమాజంలోకి స్మార్ట్ ఫోను మంచి మీడియాగా ఉంది. మీరు ఏదైనా ఐడియాతో ఒక యూట్యూబ్ చానల్ డవలప్ చేస్తే, చాలామందికి ఆండ్రాయిడ్ ఫోనుద్వారా మీ వీడియోలు చేరతాయి.
మీరు ఒక బ్లాగును క్రియేట్ చేస్తే, మీరు చెప్పే విషయాల విశ్లేషణ చాలామందికి ఆండ్రాయిడ్స్మార్ట్ ఫోన్ల ద్వారానే చేరుతుంది.
మీరు ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేస్తే ఎక్కువమందికి చేరేది… ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతోనే…
మనం మాట్లాడిన ఒకరికి నచ్చితే, అతని దగ్గర గుర్తింపుకు పరిమితం. అలాగే మనం మాట్లాడిన విషయం ఒక ఊరి ప్రజలందరికీ నచ్చితే, అది ఊరివరకే పరిమితం… పోటీ చేస్తే సర్పంచ్ గా గెలవవచ్చును.
కానీ మనం మాట్లాడిన విషయం ఒకటికి పదిసార్లు ఒక స్టేట్ ప్రజలందరికీ నచ్చితే, ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది… కదా…
అలాగే ఏదైనా ఒక ఐడియాను డవలప్ చేశారు. అది ఎక్కువమందికి నచ్చింది. ఇంకా ఎక్కువసేపు ఆ ఐడియాను ఫాలో అవుతున్నారు. అది ఆర్ధికప్రయోజం పెందచుతుంది.
మొబైల్ యాప్ డవలప్ చేయాలంటే, ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఎక్కువమంది యూజర్లకు నచ్చడం. ఎక్కువమంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉండడం… చాలా ప్రధానం.
ఇంతకముందు అనుకున్నట్టు ఒక విషయంలో ఎంతమంది ఎన్ని మొబైల్ యాప్స్ డవలప్ చేసినా… అందరికీ నచ్చింది… ఎక్కువమంది ఏక్టివ్ యూజర్లను కలిగి ఉన్న యాప్… సక్సెస్ పుల్ యాప్…
పాపులర్ ఐడియా ఉండదు…. మంచి ఐడియాపాపులర్ అవతుంది. అందరికీ తెలిసిన విషయమే… అది కానీ అందులో అందరూ గమనించని విషయం ఉంది.
చాలామంది గమనించని విషయమును హైలెట్ చేసిన ఐడియా సక్సెస్ అవుతుంది.
అంటే అందరూ ఫోను వాడుతుంటారు… ఆ ఫోను గురించిన పూర్తి అవగాహన ఎక్కువమందికి ఉండకపోవచ్చును.
కొందరికి కేవలం ఫోను కాల్ చేయడం కొరకు మాత్రమే వాడుతారు. వీరు ఖరీదు అయిన ఫోను అయినా, దానిని కేవలం కాల్ చేయడం కొరకు మాత్రమే వాడుతారు.
సోషల్ మీడియా యాప్స్ కొందరు వాడుతూ ఉంటారు. కేవలం ఫ్రెండ్ రిక్వెస్టులు చూడడం, వారికి తిరిగి రిప్లై ఇవ్వడం… చాలామంది ఇక్కడికే పరిమితం అవ్వవచ్చును.
బ్రౌజింగ్ ద్వారానే చాలా వరకు యాప్స్ ఇన్ స్టాల్ చేయవసరంలేదు… బ్రౌజింగుపై పూర్తి అవగాహన అన్ని ప్రాంతీయ భాషలలోనూ అందిస్తే, ఆ యాప్ విజవంతం కాగలదు.
ఎందుకంటే సోషల్ మీడియా యాప్స్ అంటే, వెబ్ సైటుల కూడా ఉంటాయి. వెబ్ సైటులను ఏదైనా ఒక బ్రౌజరులో ఓపెన్ చేసి చూసుకోవచ్చును…. కాబట్టి మొబైల్ బ్రౌజింగ్ ట్యుటోరియల్ బాగా వృద్ది చేస్తే, ఉపయోపడుతుంది.
ఒక గుడ్ ఐడియా అందరికీ ఉపయోగడపడేలా మొబైల్ యాప్ డవలప్ చేయాలి. దానిని ఎక్కువమందికి తెలిసేలాగా చేయాలి. అప్పుడు ఆయాప్ సక్సెస్ అవుతుంది.
ఇంకా చాలామంది డవలప్ చేసిన మొబైల్ యాప్స్ ఉన్నా… అందులో ఏదో ఒక విషయంలో మరింత డవలప్ మెంట్ అవసరం ఉంటుంది. ఆ విషయం కనిపెడితే, ఆరకమైన యాప్ మరొకటి చేసినా విజయవంతం అవుతుంది.
ప్లేస్టోర్లో అనేక రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆండ్రాయిడ్ ఫోను యూజర్ అన్నింటిని డౌన్ లోడ్ చేసుకోరు. కావాల్సిన మాత్రమే డౌన్ లోడ్ చేసుకుంటారు.
అలా అందరూ డౌన్ లోడ్ చేసుకుని ఉండే యాప్స్ ఏమిటో చూసుకుని… అటువంటి యాప్స్ బాగా గమనించి, వాటిలో బెటర్ మెంట్ తీసుకురాగలిగితే, గ్రేట్ రిజల్ట్స్ పొందవచ్చును.
వాట్సప్, యూట్యూబ్, మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్ వంటి మొబైల్ యాప్స్
చాలా మంది ఫోన్లలో వాట్సప్, యూట్యూబ్, మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్ వంటి మొబైల్ యాప్స్ ఉంటాయి. యూట్యూబ్ అయితే ప్రతీ ఆండ్రాయిడ్ ఫోనులోనూ డిఫాల్ట్ గా ఉంటుంది.
మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్, కాలింగ్, కాంటాక్ట్స్, వీడియో ప్లేయర్ వంటివి ఎటువంటి స్మార్ట్ ఫోను అయినా డిఫాల్ట్ గానే కొన్ని ఉంటాయి.
అలాంటి వాటిలో ఏవైనా సమస్యలు ఉంటే, అవి అందరికీ ఉండవచ్చనే ఊహను పట్టుకుంటే, ఆ ఊహను మరింతగా డవలప్ చేసి, కొత్త యాప్ క్రియేట్ చేయడమే….
ఇప్పుడున్న పాపులర్ యాప్స్, స్మార్ట్ ఫోను వచ్చిన కొత్తల్లో ఉండి ఉండవు… కదా.
స్మార్ట్ ఫోను వినియోగదారులు పెరిగాక పలు మొబైల్ యాప్స్ వృద్ది చెందాయి. హాట్ స్టార్ మొబైల్ యాప్ 2015లో లాంచ్ అయ్యింది…. అంతకుముందు స్మార్ట్ ఫోనులు ఉన్నాయి… వాటిలో సినిమాలు చూసేవారు…
మొబైల్ వాడుక ఎంతకాలం? యాప్స్ వాడుక ఎంతకాలం? ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్
మొబైల్ వాడకం ఎప్పుడూ ఉంటుంది… అందులో యాప్స్ వస్తూ ఉంటాయి… పోతూ ఉంటాయి.
ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ కొన్న వ్యక్తి మరికొంత కాలానికి మరొక ఫోన్ కొంటాడు… కానీ ఫోన్ వాడుకను మానడు… అయితే ఫోన్ వాడుతున్న యూజర్ ఖాతా చరిత్రలో నిలిచి ఉంటున్న యాప్స్ ఎన్ని?
అలా ఒక యూజర్ మొబైల్ ఖాతా చరిత్రలో ఎల్లకాలం, ఎంత ఎక్కువమంది చరిత్రంలో ఉంటే, అంత విజయవంత అయినట్టు….
యూట్యూబ్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ వంటి కొన్ని సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ఉంటాయి.
అయితే ఇప్పుడు మొబైల్ యాప్ ప్రారంభంలో అంత పెద్ద విజయం సాధ్యం కాకపోవచ్చును. కానీ మన ఐడియా అందరికీ నచ్చితే, అది సాధ్యమే అవుతుంది.
ఎందుకంటే అవసరాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలాగా నడవదు. 2019లో రెగ్యులర్ జీవన విధానం 2020లో అందరిలోనూ మార్పుకు గురైంది… అప్పుడప్పుడు కాలం తెచ్చే మార్పులు వ్యవస్థలపై కూడా భారీగానే పడతాయి.
అలాంటి సమయాలలో కొత్త ఆలోచను పుంతలు తొక్కుతాయి. యూజుపుల్ ఐడియాస్ వర్కవుట్ అవుతాయి.
మొబైల్ యూజర్ ఖాతాలో మన మొబైల్ యాప్ పర్మెనెంటుగా ఉండాలంటే, ఎక్కువమంది మొబైల్ యూజర్స్ ఉపయోగించే ఉపయోగాన్ని మనం అందరికన్నా సమర్ధవంతంగా అందించాలి.
వీడియో బ్లాగింగ్ ఇప్పుడు పెద్ద ట్రెండు… అందరూ ఆన్ లైన్లో ఫోనుతో కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. ఔత్సాహికులు వీడియో ద్వారా ఇచ్చే ప్రదర్శనల వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.
అలాంటి వీడియో బ్లాగింగులో మరింత డవలప్మెంట్ ఎక్కువ సక్సెస్ రేట్ సాధించగలదు… ఇప్పటికే ఉన్న వీడియో బ్లాగింగ్ యాప్స్ గమనిస్తే, వాటిలో ఏదైనా అసౌకర్యం ఉండి, దానిని మరింత డవలప్ చేయడంతో సక్సెస్ పుల్ వీడియో యాప్ చేయవచ్చును.
ఒకప్పుడు ఒక రైటర్ ఎనలైజింగ్ ఆర్టికల్స్ ఒక పుస్తకంగా ఉండేవి. కానీ ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చాకా… అవి పిడిఎఫ్ బుక్స్ రూపంలోకి మారుతున్నాయి.
