తెలుగురీడ్స్ విజిటర్స్ కు వందనములు భారతదేశయాత్రదర్శిణితెలుగుబుక్స్ ఈ శీర్షిక ద్వారా తీర్దయాత్రలపై ఉచితంగా లభిస్తున్న ఆన్ లైన్ తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ గురించి క్లుప్తవివరణ.
యాత్రలు చేసి ఆలయ సందర్శనం చేయడం, పాదయాత్రలు చేస్తూ దగ్గరలో ఉండే గుడికి కాలినడకన వెళ్లడం కార్తీకమాసం ముందునుండి భక్తులు ప్రారంభిస్తారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యాక పుణ్యక్షేత్రదర్శనమునకుయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాలినడకన తమ ప్రాంతానికి దగ్గరగా ఉండే దేవాలయమునుకు పాదయాత్ర చేస్తూ వెళ్లడం ఈ కార్తీకమాసమును ముందు, తరువాత ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
కొందరు కార్తీకమాసంలో ఇంట్లో కార్తీకదీపం వెలిగిస్తే, కొందరు ఇంటికి దగ్గరగా ఉన్న ఆలయములలో కార్తీకదీపం ప్రతిరోజు వెలిగిస్తారు. కొందరు ఊరికి దూరంగా ఉన్నా, నదీస్నానం చేయడానికి అనువుగా ఉన్న ఊరికి వెళ్లి దేవాలయంలో కార్తీకదీపం వెలిగిస్తూ ఉంటారు. అంటే విశేష దీపం వెలిగించడానికి కార్తీకమాసం విశిష్ఠమైన మాసంగా భావిస్తారు. కార్తీకమాసంలో వైష్ణవాలయం కానీ శివాలయం కానీ తప్పనిసరిగా దర్శించమంటారు. ఇంకా భారతదేశంలో విశిష్టమైన పుణ్యక్షేత్రములకు యాత్రలు కూడా ఈ మాసంలోనే చేయమని పెద్దలు చెబుతూ ఉంటారు.
అయితే దగ్గరలో ఉండే దేవాలయమునకు కొందరు కాలినడక దైవనామస్మరణతో భక్తితో పాదయాత్ర చేస్తూ శివుడిని లేక శ్రీహరిని దర్శించకుంటూ ఉంటారు. అలా దుర్గమ్మను, వేంకటేశ్వరుని, శంకరుని, వినాయకుడిని, కుమారస్వామిని, ఆంజనేయస్వామిని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. దూరంగా ఉండే పుణ్యక్షేత్రములకు మాత్రం వాహనం ద్వారా ఈ మాసం నుండే ఎక్కువగా ప్రయాణాలు కొనసాగుతాయి.
అయ్యప్పస్వామి మాలధారణ మండలకాలం ముగిసే సమయం కూడా కార్తీకమాసం మద్యలోకి రావడంతో మరింతమంది పుణ్యక్షేత్రములకు యాత్ర చేయడానికి సన్నద్ధం అవుతూ ఉంటారు. అయితే మన భారతదేశంలో దర్శించవలసిన పుణ్యక్షేత్రములను తెలియజేసే యాత్ర తెలుగు పుస్తకములను గురించి తెలుసుకుందాం.
యాత్రదర్శిణి దేవాలయాలు తెలుగు బుక్స్
శ్రీదత్తాత్రేయుని పుణ్యక్షేత్రములను తెలియజేస్తూ, ఆదేవాలయం చరిత్రను క్లుప్తంగా తెలిపే తెలుగు బుక్ ఉచితంగా ఆన్ లైన్లో లభిస్తుంది. ఈ తెలుగుబుక్ లో మహురము, గిరినార్, కరెంజ, నరసోబావాడి, ఔదుంబుర్, గాణుగాపురం, కొల్హాపూర్, నాశిక్, కురుగడ్డ, పిఠాపురము, మాణిక్యనగర్ మొదలైన శ్రీదత్త దేవాలయములు ఉన్న ప్రాంతములు గురించి క్లుప్తంగా వివరించబడి ఉన్నాయి. ఈ ఫ్రీతెలుగుబుక్ చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల విశేష భారతవానిలో పుణ్యక్షేత్రములకు పెట్టింది పేరుగా చెప్పబడుతుంది. ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రములు సందర్శిస్తూ, తీర్ధయాత్ర చేయడం పరమపుణ్యప్రదంగా చెబుతారు. యాత్ర బస్సులవారి ద్వారా యాత్రల వివరాలు ఉంటాయి. అయినా కొన్ని పుస్తకముల ద్వారా దర్శించబోయే తీర్ధయాత్రస్థలం గురించి విశిష్ఠత తెలుసుకుని దేవాలయం దర్శిస్తే మంచిదని చెబుతారు. ఈ క్రింది తెలుగు చిత్రాలకు తెలుగులోఉత్తరభారతదేశయాత్రబుక్, దక్షిణ భారతదేశ యాత్ర బుక్, భారతదేశపు అన్ని పుణ్యక్షేత్రములు తెలుగుబుక్ లింకు చేయబడి ఉన్నాయి.
మీర ఈ క్రింది చిత్రాలను క్లిక్ టచ్ చేయడం ద్వారా ఆయా యాత్రలలో ఉండే పుణ్యక్షేత్రముల గురించి చదవవచ్చును. ఈ లింకుల ద్వారా ఈ తెలుగుబుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.
ఉత్తరభారత్ లో ఉండే పుణ్యక్షేత్రముల గురించి తెలియజేసే తెలుగు బుక్, భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్
దక్షిణ బారతంలో ఉండే పుణ్యక్షేత్రల దర్శిణి తెలుగు బుక్ భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్
పైచిత్రాలకు ఫ్రీగురుకుల్ వెబ్ సైటులోని పి.డి.ఎఫ్ పుస్తకములు ఆన్ లైన్ లింకులు ఎటాచ్ చేయడం జరిగింది. మీరు పై చిత్రంపై క్లిక్ చేసి ఆయా తెలుగుబుక్స్ రీడ్ చేయవచ్చును.
దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….
తెలుగులో మనకు మీనింగ్ తెలియని పదాలు ఎన్నో ఉంటాయి అంటారు. సహజంగా కొన్ని ఇంగ్లీషు పదాలను తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగువాడుక పదాలు అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాం. వీటిలో చాలా పదాలు ఇంగ్లీషువే ఉంటాయి. అంతెందుకు ఇంగ్లీషు భాషను తెలుగులో అయితే ఆంగ్లభాష అంటారు. ఆంగ్లము అనే పదము కన్నా ఇంగ్లీషు అనే పదము ఎక్కువమందికి తెలుసు అంటారు.
ఎక్కడైనా ఏదైనా నాటకం, సభ లాంటివి జరిగితే వాటి గురించి వివరించేటప్పుడు స్టేజి అనే పదం తెలుగులో మాట్లాడుతూనే వాడుతూ ఉంటాం. స్టేజికి తెలుగులో పదం రంగస్థలం అంటారు. తెలుగులోనే మాట్లాడేవారు స్టేజి పదం ఉపయోగించినంతగా రంగస్థలం అనే పదం ఉపయోగించరు అనే భావన కూడా బలంగానే ఉంటుంది. రంగస్థలం తెలుగు సినిమా కూడా వచ్చింది. అయినా కొంతమంది తెలుగు మాట్లాడేటప్పుడు స్టేజి అనే పలుకుతారు. సినిమా అంటే తెలుగు చలనచిత్రం. సినిమా అనే ఎక్కువమంది ఉపయోగిస్తారు.
తెలుగు పుస్తకాలు చదవడం వలన తెలుగుభాషపై పట్టుతో బాటు తెలుగు సాహిత్యంలో మనిషి జీవిత పరమార్ధమునకు సంబంధించిన విషయాలు బోధపడతాయి అని అంటారు. టి.వి. రాకముందు చిన్న పిల్లలకు అమ్మ చెప్పే చిట్టి చిట్టి కధలే అమ్మకు కాలక్షేపం, పిల్లలకు సరదా. టెలివిజన్ రాకముందు తాతయ్యలకు కూడా పిల్లలకు నీతి తెలుగు కధలు బోధించడమే ప్రధాన కాలక్షేపం. సాయంకాలం అయితే నాన్న చెప్పే తెలుగు కధలు వినడమే కొందరి పిల్లలకు ఇష్టం. పిల్లలకు కధలు చేప్పేకాలం టి.వి. వచ్చి మింగేసిందంటారు.
నీతి కధలు తెలుగులో
టి.వి. వచ్చాక తెలుగు పుస్తకాలు చదివే అలవాటు పోయి సీరియల్స్ చూసే వ్యసనం వచ్చేసింది. ఇక పిల్లలకు చెప్పడానికి నీతి కధలు ముందు పెద్దలకు తెలిసి ఉండాలి కదా అని కొందరు విమర్శించేవారు లేకపోలేదు. నీతి కధలు తెలుగులో చదివి ఉంటే, కొత్త నీతి కధను కల్పించే చెప్పగలిగే ఊహాశక్తి పెరుగుతుంది అంటారు. మన తెలుగు పుస్తకాలలో అంతటి శక్తి ఉందంటారు. తెలుగులో ఉండే కధలు కాలక్షేపంతో బాటు నీతిని కూడా ప్రబోధం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంటాయి.
పనిలేకుండా తిండి తింటూ ఉండేవారికి తెలుగులో ఎక్కువగా చెప్పే తెలుగుకధ తిండిబోతు దెయ్యం తెలుగు కధ. ముఖ్యంగా పెద్దలు ఎక్కువగా పిల్లలకు దెయ్యం అంటూ భయపెడుతూ చెబుతుంది అని అంటారు. పని చేయకుండా ఉంటే, మనసుకు పట్టే భావనను దెయ్యంతో పోలుస్తూ చెబుతారు. పనిలేనివారికి మనసు చేసే గోల దెయ్యాల గోలలాంటిదే అంటారు. అదే పని ఉంటే ఆ పనిద్వారా అలసిన శరీరం విశ్రాంతి కోరుతుంది. శరీరం పనిచేస్తున్నంతసేపు ఏకాగ్రతతో ఉన్న మనసులో స్వస్థతకు చేరుతుంది. తద్వారా మనిషికి ఆరోగ్యకరమైన విశ్రాంతి రాత్రివేళల్లో పొందుతుంది అంటారు. ఇలాంటి నీతిని ప్రభోదించే కధగా తిండిబోతు దెయ్యం అంటూ చాలా మంది పెద్దలు పిల్లలకు చెబుతూ ఉంటారు.
అమ్మ చెప్పే కధలు పిల్లల మనసుకు మరింత చేరువగా ఉంటాయి. మనసులో అమ్మపై ఉండే మమతతో అమ్మ చెప్పిన మాటలు మనసులో మరింత పదిలంగా ఉంటాయి. అమ్మ చెప్పిన కధలతో మనసు మమతతో మరింత మమేకం అవుతుంది. కావునా అమ్మ చెప్పే తెలుగు కధలలో ఉండే నీతి మనసులో ఎప్పటికి గూడు కట్టుకుని ఉంటాయి.
తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….
అమ్మ నాన్న పిల్లలపై మమకారంతో ఉంటారు. అమ్మ అప్యాయంగా పిల్లలకు సేవ చేస్తూ ఉంటుంది. పిల్లలకు సమాజంలో గుర్తింపు వచ్చేవరకు పోషణకు నాన్న సంపాదిస్తూ ఉంటాడు. తమకోసం తాము పడిన కష్టం ఎక్కువ కష్టం పిల్లలు విషయంలో అమ్మా నాన్న పడడానికి సిద్దపడతారు. ఇంకా పిల్లలకు కొరకు మంచి మంచి నీతి కధలను కూడా అమ్మనాన్న చెబుతూ ఉంటారు. అలా వారు చెప్పే తెలుగుకధలలోని నీతిని పిల్లలు ఎప్పటికీ మరిచిపోరు.
సమాజంలో అమ్మా నాన్నల సామాజిక పరిస్థితిని బట్టే పిల్లలకు సమాజంలో ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఇంకా అమ్మానాన్నల పెంపకం వలననే పిల్లల ప్రవర్తన ఉంటుందని అంటారు. అమ్మానాన్నలు చూపే ప్రేమతోబాటు వారు ఆచరించి మార్గదర్శకంగా నిలిచినతీరును పిల్లలు పెరుగుతున్నప్పుడు గ్రహిస్తారు. కాబట్టి పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల మాట ఒకమాటగానే ఉండాలి. ఒక సదాచారం అలవాటుగా ఉండాలి. మంచిని బోధించే తెలుగు పుస్తకాలు చదవాలి, నీతి కధలను పిల్లలకు బోధించాలి. నేటి పిల్లలు రేపటి పౌరులు కాబట్టి. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అమ్మానాన్నల పాత్ర ప్రధానమైనదిగా చెబుతారు.
