Category Archives: vyapari vyaparam gurinchi

vyapari vyaparam gurinchi సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్ స్వయం ఉపాధి అంటే ఏమిటి?

సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు

సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు తెలుగు. సొంతంగా నిర్వహించు వ్యాపారమును సొంత వ్యాపారం అంటారు. అంటే ఒక వ్యక్తి తానే తన దగ్గర ఉన్న ధనంతో వ్యాపారం చేస్తూ, అందులో లాభనష్టాలకు తానే పూర్తి బాధ్యత వహిస్తూ చేసే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటారు.

“సొంత వ్యాపారం” అనేది సాధారణంగా ఒక పెద్ద సంస్థ లేదా సంస్థ యాజమాన్యంలో కాకుండా ఒక వ్యక్తి యాజమాన్యంలోని మరియు నిర్వహించబడే వ్యాపారాన్ని సూచిస్తుంది. ఇది విజయం లేదా వైఫల్యానికి పూర్తిగా బాధ్యత వహించే వ్యక్తి ద్వారా ప్రారంభించబడిన, నిర్వహించబడే మరియు నియంత్రించబడే వ్యాపారం. ఈ రకమైన వ్యాపారం చిన్న, స్థానిక సంస్థ నుండి పెద్ద, బహుళజాతి కంపెనీ వరకు ఉంటుంది.

సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు

వ్యక్తి నిర్వహిస్తున్న వ్యాపారంలో ఇతరులు భాగస్వాములుగా ఉంటే, దానిని సొంత వ్యాపారంగా పరిగణించరు. అటువంటి వ్యాపారమును భాగస్వామ్య వ్యాపారముగా చెబుతారు. ఇందులో లాభనష్టాలు ఇతరులకు కూడా వర్తిస్తాయి.

ఒకే వ్యక్తి అధీనంలో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి ఇతరులు రుణదాతలు ఉండవచ్చును. కానీ వ్యాపారంలో వచ్చే లాభనష్టములకు, వ్యాపారమునకు రుణమునిచ్చినవారికి సంబంధము ఉండదు. కేవలం వారు రుణమును ఇచ్చి, మరలా తిరిగి వసూలు చేసుకోవడం వరకే పరిమితం అవుతారు.

వ్యాపారంలో రుణదాతలు, రుణగ్రహీతలు కూడా ఉంటారు. వారు కేవలం లావాదేవీల వరకే పరిమితం కానీ లాభనష్టములతో పనిలేదు.

ఇలా ఒక స్థలంలో ఎక్కువమందికి అవసరం ఉన్న వస్తుసేవలను అందిస్తూ లాభాలను అర్జించే ప్రక్రియలో పూర్తిస్తాయి బాద్యతను స్వీకరించడానికి, లేదా నష్టమును మూటగట్టుకోవడానికి సిద్దపడి చేసే వ్యాపారమును సొంత వ్యాపారం అంటారు. ఇందుకు నిర్ధిష్ట సమయంలో తగు వడ్డీతో తిరిగి చెల్లించే విధానంలో రుణములను కూడా గ్రహిస్తారు.

తక్కువ పెట్టుబడి వ్యాపారాలు – వ్యాపార ఆలోచనలు

సొంత వ్యాపారం చేయడానికి తక్కువ పెట్టుబడి వ్యాపారాలు ఈ క్రింది విధంగా కొన్నింటిని సాదారణంగా చెబుతారు.

  1. Food delivery service
  2. Online tutoring
  3. Social media management
  4. Affiliate marketing
  5. E-commerce store
  6. Dropshipping business
  7. Content writing
  8. Graphic design
  9. Home-based bakery
  10. Event planning
  11. Pet care services
  12. Personal shopping and styling
  13. Personal fitness trainer
  14. Home cleaning services
  15. Car washing services

ఆహార పంపిణీ సేవ
ఆన్‌లైన్ ట్యూటరింగ్
సోషల్ మీడియా నిర్వహణ
అనుబంధ మార్కెటింగ్
ఇ-కామర్స్ స్టోర్
డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారం
కంటెంట్ రైటింగ్
గ్రాఫిక్ డిజైన్
గృహ ఆధారిత బేకరీ
పండుగ జరుపుటకు ప్రణాళిక
పెంపుడు జంతువుల సంరక్షణ సేవలు
వ్యక్తిగత షాపింగ్ మరియు స్టైలింగ్
వ్యక్తిగత ఫిట్‌నెస్ శిక్షకుడు
ఇంటి శుభ్రపరిచే సేవలు
కార్ వాషింగ్ సేవలు

సాదారణంగా చెప్పబడే వ్యాపారాలు తెలిసినవే ఉంటాయి.

వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి? వ్యాపారం మొదలు పెట్టేముందు చేయవలసిన పరిశీలనలు.

చిన్న వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, ఈ క్రింది పరిశీలనలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం:

మార్కెట్ పరిశోధన: ఉన్న మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపారం ఏమిటి? ఎటువంటి అవసరాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నిర్వహణలో ఉన్న వ్యాపారంలో ఉన్న లోటుపాట్లు చూడాలి. ఎటువంటి మార్పులు వలన మార్కెట్లో నిలదొక్కుకునే అవకాశం ఉందో సరిచూసుకోవాలి.

వ్యాపార ప్రణాళిక: ప్రారంభించే వ్యాపారానికి సరైన ప్రణాలిక ఉండాలి. ప్రణాళిక లేని పనుల ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. వ్యూహం ఉండాలి. ఎటువంటి వ్యూహం అయితే మార్కెట్లో పోటీని తట్టుకుని వ్యాపారం నిలబడుతుందో? చూసుకుని వ్యూహ రచన చేయాలి.

చట్టపరమైన పరిగణనలు: మీ వ్యాపారాన్ని నమోదు చేయడం, అవసరమైన లైసెన్స్‌లు మరియు అనుమతులు పొందడం మరియు పన్ను చట్టాలను అనుసరించడం వంటి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు నిర్వహించడం కోసం చట్టపరమైన అవసరాలు తెలుసుకోవాలి. అవసరమైన అనుమతులు పొందడం శ్రేయష్కరం.

ఫైనాన్స్: మీ ప్రారంభ ఖర్చులను నిర్ణయించండి మరియు రుణాలు, గ్రాంట్లు లేదా వ్యక్తిగత పొదుపు వంటి నిధుల ఎంపికలను పరిగణించండి. అంచనా వేసిన ఆదాయం, ఖర్చులు మరియు లాభాలతో కూడిన ఆర్థిక ప్రణాళికను అభివృద్ధి చేయండి.

లొకేషన్: మీ బిజినెస్ కోసం మీ టార్గెట్ మార్కెట్‌కి అందుబాటులో ఉండే మరియు మీకు అనుకూలమైన స్థానాన్ని ఎంచుకోండి. సగం వ్యాపారం విజయవంతం కావాడానికి కారణం లోకేషన్ ఎంపిక మూలం.

పరికరాలు మరియు సామాగ్రి: వ్యాపార నిర్వహణకు అవసరమైన పరికరాలు, వస్తువులు ముందుగానే సమకూర్చుకోవాలి.

మార్కెటింగ్ : ప్రధానంగా ప్రచారం విషయంలో రాజీపడకూడదు. వ్యాపార ప్రారంభోత్సవం ఎక్కువమందికి తెలిసేవిధంగా ఉండాలి. చేస్తున్న వ్యాపార వస్తువు గురించి అవగాహన వచ్చేవిధంగా ప్రకటనలు ఉండాలి.

ఇలాంటి సాదారణ విషయాలు పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, మీరు మీ చిన్న వ్యాపారం కోసం విజయావకాశాలను పెంచుకోవచ్చు.

భారతదేశంలో గృహ ఆధారిత వ్యాపార ఆలోచనలు

  • స్వతంత్ర రచన
  • ఆన్‌లైన్ ట్యూటరింగ్
  • అనుబంధ మార్కెటింగ్
  • ఇ-కామర్స్ స్టోర్
  • డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారం
  • కంటెంట్ రైటింగ్
  • గ్రాఫిక్ డిజైన్
  • గృహ ఆధారిత బేకరీ
  • ఈవెంట్ ప్లానింగ్ మరియు డెకరేషన్ సేవలు
  • పెంపుడు జంతువుల సంరక్షణ సేవలు
  • వ్యక్తిగత షాపింగ్ మరియు స్టైలింగ్
  • వ్యక్తిగత ఫిట్‌నెస్ శిక్షకుడు
  • ఇంటి శుభ్రపరిచే సేవలు
  • కార్ వాషింగ్ సేవలు
  • హస్తకళలు మరియు చేతివృత్తుల ఉత్పత్తులు
  • డిజిటల్ మార్కెటింగ్
  • సోషల్ మీడియా నిర్వహణ
  • అనువాదం మరియు వివరణ సేవలు
  • వర్చువల్ సహాయం
  • వంట మరియు క్యాటరింగ్ సేవలు

గమనిక: ఇవి సాధారణ ఆలోచనలు మరియు ఖచ్చితమైన అవసరాలు స్థానం, లక్ష్య మార్కెట్ మరియు పోటీ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా వెంచర్‌ను ప్రారంభించే ముందు మార్కెట్ పరిశోధనను నిర్వహించడం మరియు వివరణాత్మక వ్యాపార ప్రణాళికను రూపొందించడం మంచిది.

సొంత వ్యాపారం అంటే ఏమిటి, వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, తక్కువ పెట్టుబడి వ్యాపారాలు, గృహ ఆధారిత వ్యాపార ఆలోచనలు, వ్యాపార ఆలోచనలు తెలుగు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu

స్వయం ఉపాధి అంటే ఏమిటి?

స్వయం ఉపాధి అంటే ఏమిటి, ఒక వ్యక్తి యజమాని కోసం పనిచేయడం కంటే, తానే యజమానిగా ఉండడానికి పనిని కల్పించుకోవడం మరియు పనిని కల్పించడం అంటారు. ప్రధానంగా తను చేస్తున్న పనికి తానే యజమాని ఇంకా ఇతరులు కూడా అతని ఆధ్వర్యంలో పనిని పొందే అవకాశం కూడా ఉంటుంది.

కిరాణా, కూరగాయలు, రైస్ డిపో, స్టీల్ సామానులు, ఫ్యాన్సీ, బుక్స్ అండ్ స్టేషనరీ, మొబైల్ షాపులు, బిల్డింగ్ మెటీరియల్స్, చెప్పులు, బట్టలు, హోమ్ నీడ్స్, హార్డ్ వేర్, సిమెంట్ వంటి తదితర షాపుల ద్వారా వ్యాపార నిర్వహణలు చేస్తూ, తమను తాము పోషించుకుంటూ, వారు మరి కొంతమందికి కూడా ఉపాధి చూపుతూ ఉంటారు. పల్లెల్లో అయితే స్వీయ సంపాధన వరకు పరిమితం అయితే, పట్టణాలలో ఇవే వ్యాపారాలలో ఇతరులకు ఉపాధి ఉంటుంది.

టీ అండ్ టిఫిన్స్, బ్యాకరీ, భోజన హోటల్స్, జిరాక్స్, కొరియర్, మొబైల్ రిపేర్, టివి రిపేరు, బైక్ రిపేరు, కార్ రిపేరు, కంప్యూటర్ రిపేరు ఇలా వచ్చిన చేతి పని ఆధారంగా కూడా తమను తాము పోషించుకుంటూ స్వయం ఉపాధిలో జీవన చేసేవారు మనదేశంలో అనేకమంది ఉంటారు.

స్వయం ఉపాధికి అనేక అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా వ్యవసాయం, తయారీ మరియు సేవల రంగాలలో. అయినప్పటికీ, క్రెడిట్‌కు ప్రాప్యత లేకపోవడం, మార్కెట్‌లకు పరిమిత ప్రాప్యత మరియు వ్యాపార విద్య మరియు శిక్షణ లేకపోవడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి.

స్వయం ఉపాధికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా స్వయం ఉపాధితో జీవించేవారి సమయం వారి చేతుల్లోనే ఉంటుంది. సంపాధన చక్కగా ఉంటుంటే, సమయం వృధా అయ్యే అవకాశం తక్కువ.

ఒకరి కింద పనిచేయవలసిన ఆగత్యం ఉండదు. తనకు తానే యజమాని.

ఆదాయానికి పరిమితులు అంటూ ఉండవు. వ్యక్తి తెలివితేటలు, మార్కెట్ పరిధి, డిమాంట్ వంటి విషయాల ఆధారంగా ఆదాయం బాగా పెంచుకోవచ్చును.

ఉద్యోగం చేయవలసని పని ఉండదు. తానే ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చును.