మొబైల్ యాప్స్ రూపంలో కూడా బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి. బ్లాగులు మొబైల్ బ్లాగులుగా మారుతున్నాయి.
నేటి టెక్నాలజీ యుగంలో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ కీలక పాత్రను పోషిస్తాయి. వాటిలో మీ ఐడియా ఉంటే, భవిష్యత్తు మీదేనంటారు…
ఏవైనా కొన్ని వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సర్వీసులు…. ఇలా ఏవైనా ఒకే చోట చూపడానికి జాబితా తయారు చేస్తాము. అలాగే మొబైల్ యాప్ ఒకే స్క్రీనులో కొన్ని విషయాలను చూపడానికి లిస్ట్ చేయాలి. అలా లిస్ట్ చేయడానికి లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగపడుతుంది. సింపుల్ లిస్టువ్యూ ద్వారా ఏవైనా కొన్ని వస్తువుల లేదా వ్యక్తుల లేదా సర్వీసు వివరాలను ఒక స్క్రీనులో చూపవచ్చును.
లిస్టువ్యూ ఉపయోగించి, ఒక బేసిక్ ఆండ్రాయిడ్ యాప్ ఎలా చేయాలో ఈ పోస్టులో చూద్దాం. కొత్త ఆండ్రాయిడ్ ప్రొజెక్టు ఆండ్రాయిడ్ స్టూడియో స్టార్ట్ చేయగానే ముందుగా మెయిన్ ఏక్టివిటి ఎక్స్.ఎం.ఎల్ ఫైల్, దానికి సంబంధించిన జావా ఫైల్ ఓపెన్ అవుతాయి.
ఈ క్రింది ఇమేజ్ చూడండి… మీరు కొత్త ప్రాజెక్టు ఓపెన్ చేస్తే, ఈ విధంగా మెయిన్ లేఅవుట్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ఓపెన్ అవుతంది.
టాప్ రైటులో మూడు వర్డ్స్ ఉన్నాయి. కోడ్(Code), స్ల్పిట్(Split),డిజైన్(Design). వీటిలో మీరు కోడ్(Code) పైక్లిక్ చేస్తే, కేవలం కోడ్ మాత్రమే స్క్రీనుపై కనబడుతుంది.
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?
స్ల్పిట్(Split)పై క్లిక్ చేస్తే కోడ్ మరియు డిజైనింగ్ పార్ట్ రెండూ కనబడతాయి. ఎక్కువమంది ఈ Split పద్దతిలోనే వర్కు స్పేస్ ఉండేలా చూసుకుంటారు.
డిజైన్(Design)పై క్లిక్ చేస్తే, కేవలం డిజైన్ మోడ్ మాత్రమే కనబడుతుంది. ఇది డ్రాప్ అండ్ డ్రాగ్ పద్దతిలో యాప్ డిజైన్ చేసేవారికి సులువుగా ఉంటుంది.
ఏ కొత్త ఏక్టివిటీ తీసుకున్న, దానికి ఒక ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ మరియు జావా ఫైల్… రెండూ క్రియేట్ అవుతాయి.
ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ లేఅవుట్ డిజైన్ చేయడానికి ఉపయోగిస్తాం. జావా ఫైల్ బ్యాక్ గ్రౌండులో జరిగే కోడింగ్ వ్రాయడానికి ఉపయోగిస్తాం.
ఇప్పుడు మెయిన్ ఏక్టివిటీ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్లో లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగించడానికి ఈ క్రింది కోడ్ గమనించండి.
ఈక్రింది ఇమేజ్ చూడండి. ఇది జావా ఫైల్. మెయిన్ లేఅవుట్ కు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో కోడ్ వ్రాస్తే, ఎక్స్.ఎం.ఎల్ లేఅవుట్లో యాక్షన్ చేయగలుగుతాం.
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ మెయిన్ ఏక్టివిటీలో లిస్టువ్యూ
దిగువ చిత్రంలో చూడండి…. స్ప్లిట్ మోడ్లో ఉన్న ఏక్టివిటీ మెయిన్.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ఒక్కటి ఉంది. అందులో రైట్ సైడులో లిస్టువ్యూ కనబడుతుంటే, మిడిల్ నందు కోడ్ కనబడుతుంది.
ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ లిస్టువ్యూ
పై ఇమేజ్ లో ఒక లైనర్ లేఅవుట్ ఫైల్ నందు ఒక టెక్ట్స్ వ్యూ తీసుకోబడింది. అందులో లిస్టువ్యూ అనే టైటిల్ టెక్ట్స్ వ్రాయబడింది. అలాగే ఆ టైటిల్ టెక్ట్స్ క్రిందగా ఒక లిస్టువ్యూ కోడ్ వ్రాయబడి ఉంది.
ఎగువన గల చిత్రంలో మూడు విడ్జెట్లు కోడ్ రూపంలో వ్రాయబడి ఉన్నాయి. మూడింటికి ప్రొపర్టీస్ ఆయా ట్యాగులనుందు వ్రాయబడి ఉన్నాయి. ఈ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ద్వారా లిస్టువ్యూ డిజైన్ పూర్తి అయ్యింది.
ఇక ఈ లిస్టువ్యూకు బ్యాక్ గ్రౌండ్ జావా కోడ్ ఫైల్ ఈ క్రింది చిత్రంలో చూడండి.
మీకు మెయిన్ ఏక్టివిటి.జావా ఫైల్ ముందుగా ఈక్రిందివిధంగా డిఫాల్ట్ కోడ్ కలిగి ఉంటుంది.
పై కోడ్ నందు onCreate మెధడ్ ద్వారా ఎక్స్.ఎం.ఎల్ కోడ్ లింక్ చేయబడి ఉంది. ఇప్పుడు ఆ మెధడ్ లోనే లిస్టువ్యూకు సంబంధించిన జావా కోడ్ పై ఇమేజులో చూపిన విధంగా వ్రాయాలి.
క్రింది బ్లాకులో గల కోడ్ ను మెయిన్ ఏక్టివిటీ.జావా ఫైల్లో ఆన్ క్రియేట్ మెధడులో పేస్ట్ చేస్తే సరిపోతుంది.
మెయిన్ ఏక్టివిటి.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ పుల్ కోడ్… ఈ క్రింది కోడులో పేకేజ్ పేరు మాత్రం కాఫీ చేయకండి. మీ ప్రాజెక్టులో ప్యాకేజి నేమ్… ఇది తేడా ఉంటుంది… కాబట్టి.
ఈ సంవత్సరం టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020… లో ఎలా ఉన్నాయో ఈ తెలుగు పోస్టులో రీడ్ చేయండి.
గత ఏడాది 2020 సంవత్సరమునకు గాను, గూగుల్లో బాగా సెర్చింగ్టాపిక్స్ ఇవే. గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైటులో చూపిస్తున్న ఓవరాల్ టాప్10 సెర్చింగ్ వర్డ్స్ …
ఇండియాలో శోధించిన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ తెలుగులోనూ అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరోనా వైరస్ ప్రధానంగా 2020లో కనబడతాయి.
టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020
Overall (మొత్తం మీద గూగుల్ సెర్చ్ ఇంజన్లో శోధించిన అంశాలు ) 1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2) Coronavirus (కరోనా వైరస్) 3) US election results (యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్) 4) PM Kisan Yojana (పిఎం కిసాన్ యోజన) 5) Bihar election results (బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్) 6) Delhi election results (ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్) 7) Dil Bechara (దిల్ బెచారా) 8) Joe Biden (జోయ్ బైడెన్) 9) Leap day (లీప్ డే) 10) Arnab Goswami (అర్నబ్ గోసామి)
గూగుల్ సెర్చ్ ద్వారా నిత్యం అనేక వస్తువులు, సేవలు, వ్యక్తులు, ప్లేసులు గురించి సెర్చింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ 2020 సంవత్సరమునకు గానూ, గూగుల్లో బాగా సెర్చ్ చేసిన విషయాలలో (Near me) నాదగ్గరలో ఉన్న షాప్స్ గానీ, స్టోర్స్ గానీ, షెల్టర్స్ గానీ, సర్వీసుల గానీ ఇలాంటి వాటిలో టాప్ గూగుల్ సెర్చింగ్ వర్డ్స్ ఈ క్రింది పదాలు.
Near me (నియర్ మి అను పదంతో కూడిన గూగుల్ శోధనలు)
1) Food shelters near me (పుడ్ షెల్టర్స్ నియర్ మి) 2) COVID test near me (కోవిడ్ టెస్ట్ నియర్ మి) 3) Crackers shop near me (క్రాకర్ షాప్ నియర్ మి) 4) Liquor shops near me (లిక్కర్ షాప్స్ నియర్ మి) 5) Night shelter near me (నైట్ షెల్టర్స్ నియర్ మి) 6) Grocery stores near me (గ్రాసరీ స్టోర్స్ నియర్ మి) 7) Gym equipment near me (జిమ్ ఎక్విప్ మెంట్ నియర్ మి) 8) Broadband connection near me (బ్రాడ్ బాండ్ కనెక్షన్ నియర్ మి) 9) Laptop shop near me (ల్యాప్ టాప్ షాప్ నియర్ మి) 10) Furniture store near me (ఫర్నిచర్ నియర్ మి)
ఇంకా గూగుల్ బాగా వెతికే విషయాలో ఎలా చేయాలి? ఎలా? (How to) ఈ పదాలను బట్టి ఎక్కువగా గూగుల్ సెర్చింగ్ ఉంటుంది.
అంటే హౌటు లింక్ పాన్ కార్డ్, హౌటు రిచార్జ్, హౌటు క్రియేట్ బ్లాగ్, హౌటు అప్లై … ఇలా ఉంటాయి. అల హౌటు (How to) ఉపయోగిస్తూ సెర్చ్ చేసిన టాప్10 గూగుల్ వర్డ్స్ ఈ క్రిందలో చూడండి.