చిన్న పిల్లలకు చిట్టి చిట్టి కధలంటే ఆసక్తిగా వింటారు. తెలుగులో అనేక చిట్టి చిట్టి కధలు ఉంటాయి. చిట్టి పొట్టి చిన్న కధలలో చిట్టి చిలకమా పాట చాలా ప్రసిద్ది. ఈ పాట తెలియనివారు ఉండరు. టి.వి. వచ్చినా ఈ చిట్టి చిలకమ్మా పాట మాత్రం నిలబడిందంటే, ఆ పాట మనసును ఎంతగా ఆకర్షిస్తుందో అర్ధం అవుతుంది. చిట్టి చిలకమ్మా…అమ్మ కొట్టిందా… అంటు పిల్లలు పాడే పాట పెద్దవారికి కూడా వినాలనిపిస్తుంది. ఇలా కొన్ని పాటలు అయితే యూట్యూబ్ ద్వారా నేడు పిల్లలకు బాగా చేరువగా ఉన్నాయి.
అమ్మానాన్నలే పిల్లలకు చిట్టి చిట్టి కధలు
గమనికగా మనం గమనించవలసిన విషయం ఏమంటే, పిల్లలకు యూట్యూబ్ వీడియోలో తెలుసుకున్న నీతి, ఆచరణలోకి వచ్చేటప్పటికి అమ్మానాన్నల మాటలు గుర్తుకు వచ్చినట్టుగా గుర్తుకురాదు అనే విషయం కూడా గమనించదగిన గమనికగా ఉంటుంది. ఇంకా అమ్మ నాన్నలు చెప్పే నీతిని ఆచరించలేదని అమ్మకి, నాన్నకి తెలిస్తే బాధపడతారనే భావన పిల్లలలో ఉంటుంది. కానీ యూట్యూబ్ వీడియో ద్వారా తెలుసుకున్న నీతి పాటించకపోతే, యూట్యూబ్ వీడియో బాధపడదు కదా… అందుకే యూట్యూబ్ వీడియో ద్వారా తెలియనివి తెలుసుకుని అమ్మానాన్నలే పిల్లలకు చిట్టి చిట్టి కధలుగా చెప్పాలని అంటారు.
తెలుగులో ఉండే తెలుగునీతి కధల తెలుగు పిడిఎఫ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. నీతి కధలంటే మహాభారతంలోని గాధలనే ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఇంకా చాలామంది రచించిన పుస్తకాలలో నుండి కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే ఒక రచయిత రచించన తెలుగు రచనలో అతని ఊహాత్మక కల్పన ఉండవచ్చు. కానీ మహాభారత, రామాయణం లాంటి ఇతిహాసములలోని కధలు చిట్టి పొట్టి కధలుగా చేసి రచంచిన తెలుగు బుక్స్ కూడా మనకు లభిస్తాయి. వాటి వలన యొక్క ప్రయోజనం అని అంటారు. మీరు ఫ్రీగురుకుల్ సైటు నుండి తెలుగు పిడిఎఫ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.
డౌన్లోడ్ చేయబడిన పి.డి.ఎఫ్ తెలుగుబుక్స్ మీరు స్టోర్ చేసిన పేరును బట్టి మరలా ఓపెన్ చేసుకుని నెట్ లేని సమయంలో కూడా చదువుకోవచ్చును. తెలుగులో చదువుకుని తెలుగులో నీతికధలు చెప్పనివారుంటే, వారికి తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. బాగుంటందనే ఉద్దేశ్యం కలగాలని ఆశిస్తూ…ఈ వ్యాసం ముగిస్తున్నా…
సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులోభగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి.
మనకు రామాయణం, భాగవతం, పురాణములు చదవడానికి, వినడానికి ఉన్నా, వాటి సారాన్ని జీవిత పరమార్ధమును ప్రబోధం చేసే గ్రంధంగా భగవద్గీతను చాలామంది పెద్దలు చెబుతారు. భగవద్గీత భవసాగరమును దాటిస్తుందని చెబుతారు. అటువంటి భగవద్గీతను చదివే మనసుకు ఎటువంటి కష్టం ఎందుకు కలుగుతుంది? ప్రశ్న ఉదయించిన మనసుకు ఆ ప్రశ్నపై పరి పరి ఆలోచనలు కలుగుతాయి. కానీ సమాధానం లభిస్తే పొందే శాంతి అనిర్వీచనీయం.
ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక కష్టం కలిగితే వచ్చే ఫలితం తెలిసి ఉంటే, అటువంటి కష్టం వచ్చినప్పుడు మనసు ఆ కష్టాన్ని ఎదుర్కోవడంలో పోరాడుతుంది. తెలియని కష్టం వచ్చినప్పుడు తెలిసినవారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. జీవితంలో కలిగే కష్టాలు ఎలా ఉంటాయో కొంతమంది జీవిత చరిత్రలు చదివితే అవగాహన ఉంటుందంటారు. అలా మహాత్మగాంధీ గురించిన తెలుగు పుస్తకం చదవడానికి చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
భగవద్గీత చదవడానికి వినడానికి కష్టమే కారణమా?
సంఘజీవి అయిన మనిషికి తన ఉంటున్న ప్రాంతంలో తనతోటివారితో తెలిసిన విషయాలతో జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ కాలం వలన వచ్చే పెద్ద కష్టంతో జీవితం ప్రభావం చెందుతుంది. కాలంలో ప్రతి వ్యక్తి జీవితం మార్పులకు గురి అవుతూ ఉంటుంది. సుఖంలో ఉండే ఆలోచన కన్నా కష్టంలో ఉండే ఆలోచనలు మనిషిని కుదుటపడనివ్వవు. కష్టం మనసుకు భగవద్గీత వినడానికి గాని చదవడానికి గాని కారణం కాగలదని అంటారు.
పెద్ద కష్టంలో ఓదార్పును తనకు తానే పొందవలసి వచ్చినప్పుడు మనసుకు మరింత కష్టమంటారు. ఒక్కోసారి ఎంతమంచివారు చెప్పిన మంచి మాటలు కూడా ఆ పెద్ద కష్టం బాధలో నుండి బయటపడవేయలేవు. సాదరణంగా ఏ మనిషికైనా మరణవేదన మాత్రం తనకుతానే ఎదుర్కొనవలసిన చాలా అతి పెద్ద కష్టం. కానీ కొందరికి అప్పుడప్పుడు మరణవేదనను తలపించేవిధంగా కష్టం చుట్టుముడుతూ ఉంటుంది.
కొందరి కష్టాలు కాయ(శరీరము)మును గాయపరిస్తే, కొందరికి మనసు వేదించే వేదనాపూరితమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. కష్టం కాయానికి వచ్చినా, మనిషి మదికి కలిగినా ప్రభావితం అయ్యేది మాత్రం మనిషి మనసే…. కారణం శరీరానికి కలిగిన గాయం బాధకు స్పందించేది మనసే, అలాగే ఏదైనా అప్పుల బాధ, లేక అయినవారికి శరీరానికి పెద్ద గాయం కలిగితే స్పందించేది…మనసే. మనిషికి కష్టం వచ్చింది అంటే అతని మనసు పొందే పరివేదనను బట్టి అతని చుట్టూ ఉన్నవారు ప్రభావితం అవుతారు.
ఎంతబలం ఉన్నా మనిషి అయినా కాలంలో మనసు ఎదుర్కొనే కష్టాన్ని బట్టి కదలికలు ఉంటాయి. అనుభజ్ఙులు అయినవారు తమ కుటుంబంలో ఉన్నవారికి ఏదైనా కష్టం గురించి పరిష్కారం తెలియజేయగలరు. ఎందుకంటే అటువంటి కష్టం తమ జీవితంలో ఎదుర్కొని ఉండి ఉండడం చేత, అటువంటి కష్టం మరొకరికి వస్తే పరిష్కారం తెలుపగలరు.
అనుభవం ఉన్నవారు కొత్తవారికి మార్గదర్శకులుగా
సమాజంలో చాలా విషయాలలో మనకు అనుభవం ఉన్నవారు కొత్తవారికి మార్గదర్శకులుగా నిలబడుతారు. అనే మోటారు వాహనాలు నడిపిన వ్యక్తి, కొత్తగా మోటారు వాహనం నడుపుతున్నప్పుడు, అతనికి జాగ్రత్తలు తెలియజేయగలడు. ఎలా వాహనం నడపాలో సూచనలు ఇవ్వగలడు. అలా అనేక విషయాలలో మనిషి అనేక మంది చేసిన సూచనలను తీసుకుంటూ, తను కూడా తాను చేస్తున్న పనులలో అనుభవం గడిస్తాడు. అయితే ఇదంతా సంఘజీవికి సహజంగా జరుగుతుంది.
సంఘంలో సంఘటిత జీవి అయిన మనిషి, తనకున్న బంధుమిత్ర సహకారంతో జీవిస్తాడు. అయితే అనుబంధాలతో మెసిలే మనిషి, తను తీసుకున్న నిర్ణయం తన చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా ప్రభావితం చేసేదిగా ఉన్నప్పుడు అతని మనసులో ఏర్పడేది సంశయమే అంటారు. సంశయమే సంఘర్షణ అయితే మరింతగా మనసు కుంగిపోతుంది అంటారు.
మనసులో ఏర్పడే సంఘర్షణకు ఆ మనిషి యొక్క మనసే సాక్షి. అటువంటి మనిషి అంతరంగం అతనికి మాత్రమే తెలుస్తుంది. అతని ప్రవర్తన వలన అతనితో కలిసి మెలిసి ఉండేవారికి కొంతవరకు తెలియవస్తుంది. ఏదైనా సంఘటనతో తన జీవితం ప్రభావితం చెందితే వచ్చే మానసిక సంఘర్షణకు సంఘం నుండి సానుభూతి వస్తుంది. కానీ తన అంతరంగంలో ఏర్పడే ఆలోచనలు నుండి తాను చేయబోయే నిర్ణయం మరొకరి జీవితం ప్రభావితం అయ్యేదిగా ఉన్నప్పుటి సంఘర్షణ అతను బయటికి చెబితేకానీ తెలియదు. ఒక్కోసారి అటువంటి ఆలోచనలు హాస్యాస్పదంగా కూడా మారుతూ ఉంటాయి.
భగవద్గీత పోగేట్టేది ఏమిటి?
సంఘంలో కొందరితో సహజీవనం చేసే మనిషికి ఆయా ప్రాంతంలో ఉండే వాతావరణం మరియు అతని తోటివారితో ఉండే అనుబంధం ఒక్కోసారి సుఖాలను తీసుకువస్తే, ఒక్కొసారి దు:ఖాలను తీసుకువస్తాయి. ఒక వ్యక్తికి అతని భార్య కోరికకు సరిపడా ధనం తన దగ్గర ఉన్నప్పుడే అతనికి అది సుఖం. కాకపోతే అతనికి అతని భార్య కోరికే దు:ఖదాయకం అవ్వవచ్చును. అలాగే అతని చుట్టూ ఉన్న బంధాలు నుండి వచ్చే విషయాలు అతని ఆర్ధిక స్థితికి, అతని ప్రవర్తనకు అనుకూలంగా ఉంటే అది సుఖం. కాకపోతే అయా బంధాల నుండి వచ్చే విషయాలు దు:ఖదాయకం.
ఏ మనిషికైనా తన చుట్టూ ఉన్నవారి జీవితాలను ప్రభావితం చేసే సంఘటనలు ఎదురైనప్పుడు ధర్మసందేహం ఏర్పడుతుంది. అప్పటికి కలగబోయే ఫలితాలపై మనసులో సంఘర్షణ ఏర్పడుతుంది. గాంధీగారు దేశంలో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అయనకు ఏర్పడే సంఘర్షణలకు భగవద్గీతే సమాధనపరిచింది అని పెద్దలు చెబుతూ ఉంటారు.
భగవద్గీత ఎందుకు చదవాలి అంటే దు:ఖం పోగొట్టుకోవడానికి అంటారు. ఎందుకు అంటే కురుక్షేత్రంలో తన బంధు వర్గములోని బంధువులను చూసి దు:ఖం పొందిన అర్జునుడి దు:ఖం భగవంతుని బోధతో పోయింది. కాబట్టి కాలంలో కలిగిన కష్టం వలన ఏర్పడిన దు:ఖంతో కర్తవ్య భంగం ఏర్పడినప్పుడు భగవద్గీత మనసుకు మందు అంటారు. హృదయంలో ఏర్పడే దు:ఖాన్ని అడ్డుకోవడానికి భగవద్గీతలోని ధర్మాలు తెలిసి ఉండడం ప్రధానమని చెబుతారు.
భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి తెలుగు బుక్స్
ఇంకా పెద్ద పెద్ద కష్టాలు కాలంలో కలిగినప్పుడు పెద్దలు మాటలు ఉపశమనం కలిగించలేకపోయినా భగవద్గీత వలన కర్మయోగం కలిగితే ఉపశమనం కూడా కలుగుతుంది అంటారు. మరణవేదన ప్రతి మనిషికి తప్పనిసరి అటువంటి మరణవేదనలో కూడా మనసు తట్టుకుని నిలబడాలంటే, అంటే మోక్షానికి అర్హత సాధించాలంటే భగవద్గీతాసారం జీర్ణం చేసుకున్న మనసు వలననే సాధ్యం అంటారు.
