అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి రావాలంటే ఎలా? అమ్మ ఒడి అర్హులైనవారికి మాత్రమే అంటున్నారు. 2020, 2021లో జనవరి నెలలో అమ్మఒడి (Amma Vodi) పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం 2022లో మాత్రం కొన్ని నియమాలు చేర్చింది. ఇంకా జూన్ నెలకు అమ్మ ఒడి పధకం అమలు చేయలని భావించారు.
విద్యార్ధి హాజరు శాతం బాగుండాలి. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం దాటరాదు. ఇంకా విద్యార్ధి యొక్క తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉండాలి. తమ పిల్లలకు ఇకెవైసి జరిగి ఉండాలి. లేకపోతే వాలంటీర్ ద్వారా ఇకెవైసిని చేయించుకోవాలి. తల్లి బ్యాంక్ ఖాతాలో మినిమమ్ ఎమౌంట్ ఉండి, ఆ బ్యాంక్ ఖాతా చలామణిలో ఉండాలి. అదే బ్యాంక్ ఖాతా పిల్లవాని స్కూల్ రికార్డులలో అంటే స్కూల్ తరపున ఆన్ లైన్లో రిజిష్టర్ అయి ఉండాలి. స్కూల్ ఆన్ లైన్ వెబ్ సైటులో పిల్లవాని వివరాలు సరిగ్గా ఉండాలి.
మదర్ ఆధార్ లో ఏ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉందో తెలుసుకోవడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.
ఈ పై బటన్ పై క్లిక్ చేయండి. ఆధార్ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
అక్కడ విద్యార్ధి / విద్యార్ధిని యొక్క మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. తల్లి ఆధార్ కార్డులో నమోదు అయి ఉన్న మొబైల్ నెంబరుకు ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేయగానే తల్లి ఆధార్ కార్డుకు జోడించబడి ఉన్న బ్యాంకు పేరు మీకు కనబడుతుంది. అదే బ్యాంక్ ఖాతా స్టూడెంట్ ఇన్ పో లో స్కూల్ యాజమాన్యం సాయంతో అప్డేట్ చేయించుకుని ఉండాలి.
అమ్మ ఒడి అర్హుల జాబితా
ఇప్పటికే అమ్మ ఒడి అర్హుల జాబితా ప్రకటించబడింది. అమ్మఒడి అర్హుల జాబితా లిస్టు కొరకు ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి. అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి అమ్మ ఒడి పధకం అర్హుల జాబితాలో పేరు సరిచూసుకోవాలి. అందులో పేరు ఉండడమే కాకుండా బ్యాంక్ ఖాతా ఆధార్ కు అనుసంధానం అయి ఏక్టివ్ లో ఉందో ఇన్ ఏక్టివ్ లో ఉంది సరిచూసుకోవాలి. ఇన్ ఏక్టివ్ లో ఉంటే, బ్యాంకులో ఆధార్ అనుసంధానం చేసుకోవాలి.
ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022 Aweber వంటి ఇమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్ వేర్ గురించి తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతివారికి ఒక ఇమెయిల్ తప్పనిసరి. కాబట్టి ఇమెయిల్ మార్కెటింగ్ ద్వారా వస్తువు లేదా సేవను ప్రమోట్ చేయవచ్చును. మీ బిజినెస్ ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఉపకరించవచ్చును.
టాప్ బ్లాగర్స్ మరియు సంస్థలు తమ అఫిలియేట్ వస్తువులను ఇమెయిల్ మార్కెటింగ్ ఉపయోగించుకుని విజయవంతం అవుతున్నారు.
ముందుగా ఇమెయిల్ మార్కెటింగ్లో లీడర్ గా ఉన్న Email Marketing Software Aweber గురించి చూద్దాం.
Popular Email Marketing Software
ప్రత్యేకంగా ఇమెయిల్ మార్కెటింగ్ కోసం ఇమెయిల్ ద్వారా వార్తాలేఖలను అందించడానికి Aweber చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభం మరియు కొత్తవారికి త్వరగా సులభంగా అవగతం అవుతుంది. మీరు Aweber కోసం మీరు నమోదు కావడానికి సైన్ అప్ అవ్వండి. మీరు మీ ఇమెయిల్ జాబితాను రూపొందించడం ప్రారంభించవచ్చును. Aweber మీరు మీ ఇమెయిల్ జాబితాపై నియంత్రణను కలిగి ఉంటారు మరియు మీ ఇమెయిల్ చందాదారులకు కొత్త నవీకరణలను ఎప్పుడు పంపాలో మీరు నిర్ణయించుకోవచ్చు. Aweber గురించిన ఉత్తమమైన అంశం ఏమిటంటే, డ్యాష్‌బోర్డ్‌ను అర్థం చేసుకోవడం మరియు దానిపై పని చేయడం సులభం. Aweberని ఇతరుల నుండి వేరు చేసేది వారు అందించే ఫీచర్‌లు మరియు మద్దతు బాగుంటుంది.
Aweberని ఉచితంగా పొందితే, ఫ్రీ ఫీచర్స్ ఈ క్రింది విధంగా పరిమితంగా ఉంటాయి.
Up to 500 email subscribers Landing pages Web push notifications Drag and drop builder Email templates Sign up forms Ecommerce
మీరు అపరిమితమైన సబ్ స్కైబర్లకు అపరిమితంగా ఇమెయిల్ లెటర్స్ పంపించాలంటే, Aweber Pro కు సైన్ అప్ కావాలి.
ఇతర ఇమెయిల్ మార్కెటింగ్ ConvertKit ఒకటి.
అయితే ట్యాగింగ్, సెగ్మెంటేషన్, ఆటోమేషన్ వంటి ఆధునికమైన & తాజా ఇమెయిల్ మార్కెటింగ్ టెక్నిక్‌లను అందించే వాటిని ఎంచుకోవడానికి మీకు అవకాశం ఉంది. 2022లో మీరు ఎక్కువగా వినగలిగే ఇమెయిల్ మార్కెటింగ్ సేవల్లో ConvertKit ఒకటి. మీకు ఈబుక్ లేదా మెంబర్‌షిప్ సైట్ ఉంటే, మీరు దీన్ని మీ ఇమెయిల్ మార్కెటింగ్ స్నేహితునిగా ఎంచుకోవడం మంచిది.
జాపియర్, ఆప్టిన్‌మాన్‌స్టర్, గమ్‌రోడ్, లీడ్‌పేజ్‌లు, వర్డ్‌ప్రెస్ వంటి అన్ని ప్రముఖ సేవలతో ఇది బాగా పనిచేస్తుంది. ఇది 1000 మంది సబ్‌స్క్రైబర్‌లకు నెలకు $29తో ప్రారంభమవుతుంది & ఆటోమేషన్ ఫీచర్‌లతో ఇది చాలా పటిష్టంగా ఉంటుంది.
మరొక మెయిల్ మార్కెటింగ్ టూల్ GetResponse
ఇది కూడా ఒక పాపులర్ మెయిల్ మార్కెటింగ్ సాప్ఠ్ వేర్, GetResponse ఇమెయిల్ మార్కెటింగ్ కోసం ఒక పాపులర్ అయ్యింది. Get Response మీ బడ్జెట్‌కు సరిపోయే ధరతో ఎక్కువ, తక్కువ ఖర్చుతో కూడిన ఇమెయిల్ మార్కెటింగ్ సేవను అందిస్తుంది. మీరు ఇమెయిల్ మార్కెటింగ్‌లో విజయం సాధించడానికి అవసరమైన అనేక అత్యాధునిక లక్షణాలను వీరు అందిస్తారు. వారు Webinar మద్దతుల ద్వారా మీకు సమాచారం అందిస్తారు, అనేక ఆన్‌లైన్ జనాదరణ పొందిన సేవలు, మొబైల్-ఆప్టిమైజ్ చేసిన టెంప్లేట్‌లతో ఏకీకృతం చేస్తారు ఇంకా వాటికి మొబైల్ యాప్‌లు కూడా ఉన్నాయి. GetResponse దాని ఇమెయిల్ మార్కెటింగ్ సేవలతో ప్రపంచవ్యాప్తంగా 350,000+ కస్టమర్లకు సేవలందిస్తుంది.
Get Response దాని ఇమెయిల్ మార్కెటింగ్ సేవలతో ప్రపంచవ్యాప్తంగా 350,000+ కస్టమర్లకు సేవలందిస్తుంది. వారు ఎటువంటి క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా 30 రోజుల ఉచిత ట్రయల్‌ను అందిస్తారు, ఇది ప్రారంభకులకు ఇది గొప్ప ప్రారంభ స్థానం. వారు డబుల్ ఆప్ట్-ఇన్ & సింగిల్ ఆప్ట్-ఇన్ రెండింటినీ అందిస్తారు.
Constant Contact
మరొక ఉత్తమ ఇమెయిల్ మార్కెటింగ్ Constant Contact కంపెనీ మరియు వారు ఆన్‌లైన్ సర్వే మరియు ఈవెంట్ మార్కెటింగ్‌కు బాగా ప్రసిద్ధికెక్కారు. Constant Contact వారి కస్టమర్ల కోసం దాదాపు 50 రెడీమేడ్ ఇమెయిల్ వార్తాలేఖలను కలిగి ఉంది. ఇది కూడా మీ వ్యాపార లేదా సేవ ప్రకటనలు ఇమెయిల్ ద్వారా పంపించడానికి ఉపయోగపడుతుంది.
MailChimp
Aweber తర్వాత ప్రముఖ ఎంపికలలో MailChimp ఒకటి. మెయిల్ చింప్ జనాదరణకు ఒక కారణం ప్రారంభ 2000 సబ్‌స్క్రైబర్ మరియు 12000 ఇమెయిల్‌లకు ఉచిత ఖాతా. పూర్తి ఉచిత ఇమెయిల్ మార్కెటింగ్ మీరు 2000 ఇమెయిల్ చందాదారుల జాబితా (ఉచిత ప్లాన్) కలిగి ఉంటే, మీరు ఒక నెలలో చాలా పరిమితమైన ఇమెయిల్‌లను మాత్రమే పంపగలరని మీరు తెలుసుకోవాలి. Mailchimp వారి ఆధునిక డాష్‌బోర్డ్ మరియు సహజమైన ఇంటర్‌ఫేస్ గురించి మంచిది. Mailchimp కూడా iOS యాప్‌ని కలిగి ఉంది, ఇది iPhone వినియోగదారులకు ఉపయోగపడుతుంది.
Campaigner
మీరు చందాదారుల యొక్క చిన్న జాబితాను కలిగి ఉంటే మరియు మీరు చిన్న రకమైన బ్లాగ్ లేదా వ్యాపారాన్ని నడుపుతుంటే ప్రచారకర్త మంచిది. ప్రచారకర్త వారి క్లయింట్‌ల కోసం 450+ రెడీమేడ్ న్యూస్‌లెటర్ టెంప్లేట్‌ను కలిగి ఉన్నారు. ప్రచారకర్త Aweber యొక్క ధర కంటే 20% తక్కువ ధర. ప్రచారకర్తకు 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఉంది.
అందుబాటులో ఉన్న ఇమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్ వేర్ కొరకు ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.
మన దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా స్మార్ట్ ఫోన్లో అనేక విషయాలను తెలుసుకోవచ్చును. అలా తెలియబడే విషయాలన్నీ ఎక్కువగా బ్లాగుల ద్వారా వెబ్ సైట్ల ద్వారా మన ఫోనులో కనబడతాయి. సాదారణంగా స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా మొబైల్ యాప్స్ వలన చాలా విషయాలు మన దృష్టికి వస్తూ ఉంటాయి. అలా కాకుండా గూగుల్ సెర్చ్ ద్వారా వెతకబడే విషయాలు బ్లాగులు లేదా న్యూస్ వెబ్ సైట్ల ద్వారా మనకు మన స్మార్ట్ ఫోనులో కనబడుతూ ఉంటాయి.
వర్డ్ ప్రెస్ ద్వారా సృష్టించబడిన బ్లాగులు లేక గూగుల్ బ్లాగర్ ద్వారా సృష్టించబడిన బ్లాగులు నుండి లేక న్యూస్ వెబ్ సైట్ల రూపంలో కానీ మనల్ని విషయాలు స్మార్ట్ ఫోను ద్వారా పలకరిస్తూ ఉంటాయి. ఇంకా వీడియో వ్లాగులు వలన ఎన్నో విషయాలను వీక్షించవచ్చును. వీడియో రూపంలో లేక బ్లాగు పోస్టుల రూపంలో మనకు విషయాలు స్మార్ట్ ఫోను ద్వారా తెలియబడుతుంటాయి.
ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగులలోని సమాచారం అనేక వీడియోలుగా కూడా మనకు కనబడుతుంటాయి.
అలాగే ఆన్ లైన్ ద్వారా సృష్టిస్తున్న బ్లాగుల ద్వారా వివిధ రంగాలలో సమాచారం అందించబడుతుంటుంది.
ఒక విషయం గురించిన వివరణ కానీ ఒక సమాచారం వివరణాత్మకంగా తెలియపరచడం కానీ బ్లాగులు చేస్తూ ఉంటాయి. కావునా బ్లాగింగ్ అనేది ఒక ఆన్ లైన్ వృత్తిగా రూపొందుతుంది. ఒకప్పుడు ప్రొఫైల్ ఆధారంగా తమ సమాచారం ఆన్ లైన్లో ఉంచడానికి అలవాటు అయిన బ్లాగింగ్ తర్వాత కాలంలో సమాచారం చేరవేయడానికి, విషయాలను వివరంగా తెలియజేయడానికి బ్లాగులు బాగా ఉపయోగపడుతున్నాయి.
ఏ రంగం అయినా బ్లాగు ద్వారా ఆ రంగం గురించి వివరణ చేయడం
క్రికెట్ గురించి సమాచారం, క్రికెట్ ఆటల వివరాలు, క్రికెట్ క్రీడాకారుల గురించి, క్రికెట్ మైదానల గురించి… క్రికెట్ గురించి సమస్త సమాచారం అందించే బ్లాగులు క్రికెట్ ప్రియులకు అవసరమైన సమాచారం అందిస్తూ ఉంటాయి. క్రికెట్ మాదిరిగానే వివిధ రంగాలలో వివిధ రకాల విషయాలను బ్లాగులు వివరించే ప్రయత్నం చేస్తాయి.
ఇలా ఏ రంగం అయినా బ్లాగు ద్వారా ఆ రంగం గురించి వివరణ చేయడం జరుగుతుంది. టెక్నాలజీ విషయానికొస్తే అనేక టెక్ గాడ్జెట్ల గురించి తెలియజేసే బ్లాగులు…. ఇంకా గాడ్జెట్ల గురించి వివరించే బ్లాగులు… ఇంకా టెక్నాలజీ రూపాంతరం ఎలా ఉంటుందో తెలియజేసే బ్లాగులు… విలువైన సమాచారం అందిస్తూ ఉంటాయి. కాబట్టి బ్లాగింగ్ ఎప్పటికీ ఒక ఎర్నింగ్ ఆన్ లైన రిసోర్స్ గా ఉండగలదని అంటారు.
ముఖ్యంగా ఆన్ లైన్లో సృష్టించబడిన, సృష్టించబడుతున్న బ్లాగులు ఎక్కువగా సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఉండడం వలన బ్లాగింగ్ చాలా విజయవంతం అవుతున్నాయని అంటారు.
అంటే బ్లాగులు ఒక వస్తువు గురించి తెలియజేస్తాయి. ఒక వస్తువు వాడుక విధానం తెలియపరుస్తాయి. ఒక వస్తువు వాడుకలో సమస్యలకు అందుబాటులో ఉన్న ఆన్ లైన్ పరిష్కార మార్గములను చూపుతాయి. ఒక వస్తువు యొక్క పనితీరుని సమీక్షిస్తాయి…
దైనందిన జీవితంలో బ్లాగుల ద్వారా విలువైన సమాచారం
వ్యక్తి జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. అటువంటి ఆరోగ్యం గురించి వివరించే బ్లాగులు అనేకం ఉంటాయి. రోగము, రోగ లక్షణాలు, రోగ నివారణ, రోగ నివారణకు చర్యలు, రోగ నిర్ధారణ… రక రకాలుగా ఆరోగ్యం గురించి సమాచారం అందించే బ్లాగులు ఆన్ లైన్లో అనేకంగా కనబడతాయి.