How to హౌటు పదం కలుపుతూ గూగుల్ శోధనలు 2020
1) How to make paneer (హౌటు మేక్ పన్నీర్) 2) How to increase immunity (హౌటు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ) 3) How to make dalgona coffee (హౌటు మేక్ డాల్గోన కాఫీ) 4) How to link PAN card with aadhaar card (హౌటు లింక్ పాన్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్) 5) How to make sanitizer at home (హౌటు మేక్ సానిటైజ్ ఎట్ హోమ్) 6) How to recharge fastag (హౌటు రిచార్జ్ ఫాస్టాగ్) 7) How to prevent coronavirus (హౌటు ప్రివెంట్ కరోనా వైరస్) 8) How to apply e-pass (హౌటు అప్లై ఇపాస్) 9) How to make jalebi (హౌటు మేక్ జలేబి) 10) How to make cake at home (హౌటు మేక్ కేక్ ఎట్ హోమ్)
నెక్ట్స్ నాల్గవ టాప్ వర్గంలో మూవీస్. గూగుల్ సెర్చ్ చేసే విషయాలలో మూవీస్ కూడా ఎక్కువగానే వెతుకుతారు. మూవీస్ గురించి లేదా మూవీ ఫీల్డులో వ్యక్తుల గురించి… అలా గూగుల్లో వెతికిన మూవీస్ లో టాప్ ఇండియన్ మూవీస్ ఈ క్రిందగా చూడండి.
గూగుల్ నందు గత ఏడాది బాగా వెతికిన బాలీవుడ్ మూవీస్ Movies 2020
ఈవెంట్స్ కూడా బాగా వెతికారు. ఈ 2020 సంవత్సరమునకు గానూ గూగుల్ శోధన వెబ్ సైటు నందు బాగుగా శోధించిన విషయములలో ఈవెంట్స్(ఘటన లేక సంఘటనలు ). అలా సెర్చ్ చేసిన టాప్ ఈవెంట్స్ ఈ క్రిందగా చూడండి.
News Events (న్యూస్ ఈవెంట్స్ 2020 సంవత్సరములో)
1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2) Coronavirus (కరోనా వైరస్) 3) US Presidential Election (యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్) 4) Nirbhaya case (నిర్భయ కేస్) 5) Beirut explosion (బైరట్ ఎక్స్ ప్లోషన్) 6) Lockdown (లాక్ డౌన్) 7) China-India skirmishes (చైనా ఇండియా స్కిర్మిషెస్) 8) Bushfires in Australia (బుష్ ఫైర్స్ ఇన్ ఆస్ట్రేలియా) 9) Locust swarm attack (లోకస్ట్ స్వార్మ్ ఎటాక్) 10) Ram Mandir (రామ్ మందిర్)
ప్రసిద్ద వ్యక్తులు… ప్రసిద్ది చెందిన వ్యక్తుల గురించి గూగుల్ శోధనలో 2020 సంవత్సరములో జరిగిన టాప్ 10 పెర్సనాలీటిస్.
ఎక్కువమందిని ఆకర్షించేవి ఆటలు. ప్రసిద్ద ఆటలు గురించి, ఆటగాళ్ల గురించి గూగుల్ శోధనలు ఉంటాయి. అలా గూగుల్ సెర్చింగ్ లో స్పోర్ట్స్ ఈవెంట్స్ 2020 సంవత్సరములో టాప్ 10 ఈవెంట్స్.
Sports Events (స్పోర్ట్స్ ఈవెంట్స్ టాప్10 ఇన్ 2020)
1) Indian Premier League (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2) UEFA Champions League (UEFA చాంపియన్స్ లీగ్) 3) English Premier League (ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్) 4) French Open (ఫ్రెంచ్ ఓపెన్) 5) La Liga (లా లిగ) 6) Serie A (సిరీస్ ఏ) 7) Australian Open (ఆస్ట్రేలియా ఓపెన్) 8) NBA Basketball League (NBA బాస్కెట్ బాల్ లీగ్) 9) UEFA Europa League (UEFA యూరప్ లీగ్) 10) UEFA Nations League (UEFA నేషన్స్ లీగ్)
టివి / వెబ్ సిరీస్ విబాగంలో టాప్ గూగుల్ శోధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
TV/Web Series (టివి / వెబ్ సిరీస్ టాప్10 ఇన్ 2020)
1) Money Heist (మనీ హీస్ట్) 2) Scam 1992: The Harshad Mehta Story (స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ) 3) Bigg Boss 14 (బిగ్ బాస్ 14) 4) Mirzapur 2 (మిర్జాపూర్ 2) 5) Paatal Lok (పాటల్ లోక్) 6) Sex Education (సెక్స్ ఎడ్యుకేషన్) 7) Breathe: Into the Shadows (బ్రేథ్: ఇన్ టూ ద షాడోస్) 8) Dark (డార్క్) 9) Bandish Bandits (బందీష్ బండిట్స్) 10) Special Ops (స్పెషల్ ఓప్స్)
నియర్ మి, హౌటు, ఇలాంటి గూగుల్ శోధనలతో బాటు వాట్ ఇజ్ అనే పదం కూడా ఉంటుంది. ఈ వాట్ ఇజ్ అంటే ఏమిటి? అని అడగడం… ఈ పదం ఉపయోగించి 2020లో గూగుల్ సెర్చ్ వర్డ్స్…
What is… (వాట్ ఇజ్… గూగుల్ సెర్చ్ టాప్10 ఇన్ 2020)
1) What is coronavirus (వాటిజ్ కరోనా వైరస్) 2) What is binod (వాటిజ్ బైనోడ్) 3) What is plasma therapy (వాటిజ్ ప్లాజ్మా థెరఫీ) 4) What is COVID-19 (వాటిజ్ కోవిడ్ – 19) 5) What is CAA (వాటిజ్ సిఏఏ) 6) What is colon infection (వాటిజ్ కోలన్ ఇన్పెక్షన్) 7) What is solar eclipse (వాటిజ్ సోలార్ ఎక్లిప్స్) 8) What is NRC (వాటిజ్ ఎన్ఆర్సి) 9) What is hantavirus (వాటిజ్ హంటా వైరస్) 10) What is nepotism (వాటిజ్ నెపోటిజమ్)
ఈ గూగులో శోధనలు గురించి మరింతగా తెలుసుకోవచ్చును.
టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020
ప్రపంచ వ్యాప్తంగా ఏవిధమైన గూగుల్ సెర్చ్ సాగింది? ఎవరి గురించి బాగా సెర్చ్ చేశారు. ఏవిషయం గురించి బాగా వెతికారు?
ఎటువంటి విషయాలపై ఆసక్తి చూపించారు? ఎలాంటి వస్తువులను గురించి శోధించారు? ఎలాంటి సంఘటనలకు ప్రధాన్యత ఇచ్చారు?
ఏం తెలుసుకోవాలని చూశారు? ఇలాంటి పలు రకాలుగా గూగుల్ సెర్చ్ గురించి పరిశీలించవచ్చును.
గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైట్ ద్వారా మీరు మరింతగా తెలుసుకోవచ్చును.
బ్లాగును నిర్వహించేవారికి ఈ గూగుల్ ట్రెండ్స్ ఉపయోగపడతాయి. ఇంకా యూట్యూబ్ చానల్ నిర్వహించేవారికి కూడా ఈ గూగుల్ ట్రెండ్స్ ఉపయోగడవచ్చును.
శోధించిన విషయాలు, ఆన్ లైన్ విజిటర్స్ యొక్క తీరును తెలియజేస్తుంది. తద్వారా ఎటువంటి పోస్టులు ద్వారా ఆన్ లైన్లో వెబ్ సైటు ట్రాఫిక్ పెంచుకోవచ్చునో… ఈ గూగుల్ ట్రెండ్స్ సూచిస్తాయి.
ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా ఆరంభం అయ్యింది. సాదారణంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఐపిఎల్20 కప్ సెప్టెంబర్2020లో ప్రారంభం అయ్యింది.
ఇన్ని మాసాలు లేటు అవ్వడానికి కారణం కరోనా… అందరినీ వణికించిన కరోనా, కరెక్టుగా ఐపిఎల్ ప్రారంభానికి ముందుగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది.
కరోనా రాకముందే మార్చి29న ప్రారంభం మ్యాచుతో కూడిన ఐపిఎల్ షెడ్యూల్ కూడా విడుదలైంది.
అయితే కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభం కావడంతో, అప్పుడే లాక్ డౌన్ కూడా అమలలోకి వచ్చింది. లాక్ డౌన్ సడలిస్తారు.. ఐపిఎల్ సాగుతుందనే అంచనా కూడా ఉంది.
స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా కేవలం టివిల ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించి ఐపిఎల్ నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు.
నిర్వాహకులు కూడా ఐపిఎల్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేసినా, కరోనా వైరస్ వ్యాప్తి బాగా పెరగడంతో… ఐపిఎల్ మ్యాచులు వాయిదా వేశారు.
క్రికెట్టే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా కరోనా అడ్డుకుంది. సాదరణ జీవనాన్ని కూడా కరోనా ఇంటికే పరిమితం చేసింది.
కరోనా కారణంగా వాతావరణ కాలుష్యంలో కూడా తేడాలు వచ్చాయి. మోటారు వాహనాల వినియోగం తగ్గడంతో కాలుష్యం కొంచెం తగ్గిందనే వార్తలు కూడా వచ్చాయి.
అలాంటి సమయంలో క్రికెట్ మ్యాచులు అసాధ్యమని కేంద్రం భావించడంతో, ఐపిఎల్ నిర్వహణ వాయిదా పడింది.
మనదేశంలో క్రికెట్ కు ఆదరణ ఎక్కువ… అందులోనూ ఐపిఎల్ అంటే మరింత క్రేజ్…
నెలరోజుల పాటు అభిమానులను అలరించే ఐపిఎల్ అయిదు నెలల ఆలస్యంగా సెప్టెంబరులో దుబాయ్ లో ప్రారంభం అయ్యింది.