అటువంటి భగవద్గీతలో ఏముంది అంటే అందులో మొదటగా అర్జునుడికి పుట్టే దు:ఖం కనిపిస్తుంది. ఆ దు:ఖంతో అర్జునుడికి కలిగిన విషాదయోగం మాటలు మారితే ఎలా ఉంటుందో కనబడుతుంది. బంధాలపై అమితమైన ప్రేమతో ఉండే వీరుడి మనసులోని పరివేదన కనబడుతుంది అని అంటారు. భగవద్గీత గురించి శ్రీచాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
అర్జునుడి విషాదానికి చెదిరిన మనసుకు కర్తవ్యాన్ని బోధించే గురువుగా కృష్ణుడు మనకు భగవద్గీతో కనిపిస్తాడు. గురువు అయిన కృష్ణభగవానుడు శిష్యుడు అర్జుని చేసిన బోధ బాధలో ఉండే మనసుకు మందు అంటారు. దహింపడే దేహికి ఏర్పడే అజ్ఙానం తొలగించడానికి భగవానుడు పలికి వాక్కులు భగవద్గీతలో కనిపిస్తాయి.
భగవద్గీత సారం అర్ధం కావడం
ప్రవచనకారుల మాటలలో భగవద్గీత సారం అర్ధం కావడం వలననే జీవి తరించగలడనే మనకు వినిపిస్తాయి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు ప్రవచించిన ప్రవచనాలు ఆడియో రూపంలో ఉచితంగా తెలుగులో వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి వీడియో తెలుగుప్రవచనాలు వినడానికి ఇక్కడ / టచ్ చేయండి. తెలుగులో ప్రవచనాలు వినడం వలన మనకు బాగా తెలిసి ఉన్న తెలుగు చదవడం చేత మన మనసుకు మాటలు బాగా అర్ధం అవుతాయి.
ప్రధానంగా భగవద్గీత వలన అజ్ఙానం తొలిగి జ్ఙానం వస్తుందనేది చెప్పబడుతుంది. జ్ఙానం వలన కలిగే ధైర్యం సంసారం నుండి బయటపడవచ్చు అని అంటారు. తాను ఎప్పుడూ వెళ్లని ఇంటికి ఒక వ్యక్తి రాత్రివేళో వెళితే, ఆ ఇంటిలోకి వెళ్లగానే కరెంటుపోయి చీకట్లు కమ్ముకుంటే ఆ వ్యక్తికి భయం కలిగి అడుగు అక్కడే ఉంటుంది. ఒక వేళ అడుగు వేసినా భయంతోనే వేస్తాడు. అదే ఇంట్లో అప్పటికే నివసిస్తున్నవారు మాత్రం ఆ చీకట్లో గబా గబా టార్చిలైటు కోసం వెతుకుతారు. అంటే వారికి ఆ ఇంట్లో వెలుగునింపే వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలిసి ఉండడం చేత, వారికి ఆ చిమ్మచీకట్లో అడుగులు సాదారణంగా వేస్తారు. కానీ కొత్తగా ఆ ఇంట్లోకి అప్పుడే వచ్చిన వ్యక్తి మాత్రం ఆ చీకటి భయహేతువు. భగవద్గీత వలన ఒక దేహి జీవన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది, అంటారు.
భగవద్గీత భవసాగరం దాటించే గ్రంధంగా చెబుతారు.
తెలుగువ్యాకరణం తెలిసినవారికి తెలుగుపద్యాలు చదవమంటే గణగణమంటూ చదవుతారు. అలా కాకుండా తెలుగు సరిగ్గా అర్ధం కానివారికి తెలుగుపద్యాలు చదవమంటే మాత్రం అక్షరాలు కూడబలుక్కుంటూ చదువుతారు. అలాగే భగవద్గీత సారం ఒంటబడితే, ఆజీవి జీవన పరమార్ధం చాలా సులభం అంటారు. తెలుగుతెలియనివారికి తెలుగు సాహిత్యం మాధుర్యం తెలియబడనట్టు భగవద్గీత లేక సత్సమాన గ్రంధం చదవకపోతే, జీవిత పరమార్ధం తెలియబడదు అంటారు.
మనిషికి తెలియనవి మనిషిని మరింత భయపెడతాయి అంటారు. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన అవసరం ఉండదో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఏదైనా ప్రయత్నం ఉంటే, ఆ ప్రయత్నంలో ఏర్పడే సందేహం దేహికి సమస్యాత్మకం అంటారు. దేహి సందేహాలకు సమాధానం భగవద్గీత అని చెబుతారు. అటువంటి భగవద్గీత గురించిన తెలుగురచనలు చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. అనేకమంది తెలుగులో రచించిన భగవద్గీత గురించిన రచనలు మీరు ఉచితంగా పి.డి.ఎఫ్ బుక్స్ గా చదవవచ్చును.
భగవద్గీతతెలుగులో వినడానికి చదవడానికి తెలుగు ప్రవచనాలు, తెలుగు బుక్స్, తెలుగు వీడియోలు ఉచితంగానే లభిస్తాయి. అయితే భగవద్గీత చదవడానికి, వినడానికి కారణం కొంతమందికి కాలం వలన వచ్చే కష్టం కారణం కావచ్చును. భగవంతుని మీద భక్తి కావచ్చును. మోక్షం కారణం కావచ్చును. భగవద్గీత చదవడానికి అయినా వినడానికి అయినా కారణం ఏదైనా, అది జీవితాన్ని ఉద్దరించే గ్రంధంగా చెబుతారు.
తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్ లైన్లో చదవడానికి తెలుగుఇపేపర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్ ద్వారా మీ కంప్యూటర్ / ల్యాప్ టాప్ / టాబ్లెట్ / స్మార్ట్ ఫోన్లలో చదువుకోవచ్చును. న్యూస్ అందించే డైలీ తెలుగు పేపర్స్ వారి వారి వెబ్ సైటుల ద్వారా తెలుగుఇపేపర్స్ గతకాలంగా అందుబాటులో ఉన్నాయి.
వార్తలను అందించడంలో ఉండే టాప్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇపేపర్స్ రూపంలో ఆన్ లైన్లో న్యూస్ పేపరును డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. మనం చదివే తెలుగువార్తాపత్రిక ఎలా ఉంటుందో అలానే ఆ పత్రిక ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది. మెయిడ్ ఎడిషన్ తోబాటు ప్రాంతీయ ఎడిషన్స్ మరియు అనుభంధ ఎడిషన్స్ ఆన్ లైన్లో ఉచితంగా చదవవచ్చును.
రోజువారి వార్తలను తెలుసుకునేవారికి పేపర్ చదివే అలవాటు ఉంటుంది. అయితే కొందరు పేపరు చదివేవారికి ఆన్ లైన్ తెలుగు న్యూస్ పోస్టుల కంటే, తెలుగున్యూస్ పేపరుపై ఆసక్తి ఉంటుందంటారు. అలాంటి వారికి ఆన్ లైన్లో న్యూస్ పేపరు చదవాలంటే ఆ న్యూస్ పేపరుకు సంబంధించిన ఇపేపర్ వెబ్ సైటును ఓపెన్ చేసి తెలుగుఇపేపర్ చదవవచ్చును.
నయా న్యూస్ కంటే న్యూస్ పేపరు లుక్ తో డైలీ పేపరును మాత్రమే ఆయా రోజులలో ఆన్ లైన్ ద్వారా చదవడానికి కొన్ని పాపులర్ తెలుగుఇపేపర్ లింకులు క్రిందగా గమనించండి.
Online epaper of Telugu News
ఈనాడు తెలుగుదినపత్రిక అందరికి తెలిసిన తెలుగు వార్తాపత్రిక. పాపులర్ న్యూస్ పేపర్లలో ఈనాడు మ్వాగజైన్ తెలుగు డైలీ న్యూస్ పేపర్ ఒక్కటి. ఆనాటి రోజుల నుండి ఈరోజులలోనూ తెలుగువారింట్లో వేకువవేళలో వార్తలతో దర్శినమిచ్చే పేపర్లలో ఈనాడు ఒకటి. ఈనాడు తెలుగుఇపేపర్ చదవడానికిఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్.
ఆంధ్రజ్యోతి ప్రధాన దిన పత్రికలలో ఒక్కటిగా తెలుగువారికి తెలుగులో వార్తలను అందించే తెలుగు డైలీ న్యూస్ పేపర్. ఆంధ్రులకు తెలుగు వార్తలను చేరవేయడంలో ఉండే ప్రముఖ పత్రికలలో ఆంధ్రజ్యోతి తెలుగు డైలీ న్యూస్ పేపర్. ఈ ఆంధ్రజ్యోతి తెలుగుఇపేపర్ ను ఆన్ లైన్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
సాక్షి ప్రధాన తెలుగు డైలీ న్యూస్ పేపర్లలో ఒక్కటి. తెలుగు రాష్రాలలో తెలుగువార్తలను అందించే ప్రధాన తెలుగుదిన పత్రికలలో సాక్షి తెలుగు దినపత్రిక ప్రముఖ డైలీ పేపర్. సాక్షి తెలుగుఇపేపర్ ఆన్ లైన్లో చదవడానికిఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
నమస్తే తెలంగాణ తెలుగుదినపత్రిక అయితే తెలంగాణ ప్రాంత ప్రాధన్యతతో ఏర్పడిన పత్రికా సంస్థ. తెలంగాణ ప్రాంతాన్ని ప్రతిబింభించే విధంగానే పేరుకూడా నమస్తే తెలంగాణ అని ఉంది. నమస్తే తెలంగాణ తెలుగుఇపేపర్ ఆన్ లైన్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
ఆంధ్రప్రభ డైలీ తెలుగు న్యూస్ పేపర్ తెలుగులో వార్తలను చేరవేసే పత్రికలలో ఆంధ్రప్రభ ఒక్కటి. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ కూడా తెలుగుఇపేపర్ ను అందిస్తుంది. ఆంధ్రప్రభ తెలుగుఇపేపర్ చదవడానికిఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
ఆంధ్రభూమి తెలుగుదినపత్రిక తెలుగులో వార్తలను అందించే ఈ డైలీ న్యూస్ పేపర్ తెలుగుఇపేపరు కూడా ఆన్ లైన్ యూజర్లుకోసం అందిస్తుంది. ఆంధ్రభూమి తెలుగుఇపేపర్ చదవడానికిఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు.
సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో పురాణ ప్రవచనం జరుగుతున్నప్పుడు భక్తిశ్రద్ధలతో వినాలని చెబుతారు. ఇంకా అక్షరజ్ఙానం ఉన్నవారు అయితే పురాణ పఠనం చేస్తూ ఉంటారు. భక్తిశ్రద్ధలతో పురాణపఠనం చేయడం వలన లక్ష్యసిద్ది ఉంటుంది అని ఫలశ్రుతులు కూడా చెబుతారు.
చిన్నతనంలో పిల్లలు అమ్మ పెట్టే అన్నం తినాలంటే, ఆపిల్లాడి మనసు ఆకర్శించే ఏదో ఒక పనిచేయాల్సి వస్తుంది. కొందరు పిల్లలు కథ చెబితే, అన్నం తింటే, కొందరు పిల్లలు పాట పాడితే అన్నం తింటారు. కొందరు పిల్లలు ఏదైనా ఆట వస్తువు ఇస్తే ఆడుకుంటూ అన్నంతింటారు. అంటే ఏమి తెలియని వయసులో కూడా కొంతమంది అన్నం తినడానికి వారి మనసు ఏదో ఒక అధిక ప్రయోజనం కూడా కోరుతుంది అంటారు.
మనసుకు సహజంగా అలవాటు అయిన వ్యాపార లక్షణం చేత, మనసు ప్రయోజనం ఉండే విషయాలతో ఎక్కువగా మమేకం అయ్యిం ఉంటుంది అంటారు. అందువలన మనసుకు మేలు చేసే విషయాలే అయినా వాటిని పట్టుకోవడంలో ఆసక్తి చూపించదు అంటారు. ఎందుకంటే మనసుకు మేలు చేసే విషయాలు దీర్ఘకాలిక విధానాలను సూచిస్తూ ఉంటాయి. అటువంటి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ ఉంటేనే సాద్యమంటారు. ఎందుకంటే పురాణములు చదవడంలో లేక వినడంలో ముందుగా పుణ్యప్రయోజనం చెబుతారు.
భక్తిశ్రద్దలతో వినడం చేయడం లేక చదవడం వలన పురాణములలోను భగవతత్వమును గ్రహించే అవకాశం ఉంటుంది. భగవానుడినే చేరడమే జీవన పరమావధి అని గ్రహించినవారికి ఈవిధంగా ఉంటే, ఏదైనా కోరికతో చేసేవారికి, ప్రకృతిని శాసించే భగవతత్వం ఏదో ఒకరూపంలో సహాయకారిగా ఉంటుంది అంటారు.