స్వయం ఉపాధి చేసుకునేవారు కాలం వృధా చేయరు. తమ కాలాన్ని ధనంగా మార్చుతారు. అందువలన వారికి ఆదాయం, వారితో కూడి పనిచేసేవారికి ఆదాయం, ప్రభుత్వానికి పన్నుల రూపంలోనూ ఆదాయం. కాబట్టి సంపాధన బాగా వచ్చే స్వయం ఉపాధి వలన ఆర్దికాభివృద్ది నలుదిశలా జరుగుతుందని అంటారు.

ప్రభుత్వ మద్దతు: వ్యవస్థాపకులకు శిక్షణ మరియు ఆర్థిక సహాయం అందించడం మరియు చిన్న వ్యాపారాలకు క్రెడిట్ యాక్సెస్‌ను పెంచడం వంటి స్వయం ఉపాధికి మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసింది.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా తస్మాత్ జాగ్రత్త. దాచుకున్న డబ్బు దోపిడికి గురైతే అది చాలా బాధాకరం. అలా కాకుండా దాచుకున్న డబ్బుని, దోచుకోబోయే చోట భద్రపరిస్తే అది మరింత బాధాకరం. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాము. తెలిసికూడా ఇలాంటి పనులు చేసి, తమ డబ్బుని కోల్పోయేవారు ఉంటారు.

అదేంటి దోచుకోబోయే చోటులు కూడా ఉన్నాయా?

అంటే అలా బోర్డు పెట్టి ఉంటే, అక్కడ డబ్బు ఎవరు దాయరు. కానీ అలాంటి అవకాశానికి ఆస్కారం ఉండవచ్చును.

ఇప్పుడు బ్యాంకులో డబ్బు దాచుకుంటే, ఆ డబ్బు బాద్యత ఆ బ్యాంకుదే. కాబట్టి బ్యాంక్ డిపాజిట్లు రూపంలో డబ్బులు దాచుకోవడం సురక్షితమేనని అంటారు.

షేర్ మార్కెట్…. ఇక్కడే దాచుకుంటున్న డబ్బులు పెరగవచ్చును… ఆవిరికావచ్చును.

కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టి, ఎటువంటి నిర్వాహక కార్యక్రమాలు లేకుండా డబ్బులు సంపాదించడానికి అనువైన మార్గం షేర్ మార్కెట్ అయితే, అందులో పెట్టుబడులు పెట్టేవారి డబ్బులు పెరిగే అవకాశం ఎలా ఉంటుందో? అవి ఆవిరయ్యిపోయే అవకాశం కూడా అంతే ఉంటుంది.

ఇక్కడ దాచుకున్న డబ్బులు మొత్తం పెట్టుబడి పెట్టడం కన్నా, అతి తక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టి, షేర్ మార్కెట్ పై పూర్తి అవగాహన వచ్చాక మాత్రమే… దాచుకున్న డబ్బులో యాభై శాతం వరకు మాత్రమే పెట్టుబడిగా పెట్టి, లాభాలు కోసం చూడడం మేలు అంటారు.

ఉదాహరణకు మీ దగ్గర దాచుకున్న డబ్బు 4 లక్షలు ఉంది. దానిలో ఎంత మొత్తం షేర్ మార్కెట్ లో పెట్టడానికి

చూడాలి. అంటే 4 లక్షలలో పదవ వంతు డబ్బు పోయినా బాధాకరమే… ఇంకా చేజేతులా ఆ డబ్బుని పోగొట్టుకోవడం మరింత బాధాకరం. అయితే ఒక్కోసారి రిస్క్ చేసి, డబ్బు సంపాదించాలనే ఆలోచన పుడితే, దానికి పూనుకునేటప్పుడు తక్కువ మొత్తం ఉపయోగించాలి కాబట్టి మన దగ్గర నాలుగు లక్షలు ఉంటే, అందులో నాలుగు వేల నుండి నలభై వేలు వరకు డబ్బులు మాత్రమే ఉపయోగించుకోవడం మేలు.

షేర్ మార్కెట్లో పెట్టిన సొమ్ములు ఎలా పెరుగుతాయి? ఏఏ కంపెనీలలో పెట్టుబడులు పెడితే, ఎంత కాలంలో డబ్బులు పెరిగే అవకాశం ఉంది? ఏ కంపెనీలు ఎంత కాలం నుండి షేర్ మార్కెట్లో ఉన్నాయి? ఏఏ కంపెనీలు నిలకడగా లాభాలు గడిస్తున్నాయి? తదితర ప్రశ్నలు ప్రాక్టికల్ గా సమాధానాలు లభించినప్పుడు షేర్ మార్కెట్ పై అవగాహన వస్తుంది.

కావునా షేర్ మార్కెట్ లో అడుగుపెట్టేటప్పుడు పెట్టుబడులు స్వల్పంగా ఉండేవిధంగా చూసుకోవాలని నిపుణుల అభిప్రాయం.

ఇంతకీ దోచుకోబోయే చోటు ఎక్కడ?

ఒక వ్యక్తికి బ్యాంక్ ఖాతా ఉండి, దానికి ఆన్ లైన్ ఖాతా ఉంటే, ఆన్ లైన్ ఖాతా వివరాలు కనక తస్కరింపబడితే, సదరు వ్యక్తి దాచిన డబ్బుల ఆన్ లైన్ మోసాల వలన డబ్బులో కోల్పోయే అవకాశం ఉంటుంది.

షేర్ మార్కెట్లో ఒక్కసారిగా దూసుకువచ్చి, విపరీతంగా లాభాలు వస్తున్నాయనే భ్రమ కలిగిన చోటు నమ్మలేం.

అవును షేర్ మార్కెట్లో కేవలం పెట్టుబడుల చేతనే డబ్బులను పెంచుకోవచ్చును.

కానీ ఒక్కసారిగా పెరిగిపోతున్న విలువలు, ఒక్కసారిగా దిగిపోవచ్చుననే సూత్రం మరవకూడదు.

ఒక్కొక్కసారి ఏదైనా కొత్తగా కంపెనీ లేని లాభాలు ఉన్నట్టుగా చూపించి, మార్కెట్లో పెట్టుబడిదారులను బురిడీ కొట్టించే అవకాశం ఉంటుంది.

త్వరిత గతిన ఎదుగుదల ఒక్కొక్కసారి ఉండవచ్చును… ఎప్పుడూ ఉండదు.

దీర్ఘకాలం సాగిన ఎదుగుదల, అప్పటికే దీర్ఘకాలం రన్నింగులో ఉన్నట్టు, ఇంకా దాని బ్రాండ్ విలువను బట్టి ఇంకా కొంతకాలం దాని విలువ ఉంటుంది. కాబట్టి లాభాలు తక్కువగానే ఉన్నా దీర్ఘకాలం నుండి మార్కెట్లో నిలకడగా ఉన్న కంపెనీలను చూడాలి.

అయితే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి, ప్రశాంతంగా ఉండడం అసాధ్యం అంటారు. ఎందుకంటే ఎప్పుడూ లాభాలు ఆకస్మాత్తుగా పెరుగుతాయో? ఎప్పుడు లాభాలు కాదు అసలుకే మోసం వస్తుందో తెలియదు.

ఎందుకంటే షేర్ మార్కెట్ అంతా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

ఎప్పుడు షేర్ మార్కెట్ లో కంపెనీలపై నమ్మకం ఉండదు?

ఒక కంపెనీ లాభాలు లేకుండా లాభాలు వస్తున్నట్టు తప్పుడు లెక్కలు చూపిస్తూ, షేర్ మార్కెట్లో చలామణీ అవుతూ, దాని బండారం బయటపడ్డప్పుడు, మిగిలిన కొత్త కంపెనీల విషయంలో కూడా పెట్టుబడిదారులకు నమ్మకం సడలిపోవచ్చును.

ఏదైనా నమ్మకమైన మీడియా సంస్థలో కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం జరిగినప్పుడు.

షేర్ మార్కెట్లో ఉన్న కంపెనీ. తమ కంపెనీలో మూల ధనాన్ని, ఇతర అవసరాలకు తరలించి, కంపెనీ దివాలకు దారితీసినప్పుడు, ఇతర దీర్ఘకాలిక కంపెనీలపై కూడా పెట్టుబడిదారులు పునరాలోచనలో పడతారు.

అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే?

ఎప్పటికప్పుడు తాము పెట్టుబడి పెట్టిన కంపెనీ యొక్క యోగ సమాచారాలు తెలుసుకోవాలి.

మార్కెట్ పై ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను పరిశీలించాలి.

ప్రజలలో ఎక్కుగా ప్రభావితం చూపే అంశం ఉంటే, వాటి గురించి సమాజంలో రాబోయే మార్పులు కూడా అంచనా వేసుకోవాలి.

ముందుగా పుకార్లలో వాస్తవాలు గ్రహించాలి. పుకార్లు వాస్తవంగా కనబడుతూ అవాస్తవంగా ఉండవచ్చును. అవాస్తవంగా కనబడుతూ వాస్తవాన్ని ప్రచారం చేయవచ్చును. పుకార్లలో వాస్తవం ఎందుకు గ్రహించాలంటే, పుకార్ల వలననే నమ్మకం సడలిపోతుంది. మార్కెట్లో నమ్మకం ప్రధానం కాబట్టి…

స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అనేది కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల (ఆర్థిక లావాదేవీల యొక్క వదులుగా ఉండే నెట్‌వర్క్, భౌతిక సౌకర్యం లేదా వివిక్త సంస్థ కాదు) స్టాక్‌ల (షేర్లు అని కూడా పిలుస్తారు), ఇది వ్యాపారాలపై యాజమాన్య దావాలను సూచిస్తుంది;

వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడిన సెక్యూరిటీలు అలాగే ప్రైవేట్‌గా మాత్రమే వర్తకం చేయబడినవి కూడా ఉండవచ్చు. ఈక్విటీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెట్టుబడిదారులకు విక్రయించబడే ప్రైవేట్ కంపెనీల షేర్లు రెండో వాటికి ఉదాహరణలు. స్టాక్ ఎక్స్ఛేంజీలు సాధారణ ఈక్విటీ మరియు ఇతర భద్రతా రకాల షేర్లను జాబితా చేస్తాయి, ఉదా. కార్పొరేట్ బాండ్‌లు మరియు కన్వర్టిబుల్ బాండ్‌లు.

స్టాక్ మార్కెట్‌లో లాభాలను పెంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి:

బలమైన ఆర్థిక మరియు లాభదాయక చరిత్ర కలిగిన కంపెనీలలో పరిశోధన మరియు పెట్టుబడి పెట్టండి.

రిస్క్‌ని వ్యాప్తి చేయడానికి వివిధ పరిశ్రమలు మరియు కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచండి.

డాలర్ ధర సగటు మరియు విలువ పెట్టుబడి వంటి పెట్టుబడి వ్యూహాలను ఉపయోగించండి.

దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండండి మరియు స్వల్పకాలిక మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి.

మార్కెట్ ట్రెండ్‌లు మరియు వార్తల గురించి మీకు తెలియజేయండి, ఇది సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాల గురించి అనిశ్చితంగా ఉంటే ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌ను కలిగి ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం మరియు గత పనితీరు భవిష్యత్తు ఫలితాలను సూచించదు.

ప్రధానంగా దాచుకున్న డబ్బులు దోచుకుపోకుండా ఉండాలి. కాబట్టి ముందుగా అవగాహన చాలా అవసరం. షేర్ మార్కెట్ పై పూర్తి అవగాహన వచ్చాక మాత్రమే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం మేలు. ‘డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా‘ తస్మాత్ జాగ్రత్త అవసరం.

ధన్యవాదాలు.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? సమాధానం లభిస్తే, మనకు మార్గం లభించినట్టే. అయితే అవగాహన రావడం కోసం పోస్టు పూర్తిగా చదవగలరు. వితౌట్ డిజిటల్ డివైజ్, వుయ్ కాంట్ డు నథింగ్ అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఇష్టం ఉన్నా లేకున్నా వాడాల్సిన స్థితి అనివార్యం అవుతుంది.

కాబట్టి ఆన్ లైన్ లో ఉండే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగే ఆన్ లైన్లో డబ్బులు సంపాదించే మార్గాలు కూడా అలాగే పెరుగుతాయి. అయితే ఆలోచిస్తూ ఉంటే డబ్బులు సంపాదన ఉండదు. ఆలోచనను ఆచరణలో పెడితే డబ్బులు సంపాదన ఉంటుంది.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

కానీ ఒక్క విషయం గుర్తించాలి! ఏదీ కూడా వెంటనే ఫలితం ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా అనూహ్యంగా అది తగ్గుముఖం పడుతుంది. మనకు అర్ధం అయ్యే లోపులో ఫలితం ప్రభావం తగ్గిపోతుంది. కావునా శ్రమించి సాధించిన ఫలితం ఆస్వాదించగలం. ఇంకా అట్టి విధానాన్ని దీర్ఘకాలం కొనసాగించడానికి మంచి ప్రణాళికతో ముందుకు సాగగలం. కోటి రూపాయిలు సంపాదించడానికి కోటి మార్గాలు ఉండవచ్చును కానీ ఒక మార్గమును ఎంచుకుని పట్టుదలతో సాధన చేస్తేనే, కోటి రూపాయిలు సంపాదించే అవకాశం ఉంటుంది.