ప్రేక్షకులు లేకుండా కేవలం టివి ప్రసారాల ద్వారానే మ్యాచులు జరిగాయి. అయినా ఐపిఎల్ లాభాల బాటలోనే నడవడం విశేషం….
ఢిల్లికి – ముంబైకి మధ్య ఐపిఎల్T20 ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా
10నవంబర్ 2020న ఢిల్లికి – ముంబైకి మధ్య ఐపిఎల్T20 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఢిల్లి గెలుస్తుందనే అంచనా కూడా ఎక్కువగానే వచ్చింది…
కానీ డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబై జట్టు ఐపిఎల్ కప్ అయిదోసారి అందుకుంది. అయిదు నెలల లేటుగా ప్రారంభం అయిన ఐపిఎల్ టి20 కప్పు ముంబైపరమైంది. రోహిత్ శర్మ 68 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
ఇంకా టి20 ఐపిఎల్ టోర్నిలో ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ పై పలు ప్రశంసలు కురిశాయి. అయిదు సార్లు కప్పు కొట్టిన ఘనత రోహిత్ శర్మదే… అయ్యింది.
ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ గా అద్భుతమైన పనితీరు రోహిత్ శర్మ కనబరిచారు. ఆటగాడిగా రాణిస్తూ, కెప్టెన్ గా కూడా జట్టుకు మేలునే చేశాడు.
ఈ విధంగా ఐపిఎల్2020 కరోనా కారణంగా ఆలస్యమైనా మంచి మజానే ప్రేక్షకులకు అందించి.
చిన్న పిల్లల పేర్లు అచ్చతెలుగులో గల యాప్. బేబి నేమ్స్ బాయ్స్, గర్ల్స్ విడి విడిగా సెర్చ్ చేయవచ్చును. ఇంకా ఎంచుకున్న పేరుతో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ చూడవచ్చును.
బ్లాగుల మేటర్లో టిప్స్ ట్రిక్స్ బ్లాగులలో ఉండే మేటరులో ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విషయాలను వివరించే ఆర్టికల్స్ కలిగి ఉండి, తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ మాదిరిగా ఉంటాయి.
ఒక్కబ్లాగు ఒక టాపిక్ తీసుకుని దానిని వివరిస్తూ ఆర్టికల్ పోస్టును కలిగి ఉంటుంది. అనేక టాపిక్స్ కలిగి అనేక ఆర్టికల్స్ ను బ్లాగు కలిగి ఉంటుంది.
ఆయా టాపిక్స్ బట్టి బ్లాగులలో మేటర్ వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఇంకా ఈ వివరం విపులంగా ఉంటుంది.
అనేకానేక అంశాలతో ప్రపంచం ఉంటుంది. అందులో అందరికీ తెలిసినవి కొన్నే ఉంటే, తెలియాల్సినవి చాలానే ఉంటాయి.
అందరికీ విషయం విపులంగా, సమగ్రంగా చేరవేయడంలో బ్లాగులు చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి. వంట అందరికీ తెలియదు. కానీ ఒక్కరికి అవసరం. ఇలా వంట గురించి విషయాలు ఒక బ్లాగు ప్రచురిస్తూ ఉంటుది.
వంట చేయడం ఎలా? వెబ్ సైట్ చేయడం ఎలా? వ్యాపారం ఎలా? సంపాదించడం ఎలా? ఇలా రక రకాల ప్రశ్నలు లేవనెత్తి, వాటికి సమాధానములు వివరంగా బ్లాగులు తెలియజేస్తాయి.
టిప్స్, ట్రిక్స్ ఇవి ప్రధానంగా బ్లాగు ఆర్టికల్స్ ఉంటాయి.
బ్లాగులు మేటరులో టిప్స్, ట్రిక్స్ ఇవి ప్రధానంగా బ్లాగు ఆర్టికల్స్ ఉంటాయి. యోగాసనాలు – ఉపయోగాలు, వాకింగ్ టిప్స్, సైక్లింగ్ టిప్స్, ఫైనాన్సియల్ టిప్స్ ఇలా రక రకాల విషయాలలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా బ్లాగుల ద్వారా పోస్ట్ చేయబడతాయి.
ఏబ్లాగు చూసినా ఏదో ఒక అంశము లేక అనేక అంశములను తెలియజేస్తూ ఆర్టికల్స్ కలిగి ఉంటాయి. ఆయా అంశములలో టిప్స్, ట్రిక్స్ ప్రధానంగా తెలియజేస్తూ వివరం వ్రాయబడుతుంటుంది.
ఏదో ఒక అంశము గురించిన టిప్స్ ట్రిక్స్ అందించే వివిధ తెలుగు బ్లాగులను ఈ పోస్టులో చూద్దాం.
మీరు మీసాల మన్మధుడు నవలా రచయిత బ్లాగును, ఆ నవలను చదవాలనుకంటే ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి. ఈ నవల స్వాతి వారపత్రికలో ప్రచురితం అయ్యిందట.
ఒక పుస్తకం చదివి…చదివి… ఆపుస్తకంలోని ప్రతి విషయం వర్ణించినట్టు. పుస్తకాలు చదివి…చదివి ఓ పుస్తకం వ్రాయగలిగినట్టు… బ్లాగులు విజిట్ చేసి, విజిట్ చేసి… బ్లాగు విజన్ పై విజన్ వస్తుంది. బ్లాగు టాపిక్ పై అవగాహన వస్తుంది.
పాత పాటలు మధురమైన పాటలే. వింటుంటే వినసొంపుగా ఉంటాయి. చదవడానికి ఆసక్తిని రేపుతాయి. ఆనాటి తెలుగు మేటి పాటలు. అలాంటి పాటలలో ”మాటరానిమౌనమిది” లాంటి పాటలు. అలాగే నేటి కాలంలోని మెలోడి పాటలు కూడా అంతే. ఈనాటి పాటలలో ”కాటుక కనులే…” వంటి పాటలు… బాగు ఇలాంటి బ్లాగు ఉంటే, వెంటనే దర్శించాల్సిందే… ఆ తెలుగు పాటలు రీడ్ చేసేయాలి. ఈ పాటల బ్లాగ్ విజిట్ చేయడానికి, పాటలను రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ టచ్ చేసి బ్లాగును విజిట్ చేయండి.
కొన్ని వెబ్ సైట్లను తెలుసుకుంటే, యాప్స్ బదులుగా ఒక యాప్ లో అనే వెబ్ సైట్లను వాడుకోవచ్చును. వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్.
2.9 మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపిస్, 5.8మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపిస్ ఇలా డాలర్ రేటు ఇండియన్ రూపాయిలలో సెర్చ్ చేస్తాము.
భారతదేశ కరెన్సీలోకి డాలర్స్ కన్వెర్ట్ చేయడానికి మొబైల్ యాప్స్ ఉంటాయి. అయితే మనమొబైల్లో ఇన్ స్టాల్ చేయబడిన మొబైల్ యాప్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అందిస్తాయి.
నోటిఫికేషన్స్ అందించే మొబైల్ యాప్స్ మనమొబైల్లో ఉన్నాయంటే, అవి బ్యాక్ గ్రౌండులో కూడా రన్ అయ్యే అవకాశం ఉంటుంది.
బ్యాక్ గ్రౌండులో కూడా రన్ అయ్యే మొబైల్ యాప్స్ మనమొబైల్లో ఉంటే అవి ఎక్కువ స్టోరేజ్ మరియు బ్యాటరీ సామర్ధ్యము వాడుతాయి. కాబట్టి వీలైనంతగా వెబ్ సైటు వాడడం వలన ఎక్కువ మొబైల్ యాప్స్ మనమొబైల్లో లేకుండా చూసుకోవచ్చును.
ఇప్పుడు మనం మనమొబైల్లో గూగుల్ క్రోమ్ ద్వారా డాలర్ రేట్ సెర్చ్ చూద్దాం.
బ్రౌజరు గూగుల్ క్రోములో dollartoinr అని టైపు చేయగానే ఈ (ఎడమవైపు / క్రింద) చిత్రంలో ఉన్న విధంగా ఒక డాలర్ రేటుకు ఇండియన్ రూపాయిలలో వాల్యూ ఎంతో చూపుంది.
మీకు కేవలం రోజూ డాలర్ రేట్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసమే అయితే మీరు ఈ సెర్చ్ రిజల్ట్ పేజిని హోమ్ స్క్రీనుపైకి చేర్చుకుంటే చాలు.
హోమ్ స్క్రీనులో చేర్చబడిన షార్ట్ కట్ పై క్లిక్ చేయగానే, మీకు మరలా డాలర్ రేట్ పేజి కనబడుతుంది. ప్రక్కచిత్రంలోని రైట్ టాప్ కార్నరులో మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మెను వస్తుంది.
ఈ (కుడిప్రక్కన/క్రింద) చిత్రంలో చూపినట్టు ఉన్న మెనులో Add to Home screen ఆంగ్ల అక్షరాలు పైన టచ్ చేస్తే, మీకు డాలర్ రేట్ గూగుల్ పేజి మీ మొబైల్ హోమ్ స్క్రీనుపై షార్ట్ కట్ గా వస్తుంది.
(ఈ చిత్రంలో ఆంగ్లఅక్షరాలు రెడ్ బోర్డరుతో హైలెట్ చేయబడంది. ఆ అక్షరాలను మీరు ఏ వెబ్ సైటును ఓపెన్ చేసినప్పుడైన టచ్ చేసి, ఆ వెబ్ సైటును హోమ్ స్క్రీనులో షార్ట్ కట్ గా యాడ్ చేయవచ్చును.)
ఈ (ఎడమప్రక్కన/క్రింది) చిత్రంలో చూడండి dollar to inr అనే షార్ట్ కట్ గూగుల్ ఐకానుతో హోమ్ స్క్రీను పై ఉంది.