ఇంకా చిట్కాలు తెలియజేయడంలో బ్లాగుల ప్రత్యేకత ఉంటుంది. దైనందిన జీవితంలో అనేక అవసరాలు ఉంటాయి. అలాంటి అవసరాలకు చిన్నపాటి చిట్కాలతో సరిపోతుంది. అలా చిన్న చిన్న చిట్కాలకు విపులంగా వివరించడంలో బ్లాగులు, వ్లాగులు ఉపయోగపడతాయి.
ముందు జాగ్రత్త గురించి ముందుగానే హెచ్చరించే బ్లాగులు
స్మార్ట్ ఫోనుకు అలవాటు పడే అవకాశం
వ్యక్తి జీవితంలో స్మార్ట్ ఫోన్ ప్రధాన్యత
మనిషికి స్మార్ట్ ఫోన్ వలన ఉపయోగాలు
సమాజంలో స్మార్ట్ ఫోన్ చూపుతున్న ప్రభావాలు
చిన్న పిల్లలపై స్మార్ట్ ఫోన్ ప్రభావం
చిన్న వయస్సులోనే స్మార్ట్ ఫోన్ అలవాటు అయితే, పెద్దయ్యాక ఎదురయ్యే కళ్ళ సమస్యలు
ఇలా ఒక స్మార్ట్ ఫోన్ వలన ఉపయోగాలు, నష్టాలను వివరిస్తూ, అవి సమాజంపై ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయో… వాటికి అలవాటు పడకుండా ఉండడానికి ఎలాంటి చర్యలకు పూనుకోవాలి… తదితర జాగ్రత్తలను గురించి తెలియజేస్తూ హెచ్చరించే బ్లాగులు ఎక్కువగానే ఉంటాయి.
విద్యా విషయాలలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల పాత్ర
ఇంకా విద్యా విషయాలలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల పాత్ర అమోఘం అంటారు. L.K.G. నుండి డిగ్రీ వరకు ఎలాంటి సమాచారం విద్యార్ధులకు అవసరమో వాటిని బ్లాగులు అందిస్తూ ఉంటాయి.
పదవ తరగతి తరువాత ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం అందించడంలో అనేక బ్లాగులు పోటీ పడతాయి.
పరీక్షలకు మనసును ఎలా సమాయత్తం చేసుకోవాలి? ఈ ప్రశ్నకు సూచనలనిచ్చే బ్లాగులు అనేకం.
తరగతుల వారీగా ఆన్ లైన్ క్లాసుల వీడియోలను అందించే వ్లాగులు.
సబ్జెక్టుపై సందేహాలను వివరించే బ్లాగులు… సబ్జెక్టుపై వివరణాత్మక విశ్లేషణలు అందించే బ్లాగులు… వివిధ రకాలుగా విద్యా విషయాలలో బ్లాగులు సమాచారం అందిస్తూ ఉంటాయి.
సినిమా విషయాలను అందించడంలో బ్లాగులు ఉత్సాహం
వినోదం అందించే విషయాలలో వ్యక్తికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. వారి ఆసక్తికి తగ్గట్టుగానే వినోద విషయాలను, ఆ విషయాలకు సంబంధించిన వ్యక్తుల గురించి బ్లాగులు అనేక విషయాలను అందిస్తూ ఉంటాయి.
సినిమా నటులు, సినిమా నటుల వివరాలు, సినిమాలపై సమీక్షలు… రక రకాల సినిమా విషయాలను సినీ ప్రియులకు ఆన్ లైన్ ద్వారా బ్లాగులు అందిస్తూ ఉంటాయి. ప్రతి న్యూస్ వెబ్ సైటులోనూ ఒక సినిమా పేజీ ప్రత్యేకంగా ఉంటుంది.
సామాజిక అంశాలను ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగులు వివరిస్తూ ఉంటాయి.
మన సమాజంలో అనేక సమస్యలతో బాటు ప్రకృతి పరంగా రాబోయే మార్పులు, జరగబోయే నష్టాలు… సామాజిక సేవ చేసే నాయకులు, సమాజానికి మార్గదర్శకులుగా ఉండేవారి గురించి, గతంలోని సామాజిక పరిస్థితుల గురించి… సమాజం కోసం సమాజంలో నివసించేవారికి సామాజిక విషయాలపై పరాకు చెబుతూ ఉండే బ్లాగులు అనేకంగా ఉంటాయి.
ఇలా బ్లాగులు విలువైన సమాచారం అందిస్తూ, ఆన్ లైన్ వీక్షకులను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాయి. యూట్యూబ్ వీడియో చానల్స్ కూడా బ్లాగుల ద్వారా సమాచారం సేకరించి వీడియోలను తయారు చేసే అవకాశం కూడా ఉంటుందంటారు. కాబట్టి బ్లాగింగ్ చేయడం అలవాటుగా ఉంటే, ఆ అలవాటుతోనే ఆన్ లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చని అంటారు.
ఆన్ లైన్లో బ్లాగుని సృష్టించి, బ్లాగింగ్ మీరు చేయవచ్చునా?
అవుననే అంటారు. ఎందుకంటే బ్లాగింగ్ చేయడానికి పెద్దగా ఖర్చు ఉండదు. ఉచితంగా లభించే బ్లాగింగ్ ప్లాట్ ఫామ్స్ మనకు ఉన్నాయి. కావునా బ్లాగింగ్ అలవాటు చేసుకోవడానికి ఒక కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లేదా ఒక ట్యాబ్ వంటి పరికరం ఇంటర్నెట్ తో అనుసంధానం అయి ఉండాలి.
టైపింగ్ వచ్చి ఉండి, ఎంఎస్ వర్డ్ ఎలా ఉపయోగించాలో తెలిసి ఉంటే, చాలు ఆన్ లైన్ ద్వారా ఒక బ్లాగుని సృష్టించి, ఆ బ్లాగు ద్వారా మీకు తెలిసిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉండవచ్చును.
బ్లాగు ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చును. కాకపోతే బ్లాగు ద్వారా పోస్ట్ చేయబడుతున్న పోస్టులు సొంతమైన కంటెంట్ అయి ఉండాలి. మరొకరిని అనుకరిస్తున్నట్టుగా ఉండకూడదు. సొంత టాలెంట్ ద్వారా బ్లాగింగ్ ప్రారంభిస్తే, ఆ బ్లాగు ఎక్కువమందికి పరిచయం అయ్యే కొలది, ఆన్ లైన్ మనీ ఎర్నింగ్ కు అవకాశాలు పెరుగుతాయి.
అయితే ఆన్ లైన్ ద్వారా ఒక బ్లాగుని ఉచితంగా లభించే వాటితో సృష్టించడం కన్నా ప్రీమియం హోస్టింగ్ ప్లానుతో బ్లాగును క్రియేట్ చేయడం మేలు. ఇంకా ఒక వర్డ్ ప్రెస్ ప్లాట్ పామ్ ఆధారంగా బ్లాగుని సృష్టించి ఉంటే, వర్డ్ ప్రెస్ ప్రీమియం థీమ్ మరియు ప్రీమియం ప్లగిన్స్ మనీ ఎర్న్ చేయడానికి, కంటెంట్ ఎక్కువమందికి చేరడానికి ఉపయోగపడవచ్చును.
దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా వివిధ విషయాలను వివరిస్తాయనే విశ్లేషణ పోస్టు గురించి మీ కామెంట్ ఇవ్వగలరు.
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి చూద్దాం! వర్డ్ ప్రెస్ భారీ బ్లాగింగ్ ప్లాట్ ఫాం. అనేకమంది వర్డ్ ప్రెస్ ఉపయోగించి బ్లాగింగ్ చేస్తుంటారు. ఇది ఉచితంగానూ లభిస్తుంది. ఇంకా ప్రీమియం ధరలలో కూడా అందుబాటులో ఉంటుంది.
మీకు కంప్యూటర్లో ఎంస్ వర్డ్ ఉపయోగించడం వస్తే చాలు. వర్డ్ ప్రెస్ ద్వారా సులభంగా బ్లాగింగ్ చేయవచ్చును. మాములుగా మీరు కంప్యూటర్ ద్వారా ఎంఎస్ వర్డ్ ఆఫ్ లైన్లో ఉపయోగిస్తే, ఆన్ లైన్లో ఏదైనా బ్లాగింగ్ ద్వారా ఆర్టికల్ రైటింగ్ చేస్తూండవచ్చును. ఇంకా వీటిలో ఇమేజుల, వీడియోల లింకులు జత చేయవచ్చును.
ఎక్కువగా బ్లాగింగ్ అంటే పోస్టులను సృష్టించడమే ఉంటుంది. ప్రతి పోస్టులోనూ కొంత వచనం, చిత్రములు ఉంటాయి. ఏదైనా ఒక విషయం వివరిస్తూ ఫొటోల రూపంలో కూడా విషయాన్ని ప్రతిబింబింపచేయడానికి బ్లాగు పోస్టులు ఉపయోగపడతాయి.
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి చూద్దాం!
ఈ క్రింది చిత్రమును చూడండి. తెలుగు వ్యాసాలు వివిధ విషయాలను వివరిస్తూ తెలుగు వ్యాసాలు. వర్డ్ ప్రెస్ బ్లాగ్ పోస్టులుగా ఆన్ లైన్లో ప్రచురితం కాబడ్డాయి. ఈ క్రింది చిత్రములో మాదిరిగా ఏదైనా అంశంలో ఒక వర్డ్ ప్రెస్ బ్లాగును సృష్టించి మెయింటైన్ చేయవచ్చును.
ఏదైనా హోస్టింగ్ ప్రొవైడర్ ద్వారా హోస్టింగ్ ఖాతా ఓపెన్ చేయాలి. హోస్టింగ్ ద్వారా వర్డ్ ప్రెస్ ఆన్ లైన్లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ చేయడం మేలు. ఉచితంగా లభించే వర్డ్ ప్రెస్ ఖాతా చాలా పరిమితులకు లోబడి ఉంటాయి. కావునా హోస్టింగ్ ప్రొవైడర్ నుండి ఏదైనా హోస్టింగ్ ఖాతా కొనుగోలు చేయడం మేలు.
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి బెస్ట్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ప్రొవైడర్స్
బ్లూహోస్ట్ ఒక బెస్ట్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ప్రొవైడర్ గా చెబుతారు. షేర్డ్ హోస్టింగ్ అయితే ఏదైనా స్కిప్ట్ ఉపయోగించి వెబ్ సైటు సృష్టించే అవకాశం ఉంటుంది. కానీ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అంటే కేవలం వర్డ్ ప్రెస్ ద్వారా మాత్రమే వెబ్ సైటుని సృష్టించగలం. అయితే కేవలం వర్డ్ ప్రెస్ ద్వారానే బ్లాగ్ సృష్టించాలనుకునేవారికి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ బెటర్ అంటారు.
ఇంకా వర్డ్ ప్రెస్ ద్వారా ఈ కామర్స్ వెబ్ సైటు కూడా సృష్టించవచ్చును. ఆన్ లైన్ ద్వారా వస్తువిక్రయాలు, సేవల విక్రయాలు, పేమెంట్ లావాలదేవీలు నిర్వహించడానికి అనువుగా ఉండే ఈ కామర్స్ వంటి ఫీచర్లు కూడా వర్డ్ ప్రెస్ ద్వారా లభిస్తాయి. అలా వర్డ్ ప్రెస్ ద్వారా వెబ్ సైట్ నిర్వహించదలచేవారికి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ బెస్ట్ ఛాయిస్ అయితే బ్లూహోస్ట్ ఒక ఉత్తమ ఎంపికగా చెబుతారు.
వర్డ్ ప్రెస్ హోస్టింగ్
బ్లూ హోస్ట్ ద్వారా మూడు సంవత్సరాల కాలపరిమితిలో హోస్టింగ్ ఖాతా కొనుగోలు చేయవచ్చును. అదే సంవత్సర కాలపరిమితకే హోస్టింగ్ అంటే ధర ఎక్కువగా ఉంటుంది. బ్లూహోస్టింగ్ ద్వారా తొలిసారి రిజిష్టర్ అయిన ఖాతాకు ఒక సంవత్సరం పాటు డొమైన్ ఉచితంగా పొందవచ్చును. ఇంకా ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ ఇన్ స్టాలేషన్ కూడా ఉంటుంది.
వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేశాకా వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ లుక్ కోసం ప్రీమియం థీమ్స్ ప్రీమియం సపోర్టుని అందిస్తాయి. అనేక వర్డ్ ప్రెస్ థీమ్స్ ఉచితంగానే లభిస్తాయి. కానీ ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉండవు. అదే కొనుగోలు చేసిన వర్డ్ ప్రెస్ థీమ్ వలన ప్రయోజనం బాగుంటుందని అంటారు.
కొన్ని ప్రీమియం థీమ్స్ ఒక వెబ్ సైటు లేదా నాలుగైదు వెబ్ సైట్లకు పరిమితం అవుతాయి. ఎక్కువ వెబ్ సైట్లకు థీమ్ కావాలంటే వర్డ్ ప్రెస్ థీమ్ అయిన జనరేట్ ప్రెస్ ఒక ఉత్తమ ఎంపికగా చెబుతారు. దీనిని ఒక్కసారి కొనుగోలు చేస్తే, 500 వెబ్ సైట్లకు ఉపయోగించవచ్చును. ఒకేడాది కాలంపాటు జనరేట్ ప్రెస్ అప్డేట్స్ అందుతాయి. ఆపై ఆప్డేట్స్ లేకుండా ఈ థీమ్ కంటిన్యూ చేయవచ్చును.
ఒక హోస్టింగ్ ఖాతా, డొమైన్ కొనుగోలు, థీమ్ కొనుగోలు పూర్తయ్యాక…
ఎస్ఇఓ ప్లగిన్ చాలా ప్రధానం. ఎస్ఇఓ ప్లగిన్ సాయంతో ఒక వెబ్ సైటును సెర్చ్ ఇంజన్లలో కనబడడానికి అనువుగా వర్డ్ ప్రెస్ పోస్టులను సిద్దం చేయవచ్చును. అలా ఒక వెబ్ సైటుని సెర్చ్ ఇంజన్లలో ప్రభావితం అయ్యేలాగా చేసే ప్లగిన్లలో ప్రధానమైనది యోస్ట్ ప్లగిన్. దీని సాయంతో వర్డ్ ప్రెస్ బ్లాగుకు ఎస్ఇఓ చేయవచ్చును. ఫ్రీగానే ఉపయోగించుకోవచ్చును. కొనుగోలు చేయడం ద్వారా మరింత ప్రభావితంగా ఎస్ఇఓ చేయవచ్చును.
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్
ఒక వర్డ్ ప్రెస్ బ్లాగులో అవసరమైన ప్లగిన్స్ ఇన్ స్టాల్ చేయడానికి, వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానెల్ లో లెఫ్ట్ సైడ్ మెనులో ప్లగిన్స్ పై క్లిక్ చేయలి. ఈ క్రింది చిత్రంలో వర్డ్ ప్రెస్ అడ్మిన్ పేజిలోని లెఫ్ట్ సైడ్ మెను గమనించండి.
పై చిత్రంలో ఉన్నట్టుగా Plugins పై క్లిక్ చేస్తే, ఈ క్రింది ఎడమ చిత్రంలో మాదిరిగా మెనులో సబ్ మెను వస్తుంది. సబ్ మెనులో
Add New పై క్లిక్ చేస్తే ప్లగిన్స్ డిస్పే అవుతాయి. ఈ క్రింది చిత్రం గమనించండి.
పై చిత్రంలో ప్లగిన్స్ కనబడుతున్నాయి. వాటిలో ప్రతి ప్లగిన్ కుడివైపుగా బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆ ప్లగిన్ వర్డ్ ప్రెస్ సైటులో ఇన్ స్టాల్ కాబడుతుంది. ఒక్కసారి ప్లగిన్ ఇన్ స్టాల్ అయ్యాక, ఈ క్రింది చిత్రంలో మాదిరిగా బటన్ ప్లేస్ లో ఏక్టివ్ అను బటన్ వస్తుంది. పై చిత్రంలో Classic Editor ప్లగిన్ ఇన్ స్టాల్ చేస్తే… ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఏక్టివ్ బటన్ వస్తుంది.
ఈ పోస్టు ద్వారా తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి
Classic Editor ప్లగిన్ ఏక్టివ్ కూడా చేస్తే, ఆ ప్లగిన్ ద్వారా వర్డ్ ప్రెస్ పోస్టులను పాత పద్దతిలోనే వ్రాయవచ్చును. అలా ఏవిధమైన ప్లగిన్ అయిన వర్డ్ ప్రెస్ అడ్మిన్ పేజి నుండి ఇన్ స్టాల్ చేసి, యాక్టివ్ చేసుకోవచ్చును. ప్లగిన్ యాక్టివ్ చేసిన తర్వాతనే సదరు ప్లగిన్ వర్క్ చేయగలుగుతుంది. లేకపోతే ప్లగిన్ కేవలం మీ వర్డ్ ప్రెస్ సైటులో ఇన్ స్టాల్ చేసినట్టుగానే ఉంటుంది. కానీ దాని ద్వారా వర్క్ చేయలేరు.