డబ్బు సంపాదనకు మనమే మార్గం సృష్టించుకోవాలి. ఎవరో సృష్టించిన మార్గంలో పోటీ ఎక్కువగా ఉంటే, మనం సృష్టించిన మార్గంలో కొత్తదనం మనకు ఆదాయ మార్గం కాగలదు. ఎందుకంటే ఎవరో క్రియేట్ చేసిన మార్గం మనకు తేలికగా తెలిసిందంటే, అది చాలా పాపులర్ కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా ఆలోచనను ఆచరణలోకి తీసుకురాగలిగితే, అంత త్వరగా డబ్బులు సంపాదన మొదలు అవుతుంది.

కూటికోసం కోటి విద్యలు, కానీ పట్టుదల వదలకూడదు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

అయితే ఆరంభించేటప్పుడు అరకొరగా తెలుసుకుని ప్రారంభిస్తే, ఆప్రయత్నంలో ఆదిలోనే కలిగే ఆటంకాలతో అది ఆగిపోతుంది. కాబట్టి ఎంత త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనను కలిగి ఉన్నామో, అంతకన్నా ఎక్కువగా సాద్యాసాధ్యములు గురించి ఆలోచన చేయాలి. మన ఆలోచనకు మన సంపూర్ణ మద్దతు ముందు కావాలి. బిజినెస్ మేన్ సినిమాలో స్నేహితుడే నమ్మకపోతే, ముంబై ఎప్పుడు నమ్ముతుంది? అన్నట్టుగా ముందుగా మన ఆలోచనను మనం పూర్తిగా సమర్ధించాలి. కూటికోసం కోటి విద్యలు, కానీ పట్టుదల వదలకూడదు. పట్టిన పనిని సాధించడానికి కృషి చేయాలి. అయితే అది ఆచరణకు సాద్యమా? అనే ఆలోచన ప్రధానం. అసాద్యమైన ఆలోచనకు ఆచరణ ఎంత చేసినా ప్రయోజనం శూన్యం. కాబట్టి సరైన రీతిలో ఆలోచన చేయకపోతే అదనపు ఆదాయం దేవుడెరుగు. వృధా కాలయాపన జరుగుతుంది. ఇకా ఆన్ లైన్ ద్వారా అదనపు ఆదాయం కోసం ఎందుకు సాధ్యపడవచ్చును?

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

జనులు ఎక్కువగా తిరిగే చోట, మంచి వ్యాపారం జరుగుతుంది. అలాగే ఆన్ లైన్ యూజర్ల్ ఎంత ఎక్కువమంది పెరిగితే, అంత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అందుకు తగ్గట్టుగా ఆన్ లైన్ ఎస్సెట్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఆ అస్సెట్ ద్వారా ఆన్ లైన్లో డబ్బులు సంపాదించడానికి మార్గం ఏర్పడుతుంది. ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? ఏఏ మార్గములు మనకు అందుబాటులో ఉన్నాయి? ఈ పోస్టులో రీడ్ చేయండి.

పెద్ద గమనిక ఏమిటంటే?

పెట్టుబడి లేకుండా సంపాదన ఉండదు. కనీసం కాలం అయినా ఖర్చు పెడతాము. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. కాబట్టి మనకున్న విలువైన కాలాన్ని ఖర్చు పెడుతున్నామంటే, మనం మన కాలాన్ని పెట్టుబడి పెడుతున్నాము. కాలం పెట్టుబడి పెట్టేటప్పుడు కంటెంట్ క్వాలీటి కోసం కొంత ధనం ఖర్చు చేయడం వలన, అది మన ప్రయత్నానికి మరింత సాయపడుతుంది. ఆరంభంలో ఉచిత సర్వీసులు ఉపయోగించుకుంటూ, అనుభవం పెరిగే కొలది అవసరం మేరకు కొంత ధనమును కూడా ఖర్చు చేయగలిగితే ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గంలో మనం కూడా విజయవంతం కాగలమని అంటారు.

ఇప్పుడు ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

డబ్బులు సంపాదనకు సులభ మార్గం ఆన్ లైన్ మార్గం

డబ్బులు సంపాదనకు సులభ మార్గం ఆన్ లైన్ మార్గం అంటూ కొందరంటారు. కానీ గమనించదగిన విషయం ఒక్కటి ఉంది. అదేమిటంటే, ఆన్ లైన్ డబ్బులు సంపాదన సులభమేకానీ మన ఎంచుకున్న టాపిక్ మరియు అది అందిస్తున్న ప్లాట్ ఫామ్ ఎక్కువమందికి చేరువ అయినప్పుడే. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే, అది పాపులర్ లక్షలమంది సబ్ స్క్రైబర్లు ఉంటే, సాదారణంగా కన్నా ఎక్కువ మొత్తం డబ్బులు సంపాదన చేయవచ్చును. అయితే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించగానే ఎక్కువమందికి చేరడానికి చాలా కష్టపడాలి. అలాగే బ్లాగు కూడా… మరి సులభంగా డబ్బులు సంపాదించడానికి ఆన్ లైన్ మార్గం సులభతరం కాదు. పోటీ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా కష్టపడి పని చేయాలి.

ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయడానికి మార్గములు కొన్ని ఉన్నాయి. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం, ఎక్కువమంది అనుసరించే మార్గం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం. వాటిలో సొంతంగా క్రియేట్ చేసిన వీడియోలు అప్ లోడ్ చేయడం. ఈ మార్గములో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. సులభంగా ఉండేవి కూడా ఎక్కువ పోటీ పెరిగితే, కష్టం కూడా పెరుగుతుంది. అలా యూట్యూబ్ ఛానల్స్ లో పోటీ పెరగడమే కానీ విధానం అయితే మిగిలిన ఆన్ లైన్ ఇన్కం మార్గముల కంటే సులభమైన విధానం.

కాబట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎంత సులభమో, ఈ క్రింది రెండు అంశాలలో దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే మాత్రం అంత సులభంగా ఆన్ లైన్లో డబ్బులు సంపాదించవచ్చును. పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడమే కాదు కోటి రూపాయిల సంపాదనను చేరుకునే అవకాశం ఉండవచ్చును. కాకపోతే దీర్ఘకాలం వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఉండడం ప్రధానం. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ పాపులారిటీ పెరిగితే కోటి రూపాయిల సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎటువంటి ఛానల్ పెడితే, త్వరగా ఎక్కువమంది సబ్ స్కైబర్లను పెంచుకోగలం.

వీడియో ఏవిధంగా ఉంటే, ఆ వీడియో ఎక్కువసేపు చూడగలదు.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం కోసం యూట్యూబ్ ఛానల్

పెట్టుబడి పెట్టకుండానే డబ్బులు సంపాదించాలంటే
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

పెట్టుబడి పెట్టకుండానే డబ్బులు సంపాదించాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉచితంగానే క్రియేట్ చేయవచ్చును. మీ యూట్యూబ్ వీడియోలలో కంటెంటు ఆన్ లైన్ యూజర్లకు అవసరం అయితే, అది ఎక్కువమందికి నచ్చితే, ఎక్కువమంది మీ యూట్యూబ్ ఛానల్ కు సబ్ స్క్రైబ్ అయితే, ఎక్కువసేపు మీ యూట్యూబ్ వీడియోలు వీక్షణను పొంది ఉంటే, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ విజయవంతం అయినట్టే, గూగుల్ యాడ్స్ అమోదమునకు రిక్వెస్ట్ చేసుకుని, గూగుల్ ద్వారా డబ్బులు మీ ఖాతాలోకి జమ అయ్యేవిధంగా సెటప్ చేసుకోవచ్చును.

పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడానికి, ఎటువంటి యూట్యూబ్ ఛానల్ పెడితే, సబ్ స్క్రైబర్లు పెరుగుతారు.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

అయితే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ పెడితే, త్వరగా ఎక్కువమంది సబ్ స్కైబర్లను పెంచుకోగలం. ఇదే ప్రధానమైన ప్రశ్న. ఎక్కువమంది సబ్ స్క్రైబర్స్ పెరగడానికి, ఎక్కువమంది యూజర్లకు యూట్యూబ్ ఛానల్లో ఉండే కంటెంట్ అవసరం అయి ఉండాలి. ఇంకా ఆకంటెంట్ అంటే ఆసక్తికరంగా అనిపించాలి. మీ వీడియోలు ఎక్కుమందిని నచ్చాలి. అప్పుడే ఎక్కువమంది సబ్ స్క్రైబర్లు మీ యూట్యూబ్ ఛానల్ కు సబ్ స్క్రైబ్ అవుతారు. గమనించవలసిన అంశం ఏమిటంటే? ఒక యూట్యూబ్ ఛానల్ కు గూగుల్ నుండి సంపాదన లభించాలంటే, ముందుగా ఆ యూట్యూబ్ ఛానల్ కు 1000 సబ్ స్క్రైబర్లు అవసరం.

కాబట్టి కామన్ సబ్జెక్టు అయి ఉండి, అది యూజర్లకు నచ్చే విధంగా యూట్యూబ్ ఛానల్ డిజైన్ చేసుకోవాలి. వీడియోలు ఆసక్తికరంగా సాగాలి.

యూట్యూబ్ వీడియో ఏవిధంగా ఉంటే, ఆ వీడియో ఎక్కువసేపు చూడగలదు. ఎంత ఎక్కువ సేపు మీ యొక్క యూట్యూబ్ వీడియో వీక్షకుడు వీక్షిస్తే, అంత వీక్షణ సమయం మీ ఛానల్ కు పెరుగుతంది. త్వరగా 4000 గంటల వీక్షణ సమయం పూర్తవుతుంది. 4000గంటల వీక్షణ సమయం పూర్తయితే, అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ సాధ్యం.

ఒక యూట్యూబ్ ఛానల్ విజయవంతం కావాలంటే, ఆ ఛానల్ నందు ఒరిజినల్ కంటెంటు ఉండాలి. ఆ కంటెంట్ గతంలో వేరొకరు వాడినది అయి ఉండ కూడదు. ఛానల్ వీడియోలు అర్ధవంతంగా ఉండాలి. వీడియో ఆసక్తికరంగా సాగాలి. వీడియోలోని కంటెంటు ఇప్పటి ట్రెండుకు అనుగుణంగా ఉండాలి. ప్రతి వీడియో టైటిల్ వీడియోలోని కంటెంటుని ప్రతిబింబించేలా ఉండాలి. ముఖ్యంగా వీడియో డిస్క్రిప్షన్ పూర్తిగా ఉండాలి. అది కూడా వీడియో గురించి విపులంగా వివరిస్తూ ఉండాలి. ముఖ్యంగా యూట్యూబ్ సెర్చ్ లో వీడియోని చూపగలిగే విధంగా వీడియో డిస్క్రిప్షన్ ఉండాలి.

అయితే పెట్టుబడి లేకుండానే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించవచ్చును. అప్పటికే మీకు ఒక స్మార్ట్ ఫోను ఉండాలి. కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా సులభంగానే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించవచ్చును. అయితే ఒక కంప్యూటర్ కూడా ఉంటే, మీరు మీ యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని నాణ్యమైన వీడియోలు ఎడిట్ చేసి అందించడానికి అవకాశం ఉంటుంది.

కొంత ధనం వెచ్చించి యూట్యూబ్ ఛానల్ కు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడం ద్వారా మీ ఛానల్ మరింత నాణ్యంగా తయారు చేయవచ్చును.

ఆన్ లైన్ డబ్బు సంపాదన కోసం ఒక యూట్యూబ్ ఛానల్ సృష్టించడానికి ఐడియాస్

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా?

కుకింగ్ గురించి తెలియజేసే ఛానల్… వీడియోలలో ఒక్కొక్క కూర తయారీ గురించి తెలియజేయడం. కుకింగ్ టిప్స్ గురించి తెలియజేయడం.. చాలామందికి కుకింగ్ రాని వారు ఉండవచ్చును. అలాంటి వారు కుకింగ్ వీడియోల కోసం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు. ఇంకా కొత్త రుచుల కోసం చూసేవారు కూడా యూట్యూబ్ లో కుకింగ్ వీడియోల కోసం వెతుకుతారు. వంటల వీడియోల ద్వారా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం సులభం అంటారు.