పై మొదటి చిత్రంలో చూపినట్టుగా ఏదేని వెబ్ సైటును గూగుల్ క్రోములో ఓపెన్ చేసి, దానిని మీ మొబైల్ హోమ్ స్క్రీనుపై షార్ట్ కట్ గా తీసుకోవచ్చును.
ఎప్పుడు కావాలంటే, అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చును. ఈ విధానం వలన మీకు మీ మొబైల్ స్టోరేజ్ సేవ్ చేయవచ్చును.
మొబైల్ యాప్ ద్వారా ఎక్కువ వెబ్ సైట్లను షార్ట్ కట్స్ గా వాడుకోవడం
ఇలా గూగుల్ క్రోమ్ ద్వారా మీకు కుదరకపోతే, సింపుల్ మొబైల్ యాప్ వినియోగించవచ్చును. టచ్ చేసి చూడు మొబైల్ యాప్ లో వివిధ వర్గాల లిస్టు ఉంటుంది. ఆ వర్గాలలో వెబ్ సైట్ల లిస్టు ఉంటుంది.
ప్రతి వెబ్ సైట్ టైటిల్ చివరలో ఉన్న సిబల్ పై టచ్ చేసి, షార్ట్ కట్ ను ఫేవరెట్ స్క్రీనులోకి చేర్చవచ్చును. నక్షత్రములను బట్టి పేర్లను తెలుసుకోవడం, జాతకం చూసుకోవడం ఏదైనా అప్పుడప్పుడు చేసే పనులకు సంబంధించిన సైట్లను షార్ట్ కట్స్ గా ఈ యాప్ ద్వారా వాడుకోవచ్చును.
ఈరోజు మన భారతంలో భారత్ బంద్ తలపెట్టారు. రైతులు, ప్రతిపక్షాలు డిసెంబర్8న భారత్ బంద్ ప్రకటించాయి. తత్ఫలితంగా నేడు భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ బంద్ పిలుపు.
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు గత కొన్నిరోజులగా మన భారతంలో కొనసాగుతున్నాయి.
ఇక రాజకీయ భారతంలో అయితే సరేసరి కొన్ని ప్రతిపక్షాలు ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా ఉన్నాయని.
రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం:
మన భారతంలో ఏ పంటకు అయినా.. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, ఆయా కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. దీనికి ఒక కాల పరిమితి ఉంటంది. అది కనీసం ఒక పంట కాలం నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. రైతులు తమ పంట పండించడానికి ముందే ఎవరైనా కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకోవచ్చు. ఇందులో వివాదాల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఉంటుంది.
పెద్ద పెద్ద కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతాయి. దీంతో తాము పండించే పంట ఉత్పత్తుల అమ్మకాల విషయంలో రైతులకుభరోసా కలుగుతుంది. ముందే ధర తెలుసుకోవడం వల్ల రైతు తన పండించే పంట పెట్టుబడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. రైతులకు పంట పండించడం కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయి. రైతుల తమ పంటల అమ్మకాల ప్రక్రియలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
2) నిత్యావసర సరకుల (సవరణ) చట్టం:
కేంద్రప్రభుత్వానికి నిత్యావసరాల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, అమ్మకాల నియంత్రణ అధికారం ఉంటుంది.
వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడంతో బాటు, నిత్యావసర వస్తువులపై నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం. దీని వలన వ్యవసాయ రంగంలో పోటీ ఏర్పడుతుంది. తత్ఫలితంగా రైతుల ఆదాయం పెరుగుతుంది. దేశంలో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి తగినన్ని సదుపాయాలు పెరుగుతాయి. తత్ఫలితంగా పంట వ్యర్థాలు పెద్ద మొత్తంలో తగ్గుతాయి.
ప్రతిపక్షాలు, రైతు సంఘాలు భారత్ బంద్పిలుపునిచ్చేంతలాగా ఈ వ్యవసాయ చట్టంలో ఏముంది? చట్టాలు ప్రజాప్రయోజనాలను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తారు.
అయితే ఈ చట్టాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులు విశ్లేషకుల మాటలలో వింటే మనకు మరింత అవగాహన ఉంటుంది.
మన భారతంలో మేధావులు, విశ్లేషకులు ఎక్కువగానే ఉన్నారు. కొందరు ప్రధానంగా సామాజిక పరంగా విశ్లేషిస్తే, కొందరు రాజకీయపరంగా విశ్లేషిస్తూ ఉంటారు.
ఏదైనా విశ్లేషణలు చూడడం వలన మనకు సరైన అవగాహన ఉంటుంది. మన భారతంలో నివసిస్తున్న మనం జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలుసుకోవడం అవసరం అంటారు.
ఆందోళనలు పెంచుతున్న ఈ వ్యవసాయ చట్టంపై ప్రముఖుల అభిప్రాయాలు, చట్టం వివరించే వీడియోలు ఈకిందగా ఇవ్వడం జరిగింది. వాచ్ చేయండి… అవగాహన ఏర్పరచుకోండి.
వ్యవసాయ చట్టాలపై ప్రముఖ వీడియోలు ఈ క్రిందగా చూడండి.
సామాజిక మార్పు ఆశించి, ఉద్యోగం వదలి పార్టీని స్థాపించిన జయప్రకాశ్ నారాయణ గారి అభిప్రాయం.
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెషర్ కె నాగేశ్వర్
మన భారతంలో భారత్ బంద్
https://www.youtube.com/watch?v=WIIP2vkuwcQ
వ్యవసాయ మంత్రిత్వశాఖ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.
చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పుట్టిన సమయం బట్టి ఉన్న చూసేవి. నక్షత్రములు పాదములు బట్టి మొదటి అక్షరం ఏమిటి అనేది.
27 నక్షత్రములు 108 పాదములు ఎవరు పుట్టినా ఈ 108 పాదములలోకి వస్తారు. పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, నక్షత్రం యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం నిర్ణయిస్తూ ఉంటారు.
ఈ క్రింది నక్షత్రముల జాబితాలో ప్రతి నక్షత్రమునకు ఎదురుగా నాలుగు అక్షరములు గలవు. అంటే పాదమునకు ఒక అక్షరము గలదు. నాలుగు పాదముల గల నక్షత్రములకు నాలుగు అక్షరములుగా నిర్ణయించబడి ఉన్నవి.
పాప పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం బట్టి, నక్షత్రము యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం ఉండేలా చూస్తారు.
ఉదాహరణకు పాపాయి పుట్టిన సమయం బట్టి ధనిష్ఠ నక్షత్రం మొదటి పాదం వచ్చిందనుకోండి. పేరులో మొదటి అక్షరం బట్టి గణేష్, గంగాధర్ వంటి పేర్లను చూస్తూ ఉంటారు.
అంతేకాకుండా గ పేరుతో ప్రారంభించినా దానికి తోడు ఇంకా ఏదైనా పేర్లు కూడా కలిపి పెడుతూ ఉంటారు. అయితే కొందరు నామనక్షత్రం, జన్మనక్షత్రం, మాసం, వారం వంటివి కూడా మొదటి అక్షరమును సూచిస్తారు.
ఈ విషయంలో దగ్గరలో ఉన్న బ్రాహ్మణులను అడగడం చాలా చాలా శ్రేయష్కరం. ఎందుకంటే పేరులో పలికే మొదటి అక్షరం పిల్లవాని భవిష్యత్తుపై ఎంతోకొంత ఫలితం చూపుతుందని అంటారు.
కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉండాలనేది మాత్రం ఇంటి పురోహితుడిని అడగాలి. వారు సూచించిన అక్షరాలను బట్టి ఆపేరుకు తోడుగా పేర్లు ఎంచుకోవచ్చును.
మీరు కనుక బ్రాహ్మణుల సూచించిన అక్షరం బట్టి చిన్న పిల్లల పేర్లు వెతకాలంటే ఈ క్రింది మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.
లేదా మీరు ఈ వెబ్ సైటులో గల మెను పేజిలో గల అచ్చతెలుగులో పిల్లల పేర్లు బాయ్ నేమ్స్ అనే పేజిని ఓపెన్ చేయండి. బాలిక పేరుకోసం అయితే అచ్చ తెలుగులో బాలిక పేర్లు పేజిని ఓపెన్ చేయండి.
విషయములుఆలోచనపుస్తకం ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు మనసును ప్రభావితం చేస్తాయి. విషయములు ఆలోచనలు కలిగిస్తే, మంచి విషయాలు మంచి ఆలోచనలను కలిగిస్తాయి.
లోకంలో అనేక అంశములలో అనేక విషయాలు ఉంటాయి. అనేకమంది వ్యక్తులు, అనేక విషయాలతో సంఘం కలిగి ఉంటే, మరి ఆలోచనలు ఎన్ని ఉంటాయి?
విషయములతో ప్రభావం చెందే మనసుకు మొదట్లో తెలిసిందేమిటి? ఆలోచనలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి.
తనును తాను చూసుకోకుండా అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది మనసు. ఒకప్పుడు కష్టంలో తననితాను చూసుకుంటుంది. స్థితిని చూసుకుంటుంది. ఆలోచనలో పడుతుంది.
కష్టంలో ఓదార్పు అందుకునే మనసుకు మిత్రులు, బంధువులు, ఆత్మీయులు ఉంటారు. పుస్తకంపఠనం అలవాటు ఉన్నవారికైతే, పుస్తకం కూడా ఒక మిత్రుడు వంటివాడు.
పరిశోధనాత్మకమైన పుస్తకాలు చదివే అలవాటు అయితే, ఒక పరిశోదకుడు మనసుకు మిత్రుడుగా ఉంటాడు. భక్తిపరమైన బుక్స్ చదివే అలవాటు ఉంటే, ఓ భక్తపరాయణుడు మిత్రుడుగా మనసు లభిస్తాడు.
తాత్విక చింతనను ప్రబోదించే బుక్స్ అయితే ఓ తత్వవేత్త మనసుకు మిత్రుడుగా లభిస్తాడు. ఎటువంటి పుస్తకాలు చదువుతుంటే, అటువంటి మిత్రత్వం పుస్తకాల ద్వారా మనసుకు లభిస్తుంది.