ఒక్కసారి ప్లగిన్ యాక్టివ్ చేసిన పిదప, ఈక్రింది చిత్రంలో మాదిరిగా ప్లగిన్ కనబడుతుంది.
ఒక వేళ మీ వర్డ్ ప్రెస్ సైటులో థీమ్ చేంజ్ చేయాలి అంటే ఎలా…. ఈ క్రింది చిత్రం గమనించండి.
అందులో ఈ మెను ఐటెం పై క్లిక్ చేయడం ద్వారా మరొక వర్డ్ ప్రెస్ థీమ్ ను ఎంచుకుని, థీమ్ ఇన్ స్టాల్ చేయవచ్చును. ఈ క్రింది చిత్రం గమనించండి.
పై చిత్రం మాదిరి వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఫ్యానెల్లో థీమ్స్ గమనిస్తే, మీ వర్డ్ ప్రెస్ సైటులో ఇన్ స్టాల్ కాబడి ఉన్న ప్రస్తుత థీమ్స్ చూపెడుతుంది. వాటిలో మీకు నచ్చిన థీమ్ పై క్లిక్ చేయడం ద్వారా థీమ్ యాక్టివ్ చేయవచ్చును. ఉదాహరణకు Twenty Twenty థీమ్ పై క్లిక్ చేస్తే, ఆ థీమ్ ఈ క్రింది చిత్రంలో మాదిరిగా కనబడుతుంది.
ఈ పై చిత్రంలో Activate Live Preview Delete అను బటన్స్ చిత్రంలో క్రింది బాగంలో ఉన్నాయి. వాటిలో Activate బటన్ క్లిక్ చేస్తే, ట్వంటీ ట్వంటి థీమ్ యాక్టివ్ అవుతుంది. Live Preview పై క్లిక్ చేస్తే, థీమ్ కస్టమైజేషన్ చేయవచ్చును. Delete బటన్ పై క్లిక్ చేస్తే, ట్వంటీ ట్వంటి థీమ్ మీ వర్డ్ ప్రెస్ సైటు నుండి రిమూవ్ చేయబడుతుంది.
ఒక కొత్త పోస్టుని సృష్టించడం వర్డ్ ప్రెస్ గురించి తెలుగులో
మీ వర్డ్ ప్రెస్ సైటులో ఇన్ స్టాల్ చేసిన థీమ్స్ కాకుండా కొత్తగా థీమ్ ఇన్ స్టాల్ చేయాలంటే, వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఫ్యానెల్ లెఫ్ట్ సైడు మెను లో ఉన్న మెను ఐటెం క్లిక్ చేయగానే వచ్చే విండోలో Add New పై క్లిక్ చేయాలి. అప్పుడు వర్డ్ ప్రెస్ లో అందుబాటులో ఉండే అనేక థీమ్స్ కనబడతాయి. వాటిపై క్లిక్ చేసి, ఇన్ స్టాల్ చేయడం, యాక్టివేట్ చేయడం చేసుకోవాలి.
ఈ క్రింది చిత్రం గమనించండి. అందులో బ్లూకలర్ బ్యాక్ గ్రౌండులో హైలెట్ అయిన Posts సబ్ మెనుని గమనించండి. వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఫ్యానెల్ లెఫ్ట్ సైడు మెను లో Posts పైక్లిక్ చేయగానే అందులో సబ్ మెను మరలా ఈ క్రింది చిత్రంలో మాదిరిగా All Posts, Add New, Categories, Tags అను మెను ఐటెమ్స్ కనబడతాయి.
అందులో All Posts పై క్లిక్ చేస్తే వర్డ్ ప్రెస్ బ్లాగులో పోస్ట్ చేయబడిన పోస్టులు కనబడతాయి. Add New పైక్లిక్ చేస్తే, మరొక కొత్త పోస్టుని సృష్టించవచ్చును. Categories పై క్లిక్ చేస్తే, బ్లాగులో సృష్టించబడి ఉన్న కేటగిరీస్ కనబడతాయి. ఇంకా కొత్త కేటగీరిస్ జత చేయవచ్చును. Tags పై క్లిక్ చేస్తే, ఉపయోగించిన ట్యాగ్స్ కనబడతాయి.
ఈ క్రింది చిత్రంలో మాదిరిగా Add New పైక్లిక్ చేస్తే,
క్రింది చిత్రం వలె మరొక పోస్టు సృష్టించడానికి విండో వస్తుంది. ఇందులో Add title అంటూ కర్సర్ ఉంది. అక్కడ మీరు వ్రాయదలచిన వ్యాసానికి శీర్షిక ఎంపిక చేసుకుని, Add title ఉన్న చోట టైటిల్ వ్రాయాలి. ఆ తర్వాత Type / to choose a block ఉన్న చోట కంటెంట్ వ్రాస్తూ ఉండవచ్చును. లేదా ఇమేజ్, వీడియో, యుఆర్ఎల్ ఎంబడ్, టేబిల్ వంటి వివిధ వర్డ్ ప్రెస్ ఫీచర్లు ఉపయోగిస్తూ వ్యాసం వ్రాయవచ్చును.
అయితే వ్రాస్తున్న పోస్ట్ టైటిల్ మరియు SEO Focus keyphrase రెండు ఒక్కటే ఉండాలి. అప్పుడే మీరు వ్రాసిన వర్డ్ ప్రెస్ పోస్టు సెర్చ్ ఇంజన్లో కనబడే అవకాశం ఉంటుంది.
క్రింది చిత్రంలో + గుర్తుపై క్లిక్ చేస్తే బ్లాక్ ఎంపిక చేసుకోవడానికి స్మాల్ విండో వస్తుంది. ఈ క్రింది చిత్రం గమనించండి.
+ ప్లస్ గుర్తుపై క్లిక్ చేస్తే వచ్చిన విండోలో ఎక్కువగా ఉపయోగించే Paragraph, Heading, Image, Gallery, List, Quote వంటి బ్లాక్స్ వచ్చాయి. ఇంకా బ్లాక్స్ కావాలంటే Browse all పై క్లిక్ చేసి, మరిన్ని బ్లాక్ టూల్స్ ఎంపిక చేసుకోవచ్చును. మీరు ఇమేజ్ బ్లాక్ ఎంపిక చేసుకుంటే, ఈ క్రింది చిత్రం మాదిరిగా అక్కడ విండో కనబడుతుంది.
పైన ఉన్న చిత్రంలో చూపినట్టుగా మీరు Upload బటన్ క్లిక్ చేస్తే, మరొక విండో ఓపెన్ అవుతుంది. అది మీ కంప్యూటర్ నుండి ఫైల్ స్టోరేజ్ ఫోల్డర్ నుండి డేటా చూపిస్తుంది. అందులో మీరు ఎంపిక చేసుకున్న ఇమేజ్ ను పోస్టులోకి జోడించవచ్చును. పై చిత్రంలోనే Media Library బటన్ క్లిక్ చేస్తే, అప్పటికే వర్డ్ ప్రెస్ లో అప్ లోడ్ చేసి ఉన్న ఇమేజులను ఉపయోగించవచ్చును. లేదా Insert from URL బటన్ పై క్లిక్ చేసి, ఆన్ లైన్లో లభించే చిత్రాలను మీ వర్డ్ ప్రెస్ పోస్టులోకి జోడించవచ్చును.
వర్డ్ ప్రెస్ పోస్టులో వివిధ బ్లాక్స్ ను రిమోవ్ చేయడం.
ఈ క్రింది చిత్రం చూడండి. అందులో Add title క్రిందగా ఒక ఇమేజ్ బ్లాక్, ఒక లిస్టు బ్లాక్, ఒక కోట్ బ్లాక్ ఉన్నాయి.
చిత్రంలో మాదిరి ఇప్పుడు వాటిలో ఇమేజ్ జోడించడం లేదు. అప్పుడు ఇమేజ్ బ్లాక్ రిమోవ్ చేయడానికి ఇమేజ్ బ్లాక్ పై క్లిక్ చేస్తే, ఆ బ్లాక్ ప్రోపర్టీస్ కనబడేవిధంగా బ్లాక్ పై మరొక చిన్న బాక్స్ వస్తుంది.
ఈపైన చిత్రం చూడండి. అందులో చిన్న బాక్సులో మూడు నిలువు చుక్కలు (dots) కనబడుతున్నాయి. దానిపై క్లిక్ చేస్తే మరొక సబ్ మెను కనబడుతుంది. ఈ క్రింది చిత్రం చూడండి.
బ్లాక్ ప్రొపర్టీస్ ప్రతి బ్లాకుకు వస్తాయి. మీరు ఆ బ్లాకుని కాపీ చేయవచ్చును. డూప్లికేట్ బ్లాకును సృష్టించవచ్చును. లేదా బ్లాక్ కు ముందు Heading మరొక బ్లాకును లేదా బ్లాకుకు తర్వాత Paragraph మరొక బ్లాకును ఇన్ సర్ట్ చేయవచ్చును. లేదా బ్లాకును వేరే బ్లాకుగా మార్చవచ్చును. లేదా Remove Image పై క్లిక్ చేసి, ఇమేజ్ బ్లాకుని రిమూవ్ చేయవచ్చును.
వర్డ్ ప్రెస్ పోస్ట్ పబ్లిష్
ఈ క్రింది చిత్రంలో గమనిస్తే రైట్ సైడ్ కార్నర్లో మూడు బటన్లు ఉన్నాయి. Save draft Preview Publish వీటిలో పబ్లిష్ బటన్ హైలెట్ అయి ఉంది. పబ్లిష్ పై క్లిక్ చేస్తే, పోస్టు లైవ్ లో ఉంటుంది. Preview బటన్ పై క్లిక్ చేస్తే, పోస్టు వ్యూ కనబడుతుంది. Save draft బటన్ క్లిక్ చేస్తే, పోస్టు సేవ్ అవుతుంది కానీ పబ్లిష్ కాదు.
ఇలా ఎన్ని పోస్టులు అయినా పబ్లిష్ చేసుకోవచ్చును. కానీ ప్రతి పోస్టుకు టైటిల్ ముఖ్యం. ఇంకా ఆ టైటిల్ పోస్టు మొదటి పేరాలో రిపీట్ కావాలి. తర్వాత మద్యలో ఒక్కసారి రిపీట్ కావాలి. ఆ పై చివరగా ఒక్కసారి టైటిల్ రిపీట్ కావాలి. ఈ క్రింది చిత్రం చూడండి.
పై చిత్రంలో పోస్టు టైటిల్ వ్యక్తి జీవితంలో విలువు ఎలా ఈ టైటిల్ పోస్టుకు శీర్షికగా ఉంది. ఇంకా పోస్టులో మొదటి పేరాలో మొదటి లైనులో ఉంది. తర్వాతి మద్యలో వచనంలో ఒక్కసారి వచ్చింది. మరలా ముగింపులో కూడా ఒక్కసారి రిపీట్ అయింది. పోస్టులో ఈ టైటిల్ మూడు సార్లు రిపీట్ అయింది. 300 పదాల నుండి 450 పదాల వరకు పోస్టు యొక్క టైటిల్ మూడు సార్లు రిపీట్ అవ్వడం వలన సెర్చ్ ఇంజన్ మీ వర్డ్ ప్రెస్ పోస్టుని క్యాచ్ చేయగలుగుతుంది. ఇంకా ఎక్కువ పదాలు మీ వర్డ్ ప్రెస్ పోస్టులో ఉంటే, ఇంకా ఎక్కువ సార్లు పోస్ట్ టైటిల్ పోస్టులో రిపీట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా పోస్ట్ టైటిల్ మరియ ఎస్ఇఓ కీవర్డ్ ఒక్కటే ఉండాలి.
ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్ వర్డ్ ప్రెస్ పోస్టు
ఇంకా ఒక పోస్టుకు పర్మా లింకు, కేటగిరీ, ట్యాగ్స్, ఆల్ట్ ట్యాగ్ వంటివాటి గురించి… ఒక్కసారి ఈ క్రింది చిత్రం చూడండి.
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి
పైన ఉన్న చిత్రంలో రైట్ సైడులో ఒక మెను కనబడుతుంది. ఆ మెను ఈక్రింది చిత్రం వలె ఉంది.
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి
ఈపైన గల చిత్రంలో వరుసగా
Status & visibility Yoast SEO 3 Revisions – పోస్టుని పబ్లిష్ చేయకుండా ఎన్ని సార్లు విజిట్ చేశారు అనేది చూపుతుంది. Permalink Categories Tags Featured image Excerpt Discussion Layout ఉన్నాయి.
Status & visibility
అంటే ప్రస్తుత పోస్టు స్థితిని చూపుతుంది. Status & visibility ప్రక్కగా క్రిందికి ఒక ఏరో సింబల్ ఉంది. అంటే Status & visibility కి మరొక సబ్ మెను ఉంది. ఈ క్రింది చిత్రం చూడండి.
ఇప్పుడు ఈ ప్రక్క చిత్రంలో Visibility ఎదురుగా Public అంటూ బ్లూకలర్లో హైలెట్ అయిన బటన్ ఉంది. ఈ Public క్లిక్ చేస్తే మరొక సబ్ మెను
Public
Visible to everyone.
Private
Only visible to site admins and editors.
Password Protected
Protected with a password you choose. Only those with the password can view this post.
ఈవిధంగా మెను కనబడుతుంది. Public అంటే అందరికీ, Private అంటే వర్డ్ ప్రెస్ అడ్మిన్ లేదా ఆదర్స్ కు మాత్రమే కనబడుతుంది. ఇంకా Password Protected అంటే వర్డ్ ప్రెస్ సైటులో పాస్ వర్డ్ తెలిసిన వారికి మాత్రమే కనబడే విధంగా పోస్టుని భద్రపరచవచ్చును.
Yoast SEO
ఇంకా పైన చెప్పబడిన పోస్టు సెట్టింగులలో Yoast SEO. ఇది చూపే ఇండికేషన్ చాలా ప్రధానం. ఈ క్రింది చిత్రం చూడండి.
ఎగువ గల చిత్రంలో యోస్ట్ ఎస్ఇఓ క్రిందగా Readability analysis: OK, SEO analysis: OK అని ఉంది. కానీ పోస్టుకు దీని ఇండికేషన్ బటన్ ఆరెంజ్ కలర్ మరియు రెడ్ కలర్ కాకుండా గ్రీన్ కలర్లో ఉంటూ Readability analysis: Good, SEO analysis: Good అని ఉండాలి. అప్పుడే మీ వర్డ్ ప్రెస్ పోస్టు సెర్చ్ ఇంజన్ ద్వారా నెటిజన్లకు చేరే అవకాశం ఉంటుంది.
Permalink
ఈ ప్రక్క చిత్రంలో Permalink క్రిందగా URL Slug ఉంది. ఇదే పోస్టు యొక్క చిరునామాగా వర్డ్ ప్రెస్ గుర్తిస్తుంది. ఇది ఇంచుమించు పోస్టు టైటిల్ వలె ఉండాలి. మీ పోస్ట్ టైటిల్ ఈవిధంగా ”వ్యక్తి జీవితంలో విలువలు ఎలా” అని ఉంటే Permalink క్రిందగా URL Slug కూడా అలాగే ఉండాలి. తెలుగు కాబట్టి ప్రక్క చిత్రంలో అక్షరాలు విడివిడిగా ఉన్నాయి. ఇంగ్లీషు టైటిల్ అయితే పోస్టు టైటిల్ నే వర్డ్ ప్రెస్ Permalink క్రిందగా URL Slug గా తీసుకుంటుంది. ప్రక్క చిత్రంలో VIEW POST క్రిందగా బ్లూకలర్లో చూపుతున్నట్టుగా Permalink క్రిందగా URL Slug ఉంటుంది.
Categories
వర్డ్ ప్రెస్ పోస్టులో కేటిగిరీ ప్రధానం.
ఈ ప్రక్క చిత్రంలో Categories క్రిందగా మూడు Categories ఉన్నాయి. అందులో ఒక్క చెక్ బాక్స్ టిక్ చేయబడింది. మిగిలినవి రెండు చెక్ బాక్స్ టిక్ చేయబడలేదు. అంటే ప్రస్తుత పోస్టు Reading is fashion అనే Category లోకి పబ్లిష్ చేయబడుతుందని అర్ధం. మీకు కావాలంటే మరొక Category చెక్ బాక్స్ క్లిక్ చేస్తే మరొక Categoryలో ఈ పోస్ట్ పబ్లిష్ చేయవచ్చును.