ఆరోగ్యకరమైన విషయాలలో యోగ చాలా ప్రధానమైనది. మీకు యోగా తెలిసి ఉంటే, యోగాసనాలు, యోగా వలన ప్రయోజనాలు తదితర వీడియోలు కూడా యూజర్లను ఆకట్టుకోవచ్చును. డబ్బులు సంపాదించాలంటే ఆరోగ్యం గురించిన విషయాలు తెలిపే వీడియోలు చేయవచ్చును.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

మ్యూజిక్ ఛానల్ కూడా బాగుంటుంది. ఈనాటి కాలంలో ప్రశాంతతో ఉండేవారి కన్నా ఒత్తిడిలో బ్రతికేసేవారు ఎక్కువ అంటారు. కాబట్టి ప్రశాంతమైన కూల్ మ్యూజిక్ మనసుకు శాంతిని చేకూరుస్తుంటే, అటువంటి పీస్పుల్ మ్యూజిక్ వీడియోల కోసం యూట్యూబ్ లో సెర్చ్ చేసేవారు అధికంగానే ఉంటారు. ఆన్ లైన్ ఆదాయం రావాలంటే, మ్యూజిక్ తో మాయ చేసే వీడియోలు అవసరం.

ఇంట్లోనే ఉండేవారికి డాన్స్ మంచి ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకా కాంపిటేషన్స్ లో పాల్గొనేవారు కూడా డాన్స్ కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటారు. డాన్స్ నేర్పించే యూట్యూబ్ వీడియోలు చేయడం చేయవచ్చును.

మోటివేషన్ వీడియో ఛానల్ కూడా మంచి ప్రయోజనం చేకూర్చగలదు. ప్రముఖ వ్యక్తుల మాటల ఆధారంగా మోటివేషనల్ వీడియోలు చేసి, యూట్యూబ్ యూజర్లను ఆకట్టుకోవచ్చును. మోటివేషన్ వీడియోల ద్వారా కూడా డబ్బులు సులభంగా సంపాదించవచ్చునని అంటారు.

ముగ్గులు వేయడం, ఎన్ని చుక్కలతో ఎలాంటి ముగ్గులు వేయవచ్చునో… తదితర ముగ్గుల వీడియోలు ఎక్కువమందిని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.

ఏదైనా ఒక ఛానల్ విజయవంతం అయితే అది ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించడానికి అవకాశం సృష్టిస్తుంది.

కామెడీ వీడియో ఛానల్ కూడా ఎక్కువమందిని ఆకట్టుకోవచ్చును. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదనకు హాస్యం వినోదం ఈ రెండు ప్రధాన ఆయుధాలు….

ఫ్యాషన్ గురించి కూడా యూట్యూబ్ వీడియో ఛానల్ క్రియేట్ చేయవచ్చును. అయితే ఫ్యాషన్ గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అందించేవిధంగా ఉండాలి.

వెడ్డింగ్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్ గురించిన యూట్యూబ్ వీడియోలతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయవచ్చును. ప్రణాళికలు వేయడం వాటిని అమలు చేయడం వంటి వీడియోలు ఎక్కువమందిని ఆకట్టుకుంటే, ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం సులువు అంటారు.

కుట్టు మిషన్ మరియు కుట్టు మిషన్ కామన్ ప్రోబ్లమ్స్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మరియు ఫ్యాషన్ స్టిచింగ్ సంబంధించిన వీడియోలు బాగా ఆకట్టుకోవచ్చును.

పిల్లల సంరక్షణ, పిల్లల పెంపకం గురించిన యూట్యూబ్ ఛానల్ కూడా విజయవంతం అయే అవకాశం ఉంటుంది.

వినోదభరితమైన విషయాలు అంటే సినిమాల గురించి, సినిమా హీరోల గురించి తదితర అంశాలలో యూట్యూబ్ ఛానల్ కూడా సృష్టించవచ్చును.

మేకప్ టిప్స్ గురించిన అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయవచ్చును.

పిండి వంటల గురించిన వీడియో ఛానల్ పెట్టడం ద్వారా మంచి ఆదాయం అర్జించవచ్చును అంటారు.

అవకాయ పచ్చడి గురించిన అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్

వ్యవసాయం గురించి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చును.

మోటార్ సైకిల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి యూట్యూబ్ ఛానల్

తయారీ విధానం గురించిన అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్

మూవీ రివ్యూ యూట్యూబ్ వీడియో ఛానల్ ద్వారా మంచి రివ్యూ వీడియోలతో యూజర్లను ఆకట్టుకోగలిగితే, ఎర్న్ మనీ ఆన్ లైన్ సులభం.

కోటి రూపాయిలు సంపాదించడానికి, ఆన్ లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి విద్యా విషయాల సమాచారం గురించి యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వివిధ రకాల విద్య గురించిన వీడియోలు యూట్యూబ్ సెర్చ్ చేయవచ్చును.

డబ్బులు సంపాదించడానికి వివిధ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్

డబ్బులు సంపాదించడానికి వివిధ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్
డబ్బులు సంపాదించడానికి వివిధ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్

సబ్జెక్టుల వారీగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, అందులో వివరణాత్మక వీడియోలతో విద్యార్ధులకు అర్ధం అయ్యే విధంగా ఆన్ లైన్ పాఠాల చెప్పగలిగితే, ఎర్న్ మనీ విత్ వీడియోస్ చాలా సులభమే అంటారు.

ఉద్యోగ సమాచారం అందించే యూట్యూబ్ ఛానల్, మంచి అవకాశం కోసం వేచి ఉండేవారికి ఉపయోగపడే సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ కు సబ్ స్క్రైబ్ అవుతూ ఉంటారు. విలువైన సమాచరం అందించే ఛానల్ ఎక్కువమంది యూట్యూబ్ సబ్ స్క్రైబర్లను పొందగలదు. తద్వారా ఈజి మనీ ఎర్నింగ్ పాజిబుల్.

ఆన్ లైన్ లో డబ్బులు సంపాదన సులభమే అవుతుంది. ఎప్పుడంటే, వివిధ వస్తువుల రిపేరుల గురించి తెలియజేసే యూట్యూబ్ వీడియో ఛానల్ ఎక్కుమంది చూడడం జరుగుతుంటే…

తెలుసుకోవాలనే తపన ఉన్నవారు కొత్త వీడియోల కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఉత్పత్తి విధానం గురించి, వస్తువుల తయారీ విధానం గురించి తెలియజేసే యూట్యూబ్ వీడియో ఛానల్ విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఛానల్ ఎక్కువమందిని ఆకట్టుకోగలిగితే, ఆన్ లైన్ మనీ ఎర్న్ చేయడం సులువే అంటారు.

టాలెంట్ టెస్టులకు, ఎంట్రెన్స్ టెస్టులకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ గురించి మరియు జికె గురించిన యూట్యూబ్ వీడియో ఛానల్ విజయవంతం అవుతుంది. అటువంటి ఛానల్ వీక్షకులు పెరిగితే, డబ్బులు సంపాదించడానికి మంచి మార్గం లభించనిట్టే….

మొబైల్స్ గురించి, మొబైల్ సమస్యల గురించి, మొబైల్ రివ్యూస్ అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్

సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ మరియు వాటిని అందించే సంస్థల గురించి, వాటి వలన లభించే ఉద్యోగ అవకాశాలు గురించి యూట్యూబ్ ఛానల్

పూజలు, పూజా సామాగ్రి, ఇంటిలో వాస్తు వివిధ భక్తి పరమైన వీడియోలతో యూట్యూబ్ ఛానల్

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల గురించి, మనీ వాలెట్స్ గురించిన యూట్యూబ్ ఛానల్

ఎక్కౌంటింగ్ గురించి, టాలీ ఉపయోగించు విధానం గురించిన యూట్యూబ్ ఛానల్

నమ్మదగిన సమాచారంతో ఉపయోగపడే ఆలోచనలతో వీడియోలు ఉంటే యూట్యూబ్ ఛానల్ ఆదాయపు వనరుగా

చాలామందికి లెటర్ ప్రిపేరింగ్, పేజ్ సెట్టింగ్, ప్రింట్, టేబుల్స్ వంటికి ఎంఎస్ వర్డ్ మరియు ఎక్సెల్ గురించి అవగాహన ఉండకపోవచ్చును. ఆఫీసు గురించి పూర్తిగా మైక్రోసాఫ్ట్ ఆపీస్ గురించి యూట్యూబ్ ఛానల్…

ఇక ఎప్పుడూ ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని ఇతరుల తెలుసుకునే సాదారణ సమస్యలు అయితే, కొన్ని వ్యక్తిగతమైనవిగా ఉంటాయి. కొందరు అడిగి తెలుసుకోవడం కంటే, వెతుకులాటలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా వీడియోల శోదన చేసేవారికి సాదారణ సమస్యలు, పరిష్కారాలు యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడవచ్చును.

ఇన్ కం టాక్స్, జిఎస్టీ గురించి యూట్యూబ్ ఛానల్ ఎక్కౌంటింగ్ రంగంలో ఉండేవారికి టాక్స్ అప్డేట్స్ గురించి సమాచారం అవసరం. వ్యాపారస్తులకు, ఎక్కువ ఆదాయం వచ్చేవారికి కూడా… కాబట్టి ఈ ఛానల్ విజయవంతం అయినా మంచి డబ్బులు సంపాదించే మార్గం కాగలదు.

కొత్త వ్యాపారాలు, పాత వ్యాపారాలు, వ్యాపార విషయాల గురించి సలహాలు యూట్యూబ్ ఛానల్

వివిధ ఉచిత సేవల గురించి తెలియజేసే ఇన్పర్మేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడానికి మంచి మార్గం.

ట్రావెలింగ్ స్పాట్స్, ట్రావెలింగ్ రూట్స్ గురించి తెలియజేసే యూట్యూబ్ ఛానల్ ఇది మరొక ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడానికి మంచి మార్గం.

అందుబాటులో ఉంటే లైవ్ బిజినెస్ ఆఫర్స్ గురించిన యూట్యూబ్ ఛానల్

షేర్ మార్కెట్, షేర్ మార్కెట్ గురించి అవగాహన కల్పించేవిధంగా యూట్యూబ్ ఛానల్

మనోవిజ్ఙానం గురించిన వీడియోలతో యూట్యూబ్ ఛానల్

గొప్పవారి జీవిత చరిత్రల వీడియోలతో యూట్యూబ్ ఛానల్

ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదనకు వివిధ రకాల పనులు, వాటి సమస్యలు, వాటి పరిష్కారాలు
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా?

అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్, మోటార్ సైకిల్ మెకానిక్, కార్ మెకానికజం, కార్పెంటర్ వర్క్, పెయింటింగ్ వర్క్, బిల్డింగ్ వర్క్, వెల్డింగ్ వర్క్, రిపేరింగ్స్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ రిపేర్, టివి రిపేర్, ఫ్రిజ్ రిపేర్, స్టవ్ రిపేర్, మోటార్ వైండింగ్, జనరేటర్ రిపైర్స్, సెలూన్, ఆటోమొబైల్స్… ఇలా రకరకాల పనులు లేదా షాపులు లేదా సర్వీసులు ఉంటే, వాటిలో వచ్చే సమస్యలు, పరిష్కారాలతో యూట్యూబ్ వీడియో ఛానల్స్ సృష్టించవచ్చును. ఎందుకంటే ఎప్పుడు ఎవరికీ ఏ విషయంలో అవసరం ఏర్పడుతుందో తెలియదు. కావునా అందరి వృత్తుల వారికీ వేరు వృత్తులలోని సమస్యలు, పరిష్కారాలు అవసరం కాబట్టి… యూట్యూబ్ లో చాలా వీడియోలు విజయవంతంగా చూడబడుతున్నాయి. కావునా మీరు ఎంచుకున్న కంటెంటులో అర్ధవతంగా, ఆసక్తికరంగా వీడియోలు చేస్తూ ఉండడం వలన క్రమంగా యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు పెరుగుతారు. వీడియో వీక్షణ సమయం పెరుగుతుంది. త్వరగా యూట్యూబ్ వీడియో ఛానల్ ద్వారా డబ్బు సంపాదన ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.

దేశంలో వివిధ చేతి వృత్తి పనులు ఉన్నాయి. అలా ప్రతి పనిలోనూ సమస్య ఉండవచ్చును. ప్రతివారికి ప్రతి పని గురించి అవగాహన ఉండకపోవచ్చును. ప్రతివారిలోనూ సమస్యకు పరిష్కారం చూపే ఆలోచన తట్టకపోవచ్చును. కావునా ప్రతి చేతి వృత్తి గురించిన అవగాహన వీడియోలు చేయడం చేయవచ్చును. ఇంకా చేతి వృత్తి పనులలో ఉండే సాదారణ సమస్యలు, వాటికి పరిష్కార వీడియోలతో యూట్యూబ్ ఛానల్స్ సృష్టించవచ్చును.