పుస్తకపఠనం గొప్ప అలవాటుగా చెబుతారు. అంటే వ్యక్తికి ఉండవలసిన మంచి అలవాట్లలో పుస్తకం చదవడం అనే మంచి మంచి అలవాటు కూడా ఉండాలని చెబుతారు.
పుస్తకం చదవుతూ ఉన్నంతసేపూ మనసు ఒక విషయంపై ఏకాగ్రదృష్టితో దృష్టితో ఉంటుంది.
చదువుతున్న పుస్తకం ఇంకా భారతీయ సాహిత్యం అంటే మరీ మంచిదని అంటారు. పుస్తకం చదవడం అంటే అందులో వ్రాసి ఉన్న విషయంతో మనసు కాసేపు ప్రశాంతతో ప్రయాణం చేయడమే అవుతుందని అంటారు.
మనకు పుస్తకములు విశిష్టమైన విషయములను మనసుకు తెలియజేస్తాయి. చదివే పుస్తకంలోని విషయసారమును మనసులోకి చేరుస్తాయి. కొన్ని మనోవికాసం పుస్తకాలుమననుసు మందు వంటివి అంటారు. ఎలాంటి పుస్తక పఠనం ఉంటే, అలాంటి భావన పెరుగుతుంది.
భక్తిపుస్తకాలు చదవడం అలవాటు అయితే, మనసు భక్తి భావనతో ఉంటుంది. కాసేపు ఏదైనా ఒక భక్తి పుస్తకం చదువుతూ ఉంటే, మనసు కాసేపు ఏకాగ్రతతో ఆ దైవంపై భక్తిభావంతో ఉంటుంది…
మనోవిజ్ఙానం కలిగిన పుస్తకాలు మనసులో వికాసమును తీసుకువస్తాయి. తెలుగు సాహిత్యంలో గల విశిష్టమైన పుస్తకాలు విశిష్టమైన ఫలితాలనే అందిస్తాయి.. అయితే దృష్టి సారించడమే కష్టం అంటారు. మనసుపై మనసే యుద్ధం చేయాలంటే మనసు ఎందుకు సిద్దపడుతుందని కూడా అంటారు.
పుస్తకం మనసును ఒక విషయంపై దృష్టి పెట్టేలాగా చేస్తుంది. పుస్తకంలో ఉండే ప్రధాన లక్షణం ఇదే… ఈ లక్షణం వలన మన మనసు ఏకాగ్రత పెరుగుతుంది.
ఏదైనా ఒక పుస్తకం చదువున్నంతసేపూ మనసు ఆ పుస్తకంలోని అంశంతో మమేకమై ఆలోచనలను కొనసాగిస్తుంది. అలా ఒక విషయంపై విచారణ మనసుకు అలవాటు పడుతుంది.
విజ్ఙానంతో కూడిన పుస్తకాలు విషయములపై వివరణలు, విధానములను తెలియజేస్తాయి. అలాగే మనో విజ్ఙానంతో కూడిన పుస్తకాలు మనసు గురించిన స్వభావమును, మనసు తీరు తెలియజేస్తాయి.
ఇటువంటి మనోవిజ్ఙానమయ పుస్తకాలు రీడ్ చేయడం వలన మనసుకు మనసుతోనే చెలిమి ఏర్పడుతుందని అంటారు.
ఎక్కడ ఏది ఉందో చూసి తెలుసుకుంటాం. ఎక్కడ ఏది వినబడుతుందో విని తెలుసుకుంటాం. ఎక్కడ ఎలాంటి వస్తువు ఉందో తాకి తెలుసుకుంటాం…
కానీ చూడడం,వినడం, తాకడం తదితర విషయాలను తెలుసుకునే మనసు మాత్రం కనబడదు. చిత్రమైన మనసు విచిత్రమైన మనసుకు మనసే మిత్రుడు అవుతుంది. కొన్నిసార్లు శత్రువు కూడా అవుతుందని అంటారు.
ఇలాంటి మనసును కట్టడి చేయాలంటే, మనోమయవికాస పుస్తకాలు రీడ్ చేయాలి….
గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం కారు వేగానికి బ్రేకులు వేసినట్టయ్యింది. ఆశించిన ఫలితాలు అంటే టిఆర్ఎస్ కన్నా బిజెపినే సాధించినట్టయ్యింది.
గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది. కమలనాధులు చేసిన ప్రచారం గ్రేటరు ఓటరులో మార్పును తెచ్చింది.
గతంలో గ్రేటరు తీర్పు అధికార పార్టీ కారుకు సూపర్ ఫాస్ట్ అందించింది. ఇప్పుడు కారు ఫాస్ట్ వెళ్లింది. కానీ కమలం వికసించింది.
దూసుకొచ్చిన కారుకు వికసించిన కమలం, కారుతో సమానంగా కనబడుతుంది.
నిన్న శుక్రవారం జరిగిన గ్రేటర్ ఎలక్షన్ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ 56 సీట్లు కైవసం గెలుచుకుంటే, దాదాపు దగ్గరగానే వచ్చి 8సీట్ల దూరంలో బీజేపీ 48 గెలుచుకుంది. ఎంఐఎం 44 డివిజన్లను గెలుచుకొన్నాయి. కాంగ్రెస్ రెండు డివిజన్లు గెలుచుకుంది.
2016లో అత్యదిక స్థానాలు గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ, 2020లో మాత్రం సీట్లను తగ్గించుకుంది. అయినా ఎక్కువ సీట్లు గెలచుకున్న పార్టీగా గ్రేటరులో నిలబడింది.
దేనికైనా కాలం కొంతకాలం అనుకూలంగా ఉంటే కొంతకాలం ప్రతికూలంగా ఉంటుంది. ఒక్కోసారి మద్యమ ఫలితాలను తలబొప్పికడుతుంటుంది.
ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టి లేదు. కారు వేగంగా పరిగెత్తితే, కమలంకూడా దీటుగా వికసించింది. 150 స్థానాలు గల గ్రేటర్ మేయర్ పీఠానికి కావాల్సిన సంఖ్యా బలం 102.
రాజకీయాలలో అయితే ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ సారి గ్రేటరులో గ్రేట్ రిజల్ట్స్ హంగ్ ఏర్పడే విధంగా వచ్చాయి.
గ్రేటరులో మేయర్ పీఠం ఎవరికి?
ఆ బలం ఏపార్టీకి లేకపోవడంతో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. టీఆర్ఎస్‌కు ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు వచ్చిన సీట్లతో వాటిని కలుపుకుంటే ఆ పార్టీ బలం మేయర్ పీఠం దక్కించుకోవడానిక సరిపోదు.
గ్రేటర్ మేయర్ పీఠం కావాలంటే, మరొక పార్టీ మద్దతు కావాలి. టిఆర్ఎస్ కాకుండా మరొక పార్టీ మజ్లిస్ ఉంది. బిజెపి ఉంది. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కలిసే అవకాశాలు ఎవరూ ఊహించలేరు కూడా…. గ్రేటర్ ఎన్నికలలో పోటిపడ్డ ప్రధాన పార్టీలుగా బిజెపి-టిఆర్ఎస్ ఉన్నాయి.
కాబట్టి అవి కలిసే అవకాశం కన్నా మజ్లిస్, టిఆర్ఎస్ పార్టీలపైనే అందరి దృష్టి. ఈ రెండు కలిస్తే మేయర్ పీఠం ఒకపార్టీకి దక్కుతుంది. అయితే ఎవరు పీఠంపై కూర్చుంటారు? ఇదే ప్రశ్న. కానీ టిఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీతో కలిసి మేయర్ పదవిని పంచుకుంటే, అది బిజెపికి బలమైన ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది.
గ్రేటర్ పరిధిలో జరిగిన ఎలక్షన్ హోరెత్తిస్తే, ఇప్పుడు పరిణమాలు మరింత ఆసక్తికరమైనవిగా మారాయి. ఇప్పుడు టిఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.
బిజెపి ఎన్నికల వ్యూహంలో విజయవంతం అయ్యింది. ఇప్పుడు ఎటువంటి వ్యూహం కలిగి ఉంటుందో చూడాలి.
ఉచితంగా ఎలాంటి యాడ్స్ లేకుండా చదువుకోవాలంటే భక్తి స్త్రోత్రములు, అన్నమయ్య సంకీర్తనలు, భగవద్గీత శ్లోకాలు తెలుగులో చదువుకోవాలంటే భక్తిగంగ తెలుగు భక్తి స్త్రోత్రములు యాప్ గూగుల్ ప్లేస్టోర్ లో లభిస్తుంది.
గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి అనుకూలం అంటే ప్రారంభంలో బిజెపి ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టిఆర్ఎస్ కంటే బిజెపి ఆదిక్యంలో ఉండడం విశేషం.
గ్రేటరు ఎన్నికలలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ పోలింగ్ శాతం 50 శాతం లోపే… ప్రధాన పోటీ నెలగొన్న పార్టీలు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు… ఈ రెండు పార్టీలలో గెలుపెవరిది? గ్రేటరులో గ్రేటెస్ట్ గెలుపు ?
అయితే కొందరంటారు. పోస్టల్ బ్యాలెట్ ఆదిక్యం అంతగా పట్టింపుకాదు అని….
మరికొందరంటారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు, ప్రజల ఓట్లే…. సాదారణ ప్రజల ట్రెండ్స్ కూడా ఇలానే ఉండవచ్చు. ప్రజల ఆలోచన అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఉంది… ఆ ట్రెండ్సే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ ఉందనే వాదన వస్తుంది.
ఏది ఏమైనా గ్రేటర్ లో బిజెపి గ్రేటుగానే ప్రారంభించింది… ఆరంభమైన లెక్కింపు ముగింపుకొచ్చే సమయానికి ఏ పార్టీ స్థితి ఎలా ఉంటుందో…? చూడాలి.