ఈ ప్రక్క చిత్రంలో చూడండి. మూడు Categories చెక్ బాక్స్ టిక్ చేయబడి ఉన్నాయి. అంటే మూడు Categoriesలలోనూ ఈ పోస్టుని పబ్లిష్ చేయవచ్చును. ఈ ప్రక్క చిత్రం గమనిస్తే, మూడు Categories ఒక Category ని ప్రధాన Categoryగా ఎంపిక చేయవచ్చును. ఇంకా కొత్తగా Category జోడించడానికి Add New Category క్లిక్ చేసి మరొక Categoryని యాడ్ చేయవచ్చును.
Tags
ప్రతి వర్డ్ పోస్టుకు ట్యాగ్స్ చాలా ముఖ్యం. పోస్టులో ఎక్కువగా వాడిన పదాలు లేదా పాపులర్ పదాలు పోస్టుకు ట్యాగ్ చేస్తూ ఉంటారు. ఈ Tags వలన పోస్టు త్వరగా సెర్చ్ ఇంజన్లో కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వర్డ్ ప్రెస్ టైటిల్ మరియు డిస్కిప్షన్ ఆధారంగా మీ పోస్టులు, పోస్టుకు తగ్గట్టుగా Tags జోడించడం ప్రధానం. ఈ క్రింది చిత్రం చూడండి.
ఈ ప్రక్కచిత్రం గమనిస్తే, అందులో Tags లో Add New Tag క్రిందగా ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో Tags టైప్ చేయాలి. ట్యాగ్ రెండు మూడు నాలుగు పదాలు ఉండవచ్చును. పదాలు కలుపుతూ ట్యాగ్ వ్రాస్తున్న మీరు ఎప్పుడైతే కామ, పెడతారో వెంటనే అది ఒక ట్యాగ్ సేవ్ అవుతుంది. ఇంకా ఈ ప్రక్క చిత్రంలో గమనిస్తే గతంలో వాడిన ట్యాగ్స్ ని చూపుతుంది. వాటిని కావాలంటే పోస్టుకు అనుకూలం అనుకుంటే ఉపయోగించవచ్చును.
ఈ ప్రక్క చిత్రం చూడండి కామా పెట్టగానే ఆ పదాలు ట్యాగ్ గా మారాయి.
పీచర్ ఇమేజ్ – వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి తెలుగులో
ప్రధానమైన వర్డ్ ప్రెస్ ఫీచర్. ప్రతి వర్డ్ ప్రెస్ పోస్టుకు ఫీచర్ ఇమేజ్ చాలా సహాయకారిగా ఉంటుంది. పోస్టు యొక్క ఉద్దేశ్యాన్ని తెలియపరిచే విధంగా వర్డ్ ప్రెస్ పోస్టు ఫీచర్ ఇమేజ్ ఉండాలి.
ఈ ప్రక్క చిత్రంలో మాదిరి వర్డ్ ప్రెస్ పోస్టులో ఫీచర్ ఇమేజ్ ఆప్సన్ కనబడుతుంది. మీరు Set featured image పై క్లిక్ చేసి మీ వర్డ్ ప్రెస్ పోస్టు ఫీచర్ ఇమేజ్ అప్ లోడ్ చేయవచ్చును. ఇంకా ఈ ఫీచర్ ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్ తప్పని సరిగా పోస్ట్ టైటిల్ తో కలిసి ఉండాలి.
ప్రధానంగా Permalink, Categories, Tags, Featured image నాలుగు ఫీచర్లలో వర్డ్ ప్రెస్ పోస్టుని పబ్లిష్ చేయడంలో ఉపయోగించాలి.
ఇలా ఒక బ్లాగ్ పోస్టు ను వర్డ్ ప్రెస్ ద్వారా పబ్లిష్ చేయవచ్చు. ఇంకా పబ్లిష్ చేయబడిన బ్లాగ్ పోస్టును మీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం వలన విజిటర్స్ పెంచుకోవచ్చు.
ఎక్కువ బ్లాగ్ పోస్టులో ఉపయోగించే టైటిల్ మరియ పాపులర్ వర్డ్స్ పోస్ట్లో హెడ్డింగ్స్ లోను టాగ్స్ లోను ఉండే విధంగా చూసుకుంటే అది ఎస్ఇఓ కు సహాయపడుతుంది.
మనసుకు నచ్చే మంచి మాటలు. జీవితం చాలా విలువైనది. సాధన చేసేవారికి సమయం సరిపోదు. ఒక్కసారి గడిచిన కాలం తిరిగి రాదు. గడుస్తున్న కాలంలో ఎలా జీవిస్తున్నామో అదే ఓ జ్ఙాపకంగా మారిపోతుంది. అది సంతోషం కావచ్చు… లేదా బాధ కావచ్చును.
జీవితంలో వ్యక్తికి వ్యక్తులు ఎదురౌతూ ఉంటారు. మాటతీరు చక్కగా ఉండేవారు మనసుకు నచ్చే మంచి మాటలు మాట్లాడగలిగితే, కొందరు మనసుకు నచ్చని మాటలు మాట్లాడతారు. కానీ ఎదుటివారు ఎలా మాట్లాడినా మన మాటతీరు ఎదుటివారికి ఓదార్పుగా ఉండాలని అంటారు.
ఒక చోట వ్రాసిపెట్టినట్టుగా ఉండే మంచి మాటలు చెప్పడం తేలిక, కష్టకాలంలో మనసుకు నచ్చే విధంగా మంచి మాటలు మాట్లాడడం కష్టం. కాబట్టి ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతూ ఉండడం చేత కష్టకాలంలో చక్కని మాటలు మాట్లాడవచ్చని అంటారు.
ప్రతి బంధం వ్యక్తి నమ్మకం బట్టి బలంగా ఉంటే, వ్యక్తి స్వభావాన్ని బట్టి మంచి సంబంధాలు కొనసాగుతాయి. మంచి వ్యక్తులు మంచి మాటలు మాట్లాడుతూ తమ చుట్టూ ఉండేవారిపై ప్రభావం చూపగలరు. అటువంటి మంచి వ్యక్తుల మాటలను దూరం చేసుకోకుండని పెద్దలు చెబుతూ ఉంటారు.
సాదారణ పరిస్థితులలో మనసు ధృఢంగా ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో మనసు చలిస్తుంది. కాబట్టి కష్ట కాలంలో మనసుకు శాంతి కలిగే విధంగా మనసుకు నచ్చే నాలుగు మంచి మాటలు చెప్పే బంధం మనిషి అవసరం.
ఒక వ్యక్తికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులే, ఒక వ్యక్తికి మనసుకు నచ్చే నాలుగు మంచి మాటలు చెప్పగలరు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే వ్యక్తితో మొదటగా మనమే మంచి మాటలు మాట్లాడడం మేలని అంటారు. శ్రీరామాయణంలో తనకు ఎదురపడే వ్యక్తులతో, రాముడే మొదటగా పలకరించేవాడు అంటే, మాట ప్రభావం ఎలా ఉంటుందో? అర్ధం చేసుకోవాలి.
అలా మన జీవితంలో మన మనసుకు నచ్చేటట్టుగా మంచి మాటలు మాట్లాడేవారిని దూరం చేసుకోకూడదు. అలాంటి బంధాలలో మొదటిగా ఉండే బంధం…. జీవితభాగస్వామి. వీరు జీవితంలో సగమై ఉంటారు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసే బంధం ఇదే. తల్లిదండ్రులు కూడా మేము తోడు ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రమాణం చేయరు… కానీ జీవితపు భాగస్వామి మాత్రం జీవితాంతము తోడుంటానని బంధానికి పూనుకుంటారు. కాబటి అటువంటి జీవిత భాగస్వామితో ఎప్పటికీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.
తర్వాత ఇతర బంధాలు, స్నేహితులు… మన మనసుకు నచ్చేవిధంగా నాలుగు మంచి మాటలు మాట్లాడుతారు.
మనసుకు నచ్చే మంచి మాటలు మాట్లాడగలిగితే
మనం మంచి మాటలు మాట్లాడగలిగితే, మన మాటల ప్రభావం, మన చుట్టూ ఉండేవారి మనసులో దాగి ఉంటుంది. కడుపుకు తిన్నది కడుపులో ఉండదు కానీ మనసులోకి చేరిన మాటల ప్రభావం అలానే ఉండిపోతుంది. కాబట్టి మంచి మాటలు మాట్లాడగలిగితే మాత్రం ఆ మనిషి చుట్టూ మంచి బంధాలు బలపడుతూ ఉంటాయి.
అవసరాన్ని బట్టి ఆసక్తికరంగానో, ఆకట్టుకునే విధంగానో లోకంలో మాటలు వినబడుతూనే ఉంటాయి.
సినిమా మాటలలో మాటలు
ఇప్పుడొస్తున్న సినిమాలలో మనసుకు నచ్చే మంచి మాటలు కన్నా ఆకట్టుకునే తీరులో మాటలు పోకడ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువమందికి నచ్చే నాలుగు మాటలు, ఎక్కువమందిని రంజింపచేసే మాటల వలన సినిమా కలెక్షన్లు ఉంటాయి. కాబట్టి సినిమా మాటలలో మంచి మాటలతో పాటు ఆసక్తిని పెంచే మాటలు, ఆకర్షణను తీసుకువచ్చే మాటలు… వివిధ విషయాలను పరిచయం చేసే మాటలు ఉంటాయి.
మన ఏది గ్రహిస్తున్నామో అదే తిరిగి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు, మంచి మాటలు వినడం ప్రధానం అంటారు. మంచి పుస్తకాలు చదవడం మేలు అంటారు. మంచి పుస్తకాలు చదవడం వలన మాట యొక్క విలువ తెలియబడుతుంది. మాటతీరు మారుతుందని అంటారు.
సోషల్ మీడియాలో మంచి మాటలు చాలానే ఉంటాయి. బంధాల గురించి వారి వారి జీవితంలో అనుభవం ఆధారంగా ఈ సోషల్ మీడియా పోస్టులు ఉండవచ్చును. లేక ఒకచోట చదివినవి వారికి నచ్చితే, వాటిని పోస్ట్ చేయవచ్చును. సోషల్ మీడియాలో కూడా మనసుకు నచ్చే మాటలు హల్ చల్ చేస్తూ ఉంటాయి.
కత్తికంటే కలం గొప్పది ఎందుకంటే అది తూటా కన్నా శక్తివంతమైన మాటను వ్రాయగలదు. అలా వ్రాసిన మాట మందిలో మార్పుకు నాంది కాగలదు. కాబట్టి మాట చాలా శక్తివంతమైనది అయితే మంచి మాట అమృతము వంటిది అంటారు.
కావునా తొలుత మనం మంచి మాటలు మాట్లాడడం వలన చెడుగా మాట్లాడేవారు కూడా మంచి మాటలు వినడానికి ప్రయత్నిస్తారని, ఆపై వారు కూడా మంచి మాటలనే మాట్లాడే అవకాశం ఉంటుందని అంటారు. మంచిని పెంచడానికి మాటే ఆయుధం అయితే, అటువంటి మంచి మాటలు మాట్లాడడానికి మంచి బంధం ఉండాలి. అది మంచి పుస్తకం చదివితే ఎలాంటి భావన కలుగుతుందో, మంచి మిత్రుడితో మాట్లాడిన తరువాత అదే భావన కలుగుతుందని అంటారు.
రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్. చదవడం మనసుకొక అలవాటు అయితే, మంచి విషయాలు చదవడం వలన మనసు మంచి ప్రవర్తనకు మళ్ళుతుంది అంటారు.
నవలలు చదవడం అలవాటు అయితే, వివిధ సామాజిక స్థితులలో మనుషుల అంతరంగం గురించిన విషయజ్ఙానం తెలియబడుతుందని అంటారు.
అలవాటుగా పుస్తకాలు చదవడం వలన మనసుకు చదువంటే ఆసక్తితో ఉంటుంది. ఇష్టం లేకుండా పుస్తకాలు చదవడం వలన పుస్తకంలోని విషయం మనసులోకి చేరదు.
సైన్సుకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివితే, సైంటిస్టు మాదిరిగా ఆలోచనా తీరు ఉంటుందని అంటారు.
సోషల్ విషయాలతో కూడిన పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటే, ఓ సామాజికవేత్తగా ఆలోచనతీరు మారుతుందని అంటారు.
పౌరాణిక పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటే, దైవభావనలు బలపడతాయని అంటారు.
ఇలా ఏదైనా ఒక అంశంలోని పుస్తకాలు ఎక్కువ చదువుతుంటే, అదే అంశంతో మనుసు మమేకం అవుతూ, ఆ తరహా ఆలోచనలను సృష్టిస్తుందని అంటారు. అయితే ఆసక్తితో పుస్తకాలు చదవడం వలన, ఆ పుస్తకాలలోని సారాంశం మనసుకు త్వరగా చేరతాయి. ఇంకా మననం చేయడం చేత ఎక్కువగా కాలం జ్ఙాపకంగా ఉంటాయని అంటారు.
ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు!
సాధన చేత సులభంగా పనులు సమకూరును.
అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి… ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వ్యక్తే విజేతగా గుర్తింపు పొందుతారు.
ఎంత ఎక్కువ స్థాయిలో పోటీపడదలచమో అంత ఎక్కువగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే విజయానికి ప్రధానమైన విషయం. ఎందుకంటే సాధన చేయడానికి కాలమే ఖర్చు. ఎన్ని సదుపాయాలు ఉన్నా, మనం స్వయంగా చేసిన సాధనే, మనల్ని పోటీలో నిలబెడుతుంది. అద్భుతమైన ఫలితాలు, ఉత్తమమైన సాధన చేతనే సాధ్యమంటారు. కావునా కాలం ఖర్చు చేస్తున్న సమయం ఎలా సాగుతుందో చూసుకోవాలి. కాలాల్ని అంత సులభంగా చిన్న చిన్న విషయాలతో కాలాక్షేపం చేయడం అంటే, జీవితపు లక్ష్యానికి దూరం జరుగుతున్నట్టేనని అంటారు.
గొప్పవారు ముందుగా కాలానికి విలువనిస్తారు. కాలానికి విలువనిచ్చి, సరైన సాధన చేస్తే, విజయం తధ్యం!
గొప్పవారు కాలహరణం చేయడానికి ఇష్టపడరు.
టాటా గ్రూపు అధినేత కాలానికి ఎంత విలువనిస్తారో, ఆయన జీవితంలో జరిగిన చిన్న సంఘటన తెలియజేస్తుంది. ఒక్కసారి తోటివారితో కలిసి కారు ప్రయాణం చేస్తున్న ఆయన కారు రోడ్డుపై ఆగింది.డ్రైవరు కారు రిపేరు చేయడానికి పూనుకుంటే, మిగిలినవారు వారి వారి అలవాట్లకు అనుగుణంగా టీ త్రాగడం వంటివి చేస్తుంటే, రతన్ టాటా గారు మాత్రం కారు డ్రైవరుకు సాయం చేశాడు. అలా రతన్ టాటా, తన కారు డ్రైవరుకు సాయపడడం వలన ఆరోజు ఏడు నిమిషాల సమయం సేవ్ చేయగలిగారు. లేకపోతే ఏడు నిమిషాల సమయం వృధా అయ్యేది. ఇలా కాలం గురించి గొప్పవారు ఎప్పుడూ జాగురతతో ఉంటారు. కాలహరణం చేయడానికి ఇష్టపడరు.
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి. మంచి గుణముల గల వ్యక్తి ఎవరు? అనే ఓ మహర్షి తలంపుకు మరో మహర్షి సమాధానమే రామాయణం రచించడానికి మూలం అంటారు.
సుగుణాలు గల నరుడెవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా, కేవలం ధర్మమునే ఆచరించి చూపిన మార్గదర్శకుడు శ్రీరాముడు. కాబట్టి నరుడు రామాయణం చదవాలని పండితులు తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు.
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
వాల్మీకి మహర్షి, నారద మహర్షిని ఏమని ప్రశ్నించాడు?
గుణవంతుడు
వీరుడు
ధర్మజ్ఞుడు
కృతజ్ఞుడు
సత్యం పలికేవాడు
దృఢమైన సంకల్పం ఉన్నవాడు
ఉత్తమ చరిత్ర కలిగినవాడు
అన్ని ప్రాణుల మంచి కోరేవాడు
విద్యావంతుడు
సమర్థుడు
సౌందర్యం కలిగిన వాడు
ధైర్యవంతుడు
క్రోధాన్ని జయించినవాడు
తేజస్సు కలిగినవాడు
అసూయ లేనివాడు, ఇతరుల్లో మంచిని మాత్రమే చూసేవాడు
ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వ్యక్తి!