పురాణం భగవంతుడి గుణాలు
ఏ పురాణం చూసినా అందులో వివిధ దేవతా స్వరూపములు, ఆయా స్వరూప గుణాలను తెలుపుతూ ఉంటారు. ఆయా దేవతా మూర్తులను ఆరాధించడంలో విధి విధానాలను, భక్తి శ్రద్ధలను తెలియజేస్తూ ఉంటారు. దేవతలను ఆరాధించే విధానమునే పూజగా చెబుతూ ఉంటారు. ఒక్కో పురాణములోనూ ఒక్కో దేవతా మూర్తిని ఆరాధించే ప్రక్రియను, ఆ దేవత గుణగణములను తెలియజేస్తారు.
సమస్యలతో సతమతమయ్యే మనిషికి పురాణం అనగానే కాలక్షేపంగా భావిస్తారు. కానీ సంసారంలో ఉన్నవారికే ఎక్కువగా పురాణ విషయాలు తెలిసి ఉండాలి అని పెద్దలు అంటారు. కారణం పురాణంలోని సారంశం బోధపడి ఉంటే, సంసారం సమస్యలతో సాగితే, సమస్యను పరిష్కరించుకునే శక్తి మనసుకు ఉంటుంది అంటారు.
రామాయణం మనిషి ధర్మములను తెలియజేస్తూ ఉంటే, మహాభారతం సామాజికంగా కూడా ధర్మ సూక్ష్మములను తెలియజేస్తూ ఉంటుంది అంటారు. భాగవతం భక్తితో ఉండడం చేత అలౌకికానందం పొందడంతో మనసుకు శాంతిని ఏర్పరచుకోవచ్చును అని చెబుతూ ఉంటారు. భక్తిపారవశ్యం చేత శాంతి పొందిన మనసు సమస్యను శాంతియుత మార్గంలో చూడగలుగుతుంది. తద్వారా పరిష్కారం కష్టమైన ఆచరణలోకి మనసు వెళుతుంది అంటారు.
మనిషకి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ ఉండడం చేత పురాణములలోని విషయాలు అవగతం అవుతాయని అంటారు. పురాణములు విని ఉండడం వలన ఆయా గాధలలోని విశేషములు మనసుకు హత్తుకుని ఉంటాయని అంటారు. తెలుగులో రచించబడిన పురాణములు చదివే ముందు పెద్దల మాటలలో వాటిని విని చదవడం మరింత ప్రయోజనంగా చెబుతారు.
తెలుగులోనే ఉన్నా తెలుగుసాహిత్యంలో అన్ని భావాలు తెలియబడి ఉండవు అంటారు. అందువలన తెలుగులోనే ఉండే తెలుగుబుక్స్ రీడ్ చేయలంటే, ముందుగా పండితుల నోట ఆయా బుక్స్ గురించిన ప్రవచనాలు విని ఉండడం మేలు అంటారు. తెలుగు శ్రేష్ఠమైన భావాలతో ఉత్తమమైన విధానాలను తెలియజేస్తూ మనిషిలో మంచిని పెంచుతు మనిషి మనసులో శాంతిని పెంచేవిధంగా ఉంటుందని అంటారు. తెలుగువెలుగులు మనిషి మనసుకు వెలుగులమేడ అంటారు.
తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయదర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత.
ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలోకార్తీకదీపం వెలింగించడం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. కార్తీకదీపం ఈ మాసమంతా ప్రతిరోజూ వెలించడం విశిష్ట పుణ్యముగా చెబుతారు.
ఈ కార్తీకమాసములో భక్తులు అంతా దేవాలయ సందర్శనం పరమ భక్తితో చేస్తూ ఉంటారు. శివకేశవుల ఆలయాలకు భక్తులు వేల సంఖ్యలో వెళుతూ ఉంటారు. లోకంలో ఉన్న అన్ని వైష్ణవాలయాలు, శైవాలయాలకు వెళ్లి శివకేశవుల దర్శనం చేసుకోవడం పరమ పుణ్యంగా భావిస్తారు. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ భక్తుల కోలాహాలం కార్తీకమాసములో ఎక్కువగా ఉంటుంది.
కొందరు కాలినడకన పాదయాత్ర చేసి దేవాలయం సందర్శనం చేస్తారు. ఈ కార్తీకమాసములోనే దైవ దర్శనానికి బహుదూరం నుండి భక్తితో నడస్తూ వచ్చి, దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. భగవంతుడి నామాలు పలుకుతూ, నడుస్తూ దేవాలయం దర్శనం చేసుకోవడం చాలా మంది భక్తులు కార్తీకమాసంలోనే ఎక్కువగా చేస్తారు.
హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసము
ఇంకా కార్తీకమాసములో వచ్చే ప్రతి సోమవారం విశేష రోజుగా భక్తులు భావిస్తారు. ప్రతి సోమవారం శివ దర్శనం చేయడం, శివుని ముందు దీపారాధన చేయడం పరమపుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. రోజులో రెండు సంధ్యా సమయములలో దీపారాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు.
మాసమంతా ప్రతిరోజూ భగవంతునికి సంబంధించిన కర్మలనే ఆచరిస్తూ ఉండడం విశేషం. అవకాశం ఉన్నవారు మాసమంతా ప్రతిరోజూ నియమబద్దంగా నదీస్నానం చేస్తూ, శివకేశవుల ఆలయాలలో హరి హరులను దర్శిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం నదీస్నానం చేసి, శివాలయం దర్శించుకునేవారు కొందరుంటారు. హరి హరులకు కూడా ఇష్టమైన మాసంగా కార్తీకమాసమును చెబుతారు.
నెలరోజుల పాటు భక్తుల మనసులో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం గా కాలం కదులుతుంది. ప్రతి కదలికలోనూ భగవంతుని దర్శనం చేయడానికే తాపత్రయపడుతూ ఉంటారు. అలా కార్తీకమాసము అంతా కార్తీకపురాణం శ్రవణం చేయడం చాలా ముఖ్యమైన కర్మ. పండితుల మాటలలో కార్తీకమాసము యొక్క వైభవం ప్రవచనాలుగా వింటూ ఉంటారు.
తెలుగులో కార్తీక పురాణం బుక్
కార్తీకపురాణంతెలుగులో తెలుగుపుస్తకం రూపంలో కూడా మనకు లభిస్తుంది. పుస్తకం చదవడం అంటే ఆ పుస్తకములో ఉండే అంశంతో తాదాత్మకం చెందడం అంటారు. అలా భావించేవారు ఈ కార్తీకమాసములోకార్తీకపురాణ తెలుగుబుక్స్ చదువుతారు. కార్తీకమాసము పరమ పవిత్ర మాసంగా భావించే భక్తులు తప్పనిసరిగా కార్తీకపురాణ పఠనం కూడా చేస్తూ ఉంటారు.
అటువంటి పరమ పవిత్రమైన కార్తీకమాసములో కార్తీకపురాణం తెలుగు బుక్స్ మీ కంప్యూటర్ లేకా ఇతర సాంకేతిక పరికరాలలో చదువుకోవచ్చు. ఆన్ లైన్లో కార్తీకపురాణము పి.డి.ఎఫ్ బుక్ రూపంలో ఫ్రీగురుకుల్ వెబ్ సైట్లో లభిస్తుంది. ఈ కార్తీకపురాణం మీరు ఆన్ లైన్లో ఏదైనా బ్రౌజరు సాయంతో కేవలం చదువుకోవడానికి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
పరమ పుణ్యకాలమైన కార్తీకమాసములోస్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం తెలుగు పి.డి.ఎఫ్. బుక్ మీ మొబైల్ / కంప్యూటర్ / లాప్ టాప్ / టాబ్లెట్ పరికరాలలో ఏదైనా బ్రౌజరు ద్వారా చదవడానికి ఇక్కడ ఈ అక్షరాలను క్లిక్ చేయండి. ఇంకా సంపూర్ణ కార్తీకమహాపురాణం పి.డి.ఎఫ్ పార్మట్లో తెలుగులో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి. కార్తీక పురాణం గురించి గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు
తెలుగులో భాషలో ఉండే తెలుగుబుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగుబుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే తెలుగు విషయాలు మరింతగా మనసును పట్టుకుంటాయి అంటారు. ఎందుకంటే మన మాతృభాష తెలుగు కాబట్టి అటువంటి తెలుగుభాషలోతెలుగుబుక్స్ రీడ్ చేయడంతో ఆ బుక్స్ లోని విషయాలు త్వరగా అర్ధం అవుతాయి.
మనకు మాతృభాషగా ఉన్న భాషలో మనం మాట్లాడడం ఒక అలవాటుగా వచ్చేసి ఉంటుంది. కాబట్టి మాతృభాష ఏభాష అయితే ఆ భాషలో ఉండే బుక్స్రీడ్ చేయడం సులభం అవుతుంది. అలా మన మాతృభాషతెలుగు కాబట్టి, తెలుగుభాషలో వ్రాయబడి ఉన్న తెలుగుబుక్స్ రీడింగ్ వలన ఎక్కువ ఉపయోగం ఉంటుంది అంటారు. తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన తెలుగులోని వెలుగులు తెలుగువారి మైండులో వెలుగుతాయి.
తెలుగు భాషలో మాటలకు అర్ధం అయితే
తెలుగు వాడుకభాషలో మనం మాట్లాడే మాటలకు భావం మనం ఎరిగి మాట్లాడుతాం. అదేవిధంగా ఎదుటివ్యక్తి కూడా తెలుగుభాషమాతృభాషగా ఉండడం ఉంటుంది. తెలుగులో మాటలకు చాలావరకు వాటి భావాలు మనకు తెలిసే ఉంటాయి. అలా వాడుకు భాషలో ఉండే పదాలు బుక్ రీడింగ్ సమయంలోనూ వస్తే, వాటిని అర్ధం చేసుకోవడం సులభం. అదే ఇతర భాషలలో బుక్‌రీడింగ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఆయా భాషలలోని అన్ని పదాలకు అర్ధం తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఒక బుక్ రీడింగులోని రైటర్ అంతరంగం ఏమిటో తెలుసుకోగలం.
ఎప్పుడూ మనం మాట్లాడే తెలుగుభాషలో మాటలలో కొన్ని తెలుగుమాటలకు సరైన సాంకేతిక అర్ధం తెలియదు అంటారు. అలా తెలుగుపదాలకు అర్ధం తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం అంటారు. అలాంటి తెలుగువాడుక పదాలకు అర్ధం ఏదైనా తెలుగుబక్ రీడ్ చేస్తున్నప్పుడు బోధపడితే, అప్పుడు ‘అయ్యో ఈ పదం మనం ఎప్పుడూ మాట్లాడేస్తూ…ఉంటా..కానీ ఈ పదానికి అర్ధం ఇదా…’ అని ఆశ్చర్యపడుతూ ఉంటాం. అలాంటి సందర్భం వచ్చిందంటే, తెలుగుభాషమాతృభాష అయినా ఆతెలుగులో అంతగా పట్టులేదని చెబుతారు.
మన మాతృభాష అయిన తెలుగుభాష ఉన్నతిని తెలియజేసే తెలుగువారి తెలుగు రచనలు ఎన్నో. అటువంటి తెలుగుబుక్స్ వివిధ ధరలలో బుక్ షాపులలో లభిస్తాయి. కొన్ని తెలుగుబుక్స్ ఉచితంగా ఆన్ లైన్లో లభిస్తే, ఆ తెలుగుబుక్స్ ను రీడ్ చేయకుండా ఎలా ఉండగలం. తెలుగుభాషలో వాడుక తెలుగుభాష కాకుండా గ్రాంధిక తెలుగుభాష కూడా తెలుగుపెద్దలు చెబుతూ ఉంటారు. అంటే కొన్ని తెలుగుబుక్స్ చూడండి…వాటిలోని తెలుగుమాటలు మనం ఎప్పుడూ పలికినట్టుగానే ఉండదు. ఇది తెలుగుభాష లేక సంస్కృత భాష అన్న అనుమానం కూడా రాకపోదు. అలా తెలుగులో గ్రాంధికభాష కూడా ఉంటుంది, అంటారు.
తెలుగు బుక్ రీడింగ్ గ్రాంధిక భాష
ఈ తెలుగు గ్రాంధిక భాషలో వ్యాకరణంతో కూడిన వ్యాక్యాలు ఉంటాయి. వాటిలో ఎంతో ఆంతర్యం వచ్చే విధంగా ఉంటాయి. ఒక వ్యాక్యం చదివితే అందులోని భావం తెలుసుకోవడానికి మరొక తెలుగుపండితుడి దగ్గరకు వెళ్లాల్సిందే, అంటారు. అయితే ఇప్పుడు కొంతమంది స్కూల్ పిల్లలకు పెద్దలు పలికే వాడుక తెలుగుభాషలోని పదాలకు అర్ధం కూడా తెలియకుండా ఉంది అంటున్నారు. అలాంటి కొంతమంది వాదనలో నిజం లేకపోలేదు. తెలుగురీడ్స్ తెలుగు రచనలలోని తెలుగు విషయాలు తెలుగువారమైన మనమంతా తెలుసుకుందాం.