మన సమాజంలో అనేక చేతి వృత్తులు, అనేక రిపేరు పనులు ఉన్నాయి. వాటికి సంబంధించిన అవగాహన కల్పించడం… అందులో కామన్ ప్రోబ్లమ్స్ గురించిన వీడియోలు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. మీ యూట్యూబ్ ఛానల్ విజయవంతం అయితే, కోటి రూపాయిలు సంపాదించడం సులభమే అవుతుంది.

యూట్యూబ్ ఛానల్ కాకుండా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం కోసం ఒక బ్లాగుని రన్ చేయడం

అవును ఒక యూట్యూబ్ ఛానల్ విజయవంతం అయితే కోటి రూపాయలు సంపాదించడం ఎలా ? ప్రశ్నకు బదులు లభించనట్టేనని అంటారు. అలాగే ఒక బ్లాగు విజయవంతం అయినా సరే కోటి రూపాయలు సంపాదించడం ఎలా ? ప్రశ్నకు బదులు లభించినట్టే. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ బ్లాగు కానీ దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాలి.

ఇప్పుడు ఒక బ్లాగుని సృష్టిస్తే డబ్బులు సంపాదించవచ్చునా? బ్లాగు సృష్టించడం సులభమేనా? బ్లాగుని ఎలా సృష్టించడానికి ఆన్ లైన్ అవకాశాలు ఏమిటి?

కోటి రూపాయిలు సంపాదించడం ఎలా?
కోటి రూపాయిలు సంపాదించడం ఎలా?

ఒక విజయవంతమైన బ్లాగుని సృష్టించడానికి కొంత టెక్నికల్ కోడ్ తెలిసి ఉండాలి. లేదా ఉచితంగా లభించే బ్లాగింగ్ ప్లాట్ ఫామ్స్ పై సాధన అవసరం. బ్లాగింగ్ ద్వారా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం కష్టమే అవుతుంది. కారణం ఉచితంగా లభించే బ్లాగింగ్ ప్లాట్ ఫామ్స్ లో పరిమితులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫ్రీగా డబ్బులు సంపాదించాలంటే, ఎక్కువ కాలం బ్లాగు పోస్టులు చేస్తూ ఉండాలి.

బ్లాగర్ లేదా వర్డ్ ప్రెస్ ద్వారా ఫ్రీగా బ్లాగుని క్రియేట్ చేయవచ్చును. ముందుగా ఫ్రీగానే బ్లాగుని ప్రారంభించి, అందులో అవగాహన వచ్చాకా, డబ్బులు ఖర్చు చేసి, బ్లాగింగ్ చేయడం వలన డబ్బులు వృధా కాకుండా, ఒక విజయవంతమైన బ్లాగుని క్రియేట్ చేయగలం. ఈ క్రింది పోస్ట్ రీడ్ చేయండి వర్డ్ ప్రెస్ లో బ్లాగుని క్రియేట్ చేయడం, వర్డ్ ప్రెస్ బ్లాగు ద్వారా పోస్టుని క్రియేట్ చేయడం వివరించబడి ఉంది.

డబ్బు డబ్బు డబ్బు మూడు సార్లు చెప్పినా ముప్పై సార్లు చెప్పినా డబ్బు చాలా అవసరం. డబ్బుంటే లోకంలో ఒక స్టేటస్, డబ్బుంటే అవసరాలు తీరతాయి. వస్తువులు సమకూరతాయి. జీవితాన్ని సుఖవంతంగా కొనసాగించడానికి డబ్బు అవసరం ఎంతైనా ఉంది. అటువంటి డబ్బు సంపాధన సులభంగా ఉండదు. ఏ రంగంలోనైనా డబ్బులు సంపాదించడానికి వివిధ విదానాలు ఉంటాయి. ఖచ్చితమైన విదానం ఎక్కువకాలం కొనసాగిస్తే, ఎక్కువకాలం డబ్బులు సంపాదించవచ్చును.

అరకొరగా తెలుసుకుని ఏదైనా ప్రారంభిస్తే, అది ఆరంభశూరత్వంగా మిగులుతుంది. కావునా ఏదైనా అంశంలో అవసరం మేరకు అవగాహన ఉండాలి. ఇక డబ్బులు సంపాదించే మార్గములలో అయితే, మరింతగా అవగాహన అవసరం ఎందుకంటే, మోసం చేయబడేది, మోసపోయేది కూడా డబ్బులు విషయంలోనే ఎక్కువ అంటారు.

బ్లాగు / వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానల్
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా?

కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్ సృష్టించాలంటే, కొన్ని ఫెయిల్యూర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ గురించిన వీడియోలు చూడండి. అవి కూడా యూట్యూబ్ లో ఉంటాయి. అలాగే ఒక బ్లాగుని సృష్టించాలంటే, ఫెయిట్యూర్ బ్లాగర్స్ యొక్క అభిప్రాయాలు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. సూచనలు సలహాలు స్వీకరించండి. కొత్తగా ఆలోచించండి. విభిన్నంగా ఉండే విదానంలో బ్లాగుని కానీ ఛానల్ కానీ సృష్టించవచ్చును.

పైన యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అంటూ చదివారు కదా…. అలాగే బ్లాగుని సృష్టించడానికి కూడా అటువంటి సమాచారపరమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవచ్చును. యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో పరంగా ఉంటుంది. బ్లాగ్ అయితే వచన రూపంలో ఉంటుంది. లోకంలో అనేకానేకా సమస్యలు. వాటి పరిష్కారాల కోసం ప్రపంచంలో ఆన్ లైన్ యూజర్లు గూగుల్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ వెతుకుతూ ఉంటారు. అందులో మీ వీడియో కానీ మీ బ్లాగు పోస్టు కానీ ప్రధమ స్థానంలో కనబడితే, మీ యూట్యూబ్ ఛానల్ కానీ మీ బ్లాగు కానీ విజయవంతం అయినట్టేనని అంటారు.

మీరు సృష్టించిన యూట్యూబ్ ఛానల్ విజయవంతం అయితే, బ్లాగుని సృష్టించడం

మీకు ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా ఆదాయం వస్తుంది. అయినా మీరు మీ యూట్యూబ్ ఛానల్ కు అనుగుణంగా ఒక బ్లాగుని సృష్టించవచ్చును. మీ యూట్యూబ్ వీడియోలలో వివరించినట్టే, మీరు బ్లాగు పోస్టుల ద్వారా కూడా వచన రూపంలో వివరించవచ్చును. ఆ వివరణలో అవసరం మేరకు ఫోటోలు కూడా ఉంటే, మీరు బ్లాగుని కూడా విజయవంతం చేయవచ్చును. అప్పుడు మీరు కేవలం యూట్యూబ్ ఛానల్ నుండే కాకుండా బ్లాగు ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చును. కోటి రూపాయలు డబ్బులు సంపాదించాలనే కలకు చేరువ అవుతున్నట్టే.

మీకు విజయవంతమైన బ్లాగు ఉంటే, దానికి ఒక యూట్యూబ్ ఛానల్ అదనపు ఆదాయం

ఆన్ లైన్లో మీరు క్రియేట్ చేసిన బ్లాగు సక్సెస్ అయ్యింది. అందులోని బ్లాగు పోస్టులకు వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంది. డబ్బులు బాగానే వస్తున్నాయి. అయినా మీ బ్లాగుకు అనుగుణంగా యూట్యూబ్ వీడియోలు ద్వారా మీరు యూట్యూబ్ ఛానల్ కూడా కొనసాగించడం వలన అదనపు ఆదాయం మీకు వస్తుంది. అందువలన కోటి రూపాయల సంపాదన కల త్వరగా నెరవేరవచ్చును.

కావునా ఒక పాపులర్ బ్లాగుకు, ఒక యూట్యూబ్ ఛానల్ మరింత సాయపడుతుంది. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఒక బ్లాగు కూడా సాయపడుతుంది. కోటి రూపాయిలు సంపాదించడానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా ఆదాయ వనరుగా మారగలదో, అలాగే ఒక బ్లాగు ద్వారా కూడా కోటి రూపాయిలు సంపాదించడానికి కృషి చేయవచ్చును.

గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా ఆదాయం తక్కువగా
గూగుల్ యాడ్ సెన్స్ అమోదం
పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా?

యూట్యూబ్ ఛానల్ అయినా బ్లాగు అయినా సరే గూగుల్ యాడ్ సెన్స్ ఖాతానే మూలంగా కనబడుతుంది. ఇంకా గూగుల్ యాడ్ సెన్స్ అమోదం త్వరగా లభించదు. ఎన్నో నియమ నిబంధనాలు ఉంటాయి. ఇంకా అవన్నీ దాటి గూగుల్ యాడ్ సెన్స్ అమోదం లభిస్తే, గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా కలిగిన వ్యక్తి పరికరంలో యాడ్స్ క్లిక్ చేయకూడదు. ఇంకా అతని లేక ఆమె ఫ్రెండ్స్ పరికరాలలో కూడా యాడ్స్ క్లిక్ చేయరాదు. అలా చేస్తే గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఖాతాలో జమ చేయబోయే మొత్తం నుండి కోతలు ఉంటాయి. ఇలా గూగుల్ యాడ్ సెన్స్ ఖాతాను పరిశీలిస్తే, పెద్ద తలకాయపోటుగా అనిపిస్తుంది.

ఇన్ని నియమ నిబంధనలు పాటించాకా కూడా గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా ఎర్నింగ్ కోత పడవచ్చును. గమనిస్తే మనకు దానిమీద అపనమ్మకం కూడా ఏర్పడవచ్చును. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ లేదా బ్లాగుకు ట్రాఫిక్ ఉన్నా సరే, గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా అనిపిస్తే…. ఇతర మార్గములలో ఎలా?

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడానికి గూగుల్ యాడ్ సెన్స్ కాకుండా వేరే మార్గములు.

దీనినే అఫిలియేట్ విధానం అంటారు. ఈవిధానం ద్వారా మీరు పాపులర్ ఆన్ లైన్ సంస్థల నుండి ఖాతాను సృష్టించుకుని, వారి ఉత్పత్తులకు మీ వెబ్ సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తారు. ఆ ప్రచారంలో మీ వెబ్ సైట్ ద్వారా వారి ఉత్పత్తి అమ్మకం అయితే, మీ ఖాతాలో వారి నుండి డబ్బు వస్తుంది. అలా ఈ క్రింది రంగాలలో మీరు అఫిలియేట్ ఖాతాలను తెరవవచ్చును.

ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి ఆన్ లైన్ ఆదాయ వనరు ఏర్పడాలి. ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఒక బ్లాగు లేదా మీ టాలెంట్ ఆన్ లైన్లో బాగా పాపులర్ అయితే, అదే ఆదాయ వనరుగా మారుతుంది. తర్వాత కోటి రూపాయిలు ఆన్ లైన్లో సంపాదించడానికి అవకాశాలు మెరుగుపడతాయి.

వెబ్ హోస్టింగ్

డొమైన్ సేల్

ఫ్రీలాన్సర్ వెబ్ సైట్స్

టెలికం సంస్థలు

ఇకామర్స్

బ్యాంకింగ్

వర్డ్ ప్రెస్ థీమ్స్ అండ్ ప్లగిన్స్

కంప్యూటర్ వైరస్ ప్రోగ్రామ్స్

సాఫ్ట్ వేర్స్

ఎస్ఇఓ ప్రొడక్ట్స్ వెబ్ సైట్ ర్యాంకర్స్

ఇబుక్స్

ఆన్ లైన్ సేవలు

డూప్లికేట్ కంటెంట్ ఫైండర్స్

పిడిఎఫ్ ఎడిటర్స్

ఇమార్కెటింగ్ టూల్స్

ఇలా వివిధ రకాల సంస్థల ఉత్పత్తులను మీరు మీ వెబ్ సైట్ ద్వారా ప్రచారం కల్పించవచ్చును. అయితే మీ వెబ్ సైటుకు ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి. అప్పుడే అఫిలియేట్ రంగంలో మీరు ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చును.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం కొరకు ఒక వెబ్ సైటుకి ఎక్కువ ట్రాఫిక్ కావాలంటే

మీ వెబ్ సైట్ కంటెంటులో డూప్లికేట్ కంటెంట్ ఉండరాదు.

వెబ్ సైట్ ఎస్ఇఓ ఆప్టిమైజేషన్ అయి ఉండాలి.

కంటెంటు ఆసక్తికరమైన పోస్టులతో ఉండాలి.

గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా ఏఏ అంశాలు సెర్చ్ చేస్తున్నారో? అటువంటి అంశాల ఆధారంగా వెబ్ సైటులో ఆర్టికల్స్ ఉండాలి.

ఆర్టికల్స్ అర్ధవంతంగా ఉండాలి. వివరంగా ఉండాలి.

మీ వెబ్ సైటుకి తగినంత ప్రచారం కల్పించాలి.

ఈ విధంగా ఒక బ్లాగు లేదా వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించవచ్చును. అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి సోషల్ మీడియా కూడా ఉపయోగపడతుంది.