పైన చెప్పబడిన పదహారు సుగుణాలు గల నరుడు ఎవరు?
అందుకు నారద మహర్షి, వాల్మీకి మహర్షితో శ్రీరాముడు గుణగణాలను చెబుతాడు. క్లుప్తంగా శ్రీరామాయణం వివరిస్తాడు. కొద్దిగా విన్న శ్రీరామాయణం వాల్మీకి మహర్షి మనసులో మంచి ముద్రను వేస్తుంది. శ్రీరామాయణం రచించాలనే తపనకు ప్రేరణ అవుతుంది. తత్ఫలితంగానే శ్రీరామాయణం గ్రంధ రచనను చేశారని అంటారు. అంటే రామాయణం సంక్షిప్తంగా విన్నా, శ్రద్దగా వింటే, పూర్తిగా తెలుసుకోవాలనే తపన మనసులో పుడుతుంది.
దేవుడిచ్చిన బంధువులు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అయితే, వారితో ఎలా ప్రేమతో ఉండాలో… రాముడు ఆచరించి చూపాడని చెబుతారు. ఎంత కష్టంలోనూ ఏ బంధుత్వాన్ని దూరం చేసుకోకుండా ధర్మమార్గములోనే నడిచిన పురాణ పురుషుడుగా శ్రీరాముడు కీర్తిగడించాడు.
తండ్రిమాటను మీరని పుత్రుడిగా, సోదరులను ప్రేమించే అన్నగా, భార్య దూరమైనా నిత్యమూ భార్య కొరకు పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మాటకు విలువిచ్చిన మహారాజుగా, ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని ఆచరించి చూపించినవాడు శ్రీరాముడు అని అంటారు.
అలా శ్రీరాముడు గురించి విన్న వాల్మీకి రామాయణం రచిస్తే, శ్రీరాముడు గురించి చదవినవారికి శ్రీరాముడు మదిలో కొలువై ఉంటే, అలా కొలువుదీరిన రాముడు అంతరంగంలో ఎప్పుడూ ధర్మమార్గమునే బోధిస్తాడు. కాబట్ఠి శ్రద్ధగా శ్రీరామాయణం చదవడం అంటే, రాముడు నడిచిన మార్గములో మన మనసు కూడా మమేకం కావడమే.
మంచి గుణములతో మనసు మమేకం కావడం జరిగితే….
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తియ్యగుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినుర వేమ… ఈ పద్యసారాంశము… అనగ అనగా రాగము బాగా వచ్చును… తినగ తినగా చేదుగా ఉండే వేపాకు కూడా తీయగా ఉంటుంది… అలాగే చేయగ చేయగా పనులు కూడా సులభంగా జరుగుతాయని… అలా శ్రీరామాయణం చదువుతూ ఉండడం వలన రాముని మార్గము మనసులో పదే పదే మెదలడంతో మంచి మార్గములోనే మనసు పయనించే అవకాశం ఉంటుంది. కావునా రామాయణం చదవడం శ్రేయష్కరం అని పెద్దలు అంటారు.
రామాయణం అంటే రాముడు నడిచిన మార్గమని చెబుతారు. రాముడు మార్గమునకు మూలం ధర్మము. ధర్మమార్గమే రాముడు మార్గము.
వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే పొగత్రాగటం అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి పొగత్రాగటానికి అలవాటు పడడం అనే దృష్టి కోణం యువతలో ఉండవచ్చని అంటారు.
కాబట్టి పొగత్రాగటం అనేది చాలా చెడ్డ అలవాటు అని గుర్తించాలి. అలా గుర్తించడంలో సహాయపడేవి అవగాహనా వ్యాసాలు లేదా వీడియోలు.
కేవలం పొగత్రాగటం అలవాటు ఉన్నవారికే కాదు, పొగత్రాగేవారి చుట్టూ ఉండేవారికి కూడా ధూమపానం యొక్క ప్రభావం ఉంటుంది. పొగత్రాగకుండా ఉండడం అంటే, సామాజిక సేవ చేస్తూ ఉండడమేనని కూడా తెలుసుకోవాలి.
అదేపనిగా అలవాటు ఉండడం వలనే, అదే విషయం కావాలనే మనసుకు, అదేపనిగా చేసే పని వలన లాభనష్టాలు తెలియబడితే, ఖచ్చితంగా ఏది మేలో, దానివైపు మాత్రమే మనసు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కావునా పొగత్రాగటం వలన ఎటువంటి నష్టాలు పొగత్రాగేవారికి కలుగుతాయో… సరైన అవగాహన అవసరం అంటారు.
పొగత్రాగటంపై అవగాహన కల్పించే వీడియోల లింకులు గల పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.
ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే. ఇంకా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కావడంతో… మరింతగా సినిమాపై ఆసక్తి పెరిగింది.
రామ్ చరణ్ – తారక్ జంటగా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడితే, ఇక రామ్ చరణ్ – చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రములలో మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఏప్రిల్ 29న రిలీజ్ అయినా ఆచార్య తెలుగు సినిమా తర్వాత కలెక్షన్ల విషయంలో వెనుకబడిందని చెబుతున్నారు. ఇంకా సినిమా హిట్ టాక్ కన్నా డివైడింగ్ టాక్ పాపులర్ అయ్యింది. అందువలన ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా కాస్త సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చబోయే చిత్రంగా చర్చించుకోవడం ఎక్కువైంది.
ప్లాప్ లేది సినిమా దర్శకుడు వలన ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా అని ఆశించారు
కొరటాల శివ గతంలో ప్రభాస్ తో మిర్చి, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ భరత్ అను నేను వంటి హిట్ సినిమాలను అందించాడు. ఈ సినిమాలు హిట్ అవ్వడంతో బాటు సందేశాత్మక సినిమాలుగా కూడా ప్రశంసలు పొందాయి. అలాంటి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య ఆశించిన ఫలితాన్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద కష్టాలు పడుతుంది.
ఆర్ ఆర్ ఆర్ హిట్ అయినప్పుడు కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన సినిమాల జాబితాను ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు ఆచార్య కలెక్షన్ల తీరు చూశాకా ప్లాపుల జాబితాకు ప్రచారం కల్పించడం జరుగుతుంది. మొత్తానికి ప్లాప్ లేని దర్శకుడి ఒక ప్లాప్ సినిమా వచ్చినట్టయింది.
చిరంజీవి కెరీర్లో ఆచార్య ఒక పెద్ద ప్లాప్ అనే ప్రచారం ఊపందుకుంటుంది. మొత్తానికి ఆచార్య కలెక్షన్లు చూస్తే, తండ్రికొడుకులు కలిసి నటించిన ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా సృష్టించలేక, ప్లాపుల జాబితాలోకి జారుకుందనే వ్యాక్యకు బలం చేకూరుతుంది.
ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ఇది ప్రశ్నా లేకా యాధాలాపంగా పుట్టిన మాటా? మనం ఆకాశంలో ఎగిరే విమానాలలో ప్రయాణం చేస్తాం. నేలపై వివిధ వాహనాల ద్వారా వివిధ సుదూర ప్రాంతాలకు సైతం సులభంగా ప్రయాణం చేస్తాం. ఇంకా…
లోకంలో ఏమూల ఏం జరిగినా గోడకు తగిలించిన టివిలోనో…. చేతిలో ఉండే సెల్ ఫోనులోనో వీక్షించేస్తాము. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువును ఆర్డర్ చేయగలం. ఇంకా…. తినాలకున్న తినుబండారం బయటి నుండి ఇంటికి రప్పించుకోగలం… అర్ధబలం ఉండాలే కానీ భూతల స్వర్గముగా భూమిపై జీవించగలం. ఇలా ఇప్పటి స్థితి ఉంటే, ఈ ప్రస్తుత ప్రపంచం ప్రాచీన ప్రజలకు ఎలా తెలియబడుతుంది?
మన చేతిలో ఉండే ఫోనులో ఇష్టమైనవి చూడగలం. ఇష్టమైనవి వినగలం. ఇష్టమైనవి రప్పించుకోగలం. మన ఇంట ఉండే వస్తువులతో అనేక పనులను సులభంగా చేయగలం. చేయించగలం. ఆఫీసులో ఉండే వస్తుసంపదతో పనులను చేయించగలం. ఇలా ఎక్కడ చూసిన వస్తువు ఆధారం ప్రస్తుత జీవనం కొనసాగుతుంటే, దానికి తోడు సాంకేతికత కూడా వచ్చి చేరింది.
మరి ఇలాటి ఈ ప్రపంచం గురించి మన ముందు ఎప్పుడో జీవించినవారికి ఎలా తెలియబడుతుంది. ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ప్రశ్నేగా అనిపించడం లేదు. ఈ ప్రశ్నకు బదులేది?
అమ్మ లేక నేను లేను, నువ్వు లేవు, ఎవ్వరం లేము. బిడ్డను కనడానికి మృత్యువుతో యుద్దమే చేస్తుంది…. అటువంటి అమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మను విష్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒకరోజు వస్తుంది. అదే మదర్స్ డే… ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్.
అమ్మతో అనుబంధం అనిర్వచనీయం. అమ్మ ప్రేమకు పరమాత్మ కూడా కట్టుబడి నిలబడ్డాడు. అమ్మ అంటే పరమాత్మకు సైతం ఎనలేని ఇష్టం… అమ్మ చూపే ప్రేమలో కల్మషం లేకపోవడం. ఎంతటి శక్తివంతుడైనా అమ్మ దగ్గర తిండి తినడం చేతకాక అమ్మ గోరు ముద్దలు తిన్నవారే.
ఆది శంకరాచార్యుడుకి అయినా మొదటి గురువు అమ్మే. అమ్మ వద్దే తినడం నేర్చుకుంటాడు. అమ్మ దగ్గరే ఏడుస్తాడు. అమ్మ దగ్గరే ఉపశమనం పొందుతాడు. అమ్మ దగ్గరే నడవడం నేర్చుకుంటాడు. అమ్మ దగ్గరే కధలు వింటాడు. పాటలు వింటాడు… ఇలా అమ్మ అప్యాయత ముందు అమృతం కూడా తక్కువే.
మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే… ఆలోచన ఆగదు… పదాల ప్రవాహానికి ఆనకట్ట ఉండదు… మదర్స్ డే సందర్భంగా అమ్మ గురించి కొన్ని Quotes Telugulo 2022
ఆలయం అక్కరలేని దైవం అమ్మ, అటువంటి అమ్మ దగ్గర అమృతం వంటి మాటలు మనసుకు శాంతిని అందిస్తాయి. అమ్మకు కూడా అమ్మే ఉపశాంతి.
హ్యాపీ మదర్స్ డే 2022
మనం పుట్టినప్పుడు ఏడవకపోతే తల్లడిల్లిపోతుంది… తర్వాత ఏడ్చిన ప్రతిసారి తల్లడిల్లిపోతుంది… అమ్మ ఆప్యాయతకు కొలతలు లేవు.
హ్యాపీ మదర్స్ డే 2022
బిడ్డ భవిష్యత్తు కోసం నిత్యము తపించే అమ్మ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.
హ్యాపీ మదర్స్ డే
తల్లుల రోజున మాత్రమే కాదు… ప్రతి రోజు మొదటి నమస్కారం అమ్మకే!
హ్యాపీ మదర్స్ డే 2022
బడి పాఠాలు మరుస్తామేమో కానీ అమ్మ ఒడిలో పాఠాలు మాత్రం మరువము.
హ్యాపీ మదర్స్ డే
భగవంతుడు మనకు ఇచ్చే తొలి బడి అమ్మ ఒడి, తొలి గురువు అమ్మ….
హ్యాపీ మదర్స్ డే
బిడ్డ గుణం ఎలాంటిదైనా అమ్మ చూపే ప్రేమలో తేడా ఉండని, అమ్మ గుణం అర్ధం అయితే దుర్గుణాలు దూరం అవుతాయి.
హ్యాపీ మదర్స్ డే
పరమాత్మ సైతం పరవశిస్తాడు, ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మకు మాత్రం పసివాడే…
హ్యాపీ మదర్స్ డే
అమ్మకు మరో ప్రపంచం ఉండదు. బిడ్డ భవిష్యత్తే అమ్మ ఆనందదాయకం.
హ్యాపీ మదర్స్ డే
అమ్మ ప్రేమ ముందు అరుదైనవి కూడా వెల వెల పోతాయి.
హ్యాపీ మదర్స్ డే
అవరోధం వచ్చినా, ఆటంకం కలిగినా, ప్రాణం పోతుందని భావించినా పోయే ప్రాణాల కోసం కాకుండా బిడ్డ భవిష్యత్తునే తలిచే తల్లుల కారణంగానే మనమంతా సౌభాగ్యవంతులం.
హ్యాపీ మదర్స్ డే
అమ్మ ప్రేమకు హద్దులు చెప్పడానికి పంచభూతాల ఉపమానం కూడా సరిపోదు.
హ్యాపీ మదర్స్ డే
ఎంతో తపించి సాధన చేస్తేనే కానీ ప్రకృతిలో ఫలితం లభించదు… కానీ మనం అమ్మ ఒడిలో చేరడానికి మనకోసం అమ్మే తపిస్తుంది. మన ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తుంది. అమ్మ ఒడి వరాల మూట.
హ్యాపీ మదర్స్ డే
అమ్మ అనగానే అక్షరాలు అల్లుకుపోతూ, పదాల ప్రవహిస్తుంటే, అసంఖ్యాక వ్యాక్యాలు వస్తూనే ఉంటాయి… అమ్మకు ప్రతి రోజూ పరమ భక్తితో ఒక నమస్కారం.
నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు ఎలా ఉంటాయని అంటారు. ప్రతిరోజు పొద్దుటే కాసేపు నడక కొనసాగించడం ఆరోగ్యదాయకం అంటారు. అంటే వేకువజామునే నిద్రలేవాలి. సుమారు సూర్యోదయమునకు 90 నిమిషాల ముందుగా నిద్రలేవడం శ్రేయష్కరం అంటారు.
సూర్యోదయమునకు పూర్వమే కొంతసమయం నడక సాగించడం వలన ప్రయోజనాలు
ఉదయం వేళల్లో నడక వలన తొలుత శరీరంలో శక్తిని అయితే, తిరిగి మరలా మనకు కొత్త శక్తిని కలుగుతుందని అంటారు.
ఇంకా గుండె సమర్ధవంతంగా పనిచేయడంలో ఉదయం వేళ నడక మేలు చేయగలదని అంటారు.
నేటి రోజుల చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవుతున్నారని చెబుతున్నారు. కావునా ప్రతిరోజూ కొంత సమయం నడక కొనసాగించడం… చెక్కెర వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా నడక ఉపయోగపడుతుందని కూడా చెబుతారు.
శరీరంలో ఎముకల గట్టి పడడానికి కూడా ఉదయం వేళ నడక తోడ్పడుతుందని అంటారు. మరొక ప్రధానమైన విషయం మైండు రిలాక్స్ గా ఉండే అవకాశం ఎక్కువని అంటారు.
కండరాలు గట్టి పడడంలో కూడా నడక సాయపడుతుందని అంటారు.
రోగనిరోదక శక్తి పెంపొందించుకోవడంలో నడక కూడా ఉపయోగపడుతుందని అంటారు.
శరీరంలో గుండె సమర్ధవంతంగా పనిచేస్తూ, రక్తంలో మలినాలు లేకుండా రక్త ప్రసరణ బాగుంటే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు అంటారు.
జీవిత కాలం పెరిగే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉండవచ్చని అంటారు.
కావునా ప్రతిరోజూ సూర్యోదయమునకు ముందే కొంతసేపు నడక శ్రేయష్కరం అంటారు.
EMI calculator for personal loan పర్సనల్ లోన్, కార్ లోన్, బైక్ లోన్ హోమ్ లోన్ వంటివాటి కోసం నెలవారీ కట్టుబడి నిమిత్తం లోన్ ఎమౌంట్ కు పరిమిత కాలంలో నెలవారీ చెల్లింపు మొత్తమును కనుగొనడానికి EMI క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది.
ఇటువంటి EMI calculator గల గణనం మొబైల్ యాప్ ప్లేస్టోర్ నందు ఉచితంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ కొరకు లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ ఫ్రీగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చును.