తెలుగు గ్రాంధిక భాష కష్టం అంటారు, లెక్కల సూత్రాలు కష్టమంటారు. అయితే లెక్కల సూత్రాల సిద్ధాంతం అర్ధం అయితే ఆ లెక్కల చాప్టర్ మొత్తం తేలిక. అలాగే తెలుగు గ్రాంధికభాషలోని వ్యాకరణం అర్ధం అయితే, తెలుగు బుక్ రీడింగ్ సులభం. తెలుగుభాషలోని వ్యాక్యాలలో ఉండే అద్భుత భావనలు మనకు అర్ధం అయితే, తెలుగుబుక్ రీడింగ్ అలవాటు అవుతుంది అంటారు. ఏ సబ్జెక్టులో అయిన మైండుకు అర్దం అయితే, ఆ సబ్జెక్టులో మైండు మరింత పదును పెంచుకుంటుంది అంటారు. తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో చదవడం వలన మనసుకు తెలుగు విజ్ఙానం కూడా అలవరుతుంది అంటారు.
తెలుగు మన మాతృభాష అటువంటి తెలుగుభాషలో ఉండే తెలుగు రచనలలో మంచి తెలుగుబుక్స్ ఎంపిక చేసుకుని చదవడం తెలుగు సంస్కృతికి దూరం కాకుండా ఉండడమే అంటారు. తెలుగు సంస్కృతి ఏనాటి నుండో వస్తుంటే, కొన్నింటిని వదిలి వచ్చిన పెద్దల వలన కొన్ని తెలుగు సంస్కృతిలోని విషయాలు మనకు దూరం అయ్యాయనే వారు లేకపోలేదు. అటువంటప్పుడు మనకున్న ప్రస్తుత తెలుగు సంసృతిపై మనకు సందేహం వస్తే, ఆ సందేహం తీరాలంటే, తెలుగు సంస్కృతిని తెలిపే తెలుగు రచనలు చదవాల్సిందే.
తెలుగు భాషలో ఉచిత తెలుగు బుక్స్
తెలుగుబుక్స్ లో ఎన్నో అంశాలలో ఎన్నెన్నో తెలుగుబుక్స్ మనకు బుక్ షాపులలో, ఆన్ లైన్ ఈకామర్స్ వెబ్ సైటులలోనూ లభిస్తాయి. అయితే కొన్ని సంస్థల ద్వారా తెలుగు భాషలో ప్రచురితమైన తెలుగుబుక్స్ ను కూడా ఆన్ లైన్లో ఫ్రీగా రీడ్ చేసేవిధంగా తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ లభిస్తున్నాయి. తెలుగుభాషలో ఉచిత తెలుగుబుక్స్ పి.డి.ఎఫ్ పార్మట్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో ని పలు పుస్తకాలను చదువుతూ తెలుగుభాషలో పట్టు తెలుగువారి జీవితానికి వైజ్ఙానిక వెలుగు రేఖలు.
గమనిక: ‘బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్’ శీర్షిక ఈ పోస్టు ఉంది. అయితే పేమెంట్, మెసేజింగ్, కాలింగ్ లాంటి స్పెషల్ మొబైల్ ఫీచర్లు ఉన్న మొబైల్ యాప్స్ కు ఈ పోస్టును అన్వయించకండి. ఇంకొక విషయం కొన్ని మొబైల్ యాప్స్ వ్యూ, వెబ్ వ్యూ డిఫరెంటుగా ఉంటుంది. అటువంటి మీరు ఎప్పుడూ అనసరిస్తున్న వాటినే అనుసరించడం ఉత్తమం.
వెబ్ బ్రౌజర్ అనేది వరల్డ్ వైడ్ వెబ్‌లో సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, తిరిగి పొందడానికి మరియు ప్రదర్శించడానికి వినియోగదారులను అనుమతించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఇది వెబ్ పేజీల కోసం వెబ్ సర్వర్‌లకు అభ్యర్థనలను పంపడం ద్వారా మరియు వినియోగదారు పరికరంలో పేజీలను ప్రదర్శించడం ద్వారా దీన్ని చేస్తుంది.
మీరు బ్రౌజర్ యొక్క చిరునామా బార్‌లో URL (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)ని టైప్ చేసి ఎంటర్ నొక్కినప్పుడు, బ్రౌజర్ ఆ URL వద్ద ఉన్న పేజీ కోసం వెబ్‌సైట్‌ను హోస్ట్ చేసే సర్వర్‌కు అభ్యర్థనను పంపుతుంది. ఆపై పేజీకి సంబంధించిన HTML (హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్) కోడ్‌ను బ్రౌజర్‌కు పంపడం ద్వారా సర్వర్ ప్రతిస్పందిస్తుంది. బ్రౌజర్ ఆ తర్వాత పేజీని రెండర్ చేయడానికి ఈ కోడ్‌ని ఉపయోగిస్తుంది, ఇందులో పేజీలోని టెక్స్ట్, ఇమేజ్‌లు మరియు ఇతర మీడియాను ప్రదర్శిస్తుంది.
అదనంగా, బ్రౌజర్ CSS (క్యాస్కేడింగ్ స్టైల్ షీట్‌లు) కోడ్‌ను కూడా చదువుతుంది మరియు వివరిస్తుంది, ఇది వెబ్‌పేజీ యొక్క లేఅవుట్ మరియు దృశ్య రూపకల్పనను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. మరియు వెబ్ పేజీలతో డైనమిక్ ఇంటరాక్షన్‌ని అనుమతించే జావాస్క్రిప్ట్‌ని అమలు చేయండి.
బ్రౌజర్‌లు బుక్‌మార్క్‌లు మరియు బ్రౌజింగ్ చరిత్రను సేవ్ చేయగల సామర్థ్యం మరియు అదనపు కార్యాచరణను జోడించగల పొడిగింపులు మరియు ప్లగిన్‌లకు మద్దతు వంటి అనేక ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. Google Chrome, Firefox, Safari, Microsoft Edge మరియు Opera వంటి అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్‌లలో కొన్ని.
యాప్‌కు బదులుగా వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
క్రాస్-ప్లాట్‌ఫారమ్ అనుకూలత: వెబ్‌సైట్‌లు డెస్క్‌టాప్ మరియు ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లతో సహా అనేక రకాల పరికరాలలో బ్రౌజర్‌ను కలిగి ఉన్నంత వరకు యాక్సెస్ చేయవచ్చు. దీనికి విరుద్ధంగా, యాప్‌లు సాధారణంగా నిర్దిష్ట ఆపరేటింగ్ సిస్టమ్‌కు ప్రత్యేకంగా ఉంటాయి మరియు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేయబడి, పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడాలి.
ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు: బ్రౌజర్‌తో, యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇది పరికరంలో సమయాన్ని మరియు నిల్వ స్థలాన్ని ఆదా చేస్తుంది.
సులభమైన అప్‌డేట్‌లు: వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయడం అనేది సైట్ యొక్క కొత్త వెర్షన్‌ను సర్వర్‌లో ప్రచురించినంత సులభం, అయితే యాప్‌ను అప్‌డేట్ చేయడానికి తరచుగా వినియోగదారులు అప్‌డేట్‌ను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ సౌలభ్యం: వెబ్‌సైట్‌లను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ పరికరం నుండి అయినా యాక్సెస్ చేయవచ్చు, అయితే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయబడిన పరికరాల్లో మాత్రమే ఉపయోగించబడతాయి.
మరింత ఖర్చుతో కూడుకున్నది: వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడం అనేది యాప్‌ను అభివృద్ధి చేయడం కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఎందుకంటే ఇది అనేక రకాల పరికరాలలో యాక్సెస్ చేయబడుతుంది, అయితే యాప్‌ను అభివృద్ధి చేయడానికి సాధారణంగా ప్రతి ప్లాట్‌ఫారమ్‌కు ప్రత్యేక సంస్కరణలను సృష్టించడం అవసరం.
మెరుగైన అన్వేషణ సామర్థ్యం: వెబ్‌సైట్‌లను శోధన ఇంజిన్‌ల ద్వారా మరింత సులభంగా కనుగొనవచ్చు, ఇది వినియోగదారులకు వాటిని కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది.
ఆఫ్‌లైన్‌లో పని చేయగల సామర్థ్యం, కెమెరా మరియు GPS వంటి పరికర లక్షణాలకు ప్రాప్యత మరియు పుష్ నోటిఫికేషన్‌లను పంపగల సామర్థ్యం వంటి వెబ్‌సైట్‌ల కంటే యాప్‌లు కొన్ని ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చెప్పబడింది. రెండింటికీ వాటి స్వంత వినియోగ సందర్భాలు ఉన్నాయి మరియు రెండింటి కలయికను ఉపయోగించడం తరచుగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
మీ ఫోనులో ఇంటర్నల్ మెమోరీ (ఫోనులో మిగిలి ఉన్న స్పేస్ – ఫోను మెమోరి) తక్కువగా ఉంటుందా? ఇంకా మీ ఫోనులో డౌన్ లోడ్ చేయబడి ఉన్న మొబైల్ యాప్స్ కు కానీ వెబ్ సైటు ఉంటే, ఆ వెబ్ సైటును మీ ఫోనులో ఉండే బ్రౌజరు ద్వారా ఎలా ఉపయోగించుకోవచ్చును. ఈ పోస్టులో చూద్దాం.
మీ ఫోను 8జిబి మెమోరి, 16జిబి మెమోరి, 32జిబి మెమోరి మాత్రమే ఉండి ఉంటే, ఖచ్చితంగా మీకు ఈ పోస్టు ఉపయోగడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా బడ్జెట్ ఫోనులు 16జిబి – 32 ఫోను మెమోరిని కలిగి ఉన్న ఫోన్లు ఎక్కువమంది యూజర్ల దగ్గర ఉండి ఉంటాయి.
బడ్జెట్ స్మార్ట్ ఫోను మెమోరి?
అప్పటి బడ్జెట్లో 16-32జిబి ఫోను మెమోరి ఉన్న స్మార్ట్ ఫోన్లు లభించేవి. ఫోను మెమోరి కొన్నప్పుడు ఎంత ఉన్నా, వాడుతున్న కొలది అందులో ఉండే మొబైల్ యాప్స్ స్టోరేజి పెరిగి ఫోను మెమోరి సరిపోకపోవడం ప్రధానంగా వాడుతున్న బడ్జెట్ ఫోన్లలో వచ్చే అవకాశం ఎక్కువ. బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్ చూడడంతో మొబైల్ యాప్ బ్రౌజింగుపై అవగాహన పెరుగుతుంది.
మీరు ఒకప్పుడు 8జిబి ఫోను మెమోరి గల ఫోనును కొనుగోలు చేస్తే, అది వాడే కొలది ఫోను మెమోరి సరిపడకపోడం ఒక సమస్యగా తయారు అయితే, తరువాత 16జిబి ఫోనుమెమోరి గల స్మార్ట్ ఫోను కొన్నా… కొన్నాళ్లకు అదే పరిస్థితి రావడం గమనార్హం. ఇంకా 32జిబి ఫోను మెమోరి కూడా వాడుతున్న కొలది, గేమ్స్, యాప్స్ వాటి స్టోరేజిని పెంచుకుంటూ, ఫోను మెమోరిని ఆక్రమిస్తాయి.
కాబట్టి కేవలం చదవడం, చూడడం వరకే పరిమితమయ్యే మొబైల్ యాప్స్ కూ వెబ్ సైటు కూడా ఉండి, ఆ వెబ్ సైటులను మొబైల్ బ్రౌజరులోనే వాడుకుంటే, మనం ఆ మొబైల్ యాప్ ఫోన్లో వాడవలసిన అవసరం ఉండదు. ఇంకా ఫోను స్టోరేజి ఎక్కువగా ఉన్న స్మార్ట్ ఫోను ఉంటే, అన్ని సెక్యూర్ మొబైల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.
మొబైల్ బ్రౌజర్లు
అయితే మన స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసి మొబైల్ యాప్స్ లో కొన్నింటికి వెబ్ సైటు కూడా ఉంటుంది. ఉదాహరణకు తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ఉంది. అలాగే ఈ తెలుగురీడ్స్ మొబైల్ యాప్ తోబాటు వెబ్ సైటు కూడా ఉంది. ఈ తెలుగురీడ్స్ వెబ్ సైటును మీరు బ్రౌజరులో ఓపెన్ చేస్తే, మొబైల్ పేజి మోడ్లో ఓపెన్ అవుతుంది. ఇలా మీరు మీకు అవసరం అయినా ఆన్ లైన్ విషయం ఏదైనా బ్రౌజరు సాయంతో ఓపెన్ చేసి చూసుకోవచ్చును.