సోషల్ మీడియా ఖాతా ద్వారా డబ్బులు సంపాదించడం.

మీకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వంటి ఖాతాల ఉంటే, వాటి ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చును. మీ సోషల్ మీడియా ఖాతాలో మొబైల్ ఇన్ స్టాల్ షేర్ చేయడం. ఇకామర్స్ అఫిలియేట్ లింకులను షేర్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చును. అయితే మీ సోషల్ మీడియా ఖాతా భారీ ఫ్యాన్ పాల్లోయింగ్ ఉండాలి. మీకు ఒక ఫేస్ బుక్ ఖాతా ఉంటే, దానికి లక్షలమంది ఫాల్లోవర్స్ ఉండడం చేత ఏదైనా లింక్ షేర్ చేయగానే ఎక్కువమందికి చేరుతుంది. అందులో అవసరం అయిన ఉత్పత్తి అమ్మకం జరిగితే, తద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే దీనిలో కూడా పరిమితులు ఉంటాయి.

సొంతంగా ఒక బ్లాగు మరియు యూట్యూబ్ ఛానల్… రెండు అనుసంధానంగా క్రియేట్ చేసుకుని, వాటిలో ఏదో ఒక్కటి పాపులర్ చేసినా చాలు, వాటి ద్వారా డబ్బులు సంపాదించడం సులభం.

 ఆన్ లైన్ ఆదాయం
పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా?

కష్టం లేకుండా వచ్చే ఆదాయం అంత తృప్తికరంగా ఉండదని అంటారు. అలాగే సులభంగా వచ్చే ఆదాయం ఎక్కువ రోజులు నిలబడదు అంటారు. సులభంగా వచ్చిందంటే, సులభంగానే ఖర్చు అవుతుంది. కష్టంగా వచ్చిందంటే, ఎక్కువకాలం పడుతుంది. అంటే ఎక్కువకాలం మన దగ్గర డబ్బు రావడంలోనే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి కష్టంతో కూడిన పనిని ఎంచుకోవాలి అంటారు. అయితే కష్టం అన్నింటిలోనూ ఉంటుంది.

ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం సులభమే కానీ అందులో ఎప్పటికప్పుడు యూజర్లకు నచ్చే విధంగా యూట్యూబ్ వీడియోలను క్రియేట్ చేసి అప్డేట్ చేయడం కష్టంతో కూడుకున్న పనే. అలాగే ఒక బ్లాగుని సృష్టించడం కన్నా ఒక బ్లాగులో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మేటర్ అప్ లోడ్ చేయడం కష్టంతో కూడుకున్న పనే.

ఏదైనా శ్రమిస్తే ఆదాయం రావడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఇది ఎక్కువ కాలం నిలుస్తుంది. అది ఆన్ లైన్ ఆదాయం అయినా, చేతి పని అయినా.

ఏదైనా ప్రారంభించగానే ఆదాయం వస్తే, అది సులభం

ఒక బ్లాగుని సృష్టించిన నెలరోజులలోపు ఆదాయం రావడం ప్రారంభం అయ్యిందంటే, అప్పుడు అనిసిన్తుంది. బ్లాగు ద్వారా డబ్బులు సంపాదించడం సులభం అని. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, కొన్ని రోజులలోనే డబ్బులు సంపాదించడం మొదలైతే, యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించడం చాలా సులభం అనిపిస్తుంది. అలాగే ఫేస్ బుక్ పేజిలో అఫిలియేట్ లింకులు షేర్ చేయగానే, ఆదాయం రావడం ప్రారంభం అయితే, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం చాలా సులభం అనిపిస్తుంది.

అవే పద్దతులలో ఆదాయం రావడానికి ఎక్కువ కాలం పడితే, అప్పుడే అనిపిస్తుంది… ఆయా మార్గాలలో డబ్బులు సంపాదించడం చాలా కష్టంతో కూడిన పని అని.

ఏదైనా ప్రారంభించగానే పాపులర్ అయ్యిందంటే, అందులోని అంశం సరికొత్త అంశం అయి ఉంటుంది. వెంటనే దానికనుగుణంగా మరొక ఛానల్ లేదా మరొక బ్లాగు స్టార్ట్ అయితే పోటీ పెరుగుతుంది. సులభంగా ప్రారంభం అయింది కదా అని మొదట ప్రారంభించినవారు నిర్లక్ష్యంగా ఉంటే, తర్వాతి వచ్చిన ఛానల్ లేదా బ్లాగు మరింత విజయవంతం అవుతుంది. సులభంగా ప్రారంభం అయినా ఆదాయం ఆగుతుంది. అదే కష్టంతో ఆదాయం ఆరంభించి ఉంటే, నిర్లక్ష్యానికి తావుండదు. ఎక్కువకాలం ఆదాయం నిలబడుతుందని అంటారు.

డబ్బులు సులభంగా సంపాదించినా డబ్బే… కష్టంగా సంపాదించినా డబ్బే… డబ్బు మన అవసరాలను తీర్చుతుంది. అయితే నిర్లక్ష్యం లేకుండా ఉండాలంటే, ఆరంభం సులభంగా కన్నా కష్టంగా ఉంటే, దీర్ఘకాలంలో జాగ్రత్తగా ఉంటారని, సులభంగా వచ్చేవి, నిలబడవు అంటారు.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? ప్రశ్న అవసరమే అయితే అందుకు తగినంత అవగాహన చాలా అవసరం. ఎంపిక చేసుకునే రంగం, అందుకు సంబంధించిన సమస్యలు. దీర్ఘకాలం ఎలా రన్ చేయాలి? ముందుగా ఆదాయం లేకుండా, కాలం ఖర్చు చేయాలి అనే విషయం గమనించాలి.

డబ్బులు సంపాదించే పెట్టే మార్గంలో బ్లాగ్ సృష్టించడానికి ఈ క్రింది కొన్ని ఆలోచనలు ఉపయోగపడవచ్చును.
  • రెజ్యూమ్ ఫార్మట్స్ మరియు రెజ్యూమ్ రైటింగ్ టిప్స్ గురించిన బ్లాగు.
  • యూట్యూబ్ ఛానల్ టిప్స్, ఛానల్ కస్టమైజేషన్, ఛానల్ ఎస్ఇఓ
  • బ్లాగ్ సృష్టించడం, బ్లాగు కంటెంట్, బ్లాగు పోస్టుల ఫార్మట్, బ్లాగ్ థీమ్స్, బ్లాగు హోస్టింగ్ ఆఫర్స్, బ్లాగ్ ఎస్ఇఓ, బ్లాగ్ బ్యాక్ లింకింగ్ బ్లాగుకి సంబంధించిన విషయాలలో ఆదాయం ప్రారంభం అయితే, అది ఎక్కువ కాలం డబ్బులు సంపాదించే వనరుగా మారగలదని అంటారు.
  • సూచనలు అందించే బ్లాగ్ లేదా వెబ్ సైట్…
  • ప్రణాళికలు అందించే బ్లాగ్ లేదా వెబ్ సైట్
  • ఉద్యోగ సమాచారం, ఉద్యోగ నియమాకాలు, ఉద్యోగ ఉపాధి అవకాశల గురించిన బ్లాగ్
  • వ్యక్తిగత కధలు, వ్యక్తిగత ఆలోచనల గురించి ఆకట్టుకునే బ్లాగ్ పోస్టులు.
  • సమస్యలు వాటికి పరిష్కారాలు
  • ఎక్కువగా లేదా కామన్ గా పుట్టే ప్రశ్నలు వాటికి సరైన సమాధానాలు
  • ప్రయాణాలు, ప్రయాణ ప్రదేశాలు, ప్రయాణంలో జాగ్రత్తలు, ప్రయాణపు ప్రణాలికలు
  • వెబ్ సైటుల జాబితా, వర్గాల వారీగా బ్లాగుల జాబితా…
  • కార్యాచరణకు సంబంధించిన విషయాలు
  • టెక్నాలజీ…. పెద్ద విషయం, కొత్త విషయం, నవీకరణ విషయం.
  • ప్రసిద్ద వ్యక్తుల గురించి వెబ్ సైట్ లేదా బ్లాగ్
  • స్టడీకి సంబంధించిన విషయాలు, సబ్జెక్టుపరమైన విషయాలలో వివరణలు
  • దేని గురించైనా సమర్ధవంతమైన విశ్లేషణలతో బ్లాగు
  • ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సమాచారం
  • రాజకీయాలు, సినిమాలు, ఆటలు, న్యూస్
ఆలోచనలు ఆచరణ పెడితే డబ్బులు సంపాదనకు మంచి మార్గం లభించగలదు
  • ఏదైనా ఒక రంగంలో ప్రారంభపు దశలో ఉపదేశాలు. ఉదాహరణకు బ్లాగింగ్ చేయడంలో ప్రధమంగా చేయవలసిన పనులు, ప్రధమంగా ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలు.
  • గ్రీటింగ్స్ తెలియజేయడం గురించి వివరాణత్మక విషయాలు
  • వ్యాపార సమాచారం, డబ్బుల ఆదాయం మరియు ఆదా చేసే విషయాలలో…
  • ప్రత్యేక ఆఫర్స్ తెలియజేసే సమాచారం అందించడం.
  • ఆన్ లైన్ లో లభించే పరికరాలు, సాధనములు గురించి బ్లాగింగ్ చేయండి. వర్డ్ టు పిడిఎఫ్, ఇమేజ్ టు పిడిఎఫ్ ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. అలా ఉండే వివిధ రకాల టూల్స్ అన్ని రంగాలలోనూ ఉచితంగా కూడా లభిస్తాయి. అలాంటి వాటిని తెలియజేస్తూ, వాటి లింకులను ప్రొవైడ్ చేయడం.
  • జాతకం, మరియు రాశిఫలాలు… భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే తపన అందరికీ ఉంటుంది. గ్రహ కదలిలకు వ్యక్తుల స్వభావంపై ప్రభావం చూపుతూ ఉంటాయి… కాబట్టి రాశిఫలాల గురించి సరైన సమాచారం లభిస్తుంటే, వీక్షకులకు మీ వెబ్ సైట్ మరింత చేరువ కాగలదు.
  • యోగాభ్యాసం, యోగాసనాలు… ఒత్తిడితో ఆనారోగ్యం పాలయ్యేవారు అధికం అంటారు. అలాంటి ఒత్తిడి జయించే మార్గాలలో యోగ ఒక్కటి. దాని గురించి, దాని గొప్పతనం గురించి, దాని విలాసం గురించి… ఆసక్తికరంగా తెలియజేయగలిగితే… అలాంటి బ్లాగు ద్వారా డబ్బులు సంపాదించడం సులభం అంటారు.
  • మెకానిజం వివిధ విషయాలలో రిపేరింగ్ సర్వ సాదారణం. కాబట్టి… వివిధ వస్తువుల గురించి వాటి రూపకల్పన గురించి, వాటి రిపేరింగ్ గురించి బ్లాగు విజయవంతం కాగలదు. టివి మెకానిజం, ఫ్రిజ్ మెకానిజం, బ్లాగ్ మెకానిజం, ఛానల్ మెకానిజం, మోటార్ మెకానిజం…
  • లా… మోసం, ద్రోహం జరుగుతున్నప్పుడు వ్యక్తి న్యాయం కోసం తపిస్తాడు. అలాంటివారికి ఎలాంటి న్యాయ సలహాలు అవసరం. ఎలాంటి సెక్షన్లు ఎలా సాయపడతాయి… అవగాహన కల్పించే బ్లాగు కూడా విజయవంతం కాగలదని అంటారు.
విద్యావిషయాల అవగాహన ఆలోచనలు కోటి రూపాయిల డబ్బు సంపాదనకు ఆలోచనలుగా మారవచ్చును.
  • కళాశాలలు, కళాశాల నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్…. పది పూర్తయితే వచ్చే ఆలోచన… ఏ కళాశాలలో ఏ కోర్సులు గురించి? ఇలాంటి ప్రశ్నలకు మీబ్లాగులో సమాధానాల లభిస్తే, అది మీబ్లాగు విజయవంతం కావడంలో సాయపడగలదు.
  • పుడ్… గురించి తెలియజేసే బ్లాగు. ఈ కల్తీ పుడ్ పెరుగుతున్న కాలంలో కల్తీలేని పుడ్ గురించి ఎంత నమ్మదగిన సమాచారం అందిస్తారో? మీ సమాచారం మీ బ్లాగు వీక్షకులను పెంచుతుంటే, అదే ఆదాయపు వనరుగా మారుతుంది.
  • వాతావరణం
  • కోడింగ్
  • బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, లోన్స్
  • ఉత్పత్తి
  • వ్యవసాయం
  • రైతుల గురించి
  • చేతి వృత్తుల గురించి
  • ప్రేమ
  • సీరియల్స్
  • కధలు
  • గమనం
  • సామాజిక మార్పులు
  • చరిత్రతో వర్తమానం గురించి
ఫేస్ బుక్ పేజీ మరియు ఫేస్ బుక్ గ్రూపుల వలన కోటి రూపాయిలు డబ్బులు సంపాదించవచ్చా?