గణనంలో యాప్ EMI calculator తోబాటు…
ఫ్రీగా లభించు ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ లో ప్రధానంగా క్యాష్ calculator కూడా కలదు. దీని ద్వారా క్యాష్ డినామినేషన్ వేసుకుంటూ, క్యాష్ టోటల్ ను ఆంగ్ల పదాలలో చూడవచ్చును.
ఇంకా గణనం యాప్ లో సాదారణ వడ్డీ క్యాలిక్యులేటర్
కూడా గలదు. దీనిని ఉపయోగించుకుని కొంత మొత్తమునకు నెలసరి వడ్డీ మరియు కాలపరిమితిలో ఎంత వడ్డీ మరియు అసలు + వడ్డీ కూడా చూడవచ్చును.
అలాగే గణనం యాప్ లో జిఎస్టీ క్యాలిక్యులేటర్ కూడా
గణనం యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుని… దానిలో టాక్సబుల్ ఎమౌంట్ కు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయవచ్చును.
EMI calculator తో బాటు Days Calculator app
రోజుల గణనం… అంటే ఎంపిక చేసుకున్న రెండు తేదీల మద్యగల రోజులను సంవత్సరాల నెలల రోజులుగా కనుగొనవచ్చును. ఇంకా బర్ట్ డే నుండి… ఏజ్ క్యాలిక్యులేషన్ కూడా చేయవచ్చును.
యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి? కొత్తగా ఛానల్ పెట్టినవారికి, కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నవారికి…. చాలామంది యూట్యూబర్లకు పుట్టే ప్రశ్న అయితే మరికొన్ని ప్రశ్నలు కూడా అవసరం అంటారు. అవి…
కొత్తగా రన్ చేస్తున్న లేదా క్రియేట్ చేస్తున్న ఛానల్ మెయిన్ కంటెంట్ ఏమిటి?
అలా ఎంచుకున్న కంటెంట్ పాపులర్? అంటే అందరికీ తెలిసినది మరియు ఎక్కువమంది ఆసక్తి చూపించేదేనా?
అప్పటికే అలాంటి కంటెంటుని అందిస్తున్న ఛానల్స్ ఎన్ని? అలా అందిస్తున్న ఛానల్స్ ఎన్ని సక్సెస్ అయ్యాయి? ఎన్ని ఫెయిల్ అయ్యాయి?
సక్సెస్ పొందినవారి అనుభవం కన్నా ఫెయిల్యూర్ పొందినవారి అనుభవం అక్కరకు వస్తుంది. ప్రధానంగా ఎటువంటి తప్పిదాలు చేయకూడదో బోధపడుతుందని అంటారు.
కొత్తగా వినూత్నంగా ఒక ఆలోచన ఉంది. అటువంటి ఆలోచన ఇప్పటివరకు ఏ యూట్యూబర్ అందించడం లేదు… మరి ఇలాంటప్పుడు పుట్టవలసని ప్రశ్నలు… అంటే ఏమి జాగ్రత్తలు తీసుకుంటే, కొత్త ఆలోచనను మంచి యూట్యూబ్ ఛానల్ గా విజయవంతం చేయగలము.
కొత్త కంటెంటు కాబట్టి దానికి ప్రచారం అందించాలి. ఎందుకంటే పాపులర్ కంటెంట్ అంటే అంతా యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నారని అర్ధం. కాబట్టి పాపులర్ అయిన కంటెంటుకు సెర్చ్ లో వచ్చే విధంగా యూట్యూబ్ వీడియో డిష్కిప్షన్ వ్రాసుకుంటే సరిపోతుంది. కానీ పాపులర్ కంటెంటుపై యూట్యూబ్ ఛానల్ చేస్తే, అప్పటికే ఉన్న అన్ని ఛానల్స్ కన్నా మెరుగైన కంటెంటతో పాటు ఆసక్తికరంగా వీడియోలను రూపొందించవలసి ఉంటుంది. పోటీలో నిలబడాలంటే, కంటెంటు ఆసక్తికరంగా, విలక్షణంగా ఉండాల్సి ఉంటుందని అంటారు.
ఇక కొత్త కంటెంటు అయితే, ఆ యూట్యూబ్ ఛానల్ కు ప్రచారం అవసరం. నాణ్యమైన కంటెంట్ ఉండాలి.
కొత్తగా క్రియేట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ వారిలో ఉండే సిబ్బంది ప్రధానం.
ఎందుకంటే, ఒక పదిమంది కలసి ఒక యూట్యూబ్ ఛానల్ సృష్టించాలని అనుకుంటే, ఆ పదిమందిలో ఉన్న టాలెంట్ ఏమిటి? ఎవరు ఎటువంటి ప్రయోజనాన్ని ఛానల్ కు అందించగలరు. వీరి బలాబలాలు తెలిస్తే, వారు ఆ ఛానల్ విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించగలరని అంటారు.
ఉన్న పదిమందిలో అంతా కంటెంటుని రచించేవారు మాత్రమే ఉంటే, యూట్యూబ్ ఛానల్ కు అవసరమైనా సాంకేతికత ఎలా? ప్రమోషన్ బాద్యత ఎవరిది? ఛానల్ కు అవసరమైన ఎక్విప్ మెంట్ ? ఇలా ప్రశ్నలు అనేకం ఉంటాయి.
అదే పదిమందిలో ఒకరు ఛానల్ రన్ చేయడానికి ప్రారంభ దశలో డబ్బుని అందించగలిగే వారు ఉంటే, ఆ ఛానలకు అవసరమైన ఎక్విప్ మెంట్ సులభంగా తీసుకోవచ్చును. లేదా అంతా కలిసి వాటాలు ప్రకారం డబ్బును సమకూర్చుకోవాలి.
యూట్యూబ్ ఛానల్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఙానం తెలిసిన వారు కనీసం ఇద్దరు కన్నా ఎక్కువమంది ఉంటే, వారు ఛానల్ కు అవసరమైన మద్దతుని ఇవ్వగలదరు.
ఇంకా ఛానల్ ప్రమోట్ కావడానికి ఎస్ఇఓ తెలిసిన సాంకేతిక నిపుణుడు ఉంటే, ఇక ఛానల్ ప్రమోషన్ సులభం అవుతుందని అంటారు.
ఒక గుడ్ ఐడియాను ఒక విజయవంతమైనా యూట్యూబ్ ఛానల్ గా మార్చడానికి ఒక్కరి కృషి కన్నా కొంతమంది కృషి వలన యూట్యూబ్ ఛానల్ త్వరగా విజయవంతం చేయవచ్చును.
అయితే ఒక్కరు అయినా యూట్యూబ్ ఛానల్ విజయవంతం చేయవచ్చును. కానీ ఆ ఒక్కరికి ఎక్కువ పరిజ్ఙానం తెలిసి ఉండడమే కాకుండా దీర్ఘకాలం ఫలితం కోసం వేచి చూడవలసి వస్తుంది. పోటీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక్కడిగా విజయం సాధించాలంటే ఎక్కువ సహనం ఉండాలంటారు.
ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే అదో పెద్ద ప్రపంచం.. ఎక్కువ పోటీ ఉన్న ప్రపంచం.
ఒక్కడిగానే యూట్యూబ్ ఛానల్ పెట్టి దీర్ఘకాలంలో విజయవంతం చేయాలంటే?
ముందుగా ఎంచుకున్న కంటెంటుకి సంబంధించిన ఛానల్స్ ఏమిటి?
ఎంపిక చేసుకున్న కంటెంట్ పై యూట్యూబ్ విజిటర్స్ ఆసక్తి ఎంతవరకు ఉండవచ్చును?
సెలెక్టు చేసుకున్న కంటెంటు, ఆన్ లైన్ ప్రసంచంలో ఎంతకాలం ట్రెండ్ గా ఉండే అవకాశం ఉంటుంది?
పాపులర్ కంటెంటు ఎంచుకుంటే, అందులో ఎంత పోటీ ఉంటుంది?
సరే కంటెంట్ ఎంచుకుంటే… అలా ఎంపిక చేసుకున్న కంటెంటులో వీక్షించే జనులు ఎటువంటివి ఎక్కువగా వీక్షిస్తున్నారు? అంటే…. గాసిప్స్ టైపా? లేదా వాస్తవాల? అనేది.
ఇంకా ఎంచుకున్న కంటెంట్ వలన లీగల్ ప్రోబ్లంస్ ఉంటాయా?
ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం లభించాకా? యూట్యూబ్ ఛానల్ లో ఎన్ని వీడియోలు? వీడియో నిడివి? వీడియోలో చెప్పబోతున్న కంటెంటు యొక్క ఆవశ్యకత? వీటిపై కూడా దృష్టి పెట్టాలి.
ఇంకా ఎంతకాలం యూట్యూబ్ వీడియోలు పెడుతూ ఉంటే, ఛానల్ ద్వారా డబ్బు సంపాదించగలం?
ఎక్కువ ఊహించుకుని భంగపడడం వలన మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తక్కువగా ఊహించుకుని పనిని చేయడం వలన అది అసంపూర్ణంగా ఉండవచ్చును. కావునా వాస్తవికతకు దగ్గరగా ఆలోచన చేయాలి.
తయారు చేయబడిన వీడియోలో సరైన కంటెంటు ఉండి, అది అందరూ యూట్యూబ్ లో వెతుకుంటూ ఉంటే, ఆ వీడియోకు ప్రమోషన్ అవసరంలేదు. కానీ అలాంటి వీడియోలు అనేకం ఉంటే, ప్రమోషన్ కోసం ఎస్ఇఓ వంటివి చేయాలి. లేదా పెయిడ్ ప్రమోషన్ పై ఆధారపడాలి.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న సర్కిల్ ఎంతవరకు ఉపయోగపడగలదో సరైనా అంచనా ఉండాలి.
ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేసి, అది ఎప్పటికైనా పాపులర్ అవుతుందని నమ్మకం ఉంటే, కేవలం దాని డిష్క్రిప్షన్ లో కంటెంట్ గురించి ఖచ్చితమైన సమాచారం వ్రాస్తే సరిపోతుంది. కాదు అది ఎక్కువమందికి చేరాలంటే, మనకున్న సోషల్ మీడియా నెట్ వర్కులో షేర్ చేయాలి. ఇంకా త్వరగా ప్రమోట్ కావాలంటే, మన స్నేహితులకు షేర్ చేయమని సూచించాలి. ఇంకా ప్రమోషన్ అవసరం అయితే పెయిడ్ ప్రమోషన్ చేయాలి.
ఏదైనా జాబ్ చేస్తూ, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటే, దీర్ఘకాలంలో మాత్రమే పలితాన్ని పొందగలరు. పెయిడ్ ప్రమోషన్ లేకుండా కేవలం మనకున్న సోషల్ మీడియా సర్కిల్ ద్వారా మాత్రమే ఛానల్ ప్రమోట్ చేయదలచినా… ఎక్కువకాలం పాటు ఫలితాలు రావడానికి సమయం పడుతుందని అంటారు.
సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ! ఈ శీర్షికతో ప్రపంచంపై సినిమాల ప్రభావం ఒక అవగాహన ప్రయత్నం చేస్తే….
ఈ ప్రపంచంలో ప్రతివారు ఏదో ఒక చోట ఉండడం సాదారణం. అలాగే సాదారణ వ్యక్తి చుట్టూ ఏర్పడి ఉన్న లోకం.. ఆ లోకమే అతని ప్రపంచం. ఆ ప్రపంచంలో అతని చుట్టూ ఉండే జనులు, ఆ జనులు తెలుసుకునే విషయాలు, ఆ జనుల ద్వారా అతను పొందుతున్న ప్రేరణ… సినిమాలు లోకంపై ప్రభావం చూపుటూ ఉంటాయి. అది ఎలా?
ఒక వ్యక్తికి ఒక కుటుంబంతో బాటు అతని సహచరులు, స్నేహితులు, బంధుగణం… ఇలా ఒక ప్రపంచం ఒక వ్యక్తి చుట్టూ ఉంటుంది. అదే అతని లోకం. అతను సాధించిన ఘనత, తన లోకంలో ఉన్నవారితో పంచుకుంటూ ఉంటాడు. బాధ పొందితే, ఉపశమనం కోసం అదే లోకం ఉన్నవారితో బాధను పంచుకుంటాడు. అలా ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉండేవారితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాడు. తాను చూసిన సినిమా గురించి చర్చించుకోవడం, తద్వారా తన చుట్టూ ఉన్నవారిని ఆ సినిమా చూసేవిధంగా ప్రేరేపించడం… లేదా తన స్నేహితుల చర్చ ద్వారా తాను సినిమా చూడాలన్న ఆసక్తిని పెంచుకోవడం…. చూసిన సినిమాలో ట్రెండును అనుసరించడం లేదా సినిమాలో నచ్చిన సన్నివేశంతో మమేకం కావడం. ఇలా సినిమా ద్వారా వినోదంతో బాటు ప్రవర్తనలో మార్పుకు కూడా నాంది కాగలదు.
భారతీయుడు సినిమా చూసిన ప్రతివారు కూడా దేశంలో అవినీతి నశించిపోవాలనే తలంపు తలుస్తాడు.
అపరిచితుడు, ఠాగూర్ సినిమాలు చూసినవారు కూడా అవినీతి, లంచగొండితనంపై ఆలోచన చేస్తారు. అంటే జెంటిల్మెన్, భారతీయుడు, ఠాగుర్, అపరిచితుడు, శివాజీ సినిమాలు వలన అవినీతిపరుల వలన దేశం అభివృద్దికి ఆటంకం అనే సందేశం తెలియబడుతుంది. అలా సమాజం మంచి నాయకత్వానికి పట్టం కట్టాలనే తలంపులను కలిగి ఉంటుంది.
అలాంటి సినిమా లోకం పై పడుతున్న ప్రభావం ఆర్ధిక అంశాలతో ముడిపడి ఉంటుంది. రాజకీయ ఒత్తిడి కూడా ప్రభావం చూపవచ్చును. ఏదైనా కానీ సినిమాలు సమాజంపై మంచి చెడుల విషయంలో దీర్ఘకాలిక ప్రభావం చూపగలవని అంటారు. అటువంటి సినిమాల ద్వారా మంచి సందేశం సమాజం అంతటా పాకితే, ఆ సందేశం అనుసరించే జనులు తరువాతి నాయకత్వమును ఎంచుకుంటారు. కాబట్టి సినిమాలు సమాజంపై దీర్ఘకాలిక ప్రభావం చూపగలవు.
సన్నివేశాల ద్వారా మనిషి విజ్ఙానం పొందగలడు. అటువంటి సన్నివేశాలు సినిమాలలో అనేకంగా ఉంటాయి. అలాంటి సినిమాల ద్వారా ప్రేరణ పొందినవారు షార్ట్ వీడియోలలో కూడా అటువంటి దృశ్యాత్మక విజ్ఙానం అందిస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో విజ్ఙానం సమాజంలో లభిస్తుంది. మంచి విషయాలను తెలుసుకోవచ్చును. చెడు విషయాల వలన నష్టాలను తెలుసుకోవచ్చును.
ఆ విధంగా సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ఎక్కువగానే ఉంటుంది…. అది దీర్ఘకాలంలో ప్రస్ఫుటం అవుతుందని అంటారు.
సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం సినిమా లోకం పై పడుతున్న ప్రభావం సినిమాలు – సమాజం అవినాభావ సంబంధ మాదిరిగా ప్రభావితం అవుతూ చేస్తూ ఉంటాయి.
ఒక్క అలవాటుని జయించినా మనసులో గొప్ప మార్పుకు పునాది అంటారు.
ప్రకృతిలో పంచభూతాలకు మంచివానికి ఉపయోగపడతాయి, చెడ్డవానికి ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మంచివాడు మాత్రమేనని అంటారు.
వితండ వాదన వ్యక్తి అహంకారం నిరూపించుకోవడానికి ప్రయత్నంగా కనబడితే, సంవాదన మంచి ప్రయోజనాల కొరకు చర్చగా మారుతుందని అంటారు. రోజూ అద్దంలో ముఖం చూసుకున్నట్టుగానే, అప్పుడప్పుడూ మనసుని కూడా పరిశీలించుకోవడం వలన మనసు మరో కోణం కనబడుతుందని అంటారు.
నీ పనితనం నీకో గుర్తింపు తెచ్చి పెడితే, నీ నిర్లక్ష్యం నీ అభివృద్దికి అడ్డంకి అవుతుందని అంటారు.
అందమైన శరీరం భగవంతుడిచ్చింది అయితే, అందమైన మనసు మాత్రం నీ ప్రయత్నం వలననే ఏర్పడుతుంది. మనసును బట్టి పెరిగే బంధాలు, ఆ వ్యక్తిని చిరకాలం గుర్తు పెట్టుకుంటాయని అంటారు.