మీ స్మార్ట్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోను అయితే ఆండ్రాయిడ్ బ్రౌజరు, గూగుల్ క్రోమ్ లాంటి బ్రౌజర్లలో ఓపెన్ చేసి చూడవచ్చును. మీ స్మార్ట్ ఫోను యాపిల్ ఫోను అయితే సఫారి బ్రౌజరులో ఓపెన్ చేయవచ్చును. అయితే మీకు ఆండ్రాయిడ్ ఫోనులో క్రోమ్ బ్రౌజరు యాప్ ముందుగానే ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. అదే యాపిల్ ఫోను అయితే సఫారి బ్రౌజరు యాప్ ముందుగానే ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది.
అసలు బ్రౌజరు పనేమిటి అంటే ఇంటర్నెట్లో ఉండే ఏదేని ఒక వెబ్ సైటు చిరునామాను బ్రౌజరు అడ్రస్ బార్లో టైపు చేస్తే మీకు సదరు వెబ్ సైటులోని కంటెంటును బ్రౌజరులో చూపుతుంది. ఈ బ్రౌజరు పని కంప్యూటర్లో అయినా, లాప్ టాప్లో అయినా, స్మార్ట్ ఫోన్లో అయినా ఏదేని వెబ్ సైటు అడ్రస్ (డొమైన్ నేమ్) అంటే వెబ్ సైటు పేరు (ఉదా: గూగుల్ ఒక వెబ్ సైటు గూగుల్ డొమైన్ నేమ్ www.google.com, అలాగే ఫేస్ బుక్ వెబ్ సైటు పేరు అయితే, ఫేస్ బుక్ డొమైన్ నేమ్ www.facebook.com, ట్టిట్టర్ ఒక వెబ్ సైటు ట్విట్టర్ డొమైన్ నేమ్ www.twitter.com, ఐపిఎల్ టి20 ఒక వెబ్ సైటు పేరు అయితే దీని డొమైన్ నేమ్ www.iplt20.com) ఈ విధంగా ఉంటాయి.
ఇంకా మీకు మొబైల్ యాప్ తోబాటు వెబ్ సైటు కూడా ఉన్న మరిన్ని వెబ్ సైట్లు చూడడానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి. మీరు ఆ డొమైన్ పేరును బ్రౌజరులో ఎంటర్ చేయగానే, ఆ వెబ్ సైటు కంటెంటును బ్రౌజరు చూపుతుంది.
వెబ్ సైటు నేమ్ డొమైన్ నేమ్
మీరు తెలుగురీడ్స్ అనే వెబ్ సైటుకు సంబంధించిన డొమైన్ నేమ్ (www.telugureads.com) బ్రౌజరులో ఓపెన్ చేయడం ద్వారా ఆ వెబ్ సైటులో ఉంచబడిన కంటెంటును చూడగలరు. అయితే మీకు గమనించవలసిన విషయం ఒక్కటి ఏమిటంటే, ఏదైనా మొబైల్ యాప్ వెబ్ సైటు కన్నా ఉపయోగించడానికి వీలుగా డవలప్ చేయడం ఉంటుంది. ఈకామర్స్ లాంటి వెబ్ సైటులు అయితే మొబైల్ యాప్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తూ ఉంటారు. మీరు డిస్కౌంట్ల కొరకు చూస్తే, ఈ ఈకామర్స్ మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
ఏ మొబైల్ యాప్ అయినా ఖచ్చితంగా వెబ్ సైటు ఉండాలని లేదు, కొన్ని క్విజ్, గేమ్స్ లాంటి మొబైల్ యాప్ కేవలం యాప్ తరహా కంటెంటుతోనే ఉండడం వలన వాటి యొక్క వెబ్ సైటు కన్నా మొబైల్ యాప్ ద్వారానే ఉపయోగం ఎక్కువ. ఇంకా మెసేజింగ్ యాప్స్, వీడియో కాలింగ్ యాప్స్ మాత్రం వెబ్ సైటు కన్నా మొబైల్ యాప్ ద్వారానే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. వాట్సప్, స్కైప్ లాంటి మొబైల్ యాప్స్.
చూడడం, చదవడం ప్రధానంగా ఉండే కంటెంటు ఎక్కువగా వెబ్ సైటు ఆధారంగానే ఉంటాయి. అంటే సోషల్ మీడియా వెబ్ సైటులు ట్విట్టర్, టంబ్లర్, లింక్డ్ ఇన్ లాంటి వెబ్ సైటులు. ఇంకా రివ్యూ ఆధారిత వెబ్ సైటులు, న్యూస్ ప్రొవైడ్ చేసే వెబ్ సైటులు చదవడం ప్రధానంగా ఉంటాయి. వీటికి మొబైల్ యాప్ ఉన్నా, వాటికి వెబ్ సైటు కూడా ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి యాప్స్ ఉన్నా, వెబ్ సైటులు కూడా ఉంటాయి. 91మొబైల్స్ లాంటి టెక్ రివ్యూ మొబైల్ యాప్ ఉన్నా, ఆసంస్థకు వెబ్ సైటు కూడా ఉంది.
బ్రౌజరులో వెబ్ సైటు
బ్రౌజరు అడ్రసు బారులో మీరు ఖచ్చితంగా డొమైన్ నేమ్ అక్షరాలను తప్పులేకుండా టైపు చేస్తే, ఆ వెబ్ సైటు ఓపెన్ అవుతుంది లేకపోతే ఎర్రర్ చూపించడం ఉంటుంది. అయితే ఇప్పుడు అన్ని బ్రౌజర్లు డిఫాల్టుగా ఏదో ఒక సెర్చ్ ఇంజన్ ఎటాచ్ చేసి ఉండడం చేత, మీరు టైపు చేసిన అక్షరాలకు దగ్గరగా ఉన్న వెబ్ సైటులు, మరియ ఆ అక్షరాలకు మ్యాచ్ అయ్యే కంటెంట్ బ్రౌజరులో చూపించడం జరుగుతుంది. గూగుల్ సెర్చ్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ డిఫాల్ట్ గా ఉంటుంది.
ఇక బ్రౌజరు వాడుక విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సెర్చ్ విడ్జెట్ మీకు హోమ్ స్క్రీనుపైనే అన్ని ఫోన్లలోనూ డిఫాల్ట్ గా సెట్ చేయబడి ఉంటుంది. ప్రక్కచిత్రం చూడండి
పై చిత్రంలో చూపినట్టుగా ఉండే ఈ విడ్జెట్ గూగుల్ సెర్స్ కు సపోర్ట్ చేస్తుంది. మీరు అక్షరాలను టైపు చేసి, లేక వాయిస్ ద్వారా గూగుల్ సెర్స్ చేయవచ్చును. మైక్రోఫోను ఐకానును టచ్ చేయడం ద్వారా మీ మాటలను గూగుల్ సెర్చ్ చేయవచ్చును. మీరు మాట్లాడిన మాటలకు డొమైన్ నేమ్ మ్యాచ్ అయితే ఆ డొమైన్ ముందుగా మీకు కనబడుతుంది. లేకపోతే ఆ మాటలకు పోలి ఉన్న కంటెంటు కలిగిన ఇతర వెబ్ సైటులు ఓపెన్ అవుతాయి.
వెబ్ ఆధారంగా ఉండే సేవలు ఎక్కువగా వెబ్ సైటును కలిగి ఉంటాయి. మొబైల్ ఫీచర్స్ ఆధారంగా ఉండేవి, ప్రధానంగా మొబైల్ ఉపయోగకరంగా ఉండే విధంగానే డవలప్ చేయబడి ఉంటాయి. వాట్సప్ మొబైల్ ఆధారంగానే పని చేస్తుంది. మీరు ఒకవేళ వెబ్.వాట్సప్ ఓపెన్ చేసినా, మీ మొబైల్ ను వెబ్ సైటుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎటాచ్ చేయాల్సిందే. బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్ ఉపయోగంచడం వలన మొబైల్ యాప్ అవసరం అంతగా ఉండకపోవచ్చును.
ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణరచయితవాల్మీకిజయంతి నేడు. వాల్మీకిమహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ తిధి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం తేది మారుతుంది. ఈసారి అక్టోబర్ 13న వచ్చింది. రామాయణ రచయిత అయిన వాల్మీకి గురించిన గాధ ఇలా ప్రాచుర్యం పొంది ఉంది.
బందిపోటు దొంగగా అడవిలో ఉంటాడు. అడవిలో ఆ దారిలో వస్తున్న నారదమహర్షిని కూడా ఆ దొంగ అడ్డగిస్తాడు. అయితే అప్పుడు నారదుడు అతనిని ”నీవు చేస్తున్నది పాపం, ఈ పాపంలో నీ భార్యబిడ్డలకు భాగం ఉందో లేదో తెలుసుకో” అని అంటాడు. దానికి వెంటనే ఆ దొంగ తన ఇల్లాలిని ఇదే విషయం అడిగితే, ఆమె ”నీవు సంపాదించి, తీసుకురావడం నీ ధర్మం, నీ పాపంలో నాకు భాగముండదు” అని చెప్పడంతో ఆ దొంగ మరలా తిరిగి నారదుడిని చేరతాడు.
అప్పుడు నారద మహర్షి అతని వైరాగ్య భావనను గమనించి అతనికి తారకమంత్ర ఉపదేశం చేస్తాడు. అయితే ఆ దొంగకు రామ రామ రామ అనడం కూడా చేతకాకపోవడం వలన రామ అక్షరాలను వెనుక నుండి మర మర అనమని చెబుతాడు. అప్పుడు అతను మర మర మర మర….అంటూ పలుమార్లు ఉచ్ఛరించడం చేత, అది రామా రామా గా మార్పు పొంది, పెద్ద తపస్సులోకి వెళతాడు. అతని తపస్సు పూర్తయ్యేసరిగి అతని చుట్టూ పుట్ట పెరిగిపోయి, అందులోంచి తిరిగి మహాజ్ఙానిగా బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అంటారు.
మహాతపస్సు చేత బ్రహ్మగారి వర ప్రభావంతో నారదమహర్షి సంక్లిప్త రామాయణం విన్న వాల్మీకిమహర్షి ఆరుకాండట శ్రీరామాయణం రచించడం ప్రారంభించి, దిగ్విజయంగా పూర్తి చేసారు. అయితే ఇందులో ప్రత్యేకత ఎవరైనా రచయిత కల్పన చేత పాత్రలను సృష్ఠించగలరు. కానీ శ్రీరామాయణంలోని వ్యక్తుల మనసులోని భావాలను తెలుసుకోగలిగిన వరం పొంది ఉన్న వాల్మీకి రామాయణ రచన అంతా వారి వారి మనోభావాలను యధాతదంగా వ్రాయగలిగారు అని అంటారు.
మానవజీవితాన్ని ఉద్దరించగలిగిన రామాయణం రచించి ఇచ్చిన వాల్మీకి మహర్షి జయంతి నేడు కాగా ఈ వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. మనకు మంచిని ప్రబోధిస్తూ ధర్మాన్ని పట్టుకుంటే భూమి ఉన్నంత కాలం చరిత్రగా ఎలా ఉంటుందో నిరూపించే శ్రీరామాయణం రచించిన వాల్మీకిజయంతిని జరుపుకోవడం ఆనందదాయకం.
రామాయణం గురించిన అనేక రచనలు పి.డి.ఎఫ్ తెలుగు బుక్స్ గా ఆన్ లైన్లో శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్ అనేకం లభిస్తాయి. ఆరుకాండలు కలిపి ఉన్న కొన్ని రచనలు ఉంటే, సుందరకాండ గురించిన రచనలు ఎక్కువగా ఉంటాయి. పలువురు ప్రముఖులు రచించిన తెలుగు రచనలు పుస్తకాలుగా ఉంటే, అవి ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ పార్మట్లో లభిస్తాయి.
తెలుగులో మనకున్న ఇతిహాసములలో రామాయణం ఒక్కటి అయితే మూల రామాయణం వాల్మీకి రచించారు. రామకధను చెబుతూ గానం చేస్తూ తరించిన వారు ఉంటే, శ్రీరామునిపై శతకం చేసి తరించినవారు ఉన్నారు. ఇలా ఎందరో శ్రీరామాయాణం ఆసక్తిగా చదివి, రాముని గుణాలకు, సీతారాముల ప్రేమకు పరవశించి, రామభక్తులుగా మారినవారు చాలా మంది ఉన్నారని అంటారు.