మీకు బాగా విద్యార్ధులకు బాగా బోధించడం వచ్చును. మీరు ఆన్ ట్యూటర్ గా ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయడానికి ప్రయత్నించవచ్చును. మీకు ఒక టెక్నికల్ వస్తువు గురించి బాగా వివరించడం వచ్చును. మీరు ఒక రివ్యూ అడ్వైజరుగా డబ్బును సంపాదించవచ్చును.
మీకు అందమైన డిజైన్ చేయడం వచ్చును. మీరు ఒక డిజైనర్ గా డబ్బు సంపాదించవచ్చును. ఇక ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ స్కిల్స్ ఉంటే, ఆన్ లైన్లో తేలికగా డబ్బు సంపాదించవచ్చును. అయితే మీకు వచ్చిన విషయం ఆన్ లైన్లో డిమాండ్ ఉండి ఉండాలి. పోటీ ఉన్న అంశంలో అయితే బాగా కష్టపడాలి.
అయితే ఆన్ లైన్ డబ్బు సంపాదన అనగానే ఆన్ లైన్ మోసాలు మొదట గుర్తుకు వస్తుంటాయి. కొన్ని వెబ్ సైట్లలో చైన్ లింకింగ్ స్కీములు యూజర్లను ఆకర్షిస్తాయి. వాటిలో ముందుగా కొంత డబ్బు జమచేస్తే, వారి తరపున మరికొంతమంది యాడ్ చేయడం… వారి కింద ఇంకొంత మంది ఇలా లింకింగ్ సిస్టం ఉంటుంది.
ఒక యూజర్ వేయిరూపాయిలు కట్టి, ఏదైనా ఒక వెబ్ సైటులో జాయిన్ అయితే, అతని తరపున కొందరిని యాడ్ చేయడం… వారితో మాట్లాడి డబ్బులు పే చేయిండం… అలా ఒకరి నుండి మరొకరి కమ్యూనికేషన్ ఏర్పడి ప్రతి ఒక్కరూ జాయినింగ్ ఫీజు లేదా ఏక్టివేషన్ ఫీజు అంటూ నిర్ధిష్టమైన మొత్తము సంస్థకు పే చేస్తూ ఉంటారు.
ఆశతో జాయిన్ అయ్యేవారికి చాలామందికి నిరాశ ఎదురౌతుంది. కేవలం వేయి రూపాయిలు పే చేయండి, నెల నెల వేలల్లో డబ్బు సంపాదించండి. అంటూ ప్రకటనలు ఉంటాయి. అవి ఆకట్టుకోవడానికే ఉంటాయి. వీటిని చూసి మోసపోవడం ఉంటుంది.
ఇంకా కొన్ని తరహా వెబ్ సైట్లు అయితే వీడియో వాచ్ చేయండి…. డబ్బు సంపాదించండి. లేక యాడ్స్ క్లిక్ చేయండి….డబ్బుసంపాదించండి. లేక గేమ్స్ ఆడండి…డబ్బు సంపాదించండి. షేర్ చేయండి…డబ్బు సంపాదించండి… ఇలా చాలా తరహా ఉంటాయి. వీటిలో మొదటిగా జాయిన్ అయినవారికి కొంత ప్రయోజనం ఉండవచ్చేమో కానీ ప్రతిఒక్కరికి ప్రయోజనం కలగదు.
ఇలాగే మనీ ఎక్సేంజ్ అంటే ఒక కరెన్సీలో డబ్బును జమ చేసే, ఆ కరెన్సీ రేటు మారగానే అమ్మేయడం. పదివేలకు డాలర్లు తక్కువ రేటులో కొని, డాలరు రేటు ఎక్కువకు పెరగగానే అమ్మేయడం. ఇటువంటి వెబ్ సైట్లలో కొన్ని సంస్థలవారు ఫేక్ ఇండెక్స్ చూపించి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది.
కష్టపడకుండా సొమ్ములు కూడబెట్టలేము.
కష్టం లేకుండా ఇష్టం తీరే అవకాశం ఉండదు. కష్టపడకుండా సొమ్ములు కూడబెట్టలేము. ఊహలకే పరిమితం అవుతుంది. కేవలం ఊహలు ఒక అంచనా కొరకే కానీ సంపాదించడానికి కాదు.
అయితే ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయాలంటే ఎటువంటి వెబ్ సైట్లను దర్శించాలి. ఎటువంటి వెబ్ సైట్లలో నిజంగా డబ్బును సంపాదించవచ్చును. ఎటువంటి వెబ్ సైట్ల వారు డబ్బును ఖచ్చితంగా పే చేస్తారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఇంటర్నెట్ ఉపయోగిస్తూ, ఆన్ లైన్లో డబ్బు సంపాదించడానికి ముందుగా కావాల్సింది… విద్య. మన దగ్గర ఎటువంటి విద్య ఉంది? ఆ విద్యకు ఆన్ లైన్లో ఉన్న డిమాండ్ ఏమిటి? ఇది ఖచ్చితంగా తెలుసుకుంటే డబ్బును సంపాదించడానికి ఆన్ లైన్ వే కరక్టుగానే ఉంటుంది.
మీకు వచ్చిన విద్య ద్వారా మీరు ఆన్ లైన్ వర్కరుగా మారాలంటే మాత్రం ఫ్రీలాన్స్ వెబ్ సైట్లు ఉపయోగపడతాయి. కొన్ని డిమాండ్ ఉన్న వెబ్ సైట్ల ద్వారా మీరు ఖాతాను ప్రారంభించి ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించవచ్చును. అప్ వర్క్, గురు, ఫివర్, ఫ్రీలాన్సర్, ట్రూలాన్సర్, ఎస్ఇఓ క్లర్క్స్, ఇలా పలు రకాల వెబ్ సైట్ల ద్వారా ఆన్ లైన్లో డబ్బును సంపాదించవచ్చును.
మీరు ప్రొఫైల్లో చేర్చిన వివరణ కన్నా మిన్నగా మీ వర్కు ఉంటే, మీ ప్రొఫైల్ పై 100% మంచి అభిప్రాయం ఉంటుంది.
ఈ ఫ్రీలాన్స్ వెబ్ సైట్లలో మీకు వచ్చిన వర్కును గురించి వివరణ ఖచ్చితంగా ఉండాలి. మీరు ప్రొఫైల్లో చేర్చిన వివరణ కన్నా మిన్నగా మీ వర్కు ఉంటే, మీ ప్రొఫైల్ పై 100% మంచి అభిప్రాయం ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయితే మీకు తెలిసిన విషయం గురించి వివరంగా వ్రాయండి. మీకు గతంలో పనిచేసిన ప్రొజెక్టులు ఏవైనా ఉంటే, వాటి గురించి తెలియజేయండి. మీ ప్రొఫైల్ ఆకర్షించినట్టే, మీ వర్కు కూడా కస్టమర్ ని సంతృప్తిపరిస్తే, మీ ప్రొఫైల్ కు డిమాండ్ పెరుగుతుంది.
కొన్ని ఫ్రీలాన్స్ వర్కులను అందించే వెబ్ సైట్ల లింకులు ఈ క్రిందగా ఉన్నాయి….
ఏదైనీ ఒక సంస్థ ద్వారా ఆన్ లైన్లో డబ్బు సంపాదించాలంటే ఫ్రీలాన్సర్ గా పని చేస్తూ ఉంటారు. పైన బటన్ల రూపంలో ఉన్న లింకులు ఫ్రీలాన్స్ వర్కులను తెలియజేస్తాయి.
ఇక తమకు తామే ఓనరుగా డబ్బు సంపాదించాలంటే ఆన్ లైన్లో ఎలా? ఇందుకోసం చాలామంది ఎన్నుకునే మార్గములలో ప్రధానంగా ఒకటి యూట్యూబ్ చానల్, రెండు బ్లాగింగ్ చేయడం ఉంటుంది. ఈ రెండు మార్గములు జన్యూన్ గానే డబ్బులు వస్తాయి.
ప్రారంభంలో వీడియోలను పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. మీరు పోస్టు చేసిన వీడియో ఆన్ లైన్ యూజర్లకు నచ్చి, వాటి వ్యూస్ పెరిగి, మీకు సబ్ స్కైబర్స్ పెరిగితే…
కానీ ప్రారంభంలో కేవలం కంటెంటును అందిస్తూ ఉండడమే ఉంటుంది. అంటే మీరు యూట్యూబ్ చానల్ ప్రారంభింస్తే, అందులో మీరు ప్రారంభంలో వీడియోలను పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. మీరు పోస్టు చేసిన వీడియో ఆన్ లైన్ యూజర్లకు నచ్చి, వాటి వ్యూస్ పెరిగి, మీకు సబ్ స్కైబర్స్ పెరిగితే… మీకు ఆదాయం రావడం ప్రారంభం అవుతుంది.
యూట్యూబ్ చానల్ సౌలభ్యం ఏమిటంటే, టెక్నికల్ స్కిల్స్ అంతగా లేకపోయినా ట్రెండింగ్ సబ్జెక్టు ద్వారా చానల్ సక్సెస్ చేయవచ్చును. చిట్కాలు, వింతలు, ట్రావెలింగ్ విషయాలు ఇలా చాలా విషయాలలో విభిన్నంగా విపులంగా విశ్లేషణాత్మక వీడియోల ద్వారా యూట్యూబ్చానల్ విజయవంతం చేయవచ్చును.
ఆన్ లైన్ డబ్బు సంపాదన
యూట్యూబ్ చానల్ ద్వారా డబ్బు సంపాదించాలనే వారికి, యూట్యూబ్ చానల్ వారి రూల్స్ కూడా బాగా తెలియాలి. అప్పుడప్పుడు యూట్యూబ్ చానల్ రూల్స్ మారుతూ ఉంటాయి. మినిమన్ వ్యూస్, మినిమమ్ సబ్ స్క్రైబర్స్ అంటూ నిబంధనలు జోడిస్తూ ఉంటారు.