తల్లిదండ్రులు భగవంతుడిచ్చే గురువులు అయితే, వ్యక్తి ఆసక్తిని బట్టి మరొక గురువుపై, అతని దృష్టి నిలబడుతుంది… ఈ ముగ్గురి ఆశయాలకు బట్టి వ్యక్తి భవిష్యత్తు ఆధారపడవచ్చని అంటారు.
తెలుగులో మంచి మాటలు కోట్స్
లోకం అద్దంవంటిది? అద్దంలో మన ముఖ కవళికలను మనకు చూపినట్టు, లోకం మన ప్రవర్తనకు ప్రతి ఫలం అందిస్తుందని అంటారు.
నీ మనసును అందం కట్టిపడేయలేదు కానీ సుగుణాల స్వభావం నీ మనసుపై మంచి ప్రభావం చూపుతుందని అంటారు.
కోపం కలిగినప్పుడు ఆవేశపడితే వచ్చే ఫలితం కన్నా కోపం కలిగినప్పుడు ఆలోచనలో పడితే, కోప గుణాన్ని కూడా మంచిగా మలచవచ్చని అంటారు.
కళాకారుడు అందమైన శిల్పాన్ని చేయగలడు… గుణవంతుడు తన చుట్టూ ఉండే వారిలో మంచిని పెంచగలడని అంటారు.
ముసలితనం బాలుని వలె ఉంటే, పిల్లవానిని లాలించినట్టే, ముసలివారిని లాలించడం చేత, వారు ఆ ఆప్యాయతలోనే ఉపశాంతి పొందగలరని అంటారు.
అసలైన సంపద అంటే నిత్యం సంతోషిగా, తృప్తిగా జీవించగలగడం అని అంటారు.
ఇతరుల వలన బాధ కలుగుతుందని భావించడం కన్నా కాలం వలన బాధలు వస్తూ పోతున్నాయనే భావన వలన మనసుకు శాంతి కలుగుతుందని అంటారు.
విధి రాసిన రాతను సైతం మార్చుకోగలరని పురాణ పురుషులు జీవితాలు నిరూపిస్తాయని అంటారు, పురాణ పఠనం మనోబలం పెంచుతుందని అంటారు.
తెలుగులో మంచి మాటలు కోట్స్
మనసుతో ఏర్పడే విషయానుబంధమే, మనసును నడిపిస్తాయి. ఎటువంటి విషయాలు ఎక్కువగా చేరితే, అటువంటి మార్గములో మనసు నడుస్తుందని అంటారు.
ఆకర్షణీయమైన కాయము ఆకట్టుకోవచ్చును కానీ సుగుణాల కారణంగా వ్యక్తి ప్రేమించబడతాడని అంటారు.
సమూహం ఏర్పడేది సామాజిక ప్రయోజనాల కోసమే కానీ స్వప్రయోజనాల కోసం కాదని అంటారు.
విజయం సంతోషాన్ని తెస్తే, ఓటమి దు:ఖాన్ని తెస్తే, గెలుపు-ఓటమి శాశ్వతం కాదని భావించే భావన మనసుకు బలాన్నిస్తుందని అంటారు.
మంచి గుణాలు ఉండడం ఒక ఎత్తయితే, వాటిని ఉపయోగించడం వ్యక్తి గొప్పతనం తెలియబడుతుందని అంటారు.
మూడు ముళ్ళతో బంధం పెద్దలవలన ఏర్పడితే, దానిని గౌరవిస్తూ, తమ భాగస్వామిని అర్ధం చేసుకుంటూ నడుచుకోవడమే దాంపత్యం యొక్క గొప్పతనం అంటారు.
సమస్య సృష్టించబడుతున్నప్పుడే సమస్యక పరిష్కారం కూడా ఉంటుంది, తాళంతో పాటు తాళం చెవి కూడా తయారైనట్టు…. అని అంటారు.
ఎదగడానికి చదువు ఉపయోగపడితే, ఒదిగిపోవడానికి వినయం ఉపయోగపడుతుంది. సంస్కారం బట్టి బంధాలు ఏర్పడతాయని అంటారు.
ఓర్పు దేవతా లక్షణం అని అంటారు. దేవతల చుట్టూ మనిషి తిరిగినట్టుగా, ఓర్పు ఉన్నవారి చుట్టూ బంధాలు అల్లుకుంటూ ఉంటాయని అంటారు.
పుస్తకం చూసి వదిలేయకుండా, దానిని చదివి విషయావగాహన ఏర్పరచుకున్నట్టే, మనషుల స్వభావాలను కూడా చదివి అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటే, జీవితం కొత్త కొత్త పాఠాలు నేర్పుతుందని అంటారు.
వ్యక్తి గొప్పతనం ప్రదర్శించుకోవడానికి మరొకరిని చులకనగా చూపించడం సత్ప్రవర్తన కాదని అంటారు.
వివాహం జరిగిన తేదీన దంపతులకు తెలుగులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి,
పెళ్ళిరోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు
పరిచయం అయ్యే ప్రతివారు ఏదో ఒక కారణంతో పరిచయం కాగలరు. కానీ అందరూ కోరుకునేది మాత్రం శాంతి. అటువంటి శాంతికి అలవాలం అయిన మిత్రమా నీకు
కలపడం వరకే మావంతు కలిసి ఉండడం మీవంతు… కలిసి జీవించే మీకు అండగా ఉండడం మావంతు అయితే మీరు మాత్రం వంతులు కోసం వాదులాడుకోకుండా చక్కగా కాపురం చేసుకోవాలి…
ఇరువురికి ఇష్టమైతే అది ఎంత కష్టమైనా భరించవచ్చును… ఎంత కాలమైనా కలిసి మెలిసి జీవితంచవచ్చును. మీ ఇరువురి ఇష్టానికి అప్పుడే సంవత్సరకాలం… అటువంటి మీ కాపురం కలకాలం పిల్లాపాపలతో కళకళలాడాలని ఆశిస్తూ…
బంధం బరువు అనుకునే రోజులలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడడమంటే, మీరు మరొక జంటకు ఆదర్శమే అవుతారు.
ఇద్దరి మద్య బంధం బలపడిందంటే అది ఇద్దరి మద్య ఏర్పడిన అవగాహనే కారణం. అటువంటి అవగాహన మీకు జీవిత పర్యంతము కొనసాగాలని కోరుకుంటూ…
కాలం కట్టబెట్టే బంధానికి పెద్దల ఆశీర్వాదం తోడైతే, అది ఆదర్శంతమైన దాంపత్యానికి మార్గం అయితే, ఆ దాంపత్యంలో కష్టమైనా ఇష్టమే!
మీమద్య కష్టం కూడా కాలంతో బాటే కరిగిపోవాల్సిందేనని మీ దాంపత్య జీవితం తెలియజేస్తుంది. కలకాలం కలసి ఉండాలనే కాంక్షతో జీవిస్తున్న మీకు
ఒకరికొకరు అనుకుని బ్రతికేస్తూ ఉంటే సంవత్సరాలు కూడా రోజులులాగా గడిచిపోతాయని మీ ఇద్దరి బంధం నిరూపిస్తూ సంవత్సరం పూర్తయిన సందర్భంగా…
నీఇల్లు ఆనందానికి అడ్రస్, నీ మనసు మంచితనానికి మారుపేరు. నీ పెళ్ళిరోజు మాకు పండుగ మిత్రమా… నీకు
దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
మిత్రమా నీ ఆదర్శమునకు అనుకూలంగా నడుచుకునే జీవిత భాగస్వామి నీకు లభించినందుకు మిక్కిలి సంతోషిస్తూ… మొదటి వివాహావార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా
మీ కొత్త కాపురానికి ఏడాది కాలం అయితే మా ఆనందానికి మరింత ఆనందకరం మీ ఇద్దరి అనోన్యత…
నమ్మిస్తూ బ్రతకడం కన్నా నమ్మకంతో బ్రతకం వలస జీవనం సాఫీగా సాగుతుందని మీ జంట వలన తెలియబడుతుంది. మీకు…
వస్తువుని పరీక్షించి చూస్తాము… బంధాన్ని అవగాహన ఏర్పరచుకుని ముందుకు సాగుతాము… మీ ఇరువురిలో మీపై మీకుండే అవగాహన అందరికీ ఆదర్శం…
ఆకర్షణలో కలిసి ఉండడం కన్నా కష్టం వచ్చినప్పుడు కలిసి ఎదుర్కోవడం వలన బంధం మరింత బలపడుతుందని నిరూపించిన మీ జంటకు….
కాలక్షేపం కోసం కబుర్లాడే కొందరు సృష్టించే కలహాలు కాపురాలను కూలదోస్తాయి… కాబట్టి మీరు అలాంటి వారి మాటలను ప్రక్కన పెట్టి మీరు ఇరువురు కలకాలం కలిసి ఉండేవిధంగా ఒక అవగాహనతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ…
నాకెందుకులే అని పట్టించుకోని స్వభావమే బంధాన్ని బలహీనపరుస్తుంది. అటువంటే తలంపే లేని మీ సంసారం ఆదర్శవంతం.
చూడడానికి జంట ముచ్చటగా ఉంటే చూడచక్కని జంట… ప్రవర్తన కూడా మరొక జంట అనుసరించే విధంగా అది ఆదర్శప్రాయమైన దాంపత్యం…
కారణంలేకుండా కొట్టుకుని విడిపోయే జంటలను కూడా చూస్తున్నాం…అలాంటి వారి దృష్టి మీపై పడకుండా ఉండాలని కోరుకుంటూ… మీరు కలకాలం కలిసి ఉండాలని ఆశిస్తూ
చూడడానికి చూడముచ్చటైన జంట, మీ అనుబంధమే మీ అసలైన ఆనందానికి కారణం, మీ శ్రేయస్సును కాంక్షించే మాకు పరమానందభరితం. మీకు…
అర్ధం చేసుకునే ప్రయత్నం చేసేకొద్ది బంధం బలపడుతుంది. అపార్ధం అధికమయ్యేకొద్ది, బంధం బలహీనపడుతుంది. అపార్ధాలకు తావులేని మీ దాంపత్యం అందరికీ ఆదర్శంతం.
పరిచయం లేని స్త్రీపురుషులను చూసి ఒక్కటిగా బ్రతికేస్తారని భావించి మిమ్మల్ని కలిపిన మీ పెద్దల నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండే మీ జంట అన్యోన్యత మార్గదర్శకం! మీకు…
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్… retirement wishes in Telugu
పెంచితే పెరిగేది మంచి, పెంచకపోయినా పెరిగేది చెడు… మంచిచెడులు ఆలోచించి కార్యములు నిర్వహించే నేస్తమా నీవు మార్గదర్శకుడవు…
పుట్టాక, పెరుగుతూ ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, జీవితంలో ఎదుగుతూ అనేక పదవులు నిర్వహిస్తూ, చేస్తున్న పదవికి వన్నె తెచ్చే ఉద్యోగులు అనేకమంది మన సమాజంలో ఉంటారు.
సంస్థకు ఆస్తులు ఎప్పటికీ అలానే ఉంటాయని అంటారు. కానీ అది అబద్దం ఈరోజు ఆస్తి కదిలిపోతుంది. ఖచ్చితంగా మీరు సంస్థకు చరాస్థిగా పనిచేశారు.
సమయపాలన గురించి తెలుసుకోవాలంటే మిమ్మల్ని అనుసరిస్తే చాలు… సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మీకు మీరే సాటి
నిర్వహించిన పదవికి కానీ ఉద్యోగానికి కానీ విరమించవలసిన సందర్భం వస్తుంది. అటువంటి సందర్భంలో పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగులో తెలియజేయడానికి కొన్ని తెలుగు కోట్స్…
ఒక ముగింపు మరొక ఆరంభానికి ఆది అవుతుంది. ఈ పదవికి మీరు వన్నె తెచ్చారు. మీలాంటి వ్యక్తి మరలా ఎన్నాళ్ళకు చూడగలమో, చూడలేమో తెలియదు… కానీ మీరు మాకు ఆదర్శం…
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్…
ఎక్కడ ఉన్నా సంస్థ పనిమీద దృష్టి సారించి అందరిని కలుపుకుంటూ, తెలిసినది తెలియజేయడంలోనూ, తెలియనిది తెలుసుకోవడంలోనూ నీలాంటి సహచరుడు లభించడం అరుదు.
ఇష్టంగా ఉన్నప్పుడు కాలం ఇట్టే కరిగిపోతుందంటారు. మీరు వచ్చి వెళ్ళడం కూడా అలాగే ఉంది.
అన్ని సౌకర్యాలు ఉంటే తృప్తిగా పని చేసేవారు ఉంటారు కానీ అసౌకర్యంలో కూడా కర్తవ్యంతో పనిచేసిన మీ సహనం అందరికీ మార్గదర్శకం.
పని చేస్తున్నంతకాలం పనిమీదే దృష్టిపెడితే కష్టకాలం కూడా ఇష్టంగానే గడిచిపోతుందని మిమ్మల్ని పరిశీలించినవారికే అవగతం అవుతుంది.
కాలం కలసి వస్తే ఎవరైనా విజయాలు సాధించవచ్చును. ప్రతికూల పరిస్థితులలో కూడా విజయం సాధించడం మీకే చెల్లింది. అలాంటి విజయవంతమైన మీ పదవీకాలం ఎందరికో మార్గదర్శకం.
కొందరు కాలం కలసి వస్తే పదవి పొందుతారు అది వారి అదృష్టం అయితే మీకు ఈ పదవిని నిర్వహించడం ఈ పదవికి పట్టిన అదృష్టం నేడు దూరం అవ్వడం మా దురదృష్టం.
అదేపనిగా పని చేసుకుపోవడం పనివాని లక్షణం అయితే పనిని చేస్తూ, పనిని చేయించడం మీ లక్షణం, అది అందరికీ ఆదర్శవంతం! మీకు…
పదవి విరమణ చేశాకా పదవీకాలం చెబుతుంది ఏం సాధించింది? మీరు సాధించినది మరొకరు సాధించడానికి ఏళ్ళతరబడి ఎదురుచూడాలి.
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్…
ఎవరు ఎంత కాలానికి మార్గదర్శకంగా ఉంటారో తెలియదు కానీ ఈ పదవి ఉన్నంతకాలం ఈ పదవిలోకి వచ్చే వారందరికీ మీరే మార్గదర్శకులు… ఎందుకంటే మీ పనితీరు అంత గొప్పది.
తప్పు చేస్తే క్షమించని గుణం మీది అయినా ఆ గుణమును నియంత్రించి మంచి చెడులను ఎంచి ఎందరికో మంచి చేసిన సహృదయం మీది… ఆ హృదయమే మాకు శ్రీరామరక్ష… కానీ ఆ రక్షణ నేడు దూరం అవుతుంటే….
మీ సహచర్యంలో మమ్మల్ని మేము సరిదిద్దుకోగలిగాం. మీ సంరక్షణలో మేము సంతోషంగా ఉన్నాము. మిమ్మల్ని అనుసరించి మేము మరింతగా గుర్తింపు సాధించాము. మీరు మాపై చూపిన ప్రభావం మాకు శ్రేయస్సుగా మారింది.
ప్రతి పదవికి పరిమిత కాలముంటుంది కానీ ఇప్పుడు మీరు వెళ్తుంటే, ఆ పదవి పరిమిత కాలం మీరున్నంతకాలంగా పెరిగితే బాగుండును అనిపిస్తుంది.
ఎటువంటి పదవికైనా ఒకరికి కొంత పరిమిత కాలమే ఉంటుంది. అలాగే వ్యక్తి వయస్సు రిత్యా ఉద్యోగానికి కూడా పరిమిత కాలమే పని కాలముగా ఉంటుంది. ఇలా పదవీ విరమణ ఉంటుంది. ఉద్యోగ విరమణ ఉంటుంది. పదవికి కానీ ఉద్యోగానికి కానీ వన్నె తెచ్చి, మరలా అటువంటి వ్యక్తి ఎప్పుడు ఆ పదవిని అలంకరిస్తారో అని అనుకునేంతలాగా కొందరి కార్యదక్షత ఉంటుంది.
పదవులు ఉంటాయ్, పదవులలోకి వస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటారు. కానీ మీలాంటి వ్యక్తి మాత్రం ఇంతకుముందు రాలేదు… భవిష్యత్తులో రారు…
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్ మీ బంధుమిత్రులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఫోను నుండి పుట్టినరోజు శుబాకాంక్షలను వచనంగా sms రూపంలో పంపండానికి జన్మదిన శుభాకాంక్షల కోట్స్.