ప్రవచనకారులు ప్రవచించే అంశాలలో శ్రీరామాయణం తప్పనిసరిగా ఉంటుంది. ఏ ప్రవచనకర్త ప్రవచనం చేసినా రాముని గుణగణాలను, రాముని ధర్మదీక్షను ప్రస్తావించకుండా ఉండరని అంటారు. ఇంతటి ప్రసస్థమైన శ్రీరామాయణం గురించి గొప్పవారి నోటిమాటలతో వింటేనే, మనసుకు ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. శ్రీరామాయాణం సంపూర్ణంగా గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచన వీడియోలు వీక్షించడానికి ఇక్కడ ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
శ్రీరామాయణం గురించి ప్రవచనాల ద్వారా వినడమేకాకుండా చదివి తరించాలనే ఆలోచన ఉంటే, రామాయణం గురించి పలువురు రచయితలు రచించిన పుస్తకాలు గురుకుల్ వెబ్ సైటులో లభిస్తున్నాయి. శ్రీరామాయణంపై తెలుగుపుస్తకములు ఉచితంగా చదవడానికి, డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
మీరు ఉచితంగా శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్ ఫ్రీగురుకుల్.కామ్ నుండి చదువుకోవడానికి మాత్రం డౌన్ లోడ్ చేసుకోవచ్చును. అనేకమంది రచనలను పి.డి.ఎఫ్ ఫార్మట్లో లభిస్తున్నాయి.
భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో…
భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు అంటూ ఉంటారు. జీవన యాత్రలో గమ్యం లేకుండా సాగిపోయే సమయంలో, అసలు జీవన యాత్ర లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న వస్తే, తత్వవేత్తల జవాబు ముక్తి అంటారు.
మరి మామూలు విషయములతో ముడిపడి, సాదారణ సమయంలోనూ ఏదో ఒక ఒత్తిడిని కొని తెచ్చుకునే మనసుకు ముక్తి అంటే మూడు ఆమడల దూరం పోతుంది, కదా మరి మనసుని ముక్తివైపు మరల్చగలిగే మెటీరీయల్ ఏది? అన్న ప్రశ్న వస్తే, దానికి జవాబు భాగవతం అని భాగవతప్రియులు, ప్రవచరకారులు చెబుతూ ఉంటారు.
యోగాభ్యాసం చేస్తూ, నియమనిష్టలతో కఠిన ఆహార నియామాలతో ప్రయత్నించినా మోక్షం వస్తుందనే నమ్మకం చెప్పలేం, కానీ త్రికరణశుద్దితో రోజూ కొంతసేపు భాగవతం వింటూ, ఆ భగవంతుని తత్వం వంటబట్టించుకుంటే, మోక్షం చాలా సులువు అంటారు. అందుకేనేమో భాగవతం గురించిన తలంపు వచ్చిందంటే, ఆ జీవికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉందంటారు, మన తెలుగుపండితులు.
భాగవతం వింటే శాంతి
నిత్యం ఏదో ఒక సమస్య, లేక తనతో సహచర్యం చేసేవారికి కానీ వారి వలన కానీ ఏదో ఒక సమస్యతో సతమతమయ్యే మామూలు మనిషికి, భాగవతం వింటే మోక్షం ఎలా సాధ్యం అంటే, అది చదివితే లేక వింటే అర్ధం అవుతుంది అంటారు. అయితే అది కొంచెంసేపు విన్నా, చదివినా మన:పూర్వకంగా నమ్మి శ్రద్దతో చేయమంటారు.
భగవంతుడి లీలలు గురించి చదివితే మదిగదిలో మాయ పోయి భగవానుడు మాత్రమే ఉంటాడు. తన లీలలతో మనిషి మదిగదిని నింపేస్తాడు అని భాగవతం గురించి చెబుతూ ఉంటారు. మనిషి మనసు మనిషి జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. కాలంలో కర్మలకు దు:ఖిస్తూ, సంతోషిస్తూ సాగుతుంది. ఇలాంటి మనిషి మనసు ఒక్కోసారి దు:ఖం వలన కలిగిన అనుభూతిని, సంతోష కాలంలో కూడా పొందుతూ, తను పొందవలసిన సంతోషాన్ని కూడా కోల్పోతుంది. అంటే మనసులో బలంగా ముద్రపడిన అంశం ఆధారంగా మనిషి మనసు ఒక బలమైన భావనను మోసుకెళ్లూ కాలంలో ప్రయాణం చేస్తుంది.
సాదారణస్థితిలో మనసు ఏదో ఒక సమస్యతో పాఠం నేర్చుకుంటూనే ఉంటే, కానీ కష్టం కాలంలో అనుకోకుండా వచ్చినప్పుడు మాత్రం, మనసు కకావికలం అవుతుంది, అంటారు. అటువంటి సమయంలోనే మనసుకు మరో మనసు ఓదార్పు అవసరం అంటారు. అయితే అది కొంతవరకు ఉపశమనం ఇస్తే, అసలు కష్టం అనుభవించవలసినది, దానిని దాటవలసినది కష్టం కలిగిన మనసే.
అటువంటి మనసుకు బలం తనకు తానే బలం అవ్యాలి. ఎలా మనసు తనకుతానే బలం కాగలదు అని ఆలోచిస్తే, కొందరంటారు. మనసులో కంగారు, భయం, ఆందోళన లాంటి విషయాలు ప్రక్కన పెట్టమంటారు. అలా ప్రక్కన పెట్టాలంటే ఎలా? అంటే మరికొందరంటారు.
సాదారణ సమయాలలో అయితే ఒక మాదిరి ఒత్తిడి వచ్చినప్పుడు ఏదైనా విరామం కోసం, మనసును ఉత్సాహపరచడానికి ఏదైనా సినిమా లేక హాస్యకార్యక్రమం చూసి, మనసను ఉత్తేజపరిచి, కొంచెంసేపు ఒత్తిడిని దూరం చేసినట్టే, అతి కష్టకాలంలో కూడా అదేవిధంగా అనుసరించమంటారు.
జీవితంలో అత్యంత కష్టాలు
ఇలా జీవితంలో అత్యంత ఎక్కువ కష్టాలు అనుభవించేవారు తమకొచ్చిన కష్టమే కష్టం, ఇటువంటి కష్టం ఇంతకుమునుపెన్నడు వేరెవరికి వచ్చి ఉండదు, అని భావిస్తూ ఉంటారని పండితులు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడే పూర్వంలో జీవితంలో అనేక కష్టాలు వచ్చినప్పుడు, లేక అత్యంత దయనీయస్థితిలోకి జారిపోయినప్పుడు ఎవరు ఎటువంటి కష్టాలు అనుభవించారు. ఎలా వాటిని ఎదుర్కొని జీవితాన్ని గెలిచారు. ఇలాంటి గాధలను మనసును కుదుటపరుస్తాయని అంటారు.
అలాంటి గాధలతో బాటు మనల్ని నడిపించేవాడు ఒక్కడు ఉన్నాడు. ఎటువంటి కష్టం అయినా తీర్చగలడు అనేవాడి గురించి కూడా ఎరుక ఉంటే, కష్ట కాలంలో ఆ భగవానుడు ఆదుకుంటాడని తెలుగు పండితులు చెబుతూ ఉంటారు. మరి అటువంటి ఉన్నాడో లేడో కంటికి కనబడకుండా తన మహిమచేత లోకాన్ని ప్రభావితం చేసే ఆ భగవానుని గురించి తెలుసుకోవాంటే, ఆ భగవానుని చేరిన భక్తుల గురించి తెలుసుకోవాలి అంటారు. భాగవతం భక్తుల గాధలతో భగవానుని మహిమలను తెలియజేస్తుంది. ఆ గాధలలోని ఆంతర్యం అర్ధం అయితే భగవతత్వం మనసుకు గ్రహించగలిగే శక్తి వస్తుంది, అంటారు.
అటువంటి మనసుకు ఓదార్పు బంధవులు, స్నేహితులు అయినను ఓదార్పు పొందలేని మనసుకు భగవానుడే ఓదార్పు అంటారు. అలాంటప్పుడు గుర్తుకువచ్చే భగవానుడు గురించి, భగవానుడి లీలలు గురించి మీరు ముందే తెలుసుకోండి. కష్టకాలంలో మీకు భగవానుడు తలుచుకోడంలో మీమనసు విజ్ఙతను పొంది ఉంటుంది. కష్టంలో భగవానుడు ఆదుకోవడంలో చూపించిన లీలలు గురించి తెలియజేసే భాగవతం గురించిన వివిధ రచనలు మనకు ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ రూపంలో ఉచితంగా లభిస్తున్నాయి. భాగవతం గురించిన ఉచిత తెలుగుబుక్స్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.
పుట్టిన సమయం, తేదిని అనుసరించి తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ఆన్ లైన్లో ఉచితంగా ఉంది. ఈ వైబ్ సైటు వివరములను ఇంకా చదవండి….
పుట్టిన ప్రతి ఒక్కరి జీవితో నవగ్రహాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి అంటారు. అలాగే ఏ వ్యక్తి అయినా 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక పాదం క్రిందకు వస్తారని అంటారు. పుట్టిన నక్షత్ర పాదం, ఆ నక్షత్ర పాదం గుణగణాలు, పుట్టిన సమయంలో ఉన్న లగ్న ప్రభావం, నవగ్రహాల దృష్టి ప్రభావం లెక్కలు కట్టి ఇంకా పుట్టిన స్థలం ఇతరత్రా అంశాలు పరిశీలన చేసి, ఆ వ్యక్తి యొక్క జాతకం చెబుతూ ఉంటారు.
జాతకం చెప్పినప్పుడే కొన్ని ముఖ్యమైన పనులలో ప్రారంభించటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలను కూడా ఆ పిల్లవాని పెద్దలకు పండితులు తెలియజేసి ఉంటారు. గ్రహశాంతులు ఉంటే ఎప్పుడు చేపించుకోవాలి, ఎప్పుడు ఏ గ్రహ ప్రభావం చేత, ఆ పిల్లవాని భవిష్యత్తు ప్రభావితం అయ్యేది కూడా అంచనా వేసి చెబుతారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? స్వగృహం యోగం లాంటివి పరిశీలన చేసి, ఆ పిల్లల పెద్దలకు చెబుతారు.
ఇప్పుడు అలా పేరు, పుట్టిన తేది, సమయం, ప్రాంతము, టైం జోన్ వెబ్ సైటులో ఎంటర్ చేస్తే, ఆ వెబ్ సైటు మీ జాతకం ఆన్ లైన్లో ప్రాధమికంగా చూపుతుంది. అందులో పుట్టిన సమయం యొక్క పంచాంగ వివరాలు చూపుతుంది. ఇందులో పుట్టిన సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, తిది, వారం, నక్షత్ర పాదం, రాశి, యోగం, కరణం, జన్మనామం, దశలను చూపుతుంది. తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ..
ఇంకా వివాహ విషయంలో ఉపయోగపడే అవకహడ చక్రమును చూపుతుంది. మంచి చెడుల విషయంలో ఘాత చక్రమును చూపుతుంది. అలాగే అదృష్ట విషయములలో అనుకూల రోజు, తిది, గ్రహములు, రాశులు, లగ్నములు, రత్నం, దైవం, లోహం, వర్ణం, దిశ, సమయం, సంఖ్యలను చూపుతుంది.
గ్రహస్థితి పట్టికలను చూపుతుంది. ఇంకా గ్రహ వీక్షణలు, మైత్రి చక్రము కుండలిలు, షోడష వర్గ పట్టిక, గ్రహ భావములు తదితర విషయములతో బాటు జాతక దోశములు, పరిహారాలు, దశాంతర్దశా ఫలితములు, జాతక ఫలితాలను ప్రాదమికంగా మీకు ఈ వెబ్ సైటు చూపుతుంది. మీరు మీ ఫలితములను పి.డి.ఎఫ్ ఫార్మట్లో సేవ్ చేసుకోవచ్చును.
పూర్తి జాతకమును పొందాలంటే పెయిడ్ ఆష్ట్రాలజీలోకి వెళ్లి చూడవలసి ఉంటుంది. ఈ వెబ్ సైటులో మీరు ఎంటర్ చేయవలసిన డేటా పేజి ఈ క్రింది విధంగా ఉంటుంది.
మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం.
మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు
ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి?
ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషుసైంటిష్టులు కూడా ఈ విషయం అంగీకరించినట్టుగానే లోకం చెబుతుంది. ఆ ఏదో తెలియని శక్తి ఎలా మనమీద పని చేస్తుంది. అంటే గ్రహస్థితిని బట్టి పని చేస్తుంది, అని అంటారు. ఎలా గ్రహాలు స్థితి మనపై ప్రభావం చూపుతాయి? అంటే కొందరు ఇలా అంటారు.
ఒక కంపెనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ స్థాయి ఉద్యోగులు, మీటింగులో ఉన్నప్పుడు అదే రోజు కొత్తగా జాయిన్ అయిన క్రింది స్థాయి ఉద్యోగి అవసరం పడి, మీటింగులోకి వెళితే, ఆ మీటింగులో ముఖ్యవిషయం మాట్లాడుకుంటున్నవారి దృష్టి ఆ చిన్నఉద్యోగిపై పడి, వారి స్వభావం బట్టి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం కలుగుతుంది. ఆ చిరు ఉద్యోగి ఆ ఆఫీసులో ఉన్నంతకాలం ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అలానే ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో అలాగే ఒక జీవి పుట్టినప్పుడు, ఆకాశంలో గ్రహస్థితి దృష్టి, స్థానం, భావం ఆ వ్యక్తిపై ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియజేస్తాయి అంటారు.