అవుననే అంటారు. అయితే ఎక్కువకాలం సమయం పడుతుంది. కానీ కొంత ఖర్చు చేస్తే, అది కూడా ఆదాయపు వనరుగా మారవచ్చును. ఒక విషయంలో సరైన సమాచారంతో బాటు ఆకట్టుకునే చిత్రాలతో ఫేస్ బుక్ యూజర్ల లైక్స్ సంపాదించిన పేజి మరియు దానికనుగుణంగా గ్రూప్ బాగా ప్రసిద్ది చెందితే, అప్పుడు ఫేస్ బుక్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చును.

ఫేస్ బుక్ పేజి లక్షలమంది ఫాలో అవుతుంటే, దాని ద్వారా సరైన ఆదాయం పొందగలమని అంటారు. అలాగే గ్రూపులో లక్షలమంది సభ్యులు ఉండాలని అంటారు. ఎందుకంటే ఒక ప్రచార లింకుని పేజిలో కానీ గ్రూపులో కానీ పోస్ట్ చేస్తే, అది అనేకమందికి చేరితే, కొందరు చూస్తారు. కొందరు లైక్ చేస్తారు. అతి కొద్దిమంది లింక్ క్లిక్ చేస్తారు. కాబట్టి ఎంత ఎక్కువమందికి మీ అఫిలియేట్ లింకు చేరగలిగి, ఎక్కువమంది క్లిక్ చేసి, కొందరు ప్రచారపు లింక్ ద్వారా కొనుగోలు కానీ సబ్ స్క్రైబ్ కానీ జరిగితే, అప్పుడు ఆదాయం ఏర్పడుతుంది. ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడానికి ఫేస్ బుక్ ను కూడా ఉపయోగించవచ్చును. కానీ అందుకు సమయం ఎక్కువ కావాలి. లేదా మీరు కొంత డబ్బును చెల్లించి, పేస్ బుక్ పేజి లైక్స్ పెంచుకుంటే, ఆ తర్వాత మీరు అందించే అఫిలియేట్ లింకుల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చును. కానీ కొన్ని అఫిలియేట్ లింక్స్ ఫేస్ బుక్ నిరోదిస్తుంది.

ఏది ఉత్తమ మార్గము అంటే

ఒక యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా ఉంటే,

దానికి అనుషంగికంగా యూట్యూబ్ ఛానల్ కంటెంటు వచన రూపంలో వివరించే బ్లాగు, యూట్యూబ్ వీడియోల లింకులు, బ్లాగు లింకులు షేర్ చేయడానికి ఫేస్ బుక్ పేజి, ట్విట్టర్ ఖాతా, ఇన్ స్టాగ్రామ్ ఖాతా తదితర సోషల్ మీడియా నెట్ వర్క్ కూడా ఉంటే, త్వరగా ఛానల్ ద్వారా ఆదాయం సంపాదించడానికి అవకాశాలు పెరగుతాయి.

అలాగే మీకు ఒక బ్లాగ్ ప్రధానం ఉంటే,

బ్లాగు పోస్టులను వీడియోలుగా మార్చి, ఆవీడియోలతో యూట్యూబ్ ఛానల్ మీ బ్లాగుకు మరింత మద్దతుగా మారగలదు. ఇంకా మీ బ్లాగు పోస్టుల ఉచిత ప్రచారం కోసం సోషల్ మీడియా ఖాతాలు… అంటే ఫేస్ బుక్ పేజీలు, గ్రూపులు, ట్విట్టర్, టంబ్లర్, పిఇంటరెస్ట్, ఇన్ స్టాగ్రాం, లింక్డిన్ తదితర సోషల్ మీడియా ఖాతాలు.

చివరగా ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి ముందుగా మనం ఎంచుకున్న మార్గమును మనం నమ్మాలి.

ఎలా డబ్బులు సంపాదించాలి? ప్రశ్న పుట్టగానే పుట్టే ఆలోచనలు పుట్టలు పుట్టలు గా ఉండవచ్చును. అందులోంచి మన పనితీరుకు తగ్గట్టుగా ఇంకా మన ఆసక్తికి అనుగుణంగా ఉండే ఆలోచనను ఎంచుకోవాలి. ఎందుకంటే, మనకు నచ్చిన పనిని మనం ఎక్కువకాలం కొనసాగిస్తాము. ఎక్కువ ఇష్టంగా చేయగలుగుతాము. కాబట్టి మన ఆసక్తికి, మనకు వచ్చిన పనికి సంబంధించిన ఆలోచనతో ముందుకు సాగడం వలన దీర్ఘకాలంలోనైనా సరైన సంపాదన ప్రారంభం కావచ్చును. ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం, మనం ఎంచుకున్న మార్గంపై మనకు నమ్మకం ఉండాలి. పట్టుదలతో కృషి చేయాలి.

తెలుసుకోవడం ఎంత ముఖ్యమో? విలువైన సమాచారం తెలుసుకోవడం అంటే ముఖ్యం. ఆలోచన చేయడం ఎంత ప్రధానమో? సాద్యమయ్యే ఆలోచనా దృక్పధంతో ఉండడం ప్రధానం. సంపాదించాలనే తాపత్రయం ఎంత అవసరమో? సంపాదన మార్గం ఎంచుకోవడం సంశయం లేకుండా ఉండడ ప్రధానం. ప్రారంభించే ముందే నిపుణలు సూచనలు, స్నేహితుల సలహాలు, పెద్దల అభిప్రాయాలు… చాలా సాయపడతాయని అంటారు.

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

kadhalu

ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

మీకు బాగా విద్యార్ధులకు బాగా బోధించడం వచ్చును. మీరు ఆన్ ట్యూటర్ గా ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయడానికి ప్రయత్నించవచ్చును. మీకు ఒక టెక్నికల్ వస్తువు గురించి బాగా వివరించడం వచ్చును. మీరు ఒక రివ్యూ అడ్వైజరుగా డబ్బును సంపాదించవచ్చును.

మీకు అందమైన డిజైన్ చేయడం వచ్చును. మీరు ఒక డిజైనర్ గా డబ్బు సంపాదించవచ్చును. ఇక ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ స్కిల్స్ ఉంటే, ఆన్ లైన్లో తేలికగా డబ్బు సంపాదించవచ్చును. అయితే మీకు వచ్చిన విషయం ఆన్ లైన్లో డిమాండ్ ఉండి ఉండాలి. పోటీ ఉన్న అంశంలో అయితే బాగా కష్టపడాలి.

అయితే ఆన్ లైన్ డబ్బు సంపాదన అనగానే ఆన్ లైన్ మోసాలు మొదట గుర్తుకు వస్తుంటాయి. కొన్ని వెబ్ సైట్లలో చైన్ లింకింగ్ స్కీములు యూజర్లను ఆకర్షిస్తాయి. వాటిలో ముందుగా కొంత డబ్బు జమచేస్తే, వారి తరపున మరికొంతమంది యాడ్ చేయడం… వారి కింద ఇంకొంత మంది ఇలా లింకింగ్ సిస్టం ఉంటుంది.

ఒక యూజర్ వేయిరూపాయిలు కట్టి, ఏదైనా ఒక వెబ్ సైటులో జాయిన్ అయితే, అతని తరపున కొందరిని యాడ్ చేయడం… వారితో మాట్లాడి డబ్బులు పే చేయిండం… అలా ఒకరి నుండి మరొకరి కమ్యూనికేషన్ ఏర్పడి ప్రతి ఒక్కరూ జాయినింగ్ ఫీజు లేదా ఏక్టివేషన్ ఫీజు అంటూ నిర్ధిష్టమైన మొత్తము సంస్థకు పే చేస్తూ ఉంటారు.

ఆశతో జాయిన్ అయ్యేవారికి చాలామందికి నిరాశ ఎదురౌతుంది. కేవలం వేయి రూపాయిలు పే చేయండి, నెల నెల వేలల్లో డబ్బు సంపాదించండి. అంటూ ప్రకటనలు ఉంటాయి. అవి ఆకట్టుకోవడానికే ఉంటాయి. వీటిని చూసి మోసపోవడం ఉంటుంది.

ఇంకా కొన్ని తరహా వెబ్ సైట్లు అయితే వీడియో వాచ్ చేయండి…. డబ్బు సంపాదించండి. లేక యాడ్స్ క్లిక్ చేయండి….డబ్బు సంపాదించండి. లేక గేమ్స్ ఆడండి…డబ్బు సంపాదించండి. షేర్ చేయండి…డబ్బు సంపాదించండి… ఇలా చాలా తరహా ఉంటాయి. వీటిలో మొదటిగా జాయిన్ అయినవారికి కొంత ప్రయోజనం ఉండవచ్చేమో కానీ ప్రతిఒక్కరికి ప్రయోజనం కలగదు.

ఇలాగే మనీ ఎక్సేంజ్ అంటే ఒక కరెన్సీలో డబ్బును జమ చేసే, ఆ కరెన్సీ రేటు మారగానే అమ్మేయడం. పదివేలకు డాలర్లు తక్కువ రేటులో కొని, డాలరు రేటు ఎక్కువకు పెరగగానే అమ్మేయడం. ఇటువంటి వెబ్ సైట్లలో కొన్ని సంస్థలవారు ఫేక్ ఇండెక్స్ చూపించి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది.

కష్టపడకుండా సొమ్ములు కూడబెట్టలేము.

కష్టం లేకుండా ఇష్టం తీరే అవకాశం ఉండదు. కష్టపడకుండా సొమ్ములు కూడబెట్టలేము. ఊహలకే పరిమితం అవుతుంది. కేవలం ఊహలు ఒక అంచనా కొరకే కానీ సంపాదించడానికి కాదు.

అయితే ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయాలంటే ఎటువంటి వెబ్ సైట్లను దర్శించాలి. ఎటువంటి వెబ్ సైట్లలో నిజంగా డబ్బును సంపాదించవచ్చును. ఎటువంటి వెబ్ సైట్ల వారు డబ్బును ఖచ్చితంగా పే చేస్తారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ఇంటర్నెట్ ఉపయోగిస్తూ, ఆన్ లైన్లో డబ్బు సంపాదించడానికి ముందుగా కావాల్సింది… విద్య. మన దగ్గర ఎటువంటి విద్య ఉంది? ఆ విద్యకు ఆన్ లైన్లో ఉన్న డిమాండ్ ఏమిటి? ఇది ఖచ్చితంగా తెలుసుకుంటే డబ్బును సంపాదించడానికి ఆన్ లైన్ వే కరక్టుగానే ఉంటుంది.

మీకు వచ్చిన విద్య ద్వారా మీరు ఆన్ లైన్ వర్కరుగా మారాలంటే మాత్రం ఫ్రీలాన్స్ వెబ్ సైట్లు ఉపయోగపడతాయి. కొన్ని డిమాండ్ ఉన్న వెబ్ సైట్ల ద్వారా మీరు ఖాతాను ప్రారంభించి ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించవచ్చును. అప్ వర్క్, గురు, ఫివర్, ఫ్రీలాన్సర్, ట్రూలాన్సర్, ఎస్ఇఓ క్లర్క్స్, ఇలా పలు రకాల వెబ్ సైట్ల ద్వారా ఆన్ లైన్లో డబ్బును సంపాదించవచ్చును.

మీరు ప్రొఫైల్లో చేర్చిన వివరణ కన్నా మిన్నగా మీ వర్కు ఉంటే, మీ ప్రొఫైల్ పై 100% మంచి అభిప్రాయం ఉంటుంది.

ఈ ఫ్రీలాన్స్ వెబ్ సైట్లలో మీకు వచ్చిన వర్కును గురించి వివరణ ఖచ్చితంగా ఉండాలి. మీరు ప్రొఫైల్లో చేర్చిన వివరణ కన్నా మిన్నగా మీ వర్కు ఉంటే, మీ ప్రొఫైల్ పై 100% మంచి అభిప్రాయం ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయితే మీకు తెలిసిన విషయం గురించి వివరంగా వ్రాయండి. మీకు గతంలో పనిచేసిన ప్రొజెక్టులు ఏవైనా ఉంటే, వాటి గురించి తెలియజేయండి. మీ ప్రొఫైల్ ఆకర్షించినట్టే, మీ వర్కు కూడా కస్టమర్ ని సంతృప్తిపరిస్తే, మీ ప్రొఫైల్ కు డిమాండ్ పెరుగుతుంది.

కొన్ని ఫ్రీలాన్స్ వర్కులను అందించే వెబ్ సైట్ల లింకులు ఈ క్రిందగా ఉన్నాయి….