మిత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగు కోట్స్
మంచి మిత్రుడు ఉన్నవాడు అదృష్టవంతుడని అంటారు, ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మిత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగు కోట్స్
సహవాసంలో సంతోషం, బాధ పంచుకుంటూ, ఆనందంగా ఉంటారు. కానీ నీ సహవాసంలో ఎవరైనా మంచి మార్పు వైపుకు మారతారు… నీవు నా స్నేహితుడివైనందుకు ఎంతో సంతోషం.
మిత్రమా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మారుతున్న కాలంలో కష్టనష్టాలు వస్తూ, పోతూ ఉంటాయి కానీ నీ స్నేహం మాత్రం శాశ్వతం. మన స్నేహబంధం ఇలాగే కొనసాగాలని కోరుతూ…
ప్రియ మిత్రమా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మంచి పుస్తకం చదివితే, మంచి స్నేహితుడు దగ్గర ఉన్నట్టేనని అంటారు. కానీ నాకు ఒక గ్రంధాలయమే నీరూపంలో నాకు లభించింది…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
చెప్పుకుంటే బాధ పోతుందని అంటారు అయితే నీ పలకరింపుతోనే ఓదార్పు వచ్చేస్తుంది. నీలాంటి మిత్రుడు నాకు లభించడం నా అదృష్టం.
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మనసుకు మనసే మిత్రుడు అంటారు ఇంకా మనసు ఎరిగిన తోటివారు ఆప్తమిత్రుడు.. నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉండే నేస్తమా….
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మరు జన్మ అనేది ఉంటే, నీకు నీలాంటి స్నేహితుడిగా పుట్టాలని ఉంది.
ప్రియ నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎదుగుతుంటే ఓర్చనివారుంటే, ఎదుగుతుంటే మద్దతు పలుకుతూ, మిత్రుడి ఎదుగుదలే నా ఎదుగుదల అని భావించే మిత్రుడు ఉండడం చాలా అదృష్టం అంటారు. నా ఈ స్థితికి నీ తోడ్పాటు అనిర్విచనీయం…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
సరదాకు సాయం చేయడం కాదు అవసరానికి సాయం చేసే నీ గుణమేరా నీ మంచి గుణం…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
కాలంలో రోజులు గడిచిపోతుంటే కొన్ని రోజులు మాత్రం మరిచపోలేము… అలాంటి రోజులలో నీ పుట్టినరోజు కూడా ఉంటుంది. నీ మేలు మరవలేను… నీ మంచి మనసుకు మనస్సుమాంజలి…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఈ జన్మకు చాలు నీలాంటి స్నేహితుడితో అనుబంధం ఏర్పడడం, నిజంగా నా అదృష్టం..
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
రక్షించేవాడు దేవుడు, భక్షించేవాడు రాక్షసుడు, పోరాడేవాడు మనిషి…. ఓ మనిషిగా నీ పోరాటం నీకోసం కాకుండా నీచుట్టూ ఉండేవారి కొరకు అవ్వడం అందరి అదృష్టం! నీకు…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మంచిపని చేయాలని అనుకుంటూ ఉండేవారి మద్యలో ఉంటూ మంచిపనులే చేస్తూ ఉండే నీకు ఇలాంటి పుట్టిన రోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
పుట్టిన ప్రతివారిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అంటూ, అందరిలోనీ టాలెంట్ గుర్తించే నీటాలెంట్ హైలెట్… హాట్సప్ టు యు మై ఫ్రెండ్.
ప్రియ నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
శ్రేయస్సుకోసం కఠినంగా మాట్లాడేవాడు మిత్రుడు. శ్రేయస్సు కోసం ప్రయత్నం చేసేవాడు మిత్రుడు.. ఇవ్వన్నీ కాదురా… స్నేహానికి అర్ధం నువ్వు…
నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
సూర్యోదయం లోకానికి వెలుగు, నీ విజ్ఙానం బంగారు భవిష్యత్తుకు మార్గదర్శనం! నీ ప్రయత్నం ఓ యజ్ఙం ! నీ ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిస్తూ…. నీకు
మిత్రమా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నా జీవన ప్రయాణం మొదలు కావడానికి ఆది నుండి కష్టపడి నన్నింతవాడిని చేసిన నాన్నగారికి నా హృదయపూర్వన నమస్కారములు… నేడు మీ పుట్టినరోజు సందర్భంగా మీకు
ప్రియ నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కలగన్నట్టు ఉంది మిత్రమా నీతో పరిచయం అయ్యాక కాలం చాలా ఇష్టంగా గడిచిపోతుందంటే, నీ మాటతీరు నీ సహవాసంలో మ్యాజిక్ ఉంది మిత్రమా…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
పరిచయం పెరిగే కొలది మనస్పర్ధలు అధికమయ్యే బంధాలలోనూ మంచిని మాత్రమే గ్రహించే నీ తెలివికి జోహార్లు…
ప్రియ నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
గుడిలో దేవత కూడా పిలిస్తే పలుకుతుంది. ఇంట్లో అమ్మ మాత్రం పిలవకుండానే అన్నీ చూసుకుంటుంది… అమ్మా నీకొక నమస్కారం.
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Puttina Roju Subhakankhalu Quotes Telugu
ఓ మై ఫ్రెండ్ అంటూ ఎవరు సాయం అడిగినా, ఆలోచించకుండా సాయం చేసే నీగుణానికి హాట్సప్…
అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
చిత్రమేమిటంటే నీ పుట్టినరోజున కూడా నీవే దీవించేది… నీకు మేలు చేయడానికి భగవంతుడికైనా మరుజన్మ కావాల్సిందే… అమ్మ నీకు నా నమస్కారం.
అమ్మా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
అమ్మ నేను పొగిడితే మొదట నిన్నే పొగడాలి… నా పుట్టుక నీకు మరణయాతన కలిగించినా, ఆకష్టం అనుభవించి నన్ను కన్నతల్లిని ఎంతపొగిడినా అది తక్కువే… తల్లీ నీకు నా నమస్కారం.
అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎదుటివారి ఆనందం కోసం తపించే హృదయంలో అమ్మ ఉంటే, మరి అమ్మ హృదయంలో ఏముంటుంది…. అమృతమే ఉంటుంది. అమృతమూర్తి అమ్మకు
అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అమ్మను మించిన దైవంలేదు నాన్న మించిన హీరో లేడు
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రకృతిలో పెద్ద కష్టం మరణమే అయితే అంత పెద్ద కష్టం ఇష్టంతో స్వీకరించి నన్ను కన్నతల్లికి ప్రతిరోజు నా నమస్కారం…
అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
ఆస్తి కన్నా విలువలు ప్రధానమంటూ జీవించిన నీ జీవితం మాకు ఆదర్శవంతం…
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పట్టుదలకు ప్రేరణ తోడైతే మంచి ఆశయం జనిస్తుంది…. దానికి సాధన తోడైతే ఆశయసిద్ది కలుగుతుందని నీ జీవితం నిరూపితం!
నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు.
Puttina Roju Subhakankhalu Quotes Telugu
ఆశయం, ఆదర్శం, లక్ష్యం, నిశ్చయం, పట్టుదల, సాధన… మొదలైన పదాలకు అర్ధం తెలుసుకోవడం అనవసరం… మిమ్మల్ని అనుసరిస్తే చాలు.
నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు.
కాలం ఇచ్చే కష్టంలోనూ, కాలం తీసుకుచ్చే సుఖసంతోషాలలోనూ సమదృష్ఠితో ఎలా ఉండాలో మీకు నేర్పించిన నాన్నగారికి ఎప్పటికీ ఆదర్శం…
నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.
నాన్నకు నాన్నే సాటి, నాన్నే నాహీరో…
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఆశయంలో తండ్రి మార్గదర్శకుడు అయితే నాన్నగారు మీవలననే నాజీవితానొక మంచి ఆశయం ఏర్పడింది… మీ జన్మదినం శుభ సందర్భంలో…
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
దిక్కుతోచని స్థితిలో మీ మాటలు మనసుకు బలం అయితే, కష్టాలలో మీ పట్టుదలే మాకు మార్గదర్శకం… మీ జన్మదినం సందర్భంగా…
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
ఆశపడడానికి హద్దుండదు కానీ ఆశయం సాధించడానికి అడ్డంకులెన్నో… అయినా అడ్డంకుల్ని జయిస్తే, ఆశయం నెరవేరుతుందని నిరూపించిన నీకు….
అన్నా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
సేవలో అమ్మలాగా, ఆజ్ఙలో నాన్నలాగ నన్ను శాశించి నీవు చేసిన మేలే ఈ జీవితం.
అన్నా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆదర్శం అంటూ సాగిన నీ నడక కఠినమే కానీ అది నాకు పూలబాట అయ్యింది. నీవలన మన కుటుంబానికి మరింత గౌరవం… పుట్టిన రోజు సందర్భంగా…
అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నువ్వు నడిచిన ముళ్ళబాట నేడు మాకు రహదారిగా మారింది… నీ కష్టానికి మా నమస్కారం
అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
పెద్దవానిగా పెద్దరికం వహిస్తావు, చిన్నవాడినైన నాతో చిన్నపిల్లవాని వలె మాట్లాడుతావు… నీ పద్దతి మార్గదర్శనీయం…
తమ్మునికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
గొప్ప మాటలు విను, గొప్పను ఆపాదించుకోకు… చుట్టూ ఉన్నవారి గొప్పతనం గుర్తించు… గొప్పఅనే భావనతో అంటకాగకు… సంతోషంతో…
తమ్మునికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
సోదరుడివైనా స్నేహితుడిలాగా సలహా ఇచ్చావు… అవసరంలో అండగా నిలబడ్డ నీకు మరింత మేలు జరగాలని ఆశిస్తూ…
తమ్మునికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
స్నేహంలో సోదరిగా అనుసరణకు మార్గదర్శకురాలుగా నిలబడుతూ నన్ను నిలబెట్టిన సోదరికి
అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ప్రతి పరిచయం ఏదో సందేశం ఇవ్వడానికే అన్నట్టు ఉంటే, నీ పరిచయం మాత్రం మాకు మేలుకొలుపు… నీ మార్గం అనుసరణీయం…
అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు
సంతోషంగా ఉంటే కష్టం కూడా ఇష్టంగా మారిపోతుందని నిన్ను చూస్తే తెలుస్తుంది. అలవరుచుకుంటే జీవితం బాగుంటుంది… ఆదర్శప్రాయమైన అక్కకు
అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు
చెల్లెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు
సంతోషానికి నీ చిరునవ్వు చిరునామా అయితే కష్టానికి చోటులేకుండా పోయింది.. సోదరికి జన్మదిన శుభాకాంక్షలు
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుట్టింటి గౌరవం మెట్టింట్లో వికసిస్తుందనటానికి నీవే ఉదాహరణ… నీ జీవితం సుఖమయం కావాలని కోరుకుంటూ…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నీ పుట్టుక మాకు సంతోషదాయకం అయినా మాకు అసలైన సంతోషం నీ జీవిత పర్యంతము సుఖసంతోషాలతో ఉండడమే…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
బంగారు తల్లి నీరాక ఇంటికి శుభం. నీ నడక ఇంటికి సందడి. నీవు వెళ్ళిన ఇళ్ళు మహాలక్ష్మికి ఆలవాలం…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కలసిరాని కాలంలో కలిగావు, ఇంట్లో శుభాల సందడి మొదలయ్యింది… నీవు నిండు నూరేళ్ళు సంతోషంతో జీవించాలి.
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కొడుకుకు పట్టినరోజు శుభాకాంక్షలు తెలుగుఓ
ఓరేయ్ వెనుక ఉండి ముందుకు తోసేవారితో జాగ్రత్త… ముందుండి రమ్మని పిలిచేవారితో ఆలోచించి అడుగు వెయ్యాలి… జీవితం చాలా విలువైనది. కరిగిన కాలం తిరిగిరాదు, నోరుజారిన మాట రాదు… జాగ్రత్త సంతోషంగా జీవించు…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
జీవితంలో ఒక మంచి పనిచేయాలి అంటారు. కానీ ప్రతి పుట్టినరోజుకు ఒక మంచిపని ఆచరించు ఆనందంగా జీవించు..
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
సంతోషంగా జీవించడం అంటే సంతోషం కోసం ప్రాకులాడుట కాదు… సంతోషం పంచడం. చుట్టూ ఉన్నవారి సంతోషం కోసం తపించే మనసుకు మంచే జరుగుతుంది.
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కొందరి పుట్టిన రోజులు కొంతకాలం గుర్తు ఉంటుంది. కొందరి పుట్టిన రోజులు ఎల్లకాలం గుర్తుండిపోతుంది. అలా నీవు ఏదైనా సాధించి గొప్పఖ్యాతిని పొందాలని ఆశిస్తూ….
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ప్రతి పరిచయమునకు కారణం కాలం అయితే మన పరిచయం స్నేహంగా మారడానికి కారణం అవసరం కాదు అవగాహన. ఇటువంటి అవగాహన ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ…
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి! ఇది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వ్యాఖ్య. మంచి లక్ష్యం గురించి కలలు కనడం, ఆ లక్ష్య సాధనకు కృషి చేయడం… జీవితంలో ఉండాలని అంటారు.
పగటి కలలు కనడం తప్పు అయితే, ఏదైనా సాధించాలనే తపనతో కూడిన కలలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయని అంటారు. కేవలం కలలు కంటూ ఉండడం ముమ్మాటికి తప్పనే అంటారు. కానీ ఒక మంచిలక్ష్యం ఏర్పరచుకుని, ఆ లక్ష్యం సాధిస్తాననే కల కనడంలో తప్పులేదు అంటారు.
ఏదో ఒక రంగంలో ఏదో ఒక అంశంలో నలుగురికి ఉపయోగపడుతుందనే పనిని సాధించడానికి ఒక లక్ష్యం ఉంటే, ఆ లక్ష్య సాధనకు కలలు కనడంలో తప్పులేదు కానీ వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయకపోవడం అసలు ప్రయత్నమే చేయకపోవడం తప్పు. ప్రయత్నించే గుణం లేనప్పుడు కలలు కనడం అనవసరం అంటారు.
హైస్కూల్ చదువుతున్నప్పుడే ఒక ఐఏస్ అధికారిగా కలలు కనడం తప్పులేదు కానీ అందుకు తగ్గట్టుగా సరైన సాధన చేయకుండా, డిగ్రీ సాధించడానికి తగినంత కృషి చేయకపోవడం తప్పు….
ఒక ఐఏస్ అధికారిగా, ఒక ఐపిఎస్ అధికారిగా, ఒక డాక్టరుగా, ఒక ఇంజనీరుగా కలలు కంటూ, అవి పొందడానికి తగినంత కృషి చేయాలి. చదువులతో కాలం గడుస్తున్న కొలది, చదువులో పురోగతి ఉండాలి. వాటిని సాధించడానికి కృషి చేస్తూ ముందుకు సాగాలి.
కొందరు భారీ లక్ష్యమును పెట్టుకుంటారు. ముందుగానే పెద్ద లక్ష్యం పెట్టుకుని, దానిని సాధించలేక నిరుత్సాహపడేవారు ఉంటారు. కాబట్టి పెద్ద లక్ష్యం ఏర్పడకముందే, చిన్న చిన్న లక్ష్యాలు చేధించాలి.
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
పదవ తరగతికి రాకముందు శాస్త్రజ్ఙుడు కావాలని కలలు కనడం చేస్తూ…. పదవతరగతిలోనే పాస్ కాకపోతే, మరింత నిరుత్సాహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో విద్యాపరంగా ఎటువంటి భారీ లక్ష్యం చేధించడానికైనా కీలకం పదవతరగతి ఫలితాలు మనసులో బలాన్నిస్తాయి. కావునా భారీ లక్ష్యం గురించి ఆలోచన ఉన్నా, దాని గురించి కలలు కనేముందు, పదవ తరగతి చదువులో తమ తమ శక్తి ఏపాటిదో గ్రహించాలి. మంచి ఫలితాలు ఎలా సాధించడానికి కృషి చేయాలి. పదవతరగతి ఫలితాలు విద్యావృద్దిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి పది పాస్ కావడానికి వీలైనంతగా కృషి చేయాలి…. ఆపై జీవితపు లక్ష్యం కలలు నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కన్న కలలు నెరవేర్చుకోవడంలో పదవ తరగతి ఉత్తమ ఫలితాలు ఉపయోగపడతాయని అంటారు. కాబట్టి కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి! కానీ ముందుగా పబ్లిక్ పరీక్షలు బాగా వ్రాయండి.