గ్రహస్థితి సమయం బట్టి
అయితే ఆఫీసులో ఫస్ట్ ఇంప్రెషన్ పడ్డ చిన్న ఉద్యోగి, బాగా పనిచేసి, వారి మనసులో భావాలు చెరిపేసినట్టుగా, జీవి క్రమశిక్షణ వలన గ్రహస్థితి యొక్క ప్రభావం తట్టుకోవడం లేక ప్రభావం తగ్గించుకోవడంలాంటివి సాధ్యమే అంటారు. ఇలా కష్టపడి తన పైఅధికారుల అనుగ్రహం పొందిన చిన్నఉద్యోగి, ఆయా అధికారుల స్థితిని చూసి, ప్రవర్తించినట్టే, మనం కూడా కదులుతున్న కాలం గమనిస్తూ, మంచి సమయం మనకు అనుకూలంగా ఉన్న సమయంలో కొత్త ప్రయత్నం ప్రారంభిస్తే మంచిదని అంటారు.
కాలం కలసి రాకపోతే తాడు పాము అయ్యి కాటు వేస్తుంది అని అంటారు. అటువంటి కాలం చాలా విలువైనది, ఆలోచన పుట్టిన సమయం ఒక పండితుడికి, చెబితే ఆ ఆలోచన పుట్టిన సమయం ప్రభావం బట్టి మీ ఆలోచన ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పగలిగే వారు ఉంటారు. సమయం గమనిస్తూ, పనిపై శ్రద్ద పెడితే పని జరుగుతుంది. అయితే
ఒక్కోసారి తలపెట్టిన సమయం కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని పండితులు అంటారు. కాబట్టి ఒక ముఖ్యపనిని ప్రారంభించే సమయం ముందుగానే సరి చూసుకుంటే, ఆ పని మనకు ఇబ్బందులు లేకుండా అవుతుంది.కానీ కష్టం లేకుండా పని ఉండదు. అయితే కష్టం వృధా కాకుండా ఉండాలంటే, తలపెట్టే పనిని సరైనా సమయంలోనే ప్రారంభించాలి అంటారు.
నక్షత్రం యాడ్ చేసుకుంటే
అటువంటి కాలంలో ప్రస్తుతం జరుగుతున్న సమయం గ్రహస్థితిని బట్టి నక్షత్రమును ఒకసారి వెబ్ సైటులో యాడ్ చేసుకుంటే, ఆ వెబ్ సైటు ఆ నక్షత్రం గలవారికి ఏ రోజు ఎలా ఉంటుందో మూడు రంగులలో చూపుతుంది. ఆ వెబ్ సైటను గూర్చి ఈ పోస్టులో చూద్దాం. మీనక్షత్రం బట్టిమీకు మంచి–చెడులను చూపేవెబ్ సైటు
పంచాంగం ప్రకారం మన నక్షత్రమును బట్టి మంచి చెడుల సమయములను పండితులు మనకు సూచిస్తూ ఉంటారు. అయితే ఇది మనకు ప్రత్యేకమైన సంధర్భములలో మాత్రమే మనం మనకు మంచి సమయము ఎప్పుడు ఉందో సరి చూసుకుంటాం. అంటే ఏదైనా గృహప్రవేశం, బారశాల లాంటి ముఖ్యపనులలో మాత్రమే బ్రాహ్మణ పండితుల దగ్గరకు వెళ్లి సమయాసమయములను చూసుకుంటాం.
ఎవరైనా 27 నక్షత్రములలోనే ఉంటారు, అయితే అందరికీ అన్నివేళలా అనుకూల సమయముగా ఉండదు. ఒక నక్షత్రమునకు ఒక్కో లగ్నం అనుకూలంగా ఉంటే, అదే లగ్నసమయం మరొకరికి ప్రతికూలం కాగలదు. ముఖ్యకార్యములలో మనం మూహూర్తం చూసుకుని ఆరంభిస్తాం.
అయితే కొన్ని సార్లు మాత్రం ఏదైనా వ్యాపారం విషయములలో నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోవాలసి ఉండవచ్చును. రోజువారీ కార్యక్రమములలో కూడా కొన్ని సార్లు కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే మనకు కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి. అయితే వాటిలో రోజువారీ మంచి-చెడుల సమయములను అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ కేవలం మన నక్షత్రముననుసరించి మనకు మేలు సమయం తెలుసుకోవాలంటే మాత్రం పండితులను కాంటాక్ట్ చేయాలి.
కానీ మంచి-చెడులు చెప్పేవారు ఈరోజులలో అందుబాటులో లేకపోవడం ఉండదు. ఎందుకంటే సాంకేతిక అభివృద్ది చెందాకా ఎవరైనా మాటలకు మాత్రం అందుబాటులోనే ఉంటారు. అయితే ఒక్కోసారి అలా పండితులను కాంటాక్ట్ చేసే సమయం కూడా మంచి సమయం కాకపోతే, అప్పటి ఆ సమయం ప్రభావం కార్యసమయం నిర్ధేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండకపోదు అంటారు.
అలా కాకుండా కొత్తకార్యం అయినా శుభకార్యం తలపెట్టాలనే సమయమే మంచిదా? కాదా? చెక్ చేసుకుంటే….ఆ తలంపు వచ్చిన సమయం మంచి సమయము అయ్యి ఉండి, ఆ సమయము కూడా మన నక్షత్రం ప్రకారం మనకు అనుకూలం అయితే, ఆయొక్క కార్యమునకు సంబంధించిన పనులు అన్ని చక చకా జరిగిపోతాయి అంటారు.
నక్షత్రం బలం బట్టి
ఊహూ అలా కాదు…కార్యం తలపెట్టాలనే ఆలోచన వచ్చిన సమయం, మన నక్షత్ర బలానికి వ్యతిరేకంగా ఉంటే, అది మనకు అనుకూల ఫలితం ఇవ్వకపోవచ్చును. అలాంటప్పుడు మనకు వచ్చి ఆలోచన సరైనదా? కాదా? అని సమయమును బట్టి నిర్ణయించాలంటే, మన నక్షత్రమును బట్టి మనకు అనుకూల సమయమును, ప్రతికూల సమయమును కలర్ ఇండికేషన్ రూపంలో చూపే వెబ్ సైటు అన్ని భారతీయ భాషలతో పాటు ఆంగ్లములో కూడా ఉంది.
అలా నక్షత్రమును బట్టి ఆ నక్షత్రమునకు ఏ ఏ కాలము చాలా బాగా అనుకూలంగా ఉంటే ఆ కాలము పచ్చ రంగులో ఉంటుంది. కాలము మద్యస్తంగా ఉంటే పసుపు రంగులో ఉంటుంది. ప్రతికూలంగా ఉంటే ఎరుపు రంగులో ఉంటుంది. పచ్చ రంగు సూచించే సమయములో ఆ నక్షత్రమువారుశుభకార్యములు ప్రారంభించవచ్చునని, పసుపు రంగు సూచించే సమయములో మాములు కార్యములు నిర్వహించుకోవచ్చని, ఎరుపురంగు సూచించే సమయములో ఆచితూచి వ్యవహరించమని అర్దం.
వెబ్ సైటులో ఒక్కసారి మీ పేరు, పుట్టిన తేదీ, సమయం లేదా నక్షత్రం ఒక్కసారి జత చేసి మీ బ్రౌజరులో సేవ్ చేసుకుంటే, మీరు మరలా ఆ వెబ్ సైటును చూసిన ప్రతిసారి మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటులో సమయమును తెలుసుకోవచ్చును.
అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వస్తుంది. తెలుగు తిధులలో తదియ తిధినాడు వచ్చే ఈ పండుగ అట్లతద్దిగా వాడుక భాషలో ప్రాచుర్యం పొందింది. ఇంకా అట్టతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు అనే పాట కూడా ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగు పండుగ తెలుగింటి ఆడపడుచలకు మరింత ఆనందదాయకం కావడం విశేషం.
మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో పలు పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలవారీగా విధానం వేరుగా ఉంటే, కొన్ని పండుగలు కొన్ని పాంతాలకే పరిమితం. అలా మన తెలుగువారికి అట్లతదియ అంటే అట్టతద్దిగా మనకు మాత్రమే పరిమితం. ఇంకా తెలుగు ఆడవారికి ప్రత్యేకం ఈ అట్లతద్ది పండుగ.
అతివలు ఆడుతూ పాడుతూ ఆనందంగా జరుపుకునే పండుగ అయితే అదీ మన తెలుగువారికి ప్రత్యేకంగా ఉన్న పండుగగా అట్లతద్ది, దీనిన అట్ల తదియ అంటారు. మన తెలుగునేలలో అట్లతో కూడిన నోము. ఉదయం నుండి ఉపవాసం ఉండి, సాయంకాలం పార్వతి పరమేశ్వరులను పూజించి, చంద్రోదయం జరిగాక, చంద్రదర్శనం చేసి బోజనం చేయడం ఉంటుంది. ఇంకా ఈ పండుగ గురించి అట్లతద్ది వ్రతవిధానంలో చెబుతారు.
అట్లతద్ది నోమును ఆరేళ్ల నుండి పెళ్లయినవారు కూడా చేసుకుంటూ ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా ఎక్కువగా అట్లతద్ది ఉండడం చేత ఆట పాటలు కూడా చేరినట్టుగా ఉండవచ్చు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆట పాటలతో ఆడే అమ్మాయిలు సాయంత్రం గౌరిదేవిని పూజించడంతో మంచి మొగుడు వస్తాడనేది ప్రసిద్ధి. ఇంకా ఇందులో అట్లతో పోసిన వాయనాలు ముత్తయిదువులకు ఇవ్వడం అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వచ్చే ఈ పండుగలో మరో ప్రత్యేకత.
గౌరిదేవిని పూజించడానికి ఆడపిల్లలలో ఆసక్తి పెంచడానికే అన్నట్టు అట్లతద్ది పండుగ విధానం ఉన్నట్టుగా అని అంటారు. సర్వమంగళను పూజిస్తే, మంగళములు కలుగుతాయి కాబట్టి ఆ సర్వమంగళ అయిన పార్వతి మాతను పూజించడానికి ఆడపిల్లలకు ఆటపాటలతో కూడిన విధానం కలిగిన పండుగ కేవలం అట్లతద్ది మాత్రమే ఉంది.
ఆశ్వయుజమాసంలో దసరా తర్వాత వచ్చే తదియ తిదిని అట్లతదియగా పేర్కొంటే, అది అట్లతద్ది పండుగగా మనతెలుగు ఆడపిల్లలకు ఇష్టమైన పండుగ. అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వచ్చే పండుగ గూర్చి యూట్యూబ్ వీడియోలో శ్రీమతి అనంతలక్ష్మి గారు చెప్పిన మాటలు చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేదా క్లిక్ చేయండి.
తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో…
ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు సార్లు చొప్పున, సాలుకు 24 సార్లు వస్తాయి, అధికమాసం వస్తే సంఖ్య పెరుగుతుంది.
ఆధునిక వైద్య పద్దతిననుసరించి కూడా ప్రతి పక్షానికి ఒక రోజు పూర్తి సాత్విక ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్య లక్షణం అంటారు. అంటే ప్రతి పదిహేను రోజులకు ఒక రోజులో కేవలం సహజంగా లభించే ఆహారం పండ్లు, పాలు లాంటివి స్వీకరిస్తే, జీర్ణవ్యవస్థ భాగుగా ఉంటుంది, అంటారు. కాబట్టి హిందూ సంప్రదాయ ఏకాదశి నియమాలు కూడా ప్రత పక్షానికి ఒకమారు రావడంతో ఏకాదశి చేయడం భక్తితోపాటు ఆరోగ్యవంతం కూడా అని అంటారు.
ఇలా రెండు రకాలు మేలును చేయగలిగే ఏకాదశి వ్రతం నియమనిష్టలకు పెట్టింది పేరు అని అంటారు. ఏకాదశి వ్రతం ఆచరించి పూర్వం కొందరు మంచి ఫలితాలను పొందినట్టు చాలా తెలుగుపుస్తకములలో చెబతారు. అంబరీషుడు ఏకాదశి వ్రత ఫలితం చేత దూర్వాశో మహర్షి శాపం కూడా ఆయనను ఏమి చేయలేకపోయింది, అనే పురాణగాధ చాలా ప్రసిద్ధమైనది.
ఏ ఏకాదశికి ఎలా ఉపవాసం ఉండాలి? విష్ణు స్వరూపాన్ని ఎలా పూజించాలి? ఏకాదశి గొప్పతనం గూర్చి చెప్పే గాధలను తెలుపుతూ ఉండే పుస్తకాలు ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తున్నాయి. ఈ పుస్తకం చదవడం అంటే ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్న అంశంతో కొంతకాలం ఏకాగ్ర బుద్దితో మనసు ప్రయాణించడం, కాబట్టి భక్తిని ప్రభోదించే ఏ పుస్తకమును అయినా రీడ్ చేయడం అనేది మంచి అలవాటుగా చెబుతారు.