ఏదైనీ ఒక సంస్థ ద్వారా ఆన్ లైన్లో డబ్బు సంపాదించాలంటే ఫ్రీలాన్సర్ గా పని చేస్తూ ఉంటారు. పైన బటన్ల రూపంలో ఉన్న లింకులు ఫ్రీలాన్స్ వర్కులను తెలియజేస్తాయి.

ఇక తమకు తామే ఓనరుగా డబ్బు సంపాదించాలంటే ఆన్ లైన్లో ఎలా? ఇందుకోసం చాలామంది ఎన్నుకునే మార్గములలో ప్రధానంగా ఒకటి యూట్యూబ్ చానల్, రెండు బ్లాగింగ్ చేయడం ఉంటుంది. ఈ రెండు మార్గములు జన్యూన్ గానే డబ్బులు వస్తాయి.

ప్రారంభంలో వీడియోలను పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. మీరు పోస్టు చేసిన వీడియో ఆన్ లైన్ యూజర్లకు నచ్చి, వాటి వ్యూస్ పెరిగి, మీకు సబ్ స్కైబర్స్ పెరిగితే…

కానీ ప్రారంభంలో కేవలం కంటెంటును అందిస్తూ ఉండడమే ఉంటుంది. అంటే మీరు యూట్యూబ్ చానల్ ప్రారంభింస్తే, అందులో మీరు ప్రారంభంలో వీడియోలను పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. మీరు పోస్టు చేసిన వీడియో ఆన్ లైన్ యూజర్లకు నచ్చి, వాటి వ్యూస్ పెరిగి, మీకు సబ్ స్కైబర్స్ పెరిగితే… మీకు ఆదాయం రావడం ప్రారంభం అవుతుంది.

యూట్యూబ్ చానల్ సౌలభ్యం ఏమిటంటే, టెక్నికల్ స్కిల్స్ అంతగా లేకపోయినా ట్రెండింగ్ సబ్జెక్టు ద్వారా చానల్ సక్సెస్ చేయవచ్చును. చిట్కాలు, వింతలు, ట్రావెలింగ్ విషయాలు ఇలా చాలా విషయాలలో విభిన్నంగా విపులంగా విశ్లేషణాత్మక వీడియోల ద్వారా యూట్యూబ్ చానల్ విజయవంతం చేయవచ్చును.

ఆన్ లైన్ డబ్బు సంపాదన

యూట్యూబ్ చానల్ ద్వారా డబ్బు సంపాదించాలనే వారికి, యూట్యూబ్ చానల్ వారి రూల్స్ కూడా బాగా తెలియాలి. అప్పుడప్పుడు యూట్యూబ్ చానల్ రూల్స్ మారుతూ ఉంటాయి. మినిమన్ వ్యూస్, మినిమమ్ సబ్ స్క్రైబర్స్ అంటూ నిబంధనలు జోడిస్తూ ఉంటారు.

అలాగే బ్లాగును ప్రారంభించినా… ఆబ్లాగుకు యూనిక్ విజిటర్స్, రిపిటెడ్ విజిటర్స్ ఉంటే మీకు ఆదాయం వస్తుంది. బ్లాగు కూడా యూట్యూబ్ చానల్ లాగానే కంటెంటు ఎంపిక ఉంటుంది. అయితే యూట్యూబ్ చానల్ ద్వారా వీడియోల రూపంలో తెలియజేస్తే, బ్లాగు ద్వారా మాత్రం పోస్టుల రూపంలో విషయ విశదీకరణ ఉంటుంది.

ఒక అంశంలో బ్లాగును సృష్టిస్తే ఆ అంశముపై వివరణా విపులంగా విస్తారంగా ఉండాలి.

ఏదేని ఒక అంశంలో బ్లాగును సృష్టిస్తే ఆ అంశముపై వివరణా విపులంగా విస్తారంగా ఉండాలి. ఇక రీడర్ రీడ్ చేయడానికి ఈజీగా ఉండాలి. ప్రధానంగా కంటెంటు డూప్లికేట్ అయ్యి ఉండకూడదు.

అయితే ఈ బ్లాగింగ్ చేయడం కూడా చాలా సులభమనే చెబుతారు. గూగుల్ అందించే బ్లాగర్ వెబ్ సైటు ద్వారా కేవలం ఒక్క జిమెయిల్ ఖాతాతో బ్లాగును నిమిషాలలో క్రియేట్ చేయవచ్చును. వెను వెంటనే మీకు తెలిసిన విద్యలో ఆర్టికల్స్ పోస్టు చేయవచ్చును.

గూగుల్ అందించే బ్లాగర్ ద్వారా ఉచితంగానే ఒక బ్లాగును సృష్టించవచ్చును. ఇంకా వెబ్ స్పేస్ ఉచితంగానే లభిస్తుంది. అయితే డొమైన్ విషయంలో మాత్రం మీరు కొంత సొమ్మును ఖర్చు చేయాలి. డొమైన్ విషయంలో పట్టింపు లేకపోతే, గూగుల్ బ్లాగర్ సూచించే ఏదేని ఒక సబ్ డొమైన్ ద్వారా గూగుల్ బ్లాగును సృష్టించేయవచ్చును.

బ్లాగర్ ద్వారా సృష్టించబడిన మీ బ్లాగుకు మీరు ఎప్పటికప్పుడు రెగ్యులరుగా ఆర్టికల్స్ పోస్టు చేస్తూ ఉండాలి. మీ బ్లాగుకు తగినంత ట్రాఫిక్ క్రియేట్ అయ్యాకా మీరు గూగుల్ యాడ్స్ అప్లై చేయవచ్చును. గూగుల్ యాడ్స్ అప్రూవ్ అయితే, మీ బ్లాగు ద్వారా మీకు ఆదాయం ప్రారంభం అవుతుంది.

ఆదాయం రావడం అనేది మీరు ఎంపిక చేసుకున్న కంటెంటును బట్టి ఉంటుంది.

ఏదైనా గూగుల్ ద్వారా రుపాయి ఖర్చులేకుండా డబ్బును బ్లాగను మెయింటైన్ చేయడం ద్వారా సంపాదించవచ్చును. అయితే ఈ విధానం ఆదాయం రావడం అనేది మీరు ఎంపిక చేసుకున్న కంటెంటును బట్టి ఉంటుంది.

https://www.youtube.com/watch?v=YlipwOUEBJ4
ఆన్ లైన్ డబ్బు సంపాదన

మీరు సృష్టించిన బ్లాగు మంచి ట్రాఫిక్ బాగుండి గూగుల్ యాడ్స్ అప్లై చేస్తే, యాడ్ సెన్స్ అప్రూవల్ త్వరగానే వస్తుంది.

మీకు కొంత టెక్నాలజీపై అవగాహన ఉండి, బ్రౌజింగ్ వంటి విషయాలలో పట్టు ఉంటే, వర్డ్ ప్రెస్ ద్వారా కూడా ఒక బ్లాగును సృష్టించవచ్చును. వర్డు ప్రెస్ ద్వారా మీరు బ్లాగు ఆర్టికల్స్ పోస్టు చేసి డబ్బులు సంపాదించవచ్చును. వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ లుక్ ప్రొఫెషన్ వెబ్ సైటు లుక్ ఉంటుంది.

ఆన్ లైన్ డబ్బు సంపాదన

వర్డు ప్రెస్ వెబ్ సైటులో గూగుల్ యాడ్ సెన్స్ యాడ్ చేయడం సులభమే అంటారు. అయితే యాడ్స్ అప్రూవ్ అవ్వడానికి తగినంత కంటెంట్ మీ వర్డు ప్రెస్ బ్లాగులో ఉండాలి. అలాగే వర్డు ప్రెస్ బ్లాగులో పేజిలు కూడా ఖాళీ లేకుండా ఉండాలి.

బ్లాగు కంటెంట్ విషయంలో ఏవిధమైన టాపిక్ అయితే బాగుంటుంది. ఇదే ఇంపార్టెంట్ మీ బ్లాగు కానీ యూట్యూబ్ చానల్ కానీ సగం విజయం టాపిక్ ఎంచుకోవడంలో ఉంటే, ఆటాఫిక్ పై మీరు కంటిన్యూగా అందించే కంటెంట్ తో మిగితాది ఉంటుంది.

ఆన్ లైన్ డబ్బు సంపాదన పాపులర్ బ్లాగు కంటెంట్ అంశాలు

  • న్యూస్
  • సినిమా న్యూస్
  • క్రీడలు న్యూస్
  • టెక్నాలజీ ఆర్టికల్స్
  • రివ్యూస్ అండ్ కంపారిజన్
  • ట్యుటోరియల్
  • టిప్స్ అండ్ ట్రిక్స్
  • వంటిల్లు
  • రుచులు
  • స్టార్టప్ ఐడియాస్
  • పిల్లలు శ్రద్ద
  • ఫోన్ రేడియేషన్
  • బుక్స్
  • ఫ్యాషన్
  • బయోగ్రఫీ ఆఫ్ లెజండ్స్
  • ఆన్ లైన్ మనీ ఎర్నింగ్
  • బిజినెస్ ఐడియాస్
  • స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్
  • ఎక్కౌంటింగ్
  • సాఫ్ట్ వేర్ యూజ్
  • డవలపింగ్ టూల్స్ గురించి
  • టూర్స్ అండ్ ట్రావెల్స్
  • టెంపుల్స్
  • ఆస్ట్రాలజీ
  • డైలీ టిప్స్
  • జాబ్ న్యూస్
  • డిజిటల్ మార్కెటింగ్
  • ఓటిటి సినిమా రివ్యూస్
  • వివిధ చానల్ సీరియల్స్ గురించి
  • షేర్ మార్కెట్
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్

ఇలా ఎప్పటికప్పుడు మారే ఆన్ లైన్ ట్రెండింగ్స్ ఫాలో అవుతూ ఉంటే, మనకు మంచి కంటెంట్ లభిస్తుంది. మనకు మంచి అవగాహన ఉన్న అంశంలో ఇప్పటికే చానల్ కానీ బ్లాగు కానీ ఉన్నా, మనం బ్లాగును కానీ చానల్ కానీ ప్రారంభం చేయవచ్చును.

ఎప్పుడూ ఒకే ట్రెండు ఎక్కువకాలం కొనసాగదు. అలాగే ఎప్పుడూ ఒకరి ట్రెండు కొనసాగదు. కాబట్టి మన స్టైల్ ఎక్కువమందికి నచ్చితే మనం విజయం సాధించవచ్చును. అయితే మనకు తెలిసిన విషయంలో మనకు ఇతరుల కన్నా ఎక్కువ విషయం తెలిసి ఉండాలి. వారికన్నా బాగుగా మనం కంటెంటును తెలియజేయాలి.

నాణ్యమైన పనియొక్క ఫలితం నిష్ప్రయోజనం కాదు.

ఆన్ లైన్ డబ్బు సంపాదనకు మార్గాలు అనేకం ఉంటాయి. అందులో ముఖ్యంగా తేలికైనవి కష్టపడితే ఫలితం ఉండేవి మాత్రం…. యూట్యూబ్ చానల్ మరియు బ్లాగింగ్…

ఎప్పటికప్పుడు మారే సామాజిక సాంకేతిక కాలంలో మనం ఎంచుకునే మార్గం కూడా అలానే ఉంటుంది. ఏదైనా చేతిపని అయితే దానికి కొంతకాలం పాటు మార్పులేకుండా ఆదాయం డిమాండ్ ను బట్టి ఉంటుంది. అయితే ఆన్ లైన్లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై దృష్టి పెడుతూ, పాత విషయాలలో జరిగిన లాభనష్టాలను విశ్లేషిస్తూ, సాగితే ఆన్ లైన్ ద్వారా బ్లాగింగ్ మరియు యూట్యూబ్ చానల్ విజయవంతం చేయవచ్చును.

గూగుల్ సంబంధించిన ఉత్పత్తులతో బ్లాగింగ్ నిర్వహించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ ఉండాలి. లేకపోతే బ్లాగ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

మీకు కోడింగ్ నాలెడ్జ్ కొంచె ఉంటే మాత్రం వర్డుప్రెస్ ఒక హోస్టింగ్ ఖాతా ద్వారా మెయింటైన్ చేయడం వలన బ్లాగుపై అంతగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక్కసారి వర్డ్ ప్రెస్ మీరు ఎంపిక చేసుకున్న డొమైన్ పై ఇన్ స్టాల్ చేసుకుంటే, ఆపై మీరు వర్డ్ ప్రెస్ లో లాగన్ బ్లాగు పోస్టులు కంటిన్యూ పోస్ట్ చేయవచ్చును.

కంట్రోల్ ప్యానెల్ గురించి తెలుసుకుంటే, మీకు మీరు కంట్రోల్ ప్యానెల్ ద్వారా వర్డ్ ప్రెస్ ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో ఏదైనా యూట్యూబ్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చును.

ధన్యవాదాలు తెలుగురీడ్స్