అలాగే బ్లాగును ప్రారంభించినా… ఆబ్లాగుకు యూనిక్ విజిటర్స్, రిపిటెడ్ విజిటర్స్ ఉంటే మీకు ఆదాయం వస్తుంది. బ్లాగు కూడా యూట్యూబ్ చానల్ లాగానే కంటెంటు ఎంపిక ఉంటుంది. అయితే యూట్యూబ్ చానల్ ద్వారా వీడియోల రూపంలో తెలియజేస్తే, బ్లాగు ద్వారా మాత్రం పోస్టుల రూపంలో విషయ విశదీకరణ ఉంటుంది.
ఒక అంశంలో బ్లాగును సృష్టిస్తే ఆ అంశముపై వివరణా విపులంగా విస్తారంగా ఉండాలి.
ఏదేని ఒక అంశంలో బ్లాగును సృష్టిస్తే ఆ అంశముపై వివరణా విపులంగా విస్తారంగా ఉండాలి. ఇక రీడర్ రీడ్ చేయడానికి ఈజీగా ఉండాలి. ప్రధానంగా కంటెంటు డూప్లికేట్ అయ్యి ఉండకూడదు.
అయితే ఈ బ్లాగింగ్ చేయడం కూడా చాలా సులభమనే చెబుతారు. గూగుల్ అందించే బ్లాగర్ వెబ్ సైటు ద్వారా కేవలం ఒక్క జిమెయిల్ ఖాతాతో బ్లాగును నిమిషాలలో క్రియేట్ చేయవచ్చును. వెను వెంటనే మీకు తెలిసిన విద్యలో ఆర్టికల్స్ పోస్టు చేయవచ్చును.
గూగుల్ అందించే బ్లాగర్ ద్వారా ఉచితంగానే ఒక బ్లాగును సృష్టించవచ్చును. ఇంకా వెబ్ స్పేస్ ఉచితంగానే లభిస్తుంది. అయితే డొమైన్ విషయంలో మాత్రం మీరు కొంత సొమ్మును ఖర్చు చేయాలి. డొమైన్ విషయంలో పట్టింపు లేకపోతే, గూగుల్ బ్లాగర్ సూచించే ఏదేని ఒక సబ్ డొమైన్ ద్వారా గూగుల్ బ్లాగును సృష్టించేయవచ్చును.
బ్లాగర్ ద్వారా సృష్టించబడిన మీ బ్లాగుకు మీరు ఎప్పటికప్పుడు రెగ్యులరుగా ఆర్టికల్స్ పోస్టు చేస్తూ ఉండాలి. మీ బ్లాగుకు తగినంత ట్రాఫిక్ క్రియేట్ అయ్యాకా మీరు గూగుల్ యాడ్స్ అప్లై చేయవచ్చును. గూగుల్ యాడ్స్ అప్రూవ్ అయితే, మీ బ్లాగు ద్వారా మీకు ఆదాయం ప్రారంభం అవుతుంది.
ఆదాయం రావడం అనేది మీరు ఎంపిక చేసుకున్న కంటెంటును బట్టి ఉంటుంది.
ఏదైనా గూగుల్ ద్వారా రుపాయి ఖర్చులేకుండా డబ్బును బ్లాగను మెయింటైన్ చేయడం ద్వారా సంపాదించవచ్చును. అయితే ఈ విధానం ఆదాయం రావడం అనేది మీరు ఎంపిక చేసుకున్న కంటెంటును బట్టి ఉంటుంది.
https://www.youtube.com/watch?v=YlipwOUEBJ4
ఆన్ లైన్ డబ్బు సంపాదన
మీరు సృష్టించిన బ్లాగు మంచి ట్రాఫిక్ బాగుండి గూగుల్ యాడ్స్ అప్లై చేస్తే, యాడ్ సెన్స్ అప్రూవల్ త్వరగానే వస్తుంది.
మీకు కొంత టెక్నాలజీపై అవగాహన ఉండి, బ్రౌజింగ్ వంటి విషయాలలో పట్టు ఉంటే, వర్డ్ ప్రెస్ ద్వారా కూడా ఒక బ్లాగును సృష్టించవచ్చును. వర్డు ప్రెస్ ద్వారా మీరు బ్లాగు ఆర్టికల్స్ పోస్టు చేసి డబ్బులు సంపాదించవచ్చును. వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ లుక్ ప్రొఫెషన్ వెబ్ సైటు లుక్ ఉంటుంది.
ఆన్ లైన్ డబ్బు సంపాదన
వర్డు ప్రెస్ వెబ్ సైటులో గూగుల్ యాడ్ సెన్స్ యాడ్ చేయడం సులభమే అంటారు. అయితే యాడ్స్ అప్రూవ్ అవ్వడానికి తగినంత కంటెంట్ మీ వర్డు ప్రెస్ బ్లాగులో ఉండాలి. అలాగే వర్డు ప్రెస్ బ్లాగులో పేజిలు కూడా ఖాళీ లేకుండా ఉండాలి.
బ్లాగు కంటెంట్ విషయంలో ఏవిధమైన టాపిక్ అయితే బాగుంటుంది. ఇదే ఇంపార్టెంట్ మీ బ్లాగు కానీ యూట్యూబ్ చానల్ కానీ సగం విజయం టాపిక్ ఎంచుకోవడంలో ఉంటే, ఆటాఫిక్ పై మీరు కంటిన్యూగా అందించే కంటెంట్ తో మిగితాది ఉంటుంది.
ఆన్ లైన్ డబ్బు సంపాదన పాపులర్ బ్లాగు కంటెంట్ అంశాలు
న్యూస్
సినిమా న్యూస్
క్రీడలు న్యూస్
టెక్నాలజీ ఆర్టికల్స్
రివ్యూస్ అండ్ కంపారిజన్
ట్యుటోరియల్
టిప్స్ అండ్ ట్రిక్స్
వంటిల్లు
రుచులు
స్టార్టప్ ఐడియాస్
పిల్లలు శ్రద్ద
ఫోన్ రేడియేషన్
బుక్స్
ఫ్యాషన్
బయోగ్రఫీ ఆఫ్ లెజండ్స్
ఆన్ లైన్ మనీ ఎర్నింగ్
బిజినెస్ ఐడియాస్
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్
ఎక్కౌంటింగ్
సాఫ్ట్ వేర్ యూజ్
డవలపింగ్ టూల్స్ గురించి
టూర్స్ అండ్ ట్రావెల్స్
టెంపుల్స్
ఆస్ట్రాలజీ
డైలీ టిప్స్
జాబ్ న్యూస్
డిజిటల్ మార్కెటింగ్
ఓటిటి సినిమా రివ్యూస్
వివిధ చానల్ సీరియల్స్ గురించి
షేర్ మార్కెట్
ఇంటర్నెట్ బ్యాంకింగ్
ఇలా ఎప్పటికప్పుడు మారే ఆన్ లైన్ ట్రెండింగ్స్ ఫాలో అవుతూ ఉంటే, మనకు మంచి కంటెంట్ లభిస్తుంది. మనకు మంచి అవగాహన ఉన్న అంశంలో ఇప్పటికే చానల్ కానీ బ్లాగు కానీ ఉన్నా, మనం బ్లాగును కానీ చానల్ కానీ ప్రారంభం చేయవచ్చును.
ఎప్పుడూ ఒకే ట్రెండు ఎక్కువకాలం కొనసాగదు. అలాగే ఎప్పుడూ ఒకరి ట్రెండు కొనసాగదు. కాబట్టి మన స్టైల్ ఎక్కువమందికి నచ్చితే మనం విజయం సాధించవచ్చును. అయితే మనకు తెలిసిన విషయంలో మనకు ఇతరుల కన్నా ఎక్కువ విషయం తెలిసి ఉండాలి. వారికన్నా బాగుగా మనం కంటెంటును తెలియజేయాలి.
నాణ్యమైన పనియొక్క ఫలితం నిష్ప్రయోజనం కాదు.
ఆన్ లైన్ డబ్బు సంపాదనకు మార్గాలు అనేకం ఉంటాయి. అందులో ముఖ్యంగా తేలికైనవి కష్టపడితే ఫలితం ఉండేవి మాత్రం…. యూట్యూబ్ చానల్ మరియు బ్లాగింగ్…
ఎప్పటికప్పుడు మారే సామాజిక సాంకేతిక కాలంలో మనం ఎంచుకునే మార్గం కూడా అలానే ఉంటుంది. ఏదైనా చేతిపని అయితే దానికి కొంతకాలం పాటు మార్పులేకుండా ఆదాయం డిమాండ్ ను బట్టి ఉంటుంది. అయితే ఆన్ లైన్లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై దృష్టి పెడుతూ, పాత విషయాలలో జరిగిన లాభనష్టాలను విశ్లేషిస్తూ, సాగితే ఆన్ లైన్ ద్వారా బ్లాగింగ్ మరియు యూట్యూబ్ చానల్ విజయవంతం చేయవచ్చును.
గూగుల్ సంబంధించిన ఉత్పత్తులతో బ్లాగింగ్ నిర్వహించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ ఉండాలి. లేకపోతే బ్లాగ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.
మీకు కోడింగ్ నాలెడ్జ్ కొంచె ఉంటే మాత్రం వర్డుప్రెస్ ఒక హోస్టింగ్ ఖాతా ద్వారా మెయింటైన్ చేయడం వలన బ్లాగుపై అంతగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక్కసారి వర్డ్ ప్రెస్ మీరు ఎంపిక చేసుకున్న డొమైన్ పై ఇన్ స్టాల్ చేసుకుంటే, ఆపై మీరు వర్డ్ ప్రెస్ లో లాగన్ బ్లాగు పోస్టులు కంటిన్యూ పోస్ట్ చేయవచ్చును.
కంట్రోల్ ప్యానెల్ గురించి తెలుసుకుంటే, మీకు మీరు కంట్రోల్ ప్యానెల్ ద్వారా వర్డ్ ప్రెస్ ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో ఏదైనా యూట్యూబ్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చును.